ఆ క్యారెక్టర్‌ గురించి చెప్పగానే పిచ్చెక్కిపోయింది: ప్రభాస్ | Actor Prabhas Made Interesting Comments About Tollywood Director Puri Jagannadh, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Prabhas: అలా ఈ ప్రపంచంలోనే ఎవరూ రాయలేరు: టాలీవుడ్‌ డైరెక్టర్‌పై ప్రశంసలు

Feb 20 2026 10:20 PM | Updated on Feb 21 2026 5:04 PM

Prabhas comments about Tollywood Director Puri Jagannadh

టాలీవుడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌పై రెబల్ స్టార్ ప్రశంసలు కురిపించారు. బుజ్జిగాడు మూవీకి రాసి క్యారెక్టరైజేషన్‌ చూసి నాకు పిచ్చెక్కిపోయిందని అన్నారు. ఎలా చేయాలిరా బాబు.. నేనెప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదన్నారు. ఆయనలా క్యారెక్టర్‌కు డైలాగ్స్ రాయడం మన ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనూ లేరని ప్రభాస్ కొనియాడారు.

ప్రభాస్ మాట్లాడుతూ.. 'పూరి జగన్నాధ్‌లా క్యారెక్టరైజేషన్ రాయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయనలా క్యారెక్టర్ డిజైనింగ్‌ మన ఇండియాలోనే కాదు.. ఈ ప్రపంచంలోనే ఎవరూ రాయలేరు. బుజ్జిగాడు మూవీలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఎవరితో మాట్లాడిన బుజ్జిగాడి గురించే మాట్లాడేవాణ్ని. అంత స్ట్రాంగ్ డైలాగ్స్ రాయడం ఆయనకే సాధ్యం. ఎక్ నిరంజన్‌లో నాకు అది చాలా ఫేవరేట్. ఏంటి మగాళ్లు ఏడుస్తారా? ఏంటి ఎవరైనా ఏడుస్తారని రాయడం నాకు భలే అనిపించింది. ఈ డైలాగ్‌ను హిందీలో దబాంగ్‌ సినిమాలో కూడా అడిగి మరీ వాడుకున్నారు' అని అన్నారు. 

ప్రేమలో ప్రభాస్ వైరల్ అవుతున్న వీడియో

 

Advertisement
 
Advertisement
Advertisement