భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్దం కారణంగా దుబాయ్‌లో ఇరుక్కుపోయిన ఆమె.. ఇవాళ ఉదయం సురక్షితంగా బెంగళూరులో ల్యాండయ్యింది. వాస్తవానికి సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్‌కు వెళ్లాల్సి ఉండింది. అయితే అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్దం కారణంగా గమ్యానికి చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టింది.
భయానక అనుభవం
సింధు బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం చేస్తూ దుబాయ్‌లో ట్రాన్సిట్‌లో ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో సింధు ఉన్న ప్రాంతం దగ్గరలో పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కోచ్ పేలుడు ధాటికి గురయ్యాడు.
ఇంటికి చేరాను
మార్చి 3న సింధు “సురక్షితంగా ఇంటికి చేరాను” అని Xలో పోస్ట్ చేసింది. “ఈ క్లిష్ట సమయంలో సహకరించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, తదుపరి అడుగులు ఆలోచిస్తానని పేర్కొంది.
కాగా, సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్ కోసం కఠోరంగా శ్రమించింది. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలన్న కసితో ఉండిన ఆమెకు అనుకోని అవరోధాలు ఎదురయ్యాయి. దుబాయ్‌లో చిక్కుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం అన్వేశించినా, భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ టోర్నీ నుంచి సింధులాగే మరికొందరు క్రీడాకారులు కూడా వైదొలిగినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు జరగాల్సి ఉండింది.


