హీరోగా రెండు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. అయినా సరే వరస వివాదాలతో వార్తల్లో నిలిచాడు చంద్రహాస్. ఈ నెల ప్రారంభంలో 'బరాబర్ ప్రేమిస్తా' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఇదొక సినిమా ఉందని కూడా తెలియనంతగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దీని రిలీజ్ టైంలోనే 'గుంజీ గుంజీ' అనే బూతు పాట పాడి వివాదానికి కారణమయ్యాడు. ఓ జర్నలిస్టుకి వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. తన గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు.
ఇప్పటికీ తాను ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాలేదని చెప్పిన చంద్రహాస్.. అప్పట్లో ఏ మాత్రం కోపం వచ్చినా సరే ఎవరనేది చూడకుండా చేయెత్తి కొట్టేసేవాడినని చెప్పుకొచ్చాడు. అలానే ప్రదీప్ రంగనాథన్ తీసిన 'డ్రాగన్' సినిమా తన బయోపిక్ అని అన్నాడు. అందులో చూపించినట్లే.. తాను కూడా నిజజీవితంలో చివరి సెమిస్టర్‌లో ఒకేసారి 26 సబ్జెక్టులు క్లియర్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.
(ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)
అప్పట్లో తన తండ్రి స్పైడర్ మ్యాన్ డ్రస్ కొనిస్తే.. దాన్ని వేసుకుని కింద ఇంటిలో ఉన్న పిల్లలకు చూపిస్తే.. డ్రస్ వేసుకుంటే సరిపోదు. స్పైడర్ మ్యాన్‌లా ఎగరాలి అని చెప్పేసరికి రెండో ఫ్లోర్ నుంచి కిందకు దూకేశానని కూడా చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. అవకాశం లభిస్తే దర్శకులతో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగాతో పనిచేయాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ ఈ వీడియో బిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రహాస్ విషయానికొస్తే టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు. తొలుత 'రామ్‌నగర్ బన్నీ' అనే మూవీ చేశాడు. 2024లో ఇది థియేటర్లలోకి వచ్చింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీని ప్రమోషన్ల టైంలోనే కాస్త వింతగా ప్రవర్తించడం, మాట్లాడటంతో యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. ఈ పేరుని తనకు ట్యాగ్‌గా పెట్టేసుకున్న చంద్రహాస్.. తొలి రెండు మూవీస్‌కి అదే ట్యాగ్ వేసుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)


