లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ | Actress Konkona Sen Upcoming Accused Movie OTT Release Date, Streaming Platform Details And Trailer Inside | Sakshi
Sakshi News home page

Accused Movie In OTT: ఓటీటీలోకి డిఫరెంట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్

Feb 21 2026 4:01 PM | Updated on Feb 21 2026 4:21 PM

 Konkona Sen Accused Movie OTT Trailer And Streaming Details

హీరోయిన్ రష్మిక.. రాబోయే ఓ కొత్త సినిమాలో స్వలింగ సంపర్కరాలిగా నటించనుందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమా కాదా అనేది సదరు మూవీ రిలీజైతే కానీ తెలియదు. అయితే దీనికంటే ముందే ఇప్పుడు ఇదే తరహా కాన్సెప్ట్‌తో తీసిన ఓ హిందీ చిత్రం.. నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇదివరకే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ సినిమా.. 'చథా పచ్చ తెలుగు రివ్యూ)

ప్రముఖ నటి కొంకనా సేన్, 'లాపతా లేడీస్' ఫేమ్ ప్రతిభ రత్న ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అక్యూజ్డ్'. నెట్‌ఫ్లిక్స్ సొంతంగా నిర్మించిన ఈ చిత్రం.. సదరు ఓటీటీలోకే వచ్చే శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఇందులో లీడ్ పెయిర్.. లెస్బియన్ కపుల్ పాత్రల్లో నటించడం విశేషం. ఇదో హాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది.

విదేశాల్లో జీవించే ప్రధాన పాత్రధారుల్లో ఒకరు(కొంకనా సేన్).. ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ఈమెపై షాకింగ్ ఆరోపణలు వస్తాయి. ఆస్పత్రిలోని చాలామంది లైంగికంగా వేధిస్తుందని రూమర్స్ బయటకొస్తాయి. దీంతో ఈమె రిలేషన్‌లోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. చివరకు ఏమైంది? నిజంగానే సదరు డాక్టర్ అలాంటిదేనా? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఈ తరహా కాన్సెప్ట్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌ల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాని భారతీయ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి? ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement