భర్త మోసం చేశాడన్న 'వడాపావ్‌ గర్ల్‌'.. వీడియో రిలీజ్‌ | Bigg Boss fame Vada Pav girl Chandrika Dixit Accuses her Husband of cheating | Sakshi
Sakshi News home page

2 నెలలుగా నరకం.. నా మైండ్‌ పని చేయట్లే..: బిగ్‌బాస్‌ బ్యూటీ

Feb 4 2026 1:54 PM | Updated on Feb 4 2026 2:54 PM

Bigg Boss fame Vada Pav girl Chandrika Dixit Accuses her Husband of cheating

ఢిల్లీ వీధుల్లో వడాపావ్‌ అమ్ముతూ ఫేమస్‌ అయింది చంద్రికా దీక్షిత్‌. సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ అమ్మాయి హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌లోనూ పాల్గొంది. తాజాగా.. భర్త యుగం గేరాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కింది. భర్త మోసం చేస్తున్నాడంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో చంద్రిక మాట్లాడుతూ.. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలేనా అని అడుగుతున్నారు. రెండు నెలలుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? 

నావల్ల కావట్లే..
అన్నింటినీ మౌనంగా భరిస్తున్నాను. నా బాధేంటో మీకు చెప్పనా? అటు పిల్లాడిని, ఇటు ఇంటిని.. అన్నింటినీ మ్యానేజ్‌ చేసుకుంటున్నాను. అన్ని బాధ్యతలు నేనే నిర్వర్తిస్తున్నాను. ​అయినా అతడు (భర్త) ఇలా చేస్తుంటే నేనేం చేయాలి? (ఫోన్‌లో చాటింగ్‌ స్క్రీన్‌షాట్‌, భర్తతో క్లోజ్‌గా ఉన్న ఓ అమ్మాయి ఫోటోలు చూపిస్తూ) ఈ అమ్మాయి ఎప్పుడూ నా భర్త చుట్టూనే తిరుగుతోంది. నా భర్త, నా ఇల్లు అని ఏదేదో అంటోంది. ఈ ఫోటోలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నా మెదడును పని చేయనివ్వడం లేదు. నావల్ల కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.

గుర్తుపెట్టుకో..
దీనిపై ఆమె భర్త యుగం గేరా స్పందించాడు. నీకు అవసరమైంది నువ్వు చూపించావు. నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ, అదేమంత పెద్ద తప్పు కాదు. సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నావ్‌.. అలాంటివి నాదగ్గర చాలా ఉన్నాయి. నేను అనుకుంటే చాలా చేయగలను. కానీ నేనేమీ చేయను. ఇంకోటి.. నీ రెస్టారెంట్‌ నావల్లే నడుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకో అని కౌంటరిచ్చాడు. కాగా చంద్రికా.. ఆర్టిస్ట్‌ యుగం గేరాను పెళ్లి చేసుకుంది. యుగం గేరా.. చంద్రిక కంటే రెండుమూడేళ్లు చిన్నవాడు. ఈ దంపతులకు కుమారుడు రుద్ర సంతానం. 

 

 

చదవండి: అందుకే పిల్లల్ని కనలేదు: ప్రముఖ నటి

Advertisement
 
Advertisement
Advertisement