కోట్లు పెట్టి కొత్త అపార్ట్‌మెంట్‌ కొన్న నిర్మాత | Karan Johar Buys Another Property in Mumbai for Rs 8 05 Crore | Sakshi
Sakshi News home page

ప్రముఖ డైరెక్టర్ కొత్త అపార్ట్‌మెంట్: రేటెంతో తెలుసా?

Jan 16 2026 8:37 PM | Updated on Jan 16 2026 8:48 PM

Karan Johar Buys Another Property in Mumbai for Rs 8 05 Crore

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం సర్వ సాధారణం. ఇందులో భాగంగానే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఒక కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు.

ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేసిన కొత్త అపార్ట్‌మెంట్ ధర రూ. 8.05 కోట్లు. ఇది పాలి వింటేజ్ భవనంలో 1,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఐదవ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ను రెండు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కొనుగోలు చేశారు. దీనికోసం రూ. 48 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ లావాదేవీ నవంబర్‌లో జరిగినట్లు సమాచారం.

ఖార్‌లో పాలి వింటేజ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసిన లెవల్ 6 అనే కంపెనీ ద్వారా ఈ అపార్ట్‌మెంట్‌ను కరణ్ జోహార్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని లెవల్ 6 గ్రూప్ చీఫ్ ప్రమోటర్ ప్రీతేష్ సంఘ్వి ధృవీకరించారు.

ఈ కొత్త అపార్ట్‌మెంట్ మాత్రమే కాకుండా.. కరణ్ జోహార్ బాంద్రాలోని కార్టర్ రోడ్‌లోని ది రెసిడెన్సీలో సముద్రానికి ఎదురుగా ఉన్న పెద్ద డ్యూప్లెక్స్ కలిగి ఉన్నారు. అదే విధంగా 8,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ను 2010లో దాదాపు రూ. 32 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ప్రైవేట్ టెర్రస్ & గౌరీ ఖాన్ రూపొందించిన నర్సరీ ఉన్నాయి. ఢిల్లీలోని మెహ్రౌలిలో కూడా ఈయనకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement