Director
-
స్టైలిష్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ మామ
-
ఫిట్‌నెస్‌పై రూమర్స్.. కరణ్ జోహార్ క్లారిటీ!
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో మెరిశారు. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఇటీవల తన ఫిట్నెస్ గురించి వస్తున్న వార్తలపై తాజా ఈవెంట్లో స్పందించారు. స్లిమ్‌గా కనిపించడానికి గల కారణాలను వివరించాడు. తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరైన టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఫిట్‌నెస్‌కు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని డైరెక్టర్ సలహా ఇచ్చాడు. దీంతో కరణ్ బరువు తగ్గడంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్‌పెట్టారు.(ఇది చదవండి: 'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా)కరణ్ జోహార్ బరువు తగ్గేందుకు ఓజెంపిక్ వంటి డయాబెటిక్ మందుల వాడుతున్నారని రూమర్స్ వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సన్నిహిత మిత్రుడు మహీప్ కపూర్ వ్యాఖ్యల తర్వాత ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్లో మహీప్ కపూర్ ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా కరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఆ వార్తలకు చెక్ పడనుంది. కాగా.. గతంలో స్లిమ్‌గా ఉంటూ తన ఫిట్నెస్ పట్ల నిబద్ధతను చాటుకున్నారు కరణ్ జోహార్. -
ఆర్జీవీ శారీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రొడక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం శారీ. ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవీ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శారీ మూవీ ఓ క్రేజీ సాంగ్ విడుదల చేశారు. మొదటిసారి అంటూ సాంగే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కీర్తన శేష్, అర్జున్ విజయ్ ఆలపించగా.. రాజశేఖర్ సుద్మూన్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి కీర్తన శేష్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మార్చి 21న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాహిల్ సంభయాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కీలక పాత్రలు పోషించారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది. -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న బాలకృష్ణ హీరోయిన్..!
రక్త చరిత్ర, లెజెండ్, లయన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఆ తర్వాత అయితే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్, తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తోంది. గతేడాది మేరీ క్రిస్మస్, సిస్టర్ మిడ్నైట్ లాంటి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం లాస్ట్ డేస్ అనే మూవీలో కనిపించనుంది.ఇదిలా ఉండగా తాజాగా రాధిక ఆప్టేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. త్వరలోనే రాధికా ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో తెరకెక్కించబోయే కోట్యా అనే ఓ యాక్షన్ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సినీవీ-సీహెచ్‌డీ వెల్లడించిది. ఈ సినిమాను నిర్మాత విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తారని సమాచారం. ఏదేమైనా బాలయ్య హీరోయిన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా..రాధికా ఆప్టే ప్యాడ్‌మ్యాన్, అంధాధున్, విక్రమ్ వేద, ఎ కాల్ టు స్పై, కబాలి, లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా నటించిన సిస్టర్ మిడ్నైట్ బాఫ్టాకు నామినేట్ అయింది. అంతేకాకుండా సిస్టర్ మిడ్నైట్ గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. కాగా.. రాధికా ఇటీవల భర్త బెనెడిక్ట్ టేలర్‌తో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. -
బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి సౌత్ ఇండస్ట్రీకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్
హిందీ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) బాలీవుడ్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడు. హిందీ చిత్ర పరిశ్రమను వీడుతున్నట్లు ఆయన ప్రకటించాడు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. హిందీ ఇండస్ట్రీ చాలా విషపూరితంగా మారిపోయిందని ఆయన అసహనం వ్యక్తంచేశాడు. ఇక్కడ మేకర్స్ ఆలోచనలు చూసి పిచ్చెక్కుతోందని, ముంబైని వదిలేసి సౌత్ ఇండస్ట్రీలో సెటిలైపోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. దక్షిణాది చిత్రపరిశ్రమ(South Industry)ని చూసి అసూయ చెందుతున్నానని, సౌత్ ఇండస్ట్రీలాగా ఇక్కడ (బాలీవుడ్లో) ప్రయోగాలు చేయడం కష్టమని ఆయన చెప్పాడు.బాలీవుడ్‌ను వదిలేసిన అనురాగ్ కశ్యప్ తాజాగా బెంగళూరుకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఆయన ఇలా చెప్పాడు. 'నేను బాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొనే ఇక్కడకు (బెంగళూరు) వచ్చాను. బాలీవుడ్ చిత్రపరిశ్రమ చాలా దారుణంగా తయారైంది. సినిమా ప్రారంభం నుంచీ వ్యాపారం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎలా అమ్ముదాం, మనకెంతొస్తుంది..? ఇదే చర్చ.. దీనివల్ల సినిమా తీసేటప్పుడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను. హిందీలో ప్రతిఒక్కరూ సాధ్యం కాని టార్గెట్లతో సినిమాను ప్రారంభిస్తున్నారు. రూ.500 కోట్లు, రూ.800 కోట్లు వచ్చే సినిమాలను మాత్రమే తీయాలని ఎక్కువగా ప్లాన్ చేస్తుంటారు. దీంతో అక్కడ ప్రతిభ, కొత్తదనానికి ఛాన్స్ లేకుండా పోయింది.' అని ఆయన తెలిపాడు. ఇక నుంచి తాను పూర్తిగా సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లోనే ఉంటానని ఆయన చెప్పాడు.అనురాగ్ చివరగా రైఫిల్ క్లబ్, విడుదలై 2 సినిమాల్లో నటించాడు. ఇప్పటివరకు దాదాపు 18 సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో మొట్ట మొదటి చిత్రం పాంచ్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. రెండు దశాబ్దాల తర్వాత పాంచ్‌ను ఎట్టకేలకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది పాంచ్ ప్రేక్షకుల ముందుకురావచ్చు. ప్రస్తుతం ‘డకాయిట్’లో ఆయన నటిస్తున్నాడు. అడివిశేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో షానీల్ డియో దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. -
ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పిటిషన్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. దీంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ గురువారం విచారణకు వచ్చే ఛాన్సుంది.ఆర్జీవీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆర్జీవీ డెన్ నుంచి శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పలు నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
ఆ సినిమా చేసేందుకు సౌత్ హీరోలు ముందుకురావట్లేదు: దర్శకుడు
రొమాంటిక్ సినిమాలు తెరకెక్కించాలనుంది.. కానీ దక్షిణాదిలో ఏ హీరో కూడా అందుకు ఒప్పుకోవడం లేదు అంటున్నాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి (Bengaluru International Film Festival) గౌతమ్ బుధవారం హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజుల్లో ఏ హీరో కూడా రొమాంటిక్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. అందుకే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నా..తెలుగు (Tollywood), తమిళం.. కన్నడలో కూడా పలువురు హీరోలను సంప్రదించాను. రొమాంటిక్ కథ ఉందని చెప్పగానే వాళ్లు మీటింగ్‌ను వాయిదా వేస్తున్నారు. కొందరేమో కలవడానికే ఇష్టపడటం లేదు. అది ఎందుకనేది మీరే వారిని అడగండి అన్నాడు. అయితే నా దగ్గర కథలకు కొదవలేదు. అందుకే ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నాను. అదే పెద్ద ఛాలెంజ్సినిమాలు తెరకెక్కించడమన్నా.. ప్రజలను థియేటర్‌కు తీసుకురావడమన్నా నాకెంతో ఇష్టం. అదే సమయంలో నేను తీసే ప్రతి చిత్రం కూడా ప్రయోగాత్మకమైనదే! కాఖా కాఖా చిత్రం రిలీజైన మొదట్లో ఎవరూ పెద్దగా ఇష్టపడలేదు. కానీ నెమ్మదిగా అది అందరికీ నచ్చింది. ఓటీటీలకు జనాలు అతుక్కుపోయిన ఈ రోజుల్లో వారిని థియేటర్‌కు రప్పించడం దర్శకనిర్మాతలకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. దీనికి ఎలాంటి మార్గం కనిపెట్టాలో నాకూ అర్థం కావడం లేదు. డైరెక్టర్లను తిడుతున్నారువేందు తైంతదు కాడు సినిమాను ఆదరించిన జనాలు జోషువాను మాత్రం తిరస్కరించారు. తెలుగు, తమిళంలో ఇప్పటికీ జనాలు థియేటర్‌కు వస్తుండటం విశేషం. సినిమా రివ్యూలు కూడా ఎలా ఉంటున్నాయంటే పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో దర్శకుడిని బండబూతులు తిడుతున్నారు. రచయితను కూడా వదలడం లేదు. ఇలాంటివాళ్లు సొంతంగా ఓ సినిమా తీయాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: బంగారం అక్రమంగా తరలిస్తున్న హీరోయిన్.. ఏకంగా డీజీపీ కూతురేనట! -
సీన్ పెరిగింది
అమెరికన్ ఫిల్మ్ మేకర్ సీన్ బేకర్ సీన్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ‘అనోరా’ సినిమాకు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో సీన్ బేకర్‌కు నాలుగు అవార్డులు దక్కాయి. ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమాకి నాలుగు అవార్డులు సాధించిన ఒకే ఒక్కడు సీన్ బేకర్ కావడం విశేషం. హాలీవుడ్ సమాచారం ప్రకారం... 1954లో వాల్ట్ డిస్నీ (అమెరికన్ యానిమేటర్, వాయిస్ యాక్టర్, ప్రొడ్యూసర్)కు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చాయట. కానీ ఇవి ఒకే సినిమాకి రాలేదు. అలాగే 1974లో అమెరికన్ ఫిల్మ్ మేకర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొ΄్పోల ‘ది గాడ్ ఫాదర్ 2’ చిత్రానికి మూడు ఆస్కార్ అవార్డులు (బెస్ట్ పిక్చర్, డైరెక్టర్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగాల్లో) గెలుచుకున్నారు. . దయచేసి థియేటర్లలోనే సినిమా చూడండి – సీన్ బేకర్ ‘‘సెక్స్ వర్కర్స్ (వేశ్యల నేపథ్యంలో ‘అనోరా’ని రూపొందించారు) కమ్యూనిటీకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ఆస్కార్ అవార్డును వారితో షేర్ చేసుకుంటున్నట్లుగా ఫీలవుతున్నాను’’ అన్నారు సీన్ బేకర్. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘థియేటర్స్‌లో సినిమా చూడటం ఓ గొప్ప అనుభూతి. మనందరం కలిసి నవ్వుతాం... ఏడుస్తాం... ఉత్సాహంగా అరుస్తాం. ప్రపంచమంతా వివిధ భాగాలుగా విడిపోతున్నట్లు కనిపిస్తున్న ఇలాంటి తరుణంలో థియేటర్స్‌లో అందరం కలిసి సినిమా చూడటం అనేది ఓ ముఖ్యమైన అంశం కావొచ్చు. ప్రస్తుతం థియేట్రికల్ ఎక్స్పీరియన్్స ప్రమాదంలో ఉంది. సినిమా థియేటర్స్, మరీ ముఖ్యంగా స్వంతంత్రంగా రన్ చేస్తున్న థియేటర్స్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. మనందరం సపోర్ట్ చేయాలి. సినిమాలను థియేటర్స్‌లో చూడటం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను థియేటర్స్‌లో సినిమాలు చూసే విధంగా ప్రోత్సహించాలి. అద్భుతమైన ఆర్టిస్టుల రక్తం, కన్నీళ్లు, చెమటలతో ‘అనోరా’ను నిర్మించడం జరిగింది. ఇండిపెండెంట్ సినిమాలు కలకాలం జీవించాలి’’ అని పేర్కొన్నారు సీన్ బేకర్. మరో హైలెట్ ఏంటంటే... సీన్ బేకర్ తల్లి పుట్టిన రోజునే ఆయనకు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. తన అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో తన తల్లికి సీన్ బేకర్ థ్యాంక్స్ చెప్పారు.→ ‘‘అనోరా’ను మేం తక్కువ డబ్బుతోనే చేశాం. యంగ్ ఫిల్మ్‌మేకర్స్ మీరు చెప్పాలనుకుంటున్న కథలను చెప్పండి. మీరు ఏ మాత్రం పశ్చాత్తాపపడరనడానికి మాకు దక్కిన ఈ అవార్డు ఓ ఉదాహరణ’’ అని ‘అనోరా’ నిర్మాతలు అలెక్స్ కోకో, సమంత క్వాన్ అన్నారు. -
మహేశ్ సార్, ప్లీజ్.. ఆ ఒక్క పని చేయండి: డ్రాగన్ డైరెక్టర్
లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా రూ.100 కోట్లు దాటేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డ్రాగన్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎస్ రాజమౌళిగారు నాకు ఇన్స్పిరేషన్. ఎమోషన్స్ కనెక్ట్ అయితే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్వుడ్.. ఎక్కడైనా హిట్ అవుతుందని ఆయన చెప్తుంటారు. మహేశ్ గర్విస్తారుఈ ప్రపంచంలో ప్రేమ, స్నేహం, తల్లిదండ్రులు అనే మూడు ఎమోషన్స్ సాధారణంగా ఉంటాయి. ఈ మూడూ మా సినిమాలో ఉన్నందునే విజయం సాధించింది. మీ అందరికీ ఓ విజ్ఞప్తి.. నేను డైరెక్ట్ చేసిన ఓ మై కడవులే సినిమా రిలీజైనప్పుడు మహేశ్‌బాబు గారు దాని గురించి ఒక్క ట్వీట్ చేశారు. అంతే.. తెలుగు సినీప్రేక్షకులందరూ ఓ మై కడవులే వీక్షించారు. డ్రాగన్ సినిమాను ఆయన చూడాలని ఎదురుచూస్తున్నాను. కచ్చితంగా మూవీ చూసి ఆయన గర్విస్తారనుకుంటున్నాను. దయచేసి ఈ సందేశాన్ని ఆయనవరకు చేరవేయండి.. సినిమా చూసేలా చేయండి అని కోరాడు.డ్రాగన్ సినిమాడ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కయాడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. కల్పతి అఘోరం, కల్పతి గణేశ్, కల్పతి సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు.చదవండి: అమ్మాయితో చాటింగ్ వైరల్.. తన ఉద్దేశం అది కాదన్న హీరోధనుష్ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్ -
సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా
తీసింది తక్కువ సినిమాలే అయినా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఆయన సినిమా తీస్తే హిట్టు కాదు ఏకంగా బ్లాక్‌బస్టర్ అవ్వాల్సిందే అన్న పేరు తెచ్చేసుకున్నాడు. తనను విమర్శించినా ఊరుకుంటాడేమో కానీ తన సినిమాల జోలికి వస్తే మాత్రం అస్సలు సహించడు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే ఇచ్చిపడేస్తాడు. ఓ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి (IAS Vikas Divyakirti).. సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాపై గతేడాది విమర్శలు గుప్పించారు. యానిమల్ సినిమాలు ఎందుకు తీస్తారో!యానిమల్ (Animal Movie) వంటి చిత్రాలు మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఇలాంటి సినిమాలు రూపుదిద్దుకోకూడదు. మీ సినిమాలో హీరో జంతువులా ప్రవర్తిస్తాడని చూపించారు. దీనివల్ల మీకు డబ్బు వచ్చి ఉండొచ్చు. కానీ కేవలం డబ్బు కోణంలోనే ఆలోచిస్తే ఎలా? సామాజిక విలువలు కాస్తైనా ఉండాల్సిన పని లేదా? అని విమర్శించారు. వికాస్.. 12th ఫెయిల్ సినిమా (12th Fail Movie)లో యూపీఎస్సీ ప్రొఫెసర్‌గా యాక్ట్ చేశాడు.అవనసరంగా విమర్శిస్తే..ఈ విమర్శలపై తాజాగా సందీప్‌రెడ్డి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఓ ఐఏఎస్ అధికారి యానిమల్ వంటి చిత్రాలు రాకూడదన్నారు. ఆయన చెప్పింది వింటే నేనేదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. 'ఒకవైపు 12th ఫెయిల్ వంటి సినిమాలు తీస్తుంటే మరోవైపు యానిమల్ వంటివి తీసి సమాజాన్ని వెనక్కుతీసుకెళ్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ఇలా ఎవరైనా అనవసరంగా నా సినిమాపై దాడి చేస్తే నాకు కచ్చితంగా కోపం వస్తుంది. ఆయన బాగా చదువుకుని ఐఏఎస్ అయ్యారు. యానిమల్ హీరోతో సందీప్ రెడ్డి వంగా, ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తిఎవరైనా ఐఏఎస్ అయిపోవచ్చునాకేమనిపిస్తోందంటే ఢిల్లీ వెళ్లి, ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి రెండుమూడేళ్ల జీవితాన్ని అక్కడే గడిపితే కచ్చితంగా ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవుతారు. పైగా అందుకోసం చదవాల్సిన పుస్తకాలు కూడా వేలకొద్దీ ఉండవు. 1500 పుస్తకాలు చదివితే ఐఏఎస్ అయిపోతారు. కానీ సినిమాలో అలా కాదు.. మీరు దర్శకరచయితలు అయ్యేందుకు ప్రత్యేకంగా ఏ కోర్సు ఉండదు.. ఏ టీచర్ కూడా మిమ్మల్ని దర్శకుడిగా, రచయితలుగా తీర్చిదిద్దలేరు అన్నాడు.సినిమాసందీప్రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ 2023లో రిలీజైంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.చదవండి: హీరోయిన్ కియారా ప్రెగ్నెన్సీ.. వాళ్లకు టెన్షన్ -
సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్
తొలి సినిమా హిట్టు కొడితే ఆ కిక్కే వేరు. మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) వాస్తవ్ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా కథను సంజయ్ దత్‌కు చెప్పడానికి ముందు మద్యం తాగాడట! ఈ విషయాన్ని తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ముందుగా రెండు పెగ్గులేసి..'వాస్తవ్ కథను సంజయ్ దత్ (Sanjay Dutt)కు చెప్పడం కోసం ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన్ను కలవడానికి ముందు ఓ రెస్టారెంట్‌కు వెళ్లి రెండు పెగ్గులేశాను. వెయిటర్ దగ్గరున్న నోట్‌ప్యాడ్ తీసుకుని అందులో కథలో కీలకమైన అంశాలు రాసుకున్నాను. ఆల్రెడీ కథంతా నా మెదడులో ఉంది కాబట్టి కొన్ని పాయింట్స్ రాశాక సంజయ్ దగ్గరకు వెళ్లాను. దుష్మన్ సినిమా సెట్లో ఆయన్ను కలిశాను. ఆయన ఓ డైరెక్టర్‌తో మాట్లాడుతుండగా వెనకాల నిల్చున్నాను. ఇక్కడేం చేస్తున్నావ్?సడన్‌గా నన్ను చూసి నువ్విక్కడేం చేస్తున్నావ్? అన్నాడు. కచ్చితంగా తిడతాడేమో అనుకున్నాను. అక్కడున్నవారెవరికీ నేను తెలియదు. నన్ను కూర్చోమని కూడా ఎవరూ చెప్పలేదు. అంత పెద్ద సినిమా సెట్‌కు వెళ్లడం అదే నాకు మొదటిసారి. సంజయ్ విరామం లేకుండా షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నాడు. ఛాన్స్ మిస్ అయితే మళ్లీ దొరకదన్న భయంతో ఆయన వెనకాలే తిరుగుతున్నాను. నన్ను గమనించి.. నీకు కథ చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? అన్నాడు. పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదని బదులిచ్చాను. పదినిమిషాలు కాస్తా గంటగా..అలా అతడి గదిలోకి వెళ్లి వాస్తవ్ కథ (Vaastav: The Reality Movie) చెప్పడం మొదలుపెట్టా.. ఐదు నిమిషాలయ్యాక గదిలో ఉన్న మిగతా అందర్నీ బయటకు వెళ్లమన్నాడు. గంటన్నరపాటు కథ చెప్పాను. ఆయనకు చాలా నచ్చింది. షూటింగ్ మొదలైంది.. అయితే వారానికి ఒకరోజు సంజయ్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేసింది. ఆ రోజు చేయాల్సిన షూటింగ్‌ను అర్ధరాత్రైనా సరే పూర్తి చేసేవాళ్లం. 35% షూటింగ్ అయ్యాక నిర్మాత తన దగ్గర డబ్బు లేదని చేతులెత్తేశాడు. అప్పటివరకు షూటింగ్ చేసిన సీన్స్ ఎలా వచ్చాయోనని రష్ చూశాను. ఏమీ బాగోలేదు. షూటింగ్ ముందుకు సాగలేదు.సినిమా రైట్స్ అమ్మిన డబ్బుతో..ఏడాదిపాటు ఎలాంటి ముందడుగు లేకపోవడంతో సినిమా అటకెక్కిందన్న ప్రచారం జరిగింది. ఒక రోజు నిర్మాత శ్యామ్ ష్రాఫ్.. సినిమా రష్ చూసి బాగుందన్నాడు. రూ.50 లక్షలు పెట్టి బాంబే హక్కులు కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు చేతిలో పెట్టాడు. దీంతో షూటింగ్ పునఃప్రారంభించాం. ఆ డబ్బు అయిపోయాక మిగతాచోట్ల రైట్స్ అమ్మాం.. ఈ పద్ధతిని ఫాలో అవుతూ వాస్తవ్ పూర్తి చేశాం. సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు' మహేశ్ అని చెప్పుకొచ్చాడు.వాస్తవ్ విశేషాలువాస్తవ్ సినిమా విషయానికి వస్తే.. సంజయ్‌దత్, నమ్రత శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పరేశ్ రావల్, దీపక్, సంజయ్ నర్వేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1999 అక్టోబర్‌లో విడుదలైంది. వాస్తవ్ హిట్టవడంతో దర్శకుడు మహేశ్ దీనికి సీక్వెల్‌గా హత్యార్ తీశాడు. ఇందులోనూ సంజయ్ దత్ హీరోగా నటించాడు.చదవండి:కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే! -
సినిమా చూసిన దిల్ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజాకా. ఈ చిత్రాన్ని నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మజాకా సూపర్ హిట్ టాక్ రావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా చూసిన దిల్ రాజు ఓ మాట అన్నారని గుర్తు చేసుకున్నారు.దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. 'దిల్ రాజు ఈ సినిమా చూశారు. రిలీజ్‌కు ముందు సారథి స్టూడియోలో ఈ సినిమా చూశారు. అప్పుడు నేను వెళ్లలేదు. ఆయన బయటకొచ్చి మన రాజాతో ఒక మాట అన్నారు. ఈ సినిమా పక్కా థియేటర్ మూవీ అని అన్నారు. కచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వాలి. అందరూ ఎమోషనల్ అవుతుంటే వారితో పాటు మనం కూడా ఫీలవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లోనే చూడండి. తమ్ముళ్లు మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. మీరు మూవీని చూసిన ఫీలింగ్స్ మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి' అని అన్నారు. కాగా.. మజాకా చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. -
హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వారంపాటు అమ్మ బాధలోనే: డైరెక్టర్
ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadh Rao Nakkina). తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న మూవీ మజాకా (Mazaka Movie). సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ఈవెంట్స్‌లో త్రినాధ రావు మన్మథుడు హీరోయిన్ అన్షు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో అతడు క్షమాపణలు చెప్పాడు.ఎలాంటి శిక్ష వేసినా ఓకేతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి త్రినాధరావు మాట్లాడుతూ.. నేను కావాలని అన్షుపై అలాంటి కామెంట్స్ చేయలేదు. ఏదో సరదా చేద్దామనుకోబోయి అనుకోకుండా నోరు జారాను. తప్పు సరిదిద్దుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. తర్వాత అందరికీ క్షమాపణలు చెప్పాను. నేను దురుద్దేశంతో అలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. అప్పటికీ నోరు జారి తప్పు చేశానని ఫీలయ్యాను. అందుకే అన్షుతో పాటు అందరికీ సారీ చెప్పాను. అప్పటికే అన్షుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకు ఫోన్ చేసి విషయం మొత్తాన్ని వివరించా. తను అర్థం చేసుకుంది. అమ్మను చూసి భయమేసిందిఈ వివాదం జరిగినప్పుడు నాకంటే మా అమ్మ ఎక్కువ బాధపడింది. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నువ్వు ఎందుకు నాన్నా నోరు జారావు? అందరూ ఎలా విమర్శిస్తున్నారో చూశావా? ఒక్క పదం నిన్ను దుర్మార్గుడిని చేసింది. నువ్వు నిజంగా దుర్మార్గుడివా? కాదని ఎంతమంది దగ్గరకు వెళ్లి చెప్పగలం? ఇకమీదట స్టేజీ ఎక్కినప్పుడు ఆచితూచి మాట్లాడమని చెప్పింది. అమ్మ వారం రోజులు డీలా పడిపోయింది. తననలా చూసి భయమేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా అన్నాడు త్రినాధరావు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?
కొన్ని కథలు వినోదాన్ని పంచితే మరికొన్ని హృదయాలను బరువెక్కిస్తాయి. కొన్ని మాత్రమే మన రక్తం మరిగేలా చేస్తూనే కన్నీళ్ల వరద పారిస్తాయి. అలాంటి సినిమాయే ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీగా నటించాడు. ఆయన భార్య ఏసుబాయిగా హీరోయిన్ రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.ద్రోహులుగా చిత్రీకరించారుఇక ఈ సినిమాలో తన పూర్వీకులను తప్పుగా చూపించారంటూ మరాఠా యోధులు గానోజీ, కాన్హోజి షిర్కే వారసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ఉటంకిస్తూ తమ పూర్వీకులను శంభాజీ మహారాజ్‌కు ద్రోహం చేసినవారిగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆయా సన్నివేశాల ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ చిత్రయూనిట్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)కు నోటీసులు పంపించారు.అసౌకర్యానికి గురైతే క్షమించండిఈ వివాదంపై డైరెక్టర్ లక్ష్మణ్ స్పందిస్తూ ఛావాలో గానోజి, కన్హోజీల పేర్లు మాత్రమే ఉపయోగించామన్నాడు. వారి ఇంటిపేరు, ఏ ప్రాంతానికి చెందినవారు వంటి వివరాలను వెల్లడించలేదన్నాడు. షిర్కే కుటుంబసభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఛావా వల్ల వారు అసౌకర్యానికి గురైతే తనను క్షమించాల్సిందిగా కోరాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు దారుడు, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాశ్ పటేల్ ప్రేయసి అలెక్సీస్ విల్కిన్స్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఎవరీ అలెక్సీస్? వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటీ అనే ఆసక్తి ఏర్పడింది. మరి ఆవివరాలేంటో చూసేద్దామా!ప్రమాణ స్వీకారం తర్వాత, పటేల్ ప్రసంగిస్తూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబం,స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. వారి వల్లే తానిక్కడ ఉన్నానిని చెప్పాడు. అలాగే సోదరి నిషా మేనల్లుడు లండన్ నుండి వచ్చారని పేర్కొన్నాడు. తన అందమైన ప్రేయసి అలెక్సిస్ కూడా ఇక్కడే ఉంది అనగానే చప్పట్లు మారుమోగిపోయాయి. WATCH: Kash Patel's full remarks after being sworn in as FBI Director:"Anyone who thinks the American Dream is dead, look right here. You're talking to a first-generation Indian kid who is about to lead the law enforcement community in the greatest nation on God's Earth." pic.twitter.com/PQrCkme9az— Rapid Response 47 (@RapidResponse47) February 21, 2025కాశ్ పటేల్ (44) అక్టోబర్ 2022లో జరిగిన కన్జర్వేటివ్ రీఅవేకెన్ అమెరికా టూర్లో అలెక్సిస్ (26)ను మొదటిసారి కలిశారు. ఇద్దరూ దేశభక్తులు, వారు సంప్రదాయవాద విలువలను ఇష్టపడ్డారు. అలా వారిద్దరి పరిచయం క్రమంగా బలపడింది. 2023లో డేటింగ్ ప్రారంభించారు.చదవండి: Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమBirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలుఅలెక్సీస్ వినాష్ విల్లేకు చెందిన గాయని, పాటల రచయిత్రి కూడా. అనేక స్వచ్ఛసంస్థలతో కలిసి పనిచేస్తోంది. 1999 నవంబర్ 3న ఆమె అర్కాన్సాస్లో పుట్టింది. అయితే ఆమె బాల్యం అంతా ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోనే గడిచింది. అమెరికా వచ్చిన తరువాత యూఎస్మీదే, అక్కడి సంగీతం మీద ఇష్టం ఏర్పడింది. బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో చదివి వ్యాపారం మరియు రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసింది. కేవలం 8 ఏళ్ల వయస్సులో తన మొదటి పాటను రాయడం విశేషం.విలియమ్స్-ముర్రే రైటింగ్ అవార్డు, ఎకనామిక్ క్రిటికల్ థింకింగ్ అవార్డులను గెలుచుకుంది. -
భగవద్గీత మీద కాశ్‌పటేల్ ప్రమాణం..ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్:అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా నియమితులైన కాశ్‌పటేల్ తన మూలాలను మర్చిపోలేదు. భారతీయులు పవిత్రంగా భావించే భగవద్గీత మీద ప్రమాణం చేసి కాశ్‌పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.వైట్‌హైజ్ క్యాంస్లోని ఓ భవనంలో శనివారం(ఫిబ్రవరి21) కాశ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాశ్ భార్యాపిల్లలు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్పై ప్రశంసలు కురిపించారు. అమెరికా సెనేట్ శుక్రవారమే కాశ్ నియామకాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.గతంలో కౌంటర్ టెర్రరిజం పప్రాసిక్యూటర్గా పనిచేసిన కాశ్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించడంపై డెమోకక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాశ్ స్వతంత్రంగా పనిచేస్తారన్న నమ్మకం లేదంటున్నారు.ఎఫ్‌బీఐ డైరెక్టర్లు సాధారణంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. గుజరాతీలైన కాశ్‌పటేల్ తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. కాశ్‌పటేల్ న్యూయార్క్‌లో జన్మించారు. -
కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే?
పల్లెటూరి నుంచి వచ్చి ఎన్నో పాట్లు పడి సినిమా తీసి నిలదొక్కుకున్నవారెందరో. తమిళ దర్శకుడు సుశీంద్రన్ (Suseenthiran) కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. సినిమా తీయాలన్న లక్ష్యంతో 18 ఏళ్ల వయసులో చెన్నైకి చేరుకున్నాడు. కష్టాలకు ఓర్చుకున్నాడు. ఎదురుదెబ్బలకు వణికిపోకుండా నిలబడ్డాడు. పన్నెండేళ్ల ప్రయత్నాల తర్వాత తొలి సినిమా తీశాడు. వెన్నెల కబడ్డీ కుజు దర్శకుడిగా అతడి తొలి చిత్రం. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో మరుపటి ఏడాది కార్తీ- కాజల్‌తో కలిసి నాన్ మహాన్ అల్లా మూవీ తీశాడు. ఇది మరింత హిట్టు.సహజమైన కథలతో..అళగర్సామిన్ కుదిర, ఆదలాల్ కాదల్ సెవీర్, పాండ్య నాడు, జీవా, పాయుం పులి వంటి హిట్ చిత్రాలు తీశాడు. కొన్నిసార్లు అపజయాలతోనూ ప్రయాణం సాగించాడు. అయితే లేనిపోని హీరోయిజం, లాజిక్ లేని సీన్స్‌కు దూరంగా ఉంటూ తన కథలు సహజంగా ఉండేలా చూసుకున్నాడు. ఇతడు 2021లో శింబు (Silambarasan TR)తో ఈశ్వరన్ తీశాడు. నిజానికి ఈ కథ హీరో జై కోసం రాసుకున్నాడట!కథ బాలేదని ఛీ కొట్టిన హీరోకానీ శింబు తనతో ఓ సినిమా చేయమని కోరడంతో ఈ కథ అతడికి వినిపించాడు. అయితే కథ అస్సలు బాగోలేదంటూ శింబు ఉమ్మేశాడట! దీంతో కథను శింబుకు తగ్గట్లుగా మార్చేశానని దర్శకుడు సుశీంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్త వైరలవుతోంది. ఇకపోతే ఈశ్వరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. శింబు విషయానికి వస్తే పాదు తల (2023) సినిమాలో చివరిగా కనిపించాడు. ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్!.. ఇదెప్పుడు జరిగింది? -
మహేశ్ బాబు వల్లే నా సినిమాకు గుర్తింపు.. ఆయన ఒప్పుకుంటే: కోలీవుడ్ డైరెక్టర్
ఓ మై కడవులే, లక్కీ మ్యాన్, ఓరి దేవుడా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు. ప్రస్తుతం డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అశ్వత్ మరిముత్తు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలుగులో సినిమా తీస్తే ఫస్ట్ మూవీని ఎవరితో చేస్తారని ప్రశ్నించగా.. దానిపై స్పందించారు. తెలుగులో సూపర్ స్టార్‌తోనే నా మొదటి సినిమా చేస్తానని మనసులో మాటను బయటపెట్టారు.అశ్వత్ మరిముత్తు మాట్లాడుతూ..'ఆయన వల్లే నాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. ఓసారి నా చిత్రం ఓహ్ మై కడవులే చిత్రానికి ట్విటర్లో ఊహించని విధంగా వ్యూస్ వచ్చాయి. దానికి కారణం ఏంటో మొదట తెలియలేదు. కానీ ఆ తర్వాత మహేశ్ బాబు మా సినిమాపై మెచ్చుకుంటూ పోస్ట్ చేశాడని తెలిసింది. ఆయన వల్లే మా చిత్రానికి గుర్తింపు వచ్చింది. కేవలం రూ.3 కోట్లతోనే ఆ సినిమాను నిర్మించాం. ఇది చాలా చిన్న సినిమా. తెలుగులో మహేశ్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయనతోనే మొదటి సినిమా చేస్తా. ఆయనతో మూవీ చేయాలనేది నా చిరకాల కోరిక' అని వెల్లడించారు.ఓ మై కడవులే చిత్ర నిర్మాతల నుంచి ఎటువంటి ముందస్తు అభ్యర్థన లేకుండానే మహేష్ బాబు ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారని మరిముత్తు వెల్లడింతారు. ఆయన వల్లే పలువురు తెలుగు దర్శకులు, నటీనటులు ఈ చిత్రాన్ని వీక్షించి అభినందనలు తెలిపారు. ఆ క్షణం నుంచి మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని మరిముత్తు తెలిపారు. మరి దర్శకుడి కోరికను మన మహేష్ బాబు అంగీకరిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ చిత్రానికి దర్శకత్వ వహించారు మరిముత్తు. ఈ చిత్రం ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. #MaheshBabu వల్ల తెలుగు ఇండస్ట్రీ లో పేరు వచ్చింది - Director #AshwathMarimuthu#Dragon #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/fKHaTJiHr8— Telugu FilmNagar (@telugufilmnagar) February 17, 2025 -
సూర్యతో తండేల్ 2..!
-
హీరోయిన్లను ఏడిపించా.. ఓసారి భాగ్యశ్రీని అడగండి: డైరెక్టర్
కొంతమంది దర్శకులు సెట్లో నటీనటులపై నోరుపారేసుకుంటారు. తాను కూడా అదే జాబితాలోకి వస్తానంటున్నాడు ప్రముఖ డైరెక్టర్ సూరజ్ బర్జాత్య (Sooraj Barjatya). ఆవేశంలో కొంతమంది హీరోయిన్లపై అరిచానని చెప్తున్నాడు. బడా నామ్ కరేంగే వెబ్ సిరీస్‌తో ఈయన ఓటీటీ (OTT)లో అడుగుపెడుతున్నాడు. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో సూరజ్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో చాలామంది హీరోయిన్లను ఏడిపించాను. ఎక్కువగా చిరాకు పడుతూ అందరిమీదకు అరిచేవాడిని. ఆమెను అడిగినా చెప్తుందిఅలా భాగ్యశ్రీ (Bhagyashree) మీద ఒకసారి గట్టిగా అరవడంతో ఆమె సెట్లోనే ఏడ్చింది. ఈ విషయం తనను అడిగినా చెప్తుంది. కానీ రానురానూ నా ప్రవర్తనను మార్చుకున్నాను. ప్రశాంతంగా ప్రేమగా చెప్తేనే మంచి ఫలితాలు వస్తాయని గ్రహించాను. సెట్లోకి వెళ్లేముందు అన్నీ సిద్ధం చేసుకునేవాడిని. ఆ రోజు ఏది షూట్ చేయాలనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునేవాడిని. కాస్ట్యూమ్ నుంచి మొదలుకుని ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించేవాడిని. అందుకే ఐదేళ్లు పట్టిందిఅన్నీ కుదిరాకే సెట్లో అడుగుపెట్టేవాడిని. అందుకే నాకు ఈ సిరీస్ చేయడానికి ఐదేళ్లు పట్టింది. షూటింగ్ సెట్లో సన్నివేశాల్ని డైరెక్ట్ చేయాలే తప్ప వాటిని సరిదిద్దుతూ కూర్చోకూడదన్నది నా నియమం. దర్శకుడిగా నేను చాలా స్వార్థపరుడిని. సినిమాకు ఏమేం అవసరమో అవన్నీ సెట్టయ్యాకే షూటింగ్ మొదలుపెడతాను. నా మూవీ మీకు నచ్చాలని ఆశిస్తాను. కలెక్షన్స్ గురించి ఆలోచించను. నా మొదటి ప్రాధాన్యత దానికేడైరెక్టర్గా నేను ఎవరి మాటా వినను. ప్రతి డైలాగ్‌లో కూడా దూరి కరెక్ట్‌గానే సరిపోయిందా? లేదా? అనేది చెక్ చేస్తాను. విజువల్స్ కన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సూరజ్ బర్జాత్య.. మైనే ప్యార్ కియా చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. సినిమాసూరజ్.. హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై, వివాహ్, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించాడు. బడా నామ్ కరేంగే వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రితిక్ ఘన్షన్, ఆయేషా కడుస్కర్, రాజేశ్ తైలంగ్, అంజన సుఖని, ప్రియంవదకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.చదవండి: ఐశ్వర్య రాజేశ్ హిట్ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే? -
అతను లేకుండా ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయలేదు: సుకుమార్
పుష్ప-2 ది రూల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. టాలీవుడ్లో క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ థ్యాంక్ యూ మీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో దర్శకుడు సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.దేవీశ్రీ ప్రసాద్ లేకుండా తాను ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదని సుకుమార్ అన్నారు. భవిష్యత్తులో కూడా చేయనేమో అని వెల్లడించారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. దీంతో రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రానికి డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది.సుకుమార్ మాట్లాడుతూ.. 'నా పేరుతో పాటు ఉండే మరొక పేరు దేవీశ్రీ ప్రసాద్. నాపేరు సుకుమార్ కాదు.. దేవీశ్రీ ప్రసాద్ సుకుమార్. తను లేకుండా ఎప్పుడు సినిమా చేయలేదు. భవిష్యత్తులో కూడా తీయనేమో. అందుకే ముఖ్యంగా తను నా ఫస్ట్ ఆడియన్. పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పగానే దేవీశ్రీ కథ అయిపోయింది అన్నాడు. సినిమా ఇంతే అనేశాడు. అలా పుష్ప-2 కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే రిలీజ్ చేశాను.. అది దేవీశ్రీకి మాత్రమే తెలుసు' అని అన్నారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్ అని హింట్ ఇచ్చేశారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే చెర్రీ సైతం సెట్లో తన కూతురితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్.. సుకుమార్‌తో జతకట్టనున్నారు. తాజాగా పుష్ప డైరెక్టర్ చేసిన కామెంట్స్‌తో ఈ ప్రాజెక్ట్‌లో దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలోనే సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ చెప్పారని వెల్లడించారు. ఓపెనింగ్ సీన్ దాదాపు ఐదు నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. కాగా..రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆర్సీ17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
‘రెడ్‌బుక్’ ఎఫెక్ట్..! కాష్పటేల్కు సెనేట్ షాక్
వాషింగ్టన్:అమెరికాలోనూ కక్ష సాధింపు రాజకీయాల కాలం నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్నట్లుగానే అక్కడా రిపబ్లికన్లు ఒక ‘రెడ్‌బుక్’ రాసి పెట్టుకున్నారు. అందులో వారు టార్గెట్‌గా చేసుకున్న ప్రత్యర్థుల పేర్లు రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిపై ఎలా కక్ష తీర్చుకోవాలనేది ముందే డిసైడయ్యారు. ఈ కక్ష సాధించే సంప్రదాయమే ట్రంప్ 2.0లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) చీఫ్‌గా నామినేట్ అయిన కాశ్‌పటేల్ మెడకు చుట్టుకుంది. తాము కక్ష తీర్చుకోవాల్సిన డెమోక్రాట్లు చాలా మంది ఉన్నారని కాష్ పటేల్ గతంలో వ్యాఖ్యానించారు. కాష్ మాట్లాడిన ఈ మాటలే ప్రస్తుతం ఆయన ఎఫ్‌బీఐ చీఫ్‌గా పదవి చేపట్టేందుకు అడ్డంకిగా మారింది.ఈ మాటల వల్లే కాష్ పటేల్ నామినేషన్‌ను గత వారం అమెరికా ఎగువ సభ సెనేట్ ఆమోదించలేదు. కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమించడాన్ని డెమోక్రాట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానన్న కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమిస్తే అది రాజకీయ నియామకమే అవుతుందని వారు పేర్కొన్నారు.కాష్ పటేల్ రెడ్‌బుక్‌లో పలువురు డెమోక్రాట్ నేతలతో పాటు ట్రంప్ కేసులు వాదించిన ప్రాసిక్యూటర్లు, బైడెన్ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా ట్రంప్ గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే నామినేట్ చేయడం గమనార్హం. -
సరైన డైరెక్టర్ కోసం వెతుకుతున్న నాగార్జున & నితిన్..
-
అవునూ.. నాదే తప్పు, క్షమించండి: కృష్ణవంశీ
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam) 2004 జూలై 24 విడుదలైంది. సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో హనుమంతుడిగా ప్రముఖ నటుడు అర్జున్, హనుమాన్ భక్తుడి పాత్రలో అంజిగా నితిన్ మెప్పించారు. అయితే, హీరోయిన్ ఛార్మి(Charmy Kaur) పాత్ర ఈ సినిమాలో బాగాలేదని, అందుకే ప్రేక్షకులు తిప్పికొట్టారని పలు వాదనలు భారీగానే వచ్చాయి. హీరోయిన్ పాత్ర లేకపోయింటే ఈ చిత్రం సూపర్ హిట్ అయి ఉండేదని అప్పట్లోనే చాలామంది కామెంట్లు చేశారు. ఈ సినిమాలో మాంత్రికుడిగా నటించిన పృథ్వీరాజ్ కూడా కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో అదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. (ఇదీ చదవండి: వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య)శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో ఛార్మిని అలా ఎందుకు చూపించారు అంటూ కృష్ణవంశీని ఒక నెటిజన్ ప్రశ్నించారు. అందుకు ఆయన కూడా రిప్లై ఇచ్చారు. 'తప్పేనండి.. క్షమించండి.. తీరని సమయాలు, తీరని చర్యలు, తీరని పనులు..' అని ఆ తప్పలను ఎప్పటికీ సరిచేయలేమని ఆయన అన్నారు. ఎక్స్ పేజీలో ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి గ్లామర్ డోస్ శృతిమించిందని, ఆమె పాత్ర సినిమాను పూర్తిగా తప్పుదోవ పట్టించిందని కృష్ణవంశీపై ఆ సమయంలో బాగానే ట్రోల్ చేశారు. అప్పుడు కూడా తనదే తప్పు అని హుందాగా ఒప్పుకున్న కృష్ణవంశీ ఇప్పుడు మరోసారి క్షమించమని నెటిజన్లను కోరారు.1995లో తొలి సినిమా గులాబితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కృష్ణవంశీ.. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం,మురారి,ఖడ్గం వంటి టాప్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఖడ్గం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సోషియో ఫాంటసీ కథతో శ్రీ ఆంజనేయం విడుదల కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా బాగున్నప్పటికీ ఛార్మి పాత్ర పెద్ద మైనస్‌గా మారింది. దీంతో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. సుమారు 20 ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. 2023లో చివరిగా రంగమార్తాండ చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. Thappenandi.... Apologies.. desperate times desperate measures desperate deeds 🙏🙏 https://t.co/61ZzByYkaz— Krishna Vamsi (@director_kv) February 3, 2025 -
ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను
‘‘నేను 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అయితే సినిమా రంగంలోని వారు ఎలా ఉంటారనే విషయం అప్పటికి నాకు తెలియదు. ఓ దర్శకుడు నా కాస్ట్యూమ్స్ గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలకి బాధపడి, డిప్రెషన్లోకి వెళ్లాను’’ అని హీరోయిన్ ప్రియాంకా చోప్రా అన్నారు. ఇటీవల జరిగిన ఓ సమ్మిట్‌లో ΄పాల్గొన్న ప్రియాంకా చోప్రా కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఘటనల గురించి మాట్లాడారు. ‘‘ఓ సినిమా షూటింగ్ కోసం సెట్‌కి వెళ్లాను.నాకు ఎలాంటి దుస్తులు కావాలో నా కాస్ట్యూమ్ డిజైనర్‌కు చెప్పండి అని డైరెక్టర్‌తో అన్నాను. నా ముందే నా కాస్ట్యూమ్ డిజైనర్‌కి ఫోన్ చేసిన ఆయన... ‘కథానాయిక లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. అందుకే ప్రియాంక దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి.. తన లోదుస్తులు కనిపించాలి’ అంటూ పలుమార్లు ఆ పదాన్ని ఉపయోగించాడు.ఆ మాటలు విన్నప్పుడు చాలా నీచంగా, బాధగా అనిపించింది. దీంతో నేను డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆ డైరెక్టర్ నన్ను చిన్నచూపు చూస్తే ఆ సినిమా చేయనని చెప్పేశాను. ఆ తర్వాత ఆ మూవీ చేయలేదు. ఇన్నేళ్ల నా కెరీర్లో ఇప్పటివరకు కూడా ఆ దర్శకుడితో పని చేయలేదు’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. -
మహేశ్ బాబు, నేను కలిసి క్వశ్చన్ పేపర్ కొనేవాళ్లం: టాలీవుడ్ డైరెక్టర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం ప్రేమిస్తావా. ఈ మూవీని పంజా ఫేం విష్ణు వర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓకే స్కూల్లో చదివినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన బెంచ్‌మేట్ అయిన ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. మహేశ్ బాబుతో తన అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..' మహేశ్ బాబుతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మేమిద్దరం బెంచ్‌మేట్స్. ఆయనతో చాలా మధురమైన, సరదా క్షణాలు ఉన్నాయి. కొన్నింటిని బయటికే చెప్పలేం. మేము చెన్నైలో చదివే రోజుల్లో నేను చాలా యావరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ అనుకోండి. మహేశ్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు. ఒక ఏరియాలో ప్రశ్న పత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు. ఈ విషయం మహేశ్ బాబుతో చెప్పా. నేను వెంటనే మహేశ్ బాబును లాక్కొని అక్కడికి తీసుకెళ్లా. కానీ అక్కడకు వెళ్తే మా డబ్బులు పోయాయి కానీ క్వశ్చన్ పేపర్ అయితే దొరకలేదు. అన్నీ ఫేక్. మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేశ్ బాబు సినిమా తీస్తా' అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. నేను, #MaheshBabu డబ్బులిచ్చి QUESTION PAPER కొనేవాళ్ళం 😂 - Director #VishnuVardhan#Premisthava #TeluguFilmNagar pic.twitter.com/cq5gNxJovt— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2025 -
సబ్యసాచి ఫ్యాషన్ షోలో మెరిసిన సుకుమార్ భార్య తబిత (పోటోలు)
-
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మలయాళ దర్శకుడైన షఫీ(56)కి ఈనెల 16న హార్ట్ స్ట్రోక్ రావడంతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు పది రోజుల చికిత్స పొందుతూ కోలుకోలేక ఇవాళ మృతి చెందారు. ఆయన మరణం పట్ల ప్రముఖ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, చియాన్ విక్రమ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రియమైన స్నేహితుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని చియాన్ విక్రమ్ ట్విటర్ వేదిక విచారం వ్యక్తం చేశారు. డైరెక్టర్ షఫీలో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.విక్రమ్ ట్విటర్లో రాస్తూ "ఈ రోజు ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. అంతాకాదు ఈ ప్రపంచం ఒక అద్భుతమైన దర్శకుడిని కోల్పోయింది. నాకు తెలిసిన అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. జీవితంలోని క్షణాలలో అందాన్ని చూడగల వ్యక్తి. అతను మన మధ్య లేకపోవచ్చు.. కానీ అతనితో ఉన్న క్షణాలు ఎల్లప్పుడూ గుర్తుకొస్తాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడి పార్థిస్తున్నా. నిన్ను మిస్సవుతున్నా కానీ ఎప్పటికీ మర్చిపోలేము " అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. డైరెక్టర్ మృతి పట్ల హీరో విష్ణు ఉన్నికృష్ణన్ నివాళులర్పించారు.కాగా.. షఫీ అసలు రషీద్ కాగా.. సినిమాల్లోకి వచ్చాక షఫీ పేరుతోనే ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా కామెడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో వన్ మ్యాన్ షో మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో 10 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మలయాళంలో పులివాల్ కళ్యాణం, తొమ్మనుమ్ మక్కలుమ్, మాయావి, మరికొండొరు కుంజాడు లాంటి చిత్రాలను తెరకెక్కించారు. చివరిసారిగా 2022లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆనందం పరమానందం’ దర్శకుడిగా వ్యవహరించారు. Today, I lost a dear friend and the world lost an incredible storyteller. He was one of the most fun loving & sensitive souls I’ve ever known, someone who could see the beauty in life’s simplest moments.He may no longer walk among us, but he will always live in the laughter,… pic.twitter.com/HS8xytCvPi— Vikram (@chiyaan) January 26, 2025 -
ధనుశ్‌తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.గతంలో 2019లో ధనుశ్‌తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్‌గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina)పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షు (Actress Anshu)పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.హీరోయిన్ కోసమే సినిమా చూశా..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. పేరు మర్చిపోయినట్లుగా యాక్టింగ్ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దర్శకుడి ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో త్రినాధరావు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరాడు. 'మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే.. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. (చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! ఇప్పట్లో ఆగేలా లేడుగా)20 ఏళ్ల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. 20 ఏళ్ల తర్వాత ఆమె మజాకా మూవీతో రీఎంట్రీ ఇస్తోంది మజాకా సినిమా విషయానికి వస్తే ఇందులో సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు డైరెక్షన్ చేస్తున్నాడు.ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. త్రినాధరావు విషయానికి వస్తే.. ఈయన ప్రియతమా నీవచ కుశలమా సినిమాతో దర్శకుడిగా మారారు. మేం వయసుకు వచ్చాం, నువ్వలా నేనిలా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా పలు సినిమాలు తెరకెక్కించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత మజాకా మూవీ చేస్తున్నాడు. Yesterday was an unfortunate slip of the tongue by Dir #NakkinaTrinadhRaoIt’s a wrong example to set & we should have been cautious to avoid itTrinadh garu & Team #Mazaka apologise for the poor choice of words to Anshu garu & to all Women out there,We are because of you ♥️ pic.twitter.com/KQvLSeBtJ1— Sundeep Kishan (@sundeepkishan) January 13, 2025 చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ? -
ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు.. వారికోసమే ఇంకా బతికి ఉన్నా: స్టార్ డైరెక్టర్
మలయాళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా కాల్ చేయలేదని అన్నారు. అసలేం జరిగిందో కూడా తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్ అవసరమైనప్పుడు ఎవరూ సహకరించలేదని అసహనం వ్యక్తం చేశారు.గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ..' ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. 2017లో నా సినిమా ధృవ నచ్చితిరమ్(తెలుగులో ధృవనక్షత్రం) విడుదల కాలేదు. కానీ ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కనీసం నా సమస్య గురించి ఎవరూ కూడా ఫోన్ చేయలేదు. అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కేవలం ధనుశ్ సార్, లింగుసామి లాంటి వ్యక్తులు నా సినిమా చూశారు. విడుదల చేసేందుకు ప్రయత్నిచారు. కానీ వారికి ఉన్న సమస్యల వల్ల వీలుకాలేదు. మరికొందరికి ఈ సినిమా చూపించాను. కానీ కొన్ని సమస్యల వల్ల ఎవరూ ముందుకు రాలేదు. ప్రేక్షకులు ఇప్పటికీ సినిమాని చూడాలని కోరుకుంటున్నందు వల్లే ఇంకా నేను బతికి ఉన్నా.' అని అన్నారు. కాగా.. 2017లో విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నచ్చతిరమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రీతూ వర్మ, ఆర్ పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్ వాసుదేవ్ మేనన్ అసహనం వ్యక్తం చేశారు. గౌతమ్ చాలా సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు.నటుడిగా రాణిస్తున్న డైరెక్టర్గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటనలో దూసుకెళ్తున్నారు. చివరిసారిగా 2024లో రత్నం, హిట్ లిస్ట్, హిట్లర్. విడుతలై పార్ట్- 2 చిత్రాలలో కనిపించాడు. అంతే కాకుండా త్వరలో వరాహం, బజూకా, తలపతి 69 చిత్రాల్లో నటించనున్నాడు. త్వరలోనే మలయాళంలో డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ అనే మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. అతని చివరిసారిగా దర్శకత్వం వహించిన 2024 చిత్రం జాషువా ఇమై పోల్ కాఖా ఇంకా విడుదల కాలేదు. -
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్‌డే విశేషాలు (ఫోటోలు)
-
టాలీవుడ్లో విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ డైరెక్టర్ కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) మృతి చెందారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో ఉంటున్న ఆమె గురువారం కన్నుమూశారు. క్యాన్సర్ చికిత్స కోసం యూఎస్ వెళ్లిన అపర్ణ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అపర్ణ మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) నటి, రచయితగా రాణించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో ఆమె సినీ కెరీర్ ప్రారంభించారు. పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే పెళ్లికూతురు పార్టీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. -
పెద్ద హీరోతో సినిమాకు సైన్ చేశా.. ఆ సౌత్ డైరెక్టర్ హోటల్ రూమ్‌కు రమ్మన్నాడు: హీరోయిన్
బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారామె. బాలీవుడ్ కామెడీ షో ది కపిల్ శర్మ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో ఉపాసన కనిపించారు. అంతేకాకుండా ఉపాసన పంజాబీ సినిమాల్లో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ..'అనిల్ కపూర్ సరసన ఒక పెద్ద సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ మూవీకి సైన్ చేశా. నేను డైరెక్టర్ ఆఫీసుకి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ, సోదరిని తీసుకెళ్లేదాన్ని. ఒక రోజు అతను నన్ను ఎప్పుడూ ఎందుకు మీ అమ్మను తీసుకొని వస్తావు అని అడిగాడు. ఒక రోజు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని చెప్పి తన హోటల్‌కు రమ్మని అడిగాడు. నా వద్ద కారు లేదని.. రేపు ఉదయం ఆఫీస్‌కు వచ్చి కథ వింటానని చెప్పా. కానీ దానికి ఆయన.. నీకు సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా?’ అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దర్శకుడితో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదని' అని తెలిపింది.ఆ తర్వాత మాట్లాడుతూ.. "డైరెక్టర్ కార్యాలయం ముంబయిలోని బాంద్రాలో ఉంది. మరుసటి రోజు ఉదయం నేను డైరెక్టర్ ఆఫీస్‌కు వెళ్లా. అక్కడ మరో నలుగురు వ్యక్తులతో ఆయన సమావేశంలో ఉన్నారు. అతని సెక్రటరీ నన్ను బయట వేచి ఉండమని చెప్పాడు. కానీ నేను అలా చేయలేదు. మీటింగ్‌లో ఉండగానే లోపలికి ప్రవేశించా. దాదాపు ఐదు నిమిషాల పాటు పంజాబీలో అతనిని దుర్భాషలాడాను. వాళ్ల ముందే అతన్ని తిట్టి బయటకు వచ్చేశా. కానీ ఆ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో ఎంతో ఏడ్చేశా. ఆ తర్వాత వారంరోజుల పాటు బయటకు రాలేదు. అప్పటికే అనిల్ కపూర్‌తో సినిమా చేస్తున్నానని చాలామందికి తెలియజేశా. ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పాలని ఆలోచించా. కానీ ఆ పరిస్థితులే నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా'అని ఉపాసన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ డైరెక్టర్ పేరును మాత్రం రివీల్ చేయలేదు.కాగా.. ఉపాసన సింగ్ తన కెరీర్లో సినిమాలతో పాటు బుల్లితెరపై మెరిసింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి జుడ్వా (1997)లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెయిన్ ప్రేమ్ కీ దివానీ హూన్ (2003), క్రేజీ 4 (2008) చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. కపిల్ శర్మ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మరింత ఆదరణ దక్కించుకుంది. అంతేకాకుండా డర్, లోఫర్, భీష్మ, బాదల్, హంగామా, హల్చల్, డిస్కో సింగ్, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాల్లో ఉపాసన సింగ్ నటించారు. -
అప్పటి వరకు మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్: రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
న్యూ ఇయర్ సందర్భంగా రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త ఏడాది అనేది కేవలం అప్పటి వరకు మాత్రమే ఉంటుందని పోస్ట్ చేశారు. ఈ రోజు 31 రాత్రి నుంచి జనవరి 1 మధ్యాహ్నాం వరకు మాత్రమేనని రాసుకొచ్చారు. మీరు మీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వచ్చాక అసలు విషయం అర్థమవుతుందన్నారు. గతేడాదిలో వెంటాడిన సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని.. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. రాంగోపాల్ వర్మ టాలీవుడ్లో సంచలన డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున నటించిన శివ మూవీతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ఆ తర్వాత ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆర్జీవీ డెన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.శారీ మూవీ..తాజాగా ఆర్జీవీ ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా శారీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది.HAPPY NEW YEAR will last only from 31st night till 1st afternoon , when u wake up from ur hangover and realise that all the OLD YEAR’S problems are still there in the NEW YEAR 😎 #HappyOldYear— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2024 -
బాలీవుడ్‌పై నాగవంశీ అలాంటి కామెంట్స్.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాజాగా నిర్వహించిన నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. దక్షిణాది ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలను చూసే విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, యానిమల్, జవాన్ చిత్రాలతో ఆ మార్పును చూశామని అన్నారు.అయితే నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్‌పై బాలీవుడ్ డైరెక్టర్ బోనీకపూర్ స్పందించారు. దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉందన్నారు. అలాగే తెలుగు సినిమాలకు యూఎస్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.. అంతేకాకుండా తమిళ చిత్రాలకు సింగపూర్, మలేషియాలో డిమాండ్ ఉందని తెలిపారు. గల్ఫ్ దేశాలతో పోలిస్తే యూఎస్ పెద్ద మార్కెట్ అని బోనీ కపూర్ అన్నారు. అయితే మలయాళ సినిమాకు గల్ఫ్‌లో భారీ మార్కెట్ ఉందని నాగవంశీ అన్నారు.అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైందన్న నాగవంశీ కామెంట్స్‌ను బోనీ కపూర్ వ్యతిరేకించారు. పుష్ప- 2 హీరో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్‌కి పెద్ద అభిమానిని అని చెప్పిన విషయాన్ని బోనీకపూర్ గుర్తు చేశారు. అంతేకాకుండా తాను సీనియర్ ఎన్టీఆర్‌కు బిగ్ ఫ్యాన్ అని అన్నారు. దీనికి స్పందిస్తూ.. తాను షారూఖ్, అల్లు అర్జున్, చిరంజీవికి పెద్ద అభిమానినని నాగవంశీ అన్నారు.ఇటీవల మీడియాతో అమితాబ్ బచ్చన్ మాట్లాడిన విషయాన్ని బోనీ కపూర్ గుర్తు చేశారు. సినిమాకు భాష అడ్డంకి కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఈరోజు మరాఠీ సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయని బోనీకపూర్ తెలిపారు. మరాఠీ సినిమా ఈ తరహా బిజినెస్ చేస్తుందని ఎవరూ ఊహిందలేదన్నారు. -
టాలీవుడ్ డైరెక్టర్‌కు షాక్.. మాట్లాడుతుండగా మూకుమ్మడి దాడి!
ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రం డ్రింకర్ సాయి. ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై దాడి జరిగింది. సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరుకు వెళ్లిన ఆయన శివ థియేటర్ వద్ద మాట్లాడుతుండగా ఊహించని విధంగా ఆయనపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై మంతెన సత్యనారాయణ ఫాన్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన్ను కించపరిచేలా సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సమాచారం.కాగా.. డ్రింకర్ సాయి చిత్రాన్ని కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఓ డ్రింకర్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. #DrinkerSai దర్శకుడు మీద దాడి చేసిన మంతెన సత్యనారాయణ అభిమానులు.. pic.twitter.com/xQ7JL6IQbZ— Suresh PRO (@SureshPRO_) December 29, 2024 -
డైరెక్టర్ పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్.. ట్రైన్లో వెళ్తూ చిల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే పెళ్లికి హాజరైంది. అయితే ఈ వివాహా వేడుకలో పాల్గొనేందుకు రైలులో ప్రయాణించింది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్న వీడియోను పంచుకుంది.ట్రైన్లో రత్నగిరి చేరుకున్న నోరాకు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత డైరెక్టర్ హల్దీ వేడుకలో నోరా ఫతేహీ డ్యాన్స్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. డైరెక్టర్ అనూప్ సర్వేతో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని నోరా ఫతేహీ తెలిపింది. 2017 నుంచి తన సినీ ప్రయాణంలో ఉన్నాడని రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే నోరా ఫతేహి చివరిసారిగా మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ధృవ సర్జా నటిస్తోన్న కేడీ - ది డెవిల్తో కన్నడలో అరంగేట్రం చేస్తోంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'ఆ థియేటర్‌తో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు'.. గుర్తు చేసుకున్న కల్కి డైరెక్టర్
కల్కి మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కల్కి పార్ట్-2 పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ థియేటర్‌ను గుర్తు చేసుకున్నారు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగు సినిమా చరిత్రలో సత్యం థియేటర్ ఒక భాగమన్నారు. ఆ థియేటర్లో గీతోపదేశంలోని కుడ్యచిత్రం అంతర్భాగమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే మల్టీప్లెక్స్‌గా మార్చాక ఆ ఆ కుడ్యచిత్రాన్ని భద్రపరచలేదని ఆవేదన చెందాను.. కానీ మళ్లీ ఆ ఫోటోను చూడడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఆ చిత్రాలను అలాగే భద్రపరచిన నిర్మాత సునీల్ నారంగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సత్యం థియేటర్ మళ్లీ సత్యంగానే మారిందని ఇన్‌స్టాలో నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
ముంబయిలో దర్శకుడు శ్యామ్ బెనెగల్ అంత్యక్రియలు (ఫొటోలు)
-
భాగ్యనగర్ కా బెనగళ్..
సాక్షి, హైదరాబాద్: విఖ్యాత సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్‌కు నగరంతో విడదీయరాని అనుంబంధం ఉంది. ఆయన చదువు ఇక్కడే కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని నిజాం కళాశాల నుంచి ఆరి్థక శాస్త్రంలో శ్యామ్ బెనగళ్ పట్టభద్రుడయ్యాడు. అదే సమయంలో ఆయన హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. నాన్నే తొలి గురువు... నగరంలో ఉండగానే తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు శ్యామ్ బెనగళ్. ఆయన తండ్రి నగరంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా ప్రాచుర్యం పొందాడు. ఖాళీ సమయాల్లో ఆయన 16 ఎంఎం కెమెరాతో తన పిల్లలతోనే సినిమాలను షూట్ చేసేవారు. ఆయన దగ్గర ఈ సినిమాల భారీ కలెక్షన్ ఉంది. శ్యామ్ బెనగళ్ది పెద్ద కుటుంబం. ఆయనతో కలిపి పది మంది పిల్లలు. ‘నాకు మా నాన్న తొలిగా సినిమా గురించి అవగాహన కల్పించారు. మా డిన్నర్ తర్వాత వినోదం.. మా నాన్న రూపొందించిన చిత్రాలను చూడటమే. సినిమాతో నా ప్రమేయం అలా మొదలై చివరికి నన్ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్‌గా మార్చింది’ అంటూ శ్యామ్ బెనగళ్ గుర్తు చేసుకునేవారు. తన తండ్రికి చెందిన 16 ఎంఎం సినిమా కెమెరాతో వేసవి సెలవుల్లో తన అన్నదమ్ములు, కజిన్లు కలిసినప్పుడు తాను తీసిన ‘చుటియో మే మౌజ్ మజా (సెలవుల్లో వినోదం, ఆటలు)’ తన మొదటి సినిమాగా ఆయన పేర్కొంటారు. కంటోన్మెంట్ ఏరియాలో... సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో తాము నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఆర్మీ గ్యారీసన్‌లో సినిమా ప్రదర్శనలు ఉండేవనీ, ప్రధానంగా సైన్యం కోసం ఉద్దేశించిన ఆ ప్రదేశంలో వారాంతంలో ఆంగ్ల భాషా చిత్రంతో పాటు, వివిధ భారతీయ భాషలలోని చలనచిత్రాలు ప్రదర్శించేవారని ఆయ న తన చిన్ననాటి స్మృతులను నెమరేసుకునేవారు. అనుబంధం..అపురూపం... ‘హైదరాబాద్ నా జన్మభూమి’ అని శ్యామ్ బెనగళ్ సగర్వంగా చెప్పేవారు. తాను జని్మంచిన నగరం గురించి ‘నేను ఇక్కడ పెరిగాను, నా పాఠశాల కళాశాల ఇక్కడే. ఇక్కడ మరే ఇతర ప్రదేశంలో లేని విశిష్టమైన స్వభావం, మిశ్రమ సంస్కృతి దీని సొంతం’ అంటూ కొనియాడేవారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నిజాం కాలేజ్‌లో చదువుకున్న తాను ప్రస్తుతం పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘విశ్వవిద్యాలయం ఇప్పటికీ గొప్పగా ఉంది, కానీ అక్కడ రాజకీయ ప్రమేయం పెరిగింది’ అంటూ ఆయన తాను చదువుకున్న ఉస్మానియా గురించి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేపథ్యంలో మరో చిత్రం తీస్తానన్నారు... తన సినిమాలపై తెలంగాణ ప్రభావం గురించి మాట్లాడుతూ తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘అంకుర్, నిషాంత్, మండి చిత్రాలపై ఈ ప్రాంత ప్రభావం ఉందని బెనగళ్ అనేవారు. తెలంగాణ నేపథ్యంలో మరొక కథ దొరికితే, తాను ఖచి్చతంగా దాన్ని కూడా సినిమాగా మలుస్తాను అంటూ ఈ రాష్ట్రంపై ప్రేమను చాటేవారాయన. అనుగ్రహం అనే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన బెనగళ్‌కు తెలుగు మాట్లాడటం అంతగా రాదు.‘నాకు తెలుగు బాగా అర్థం అవుతుంది కానీ మాట్లాడటం కొంచెం కష్టమవుతుంది’ అనేవారు. తాను హైదరాబాద్‌ను విడిచిపెట్టి 50 సంవత్సరాలకు పైనే అవుతున్నా, ఈ సిటీపై ఇష్టానికి దూరం కాలేదంటారు. ‘ఇది సినిమా క్రేజీ సిటీ. ఇక్కడ భారీ సంఖ్యలో ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. చాలా మంది మంచి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ ఉన్నారు’ అంటూ కొనియాడేవారు. ఆయన ఇప్పుడు లేకున్నా..ఆ మంచి దర్శక నిర్మాతలకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందనేది వాస్తవం. -
సమాంతర సినిమా సృష్టికర్త శ్యామ్ బెనగళ్
శ్యామ్ బెనగళ్– ఈ పేరు ఈ తరం ప్రేక్షకులకి తెలిసి ఉండవచ్చు. కానీ సినిమాలు తెలిసి ఉండక పోవచ్చు. భారతీయ సినిమా భాషా భేదాలు లేకుండా కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో ప్రవాహానికి ఎదురీదిన వాడు, సమాంతర (పారలల్ ) సినిమాకి ఊపిరి పోసిన వాడు శ్యామ్ బెనగళ్. ఆయన పూర్తి పేరు బెనగళ్ళ శ్యామ్ సుందర రావు. సికింద్రాబాద్‌లో డిసెంబరు 14, 1934న జన్మించారు. సరిగ్గా 90 సంవత్సరాల 9 రోజులు ఈ భూమి మీద బతికారు. భారతీయ సినిమా రంగంలో ఇకపై ఎన్ని వందల ఏళ్ళు శ్యామ్ బెనగళ్ జీవించి ఉంటారనేది చరిత్ర చెబుతుంది. తెలంగాణ– ఆయనకి ఊహ తెలిసేటప్పటికి ఇంకా నిజాం పాలనలోనే ఉంది. అప్పటి దొరల దౌర్జన్యాలు, పెత్తందారీతనాలు– అట్టడుగు ప్రజల, ముఖ్యంగా స్త్రీల కన్నీటి కథలు– శ్యామ్ బెనగళ్ గుండెలపై చెరగని జ్ఞాపకాలు అయ్యాయి. అందుకే తన మొదటి సినిమా అంకుర్ – ఇదే తెలంగాణ నేపథ్యంలో తీశారు. అప్పటిలో నిజాం రాజ్యంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాలు కలిసి ఉండేవి. ఈ మూడుప్రాంతాల సంస్కృతులు, నేపథ్యాలు – శ్యామ్ బెనగళ్ని వెంటాడాయి. యాడ్ ఏజన్సీ లో కాపీ రైటర్‌గా కెరీర్‌ని ఆరంభించినా – ఆయన దృష్టి సినిమాల మీదే ఉండేది . కమర్షియల్ సినిమాల ప్రభంజనంలో – ఆర్టిఫిషియల్ హీరోలను కాకుండా– జీవితాన్ని – సమాజం లోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనుకున్నాడు శ్యామ్. హైదరాబాద్‌లో ఫిలిమ్ సొసైటీప్రారంభించిన వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్లు అతి కష్టం మీద తెప్పించుకుని, సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారు. తెలిసిన జీవితాలు, చూసిన సినిమాలు శ్యామ్ బెనగళ్ ఆలోచనల్లో పారలల్ సినిమా ప్రపంచాన్ని çసృష్టించాయి . కొత్త కథలు చెప్పాలి, జనం మస్తిష్కాలు కదిలించాలని శ్యామ్ బెనగళ్లో ‘అంకుర్’ సినిమాతో భారతీయ సినిమా తెరపై తన సంతకాన్ని పెట్టారు.1978–1980 మధ్య తెలుగు సినిమా అడవి రాముడు నుంచి శంకరాభరణం సినిమాల మధ్య బాక్సాఫీస్ ఊయలలు ఊగుతుండగా, ఓ బ్రహ్మాండమైన మలుపు తిరగబోయి ఆగిపోయింది. సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కొందరు– శ్యామ్ బెనగళ్, మృణాల్ సేన్, గౌతమ్ ఘోష్ – తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, ఆమోదానికి ఫిదా అయ్యారేమో తెలియదు కానీ – హిందీలో కాకుండా తెలుగులో పారలల్ సినిమాలు తీశారు. ‘మా భూమి’ అంటూ గౌతమ్ ఘోష్ అత్యద్భుతమైన సినిమాలు అందించారు. వీరి మధ్యలో శ్యామ్ బెనగళ్ మరాఠీ నవల ఆధారంగా తెలుగులో ‘అనుగ్రహం’ సినిమా తీశారు. తెలుగుతో పాటు హిందీలో ఇదే కథతో కొండూర– టైటిల్‌తో పారలల్‌గా తీశారు. రెండింటిలో అప్పటి అగ్ర కథానాయిక వాణిశ్రీ హీరోయిన్. అనంత్ నాగ్ హీరో . స్మితా పాటిల్ తెలుగులో నటించిన సినిమా ఇదే! అలాగే అమ్రేష్ పురి జగదేక వీరుడు – అతిలోక సుందరి మొదలైన వాటి కన్నా చాలా చాలా ముందు తెలుగులో నటించిన సినిమా అనుగ్రహం. తెలుగులో ఆరుద్ర, గిరీష్ కర్నాడ్‌తో కలిసి స్క్రీన్ ప్లే రాశారు శ్యామ్ బెనగళ్. ఆరుద్ర మాటలు– పాటలు రాశారు. రావు గోపాలరావు గుర్తుండి పోయే పాత్ర చేశారు. అయితే శ్యామ్ బెనగళ్ చెప్పిన కథా విధానం అప్పటి ప్రేక్షకులకి రుచించ లేదనే చెప్పాలి. ఆ రోజుల్లో అభిరుచి ఉన్న ప్రేక్షకులు అంకుర్, నిషాంత్ , మంథన్ , భూమిక – ఏ ఫిలిమ్ సొసైటీల్లో చూపిస్తారా అని తిరుగుతుండేవారు. సగటు ప్రేక్షకులేమో ఈయనేంటి – వేరే కథలు చెబుతున్నారు – మనకి తెలియని జీవితపు కోణాలు పట్టుకుంటున్నారు అని డిస్ట్రబ్ అవుతుండే వారు. ఎదిగిన కొద్దీ ప్రేక్షకులకు శ్యామ్ బెనగళ్ను ఇంకొంచెం అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అనంత్ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్ షా , ఓం పురి , స్మితా పాటిల్ , అమ్రేష్ పురి , లాంటి గొప్ప నటుల్ని కనుగొన్న కొలంబస్ – శ్యామ్ బెనగళ్. ముఖ్యంగా మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా శ్యామ్ బెనగళ్ దూరదర్శన్ కోసం తీసిన సీరియల్ ఎప్పటికీ గుర్తుంచు కోదగ్గది. ముస్లిమ్ మహిళల జీవితాలను çస్పృశిస్తూ మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు రూపొందించారు. కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ – మహా భారతాన్ని ఓ బిజినెస్ సామ్రాజ్యానికి అన్వయిస్తూ శశి కపూర్ తీయించిన ‘కలియుగ్’ శ్యామ్ బెనగళ్ ప్రయోగం. 23 డిసెంబర్ 2024న కన్ను మూశారు శ్యామ్ బెనగళ్. కన్ను మూసినా ఆయన ఆలోచనల్లో తీరని కలలు చెప్పని కథలు ఏమున్నాయో మనకి తెలియదు. కానీ కొత్త తరం రచయితలు, దర్శకులు శ్యామ్ బెనగళ్ స్ఫూర్తితో ఏ కొత్త సినిమాని పరిచయం చేస్తారోనని ఎదురు చూద్దాం. – తోట ప్రసాద్, సినీ రచయితసంతాపంసువర్ణాధ్యాయం ముగిసిందిభారతీయ సినిమా, టెలివిజన్ రంగాల్లోని ఓ సువర్ణాధ్యాయం శ్యామ్‌బెనగళ్ మరణంతో ముగిసింది. కొత్త తరహా సినిమాలనుప్రారంభించి, క్లాసిక్ సినిమాలను రూపొందించారు. నిజమైన ఇన్స్టిట్యూషన్కు ఆయన ఓ నిదర్శనం. ఎందరో కళాకారులను, నటులను తీర్చిదిద్దారు. సినిమా పరిశ్రమకు శ్యామ్ బెనగళ్ చేసిన సేవలు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారంతో సహా ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు, ఎంతోమంది ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. – భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతీవ్రంగా బాధించిందిశ్యామ్ బెనగళ్ గారి మరణం తీవ్రంగా బాధించింది. ఆయన కథలు ఇండియన్ సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆయన ప్రతిభ ఎప్పటికీ ప్రజాదరణకు నోచుకుంటూనే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – భారత ప్రధానమంత్రి నరేంద్రమోదిఫిలిం మేకర్స్‌కు స్ఫూర్తిసమాంతర సినిమాకు నిజమైన మార్గదర్శకుడు, ఆలోచింపజేసే కథ, కథనాలు, సామాజిక సమస్యలతో సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు బెనగళ్. 18 జాతీయ చలన చిత్ర అవార్డులతో సహా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్, దాదాసాహెబ్ఫాల్కే అవార్డులను అందుకున్నారు. ఆయన చరిత్ర ఫిల్మ్‌మేకర్స్‌కు స్ఫూర్తినిస్తుంది. – కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేభావితరాలకు ప్రేరణవిజనరీ ఫిల్మ్‌మేకర్ శ్యామ్ బెనగళ్ గారి మరణవార్త బాధిస్తోంది. సినిమాల్లో అద్భుతంగా సాగిన ఆయన ప్రయాణం, సామాజిక అంశాలపై అంకితభావంతో ఆయన చేసిన సినిమాలు భావితరాలకు ప్రేరణగా నిలుస్తాయి. – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీసాంస్కృతిక సంపదమన దేశంలోనే అత్యుత్తమ ఫిల్మ్‌మేకర్, మేధావి అయిన శ్యామ్ బెనగళ్గారి మరణం నన్ను బాధించింది. సినిమా రంగంలోని ప్రతిభావంతులను గుర్తించి, ్రపోత్సహించారు. ఆయన తీసిన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారతదేశ సాంస్కృతిక సంపదలో భాగమయ్యాయి. సహచర హైదరాబాదీ వాసి, మాజీ రాజ్యసభ సభ్యులు అయిన బెనగళ్గారి అద్భుతమైన చిత్రాలు, భారతీయ సినిమాలో ఎప్పటికీ మన్ననలు పొందుతూనే ఉంటాయి. – చిరంజీవి -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.అనేక అవార్డులు- ప్రశంసలుదాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్-2005పద్మశ్రీ -1976పద్మ భూషణ్-1991ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం- 2003ఏఎన్నార్ జాతీయ అవార్డ్-2013నిశాంత్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు -1976మంథన్ సినిమాకు ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు- 1977జునూన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు -1980 -
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మా తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడికి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి రూ.5 లక్షల సాయం చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ముందురోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్‌పై కేసు..సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు. -
అలా జరిగితే దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా?.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆర్జీవీ రియాక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో బన్నీని అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులకు తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. నాలుగు రకాల ప్రశ్నలతో ఆయన ట్వీట్ చేశారు.సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన అధికారులకు ఆర్జీవీ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవేంటో మీరు కూడా చూసేయండి. పుష్కరాలు ,బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ? అంటూ ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ? అని ట్విటర్ వేదిక నిలదీశారు.ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు ఇవే..1.పుష్కరాలు , బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ? . @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు . 1.పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?3.ప్రీ రిలీజ్…— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2024 -
కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తెచ్చిన రవితేజ!?
తెలుగు హీరోలు చాలామంది తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తారు గానీ కూతుళ్లని హీరోయిన్లని చేయడానికి ఇష్టపడరు. మిగతా విభాగాల్లో పనిచేసే విషయమై కూడా పెద్దగా ప్రోత్సహించారు. కానీ రవితేజ మాత్రం అలా కాదని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఇతడి కూతురు దర్శకత్వం నేర్చుకుంటోందట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోందట.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తీస్తున్న ఓ సినిమాకు రవితేజ కూతురు మోక్షద.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుందట. గతంలో రవితేజ కూడా ఇలానే సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత నటుడు అయ్యాడు. బహుశా మోక్షద కూడా ఇలా మొదట దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని, నటి అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ') -
'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ రిసెప్షన్.. హాజరైన నిహారిక (ఫొటోలు)
-
తిరుమలలో నటితో తెలుగు డైరెక్టర్ పెళ్లి.. హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
సారా టెండుల్కర్‌కు కొత్త బాధ్యతలు.. సచిన్ ట్వీట్ వైరల్ (ఫొటోలు)
-
నా పోస్ట్‌పై ఏడాది తర్వాత కేసులు పెట్టడమేంటి? : రాం గోపాల్ వర్మ
ఏపీలో తనపై నమోదైన కేసులపై టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడారు. ఏడాది క్రితం తాను పెట్టిన పోస్టుపై ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం ఏంటో నాకర్థం కావడం లేదన్నారు. ఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో తనపై నమోదైన కేసులపై స్పందించారు.గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు. ఆ తర్వాత నేను పోలీసులకు మేసేజ్ పెట్టానని.. కానీ వాళ్లు కొందరు మీడియావాళ్లతో కలిసి వచ్చారని తెలిపారు. దానికి ఆ మీడియా సంస్థలు ఏవేవో కథనాలు రాశాయని ఆర్జీవీ అన్నారు. సోషల్ మీడియా కంటే ముందుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నన్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో రాస్తారని.. నేను టీవీ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తుంటే పారిపోయాడంటూ ప్రచారం చేశారని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.(ఇది చదవండి: రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట)గవర్నమెంట్ మారినా పోలీసులు ఇంకా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కొందరు తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అర్జీవీ అన్నారు. మీ అభిప్రాయం చెప్పినప్పుడు.. నా అభిప్రాయంగా కూడా తీసుకోవాలి కదా.. అదే స్పిరిట్ అని ప్రశ్నించారు. నాపై కూడా ఎన్నో మీమ్స్ వస్తుంటాయి.. నేను ఏదైనా పోస్ట్ పెడితే 90శాతం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఇంత మంది ఒకేసారి కేసులు పెట్టడంపై ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.అయితే నేను వ్యూహం రిలీజ్ టైములో పొలిటికల్ సినిమా తీయనని చెప్పానని.. ఆ మూవీ విషయంలో సెన్సర్ వాళ్లతో ఇబ్బంది పడి ఇక చేయనని చెప్పినట్లు ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి డెన్‌కు వచ్చామని పోలీసులు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. కాగా.. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపై కొందరు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఆ కేసులను క్వాష్ చేయాలంటూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. తాను చేసిన ఒక్క పోస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదికి సూచించింది.కేసులకు భయపడటం లేదు: ఆర్జీవీఆంధ్రప్రదేశ్లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
ఎన్టీఆర్ హీరోయిన్ను పరిచయం చేసిన వై.వి.ఎస్.చౌదరి (ఫోటోలు)
-
సన్ ఆఫ్ సర్దార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు. -
అలా చేస్తే కచ్చితంగా లీడర్ అవుతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల వరుస మ్యూజింగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో ఎలా నడుచుకోవాలో తన మాటల ద్వారా మోటివేట్ చేస్తున్నారు. తాజాగా ప్లే ఫూలిష్ అనే కాన్సెప్ట్‌తో మరో కొత్త మ్యూజింగ్‌ను విడుదల చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి.పూరి మ్యూజింగ్స్‌లో మాట్లాడుతూ.. 'ది ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫూలిష్.. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి చాలామంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్.. అది నీ బిజినెస్, జాబ్‌లో చాలామంది పోటీదారులు, సీనియర్స్, అనుభవజ్ఞులు ఉంటారు. నీకంటే బాగా సక్సెస్ అయినవాళ్లు ఉంటారు. వాళ్లందరినీ స్మూత్‌గా డీల్ చేసే థియరీ ప్లే ఫూలిష్. అంటే నిజంగానే ఫూల్‌లా ఉండటం కాదు. వాళ్ల ముందు తక్కువ నాలెడ్జ్ వాళ్లలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరింకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినటం నేర్చుకుంటే మనం ఎంత మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? అనే విషయాలు అర్థమవుతాయి. నీ పోటీదారులను ఎప్పుడు శత్రువులుగా చూడొద్దు. వారిని మెంటార్స్‌గా భావించండి. అతను, నువ్వు ఓకే బిజినెస్ చేస్తున్నా.. అతనికంటే నీకు తక్కువ తెలుసనే ఫీలింగ్ రావాలి' అని సూచించారు.ఇదేమీ మానిపులేటేడ్ టాక్టిక్ కాదు.. వాదించడం మానేసి.. జీనియస్‌గా వ్యవహరించడం.. నువ్వు తక్కువ నాలెడ్జ్ వాడిలా కనిపించినప్పుడు.. అవతలివాళ్లు నిన్ను ఇబ్బందిగా భావించరు. నీపై ఫోకస్ పెట్టరు. నీకు తెలిసినా సరే బేసిక్స్ చెప్పమని అడగండి. అలా అడిగితేనే అవతలివాళ్లు ఆనందంగా సమాధానం చెబుతారు. వాళ్లు ఏమనుకుంటున్నారో వినాలి.. అప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. నీవల్ల వాళ్లకి ఇబ్బంది లేదని ఫీలవ్వాలి. అప్పుడే వాళ్ల స్ట్రాటజీలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో చర్చలు జరపాలంటే నాలెడ్జ్ చాలా అవసరం. అది నీ సీనియర్స్, పోటీదారుల నుంచి నేర్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ల స్కిల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. అందుకే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా చెబితే నేర్చుకుంటా అనేలా ఉండాలి. నీకే ఎక్కువ తెలిసినట్లు మాట్లాడితే.. అవతలి వ్యక్తి ఏది నీతో షేర్ చేసుకోడు. పైగా నువ్వు వాడి దృష్టిలో అహంకారిగా కనిపిస్తావు. అందరితో శత్రుత్వం మనకెందుకు? మీరు ఏదైనా అనుకుంటే అందులో సూచనలు చేయమని అడుగుతూ ఉంటే మంచిది. వాళ్లు మీ జీవితంలో సపోర్టింగ్ పర్సన్ అవుతాం. సోక్రటీస్ ఒకమాట చెప్పాడు. 'నాకు తెలిసింది ఏంటంటే.. ఏమీ తెలియదని'. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడూ బిగినర్స్ మైండ్ సెట్‌తోనే ఉండాలి. అబ్రహాం లింకన్ ఇలాగే ఉండేవాడట. ఎదుటి వాడి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీకు ఎన్నో స్ట్రాటజీలు అర్థమవుతాయి. ప్లే ఫూలిష్ పవర్ఫుల్. ఈ ఆర్ట్‌లో మాస్టర్ అయితే మీరు లీడర్‌గా మంచి పొజిషన్లో ఉంటారు' అని చెప్పారు.కాగా.. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మించారు. -
‘వర్చువల్ విచారణకు హాజరవుతానని వర్మ ముందే చెప్పారు’
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరి ‘అరెస్ట్’ పేరిట హడాడివి చేశారు. అయితే.. వర్మ తాను ఫిజికల్‌గా హాజరయ్యేందుకు సమయం కోరిన విషయాన్ని ఆయన లాయర్ బాల మీడియాకు వివరించారు. ‘‘విచారణకు రెండు వారాల సమయం కోరాం. ఈలోపు వర్చువల్‌గా విచారణకు తాను హాజరవుతానని వర్మ ఇదివరకే చెప్పారు. ఫిజికల్‌గా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలన్నారు అని న్యాయవాది తెలిపారు. అయితే.. ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ అందించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. ఆర్జీవీ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని.. అందువల్లే డిజిటల్ విచారణకు హాజరవుతామని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని న్యాయవాది స్పష్టం చేశారు. అయితే.. ఈలోపే ఏపీ ప్రకాశం జిల్లా పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చారు. ఆయన కోసం వేచిచేస్తూ.. మీడియాలో హడావిడి ప్రదర్శించాక అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. -
అలా చేస్తే సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకులను అలరించాడు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో బిగ్‌బుల్‌గా కనిపించారు.సినిమాల విషయం పక్కనపెడితే.. దర్శకుడు పూరి మ్యూజింగ్స్ పేరుతో మోటివేషనల్ సందేశాలు ఇస్తుంటారు. జీవితంలో తను అనుభవాలతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి వాటిని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన మరో గొప్ప సందేశాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటారు. అదేంటో మనం కూడా వినేద్దాం.పూరి మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' చైనాలో లావోజు అనే గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన 571 బీసీలో జన్మించారు. ఆయనొక మంచి మాట చెప్పారు. నీ ఆలోచనలను గమనించు. ఎందుకంటే అవే నీ మాటలవుతాయి. నీ మాటలే నీ యాక్షన్స్ అవుతాయి. అవే నీ అలవాట్లు.. ఆ తర్వాత అదే నీ క్యారెక్టర్ అవుతుంది. మరి మనకు థాట్స్ ఎలా వస్తాయి. మనం రోజు దేన్నైతే చూస్తామో అవే గుర్తుకొస్తాయి. చదివే పుస్తకాలు, చూసే వీడియోలు, సంభాషణలన్నీ మన ఆలోచనలు మార్చేస్తాయి. పనికిరానివన్నీ చూస్తూ టైమ్ పాస్ చేస్తే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు. ' అని అన్నారు.ఆ తర్వాత..' మనం మొబైల్లో రోజు ఎన్నో చూస్తుంటాం. రోడ్డెక్కితే ఏదో ఒకటి మనం చూస్తుంటాం. వీటిలో మనం దేనికైనా ఎమోషనల్ అయితే.. అందులోనే మనం కొట్టుకుపోతాం. రోజు నాలెడ్జ్ పెంచుకోకపోయినా ఫర్వాలేదు.. నాన్ సెన్స్ తీసుకోకపోతే చాలు. అందుకే మంచిది, మనకు పనికొచ్చేది మాత్రమే తీసుకుంటే మంచిది. అప్పుడే మన థాట్స్ మారతాయి. మన క్యారెక్టర్‌తో పాటు రాత కూడా మారుద్ది. ' అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మన పూరి జగన్నాధ్ చెప్పినవి జీవితంలో పాటిస్తే సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా పాటించాల్సిందే. -
హీరోయిన్ భానుప్రియను పెళ్లాడాలనుకున్నారా? డైరెక్టర్ ఆన్సరిదే!
సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడరు, గోపి గోపిక గోదావరి,అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి ఎన్నో విభిన్న సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించాడు డైరెక్టర్ వంశీ. హీరోయిన్ భానుప్రియను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే! చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.నా సినిమాతోనే భానుప్రియకు అలాంటి ఆఫర్లుభానుప్రియ తన కెరీర్ ఆరంభంలో ఏ సినిమా చేస్తే బాగుంటుందని నన్ను అడిగేది. సితార మూవీ తర్వాత తను బిజీ అయింది. అయితే తనకు మోడ్రన్ లుక్‌లో కనిపించే పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందేది. దీంతో నేను అన్వేషణ మూవీలో తనను గ్లామరస్‌గా చూపించాను. ఆ సినిమా బాగా ఆడింది. అప్పటినుంచి తనకు గ్లామర్ పాత్రలు వచ్చాయని తనే చెప్పింది. 35 ఏళ్లుగా చూడలేదుతనను కలిసి దాదాపు 35 ఏళ్లు అయ్యాయి అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో వంశీ.. భానుప్రియను పెళ్లి చేసుకోవాలని ఆశపడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా అందుకు వంశీ స్పందించలేదు. అది ఎప్పుడో గతానికి సంబంధించినది.. అదంతా పాత కథ. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నా భార్య కూడా చనిపోయింది. నా పెద్ద కూతురు చెన్నైలో, చిన్న కూతురు నా దగ్గరే ఉంటుందని తెలిపాడు.చదవండి: పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్ -
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్లో వివరించారు.కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు.మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. -
విశ్వంభర దర్శకుడి టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్
ప్రముఖ దర్శకుడు వశిష్ట టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించాడు. తన టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, దాని నుంచి ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా పట్టించుకోవద్దని కోరాడు.వశిష్ట విషయానికి వస్తే.. చేసింది ఒక్క సినిమానే అయినా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బింబిసార మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. గతంలో ఇతడు ప్రేమలేఖ రాశా అనే మూవీలోనూ చిన్న పాత్రలో నటించాడు.విశ్వంభర విషయానికి వస్తే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని విక్రమ్, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు.త్రిష, కునాల్ కపూర్, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.Hi everyone, I just found out that my Telegram account has been hacked. If you receive any messages from it, please ignore them. Thank you!— Vassishta (@DirVassishta) November 15, 2024చదవండి: 20 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న టాప్ హీరోయిన్ -
ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేతలకు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవుల పట్టం కడుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తన నూతన ప్రభుత్వ పాలనావర్గం ఎంపిక ప్రక్రియ జోరు పెంచారు. గతంలో డెమొక్రటిక్ పార్టీ నాయకురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది ఇటీవల రిపబ్లికన్ నేత ట్రంప్‌కు పూర్తి మద్దతు పలికిన తులసీ గబార్డ్‌కు కీలక పదవి దక్కింది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసీని ఎంపిక చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ మహిళగా తులసీ చరిత్ర సృష్టించారు. ‘‘గత రెండు దశాబ్దాలుగా మన దేశం కోసం, మన అమెరికన్ల స్వేచ్ఛ కోసం తులసి పోరాడారు. గతంలో డెమొక్రటిక్ పారీ్టలో పనిచేయడంతో ఈమెకు రెండు పారీ్టల్లోనూ మద్దతుంది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, శాంతిని పరిరక్షిస్తూ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ముందుకు నడిపిస్తారని విశ్వసిస్తున్నా’ అని ట్రంప్ పొగిడారు.ఆర్మీలో పనిచేసి, రాజకీయ నాయకురాలిగా ఎదిగి.. అమెరికాలోని టుటూలియా ద్వీపంలోని లీలోలా గ్రామంలో 1981 ఏప్రిల్ 12న తులసి జని్మంచారు. 21 ఏళ్ల వయసులో తొలిసారిగా హవాయి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2001లో అమెరికాలో 9/11 సెపె్టంబర్ దాడుల తర్వాత స్వచ్ఛందంగా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో చేరారు. 2004లో ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్‌గా సేవలందించారు. మేజర్‌గా పనిచేసి లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి పొందారు. 31 ఏళ్ల వయసులో 2012 పార్లమెంట్ ఎన్నికల్లో రెండో హవాయి కాంగ్రేషనల్ జిల్లా నుంచి డెమొక్రటిక్ అభ్యరి్థగా గెలిచి తొలిసారిగా పార్లమెంట్ దిగువ సభకు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన తులసీ 2020లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బైడెన్‌తో పోటీపడి చివరకు ని్రష్కమించి ఆయనకే మద్దతు పలికారు. తర్వాత 2022లో డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానాలకు ఆకర్షితురాలై ఆగస్ట్‌లో ట్రంప్ అనుకూల పోస్ట్‌లు పెట్టి మళ్లీ అందరి దృష్టిలో పడ్డారు. అక్టోబర్‌లో రిపబ్లికన్ పారీ్టలో చేరారు. టీనేజీలో హిందువుగా మారి.. తులసి తల్లి ఇండియానా వాసికాగా, తండ్రికి యూరోపియన్ మూలాలున్నాయి. వీళ్లిద్దరికీ భారత్‌తో సంబంధం లేదు. కానీ తులసి తల్లిదండ్రులు 1970వ దశకం నుంచి హిందుత్వాన్ని నమ్ముతున్నారు. అందుకే తమ కుమార్తెకు సంస్కృత పదమైన తులసి అని పేరు పెట్టారు. హిందువుగా పెంచారు. పార్లమెంట్లో భగవద్గీత మీదనే ఆమె ప్రమాణంచేశారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సైతం రాజకీయనేతే. ఆయన హవాయ్ సెనేటర్‌గా గతంలో పనిచేశారు.18 నిఘా సంస్థల సమన్వయంతో రోజూ బ్రీఫింగ్ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌తో కలిసి తులసి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా కీలకమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. 18 ముఖ్యమైన నిఘా సంస్థల నుంచి అనుక్షణం సమాచారం తెప్పించుకుంటూ వాటిని సమన్వయపరచాలి. ప్రతి రోజూ ఉదయాన్నే అధ్యక్షుడు ట్రంప్‌కు తాజా సమాచారంపై బ్రీఫింగ్ ఇవ్వాలి. అమెరికా విదేశాంగ విధానాలను, విదేశాల్లో అమెరికా అతిసైనిక జోక్యాన్ని తప్పుబట్టిన తులసి తాజా పదవిలో ఏమేరకు రాణిస్తారో వేచిచూడాలి. -
'కలర్ ఫోటో' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. త్వరలోనే మరో దర్శకుడి ఇంట్లో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావును ఆయన పెళ్లాడనున్నారు. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తనకు కాబోయే భార్య చాందిని రావుకు సందీప్ రాజ్ రింగ్ తొడిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీంతో ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారు.కాగా.. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు.వచ్చేనెల అంటే డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeepraaaj) -
రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
సంచలన డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదు..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవీపై పోలీసు కేసు నమోదు చేశారు.కాగా.. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పలువురు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ను టార్గెట్ చేసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా.. అక్రమ కేసులపై కార్యకర్తలకు అండగా ఉంటామని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. -
నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌లో ఆర్ఆర్ఆర్ హీరోయిన్.. ఆ పవర్ఫుల్ రోల్ కోసమేనా?
ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ పాత్రకు ఆలియానే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.అయితే ఆలియా భట్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత మరో భారీ పాన్-ఇండియా చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ రోల్స్‌కు ఆలియా భట్ పేరుగాంచింది. ఇటీవలే ఆమె లీడ్ రోల్లో నటించిన జిగ్రా మూవీ థియేటర్లలో సందడి చేసింది.అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మూవీని వైజయంతీ ఫిల్మ్స్ బ్యానర్లోనే తెరకెక్కించనున్నారు. 2025 మధ్యలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా.. అలియా భట్ ప్రస్తుతం శర్వాయ్ వాఘ్‌తో కలిసి ఆల్ఫా చిత్రంలో నటిస్తోంది. -
యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్.. మాటల మాంత్రికుడు ఎలా అయ్యాడు? (ఫొటోలు)
-
హీరోలకు మించిన ప్లానింగ్ లో స్టార్ దర్శకులు
-
అప్పుల బాధలు, భార్యకు దూరం కావడంతో సినీ దర్శకుడు మృతి
కన్నడ ప్రముఖ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్యకు కారణాలు వెలుగులోకి వచ్చాయి. సినిమా రంగంలో నటీనటులు, దర్శకులు బాగా డబ్బుతో ఏ కష్టం లేకుండా జీవిస్తుంటారని అనుకుంటారు. కానీ, ఆయన మరణం వెనుక ఆర్థిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. బెంగళూరు రూరల్ నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లిలోని అపార్ట్మెంట్లో నివసిస్తున్న గురుప్రసాద్ (52) మూడు రోజుల క్రితం ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన పూర్తిపేరు గురుప్రసాద్ రాఘవేంద్ర శర్మ, కనకపుర స్వస్థలం. సినిమాలపై మోజుతో ఆ రంగంలోకి వచ్చి దర్శకుడయ్యారు. సామాజిక అంశాలను బాగా చిత్రీకరించేవారు.రెండవ పెళ్లీ విఫలం..మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గురుప్రసాద్ ఇటీవలే రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. మరోవైపు అవకాశాలు లేని గురుప్రసాద్ అప్పులపాలయ్యారు. తాగుడుకి బానిసైన ఆయన అప్పులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేను ఆత్మహత్య చేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని తెలిసింది. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన రంగనాయక సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. షూటింగ్ ముగిసినా ఓ సినిమా విడుదల కాలేదు. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించారు.అప్పుల బాధల వల్ల తరచూ ఇళ్లు మారుస్తూ.. సినిమాల కోసం గురుప్రసాద్ రూ.3 కోట్ల వరకూ అప్పులు చేశారు. అప్పులు ఇచ్చిన ఫైనాన్షియర్లు తరచూ ఒత్తిడి చేసేవారు. ఆ బాధ పడలేక ఆయన తరచూ ఇళ్లు మారుస్తూ వచ్చాడు. కొందరు రుణదాతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో ఒకసారి అరెస్టయ్యారు. అయితే ఆయన తీసిన మఠ, ఎద్దేళు మంజునాథ్, డైరెక్టర్ స్పెషల్ తదితర చిత్రాలు విజయం సాధించడంతోపాటు మంచి పేరు, అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆదివారం అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నుండి దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా గురుప్రసాద్ శవం కుళ్లిపోయి ఫ్యాన్‌కు వేలాడుతోంది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.ముగిసిన అంత్యక్రియలుచిత్ర దర్శకుడు గురుప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం జరిగాయి. బ్రాహ్మణ విధివిధానాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. గురుప్రసాద్ సోదరుడు హరిప్రసాద్, మొదటి భార్య ఆరతి, రెండో భార్య సుమిత్ర, ఇతర కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు యోగరాజ్‌భట్, నటుడు దునియా విజయ్, డాలి ధనంజయ, తబలా నాణి, సతీశ్ నీనాసం తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కాగా, తన భర్త మృతి పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవని, అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భార్య సుమిత్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనుమానస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు అనుమానాస్పద మృతి
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. తన కెరీర్లో 'మఠం' సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. దీంతో ఆయన పేరు మఠం గురు ప్రసాద్‌గా గుర్తింపు పొందారు. తను ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.గురుప్రసాద్ మూడు రోజుల క్రితమే మరణించారని తెలుస్తోంది. ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ఆయన మరణ వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. జిగర్తాండ, బాడీగార్డ్, కుష్క, విజిల్, మైలారీ వంటి సినిమాలతో ఆయన ఆకట్టుకున్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. -
Karimnagar: లగ్గం సినిమాలో మనోళ్లు
విద్యానగర్(కరీంనగర్): పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలవడమే కాదు.. రెండు మనసులు కలవడం అన్న అంశంతో తెలంగాణ పెండ్లి సంప్రదాయాన్ని పెద్ద తెరపై ఆవిష్కరిస్తున్నారు మనోళ్లు. ‘లగ్గం’ పేరున సినిమాను కామారెడ్డికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి నిర్మించగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన చెప్పాల రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ, యూట్యూబ్ స్టార్స్ ఆర్ఎస్ నంద, గుండ మల్ల య్య, రాధిక, తెలంగాణ లక్ష్మి, మిమిక్రి మహేశ్, సత్య ఎలేశ్వరం, సినీ పోస్టర్, టైటిల్ డిజైనర్ విష్ణువర్దన్‌రెడ్డి, అర్చిత, కాంతరెడ్డితోపాటు మరో 10మంది వరకు నటించడం విశేషం. లగ్గం సినిమా ఈనెల 25న విడుదల కానుంది. పాటే ఆమె ప్రాణం.. శంకరపట్నం(మానకొండూర్): ఇప్పలపల్లి గ్రామానికి చెందిన జనగాం లావణ్య ఫోక్సాంగ్స్ పాడి పల్లె జనం, పట్టణ ప్రజల అభిమానం చురగొంటున్నారు. గ్రామీణ ప్రాంతమైన ఇప్పలపల్లిలో నివాసముంటూ భర్త రవీందర్ ప్రోత్సాహంతో నటనలోనూ సత్తా చూపుతున్నారు. బతుకమ్మ, పెళ్లి, వాన పాటలే కాకుండా.. వేములవాడ రాజన్న, కొండగుట్ట అంజన్న, కొమురవెల్లి మల్లన్న దేవతామూర్తుల పాటలు పాడుతూ భక్తుల గుండెల్లో చోటు సాధించారు. ఎల్ఆర్ పోక్స్ పేరిట య్యూటూబ్‌లో పాటలు, షార్ట్ఫిల్్మలు విడుదల చేస్తున్నారు. భర్త రవీందర్, కూతురు మైత్రి, కొడుకు మనోజ్‌కుమార్‌తో కలిసి నటించారు. 90 వరకు పాటలు, షార్ట్ఫిల్్మలలో నటించగా.. ఇప్పటివరకు 1.50లక్షల వ్యూయర్స్ ఉన్నారు. పాట పాడుతున్న లావణ్య -
ఏడ్చుకుంటూ డైరెక్టర్‌తో గోడు వెల్లబోసుకున్న స్టార్ హీరో
ప్రతి నటుడి కెరీర్లో హిట్టు, ఫ్లాప్ రెండూ ఉంటాయి. సక్సెస్ సాధించినప్పుడు పొగిడేవారికన్నా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు విమర్శించేవారే ఎక్కువమంది ఉంటారు. అలా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వరుస బాక్సాఫీస్ వైఫలయ్యాలతో బాధపడుతున్నప్పుడు ఓ నిర్మాత చులకనగా చూశాడట!ఆ మూవీతో హిట్ ట్రాక్1997లో అక్షయ్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కూడా తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. 1999లో జాన్వార్ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆనాటి సంగతులను జాన్వార్ డైరెక్టర్ సునీల్ దర్శన్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 'అక్షయ్ సినిమాలు వరుసగా ఫెయిలవుతున్న సమయంలో జాన్వార్ తెరకెక్కించాం.సంపాదించిదంతా ధారపోశా..ఈ సినిమా షూటింగ్ దాదాపు 110 రోజుల్లో పూర్తి చేశాం. ఇందులో అక్షయ్ కళ్లతోనే ఎమోషన్స్ పలికించాడు. సినిమా కొనేందుకు ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు. దీంతో నేను సంపాదించిదంతా ఈ చిత్రం కోసమే ధారపోశాను. సినిమా టైటిల్, కథ, సంగీతం అన్నీ సరిగ్గా కుదరడంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేశాం. అయితే మా సినిమా కంటే ముందు అక్షయ్ నటించిన మూవీ ఒకటి రిలీజ్ కావాల్సి ఉంది. ఎక్కడా బ్యానర్లు వేయలేదు. ఎందుకని అక్షయ్ నిర్మాతను అడగ్గా.. నీ కోసం బిల్‌బోర్డు పెట్టేంత సీన్ లేదని చులకనగా మాట్లాడాడు. జాన్వార్ మూవీలోని ఒక దృశ్యంఏడ్చేసిన అక్షయ్ఆ విషయం నాతో చెప్తూ అక్షయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి చలించిపోయిన నేను జుహులో అక్షయ్ కుమార్ జాన్వార్ సినిమా బ్యానర్ పెద్దది పెట్టించాను. ఇకపోతే జాన్వార్ కొన్నిచోట్ల 100 రోజులు ఆడితే మరికొన్నిచోట్ల పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో నేను నిరాశ చెంది నా నెక్స్ట్ సినిమాను హృతిక్ రోషన్‌తో తీస్తున్నానని అక్షయ్ పొరపడ్డాడు. నేను అలాంటిదేం లేదని క్లారిటీ ఇవ్వడంతో అతడితోనే 100 సినిమాలు తీయమని కోరాడు' అని చెప్పుకొచ్చాడు.కాంబినేషన్ రిపీట్జాన్వార్ హిట్ సాధించిన తర్వాత అక్షయ్- సునీల్ కాంబినేషన్లో ఏక్ రిష్తా, తలాష్: ద హంట్ బిగిన్స్, దోస్తి: ఫ్రెండ్స్ ఫరెవర్, మేరే జీవన్ సాతి చిత్రాలు తెరకెక్కాయి. అక్షయ్.. హా మైనే బీ ప్యార్ కియా, అండాజ్ సినిమాలకు దర్శన్ నిర్మాతగానూ వ్యవహరించాడు.చదవండి: వెండితెర అద్భుత దృశ్య కావ్యం...తొలి పాన్ ఇండియా చిత్రం -
ఆలియా భట్ సినిమా డిజాస్టర్.. డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జిగ్రా. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లా సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఫేక్ కలెక్షన్స్ ఎలా ప్రకటిస్తున్నారంటూ మేకర్స్‌ను నిలదీసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాజ్‌కుమార్ రావ్, ట్రిప్తి డిమ్రీ నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో పోటీపడింది.అయితే జిగ్రా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. మ్మిది రోజుల్లో కేవలం రూ.25.35 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. సినిమా ఫ్లాఫ్ కావడంతో డైరెక్టర్ వాసన్ బాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ట్విటర్ ఖాతాను ఆయన డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆయన అకౌంట్ సెర్చ్ చేస్తే ట్విటర్లో కనిపించడం లేదు. జిగ్రా ఫెయిల్యూర్‌తోనే ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.కాగా.. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆలియా భట్.. రక్షిత అక్క పాత్రలో కనిపించింది. ఆమె సోదరుడిగా బాలీవుడ్ నటుడు వేదాంగ్ నటించాడు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. -
మా ముందు హాజరై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఓ భవన నిర్మాణ అనుమతికి సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో చెప్పాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కె.విద్యాధర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. నవంబర్ 22న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీలోని దొమ్మరపోచంపల్లి గ్రామంలో 40 అడుగుల వెడల్పుతో లోపలి రహదారికి ఆనుకొని నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతులను పునః పరిశీలించాలని గతంలో కోర్టు ఆదేశించినా అధికారులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదంటూ అక్షయ డెవలపర్స్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. తదుపరి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
దేశంలోనే తొలి ట్రాన్స్ఉమెన్ డైరెక్టర్ సంయుక్త విజయన్ సక్సెస్ స్టోరీ
పొల్లాచ్చిలో పుట్టి శాన్ఫ్రాన్సిస్కోలో స్థిరపడిన ఈ ట్రాన్స్ ఉమన్ మన దేశ తొలి ట్రాన్స్ ఉమన్ డైరెక్టర్‌గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీల నిర సూర్యన్’ పేరుతో సినిమా తీయడమే కాదు ముఖ్యపాత్ర పోషించింది. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా సంయుక్త పరిచయం. 2016.తమిళనాడు–తిరుచ్చిలోని సొంత ఇంటికి దీపావళి పండక్కు వచ్చిన సంతోష్ అమెరికాకు తిరిగి వెళుతూ ‘అమ్మా... వచ్చే దీపావళికి నేను అమ్మాయిగా వస్తాను’ అని చెప్పాడు. తల్లి ఉలిక్కి పడలేదు. కన్నీరు కార్చలేదు. ‘నీ ఇష్టంరా. నీకెలా సంతోషంగా ఉంటే అలా చెయ్’ అంది. అమెరికాకు వెళ్లాక సంతోష్ ట్రాన్స్ ఉమన్‌గా మారడానికి అవసరమైన వైద్యం, చికిత్సలు చేయించుకున్నాడు. శనివారం వరకూ అబ్బాయి రూపంలోనే వెళ్లిన సంతోష్ సోమవారం నుంచి ‘సంయుక్త’ గా ఆఫీస్‌లో అడుగు‘పెట్టింది’. అయితే స్నేహితులు ఎటువంటి తేడా చూపించలేదు. అబ్బాయి సంతోష్‌తో ఎంత స్నేహంగా ఉన్నారో అమ్మాయి సంయుక్తతో అంత స్నేహంగా ఉన్నారు. ‘అందరి కథ ఇంత సులువుగా ఉండదు. అందుకే సినిమా తీశాను’ అంటుంది సంయుక్త.బీటెక్ గ్రాడ్యుయేట్సంయుక్త తండ్రి టైలర్. తల్లి గృహిణి. ముగ్గురు కుమారుల్లో ఒకడుగా పుట్టాడు సంతోష్. ‘అయితే నా భౌతిక రూపానికి నా మానసిక స్వభావానికి పొంతన కుదరలేదు. నాలోని స్త్రీనే నేను స్వీకరించాను. నా తల్లిదండ్రులు ఇందుకు నన్ను ఇబ్బంది పెట్టకపోయినా బయట నేను సంప్రదాయవాదుల గేలిని, అల్లరిని, అవమానాన్ని భరించాను. ట్రాన్స్పర్సన్ల జీవితం వెండి తెర మీద రావడం తక్కువ. మగవాళ్లు కొందరు ఆ పాత్రలు ధరించారు. ఇటీవల ‘తాలి’ సినిమాలో సుస్మితా సేన్ బాగా చేసింది. కాని నేను ట్రాన్స్ఉమన్గా ఉంటూ సినిమా తీయడం వల్ల మేమూ ఇండస్ట్రీలో మా కథలు చెప్పగలం అని నిరూపించదలుచు కున్నాను’ అంటుంది సంయుక్త.సినిమా అంటే తెలియకపోయినా...‘మా పొల్లాచ్చిలో రోజూ షూటింగ్‌లే. కాని ఏవీ నేను చూడలేదు. షార్ట్‌ఫిల్మ్‌లు తీయలేదు. అసిస్టెంట్‌గా పని చేయలేదు. 2020లో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలన్న సంగతిని యూట్యూబ్ పాఠాల ద్వారా తెలుసుకున్నాను. వందల వీడియోలు చూసి రెండేళ్ల పాటు స్క్రిప్ట్ రాశాను. నా జీవితాన్ని, నావంటి వారి జీవితంలోని ఘటనలను కలిపి ‘నీల నిర సూర్యన్’ సినిమా తీశాను. అంటే నీలి రంగు సూర్యుడు అని అర్థం. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది బ్లూ సన్‌షైన్’ పేరుతో ప్రదర్శితమవుతుంది. తమిళ విడుదల కోసం తమిళ పేరు పెట్టాను’ అని తెలిపింది సంయుక్త.సొంత డబ్బు పెట్టి...సంయుక్త అమెరికాలో అమేజాన్‌లో ఉన్నత ఉద్యోగంలో ఉంది. తన సంపాదనలోని కొంత భాగాన్ని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది. ‘సినిమాల్లో థర్డ్ జెండర్‌ని హాస్యానికే వాడి అపచారం చేశారు. ఇక మీదైనా ట్రాన్స్పర్సన్లను మర్యాదకరమైన రీతిలో ఇన్క్లూజివ్గా చూపి చేసిన పాపాన్ని కడుక్కోవాలి సినిమావారు. పరిస్థితి ఇంకా చిన్న ఊళ్లలో మారలేదు. ఉదాహరణకు ఒక స్కూల్లో టీచర్ని పిల్లలు గౌరవిస్తారు. కాని ఆ టీచర్ ట్రాన్స్ ఉమన్ అయితే తేడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ΄ోవాలి. నేను తీసిన సినిమా కథ మాలాంటి వాళ్ల అస్తిత్వాన్ని గౌరవించవలసిందిగా అర్థం చేసుకోమని కోరుతుంది’ అందామె.స్త్రీగా మాత్రమేసంయుక్త తనను తాను స్త్రీగా తప్ప ట్రాన్స్‌జెండర్‌గా చెప్పడానికి అంగీకరించదు. ‘నేను స్త్రీగా మారదల్చుకున్నాను. మారాను. కనుక నా ఆధార్ కార్డులో స్త్రీ అనే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం ట్రాన్స్‌జెండర్ అనే అస్తిత్వం అవసరమైతే దానిని కొందరు స్వీకరించవచ్చు. కాని నేను పూర్తిగా స్త్రీ అస్తిత్వంతో ఉండాలని కోరుకుంటాను’ అంటుంది సంయుక్త. ఆమె మంచి భరతనాట్య కళాకారిణి. చెన్నయ్‌లో ఆరంగేట్రం చేస్తే చాలామంది మెచ్చుకున్నారు. విస్మరణకు గురైన జీవితాలకు సంబంధించి ఇవాళ అనేక సినిమాలు వస్తున్నాయి. సంయుక్త విజయన్ తీసిన ‘నీల నిర సూర్యన్’ మరో ముఖ్యమైన కథను చెబుతోంది. మరిన్ని కథలు సంయుక్త నుంచి మనం చూడొచ్చు.‘మా కథలు మేము చెప్పుకోవడం ఈ దేశంలో అంత సులువు కాదు’ అంటుంది సంయుక్త విజయన్. -
టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోని డైరెక్టర్.. కానీ ఇప్పుడిలా చూస్తుంటే! (ఫొటోలు)
-
చెత్త సినిమా అన్నారు.. కట్ చేస్తే బ్లాక్‌బస్టర్!
సినిమా రిలీజ్‌కు ముందే ఫోకస్ గ్రూప్ స్క్రీనింగ్స్ అని ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ టాక్ అదిరిందంటే హిట్టు గ్యారెంటీ! అయితే తనకు మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని తీరా చూస్తే సినిమా సూపర్ డూపర్ హిట్టయిందంటోంది దర్శకురాలు జోయా అక్తర్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను పట్టించుకోను. చెత్త మూవీ అని విమర్శఎవరేం చెప్పినా అవునా అని గంగిరెద్దులా తలాడించను. కానీ ఓసారి ఏమైందంటే.. జిందగీ నా మిలేగి దొబారా మూవీ స్క్రీనింగ్ టైంలో ఓ అంకుల్.. ఇది చెత్త మూవీ అంటూ గట్టిగా అరిచాడు. అసలేం మూవీ, ఏం చేస్తున్నారంతా? అని తిట్టాడు. అవును, ఇది మీ వయసువాళ్లకు కాదు. మీ కోసం నా సినిమాను మార్చుకోలేను అని మనసులోనే అనుకున్నాను. కనెక్ట్ అయ్యామన్న టీనేజర్స్ఆ పెద్దమనిషి.. నిర్మాత స్నేహితుడి చుట్టమట! అదృష్టవశాత్తూ.. అక్కడ టీనేజర్స్ కూడా ఉన్నారు. వాళ్లు సినిమా మాకు బాగా నచ్చింది, ఈ మూవీకి కనెక్ట్ అయ్యాం అని చెప్పారు. ఆ పెద్దాయన వీళ్లతో గొడవపడటంతో నేను అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. అప్పటినుంచి ఇలాంటి స్క్రీనింగ్స్‌కు వెళ్లడమే మానేశాను' అని చెప్పుకొచ్చింది.సినిమా..కాగా జోయా అక్తర్.. లక్ బై ఛాన్స్ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆమె డైరెక్ట్ చేసిన రెండో సినిమాయే.. జిందగీనా మిలేగి దొబారా. ఈ మూవీ 2011లో విడుదలైంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కల్కి కొచ్లిన్, దీప్తి నవల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.చదవండి: చైతో ఎంగేజ్మెంట్.. ఎప్పుడూ కలగనలేదన్న శోభిత.. మాతృత్వం కోసం.. -
ధనుష్ ఇడ్లీ కొట్టు!
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న తాజా సినిమాకు ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు) అనే టైటిల్ ఖరారైంది. గురువారం ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ధనుష్ కెరీర్‌లోని ఈ 52వ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకాలపై ఆకాశ్ భాస్కరన్ నిర్మించనున్నారు. ‘‘మా డాన్ పిక్చర్స్ సంస్థలోని తొలి సినిమాకే ధనుష్గారితో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు ఆకాశ్ భాస్కరన్. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: కిరణ్ కౌశిక్. -
థియేటర్లో సినిమా వీక్షించిన రాజమౌళి.. వీడియో వైరల్!
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తువదలరా- 2. ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించారు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. రీతేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌కు ఆడియన్స్న నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ ట్రైలర్ బాగుందని అభినందించారు.ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోకు సైతం రాజమౌళి హాజరయ్యారు. థియేటర్లలో అందరితో కలిసి చిత్రాన్ని వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. అంతకుముందు మత్తువదలరా-2 ప్రమోషన్లలోనూ రాజమౌళి పాల్గొన్నారు. మూవీ టీంతో కలిసి సరదా స్కిట్ కూడా చేశారు. ప్రమోషన్లలో భాగంగా మహేశ్ బాబుతో తెరకెక్కించబోయే మూవీ అప్డేట్ గురించి ఆరాతీయగా.. పెద్దకర్రతో రాజమౌళి కొట్టబోయారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: మత్తు వదలరా-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?)కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్నారు. యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభించే అవకాశముంది. ఈ సినిమా కోసమే మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. #TFNExclusive: Maverick director @ssrajamouli enjoys the #MathuVadalara2 premiere in Hyderabad!🤩#SSRajamouli #MV2 #TeluguFilmNagar pic.twitter.com/pCArTLDGhH— Telugu FilmNagar (@telugufilmnagar) September 13, 2024 -
పెద్దకర్రతో కొట్టబోయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను విజయేంద్రప్రసాద్ అందించారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ వారంలో టాలీవుడ్ మూవీ మత్తువదలరా 2 విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీసింహా హీరోగా నటించారు. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళిని కలిసి కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి వద్దకు వెళ్లిన మత్తువదలరా టీమ్ ఎస్ఎస్ఎంబీ29 గురించి అప్డేట్ అడిగారు. దీంతో కోపానికి గురైన రాజమౌళి పెద్ద కర్ర చేతపట్టుకుని.. అప్డేట్ కావాలా అంటూ వారిని కొట్టేందుకు యత్నించారు. అయితే ఇదంతా కేవలం సరదాగా చేశారు. మత్తువదలరా-2 ప్రమోషన్స్ కోసం ఇలా వెరైటీగా ట్రై చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: మత్తువదలరాని ఫ్రాంచైజీలా కొనసాగిస్తాం: శ్రీ సింహా)కాగా.. శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తువదలరా 2. ఈ మూవీని రీతేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కించారు. 2019లో వచ్చిన మత్తువదలరా-2 చిత్రానికి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ప్రభాస్, రాజమౌళి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది. SSR - MB Update Emina ?@ssrajamouli :- Ikkada Karra undali ra Update kavali ante Update #MathuVadalara2 pic.twitter.com/uHgUFCoClT— Milagro Movies (@MilagroMovies) September 11, 2024 -
సెప్టెంబర్‌లోనూ అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: ఆగస్ట్‌లో మాదిరిగానే సెప్టెంబర్‌లోనూ సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆగస్ట్‌లో సాధారణానికి మించి 16 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపింది. అదేసమయంలో, వాయవ్య భారతంలో రికార్డు స్థాయిలో 253.9 మిల్లీమీటర్ల వర్షం పడిందని, 2001 సంవత్సరం తర్వాత ఆగస్ట్‌లో ఇంత భారీగా వానలు కురియడం ఇది రెండోసారని తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘దేశంలో ఆగస్ట్‌లో 248.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, అంతకుమించి ఈసారి ఆగస్ట్‌లో 287.1 మి.మీ. వర్షం కురిసింది. అదేవిధంగా, జూన్ ఒకటో తేదీన మొదలైన రుతు పవన సీజన్లో దేశంలో సాధారణంగా 701 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి ఏకంగా 749 మి.మీ. కురిసింది’అని ఆయన వివరించారు. ‘ఆగస్ట్‌లో సాధారణంగా 16.3 రోజులపాటు అల్పపీడన వాతావరణం కొనసాగుతుంది. కానీ, అంతకుమించి 17 రోజుల్లో అల్పపీడనాల ప్రభావం ఉంది. ఆగస్ట్‌లో ఏర్పడిన ఆరు అల్పపీడనాల్లో రెండింటి కారణంగా ఉత్తర, మధ్యభారతంతోపాటు తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు సహా దక్షిణ భారతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆగస్ట్ నెల మొత్తం రుతు పవనాల ప్రభావం కొనసాగింది’అని ఐఎండీ డీజీ మహాపాత్ర తెలిపారు. అయితే, హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఈ సీజన్లో అల్పపీడనాల్లో అధిక భాగం దేశ దక్షిణ ప్రాంతంపైనే కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. వాయవ్య భారతంలో అతిభారీ వర్షాలు వాయవ్య భారతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆగస్ట్‌లో మాదిరిగా∙సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని ఐఎండీ డీజీ మృత్యుంజయ వివరించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణానికి మించి వానలు పడొచ్చని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో దీర్ఘకాలం సగటు 167.9 మి.మీ. మించి వర్షాలు పడొచ్చని చెప్పారు. -
పెళ్లి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు దర్శకుడు
తెలుగు దర్శకుడు వంశీ కృష్ణ పెళ్లి పీటలెక్కాడు. ప్రమీల అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం నాడు ఆయన వివాహం వేడుకగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాలివే..వంశీ విషయానికి వస్తే.. ఈయన టైగర్ నాగేశ్వరరావు సినిమా తీశాడు. స్టువర్టుపురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. ఈ సినిమా కంటే ముందు దొంగాట మూవీని డైరెక్ట్ చేశాడు. ఇందులో అడివి శేష్, లక్ష్మీ మంచు కీలక పాత్రల్లో నటించారు. -
ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే ట్రెండ్ నడుస్తోంది: ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్
అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2. ఈ సినిమాకు అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 2015లో వచ్చిన డీమాంటీ కాలనీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ కోలీవుడ్ మూవీని శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్‌పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, అజయ్ భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. 'నేను ఇరవై ఏళ్ల క్రితం భూత్ అనే సినిమా చేశా. అది అంతా అపార్ట్ మెంట్లో జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లేందుకు కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. డీమాంటీ కాలనీ రిలీజ్ తర్వాత ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ అయిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నాతో చెప్పారు. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్. ఇప్పుడు మరో భాషలోకి వస్తోంది అంతే. నేను ఈ మూవీ ప్రీమియర్ చూడలేదు. కానీ ఇక్కడ ప్రీమియర్ చూసిన వాళ్ల నుంచి మంచి టాక్ వచ్చింది. ఇవాళ కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు పెద్దవి అవుతున్నాయి. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు చూసే ట్రెండ్ నడుస్తోంది. అలాగే తెలుగులోనూ డీమాంటీ కాలనీ 2 ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. కాగా.. డీమాంటీ కాలనీ 2 చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఆయ్.. మనోడేనండి
అమలాపురం టౌన్: ఆయ్.. ఓయ్.. మాటలు గోదావరి జిల్లాల యాసే. గోదారోళ్ల వెటకారంతో కూడిన మాటలు, యాసలు ఇటీవల కాలంలో యూట్యూబ్, సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవే సినిమాల్లోనూ సక్సెస్ అవుతున్నాయి. ఈ కోవలోంచే రెండు రోజుల కిందట విడుదలైన ‘ఆయ్’ సినిమా పుట్టుకొచ్చింది. దీనిని గోదారోళ్ల యాసను రంగరించి చిత్రీకరించారు. అమలాపురం కుర్రాడైన యువ దర్శకుడు అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే నూరు శాతం కోనసీమ గ్రామీణంలో సినిమా తీసి విజయవంతం అయ్యారు. ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కమిటీ కుర్రాళ్లు చిత్రాలు కూడా దాదాపు కోనసీమ అందాల నడుమే రూపుదిద్దుకున్నాయి. ఈ చిత్రాల్లో కోనసీమ ఫిలిం అసోసియేషన్‌కు చెందిన వర్థమాన నటీనటులు 50 మందికి పైగా ఆయా చిత్రాల దర్శకులు అవకాశాలు ఇచ్చారంటే ఈ పచ్చని సీమకు సినిమా సిరి పెరుగుతోందని తెలుస్తోంది. ఆయ్ చిత్రంలో కోనసీమ ఫిలిం అసోసియేషన్‌కు చెందిన 12 మంది నటీనటులకు ఛాన్స్ దొరికింది. అంజిబాబు ప్రస్థానం ఇది అమలాపురం కొంకాపల్లికి చెందిన వర్ధమాన సినీ దర్శకుడు అంజిబాబు కంచిపల్లి ఎస్కేబీఆర్ కాలేజీలో చదివారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచీ ఆయన సినీ పరిశ్రమపై మక్కువ పెంచుకున్నారు. 12 ఏళ్ల కిందటే మంచి సందేశాత్మక చిత్రాలు తియ్యాలన్న ఆకాంక్షతో సినీ పరిశ్రమలోని దర్శక విభాగంలో శిక్షణ పొందారు. అసోసియేట్, కోఅసిస్టెంట్ డైరెక్టర్‌గా పలువురి దర్శకుల వద్ద పనిచేశారు. నేడు తాను కన్న సినీ కలను నెరవేర్చుకునేలా ఆయ్ చిత్రాన్ని రూపొందించారు. తాను పుట్టి పెరిగిన అమలాపురం పరిసర ప్రాంతాల్లోనే ఆ సినిమాను తీసి కోనసీమ కుర్రాడు అనిపించుకున్నారు. దర్శకుడిగా తొలిసారిగా ఆయ్ చిత్రానికి బాధ్యత వహించి కోనసీమ నేటివిటీని, ఆ సీమతో మిళితమయ్యే కథాంశాన్ని తెరకెక్కించారు. అమలాపురం పట్టణంతోపాటు కోనసీమలోని దాదాపు 22 గ్రామాల్లోని నదీ పాయలు, కొబ్బరి, అరటి తోటలు, వరి చేలు, కాలువ గట్లు, సముద్ర తీరాన్ని తన సినిమాలో బంధించారు. చిన్నతనంలో స్నేహాలుగా చిగురించి పెద్దయ్యాక కులాల కుంపటితో రగలిపోయే నేటి తరాన్ని కులాలు కంటే స్నేహాలు గొప్పవన్న సందేశంతో సినిమాను ఆద్యంతం రక్తికట్టించారు. అందుకే ‘ఆయ్’ మెయిన్ టైటిల్‌తోనూ, ‘మేం ఫ్రెండ్స్ండి’ అనే సబ్ టైటిల్ (ట్యాగ్)తో చిత్రాన్ని రూపొందించారు. మధ్యలో హాస్యం జోడించి పూర్తి ఇంటర్టైన్మెంట్ సినిమాను తన మొదటి బహుమతిగా ప్రేక్షకులకు అందించారు. కమిటీ కుర్రాళ్లు సినిమా ఇక్కడి నేటివిటీతో చిత్రీకరించి హిట్ కొడితే.. ఆయ్ చిత్రం కూడా కోనసీమ యాసను, స్నేహా బంధాలను గుర్తు చేస్తూ సాగింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కమిటీ కుర్రాళ్లు చిత్రాల దర్శకులు కోనసీమేతురులై ఈ రెండు చిత్రాలను ఈ ప్రాంత నేటివిటీతో చిత్రీకరించారు. అయితే ఆయ్ చిత్ర దర్శకుడు అంజిబాబు అమలాపురానికి చెందిన వాడై.. ఈ ప్రాంతానికి అనువైన, అనుబంధమైన కథాంశాన్ని ఎంచుకుని కష్టపడి, ఇష్టపడి తీశారు. ఇక్కడి నుంచే నా తొలి చిత్రం నేను సినీ దర్శకునిగా తొలి చిత్రం ‘ఆయ్’ కోనసీమ నుంచే శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. 12 ఏళ్ల నా కల సాకారమైంది. స్నేహ సంబంధాలు కులాల రాపిడిలో పడి చెక్కు చెదరకూడదన్న సందేశంతో ఈ చిత్రం తీశాను. కేరళకు మించిన ప్రకృతి సహజ సిద్ధ అందాలు కోనసీమలోనే ఉన్నాయి. నా చిన్నతనం నుంచి చూస్తున్న కోనసీమ ప్రకృతి అందాలతో పాటు అచ్చమైన గ్రామీణ సౌందర్యాన్ని చిత్రంతో తెరకెక్కించాను. హాస్యం, సెంట్మెంట్ తదితర అంశాలతో మంచి చిత్రాన్ని తీశానన్న సంతృప్తి మిగిలింది. – అంజిబాబు కంచిపల్లి, ఆయ్ చిత్ర దర్శకుడు, అమలాపురం -
Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మొదటి మహిళగా కూడా. సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణ పొందింది. లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి) 2019లోని మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. మెరిటోరియస్ సర్వీస్ కోసం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. -
సమంతతో డేటింగ్ రూమర్స్.. అసలు ఎవరీ రాజ్?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడనున్నారు. అయితే చైతూ నిశ్చితార్థం తర్వాత అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపై పడింది. ఇంతకీ ఆమె రియాక్ట్ అవుతుందా? లేదా అని ఫ్యాన్స్ వేచిచూశారు. కానీ చైతూ ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియాలో ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే సమంతపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. దీంతో అసలు సమంతకు రాజ్ ఎలా పరిచయం? అసలు అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతని పూర్తి వివరాలేంటో ఓ లుక్కేద్దాం.రాజ్ నిడిమోరు ప్రస్థానమిదేఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జన్మించిన రాజ్ నిడిమోరు జన్మించారు. ఇంజనీరింగ్ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్ ఫిల్స్మ్ అనే బ్యానర్‌ను స్థాపించారు. మొదట వీరిద్దరు షాదీ అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరు సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి రాజ్, సమంతకు పరిచయం ఉండడం వల్లే తాజాగా డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి. అయితే రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. -
'విజయవాడలో ఇంజినీరింగ్ డేస్'.. నెటిజన్స్‌కు డైరెక్టర్ ఆర్జీవీ సవాల్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆర్జీవీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.తాను విజయవాడలో ఇంజినీరింగ్ చదివే రోజుల్లో క్లాస్‌మేట్స్‌తో కలిసి దిగిన ఫోటోను రాంగోపాల్ వర్మ ట్విటర్లో షేర్ చేశారు. అందులో తాను ఎక్కడున్నానో కనిపెట్టాలంటూ నెటిజన్స్‌ను ప్రశ్నించారు. అయితే ఆ ఫోటోలో అందరి మొహాలు కాస్తా బ్లర్‌గా ఉన్నాయి. అందువల్లనే ఆడియన్స్‌కు ఆర్జీవీ చిన్న పరీక్ష పెట్టినట్లు తెలుస్తోంది.కాగా.. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. Me with my friends sitting on a wall in my engineering days in Vijaywada..SPOT ME pic.twitter.com/gq7SFTb4UA— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024 -
ఓయో రూమ్‌లో తెలుగు డైరెక్టర్ ఆత్మహత్య
టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు కొమారి జానయ్య నాయుడు (44) ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగులో పలు చిన్న సినిమాలకు దర్శకత్వం, నిర్మాతగా ఆయన కొనసాగారు. అయితే, కూకట్‌పల్లిలో భాగ్య నగర్ కాలనీలో ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని జానయ్య మరణించారు. అయితే, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్లో ‘జీఎస్టీ’ (గాడ్ సైతాన్ టెక్నాలజీ) అనే సినిమాను కొమరి జానయ్య నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించారు.ఉండేందుకు రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆయన చెక్ ఆవుట్ చేయాల్సిన సమయం పూర్తి కావడంతో లాడ్జి సిబ్బంది గది తలుపులు కొట్టగా జానయ్య ఓపెన్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా ఆయన ఫ్యాన్‌కు వేలాడుతు కనిపించాడు. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న వారు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఆయన ఈ లాడ్జ్‌కు ఒక్కడే వచ్చాడా..? ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు. -
ఒకప్పుడు కేవలం అలాంటి సినిమాలే: మలయాళ ఇండస్ట్రీపై ఆర్జీవీ కామెంట్స్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవల కల్కి చిత్రంలో అతిథిపాత్రలో మెరిశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే తాజాగా ఆర్జీవీ మలయాళ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో మలయాళ చిత్రాలు కేవలం అడల్ట్, రొమాంటిక్ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవని అన్నారు.రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ..'ఒకప్పుడు మలయాళం సినిమా అంటే కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమేనని మనందరికీ తెలుసు. నేను విజయవాడలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో మలయాళ సినిమాలు చూడలేదు. ఎందుకంటే ఇతర సినిమాలతో పోలిస్తే ఎక్కువ అడల్ట్ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం మలయాళం నుంచి ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఆ సమయంలో మంచి సినిమాలు లేవని కాదు. బహుశా అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా కారణాలతో అలాంటి సినిమాలు తీసుకొచ్చి ఉంటారేమో. వారిని ప్రభావితం చేసిన అనేక అంశాలు ఉండొచ్చు.' అని అన్నారు,ది కేరళ స్టోరీపై ప్రశంసలు..ది కశ్మీర్ ఫైల్స్, యానిమల్ లాంటి వివాదాస్పద చిత్రాలపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. తాను చూసిన ఉత్తమ చిత్రాలలో ది కేరళ స్టోరీ ఒకటని ఆయన తెలిపారు. అలాగే ప్రశాంత్ వర్మ చిత్రం హను-మాన్, నాగ్ అశ్విన్ తాజా బ్లాక్‌బస్టర్ కల్కి 2898 AD సినిమాలు అధ్బుతమని కొనియాడారు. శివ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆర్జీవీ టాలీవుడ్‌కు పలు సూపర్ హిట్ చిత్రాలను అందించారు. -
తన సినిమా చూసి షాకైన డైరెక్టర్.. తనకు తెలియకుండానే మార్చేశారు!
విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రం మళై పిడికత మనితన్. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని 2022లో మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈ మూవీని పూర్తి చేసి శుక్రవారం (ఆగస్టు 2న) విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాను విజయ్ మిల్టన్.. జర్నలిస్టులతో కలిసి వీక్షించాడు.పరిచయ సీన్లోనే..సినిమా ప్రారంభంలో వచ్చిన సీన్ చూసి షాకైపోయాడు. విజయ్ ఆంటోని పాత్ర స్వభావాన్ని తెలుపుతూ ఒక నిమిషంపాటు ఇంట్రడక్షన్ సీన్ ఉందట. నిజానికి డైరెక్టర్ అనుకుంది ఒక సీన్ అయితే ఇక్కడ ఇంకో సీన్ వేశారట. అది ఎవరు యాడ్ చేశారో అర్థం కావడం లేదంటున్నాడు. ఆ ఒక నిమిషం ఓపెనింగ్ సీన్ వల్ల సస్పెన్స్ అనేది లేకుండా పోయిందన్నాడు. దీనివల్ల సినిమా సాదాసీదాగా కనిపిస్తోందన్నాడు.అప్పుడు లేనిది ఇప్పుడెలా?సినిమాను సెన్సార్‌కు పంపించినప్పుడు లేని సీన్ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు ఎలా వచ్చిందో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. మరి అది ఎవరు యాడ్ చేశారనేది తెలియాల్సి ఉంది. మళై పిడికత మనితన్ మూవీలో శరత్ కుమార్, సత్యరాజ్, శరణ్య, మేఘా ఆకాశ్ కీలక పాత్రలు పోషించారు. రాజమణి సంగీతం అందించాడు.చదవండి: ఎడమ చేత్తో భోజనం.. ఫ్రాక్చర్‌తో జీవితం ఇలా అయిపోయిందంటున్న హీరో -
టాలీవుడ్ డైరెక్టర్ మృతి.. మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్
తెలుగు ఇండస్ట్రీలో విషాదం. హీరో మంచు మనోజ్‌తో అప్పట్లో 'నేను మీకు తెలుసా?' సినిమా తీసిన దర్శకుడు అజయ్ శాస్త్రి (50) కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన మనోజ్.. చాలా ఎమోషనల్ అయ్యాడు. తన బాధని బయటకు చెప్పుకోలేకపోతున్నానని రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'తిరగబడర సామీ' సినిమా రివ్యూ)'కెప్టెన్ ఆఫ్ 'నేను మీకు తెలుసా', నా బెస్ట్ ఫ్రెండ్ ఇక లేరు. ఈ బాధని చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. ఆ పరమశివుడే.. అతడి కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి. మిస్ యూ రా అజయ్. త్వరగా వెళ్లిపోయావ్. లవ్ యూ రా బాబాయ్' అని మనోజ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అజయ్ శాస్త్రి.. డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన 'రాఖీ', 'డేంజర్' చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. 2008లో 'నేను మీకు తెలుసా?' మూవీతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా ఫెయిల్ కావడంతో మరో ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత ఏమైపోయారో ఎక్కడున్నారనే విషయాలు బయటకు రాలేదు. ఇప్పుడు మనోజ్ ట్వీట్‌తో అజయ్ చనిపోయిన విషయం బయటపడింది.(ఇదీ చదవండి: చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్‌నే బెస్ట్: కీర్తి సురేశ్)Heartbreaking to inform that my best friend and the Captain of Nenu Meeku Telusa is no more. No words can describe the pain we r enduring. Praying lord shiva to give strength to his family and loved ones. Om Shanti. Will miss you ra Ajay, gone too soon. Wishing this is a dream.… pic.twitter.com/zxjPjdi2Tw— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 2, 2024 -
జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా.. హాయ్ నాన్న డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాకుండా హృతిక్ రోషన్ సినిమా వార్-2లోనూ యంగ్ టైగర్ కనిపించనున్నారు. అయితే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం. హాయ్ నాన్న డైరెక్టర్‌తో.. అయితే మరోవైపు హాయ్ నాన్న సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ శౌర్యువ్‌తో ఎన్టీఆర్ జతకట్టనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో శౌర్యువ్ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ కోసం మీరు జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఈ రూమర్స్ ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు.. ఇదంతా తప్పుడు సమాచారం' అని శౌర్యువ్ స్పష్టం చేశారు. అయితే ఏదో ఒక రోజు ఇది నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నానని ఆయన అన్నారు.కాగా.. దేవర మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారు. మరోవైపు గతేడాది నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్నా సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. -
కోట్ల అప్పు వల్లే ప్రాణాలు తీసుకున్న దర్శకుడు?
కన్నడ బుల్లితెర దర్శకుడు వినోద్ దొండే మరణవార్త టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. జూలై 20న ఆయన తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణిస్తున్న ఆయన అశోక్ బ్లేడ్ అనే సినిమాతో వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. సినిమా షూటింగ్ 90 శాతం వరకు పూర్తయింది. కానీ అంతలోనే ఆయన ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలవరపరిచింది. పెరిగిపోయిన బడ్జెట్తొలి సినిమా కోసం చేసిన అప్పులే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ నిర్మాత వర్ధన్ హరి వెల్లడించాడు. వర్ధన్ మాట్లాడుతూ.. '1970 బ్యాక్‌డ్రాప్‌లో అశోక బ్లేడ్ సినిమా తీస్తున్నాం. సతీశ్ నినాశం హీరోగా నటిస్తున్నాడు. ఇది వినోద్ డ్రీమ్ ప్రాజెక్ట్. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభించాం. నిజానికి 45 రోజులే అనుకున్నాం. కానీ 87 రోజుల వరకు షూటింగ్ జరిగింది. రూ.1.5 కోట్లు బడ్జెట్ అనుకున్నాం. అది కూడా పెరుగుతూనే వస్తోంది. మళ్లీ ఇప్పుడు కొన్ని సన్నివేశాలను, ఓ పాటను, ఫైట్ సీన్‌ను రీషూట్ చేయాలనుకున్నాం. రూ.3 కోట్ల అప్పుఇదంతా చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి. దాని గురించి వినోద్ ఎక్కువగా కంగారుపడ్డాడు. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశాం.. ఇప్పుడెలా అని తనలో తానే మథనపడ్డాడు. మేము ఇంకో నిర్మాతను కలిసి సాయం కోరగా ఆయన సానుకూలంగా స్పందించాడు. అలా దీనికి పరిష్కారం కనుగొన్నాం. ఆ మీటింగ్ తర్వాత జూలై 19న రాత్రి వినోద్‌ను ఇంటి దగ్గర దిగబెట్టాను. కానీ తర్వాతిరోజే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం కోసం వివేక్ రూ.3 కోట్ల అప్పు తీసుకున్నాడు.చదవండి: ప్రభాస్ కల్కి మరో ఘనత.. ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్! -
ఆ హీరోయిన్‌కు యాక్టింగ్ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. కానీ అందరిలాగే కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడింది. కొన్ని సినిమాలు చేతిదాకా వచ్చి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కష్టపడి ఎదుగుతుంటే చూసి ఓర్వలేనివారు ఆమెకు యాక్టింగ్ రాదని, లుక్స్ బాగోవని విషప్రచారం చేసేవారు.అడిగి మరీ..ఈ విషయాన్ని దర్శకుడు గుడ్డు ధనోవా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'సన్నీ డియోల్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా 2002-2003 మధ్యలో ఓ సినిమా తీశాను. అప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్ జరిపాం. ప్రియాంకకు యాక్టింగ్ అంతగా రాకపోయేది. ఇప్పుడీ సీన్ ఎలా చేయాలి? ఈ సన్నివేశం గురించి కాస్త వివరించరా? అని అడిగి మరీ తెలుసుకుని నటించేది. యాక్టింగ్ రాదన్నారునేర్చుకోవాలన్న తపన తనలో కనిపించేది. తన పాత్రను పర్ఫెక్ట్గా చేయాలని భావించేది. అలాగే అందంగా కూడా ఉండేది. ఓ షెడ్యూల్ పూర్తయ్యాక ప్రియాంక గురించి ముంబైలోని కొందరు నెగెటివ్‌గా చెప్పడం మొదలుపెట్టారు. స్క్రీన్‌పై తను అంత అందంగా కనిపించదని, యాక్టింగే రాదని, టైం వేస్ట్ చేసుకోవద్దని, కావాలంటే ఇప్పటివరకు షూట్ చేసిన భాగాన్ని ఓసారి చూసుకోమని సలహాలు ఇచ్చారు. ఆమెకు ఫిదా అయ్యాంసరేనని చెప్పి సన్నీ డియోల్, నేను రషెస్ చూశాం. వాళ్లు చెప్పినట్లుగా ఏమీ అనిపించలేదు. దీంతో ఈ సినిమా తనతోనే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాం. తన అంకితభావానికి, నటనకు మేము ఫిదా అయ్యాం. తప్పకుండా తను ఏదో ఒకరోజు గొప్ప స్థానానికి వెళ్తుందని భావించాం. చాలా త్వరగానే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. తన వెడ్డింగ్ రిసెప్షన్‌కు సైతం నన్ను ఆహ్వానించింది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. కాగా గుడ్డు ధనోవా డైరెక్షన్లో ప్రియాంక చోప్రా.. బిగ్ బ్రదర్, కిస్మత్ అనే సినిమాలు చేసింది.చదవండి: ‘గురువాయూర్ అంబలనడియాల్’ మూవీ రివ్యూ -
ఒకప్పుడు క్లాసిక్ డైరెక్టర్.. ఇప్పుడో అద్భుతమైన యాక్టర్.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఈ సినిమా సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి పోదామనుకున్నా!
డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ పార్థిబన్. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుండే ఈయన దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగానూ సుపరిచితులే. భారతి కన్నమ్మ (తమిళ) సినిమాకు ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారం అందుకున్నాడు. యుగానికి ఒక్కడు మూవీలో చోళరాజుగా నటించి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. కొత్త సినిమారచ్చ, పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. పుదియ పాదై, హౌస్‌ఫుల్, ఇవన్, విటగన్, ఒత్త సెరుప్పు సైజ్ 7, ఇరవిన్ నిడల్ సినిమాలతో దర్శకనిర్మాతగానూ సత్తా చాటాడు. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం టీన్జ్. ఈ మూవీలో పార్థిబన్ కీలక పాత్రలో నటించగా ఆయన కుమార్తె కీర్తన క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసింది. జూలై 12న తమిళనాట రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా పార్థిబన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా'ఫ్రెండ్స్.. టీన్జ్ సినిమాకు పిల్లలు, కుటుంబాల నుంచి మంచి స్పందన రాకపోతే నా ఊపిరిగా భావించిన సినిమాను వదిలేద్దామనుకున్నాను. ఇండస్ట్రీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామనుకున్నాను. కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సినిమాను ఆదరిస్తున్నారు. థాంక్యూ' అని ట్వీట్ చేశాడు. అయితే కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేయడం గమనార్హం. The wait is over!TEENZ from Today in cinemas worldwide@rparthiepan@immancomposer@dopgavemic@k33rthana@GenauRanjith@lramachandran@AdithyarkM@Iam_Nithyashree@shreyaghoshal@Arivubeing@iYogiBabu@onlynikil@j_prabaahar@shrutihaasan@CVelnambi@teenzmovieoffl… pic.twitter.com/F0hbYzxCaH— Radhakrishnan Parthiban (@rparthiepan) July 12, 2024 చదవండి: ఆ సినిమా చేస్తే కెరీర్ ముగిసినట్లేనని వార్నింగ్.. అయినా వినలేదు! -
కలర్ఫుల్గా మెరిసిపోతున్న డైరెక్టర్ అట్లీ సతీమణి ప్రియా (ఫోటోలు)
-
అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో?
బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు ఇద్దరు పిల్లలు. యష్- రూహి అని ట్విన్స్. పిల్లలున్నారనగానే అతడికి పెళ్లయిందనుకునేరు.. కానే కాదు! 52 ఏళ్లున్న ఈ డైరెక్టర్ పెళ్లికాని ప్రసాద్‌లాగే మిగిలిపోయాడు. వివాహమంటే మొగ్గుచూపని ఇతడికి పిల్లలంటే ఇష్టం. అందుకని సరోగసి ద్వారా 2017లో కవలల పిల్లలకు తండ్రయ్యాడు.ఎవరి పొట్టలో ఉన్నాం?ఇప్పుడిప్పుడే స్కూలుకు వెళ్తున్న ఈ పిల్లలు తల్లి గురించి అడుగుతున్నారట! ఈ విషయాన్ని కరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'మాదొక మోడ్రన్ ఫ్యామిలీ. అయితే నాకు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నా పిల్లలిద్దరూ.. మేము చిన్నప్పుడు ఎవరి పొట్టలో ఉన్నాం? మా అమ్మ ఎక్కడ? మేము అమ్మ అంటున్న వ్యక్తి మాకు నానమ్మ అవుతుంది కదా.. అని ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.వద్దని చెప్పలేకపోతున్నాఆ చిన్ని బుర్రలకు అర్థమయ్యేలా సమాధానం ఎలా చెప్పాలి? తండ్రిగా ఉండటం అంత ఈజీ కానే కాదు. మరోపక్క నా బాబు స్వీట్స్ గట్రా తిని కొద్దిగా లావయినా కంగారుపడిపోతున్నాను. అలా అని వారిని వద్దని వారించలేను. ఎందుకంటే ఈ చిన్న వయసులో వాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలి. సంతోషంగా గడపనివ్వాలి. నా కూతురికి, బాబుకు ఆంక్షలు పెట్టి ఇబ్బందిపెట్టలేను' అని కరణ్ చెప్పుకొచ్చాడు.చదవండి: OTT: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే! -
చంద్రబాబు బెదిరింపులతో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
-
ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంది: నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడినట్లు నాగ్ అశ్విన్ ఇదివరకే వెల్లడించారు. తాజాగా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ సంఘటనను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం.నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో రాస్తూ..' దాదాపు 10 సంవత్సరాల క్రితం మేము ముగ్గురం(నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్) కలిసి మా తొలి చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం" ప్రారంభించాం . అప్పట్లో వైజయంతి నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కించడం రిస్క్‌తో కూడుకున్నది . నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంది. ఒక రోజు వర్షం కురిసింది. దీంతో షూటింగ్ పూర్తి చేయలేకపోయాం. దీంతో మళ్లీ షూటింగ్ సెట్ వేయాల్సి వచ్చింది. దీంతో నిర్మాణ ఖర్చు ఎక్కువైంది. అది కాస్తా మమ్మల్ని భయాందోళనకు గురిచేసిందని. ' రాసుకొచ్చారు. 'అంతే కాకుండా.. దాదాపు 10 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు.. సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి. ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవడం మీ అందరి ఆశీర్వాదంగా భావిస్తున్నా. వీళ్లిద్దరి మధ్యలో నిల్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఆదరిస్తున్నందకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు మీ నుంచి మరెన్నో అద్భుతమైన చిత్రాలు రావాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడిన దర్శకుడు.. స్టార్ హీరో పోస్ట్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సమీర్ విద్వాన్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ జూలీ సోనాల్కర్ను ఆయన పెళ్లాడారు. గతేడాది సత్య ప్రేమ్ కి కథ మూవీతో హిట్ కొట్టిన సమీర్ విద్వాన్స్ తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట జూన్ 29న మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లికి బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' సత్యప్రేమ్ కి కథ సెట్స్‌లో మీ లవ్ స్టోరీని చూశా. ఈ రోజు మీ అందమైన ప్రయాణంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నూతన జంటకు నా అభినందనలు.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. సత్యప్రేమ్ కి కథ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయితే వీరి పెళ్లికి హీరోయిన్ కియారా అద్వానీ హాజరు కాలేదు. కాగా.. సమీర్ విద్వాన్స్ ప్రస్తుతం మరాఠీ చిత్రం మహాత్మను తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం ‘చందు ఛాంపియన్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
ప్రభాస్ కల్కి మూవీ.. ఈ పోస్ట్ చూస్తే చాలు.. ఆయన ఎంత కష్టపడ్డాడో!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్, విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం రిలీజైంది. ఉదయం నుంచే ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. మొదటి రోజే కల్కి సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.అయితే కల్కి సినిమాకు తెరెకెక్కించేందుకు దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డారు. ఇప్పటికే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డామని.. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం తాను కష్టపడ్డాడో అది చూస్తేనే అర్థమవుతోంది.తాజాగా తన అరిగిపోయిన చెప్పులను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక సుదీర్ఘమైన రోడ్డు ప్రయాణం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కాగా.. కల్కి చిత్రంలో అగ్రతారలైన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి స్టార్స్ నటించారు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ తాజా అప్డేట్ ఇచ్చారు. ఇండియన్ -2 ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో గేమ్ ఛేంజర్ గురించి ఆయన మాట్లాడారు.శంకర్ మాట్లాడుతూ..'సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇండియన్ -2 రిలీజ్ కాగానే గేమ్ ఛేంజర్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాం. అన్ని ఓకే అనుకున్నాకే రిలీజ్‌పై నిర్ణయం తీసుకుంటాం. వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా' అన్నారు.కాగా.. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఫొటోలు)
-
తిరుమలకు కాలినడకన చేరుకున్న టాలీవుడ్ డైరెక్టర్..!
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తన భార్య సౌజన్యతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. -
స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌లోనూ మహారాజా చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి హైదరాబాద్‌లో పర్యటించారు. ఓ హోటల్ జరిగిన ఈవెంట్లో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా పాల్గొన్నారు. విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి వస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉప్పెన మూవీలో కలిసి పనిచేసిన బుచ్చిబాబు ఏకంగా విజయ్ సేతుపతి కాళ్లకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. బుచ్చిబాబు తదుపరి చిత్రం రామ్ చరణ్‌తో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
న్యూఢిల్లీ: సిలబస్‌ను కాషాయీకరణ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ స్పందించారు. ఆదివారం(జూన్16) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వాస్తవాలను తెలియజేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. చరిత్రను తెలియజేసే అంశాలను బోధిస్తామని, యుద్ధానికి మద్దతుగా బోధన ఉండదన్నారు. బాధ్యత గల పౌరులను మాత్రమే సమాజానికి అందించాలనుకుంటున్నామని దినేశ్ తెలిపారు. ‘పుస్తకాల ద్వారా చిన్నారులకు అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి సమాజంలో నేరాలు, హింస ఎలా సృష్టించాలనే విషయాలను మన విద్యార్థులకు బోధించాలా ఇదేనా విద్య ముఖ్య ఉద్దేశం. అసలు అల్లర్ల గురించి చిన్న వయసులో పిల్లలకెందుకు. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దాన్ని పుస్తకాల్లో చేర్చకూడదా.. కొత్త పార్లమెంటును నిర్మిస్తే వాటి గురించి మన విద్యార్థులు తెలుసుకోవద్దా.. ఇటువంటి అంశాలనే సిలబస్‌లో చేర్చాం. చారిత్రక విషయాలతో పాటు సమకాలీన అంశాలను సిలబస్‌లో చేర్చడం మా బాధ్యత’అని సక్లానీ తెలిపారు. -
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
హాలీవుడ్ దర్శకరచయిత ఫిలిప్ నోయిస్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ఫాస్ట్ చార్లీ. ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడిది ఇండియాలోనూ రిలీజ్ కావడంతో ఇక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూలిస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'ఇండియన్ సినిమాకు నేను పెద్ద అభిమానిని. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ మూవీ చూశాను. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప విజయం సాధించింది. అలాగే దేవ్ పటేల్ దర్శకత్వం వహించడంతో పాటు యాక్ట్ చేసిన మంకీ మాన్ కూడా బాగా నచ్చింది.ఆల్‌టైం ఫేవరెట్..ఈ ఏడాది ఇదే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మంకీమాన్ చిత్రంలో కథ చెప్పే విధానం కాస్త ఆర్ఆర్ఆర్ మాదిరిగా ఉంటుంది. సత్యజిత్ రే తీసిన పాతర్ పాంచాలి నా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. బాల్యంలో ఉన్నప్పుడు ఆ సినిమా నన్ను ఎంతగానో కదిలించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో గొప్ప ఇండియన్ సినిమాలున్నాయి. ఓటీటీల పుణ్యమాని వాటిని ఎంచక్కా డిజిటల్ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. నేను ఇండియాలో సినిమా తీయాల్సి వస్తే దాన్ని గౌరవంగా భావిస్తాను. హీరో షారుక్ ఖాన్‌తో పని చేయాలని ఉంది. వారి బ్లడ్‌లోనే ఉందిఇక్కడ తీసే అద్భుతమైన సినిమాలు కొన్ని బయట దేశాల్లో విడుదల కావడం లేదు. ప్రపంచ ప్రేక్షకుల్ని మీ వైపు తిప్పుకోవాలంటే ఇంకాస్త కష్టపడాల్సి ఉంది. ఇండియన్ ప్రేక్షకులు ఎమోషన్స్‌ను బయటకు చూపిస్తారు. సినిమాలో లీనమైపోతారు. వారి రక్తంలోనే సినిమా అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిలిప్ నోయిస్ .. న్యూస్ఫ్రంట్, హీట్‌వేవ్, డెడ్ కామ్, ద క్వైట్ అమెరికన్, రాబిట్ ప్రూఫ్ ఫెన్స్, ద గీవర్, ద డెస్పరేట్ అవర్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.చదవండి: నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా.. -
Snehil Dixit Mehra: ఇంజినీర్ టు క్రియేటివ్ డైరెక్టర్..
నేర్చుకోవాలనే తపన ఉంటే... అదే తపస్సు. ఆ తపస్సు ఫలితాలు ఊరకే పోవు. విజయాలకు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి డిగ్రీలు, అనుభవం లేకుండానే ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది స్నేహిల్ దీక్షిత్ మెహ్రా. వేగంగా నేర్చుకోవాలనే తపన ఆమె బలం. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, కంటెంట్ క్రియేటర్, యాక్టర్, క్రియేటివ్ డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.జర్నలిస్ట్ కావాలనుకుంది స్నేహిల్. ‘అదేం కుదరదు. ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాల్సిందే’ అన్నారు తల్లిదండ్రులు. దీంతో భో΄ాల్లో ఇంజినీరింగ్ చేసింది. చదువు పూర్తయిన తరువాత ముంబైలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసింది. ఉద్యోగం చేస్తున్న మాటేగానీ తన మనసంతా టీవీ రంగంపైనే ఉండేది. ఒక ఫైన్ మార్నింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక చానల్లో ట్రైనీగా చేరింది. తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు.‘జర్నలిజంలో ఎలాంటి డిగ్రీ లేకుండా నెగ్గుకు రావడం కష్టం’ అన్నారు.ఆ తరువాత తల్లి మాత్రం ‘ఫరవాలేదు’ అన్నట్లుగా మాట్లాడింది. అండగా నిలబడింది. ముంబైలో ఉండే సోదరుడుప్రోత్సహించాడు.కొత్త ప్రయాణంలో స్నేహిల్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ‘ఓటమిని దరి చేరనివ్వవద్దు’ అని బలంగా అనుకునే స్నేహిల్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ వెళ్లింది. సవాళ్లను అధిగమించే శక్తి తనకు త్వరగా నేర్చుకునే నైపుణ్యం నుంచి వచ్చింది.స్టోరీ టెల్లింగ్పై ఉన్న ΄ాషన్తో టెలివిజన్ నుంచి ఓటీటీకి అక్కడి నుంచి సోషల్ మీడియాకు వచ్చిన స్నేహిల్ ప్రతిచోటా తనను తాను నిరూపించుకుంది. ఎన్నో షోలు చేసి రైటర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘అప్‌హరణ్’ వెబ్ సిరీస్‌లో నటించడం ద్వారా నటిగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇదంతా ఒక్క ఎత్తయితే ‘హీరామండీ’ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ టీమ్‌లో చేరడం మరో ఎత్తు.రైటింగ్ విభాగంలో పనిచేసిన స్నేహిల్‌కు సంజయ్ లీలా భన్సాలీ కొన్ని సీన్లను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సీన్లు బాగా చేయడంతో ‘హీరామండీ’ సిరీస్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా ప్రమోట్ అయింది.‘ఇది పదిహేడు సంవత్సరాల కష్టఫలితం. భన్సాలీతో పని చేయడం వరంలాంటిది. ఫిల్మ్‌మేకర్,ప్రొడ్యూసర్‌గా ఆయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయనతో పనిచేయడం అంటే ఫిల్మ్ స్కూల్లో చేరి ఎన్నో విషయాలు నేర్చుకోవడంలాంటిది’ అంటుంది స్నేహిల్.ఇక ఇన్ఫ్లూయెన్సర్గా తన అనుభవాన్ని గురించి చెబుతూ... ‘కామెడీ అనేది రిస్క్. కొన్నిసార్లు ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో ఊహించలేము. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా నా వీడియోల నుంచి ఇన్స్టంట్ ఫీడ్‌బ్యాక్ తెలుసుకునేదాన్ని. ఫలానా వీడియో అభ్యంతరకరంగా, నొప్పించేలా ఉంది అనే కామెంట్స్ కనిపిస్తే వెంటనే ఆ వీడియోను తొలిగించేదాన్ని. ఎవరినీ నొప్పించకుండా అందరూ హాయిగా నవ్వుకునేలా కంటెంట్‌ను రూ΄÷ందించడం అనేది నిజంగా సవాలే’ అంటుంది బహుముఖ ప్రజ్ఞాశాలి స్నేహిల్ దీక్షిత్ మెహ్ర. కలల దారిలో...కలలు కనడం అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. కల కనడం గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఉత్సాహం దగ్గర మాత్రమే ఆగిపోకుండా నా కలను సాకారం చేసుకోవడానికి కష్టపడ్డాను. నేర్చుకోవాలనే ఉత్సాహం, నిరంతర కష్టం మనకు విజయాన్ని చేకూరుస్తాయి. – స్నేహిల్ దీక్షిత్ మెహ్ర -
పెళ్లి చేసుకుంటావా? అన్నాడు.. నో చెప్పానని సినిమాలో నుంచే..
సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందని సంబరపడేలోపే తనను మూవీలో నుంచే తీసేశారట! ఒక దర్శకుడు పెట్టిన పెళ్లి ప్రపోజల్‌కు ఒప్పుకోలేదని తనను పక్కన పెట్టేశారంటోంది అలనాటి హీరోయిన్ మీనాక్షి చౌదరి. దామిని (1993) సినిమా సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. పెళ్లి ప్రపోజల్మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ.. 'ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంలో దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. నేను కుదరదని తిరస్కరించాను. దాని గురించి పెద్ద రచ్చ కూడా చేయలేదు. సైలెంట్‌గా ఉన్నాను. ఆయన కూడా మౌనంగానే ఉన్నాడు. నా మనసుకు అనిపించింది చెప్పాను. అదే మాట మీద నిలబడ్డాను కూడా! నో చెప్పాను కదా అని నన్ను సినిమాలో నుంచి తీసేయాలని చూస్తే ఎలా? వాళ్లు జోక్యం చేసుకోవడంతో..పరిస్థితులు వర్కవుట్ అయితే టీమ్‌గా కలిసి పని చేస్తాం, లేదంటే లేదు. ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నాను. ఆ గొప్ప సినిమా దామిని అవ్వాలనుకున్నాను. ఆ సమయంలో నిర్మాతల మండలి జోక్యం చేసుకుంది. ఆర్టిస్టుల గిల్డ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించి నేను మళ్లీ దామిని చిత్రంలో భాగమయ్యేట్లు చేసింది. అలా దామిని సినిమా షూటింగ్ సజావుగా సాగిపోయింది' అని చెప్పుకొచ్చింది.పెళ్లి తర్వాత..కాగా మీనాక్షి.. 1995లో హరీశ్ మైసూర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. మరోవైపు రాజ్‌కుమార్ సంతోషి.. మనీలాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. 1996లో మీనాక్షి, రాజ్‌కుమార్ సంతోషి ఘటక్ సినిమాకు కలిసి పని చేశారు.చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే -
లెక్క కుదిరింది
కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్)కి, షిప్ ఓనర్ (ప్రోడ్యూసర్)కి మధ్య మంచి రిలేషన్ ఉండాలి. షిప్ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. ‘దిల్’ రాజు, అనిల్ రావిపూడిమూడోసారి ‘దిల్’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో సుప్రీమ్ (2016), ‘రాజా ది గ్రేట్’ (2017), ‘ఎఫ్ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్ 3’ (2022) వంటి హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్–‘దిల్’ రాజు కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్ హీరో. హిట్ చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్–అనిల్ రావిపూడి–‘దిల్’ రాజు కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్ సుకుమార్–మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్–మైత్రీ కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్–నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కాంబినేషన్లో ‘పుష్ప 2: ది రూల్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.∙సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్ హీరోగా నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. సునీల్, రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్), అమిగోస్ క్రియేషన్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్ నారంగ్, రామ్మోహన్ కాంబినేషన్లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ (2021) సూపర్ హిట్టయింది. నాగ్ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్ బేనర్లో నాగ్ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి రెండు హోమ్ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ఉన్నాయి. అశ్వినీదత్ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్ అశ్విన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘సార్’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్లో తాజాగా ‘లక్కీ భాస్కర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. శ్రీకాంత్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్’ చిత్రం తర్వాత డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని–పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో ‘మిరాయ్’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరో, హీరోయిన్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘ఈగల్’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్–విశ్వప్రసాద్ కాంబినేషన్లో ‘మిరాయ్’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటిస్తున్న ‘మిరాయ్’లో మంచు మనోజ్ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్ కానుంది. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డిఈసారి ‘జై హనుమాన్’తో...సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఇక ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ–చైతన్య–నిరంజన్ రెడ్డి కాంబినేషన్లో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. -
ఈ వీడియోలో ఉన్న చెత్త ఎవరు?.. బాలకృష్ణపై స్టార్ డైరెక్టర్ ఫైర్!
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణపై విమర్శలు ఆగడం లేదు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అంజలిని పక్కకు నెట్టడంతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తోటి మహిళా నటి పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా ఈ వీడియో చూసిన బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా.. అసలు ఆయన ఎవరంటూ కామెంట్స్ చేశారు. ఎవరీ చెత్త అంటూ ఆ వీడియోను చూసి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా..హన్సల్ మెహతా ప్రస్తుతం కరీనా కపూర్ ప్రధాన పాత్రలో ది బకింగ్‌హామ్ మర్డర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. అంతే కాకుండా ప్రతిక్ గాంధీ లీడ్ రోల్లో దేద్ బిఘా జమీన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మే 31 న విడుదల కానుంది. ఇటీవలే స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ చిత్రం కూడా ప్రకటించారు. ఇది తమల్ బందోపాధ్యాయ రచించిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ అనే పుస్తకం ఆధారంగా రూపొందించనున్నారు. Who is this scumbag? https://t.co/KUVZjMZY2M— Hansal Mehta (@mehtahansal) May 29, 2024 -
దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కాగా బుచ్చిబాబు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడన్న విషయం తెలిసిందే! ఈయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఉప్పెన. ఫస్ట్ చిత్రంతోనే రూ.100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.చదవండి: 45 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న నటుడు! వచ్చే వారమే ముహూర్తం! -
'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్ కోసం ఓరియో బిస్కెట్స్: డైరెక్టర్
మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ కేవ్స్లో కేరళ యువకుడు పడిపోవడం జరిగింది. ఆ నిజజీవిత ఘటన ఆధారంగా మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించాడు. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న క్లైమాక్స్ సన్నివేశాన్ని అసలు ఎలా చిత్రీకరించారో తాజాగా ఆ చిత్ర డైరెక్టర్ చిదంబరం రివీల్ చేశాడు. ఈ సినిమాలో సుభాష్ పాత్రలో నటించిన శ్రీనాథ్ భాసి గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. ఆ గుహలో పడిపోయిన సుభాష్ నెత్తుటి మడుగులో ఉన్నట్లుగా చూపించారు. ఆయనకు గాయాలు అయినట్లుగా చూపించడానికి ఓరియో బిస్కెట్లను మేకర్స్ ఉపయోగించారని చిదంబరం వెల్లడించాడు. ఓరియో బిస్కెట్లలో ఉండే క్రీమ్‌తో సుభాస్‌కు మేకప్ వేశామన్నారు. అతనికి అయినటువంటి గాయాలను చూపించేందుకు తాము ఈ టెక్నిక్ ఉపయోగించామని ఆయన తెలిపాడు. అయితే, ఈ క్రెడిట్ అంతా మేకప్ మ్యాన్ రోనెక్స్ జేవియర్‌కు చెందుతుందని చెప్పాడు. అయితే, ఈ మేకప్ వల్ల సుభాస్ ( శ్రీనాథ్ భాసి) చాలా ఇబ్బంది పడ్డాడు. బిస్కెట్ క్రీమ్ వాసనకు ఆయన చుట్టూ చీమలు కూడా చేరిపోయాయి. ఈ సీన్ తీస్తున్నప్పుడు ఆ చీమలు కూడా అతన్ని కుట్టడం ప్రారంభించాయి. అయినా కూడా శ్రీనాథ్ భాసి చాలా చక్కడా చేశాడని దర్శకుడు చిదంబరం గుర్తుచేసుకున్నాడు. -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ దర్శకుడు సంగీత శివన్ (61) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ క్రమంలోనే మలయాళ, హిందీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?)కేరళకు చెందిన సంగీత్ శివన్.. 1990లో 'వ్యూహం' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యోధ, గంధర్వం, నిర్ణయం, స్నేహపూర్వం అన్న లాంటి మలయాళ సినిమాలతో పాటు అప్నా సప్నా మనీ మనీ, క్లిక్, యమ్ల పగ్ల దీవానా 2 తదితర హిందీ మూవీస్ చేశారు. చివరగా 2019లో 'భారం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు వయసుతో వచ్చిన అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు.సంగీత శివన్ సోదరుడు సంతోష్ శివన్.. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్‌గా చాలా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడిగానూ కొన్ని మూవీస్ చేశారు. ఇక సంగీత్ శివన్ చనిపోయారని వార్త తెలిసిన తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)Deeply saddened and shocked to know that Sangeeth Sivan Sir is no more. As a newcomer all you want is someone to believe in you and take a chance.. can’t thank him enough for Kya Kool Hai Hum & Apna Sapna Money Money. Soft spoken, gentle and a wonderful human being. Am heart… pic.twitter.com/kvTkFJmEXx— Riteish Deshmukh (@Riteishd) May 8, 2024 -
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్ మాకు లభించింది. యానిమేషన్ సిరీస్‌పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్లో సిరీస్ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్లో అది వర్కవుట్ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్ సిరీస్‌కు కనెక్ట్ అవుతారన అన్నారు.యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్‌లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీప్లస్ మే 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది -
నాకు సపోర్ట్ చేసేందుకు ఆ హీరో భార్య ఒప్పుకోలేదు
దీపక్ తిరోజి.. ఆషిఖి, ఖిలాడీ, జో జీతా వోహి సిఖిందర్, ఘులామ్, బాద్షా వంటి హిందీ చిత్రాల్లో సహాయక పాత్రలతో గుర్తింపు పొందాడు. పెహ్లా నషా మూవీతో హీరోగానూ మారాడు. ఊప్స్ చిత్రంతో దర్శకనిర్మాతగా అవతారం ఎత్తాడు. ఆయన చివరగా 2018లో వచ్చిన టామ్, డిక్ అండ్ హ్యారీ 2 అనే సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు.అతిథి పాత్రలోదాదాపు ఆరేళ్ల తర్వాత టిప్సీ చిత్రంతో మరోసారి దర్శకుడిగా మారాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన దీపక్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. '1993లో జరిగిందీ సంఘటన.. అప్పుడు నేను పెహ్లా నషా సినిమా చేస్తున్నాను. ఆ మూవీలో అందరు సెలబ్రిటీలు అతిథి పాత్రలో కనిపించాల్సి ఉంది. షారుక్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్.. అందరూ ఒప్పుకున్నారు. చిన్నపాటి సీన్షూటింగ్ కోసం సైఫ్ ఇంటి దగ్గర రెడీ అవుతున్నప్పుడు అతడి భార్య అమృత (ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. అందుకాయన దీపక్ సినిమా కోసం వెళ్తున్నాను. చిన్నపాటి సీన్ చేసి వస్తానని చెప్పాడు. అందుకామె ఆశ్చర్యపోతూ నిజంగానే మీరందుకు ఒప్పుకున్నారా? మేమైతే అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. నిజానికి ఆ సమయంలో..ఇలా ఒకరికి సపోర్ట్ చేసేందుకు ఎవరైనా వెళ్తారా? అని ఆగ్రహించింది. నిజానికి ఆ సమయంలో అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించడమే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక పెహ్లా నషా సినిమాలో షారుక్, సైఫ్‌తో పాటు రవీనా టండన్, పూజా భట్, పరేశ్ రావల్, జూహీ చావ్లా, సుదేశ్ బెర్రీ ఇలా తదితరులు నటించారు.చదవండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి -
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
తమిళ సినీ ఇండస్ట్రీలో సుందర్ సి పేరు మోసిన దర్శకుడు. అతడు తెరకెక్కించిన అరణ్మనై 4 సినిమా మే 3న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుందర్. ఈ సందర్భంగా అతడు ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ రేంజ్లో కాపీ కొడతారా?సుందర్ మాట్లాడుతూ.. నేను ఓ తెలుగు సినిమా చూసి షాకయ్యాను. నేను తీసిన సినిమాలోని కంటెంట్‌నే కాపీ కొట్టారు. మరో నాలుగు మూవీస్ చూశాను.. అందులో కూడా తమిళ సినిమాల వాసనలు కనిపించాయి. ఈ రేంజ్లో కాపీ కొడతారా? అని ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ఎనిమిది తెలుగు సినిమాలను కాపీ కొట్టి మిక్స్ చేసి విన్నర్ (2003) మూవీ తెరకెక్కించాను అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలేంటన్నవి మాత్రం..అయితే ఆ సినిమాలేంటన్నవి మాత్రం ప్రస్తావించలేదు. ఇకపోతే అరుణ్మనై మూవీలో సుందర్ ప్రధాన పాత్రలో నటించాడు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం తెలుగులో బాక్ పేరిట విడుదల కానుంది. ఇందులో యోగి బాబు, కోవై సరళ, సంతోష్ ప్రతాప్ ముఖ్య పాత్రలు పోషించారు.చదవండి: 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్తమబాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్తమనటనకు ఈ అవార్డును అందజేశారు. ఢీల్లిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును ఆమెకు అందజేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గ్రేడ్-8 అభ్యసిస్తున్న సుకృతి వేణి బండ్రెడ్డి నటించిన ఈ చిత్రం గతంలో కూడా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు.ఈ చిత్రంలో సుకృతి నటనకు ప్రశంసలతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణికి అవార్డులు వరించాయి. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా.. న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్లో జూరీ బెస్ట్ ఫిలింగా.. ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకుంది. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవడం విశేషం.ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధు రావులు నిర్మాతలుగా వ్యవహరించారు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. -
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగువారికి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. లైగర్ తర్వాత ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పూరి మ్యూజింగ్స్ పేరుతో వాయిస్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..'జీవితంలో చాలామంది ప్రేమలో ఫెయిల్ చూస్తారు. తిండి, నిద్ర ఉండదు. గుండెల్లో తెలియని మంట. దానికితోడు మద్యానికి బానిస అవుతాం. స్నేహితులు ఎంత ఓదార్చినా తీరని బాధ. కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. అదొ రకమైన నరకం. నా ప్రేమను అమ్మాయి అర్థం చేసుకోలేదని కుంగిపోతాం. నిజానికి అదంతా ప్రేమ కాదు.. ఈగో.. నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు. ఇది నిజం. నీకు దక్కలేదన్న ఉక్రోశమది. పాపం ఆ అబ్బాయి నీ గురించి తాగుబోతు అయ్యాడే అని అందరూ తనకు చెప్పాలి. అది నీ అసలు ఉద్దేశం' అని అన్నారు.మీ అమ్మ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడైనా అమ్మ కోసం కత్తిపెట్టి చేయి కోసుకున్నావా? ఏడ్చావా? లేదు. మన ప్రేమలన్నీ శృంగారం కోసమే. అందమైన అమ్మాయిలనే ఎందుకు ప్రేమిస్తావ్. కాళ్లు, చేతులు లేని వాళ్లను కూడా ప్రేమించొచ్చు కదా? నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే.. ఆమె డెసిషన్‌కు రెస్పెక్ట్ ఇచ్చేవాడివి. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి దొరక్కపోతే చనిపోవాలనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే నిన్నే పెళ్లి చేసుకుంటే రెండేళ్లు కూడా సరిగా కాపురం చేయలేవు. మోజు తీరిపోద్ది. మళ్లీ కొత్త కోరికలు మొదలవుతాయి. వేరే అమ్మాయిలు కావాలి. ఎంజెల్స్ అందరినీ మగాళ్లు పెళ్లి తర్వాత డోర్ మ్యాట్స్‌లా తయారు చేస్తారు. సైన్స్ ప్రకారం ఆడ, మగ మధ్య ఎట్రాక్షన్ 18 నెలలు మాత్రమే' అనిలవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లందరూ ప్రామిస్ చేయగలరా? వేరే ఏ అమ్మాయిని చూడమని? చేయలేరు. ప్రేమించడం, ఇంట్లో వద్దంటే గొడవ పడడం.. అమ్మాయి కాదంటే దేవదాసులా మారడాలు.. ఇవన్నీ డ్రామాలు. మనం ఈ డ్రామాలనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిలను ఎక్కడైనా చూశారా?. వాళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. మరీ మీకెందుకు ఇంత ఓవరాక్షన్. వాళ్లను చూసి బుద్ది తెచ్చుకో. లవ్ ఫెయిల్ అవడం ఎప్పుడూ మంచిదే. దానివల్ల మీరు మరింత స్ట్రాంగ్ అవుతారు. కానీ ప్రేమించమని ఏడుస్తూ.. బతిమిలాడుతూ.. అడుక్కుంటూ బెగ్గర్స్‌లా తయారవుతాం. రోజు ఇంత ఏడుస్తున్నావు కదా.. ఏడాది తర్వాత అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని' వివరించారు.నిజంగా అమ్మాయి మోసం చేస్తే.. ఆ బాధను మీ కెరీర్ కోసం వాడండి. ప్రేమ కంటే గొప్పది ఒంటరితనం. ఒంటరిగా తినండి, ప్రయాణాలు చేయండి. కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు. మీ లవ్ ఫెయిల్యూర్ మీద మీరే జోకులు వేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎంజెలినా జోలి లాంటి సెలబ్రిటీలే విడాకులు తీసుకున్నారు. వాళ్లతో పోలిస్తే.. నువ్వు ఎంత? నీ ప్రేమ ఎంత? దయచేసి ఆలోచించు. నిన్ను నమ్ముకొని మీ కుటుంబం ఉంది' అని పూరి జగన్నాథ్ సలహాలిచ్చారు. -
అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ తీసుకున్నవారు మరింత భయపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. వ్యాక్సిన్‌పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ భయం కంటే.. ఇలాంటి సగం సగం నాలెడ్జ్ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా, సరదాగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రభావం గురించి ఓ క్లిప్‌ను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ ఏడాది శైలేశ్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సంక్రాంతి రిలీజైన సంగతి తెలిసిందే. For people who have been terrified after the news about Covishield broke out. The stress from all the memes and half baked articles will damage you more than anything else. Stay calm and have fun. pic.twitter.com/DGgxn4mGXG— Sailesh Kolanu (@KolanuSailesh) April 30, 2024 -
ప్రముఖ దర్శకుడి ఇంట పెళ్లి.. స్టార్స్ సందడి
ప్రముఖ దర్శకనటుడు చేరన్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అతడి పెద్ద కూతురు నివేద ప్రియదర్శిని పెళ్లిపీటలెక్కింది. వ్యాపారవేత్త సురేశ్ ఆదిత్యతో ఏడడుగులు వేసింది. ఏప్రిల్ 22న చెన్నైలో ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు సముద్రఖని, సీమన్, పాండిరాజ్, కేఎస్ రవికుమార్ తదితర కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.డైరెక్షన్ మీద ఆసక్తితో..తన కూతురి పెళ్లికి విచ్చేసిన అతిథుల ఫోటోలను చేరన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా తమిళనాడులోని మధురైకి చెందిన చేరన్ డైరెక్షన్ మీద ఆసక్తితో చెన్నై చేరుకున్నాడు. మొదట్లో పలు సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేశాడు. పురియత పూజం అనే సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. పెద్ద సినిమాలకు సైతం సహాయ దర్శకుడిగా పని చేసిన ఇతడు తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించాడు. అనంతరం 'భారతీ కన్నమ్మ' చిత్రంతో డైరెక్టర్‌గా మారాడు.తొలి సినిమాతోనే హిట్తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన చేరన్ ఆటోగ్రాఫ్ అనే మూవీకి డైరెక్టర్‌గా పని చేయడంతోపాటు అందులో నటించడం విశేషం. ఈ చిత్రం అతడికి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటినుంచి తను డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో నటుడిగానూ కనిపించాడు. ఆయన పని చేసిన నాలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం విశేషం. ఆ మధ్య తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం చేరన్.. కిచ్చా సుదీప్తో ఓ సినిమా చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ మూవీ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటిస్తోంది. திருமணத்தை மனப்பூர்வமான வாழ்த்துடன் நடத்தித்தந்த திரு.ரவிக்குமார் சார், மரியாதைக்குரிய திருமதி ரவிக்குமார் அவர்களுக்கும், எங்கள் பெருமைக்குரிய இயக்குனர் இமயம் திரு.பாரதிராஜா, அன்பு அண்ணன் சீமான், திருமதி சீமான் அவர்களுக்கும் எங்கள் குடும்பத்தினர் சார்பாக மகிழ்ச்சியும் நன்றியும். pic.twitter.com/owMd4lDBkW— Cheran (@directorcheran) April 23, 2024 చదవండి: నా కాబోయే భర్త అలా చెప్పే ఛాన్సే లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్ -
ఛా.. నిన్ను తీసుకుని తప్పు చేశా.. నటుడిపై సెటైర్లు
కబీర్ సింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ఇందులో కాలేజీ డీన్‌గా నటించిన అదిల్ హుస్సేన్‌కు కూడా సినిమా నచ్చలేదట! తన సినీ కెరీర్లో ఎందుకు నటించాన్రా దేవుడా.. అని ఫీలైన సినిమా ఏదైనా ఉందంటే.. అదే కబీర్ సింగ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'అందులో యాక్ట్ చేయనని చెప్తే కేవలం ఒక్క రోజే రమ్మని అడిగారు. భారీ పారితోషికం డిమాండ్ చేస్తే వాళ్లే సైలెంట్‌గా ఉంటారనుకున్నాను. డబ్బులెక్కువ డిమాండ్ చేశా కానీ నేను డిమాండ్ చేసిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో తప్పనిపరిస్థితిలో నేను సినిమా చేశాను. నేను నటించిన సన్నివేశం బాగానే ఉంది. సినిమా అంతా కూడా అలాగే ఉంటుందనుకున్నాను. మూవీ రిలీజైన తర్వాత చూస్తే.. ఇలాంటి సినిమా చేశానా? అని సిగ్గుతో చచ్చిపోయాను. నా భార్యను కూడా సినిమా చూడమని అడగలేదు. తను చూసుంటే ఇలాంటి మూవీలో యాక్ట్ చేశావా? అని నాపై కోప్పడేది' అని చెప్పుకొచ్చాడు. ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు ఇది చూసిన కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో సదరు నటుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 'మీరు గొప్పగా భావించి యాక్ట్ చేసిన 30 సినిమాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని బాధపడుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్ చిత్రంతోనే వచ్చింది. మిమ్మల్ని సినిమాలోకి తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. మీకు నటనపై అభిరుచి కంటే దురాశే ఎక్కువుందని అర్థమవుతోంది. మీరు బాధపడక్కర్లేదు మీరు సిగ్గుతో తలదించుకోకండి.. మీ ముఖాన్ని ఏఐ సాయంతో రీప్లేస్ చేస్తాను.. అప్పుడు మనసారా నవ్వుకోండి' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై అదిల్ హుస్సేన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చూసి నేను షాకైన మాట వాస్తవం. ఇప్పటికీ ఆ మూవీలో నటించినందుకు రిగ్రెట్‌గా ఫీలవుతున్నాను. అభిప్రాయాన్ని మార్చుకునే ఉద్దేశ్యం నాకు లేదు అని చెప్పుకొచ్చాడు. Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did 👏https://t.co/BiJIV3UeyO I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help👍 Now smile properly 🙂 — Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024 చదవండి: డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం -
Shankar Daughter Reception Photos: శంకర్ కుమార్తె రిసెప్షన్ హైలైట్స్.. దిల్‌రాజు, సిద్దార్థ్, బేబమ్మ సహా ఎందరో.. (ఫోటోలు)
-
టాలీవుడ్ డైరెక్టర్ అరుదైన ఘనత..!
ఆర్ఎక్స్ 100 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డ్ వరించింది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడిగా ఆయన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం సినిమా హిట్ కావడంతోనే ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ కాగా.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెరకెక్కించిన మహాసముద్రం పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. గతేడాది మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. Elated to receive BEST DIRECTOR Award for #Mangalavaaram at "INDIAN WORLD FILM FESTIVAL 2024" 🔥 Thankyou @miniboxoffice Team for the honour 😇 pic.twitter.com/8gTebipvqu — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 16, 2024 -
ఆ ఆరోపణలతో నాకు సంబంధం లేదు: నటుడు
దర్శకుడు, నటుడు అమీర్ ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్ సాధిక్తో దర్శకుడు అమీర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం నాడు ఎన్సీబీ, ఈడీ అధికారులు అమీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బుధవారం మధురైలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో అధికారులు 11 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం నిజమేనన్నారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయన్నది వారే చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. అలాగే తనను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదన్నారు. అయితే ఈ విషయమై ఒక రోజు కచ్చితంగా వివరంగా మాట్లాడతానన్నారు. ఈ వ్యవహారం గురించి తాను ఒక నెలరోజులుగా మాట్లాడలేని పరిస్థితి అని.. ఆ దేవుడు చూసుకుంటాడనే మౌనంగా రోజులు గడిపానన్నారు. చదవండి: మీకు నచ్చకపోతే అలా చేస్తారా?.. ట్రోల్స్‌పై మండిపడ్డ నటి! -
ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో వివాహం.. అందుకే సీక్రెట్‌గా..: నటి
బాబీ, రోటి కపడా ఔర్ మకాన్, రాకీ, లవ్ స్టోరీ, బేటా, కర్తవ్య.. ఇలా పలు హిందీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అరుణ ఇరానీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె తర్వాతి కాలంలో సహాయక పాత్రలతో ఫేమస్ అయింది. సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా చేసింది. తాజాగా ఆమె అరుణ ఇరానీ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'కోహ్రాం సినిమా షూటింగ్లో తొలిసారి డైరెక్టర్ కుకును కలిశాను. అప్పటికే నా ఇల్లు గడవడం కోసం చాలా సినిమాలు చేస్తున్నాను. కానీ అవేమీ పెద్దగా గుర్తింపు ఉన్న పాత్రలు కావు. ఒకరంటే ఒకరికి కోపం చెన్నైలో సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కుకు ఓ నెలరోజులపాటు నా డేట్స్ అడిగారు. సరేనని సినిమాలో భాగమయ్యాను. అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల అన్నీ మేనేజ్ చేయలేకపోయాను. నా వల్ల కావడం లేదని, వేరే ఆప్షన్ చూసుకోమని చెప్పాను. అప్పుడు కుకుకి విపరీతమైన కోపం వచ్చింది. నాపై సీన్లు ఉన్నా, లేకపోయినా నాకు కొన్ని డేట్స్ ఇచ్చి రమ్మనేవారు. నాపై సీన్ షూట్ లేనప్పుడు ఎందుకు రమ్మంటున్నారని కోపమొచ్చింది. ఒక్కోసారైతే రోజంతా కూర్చోబెట్టి ఒక చిన్న షాట్ తీసేవారు. ఆయనను చూస్తేనే ఒళ్లు మండిపోయింది. తనకు కూడా నేనంటే అంతే కోపం ఏర్పడింది. ప్రేమలో పడిపోయాం ఏమైందో తెలీదు కానీ ఉన్నట్లుండి సాఫ్ట్‌గా మారిపోయాడు. కూల్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు తనే నా డేట్లు అడ్జస్ట్ చేశాడు. అలా మేము ప్రేమలో పడ్డాం.. పెళ్లి చేసుకున్నాం. కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే అతడికి ఆల్రెడీ పెళ్లయింది. నాకు ఆ విషయం తెలియదని అంతా అనుకున్నారు. అతడి భార్య, పిల్లలు సెట్స్‌కు వచ్చేవారు.. కాబట్టి తనకు ఇదివరకే ఓ కుటుంబం ఉందని నాకు ముందే తెలుసు. అయినా సరే కలిసుండాలనుకున్నాం. అందరితో పోరాడి మరీ అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లల్ని వద్దనుకున్నాం.. ఈ నిర్ణయం తీసుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు' అని చెప్పుకొచ్చింది. చదవండి: పాతికేండ్లుగా సినిమాలకు దూరం.. రీఎంట్రీపై తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
Ravi Babu : తిరుమల శ్రీవారి సేవలో డైరెక్టర్ రవిబాబు కుటుంబం (ఫొటోలు)
-
'దిల్ రాజుపై నెగెటివ్ ట్రోల్స్'.. ఫ్యామిలీ స్టార్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా చిత్రయూనిట్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానలిచ్చారు. గతంలో మీపై వచ్చిన నెగెటివ్ ట్రోల్స్‌ను మీరేలా అధిగమించారు? అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సరిచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. 'నా మీద మీమ్స్ వచ్చాయనే విషయంపై నాకు అవగాహన కూడా లేదు. నేను ఓ ఇంటర్వ్యూలో నా పెళ్లి గురించి ప్రస్తావించా. దాని గురించి మస్తుగా చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తు పట్టేవాళ్లు దాదాపు ఒక కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ పెట్టినవాళ్లు ఒక పదివేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ల గురించి ఆలోచిస్తే మిగిలినవాళ్లకు దూరమవుతా. మనం నెగెటివ్ వైబ్‌లో బతుకుతున్నాం. ఇంట్లో కూడా అలానే ఉంటున్నాం. అలా మనకు తెలియకుండానే హెల్త్‌ను పాడు చేసుకుంటాం. ఆ నెగెటివ్‌ను మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అవేమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవుగా. పాసింగ్ క్లౌడ్స్ పోయాక మనకు క్లియర్‌గా ఆకాశమే కనిపిస్తుంది. మనం స్కై లాంటి వాళ్లం. క్లౌడ్స్‌కు భయపడితే ఎలా? ' అని అన్నారు. "Trolls are like passing clouds, but I'm like the sky" Ace Producer #DilRaju responds to trolls on his personal life, giving a befitting reply 🙌#TheFamilyStar #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Fuwifsq0NQ — Telugu FilmNagar (@telugufilmnagar) April 4, 2024 -
ఫ్యామిలీ స్టార్ క్రెడిట్ అంతా ఆయనకే: విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం తర్వాత పరశురామ్- విజయ్ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో అలరించనుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురామ్‌పై ప్రశంసలు కురిపించారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..'ఫ్యామిలీ స్టార్ నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ మూవీ. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకొచ్చాడు. ఈ సినిమాలో నా ఫర్మామెన్స్ నెక్ట్ లెవెల్ అని పరశురామ్ అంటున్నాడు. కానీ ఈ క్రెడిట్ మొత్తం పరశురామ్‌కే ఇవ్వాలి. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురాముడే. ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది' అని అన్నారు. కాగా.. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. -
‘సాక్షి’ డైరెక్టర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి,హైదరాబాద్: సాక్షి మీడియా సంస్థల డైరెక్టర్ కేఆర్‌పీరెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. బుధవారం(ఏప్రిల్ 3) హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేఆర్‌పీరెడ్డికి పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పురస్కారం ప్రదానం చేశారు. ఇండియా పీఆర్ బాడీ 20వ ఫౌండేషన్ డే సందర్భంగా కేఆర్పీ రెడ్డికి అవార్డు అందజేశారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. కేఆర్పీ రెడ్డి గడిచిన మూడున్నర దశాబ్దాలుగా అడ్వర్టైజింగ్, సర్క్యులేషన్ రంగాల్లో విశేషమైన కృషి చేశారు. -
కలియుగం పట్టణంలో.. ఊరిపేరు కాదు, అప్పుడే సీక్వెలా?!
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు. నంద్యాల బ్యాక్‌డ్రాప్‌లో.. కలియుగం పట్టణంలో అంటే ఊరిపేరు కాదు. మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పటి మనుషులు ఎలా ఉన్నారు, ఏంటనేది కథ. ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి చూపిస్తాము. నంద్యాల దగ్గర్లో నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. కథలో అడవికి, ఔషధ మొక్కలకు లింక్ ఉంటుంది. అందుకే నంద్యాల బ్యాక్‌డ్రాప్‌లో చేశాము. గతంలో నేను జాబ్ చేసేటప్పుడు బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వస్తుంటే ఓ గర్భవతి లేడీ సైకాలజీకి చెందిన బుక్ చదువుతుంది. గర్భవతికి చెప్పినా వినలేదు ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చదవకూడదని చెప్తే, ఆమె.. మేం ఏం చేయాలో మాకు తెలుసు అంది. ఇక నేను మాట్లాడలేదు. ట్రావెలింగ్ మొత్తం ఆమె ఆ బుక్ చదువుతూనే ఉంది. అప్పుడే ఈ కథ ఆలోచన వచ్చింది. అలాగే బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఇటీవల చూస్తున్నాం. దాంతో ఈ కథ రాసుకున్నాను. సినిమాల్లోకి ఎలా వచ్చానంటే? నేను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర కోడి రామకృష్ణ గారు అరుంధతి సినిమా తీశారు. అప్పుడు షూటింగ్లో అసిస్టెంట్‌గా పనిచేశాను. అక్కడి నుంచి సినిమా ఇంట్రస్టు బాగా పెరిగింది. ఆ తర్వాత వైజాగ్‌లో చదువుకునేటప్పుడు సినిమాల్లో తిరిగాను. హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేస్తూ, కొన్ని సినిమాలకు పనిచేశాను. అప్పుడే ఫిక్సయ్యా కరోనాలో ఫిక్స్ అయి కరోనా తర్వాత పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. కోడి రామకృష్ణ దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టి పలువురు దర్శకుల వద్ద పనిచేశాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా వర్క్ చేశాను. కలియుగం పట్టణంలో సినిమాకు సీక్వెల్‌గా కలియుగ నగరంలో తీస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. చదవండి: స్టేడియంలో సిగరెట్ తాగిన షారుక్.. వీడియో వైరల్ -
నన్ను కలవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కొత్త పాట పాడుతున్నాడు. ఇకనుంచి ఎవరినీ ఊరికే కలిసేది లేదంటున్నాడు. డబ్బులిస్తేనే పని జరుగుతుందంటున్నాడు. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ఇకనుంచి ఏదీ ఫ్రీగా చేయనంటున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 'ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్లకు సాయం చేయడం కోసం ఇప్పటికే నేను చాలా సమయాన్ని వృథా చేశాను. కొన్నిసార్లు టైం వేస్ట్ తప్ప ఏమీ మిగల్లేదు. కాబట్టి నేనో నిర్ణయానికి వచ్చాను. పావుగంటకు లక్ష.. గంటకు..? మేము తెలివైనవాళ్లం.. మా దగ్గర టాలెంట్‌కు కొదవే లేదని చెప్పుకుని తిరిగేవాళ్లతో నా సమయం వృథా చేయాలనుకోవడం లేదు. ప్రతిదానికి ఓ రేటు పెడుతున్నాను. నన్ను ఒక పది, పదిహేను నిమిషాలు కలవాలంటే రూ.1 లక్ష చెల్లించాలి. అరగంట మాట్లాడాలంటే రూ.2 లక్షలు.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. షార్ట్‌కట్స్ కావాలా? మీరు అంత డబ్బు ఇవ్వగలిగేవారైతేనే రండి. లేదంటే వెళ్లిపోండి. షార్ట్‌కట్స్ వెతుక్కుంటూ వచ్చేవారిని చూసి అలిసిపోయాను. మరో ముఖ్య విషయం.. ఆ డబ్బంతా కూడా ఒక్కసారే అడ్వాన్స్‌గా ఇచ్చేయాలి' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అతడి కూతురు ఆలియా.. నీకు ఫార్వర్డ్ చేయమంటూ నాకు స్క్రిప్టులు పంపుతున్న ప్రతిఒక్కరికీ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను అని రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: మొన్నే ప్రియుడితో ఎంగేజ్మెంట్.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్ -
ఇండస్ట్రీకి 'అవసరాల' బుల్లోడి అరుదైన ఫోటోలు..
-
సూపర్ హిట్ సినిమా డైరెక్టర్.. ఉండటానికి ఇల్లు లేక దీన స్థితిలో..
మనోజ్ భాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జొరమ్. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు ఎగరేసుకుపోయింది. ఈ సూపర్ హిట్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అద్దె పద్ధతిన అందుబాటులో ఉంది. పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈ మూవీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. సైకిల్ కొనేందుకు కూడా తాజాగా ఈ మూవీ దర్శకనిర్మాత దేవశిష్ మఖిజ తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. 'నాకిప్పుడు 40 ఏళ్లు. కనీసం ఒక సైకిల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. నేను తీసిన సినిమాలతో నేను కొంచెం కూడా డబ్బు కూడబెట్టుకోలేకపోయాను. ఇప్పటికీ అద్దె కట్టడానికి కష్టపడుతున్నాను. జొరమ్ మూవీ వల్ల నాకు లాభాలు రావడం కాదు కదా.. ఏకంగా దివాలా తీశాను. గత ఐదు నెలలుగా అద్దె కట్టడం లేదు. నన్ను ఇంటి నుంచి గెంటేయొద్దని మా ఓనర్‌ను వేడుకుంటున్నాను. కళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే ఇదిగో ఇలాంటి మూల్యమే దక్కుతుంది' అని బాధపడ్డాడు. రూ.1 కోటి పెడితే.. కాగా దేవశిష్ కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి సమస్యలతోనే సతమతమవుతున్నాడు. 2017లో అతడు అజ్జి అనే సినిమా తీశాడు. రూ.1 కోటి రూపాయలతో సినిమా తీయగా పెట్టుబడి అయినా వెనక్కు వస్తుందనుకున్నాడు. కానీ రూ.15 లక్షలు మాత్రమే వచ్చాయి. మొన్నటికి మొన్న జొరమ్ సినిమాతో నిండా మునిగిపోయాడు. తను నమ్ముకున్న కళ కోసం జీవితంలో ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు డైరెక్టర్. ప్రస్తుతం తన చేతిలో 20 స్క్రిప్టులదాకా ఉన్నాయని.. కానీ దాన్ని సినిమాగా మలిచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయాడు. చదవండి: మళ్లీ వచ్చేసిన మగజాతి ఆణిముత్యాలు.. సేవ్ ద టైగర్స్ 2 సిరీస్ ఎలా ఉందంటే? -
సినిమా ఆఫర్ కోసం వెళ్తే.. డైరెక్టర్ అలాంటి పాడు పని: బిగ్ బాస్ బ్యూటీ
క్యాస్టింగ్ కౌచ్ ఈ పదం చాలామంది వినే ఉంటారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. రంగుల ప్రపంచం లాంటి సినిమా రంగంలో ఇది సర్వ సాధారణంగా మారిపోయింది. గతంలో చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి తనకెదురైన క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బిగ్ బాస్ -16 కంటెస్టెంట్ శ్రీజిత దే సినీ రంగంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించింది. ఓ సినిమా ఆఫర్ కోసం వెళ్తే డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. శ్రీజిత మాట్లాడుతూ..' నేను 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మాది పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా అనే చిన్న పట్టణం. మా అమ్మ ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ నాతోనే ఉండేది. మా అమ్మ దగ్గర ఏ విషయాన్ని కూడా దాచేదాన్ని కాదు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలో కొందరు చెత్త వ్యక్తులను కూడా కలిశాను. కొందరు ప్రాజెక్ట్ లేకపోయినా కేవలం మీటింగ్ కోసం పిలిచి టైం పాస్ చేసేవారు. మరికొందరు పెద్ద డైరెక్టర్‌తో సినిమా ఉందంటూ కమిట్మెంట్ అడిగేవారు. అలా రెండుసార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చింది. కానీ ఒకసారి చాలా భయంకరమైన పరిస్థితి నుంచి బయపడ్డానని తెలిపింది. శ్రీజిత మాట్లాడుతూ.. "నాకు 19 ఏళ్ల వయస్సులో హిందీ చిత్రం రీమేక్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ నన్ను సమావేశానికి పిలిచారు. ఆ సమయంలో మా అమ్మ కోల్‌కతాలో ఉంది. నేను ఒంటరిగా డైరెక్టర్ ఆఫీసుకి వెళ్లాను. అతను నా భుజం పట్టుకున్న విధానం, నాతో మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. అతను వయసులో చాలా పెద్దవారు. ఎలాంటి వారికైనా ఆయన బుద్ధి ఎలాంటిదో వెంటనే అర్థమైపోతుంది. అతను నన్ను చూస్తున్న తీరు చాలా అసహ్యంగా అనిపించింది. దీంతో వెంటనే నా పర్సు తీసుకుని ఆఫీసు నుంచి బయటికి పరిగెత్తా." అంటూ ఆ షాకింగ్ సంఘటనను వివరించింది. కానీ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎప్పుడు మోసపోలేదని తెలిపింది. కాగా.. శ్రీజిత ఉత్తరాన్, తుమ్ హి హో బంధు సఖా తుమ్హీ, లేడీస్ స్పెషల్, లాల్ ఇష్క్, యే జాదూ హై జిన్ కా లాంటి ప్రముఖ టీవీ షోలలో కనిపించింది. బెంగాలీలో తన పాత్రలకు బాగా గుర్తింపు తెచ్చుకుంది. 2007లో కసౌతి జిందగీ కే అనే షోతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా తషాన్, మాన్సూన్ షూటౌట్, లవ్ కా ది ఎండ్, రెస్క్యూ వంటి చిత్రాలలో కూడా నటించింది. View this post on Instagram A post shared by Sreejita De Blohm-Pape (@sreejita_de) -
Sudha Murty: ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా రిటైరయ్యేదాన్ని..
దేశంలో అత్యంత గుర్తింపు పొందిన దంపతుల్లో ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి ఒకరు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషితో నారాయణమూర్తి ప్రసిద్ధి చెందితే రచయిత్రిగా, సేవా కార్యక్రమాలతో ఆయన సతీమణి సుధా మూర్తి గుర్తింపు పొందారు. అయితే భర్త కంపెనీ కోసం ఎంతో కష్టపడిన ఆమె కంపెనీలో మాత్రం భాగం కాలేకపోయారు. దానికి తన భర్త పెట్టిన షరతే కారణమంటున్నారు సుధా మూర్తి. అనేక దశాబ్దాల సహచర్యం ఉన్న ఈ దంపతులు తమ జీవిత విశేషాల గురించి పలు సందర్భాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధా మూర్తి తన భర్తతో సాన్నిహిత్యాన్ని, తమ వైవాహిక బంధం గురించి వెల్లడించారు.తమ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను కంపెనీ (ఇన్ఫోసిస్)లో చేరలేకపోవడమే జీవితంలో నాకు అత్యంత కష్టతరమైన విషయం. నేను ఎందుకు చేరలేకపోయానంటే.. కంపెనీ భార్యాభర్తల కంపెనీ కాకూడదని ఆయన షరతు పెట్టారు. ఆ కష్టతరమైన సమయం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. నేను ఎంతగానో ప్రేమించిన కంపెనీ, దాని కోసం చాలా పనిచేశాను. కానీ అందులో భాగం కాలేకపోయాను" అన్నారు సుధామూర్తి. అయినప్పటికీ తాను జీవితంలో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పటికి నేను బహుశా ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసి ఉండేదాన్ని. కానీ నేను నా పనితో చాలా మంది జీవితాలను స్పృశించగలిగాను. బహుశా ఇది దేవుడి నిర్ణయం. నాకు మాత్రమే సాధ్యమైంది" అన్నారు. నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన ఇన్ఫోసిస్. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. -
డ్రగ్స్ టెస్ట్ కోసం క్రిష్ వద్ద శాంపిల్స్ సేకరించిన పోలీసులు
-
హీరోయిన్‌పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు. (ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్) అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
Mamitha Baiju: డైరెక్టర్ చేతిలో చీవాట్లు తిన్న హీరోయిన్ (ఫోటోలు)
-
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో రాజమౌళి దంపతులు!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు ఆలయంలో పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB29గా తెరకెక్కించనున్న ఈ మూవీ కోసం మహేశ్ బాబు జిమ్‌లో కసరత్తులు ప్రారంభించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలో రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్ SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్ వినిపించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త అప్పట్లో తెగ వైరలైంది. Legendary Director @ssrajamouli garu at #SreeAmrutheswaraTemple in Bellary for the Prana Prathishta ceremony.@SriAmruteshwara @VaaraahiCC @SaiKorrapati_ pic.twitter.com/IH2wEYI6IM — Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) February 29, 2024 -
డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది ప్రేమలు మూవీ. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రేమలు చిత్రంలో హీరోయిన్గా నటించింది మమిత బైజు. ఈ మూవీ కంటే ముందు వణంగాన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను దూషించడంతో పాటు కొట్టాడని వెల్లడించింది హీరోయిన్. ఎక్స్పర్ట్లా యాక్ట్ చేయాలి.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ.. వణంగాన్ మూవీలో ఓ సంగీతపరికరాన్ని వాయించే సన్నివేశం ఉంటుంది. నేను అప్పటికే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్ చేయాలా? అని అడిగాను. డైరెక్టర్ బాలా.. అనుభవం ఉన్న కళాకారిణిగా నటించమన్నాడు. అప్పుడు నేను డ్రమ్స్ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిగా పాట పాడాలి అంతేగా అనుకున్నాను. కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు.. కానీ ఇంతలో ఆయన నన్ను ఆపి నా వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా చేయమన్నాడు. ఇంతలోనే రెడీ అన్నాడు. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లు ఏం పాడుతున్నారో నాకసలు అర్థం కావట్లేదు. మూడు టేకులయ్యాయి. మధ్యలో కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు. అయితే సెట్లో ఎప్పుడైనా కోప్పడతానని, దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని నాకు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి నేను దానికి మానసికంగా రెడీ అయ్యే సెట్లోకి వచ్చాను. కానీ ఆయన దూషణతో ఆగిపోలేదు, కొట్టాడు కూడా! తిట్టడమే కాదు కొట్టాడు కూడా! హీరో సూర్య సర్‌కు ఇదంతా తెలుసు. వారు ఎంతోకాలంగా కలిసి పని చేస్తున్నారు. వారి మధ్య ఆ అనుబంధం ఉంది. కానీ నాకిదంతా కొత్త కదా' అని చెప్పుకొచ్చింది. కాగా వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
డైరెక్టర్ కుమార్ సహానీ ఇకలేరు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కుమార్ సహాని (83) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. 1940 డిసెంబర్ 7న సింధ్‌లోని లర్కానాలో (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది) జన్మించారు కుమార్ సహాని. అయితే పాక్ విభజన తర్వాత ఆయన కుటుంబం ముంబైకి వచ్చేసింది. ముంబై యూనివర్సిటీలో బీఏ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు కుమార్ సహాని. ఆ తర్వాత పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ)లో డైరెక్షన్ కోర్స్ చేశారు. ఆ తర్వాత విదేశాల్లో కొన్ని సినిమాలకు సహాయకునిగా పనిచేసిన తర్వాత దర్శకుడిగా మారారాయన. 1972లో ‘మాయా దర్పన్’, 1984లో ‘తరంగ్’, 1989లో ‘ఖయల్ గాధ’, 1990లో ‘కస్బా’ లాంటి హిట్ సినిమాలు తీశారు కుమార్ సహాని. ‘మాయా దర్పణ్’ మూవీ జాతీయ ఉత్తమ చలన చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. కేవలం దర్శకుడిగానే కాకుండా మంచి విద్యావేత్తగా, రచయితగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారాయన. కుమార్ సహానీ మృతిపై పలువురు బాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు. -
స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్.. గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి టాలీవుడ్లో పెద్ద డైరెక్టర్. అల్లు అర్జున్, నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు తీశాడు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా కనిపించాడు. ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. గతేడాది నిర్మాతగా హారర్ మూవీతో హిట్ కొట్టాడు. అతడు మరెవరో కాదు.. డైరెక్టర్ సుకుమార్. నీ ప్రేమ ఎంత మధురం.. తాజాగా సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో ఈ ఫోటో షేర్ చేసింది. 2004లో దిగిన ఫోటోతోపాటు ఈ ఏడాది దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నీ ప్రేమను పొందడం ఎంత మధురమో.. అని రాసుకొచ్చింది. దీనికి 20 ఏళ్ల ప్రయాణం అంటూ హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. అప్పుడు, ఇప్పుడు ఆయన లుక్ చూసిన అభిమానులు.. వాటే ఛేంజ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సుకుమార్ గతేడాది నిర్మించిన విరూపాక్ష మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది పుష్ప 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) చదవండి: ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం? రాత్రి 12 తర్వాత ఏం పని? తప్పు మనవైపు.. -
అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత
మరో దిగ్గజ దర్శకుడు కుమార్ సహానీ(83) తుదిశ్వాస విడిచారు. హిందీలో గతంలో పలు హిట్ సినిమాలు తీసిన ఈయన.. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని నటి మిఠా వశిష్ట్ ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు కుమార్ సహానీకి సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) 1940 డిసెంబర్ 7న సింధ్‌లోని లర్కానాలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) పుట్టారు. అయితే పాక్ విభజన తర్వాత.. ఈయన కుటుంబం ముంబైకి వచ్చేసింది. అలా ముంబై యూనివర్సిటలో చదువుకున్నారు. బీఏ (ఆనర్స్) లో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేశారు. దర్శకుడిగా స్క్రీన్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1972లో మాయా దర్పన్, 1984లో తరంగ్, 1989లో ఖయల్ గాధ, 1990లో కస్బా లాంటి హిట్ సినిమాలు తీసింద ఈయనే కావడం విశేషం. (ఇదీ చదవండి: మీ మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నా.. ఎన్నో త్యాగాలు చేశారు..) -
ప్రముఖ డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు గౌరవ డాక్టరేట్
"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. ఈ డాక్టరేట్ గౌరవాన్ని.. అందులో సినీ రంగం నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. 'ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నాను. నాకే కాదు అమ్మకు కూడా.. నేను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన చిత్ర రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా సంతోషాన్నిచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను' అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
టాప్ డైరెక్టర్ తనయుడు హీరోగా లాంచ్.. ఆ మూవీలో హీరోయిన్స్ ఎవరంటే?
గ్రామీణ కథా చిత్రాలకు ట్రేడ్ మార్క్ దర్శకుడు ముత్తయ్య. ఈయన ఇంతకుముందు పులికుట్టి, కొంబన్ విరుమాన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది తెలిసిందే. తాజాగా మరోసారి మధురై నేపథ్యంలో తనదైన శైలిలో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందు శశికుమార్, ఆర్య, కార్తీ, విశాల్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు చేసిన ముత్తయ్య ఈసారి తన వారసుడు విజయ్ ముత్తయ్యను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. దర్శిని, బ్రిగిడ సాగా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురువారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం కూడా తన గత చిత్రాల తరహాలో గ్రామీణ నేపథ్యంలో సాగుతుందన్నారు హీరోయిన్స్‌గా. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను మదురై జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇందులో పూర్తిగా కొత్త తారలు నటిస్తున్నట్లు తెలిపారు. చిత్రంలోని ఒక ముఖ్యమైన ఫైట్ సన్నివేశం కోసం భారీ సెట్ వేసినట్లు చెప్పారు. ఈ మూవీని కేకేఆర్ శ్రీనివాస్ పతాకంపై రమేష్ పాండే నిర్మిస్తున్నారు. దీనికి ఎం సుకుమార్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: 'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు -
మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన సూపర్ హిట్ డైరెక్టర్!
అంజలి మీనన్ మహిళా దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో బెంగళూరు డేస్, మంచాడి గురు, ఉస్తాద్ హోటల్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆమె దర్శకత్వం వహించిన వండర్ ఉమెన్ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా అంజలి మీనన్ మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈసారి తమిళ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. కేఆర్జీ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది. ఈ సంస్థ తొలిసారిగా తమిళంలో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. అంజలిమీనన్ సహా ప్రతిభావంతులైన పలువురు నవ దర్శకులను ప్రోత్సహించే విధంగా తమ సంస్థ పనిచేస్తుందని తెలిపింది. మంచి కథ అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఆలోచింప జేసే కథ, కథనాలతో పాటు ప్రేక్షకులకు మంచి ఎంటర్టెయిన్మెంట్ ఇచ్చే కథా చిత్రాలను అందిస్తామని చెప్పారు. దర్శకురాలు అంజలిమీనన్ మట్లాడుతూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా ప్రపంచ స్థాయి కథా చిత్రాలను రూపొందిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. Happy to share news about the next film and our exciting association with @KRG_Studios @Karthik1423 @vjsub @yogigraj It’s a first step for me with தமிழ் and with all the blessings, I hope we can bring together a memorable movie. 🙏❤️ https://t.co/rkfsUzleeM — Anjali Menon (@AnjaliMenonFilm) February 20, 2024 -
పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా మంజువాణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ జి.మంజువాణి నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఎస్.రాంచందర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయన స్థానంలో మంజువాణిని నియమించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మంజువాణి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. డాక్టర్ ఎస్.రాంచందర్‌ను తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీఎల్‌ఎస్‌డీఏ) సీఈవోగా నియమించారు. కాగ్ నివేదిక నేపథ్యంలో! పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణం కారణంగానే ఈ బదిలీలు జరిగాయనే చర్చ సాగుతోంది. గొర్రెల పంపిణీలో చాలా అవకతవకలు జరిగాయని, బైక్‌లపై కూడా గొర్రెలను తీసుకొచ్చారని ఇటీవల కాగ్ తన నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గిరిజన బిడ్డ కావడమే నేరమా?: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పశుసంవర్థక శాఖలో జరిగిన బదిలీలపై రాష్ట్ర బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్పందించారు. నిజాయితీకి మారుపేరైన రాంచందర్‌ను ఆగమేఘాల మీద బదిలీ చేసి బలిపశువును చేశారని, ఆయన తెలంగాణ తండాలలో జని్మంచిన గిరిజన బిడ్డ కావడమే నేరమా అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘గొర్రెల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులను, వారి ఓఎస్డీలను, అప్పటి డైరెక్టర్లను ముట్టుకునే దమ్ముందా మీకు? ’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత సావిత్రి .. ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడిప్పుడే మహిళా డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించారు. విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైంది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి మంచి దర్శకురాలిగా గుర్తింపు సాధించారు. అలాగే 2021లో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య... ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్‌గా రాణించారు. తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంజన అన్నే కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్నారు .కాగా.. సంజన అన్నే గతంలో నేనే రాజు నేనే మంత్రి, నీకు నాకు పెళ్లంట టామ్ టామ్ లాంటి చిత్రాల్లో నటించింది. -
ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్!
మెగా హీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 'గేమ్ ఛేంజర్' తర్వాత చెర్రీ మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఉప్పెన్ ఫేమ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఆర్సీ16 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇవాళ డైరెక్టర్ బుచ్చిబాబు సనా బర్త్‌డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలిపారు. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ఏడాదిలో మీరు మరింత ప్రేరణ, ఆవిష్కరణలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. ఆర్సీ16 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని.. సరికొత్త ఉత్సాహంతో పనిచేద్దామని ట్విటర్లో రాసుకొచ్చారు. అంతకుముందే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Warmest birthday wishes to @BuchiBabuSana 🎉 Here's to a year brimming with inspiration and innovation. Let's stir up some excitement with our next film #RC16 ✨ — Ram Charan (@AlwaysRamCharan) February 15, 2024 -
దర్శకుడి ఇంట దొంగతనం.. బంగారం ఎత్తుకెళ్లారు, కానీ!
సినీ దర్శకుడి కష్టాన్ని దొంగలు కూడా గుర్తించారు. తాము చేసిన దొంగతనానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ దర్శకుడికి లభించిన జాతీయ అవార్డు, వెండి పతకాన్ని అప్పగించి వెళ్లారు. సినీ తరహాలో ఆసక్తికరంగా మారిన ఈ దొంగతనం కేసు వివరాల్లోకి వెళ్తే.. కాకా ముట్టై వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మణికందన్ సొంత నివాసం మధురై జిల్లా ఉసిలం పట్టి సమీపంలోని విలాం పట్టి ఎలిల్ నగర్లో ఉంది. సినిమా పనుల నిమిత్తం చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఈ నెల 8వ తేదీన మధురైలోని ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన దర్శకుడి డ్రైవర్ నరేష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఇంట్లో ఉన్న 5 సవర్ల బంగారం, రూ. లక్ష నగదుతో పాటు కడేసి వ్యవసాయి చిత్రానికిగానూ మణికందన్‌కు లభించిన జాతీయ అవార్డు.. వెండి పతకం చోరీ అయినట్లు విచారణలో తేలింది. ఈ కేసును ఉసిలం పట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆ ఇంటి ముందు ప్లాస్టిక్ కవర్ వేలాడుతూ ఉండటాన్ని గస్తీలో ఉన్న పోలీసులు గుర్తించారు. ఇందులో మణికందన్ గెలుచుకున్న వెండి పతకం ఉండడం విశేషం. అలాగే అందులో ఓ లేఖ కూడా బయట పడింది. అయ్యా.. మమ్మల్ని క్షమించండి.. మీ కష్టం మీకే.. అని రాసి ఉంది. దర్శకుడి కష్టాన్ని గుర్తించిన దొంగలు ఆయనకు లభించిన పతకాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చదవండి: 22 ఏళ్ల ఏజ్ గ్యాప్.. ప్రేమకు సరైన నిర్వచనంగా నిలిచిన జంట - పోడూరి నాగ ఆంజనేయులు