10 జంటలతో కపుల్‌ షో.. కంటెస్టెంట్స్‌ వీళ్లే! | Hotstar Special: Mad For Each Other Reality Show Details | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ తరహాలో కొత్త రియాలిటీ షో.. ఆ 10 జంటలు వీళ్లేనా?

Feb 21 2026 7:33 PM | Updated on Feb 21 2026 7:39 PM

Hotstar Special: Mad For Each Other Reality Show Details

రియాలిటీ షోలంటే జనాలకు భలే ఇష్టం. రీల్‌ లైఫ్‌లో సెలబ్రిటీలను చూసి ఆరాధించే ప్రేక్షకులు వారు రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని తెగ తహతహలాడుతుంటారు. అందుకేగా బిగ్‌బాస్‌ షో అనేక భాషల్లో ఫేమస్‌ అయింది. బిగ్‌బాస్‌ తరహాలోనే హిందీలో ఇటీవల ద 50 అనే షో కూడా మొదలైంది. ఇప్పుడు తెలుగులో ఒక కపుల్‌ షో రాబోతోంది. అదే మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌. ది అల్టిమేట్‌ టెస్ట్‌ ఆఫ్‌ లవ్‌ అనేది క్యాప్షన్‌.

10 జంటలు - 70 రోజులు
ఈ షోలో సెలబ్రిటీ జంటలు మాత్రమే పాల్గొననున్నారు. అందులో పెళ్లయినవాళ్లున్నారు. పెళ్లి చేసుకోకుండా డేటింగ్‌లో ఉన్నవారూ ఉన్నారు. 10 సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజులపాటు ఉండనున్నారు. ఈ జంటల మధ్య ప్రేమ, రొమాన్స్‌, డ్రామా.. ఇలా అన్ని ఎమోషన్స్‌ చూపించనున్నారు. షో నిర్వాహకులు పెట్టే ప్రేమ పరీక్షలను వీరు ఎలా దాటుతారు? అన్నది ఆసక్తికరంగా ఉండనుంది.

ఆ జంటలెవరంటే?
ప్రస్తుతం సోషల్‌మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఆ 10 జంటలెవరో ఓసారి చూసేద్దాం.. అమర్‌దీప్‌- తేజు, హరిత- హరీశ్‌, ప్రియాంక- శివకుమార్‌, అంజలి - పవన్‌ సంతోష్‌, నటరాజ్‌ మాస్టర్‌- నీతూ, సోనియా సింగ్‌- సిద్ధు, జబర్దస్త్‌ నూకరాజు- ఆసియా, సాండ్రా- మహేశ్‌బాబు, వాసంతి - పవన్‌ కల్యాణ్‌, శుభశ్రీ రాయగురు- అజయ్‌.

అప్పుడే ప్రారంభం?
వీరిలో అమర్‌దీప్‌, హరీశ్‌ (మాస్క్‌ మ్యాన్‌), ప్రియాంక జైన్‌, నటరాజ్‌ మాస్టర్‌, వాసంతి కృష్ణన్‌, శుభశ్రీ.. వీళ్లందరూ బిగ్‌బాస్‌ ద్వారా బుల్లితెర ఆడియన్స్‌కు దగ్గరైనవారే! మార్చి 2వ వారంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో హాట్‌స్టార్‌లో ఈ షో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో వచ్చిన బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష బాగానే హిట్టయింది. మరి మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి!

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement