breaking news
Movie News
-
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటుడి కొడుకు.. డెబ్యూ మూవీ ఇదే!
ప్రముఖ నటుడు శరత్ బాబు కుమారుడు ఆయుష్ తేజస్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కట్టా జయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన సీహెచ్ దివ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నానిషా హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రానికి క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు కట్టా జయ్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం గ్రాండ్‌గా అన్నపూర్ణా స్టూడియోస్‌లో ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. శరత్ బాబు గారి కుమారుడు ఆయుష్ తేజస్ మా సినిమాలో హీరోగా నటించడం ఎంతో సంతోషంగా ఉంది. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టిన వి.వి. వినాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తొలి ప్రెస్ మీట్‌కు విచ్చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇది మా డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమవుతున్నారు. ప్రేక్షకులు, మీడియా మా సినిమాను ఆదరించి, ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను’అన్నారు.హీరో ఆయుష్ తేజస్ మాట్లాడుతూ..‘మా సినిమా కథపై పూర్తి నమ్మకంతో, ఒక గొప్ప విజయాన్ని సాధిస్తామని విశ్వసిస్తున్నాం. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టిన వి.వి. వినాయక్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేతుల మీదుగా మా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా టీమ్‌కు సంబంధించిన తొలి ప్రెస్ మీట్. మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మా సినిమాను అందరూ ఆదరించి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. -
నిర్మాతల మండలి ఎన్నికలు.. ఏ ప్యానెల్ గెలిచిందంటే?
నిర్మాతల మండలి ఎన్నికల్లో మన ప్యానెల్ ఘనవిజయం సాధించింది. మొత్తం 663 ఓట్లు పోల్ కాగా.. మన ప్యానెల్ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్లుగా మోహన్ వడ్లపట్ల(మన ప్యానెల్), దామోదర్ ప్రసాద్ (ప్రోగ్రెసివ్ ప్యానెల్) ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా చదలవాడ (మన ప్యానెల్)ను ఎన్నుకున్నారు. జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు, తుమ్మలపల్లి మన ప్యానెల్ నుంచి ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా విజయం మన ప్యానెల్ నుంచి 12 మంది ఎంపిక కాగా.. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ముగ్గురు ఎంపికయ్యారు. ఈసీ మెంబర్స్..మన ప్యానెల్ – 121. పద్మిని2. ఏషియన్ సునీల్3. మోహన్ గౌడ్4. శివలెంక కృష్ణప్రసాద్5. దానయ్య6. వంశీ నందిపాటి7. పల్లి కేశవరావు8. శ్రీనివాసరావు9. పుల్లారావు10. బాపిరాజు11. ఆర్.కె. గౌడ్12. నయీంప్రోగ్రెసివ్ ప్యానెల్- 3 1. మైత్రీ రవి2. నిరంజన్ రెడ్డి3. డి.ఎస్. రావు -
రవితేజ ఇరుముడి.. పూనకాలు తెప్పించే ఫుల్ వీడియో సాంగ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్‌తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ రిలీజ్ చేశారు. థియేటర్లలో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మల్లెపూల పల్లకి.. మందార పల్లకి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు థియేటర్లు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ పాటకు చౌడమ్ శ్రీనివాసరావు లిరిక్స్ అందించగా.. డప్పు శ్రీను ఆలపించారు. ఈ సాంగ్‌ను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. -
'పండు ఐ లవ్ యూ రా.. నేను వెళ్లిపోతున్నా'
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈశ్వర్ సాయి మోసం చేశాడని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫోక్ డ్యాన్సర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అందరికీ సారీ.. నాకు ఇక బతకాలని లేదంటూ తన లేఖలో పేర్కొంది. పండు ఐ లవ్ యూ రా.. పిల్లలందరికీ సారీ రా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. నేను తప్పు చేశానని.. నా చావుకు నేనే కారణమంటూ అంటూ రాసుకొచ్చింది. నేను తప్పు చేశా.. అందుకే చనిపోవాలనుకుంటున్నానని మాధురి రాథోడ్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. కాపాడిన కుటుంబ సభ్యులు.. ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. -
అల్లు అర్జున్ రాకా.. ప్రముఖ నటుడి రోల్ రివీల్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న భారీ యాక్షన్ మూవీ రాకా. ఈ సినిమాకు అల్లు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ముంబయిలో పూర్తి చేసుకుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్(బబ్లూ) కీలక పాత్ర పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో తనకు ఒక ప్రత్యేకమైన లుక్‌తో కూడిన కీలక పాత్ర దక్కిందని రివీల్ చేశారు. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం అదృష్టమని.. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడంతో తన కల సాకారమైందని స్పష్టం చేశారు.కాగా.. ఈ సినిమాలో దీపిక పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్ చేయనున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..!
ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్ మరింత ముదిరింది. ఈ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. మాధురి రాథోడ్ ఫిర్యాదు..అంతకుముందు ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశ్వర్‌సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాసింగ బలాలే జానపద నృత్యంలో నటించి ఈశ్వర్‌సాయి పాపులర్ అయ్యారు. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆల్ఫా ఫలితం.. అలాంటి సినిమాలకు శాపం: తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే గాంధారి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ చిత్రానికి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించారు. ఫీమేల్ ఓరియంటెడ్ జానర్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే కథగా రూపొందించారు.అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆలియా భట్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఆల్ఫా డిజాస్టర్ కావడంతో ఆ ప్రభావం మాపై కూడా పడుతుందని తెలిపింది. ఇలా జరిగితే మహిళ నేపథ్యంలో వచ్చే సినిమాలకు నిర్మాతలు ముందుకు రారంటూ మాట్లాడింది. మా సినిమాలన్నీ నిలిచిపోయే పరిస్థితి వస్తుందని తెలిపింది. దీంతో తాప్సీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. తన కుమార్తె అదృశ్యమైన తర్వాత ఓ అంధ తల్లి సాగించే పోరాటం ఆధారంగా తీర్చిదిద్దారు. ఈ మూవీలో ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, ఛాయా కదమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్‌తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది.తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీకమాసం ఫుల్ వీడియో పాటను ఇరుముడి టీమ్ విడుదల చేసింది. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ పాడడంతో పాటు కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించగా.. సాయి కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరు కూడా చూసేయండి. -
నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ దీంతో సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసే ఆలోచన లేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 18 years of entertaining. And this year, the stage is all set to burn with #TheParadise 🔥🔥🔥Natural Star @NameisNani as JADAL 💥#TheParadise GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥An @anirudhofficial musical 🎼… pic.twitter.com/sGx22f8BIK— SLV Cinemas (@SLVCinemasOffl) September 5, 2026 -
ప్రభాస్‌తో టాలీవుడ్ హీరో ఢీ.. పెద్ద సాహసమే..!
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ప్రభాస్‌తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు మరో హీరో. రెబల్ స్టార్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఆయన హీరోగా వస్తోన్న లెగసీ మూవీ డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఫౌజీ రిలీజైన ఒక్క రోజు గ్యాప్‌లోనే విశ్వక్ సేన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. దీంతో వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.మరి ఫౌజీ ముందు లెగసీ మూవీ ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాల్సిందే. అయితే విశ్వక్ సేన్ ఒక్క రోజు గ్యాప్‌లోనే రావడం పెద్ద సాహసమనే చెప్పాలి. లేదంటే ఈ నిర్ణయం వెనుక నిర్మాతల పక్కా వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఫౌజీ అనుకున్న టైమ్‌కి రాకపోతే తమ సినిమాకు తిరుగుండదనే ఉద్దేశంతోనే ఈ డేట్‌పై కర్చీఫ్ వేసిందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న విశ్వక్ ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. MASS KA DAS IS COMING THIS DECEMBER. 🔥🔥#LEGACY locks DECEMBER 4, 2026 for its worldwide theatrical release.Vishwak Sen in a powerful new avatar.Kay Kay Menon in a key role.Saikiran Reddy Daida returning with his second film.THE LEGACY BEGINS. ⚔️#LegacyMovie… pic.twitter.com/kWW7MuX85q— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) September 5, 2026 -
మీర్జాపూర్ సిరీస్ మాత్రమే కాదు.. సినిమా కూడా..!
మీర్జాపూర్ సిరీస్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్ని సీజన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా సూపర్ హిట్ అయిన ఈ సిరీస్‌లను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీర్జాపూర్: ది మూవీ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఈ చిత్రం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.78 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ. 68.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ. 56.75 నెట్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్, శ్రియా పిల్గావ్కర్, హర్షిత శేఖర్ గౌర్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ మూవీ సెప్టెంబర్ 4, 2026న సినిమా థియేటర్లలో విడుదలైంది. -
అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?
దశాబ్దానికి పైగా టాలీవుడ్లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్‌గా ఏకచక్రాధిపత్యం వహించింది నటి అనుష్క శెట్టి. ఆమె కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అనుష్క అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. 'బాహుబలి'తో అనుష్క పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది. అనుష్క శెట్టి సినిమాలకు దూరమవుతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె చివరి చిత్రం ఘాటీ విడుదలై ఇప్పటికే 365 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మరో తెలుగు సినిమాను అనుష్క ప్రకటించలేదు. క్రేజ్ ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేయకుండా.. నచ్చిన కథ, పాత్ర కోసం మాత్రమే ఎదురుచూడటం అనుష్క స్టైల్. అయితే ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడంతో ఆమె ఇక సినిమాలు చేయరనే ప్రచారం మొదలైంది. అయితే అనుష్కపై ఇలాంటి ఊహాగానాలు ఇప్పటివి కావు. కొన్నేళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితంపై, సినిమాలపై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో లింక్ చేస్తూ అప్పట్లో ఆమెపై వచ్చిన కథనాలకు కొదవ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు, ఆమె సినిమాలకు దూరమైందనే ప్రచారం కూడా నడిచింది.అయితే దీనిపై అనుష్క నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఆమె నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పారా? లేక మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో సర్ప్రైజ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఓ హీరో ఏడాది గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు. కానీ అదే హీరోయిన్ తీసుకుంటే అంతే సంగతులు. ఇక అనుష్క లాంటి నటిని ఇలాంటి గ్యాప్స్ ఏం చేయలేవు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వచ్చి మరో సూపర్ హిట్ కొడితే ఈ రూమర్స్ అన్నీ రూమర్స్‌గానే మిగిలిపోతాయి. అయితే ఇండస్ట్రీలో చాలామంది నుంచి మాత్రం ఇక ఆమె సినిమాలు చేయదనే టాక్ నడుస్తోంది. దీనిపై అనుష్క టీమ్ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి. -
‘పెద్ద సినిమాలకు అండగా నిలబడ్డాం’
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ‘మన ప్యానల్’ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతల సమస్యల పరిష్కారంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి మన ప్యానెల్ కృషి చేస్తుందని తెలిపారు.మేము అలాంటివి ఏం చేయలేదు..సి కల్యాణ్ మాట్లాడుతూ ‘కొన్ని హామీలు చూసాం. మేము అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము చేసినవి అందరికీ కనిపిస్తున్నాయి. గత రెండున్నర ఏళ్లుగా మీరేం చేశారు. ఇప్పుడు వచ్చి సేవలు చేస్తాం అంటున్నారు. చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి మన ప్యానెల్ ఉంది. ఒకసారి నిర్మాత ఒక సినిమా చేస్తే మెడిక్లైమ్ వచ్చేలా మేమే చేశాం’ అని తెలిపారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘1990లో చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇప్పుడు పరిశ్రమలో ఉన్న పెద్ద నిర్మాతలు లేరు. అక్కడ నుండి ఇక్కడకు పరిశ్రమ వచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి బాగా సపోర్ట్ చేశారు. నిర్మాతలకు అంతా తెలుసు. కౌన్సిల్ లో మేము అధికారంలోకి వచ్చాక అన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తాం’ అని తెలిపారు.తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘గతంలో మమ్మల్ని ఎన్నికల సమయంలో వారు మోసం చేశారు. నేను చాలా మంది చిన్న నిర్మాతలకు అండగా నిలబడ్డాను. ఇన్సూరెన్స్ ఎవరెవరికి ఇచ్చారో క్లియర్ గా ఉంది. ఎన్నో పెద్ద సినిమాలకు కూడా మేము అండగా నిలబడ్డాం.’ అని తెలిపారు. -
ఆరేళ్లకే తొలి సంపాదన! ఆ ఒక్క నిర్ణయంతో మారిన మమితా రేంజ్
ఒకట్రెండు హిట్లు రాగానే స్టార్డమ్ వచ్చేసిందంటూ హడావుడి చేసే హీరోయిన్లు చాలామందే. కానీ.. వరుసగా మూడు భారీ విజయాలతో తన స్థాయినే మార్చేసుకుంటే? ఇప్పుడు మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు చేస్తున్నది అదే. ఈ ఏడాదిలో విజయ్, సూర్య, నివిన్ పౌలీ వంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించిన ఆమె.. వరుస విజయాలతో సౌత్ ఇండియాలో తన మార్కెట్‌ను ఒక్కసారిగా పెంచుకుంది. తెరపై కనిపించే ఆ పక్కింటి అమ్మాయి ఇమేజ్ వెనుక.. కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ కూడా తయారవుతోంది.మమితా బైజు కెరీర్లో 2026 ఓ ప్రత్యేక అధ్యాయం. జూలై 23న విజయ్ నటించిన జన నాయగన్ విడుదలైంది. ఆ తర్వాత ఆగస్టు 14న సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటి తర్వాత.. ఆగస్టు 21న నివిన్ పౌలీతో కలిసి నటించిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ థియేటర్లలోకి వచ్చింది. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో.. ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ జస్ట్.. 11 రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. ముఖ్యంగా.. ఈ మూడు చిత్రాల విడుదల మధ్య వ్యవధి కేవలం 29 రోజులు. దీంతో ఒకే ఏడాదిలో(ఇప్పటివరకు..) మూడు రూ.200 కోట్ల సినిమాల్లో నటించిన భారతీయ నటిగా మమితా రికార్డు సృష్టించినట్లైంది. ఈ మధ్యకాలంలో మరేయితర హీరోయిన్ ఖాతాలో ఇలాంటి అరుదైన రికార్డు నమోదు కాలేదు.‘ప్రేమలు’తో మారిపోయిన కెరీర్అయితే ఈ స్థాయికి ఆమె ప్రయాణం ఒక్కరోజులో మొదలైనదేమీ కాదు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన మమితా.. ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య వంటి చిత్రాల్లో కనిపించింది. కానీ 2024లో వచ్చిన ప్రేమలు ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అందులో రీనూ పాత్రలో ఆమె చూపించిన సహజమైన నటన, ఎక్స్ప్రెషన్స్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత తమిళం, తెలుగు చిత్రసీమల్లోనూ అవకాశాలు వరుసకట్టాయి. అక్కడి నుంచి మమితా ఎంచుకున్న సినిమాలూ ఆమె మార్కెట్‌ను పెంచాయి. డ్యూడ్, కరా వంటి తమిళ చిత్రాలతో పాటు విజయ్ జన నాయగన్, సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌లో నటించడం ఆమెకు మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు సొంత భాషలో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సక్సెస్‌తో ఆ జాబితాలో మరో భారీ హిట్ చేరింది.డాక్టర్ కావాలనుకుని.. హీరోయిన్గామమితా జీవితంలో ఆసక్తికరమైన మలుపు స్కూల్లో ఉండగానే జరిగింది. ఆమె స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్. మె తండ్రి డాక్టర్ బైజు కృష్ణన్.. తల్లి మినీ బైజు. అన్నయ్య మిథున్ కెనడాలో చదువు పూర్తి చేశారు. చిన్నతనంలో ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేదట. అయితే తొమ్మిదో తరగతిలో ఉన్న సమయంలో ఓ ఆడిషన్‌కు వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చింది. ఆ తర్వాత చదువుతో పాటు నటనపైనా దృష్టి పెట్టింది. చివరకు వైద్య వృత్తికి బదులు సినీ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకుంది.ఫ్యాన్స్ ముద్దుగా ‘SSMB’..మమితకు ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. ఆమె షార్ట్ వీడియోలు, డ్యాన్సింగ్ క్లిప్పులు వైరల్ అవుతుంటాయి. సాదాసీదాగా ఉంటూ అభిమానులతోనూ ఆమె అంతే హుందాగా వ్యవహరిస్తుంటారు. ఫ్యాన్స్ సరదాగా ‘SSMB’ సూపర్‌స్టార్ మమితా బైజు అనే ట్యాగ్ కూడా ఇస్తున్నారు. ‘సూపర్‌స్టార్’ అనే అర్థంలో ఈ పేరును వాడుతూ.. మలయాళ సినీ పరిశ్రమకు మమ్ముట్టి, మోహన్‌లాల్ తర్వాత మరో ఎం(M) దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకున్న క్రేజ్, వరుస అవకాశాలను చూసి సోషల్ మీడియాలో ఈ సరదా పోలికలు వైరల్‌గా మారుతున్నాయి.రెమ్యునరేషన్ విషయంలో.. ఇక సంపాదన విషయానికొస్తే.. ఆరేళ్ల వయసులో పాల్గొన్న ఫ్యాషన్ షోలో తొలిసారి రూ.500 సంపాదించిన విషయాన్ని ఆమె తరచూ చెబుతుంటారు. అలాగే తొలి సినిమా ‘సర్వోపరి పాలక్కారన్’కు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని, రెండో సినిమాకు మాత్రం రూ.6,000 అందుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఇన్నేళ్ల శ్రమకు ఆమెకు అవకాశాలు, సక్సెస్‌లు దక్కుతున్నాయి. వరుస విజయాలతో మమితా బైజు పారితోషికం కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆమె సుమారు రూ.2–3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలే కాకుండా ఫ్యాషన్, స్కిన్‌కేర్, జ్యువెలరీ తదితర బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తోంది. దీంతో నటనతో వచ్చే ఆదాయానికి అదనంగా ఎండార్స్మెంట్లు, పెట్టుబడులు కూడా ఆమె సంపాదనలో భాగమవుతున్నాయి.కోచిలో కోట్ల విలువైన ఇల్లు.. కార్లు కూడామమితా బైజు ఆస్తుల గురించి కూడా మాలీవుడ్ వెబ్సైట్లు ఆసక్తికర విషయాలు షేర్ చేస్తుంటాయి. కోచిలో ఆమెకు సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో కోచినే ఆమెకు ప్రధాన నివాసంగా మారినట్లు సమాచారం. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూరులో కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇల్లు కూడా ఉంది.కార్ల విషయానికొస్తే.. మమితా బైజు గ్యారేజీలో వోక్స్వాగెన్ టైగన్, మారుతి సుజుకీ జిమ్నీ ఉన్నాయి. అయితే ఆమె మొత్తం ఆస్తుల విలువపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. మాలీవుడ్ మూవీ సర్కిల్స్ వెబ్సైట్లు మాత్రం.. ఆమె నికర ఆస్తుల విలువను సుమారు రూ.20–30 కోట్లుగా అంచనా వేస్తున్నాయి.ఇష్టాలుఫేవరెట్ యాక్టర్: ధనుష్ ఇష్టమైన హాబీస్: డ్యాన్స్, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ట్రావెలింగ్. ఇష్టమైన ఆహారం: చైనీస్ ఫుడ్ ఇష్టమైన రంగు: బ్లాక్ఇష్టమైన సింగర్: ఆంథోనీ దాసన్ఇష్టమైన పెర్ఫ్యూమ్: చానెల్ఇష్టమైన హాలిడే డెస్టినేషన్: దుబాయ్ఇష్టమైన ఆట: క్రికెట్ఇకపై మమితా రేంజ్ మరింత పెరిగేనా?ప్రేమలుతో వచ్చిన గుర్తింపు.. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాలు.. ఇప్పుడు మూడు రూ.200 కోట్ల చిత్రాలతో వచ్చిన రికార్డు. మమితా బైజు కెరీర్ గ్రాఫ్ చూస్తే.. తక్కువ సమయంలోనే ఆమె ఎంత వేగంగా ఎదిగిందో అర్థమవుతుంది. పాతికేళ్ల వయసులోనే ఇలాంటి మార్కెట్ రావడం ఆమెకు కలిసొచ్చిన మరో అంశం. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథ, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగితే.. మమితా బైజు దక్షిణాది చిత్రసీమలో మరో బలమైన హీరోయిన్గా ఎదగడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇదీ చదవండి: ఆమె దోసె వేస్తే లక్షలు కురవాల్సిందే! -
లాజిక్‌లు వదిలేసి మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయండి: ‘అల్లరి’ నరేశ్
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని యూనిట్ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత నేను చేసిన కామెడీ సినిమా ఇది. దీంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న చిన్న భయం ఉండేది. ఫస్ట్ డేనే మా సినిమాకు మంచి టాక్ రావడం సంతోషాన్నిచ్చింది. లాజిక్‌లు వదిలేసి ఒక మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయండి. చూడనివాళ్ళు, థియేటర్స్‌లో చూసి, ఇంకా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అందరూ ‘నరేష్ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. కామెడీని ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఎమోషన్ గురించి కూడా గొప్పగా మాట్లాడుతున్నారు’’ అని తెలిపారు చంద్రమోహన్. ‘‘నరేష్‌గారి కామెడీ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది. బీ, సీ సెంటర్స్‌లో మా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు రాజేష్ దండా. -
పాఠాలు చెబుతాం... నిలదీస్తాం
టీచర్ అంటే క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పడం, స్ట్రిక్ట్‌గా ఉండటం మాత్రమే కాదు... విద్యను వ్యాపారంగా మార్చాలనుకుంటే నిలదీస్తాం అంటున్నారు సిల్వర్ స్క్రీన్ టీచర్స్. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా త్వరలో తెరకు రానున్న కొన్ని టీచర్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం.ప్రొఫెసర్ పాఠాలు యాక్షన్ మోడ్‌లో స్క్రీన్ పై ప్రభాస్ ఎలా కనిపిస్తారో చాలా సినిమాల్లో చూశాం. కానీ ‘మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాల్లో ప్రభాస్ క్లాస్‌గానూ కనిపించారు. తాజా సినిమా ‘స్పిరిట్’లో కూడా కొన్ని సీన్స్‌లో క్లాస్‌గా కనిపిస్తారట. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్, డాన్, కాలేజీ ప్రొఫెసర్... ఇలా మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారట. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ప్రభాస్ పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. ప్రొఫెసర్‌గా ప్రభాస్ నటించిన సన్నివేశాలనే ఆ షెడ్యూల్లో చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తండ్రి గురువు... కుమార్తె శిష్యురాలు నిజ జీవితంలో తండ్రీ కూతుళ్ళు అయిన షారుక్ ఖాన్ –సుహానా ఖాన్లు ‘కింగ్’ సినిమాలో గురు–శిష్యులుగా కనిపించనున్నారని తెలిసింది. కాకపోతే ఈ చిత్రంలో గురువుగా సుహానాకు షారుక్ కాలేజీ పాఠాలు చెప్పరు. జీవిత పాఠాలు నేర్పుతారు. తనకు అన్యాయం చేసిన వారి భరతం పట్టే పాత్రలో సుహానా నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో ఆమె కొన్ని రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాల్సి ఉంది. ఆన్సెట్స్లో ఈ రిస్కీ ఫైట్స్ చేయడానికి షారుక్ సహాయం చేస్తున్నారట. అలాగే సినిమాలోనూ యాక్షన్ గురువుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాక్‌పీస్... తుపాకీ ‘హిస్టరీ లెసన్స్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి’ అంటూ ఆ మధ్య ‘టీచర్’ చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు బాలు శర్మ. ఈ సినిమా టైటిల్ లోగోలో చాక్‌పీస్ మాత్రమే కాదు... తుపాకీ కూడా కనిపించడం చర్చనీయాంశమైంది. యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. టీచర్‌గా ప్రముఖ నటి సిమ్రాన్ నటిస్తున్నారు. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పడంతో పాటు దుష్టుల పని పట్టే టీచర్‌గా ఆమె కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. దబాంగ్ టీచర్ ఆమె కోటీశ్వరురాలు... కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి, టీచర్‌గా చేరుతుందట. అది కూడా ట్రైనీ టీచర్‌గా... ‘దబాంగ్ టీచర్’ పేరుతో రూపొందుతున్న సిరీస్‌లో కనికా కపూర్ ఈ పాత్రను చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం, న్యాయం కోసం పోరాటం, విలక్షణమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టీచర్ నైనా పాత్ర కోసం తాను సుష్మితా సేన్, ఆలియా భట్లను స్ఫూర్తిగా తీసుకున్నానని, వారి బాడీ లాంగ్వేజ్ టీచర్ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఉంటుందని కనికా పేర్కొన్నారు. షకేబ్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిజిటల్ వేదికగా త్వరలో వీక్షకుల ముందుకు రానుంది. -
కన్నప్పుడు కాలేజీ ఫీజు కూడా కట్టరా?.. ఎపిక్ ట్రైలర్ రిలీజ్
బేబీ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. ఈ జంట ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అనే మూవీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆదిత్యహాసన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే ఎపిక్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లండన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇండియా నుంచి లండన్ వెళ్లిన ఇద్దరు ప్రేమలో పడే నేపథ్యంలో ఈ కథ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. -
మహేంద్రగిరి వారాహి.. ది రేజ్ ఆఫ్ వారాహి రిలీజ్
సుమంత్, ఐశ్వర్య రాజేశ్, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో వస్తోన్న డివోషనల్ మూవీ మహేంద్రగిరి వారాహి. వారణాసి గ్రామదేవత వారాహీ అమ్మవారి కథతో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ వారాహీ అమ్మవారిగా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి ది రేజ్ ఆప్ వారాహి అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను టాలీవుడ్ హీరో నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు కడలి సత్యనారాయణ లిరిక్స్ అందించగా.. నకాశ్ అజిజ్ ఆలపించారు. ఈ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. Happy to launch #TheRageOfVarahi from #MahendragiriVarahi 🔱🔗 https://t.co/pYkqIjAtccA powerful score by @anuprubens that elevates the essence of Varahi beautifullyMy best wishes to @iSumanth anna, director @Santhosshjagar1, producers Laxman garu, @kalipumadhu5 garu and…— chaitanya akkineni (@chay_akkineni) September 4, 2026 -
రాజ్ తరుణ్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
రాజ్‌తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టార్టాయిస్. ఈ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్‌పై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, ఇమ్మడి సంతోష్, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. నీ పరిచయం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. చిన్మయి, అనూప్ రూబెన్స్, జాహ్నవి ఆలపించారు. ఈ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
జానీ మాస్టర్ సతీమణి సుమలతపై ఫిర్యాదు
సుమలత ఆరోపణలపై రఘు మాస్టర్ కౌంటరిచ్చారు. సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రఘు మాస్టర్ ఫిర్యాదు చేశారు. తమ కార్యవర్గాన్ని ఫెడరేషన్ గుర్తించిందని రఘు మాస్టర్ స్పష్టం చేశారు. ఫెడరేషన్ గుర్తింపు లేఖతోనే బ్యాంకును ఆశ్రయించామని వెల్లడించారు. మేం ఇచ్చిన లేఖ ఆధారంగానే బ్యాంకు అనుమతించిందని రఘు మాస్టర్ తెలిపారు.సుమలత ప్యానెల్‌ను ఫెడరేషన్ గుర్తించలేదని రఘు మాస్టర్ ఆరోపించారు. సుమలత వ్యవహారంతో డాన్సర్స్ అసోసియేషన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. అసోసియేషన్‌లో వివాదాలను సుమలత మరింత పెంచుతున్నారని రఘు మాస్టర్ విమర్శించారు. త్వరలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతానని రఘు మాస్టర్ ప్రకటించారు. కాగా.. అంతకుముందు రఘు మాస్టర్ ప్యానెల్‌పై సుమలత ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ సుమలత ఆరోపించింది. -
రంభ ఊర్వశి మేనక.. ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..!
అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చింతాడ చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా కనిపించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, నిమ్మకాయ ప్రసాద్ నిర్మించారు. -
కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌పై ఫిర్యాదు
డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్‌పై కేసు నమోదైంది. ఆయనపై జానీ మాస్టర్ సతీమణి సుమలత దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఘు మాస్టర్ కార్యవర్గం చెల్లదంటూ ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మరింత తెలియాల్సి ఉంది. అసోసియేషన్ అధ్యక్షురాలిగా తొలగింపు.. కాగా.. గతేడాది డిసెంబరులో జానీ మాస్టర్ భార్య సుమలత.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు పదవీకాలం ఉంది. కానీ అసోసియేషన్‌లో గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న సంఘటనల కారణంగా ఈమెని తప్పించారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో యూనియన్ డ్యాన్సర్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు కార్యవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులని ప్రకటించారు.డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి రఘు మాస్టర్ ప్రెసిడెంట్ కాగా.. మెహర్ బాబా మాస్టర్ సెక్రటరీ, బసవరాజు వైస్ ప్రెసిడెంట్, రాజన్న జాయింట్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా సతీష్, నాగార్జున, శివ కృష్ణ , జోజో ఉండనున్నారు. అయితే వీళ్లంతా తాత్కాలిక సభ్యులే. త్వరలో ఎన్నికలు జరుగుతాయని రఘు మాస్టర్ చెప్పారు. -
అప్పట్లో దేవుళ్లు.. ఇప్పుడు స్మగ్లర్లు, క్రిమినల్స్: నటి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి కస్తూరి శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తోన్న మూవీస్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. మన తెలుగులో మొదట్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారని తెలిపింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రలు ఎక్కువగా కనిపించాయని పేర్కొంది. అయితే ఈ నాటి చిత్రాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో మాత్రమే హీరోలు కనిపిస్తున్నారని విమర్శించింది. సోషల్ మేసేజ్‌తో వచ్చే చిత్రాలు చాలా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేసింది.కస్తూరి శంకర్ మాట్లాడుతూ.." చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమాను సినిమాగానే చూడాలి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు చూసేదాన్ని. అప్పట్లో దేవుడి పాత్రల్లో ఎక్కువ కనిపించేవారు. కానీ ఇప్పుడు సినిమాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ పాత్రలు చేసే సినిమాలు వస్తున్నాయి. ఆనాడు ఒక సామాజిక బాధ్యతతో సినిమాలు చేసేవారు. అలాంటి సోషల్ మేసేజ్ ఇచ్చే మూవీనే మా ధర్మస్థల నియోజకవర్గం" అని తెలిపింది. ఆమె కీలక పాత్రలో నటించిన ధర్మస్థల నియోజకవర్గం ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ తెలుగు సినిమాలను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. మొదట్లో తెలుగు సినిమాల్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారు.ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రల్లో నటించేవారు.ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోలు స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో నటిస్తున్నారు.- Kasthuri Shankar… pic.twitter.com/s1FglISJx7— Tupaki (@tupaki_official) September 3, 2026 -
అల్లు అర్జున్ రాకా.. రిలీజ్ డేట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ రాకా. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలు మరించ పెంచేశాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో టాక్ నెట్టింట వైరల్‌గా మారింది.ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2028 జనవరి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ తేదీపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రాకా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అధికారిక ప్రకటన వస్తేనే ఫుల్ క్లారిటీ రానుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో తండ్రి... ఇద్దరు కొడుకులు... ఇలా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారట అల్లు అర్జున్. అంతేకాదు... ఈ మూడు పాత్రల్లో ఒకటి విలన్ రోల్ అని సమాచారం. ఇదే నిజమైతే ‘రాకా’ చిత్రంలో హీరోగా, విలన్‌గా అల్లు అర్జున్ నటన చూడొచ్చు. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్లో దీపికా పదుకోణె నటిస్తున్నారు. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. 🚨 𝐒𝐇𝐎𝐂𝐊𝐈𝐍𝐆 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 🚨Allu Arjun’s #𝐑𝐀𝐀𝐊𝐀 Is 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋𝐋Y Set For 𝟐𝟔𝐓𝐇 𝐉𝐀𝐍𝐔𝐀𝐑𝐘 𝟐𝟎𝟐8 Release🗓️❤️🔥❤️🔥!Targeting A 𝟓-𝐃𝐀𝐘 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃 𝐑𝐄𝐏𝐔𝐁𝐋𝐈𝐂 𝐃𝐀𝐘 𝐖𝐄𝐄𝐊𝐄𝐍𝐃 🥁, The Film Has Announced Its Release Date Via Its… pic.twitter.com/ldGV5jN8tq— Movies Buster (@buster_movies) September 4, 2026 -
మార్కండేయుడిగా బహ్మాజీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
బ్రహ్మాజీ మార్కండేయుడి పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తుండగా.. నాగరాజ్ కొట్టే దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో లాంఛ్ చేశారు.పోస్టర్లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఆయన లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.కాగా.. ఈ చిత్రంలో ప్రదీష్, వంగమయి పటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచ్చ రవి డైలాగ్స్ అందిస్తున్నారు. -
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నికల సందడి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతల సమస్యల పరిష్కారంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి తమ ప్యానెల్ కృషి చేస్తుందని తెలిపారు.కలిసి పనిచేద్దాం..ఈ సందర్భంగా నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధి రవి యలమంచిలి మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. పరిశ్రమలో నిర్మాతలంతా ఐక్యంగా ఉండి మంచి సినిమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ ఇప్పటివరకు సుమారు 180 సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసినట్లు తెలిపారు. నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.నిర్మాత అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. నిర్మాతల మండలి ఎన్నికలు సాధారణంగా రెండేళ్లకు ఒకసారి జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈసారి ఏడు నెలలు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. మండలిలో అధ్యక్షుడి మాట కూడా చెల్లని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం తాను నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. -
తొలిసారి ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన నయనతార..!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే టాక్సిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. యశ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు గీతూ మోహన్గాస్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంచితే మరో మూవీ హాయ్ కూడా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. అయితే నయనతార ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. తన సంప్రదాయానికి భిన్నంగా థియేటర్లో సందడి చేసింది. తన సుదీర్ఘ సినీ కెరీర్లోనే మొదటిసారిగా ఒక సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు థియేటర్‌ను సందర్శించింది. ఆమెను చూసిన ఆడియన్స్ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమాకి ఆమె ప్రొడ్యూసర్ కూడా కావడమే ఇలా ప్రమోషన్ కోసం బయటకు వచ్చిందని.. లేకపోతే ఎందుకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. #Nayanthara theatre visit at kamala theatre chennai.#HiMovie pic.twitter.com/AmZUTC3tBE— Quality Pixels (@Quality_Pixels) September 4, 2026 -
‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
టైటిల్: బెత్లెహోమ్ కుటుంబ యూనిట్నటీనటులు: నివిన్ పౌలి, మమిత బైజు, సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులునిర్మాతలు: దిలీష్ పోతన్, ఫహద్, ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ తెలుగు విడుదల: మైత్రీ మూవీ రిలీజ్దర్శకత్వం: గిరీశ్ ఏడీసంగీత: విష్ణు విజయ్సినిమాటోగ్రాఫర్: అజ్మల్ సాబువిడుదల తేది: సెప్టెంబర్ 4, 2026మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ మధ్య అక్కడ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ వారం తెలుగులో రిలీజ్ అయిన మలయాళ చిత్రమే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. నేడు(సెప్టెంబర్ 4) ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ‘ప్రేమలు’ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. జస్టిన్ (నివిన్ పౌలీ) ఊర్లో క్యాటరింగ్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. ఊర్లో వాళ్లంతా హేళన చేస్తున్న పెద్దగా పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని పక్కింట్లోకి కొత్తగా వచ్చిన ఓ కుటుంబంలోని అమ్మాయి ఆష్లే(మమితా బైజు) ప్రేమిస్తుంది. తొలుత స్నేహం చేసి ఆ తర్వాత అతని మంచితనం చూసి ప్రేమలో పడిపోతుంది. అయితే ఆమెకు జస్టిన్‌కి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఆష్లే తనను ప్రేమించిందన్న విషయం తెలిసి జస్టిన్ కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ప్రేమ విషయం కొన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచుదామని చెప్పి..ఎవరి కంటా పడకుండా తిరుగుతుంటారు. అయితే ఓ సంఘటన వీరి రహస్య ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరి కుటుంబ సభ్యలు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరకు వీరిద్దరి ప్రేమ..పెళ్లి వరకు ఎలా వెళ్లింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుగా.. చిన్న కథకు కూడా కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి, భారీ హంగులతో సినిమాలు తెరకెక్కిస్తున్న రోజులివి. కానీ సినిమా గొప్పదనం ఎన్ని కోట్లు ఖర్చు చేశామన్నదానిలో లేదు.. తెరపై ఆ కథను ఎంత సహజంగా ఆవిష్కరించామన్నదానిలో ఉంటుంది. ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవ్వాలి.. పాత్రల్లో తనను తాను చూసుకోవాలి.. అప్పుడే ఆ సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా విజయం సాధిస్తుంది. ఈ సూత్రాన్ని మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడో ఒంటబట్టించుకుంది. స్టార్ హీరోలు, భారీ సెట్లు, కోట్ల బడ్జెట్ల కంటే.. కథ, కథనానికే అక్కడ పెద్దపీట. అందుకే అక్కడి నుంచి వచ్చే సినిమాలు భాషల్ని దాటి ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్తుంటాయి. అలాంటి సహజత్వానికి అద్దం పట్టే మరో మలయాళ ఆణిముత్యమే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సినిమా. ఈ సినిమా కథ కొత్తదేమి కాదు. చాలా సింపుల్ లవ్ స్టోరీ. ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన సింపుల్ లవ్‌స్టోరీ.కథలో కొత్తదనమేమి లేకున్నా..దాన్ని తెరపై కొత్తగా చూపించడంలో మాత్రం దర్శకుడు గిరీశ్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రేమలు సినిమా మాదిరే ఇందులో కూడా సహజత్వానికి పెద్ద పీట వేశాడు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతి సన్నివేశం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆహ్లాదకరంగా కథనం సాగుతుంది. ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినా..జస్టిన్, ఆష్లే పరిచయం తర్వాత మనం ఆ పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తుంటాం. హీరోహీరోయిన్ల పరిచయం..స్నేహితుల మాటలు.. లవ్ ప్రపోజల్.. ప్రతీది మన చుట్టుపక్కల చూసిన కథనే తెరపై చూపించిన అనుభూతి కలుగుతుంది. షార్ట్‌ఫిల్మ్ మేకింగ్‌తో జస్టిన్ తమ్ముడు రచ్చ నవ్వులు పూయిస్తుంది. ఆష్లే లవ్ ప్రపోజల్ సీన్ కూడా ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల లవ్ చుట్టునే తిరుగుతుంది. ఊర్లో వాళ్లుకి, స్నేహితులకు తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం.. చిన్న చిన్న గొడవలు..అలకలు.. కాలేజీ ఎపిసోడ్.. అన్ని ఆకట్టుకుంటాయి. ఇక వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. అయితే అక్కడ నుంచి కథను ఎమోషనల్‌గా నడిపించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మళ్లీ హాస్యాన్నే ఎంచుకున్నాడు. తన తమ్ముడి లవ్‌స్టోరీ తెలిసిన తర్వాత.. ఆ జంటను కలిపేందుకు జస్టిన్ గ్యాంగ్ చేసే హంగామా అంతా నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు. అలాగే హీరో లవ్ఫెయిల్యూర్ని పైపైనా చూపిస్తూ .. అతని తమ్ముడి లవ్‌స్టోరిని హైలెట్ చేస్తూ హాస్యం పండించాడు. హీరోహీరోయిన్ల ప్రేమలో డెప్త్ లేకున్నా.. కామెడీ సీన్లతో ఆలోటుని పూడ్చేశాడు. క్లైమాక్స్ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మాత్రం ఓ మంచి సినిమా చూశామనే ఫిలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. నివిన్ పౌలీ పాత్రలో నివిన్ పౌలీ నటించలేదు..జీవించేశాడని చెప్పాలి.తెరపై హీరోలా కాకుండా కామన్ మ్యాన్‌గా కనిపించాడు. ముఖ్యంగా హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుటు ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా ఉంటాయి. తన ప్రేమను వ్యక్తం పరిచేందుకు పడే సిగ్గు, ఇన్ సెక్యూరిటీ.. ప్రతీది చాలా అద్భుతంగా పండించాడు. ఇక ఆష్ల పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది మమిత. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.నివిన్, మమితల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో తమ్ముడిగా సంగీత్ ప్రతాప్, అతని స్నేహితుడిగా రోషన్ షనవాస్ తమదైన కామెడీతో నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. విష్ణు విజయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు కూడా బాగుంటాయి. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కేరళ పల్లెటూరి అందాలనే కాదు గోవా అందాలను కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రముఖ నటుడు దునియా విజయ్‌కు విడాకులు
సీనియర్ కన్నడ నటుడు దునియా విజయ్, భార్య నాగరత్న విడిపోయారు. వారి విడాకుల కేసు కొన్నేళ్లు నుంచి కోర్టులో నడుస్తోంది. హైకోర్టు వారికి విడాకులను మంజూరు చేసింది. దునియా–నాగరత్నలు 1999లో పెళ్లి చేసుకోగా, గొడవలు వచ్చి 2013లో మొదటిసారిగా విడాకులకు కోర్టుకు వెళ్లారు. 2014లో రాజీ అయి కేసును విత్‌డ్రా చేసుకున్నారు. 2018లో తన భార్య వేధిస్తోందని విజయ్ మళ్లీ శాంతినగర ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరాడు. 2024 విచారణలో విజయ్ తన ఆరోపణలకు ఆధారాలను చూపలేకపోవడంతో అర్జీని కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కాడు. ఇరుపక్షాల వాదనలను ఆలకించిన కోర్టు.. వారి దాంపత్య బంధానికి చట్ట ప్రకారం ముగింపు పలికింది. విజయ్ ఆనందం విడాకుల సంగతిని విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోర్టుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నట్లు, తన వెంట ఉన్న అభిమానులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలని, కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు సంతోషం వ్యక్తంచేశాడు. కాగా, ఈ కేసు నడుస్తుండగానే విజయ్.. మోడల్, టెక్కీ అయిన కీర్తి పట్టాను 2010లో పెళ్లి చేసుకున్నాడు. భృతి వివరాలు.. విజయ్–నాగరత్నకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లల పోషణ, చదువుల ఖర్చును పూర్తిగా విజయ్ చూసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే 2 నెలల్లో రూ.2 కోట్ల భృతిని నాగరత్నకు అందజేయాలని సూచించింది. -
ప్రయాణం ఖరారు
అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూప శ్రీనివాస్, సునైనా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 18న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు మేకర్స్. ‘‘మహిళల భావోద్వేగాల ప్రధానంగా రూపొందిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది.పృధ్వీ, పాయల్ రాధాకృష్ణ -
అల్ల కల్లోలంగా అద్భుతంగా కుదిరింది: మణిశర్మ
సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గజ’. సతీష్ జై దర్శకత్వం వహించారు. చలంశెట్టి సునీల్ సమర్పణలో మైత్రి శరణ్ నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీస్ విడుదల చేయనుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘అల్లకల్లోలంగా...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించగా, రామ్ మిర్యాల పాడారు. ఈ పాట విడుదల వేడుకకి దర్శకుడు సాయి రాజేష్ అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘గజ’ టీజర్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి ’’ అన్నారు. సతీష్ జై మాట్లాడుతూ– ‘‘గజ’లో వాణిజ్య అంశాలతో పాటు మంచి సందేశం, భావోద్వేగాలు ఉంటాయి. క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు కంట తడి పెట్టుకుంటారు’’ అన్నారు. ‘‘సతీష్ ఈ సినిమాని ఎన్నో సవాళ్లని ఎదుర్కొని చేశాడు. ‘అల్ల కల్లోలంగా’ పాట అద్భుతంగా కుదిరింది’’ అని మణిశర్మ అన్నారు. ‘‘మణిశర్మగారి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందర్నీ ఆకట్టుకుంటాయి’’ అన్నారు మైత్రి శరణ్. -
ఆ బాధ ఎలా ఉండేదో చూశాను: ‘అల్లరి’ నరేశ్
‘‘చిత్ర పరిశ్రమలో చాన్స్‌లు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా నాన్నగారు (ఈవీవీ సత్యనారాయణ) కూడా ‘చెవిలో పువ్వు’ సినిమా తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉండేదో నేను చూశాను. చంద్రమోహన్‌గారు దర్శకుడు కావడానికి చాలా కష్టపడ్డారు. ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం నాకంటే చంద్రమోహన్‌గారి కోసం పెద్ద సక్సెస్ అవ్వాలి’’ అని ‘అల్లరి’ నరేశ్ తెలిపారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, సురభి జంటగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘రంభ ఊర్వశి మేనక’తో హిట్టు సాధిస్తాం... సక్సెస్ మీట్ కూడా పెడతాం’’ అని చెప్పారు. ‘‘నా తొలి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్‌లో చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు చంద్రమోహన్ చింతాడ. ‘‘ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ కాబోతోందని అర్థమవుతోంది’’ అన్నారు నిర్మాత వై. రవిశంకర్. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను’’ అన్నారు నిమ్మకాయల ప్రసాద్. ‘‘థియేటర్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు ప్రేక్షకులు ఫుల్లుగా నవ్వుకుంటూ వెళ్తారు. దానికి నేను గ్యారంటీ’’ అని రాజేష్ దండా తెలిపారు. -
లుక్ ఫిక్స్
చేతిలో కత్తి, చురకత్తుల్లాంటి చూపులు... తన కొత్త చిత్రంలో కమల్‌హాసన్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నారని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘సేతుపతి, చిత్తా’ వంటి తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్‌హాసన్ లీడ్ రోల్లో రూపొందనున్న చిత్రంలోని లుక్ ఇది. త్వరలో చిత్రీకరణ ఆరంభించనున్న నేపథ్యంలో లుక్ టెస్ట్ చేశారు. ఫైనల్‌గా ఈ లుక్‌ని ఫిక్స్ చేశారు. కమల్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ చిత్రంలో కమల్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
జూ. ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అనీల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోకి మరో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ‘డ్రాగన్’లో పవర్ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. నిజానికి డ్రాగన్ సినిమాలోకి అలియాను తీసుకుంటారనే ప్రచారం ఏడాది కిందటే నడిచింది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ సినిమా షూటింగ్ మరో రెండు వారాల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి చిత్రీకరణను ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
వెండితెరపై రామానుజచార్యుల చరిత్ర.. రిలీజ్ ఎప్పుడంటే?
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 25న "జయహో రామానుజ" సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో యాదగిరిగుట్ట బోర్డ్ మెంబర్ డా లక్ష్మీ నారాయణ, ఓబీసీ కన్వీనర్ మల్లేశ్, అన్నపూర్ణ, ప్రొఫెసర్ కిరణ్, శ్రీనివాస్, నిర్మాత మోహన్ గౌడ్, నటుడు రాంకీ, సత్యనారాయణ, వెంకట్ పాల్గొన్నారు.నటి ప్రవళ్లిక మాట్లాడుతూ.. " ఈ సినిమా నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నిర్మాణ బాధ్యతల వహిస్తూనే పాటు కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించా. ఈ చిత్రంతో సమ సమాజం కోసం పాటుపడిన రామానుజాచార్యుల వారి గురించి ఈ తరం వారికి మరింతగా తెలియజేసే ప్రయత్నం చేశాం. ఈ సినిమా జర్నీ నాకు ఎన్నో విషయాలు నేర్పింది. అదంతా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మీరంతా తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.దర్శకుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ..' కులం లేదు.. మతం లేదు.. మనుషులంతా ఒక్కటే, సమానమే అని చెప్పిన గొప్ప మహనీయుడు రామానుజాచార్యులు. ఈ సినిమా రూపొందిస్తున్న సమయంలో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. టీటీడీకి 20 లక్షల రూపాయలు విరాళం ఇవ్వగలిగా. అంటే అది రామానుజాచార్యుల వారి మహిమే. అప్పట్లో బ్రాహ్మణులకు మాత్రమే దేవాలయాలకు ప్రవేశం ఉండేది. అలాంటి టైమ్‌లో ఒక ఆధ్యాత్మిక విప్లవం తీసుకొచ్చారు రామానుజాచార్యులు. మనుషులంతా ఒక్కటే కదా అలాంటప్పుడు మిగతా వారికి ఆలయ ప్రవేశం ఎందుకు లేదు అని ప్రశ్నించాడు. అందరిలో చైతన్యం తీసుకొచ్చాడు. అందరికీ ఓం నమో నారాయణ మంత్రాన్ని నేర్పించి, ఇక నుంచీ ప్రతి ఒక్కరు బ్రాహ్మణులే వైష్ణవులే అని చాటాడు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా' అని అన్నారు. -
అమెజాన్ ఉద్యోగులకు సర్ప్రైజ్.. మీర్జాపూర్ తారల సందడి
మీర్జాపూర్ – ది మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అమెజాన్ క్యాంపస్‌లో ఉద్యోగులకు ఊహించని సర్ప్రైజ్ లభించింది. కంపెనీ వార్షిక ‘ఆల్ ఇండియా మీటింగ్’ (AIM) సందర్భంగా ‘మీర్జాపూర్’ ఫ్రాంచైజీకి చెందిన నటీనటులను ప్రత్యేకంగా క్యాంపస్‌కు తీసుకొచ్చి లైవ్ అపియరెన్స్ ఇప్పించింది. దీంతో ఆఫీస్ వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది.‘మీర్జాపూర్ నటీనటులు హైదరాబాద్‌లోని అమెజాన్ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే.. ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఊహించని విధంగా తమ అభిమాన తారలు కళ్లముందు ప్రత్యక్షం కావడంతో ఆఫీస్ మొత్తం సందడిగా మారిపోయింది. ఒక సాధారణ వార్షిక సమావేశంగా ప్రారంభమైన ఏఐఎం, వీరి రాకతో ఒక పాప్-కల్చర్ దృశ్యం కనిపించింది.ఈ వార్త త్వరగానే సోషల్ మీడియాలో వైరలైంది. ఉద్యోగులు లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ మరియు ఎక్స్లలో ఫోటోలు, వీడియోలు, తెరవెనుక క్లిప్‌లతో నింపేశారు. పని ప్రదేశంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఎలా ఉండాలనే దానిపై పునరాలోచన చేస్తున్న పెద్ద సంస్థల యజమానులలో పెరుగుతున్న ధోరణిని ఈ చర్య ప్రతిబింబిస్తోంది. పోటీతత్వంతో కూడిన ప్రతిభావంతుల మార్కెట్లో, విధేయతను.. సంస్థలో భాగమనే భావనను పెంపొందించడంలో సాధారణ ప్రోత్సాహకాల కంటే ఆశ్చర్యపరిచే, ఆనందపరిచే అనుభవాలను అందించింది. -
అలాంటి వాటితో జాగ్రత్త.. కల్కి మేకర్స్ వార్నింగ్..!
కల్కి మూవీ మేకర్స్ ప్రేక్షకులను విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మా పేరుతో నకిలీ కాస్టింగ్ కాల్స్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలియజేస్తూ పోస్ట్ చేసింది.మా తరఫున ఆడిషన్స్ కానీ.. కాస్టింగ్ కానీ నిర్వహించడానికి ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీ, కంపెనీ లేదా వ్యక్తులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వైజయంతి మూవీస్ స్పష్టం చేసింది. మా ప్రతినిధులమని చెప్పుకుంటూ ఎవరైనా సంప్రదిస్తే నమ్మవద్దని కోరింది. తమ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మాణ సంస్థ కోరింది.ఎవరైనా సరే తమ వ్యక్తిగత వివరాలు, ఆడిషన్ మెటీరియల్ పంచుకోవద్దని స్పష్టం చేసింది. ఎవరికీ కూడా ఎలాంటి చెల్లింపులు చేయవద్దని హెచ్చరించింది. తమ సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. కల్కి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదైనా అధికారిక సమాచారం కోసం కేవలం వైజయంతి మూవీస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను మాత్రమే అనుసరించాలని స్పష్టం చేసింది. కాగా.. కల్కి మూవీకి సీక్వెల్‌గా కల్కి-2 కూడా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. Important Clarification:Please beware of fake casting calls and individuals falsely claiming to represent #VyjayanthiMovies.#Kalki2898AD pic.twitter.com/YPcGHTf1OQ— Kalki 2898 AD (@Kalki2898AD) September 3, 2026 -
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం తెలుగులో నరేశ్ హీరోగా వస్తోన్న రంభ ఊర్వశి మేనక, ఐ యామ్ గేమ్, బెత్లెహోమ్ కుటుంబ యూనిట్, మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో నరేశ్ మూవీపై ఆడియన్స్‌లో బజ్ నెలకొంది.ఇక ఓటీటీల విషయానికొస్తే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ లాంటి ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. జగమే సంగీతం అనే తెలుగు వెబ్ సిరీస్ సైతం మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్..నెట్‌ఫ్లిక్స్ ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04 కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) - సెప్టెంబరు 04 ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04 టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04జీడీఎన్(తమిళ సినిమా)- సెప్టెంబరు 04 అమినే క్రాఫ్ట్ మూవీ(హాలీవుడ్)- సెప్టెంబరు 04 ది బ్రెడ్ విన్నర్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 06సన్ నెక్స్ట్ డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04అమెజాన్ ప్రైమ్ జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04జియో హాట్‌స్టార్ ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04జీ5వీరభద్రుని రహస్యం సీజన్-1 పార్ట్-2(తెలుగు సిరీస్)- సెప్టెంబర్ 04సోనీ లివ్ ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 04ఆపిల్ టీవీ ప్లస్ మే డే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 04 -
ఏషనాగుల సాంగ్.. ఐదు రోజుల్లోనే అరుదైన రికార్డ్..!
నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్ అభిమానులను అలరించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే మరో సాంగ్ విడుదల చేశారు.తాజాగా రిలీజైన మాస్ సాంగ్ ఏషనాగుల ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట గురించే టాక్ వినిపిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే యూట్యూబ్ వేదికగా 50+ మిలియన్ వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. #Yeshanagula sets an unprecedented record 🔥🔥Becomes the FASTEST TELUGU SONG TO HIT 50 MILLION+ VIEWS in under 5 days 💥💥#TheParadise second single is TRENDING #1 on YouTube Global Charts ❤🔥▶️ https://t.co/yqhCQaF2JdGRAND RELEASE WORLDWIDE ON 24.09.26.Natural Star… pic.twitter.com/uVMACvbSOC— SLV Cinemas (@SLVCinemasOffl) September 3, 2026 -
అల్లు అరవింద్ కామెంట్స్‌పై వివాదం.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
అల్లు అరవింద్- యశ్ వివాదంపై సంచలన డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. గతంలో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలను ఇప్పుడు వివాదం చేస్తున్నారని అన్నారు. ఎక్కడా కూడా యశ్‌ను ఆయన విమర్శించేదని తెలిపారు. కేజీఎఫ్ తర్వాత యశ్ రేంజ్ మారిపోయిందని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక శుక్రవారంతో కెరీర్ మారిపోతుందనే అర్దంలొ అదే విషయాన్ని కేజీఎఫ్ హీరో యశ్ కూడా చెప్పారని అన్నారు. ఈ విషయంలో యశ్ మదర్ తెలియక మాట్లాడి ఉంటారని రాం గోపాల్ వర్మ తన ట్వీట్లో ప్రస్తావించారు. ఇలా గతంలో మాట్లాడిన పాత వీడియోలను పట్టుకుని మనం మాట్లాడడం సరైంది కాదన్నారు. బాహుబలికి ముందు హిందీ ప్రేక్షకులకు ప్రభాస్ గురించి తెలియదు.. అలాగే కాంతారాకు ముందు రిషబ్ గురించి ఎవరికీ తెలియదు.. గాడ్ ఫాదర్‌కు ముందు బ్రాండో గురించి నాకు తెలియదు.. బహుశా 'ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్', 'ఆన్ ది వాటర్ ఫ్రంట్' వంటి సినిమాలతో అతను అంతకు ముందే స్టార్ అయ్యి ఉండవచ్చని అన్నారు.. అవి భారతదేశంలో కూడా విడుదలయ్యాయో లేదో నాకు తెలియదు.. ఎందుకంటే ఆ సినిమాలే వారిని పెద్ద స్టార్లుగా చేశాయని రాసుకొచ్చారు. అంతేగాని వారు స్టార్లు కాదు.. హాలీవుడ్ ఎప్పుడూ కాన్సెప్ట్ సినిమాలపైనే ఎక్కువగా ఖర్చు చేస్తుంది.. కానీ స్టార్లపై కాదు.. నోలన్ వంటి దర్శకులు కూడా నటులను వారి నటన ప్రతిభ కోసమే వాడుకుంటారు తప్ప వారి స్టార్‌డమ్‌పై ఆధారపడరు.. అది ఓపెన్‌హైమర్ సినిమా అయినా, ఒడిస్సీ అయినా, అందులో ఎవరున్నా అవి అంతే విజయం సాధిస్తాయని మనందరికీ తెలుసు కదా అన్నారుఇక విషయానికి వస్తే అల్లు అరవింద్ విషయానికి వస్తే.. అత్యంత సాధారణమైన, మంచి ఉద్దేశంతో కూడిన ఆలోచనను ఆయన అన్న మాటను వ్యక్తిగతంగా తీసుకోవడం అంటే కేవలం విపరీతమైన అహంకారం ఉన్నవారేనని ప్రస్తావించారు.. నిజానికి.. ఇలాంటి ప్రతిచర్యే వారు అలాంటివి ఎందుకు చేస్తున్నారో కూడా వివరిస్తుందని అన్నారు. కాగా.. 2023లో కోటబొమ్మాలి ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడిన విడియో క్లిప్‌పై యశ్ మదర్ కామెంట్స్ చేయడమే ఈ వివాదానికి కారణమైంది. The controversy regarding #AlluAravind ‘s statement regarding #Yash is ridiculously laughable because what he clearly meant when he talked about big films with unknown actors and saying he dint know of Yash before KGF , even a dumbo should understand that it was in context of the…— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2026 -
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్‌లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
సినిమా వాళ్ల జీవితం మనం ఊహించనంతగా ఈజీగా ఉండదు. గ్లామర్ ఫీల్డ్ రంగుల ప్రపంచమే అయినప్పటికీ.. వాళ్ల జీవితంలో అలాగే ఉంటుందనుకుంటే తొక్కపై కాలేసినట్లే. అందరి లైఫ్ లగ్జరీగా ఉంటుందనుకుంటే పెద్ద పొరపాటే. వెండితెరపై కనిపించినంత కలర్ఫుల్గా వ్యక్తిగత జీవితం ఉండదు. అలాంటి కథే ఈ మలయాళ స్టార్ హీరోయిన్ చర్మిలాది. సినిమాల్లో స్టార్‌గా ఎదిగిన ఈ భామ.. రియల్ లైఫ్‌లో మాత్రం దారుణ పరిస్థితులు ఎదుర్కొంది.తమిళనాడులో జన్మించిన చర్మిలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఎదిగింది. శివాజీ గణేషన్ నటించిన ‘నల్లతోరు కుటుంబం’ (1979) చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ చిత్రం ‘ఒయిలట్టం’ (1991)తో హీరోయిన్గా పరిచయమైంది. అయితే చర్మిలకు మోహన్‌లాల్ సరసన వరుస చిత్రాలలో నటించే అవకాశం లభించింది. ధనం(1991), అంకుల్ బన్ (1991) చిత్రాలు ఆమెను ఓ స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత కేలి మూవీతో స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అంతేకాకుండా 90 దశకంలో తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా కనిపించారు.రియల్ లైఫ్‌లో ఫెయిల్..సినిమాల్లో స్టార్‌గా ఎదిగిన చర్మిలా మాత్రం రియల్ లైఫ్‌లో సక్సెస్ కాలేకపోయింది. బాబు ఆంటోనీతో మొదలైన ఆమె ప్రేమ ప్రయాణం.. ఆ రిలేషన్ విచ్చిన్నం కావడంతోనే మొదలైంది. ఆ తర్వాత ఆమె జీవితం మరింత పతనమైంది. రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చివరికీ విడాకులు తీసుకుంది.మలయాళంలో 'కడల్' (1994) అనే చిత్రంలో ఆమె నటించారు. ఈ మూవీలో బాబు కూడా ఒక కీలక పాత్ర పోషించారు. అక్కడే వారిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వారు 'రాజధాని', 'కంబోలం' వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నప్పటికీ.. చివరికి విడిపోయారు. తన తండ్రికి బాబు అంటే అస్సలు ఇష్టం లేదని ఆమె ఒకసారి వెల్లడించారు. నా తండ్రి కఠిన వైఖరే తనను బాబుకు మరింత దగ్గర చేసిందని ఆమె పేర్కొంది.కిషోర్ సత్యతో సీక్రెట్ పెళ్లి..అయితే బాబు ఆంటోనీతో విడిపోయాక.. అప్పట్లో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నటుడు కిషోర్ సత్యకు ఆమె దగ్గరైంది. చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లే ఆమె సినీ కెరీర్ పతనానికి నాంది పలికింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని కిషోర్ నన్ను అడిగాడని చెప్పింది. ఆ తర్వాత కిషోర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అలా నాలుగేళ్లపాటు అతను అక్కడ.. నేను ఇక్కడ ఉన్నామని తెలిపింది. ఒక షో కోసం నేను దుబాయ్ వెళ్లి అతన్ని కలిశా.. ఈ మన బంధాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని కిషోర్ చెప్పిన విషయాన్ని చర్మిల గుర్తుచేసుకుంది. కేవలం నా పాపులారిటీ వల్లే నన్ను పెళ్లి చేసుకున్నాడని గ్రహించి..ఆ తర్వాత మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని వెల్లడించింది.రెండో పెళ్లి కూడా..ఒక పెళ్లి విఫలమైనప్పటికీ.. చర్మిల మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన రాజేశ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడింది. అతను చర్మిల సోదరి ఫ్రెండ్ కావడం విశేషం. అయితే మా ఇద్దరికీ ఓ కుమారుడు జన్మించాడు. అయితే నేను క్రిస్టియన్ కావడంతో తన కొడుకు కూడా అదే మతం అనుసరించాలని కోరుకున్నా..కానీ రాజేశ్ హిందూ మతంలోకి మారాలని కోరడంతో మా ఇద్దరికీ విభేదాలొచ్చాయని తెలిపింది. దీంతో మేము చట్టపరంగా విడాకులు తీసుకున్నామని తెలిపింది. అయినప్పటికీ అతనితో టచ్‌లో ఉన్నాం.. కోర్టు విచారణ సమయంలో నా కొడుకు నాతో ఉండాలనుకుంటున్నానని చెప్పాడని.. రాజేశ్ తరచుగా నా కొడుకును కలవడానికి వస్తుంటాడని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలలో లేనప్పటికీ.. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఆమె పలు టెలివిజన్ షోలలో కూడా కనిపించారు. -
ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!
-
టాక్సిక్ డిజాస్టర్.. ఇంగ్లీష్ వర్షన్లో భారీ కట్స్..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. వసూళ్లపరంగా ఘోరంగా విఫలమైంది. భారీ బడ్జెట్ చిత్రంపై పెట్టుకున్న అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.ఇండియాలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ.. హాలీవుడ్లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ వర్షన్ రన్‌టైమ్‌లో 2 గంటల 57 నిమిషాలు ఉండనుందని.. ఒరిజనల్ వర్షన్ కంటే 17 నిమిషాలు తక్కువ ఉంటుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ ఆంగ్ల వర్షన్ విదేశాల్లో ఆగస్టు 26న విడుదలైంది. ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్ ఇండియాలో సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీలోని ఏ సీన్స్ తొలగించారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. తబాహి, మధోశ్ లాంటి పాటలు తొలగించి ఉంటారని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ పాటలను తొలగించారనే వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. థియేటర్లో చూస్తేనే కానీ ఏయే సీన్స్ తొలగించారో ఓ క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. Toxic: A Fairy Tale for Grown-Ups, in English - one of the languages the film was written and shot in. A shorter cut from the Indian language version. In cinemas from September 4, 2026. 🖤🎭#ToxicTheMovie @TheNameIsYash #Nayanthara @advani_kiara #TaraSutaria @rukminitweets… pic.twitter.com/AkKlV7AwvB— KVN Productions (@KvnProductions) September 3, 2026 -
తుంటి గాయం.. పెళ్లి తర్వాత లోటును తీర్చేసింది: రష్మిక
టాలీవుడ్ రష్మిక ప్రస్తుతం మైసాతో పాటు రణబాలి చిత్రంలోనూ నటిస్తున్నారు. పెళ్లి తర్వాత విజయ్, రష్ జంటగా నటిస్తోన్న చిత్రం రణబాలి కావడం విశేషం. అయితే ఇటీవల రష్మికకు తుంటి గాయమైంది. ఆ తర్వాత షూటింగ్‌లకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో తనతో విజయ్ దేవరకొండ ఎక్కువ సమయం ఉన్నారని తెలిపింది. పెళ్లి తర్వాత కంటే గాయం అయ్యాకే మాకు ఎక్కువ సమయం దొరికిందని చెప్పుకొచ్చింది.షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ వల్ల తామిద్దరం ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేకపోయామని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ పెళ్లి తర్వాత మూడు నెలల పాటు ఒకరినొకరం చాలా అరుదుగా కలిసేవాళ్లమని తెలిపింది. మా ఇద్దరి సంభాషణ చాలా వరకు ఫోన్ కాల్స్‌కే పరిమితమైందని రష్మిక వెల్లడించింది. అయితే తనను ఇంట్లోనే ఉండేలా చేసిన గాయం.. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని పేర్కొంది. పెళ్లి తర్వాత మేమిద్దరం కలిసి గడిపిన సుదీర్ఘ సమయం కూడా ఇదేనని రష్మిక తెలిపింది.గాయం కాకుండా ఉంటే.. ఇలాంటి విరామ సమయంలో విజయ్ మరింత సంతోషంగా ఉండేవాడని వెల్లడించింది. ఈ విరామం నిద్రపోవడానికి, చదువుకోవడానికి, పజిల్స్ పరిష్కరించుకోవడానికి.. తన కుటుంబంతో సమయం గడపడానికి కూడా అవకాశం ఇచ్చిందని తెలిపింది. బిజీ షెడ్యూల్లోకి వెళ్లాక.. ఇలాంటి ప్రశాంతమైన క్షణాలను తాను మిస్ అవుతానని చెప్పింది. గాయపడినప్పటికీ, తాను నిస్సహాయంగా భావించలేదని రష్మిక చెప్పింది. ఇతరులపై ఆధారపడటం తనకు ఇష్టం లేదని.. తన పనులు తాను చూసుకోగలగడానికే ప్రాధాన్యత ఇస్తానని వివరించింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తన కుటుంబంతో కలిసి మధురమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. -
యువతిపై అత్యాచారానికి యత్నించిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్!
టీ.నగర్ లాడ్జీలో యువతిపై అత్యాచారానికి యత్నించిన సినిమా డిస్ట్రిబ్యూటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. చెన్నై చేట్‌పట్ ప్రాంతానికి చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్ అలెగ్జాండర్ (38). ఇతను టీ.నగర్ తిరుమలై పిళ్ళై రోడ్డులోని ఒక ప్రముఖ ప్రైవేట్ హోటల్లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఘటన జరిగిన రోజు అలెగ్జాండర్ స్నేహితుడు జై లాడ్జికి వచ్చాడు. అతనితో పాటు ఒక యువతిని కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ యువతిని లాడ్జిలో మాట్లాడుకుంటూ ఉండమని చెప్పి, స్నేహితుడు జై అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో అలెగ్జాండర్ అకస్మాత్తుగా ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారానికి యత్నించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ యువతి తన స్నేహితురాలికి ఫోన్ చేసి, ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పి సహాయం కోసం రమ్మని పిలిచింది. దీంతో కంగారుపడిన ఆమె స్నేహితురాలు వెంటనే లాడ్జీకి వచ్చి, అలెగ్జాండర్‌ను దీని గురించి నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన అలెగ్జాండర్ ఆ ఇద్దరు యువతులపై దాడికి యత్నించాడు. దీంతో బాధిత యువతులు విషయాన్ని సామాజిక సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. సామాజిక సంక్షేమ శాఖ అధికారులు పాండి బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి అలెగ్జాండర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా యువతిని లాడ్జికి తీసుకొచ్చిన జై కోసం గాలింపు చేపట్టారు. -
‘ఐ యామ్ గేమ్’ విడుదల తెలుగులో ఆలస్యం
నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ సినిమాకు దుల్కర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు వెర్షన్ నేడు( సెప్టెంబర్ 3) విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆగిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురై పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ మండిపడుతున్నారు. దీనిపై టీమ్ స్పందించి నోట్ విడుదల చేసింది. ఇదీ చదవండి: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి: అల్లరి నరేష్‘పలు సాంకేతిక కారణాల వల్ల ‘ఐ యామ్ గేమ్’ సినిమా తెలుగులో విడుదల ఆలస్యం కానుంది. ఇప్పటికే మలయాళ వెర్షన్లో సినిమా విడుదలైంది. ఆలస్యం అయినా తెలుగులోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చిత్రబృందం నోట్ విడుదల చేసింది. కామెడీ, రొమాన్స్, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్, గేమింగ్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే పలు అంశాలు ఇందులో ఉన్నాయని టీమ్ తెలిపింది. -
ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?
-
ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ!
కృతి సనన్ రాఖీ యాడ్ దుమారం చల్లారక ముందే.. మరో నటి స్వరా భాస్కర్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాలోని ‘జౌహర్’ సన్నివేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల త్యాగాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించింది.ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’ కార్యక్రమంలో స్వరా భాస్కర్ ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశాన్ని ప్రస్తావించారు. సినిమాలో మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతి చేసుకున్నట్లు చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ లైంగిక హింసకు గురైన మహిళ ఈ సన్నివేశాన్ని చూస్తే.. తన జీవితాన్ని కొనసాగించాలనుకోవడం తప్పా అనే భావన కలగొచ్చని స్వరా ప్రశ్నించారు. ‘గౌరవం కోసం చనిపోకపోతే పిరికిదానిననే భావన కలుగుతుందా?’ అన్న కోణంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లైంగిక హింసకు గురైన మహిళలకు కూడా బతికే హక్కు ఉందన్న సందేశమే సమాజానికి వెళ్లాలని ఆమె పేర్కొన్నారు.జౌహర్ (Jauhar) అంటే.. యుద్ధంలో శత్రు సైన్యం చేతిలో చిక్కి అవమానం, లైంగిక హింసకు గురికాకుండా ఉండేందుకు మహిళలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకునే ఆచారం.‘ఆమె పిరికిదని అనలేదు’స్వరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని కానీ, జౌహర్ చేసిన మహిళలను కానీ పిరికివాళ్లుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అనువదించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నించింది జౌహర్ చేసిన మహిళల ధైర్యాన్ని కాదని.. ఆ సన్నివేశం ఆధునిక సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్నదేనని వివరించారు.‘ఇతర మహిళలను గౌరవించాలి’ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి మహిళ ఇతర మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వరా పేరులోని ‘స్వర్’ (గొంతు/స్వరం)ను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మహిళల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.పోలీసులకు ఫిర్యాదుఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. బిహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణకుమార్ సింగ్ స్వరా భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హిందూ సమాజం, రాజ్‌పుత్ మహిళలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి.కర్ణిసేన కూడా..పద్మావత్ విడుదల సమయంలోనే ఆ సినిమాలోని అంశాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణిసేన.. తాజా వివాదంలోనూ స్వరా భాస్కర్‌ను తప్పుబట్టింది. జౌహర్‌ను, రాజ్‌పుత్ మహిళల త్యాగాన్ని విమర్శించే ముందు చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. కర్ణిసేన మహిళా విభాగం నేత కీర్తి రాథోర్.. స్వరా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్ మహిళల త్యాగం, ధైర్యాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.మళ్లీ తెరపైకి ‘పద్మావత్’ వివాదం2018లో విడుదలైన ‘పద్మావత్’లో రాణి పద్మావతి పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఆ సమయంలో కర్ణిసేన అభ్యంతరాలతో సినిమా టైటిల్ పద్మావతి కాస్త పద్మావత్‌గా మారింది. ఇక చిత్ర క్లైమాక్స్‌లో శత్రు సేనల చేతికి చిక్కకుండా రాజ్‌పుత్ మహిళలు సామూహికంగా జౌహర్ చేసినట్లు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. స్వరా భాస్కర్ కూడా సినిమా విడుదల సమయంలో దర్శకుడు భన్సాలీకి బహిరంగ లేఖ రాసి జౌహర్ చిత్రీకరణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం తాజాగా మళ్లీ రాజుకుంది.చరిత్రా? సమాజానికి సందేశమా?‘పద్మావత్’లో జౌహర్ చిత్రీకరణ చుట్టూ సాగుతున్న తాజా వివాదం.. చరిత్రను సినిమాల్లో ఎలా చూపించాలి? చారిత్రక ఘటనలను ఆధునిక సామాజిక విలువలతో ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో ‘పద్మావత్’ రచయిత ప్రకాశ్ కపాడియా కూడా జౌహర్ సన్నివేశాన్ని సమర్థించారు. అది ఆ కాలంలోని వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమని, నేటి ప్రమాణాలతో మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరా భాస్కర్ మాత్రం తన ఉద్దేశం ఏ మహిళనూ అవమానించడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ, కర్ణిసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ‘పద్మావత్’ జౌహర్ వివాదం మరోసారి బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.వివాదాలు స్వరా భాస్కర్‌కు కొత్తేమీ కాదు. నటిగా ‘తను వెడ్స్ మను’, ‘రాంఝనా’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘నిల్ బట్టే సన్నాటా’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత తన వ్యాఖ్యలు, రాజకీయ వైఖరితోనూ తరచూ వార్తల్లో నిలిచారు. సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం నుంచి ‘వీరే ది వెడ్డింగ్’లోని ఓ సన్నివేశంపై వచ్చిన విమర్శల వరకు.. ఆమెపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. 2024లో యాహ్యా సిన్వార్పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇప్పుడు ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశంపై వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగింది.ఇదీ చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి ఎట్టకేలకు తెర -
ఇక సీరియస్... కామెడీని బ్యాలెన్స్ చేస్తా: ‘అల్లరి’ నరేశ్
‘‘ప్రేక్షకులు నా నుంచి ‘కితకితలు, బెండు అప్పారావు’ వంటి వినోదాత్మక సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు చంద్రమోహన్ ‘రంభ ఊర్వశి మేనక’ కథ చెప్పారు. ఈ కథ నాతో పాటు నాగార్జున, సుప్రియ, రాజేష్, నిమ్మకాయల ప్రసాద్‌గార్లకు కూడా నచ్చింది. ఇలా చాలా రోజుల తర్వాత ‘రంభ ఊర్వశి మేనక’ వంటి వినోదాత్మక చిత్రం చేశాను’’ అని ‘అల్లరి’ నరేశ్ తెలిపారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘అల్లరి’ నరేశ్ విలేకరులతో పంచుకున్న విశేషాలు...⇒ ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ఇందులో హీరోకి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. ‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. పైగా కష్టపడకుండా హీరో అయి పోవాలనే పాత్ర. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒకప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారనే నమ్మకం ఉంటుంది. హీరో ఆప్యాట్రన్ ఎలా గీశాడు? రంభ, ఊర్వశి, మేనక భువికి వచ్చిన తర్వాత ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది. ⇒ నా బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే కామెడీని చంద్రశేఖర్ బాగా డిజైన్ చేశారు. పైగా ప్రేక్షకులు స్వర్గం, నరకం, ఇంద్రలోకం లాంటి కథలు చూసి చాలా కాలమైంది. పెద్దలే కాదు... చిన్నపిల్లలూ చాలా ఎగ్జయిట్ అవుతారు. క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘రంభ ఊర్వశి మేనక’ మా నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) శైలిలో చేసిన సినిమా. అంత పెద్ద స్టార్ కాస్ట్ ఇందులో ఉంది. ⇒ ఇకపై రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలని భావిస్తున్నాను. నటుడిగా ఇంకా విజయవంతమైన చిత్రాలు చేసిన తర్వాతే దర్శకత్వం గురించి ఆలోచిస్తాను. నేను నటించిన ‘ఆల్కహాల్’ మూవీ రిలీజ్ రెడీగా ఉంది. ‘కనకదుర్గ’ సినిమా షూటింగ్ జరుగుతోంది. -
తండ్రీ కొడుకుల భావోద్వేగం
శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. సుమన్, సమ్మెట గాంధీ, నాగమహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ అతిథులుగా హాజరై, ‘మా రాముడు అందరివాడు’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో ముఖ్యమంత్రిగా మంచి సందేశం ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు’’ అని తెలిపారు. లక్ష్మణరావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు విలన్ పాత్ర చేశాను. మాకు స పోర్ట్ చేయాలని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని కోరాం. కానీ, పట్టించుకోలేదు. తర్వాత మా ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు’’ అని పేర్కొన్నారు. ‘‘తండ్రీ కొడుకుల భావోద్వేగంతో రూపొందిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు మైకిల్. ‘‘తెలుగువాళ్లం మనల్ని మనం ప్రోత్సహించుకుంటేనే నిరూపించుకుంటాం’’ అని శ్రీరామ్ చెప్పారు. -
ఈఎమ్ఐ ఆరంభం
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 పీఎం ప్రోడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ‘ఈ.ఎమ్.ఐ.’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకుడు. సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని నిర్మాతలు. ‘లాల్ సలామ్, హాస్టల్ డేస్’ వంటి వెబ్ సిరీస్‌లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు.‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో ఓ కీలక పాత్రతో ఫేమస్ అయిన శైలజ ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. బుధవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇచ్చారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రదర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందజేశారు.‘‘బైక్, కారు, ఫోన్... ఇలా ఏ వస్తువు కొన్నా ఈ.ఎమ్.ఐ. కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఈ కష్టాలు తప్పవు. ఈ.ఎమ్.ఐ. చెల్లించేందుకు యువత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అనే కాన్సెప్ట్‌తో, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో కంప్లీట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం సాగుతుంది. రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్లో మా బ్యానర్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాం’’ అని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని తెలిపారు. -
రామ్‌చరణ్ ఉంటే అద్భుతమే..‘ఇరుముడి 2’పై శివ నిర్వాణ క్లారిటీ
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్ అయ్యప్ప మాల వేయడం, సినిమా నేపథ్యం కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినదే కావడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.తాజాగా ‘ఇరుముడి’ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్లో చరణ్ నటిస్తారా? అనే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘చరణ్ మా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ ‘ఇరుముడి’ తీసేటప్పుడు ఆయనను క్యామియోగా తీసుకోవాలనే ఆలోచనే మాకు రాలేదు. ఈ ప్రచారం సోషల్ మీడియాలోనే మొదట చూశాను. ఆ తర్వాత మీడియా మిత్రులు కూడా అడగడంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది’’ అని చెప్పారు.అయితే కథకు సహజంగా అలాంటి పాత్ర అవసరమైతే చరణ్‌తో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని శివ నిర్వాణ తెలిపారు. ముందుగా స్టార్‌ను అనుకుని పాత్రను సృష్టించడం తన విధానం కాదని స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ సహజంగా పుట్టింది. మాలలో ఉన్న ఓ వ్యక్తికి తాగుడు అలవాటు ఉండటం, ఆ వ్యక్తి తన కూతురు కోసం అయ్యప్ప మాల వేయడం, ఆ 41 రోజుల దీక్షలో అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా ఈ కథను చాలా సహజంగా అభివృద్ధి చేశాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే ‘ఇరుముడి 2’ కథ రాయలేను. మరో సహజమైన కథా పాయింట్ దొరికితేనే ఇరుముడి సీక్వెల్‌పై ఆలోచిస్తానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.'ఇరుముడి' సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. మూడో వారాంతంలోకి వచ్చినా 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ తన హవా చూపించేలానే కనిపిస్తున్నాడు. -
సినీ సెప్టెంబర్
ఆగస్టులో విడుదలైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్ తో సినిమా ఇండస్ట్రీకి మరింత ఊపిరి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్‌కు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఇది తెలుగు బాక్సాఫీస్‌కు మరింత ఊపునిచ్చింది. తాజాగా సెప్టెంబరులో కూడా ప్రతి వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఆశ్చర్యకరంగా స్ట్రయిట్ చిత్రాలతో పాటు సెప్టెంబరులో ప్రతివారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ డబ్బింగ్ సినిమా కూడా ఉంది. లవ్, యాక్షన్, డివోషన్, ఎమోషన్, యూత్‌ఫుల్... ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సెప్టెంబరులో సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి... ఏ వారం ఏయే సినిమా రిలీజ్ కానుందో, ఏ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఓ లుక్ వేయండి.రంభ... ఊర్వశి... మేనక భూలోకానికి వస్తే! సినిమా హీరో అవ్వాలన్నది సూరి ఆశయం. కానీ సూరి ఏ మాత్రం కష్టపడకుండా సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. షార్ట్‌కట్ లో తాను హీరో కావాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఓ మాయా పుస్తకం సాయంతో ఏకంగా రంభ... ఊర్వశి... మేనకలను భూలోకానికి తీసుకువస్తాడట సూరి. మరి... ఆ తర్వాత ఏం జరిగింది? సూరి ఆశయం నెరవేరి అతను సినిమా హీరో అయ్యాడా? ‘రంభ... ఊర్వశి... మేనక డ్రామా కంపెనీ’ సూరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది... అనేది ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో చూడొచ్చు. అల్లరి నరేశ్, సురభి హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 4న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ప్రేమ... హాస్యం... ఉత్కంఠ ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాల్లో మంచి ఇంటెన్స్ అండ్ బోల్డ్ సీన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను ఆడియన్స్ చూశారు. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది సందీప్ రెడ్డి వంగా అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘రోమాంచకం’ సినిమా మాత్రం ఎక్కువగా ఫన్ ఎలిమెంట్స్‌తో రూపొందడం విశేషం. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ యూత్‌ఫుల్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరించగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ‘‘కాలేజీ స్టడీస్ పూర్తయిన తర్వాత కొంతమంది యువత లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంటుంది. సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేని విభిన్నమైన పరిస్థితుల్లో ఉంటారు. ఈ కాంప్లిసిటీ నేపథ్యంలో ‘రోమాంచకం’ సినిమా కథనం సాగుతుంది’’ అని ఇటీవల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ గురువారం ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే... నేడే ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నట్లు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. లైఫ్ ఆఫ్ సంజు ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘సహా’ (లైఫ్ ఆఫ్ సంజు). శివకుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిశాంత్ కోదాటి దర్శకత్వంలో సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వేల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న రిలీజ్ కానుంది. ‘‘సంజు జీవితంలోని వివిధ దశలను ఈ సినిమా ప్రజెంట్ చేస్తుంది. ప్రేమ, విడిపోవడం, మధురమైన జ్ఞాపకాలు, కష్టాలను అధిగమించేందుకు అవసరమైన మనోధైర్యం వంటి అంశాలను కథలో చూపిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ ఎంటర్టైనర్ సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజక వర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 4న రిలీజ్ కానుంది. పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారట మేకర్స్. అవినీతి, డ్రగ్ మాఫియాలపై ఓ సామాన్యుడు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నటి కస్తూరి ఈ సినిమాలో ఓ విలన్ రోల్ చేశారని టాక్. వారాహి అమ్మవారి శాపం ఎందుకు? సుమంత్ హీరోగా నటించిన ఆధ్యాతి్మక మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. దాదాపు 150 ఏళ్లుగా మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందినవారు వరుసగా మరణిస్తుంటారు. ఈ మరణాలన్నీ వారాహి మాత శాపం కారణంగానే జరుగుతున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ శాపాన్ని ఛేదించి, వరుస మరణాల వెనక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేస్తోంది.మధ్యతరగతి జీవితాలు ‘బేబీ’ వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మధ్య తరగతి యువతీయువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ పడే కష్టాలు, వారి కుటుంబాల ఇబ్బందులు ... వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అలాగే లవ్, ఎమోషన్ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. విలేజ్ యాక్షన్ డ్రామా నటుడు–నిర్మాత రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. ఈ విలేజ్ యాక్షన్ డ్రామా సినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించగా, దీపా బాలు హీరోయిన్గా నటించారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపాలక్ష్మి ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఓ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. దీంతో ఆ ఊరి గ్రామదేవతకు ఓ ఆంబోతును సమరి్పస్తారు గ్రామస్థులు. కానీ సడన్‌గా, అది అదృశ్యం అవుతుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నదే ఈ సినిమా కథనం అని సమాచారం. ప్రేమకథ వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లు గా నటించిన లవ్‌స్టోరీ సినిమా ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం లో కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్‌రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఈ సెపె్టంబరు 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ‘‘మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. మా సినిమా చూస్తే మీ ప్రేమకథ గుర్తుకు వస్తుంది’’ అని ఈ సినిమా గురించి దర్శకుడు ఎంజీఆర్ తుకారాం చెప్పారు. స్పై డ్రామా నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని కీలక పాత్రలు పోషించారు. దేశభక్తి, యాక్షన్, థ్రిల్, స్పై యాక్షన్ డ్రామా, హ్యూమర్ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాని సెప్టెంబరు 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. జడల్ జమానా నాని హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘దిప్యారడైజ్’. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని కపిస్తారు. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని ‘ఏష నాగుల గట్టుపైన..’ అనే స్పెషల్ సాంగ్‌లో కీర్తీ సురేష్ డ్యాన్స్ చేశారు. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది. ‘దిప్యారడైజ్’ సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్ కు కూడా పెద్ద పీట వేశారట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఐడెంటిటీ, ఆధిపత్య పోరు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబరు 24న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.వీటితో పాటు మరికొన్ని సినిమాలు సెప్టెంబరు నెలలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.⇒ ఈ సెప్టెంబరు నెలలో వారానికొక డబ్బింగ్ సినిమా కూడా తెలుగు తెరకు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్ వంటి అంశాలతో రూపొందిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సెప్టెంబరు 3న విడుదలæ కానుంది. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు –దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జిమ్ వర్గీస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ⇒ మలయాళ నటుడు నివిన్ పౌలి హీరోగా, మమితాౖ బెజు హీరోయిన్గా నటించిన లవబుల్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ‘బెత్లెహోమ్ కుటుంబయూనిట్’. సూపర్‌హిట్ ‘ప్రేమలు’ ఫేమ్ దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ సినిమాను ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. మలయాళంలో ఆగస్టు 21న విడుదలైన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో సెప్టెంబరు 4న రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. వయసు వ్యత్యాసంతో కూడిన లవ్‌స్టోరీగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ⇒ సూపర్‌హిట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఆధారంగా ‘మిర్జాపూర్:ది మూవీ’ అనే హిందీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, జితేంద్ర కుమార్, రవి, అభిషేక్. బి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. ⇒ తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఆల్మోస్ట్ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా కార్తీ హీరోగా నటించిన తమిళ సినిమా ‘సర్దార్ 2’. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్లు ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో నటించారు. ఇందులో తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు కార్తీ. దేశభక్తి, తండ్రీ కొడుకుల భావోద్వేగం ప్రధానంగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా కలిసి ‘సర్దార్ 2’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 10న విడుదలæకానుంది. ⇒ తెలుగు హీరో సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా ‘మండాడి’. ఈ చిత్రంలో సూరి, సుహాస్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. సుహాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. మహిమా నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. సముద్రంపై సాగే పడవల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది. ⇒ కీర్తీ సురేష్ ప్రధాన పాత్రధారిగా సనంత్, రిషికాంత్ ఇతర కీలక పాత్రధారులుగా నటించిన పీరియాడికల్ విలేజ్ డ్రామా ‘డొరోతి’. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీ™Œ æమోంగా, అచిన్ జైన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదల కానుంది. స్నేహం, ఆశ, ఆశయం, పక్షపాత ధోరణి వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని కోలీవుడ్ టాక్.ఈ సినిమాలే కాకుండా... జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘ఇమ్మోర్టల్’, ‘డీమాంటీ కాలనీ 3’ వంటివి సెప్టెంబరు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కోవలో మరికొన్ని పరభాషా సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
క్రైమ్... యాక్షన్
పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిర్జాపూర్: ది మూవీ’. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, శ్వేతా త్రిపాఠి, శ్రియ, రవి కిషన్, జితేంద్ర కుమార్, రసిక దుగ్గల్, హర్షిత గౌర్ ఇతర పాత్రలు పోషించారు. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 4న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ– ‘‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ‘మిర్జాపూర్: ది మూవీ’ పేరుతో సినిమాగా తీసుకొచ్చాం. ఈ సినిమా తప్పకుండా మీ అందర్నీ అలరిస్తుంది’’ అని తెలిపారు. ‘‘మిర్జాపూర్ సిరీస్‌ని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో అభిమానించారు. ఈ సినిమాని కూడా థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు’’ అన్నారు దివ్యేందు శర్మ. ‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాను థియేటర్లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే మా చిత్రాన్ని కూడా తెలుగులోకి తీసుకురావాలనుకున్నాం’’ అని చెప్పారు గుర్మీత్ సింగ్. ‘‘తెలుగులో నేను చేసిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ‘మిర్జాపూర్: ది మూవీ’లో బబ్బన్ యాదవ్ అనే క్యారెక్టర్ చేశాను’’ అన్నారు రవి కిషన్. -
డోంట్ ట్రబుల్ వాయిదా
ఫహాద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలు పోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాయిదా వేసి, అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘వైవిధ్యమైన పాత్రల్లో నటించి, విలక్షణ నటుడిగా పేరు పొందిన ఫహాద్ ఫాజిల్ నటించిన ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. టీజర్ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ‘కేకు వాకు...’ అనే వీడియో సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్ పేర్కొంది. -
టాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
వర్ధన్, కృష్ణప్రియ జంటగా వస్తోన్న మూవీ కాగితం పడవలు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా హీరో వర్ధన్ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. కాగితం పడవలు.. ఒక కాలువలో ప్రయాణం చేయాలని అనుకున్నాం. తెలియకుండానే ఒక సముద్రంలోకి వచ్చేశాం. ఎన్నోసార్లు ఒడ్డుకు వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం. డైరెక్టర్ తుకారాం చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ 18న థియేటర్స్‌లో కలుద్దాం' అని అన్నారు.దర్శకుడు తుకారాం మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. మా సినిమాకి మా నిర్మాతలే హీరోలు. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీ ప్రేమకథ మీకు గుర్తుకొస్తుంది. మీరందరూ ఈ సినిమాను థియేటర్లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు.హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ..' తెలుగులో కాగితం పడవలు నా రెండో సినిమా. మా నిర్మాతలందరికీ థాంక్యూ. మా డైరెక్టర్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించాను. మా హీరోకి థాంక్యూ. సెప్టెంబర్ 18న సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు. కాగా.. సెప్టెంబర్ 18న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్‌బస్టర్.. ఇదేం విచిత్రం..!
ఇటీవల బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇటీవల రిలీజైన టాక్సిక్ ఒక్క రోజుకే బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. భారీ బడ్జెట్, తారాగణం ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా మెప్పించలేకపోయింది. అలాంటి ఈ టైమ్‌లో ఇరుముడి సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా మలయాళ చిన్న సినిమా బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం అదరగొడుతోంది.ఇదిలా ఉంటే ఎప్పుడో 19 ఏళ్ల క్రితం వచ్చిన మూవీకి సీక్వెల్‌గా ఆవారాపన్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 2007లో ఇమ్రాన్ హష్మి, శ్రియా శరణ్ జంటగా ఆవారాపన్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా కనిపించారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కించారు.అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమా సీక్వెల్‌కు ఇప్పుడు వసూళ్లు రావడంపై బాలీవుడ్లో చర్చ మొదలైంది. ఆగస్టు 14న విడుదలై ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు సాధించింది. ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలవడంపై ఇమ్రాన్ హష్మి ఎమోషనల్ అయ్యారు. -
మమితా బైజు హ్యాట్రిక్.. తొలి హీరోయిన్గా రికార్డ్..!
మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలు రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్గా మమితా బైజు రికార్డ్ సృష్టించింది.జూలై 23న ఆమె నటించిన జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సూర్య సరసన హీరోయిన్గా కనిపించింది. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల రిలీజైన మలయాళ మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హ్యాట్రిక్ కొట్టిన మమితా బైజు అరుదైన ఫీట్ సాధించింది. ఈ విషయంలో తొలి హీరోయిన్గా ఘనతను సొంతం చేసుకుంది. -
యశ్ టాక్సిక్.. గౌతమ్ ఘోరమైన రేటింగ్..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. రిలీజైన రెండు రోజులకే బిగ్ స్క్రీన్‌పై నుంచి కనుమరుగైంది.ఇదంతా పక్కనపెడితే ఈ చిత్రానికి మహేశ్ బాబు తనయుడు గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. లెటర్ బాక్స్ డీ అనే ఖాతాలో పలు సినిమాలకు గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. ఇందులో మహేశ్ బాబు నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే టాక్సిక్ మూవీకి ఏకంగా 0.5 రేటింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.అంతేకాకుండా తన తండ్రి మహేశ్ బాబు సినిమాలకు తక్కువ రేటింగ్స్ కనిపించడం ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం కలిగించింది. ఇది కాస్తా నెట్టింట మరింత చర్చకు దారితీసింది. కొందరు అభిమానులు అతని రేటింగ్స్ నిజాయితీగా ఉన్నాయని చెప్పగా.. మరికొందరు వాటిని మరింత కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ లెటర్ బాక్స్ డీ ప్రొఫైల్‌లో దాదాపు 400కు పైగా సినిమాలకు రేటింగ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మహేష్ బాబు 'పోకిరి', '1: నేనొక్కడినే' సినిమాలైన గౌతమ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో 'నిజం', 'వంశీ' చిత్రాలకు 2 స్టార్ ఇవ్వగా.. 'బ్రహ్మోత్సవం' చిత్రానికి కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాడు. టాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాదు.. 'షోలే', 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ', 'నైవ్స్ అవుట్', 'జెర్సీ' చిత్రాలకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. 'ది ఒడిస్సీ', 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' లాంటి సినిమాలకు 4.5 స్టార్ ఇచ్చాడు.అంతేకాకుండా బాహుబలి- 2 సినిమాకు 5 స్టార్.. పెళ్లి చూపులు, సీతా రామం చిత్రాలకు 4.5 స్టార్ ఇచ్చేశాడు. ఈగ మూవీకి 4 స్టార్ ఇవ్వగా.. ధురందర్-1కి 4 స్టార్, ధురందర్- 2కి 3 స్టార్ ఇచ్చాడు. రవి తేజ నటించిన ఇటీవలి తెలుగు హిట్ చిత్రం ఇరుముడికి 3 స్టార్ ఇవ్వగా.. లోకేష్ కనగరాజ్ 'డీసీ'కి 4 స్టార్ రేటింగ్ రాసుకొచ్చాడు. 'టాక్సిక్' లాగే 'లైగర్'కు కూడా 0.5 స్టార్ ఇస్తూ.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీకి 2.5 స్టార్ రేటింగ్స్ ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
'నన్ను ఘోరంగా అవమానించారు'.. కోలీవుడ్ హీరో ఆవేదన
కోలీవుడ్ హీరోలు ఇప్పటికే చాలామంది తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో సూర్య ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత విజయ్, ధనుశ్, కార్తీ, విశాల్, అజిత్ లాంటి స్టార్స్‌కు సైతం టాలీవుడ్లో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం మరో కోలీవుడ్ హీరో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నాడు. అతను మరెవరో కాదు.. మండాడి మూవీతో అలరించేందుకు వస్తోన్న సూరి. ఈ మూవీ వచ్చే శుక్రవారం తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.ప్రస్తుతం మండాడి మూవీ ప్రమోషన్లతో బిడీగా ఉన్న సూరి.. ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనను ఘోరంగా అవమానించిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారని సూరి వెల్లడించారు.సూరి మాట్లాడుతూ..'నన్ను ఒక పెద్ద హీరో మూవీ షూటింగ్ కోసం పిలిచారు. అందులో ఒక టాప్ కమెడియన్‌తో కలిసి నటించే సీన్. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ పెద్ద హీరో.. దర్శకుడు కలిసి మానిటర్లో సీన్ చూసుకున్నారు. ఆ తర్వాత వారు నా చొక్కా విప్పేసి.. రికమండేషన్‌తో వచ్చిన వేరే వ్యక్తికి ఇవ్వమని చెప్పారు. అది నా సొంత చొక్కా అయినా కూడా లాక్కొని కాస్ట్యూమ్ వెహికల్‌పైకి విసిరేశారు. ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కప్పుకుని, తీవ్ర అవమాన భారంతో నా చొక్కా కోసం అక్కడ వెతుక్కున్నా. నా సినీ ప్రయాణంలో నన్ను అత్యంత మానసిక వేదనకు గురిచేసిన సంఘటన ఇదే. ఇది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన' అని పంచుకున్నారు.కాగా.. వెన్నెలా కబడ్డికుళు సినిమాతో వెండితెరకు పరిచయమైన సూరి.. తర్వాత పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో దర్శకుడు వెట్రిమారన్ తీసిన 'విడుదలై'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో ఇది సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'విడుదలై 2, మామన్, గరుడన్ తదితర మూవీస్‌లో సూరి హీరోగా చేసి సక్సెస్ అందుకున్నాడు. -
సినిమా చరిత్రలోనే ఓ డైలాగ్ సీన్‌కు అరుదైన గౌరవం
యాక్షన్ సినిమాలకు 1990ల దశకం ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే,’ ‘ది ఫ్యుజిటివ్,’ ‘స్పీడ్,’‘హీట్,’‘ది రాక్,’ ఎయిర్ ఫోర్స్ వన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి. అలాంటి సన్నివేశాల్లో ఒకటైన హీట్ (1995)లోని రెస్టారెంట్ సీన్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. సినిమా చరిత్రలోనే ‘గొప్ప డైలాగ్ ఎక్స్ఛేంజ్’గా ఈ సన్నివేశం ఓ మైలురాయిగా నిలిచింది.తొలిసారి ఎదురెదురుగా..మైఖేల్ మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీట్’లో అల్ పచినో, రాబర్ట్ డి నీరో ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్ అధికారి విన్సెంట్ హన్నా (అల్ పచినో), ప్రొఫెషనల్ నేరస్థుడు నీల్ మెక్కాలీ (రాబర్ట్ డి నీరో) మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఓ భారీ దోపిడీకి రెడీ అవుతున్న టైంలో మెక్కాలీని కాఫీ కోసం ఓ రెస్టారెంట్‌కు హన్నా ఆహ్వానిస్తాడు. అప్పటివరకు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవని వీరిద్దరూ తొలిసారి ఎదురెదురుగా కూర్చొని తమ జీవితాలు, ఎదుర్కొన్న కష్టాలు, నేరం, పోలీసు వృత్తి గురించి మాట్లాడుకుంటారు.ఇదీ చదవండి: ప్రభాస్‘స్పిరిట్’షూటింగ్.. హైదరాబాద్‌లోనే ఎందుకంటే?ఓ డైలాగ్ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది..ఈ సన్నివేశంలో మెక్కాలీ చెప్పే ఓ డైలాగ్ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ‘పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఎలాంటి అనుబంధానికీ తాను లోనుకాను’ అని అతను చెప్తాడు. చివర్లో హన్నా తనను అడ్డుకుంటే మెక్కాలీని పట్టుకోవడానికి వెనుకాడనని అంటాడు. అదే సమయంలో తన దారికి అడ్డొస్తే హన్నాను చంపడానికి కూడా తాను వెనుకాడనని మెక్కాలీ అంటాడు. ఒకరినొకరు గౌరవిస్తూనే ప్రత్యర్థులుగా నిలిచే ఈ సంభాషణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.ఇద్దరి నటుల మధ్య పోరు ‘ఫార్ అవుట్ మ్యాగజైన్’కు చెందిన టామ్ టేలర్ రూపొందించిన ‘ది 10 గ్రేటెస్ట్ డైలాగ్ ఎక్స్ఛేంజెస్ ఇన్ మూవీ హిస్టరీ’ జాబితాలో ఈ రెస్టారెంట్ సీన్‌కు మొదటి స్థానం దక్కింది. ఇద్దరు స్టార్ నటులు తమ నటనా ప్రతిభతో ఈ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని టేలర్ పేర్కొన్నారు.ఎక్కువమంది చదివింది: అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ పెట్టా..: విష్టుప్రియమరో ఆసక్తికరమైన విషయం..ఇక ఈ సన్నివేశానికి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అల్ పచినో, రాబర్ట్ డి నీరో ఈ సీన్‌ను షూట్ చేయడానికి ముందు రిహార్సల్ చేయలేదట. హన్నా, మెక్కాలీ పాత్రలు అప్పటివరకు ముఖాముఖిగా కలవలేదు కాబట్టి ప్రాక్టిస్ చేయకుండానే నేరుగా సీన్ షూట్ చేస్తే సహజంగా ఉంటుందని డి నీరో భావించారట. దర్శకుడు మైఖేల్ మాన్ అందుకు ఓకే చెప్పడంతో ఆ సన్నివేశం అలా చిత్రీకరించారట.చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ -
రవితేజ ఇరుముడి.. డైరెక్టర్ రాసిన సాంగ్ రిలీజ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది.ఇప్పటికే ఈ మూవీ నుంచి అయ్యప్ప సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా మరో పాట విడుదల చేశారు మేకర్స్. కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కంపోజ్ చేయడంతో పాటు ఆలపించారు. -
తమ్ముడితో మూవీ.. అన్నతో పెళ్లి.. హాట్‌టాపిక్‌గా బలగం బ్యూటీ..!
బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో ఏడడుగులు వేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా ప్రకటించింది. కాల భైరవతో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది.అయితే కావ్య కల్యాణ్ రామ్ బలగం మూవీతో ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. ఉస్తాద్ మూవీలో కాల భైరవ తమ్ముడు సింహా సరసన హీరోయిన్గా మెప్పించింది. ఇప్పుడేమో హీరో అన్న కాల భైరవతో పెళ్లికి రెడీ అయిపోయింది. ఇది కాస్తా టాలీవుడ్లో ఆసక్తికర విషయంగా మారింది.తమ్ముడితో సినిమా చేసిన బ్యూటీ.. రియల్ లైఫ్‌లో అన్నతో జోడీ కట్టడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కొందరు హీరోయిన్లు కూడా ఇలానే చేశారని చర్చించుకుంటున్నారు. శ్రీదేవి–బోనీ కపూర్, శ్రియా రెడ్డి–విక్రమ్ రెడ్డి, సోనియా అగర్వాల్–సెల్వరాఘవన్ జంటలు కూడా ఇలానే చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. -
నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రామానాయడు స్డూడియోస్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. మద్యం మానేయడం, ప్రేమలో పడటం, బ్రేకప్ ఎదుర్కోవడం, చివరకు పెళ్లి చేసుకోవడం.. ఇలా తన జీవితంలో చోటుచేసుకున్న కీలక మలుపులను గుర్తుచేసుకున్నారు. ‘రొమాంచకం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రేమ, బ్రేకప్, మద్యం మానేయడం, పెళ్లి వంటి అంశాలపై ఓపెన్‌గా మాట్లాడటంతో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.బ్రేకప్ అయింది..తన జీవితంలోని జరిగిన కొన్ని అనుభవాలని విజయ్ వివరిస్తూ.. ‘నేను ఆల్కహాలిక్ని. డబ్బులు ఉన్నా లేకపోయినా విస్కీ తాగేవాడిని. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మద్యం మానేయాలని నిర్ణయించుకున్నా. తర్వాత ప్రేమలో పడ్డా. బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా. ఏదేమైనా.. ఇదంతా థ్రిల్లింగ్ అనుభవమే’ అని విజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!ప్రస్తుతం రణబాలితో..ఇదే సందర్భంలో వదినమ్మ ఎలా ఉంది అని అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘రష్మిక బాగుంది. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. పని నుంచి విరామం తీసుకుని రిలాక్స్ అవుతోంది’ అని చెప్పారు. కాగా విజయ్, రష్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. Question: 2026 లో మీ దృష్టిలో ఒక 'రోమాంచకం' మూమెంట్ అంటే ఏమిటి?#VijayDevarakonda : 89 లో పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీదీ రోమాంచకమే . జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ తాగినా గ్లెన్ ఫిడిచ్ తాగినా, మందు వదిలేసినా, ప్రేమలో పడినా, హార్ట్ బ్రేక్ అయినా, పెళ్లి… pic.twitter.com/G1DmPjT064— CHITRAMBHALARE (@chitrambhalareI) August 30, 2026 -
అశ్విని రాథోడ్ స్వరానికి జడ్జిలు ఫిదా!
‘ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్లో సింగిల్ సెషన్ గాయకుల ఎంపిక వేదిక అది. ఆర్కెస్ట్రాతో ఓ పాట పాడిన ఆమెను న్యాయనిర్ణేతలో ఒకరైన ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి జోక్యం చేసుకుని ఇదే పాటను ఆర్కెస్ట్రా లేకుండా పాడగలవా అని కోరతాడు.. ఆమె అదే బేస్ వాయిస్‌తో రేలారే..రేలారె.. నీళ్లల్ల నిప్పల్లె.. వచ్చింది నిజమల్లె’ అంటూ పాడడంతో ఆయనతోపాటు మరో జడ్జి, ప్రముఖ నేపథ్య గాయకురాలు శైలజ మంత్రముగ్ధులవుతారు. చప్పట్లతో హోరెత్తిస్తారు. ఇదే క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదు. సరైన ప్రోత్సాహం లభిస్తే పల్లె ముద్దుబిడ్డలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని నిరూపిస్తోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గాజరాంపల్లి తండాకు చెందిన బంజారా బిడ్డ, గాయని అశ్విని రాథోడ్. నల్లబంగారం కొలువైన నేలపై పుట్టిన ఆమె.. తన గానామృతంతో ఆ నేలకు, పుట్టిన ఊరికి ప్రత్యేక గుర్తింపు తెస్తోంది. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతంపై ఆసక్తి పెంచుకుని తన మధుర గాత్రంతో పాటలు పాడుతోంది.ఏడేళ్ల సంగీత ప్రయాణం.. అశ్విని ఏడేళ్లుగా నిరంతర సాధన చేస్తూ సంగీతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రారంభంలో గ్రామాల్లో జరిగే సాంస్కృతిక కా ర్యక్రమాల వేదికలపై పాటలు పాడుతూ ప్రేక్షకుల ను అలరించిన ఆమె క్రమంగా స్టూడియో రికార్డింగ్స్, సింగిల్ సెషన్స్ పాడే స్థాయికి ఎదిగింది. భావోద్వేగాలను పలికించే గాత్రం స్పష్టమైన ఉచ్ఛరణ ఆమె సొంతం. View this post on Instagram A post shared by Ashwini Rathod 🎙️ (@ashwinirathod.1)సరిగమప వేదికపై ప్రతిభఇటీవల ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరిగమప సింగింగ్ రియాలిటీ షోలో అశ్విని పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎందరో గాయనీగాయకుల మధ్య పోటీపడి తన గాత్ర మాధుర్యంతో న్యాయనిర్ణేతలను మెప్పించారు. మారుమూల పల్లెటూరు నుంచి వెళ్లి అంతటి ప్రతిష్టాత్మక వేదికపై పాడి జిల్లా కీర్తిని దశదిశలా చాటారు.ఇటీవల కాలంలో విడుదల అవుతున్న సింగిల్ ట్రాక్స్, స్టూడియో సెషన్స్‌లో తన గానంతో అశ్విని రాథోడ్ ప్రతిభ కనబరుస్తోంది. జానపద, భక్తి, సినీ గీతాలను సునాయాసంగా ఆలపిస్తూ సంగీత దర్శకుల మన్ననలు పొందుతోంది. మారుమూల తండా నుంచి వచ్చి ఎలాంటి పెద్ద సంగీత నేపథ్యం లేకపోయినా స్వయంకృషితోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎందరో గ్రామీణ కళాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది.మరిన్ని అవకాశాలు రావాలి..అశ్విని సంగీతంలో రాణిస్తుండడంతో గాజరాంపల్లి తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుమూలతండా నుంచి వచ్చిన ఇలాంటి ప్రతిభావంతురాలికి ప్రభుత్వం, సినీ పరిశ్రమ మరిన్ని అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని ప్రజలు, కళాభిమానులు కోరుతున్నారు.పాటలు పాడడం అంటే ఇష్టం..సంగీతమే నా ప్రాణం. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే ఎంతో ఇష్టం. ఏడేళ్లుగా ఎన్నో అనుభవాలు, సవాళ్లను ఎదుర్కొంటూ పాటలే సర్వస్వంగా ముందుకుసాగుతున్నా. ప్రముఖ వేదికలపై పాడడంతోపాటు గొప్ప నేపథ్య గాయనిగా ఎదడగమే నా జీవిత ఆశయం. నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకుధన్యవాదాలు.– అశ్విని, గాయని , వరంగల్ జిల్లాచదవండి: Nithya Menen: ఇన్నాళ్లు హీరోయిన్.. ఇప్పుడు కొత్త బాధ్యతలు -
ఐ యామ్ గేమ్ సర్ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్
‘‘ఐ యామ్ గేమ్’ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. ఈ సినిమాని నేను కొంత చూశాను. చాలా వినోదం ఉంటుంది. ఇందులోని కాన్సెప్ట్‌కు ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. ‘మహానటి’ సినిమా నుంచి దుల్కర్గారితో నా ప్రయాణం కొనసాగుతోంది. కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చే నటుడు ఆయన. కథ కోసం ఎంత దూరమైనా వెళ్తారు’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘ఐ యామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటించారు. వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 3న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘నా ప్రొడక్షన్ లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ఐ యామ్ గేమ్’. తెలుగు ప్రేక్షకులు హీరోలను ఆదరించడంలో చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌గార్లు.. ఇలా ఎవరి పేరు చెప్పినా ప్రేక్షకులు కేరింతలు కొడతారు. అది తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం. మీ అందరి మనసులో నాకు కూడా చోటు కల్పించినందుకు ధన్యవాదాలు. ‘ఐ యామ్ గేమ్’ మూవీతో మరోసారి మిమ్మల్ని అలరిస్తానని నమ్ముతున్నాను’’ అని చెప్పారు. సంయుక్త విశ్వనాథన్, నిర్మాతలు సందీప్ గుణ్ణం, సాయిబాబా మాట్లాడారు. -
క్రైమ్ థ్రిల్లర్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, మలయాళ నటుడు, దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘దయారా’. నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పణలో వినీత్ జైన్ , ధవల్ గడా నిర్మించిన ఈ మూవీ హిందీ, మలయాళ భాషల్లో ఈ నెల 18న రిలీజ్ కానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన డీసీపీ అజూనీ కోహ్లి రోల్ నా మనసులో చాలా కాలం నిలిచి΄ోతుంది’’ అని చెప్పారు కరీనా కపూర్. ‘‘మనుషుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథ ఇది’’ అని తెలిపారు పృథ్వీరాజ్ సుకుమారన్ . ‘‘గ్రే షేడ్స్‌తో కూడిన పాత్రలు ఉన్న ‘దయారా’ ప్రపంచంలోకి ప్రేక్షకులను ఆహ్వానించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను’’ అని తెలిపారు మేఘనా గుల్జార్. ఈ చిత్రంలో జితేంద్ర జోషి, క్షితీ జోగ్, కన్వల్జీత్ సింగ్, సందీప్ కులకర్ణి ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
భావోద్వేగాలు బలంగా ఉంటాయి: అనంతిక సనిల్‌కుమార్
‘‘రోమాంచకం’ చిత్రంలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ... ఈ మూడు భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ఈ మూడింటిలో నాకు ఉత్కంఠ బాగా నచ్చింది. ఈ ఉత్కంఠ కూడా ప్రేమవల్లే అవుతుంది. అది ఎలా జరిగింది? అనేది సినిమాలోనే చూడాలి. నేను గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ‘రోమాంచకం’లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంత సరదాగా, సంతోషంగా చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అనంతిక సనిల్‌కుమార్ మాట్లాడుతూ–‘‘8 వసంతాలు’ సినిమా తర్వాత చాలా కథలు విన్నప్పటికీ ఎగై్జటింగ్‌గా అనిపించలేదు. ‘రోమాంచకం’ కథ విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో బబ్లీ గర్ల్, సరదాగా ఉండే తమిళ అమ్మాయిగా కనిపిస్తా. ఇది ప్రేమ కథా చిత్రమే అయినప్పటికీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సుమంత్ ప్రభాస్ పాత్ర ఈ మూవీలో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా ఆయనతో పోటీ పడేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ వేణుగోపాల్‌గారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డిగార్లు నా పాత్ర చాలా బాగా వచ్చిందని అభినందించడం సంతోషం. అయితే ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను. యాక్షన్, డ్యాన్స్ బేస్డ్ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధమే. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. -
మళ్లీ తన ఫేవరెట్ జానర్లోకి శ్రీవిష్ణు
ఇటీవల కాలంలో మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు హీరో శ్రీవిష్ణు. కొంత గ్యాప్ తరువాత మరోసారి అదే జానర్లోకి ఎంటరయ్యాడు ఈ హీరో. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.నేటి యువత అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, జీవిత పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఇది మన అందరి కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. యానిమేషన్‌తో మొదలైన ఈ గ్లింప్స్ హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆసక్తికరంగా పరిచయం చేసింది. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాతో సన్నీ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన మిడిల్ క్లాస్ పాత్రతో ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రానికి చందు, రవి సంగీతమందించనున్నారు.ఈ సినిమా తరువాత హీరో రవితేజతో కలిసి 2027 సంక్రాంతి పండక్కి ఆడియన్స్ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్‌గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. కథ రీత్యా ఇది మల్టీస్టారర్ మూవీ అని, రవితేజతో పాటు శ్రీవిష్ణు మరో లీడ్ రోల్లో నటించనున్నారని సమాచారం. -
కార్తీ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ హీరో కార్తి నటించిన సీక్వెల్ సర్దార్-2. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన సర్దార్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మిషన్ చుట్టూ కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విలన్‌గా ఎస్జే సూర్య కనిపించడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతమందించారు. #Sardar2 Trailer is here! Tamil : https://t.co/XetVn1ESqfTelugu : https://t.co/bDJ6ffBYWB#Sardar2FromSep10— Karthi (@Karthi_Offl) August 31, 2026 -
ఏషనాగుల సాంగ్.. నాని, అనిరుధ్ వీడియో వైరల్
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్'. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఆయా షేర్ సాంగ్ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.ఇటీవలే ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఏషనాగుల కట్టమీద అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ సైతం ఊహించని విధంగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్‌తో అదరగొడుతోంది.తాజాగా ఈ పాటకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో నాని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కలిసి చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నాని, అనిరుధ్ న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద లైట్లతో ఓ రిక్షాలో సందడి చేశారు. ఈ క్రమంలో ఏషనాగుల పాట బీట్‌కు దరువు వేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. NANI & ANI are us. Vibing to #YeshaNagula everywhere and anywhere 🔥🔥#TheParadise second single is TRENDING #1 on YouTube ▶️ https://t.co/ffTvysQUod pic.twitter.com/9jIf1NfADQ— THE PARADISE (@TheParadiseOffl) August 31, 2026 -
తనయుడికి స్పెషల్ విషెస్.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తనయుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు గౌతమ్ బర్త్ డే కావడంతో కుమారుడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నేరవేర్చుకోవాలని ఆకాంక్షించారు.మహేశ్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' ఘట్టమనేని గౌతమ్‌కు 20వ పుట్టినరోజు శుభాకాంక్షలు.ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నప్పుడు నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నేరవేర్చుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు నిన్ను చూసి గర్వపడుతున్నా' అంటూ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy 20 GG!! As you step into this new chapter, may you always chase your dreams with courage and kindness….. Proud of you today and every day….♥️♥️♥️ pic.twitter.com/kn8AGpviWY— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2026 -
'ఇది మనందరి కథ'.. ఆసక్తిగా శ్రీ విష్ణు కొత్త సినిమా గ్లింప్స్
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో మూవీకి రెడీ అయిపోయారు. గతేడాది సింగిల్ మూవీతో అలరించిన హీరో.. ఈ ఏడాది సరికొత్త ప్రేమకథను ప్రకటించారు. ఇది మన అందరి కథ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ చూస్తుంటే ఓ సగటు యువకుడి కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు, ఉద్యోగం, పెళ్లి కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర హారిక నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందు, రవి సంగీతమందించనున్నారు. -
పాప పుడితే అలా.. అబ్బాయి పుడితే ఇలా.. సామ్‌కు పేరు సలహా..!
ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన టాలీవుడ్ బ్యూటీ సమంత. ఈ మూవీ సూపర్ హిట్‌తో పాటు అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. కాగా.. గతేడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన ప్రెగ్నెన్సీతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ చిట్ చాట్‌లో సమంతకు పుట్టబోయే బిడ్డ గురించి చర్చ జరిగింది. మీ బిడ్డకు ఇద్దరి పేర్లు వచ్చేలా పేరు పెట్టుకోవాలని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. పాప పుడితే సమైరా.. బాబు పుడితే సామ్రాజ్ అని పెట్టుకోవాలని కామెంట్ చేశాడు. దీనిపై సమంత స్పందించింది. మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ? అంటూ స్మైలీ ఎమోజీలను జోడించింది.సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో కథానాయికగా కనిపించారు. ఈసినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం సమంత మాతృత్వం కోసం సినిమాలకు విరామం ప్రకటించింది. -
కిరణ్ అబ్బవరం మరో మూవీ.. ఆసక్తిగా టైటిల్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే చెన్నై లవ్ స్టోరీతో హిట్ అందుకున్న మన హీరో.. మరో మూవీని ప్రకటించారు. ఆయన నిర్మాతగా తాజాగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి హతః అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తోనే ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేశారు. 'ఈ పిల్లి బతికి ఉందా.. లేక చనిపోయిందా' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు అనుశ్ గోరఖ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అటు హీరోగా రాణిస్తూనే.. నిర్మాతగానూ కిరణ్ అబ్బవరం దూసుకెళ్తున్నారు. HATAH - What you never saw coming 🐈⬛Teaser soon ❤️#HATAH #STAYLOST pic.twitter.com/W1qmiqkovL— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 31, 2026 -
మనలో ఫైర్ ఉంటే ప్రపంచంలో ఏదీ ఆపలేదు: విజయ్ దేవరకొండ
‘‘మన హార్ట్‌లో ఫైర్ ఉండి, యాంబిషన్ ఉండి, నీకు నీపై నమ్మకం ఉంటే ఎప్పుడైనా సక్సెస్ కొట్టొచ్చు. బాయ్స్... మీ అందరికీ చెబుతున్నాను. వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ, నీపై నువ్వు నమ్మకం ఉంచి, మనలోని ఫైర్‌ను అలానే కొనసాగించగలిగితే ప్రపంచంలో ఏదీ మనల్ని ఆపలేదు’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన సినిమా ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణుగోపాల్‌రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ ఈ సినిమాలోని పాటను రిలీజ్ చేశారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘అప్పట్లో ఒకవేళ ఆ సినిమా (‘అర్జున్ రెడ్డి’) ఆడకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి మాది. చేతుల్లో డబ్బులు లేవు, ఇన్ఫ్లూయెన్స్, కనెక్షన్స్ లేవు. వెనక మీరందరూ (ఫ్యాన్స్) కూడా లేరు. అప్పటికి ‘పెళ్ళి చూపులు’ సినిమా రిలీజ్ కాలేదు. సందీప్, ప్రణయ్ అన్న, ప్రభాకర్ అంకుల్ వాళ్ల పోలం అమ్మి ‘అర్జున్ రెడ్డి’ తీశారు. నా గురించి సందీప్ ఎంత దూరం అయిన వెళ్లేటోడు. నేను సందీప్ గురించి ఎంత దూరమైనా వెళ్తా. ‘నువ్వు పిలిచినప్పుడు రాకపోతే బతికి వేస్టు..’. ఇక మా రౌడీవేర్ ఆఫీస్ దగ్గర సుమంత్ అప్పుడప్పుడు కనిపించేవాడు. వీడు లైఫ్‌లో యాక్టరో, డైరెక్టరో అవుతాడనుకున్నాను. సందీప్, ప్రణయ్ అన్న ఒక సినిమా చేస్తున్నారంటే... అది కచ్చితంగా విజయం సాధించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నాకు ఇంకా గుర్తుంది. ‘అర్జున్ రెడ్డి’ ఆడియో ఫంక్షన్లో నేను దిగినప్పుడు మీ అరుపులు విని, ఇక్కడ్నుంచి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాను. ఈ ఇండస్ట్రీ నుంచి కదిలేదే లేదు... ఫిక్స్’’ అని చె΄్పారు. రష్మిక మందన్నా గురించి అభిమానులు అడిగితే... ‘‘వదినమ్మా... బాగానే ఉంది. గాయమైంది. రికవరీ అవుతోంది. ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది.‘రణబాలి’ సినిమా గురించి త్వరలోనే మాట్లాడదాం’’ అన్నారు విజయ్ దేవరకొండ. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘రోమాంచకం’ కథ విన్నప్పుడు చెప్పినట్లు తీస్తావా? అని డైరెక్టర్‌ను అడిగితే ఓ ఆరు నిమిషాల సీన్ తీసి చూపించాడు. చెప్పినదానికన్నా బాగా తీశాడనిపించింది. సెప్టెంబరు 2న ప్రీమియర్స్ వేస్తున్నాం. వేణు కల నిజం కాబోతోంది. వేణు జీవితంలో సెప్టెంబరు 2, 3 మార్నింగ్ స్పెషల్‌గా ఉండబోతున్నాయి. విజయ్‌కు, నాకు ఇంకా గుర్తుంది.. ఆ ఆగస్టు 24 నైట్ (‘అర్జున్ రెడ్డి’ని ఉద్దేశించి). అలాంటి మూమెంట్ నీకు క్రియేట్ కావాలి. ‘రోమాంచకం’ కోసం మా నాన్న, అన్నయ్య, టీమ్ హార్డ్ వర్క్ చేశారు. ప్రేక్షకులు కేటాయించే డబ్బు, సమయం వృథా కావు’’ అని అన్నారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్స్‌కు వెళ్లి ఈ సినిమాని చూడండి’’ అన్నారు ప్రణయ్ రెడ్డి వంగా. ‘‘ఈ సినిమా నా కెరీర్‌కి పెద్ద మైల్స్టోన్ అవ్వాలన్నది నా ఆకాంక్ష’’ అని అన్నారు సుమంత్ ప్రభాస్. ‘‘కాలేజీ స్టడీస్ పూరయ్యాక రియాలిటీ తెలుస్తుంది. కొంత కన్ఫ్యూజ్ అవుతాం. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతుంటాం. ఆ అంశాలను ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు వేణుగోపాల్. -
భక్తి... భావోద్వేగం...
‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కనకదుర్గ’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో కాజల్ చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ముందుగా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత జీ5 తెలుగులో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుందని మేకర్స్ తెలిపారు.‘‘భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం... ఇలా అన్ని అంశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సర్వశక్తిమంతమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్యశక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నుంచి స్ఫూర్తి పొంది, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. భక్తి భావాన్ని ఆవిష్కరిస్తూనే, ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో చక్కని అనుభూతినిచ్చేలా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
దండాలయ్యా రీమిక్స్ అయ్యా?
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – ఏకే47’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా వెంకటేష్ హీరోగా నటించిన సూపర్‌హిట్ మూవీ ‘కూలీ నెం1’లోని పాపులర్ సాంగ్ ‘దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా’ను ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం రీమిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఈ పాటను రీమిక్స్ చేసినట్లయితే వెంకటేష్ అభిమానులకు మరోసారి ఫెస్టివల్ ఫీస్ట్ ఇచ్చినట్లు అవుతుందని చెప్పాచ్చు. మరి... వార్తల్లో ఉన్నట్లు ‘దండలయ్యా...’ని రీమిక్స్ చేస్తున్నారా? లేదా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 2న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తేదీకి విడు దల కాకపోవచ్చని, అదే నెలలో 9 లేదా 16న విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
ట్రెండింగ్‌లో 'ఏష నాగుల'... టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ ఫోక్!
‘ఏష నాగుల కట్టమీద యేసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల..’ ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ఇదే పాట. ఇన్‌స్టాలో లక్షల్లో రీల్స్.. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన క్లిప్పులే కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు తెలంగాణ పల్లెల్లో, దావత్‌ల్లో, పండుగల్లో, పెళ్లిళ్లలో వినిపించిన పాట ఇప్పుడు సినిమా ప్రమోషన్లో భాగమై.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ‘ఏష నాగుల’ పాటకు వస్తున్న రెస్పాన్స్ దీనికి తాజా ఉదాహరణ.అయితే ఇది ఒక్క పాటతో మొదలైన ట్రెండ్ కాదు. కొన్నేళ్లుగా టాలీవుడ్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ క్రమంగా తమ పరిధిని పెంచుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు జానపద గీతం అంటే పల్లె వాతావరణానికే పరిమితమనే భావన ఉండేది. ఇప్పుడు అదే పాట థియేటర్లో మాస్ సెలబ్రేషన్‌కు, సోషల్ మీడియాలో రీల్స్‌కు, ఫంక్షన్లలో డ్యాన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పల్లె నుంచి పట్టణానికి.. అక్కడి నుంచి పాన్ ఇండియా ప్రేక్షకుల వరకు తెలంగాణ జానపదం తన జోరు చూపిస్తోంది.‘సారంగ దరియా’తో మొదలైన కొత్త ఊపుతెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద మలుపుల్లో ‘సారంగ దరియా’ ఒకటి. లవ్‌స్టోరీ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్‌తో ఈ పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు తెలంగాణ జానపద సంప్రదాయంలో ఉన్న పాటను సినిమాకు తగ్గట్టుగా కొత్త రూపంలో తీసుకొచ్చారు. 2021లో విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఫోక్ ట్యూన్‌కు సినిమా విజువల్స్, మాస్ బీట్ తోడైతే ఏ రేంజ్లో రీచ్ వస్తుందో ‘సారంగ దరియా’ చూపించింది.‘రాములో రాములా’.. ఫోక్ బీట్‌కు కమర్షియల్ టచ్ఆ తర్వాత ‘అల..వైకుంఠపురములో’మూవీలోని ‘రాములో రాములా’ కూడా తెలంగాణ యాస, జానపద పదజాలం, మాస్ బీట్‌ను కమర్షియల్ సినిమా సౌండ్‌తో కలిపిన పాటగా నిలిచింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ గాత్రం.. తమన్ సంగీతం.. కాసర్ల శ్యామ్ తెలంగాణ నేటివిటీతో కూడిన పదాలు.. ఈ కాంబినేషన్ పాటను జనాల్లోకి తీసుకెళ్లింది.ఇక్కడే టాలీవుడ్ మ్యూజిక్‌లో ఒక మార్పు మొదలైంది. ఫోక్ అంటే కేవలం పల్లె పాట కాదు.. ఫోక్‌ను కమర్షియల్‌గా ప్యాకేజ్ చేస్తే అదే మాస్ ఆంథమ్ అనే ఫార్ములా వర్కవుట్ అయింది.‘దసరా’లో పల్లె మట్టి వాసనఆ తర్వాత ‘దసరా’లోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ తెలంగాణ జానపదానికి మరింత మాస్ రూపాన్ని ఇచ్చింది. ఈ పాటలో కేవలం ఫోక్ ట్యూన్‌ను ఉపయోగించడం కాకుండా నిజమైన జానపద కళాకారుల గాత్రాలను కూడా వినిపించారు. రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు గన్నోర దాస లక్ష్మి, గొట్టె కనకవ్వ, పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న వంటి జానపద కళాకారులు పాటలో భాగమయ్యారు. అంటే.. సినిమా పాటలో ఫోక్ కలపడం నుంచి ఫోక్నే సినిమా పాటగా మార్చే స్థాయికి టాలీవుడ్ వచ్చేసింది. అలాగే ఇదే సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’పాట కూడా తెలంగాణ పదాలతో సాగుతుంది. ‘ఊరు పల్లెటూరు’.. జానపదానికి అసలైన నేటివిటీ‘బలగం’సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటలో తెలంగాణ పల్లె జీవితం, మట్టి వాసన, వ్యవసాయం, కుటుంబ బంధాలు, ఊరి అనుబంధం అన్నీ కనిపిస్తాయి. మంగ్లీ, రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక్కడ పాట కేవలం హీరో-హీరోయిన్ కోసం పెట్టిన డ్యాన్స్ నంబర్ కాదు. కథలోని ఊరిని, అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని పరిచయం చేసే కథన సాధనంగా మారింది. ఇదే ‘బలగం’ పాటలకు ప్రత్యేకత తీసుకొచ్చింది.‘కాలేజీ పాప’తో పల్లె యాస.. పట్టణ కుర్రాళ్ల వైబ్స్తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు మరో ఆసక్తికరమైన రూపం మ్యాడ్ సినిమాలోని ‘కాలేజీ పాప’ పాట. కాసర్ల శ్యామ్ రాసిన తెలంగాణ యాస పదాలను భీమ్స్ సిసిరోలియో సంగీతంతో మాస్ ఫీల్‌లోకి తీసుకొచ్చారు. పాటలోని పదాలు పక్కా లోకల్‌గా ఉన్నా.. టార్గెట్ మాత్రం కాలేజీ యూత్. తెలంగాణ ఫోక్ అంటే గ్రామీణ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. అర్బన్ యూత్ కూడా అదే యాసను ఎంజాయ్ చేస్తోందని ఈ పాట మరోసారి నిరూపించింది. ‘ఏష నాగుల’.. ఎందుకింత వైరల్?ఇక ప్రస్తుతం ‘ఏష నాగుల’ పాట ఆ ట్రెండ్‌కు కొత్త బెంచ్‌మార్క్ పెట్టేలా కనిపిస్తోంది. ‘ది ప్యారడైజ్’ కోసం కాసర్ల శ్యామ్ ఈ పాపులర్ ఫోక్ హుక్‌ను తీసుకుని కొత్త లిరిక్స్‌ను జోడించారు. అసలు జానపద గీతంలోని గుర్తుండిపోయే భాగాన్ని ఉంచుతూనే.. సినిమా ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త సౌండ్, కొత్త ఎనర్జీని ఇచ్చారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ప్రొడక్షన్, జానపద గాత్రం, నాని మాస్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఇవన్నీ కలిసి పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాట విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లోకి రావడం, మిలియన్ల వ్యూస్ సాధించడం ఈ క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇవే కాదు ‘గున్నా గున్నా మామిడి’ (రాజా ది గ్రేట్), ‘దిగు దిగు దిగు నాగ’ (వరుడు కావలెను) వంటి పక్కా తెలంగాణ జానపదాలను కూడా సినిమాల్లో పెట్టి.. హిట్ కొట్టారు. మొత్తానికి.. తెలంగాణ పల్లె పాటకు పట్టం కట్టిన టాలీవుడ్.. ఇప్పుడు ఆ పాటనే బాక్సాఫీస్ ప్రమోషన్ మంత్రంగా మార్చేస్తోంది. ‘ఏష నాగుల’ నుంచి మరోసారి స్పష్టమవుతున్న విషయం ఒక్కటే.. తెలంగాణ ఫోక్ ఇక ఊరి గడప దాటింది. వెండితెరపై అడుగుపెట్టి.. సోషల్ మీడియాను ఊపేస్తూ.. పాన్ ఇండియా దిశగా పరుగులు పెడుతోంది -
‘మిస్సింగ్ మేఘన’నుంచి రెండో సాంగ్ రిలీజ్
వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈచిత్రం నుంచి సెకండ్ లిరికల్ ‘విన్నావా ప్రేమ’ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ ‘ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది. ఈ సాంగ్ ప్రేక్షకులకూ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను’ అని అన్నారు.కాగా ఈ సినిమాకి ఆర్.ఆర్ ధృవన్ సంగీతం అందించారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా చిత్రీకరిస్తున్న ఈ మూవీలో హీరో రామ్ కార్తీక్‌తో పాటు అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
నటనకు అవకాశం ఉన్నపాత్ర చేశాను
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు, నటరాజ్, రాయంచ కొక్కుర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించారు. ఈ మూవీ పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జై జ్ఞానప్రభ మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. మహావీర్ మ్యూజిక్, చంద్రబోస్‌గారి సాహిత్యం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. మా సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపరచదు’’ అని చెప్పారు. ‘‘మా మూవీ ఔట్పుట్ అందరికీ నచ్చేలా వచ్చింది... ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అని మేరుం భాస్కర్ తెలిపారు. ‘‘ఇటీవల నటనకు విరామం ఇచ్చాను. అయితే ‘ధర్మస్థల నియోజకవర్గం’లో డిఫరెంట్ క్యారెక్టర్ రావడంతో ఒప్పుకున్నాను. నటనకు మంచి స్కోప్ దక్కింది’’ అని వితికా షేరు పేర్కొన్నారు. రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఏలేందర్, ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల, నటులు శివకుమార్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వార్ బిగిన్స్
శివ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఒరిజినల్ మాన్స్టర్’ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో సునీల్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఆనంద్ పండిట్ సమర్పణలో ఆర్. చంద్రు దర్శకత్వంలో యమున చంద్రు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘షూట్ బిగిన్స్... వార్ బిగిన్స్’ అని ఈ పోస్టర్లో కనిపిస్తోంది. పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. -
వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’లో మరో ఎట్రాక్షన్?
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో వెంకీ నటించిన ‘కూలీ నంబర్ 1’లోని ఎవర్గ్రీన్ సాంగ్ ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా’ పాటను రీమిక్స్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకల్లో వినిపించే ఎంతో ఫేమస్ అయిన ఈ పాటను కొత్త బీట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను తనదైన స్టైల్లో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఏ సందర్భంలో ఈ పాటను పెట్టారన్నది ఆసక్తికరంగా మారింది.శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ తొలి వారంలో విడుదల కానుంది. -
ఇరుముడి సక్సెస్ తో జాక్‌పాట్...హీరో, డైరెక్టర్ కు ఆఫర్ల వర్షం!
-
ఆ విజయం కొనసాగాలి: డైరెక్టర్ వెంకీ అట్లూరి
‘‘ప్రేక్షకులు గత కొన్ని నెలలుగా థియేటర్లకు వస్తున్నారు. సినిమాలకు చాలా మంచి రన్ ఇస్తుండటం మంచి పరిణామం. అదే కంటిన్యూ అవుతూ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా సుమంత్ అన్నకి ‘గోదావరి’ చిత్రం కంటే ఈ సినిమాతో బిగ్ సక్సెస్ రావాలి’’ అని డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పారు. సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ– ‘‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత డైరెక్టర్ సంతోష్‌తో ఇది నా రెండో సినిమా. దాదాపు మూడేళ్ల జర్నీ ఇది. ఈ సినిమా విజయం పై మంచి నమ్మకం ఉంది’’ అన్నారు.‘‘మా సినిమా థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించేలా ఉంటుంది’’ అని సంతోష్ జాగర్లపూడి చెప్పారు. కాలిపు మధు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా జర్నీలో వారాహి అమ్మవారు మాతోనే ఉన్నారని మా విశ్వాసం. షూటింగ్ అప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగేవి’’ అని అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటి మీనాక్షి గోస్వామి మాట్లాడారు. -
ఫీనిక్స్ రాజా ఫిక్స్
దర్శకుడు శ్రీవాస్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మాధవి క్రియేషన్స్‌పై మహంకాళి నాగరాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఫీనిక్స్ రాజా’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫీనిక్స్ రాజా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రెండు నిమిషాల 2డీ మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. శ్రీవాస్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలను, ప్రభావవంతమైన కథనంతో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడమే లక్ష్యంగా ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఈ చిత్రకథ ఓ నిజాయితీగల వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. రాజకీయ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించుకోకుండా కష్టపడి, విలువలు, నిజాయితీతో జీవితాన్ని నిర్మించుకోవాలని భావించే అతడి జీవితంలోకి పవర్ఫుల్ వ్యక్తులు ప్రవేశించినప్పుడు అతడి వ్యక్తిగత పోరాటం నిజం, గౌరవం, భవిష్యత్ తరాల కోసం జరిగే పెద్ద పోరాటంగా మారుతుంది. ఈ చిత్రంలో మరో కీలక అంశంగా జెన్ జీపై పెరుగుతున్న డ్రగ్ మాఫియా ప్రభావాన్ని చూపించనున్నాం. ఇంగ్లిష్తో పాటు పలు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రాన్ని భారత్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. -
భిన్నమైన ప్రేమకథ
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చకోర: లూనార్ లవ్ బర్డ్’. దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 8న విడుదల కానుంది.ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ని పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన లవ్‌స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త లవ్ ఫీల్‌ను అందిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ప్రిన్స్ హెన్రీ. -
హీరోగా... విలన్‌గా..!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథనం పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని, వివిధ కాలమానాల్లో సాగుతుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే... ఈ చిత్రంలో తండ్రి... ఇద్దరు కొడుకులు... ఇలా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారట అల్లు అర్జున్. అంతేకాదు... ఈ మూడు పాత్రల్లో ఒకటి విలన్ రోల్ అని సమాచారం. ఇదే నిజమైతే ‘రాకా’ చిత్రంలో హీరోగా, విలన్‌గా అల్లు అర్జున్ నటన చూడొచ్చు. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్లో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. -
ఫుల్ జోష్‌లో...
‘ఇరుముడి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రవితేజ. వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు. రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్‌లోని సినిమా ప్రకటన ఈ వారంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న మూవీని ప్రకటించారు. బ్రిడ్జ్ ప్రోడక్షన్స్పై లక్ష్మణ్, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఇరుముడి’తో సూపర్ హిట్ అందుకున్న రవితేజను లక్ష్మణ్, శ్రీని కలిసి అభినందించి, ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో రూపొందించే కొత్త ప్రపంచంలోకి రవితేజ అడుగు పెట్టనున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లోని సీన్‌పై మీమ్స్ వైరల్
ప్రేక్షకులకు సినిమాల్లోని కొన్ని సీన్లు అలరించడమే కాదు.. కొన్ని మీమ్ మెటీరియల్‌గా కూడా మారుతుంటాయి. తాజాగా సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రతి నెల 27వ తేదీ రాగానే సూర్య పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు.27న విశ్వనాథ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సూర్య పోషించిన సంజయ్ విశ్వనాథ్ పాత్రకు సంబంధించిన ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి నెల 27న వ్యక్తిగత కారణాలతో అతడు విదేశాలకు వెళ్తుంటాడు. దీంతో ఆ తేదీరాగానే సంజయ్ విశ్వనాథ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ అభిమానులు సరదాగా మీమ్స్ పెడుతున్నారు. గతంలో దృశ్యం2’ సినిమాలోనివి కూడా..మొన్నటి వరకు వెంకటేశ్ నటించిన ‘దృశ్యం2’ సినిమాలోని కొన్ని తేదీలు కూడా ఇలాగే వైరలయ్యాయి. ఆగస్టు 3 అంటే రాంబాబు విజయనగరం నుంచి వచ్చిన రోజు అని ఇలా ఆగస్టు నెలకు సంబంధించిన తేదీలు మీమ్‌గా మార్చి సోషల్‌మీడియాలో పోస్ట్చేసేవారు.కాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు రాబెట్టింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, భవానీ శ్రీ, నాజర్, ఆది, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
రుక్మిణి తండ్రి వెనుక ఇంత చరిత్ర ఉందా..?
రుక్మిణి వసంత్. ఈ బామ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తన నటనతో, యాక్షన్ సీక్వెన్స్‌లతో మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఇటీవలే టాక్సిక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇదే మూవీ ఈవెంట్లో తన తండ్రిని గుర్తుతెచ్చుకుని ఎమోషనల్ అయింది.రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. 2007లో జమ్మూకశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందారు. అప్పటికి రుక్మిణి వయసు కేవలం పదేళ్లు. ఈవిషయాన్ని టాక్సిక్ ఈవెంట్లో రుక్మిణిని పరిచయం చేస్తూ ఆమె తండ్రి ఓ అమరవీరుడని నిర్వాహకులు చెప్పడంతో ఆమెతో పాటు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.అదే అంకితభావంతో..‘నాన్న ఎంతో మంచి వ్యక్తి. ఆయన విధి పట్ల ఎంతో అంకితభావంతో ఉండే సైనికుడు కూడా. సైనికులను ఎక్కడికి పంపినా..నాన్నే మందుండేవారు. అదే అంకితభావం నా వ్యక్తిత్వంపై కూడా ఎంతో ప్రభావం చూపింది. ఆయన దేశానికి చూసిన సేవలను గుర్తుచేసుకుంటూ నేను కూడా అదే పనిలో అదే అంకితభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తాను’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.కర్ణాటక నుంచి తొలి అశోకచక్ర గ్రహీత 2007 జూలై 31న ఉరీ ప్రాంతంలో ఉగ్రవాదులతో కల్నల్ వసంత్ వేణుగోపాల్ పోరాడారు. ఈ ఘటనలో ఆయన వీరమరణం పొందారు. ధైర్యసాహసాలకు ఆయన మరణాంతరం అశోక చక్ర లభించింది. కర్ణాటకకు చెందిన తొలి ఆర్మీ అధికారిగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.అలాంటివారిని ఆదుకునేందుకు ఓ ఫౌండేషన్..భర్తను కోల్పోయినా తర్వాత కూడా రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ ఇద్దరు కుమార్తెల బాధ్యతలను చేపట్టారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘వసంతరత్నం ఫౌండేషన్ ఫర్ ఆర్ట్’ను స్థాపించారు. సైనక కుటుంబాలకు సహాయం అందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.నాన్న ఉంటే మద్దతుగా ఉండేవారు..తన తండ్రి ఉన్న సమయంలో తాను నృత్యంపై ఎక్కువ ఆసక్తి చూపేదానిని అని రుక్మిణి తెలిపారు. ‘ నాన్న మాపై ఎప్పుడూ కఠినంగా ఉండేవారు కాదు. చాలా బాగా చూసుకునేవారు. నేను నటనను కెరీర్‌గా ఎంచుకోవడాన్ని చూసి ఆయన తప్పకుండా సంతోషపడేవారు. ప్రోత్సహించేవారు. అని ఆమె గతంలో చెప్పుకొచ్చారు.సినిమాల విషయానికి వస్తే..కాంతార, తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్... యశ్ నటించిన టాక్సిక్ సినిమాతో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ సరసన ‘డ్రాగాన్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.ఇదీ చదవండి: జార్జ్‌కుట్టి.. ఈసారి అయినా లొంగిపోవయ్యా..! -
'మొదటి భర్త టార్చర్.. గాయాలకు మేకప్ వేసుకునేదాన్ని': బుల్లితెర నటి
సినీరంగంలో వారి జీవితాలు ఫుల్ కలర్పుల్గా ఉంటాయని అనుకుంటాం. కానీ అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండో వైపు కూడా చూస్తేనే అసలు జీవితం గురించి తెలుస్తుంది. వర్క్ లైఫ్ బాగానే ఉన్నా.. పర్సనల్ విషయానికి వచ్చేసరికి అదంతా మారిపోయే అవకాశముంది. అలా బాలీవుడ్ బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ మెప్పించిన నటి కామ్యా పంజాబీ జీవితమే ఇందుకు ఉదాహరణ. హిందీలో పలు సీరియల్స్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది.అయితే సినిమాల్లో ఆకట్టుకున్న ఈమె.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తన మొదటి భర్తతో తాను పడిన ఇబ్బందులను పంచుకుంది. గృహ హింసతో పాటు మానసిక క్షోభ అనుభవించానని తెలిపింది. గాయాలను మేకప్‌తో దాచుకోవడం అలవాటు చేసుకున్నానని కామ్యా వెల్లడించింది. ఆ టాక్సిక్ బంధం నుంచి బయటపడటానికి పడిన ఇబ్బందిని ఆమె గుర్తుచేసుకున్నారు. మా ఇద్దరి గొడవను కుమార్తె ఆరా చూడటంతో.. ఇకపై అతనితో జీవించలేనని డిసైడ్ అయ్యానని కామ్యా వెల్లడించారు.కామ్యా పంజాబీ మాట్లాడుతూ..'మేమిద్దరం పెళ్లికి ముందే మేము గొడవపడేవాళ్లం. అతను నాకు సరైనవాడు కాదని నిర్ణయించుకోవాల్సిన స్థాయికి పరిస్థితులు వచ్చాయి. కానీ మాది తొలిప్రేమ కావడంతో ఇతనే సరైన వ్యక్తి అనిపించింది. మా ఇద్దరికీ సెట్ కాదని మా తల్లిదండ్రులు కూడా చెప్పారు. కానీ నేను వారి మాట వినలేదు. పెళ్లి తర్వాత ఆయన నన్ను పని మానేయమన్నారు. కానీ నేను వినిపించుకోలేదు. నేను నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని పోషించాలని చెప్పా. అప్పుడు అతని ఆలోచనా విధానం ఏమిటో నాకు తెలియదు, కానీ అతను ప్రతి విషయాన్ని అనుమానించేవాడు. అతను ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ ఎత్తలేదు?' అని ప్రశ్నలు వేసేవాడు. ఏంటి సంగతి? ఎవరితో ఉన్నావు? అని కూడా ప్రశ్నలు అడిగేవాడు. బాత్రూంలో నన్ను నేను బంధించుకుని గంటల తరబడి బాధపడ్డా. కొన్నిసార్లు రాత్రంతా ఏడ్చేదాన్ని" అని తన బాధను వ్యక్తం చేసింది.కాగా.. కామ్యా మొదట వ్యాపారవేత్త బంటీ నేగీని వివాహం చేసుకున్నారు. వీరికి ఆరా అనే కుమార్తె జన్మించారు. దాదాపు 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోయారు. 2020లో కామ్యా.. శలభ్ డాంగ్‌ను వివాహం చేసుకున్నారు. -
కికు చిరంజీవి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కికు యనమల, కశిశ్ ఖాన్ జంటగా నటించిన మూవీ కికు చిరంజీవి. దీనికి అసలు పేరు చిరంజీవి. కానీ టైటిల్ విషయంలో కొందరు అభ్యంతరాలు తెలియజేయడంతో కికు చిరంజీవిగా మార్చారు. ఈ మూవీకి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. కికు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దీప్తి నడిమింటి నిర్మించారు. ఇందులో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్(అయ్యంగార్), వైవా రాఘవ ముఖ్య పాత్రలు పోషించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టుకుందా అనేది రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..చిరంజీవి(కికు యనమల) అరకులో ఒక ఫోటోగ్రాఫర్. అతనికి ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. అందరికీ గుండె ఎడమ సైడ్ ఉంటే ఈయనకు కుడివైపు ఉంటుంది. దానివల్ల ఎక్కువ పరిగెడితే ఊపిరి ఆడదు.. ఆయన శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. అలాంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రకు వచ్చిన మను(కశిశ్ ఖాన్)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు. అయితే మనుని ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఓ వ్యక్తి తన మనుషులతో చంపేస్తుంటాడు. ఈ విషయం మనుకి కూడా తెలియదు. ఓ సంఘటన తర్వాత మను కూడా చిరంజీవిని ఇష్టపడుతుంది. ఈ విషయం ఆ దుండగులకు తెలిసి చిరంజీవిని చంపేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారి నుంచి తప్పించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు . శోభనం రోజు రాత్రి మనుకి షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు మనును చంపేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? వారి లక్ష్యం ఏంటి? చిరంజీవి గతం ఏంటి? ఈ కథలో ఈశ్వరి రావు పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..గుండె ఎడవైపు కాకుండా, కుడివైపు ఉందనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే ఒకటి రెండు సినిమాలొచ్చాయి. పాత కాన్సెప్ట్ అయినప్పటికీ కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. చిరంజీవి అంటే మరణం లేనివారు.. చచ్చిబతికిన వారు అని పిలుస్తుంటారు. ఇక్కడ రెండో యాంగిల్ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు ప్రయత్నిస్తారు. కానీ అతను చనిపోడు.. అది ఎలా జరిగిందనేది ఈ కథలో అసలు ట్విస్ట్.ఈ కథ ప్రారంభంలో హీరో, హీరోయిన్ల పాత్రలని పరిచేస్తూ, టూర్ ద్వారా వీరిద్దరిని కలుపుతారు. ఈ క్రమంలోనే హీరోకి బ్రీతింగ్ సమస్య, హార్ట్ సమస్య ఉందని తెలుస్తుంది. అనంతరం ఫారెస్ట్‌లో కొందరు దుండగులు వెంటాడటం, ఈ క్రమంలో పారిపోవడం, చిరుని రక్షించుకునేందుకు ఆమె బ్రీతింగ్ ఇవ్వడం వంటి సీన్లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే కథలో అసలేం ఏం జరుగుతుందనేది క్లారిటీ మిస్ అవుతుంది. బీచ్‌లో హీరోకి కత్తిపోట్ల తర్వాత అసలు కథ అప్పుడు మొదలవుతుంది. హీరో లైఫ్‌లోకి ఈశ్వరీరావు రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. వీరు కలిసిపోవడం, హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అలా చకచకా జరిగిపోతుంది. ఫస్ట్ నైట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్‌కు ముందు బిగ్ ట్విస్ట్ ఉంటుంది.కుడి వైపు ఉండాల్సిన హార్ట్ ఎడమవైపు కొట్టుకుంటే.. తాను ఫస్ట్ నైట్ చేసింది ఎవరితో అని హీరోయిన్ టెన్షన్ పడటంతో కథ ఆసక్తిగా సాగుతుంది. అసలు అతను ఎవరు? తన వాడు ఎవరనే ఆమె పడే బాధ, స్ట్రగుల్, టెన్షన్ భయటం ఎంగేజ్ చేస్తాయి. అదే సమయంలో చిరంజీవిలో అనూహ్యమైన మార్పు, సైకోలా ప్రవర్తించడం వంటి సీన్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతాయి.సెకండాఫ్ అంతా థ్రిల్లర్‌గా మారిపోతుంది. ఆ తర్వాత అంతకు ముందు ఉన్న ట్విస్ట్‌లు ఒక్కోటి రివీల్ అవుతాయి. చిరంజీవి పాత్రలోని ట్విస్ట్, మాస్క్ మ్యాన్ ఎవరు అనేది? తనికెళ్ల భరణి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్లని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఫస్ట్ నైట్‌లో చిరంజీవి ఎలా మారిపోయాడు? అసలు హీరోయిన్ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కానీ క్లైమాక్స్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫర్వాలేదు అనే ఫీలింగ్ వస్తుంది.ఓవరాల్‌గా చూస్తే మొదటి భాగం స్లోగా ఉంటుంది. సీరియల్‌ని తలపిస్తుంది. సీన్లు వచ్చిపోతుంటాయి కానీ.. అందులో ఎమోషన్, ఫీల్, లవ్ కనిపించదు. రొమాన్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. డ్రామా ఓవర్‌గా అనిపిస్తుంది. సహజత్వం మిస్సయింది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఒక్కటే కాస్తా చెప్పుకోదగ్గది. సెకండాఫ్‌ని బాగానే డీల్ చేశాడు. ట్విస్ట్‌లు, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ అంశాలు బాగానే రాసుకున్నాడు. ఫన్, రొమాన్స్, యాక్షన్ అంశాలు బాగానే ఉన్నాయి. దర్శకుడు శుభ సాయి వెంకట్ ఎంచుకున్న కథ బాగానే ఉంది. కథనం కూడా బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించే విషయంలోనే తడబాటు కనిపించింది.ఎవరెలా చేశారంటే.. చిరంజీవిగా హీరో కికు యనమల ఫర్వాలేదనిపించాడు. ఫన్నీగా, సీరియస్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. హీరోగా మొదటి సినిమా అయినా కికు యనమల బాగానే యాక్ట్ చేశాడు. మనుగా కశిశ్ ఖాన్ ఉన్నంతలో తన పాత్రలో మెప్పించింది. ఆమె నటన కొంత అసహజంగా అనిపిస్తుంది. మిగిలిన ఈశ్వరీరావు, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, వైవా రాఘవ, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయ చేశారు. సాంకేతికంగా చూస్తే రామకృష్ణ కెమెరా వర్క్ బాగుంది.. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఫర్వాలేదు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఇంకాస్తా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. -
యశ్ టాక్సిక్ వసూళ్లు.. రెండో రోజే తేల్చేశారు..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే రాణించింది. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. యశ్ నటన మినహాయిస్తే కథలో బలం లేకపోవడం టాక్సిక్ను దెబ్బతీసింది.మొదటి రోజు వసూళ్లపరంగా రాణించిన టాక్సిక్.. రెండో రోజే చతికిలపడింది. నెగెటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు మొహం చాటేశారు. దీంతో టాక్సిక్ కేవలం రూ. 49.75 కోట్లకే పరిమితమైంది. దీంతో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 190.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ధురందర్ 2, పుష్ప 2, కేజీఎఫ్: చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల కంటే వెనకే ఉంది. ధురందర్ 2 రెండో రోజు ఇండియాలోనే సుమారు రూ. 80.72 కోట్ల నికర వసూళ్లు సాధించగా.. పుష్ప 2 రూ. 93.80 కోట్ల నెట్, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 90.50 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ. 86.70 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టాయి.కాగా.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన రెండో రోజే తేలిపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోనుంది. ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 137.50 కోట్ల నెట్.. రూ. 164.50 కోట్ల కలెక్షన్స్‌కే పరిమితమైంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. -
ఏఐ టెక్నాలజీతో మైథలాజికల్ స్టోరీ.. టీజర్ రిలీజ్
మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఏఐ మూవీ అంబాస్ రివెంజ్. ఈ చిత్రాన్ని జైవర్ధన్ మేడి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ మూవీకి యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఈ విజువల్ ఫీస్ట్ మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో మహాభారతంలో భీష్ముని వల్ల ఒక జన్మలో మరణించిన కారణం, మరో జన్మలో భీష్మునిపై ఆమె పగ తీర్చుకున్న ప్రయాణాన్ని చూపించనున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ... "సినిమా అంబ అయినప్పటికీ ఈ సినిమా శిఖండి నుంచి చూడబోతున్నాం. ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఈ టీజర్ విడుదల చేశాం. ఇందులో ఎలాంటి డైలాగ్స్ కూడా లేవు. త్వరలో ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది' అని అన్నారు.నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ... 'ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎఐలో సినిమా చేయడం చాలా ఖర్చుతో కూడిన విషయం. సాధారణంగా ఇటువంటి సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అనుకుంటారు. కానీ మేము ఒక టూల్ ఉపయోగించేలోపు మరొక టూల్ వస్తుంది. అలా అంబాకు ఖర్చు ఎక్కువైంది. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది' అని అన్నారు. -
'మనోజ్‌తో మౌనిక పెళ్లి.. మోహన్ బాబు వెంటనే ఒప్పుకోలేదు'
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరిగ్గా మూడేళ్ల క్రితం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ పొలిటిషియన్ భూమా నాగిరెడ్డి కూతురు మౌనికను ఆయన పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతం ఈ జంట తమ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మనోజ్ సైతం సినిమాలతో కెరీర్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు ఓ పెళ్లి వేడుకలోనూ సందడి చేశారు.ఇదంతా పక్కనపెడితే మంచు మనోజ్ పెళ్లి తర్వాత చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంచు ఫ్యామిలీలో విష్ణుకు, మనోజ్‌కు మధ్య గొడవలు కూడా జరిగాయి. మౌనికతో పెళ్లి తర్వాతే ఈ వివాదాలు తలెత్తాయి. మంచు మనోజ్- మౌనిక పెళ్లి మోహన్‌బాబుకు ఇష్టం లేదని గతంలో వార్తలు కూడా వచ్చాయి.అయితే మంచు మనోజ్- మౌనిక పెళ్లి గురించి ఆమె సిస్టర్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె వీరిద్దరి పెళ్లికి మోహన్‌బాబు త్వరగా ఒప్పుకోలేదన్నారు. మంచు మనోజ్- మౌనికను పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని అడిగారని చెప్పింది. అయితే తాము ఈ పెళ్లి వెంటనే జరగాలని మనోజ్‌తో చెప్పామని అఖిల ప్రియ వెల్లడించారు. ఈ పెళ్లికి మా ఫ్యామిలీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆమె తెలిపారు. కాకపోతే మా తమ్ముడు, నేను ఎఫెక్ట్ అవ్వకూడదనే త్వరగా పెళ్లి చేసుకోవాలని మాత్రమే చెప్పామని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు.కాగా.. మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023 మార్చి 3వ తేదీన రాత్రి 8.30నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్- మౌనిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. -
సడన్‌గా ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తీ తరేజా లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’. 1990 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ క్రైమ్ డ్రామాకు కేకే దర్శకత్వం వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో సడన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. కాగా.. ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వీ సంగీతమందించారు. -
బిగ్‌బాస్ సీజన్-10.. హౌస్‌లోకి చెన్నై లవ్ స్టోరీ నటుడు..!
బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ ఏడాది పదో సీజన్ కావడంతో మరింత స్పెషల్‌గా నిలవనుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేయగా.. ఈ సీజన్ సరికొత్తగా ఉండనుందని హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ షోకు కంటెస్టెంట్ల వేట కొనసాగుతోంది. అగ్నిపరీక్ష పేరుతో కామనర్లను వడపోత పోస్తున్నారు. వీరిలో కొందరినీ ఎంపిక చేసే ప్రక్రియ ఇంకా నడుస్తోంది.అయితే ఇప్పటి వరకు సెలబ్రిటీల ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ సీజన్లో బుల్లితెర నటులతో పాటు కొందరు నటులు హౌస్‌లో అడుగుపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బిగ్‌బాస్ సీజన్లో ఓ ప్రముఖ నటుడు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన కిరణ్ అబ్బవరం మూవీ నటుడు ఆదిత్ అరుణ్ ఈ సీజన్లో హౌస్‌లో అడుగుపెట్టనున్నారని లేటేస్ట్ టాక్.(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్- 10 సెప్టెంబర్‌లో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. తేదీని ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. దీంతో కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై రోజుకు ఒక పేరు వినిపిస్తోంది. తాజాగా ఆదితి అరుణ్ బిగ్‌బాస్‌లో కనిపిస్తారని వార్త వినిపిస్తోంది. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. ఈ పదో సీజన్‌కు సైతం కింగా నాగార్జునే హోస్ట్ కావడం విశేషం. -
వంద కోట్ల క్లబ్లో మమితా బైజు లేటేస్ట్ మూవీ
కంటెంట్ ఉంటే చాలు ఏ సినిమాకైనా కాసుల వర్షమే. అదే నిజమని ప్రతిసారి రుజువవుతోంది. ఇటీవలే విడుదలైన రవితేజ ఇరుముడి సైతం ఇదే నిరూపించింది. తండ్రీ కూతుళ్లు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ ఇప్పటికే వసూళ్లపరంగా సెంచరీ కొట్టేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.ఇటీవలే మలయాళంలో విడుదలైన మరో మూవీ సైతం కంటెంట్‌తో అదరగొడుతోంది. మమితా బైజు, నివిన్ పౌలీ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా బెత్లెహెమ్ ఫ్యామిలీ యూనిట్. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం విడుదలైన 6 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేరళలో ఓనం పండుగకు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయకపోయినా కూడా.. కేవలం మలయాళం వర్షన్‌తోనే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పోటీ లేకపోవడం బాగా కలిసొచ్చింది. ఓనం పండుగ కూడా రావడంతో ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ బ్యానర్లో నిర్మించారు. ₹100 CRORE Gross Worldwide in 6 days🔥Phenomenal for a Malayalam only version film 💯#BethlehemFamilyUnit is a genuine blockbuster and is the clear Onam2026 winner by a mile 💥✨A big thumbs up to @NivinOfficial @mamitha_baiju #GirishAD @BhavanaStudios and rest of the #BKU… pic.twitter.com/DwaaIyZMpg— Sreedhar Pillai (@sri50) August 27, 2026 -
కింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వందో సినిమా అప్డేట్
టాలీవుడ్ కింగ్ నాగార్జున మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న వారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా నాగ్ వందో మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా రివీల్ చేస్తామని ఓ వీడియో పంచుకున్నారు.ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వందో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్‌ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాక్‌స్టార్ కింగ్ సైజ్ స్కోర్ లోడింగ్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ చిన్న వీడియోను పంచుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ బర్త్ డేకు నాగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ తేదీ ప్రకటించే అవకాశముంది. ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. Before the take over… 👑Here’s a little preview of the REIGN that awaits.Rockstar’s KING-SIZE score is loading… 💥🔥29th August ⏳#KING100King @iamnagarjuna @Rakarthik_dir @ThisIsDSP @rajamahadhevan @NavinNooli @ArtSathees #SupriyaYarlagadda @CVRao74 @TSeriesSouth… pic.twitter.com/zIUAQmeF9k— Annapurna Studios (@AnnapurnaStdios) August 27, 2026 -
బలమైన భావోద్వేగాల సహా...
శివ కుమార్ కాసారం హీరోగా నిషాంత్ దోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు). శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య హీరోయిన్లుగా నటించారు. తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను... చాలా బాగుంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ–‘‘సహా–ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని పోస్టర్ పెట్టారు. ఇలా పెట్టాలంటే ధైర్యం కావాలి. సినిమా ఆ అంచనాలను అందుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘చిన్న సినిమా బ్లాక్‌బస్టర్ కొడితే ఎలా ఉంటుందో మా చిత్రంతో చూపిస్తాం’’ అన్నారు శివకుమార్. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు నిరుత్సాహపడితే అమీర్‌పేట్ సెంటర్లో నిలబడి గుండు గీయించుకుంటాను’’ అని శ్వేతా లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలున్నాయి’’ అన్నారు నిశాంత్. ‘‘సహ’ గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటారు’’ అన్నారు వ్రజన పాండ్య. -
డిసెంబరులో లెగసీ
డిసెంబరులో విశ్వక్ సేన్ ‘లెగసీ’ థియేటర్స్‌కి రానుంది. విశ్వక్ సేన్ హీరోగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లెగసీ’. ఏక్తా రాథోడ్ హీరోయిన్గా నటిస్తు్తన్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గురువారం ప్రారంభమైంది. విశ్వక్ సేన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.‘‘మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం అంశాలతో సాగే ఈ కథలో ఒక వారసుడు ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతను తన తండ్రి గతానికి సంబంధించి దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ సినిమా కథనం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత. -
కియారాకు సౌత్ కలిసిరావట్లేదా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీకి సౌత్ సినిమా పెద్దగా కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అప్పట్లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మాత్రమే దక్షిణాదిలో ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత దక్షిణాదిన ఆమె సినిమా చేసిన ప్రతిసారి ఏదో తేడా కొడుతోంది.అప్పట్లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ’, తరువాత అదే హీరోతో చేసిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫిస్ వద్ద నిరాశపరిచాయి. తాజాగా పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ సరసన నటించిన ‘టాక్సిక్’ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వస్తోంది. దీంతో ‘భరత్ అనే నేను’ మినహా సౌత్‌లో కియారా సినిమాలు అన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి.ఇక త్వరలోనే కోలీవుడ్లోకి అడుగుపెట్టనుంది ఈ భామ. ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పాను. త్వరలోనే దాని గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఇటీవల టాక్సిక్ సినిమా ప్రచారంలో తెలిపింది. ఇక మరోవైపు ముంబైలో సముద్రానికి ఎదురుగా ఓ కొత్త ఫ్లాట్‌ను కియారా కొనుగోలు చేసింది. దాని ఇంటీరియర్ పనుల కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
ఇరుముడి క్రేజ్.. సొంత ఊరిలో వీక్షించిన నటుడు
టాలీవుడ్లో ఇప్పుడంతా ఇరుముడి మానియా నడుస్తోంది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు.భారీ బడ్జెట్ మూవీ టాక్సిక్ రిలీజైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ఇరుముడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మౌత్ టాక్‌తో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి నటుడు అజయ్ ఘోష్ సైతం ఈ చిత్రాన్ని వీక్షించాడు. తన సొంత ఊరు వేటపాలంలోని థియేటర్‌కు వెళ్లిన సామాన్య ప్రేక్షకుడిలా టికెట్ తీసుకుని మూవీని చూశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. తన సొంత ఊరు వేటపాలం థియేటర్లో లైన్లో నిల్చొని టికెట్ తీసుకుని #Irumudi సినిమా చూసిన నటుడు Ajay Ghosh. ❤️ pic.twitter.com/LeqCajihvC— cinee worldd (@Cinee_Worldd) August 27, 2026 -
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 17 సినిమాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో టాక్సిక్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ ఫ్రైడే టాలీవుడ్లో కికు చిరంజీవి అనే మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆలియా భట్ ఆల్ఫా మూవీతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ఆకలిరాజ్యం -2026 ఓటీటీల్లో సందడి చేయనుంది. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28 న్యూటన్స్ థర్డ్ లా(తెలుగు సినిమా)- ఆగస్టు 28 చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28 గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28 ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28 ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28 గ్రాండ్ థెఫ్ట్ ఆటో యాన్ ఎక్సెండెడ్ లుక్(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 28 మౌస్ ట్రాప్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 28 సీక్రెట్ ఉమెన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 28 ఫోర్ హ్యాండ్స్- టు సోనాటాస్(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 29జియో హాట్‌స్టార్.. పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28 మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29అమెజాన్ ప్రైమ్బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28 బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28సోనీ లివ్ అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28జీ5 బందర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28ఆహా ఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28ఆపిల్ టీవీ ప్లస్ డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28లయన్స్ గేట్ ప్లే హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28 -
టాక్సిక్ డిజాస్టర్.. డైరెక్టర్ గీతూ కామెంట్స్ వైరల్..!
కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరో యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్ నుంచి సాంగ్స్, ట్రైలర్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయినా కూడా మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. సమ్మర్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేసింది.ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్ మూవీకి తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. యశ్ యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కథలో ఎలాంటి బలం లేదని నెటిజన్స్ తేల్చేశారు. మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో టాక్సిక్ మేకర్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లైంది. నాలుగేళ్ల తర్వాత వచ్చిన మూవీ కావడంతో యశ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మూవీకి డిజాస్టర్ టాక్‌తో డైరెక్టర్ గీతూపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే గీతూ మోహన్‌దాస్ పాత వీడియో నెట్టింట తెగ వైరవుతోంది. గీతూ 2021లో ఈ సినిమా గురించి మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నేను స్క్రిప్ట్ ఒకటి రాస్తాను.. ఇంకొకటి చిత్రీకరిస్తానని ఈ వీడియోలో మాట్లాడింది. నా రచనలో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు.. ఒక స్క్రిప్ట్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి పనిచేస్తున్నప్పుడు పరిస్థితి గందరగోళంగా ఉంటుందని తెలిపింది. కొందరు విమర్శలు చేసి వెళ్లిపోతారు.. కానీ నేను వాటిని పట్టించుకోనని వెల్లడించింది. తన టీమ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటామని గీతూ పేర్కొంది.ఈ చిత్రాన్ని స్త్రీ దృష్టికోణంతో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఆమె అభివర్ణించారు. నేను రాసిన స్క్రిప్టులన్నీ నా సొంతంగానే రాశానని తెలిపారు. నా తర్వాతి సినిమా కోసం రైటర్స్ రూమ్ ఉండటం ఇదే మొదటిసారని అన్నారు. నేను ఒకటి రాస్తాను.. మరొకటి చిత్రీకరిస్తాను.. ఇంకొకటి ఎడిట్ చేస్తాను.. ఆ తర్వాత సినిమా విడుదల అవుతుందన్నారు. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటా.. అందుకే నేను ఎప్పుడూ స్క్రిప్ట్‌కు కట్టుబడి ఉండనని గీతూ మోహన్ దాస్ తెలిపింది. ఈ కామెంట్స్‌ను కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు.KVN Productions should have listened to this disclaimer. Pun by @coachravindrak - #ToxicTheMovie 😊 pic.twitter.com/QZKgvSREjo— Parth Chaturvedi (@_mrchaturvedi) August 27, 2026 -
రంభ ఊర్వశి మేనక.. ముగ్గురు భామలతో టైటిల్ సాంగ్
అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ కామెడీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక. ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు.ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ ఫన్‌గా అనిపించింది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ చూస్తుంటే ఈ మూవీలో హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది. భారీస్థాయిలో ఈ పాటను షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ పాటకు సురేశ్ బనిశెట్టి లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ సీపన, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ టైటిల్ సాంగ్ మీరు కూడా చూసేయండి. రంభ ఊర్వశి మేనక... స్టెప్ వేస్తే తెల్లార్లూ వేడుక ❤️🔥The Ultimate Dance Blast number #RambaOorvasiMenaka Title Song Lyrical Video Out Now🕺💃💃💃-- https://t.co/4Jy3mHDKnYIN CINEMAS SEPTEMBER 4th, 2026 😀@allarinaresh @Surbhiactress @RashiReal_ #VishnuPriya… pic.twitter.com/fgu1zb3EYP— Annapurna Studios (@AnnapurnaStdios) August 27, 2026 -
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పోర్బ్స్ కవర్ పేజీపై ఆయన కనిపించారు. వివిధ రంగాల్లో రాణించిన 100 మంది తారల జాబితాను షో స్టాపర్స్ -2026 పేరుతో ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో బన్నీ కూడా స్థానం దక్కించుకున్నారు. ఇందులో అల్లు అర్జున్‌తో పాటు రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, రజనీకాంత్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ కూడా ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మువీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని మరో టాక్. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం కనిపించనుందని లేటేస్ట్ బజ్. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 🤍@ForbesIndia #CoverStory #Showstoppers2026 pic.twitter.com/XxLExdn1Cz— Allu Arjun (@alluarjun) August 27, 2026 -
'గుండు గీయించుకుంటా.. బూతులు తిట్టండి'.. ఇలా సవాల్ చేస్తారా?
శివ కుమార్,శ్వేతా లక్ష్మణ్ జంటగా వస్తోన్న చిత్రం సహ. ఈ సినిమాకు నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. ఈ మూవీని రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చేనెల 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి.తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్ మూవీ గురించి ఫుల్ అగ్రెసివ్‌గా మాట్లాడారు. ఈ మూవీ కంటెంట్ అద్భుతంగా ఉందని అన్నారు. సెప్టెంబర్ 4న రిలీజయ్యే ఈ సినిమా మీకు నచ్చకపోతే అమీర్‌పేట్ సెంటర్లో గుండు గీయించుకుంటానని హీరోయిన్ శ్వేతా ఛాలెంజ్ విసిరారు. ఈ మూవీ చూసి ఎవరు కూడా నిరాశకు గురికారని వెల్లడించింది. మీ అందరూ థియేటర్స్‌కు వచ్చి మా సినిమా చూడాలని కోరారు.అదేవిధంగా హీరో శివకుమార్ సైతం ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మూవీ మీరు ఆశించినదాని కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా మీకు నచ్చకపోతే నా నంబర్‌కు ఫోన్ చేసి బూతులు తిట్టండని హీరో సవాల్ చేశారు. ఈ మూవీ కంటెంట్ మీకు నచ్చితే ఒకరికి బాగుందని చెప్పండి చాలు అంటూ రిక్వెస్ట్ చేశారు. మా సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇప్పించాలని నిర్మాత బన్నీ వాసును కోరారు. మొత్తానికి సహా మూవీ థియేటర్లలో రిలీజైన తర్వాత వీళ్లిద్దరి ఛాలెంజ్‌పై ఓ క్లారిటీ రానుంది. ఈ ఈవెంట్‌కు నిర్మాత బన్నీవాసు కూడా హాజరయ్యారు. ఈ సినిమా మీకు నచ్చకపోతే అమీర్ పేట్ సెంటర్ లో గుండు గీయించుకుంటా.- Actress #Swetha#Sahaa #Tollywood #TeluguCinema #TupakiFollow 👉 @tupaki_official pic.twitter.com/IG9o8AUWyb— Tupaki (@tupaki_official) August 27, 2026 -
ఇరుముడితో ఏం చెప్పాలనుకున్నారు?.. డైరెక్టర్‌కు సూటి ప్రశ్న
ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఒకటే పేరు వినిపిస్తోంది. అందరూ ఆ మూవీ గురించే చర్చించుకుంటున్నారు. యశ్ టాక్సిక్ రిలీజైనా కూడా ఇరుముడి గురించే ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఓ కూతురి తండ్రి ఎలా పెంచాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారని అంటున్నారు. ఈ మూవీ రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే వంద కోట్ల మార్క్‌ను సైతం దాటేసింది.అయితే ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఆడియన్స్ క్యూ కడతారు. అందులోని మైనస్‌ల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇరుముడికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అవీ పెద్దగా హైలెట్ కాలేదు. కానీ ఈ మూవీ సమాజానికి సందేశం ఇచ్చేలా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరమని అంటున్నారు ఓ ప్రముఖ వైద్యుడు ఉప్పలపాటి రామ్ వర్మ. ఇరుముడి డైరెక్టర్ తీరును ఆయన తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.డాక్టర్ తన ట్వీట్లో రాస్తూ..'ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే... సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి.. అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరో పక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి అదే శ్రీరామ రక్ష అంటాడు.. ఒకపక్క ధైర్యంగా మాట్లాడాలి అనే ఆడపిల్లను చంపేసి.. మరోపక్క భయంతో నిజాలను దాచేసి తన జీవితాన్ని ఓ ఎమ్మెల్యే చేతిలో నాశనం చేసుకొన్న మరో ఆడపిల్ల' అంటూ రాసుకొచ్చారు.అసలు ఇరుముడి మూవీతో డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ సినిమా చూసిన పిల్లలు రియల్ లైఫ్‌లో నిజం మాట్లాడినా.. బయటకు చెప్పినా చంపేస్తారేమోనన్న భయం, అనుమానం కలగదా..? ఇద్దరు ఆడపిల్లల జీవితాలను విచ్ఛిన్నం చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఈ డైరెక్టర్..? ధైర్యంగా ఉండే ఆడపిల్ల చనిపోకుండా ఉండింటే చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్లుగా ఉండేది కదా.. ఇదంతా సినిమా... సినిమాను సినిమాలా చూడాలని నీతులు చెప్పకండి అంటారు.. కానీ సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి కదా? అని పోస్ట్ చేశారు. మరి దీనిపై దర్శకుడు శివ నిర్వాణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే...సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరోపక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి… pic.twitter.com/Zdan8y6haL— Uppalapati Ramvarma (@DRRamvarma22) August 26, 2026 -
ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?
-
నాకు యాక్టింగ్ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్
నటీనటుల ప్రతిభకు స్టార్డమ్తో సంబంధం ఉండదు. మంచి నటన ఎక్కడ కనిపంచినా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బాలనటి నక్షత్ర విషయంలో కూడా అదే జరిగింది. ‘ఇరుముడి’ చిత్రంలోని ఆమె నటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తుండగా.. ప్రముఖ తమిళ నటుడు ధనుష్ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోకాల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.వీడియో కాల్ చేసి ప్రశంసలు..నక్షత్ర నటనను చూసిన ధనుష్ స్వయంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారిని అభినందించడంతోపాటు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎప్పుడైనా మనం కలిసినప్పుడు నీ దగ్గర నటన నేర్చుకోవాలని ఉంది. చాలా అద్భుతంగా, అందగా నటించావు. నీ నటన నాకు చాలా నచ్చింది. ఎప్పుడైనా మనం కలుద్దాం. గ్రేట్ జాబ్ కన్నా.. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి’. అంటూ వీడియో కాల్లో మాట్లాడాడు. ఈ సమయంలో ఆ చిన్నారి ఇచ్చిన అమాయకరమైన, ఉత్సాహభరితమైన స్పందన కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. A cloud-nine moment for our little star ❤️The extraordinary @dhanushkraja Garu praised #Nakshatra for her performance and showered #Irumudi with appreciation ❤️🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/oJbwLVl3N0— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026 ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..! -
‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
ప్రస్తుతం అంతటా ‘ఇరుముడి’ ఫీవర్ నడుస్తోంది. చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. తండ్రికూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఇదే సమయంలో మరో బాలనటి నటన.. ప్రేక్షకులను మత్రముగ్ధులను చేసింది. ఆమె మరేవరో కాదు బాలనటి నక్షత్ర. ఇరుముడి చిత్రం ద్వారా అందరిమనసులు దోచుకుంది ఈ బాలనటి . ఈ సినిమాలో ఆమెకి ఉన్న పాత్ర అలాంటిది మరి. మనమ్మపాత్ర సినిమాకు ప్రాణం అనే చెప్పాలి. ఇప్పటికే డైరెక్టర్ నుంచి హీరో వరకు ఆమె నటనకు ప్రశంసలు కురిపించారు. అయితే ఇరుముడిలో ఆమెకు ఎలా అవకాశం వచ్చింది, ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతని ఇప్పుడు హాట్‌టాపిగ్ మారింది.పారితోషికం ఎంతంటే..ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుండగా, దర్శకుడు ఆమె తల్లిని సంప్రదించారట. హైదరాబాద్‌లో ఆడిషన్ ఇచ్చి, మనమ్మపాత్రకు ఎంపికయ్యారని అటు నక్షత్ర, ఇటు డైరెక్టర్ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక నక్షత్ర తీసుక్ను పారితోషికం విషయానికి వస్తే.. సుమారు రూ.10లక్షలు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర దక్కడంతో ఆ పాత్రకు తగినట్టుగానే మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: నాకు యాక్టింగ్ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్ -
LCUని పక్కన పెట్టి.. అల్లు అర్జున్‌తో లోకేష్ ప్రయోగం ఎందుకు?
లోకేష్ కనగరాజ్ పేరు వినగానే LCU గుర్తుకు వస్తుంది. ఈ దర్శకుడు తీసిన ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వంటి సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఆయన ఆ సినిమాలను పక్కన పెట్టి మరీ ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి కారణం.. దాదాపు ఆరేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్‌కు అడ్వాన్స్ ఇచ్చిందట. మరోవైపు అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనే ఆలోచన కూడా కొంతకాలంగా ఉందని లోకేష్ ఓ సందర్భంలో వెల్లడించాడు. ఈ రెండు కమిట్మెంట్లు ఇప్పుడు కలవడంతో AA23 పట్టాలెక్కింది.ఇక ఖైదీ 2 ఆలస్యానికి ఆ సినిమా హీరో కార్తి షెడ్యూల్స్ కూడా కారణమయ్యాయి. రజినీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ కోసం లోకేష్ కొంతకాలం పనిచేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. అదే సమయానికి కార్తి కూడా మరో సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. దీంతో లోకేష్‌కు వచ్చిన గ్యాప్‌లో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. మైత్రీ నిర్మిస్తున్న AA23 సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోలో అడవి, గుర్రం, జంతువుల నేపథ్యంలో ఆసక్తికరమైన ప్రపంచాన్ని హింట్ చేశారు. అయితే ఆ సినిమా కథపై మాత్రం ఎలాంటి ఇంకా క్లారిటీ లేదు.LCUతో కనెక్షన్లు లేకుండా లోకేష్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. అల్లు అర్జున్ సినిమా తర్వాత తన తదుపరి సినిమా ఖైదీ 2నే అని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అంటే ఇది LCUకి బ్రేక్ మాత్రమే.. ముగింపు కాదు! -
ఇరుముడి మ్యూజిక్ డైరెక్టర్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఇమ్మార్షల్. ఈ మూవీకి మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కేవలం తమిళ వర్షన్ మాత్రమే విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో సీన్స్ కథపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ సినిమాకు సామ్ సీఎం సంగీతమందించారు. ఈ చిత్రంలో టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహర్జన్, సునీతా శ్రేష్ఠ కీలక పాత్రల్లో నటించారు. -
టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం.. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్
టాక్సిక్ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని బెంగళూరు కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై స్పందించింది. టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌పై బెంగళూరు కోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆంక్షలు విధించింది. టాక్సిక్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ సినిమాను కించపరిచేలా మీడియాలోనూ పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే వీటిని రద్దు చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. -
బిగ్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్.. తెలుగు ట్రైలర్ రిలీజ్
అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్‌తో మరోసారి థియేటర్లలోకి సందడి చేయనుంది. అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది. అవెంజర్స్: ఎండ్‌గేమ్‌కు ప్రత్యేకమైన ఎంకోర్ ప్రదర్శనగా మరో మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ ఐమాక్స్ స్క్రీన్స్‌తో పాటు మార్వల్ స్టూడియోస్ ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్‌లోనూ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అందుబాటులో ఉండనుంది. పెద్ద స్క్రీన్స్, మరింత ప్రకాశవంతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు మహత్తర ముగింపుగా నిలిచిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం అభిమానులకు లభించనుంది.అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్లో థానోస్ కారణంగా ప్రపంచ జనాభాలో సగం మంది కనుమరుగైన తర్వాత మిగిలిన సూపర్‌హీరోలు ఎదుర్కొనే పరిస్థితులు, తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడానికి వారు చేసే పోరాటం ప్రధానంగా సాగుతుంది. విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు అవెంజర్స్ మరోసారి ఏకమై థానోస్‌తో తలపడే మహా సంగ్రామం ప్రేక్షకులకు మరోసారి అద్భుతమైన అనుభూతిని అందించనుంది.కాగా.. ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజీ నిర్మించగా.. ఆంథనీ, జో రూసో దర్శకత్వం వహించారు. లూయిస్ డి ఎస్పొసిటో, విక్టోరియా అలోన్సో, మైఖేల్ గ్రిల్లో, ట్రిన్ ట్రాన్, జాన్ ఫావ్రూ, జేమ్స్ గన్, స్టాన్ లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఈ అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్ సెప్టెంబర్ 25, 2026 ఇండియాలో గ్రాండ్‌గా విడుదల కానుంది. -
టాక్సిక్ నెగెటివ్ టాక్... ఆ విషయంలో తగ్గేదేలే..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేజీఎఫ్-2 తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌పై విమర్శలు రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. భారీ అంచనాలతో పాటు విమర్శల నేపథ్యంలో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. యశ్ నటనతో మెప్పించినా కథపై విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యశ్ మూవీ కావడంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సైతం నిరాశకు గురవుతున్నారు.కలెక్షన్ల వర్షం..అయితే ఈ మూవీకి నెగెటివ్ రివ్యూలు వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. తొలి రోజే దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకే రూ.79.12 కోట్ల నికర వసూళ్లను సాధించిందని ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్నిల్క్ వెల్లడించింది. కేవలం కన్నడ వర్షన్లో రూ.19 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్ రూ.28 కోట్ల వసూళ్లను టాక్సిక్ అధిగమించింది. ఇప్పటికే పఠాన్, యానిమల్, జవాన్ చిత్రాలను కూడా దాటేసింది. అయితే కేజీఎఫ్ చాప్టర్- 2 రూ.116 కోట్ల తొలిరోజు వసూళ్ల ఆల్-టైమ్ కన్నడ ఇండస్ట్రీ రికార్డ్ మాత్రం అందుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. కాగా..టాక్సిక్ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించారు. -
టాక్సిక్ టాప్ లో ఉంది
-
'మోహన్‌లాల్‌తో పెళ్లి.. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు'
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి పరిచయం అక్కర్లేదు. మలయాళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్లో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తోన్న మోహన్ లాల్..ఈ ఏడాది దృశ్యం-3 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మోహన్ లాల్.. రజినీకాంత్ హీరోగా వస్తోన్న జైలర్-2లో కనిపించనున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే..పర్సనల్ లైఫ్‌లో ఆయన సుచిత్ర బాలాజీని పెళ్లాడారు. 1988 వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం లేని సుచిత్ర.. మోహన్ లాల్‌తో పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన సుచిత్ర..మోహన్ లాల్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. వీరిద్దరు మొదటిసారి ఎలా కలుసుకున్నారో గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా పెళ్లికి తన తండ్రి ఇచ్చిన సలహాను కూడా పంచుకున్నారు.తాను మోహన్‌లాల్‌ను మొదటిసారి ఓ పెళ్లిలో కలిశానని సుచిత్ర వెల్లడించారు. అప్పటికే మా కుటుంబాలకు పరిచయం ఉండటంతో ఆయనను కలిసే అవకాశం వచ్చిందని తెలిపింది. తాను కూడా ఒక అభిమానిగానే ఆయనతో ఒక ఫోటో దిగానని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ఫోటో కాపీ తనకు ఇప్పటికీ అందలేదని సుచిత్ర వెల్లడించారు. ఆ తర్వాత సుచిత్ర తాను మోహన్‌లాల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన కుటుంబంతో చెప్పగా.. నా ఆలోచనకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. తన తండ్రికి బాగా తెలిసిన నటి సుకుమారి ద్వారా ఈ పెళ్లి ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని భావించానని పేర్కొంది. మోహన్‌లాల్‌తో పెళ్లికి ముందే తన తండ్రి హెచ్చరించారని సుచిత్ర వెల్లడించింది. నువ్వు అతన్ని పెళ్లి చేసుకునే ముందే ఒకసారి ఆలోచించుకో అన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావని వార్నింగ్ ఇచ్చారు. కొన్నిసార్లు ఆయన ఇంట్లోనే ఉంటాడు.. కొన్నిసార్లు షూటింగ్‌కు వెళ్లి నెలల రోజుల వరకు తిరిగి రాడని నాన్న అన్నారు. అలాంటప్పుడు నువ్వు అన్నింటికీ సిద్ధంగా ఉండాలని.. పైగా ఇండస్ట్రీలో మనం చాలా విషయాలు వింటాం.. వాటన్నింటినీ కూడా తట్టుకోగలగాలని చెప్పారు. మీ అమ్మ చాలా ప్రశాంతమైన వ్యక్తి.. మీ అమ్మ అన్నింటినీ ఎలా సర్దుకుపోతుందో నువ్వు చూస్తూనే ఉన్నావ్ కదా.. నువ్వు కూడా అలాగే ఉండాలని సలహా ఇచ్చాడు. కానీ నీ పెళ్లయ్యాక తిరిగి వచ్చి నాన్న, ఆయన ఇలా ఉంటాడు, అలా ఉంటాడని నా దగ్గర ఏడిస్తే.. నేను నిన్ను మళ్లీ ఇంట్లోకి కూడా రానివ్వనని చెప్పాడని గుర్తు చేసుకుంది. అందుకే పెళ్లి విషయంలో అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో అని నాన్న చెప్పారని సుచిత్ర వెల్లడించింది.అయితే భర్తగా మోహన్‌లాల్‌పై ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని కూడా సుచిత్ర వెల్లడించారు. మా వివాహం తర్వాత తండ్రికి, మోహన్లాల్కి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. నా కూతురిని ఇంత బాగా చూసుకుంటూ.. నువ్వు ఆమెను చెడగొట్టావని మా నాన్న మోహన్‌లాల్‌తో అన్నారు. ఏది ఏమైనప్పటికీ.. మీరు చూసుకున్న దానికంటే నేను ఇంకా బాగా చూసుకోవద్దా? మోహన్‌లాల్ అని అన్నారని తెలిపింది. మోహన్‌లాల్ తనకు దక్కాల్సిన గౌరవాన్ని ఎల్లప్పుడూ ఇచ్చారని ఆమె వివరించారు. కాగా.. సుచిత్ర- మోహన్‌లాల్ పెళ్లి ఏప్రిల్ 28, 1988న జరిగింది. వీరికి కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్, కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఉన్నారు. కాగా.. సుచిత్ర తండ్రి కె బాలాజీ తమిళంలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
కృతి సనన్ యాడ్ వివాదం.. ప్రకటన సంస్థ కీలక నిర్ణయం
ఆదిపురుష్ భామ కృతి సనన్ చేసిన యాడ్ వివాదానికి కారణమైంది. ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై కూడా దుమారం చెలరేగింది. అంతేకాకుండా రాఖీని ఓ కుక్కకు కట్టడంతో ఇది కాస్తా ముదిరింది. హిందూ సంప్రదాయాలను కృతి అవమానించారంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ పండుగలంటే అంటే అంత చులకన అంటూ బాలీవుడ్ బ్యూటీని నిలదీశారు.ఆ తర్వాత తనపై వస్తున్న వివాదంపై కూడా కృతి సనన్ స్పందించింది. మన సంప్రదాయాలను గౌరవించే విధానం మన దుస్తులపై ఆధారపడి ఉందని తెలిపింది. భక్తి అనేది మహిళ ధరించే దుస్తుల్లో ఉండదని.. అది ఆమె మనసుకు సంబంధించిన విషయమని పోస్ట్ చేసింది. మహిళల దుస్తులను టార్గెట్ చేయడం ఇంకెప్పుడు ఆపుతారని ప్రశ్నించింది. కుక్క కూడా మా ఫ్యామిలీ మెంబర్ అని.. అందుకే రాఖీ కూడా కట్టానని కృతి వెల్లడించింది.తాజాగా ఈ వివాదం పెద్దఎత్తున వైరల్ కావడంతో యాడ్ రూపొందించిన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ కల్చర్, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు పూర్తి గౌరవముందని తెలిపింది. కుటుంబంతో పాటు పెంపుడు జంతువులపై ప్రేమను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ రూపొందించామని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు యాడ్‌ను తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. -
'రవితేజను ఓ బూతు మాట అనాలి.. నా వల్ల కాలేదు'
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ దాటేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప భక్తి తోడు కావడంతో థియేటర్ల వద్ద ఇరుముడి అదరగొడుతోంది.ఈ మూవీతో ఫేమస్ అయిన వాళ్లలో జబర్దస్త్ కమెడియన్ కొమురం ఒకరు. ఈ సినిమాలో ఏకంగా విలన్ పాత్రలో మెప్పించారు. ఒక్కసారిగా స్టార్ హీరో చిత్రంలో విలన్ రోల్ చేయడం నా కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేనని కొమురం అన్నారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కొమురం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కొమురం ఇరుముడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పెద్ద బ్యానర్లో నన్ను ఎలా తీసుకున్నారని మొదట నాకే అనుమానం వచ్చిందన్నారు. నా పాత్ర ఏదైనా చిన్న గే రోల్ ఉంటుందని భావించానని తెలిపారు. లుక్ టెస్ట్ కోసం పిలిస్తే మొదట తాను వెళ్లలేదన్నారు. షూట్‌కు వెళ్లే వరకు నా రోల్ ఏంటనేది కూడా తెలియదన్నారు. ఈ సినిమా పాత్రపై నాకు ఎక్కడా కూడా సంతృప్తిగా అనిపించలేదని తెలిపారు.కానీ డైరెక్టర్ శివ నన్ను పిలిచి మేకప్ వేసి మరి రెడీ చేశారు. నువ్వు సిగరెంట్, మందు తాగుతావు.. ఈ మూవీలో నువ్వు ఒక సైకోలా చేయాలని డైరెక్టర్ చెప్పారు. ఇదంతా విని నేను షాకయ్యా.. రవితేజ క్యారవాన్ దిగి రాగానే నాకు చెమటలు పట్టాయని అన్నారు. ఆయన రాగానే గళ్ల పట్టుకుని రవితేజను కొట్టాలని డైరెక్టర్ చెప్పారు.. ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. అదే సీన్లో రవితేజను ఒక బూతు మాట అనాలని కూడా చెప్పారు.. కానీ అప్పుడే నాలో భయం మొదలైందని కొమురం చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెద్ద హీరో కదా.. సింగిల్ టేక్‌లో చేయకపోతే బాగుండదని చెమటలు పట్టేశాయని కొమురం తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో నాగులు అనే విలన్ పాత్రలో కొమురం ఆకట్టుకున్నారు. -
సంక్రాంతికి సై
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అంటే చాలా ప్రత్యేకం అని చెప్పాలి. తెలుగు లోగిళ్లలో ముగ్గుల పండగ వేళ విందూ వినోదాల్లో కొత్త సినిమాలది కూడా ఒక భాగమే. ఇండస్ట్రీకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఆ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆడియన్స్. ఈ టైమ్‌లో వచ్చే మూవీస్‌లో చాలా వరకు కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటాయి. అందుకే హీరోలు, దర్శక– నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తుంటారు. పైగా ఈ సమయంలో విడుదలయ్యే చిత్రాలకు మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్ ఆలోచన. పండగకి వచ్చే సినిమాల్లో ‘ఫలానా సినిమా’ బాగుందనే టాక్ వచ్చిందంటే ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనే. అందుకే స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి పోటీకి సై అంటుంటారు. 2027 సంక్రాంతి మరో నాలుగు నెలలు ఉండగానే పలు చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు కూడా సంక్రాంతి రేసులో ఉండేందుకు ముస్తాబవుతున్నాయి. చిరంజీవి, వెంకటేశ్–కల్యాణ్ రామ్, రవితేజ, శర్వానంద్, సాయిదుర్గా తేజ్ వంటి హీరోలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కర్చీఫ్ వేసేశారు. బాలకృష్ణ, నాగార్జున, రజనీకాంత్, సూర్య వంటి హీరోలు కూడా సంక్రాంతి పోటీలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. మరి... సంక్రాంతి బరిలో నిలిచిన, నిలవనున్న సినిమాలేంటో చూద్దాం. 13న కాకా రాక చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబోలో రూపొందుతున్న సినిమా ‘కాకా’. ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వరా రాజన్ , సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చినట్లు యూనిట్ పేర్కొంది.‘‘తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ‘కాకా’ కథనం సాగుతుంది. చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేస్తారు. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రజెంట్ చేస్తున్నారు బాబీ. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్‌తో, యంగ్ వెర్షన్ లో తన యాటిట్యూడ్, ఎనర్జీతో ఆకట్టుకుంటారు. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ఇంటెన్సిటీని మరింత పెంచింది. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది. టైటిల్ గ్లింప్స్ తర్వాత ‘కాకా’ పై అంచనాలు పెరిగాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.జనవరి 12 విడుదల వెంకటేష్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి నటిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘జనవరి 12 విడుదల’ (బావ బామ్మర్ది సౌజన్యంతో అన్నది ట్యాగ్‌లైన్) అనే టైటిల్‌ను ఖరారు చేసి, సినిమాని కూడా జనవరి 12 విడుదల చేయనున్నట్లు ఓ ఫన్నీ వీడియోను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.‘‘దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు అనిల్ రావిపూడి. అనిల్ ట్రేడ్ మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉంటుంది.వెంకటేష్, కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య సినిమాలో ఉండే రిలేషన్ ను హైలెట్ చేస్తూ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ని పెట్టడం జరిగింది. మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్‌గా నిలవనుంది. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. దాగుడు మూతల దండాకోర్? ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఆయన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా నటించనున్న ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ 64వ సినిమాకి ‘ఎస్వీసీ 64’ అనే వర్కింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ని మంగళవారం ప్రకటించారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలి పారు.‘‘రవితేజ, హసిత్ గోలి కలిసి ఓ హార్డ్‌కోర్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే... వైవిధ్యమైన కథలు, హ్యూమర్‌తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. హసిత్ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్‌లో రవితేజ సరికొత్తగా కనిపిస్తారు. ఈ సంక్రాంతికి రవితేజ నుంచి రానున్న ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను, టైటిల్‌ని త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్’ అనే టైటిల్‌ని ఖరారు చేయనున్నారట మేకర్స్. 14న జార్జ్ క్రిష్ ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న హీరో శర్వానంద్ తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ సినిమాకి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు జనవరి 14 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలి పారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’.‘శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాలతో పండుగ సీజన్ లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ప్రత్యేకమైనది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల చేస్తున్నాం. సంక్రాంతి సీజన్లో శర్వాకు ఉన్న విజయ వంతమైన ట్రాక్ రికార్డ్, కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలకు శ్రీను వైట్లకు ఉన్న పేరు, ఆసక్తిని రేకెత్తించేలా ఆకర్షణీయంగా రూపొందించిన టైటిల్... ఇలా వీటన్నింటితో ‘జార్జ్ క్రిష్’ పూర్తి స్థాయి పండగ వినోద చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు’’ అన్నారు మేకర్స్. 8న మహాకాళి ‘హను–మాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ఫీమేల్ సూపర్ హీరో సినిమా ‘మహాకాళి’. భూమిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్, శ్రియా రెడ్డి, ఖుష్బూ సుందర్, రాకేష్ బేడీ, సముద్ర ఖని, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీ శర్మ, నార్, బబ్లూ పృథ్వీరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు.ఈ మైథాలజీ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ స్పెక్టకిల్ మూవీ ‘మహాకాళి’. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌పై ఏర్పడిన క్యూరియాసిటీని ఈ గ్లింప్స్ మరింత పెంచింది.ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. ఇది కేవలం మంచి–చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయిలో యుద్ధం ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. శ్రియా రెడ్డి కూడా పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తారు. ‘హను–మాన్’ మూవీతో పీవీసీయూకు బలమైన పునాది వేసిన ప్రశాంత్ వర్మ భారతీయ ఇతిహాసాలను మోడరన్ విజువల్ ట్రీట్మెంట్తో తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని ‘మహాకాళి’తో మరింత భారీ స్థాయికి తీసుకెళ్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. 12న సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటించారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జనవరి 12 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు)’. ఇందులో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు దర్శకుడు రోహిత్ కేపీ. ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. షూ టింగ్ విజయవంతంగా ముగియడంతో ఆడియన్స్‌కి గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి పోస్ట్ ప్రోడక్షన్‌పై దృష్టి పెట్టాం’’ అని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.⇒ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ మూవీని డిసెంబరులో విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిర్స్లో వినిపించింది. అయితే డిసెంబరులో తన తనయుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే... సంక్రాంతికి ‘కింగ్ 100’ని విడుదల చేయాలన్నది మేకర్స్ ఆలోచన అట. పైగా సంక్రాంతి పండగ అంటే నాగార్జునకు బాగా కలిసి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. జనవరి 14న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ⇒ బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తున్న ఈ 111వ సినిమాకి ‘ఎన్బీకే 111’ అనే వర్కింగ్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఎన్బీకే 111’ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే బాలకృష్ణకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ⇒ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్ ’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనేది ఉప శీర్షిక. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశీఖన్నా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ధర్మన్’ పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా విడుదల కానుంది. 2027 పొంగల్‌కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులోనూ రిలీజ్ కావడం ఖాయం. ఈ రకంగా ‘ధర్మన్’ కూడా సంక్రాంతికి తెలుగు తెరపై సందడి చేయనుంది. ⇒ ‘వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు హీరో సూర్య. ఆయన హీరోగా నటించిన 47వ చిత్రానికి ‘ఆవేశం’ మూవీ ఫేమ్ జిత్తు మాధవ్ డైరెక్టర్. ‘సూర్య 47’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక నిర్మించారు. ఈ సినిమాని పొంగల్‌కి (సంక్రాంతి) రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. సూర్య చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ రకంగా ఈ మూవీ టాలీవుడ్‌లోనూ విడుదలవుతుందని ఊహించవచ్చు. – డేరంగుల జగన్ మోహన్ -
వదంతులు నమ్మకండి
‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు మహేశ్‌బాబు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో మహేశ్‌బాబు సినిమా చేస్తారనే వార్త మంగళవారం వైరల్‌గా మారింది. ఈ అంశంపై అదే రోజు సాయంత్రం తర్వాత అనిల్ రావిపూడి స్పందించారు. ‘‘మహేశ్బాబుగారంటే నాకు ఎంతో అభిమానం... గౌరవం. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదు. దయచేసి ఇలాంటి వదంతులు నమ్మకండి, వ్యాప్తి చేయకండి’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. మరోవైపు వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం అనిల్ రావిపూడి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది. -
స్పిరిట్ Vs వారణాసి.. సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు!
వచ్చే ఏడాది వేసవిలో నెల రోజుల గ్యాప్‌లో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలు కావడంతో ఈ గ్యాప్ సరిపోతుందా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతోంది.ఈ విషయంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సరదాగా స్పందించారు. స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అని చెప్పిన ఆయన.. అవసరమైతే వారణాసి చిత్రం కోసం కాస్త జరగడానికి తమకేం అభ్యంతరం లేదన్నాడు. ఈ రెండు సినిమాల విడుదల తేదీల మధ్య నెల రోజుల పైనే తేడా ఉండటంతో సాద్యమైనంతవరుకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. అయితే అదే టైమ్‌లో స్పిరిట్ మాత్రం చెప్పిన తేదీకి కచ్చితంగా వస్తుందని కూడా మరోసారి క్లారిటీ ఇచ్చాడు.రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్‌కు ఇంకా 65 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తానని సందీప్ వంగ తెలిపారు. అలాగే తన గత చిత్రాలకు వచ్చినట్టే ఈ సినిమాకు కూడా ‘A’ సర్టిఫికేట్ ఖాయమని చెప్పారు.యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
కొత్త వాళ్లతో కొత్త సినిమా.. రిలీజ్‌కు రెడీ
సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న మూవీ కొత్త సినిమా. ఈ చిత్రానికి అజర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో 'వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్' అనే ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పలువురు దర్శక నిర్మాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.నటుడు రాకేశ్ మాట్లాడుతూ..' నేను మా సినిమా కోసం లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చా. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మా మేనేజర్, ఇతర ఆఫీసర్స్ సహకారం అందిస్తారని కోరుకుంటున్నా. అందరం కొత్త వాళ్లం కలిసి కొత్త సినిమా చేశాం. మేము ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి'అని అన్నారు.నటుడు సురేశ్ మాట్లాడుతూ ..'ఒక సినిమాలో నేను మెయిన్ రోల్ చేశానని చెప్పుకునే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అజర్ నాకు అలాంటి అవకాశం కల్పించారు. సినిమా తీయడం ఈజీ అని అనుకోవద్దు. అది చేసే వారికే తెలుస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా కంప్లీట్ చేశారు అజర్. మీలాంటి పెద్ద వాళ్లు అండగా నిలబడితే మాలాంటి కొత్త వాళ్లం గుర్తింపు తెచ్చుకుంటాం' అని అన్నారు.డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ..'కొత్త వాళ్లం ఎవరూ సపోర్ట్ చేయరు అనుకున్నాం. కానీ మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ రోజు మా ఈవెంట్ కు పిలవగానే వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. సినిమా అనేది ప్రపంచంలో బలమైన మాధ్యమం. ఇలాంటి ప్రభావవంతమైన సినిమాను నేను కూడా రూపొందించాలనే ప్రయత్నం మొదలుపెట్టా. రోజూ ఏదో ఒక పని పూర్తి చేశాననే సంతృప్తితోనే ఉండేవాడిని. నా కథతో వేరే ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లకుండా నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. నేను కొత్త, నాతో పాటు కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు. కానీ మా ఊరిలోనే ఆడిషన్స్ చేసి టాలెంట్ ఉన్నవారిని తీసుకున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఈ సినిమా మేకింగ్ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ వచ్చాం. త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతున్నాం. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు: శోభిత
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల కోలీవుడ్ మూవీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ ఏడాది చీకటిలో అనే వెబ్ సిరీస్‌లో మెప్పించిన శోభిత.. వెట్టువం అనే తమిళ మూవీలో కనిపించనున్నారు. ప్రస్తుతం కెరీర్లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తన వైవాహిక జీవితానికి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లయిన ఏడాదిలో కెరీర్లో చైతూతో పాటు తాను కూడా ఫుల్ బిజీ పోయానని శోభిత వెల్లడించింది. పెళ్లైన కొన్ని వారాలకే షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. నేను అక్కడే దాదాపు 150 రోజులకు పైగా ఉన్నానని.. కేవలం నెలకొకసారి మాత్రమే చైతూను కలిసేదాన్ని అని శోభిత వివరించింది. ఇద్దరం సినిమా ఫీల్డ్ కావడంతో వర్క్‌లైఫ్, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేయడం సవాల్‌గా అనిపించిందని పంచుకుంది. అయితే కొన్ని నెలల తర్వాత మా కొత్త జీవితానికి అలవాటు పడ్డామని శోభిత చెప్పుకొచ్చింది. మా వైవాహిక బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామని తెలిపింది. మొదటి నుంచి నా పెళ్లి వేడుక పూర్తిగా సంప్రదాయ పద్ధతిలోనే జరగాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని అని వెల్లడించింది. కానీ నా రాష్ట్రానికి చెందిన వ్యక్తినే పెళ్లాడతానని.. అందులో ఓ హీరోకు భార్య అవుతానని మాత్రం తానెప్పుడు ఊహించలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ నా కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది శోభిత దూళిపాళ్ల. -
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా మరికొద్ది గంటల్లో(ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఉన్నాయి. అయితే సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ( చదవండి: అడ్వాన్స్ బుకింగ్స్కే 40+ కోట్లు.. ఫస్ట్‌డే 100 కోట్లు పక్కా!)ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారట. అయితే హింసాత్మక సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కువే ఉండడంతో ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా అన్నమాట. టాక్సిక్ స్టోరీ ఇదేనా?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, ట్రైలర్ బట్టి చూస్తే.. ఈ సినిమా కథనం ఇలా కొనసాగబోతుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా.. గోవా మాత్రం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ చాలా ఇల్లీగల్ దందాలు జరుగుతుంటాయి. డ్రగ్స్,మాఫియా యదేచ్ఛగా కొనసాగేవి. ఆ చీకటి రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి కొన్ని గ్రూపులు పోరాడుతుంటాయి. ఈ నేపథ్యంలో గోవాలో హింస మితిమీరిపోతుంది. వెన్నుపోట్లు, ఆధిపత్య పోరు ఉన్న ఇలాంటి ప్రపంచంలో రాయ(యష్) ఎలా ఎదిగాడు? సొంత చెల్లి గంగ(నయనతార)తో ఎందుకు పోరాటం చేయల్సి వచ్చింది? నాడియా (కియారా)తో రాయ ప్రేమాయణం కొనసాగింది? ఎలిజబెత్ (హ్యుమా ఖురేషి), రెబెకా (తారా సుతారియా), మెలిసా (రుక్మిణి వసంత్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుకోవాల్సిందే.టాక్సిక్ హైలెట్స్..ఈ సినిమాలో హైలెట్ ఏంటంటే.. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఇందులో రాయగా, రూమిగా కనిపించి అలరించాడట. మొత్తంగా మూడు డిఫరెంట్ గెటప్‌లో ఆయన కనిపించబోతున్నాడు. సినిమా విజువల్ ట్రీట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు రవి బస్రూర్ అదిరిపోయే బీజీఎం ఇచ్చాడట. అలాగే యాక్షన్ సీన్లు కూడా అదిరిపోయాయట. ముఖ్యంగా యష్, నయనతారల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. ఇక తెలుగులో దిల్‌రాజు అల్రెడీ కొంతమందికి సినిమా చూపించాడట. వారంతా సినిమా అదిరిపోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాలకే అంతా టాక్సిక్ ప్రపంచంలోకి వెళ్తారట. ఫస్టాఫ్‌లో వచ్చే బోల్డ్ సీన్లు, యాక్షన్ సీక్వెన్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని అంటున్నారు.రికార్డులు పక్కా.. అయితే సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ చిత్రం అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. అయితే వారిలో చాలా మంది సినిమా చూడకుండా 4 రేటింగ్‌లు ఇచ్చి ట్వీట్లు చేస్తున్నారు.బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. ఇక సెన్సార్ మెంబర్ని అని తనకు తానుగా చెప్పుకునే ఉమైర్ సందు మాత్రం ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు. బీగ్రేడ్ సినిమా అని, యానిమల్ మూవీకి కాపీలా ఉందని ట్వీట్ చేశాడు. అయితే అతని పోస్టులను అంతగా నమ్మే పరిస్థితి లేదు. ప్రతి సినిమాకి ఇలా రిలీజ్‌కు ముందే ఇష్టం వచ్చినట్లుగా రివ్యూ ఇస్తుంటాడు. ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమాకు నెట్టింట ఫుల్ క్రేజీ ఏర్పడింది. టాక్సిక్.బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. మరి నిజంగా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఒరిజినల్ రివ్యూ కోసం సాక్షి డాట్‌కామ్(sakshi.com)ని ఫాలో అవ్వండి. -
రవితేజ ఇరుముడి.. వంద కోట్లు వచ్చేశాయ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తాజాగా మరో క్రేజీ రికార్డ్ సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా సెంచరీ దాటేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేశారు.తండ్రీ, కూతురి కాన్సెప్ట్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వందమార్క్ను కేవలం ఐదు రోజుల్లోనే చేరుకుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించారు. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. With the blessings of Lord Ayyappa and the love from the audience, #Irumudi hits a century ❤🔥❤🔥 100 CRORES GROSS WORLDWIDE 🔥🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/QSJF8T3GrC— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026 -
ఆ ఒక్క మేసేజ్.. మూడేళ్లలో మూడు పాన్ ఇండియా చిత్రాలు..!
కన్నడ భామ రుక్మిణి వసంత్ గురించి ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఆమె నటించిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె కీలక పాత్రలో వస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. యశ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంతేకాకుండా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న డ్రాగన్‌లో రుక్మిణి వసంత్‌నే హీరోయిన్గా చేస్తోన్న సంగతి తెలిసిందే.అయితే ఇదంతా కేవలం మూడేళ్ల గ్యాప్‌లోనే జరిగిందంటే మీరు నమ్ముతారా? అవునండి.. రుక్మిణి వసంత్ మూడేళ్లలోనే మూడు పాన్ ఇండియా మూవీస్‌లో ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందు ఆమె ఎవరో కూడా కన్నడ ఇండస్ట్రీలో సరిగా తెలియదు. అలాంటి రుక్మిణి పేరు ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం వినిపిస్తుందంటే దానికి కారణం ఓకే ఒక్క మేసేజ్. ఆమె పంపిన ఒక ఇన్స్టాగ్రామ్ డీఎమ్ ఆమె కెరీర్‌నే ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇదే విషయాన్ని రుక్మిణి గత ఇంటర్వ్యూలోనే వెల్లడించింది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా తెలుసుకుందాం.రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ప్రేమకథా చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో'. ఈ మూవీకి హేమంత్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాత్ర కోసం ఎలా ప్రయత్నించిందో రుక్మిణి వెల్లడించింది. ఇది ఆమె రెండో ప్రాజెక్ట్ కావడం మరో విశేషం. ఈ రోల్ తనకు ఎలా దక్కిందన్న విషయాన్ని గత ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నారన్న విషయం తెలిసి ఇన్‌స్టాలో నేరుగా దర్శకుడికి ఒక మేసేజ్ చేశానని తెలిపింది.ఈ సినిమాలో ఛాన్స్ కావాలనే తన పట్టుదల గురించి రుక్మిణి చాలాసార్లు చెప్పింది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, ఈమెయిల్స్ ద్వారా పంపినట్లు వివరించింది. అలా ఈ చిత్ర బృందంలోని ఎవరైనా తనను గమనించి ఆడిషన్ ఇస్తారని ఆశించినట్లు తెలిపింది. ఈ మూవీ దర్శకుడు హేమంత్ రావు దాదాపు 10 రోజుల తర్వాత నా ఇన్స్టాగ్రామ్ మేసేజ్‌కు స్పందించారని వెల్లడించింది. అలా తనకు సప్త సాగరదాచే ఎల్లో మూవీలో ప్రియా అలియాస్ పుట్టి అనే పాత్ర దక్కేలా చేసిందని రుక్మిణి పేర్కొంది. ఈ మూవీ 2023 సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది.అలా కేవలం ఒకే ఒక్క మేసేజ్ రుక్మిణి జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత మూడేళ్లలోనే మూడు పాన్ ఇండియా చిత్రాల్లో ఛాన్స్‌లు కొల్లగొట్టింది. అయితే అంతకుముందే తెలుగులో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత విజయ్ సేతుపతి 'ఏస్' చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా శివకార్తికేయన్ సరసన 'మదరాసి' చిత్రంలో కూడా నటించింది. -
Toxic: ఇదేం క్రేజ్‌రా బాబూ.. ఫస్ట్‌డే రూ. 100 కోట్లు పక్కా!
కోడి కూయకముందే తెల్లారినట్టు.. విడుదల కాకముందే ఓ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అదే టాక్సిక్. కేజీఎఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ చిత్రం రేపు(ఆగస్టు 26)న తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. పలు భాషల్లో రేపు ఉదయం 6 గంటలకే షోలు ప్రారంభం కానున్నాయి. అయితే విడుదలకు ముందే..అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ చిత్రం భారీ వసూళ్లును సాధించింది. కర్ణాటకలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్లో అయితే ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ కాగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు పోయాయి. హిందీ వెర్షన్ గానూ భారీగానే టికెట్స్ బుక్ అవుతున్నాయి. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఈ చిత్రానికి రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.తెలుగులోనూ హవా.. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో తెల్లవారుజామున 6.30 గంటల నుంచే తొలి షోను ప్రదర్శించనున్నారు. మరోవైపు టికెట్లు ధరలను పెంచేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు మొత్తం 10 రోజుల పాటు సవరించిన ధరలు అమల్లో ఉండనున్నాయి. ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై అదనంగా రూ.50, మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో రూ.100 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.227గా, మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో రూ.395గా ఉండనుంది. ఏపీలో ఆగస్టు 26న ఉదయం 6 గంటల స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌ల్లో రేపటి షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి.(చదవండి: ‘టాక్సిక్’ కోసం యశ్ ఎంత తీసుకున్నాడు?)ఫస్ట్‌డే.. 100 కోట్లు పక్కా.. ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చిత్రానికి కర్ణాటక బాక్సాఫీసే అతి పెద్దది. యశ్ సొంత రాష్ట్రంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడం పక్కా. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. తమిళ, హిందీ భాషలతో కలుపుకొని మొత్తంగా ఫస్ట్‌డే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ షోకి హిట్ టాక్ వస్తే.. తొలి రోజే రూ. 150 కోట్లను కూడా సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, యశ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. యశ్‌తో కలిసి ఆమె కథ, స్క్రీన్‌ప్లేను రూపొందించారు. నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌లు హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ ఒబెరాయ్, డారెల్ డిసిల్వ, సుదేవ్ నాయర్, సంజీదా షేక్, కైల్ పాల్, అమిత్ తివారీ, సుర్జీత్ గోపీనాథ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా వ్యవహరించారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం అందించాడు. -
రవితేజ ఇరుముడి.. ఏ ఓటీటీకి రానుందంటే?
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రీ కూతుళ్ల కాన్సెప్ట్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే ఇరుముడి వందకోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ న్యూస్ వైరల్‌గా మారింది. థియేటర్లలో అదరగొడుతున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఏదనే విషయంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరుముడి ఓటీటీ పార్ట్నర్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత బుల్లితెరపై సందడి చేయనుంది. త్వరలోనే స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై ప్రకటన రానుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
అక్షయ్-సైఫ్ యాక్షన్ మూవీ.. ఫుల్ వయొలెంట్‌గా ట్రైలర్
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హైవాన్. ఈ మూవీని ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే నెల 11న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే హైవాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే మర్డర్స్ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ వయొలెంట్‌గా ఉండనుందని అర్థమవుతోంది. అక్షయ్- సైఫ్ మధ్య ఫైట్ సీన్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
యాంకర్ అనసూయ సందేహం.. ఈ సినిమా ఇచ్చిన సందేశం ఒక్కటే!
‘భర్త చనిపోతే బోట్టు, గాజులు ఎందుకు తీసెయ్యాలి?’ అంటూ ఇటీవల ప్రముఖ యాంకర్, నటి అనసూయ చేసిన వీడియో పోస్ట్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు. చాలా మంది అనసూయకు సపోర్ట్‌గానే పోస్టులు పెట్టారు. అలా బొట్టు, గాజులు తీసేయాలని ఏ శాస్త్రంలోనూ లేదని కామెంట్ బాక్సులో రాసుకొచ్చారు. మరికొంతమంది అనసూయను తప్పుపడుతూ పోస్టులు పెట్టారు. ఇదంతా పక్కన పెడితే.. అనసూయ బయటపెట్టిన సందేహాల మాదిరే.. కొన్నేళ్లుగా సమాజంలో పేరుకుపోయిన ఓ కట్టుబాటు వల్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. ఆ కట్టుబాటు తప్పు అని చాటి చెబుతూ ఓ సినిమా తెరకెక్కించారు. అదే వంద దేవళ్లు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం కథేంటి? ఇచ్చిన సందేశం ఏంటి? ఓ లుక్కేద్దాం.(చదవండి: ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ)భార్యభర్తల బంధమనేది అపూర్వం. ఆ అనుబంధమే కుటుంబ శ్రేయస్సుకు ఆధారం. జీవిత ప్రయాణంలో ఎక్కడైనా, ఏ రకంగానైనా ఆ బ్రహ్మముడి పొరపాటున చెరిగితే కుటుంబాలకు కుటుంబాలు కుదేలవుతాయి. అందుకే ఏడు జన్మల బంధం ఆ ఏడడుగుల సంబంధం అంటారు. భార్యభర్తలలో ఎవరో ఒకరు దూరమైతే మిగతా వారి బ్రతుకు భారమే. ఆ సమయంలో ఇటు దూరమైనవారి బాధ ఓ వైపైతే అటు సమాజం నుండి వచ్చే సెగ మరో వైపు. అయితే పోయినవారి కోసం కాకుండా ఉన్నవారి గురించి కన్నవారే ఆలోచిస్తే ఎలా ఉంటుందన్న ఇతివృత్తంతో వచ్చిన సినిమా నూరు దేవుళ్ళు. తమిళ సినిమా నూరు సామి దీనికి మాతృక.నిజానికి ఈ తరహా సినిమాలు ఇదివరకు ఎన్నో చూశాం. కాని ఈ సినిమాలో ఉన్న సహజత్వం, స్వచ్ఛత చాలా రోజుల తరువాత ప్రేక్షకులను పులకరిస్తూ పలకరిస్తుంది. ఇటీవల ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఈ విషయంపై చేసిన పోస్ట్ కూడా తెగ వైరలవుతోంది.ఈ సినిమాలో వర్ధమాన నటులు విజయ్ ఆంటోని, స్వాసిక తమ పాత్రల్లో జీవించారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ నరాలు తెగే ఉత్కంఠతతో నడుస్తుంది. సినిమా పూర్తయ్యాక చాలా మంది ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూశామని సంబరపడతారు. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓ సారి చూద్దాం. ఓ మారుమూల గ్రామంలో ఉన్న సెల్వి అనే వితంతువు కథ ఈ సినిమా. సెల్వికి ఇద్దరు చిన్నపిల్లలు. పెళ్ళైన అతి కొద్ది కాలంలోనే సెల్వి భర్త చనిపోతాడు. అసలే పేదరికంలో ఉన్న సెల్వి భర్త పోయిన బాధను దిగమింగుకోని కనిపించిన ప్రతి పని చేస్తూ పిల్లలను పెంచుతూ ఉంటుంది. కాలం గడుస్తూ పిల్లలకు యుక్తవయసు వస్తుంది. కాని అదే సమయంలో సెల్వికి రెండో పెళ్ళి చేసుకోవాలనిపించి పెద్ద కొడుకైన భాస్కర్ తో తన ఆలోచనను పంచుకుంటుంది. భాస్కర్ ఆ విషయం విన్నాక ససేమిరా అంటాడు. ఇక చేసేదిలేక సెల్వి పెళ్ళి ఆలోచనను విరమించుకుంటుంది. కాని కొద్ది సమయంలోనే ఇద్దరు పిల్లలు తమ కోసం అష్టకష్టాలు పడుతున్న తల్లికి ఓ తోడుండాలనే నిర్ణయానికి వచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి తెస్తారు. పక్క గ్రామంలో భార్యను పోగొట్టుకున్న ఎజుమలై తమ తల్లికి సరైన తోడని వారిద్దరికీ పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటారు. అటు సెల్వి కూడా ఒప్పుకోవడంతో అంతా బాగుంది అనుకునే లోపల సెల్వి బంధువులు, ఆ గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. మరి ఆ పిల్లలు ఆ తల్లి పెళ్ళి చేయగలరా లేదా అన్నది మాత్రం వంద దేవుళ్ళు సినిమాలోనే చూడాలి. ఏది ఏమైనప్పటికీ అవకాశం అందిపుచ్చుకోవడమే కాదు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ధైర్యం కూడా ఉండాలి అని చెప్పే ఈ సినిమా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. -
'పాలమ్మినా.. పూలమ్మినా అంటారు..' మా కష్టం కనిపించదా?
కికు యనమల, కశిష్ ఖాన్ ప్రధాన పాత్రల్లో సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ కికు చిరంజీవి. ఈ సినిమాకు శుభ సాయివెంకట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దీప్తి నడిమింటి నిర్మించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు హీరో కికు యనమల తమ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆంధ్రాలో కూడా పేరున్న కాలేజీల్లో నా మూవీ ప్రమోషన్ చేసుకున్నానని వెల్లడించారు. నా వల్ల సాధ్యమైనంత వరకు మూవీ ప్రమోషన్స్ చేస్తున్నానని తెలిపారు.కానీ హైదరాబాద్‌లో మాత్రం పేరు మోసిన కాలేజీ ప్రమోషన్ ఈవెంట్ కోసం అనుమతి అడిగితే కనీసం స్పందించలేదని హీరో యనమల ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పర్మిషన్ ఇస్తామని చెప్పి.. తర్వాత రెస్పాండ్ కాలేదన్నారు. ఆ పెద్దాయన ఓ పెద్ద సినిమా కోసం స్టేజ్ మీద నిలబడి నేను పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డా అని చెప్పుకునే వ్యక్తికి మా కష్టం కనిపించలేదా? అని హీరో ప్రశ్నించారు. ఒక సినిమా కోసం 75,000 మందిని ఆర్గనైజ్ చేశారు కానీ.. నా సినిమా కోసం కూడా కనీసం 700 మందిని ఆర్గనైజ్ చేసి ఉంటే.. చాలా హెల్ప్ అయ్యేదని అన్నారు.పోస్టర్స్ తీసేశారు..అంతేకాకుండా నా మూవీ పోస్టర్స్ ఓ థియేటర్ వద్ద తొలగించారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. మా మూవీ పోస్టర్ ప్లేస్‌లో యశ్ టాక్సిక్ ఉందన్నారు. మన తెలుగు సినిమాలకు మనవాళ్లు సపోర్ట్ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. కనీసం టాక్సిక్ పోస్టర్ పక్కనైనా నా పోస్టర్ పెట్టొచ్చు కదా... తీసి పడేయడం ఎందుకన్నారు. పేరుమోసిన ఓ కాలేజీలో మూవీ ప్రమోషన్స్ కోసం ముందుగా పర్మిషన్ ఇస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.అదే పెద్దాయన పెద్ద సినిమా కోసం స్టేజ్ మీద నిలబడి “నేను పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డాను” అని చెబుతుంటే చాలా బాధ అనిపించింది.ఆ సినిమా కోసం… pic.twitter.com/KQqboSQAVf— Tupaki (@tupaki_official) August 25, 2026 -
'హీరోయిన్‌తో ఇబ్బంది.. డబ్బుల కోసం టార్చర్'
కికు యనమల, కశిష్ ఖాన్ ప్రధాన పాత్రల్లో సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ కికు చిరంజీవి. ఈ సినిమాకు శుభ సాయివెంకట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దీప్తి నడిమింటి నిర్మించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు నిర్మాత దీప్తి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఓ షాకింగ్ విషయాన్ని పంచుకుంది. ఈ మూవీకి హీరోయిన్ తనను చాలా ఇబ్బంది పెట్టిందని తెలిపింది. ఆమెకు డబ్బులు ఇస్తే కానీ క్యారవాన్ దిగనని చెప్పేదని వెల్లడించింది. చిన్న చిన్న డిమాండ్స్ పూర్తి చేయకుంటే తాను షూట్‌కు రానని చెప్పేదని నిర్మాత పేర్కొంది.(ఇది చదవండి: ఇంకెప్పుడు మారుతారు?.. వివాదంపై కృతి సనన్ రియాక్షన్)అయితే పేమేంట్ విషయంలో మాకు కొన్నిసార్లు ఇబ్బందులొచ్చాయని దీప్తి వెల్లడించింది. మా బడ్జెట్ ఓవర్‌షూట్ కావడంతో లాస్ట్ షెడ్యూల్లో ఇబ్బంది పడ్డామని తెలిపింది. అలాంటి టైమ్‌లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని పేర్కొంది. అగ్రిమెంట్ ప్రకారం ఆమెకు ప్రమోషన్స్ అయిపోయాక కేవలం రూ.లక్ష నాలుగు వేలు చెల్లించాలని నిర్మాత తెలిపింది. తాను మా ప్రమోషన్‌కు ఈవెంట్‌కు రాలేదు.. అందుకే ఆమెకు నేను డబ్బులు ఇవ్వాలనుకోవడం లేదని నిర్మాత దీప్తి స్పష్టం చేసింది. ఈ డబ్బులు తిరుపతి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్లకు డొనేట్ చేస్తున్నానని నిర్మాత దీప్తి ప్రెస్ మీట్లోనే ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వివా రాఘవ, రాజీవ్ రవిచంద్ర, శ్రీరామ్ వెంకట్, రామ్ జగన్ కీలక పాత్రల్లో నటించారు. -
ఇంకెప్పుడు మారుతారు?.. వివాదంపై కృతి సనన్ రియాక్షన్
ఆదిపురుష్ భామ కృతి సనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. తాను నటించిన రక్షాబంధన్ యాడ్‌తో విమర్శల పాలైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ.. సంప్రదాయ దుస్తులు కాకుండా వెస్టర్న్ డ్రెస్‌లో కనిపించింది. ఇదే వివాదానికి కారణమైంది. హిందూ పండుగను అవమానించేలా కృతి సనన్ వ్యవహరించారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోదరుడికి ప్రేమతో కట్టే రాఖీని కుక్కకు కట్టడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.తాజాగా తనపై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ భామ స్పందించారు. పండుగ అనేది భావోద్వేగాలు, సంప్రదాయాలతో కూడుకున్నదని తెలిపింది. అంతేకానీ ఒక మహిళ ధరించే దుస్తులపై ప్రభావం ఉండదని రాసుకొచ్చింది. ఈ వేడుకల్లో తన పెంపుడు జంతువును చేర్చాలనే ఆలోచన సరైందేనని.. కుక్కలు కూడా కుటుంబంలో భాగమేనని వెల్లడించింది. ఈ వివాదంపై ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.కృతి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మన పండుగల సారం మనం ధరించే దుస్తుల్లో ఉండదు. అది సంప్రదాయాల పట్ల మీకు ఉండే భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. రక్షాబంధన్ అనేది ఒక రక్షణ బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒక సోదరుడు ఎలాగైతే రక్షణగా ఉంటారో.. మేము కూడా అలాగే రక్షించుకోగలమని మాకు తెలుసు. తాను, తన సోదరి ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు కోసం ప్రార్థించుకుంటాం. ఇది మా ఇంట్లో కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవీ కూడా మా కుటుంబంలో సభ్యులే కదా " అని పోస్ట్ చేసింది.అంతేకాకుండా మనం మహిళలు ఏమి ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతామని కృతి సనన్ ప్రశ్నించింది. ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని ఆమె దుస్తులను బట్టి అంచనా వేసే పద్ధతిని కృతి తప్పుపట్టింది. ఎథ్నిక్ ఫ్యాషన్ సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.. కానీ ఇప్పటికీ ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని కేవలం ఆమె దుస్తులతోనే కొలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మన సంస్కృతి, సంప్రదాయాలు అనే మహిళ హృదయంలో ఉంటాయి.. అంతే కానీ ఆమె మెడలో కాదంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి రొమాంటిక్ కామెడీ-డ్రామా కాక్టెయిల్ -2లో కనిపించింది. గతేడాది 'తేరే ఇష్క్ మే'లో ధనుష్ సరసన కూడా హీరోయిన్గా మెప్పించింది. -
ఇరుముడి సూపర్ హిట్.. బేబీ నక్షత్రకు బంపరాఫర్..!
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. హిట్ కావడంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు ఇరుముడి టీమ్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఇరుముడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మూవీ టీమ్ పంచుకుంది. ఈ ఈవెంట్లో బేబీ నక్షత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బేబీ నక్షత్రపై డైరెక్టర్ శివ నిర్వాణ సైతం ప్రశంసలు కురిపించారు.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అందరి కళ్లు బేబీ నక్షత్రపై పడ్డాయి. ఈ చిత్రంలో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర మెప్పించింది. దీంతో ఈ అమ్మాయికి ఇరుముడి మేకర్స్ బంపరాఫర్ ఇచ్చారు. భవిష్యత్తులో హీరోయిన్ అవ్వాలనే ఆసక్తి ఉంటే తమ బ్యానర్లో హీరోయిన్గా అవకాశమిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నక్షత్ర అద్భుతంగా నటించారని కొనియాడారు. తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ అవకాశం ఇచ్చారని బేబీ నక్షత్ర వెల్లడించింది.తండ్రి లేకపోయినా..ఈ మూవీలో అందరినీ ఆకట్టుకున్న బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తండ్రి లేరనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించిందని శివ నిర్వాణ వెల్లడించారు. తండ్రి లేని లోటును ఎదుర్కొంటూనే.. ఇంత చిన్న వయసులో ఆమె చూపిస్తున్న ధైర్యానికి నిజంగా అభినందనీయం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తల్లిని స్టేజ్‌పైకి తీసుకొచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా తన కూతురిని సపోర్ట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణకు నక్షత్ర తల్లి ధన్యవాదాలు తెలిపారు. -
బ్రహ్మాస్త్ర-2లో రణ్‌బీర్‌కు జోడిగా యంగ్ హీరోయిన్
2022లో విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర-2’పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌తో పాటు పలువురు ప్రముఖ నటులు కనిపించనున్నారు. తొలి పార్ట్‌లో పలు ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో రెండో పార్ట్‌కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చేతిలో ఓ చిన్నారిని పట్టుకుని..ముఖ్యంగా తొలిభాగం పోస్ట్ క్రెడిట్ సన్నివేశంలో దీపికా పదుకొణే పాత్రను పోలిన ఓ మహిళను చూపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ముఖాన్ని మాత్రం చూపించలేదు. చేతిలో ఓ చిన్నారిని పట్టుకుని కనిపించడంతో.. రెండో భాగంలో ఆమె పాత్ర కీలకంగా ఉండొచ్చనే ఊహాగానాలు వచ్చాయి.యువనటి పేరు వైరల్..ఇదిలా ఉండగా.. తాజాగా ‘సయ్యారా’ చిత్రంలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువనటి అనీత్ పడ్డా. ఈ పేరు ‘బ్రహ్మస్త్ర2’ కోసం వినిపిస్తోంది. ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా కీలక పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే చిత్రం బృందం ఆమెను సంప్రదించినట్లు టాక్. అయితే ఈ ఎంపిక అధికారికంగా ఖరారు కాలేదని తెలుస్తోంది. అనిత్ పడ్డా సినిమాలో భాగమైతే ఓ యువనటిని ఈ భారీ ఫ్రాంచైజీలో చూడటం ఆసక్తికరంగా మారనుంది. ఇదీ చదవండి: ‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్‌లో వార్నర్ -
‘బికినీ డ్రెస్‌లో రాఖీ కట్టాల్సి అవసరం ఏంటి..?’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఓ రక్షా బంధన్ జ్యువెలరీ యాడ్ గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతోంది. ఈ ప్రకటనలో కృతి సనన్ స్కర్ట్ ధరించి గ్లామరస్‌గా కనిపించారు. అయితే పవిత్రమైన రాఖీ పండగ యాడ్‌లో గ్లామర్ షో చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయమై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా తనదనైన సైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘మహిళలకు డ్రెస్ ఎంపికలో ఎన్నో రకాల ఆప్షన్లు ఉన్నాయి. మన దగ్గర జీన్స్, చీరలు, సల్వార్ కమీజ్ నుంచి కాక్టైల్ డ్రెస్సుల వరకు మరెన్నో మంచి దుస్తులు ఉన్నాయి. వాటిని వదిలి సోదరుడికి బికినీ, లోదుస్తుల వేసుకుని రాఖీ కట్టాల్సిన అవసరం ఏంటి?. ఈ యాడ్ కూడా కావాలనే వివిదాస్పదంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది’ అని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ మండిపడ్డారు. అయితే ఈ యాడ్‌పై అటు కృతి సనన్గానీ, యాడ్ యాజమాన్యం గానీ ఏవిధంగా స్పందించలేదు. ఇదీ చదవండి: విలన్‌గా మెప్పించిన జబర్దస్త్ నటుడు -
విలన్‌గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
జబర్దస్త్ అనగానే కామెడీ, పంచులు, విభిన్నమైన గెటప్స్ గుర్తుకొస్తాయి. ఆ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన వారు ఉన్నారు. అదే షోతో వివాదాలపాలు అయినవారూ ఉన్నారు. అలా దగ్గరయిన వారే కొమురం. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు లేడీ గెటప్స్‌తో అలరించిన ఆయన.. యాంకరింగ్ చేస్తూ కూడా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమాలో కొమురం కాస్త నాగులుగా కనిపించి మరో సారి ప్రేక్షకులను ఆశ్చర్చపరిచాడు.మరో కోణం..కామెడీతో నవ్వించిన నటుడు.. సీరియస్ విలనిజంలో మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ ఇది కూడా సాధ్యం అవుతుందని కొమురం నిరూపించాడు. రవితేజ హీరోగా వచ్చిన ‘ఇరుముడి’ సినిమాలో నాగులుగా కనిపించాడు. సీరియస్ బాడీ లాంగ్వేజ్, హావాభావాలు, డైలాగ్ డెలివరీతో విలన్ పాత్రకు న్యాయం చేశాడు. కామెడీగా పరిచయం అయిన ప్రేక్షకులకు సినిమాలో నెగెటివ్ షేడ్‌లో కనిపించి తనలోని మరో కోణాన్ని చూపించాడు. దాదాపు 12 సంవత్సరాలు కొమురక్క పాత్రలో కనిపించి ఒక్కసారిగా విలన్‌గా మారిన తన అనుభవాన్ని, తనకు ఈ అవకాశమిచ్చిన వారికోసం మూవీ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ డైరెక్టర్‌తో సహ అక్కడ ఉన్న వారిని కంటితడి తెప్పించాడు.నా ఫోన్ మోగుతూనే ఉంది..‘ నన్ను చాలా మంది అవమానించారు. నాతో కలిసి రూమ్‌లో ఉన్న దాదాపు 15మంది డైరెక్టర్స్ అయ్యారు. నాకోసం వారికి పూర్తిగా తెలుసు. కానీ వాళ్లు నాలో నటుడిని మాత్రం గుర్తించలేకపోయారు. శివ నిర్వాణ ఎవరో తెలీదు. కానీ ఈ పాత్ర ఇచ్చారు. మూడు రోజుల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ డైరెక్టర్ వల్లే కొమురక్క నుంచి నాగులుగా మారిపోయా. 12 ఏళ్లగా నన్ను చూసిన భార్య ‘ఇరుముడి’ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయింది. నేను మరణించే వరకు శివ నిర్వాణ అన్నను మర్చిపోను. ఒక వేళ మర్చిపోతే మనిషినే కాను’ అంటూ భావోద్వేగానికి గురవుతూ మాట్లాడాడు.ప్రశంసల వెల్లువమొత్తానికి ఇప్పటి వరకు నవ్వించిన కొమరం.. నాగులుగా మెప్పించాడు. కామెడీ నటుడిగా ముద్ర పడిన ఓ ఆర్టిస్ట్.. చాలా అనుభవం ఉన్న సీరియస్ నెగిటివ్ రోల్లో నటించి తన సత్తా చాటుకోవడం విశేషమనే చెప్పాలి. అటు తన నటన చూసిన ప్రేక్షకులు సైతం అతన్ని మెచ్చుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: డూప్నకు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్..! -
అయ్యప్ప వారం మొదలైంది! ఇరుముడికి కలెక్షన్ల జోరు
-
డూప్నకు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్..!
సల్మాన్ ఖాన్ బాడీ డబుల్( డూప్) పర్వేజ్ కాజీ ఇటీవల అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని పర్వేజ్ మేనేజర్ పీయూష్ స్పష్టం చేశారు. ఆగస్టు 6న ఇంట్లో ఉన్న సమయంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వైద్యులను సంప్రదించామని. పరీక్షల అనంతరం ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. వైద్యులు స్వల్పంగా గుండె శస్త్రచికిత్స నిర్వహించారని పేర్కొన్నారు.వెంటనే సాయం చేశారు..‘పర్వేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే సల్మాన్ ఖాన్ స్పందించారు. మెరుగైన వైద్యం అందేలా స్వయంగా అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు. సల్మాన్ సర్ పర్వేజ్‌ను తమ్ముడిలా భావిస్తారు. విషయం తెలిసిన వెంటనే సాయం చేశారు’ అని పీయూష్ చెప్పారు. కాగా ప్రస్తుతం పర్వేజ్ కోలుకుంటున్నారని, మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.షూటింగ్‌పై ప్రభావం.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నయనతారతో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘మాన్స్టర్’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్లో ఉన్నారు. పర్వేజ్ ఆరోగ్య కారణాలతో కొన్ని రోజులు విరామం తీసుకోవడంతో యాక్షన్ సన్నివేశాలపై ప్రభావం పడుతుందనే వార్తలు వచ్చాయి. ఆయన తిరిగి సెట్స్‌కు వచ్చిన తర్వాత స్టంట్ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేసి, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ముంబై ఫిల్మ్ సిటీలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోలో అఫ్గాన్ గ్రామాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. కొరియన్ యాక్షన్ బృందం కూడా స్టంట్స్ కోసం పనిచేస్తోందట. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.ఎవరీ పర్వేజ్ కాజీ?పర్వేజ్ కాజీ చాలా ఏళ్లుగా సల్మాన్ ఖాన్‌కు బాడీ డబుల్‌గా పనిచేస్తున్నారు. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘రేస్ 3’, ‘భారత్’, ‘దబాంగ్ 3’, ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ తదితర చిత్రాల్లో సల్మాన్‌కు డూప్‌గా కనిపించారు.ఇదీ చదవండి: త్వరలో రాబోయే థిల్లర్ సినిమాపై కాపీరైట్ వివాదం..! -
ఓటీటీలో రాబోయే థిల్లర్ సినిమాపై కాపీరైట్ వివాదం..!
తాప్సీ పన్ను.. ‘గాంధారి’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై తాజాగా కాపీరైట్ వివాదం మొదలైంది. ఈ సినిమా కథ 2019లో రాసి తాను రిజిస్టర్ చేసిన కథాంశంతో పోలి ఉందని కల్యాణ్ బండి అనే రచియిత ఆరోపించారు. తాను రాసిన కథలో కూడా చిన్నారి కిడ్నాప్, చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఓ తల్లి తన బిడ్డను రక్షించేందుకు పోరాడుతుందని, ఆ క్రమంలో ఆమెను ఉగ్రరూపం దాల్చిన దేవతగా చూపించానని ఆయన తెలిపారు. 2019లో ఈ కథను అప్పటి వూట్ సంస్థలో ఉన్న మోనికా షెర్గిల్‌కు పంపినట్లు చెప్పారు. అనంతరం స్కీృరైటర్స్ అసోసియేషన్‌లో కథ, సారాంశాన్ని రిజిస్టర్ చేసినట్లు పేర్కొన్నారు. రూ.40లక్షల పరిహారం..2025లో నెట్‌ఫ్లిక్స్‌లో ‘గాంధారి’ ప్రకటన వచ్చినప్పుడు తన కథతో పోలి ఉన్నట్లు గమనించానని కల్యాణ్ తెలపారు. ఈ విషయంపై 2025లోనే నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపి సుమారు 40 లక్షల పరిహారం కోరినట్లు వెల్లడించారు. అయితే తనకు డబ్బు కంటే తన ఆలోచనకు గుర్తింపు, క్రెడిట అభించడమే ముఖ్యమని చెప్పారు. ఆరోపణలను ఖండిస్తూ..మరోవైపు కనికా ధిల్లాన్‌కు చెందిన కత్త పిక్చర్స్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ‘గాంధారి’ పూర్తిగా ఒరిజినల్ కథ అని.. కనికా ధిల్లాన్ స్వయంగా కథను రచించినట్లు స్పష్టం చేశారు. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీతో పాటు ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ తదితరులు నటించారు. సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఇదీ చదవండి: మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రవితేజ, శ్రీ విష్టు మల్టీస్టారర్ మూవీ.! -
మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రవితేజ, శ్రీ విష్టు మల్టీస్టారర్ మూవీ.!
మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ విజయం మంచి ఊరటనిచ్చింది. వరుస పరాజయాలతో కొంతకాలంగా సతమతమవుతున్న ఆయనకు ఈ సినిమా ఓ విజయాన్ని తెచ్చిపెట్టింది. తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి కళ్లు చెదిరే కలెక్షన్లు రాబెట్టింది. ఇప్పుడు రవితేజ తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది.త్వరలో హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణుతో కలిసి రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఫుల్ ఎంటర్టైనర్గా తీయబోయే ఈ సినిమాను దిల్‌రాజు నిర్మాతగా ఉండనున్నట్లు టాక్. ఈ సినిమాను తొలిత ఆగస్టు చివరిలో ప్రారంభించాలని మేకర్స్ భావించారట. కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. -
ఊహించని జానర్
కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి ప్రధాన పాత్రధారులుగా అనూష్ గోరక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కేఏ ప్రొడక్షన్స్ , పౌర్ణమి ఎంటర్టైన్ మెంట్స్‌పై కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై నిర్మాతలు. సోమవారం ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇలాంటి కథను మీరు ఇప్పటి దాకా తెరపై చూసి ఉండరు. ఇలాంటి జానర్‌ను మీరు (ప్రేక్షకులను ఉద్దేశించి కావొచ్చు) ఊహించలేరు’ అనే క్యాప్షన్స్ ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌పై ఉన్నాయి. జేసిన్ జార్జ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వినీల సాహిత్య, కుష్లు సహ–నిర్మాతలు. -
ప్రేక్షకుల స్పందనతో కళ్లు చెమర్చాయి: రవితేజ
‘‘ఇరుముడి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు ఇప్పుడు మళ్లీ ‘ఇరుముడి’కి థియేటర్‌కి రావడం భావోద్వేగంగా అనిపించింది’’ అని హీరో రవితేజ చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జోడీగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం(ఆగస్టు 21) విడుదలయింది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ–‘‘ఇరుముడి’ చూస్తున్నప్పుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్‌తో ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిర్మాతలు రవి, నవీన్‌లతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాతో ఇంత మంచి సినిమా చేసినందుకు శివ నిర్వాణకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్‌కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో కావేరిలాంటి పాత్ర ఇచ్చినందుకు శివ నిర్వాణగారికి ధన్యవాదాలు’’ అన్నారు ప్రియా భవాని శంకర్. ‘‘ఈ సినిమాకి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది’’ అని వై. రవిశంకర్ పేర్కొన్నారు. ‘‘ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని నవీన్ యెర్నేని తెలిపారు. నటుడు సాయికుమార్, నటి స్వసిక, బేబీ నక్షత్ర, కెమెరామేన్ విష్ణు శర్మ, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు మాట్లాడారు. -
హైదరాబాద్‌లో ధర్మన్
హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు ధర్మన్ . రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ధర్మన్ ’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో సిమ్రాన్ , రాశీఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ , ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ మూవీలో ధర్మన్ అనే డాక్టర్‌గా రజనీకాంత్ నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందని తెలిసింది.ఈ షెడ్యూల్లో రజనీకాంత్‌పై కొన్ని కీలక సన్నివేశాలను, ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేలా అశ్వత్ ప్లాన్ చేశారట. అలాగే ఈ చిత్రంలో హీరో రామ్ పోతినేని ఓ కీలక పాత్రలో నటించనున్నారని, ఆయన క్యారెక్టరైజేషన్స్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘ధర్మన్ ’ కొత్త షూటింగ్ షెడ్యూల్లో అతి త్వరలో రామ్ కూడా పాల్గొంటారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతేకాదు.. కథ రీత్యా ఈ చిత్రంలో రజనీకాంత్–రామ్ మామ అల్లుళ్ళుగా కనిపిస్తారట. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ధర్మన్ ’ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. -
నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.2,000..? మరి 'టాక్సిక్'కి ఎంతో తెలుసా?
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నయనతార తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మొదటి జీతం గురించి వెల్లడించింది. తాజాగా నయనతారను ఆమె తొలి ఉద్యోగం గురించి అడిగారు. దీనికి స్పందించిన నయనతార.. తన మొదటి పని ఓ మ్యాగజైన్ కవర్ షూట్ అని గుర్తుచేసుకుంది. ఓ ఫ్యాషన్ కార్యక్రమం కోసం తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో తనకు వచ్చిన పారితోషికం కేవలం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు మాత్రమే అని నయనతార చెప్పింది. ఆ చిన్న మొత్తంతో ప్రారంభమైన తన కెరీర్.. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగే స్థాయికి చేరుకోవడం విశేషం.నయనతార చాలా కాలంగా సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మోడలింగ్ ద్వారా సినీరంగం దృష్టిని ఆకర్షించిన ఆమె 2003లో ‘మనస్సినక్కరే’ సినిమాతో నటిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాగజైన్లో నయనతార ఫొటోలు చూసిన దర్శకుడు సత్యన్ ఆమెకు తొలి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ‘అయ్యా’, ‘చంద్రముఖి’ చిత్రాలతో తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది.రజనీకాంత్‌తో చేసిన చంద్రముఖి సినిమా నయనతార కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఆమె పాపులర్ అయింది. అదే టైమ్‌లో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల వైపు ఫోకస్ పెట్టింది. అవి సక్సెస్ కావడంతో తిరుగులేని లేడీ సూపర్‌స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంది. వరుస విజయాలతో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయనతార 2023లో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’తో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంటే.. కేవలం రూ.3 వేలతో మొదలైన ఆమె సినీ ప్రయాణం ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి చేరింది. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో యశ్‌తో ఆమె నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధమైంది. -
అల్లు అర్జున్ రాకా.. మరో భామ రాక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ రాకా. ఈ మూవీకి అట్లీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. వీటిలో ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇటీవలే మంచు లక్ష్మీ సైతం రాకా షూటింగ్ సెట్ అద్భుతంగా ఉందంటూ కొనియాడింది.ఈ నేపథ్యంలో రాకాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీలో నలుగురు భామలు కనిపించనున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. లేడీ విలన్ పాత్ర పోషించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం ముంబయిలో వేసిన ఓ భారీ సెట్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో సెట్‌ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అక్కడ చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్భ్, ఫెమినా జార్జ్, నైలా గ్రేవాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నారు.


