క్రూడ్‌ కల్లోలం.. గ్లోబల్‌ మార్కెట్లు కుదేల్‌ | Middle East War Shakes Global Markets US Stocks Plunge Oil Collapse | Sakshi
Sakshi News home page

క్రూడ్‌ కల్లోలం.. గ్లోబల్‌ మార్కెట్లు కుదేల్‌

Mar 4 2026 8:31 AM | Updated on Mar 4 2026 8:43 AM

Middle East War Shakes Global Markets US Stocks Plunge Oil Collapse

అమెరికా, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్‌ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. ఒక దశలో అమెరికాలో కీలకమైన సూచీలైన డోజోన్స్‌ 2.5 శాతం (1,232 పాయింట్లు), నాస్‌డాక్‌ 2.7 శాతం మేర క్షీణించాయి. ఎస్‌అండ్‌పీ 500లోని 95 శాతం స్టాక్స్‌ నష్టపోవడం గమనార్హం. పెరిగే ఇంధన భారం, ఫ్లయిట్ల రద్దుపరమైన సవాళ్లతో అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు 5.4 శాతం, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 5.8 శాతం పతనమయ్యాయి.

అటు ఆసియా, యూరప్‌ సూచీలు కూడా తగ్గాయి. దక్షిణ కొరియా కోస్పి స్టాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్‌ నిల్వలున్నప్పటికీ జపాన్‌ నికాయ్‌ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్‌ సూచీ 3.9 శాతం పతనమైంది.  మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు. గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావంతో బుధవారం (నేడు) గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.  

ఆయిల్‌ అప్‌.. గోల్డ్‌ డౌన్‌..

అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 83.33 డాలర్ల వద్ద, నైమెక్స్‌ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్‌ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

ఇదీ చదవండి: పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు?

Advertisement
 
Advertisement
Advertisement