ఫైట్‌ సెట్‌ | Sharwa Bhogi commences high-octane action shoot | Sakshi
Sakshi News home page

ఫైట్‌ సెట్‌

Feb 22 2026 5:37 AM | Updated on Feb 22 2026 5:38 AM

Sharwa Bhogi commences high-octane action shoot

శర్వానంద్‌ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘భోగి’. సంపత్‌ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లోప్రారంభమైంది.  ఓ భారీ సెట్‌లో శర్వానంద్‌ పాల్గొంటుండగా స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌ నేతృత్వంలో రెండు భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఈ భారీ షెడ్యూల్‌ పూర్తయ్యేవరకు ఈ షూట్‌లోనే శర్వానంద్‌ పాల్గొంటారు. ‘‘1960 నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ చిత్రంలో శర్వానంద్‌ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement