లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ డైరెక్టర్.. పోస్ట్ వైరల్ | Tollywood director Raghav Omkar Sasidhar Buys Luxury Car | Sakshi
Sakshi News home page

Raghav Omkar Sasidhar: లగ్జరీ కారు కొన్న ది 100 డైరెక్టర్.. ధర ఎంతంటే?

Feb 20 2026 7:55 PM | Updated on Feb 20 2026 8:19 PM

Tollywood director Raghav Omkar Sasidhar Buys Luxury Car

టాలీవుడ్ డైరెక్టర్  రాఘవ్ ఓంకార్ శశిధర్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ కొత్త ప్రయాణం చాలా గర్వంగా ఉందన్నారు. నా ఫ్యామిలీలోకి మెర్సిడెజ్ ఈ క్లాస్ కారును సాదరంగా ఆహ్వనిస్తున్నానంటూ పోస్ట్ చేశారు. ఇది కేవలం కారు మాత్రమే కాదు.. ఓర్పు, కృషి, విశ్వాసం ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తాయని గుర్తుచేస్తుందని రాసుకొచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. రాఘవ్ ఓంకార్ శశిధర్ ది 100 మూవీకి దర్శకత్వం వహించారు. 2024లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు నిర్మించారు. అంతేకాకుండా డైరెక్టర్ శశిధర్.. ఓంకారం, నన్ను క్షమించండి, లడ్డు ఏ స్వీట్ మెమొరీ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement