విజయ్-రష్మిక పెళ్లి..నాకు ఆహ్వానం అందలేదు: ప్రముఖ నటుడు | Pramod Shetty Opens Up On Rashmika Mandanna Past With Rakshit Shetty And Talks About Marriage With Vijay Deverakonda | Sakshi
Sakshi News home page

Rashmika: విజయ్-రష్మిక పెళ్లి.. నాకు ఆహ్వానం అందలేదు: ప్రముఖ నటుడు

Feb 20 2026 9:21 PM | Updated on Feb 21 2026 10:54 AM

Actor Pramod Shetty says Rashmika not invite her Kirik Party co star

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండల వివాహానికి తమను ఆహ్వానిస్తారని వెయిట్ చేయడం లేదని ప్రముఖ నటుడు ప్రమోద్‌ శెట్టి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా రక్షిత్‌ శెట్టిని.. తనను ఆమె వివాహానికి పిలుస్తారని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రక్షిత్ శెట్టి‌ పూర్తిగా సినిమాలతో  బిజీగా ఉన్నాడని ప్రమోద్‌ శెట్టి తెలిపారు. హీరోయిన్‌ రష్మికతో వివాహం కానందుకు రక్షిత్‌ శెట్టి బాధపడడం లేదని వెల్లడించారు.

కాగా.. గతంలో రష్మికకు కన్నడ హీరో రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. అంతకుముందు రష్మిక, రక్షిత్ కిరిక్‌ పార్టీ మూవీలో జంటగా నటించారు. రష్మిక ఈ మూవీతోనే కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రమోద్‌శెట్టి  కీలక పాత్రలో కనిపించారు.

కాగా.. ఈ నెల 26న టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ- రష్మిక వివాహం జరగనుంది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖులు, సన్నిహితులు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement