చిన్మయి, తన తండ్రిపై నెటిజన్‌ దిగజారుడు కామెంట్‌ | Singer Chinmay Comments On Epstein Files In Social Media Post, Netizen Stupid Reaction Creates Controversy | Sakshi
Sakshi News home page

చిన్మయి, తన తండ్రిపై నెటిజన్‌ దిగజారుడు కామెంట్‌

Feb 21 2026 8:52 AM | Updated on Feb 21 2026 9:49 AM

Singar Chinmay Comments On Epstein Files But Netjin stupid Reaction

సోషల్‌మీడియా వినియోగం పెరుగుతున్న కొద్ది కొందరు నెటిజన్లు తమ విచక్షణ కోల్పోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పశువులకంటే హీనంగా మారిపోతున్నారు. తండ్రీ కూతుళ్ల బంధంపై విషం చిమ్మే స్థాయికి కూడా చేరిపోతున్నారు. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియోపై  'ఫన్ & డాంక్' పేరుతో ప్రణీత్ హన్మంతు చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల  సీఎం రేవంత్‌ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించిన విషయం గుర్తే ఉండుంటుంది కదా.. అయితే, తాజాగా ఇదే రీతిలో ప్రముఖ సింగర్‌ చిన్మయిపై ఒక నెటిజన్‌ 'మీ తండ్రి నిన్ను తప్పకుండా అత్యాచారం చేసే ఉంటాడు' అని నీచమైన కామెంట్‌ చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికలపై లైంగిక వేధింపుల గురించి ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పేరుతో వైరల్‌ అవుతుంది. ఈ అంశంపై సింగర్‌ చిన్మయి కూడా రియాక్ట్‌ అయింది. భారత ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి భవనంలో ఎప్‌స్టీన్‌‌లు ఉంటారు. ఈ విషయంలో గుడ్డిగా మత పెద్దలను కూడా నమ్మకండి. వారితో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్థులు ఉన్నారని గుర్తుంచుకోండి. నేను చెబుతుంది మీరు నమ్మకపోతే..  మీకు తెలిసిన అమ్మాయిని అడగండి. మొదటిసారి ఎప్పుడు, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురి అయిందో చెబుతుంది.' అని పోస్ట్‌ చేసింది. దీనికి సమాధానంగా చిన్మయిపై ఒక నెటిజన్‌ విషం చిమ్మాడు. 'మీ తండ్రి కూడా నిన్ను తప్పకుండా అత్యాచారం చేసే ఉంటాడు' అని తెగబడ్డాడు. దీంతో ఆమె కూడా తిరిగి కౌంటర్‌ ఇచ్చింది.

అతనికి కౌంటర్‌గా చిన్మయి ఇలా పోస్ట్‌ చేసింది.. 'నా తండ్రి నన్ను అత్యాచారం చేయలేదు. కానీ,  కూతుళ్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు ఖచ్చితంగా ఊహించుకుంటారని తెలుస్తోంది. మీరు ఏమిటో, మీ సంస్కృతి  ఏమిటో తెలుస్తుంది. మిమ్మల్ని ఎవరు పెంచారో కూడా ఈ ప్రవర్తనలోనే కనపడుతుంది.' అని ఆమె రిప్లై ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement