నానికి హీరోయిన్‌గా బోల్డ్ బ్యూటీ? | Actor Nani Next With Animal Fame Tripti Dimri | Sakshi
Sakshi News home page

Nani: 'స్పిరిట్' భామని రంగంలోకి దించుతున్న నాని?

Feb 21 2026 9:21 PM | Updated on Feb 21 2026 9:21 PM

 Actor Nani Next With Animal Fame Tripti Dimri

టాలీవుడ్‌లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని.. ప్రస్తుతం 'ప్యారడైజ్'తో బిజీగా ఉన్నాడు. మరోవైపు 'ఓజీ' సుజీత్ దర్శకత్వంలో త్వరలో ఓ మూవీని ప్రారంభించబోతున్నాడు. ఇవి కాకుండా మరికొన్ని లైన్‌లో ఉన్నాయి. ఇలా కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న నాని.. ఇప్పుడు ఓ బోల్‌ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడట.

(ఇదీ చదవండి: ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు)

పలు హిందీ చిత్రాల్లో నటించిన తృప్తి దిమ్రికి.. సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' మూవీ ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్‌లో వరస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన సందీప్ వంగా తీస్తున్న 'స్పిరిట్'లో ప్రభాస్‌కి జోడీగా చేస్తోంది. మరి మెయిన్ లీడ్ లేదా సెకండ్ హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. ఇదలా ఉండగానే ఇప్పుడు నాని చేయబోయే ఓ మూవీ కోసం తృప్తిని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే తృప్తి.. టాలీవుడ్ ఎంట్రీ చిత్రం ఇదే కావొచ్చు.

గత కొన్ని సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టిన నాని.. అందుకు తగ్గట్లే బాలీవుడ్‌లో మెల్లమెల్లగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'ప్యారడైజ్'లోనూ ఓ కీలక పాత్ర కోసం రాఘవ్ జ్యూయెల్ అనే నటుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు తృప్తి పేరు వినిపిస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజముందో?

(ఇదీ చదవండి: 18 ఏళ్లప్పుడు రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా)

Advertisement
 
Advertisement
Advertisement