ఈ మధ్య కాలంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. గత డిసెంబరులో రిలీజైనప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇందులో నటించిన రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్.. ఇలా అందరికీ మంచి పేరు వచ్చింది. హీరోయిన్‌గా చేసిన సారా అర్జున్ కూడా ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె.. చిరంజీవి కూతురిగా నటించే బంపరాఫర్ కొట్టేసిందట.
(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)
ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి.. త్వరలో 'విశ్వంభర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు బాబీతో మరోసారి కలిసి పనిచేయనున్నాడు. గతేడాదే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా సినిమాలో ఎవరెవరు నటిస్తారనే వివరాలు బయటకొస్తున్నాయి.
ఇందులో చిరుకి జోడీ ప్రియమణిని ఎంపిక చేశారని.. మోహన్ లాల్ కీలక పాత్ర కోసం తీసుకున్నారని.. విలన్‌గా బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కనిపించబోతున్నారని అంటున్నారు. అలానే కీలకమైన హీరో కూతురి పాత్ర కోసం 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్‌ని ఫైనల్ చేశారని మాట్లాడుకుంటున్నారు. తొలుత ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది కానీ సారా ఫైనల్ అయినట్లు ఉంది. సారా నటించిన తొలి తెలుగు మూవీ 'యుఫోరియా'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఠాకుర్)


