breaking news
Iran-Israel conflict
-
హార్ముజ్ మూసివేత గండం గడిచినట్లేనా?!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ (israel) అమెరికాల(USA) యుద్ధం నేపథ్యంలో హార్ముజ్( Hormuz) జల సంధిని మూసివేస్తామని ఇరాన్ (Iran)ప్రకటించడం కలకలం రేపింది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? ఇది ఇరాన్‌కు ఉత్తర భాగంలో, ఒమన్, యూఏఈ దేశాలకు పశ్చిమ భూభాగంలో ఉంటుంది. ఈ జలసంధి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో 50 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. లోతు చాల ఎక్కువగా ఉండి పెద్ద రవాణా నౌకలు కూడా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది గల్ఫ్ దేశాలను అరేబియా సముద్రానికి అనుసంధానిస్తుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఒక్క ఇరాన్ కాకుండా ఇంకా గల్ఫ్ దేశాలైన ఇరాక్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా ఆయిల్ సరఫరా చేస్తుంటాయి. అమెరికాలోని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 2023లో ఈ జలసంధి ద్వారా 2 కోట్ల బారెళ్ల క్రూడ్ ఆయిల్‌ని ఆ యా గల్ఫ్ దేశాలు సరఫరా చేశాయి. దీని విలువ సుమారు 600 బిలియన్ల డాలర్లు. ఇది ఒక్క ఏడాదిలో జరిగిన ఆయిల్ సరఫరా విలువ.యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డైరెక్టర్ సర్ అలెక్ యూన్గర్ అంచనా ప్రకారం ఈ జలసంధిని మూసివేయడం వల్ల ఆయిల్ రేట్లు అంచనాకు మించి పెరిగే అవకాశముంటుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావి తమవుతాయి. ఈ జలసంధి ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకు ఆయిల్ సరఫరా అవుతోంది. చైనా దిగుమతి చేసుకొనే 90% ఆయిల్ ఒక్క ఇరాన్ నుంచే సప్లై అవుతుంది. ఇండియా 60% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా 60%, జపాన్ ఉపయోగించే ఆయిల్లో మూడొంతులు ఈ జలసంధి ద్వారానే దిగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరలూ దీని మూసివేత వల్ల బాగా పెరిగే అవకాశంఉంటుంది. ఈ దేశాల వస్తువులు ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు వాడటంతో అంతటా ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది కనుక హార్ముజ్ మూసివేత నిర్ణయాన్ని విరమించినట్టు వస్తున్న వార్తలు నిజమైతే అదే పదివేలు! – డా.కొండి సుధాకర్ రెడ్డి లెక్చరర్ -
అమెరికా దాడుల ఎఫెక్ట్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ ఊహించిన షాకిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సందర్భంగా తమపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ వచ్చేవారం ఇరాన్‌తో అణుచర్చలు జరగనున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఈ సందర్బంగా అబ్బాస్.. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన మాకు లేదు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా చేసిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో చర్చల్లో పాల్గొనే ఆలోచనే లేదు అని కుండబద్దలు కొట్టారు.#Iran's Foreign Minister Seyed Abbas Araghchi says that no arrangement or commitment was made to resume negotiations with the United States, amid heightened tensions following attacks by Israel and United States on Iranian territory. File Photo pic.twitter.com/LZruhGwi4K— All India Radio News (@airnewsalerts) June 27, 2025మరోవైపు.. నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చేవారం టెహ్రాన్‌తో అణుచర్చలు జరుపుతామన్నారు. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్‌తో ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్ చమురుపై ఆంక్షల విషయంలో కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ట్రంప్ హింట్ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖతార్‌లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్నీ చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు, క్రూజ్ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అగ్రరాజ్యం ఏమీ సాధించలేకపోయిందని అన్నారు. ఖతార్‌లో అమెరికా స్థావరంపై తాము చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా స్థావరాలకు చేరగల సత్తా తమ దేశానికి ఉందని నిరూపితమైందని అన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన సందర్భాల్లో ఇలాంటి దాడులు చేస్తామని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. -
ఇరాన్ ప్రజల ఆందోళన.. ఖమేనీ ఎక్కడ?
టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా సైతం ఆకస్మిక దాడులకు దిగింది. దీంతో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతోందా? అన్న భయాందోళన నెలకొంది. కానీ, అనూహ్య పరిణామాలతో యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. అయితే, వారం రోజులుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటి వరకు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అదృశ్యమయ్యారు. వారం రోజులుగా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా ఖమేనీ వాయిస్ కూడా బయటకు వినిపించలేదు. దీంతో ఇరాన్ నేతలు, ప్రజలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, యుద్ధం ప్రారంభం తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీని రహస్య భూగర్భ బంకర్‌కు తరలించారని వార్తలు బయటకు వచ్చాయి. ఆయనను ఎవరూ టార్గెట్ చేయకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉంచినట్టు సన్నిహిత అధికారులు చెబుతున్నారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు కూడా ఆయనతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మంగళవారం ప్రైమ్-టైమ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ షో హోస్ట్ ఖమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి అడిగారు. ఈ సందర్భంగా ప్రజలు సుప్రీం లీడర్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మాకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కానీ ఫజేలీ.. మాత్రం ఆ ప్రశ్నను పక్కనపెట్టి మనమందరం ప్రార్థన చేయాలి. సుప్రీం లీడర్‌ను రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా ఇరాన్‌ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.చావుకు భయపడే మనిషి కాదు.. ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచ్చితంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం దొరకకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. -
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. నష్టం ఎవరికి? నెగ్గిందెవరు?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా తెరపడింది. క్షిపణి మోతలు, సైరన్ల హోరు కాస్త తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో ఇరుపక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పు చందంగానే ఉందన్నది నిపుణుల అంచనా. అయితే... పదమూడు రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో నెగ్గిందెవరు? తగ్గిందెవరు? కష్టమెవరికి? నష్టమెవరికి?.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్ 13వ తేదీన ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేవలం అయిదంటే అయిదు రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్‌లోని వందకుపైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకూ క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్ జూన్ పదమూడుతో మొదలుపెట్టి వరుసుగా వారం రోజులపాటు ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్ కొన్నింటిని నిరోధించగలిగినా... మిగిలినవి ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయి. అయితే.. జూన్ ఇరవైన అమెరికా రంగ ప్రవేశంతో యుద్ధం తీరుతెన్నులు మారాయి. అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, ఈ దాడులు యుద్ధ ప్రకటనేని హూంకరించిన ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికన్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది కూడా. అయితే ఆ తరువాత జూన్ 22న రోజు గడవకముందే ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ఈ కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడితో బలవంతంగా కుదిరిందే కానీ స్వచ్ఛందంగా ప్రకటించింది కాదని దౌత్య, మిలటరీ వర్గాలు అంటున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ జోక్యం చేసుకోవాల్సిందిగా అమెరికాను అభ్యర్థించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ట్రంప్ ఈ అభ్యర్థనను మన్నించి ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్ నెతన్యాహ్యూ తన మాట వినేలా చేసుకున్నాడని, అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా.. ఇజ్రాయెల్ రెచ్చగొట్టనంత వరకూ తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ స్పష్టం చేయగా... ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ ‘యుద్ధం ముగియలేదు’ ప్రకటించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఒక అణుశాస్త్రవేత్త మృతికి కారణమైంది కూడా. ఇదిలా ఉంటే... ఫొర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణు స్థావరాలపై ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ ప్రకటించగా... జరిగిన నష్టం తక్కువేనని, కొన్ని నెలల్లోపే అణ్వాయుధాలకు కావాల్సినంత శుద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవమున్నా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు ఇరాన్‌పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలే ఎక్కువ.మొత్తమ్మీద చూస్తే ఈ యుద్ధంలో ఇరాన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్లో ప్రభుత్వ మార్పు అనే రెండు లక్ష్యాలతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వాటిని సాధించలేకపోయింది. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ అమెరికాను కూడా తోసిరాజు అనగలిగింది!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఇరాన్ అణు ముప్పును తొలగించాం: నెతన్యాహు
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించింది. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ అణు-క్షిపణి ముప్పును తొలగించడంలో విజయం సాధించాం అని పేర్కొన్నారాయన. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. ‘‘ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించాం. తద్వారా ముప్పును తొలగించగలిగాం. ఈ విషయంలో సహకరించడంతో పాటు రక్షణ సహకారం అందించిన ట్రంప్‌నకు కృతజ్ఞతలు. ఈ విజయానికి ప్రతిగా.. ట్రంప్‌నకు పూర్తి సహకారం అందిస్తాం. ఆయన ప్రతిపాదించిన పరస్పర కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం.’’ అని నెతన్యూహు పేర్కొన్నారు. అయితే.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక ఇజ్రాయెల్ ధీటుగానే స్పందిస్తుందని ఇరాన్‌ను హెచ్చరించారాయన. అయితే నెతన్యాహు అణు ముప్పు తొలగిందన్న వ్యాఖ్యలకు ఇరాన్ స్పందించాల్సి ఉంది.12 రోజుల యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే తొలుత ఇరాన్ ఈ ప్రకటనను తోసిపుచ్చుతూ.. భిన్నమైన ప్రకటనలు చేసింది. ఈలోపు మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం కొనసాగుతోందని అంతా భావించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే కాల్పుల విరమణ మొదలైందని టెహ్రాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించగా.. కాసేపటికే ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. 24 గంటల్లో తొలి 12 గంటలు ఇరాన్ కాల్పుల విరమణ పాటించాలి. ఆ తర్వాత 12 గంటలు ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పాటిస్తుంది. దీంతో కాల్పుల విమరణ ఒప్పందం సంపూర్ణంగా అమలు అయినట్లే. అయితే ఇది శాశ్వత పరిష్కారమా? కాదా? అనేదానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
పశ్చిమాసియా యుద్ధవాతావరణానికి ఎట్టకేలకు తెరపడింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసింది!. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు.. ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు కొనసాగించడం గమనార్హం.ఇరాన్- ఇజ్రాయెల్ (Iran- Israel) మధ్య కాల్పుల విరమణ జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా ఆయన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు. తొలుత ఇరాన్, ఆపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. అంతకు ముందు.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకేశారి ‘శాంతి’ అంటూ తన వద్దకు కాళ్లబేరానికి వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించానన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందన్నారు. ఇరుదేశాలు భవిష్యత్తులో ప్రేమ, శాంతి శ్రేయస్సును చూస్తాయని తెలిపారు. అలా కాదని వారు నీతిని, సత్య మార్గాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో మరింత కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈలోపు ఇరాన్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదంటూనే.. ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తామూ దాడులు ఆపుతామంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి సూచనప్రాయంగా పోస్టులు చేశారు. మరోవైపు.. ‘‘ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్‌లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది.ఆపై కొన్ని గంటల్లోనే టెల్‌అవీవ్‌పై టెహ్రాన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. దీంతో పశ్చిమాసియలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయని భావించేలోపే.. కాసేపటికే ట్విస్ట్ ఇస్తూ ఇరాన్ కాల్పుల విరమణ మొదలైందంటూ ప్రకటన చేయించడం గమనార్హం. ఇరుదేశాల ఒప్పందం వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. -
నో సీజ్ ఫైర్ ట్రంప్.. అంతా తుస్!!
ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ముందే క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాకే తగిలింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే అంతా ఉత్తదేనంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒప్పందం కోసం ట్రంప్ తమను వేడుకున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణులతో దాడులకు తెగబడింది. పశ్చిమాసియాలో యుద్ధం 12వ రోజుకి చేరగా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ తాజాగా మిస్సైల్స్ ప్రయోగించింది. ఏకంగా 10 మిస్సైల్స్ ప్రయోగించిందని.. ఐదుగురు మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ తమపై ఆరు క్షిపణులతో దాడులకు దిగినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్.. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ప్రకటించుకుంది. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రకటన ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్‌లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అదే సమయంలో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మండిపడిన సంగతి తెలిసిందే. కాసేపటికే శాంతి ఒప్పందం కోసం ట్రంప్ వేడుకొన్నారంటూ మరో సంచలన ప్రకటన చేసింది. ‘‘ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్‌లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది. అంతకు ముందు.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని స్పష్టం చేసింది.ఇరాన్ ప్రకటనతో సంబంధం లేకుండా ట్రంప్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇరుదేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం సాధించామని, అందుకు గర్వకారణంగా ఉందంటూ తన సోషల్ ట్రూత్ అకౌంట్లో వరుస పోస్టులు పెడుతున్నారు. -
Iran-Israel: ట్రంప్ కీలక ప్రకటన
-
ఇరాన్ ఎఫెక్ట్.. భారత్‌కు గ్యాస్ సిలిండర్ టెన్షన్!
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్‌కు ఎల్పీజీ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్‌లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్ టెన్షన్ మొదలైంది.ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్‌కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాల్లో భారత్‌కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్ నుంచి భారత్‌కు 95 శాతం ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.మూడింట రెండు అటు నుంచే..దేశంలో వాడే ప్రతీ మూడు వంట గ్యాస్ సిలిండర్లలో రెండు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్‌లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎరువులపై ప్రభావం.. మరోవైపు.. హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లో అధిక మొత్తంలో అమ్మోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమ్మెనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ నుంచి అమ్మెనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చమురు నిల్వలు ఓకే.. ఇదిలా ఉండగా.. అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. అయితే, భారత్‌లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.రష్యా నుంచి..భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది.అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. -
ట్రంప్‌కు ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్.. చైనా, రష్యా, భారత్ పరిస్థితేంటి?
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో దాడులు చేసిన వారికి తప్పకుండా శిక్ష కొనసాగుతుంది అంటూ హెచ్చరించారు.ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీ మొదటిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఖమేనీ..‘ఇజ్రాయెల్, అమెరికాకు కఠినమైన, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుంది. శిక్ష కొనసాగుతోంది. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశాడు. పెద్ద నేరం చేశాడు. దానిని శిక్షించాల్సిందే.. తప్పకుండా శిక్ష ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు.మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసి దౌత్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని విమర్శించారు. ఇరాన్ మిలిటరీ సరైన సమయంలో స్పందిస్తుందని అమెరికాను హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.#همین_حالا مجازات ادامه دارددشمن صهیونی یک اشتباه بزرگی کرده، یک جنایت بزرگی را مرتکب شده؛ باید مجازات بشود و دارد مجازات میشود؛ همین حالا دارد مجازات میشود.#الله_اکبر pic.twitter.com/wH6Wk9nNhJ— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) June 23, 2025రష్యా, చైనా వైఖరేంటి?ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ ‘రెడ్ లైన్ దాటిందని’ చెప్పింది. ఇజ్రాయెల్ చర్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజింగ్ వ్యాఖ్యానించింది. మరోవైపు.. రష్యా ఇజ్రాయెల్ దాడులను విమర్శించినప్పటికీ ఇరాన్‌కు మాస్కో ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడం, ఆ తర్వాత ఇది మరింత తీవ్రమైతే చైనా, రష్యా ఇరాన్‌కు సైనిక సాయం అందిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘రష్యా, చైనా ఇరాన్‌కు దౌత్యపరమైన మద్దతిస్తాయి. కానీ అవి సైనికంగా ఎలాంటి సాయం చేయవు. ఇరాన్ కోసం ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగవు’ అని చైనాకు చెందిన కీలక నేత చెప్పుకొచ్చారు.ఇస్లామిక్ దేశాలు ఎటువైపు?ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం అని ఖతార్ హెచ్చరించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు నిదర్శనం అని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైతే, దాని ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే, అరబ్ దేశాల తాజా ప్రకటనలు చూస్తుంటే, ఈ ఘర్షణ మరింత పెద్దది కావడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది.ఆందోళనలో భారత్?భారత్‌కు ఇజ్రాయెల్, ఇరాన్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్, ఇరాన్ రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు. చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్‌కు ఇరాన్ బలమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇక, ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. నెల రోజుల క్రితం భారత్ పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ విషయంలో భారత్‌కు ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో, రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో తన ప్రయోజనాలకు హాని కలగకుండానే ఎవరి పక్షం వహించాలో నిర్ణయించుకోవడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాల్. -
మార్కెట్లలో ఈ వారం బ్రేకవుట్!
సుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్ జోన్)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం.. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గత వారాంతాన సాంకేతికంగా పరివర్తన స్థాయి(25,112)కి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా 25,200 పాయింట్ల ఎగువకు చేరి నిలదొక్కుకుంటే సాంకేతికంగా బ్రేకవుట్‌కు వీలున్నట్లు అంచనా వేశారు. దీంతో సమీప కాలంలో 25,600–25,800 పాయింట్లను తాకవచ్చని విశ్లేíÙంచారు. ఇలాకాకుండా బలహీనపడితే సైడ్‌వేస్‌లో కదలవచ్చని పేర్కొన్నారు. పశి్చమాసియాలో యుద్ధం ముదిరితే మార్కెట్లు క్షీణించవచ్చని తెలియజేశారు. దీంతో గత వారం మాదిరే 24,700 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. రుతుపవనాలకు ప్రాధాన్యత దేశీయంగా నైరుతి రుతుపవన కదలికలు కీలకంగా మారనున్నాయి. మే నెలలోనే దేశంలోకి ప్రవేశించడం ద్వారా ఆశలు రేపినప్పటికీ తదుపరి మందగించిన సంగతి తెలిసిందే. అయితే రెండు, మూడు రోజుల్లో తిరిగి ఊపందుకుని పలు ఉత్తరాది రాష్ట్రాలలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో సెంటిమెంటు బలపడనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల పరిణామమని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ కొనసాగవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, వాటర్‌ఫీల్డ్ అడ్వయిజర్స్ లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ అభిప్రాయపడ్డారు. ఫెడ్‌పై చూపు గత వారం పాలసీ సమీక్షలో ఫెడరల్ ఓపెన్ మార్కెట్‌కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్లను యథాతథంగా అమలు చేసేందుకే ఓటేసింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన సమావేశమైన ఎఫ్‌వోఎంసీ వరుసగా నాలుగోసారి ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇంతక్రితం 2024 డిసెంబర్లో 0.25 శాతం వడ్డీ రేటును తగ్గించిన ఫెడ్ తదుపరి నిర్వహించిన సమావేశాలలో యథాతథ పాలసీ అమలుకే ఓటు వేస్తూ వస్తోంది. అయితే ఈ నిర్ణయాలతోపాటు.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థలపై ఫెడ్ అభిప్రాయాలను పావెల్ కాంగ్రెస్‌కు వివరించనున్నారు. మంగళవారం(24న) ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమిటీముందు, బుధవారం(25న) సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ముందు ఫెడ్ అంచనాలను వెల్లడించనున్నారు. మరోపక్క యూఎస్ క్యూ1 జీడీపీ తుది గణాంకాలు గురువారం(26న) వెల్లడికానున్నాయి. 2025 జనవరి–మార్చిలో యూఎస్ జీడీపీ 0.2 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.చమురు ధరలు కీలకం ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసే వీలున్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇది జరిగితే చమురు ధరలకు రెక్కలురానున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తలెత్తిన వెంటనే బ్రెంట్ చమురు ధర ఒక్కో బ్యారల్‌కు 78 డాలర్ల గరిష్టానికి ఎగసిన విషయం విదితమే. ఫలితంగా యుద్ధ ప్రభావం ప్రధానంగా ముడిచమురు ధరలపై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా అధిక శాతం చమురు అవసరాలకు గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో యుద్ధ సెగలు దేశీ మార్కెట్లను దెబ్బతీయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారమిలా.. గత వారం(16–20) ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత క్షీణపథంలో ట్రేడయినప్పటికీ వారం చివర్లో జోరందుకున్నాయి. దీంతో నికరంగా బీఎస్ఈ సెన్సెక్స్ గత వారం 1,290 పాయింట్లు(1.6 శాతం) ఎగసింది. 82,408 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 394 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 25,112 వద్ద నిలిచింది. అయితే చిన్న, మధ్యతరహా కౌంటర్లలో అమ్మకాలదే పైచేయి అయ్యింది. వెరసి బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ దాదాపు 2 శాతం పతనమైంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇరాన్ అన్నంత పని చేసింది.. ప్రపంచ దేశాలపై ప్రభావం!
టెహ్రాన్: గత కొన్ని రోజులు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్.. అన్నంత పని చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్ ఇక హార్ముజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్.. ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది.భారత్‌పై చమురు దిగుమతుల ప్రభావంహార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపులో ఉండదు. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టింది. అమెరికా, రష్యాల నుంచి చమురు నిల్వలు దిగుమతి పెంచేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు చమురు కోసం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ. -
ఇరాన్ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెలీ అవీవ్, ఇతర ప్రాంతాలను టార్గెట్‌గా ఇరాన్ భారీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో, టెలీ అవీవ్ సహ దాదాపు 400 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోవైపు.. తమపై దాడి చేసి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా బాంబు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ..మరోవైపు.. అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్‌తో ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య ఇజ్రాయెల్‌లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరిగినట్టు సమాచారం. ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. జూన్ 27వ తేదీ వరకు ఇజ్రాయెల్ విమాన సర్వీసులను రద్దు చేసింది.There are close to 50 large oil tankers scrambling to leave the Strait of Hormuz right now. Looks like the oil industry is expecting the Strait to be blockaded in the coming days. pic.twitter.com/ymaJRcax3x— Spencer Hakimian (@SpencerHakimian) June 22, 2025'హార్ముజ్ జలసంధి' మూసివేత!ఇదిలా ఉండగా.. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇక, ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది. 🚨⚡BREAKING AND UNUSUALBrigadier General Tangsiri, Commander of the IRGC Navy:The Strait of Hormuz will be closed within a few hours. pic.twitter.com/ca1cYFwvvf— RussiaNews 🇷🇺 (@mog_russEN) June 22, 2025 భారత్‌పై ఎఫెక్ట్.. ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది. -
ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు
ఢిల్లీ: ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్‌కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది.కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్ నుంచి భారత్‌కు విమానాలు చేరుకుంటున్నాయి.యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూలో భాగంగా భారతసర్కార్ ఇరాన్‌లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి. -
అణు పరీక్షలతోనే ఇరాన్లో భూకంపమా?
తీవ్రత తక్కువే అయినా కూడా శక్తివంతమైన భూకంపం శుక్రవారం ఇరాన్‌ను వణికించింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లేదని.. స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభించిందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించడంతోనే అక్కడ భూమి కంపించిందా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. జూన్ 20 శుక్రవారం ఇరాన్ సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. సెమ్నాన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైంది. అయితే టెహ్రాన్ అణు పరీక్షలు నిర్వహించడం వల్లే భూమి కంపించిందనే అనుమానాలు మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం 9వ రోజుకి చేరింది. అణు ఒప్పందాలపై ఎలాంటి చర్చలు ఉండబోవని ఇరాన్ తాజాగా ప్రకటించింది కూడా. అయితే ఆ దేశ సైన్యం నడిపించే మిస్సైల్ కాంప్లెక్స్‌తో పాటు సీక్రెట్ స్పేస్ సెంటర్ కూడా సెమ్నాన్ ప్రాంతంలోనే ఉంది. అందుకే ఈ అనుమానం తెర మీదకు వచ్చింది. సాధారణంగా అణు పరీక్షలు నిర్వహించే క్రమంలో భూమి కంపించడం సహజమే. పేలుళ్ల ధాటికి టెక్టానిక్ ప్లేట్లు ఒత్తిడికి గురికావడం వల్ల భూకంపానికి దారితీసే అవకాశం ఉంది. అయితే భూకంప శాస్త్రవేత్తలు (Seismologists).. సహజ భూకంపాలకు, అణు కార్యక్రమాల వల్ల ఏర్పడే ప్రకంపనలకు తేడాను గుర్తించగలుగుతారు. ఇండియా టుడే కథనం ప్రకారం.. ఇరాన్ తాజా భూకంపానికి, అణు పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వేతో పాటు కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్(CTBTO) ధృవీకరించారు. మరికొందరు సిస్మాలజిస్టులు కూడా ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. కేవలం పది కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు జరపడం అసాధ్యమని తేల్చేశారు.ఇరాన్ భూకంపాల జోన్లోనే ఉంది. సాధారణంగా ఏడాదిలో అక్కడ 2,100 సార్లు భూమి కంపిస్తుంటుంది. ఇందులో 15 నుంచి 16 సార్లు.. రిక్టర్ స్కేల్‌పై 5 కంటే ఎక్కువ తీవ్రతతోనే భూమి కంపిస్తుంది. 2006-2015 మధ్య ఇరాన్ 96,000 భూకంపాలను చవిచూసింది. -
హర్మూజ్ జలసంధి మూతపడితే...???
ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తరువాత ఇరుదేశాలిప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొడుతూంటే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటీ హర్మూజ్ జలసంధి? దాన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్‌కు ఏమిటి నష్టం?(India Effects With Hormuz Block). సూయెజ్ కెనాల్... యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గం. సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయెజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఒమాన్‌ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయెజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడిచమురు, ఎల్‌ఎన్‌జీలు సరఫరా అవుతూంటాయి. మన దేశం సౌదీ అరేబియా, ఖతార్ తదితర మధ్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎల్ఎన్జీ గ్యాస్‌లు సూయెజ్తోపాటు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతూంటాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు మోతాదు హర్మూజ్ ద్వారా సాగుతూంటుంది. భారీ నౌకలు, ఆయిల్ కంటెయినర్లు ఉన్న నౌకలు వీటిని భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలకు సరఫరా చేస్తూంటాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం వరకూ దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇరాక్‌లోని బస్రా నుంచి అత్యధికంగా 20 - 23 శాతం వస్తూంటే.. రష్యా నుంచి వచ్చేది 18 - 20 శాతం వరకూ ఉంటుంది. ఇవి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా (ఆరేడు శాతం), నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, కువైట్ల నుంచి మిగిలిన ముడిచమురు కొనుగోలు చేస్తూంటాం. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) విషయానికి వస్తే మన దిగుమతుల్లో సగం ఖతార్ నుంచి అందుతూంటే.. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియా, రష్యా, మొజాంబీక్ల నుంచి మిగిలిన సగం వస్తాయి. 2022 తరువాత అంటే ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు కొంచెం పెరిగాయి. ఇజ్రాయెల్‌పై కోపంతోనో లేక ఆ దేశానికి సర్ది చెప్పగల సామర్థ్యమున్న అమెరికా పట్టించుకోవడం లేదనో ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి! ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా