ఇది రెగ్యులర్‌ సినిమా కాదు: వినోద్‌ కుమార్‌ | Vinod Kumar about Speech Son of movie | Sakshi
Sakshi News home page

ఇది రెగ్యులర్‌ సినిమా కాదు: వినోద్‌ కుమార్‌

Dec 20 2025 3:34 AM | Updated on Dec 20 2025 3:34 AM

Vinod Kumar about Speech Son of movie

సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌’. వినోద్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు బత్తల సతీష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘సన్‌ ఆఫ్‌’ రెగ్యులర్‌ ఫార్మాట్‌ సినిమా కాదు. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ మూవీ. తండ్రీకొడుకుల మధ్య సాగే మంచి కథ. ఎక్కడో పర్లాకిమిడిలో చదివి, ఆ తర్వత అమెరికా వెళ్లి, తిరిగి అక్కడ్నుంచి వచ్చి, సాయి సింహాద్రి ఈ సినిమాను నిర్మించడం గ్రేట్‌ అచీవ్‌మెంట్‌. నటుడిగా నాకున్న అనుభవంతో చెబుతున్నాను... ఈ చిత్రదర్శకుడు మంచి ప్రతిభాశాలి.

ఎంతో కమిట్‌మెంట్‌తో ఈ సినిమా చేశాడు. ప్రస్తుతం నేను గోపీచంద్‌ హీరోగా చేస్తున్న సినిమాలో, ‘మారెమ్మ’ చిత్రాల్లో నటిస్తున్నాను. అలాగే సుహాసినితో కలిసి ఓ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ కథ రియల్‌ లైఫ్‌లో నాకు, మా నాన్నకు కనెక్ట్‌ అవుతుంది. ప్రతి కొడుకు తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. నేను చిరంజీవిగారికి అభిమానిని. ఆయనకు ఈ సినిమా చూపించాలని ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కొడుకు తన తండ్రిపై ఎందుకు కేసు వేశాడు? అన్న పాయింట్‌ని స్ట్రాంగ్‌గా చూపించాం. వినోద్‌కుమార్‌గారి కెరీర్‌లో ‘మామగారు’ సినిమాలా ఈ ‘సన్‌ ఆఫ్‌’ చిత్రం కూడా నిలిచిపోతుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సతీష్‌. ఈ కార్యక్రమంలో ‘చిత్రం’ శ్రీను, రిషి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement