Khammam
-
ఐక్యరాజ్య సమితి సదస్సులో జిల్లా వాసి
ఖమ్మం మామిళ్లగూడెం: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ‘మహిళల సాధికారత – సామాజిక స్థితిగతులు’ అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, ఖమ్మంకు చెందిన డాక్టర్ ఏలూరి సునీత పాల్గొన్నారు. మహిళా సాధికారతను సమర్థించడం, ఆధునిక సాంకేతికత ఉపయోగాన్ని మెరుగుపర్చడం తదితర అంశాలపై ఆమె కీలక సూచనలు చేశారు. అలాగే, మహిళలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, డిజిటల్ అసమానతలు, ఆన్లైన్ భద్రతా సమస్యల పరిష్కారంపైనా మాట్లాడారు. మహిళల ఆరోగ్యం, మాతృత్వ సంరక్షణ, శిశు సంక్షేమం, లింగ సమానత్వం కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలని, లింగ సమానత్వంపై విద్యార్థి దశలోనే అవగాహన పెంచేలా విద్యావ్యవస్థలో కోర్సులు ప్రవేశపెట్టాలని సూచనలు చేశా రు. కాగా, మహిళా సాధికారతకు అనుకూలమైన విధానాలను ప్రోత్సహించేలా అన్ని దేశాల బా ధ్యులు పరస్పర సహకారం అందించుకోవాలని ఈ సమావేశాల్లో నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.‘మహిళా సాధికారత’పై మాట్లాడిన సునీత -
సింగరేణి కార్మికులకు ఇన్సెంటివ్
● నెలలో 22 మస్టర్లు పనిచేసిన వారికే వర్తింపు ● ఫిబ్రవరి ఇన్సెంటివ్ నేడు చెల్లింపు సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఏడాది నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యం 72 మిలియన్ టన్నులు సాధించడానికి గాను జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతీ గనికి (ఓపెన్‌కాస్ట్, భూగర్భ) డిపార్ట్మెంట్ (సీహెచ్‌పీ)లకు కొంత టార్గెట్ నిర్ణయించింది. లక్ష్యాన్ని సాధించేందుకు గాను ఈ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈ మూడు మాసాల్లో నెలకు కనీసం 22 మస్టర్లు పనిచేయాలని, అలా చేసిన వారికి మాత్రమే ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఇన్సెంటివ్ను గురువారం ఆయా కార్మికులకు చెల్లించనుంది. లక్ష్యాలు ఇలా.. ఆర్జీ–1లోని జీడీకే–11 ఇంక్లెయిన్ గనిలో 58,800 టన్నుల లక్ష్యానికి గాను 75,301 టన్నులు సాధించగా ఆ గనిలో పనిచేసే ఉద్యోగులకు రూ.2,500 స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వనుంది. మణుగూరులోని ఓసీ–2లో 1,68,000 టన్నుల లక్ష్యానికి 2,08,580 టన్నులు సాధించగా ఆయా ఉద్యోగులు రూ. 2,200 చొప్పున, ఇల్లెందులో 1,96,000 టన్నుల లక్ష్యానికి 2,29,617 టన్నులు సాధించారు. ఆ గని ఉద్యోగులు రూ. 2,200 చొప్పున నేడు ఇన్సెంటివ్ అందుకోనున్నారు. అయితే గ్రేడ్ల ఆధారంగా ఈ ఇన్సెంటివ్ చెల్లిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. మిగతా ఏరియాల్లో ఇలా.. ● కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్‌ఓసీ–2లో 9,52,000 టన్నుల లక్ష్యానికి 10,13,430 టన్నులు (106 శాతం)సాధించగా, ఈ ఓసీలో పనిచేసే ఉద్యోగులు రూ.2,200 ఇన్సెంటివ్ అందుకోనున్నారు. ● భూపాలపల్లి ఏరియా కేటీకే 8 ఇంక్లెయిన్‌లో 16,800 టన్నుల లక్ష్యానికి 17,043 టన్నులు సాధించగా వీరికి రూ.1,200 ఇన్సెంటివ్ రానుంది. ● భూపాలపెల్లి కేటీకే ఓసీ–2లో 1,40,000 టన్నుల లక్ష్యానికి 1,52,665 టన్నులు సాధించగా ఇక్కడి ఉద్యోగులకు రూ.1,700 ఇన్సెంటివ్ చెల్లించనుంది. ● మందమర్రి ఏరియాలోని కేకే5 గనిలో 16,800 టన్నుల లక్ష్యానికి 16,802 టన్నులు సాధించగా వీరికి రూ.1,200 ఇన్సెంటివ్ రానుంది. ● మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలో 1,12,000 టన్నుల లక్ష్యానికి 1,31,173 టన్నులు సాధించగా, ఇందులో పనిచేసే కార్మికులకు రూ.1,200 ఇన్సెంటివ్ చెల్లించనుంది. ● శ్రీరాంపూర్‌లోని ఆర్కే–5 గనిలో 21,000 టన్నుల లక్ష్యానికి 21,478 టన్నులు సాధించగా ఇక్కడి ఉద్యోగులకు రూ.1,500 చొప్పున, అదే ఏరియాలోని ఆర్కే–6 ఇంక్లెయిన్‌లో 14,840 టన్నులకు 15,683 టన్నుల ఉత్పత్తి సాధించగా వీరికి రూ.1,700 చొప్పున ఇన్సెంటివ్ చెల్లించనుంది. రామకృష్టాపూర్లోని రాంటెంకి గనిలో 14 వేల టన్నుల లక్ష్యానికి 14,694 టన్నులు సాధించగా అక్కడి ఉద్యోగులు రూ.1,200 చొప్పుఏ ఇన్సెంటివ్ అందుకోనున్నారు. -
ఎండల వేళ.. మామిడి జాగ్రత్త
● బిందు సేద్యంతో తోటలకు నీరు అందిస్తే మేలు ● ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మధుసూదన్ ఖమ్మంవ్యవసాయం: రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యాన మామిడి తోటల రక్షణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా, ఖమ్మం జిల్లాలో 30 వేలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. ప్రస్తుతం మామిడి కాయ దశలో ఉండడం.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పంటను రక్షించుకుంటూ నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు రైతులు తగిన యాజమాన్య పద్ధతలు పాటించాలని ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్ సూచించారు. ఈమేరకు జిలాల్లోని పలు ప్రాంతాల్లో తోటలను పరిశీలించిన రైతులకు ఆయన చేసిన సూచనలు ఇలా ఉన్నాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ● ప్రతీ మొక్కకు 6 – 8 డ్రిప్పర్లతో రోజుకు మూడు గంటలు చొప్పున బిందు సేద్యం ద్వారా నీరు అందించాలి. ● ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున నేలలో తేమ సమతుల్యతను కాపాడేందుకు ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర నీరు పెట్టాలి. ● డ్రిప్పర్లు చెట్టు కాండం నుండి 1.5 మీటర్ల దూరంలో ఉండాలి. డ్రిప్పర్ స్థానాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ● కాయ సైజు వేగంగా పెరిగేందుకు పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన చెట్లకు 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. ● త్రిప్స్(రసం పిల్చే చీడపీడలు) కనిపిస్తే లీటర్ నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ● వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గించడానికి మామిడి తోటకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీరు పట్టడమే ప్రధానం. ● సాధారణంగా మామిడి తోటల వ్యాపారులు తక్కువ నీరు పెడుతుంటారు. లేదా రోజు విడిచి రోజు నీరు ఇస్తారు. తద్వారా పండ్లు రాలిపోయే ప్రమాదమున్నందున జాగ్రత్తలు వహించాలి. -
ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
ఖమ్మంరూరల్: ఏటా రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంసత్యనారాయణపురంలో పాలేరు నియోజకవర్గ ముస్లింలకు బుధవారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ ముజుమ్మిల్ఖాన్, సీపీ సునీల్‌దత్ పాల్గొనగా మంత్రి మాట్లాడారు. రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష ఆచరించే ముస్లింల కు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. కాగా, నియోజకవర్గంలోని ఒక్కో మసీదు అభివృద్ధి, ఇతర పనులకు రూ.లక్ష చొప్పున మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు సైతం లబ్ధి జరుగుతుందని తెలిపారు. కాగా, గత ఏడాది మున్నేటికి వరదలు వచ్చిన సమయాన ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న పలువురిని తన ప్రాణాలు ఫణంగా పెట్టి రక్షించిన సుభానీని మంత్రి అభినందించారు. ఈకార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, చావా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
పచ్చని పంట.. పుదీనా!
తల్లాడ: వాణిజ్య పంటలకు రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్నా సరైన దిగుబడి రాక రైతులు నష్టపోతున్న ఈ తరుణంలో తల్లాడ మండలం మంగాపురంలో ఒక రైతు మొదలుపెట్టిన పుదీనా సాగు మరికొందరు అదే బాట పట్టేలా స్ఫూర్తినిచ్చింది. దీంతో ఆ గ్రామం పుదీనానే కాక ఇతర ఆకు, కూరల సాగులోనూ మేటిగా నిలుస్తోంది. ఐదేళ్ల క్రితం ప్రారంభం.. మంగాపురానికి చెందిన రైతు గాదె నరసింహారావు ఐదేళ్ల క్రితం పుదీనా సాగు మొదలుపెట్టాడు. ఈ పంటతో ఆయన లాభాలు గడిస్తుండగా మరికొందరూ అదే బాట పడుతున్నారు. కాగా, నర్సింహరావు నాలుగున్నర ఎకరాల్లో పుదీనా సాగు చేసి డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీరందిస్తున్నాడు. పుదీనాకు తోడు కాకర, దోసకాయ, టమాటా పంటలను కూడా సాగు చేస్తుండగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఒకసారి డ్రిప్ ద్వారా నీరు వదిలితే పంటతా తడుస్తుండడంతో పర్యవేక్షించాల్సిన భారం కూడా తప్పిందని చెబుతున్నారు. పుదీనాతో పాటు గ్రామ రైతులు పాలకూర, తోటకూర, టమాట, దోసకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి పంటలను కూడా పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటుకట్టే పద్ధతిలో.. పుదీనా సాగులో రైతులు అంటు కట్టే విధానం అవలంబిస్తున్నారు. మొదట అంటుకట్టి నీరు పెడితే రెండు నెలలకు పుదీనా కోతకొస్తోంది. ఆపై మళ్లీ డ్రిప్ ద్వారా నీరు పెట్టుకుంటూ కలుపు తీసి పోషణ చేసుకుంటే 45 రోజుల్లో రెండో కోత వస్తుందని చెబుతున్నారు. ఆపై మళ్లీ నీటి సరఫరాతో ఇంకో 45 రోజులకు.. ఇలా 20 కోతల వరకూ పుదీనా తీసుకోవచ్చని రైతులు చెబుతున్నారు. ప్రతీనెల ఆదాయం.. ఓ రైతు నాలుగున్నర ఎకరాల్లో పుదీనా సాగు చేస్తే ఎకరానికి రూ.లక్ష చొప్పున పెట్టుబడి అవసరమవుతుంది. ఆపై అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50 వేల లాభం వస్తుందని చెబుతున్నారు. చీడపీడలు తక్కువ కావడం.. వైరా మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులు కట్ట రూ.6కు తీసుకుంటుండడం.. తరచుగా ఖమ్మం, కొత్తగూడెంలోనూ అమ్ముతుండడంతో రైతులకు నికర లాభం వస్తోందని చెబుతున్నారు. దీనికి తోడు ఎకరానికి పది మంది కూలీలు పుదీనా కోసి కట్టలు కట్టాల్సి ఉంటుంది. దీంతో ఒక రైతు సాగు చేసే తోటలోనే 30 మంది వరకు కూలీలు అవసరం అవుతుండడంతో స్థానికంగా కూలీలకు నిత్యం రూ.400 చొప్పున అందుతున్నాయి. మంగాపురంలో విస్తృతంగా సాగు రైతులకు నికర ఆదాయం.. కూలీలకూ ఉపాధి డ్రిప్ విధానంలో వేసవిలోనూ ఆశాజనకంగా దిగుబడిఒకసారి అంటుకడితే 20 సార్లు.. ప్రతీనెల పుదీనా సాగుతో ఖర్చులు పోగా రూ.50వేల వరకు మిగులుతున్నాయి. నిత్య పరిశీలనకు తోడు ఓసారి అంటు కట్టి నీరు పెడుతుంటే 20 సార్లయినా పుదీనా తీసుకోవచ్చు. చీడపీడలు తక్కువే కాగా, కలుపు పెరగకుండా చూసుకుంటే చాలు. – గాదె నరసింహారావు, రైతు, మంగాపురం అందరికీ అందుబాటులో... మా గ్రామ రైతులు పుదీనా సాగు చేస్తుండడంతో ఎప్పుడు కావాలన్నా తాజాగా లభిస్తోంది. వివాహాది శుభకార్యాల సమయాన ఇబ్బంది ఉండడం లేదు. మార్కెట్‌కు వెళ్లే పని లేకుండానే ఫోన్లో చెబితే చాలు నేరుగా ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. – పరుచూరి సతీష్, మంగాపురం -
ఖమ్మం, సత్తుపల్లిలో మోడల్ వైకుంఠధామాలు
ఖమ్మంవన్‌టౌన్: మనిషి చివరి మజిలీ అయిన మహాప్రస్థానాలకు వచ్చే మృతుల బంధువులకు ఓదార్పునిచ్చేలా అన్ని సౌకర్యాలతో నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలపై హైదరాబాద్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. ఖమ్మం, సత్తుపల్లిలో మోడల్ వైకుంఠధామాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కేఎంసీ, సత్తుపల్లి కమిషనర్లు అభిషేక్ అగస్త్య, నరసింహను ఆదేశించారు. ఈసందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు మోడల్ వైకుంఠధామాల నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, సూర్యాపేట, నల్లగొండలో ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. ఆపై భూ కేటాయింపు, నిధుల విడుదలపై దృష్టి సారించాలని మంత్రి తెలిపారు.ప్రణాళికలపై మంత్రి తుమ్మల సమీక్ష -
పీజీ కళాశాలలో కొత్త కోర్సులు
● కాలేజ్ ఆఫ్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు ● జాబితాలో నాలుగు కోర్సులు ● అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభంఖమ్మం సహకారనగర్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు సత్తా చాటేలా విద్యారంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు భవిష్యత్ బాగుండేలా కొత్త కోర్సులు నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనేపథ్యాన విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉన్నతాధికారులకు ప్రతిపాదన ఖమ్మంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న కోర్సులకు తోడు ఎంసీఏ, ఎంఏ మ్యాథ్స్, ఎంఏ తెలుగు, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు కాలేజ్ ఆఫ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీడీసీ) డీన్‌కు తాజాగాప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే అవకాశముంది. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ కోర్సులను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కమిటీ పరిశీలించాకే.. ప్రస్తుతం నూతన కోర్సులు ప్రవేశపెట్టడానికి కళాశాల నుంచి సీడీసీ డీన్‌కు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించాక వీసీ, రిజిస్ట్రార్ అనుమతి జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఖమ్మంలో కొత్త కోర్సుల ఆవశ్యకత, వీటిని బోధించేందుకు సరిపడా అధ్యాపకులు ఉన్నారా, ఒకవేళ ప్రవేశపెడితే ప్రవేశాలు ఉంటాయా అన్నది కమిటీ ద్వారా పరిశీలించాక మంజూరు చేసే అవకాశముంది.ప్రతిపాదనలు పంపాం.. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కొత్త కోర్సు ప్రారంభానికి చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపించాం. ఉన్నతాధికారులు పరిశీలించి ఆమోదిస్తే వచ్చే విద్యాసంవత్సరం తరగతులు మొదలయ్యే అవకాశముంది. – రవికుమార్, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ పీజీ కళాశాల, ఖమ్మం -
మరొకరి పార్సిల్ తీసుకెళ్లిన వ్యక్తిపై కేసు
చింతకాని: ఓ వ్యక్తికి వచ్చిన రిజిస్టర్ పార్సిల్‌ను మరో వ్యక్తి తీసుకెళ్లగా పోలీసులు కేసు నమోదు చేశారు. చింతకాని మండలం మత్కేపల్లి గ్రామ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ గడ్డం బాలాజీ అనంతసాగర్ గ్రామానికి జనవరి నుంచి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. గతనెల 12వ తేదీన అనంతసాగర్‌కు చెందిన వడ్లమూడి సత్యనారాయణ పేరిట రిజిస్టర్ పోస్ట్ రాగా వడ్లమూడి నాగేశ్వరరావు తానే సత్యనారాయణ అని చెప్పి తీసుకెళ్లాడు. ఆతర్వాత సత్యనారాయణ భార్య సుభద్ర ఆరాతీయగా అప్పటికే తీసుకెళ్లినట్లు చెప్పడంతో సంతకం, ఫోన్ నంబర్‌ను ఆదారంగా వడ్లమూడి నాగేశ్వరరావుగా గుర్తించారు. ఈమేరకు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు. రీజియన్‌ను అగ్రగామిగా నిలిపారు... ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలో విధులు నిర్వర్తించిన ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) జీ.ఎన్.పవిత్ర, డిప్యూటీ రీజినల్ మేనేజర్(మెకానికల్) ఎస్.భవానీప్రసాద్‌ను రీజియన్‌ను అగ్రగామిగా నిలిపారని రీజినల్ మేనేజర్ ఏ.సరిరాం కొనియాడారు. బదిలీపై వెళ్తున్న పవిత్ర, భవానీప్రసాద్‌ను ఖమ్మం ఆర్ఎం కార్యాలయంలో బుధవారం సన్మానించారు. ఈసందర్భంగా సరిరాం మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు. అనంతరం షాద్‌నగర్, మహబూబ్‌నగర్ రీజియన్లకు పవిత్ర, భవానీప్రసాద్‌ను ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల మేనేజర్లు, వివిధ విభాగాల ఉద్యోగులు సన్మానించారు. జీవిత అనుభవాల్ని తెలిపేదే కథ.. ఖమ్మం సహకారనగర్: కథ అంటే జీవిత అనుభవాల్ని తెలపడమే కాక సందేశాన్ని ఇస్తుందని కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో కళాశాల తెలుగు విభాగం, ఐక్యూఏసీ విభాగాల ఆధ్వర్యాన బుధవారం ‘కథలోకి..’ పేరిట నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. కథలు రాసే విధానంపై తన అనుభవాలను వివరించగా, ప్రముఖ కథా రచయిత నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ తదితరులు మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ పి.రవికుమార్, ఎం.సునంద, డాక్టర్ సీతారాంతో పాటు ప్రసేన్, రవిమారుత్, ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డాక్టర్ బానోత్ రెడ్డి, డాక్టర్ జె.అనురాధ, డాక్టర్ కిరణ్, కోటమ్మ, ఎం.వీ.రమణ, కార్తీక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సేవల్లో సాంకేతికత..
యాప్‌లోని అంశాలు ఇలా.. ●రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ : ఎక్కడైనా ఎలాంటి ఘటన జరిగినా ఇందులో జీపీఎస్ లొకేషన్ ద్వారా ఫొటో తీసి పంపొచ్చు. తద్వారా సంబంధిత అధికారి పరిశీలించి పరిష్కరించేందుకు వీలవుతుంది. ●కన్జ్యూమర్ గ్రీవెన్సె : న్యూ కంప్లైంట్ : వినియోగదారులకు సంబంధించి సమస్యలను నేరుగా ఇందులో పొందుపర్చవచ్చు. మీటర్ నంబర్, సమస్య వివరాలు నమోదు చేస్తే పరిష్కరిస్తారు. ●కంప్లైంట్ స్టేటస్ : ఫిర్యాదు చేసిన సమస్య స్థితిగతులను ఇందులో చూసుకునే సౌలభ్యం ఉంది. ●రీ ఓపెన్ కంప్లైంట్ : ఫిర్యాదు చేసిన సమస్యపై సంతృప్తి చెందకపోతే మళ్లీ అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ●సెల్ఫ్ రీడింగ్ : ఇందులో వినియోగదారులు సెల్ఫ్ రీడింగ్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. తద్వారా సిబ్బంది వచ్చే వరకు వేచి ఉండాల్సిన పని ఉండదు. ●పే బిల్స్ : నెలవారీ విద్యుత్ బిల్లులను వినియోగదారుల సర్వీస్ నంబర్ ఆధారంగా చెల్లించవచ్చు. ఇది సులభమే కాక సమయం ఆదా అవుతుంది. ●బిల్ హిస్టరీ : చెల్లించిన విద్యుత్ బిల్లుల వివరాలు తెలుసుకుని నెల వారీగా హెచ్చుతగ్గులను నిర్ధారించుకోవచ్చు. ●ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ : ఆన్లైన్ ద్వారా చెల్లించిన బిల్లుల తాలూకు సమాచారం ఇందులో ఉంటుంది. ఆన్లైన్ ద్వారా చెల్లించిన బిల్లుల సమాచారం తెలుసుకోవచ్చు. ●కొత్త సర్వీస్ స్థితి : కొత్త సర్వీసుల మంజూరు స్థితిగతులను ఎప్పటికప్పుడు దరఖాస్తు నంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. ●లింక్ ఆధార్–మొబైల్ : వినియోగదారుల ఆధార్, సెల్‌నంబర్లు లింక్ చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల సమాచారం ఫోన్‌కు అందుతుంది. ●డొమెస్టిక్ బిల్ క్యాలుక్యులేటర్ : వినియోగదారుల నెలవారీ విద్యుత్ వినియోగం, మీటర్ రీడింగ్ వివరాలు ఇందులో పొందుపరిస్తే బిల్లు తాలూకా పూర్తి సమాచారం వస్తుంది. ●కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి : కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. ●పేరు, లోడ్ మార్పు : విద్యుత్ మీటర్ పేరు మార్పుపై వివరాలు, లోడ్ సమాచారం తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ●పవర్ కంజమ్షన్ గైడ్‌లైన్స్ : ఏ ఉపకరణాలు ఎంత వాడితే ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుస్తుంది. ●టారిఫ్ డిటైల్స్ : విద్యుత్ వినియోగం, చార్జీల వివరాలు కేటగిరీల వారీగా ఇందులో సవివరంగా ఉంటాయి. గృహవినియోగదారులు, గృహేతర విని యోగదారులు, పరిశ్రమల తదితరాల వివరాలు కేటగిరీల వారీగా చార్జీల వివరాలు పొందుపర్చబడి ఉంటాయి. ●ఎనర్జీ సేవింగ్ టిప్స్ : ఇందులో విద్యుత్ ఉపకరణాలు వాడుతున్నపుడు పొదుపు కోసం ఆచరించాల్సిన సూచనలు ఉంటాయి. ●సేఫ్టీ టిప్స్ : విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడుతుంది. ●ఫీడ్‌బ్యాక్ : విద్యుత్ సేవల పట్ల వినియోగదారుల అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. తద్వారా మెరుగైన సేవలను పొందే అవకాశం ఉంటుంది. ●మై అకౌంట్ : మై అకౌంట్లో వినియోగదారుల పూర్తి వివరాలు ఉంటాయి. మీటర్ తాలూకు వివరాలు, తదితర సమాచారం దీనిలో ఉంటుంది. ●బిల్లు సమాచారం : వినియోగదారుల బిల్లులకు సంబంధించిన సమాచారం దీనిలో ఉంటుంది. వినియోగదారుల సర్వీస్ నంబర్ నమోదుచేసి బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు. ●అధికారి వివరాలు : వినియోగదారుల పరిధిలోని అధికారిని సంప్రదించాలంటే ఇందులో నుంచి తెలుసుకోవచ్చు. ఎటువంటి సందేహాలు ఉన్నా సంబందిత అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. ●కాంటాక్ట్ అజ్ : దీనిలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్లు 18004250028, 1912. 20 అంశాలతో టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ ఘటనలు, ఫిర్యాదులు నమోదు చేసేలా రూపకల్పన ఇటు వినియోగదారులకు లబ్ధి.. ఉద్యోగుల్లో జవాబుదారీ తనం వినియోగదారులతో పాటు విద్యుత్ శాఖకు సౌకర్యవంతంగా ఉండేలా టీజీ ఎన్పీడీసీఎల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇందులో భాగంగా 20 అంశాలతో కూడిన యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. వినియోగదారులు తమ ఫోన్ నుంచే సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం లభిస్తోంది. వివిధ ఫిర్యాదులు, బిల్లులు, నూతన సర్వీసులు, మీటర్ పేరు మార్పిడి తదితర అంశాలను ఈ యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. వినియోగదారులకు ఈ యాప్‌తో మేలు జరగడమే కాక నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులకూ ఉపయోగపడుతోంది. అంతేకాక ఉద్యోగుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు. – ఖమ్మంవ్యవసాయంయాప్ సేవలు ప్రయోజనకరం వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లో టీజీఎన్పీడీసీఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తద్వారా సంస్థ సమాచారం తెలుసుకోవడమే కాక మెరుగైన సేవలు పొందొచ్చు. ఈ యాప్ సేవలు అటు వినియోగదారులకే కాక సంస్థకు సైతం ప్రయోజనకరం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఖమ్మం సర్కిల్ -
పరీక్షలకు సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ● జిల్లాలో 97 కేంద్రాలు, 16,788మంది విద్యార్థులు ● ఈసారి అడిషనల్స్కు బదులు బుక్లెట్ అబ్జర్వర్‌గా విజయలక్ష్మీబాయి పాఠశాల విద్యాశాఖలో డైరెక్టర్ స్థాయి అధికారులు జిల్లాకొకరిని పరిశీలకులుగా నియమించారు. ఈక్రమాన ఉమ్మడి ఖమ్మం జిల్లా అబ్జర్వర్‌గా విజయలక్ష్మీబాయిని కేటాయించారు. ఆమె ఉమ్మడి జిల్లాలో పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తూ యంత్రాంగానికి సూచనలు చేయనున్నారు.ఖమ్మంసహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం మొదలుకానున్నాయి. ఈమేరకు ఈనెల 21నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు జరిగే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లాలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల వివరాలను డీఈఓ సోమశేఖరశర్మ బుధవారం ‘సాక్షి’కి వెల్లడించారు. గంట ముందు నుంచే అనుమతి జిల్లాలో పరీక్షల నిర్వహణకు 97 కేంద్రాలు ఏర్పాటు చేయగా 16,788మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 16,417మంది రెగ్యులర్ విద్యార్థులు, 371మంది ప్రైవేట్(సప్లిమెంటరీ) విద్యార్థులు ఉన్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9–30నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు పరీక్ష కోసం విద్యార్థులను 8–30గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాగా, 9–35గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు. కాగా, కేంద్రాల వద్ద తాగునీరు, ఫర్నీచర్, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఎవరైనా నడిచి వెళ్లాల్సిందే.. పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేసే బృందాలు గతంలో వాహనాలతో సహా పాఠశాలల ఆవరణలోకి వెళ్లేవారు. కానీ ఈసారి వాహనాలను ఆరుబయటే ఆపి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల రాకపోకలతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది ఇలా... జిల్లాలోని పరీక్షా కేంద్రాలను ఏడు రూట్లుగా విభజించగా.. 97మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. మొత్తంగా 1,185మంది ఇన్విజిలేటర్లను నియమించారు. కాగా, 20 పరీక్షా కేంద్రాలను ‘సీ’ సెంటర్లుగా గుర్తించినట్లు డీఈఓ తెలిపారు. అడిషనల్స్ ఉండవు.. గతంలో జవాబుపత్రంగా ఒక జంట పేపర్ ఇచ్చేవారు. ఆపై విద్యార్థులకు కావాలంటే అదనపు జవాబుపత్రాలు(అడిషనల్స్) ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగేది. కానీ ఈసారి నుంచి 24పేపర్లతో కూడిన బుక్లెట్ ఇవ్వనున్నారు. విద్యార్థులు దీనినే సద్వినియోగం చేసుకుని నిర్ణీత ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. కంట్రోల్ రూమ్ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. ఫీజులు చెల్లించలేదని, ఇతర కారణాలతో ఎక్కడైనా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దీంతో పాటు ఇతర సమస్యలు ఉంటే డీఈఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 83318 51510కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.ప్రియమైన తల్లిదండ్రులారా... పదో తరగతి పరీక్షలు సమీపించిన నేపథ్యాన జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ లేఖ రాశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకునే వాతావరణం కల్పించడం, ఆందోళనకు గురికాకుండా పరీక్షలకు సిద్ధం చేయడం, ఫలితాలపై ఒత్తిడికి గురిచేయకపోవడం, పౌష్టికాహారం అందించాల్సిన ఆవశ్యకతపై ఇందులో సూచనలు చేశారు. ఈమేరకు లేఖ(సాఫ్ట్ కాపీ)ను పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు చేరవేయగా.. వారు ఎస్సెస్సీ విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసిన వాట్సప్ గ్రూప్‌ల్లో పంపిస్తున్నారు. కేంద్రాల వద్ద 163 సెక్షన్ ఖమ్మంక్రైం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ సునీల్‌దత్ తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు గుంపుగా ఉండొద్దని, సభలు, సమావేశాలు, మైక్‌లు, డీజేలతో ప్రదర్శనలకు అనుమతి ఉండదన్నారు. పరీక్ష సమయాన కేంద్రాలకు సమీపంలో ఇంటర్నెట్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. -
వరద పారేలా...
ప్రాజెక్టుల్లో సాగునీటి ప్రాజెక్టుల పనులు వడివడిగా సాగేలా రాష్ట్ర బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే సీతారామ ప్రాజెక్టుకు రూ.699.35 కోట్లు కేటాయించగా.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా కేటాయింపులు చేశారు. అలాగే, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం, ఎకో టూరిజం, ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా.. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
ప్రశాంతంగా పరీక్షలు రాయండి..
కొణిజర్ల: పదో తరగతి బాలబాలికలు ఆందోళన, భయం విడనాడి ప్రశాంత వాతావరణంలో వార్షిక పరీక్షలు రాయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మండలంలోని తనికెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బుధవారం వచ్చిన ఆయన పదో తరగతి విద్యార్థులకు సూచనలు చేశారు. పౌష్టికాహా రం తీసుకుంటూ శ్రద్ధగా చదవాలని, తద్వారా పరీక్షల్లో మంచి మార్కులు సాధించొచ్చని తెలిపారు. అనంతరం అదే పాఠశాలలో ‘వుయ్ కెన్ లెర్న్’ పేరి ట నిర్వహిస్తున్న ఆంగ్లభాషా శిక్షణను కలెక్టర్ పరి శీలించారు. బాలబాలికలకు గ్రూపులుగా ఏర్పరిచి ఆంగ్లంలో మాట్లాడించారు. నాలుగు నెలల్లో మంచి మార్పు కనిపిస్తున్నందున విద్యార్థులంతా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. తొలుత తనికెళ్ల సెంటర్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎంపీడీఓ ఏ.రోజారాణితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. తహసీల్దార్ రాము, ఇన్చార్జ్ హెచ్ఎం డి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రిటైనింగ్ వాల్ పనుల్లో వేగం ఖమ్మంఅర్బన్: మున్నేటి వరదకు అడ్డుకట్ట వేసేలా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్‌కు భూసేకరణతో పాటు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పోలేపల్లి వద్ద రిటైనింగ్ వాల్ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు చేపట్టాలని, ఈ గోడ నిర్మాణానికి కావాల్సిన భూముల సేకరణకు నిర్వాసితులతో చర్చించాలని తెలిపారు. నిర్వాసితులకు అభివృద్ధి చేసిన భూములను ప్రత్యామ్నాయంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జలవనరులశాఖ ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, డీఈ రమేష్‌రెడ్డి, మన్మధరావు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఆర్ఐ క్రాంతి పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థి ఆంగ్లంపై పట్టు సాధించాలి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12గంటలకు కల్లూరు మండలం పెద్దకోరుకోండిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, 12–30గంటలకు ఎర్రబోయినపల్లిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు తిరుమలాయపాలెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక పీఏసీఎస్ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే, 5గంటలకు తెట్టెలపాడు, మేడిదపల్లి, ఇస్లావత్ తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. కలెక్టరేట్లో హౌస్ కీపింగ్‌కు టెండర్ల ఆహ్వానం ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్లో పారిశుద్ధ్యం, హౌస్ క్లీపింగ్ నిర్వహణను సాయినాధ్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించగా కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తుండడంపై ఈనెల 11న ‘సాక్షి’లో ‘కార్మికుల కష్టం కాజేస్తున్నారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్... గత 28వ తేదీతోనే ఏజెన్సీ కాల పరిమితి ముగిసిన నేపథ్యాన పొడిగించకుండా మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కలెక్టరేట్ పరిసరాలు, అన్ని కార్యాలయ గదులను పరిశుభ్రం చేయడం, టాయిలెట్లు, కారిడార్, గార్డెన్ నిర్వహణ కోసం ఆసక్తి ఉన్న హౌస్ కీపింగ్ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. రూ.10వేల నగదు చెల్లించి టెండర్ ఫారాలు తీసుకుని, ఈనెల 27న సాయంత్రం 5గంటల్లోగా టెండర్లు దాఖలు చేయాలని సూచించారు. టెండర్‌తో పాటు కలెక్టర్ పేరిట రూ.3,00,300 చొప్పున డీడీ లేదా చెక్కు రూపంలో అందించాల్సి ఉంటుందని, వివరాలకు 98499 06076 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. పోస్టు ద్వారా సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఖమ్మంగాంధీచౌక్: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వచ్చేనెల 6న శ్రీరామనవమి సందర్బంగా సీతారాముల కల్యాణం జరగనుంది. ఈమేరకు నేరుగా హాజరుకాలేని భక్తుల ఇంటికే కల్యాణ తలంబ్రాలు అందించాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. అంతరాలయ అర్చన, కల్యాణ తలంబ్రాల కోసం రూ.450, ముత్యాల తలంబ్రాల కోసం రూ.150ను సమీప పోస్టాఫీస్‌లో లేదా పోస్టుమ్యాన్‌కు చెల్లిస్తే కల్యాణం ముగిశాక ఇంటి వద్దకే తలంబ్రాలు చేరవేస్తామని ఖమ్మం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. ఈమేరకు భక్తులు ఏప్రిల్ 1వ తేదీ వరకు రుసుము చెల్లించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేదు.. కామేపల్లి: రైతులు సాగు చేస్తున్న యాసంగి పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. కామేపల్లి మండలం కామేపల్లి, కొండాయిగూడెం సొసైటీ కార్యాయాల్లో ఎరువులు, రికార్డులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో అన్ని పీఏసీ ఎస్‌ల్లో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు అధికారుల సిఫారసు మేరకే వినియోగించాలని సూచించారు. కాగా, డీలర్లు స్టాక్ వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని, నానో యూరియా, నానో డీఏపీ వాడకంతో ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఏఓ తారాదేవి, ఏఈఓలు ఉష, జగదీశ్వర్, శ్రీకన్య పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు 18,165మంది విద్యార్థులకు గాను 17,515మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. కాగా జిల్లాలోని 40పరీక్ష కేంద్రాలను హెచ్పీసీ, డీఈసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయని వెల్లడించారు. -
విద్యుత్ చార్జీల పెంపు లేదు..
● యథాతధంగానే ప్రస్తుత ధరలు ● బహిరంగ విచారణలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టత వచ్చింది. హనుమకొండలో బుధవారం 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేసిన రిటైల్ సప్లయి వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ధరలు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిగింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ విచారణలో విద్యుత్ టారిఫ్‌ల ప్రతిపాదనలను టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదలపై ఎలాంటి ప్రతిపాదనలూ చేయలేదని, ప్రస్తుత ధరల్లో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే ఎల్టీ, హెచ్‌టీ వినియోగదారులకు సాధారణ టారిఫ్ కంటే యూనిట్‌కు రూ.0.66 గ్రీన్ టారిఫ్ విధింపు కొనసాగుతుందని తెలిపారు. ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ కొనుగోలు చేసి ఎన్పీడీసీఎల్ విద్యుత్ లైన్లు వినియోగించుకున్న వినియోగదారులకు ఎనర్జీ చార్జీల్లో 10 శాతం చొప్పున స్టాండ్ బై చార్జీల విధింపు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. టీజీ ఎన్పీడీసీఎల్ నిర్వహణకు 2025–2026 ఆర్థిక సంవత్సరంలో రూ.19,814 కోట్ల ఆదాయ ఆవశ్యకత ఉందని తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత టారిఫ్(టారిఫేతర ఆదాయం కలుపుకుని) రూ.9,421కోట్ల వస్తుందని అంచనా వేయగా, రూ.10,393 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని వివరించారు. -
పదెకరాల్లో ఆయిల్‌పామ్ తోట దగ్ధం
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం బావోజీ తండాలో పది ఎకరాల్లోని ఆయిల్‌పామ్‌తోటలో చెట్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా కాలిపోయాయి. బాధిత రైతు బానోత్ శివలాల్ తెలిపిన వివరాలు... బుధవారం మద్యాహ్నం తోటలో మంటలు చెలరేగాయనే సమాచారంతో వెళ్లగా కాపుదశకు వచ్చిన ఆయిల్‌పామ్ పామాయిల్ చెట్లు కాలిపోయాయని వాపోయారు. తోట మీదుగా వెళ్తున్న విద్యుత్ వైర్లను తొలగించాలని, అందుకు అయ్యే వ్యయం కూడా భరిస్తానని చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. వడగాలుతో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకగా షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పారు. కాగా, శివలాల్ తోటలో మొదలైన మంటలు పక్క తోటకు సైతం వ్యాపించగా సుమారు పదెకరాల్లో తోట కాలిపోయింది. ఇప్పటికే గెలలు వేయగా త్వరలోనే అమ్మేందుకు సిద్ధమవుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. షార్ట్ సర్క్యూటే కారణమని రైతులు ఆవేదన -
లారీడ్రైవర్ ప్రాణాలు కాపాడిన పోలీసులు
పెనుబల్లి: ఓ లారీడ్రైవర్ గుండెపోటుకు గురికాగా సకాలంలో స్పందించిన వీఎం బంజర్ పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి నుండి మొక్కజొన్న లోడ్ హైదరాబాద్ తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ మొగుళ్ల కృపారావుకు బుధవారం తెల్లవారుజామున వీఎం బంజర్ సమీపాన ఛాతినొప్పి వచ్చింది. దీంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఇపి రామకృష్ణ అనే వ్యక్తికి తన పరిస్థితి చెప్పడంతో ఆయన వీఎం బంజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య, కానిస్టేబుల్ వీర రాఘవులు, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ పుల్లారావు చేరుకుని కృపారావును పోలీసు వాహనంలో పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. దీంతో రామకృష్ణ, పోలీసుసిబ్బందిని స్థానికులు అభినందించారు. -
జిల్లాకు అన్యాయం..
ఆర్థికమంత్రి సహా ముగ్గురు మంత్రులు ఉన్నా కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. సీతారామ ప్రాజెక్టుకు రూ.699 కోట్లు కేటాయించడమే దీనికి నిదర్శనం. ఈ నిధులు పెంచి, జనరల్ యూనివర్సిటీ మంజూరు చేయాలి. – నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, సీపీఎం గ్యారంటీల ప్రస్తావన ఏదీ? ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు చేయలేక ఈ ప్రభుత్వం పారిపోతున్నట్లుగా బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. ఆరు గ్యారంటీలు సహా ఇతర పథకాలకు సరైన కేటాయింపులే లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ బాగుంటుందనుకుంటే నిరాశే ఎదురైంది. – కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అన్ని వర్గాలకు అసంతృప్తే... బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను అసంతృప్తికి గురిచేసింది. ఆరు గ్యారంటీలకు గ్యారంటీ లేకపోగా, వ్యవసాయ, సంక్షేమ రంగాల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. వైద్య రంగానికి సైతం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక మహిళలకు ఇచ్చిన హామీల ఊసే లేదు. – బానోతు చంద్రావతి, వైరా మాజీ ఎమ్మెల్యే● -
బడ్జెట్ బాగుంది.. లేదు నిరాశ పరిచింది...
శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లాలోని వివిధ పార్టీల నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. కాంగ్రెస్ నాయకులు బడ్జెట్లో కేటాయింపులపై హర్షం చేశారు. ఇదే సమయాన బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, మాస్ లైన్ నాయకులు మాత్రం విద్య, వైద్య, సాగునీటి రంగాలకు సరైన కేటాయింపులు లేవని పెదవి విరిచారు. ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీ కేటాయించకపోవడాన్ని తప్పుపట్టారు. కాగా, వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొనగా, పెన్షనర్లు, ఉద్యోగులను నిరాశపరిచేలా బడ్జెట్ ఉందని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరిశ పుల్లయ్య, రాయల రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. – సాక్షి నెట్వర్క్వివిధ పార్టీల నాయకుల భిన్నాభిప్రాయాలు అందరినీ మోసం చేశారు.. ఏ వర్గానికి ఈ బడ్జెట్ మేలు చేయదు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలకు మంగళం పాడారు. ఆటోడ్రైవర్ మొదలు అన్నదాతల వరకు సరైన కేటాయింపులు చేయకుండా అందరినీ రాష్ట్రప్రభుత్వం మోసం చేసింది. – తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు -
ఇంటర్ విద్యార్థులు.. ఇంటి బాట !
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. దీంతో పరీక్ష కేంద్రాల నుంచి బయటకు రాగానే విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. స్నేహితుల నుంచి వీడ్కోలు తీసుకుంటూ త్వరలోనే మళ్లీ కలుద్దామని ఇంటి బాట పట్టారు. పరీక్ష ముగిసి విద్యార్థులు హాస్టళ్లకు వచ్చేలోగా తల్లిదండ్రులు సిద్ధంగా ఉండడంతో లగేజీతో ఇళ్లకు బయలుదేరారు. చాలామంది ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడంతో జిల్లా కేంద్రంలోని కొత్త, పాత బస్టాండ్లు కిటకిటలాడాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ఐటీఐలో రేపు ప్లేస్మెంట్ డ్రైవ్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యాన రిజిస్టర్డ్ అయిన ఏజన్సీల బాధ్యలు పాల్గొని ప్లేస్మెంట్లు కల్పిస్తారని పేర్కొన్నారు. ఈమేరకు 18నుంచి 40 ఏళ్లలోపు అభ్యర్థులు ఉదయం పది గంటలకు మొదలయ్యే డ్రైవ్‌కు హాజరుకావాలని సూచించారు. ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ఆర్ఎం తనిఖీ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని ఆర్టీసీ కొత్త, పాత బస్టాండ్లలో హోటళ్లు, షాపులను రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ బుధవారం తనిఖీ చేశారు. కొత్త బస్టాండ్‌లోని హోటల్లో ఆహార పదార్థాలు, కిచెన్‌ను పరిశీలించి తాగునీటి బాటిళ్ల ధరపై ఆరా తీశారు. హోటళ్ల నిర్వాహకులు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. అపరిశుభ్రంగా ఉన్నా, తాగునీటి బాటిళ్లు అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, బస్టాండ్లలోని వాటర్ కూలర్లను శుభ్రం చేయించాలని డీఎం దినేష్‌కుమార్‌ను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌కు స్థల పరిశీలన బోనకల్: బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌కు కేటాయించాలని స్థలాన్ని ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించారు. తెలంగాణ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఎండీ గణపతిరెడ్డి, ఇంజనీర్లు షఫీమియా, విన్సెంట్‌రావు స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. లక్ష్మీపురం రెవెన్యూ పరిధి సర్వేనంబర్ 401లో గుర్తించిన 30ఎకరాల స్థలం స్కూల్ నిర్మాణానికి అనువుగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు మొదలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పున్నం చందర్, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏజెంట్ల వద్ద సైతం తలంబ్రాల బుకింగ్ ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఖమ్మం డిపో పరిధిలోని ఆర్టీసీ కార్గో ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్‌లో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. స్వామి వారి తలంబ్రాలను ఇంటి వద్దే అందించనుండగా, ఖమ్మం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(91542 98583), ఖమ్మం పాతబస్టాండ్ ఏజెంట్(97043 45599), కొణిజర్ల ఏజెంట్(85220 12587), నేలకొండపల్లి ఏజెంట్ 83310 06959, బోనకల్ ఏజెంట్(83091 25037)ను సంప్రదించాలని సూచించారు. మత్స్యకారులకు ముగిసిన శిక్షణ కూసుమంచి: మండలంలోని పాలేరులో పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ బుధవారం ముగిసింది. చివరి రోజు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నల్లగొండలో పనామి రొయ్యల పెంపకాన్ని పరిశీలించారు. ఆతర్వాత హైదరాబాద్‌లోని మత్స్య అభివృద్ధి మండలిని సందర్శించి అక్కడ మత్స్యరైతులకు కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను తెలుసుకున్నారు. పాలేరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారంజకంగా ఉంది..
ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉంది. ప్రజలందరి ఆశలకు అనుగుణంగా భావిభారత పౌరుల అభివృద్ధే ధ్యేయంగా కేటాయింపులు చేశారు. హామీల అమలుకు అధికంగా కేటాయించారు. – పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రాజెక్టులు పూర్తికావు... రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలు ప్రతిబింబించేలా లేదు. రూ.56 వేల కోట్లతో హామీలు అమలుకాకపోగా, రూ.23వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావు. అయితే, వ్యవసాయ శాఖకు మాత్రం బడ్జెట్ పెంచడం ఒక్కటే శుభపరిణామం. – బాగం హేమంతరావు, జాతీయ సమితి సభ్యులు, సీపీఐ హామీలకు అనుగుణంగా లేదు.. పాత బడ్జెట్ తరహాలోనే కొత్త మాటలతో ఉంది. ఆరు గ్యారంటీల్లో రెండు, మూడు తప్ప మిగతా వాటిని ప్రస్తావనే లేదు. ఉద్యోగాల భర్తీ అంశం లేకపోగా, విద్యా, వైద్యరంగాలకు సైతం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. – పోటు రంగారావు, మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి ● -
వాస్తవాలతోనే సమాజ అభ్యున్నతి
● కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ● ‘యువ పార్లమెంట్’కు మూడు జిల్లాల నుంచి 102 మంది హాజరు ఖమ్మంరాపర్తినగర్: వాస్తవానికే ఎప్పుడూ విలువ ఉంటుందని.. అలా అందరు భావిస్తేనే సమాజ అభ్యున్నతి సాధ్యమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈవిషయాన్ని యువతీ, యువకులు పాటించడమే మరికొందరికి అవగాహన కల్పించాలని సూచించారు. ఖమ్మంలోని కేఎండీసీలో బుధవారం వికసిత్ భారత్‌లో భాగంగా ఏర్పాటుచేసిన యువ పార్లమెంట్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. యువత తమ తెలివితేటలను సక్రమమైన మార్గంలో వినియోగించడంలో కొంత మేర వెనకబడుతున్నారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్ర తీసుకొచ్చేందుకు పాటుపడిన మహనీయులు, గొప్పస్థానాల్లో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోవడమే కాక ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉంటూ సరైన నాయకులను ఎన్నుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ మాట్లాడగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎన్.శ్రీనివాసరావు, నెహ్రూ యువక కేంద్ర అధికారి కె.భానుచందర్, వికసిత్ భారత్ నోడల్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వీ.రమణారావు, పోటీల జ్యూరీ అధికారులు ప్రొఫెసర్ సీతారాం, దినేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ ఓకే... దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడ్డారు. యువ పార్లమెంట్లో భాగంగా నిర్వహించిన పోటీలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుండి 102మంది యువతీ, యువకులు హాజరయ్యారు. ప్రతీఒక్కరికి మూడేసి నిమిషాల సమయం కేటాయించగా, ఎక్కువ మంది ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ సరైనదేనని తెలిపారు. ఇంకొందరు ఈ విధానంతో సమస్యలు వస్తాయని తెలిపారు. -
హెచ్‌డబ్ల్యూఓగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
చింతకాని: మండలంలోని పాతర్లపాడుకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నెల్లూరి రమేష్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. ఆయన కొన్నేళ్లు ఆర్మీలో విధులు నిర్వర్తించాక 2016లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. అనంతరం 2018లో గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఎంపికై నా 2020లో రాజీనామా చేశాడు. ఆతర్వాత బీఈడీ చదివిన రమేష్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపిక కాగా, పలువురు అభినందించారు. నవ్య.. మరో ఉద్యోగం తల్లాడ: మండలంలోని మంగాపురానికి చెందిన గాదె నవ్య మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో రెండో ఉద్యోగం సాదించింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో సూపరింటెండెంట్ ఉద్యోగానికి అర్హత సాధించిన ఆమె, బుధవారం వెలువడిన గ్రేడ్–1 సూపర్వైజర్ ఫలితాల్లోనూ రాష్ట్రస్థాయి 89, జోన్లో 9వ ర్యాంక్ సాధించడం విశేషం. నవ్య భర్త పరచూరి రమేష్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థినితో అసభ్య ప్రవర్తన టేకులపల్లి: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన డిప్యూటీ వార్డెన్‌ను తల్లిదండ్రులు, గ్రామస్తులు బుధవారం చితకబాదారు. టేకులపల్లి మండలంలోని గంగారం ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్(హిందీ టీచర్) మాలోత్ ప్రతాప్‌సింగ్ మంగళవారం మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో తొమ్మిదో తరగతి బాలికపై చేతులు వేసి అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బందికి గురి చేశాడు. దీంతో ఆమె డిప్యూటీ వార్డెన్‌ను నెట్టేయగా, అదే సమయంలో వంట చెరకు డబ్బుల కోసం వచ్చిన గ్రామస్తులకు విషయం తెలిపింది. దీంతో వారు ప్రశ్నించగా తప్పయిందని చెప్పి ప్రతాప్ వెళ్లిపోయాడు. గ్రామస్తులు విషయం తెలపడంతో బాలిక తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, బంధువులు రాత్రి పాఠశాలకు రాగా, డిప్యూటీ వార్డెన్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో బుధవారం మళ్లీ వారంతా పాఠశాలకు వచ్చి డిప్యూటీ వార్డెన్, హెచ్ఎంలను నిలదీశారు. డిప్యూటీ వార్డెన్ పశ్చాత్తాపం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చితకబాదడంతో పారిపోయాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్, డిప్యూటీ తహసిల్దార్ ముత్తయ్య, ఏటీడీవో రాధ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, డిప్యూటీ వార్డెన్‌పై హెచ్ఎం జగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పాఠశాల నుంచి తిరిగి వెళ్తున్న బోడు పోలీసులకు డిప్యూటీ వార్డెన్ తారస పడటంతో అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. డిప్యూటీ వార్డెన్‌ను చితకబాదిన గ్రామస్తులు -
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉద్యోగి మృతి
కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని లింగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనివాసరావు(48) సిరిసిల్లలో చేనేత శాఖలో డీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలోని బంధువులను కలిసేందుకు మంగళవారం వచ్చిన ఆయన బుధవారం ఉదయం కొత్త చెరువు వద్ద బహిర్భూమికి వెళ్లిన క్రమంలో కాలుజారి పడగా మృతి చెందాడు. ఆయనకు భార్య సరిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఎన్నెస్పీ కాల్వలో పడి ఒకరు... తల్లాడ: ప్రమాదవశాత్తు ఎన్నెస్పీ కాల్వలో పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కల్లూరు మండలం బాలాజీనగర్‌కు చెందిన కాళ్ల నాగేశ్వరరావు(55) కాల్వలో పడగా, మృతదేహం తల్లాడ మండలం రంగంబంజర సమీపాన తేలింది. దీంతో స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పరిశీలించిన పోలీసులు మృతదేహం నాగేశ్వర్రావుదిగా గుర్తించారు. కూలీ పనులతో జీవనం సాగించే ఆయన రెండు రోజుల క్రితం పనికి వెళ్లొచ్చాక మద్యం కోసం బయటకు వెళ్లి రాకపోవడంతో కుటుంబీకులు గాలిస్తున్నారు. ఇంతలోనే మృతదేహమై కనిపించగా ఆయన కుమారుడు శివసుబ్రమణ్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ కొండల్రావు తెలిపారు. »êÑÌZ ç³yìl¯]l {sêMýStÆŠ‡.. {OyðlÐ]lÆŠæḥÐ]l$–† బోనకల్: ప్రమాదవశాత్తు బావిలో ట్రాక్టర్ పడగా డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దబీరవల్లి రెవెన్యూ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వైరా మండలం పాలడుగుకు కంచపోగు మంగరాజు(28) పొలంలో పత్తి కట్టె తొలగిస్తుండగా ట్రాక్టర్‌ను ముందుకు, వెనకకు నడిపించే క్రమాన ఇంజిన్‌తో సహా బావిలో పడ్డాడు. దీంతో మంగరాజు నీట మునిగి మృతి చెందగా స్థానికులు మృతదేహాన్ని బయటకు తీయగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో గుర్తుతెలియని యాచకుడు మృతి ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌ల వద్ద గుర్తు తెలియని వ్యక్తి యాచకుడు(70) బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఖమ్మం టూటౌన్ పోలీసులు, అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కలిసి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. మోసం చేశాడని యువకుడిపై ఫిర్యాదు ఖమ్మంఅర్బన్: ప్రేమ పేరిట నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువకుడిపై యువతి ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం శ్రీనగర్‌కాలనీలో నివాసముండే ఆమె ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఇతర ప్రాంతానికి చెందిన వారిద్దరు కొద్దినెలలుగా శ్రీనగర్‌లో నివాసముంటున్నారని తెలిపారు. -
ప్రతిభ కనబర్చిన వారికి రూ.3లక్షల బహుమతులు
ఖమ్మంగాంధీచౌక్: ఎస్సెస్సీ వార్షిక పరీక్షల ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.3లక్షల విలువైన బహుమతులు అందించనున్నట్లు మిత్రా ఫౌండేషన్, మిత్ర గ్రూప్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు వివరాలతో కూడిన బ్రోచర్లను కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి మంగళవారం విడుదల చేశాక, సంస్థ కార్యాలయంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. మొదటి బహుమతిగా రూ.25 వేల నగదు, ల్యాప్‌ట్యాప్, రెండు, మూడో స్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేల చొప్పున నగదు, ఐదుగురు ప్రతిభావంతులకు రూ.10 వేల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన వారిని విమానంలో ఢిల్లీ తీసుకెళ్లనుండగా తుమ్మల యుగంధర్ ప్రోత్సాహంతో కార్పొరేట్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రంగా శ్రీనివాస్, చెరుకూరి యుగంధర్, పాలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, నాగసాయి నగేష్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ లేకుండానే సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం ● మంగాపురం వాసి నవ్యకు రాష్ట్రస్థాయి పదో ర్యాంకు తల్లాడ: మండలంలోని మంగాపురం గ్రామానికి చెందిన గాదె నవ్య సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగానికి నిర్వహించిన పరీక్షలో 215 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి పదో ర్యాంకుతో ఉద్యోగానికి ఎంపికై ంది. ఈ ఫలితాలు సోమవారం రాత్రి వెలువడ్డాయి. నవ్య భర్త పరుచూరి రమేష్ పోలీస్ కానిస్టేబుల్ కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ పక్క ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎలాంటి శిక్షణ లేకుండా మూడేళ్లు పట్టుదలతో సిద్ధమైన ఆమె ఉద్యోగానికి ఎంపికవడం విశేషం. కాగా, నవ్య 1–10 వ తరగతి వరకు తల్లాడ సాయి చైతన్య పాఠశాలలో, ఇంటర్ కేఎస్ఎం కళాశాలలో, డిగ్రీ ఖమ్మం నవీన కళాశాల, బీఈడీ మధిర పూర్తి చేసింది. ఖమ్మం వాసికి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి ఖమ్మంక్రైం: ఖమ్మం పంపింగ్ వెల్‌రోడ్ ప్రాంత వాసి, సామాన్య కుటుంబంలో జన్మించి పోలీస్ శాఖలో ఎస్ఐగా ప్రస్తానం ప్రారంభించిన గోపతి నరేందర్‌కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సైదులు – కళావతి కుమారుడైన నరేందర్‌ను ఆయన తండ్రి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివించారు. 1996 బ్యాచ్‌లో ఎస్సైగా ఎంపికైన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎస్సై, సీఐగా, జైపూర్, కరీంనగర్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి గ్యాలరీ అవార్డు అందుకున్న నరేందర్ ప్రస్తుతం కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తుండగా అడిషనల్ ఎస్పీగా పదోన్నతి ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయనను పలువురు అభినందించారు.చిన్నకోరుకొండి రేషన్ డీలర్ సస్పెన్షన్ ● 180 బస్తాల బియ్యం మాయమైన ఘటనలో చర్యలు కల్లూరురూరల్: మండలంలోని చిన్నకోరుకొండికి చెందిన రేషన్ డీలర్ గూడిద భిక్షాలును సస్పెండ్ చేసినట్లు తహసీల్దార్ పులి సాంబశివుడు తెలిపారు. షాపులో నిల్వ చేసిన 180 బస్తాల బియ్యం చోరీ గురికాగా డీలర్ సోమవారం తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు తహసీల్దార్, ఎస్సై హరిత మంగళవారం విచారణ చేపట్టగా, షాపులో దిగుమతి అయిన 117 క్వింటాళ్ల బియ్యంలో 180 బస్తాల బియ్యం చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు బియ్యాన్ని వాహనంలో తీసుకెళ్లినట్లు గుర్తించిన వారు, సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించాలని నిర్ణయించారు. అయితే, ఘటనలో డీలర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త ఉందని భావిస్తూ భిక్షాలును సస్పెండ్ చేయడమే కాక విచారణ కొనసాగిస్తామని తెలిపారు. -
హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
సత్తుపల్లి/కల్లూరు: ఇంట్లో కష్టాలకు కారణమని నమ్మి ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు మంగళవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావు, అదే గ్రామానికి చెందిన బంధువు పాడిబండ్ల శివ నడుమ పాతకక్షలు ఉన్నాయి. శివ ఇంట్లో ఎదురవుతున్న సమస్యలు, ఆయన పశువులు చనిపోతున్నాయని నూతలపాటి నారాయణరావు, తల్లాడ మండలం మల్లారానికి చెందిన పాస్తం రంగారావును సంప్రదించగా సమస్యలన్నింటికీ శ్రీనివాసరావు చేస్తున్న పూజలే కారణమని చెప్పారు. దీంతో శ్రీనివాసరావును శివ 2023 ఫిబ్రవరి 19 చెన్నూరు–రంగాపురం రోడ్డుపై కత్తితో నరికి హత్య చేయడంతో శ్రీనివాసరావు భార్య కృష్ణమ్మ కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శివతో పాటు ఆయన తల్లిదండ్రులు రమాదేవి, అర్జున్‌రావు, నారాయణరావు, రంగారావు పై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈమేరకు విచారణ అనంతరం ఏ–1 పాటిబండ్ల శివ, ఏ–5 పస్తం రంగారావుపై నేరం రుజువు కాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అబ్దుల్‌పాషా వాదించగా.. అప్పటి, ప్రస్తుత సీఐలు హనూక్, ముత్తులింగయ్య ఎస్సైలు రఘు, హరిత, కానిస్టేబుళ్లు మల్లికార్జున్, సుందరం సహకరించారు. నిందితులకు శిక్ష పడేలా విచారణ చేపట్టి చార్జీషీట్ దాఖలు చేసిన ఏపీపీ అబ్దుల్‌పాషా, పోలీసులను ఖమ్మం సీపీ సునీల్‌దత్ మంగళవారం సత్తుపల్లిలో అభినందించారు.కష్టాలకు కారణమని నమ్మి హతం చేసిన వైనం -
పన్నులు వసూలయ్యేదెలా?
● చివరి దశకు చేరిన ఆర్థిక సంవత్సరం ● కేఎంసీలో రూ.33.02 కోట్లకు రూ.24.91 కోట్లే వసూలు ● భారం మోపుతున్నారని బిల్ కలెక్టర్ల నిరసన ఖమ్మంమయూరిసెంటర్: ఓ వైపు ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరింది. అయినా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్నుల బకాయిలు భారీగానే ఉన్నాయి. పన్నులు వంద శాతం వసూలు చేసేలా అధికారులు రోజువారీగా లక్ష్యాలను నిర్దేశించి రెవెన్యూ అధికారులు, బిల్కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లకు సూచనలు చేస్తుండగా లక్ష్యాల పేరుతో తమను వేధిస్తున్నారని బిల్ కలెక్టర్లు నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఏటా లక్ష్యాలను నిర్దేశించగా సాధారణ ప్రకియేనని అధికారులు చెబుతుండగా, ఈసారి అలా చేయలేమని బిల్లు కలెక్టర్లు చెప్పడం గమనార్హం. దీంతో రానున్న 13రోజుల్లో రూ.8.10 కోట్ల మేర ఎలా వసూలు చేస్తారన్నది ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది. రూ.24.91 కోట్ల వసూలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో మరో 13 రోజులు మాత్రమే ఉంది. కేఎంసీ పరిధిలో 80,348 అసెస్మెంట్లకు గాను రూ.33.02 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో రూ.24.91 కోట్లు వసూలవగా, ఇంకా రూ.8.10 కోట్ల మేరబకాయి ఉంది. మిగిలిన సమయంలో ఈ పన్నులన్నీ రాబట్టాలంటే రోజుకు రూ.62లక్షలకు పైగా వసూలు చేయాలి. దీంతో అధికారులు సైతం క్షేత్ర స్థాయికి వెళ్లి బకాయిదారులను కలుస్తున్నారు. మాపై వేధింపులు అధికారులు లక్ష్యాలను విధించి పన్నులు వసూలు చేయకపోతే వేతనం కోత వేధిస్తామని, నోటీసులు ఇస్తామంటే బెదిరిస్తున్నారని మంగళవారం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆందోళనకు దిగారు. అధికారులు కావాలనే ఇలా చేస్తూ తమను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ కేఎంసీ కార్యాలయంలో మిషన్లంటినీ పక్కన పెట్టేశారు. దీంతో అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లా కార్యాలయానికి చేరుకుని ఆర్ఓ శ్రీనివాసరావుతో కలిసి ఉద్యోగులతో సమావేశమయ్యారు. లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేస్తేనే ఫలితం వస్తుందని నచ్చచెప్పిన ఆయన ఆతర్వాత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా లక్ష్యాల మేర పన్నులు వసూలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయని చెబితే కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన ఆయన.. రానున్న 13 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండి వసూళ్లలో నిమగ్నం కావాల్సిందేనని స్పష్టం చేశారు. సెలవు ఇప్పించండి.. వెళ్లిపోతా అధికారులు కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నందున తాము పని చేయలేనని, సెలవు ఇప్పిస్తే వెళ్లిపోతానంటూ ఓ అధికారి.. అసిస్టెంట్ కమిషనర్ ఎదుట ఆందోళనకు దిగాడు. పని చేస్తున్నా చేయడం లేదని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు సెలవులైనా ఇప్పించాలని, లేదంటే మరో పోస్టు కేటాయించాలన్నారు. సదరు అధికారి ఆందోళనతో కేఎంసీ కార్యాలయంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా.. రెండు గంటల పాటు జరిగిన వాదనలు కొనసాగుతాయి. చివరకు అసిస్టెంట్ కమిషనర్ సర్దిచెప్పగా ఆర్ఐలు, బిల్కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పన్నుల వసూళ్లకు బయలుదేరారు. ఏటా మాదిరిగానే లక్ష్యాలు కేఎంసీలో వేతనాలు, ఇతర ఖర్చులు పెరుగుతున్నందున అదే స్థాయిలో ఆదాయం రాబట్టుకునేందుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఆస్తి పన్నుతోనే అత్యధికంగా ఆదాయం సమకూర్చుకునే అవకాశమున్నందున లక్ష్యాలను నిర్దేశించామని వెల్లడించారు. గతేడాది మాదిరే ముందుకు సాగుతున్నన విషయాన్ని సిబ్బందికి వివరిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు ఉంటే సంప్రదించండి.. రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలు ఉంటే నేరుగా తననైనా లేదంటే అసిస్టెంట్ కమిషనర్, ఆర్ఓను సంప్రదిందించాలని కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. పన్నుల వసూళ్లపై కార్యాలయంలో మంగళవారం సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఆందోళనకు గురై లక్ష్యసాధనలో వెనుకబడొద్దని తెలిపారు. ఉదయం 7నుంచి రాత్రి 9 గంటల వరకు క్షేత్ర స్థాయిలో ఉంటేనే పన్నులు వసూలవుతాయని చెప్పారు. ఈనెల 31 వరకు రెవెన్యూ ఉద్యోగులకు సెలవులు ఉండవని, ఆదివారం కూడా వసూళ్లలో నిమగ్నం కావాల్సిందేనని స్పష్టం చేశారు.పన్నుల వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో) రకం అసెస్మెంట్లు లక్ష్యం వసూలు చేసింది బకాయి రెసిడెన్షియల్ 72,827 18.06 14.35 3.71 కమర్షియల్ 3,720 8.65 6.29 2.36 రెండూ కలిసి ఉన్నవి 3,771 6.31 4.27 2.03 -
రూ.25వేల విలువైన మద్యం సీజ్
వైరా: వైరా మండలం గన్నవరంలో బెల్ట్షాప్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని ఎకై ్సజ్ ఉద్యోగులు సీజ్ చేశారు. గ్రామానికి మల్లికార్జునరావు బెల్టు షాప్ నిర్వహిస్తున్నాడనే సమాచారంతో మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.25 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ మమతారెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి కల్లూరు: కల్లూరులోని తిరువూరు క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... తిరువూరు క్రాస్ మీదుగా వెళ్తున్న కంటైనర్‌ను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బృందాబం చెక్ గ్రామానికి చెందిన గోబర్ధన్రాయ్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడుతున్నాడు. ఈక్రమాన కల్లూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా వెనక కూర్చున్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన దుబ్బాక రాజారావు(50) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే బైక్ నడుపుతున్న వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఈమేరకు మృతుడి బంధువు ప్రసాద్ ఫిర్యాదుతోకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్ఎంపీ హత్యకు మరో ఆర్ఎంపీ కుట్ర కామేపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స చేయాల్సిన వైద్యులు అర్హతకు మించి వైద్యం చేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే తన ఆదాయానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ ఆర్ఎంపీ ఇంకొకరి హత్యకు యత్నించగా తృటిలో బయటపడ్డాడు. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి. సింగరేణి మండలం కొత్తకమలాపురానికి చెందిన రంగారావు ఆర్ఎంపీగా గ్రామంలోనే కాక కామేపల్లి మండలం నెమలిపురితండాలోనూ ప్రజలకు చికిత్స చేస్తుంటాడు. అప్పటికే తండాలో ఆర్ఎంపీగా కొనసాగుతున్న వేముల రాధాకృష్ణ తన సంపాదనకు రంగారావు అడ్డొస్తున్నాడని భావించి హత్యకు కుట్ర పన్నాడు. ఈమేరకు రంగారావు ఈనెల 15న రాత్రి బైక్‌పై వెళ్తుండగా చౌటకుంట అలుగు సమీపాన రాధాకృష్ణ కారులో అడ్డు పెట్టి మరో ఐదుగురితో కలిసి రాడ్లతో దాడి చేయగా రంగారావుకు గాయాలయ్యాయి. ఇంతలోనే మరో బైక్ వస్తుండడంతో నిందితులు పారిపోయాడు. ఈమేరకు రంగారావు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సాయికుమార్ విచారణ చేపట్టారు. దంతో రాధాకృష్ణ, నెమలిపురితండాకు చెందిన ధరావత్ నాగలక్ష్మి, ఈశ్వర్, ఖమ్మంకు చెందిన కుక్కల కార్తీక్, సుమంత్, వేణును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
నేలకొండపల్లి: అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగా, కుటుంబీకులు నిద్ర నుంచి మేల్కొని బయటకు వచ్చేలోగా సర్వం అగ్నికి ఆహుతవడంతో కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి. మండలంలోని కొత్తకొత్తూరుకు చెందిన కస్తూరి పద్మకు చెందిన ఇంట్లో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న పద్మ, కుటుంబ సభ్యులు మేల్కొని బయటకు పరుగులు తీయగా మంచాలు, బట్టలు, బీరువా, కూలర్ తదితర సామగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చేలేగా ఏమీ మిగలకపోగా, ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఓ వ్యక్తి తనను చంపుతానని బెదిరించాడని, ఆయనే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రత్యేక కార్యాచరణతో ‘ఉపాధి’ పనులు
● ఇంకుడు గుంతలు, డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మంమయూరిసెంటర్: రానున్న పది రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి హామీ పనులు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన పనుల లక్ష్యాలను చేరేందుకు కృషి చేయాలని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్, ఫీల్డ్ చానల్స్, చెరువు కాల్వల పూడిక తీత పనులను ప్రత్యేక డ్రైవ్‌గా చేపట్టాలన్నారు. అటవీ భూములకు బౌండరీ ట్రెంచ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి హామీ కూలీలకు పని లభించడమే కాక భూముల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. అంతేకాక వ్యవసాయ శాఖ ద్వారా కొత్త పంట కాల్వలు, ఫామ్ పాండ్ల నిర్మాణానికి ప్రతిపాదిస్తే 24 గంటల్లో పనులు ప్రారంభించేందుకు అవకాశముందన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్న ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి తిరుమలాయపాలెం, వైరా, ఏన్కూర్, సింగరేణి మండలాల్లో 15 చొప్పున రెయిన్ హార్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేయాలని, ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో మండలానికి కనీసం 5 ఫామ్ పాండ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిధులు అందుబాటులో ఉన్న గ్రామపంచాయతీలలో సామాజిక ఇంకుడు గుంతలు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కాగా, తిరుమలాయపాలెం మండలంలో గతంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైనందున ఈసారి పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఏఓ డి.పుల్లయ్య, పీఆర్ ఈఈ వెంకట్‌రెడ్డి, డీఎల్పీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీ పేరు మారిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును యథావిధిగా కొనసాగించాలని, అలాకాకుండా పేరు మారిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రతినిధులు హెచ్చరించారు. తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశంపై మంగళవారం ఖమ్మంలోని పొట్టిరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు నిరసన తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పసుమర్తి సీతారామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుమ్మడివెల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు గోళ్ల రాధాకృష్ణమూర్తితో పాటు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, కొత్త వెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, సన్నె ఉదయ్‌ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, వనమా వేణుగోపాల్‌రావు, మాశెట్టి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
టీఈఎస్‌ఎస్‌ఏ నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్కు అనుబంధ తెలంగాణ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్స్ అసోసియేషన్ (టీఈఎస్‌ఎస్‌ఏ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా వి.సుమన్, కార్యదర్శిగా ఎన్. తిరుపతిరావు, కోశాధికారిగా డీ.వీ.సాయికుమార్, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాసరెడ్డి, ఎం.కిష్టయ్య, కె.మధు, సహాయ కార్యదర్శులుగా పి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.డీ.జోహెందర్ సాహెబ్, పబ్లిసిటీ సెక్రటరీగా ఎన్.స్పందన, ఈసీ మెంబర్లుగా పి.రామకృష్ణ, బి.స్వాతి ఎన్నికయ్యారు. టీఎన్జీవోస్ ప్రచార కార్యదర్శి ఎరమ్రల్ల శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావుతో పాటు సీపీఓ ఏ.శ్రీనివాస్ అభినందించారు. -
రేక్ పాయింట్‌కు లైన్ క్లియర్
● పందిళ్లపల్లిలో ఎరువుల దిగుమతికి ‘కోడ్’ కేటాయింపు ● కంపెనీల సానుకూలతతో త్వరలోనే రవాణా ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం పందిళ్లపల్లిలో ఎరువుల రేక్ పాయింట్‌కు లైన్ క్లియర్ అయింది. వివిధ కంపెనీలు ఎరువులు సరఫరా చేసేలా కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ తాజాగా ‘కోడ్’ కేటాయించింది. గతంలో ఖమ్మం రైల్వేస్టేషన్ కేంద్రంగా రేక్ పాయింట్ కొనసాగగా, కాజీ పేట–విజయవాడ మధ్య మూడోలైన్ ఏర్పాటు పనులతో తొలగించి పందిళ్లపల్లి స్టేషన్‌కు మార్చింది. అయితే, అనుమతుల్లో జాప్యం జరుగుతుండగా దాదాపు మూడు నెలలుగా రైల్వేవ్యాగన్ల ద్వారా ఎరువుల సరఫరా నిలిచిపోయింది. దీంతో వరంగల్, మిర్యాలగూడ రేక్ పాయింట్ల నుంచి ఇక్కడకు ఎరువుల సరఫరా చేసి కేంద్రాలకు చేరవేస్తున్నా అక్కడక్కడా కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ కోడ్ కేటాయించిన నేపథ్యాన ఖమ్మం బదులు పందిళ్లపల్లికి ఎరువుల దిగుమతికి అవకాశం లభించినట్లయింది. ఇప్పటికే లారీ అసోసియేషన్ బాధ్యుల సమస్యలు పరిష్కారం కాగా, హమాలీల సమస్య కూడా త్వరలో ఓ కొలిక్కి రానుంది. నిల్వల కోసం ఎదురుచూపులు రానున్న వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎరువులు నిల్వ చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. ఏటా యాసంగి సీజన్ తర్వాత మార్చి నెల నాటికే దాదాపు 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల వివిధ కంపెనీలకు సంబంధించి యూరియా నిల్వ చేస్తారు. మే నెల నాటికి ఇది 70 వేల మెట్రిక్ టన్నులకు చేరుతుంది. కానీ ఈసారి రేక్ పాయింట్ మారడం, అనుమతుల్లో జాప్యంతో నిల్వ చేయలేదు. పందిళ్లపల్లి రేక్ పాయింట్ నుంచే ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఎరువులు సరఫరా చేయనుండగా.. మార్క్‌ఫెడ్‌కు 60 శాతం, 40 శాతం డీలర్లకు కేటాయిస్తారు. ముందుకొస్తున్న కంపెనీలు పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు అనుమతులు వచ్చిన నేపథ్యాన ఎరువులు సరఫరా చేసేందుకు వివిధ కంపెనీలు సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలోనే క్రిబ్కో, రామగుండం కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీల యూరియా దిగుమతి జరగనున్నట్లు తెలిసింది. ఒక్కో రైల్వే వ్యాగన్లో దాదాపు 3వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రానుండగా, నెలకు 20 నుంచి 25 వ్యాగన్లు వచ్చే అవకాశముంది. దీంతో వానా కాలం సీజన్‌కు కావాల్సిన ఎరువులు నిల్వ చేసేందుకు గోదాంలను సిద్ధం చేస్తున్నారు. కాగా, పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు కోడ్ కేటాయించిన నేపథ్యాన ఎరువులతో పాటు ఎఫ్‌సీఐ తరఫున బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల ఎగుమతి, దిగుమతికి కూడా అవకాశం లభించినట్లయింది. -
పన్నుల వసూళ్లలో జాప్యం వద్దు
వైరా: ఈనెలాఖరు నాటికి వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందేనని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ రీజినల్ డైరెక్టర్ షాహీద్ మసూద్ స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీలో పన్ను వసూళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్నులు వసూలు చేయాలని సూచించారు. మార్చి 31వరకు సెలవులు కూడా ఉండవని తెలిపారు. నిర్దేశిత లక్ష్యం కంటే తక్కువ వసూలైతే బాధ్యులపై చర్యలు తప్పవని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ చింతా వేణు, ఆర్ఐ ప్రదీప్, ఉద్యోగులు పాల్గొన్నారు. 984మంది విద్యార్థులకు కంటి అద్దాలు ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో ఉంటున్న 984 మంది విద్యార్థులకు మొదటి విడతగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ బి.కళావతిబాయి తెలిపారు. ఇటీవల 3,557 విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించగా 3,079 మందికి అద్దాలు అవసరమని తేల్చినట్లు పేర్కొన్నారు. ఇందులో మొదటి విడతగా 984 మందికి కంటి అద్దాలను పాఠశాలలు, హాస్టళ్లకు పంపినట్లు ఆమె తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ లైన్లు ఖమ్మంఅర్బన్: రానున్న వేసవిలో డిమాండ్ పెరగనున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదురుకాకుండా సబ్ స్టేషన్లుకు ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్ఈ ఐ.శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మం ఖానాపురం పారిశ్రామిక ప్రాంతానికి మెరుగైన సరఫరా కోసం రూ.25లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 33 కేవీ లైన్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ లైన్‌తో బల్లేపల్లి సెక్షన్ పరిధి ఖానాపురం, బల్లేపల్లి, పాండురంగాపురం, బాలపేట, జయనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో మెరుగైన సరఫరా చేయొచ్చని తెలిపారు. డీఈ ఎన్.రామారావుతో పాటు ఉద్యోగులు ఎం.సంజీవ కుమార్, పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఓటర్ జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా ఉద్యోగులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ విషయంలో పార్టీల నాయకులు సహకరించాలని చెప్పారు. ఫారం–6 ద్వారా 4,734 దరఖాస్తులు రాగా 3,267 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించామని తెలిపారు. అలాగే, ఫారం–7 ద్వారా అందిన 3,352 దరఖాస్తుల్లో 2,450 పరిష్కరించగా, ఫారం–8 దరఖాస్తులు 11,820లో 9,573 పరిష్కారమయ్యాయని చెప్పారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికీ వ్యయ వివరాలు అందజేయలేదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్.స్వామి, డీటీ అన్సారీతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో ఇద్దరి డీబార్ ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. బోర్డు అబ్జర్వర్లు టి.యాదగిరి, ఆర్.వెంకటేశ్వర్లు మంగళవారం పలు కేంద్రాల్లో తనిఖీ చేయగా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఇద్దరు పట్టుబడ్డారని పేర్కొన్నారు. కాగా, మంగళవారం పరీక్షలకు 17,442మందిలో 17,001మంది విద్యార్థులు హాజరయ్యారని డీఐఈఓ తెలిపారు. -
గూగుల్ మ్యాప్‌తో ధనవంతుల ఇళ్ల గుర్తింపు
● ఆపై చోరీలు.. సొత్తుతో సహా శ్మశానాల్లోనే నివాసం ● తల్లికి చీర కొనేందుకు తొలిసారి చోరీ ● 90కి పైగా కేసులు, కానిస్టేబుల్‌పై కత్తి దాడి నిందితుడి అరెస్ట్ సత్తుపల్లి: సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి గూగుల్ మ్యాప్ ద్వారా అత్యాధునిక భవంతులను గుర్తించి చోరీ చేయడం, ఆపై చోరీ సొత్తును శ్మశానాల్లోనే దాచి అక్కడే బస చేయడం ఆయనకు అలవాటు. తల్లికి చీర కొనేందుకు రూ.300కోసం తొలిసారి చోరీ చేసిన నిందితుడు.. వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాక నాలుగు నెలల్లోనే ఎనిమిది జిల్లాల్లో 43కు పైగా చోరీలు చేయడం గమనార్హం. ఈక్రమంలో తనను పట్టుకునేందుకు సిద్ధమైన కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పరారైన నిందితుడిని సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా వివరాలను మంగళవారం ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ వెల్లడించారు. కానిస్టేబుల్‌పై దాడి సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ నెల 10వ తేదీ రాత్రి అనుమానాస్పదంగా తచ్చాడుతున్న సురేందర్‌ను విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఎం.నరేష్ విచారించే క్రమాన కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో ఏసీపీ అనిశెట్టి రఘు ఆధ్వర్యాన సీఐ టి.కిరణ్, ఎస్సైలు కవిత, వీరేందర్, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈమేరకు సురేందర్ పట్టుబడగా చోరీ సొత్తు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సునీల్‌దత్ తెలిపారు. అయితే, ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందా, మిగతా సొత్తు ఎవరికి విక్రయించాడనే కోణంలో విచారిస్తూ ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. కాగా, నిందితుడిని అడ్డుకునే క్రమంలో కత్తి పోట్లకు గురైన కానిస్టేబుల్ ఎం.నరేష్, పోలీసులకు సహకరించిన యువకులు చెరుకుపల్లి ప్రసాద్, ఎల్లంగి రాజుకు సీపీ క్యాష్ రివార్డులు అందించారు. అలాగే, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై కవిత, కానిస్టేబుళ్లు ఎం.శ్రీనివాస్, శ్రావణ్‌రెడ్డి, ఇమ్రాన్‌ను అభినందించగా.. సత్తుపల్లి పట్టణ, రూరల్ సీఐలు టి.కిరణ్, ముత్తిలింగం, ఎస్సై వీరేందర్ పాల్గొన్నారు.సాంకేతికత అండగా.. ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చితాపూర్కు చెందిన తిరువీధుల సురేందర్ తల్లికి రూ.300 విలువైన చీర కొనేందుకు మొదటిసారి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆతర్వాత ఆయన 90 కేసుల్లో ముద్ధాయిగా ఉండగా.. చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసులో శిక్ష అనుభవిస్తూ గతేడాది నవంబర్‌లో బెయిల్‌పై వచ్చాడు. ఆతర్వాత ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 15, సూర్యాపేటలో ఏడు, నల్లగొండ, ఏలూరు జిల్లాల్లో ఐదు చొప్పున, కొత్తగూడెం జిల్లాలో నాలుగు, వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు ఇలా మొత్తం 43 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అయితే, దొంగతనానికి ఇళ్లు ఎంచుకునే క్రమాన గూగుల్ మ్యాప్ సాయం తీసుకునే సురేందర్ అత్యాధునిక భవంతులను గుర్తించి ధనవంతులు ఉంటున్నారని తేల్చుకుని రంగంలోకి దిగుతాడు. చోరీ చేసిన సొత్తును శ్మశానవాటికల్లో దాచిపెట్టడం.. ఆయన కూడా అక్కడే ఉంటూ గడిచిన నాలుగు నెలల్లోనే 43చోట్ల రూ.3.33లక్షల నగదు, 461.18 గ్రాముల బంగారు ఆభరణాలు, 424 గ్రాముల వెండి ఆభరణాలే కాక రెండు బైక్‌లు, సెల్ఫోన్లు చోరీ చేశాడు. -
కల ఫలించిన వేళ...
● జిల్లాకు 57 మంది జూనియర్ లెక్చరర్లు ● 2022లో నోటిఫికేషన్.. ఇప్పుడు నియామకం ● మరింత బలోపేతం కానున్న ఇంటర్ విద్య సత్తుపల్లిటౌన్: ఏళ్ల తరబడి సరిపడా అధ్యాపకులు లేక కునారిల్లుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన కష్టాలు ఇకపై తీరనున్నాయి. ఏళ్ల తర్వాత కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని భావిస్తున్నారు. ఈనెల 12వ తేదీన కొత్త జూనియర్ లెక్చరర్లు నియామక పత్రాలు అందుకుని కళాశాలల్లో రిపోర్ట్ చేయగా, జిల్లాకు 57మందిని కేటాయించారు. అధ్యాపకులు లేక.. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సబ్జెక్టు అధ్యాపకులు లేక బోధన సాఫీగా సాగడంలేదు. ఈ కారణంగా విద్యార్థులు నష్టపోతుండగా, ఫలితా లపై ప్రభావం పడుతోంది. గెస్ట్ లెక్చరర్లు, ఒప్పంద అధ్యాపకులను నియమించినా పూర్తిస్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లను నియమించడం.. జిల్లాలోని కళాశాలలకు 57మందిని కేటా యించడంతో ఇకపై ఇంటర్ విద్య బలోపేతమవుతుందని భావిస్తున్నారు. చివరగా వైఎస్సార్ హయాంలో... దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జూనియర్ లెక్చరర్ల నియామకానికి 2008లో నోటిఫికేషన్ జారీ అయింది. ఆతర్వాత 14ఏళ్లకు మళ్లీ 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆపై 2023 సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించి, 2024 జూన్‌లోనే ఫలితాలు వెల్లడించినా నియామక ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఇటీవల నియామక పత్రాలు అందించగా అటు అధ్యాపకుల్లో.. ఇటు విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.ఎదురుచూపులకు తెర 2009లో పీజీ పూర్తి చేసి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నా. 2022లో జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ప్రతిభ కనబర్చగా సత్తుపల్లి బాలికల కళాశాలలో జువాలజీ లెక్చరర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఎదురుచూపులకు తెర పడినట్లయింది. – కె.శ్వేత, తొర్రూరు ఆనందంగా ఉంది... ప్రైవేట్ కాలేజీలో సివిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ జేఎల్ పోస్టుకు సిద్ధమయ్యాను. నా పీజీ 2011లో పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదవడంతోఫలితం వచ్చింది. సత్తుపల్లి బాలికల జూనియర్ కళాశాలలో పోస్టింగ్ ఇవ్వగా విధుల్లో చేరా. – కె.రాణి, వరంగల్ -
మున్నేరుపై కొత్త వంతెనలు
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలోకి ప్రవేశించేందుకు కీలకంగా నిలుస్తూ మున్నేటిపై ఉన్న రెండు వంతెనలకు తోడు అదనపు బ్రిడ్జిల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. కరుణగిరి, ప్రకాష్‌నగర్ వద్ద రెండు లేన్లతో ఉన్న ఈ వంతెనల పక్కన మరో రెండు లేన్లతో వంతెనలు నిర్మిస్తారు. ఇందుకోసం రూ.40కోట్ల చొప్పున రూ.80కోట్లు మంజూరు కాగా టెండర్లు ఆహ్వానించడంపై అర్అండ్బీ అధికారులు దృష్టి సారించారు. కీలకంగా వంతెనలు జిల్లా కేంద్రం మీదుగా ఇతర ప్రాంతాలకు వారధిగా నిలుస్తున్న ఈ వంతెలు ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్నాయి. అయితే, వంతెనలకు ముందు, తర్వాత రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించారు. దీంతో వంతెన వరకు రాకపోకలు సాఫీగా సాగుతున్నా బ్రిడ్జిలపైకి వచ్చేసరికి భారీ వాహనాలతో ఇరుకుగా మారి తరచూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీనికి తోడు ఖమ్మం చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణం చివరి దశకు చేరింది. ఈమేరకు రెండు బ్రిడ్జిలకు పక్కన మరో రెండు వరుసలతో నూతన బ్రిడ్జిలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. మున్నేరుపై మూడు బ్రిడ్జిలు ఉండగా, కాల్వొడ్డులో పాత వంతెనను ఆనుకుని రూ.180 కోట్లతో తీగల వంతెన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఆపై కరుణగిరి, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిల సమీపాన కొత్తగా రెండేసి వరుసలతో బ్రిడ్జిలు నిర్మిస్తే రహదారులకు అనుగుణంగా నాలుగు లేన్ల రోడ్డు అందుబాటులోకి వస్తుంది. తద్వారా జాతీయ రహదారులకు అనుగుణంగా వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని భావిస్తున్నారు.పాత బ్రిడ్జిల వెంట నిర్మాణం ప్రకాష్‌నగర్, కరుణగిరి వద్ద రెండేసి లేన్లతో నిర్మాణానికి నిర్ణయం రూ.80కోట్ల నిధులు మంజూరు.. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ‘నెల్లూరి’
ఖమ్మంమయూరిసెంటర్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరి కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర ఎన్నికల కో రిటర్నింగ్ ఆఫీసర్ గీతామూర్తి పేరి ట ప్రకటన వెలువడింది. అలాగే, ఐదు నియోజకవర్గాల నుంచి రాష్ట్ర కౌన్సిల్ కు ఐదుగురిని ఎంపిక చేశారు. ఇందులో డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు(ఖమ్మం), గడ్డం వెంకటేశ్వర్లు(పాలేరు), గుగులోత్ నాగేశ్వరరావు(మధిర), బి.సుజాత(వైరా), జె.నరేష్(సత్తుపల్లి) ఉన్నారు. ప్రస్తు తం జిల్లా అధ్యక్షుడిగా గల్లా సత్యనారాయణ ఉండగా ఆయన స్థానంలో ఎంపికైన కోటేశ్వరరావు స్వస్థలం కొణిజర్ల మండలం అమ్మపాలెం. 2012లో ఆర్ఎస్ఎస్ ద్వారా తన ప్రస్తానం ప్రారంభించిన ఆయన పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. -
ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లిలోని జిల్లా మహిళా ప్రాంగణంలో నిరుపేద యువతులు, మహిళలకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనుండగా, దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రాంగణం అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 – 45 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలకు ఉచిత భోజన, వసతితో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. టైలరింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్, కారు, ఆటో డ్రైవింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్‌లో రెండు నెలల నిడివితో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కోర్సుల వారీగా ఎనిమిదో తరగతి మొదలు ఎస్సెస్సీ, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని, డ్వాక్రా గ్రూప్‌ల సభ్యులకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్ కాపీలు జతపరిచిన దరఖాస్తులను ఈనెల 31లోగా మహిళా ప్రాంగణంలో అందజేయాలని, శిక్షణ పూర్తయ్యాక రాయితీతో కూడిన రుణాలు ఇప్పిస్తామని విజేత తెలిపారు. ఏదులాపురం కమిషనర్‌గా శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్: ఇటీవల ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా ఆళ్ల శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జ్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆతర్వాత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, శ్రీనివాసరెడ్డి గతంలో జిల్లాలోని వివిధ మండలాల ఎంపీడీఓగా, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్‌గా, పెద్దతండా పంచాయతీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తు తం డీఆర్డీఏ డీపీఎం(ఫైనాన్స్)గా పనిచేస్తున్న ఆయనను ఏదులాపురం మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తులు ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికా సం పథకానికి గిరిజన నిరుద్యోగ యువత ఏప్రిల్ 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్.విజయలక్ష్మి తెలిపారు. షెడ్యూల్ తెగల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిందని వెల్లడించారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. బీసీ గురుకులాల్లో ప్రవేశానికి ఏప్రిల్ 20న పరీక్ష ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల్లో వచ్చే విద్యాసంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఏప్రిల్ 4న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీ గురుకుల విద్యాసంస్థల ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి సీహెచ్.రాంబాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 24 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, 6వ తరగతిలో బాలికలకు 249, బాలురకు 294, 7వ తరగతిలో బాలికలకు 170, బాలురకు 177, 8వ తరగతిలో బాలికలకు 97, బాలురకు 124, 9వ తరగతిలో బాలికలకు 139, బాలురకు 184 బ్యాక్లాగ్ సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రవేశాలకు రూ.150 చెల్లించి ఈనెల 31లోగా https://mjptbcadmissions.org/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. మత్స్యకారులకు శిక్షణ ప్రారంభం కూసుమంచి: కూసుమంచి మండలంలోని పాలేరు పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన ఎస్టీ మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ చేపల పెంపకంలో పద్ధతులు, చేపల సంరక్షణ, దాణా తయారీపై అవగాహన కల్పించారు. అనంతరం జుజుల్‌రావుపేట, నాచేపల్లిలోని ఫిషరీస్ కేంద్రాలను తీసుకెళ్లి వివిధ రకాల చేపలు, రొయ్యల పెంపకం తీరును వివరించారు. -
పండితాపురం సంత @
రూ.2,42,30,000● పోటాపోటీగా వేలం పాడడంతో పెరిగిన ధర ● గత ఏడాదితో పోలిస్తే రూ.36.20లక్షలు అధికంకామేపల్లి: కామేపల్లి మండలం కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీ కృష్ణప్రసాద్ సంతకు వివిధ ప్రాంతాల నుంచి క్రయవిక్రయదారులు వస్తుండడంతో రాష్ట్రంలోనే పేరుంది. ప్రతీ బుధవారం జరిగే ఈ సంతలో ప్రధానంగా పశువులు, మేకలు, గొర్రెల అమ్మకం ఎక్కువగా జరుగుతుంది. దీంతో సంత నిర్వహణను దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతుండగా వేలంలో రికార్డు స్థాయి ధర నమోదవుతోంది. ఇందులో భాగంగా ఈసారి రూ.2,42,30,000 పలకగా కొత్త రికార్డు నెలకొంది. గత నెల 13న నిర్వహించినా... 2025–26 ఆర్థిక సంవత్సరానికి బాధ్యతలు అప్పగించేందుకు ఈనెల 13న గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి రవీందర్ అధ్యక్షతన బహిరంగ వేలం నిర్వహించారు. అయితే, నలుగురు పాల్గొనగా బోడా శ్రీను రూ.2,35,70,000 అత్యధికంగా పాడినా ప్రభుత్వ మద్దతు ధర రాలేదని అధికారులు రద్దు చేశారు. తిరిగి సోమవారం డీఎల్పీఓ రాంబాబు సమక్షంలో జీపీ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్ అధ్యక్షతన వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన భూక్యా వీరన్న, బానోత్ లక్ష్మణ్, బోడా శ్రీను పాల్గొన్నారు. గత వేలం పాటలో హెచ్చుగా నమోదైన రూ.2,35,70,000 నుంచి ప్రారంభించగా భూక్యా వీరన్న, బానోతు లక్ష్మణ్ మధ్య హోరాహోరీగా వేలం సాగింది. చివరకు భూక్యా వీరన్న రూ.2,42,30,000కు హెచ్చు పాటదారుడిగా నిలిచాడు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,42,01,540 కంటే ఎక్కువకు పాడడంతో వీరన్ననే ఖరారు చేశారు. ఈమేరకు ఆయన సాల్వేన్సీ రూ.5లక్షలతో పాటు పాట మొత్తంలో మూడో వంతైన రూ.80.77లక్షలు అక్కడికక్కడే చెల్లించాడు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.36.20లక్షలు అధికంగా జీపీకి ఆదాయం లభించింది. వేలం దృష్ట్యా ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై సాయికుమార్ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్‌రెడ్డి, జీ.వీ.సత్యనారాయణ, కార్యదర్శి శంకర్, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి .. పండితాపురం సంత ఏర్పడి సుమారు 30 ఏళ్లవుతోంది. తొలినాళ్లలో రూ.వందల్లోనే పలికే పాట ఇప్పుడు రూ.కోట్లకు చేరింది. గ్రామంలో వర్గపోరు కారణంగా ఆధిపత్యం సాధించాలంటే సంత తమ ఆధీనంలో ఉండాలని పోటీ పడుతుండడం ఆనవాయితీగా మారింది. గిరిజనులు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశమున్న ఈ సంతకు గ్రామస్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉన్న కారణంగా వేలంలో రికార్డు దర నమోదవుతుండగా, అదేస్థాయలో గ్రామపంచాయతీకి నిధులు జమ అవుతున్నాయి. ఈ నిధులతో గ్రామంలో అనేక అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కాగా, కరోనా వ్యాప్తి సమయాన కొద్దివారాలు మాత్రమే సంత నిలిచిపోయింది.ఆర్థిక సంవత్సరం ఆదాయం 2019–20 రూ.2,05,30,000 2020–21 రూ.91,70,000 (కరోనా) 2021–22 రూ.1,99,30,000 2023–24 రూ.2,39,50,000 2024–25 రూ.2,06,10,000 2025–26 రూ.2,42,30,000 -
తస్మాత్ జాగ్రత్త
ఖమ్మంవైద్యవిభాగం: రోజురోజుకూ ఎండలు పెరుగుతున్న నేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బి.కళావతిబాయి సూచించారు. జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతున్న నేపథ్యాన ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈమేరకు ఎండ నుండి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ బారిన పడిన వారికి చికిత్స కోసం వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలను ఆమె ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ వెల్లడించిన అంశాలు ఆమె మాటల్లోనే...ఎండల వేళ అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందే ● వడదెబ్బ బాధితుల చికిత్సకు ఆస్పత్రుల్లో ఏర్పాట్లు ● అత్యవసర సమాచారానికి కంట్రోల్ రూం కూడా.. ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కళావతిబాయిపగలు ఎండ.. రాత్రి చలి ఇటీవల వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట ఎండ, అర్ధరాత్రి నుండి ఉదయం వరకు చలితీవ్రత ఉంటోంది. ఇలాంటి పరిస్థితితో వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. జ్వరం, జలుబు, దగ్గు, అస్తమా వంటి వ్యాధులతో పాటు ఎండతీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యే అవకాశముంది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత నేపథ్యాన ఉదయం 11నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుండి బయటకు రాకపోవడమే మంచిది. తప్పనిసరై వస్తే తలకు టోపీ, ఖద్దర్ వస్త్రాలు, గొడుగు, చలువ కళ్లద్దాలు ధరించాలి. మా తరఫున సిద్ధం వేసవి దృష్ట్యా గత నెలలోనే టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించాం. జిల్లాలోని అన్ని మండలాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేశాం. 24 పీహెచ్‌సీలు, నాలుగు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు లక్ష ఓఆర్ఎస్ ప్యాకెట్లు చేరవేశాం. అవసరమైతే మరిన్ని ప్యాకెట్లు పంపిస్తాం. జిల్లా కేంద్రంలో 97041 50025 టోల్‌ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. ఎండ వేడితో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. అలాగే ఎవరికై నా కళ్లు తిరగటం, వాంతి వచ్చినట్లు అనిపించటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేయగా.. వివిధ శాఖల సమస్వయంతో అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేకున్నా... ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరవొద్దు.ఆహారమూ ముఖ్యమే.. ఈ వేసవిలో ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్నే తీసుకోవాలి. నిమ్మరసం, ఓఆర్ఎస్, వివిధ రకాల పండ్ల రసాలు, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. జంక్ఫుడ్స్ సైతం తీసుకోవద్దు. ఎండవేడితో శరీరం డీహైడ్రేషన్ కాకుండా ప్రతీ గంటకు ఒక గ్లాస్ నీరు తీసుకోవాలి. -
ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
● ఆర్టీసీ కార్గో ద్వారా చేరవేసేలా ఏర్పాట్లు ● ఆన్లైన్ లేదా కార్గో పాయింట్లలో బుకింగ్‌కు అవకాశం ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో వచ్చేనెల 6న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణానికి హాజరుకాలేని భక్తులకు తలంబ్రాలు ఇంటి వద్దే అందించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకుంటే ముత్యంతో కూడిన తలంబ్రాల ప్యాకెట్‌ను ఇంటి వద్దే అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా లేదా బస్టాండ్లలోని కార్గో పాయింట్లు, ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ●సత్తుపల్లిటౌన్: భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాల బుకింగ్ వివరాలతో రూపొందించిన కరపత్రాలను సత్తుపల్లిలో ఆర్టీసీ డీఎం యు.రాజ్యలక్ష్మి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఎంఎఫ్ ఎస్.సాహితీ, మునీర్‌పాషా, బాబురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.డిపోల వారీగా సంప్రదించాల్సిన నంబర్లు ఖమ్మం 91542 98583 మధిర 91542 98584 సత్తుపల్లి 91542 98585 భద్రాచలం 91542 98586 కొత్తగూడెం 91542 98587 మణుగూరు 91542 98588 ఇల్లెందు 91542 98587 -
మళ్లీ తెరపైకి గొర్రెల పథకం అక్రమాలు
● ఇటీవల రికార్డులతో పాటు క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలు ● తాజాగా వరంగల్‌లో పశువైద్యాధికారుల విచారణ ఖమ్మంవ్యవసాయం: గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు వరంగల్ నుంచి వచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన ముగ్గురు అధికారుల బృందం రెండు రోజుల పాటు తనిఖీలు, క్షేత్ర స్థాయి విచారణ చేపట్టింది. ఈసందర్భంగా ఖమ్మంలోని జిల్లా పశువైద్య, పశుసంవర్దక శాఖ కార్యాలయంలో 2017–18 నాటి గొర్రెల పథకం తాలుకా రికార్డులు, బిల్లులు, బీమా వివరాలను పరిశీలించడమే కాక మధిర, ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించింది. తాజాగా సోమవారం జిల్లాలోని ఐదుగురు పశువైద్యాధికారులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు సోమవారం వరంగల్‌కు పిలిపించి విచారణ నిర్వహించారు. ఏమిటీ పథకం? గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పెంపకందారుల ఆర్థిక పరిపుష్టి కోసం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని రెండు విడతలుగా అమలు చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా రూ.కోట్లలో అక్రమాలు జరిగాయని ‘కాగ్’ గుర్తించగా, నివేదిక ఆధారంగా అప్పట్లోనే పలు జిల్లాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ఓ ఉన్నత స్థాయి అధికారిని అరెస్ట్ చేయగా, ఇంకొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈనేపథ్యాన ఖమ్మం జిల్లాలోనూ అక్రమాలు జరిగాయంటూ బాధ్యులుగా పలువురికి నోటీసులు ఇచ్చారు. అక్రమాలు ఇలా.. గొర్రెల పంపిణీ పథకంలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.25 లక్షల విలువైన యూనిట్(21గొర్రెలు) ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో 32,513 మందిని అర్హులుగా గుర్తించి 2017–18లో 10,538 మందికి గొర్రెలు అందించారు. ఈ మొత్తంలో 970 యూనిట్లకు సంబంధించి అక్రమాలు జరిగాయని కాగ్ నివేదికలో పేర్కొంది. ఒక్కో యూనిట్ రవాణాకు రూ.6వేలు చెల్లించాలని నిర్ణయించడంతో జిల్లా లబ్ధిదారులకు ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల నుంచి గొర్రెలను తెప్పించారు. అయితే, రవాణా కాంట్రాక్టర్లు ఇచ్చిన బిల్లుల ఆధారంగా పశుసంవర్ధ శాఖ నగదు చెల్లించింది. కానీ కాంట్రాక్టర్లు సమర్పించిన వాహనాల నంబర్లను పరిశీలించగా అంబులెన్స్‌లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఉండడం, 106 చోట్ల అంకెల మార్పిడి జరగడంతో రూ.17కోట్లు దుర్వినియోగం జరిగి నట్లు తేల్చారు. ఇందులో కాంట్రాక్టర్లతో పాటు 27 మంది పశువైద్య అధికారుల బాధ్యత ఉందని చెబుతూ వివరణ తీసుకున్నారు. అయితే, ఈ కేసు ఇన్నాళ్లు మూలనపడగా మరోసారి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించింది. దీంతో అక్రమాల వ్యవహారం తెరపైకి రావడం, ముమ్మరంగా విచారణ జరుగుతుండగా.. విజిలెన్స్ విభాగం అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎవరిపై వేటు పడుతుందోనని పశు సంవర్థక శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. -
ఎప్పటికప్పుడు పరిష్కరించండి
● గ్రీవెన్స్ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దు ● అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో భాగంగా వారు ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారు లతో పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించిన అదనపు కలెక్టర్లు పలు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ●ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమీపాన వ్యాపారాలు చేసుకుంటున్న తమకు అక్కడ కనీస వసతులు కల్పించాలని చిరువ్యాపారులు విన్నవించారు. ●కూసుమంచి మండలం పెరిక సింగారంలోని సర్వే నంబర్ 231లో 1.03గుంటల భూమి తన భర్త పేరిట ఉండగా, ఆడపడుచు నకీలీ పత్రాలతో పాసు బుక్ తీసుకుందని బి.ఆదెమ్మ ఫిర్యాదు చేసింది. ●ఖమ్మం దొరన్ననగర్కు చెందిన జి.నరేష్‌కు ఆయన భార్యతో గొడవలు జరుగుతుండగా, ఆమెకు వారి కుటుంబీకులు తన అనుమతి లేకుండా అబార్షన్ చేయించారని ఫిర్యాదు చేశాడు. ●ఖమ్మం టేకులపల్లిలో కేసీఆర్ టవర్స్‌లో నివాసముండే ఎస్.కే.హసీనా షార్ట్ సర్క్యూట్ కారణంగా సామగ్రి కాలిపోయినందున పరిహారం ఇప్పించాలని వినతిపత్రం అందజేసింది. -
పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి
ఖమ్మం సహకారనగర్: దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు వేచిచూస్తున్న సీపీఎస్ రద్దు, డీఏలు, సర్వీస్ రూల్స్ తదితర సమస్యల పరిష్కారానికి మండలితో తన గళం వినిపిస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికై న పింగిళి శ్రీపాల్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మం – వరంగల్ – నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికై న ఆయన తొలిసారి సోమవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ నాయకులు 500ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మంలోని యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన విజయోత్సవ సభలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు, కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ మంజూరు తదితర అంశాల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. ఈకార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యలమద్ది వెంకటేశ్వర్లు, రామిశెట్టి రంగారావుతో పాటు మోత్కూరు మధు, సతీష్‌తో పాటు పలువురు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయోత్సవ సభలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి -
రూ.102 కోట్లతో కేఎంసీ బడ్జెట్
● గత ఏడాదితో పోలిస్తే రూ.12 కోట్ల పెంపు ● మేయర్, కమిషనర్‌తో చర్చించిన అధికారులు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ(కేఎంసీ)కు 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధవుతున్నాయి. ఈసారి బడ్జెట్ రూ.102 కోట్లకు పైగా ఉంటుందని ఇప్పటికే లెక్కలు గట్టారు. కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయానికి తోడు వ్యయాన్ని బేరీజు వేసుకుని బడ్జెట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.90.82కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి రూ.12 కోట్ల మేర పెంచారు. కేఎంసీకి జనరల్ ఫండ్‌తో పాటు ఇతర నిధులు కలిపి వచ్చే ఆదాయాన్ని పొందుపరిచి.. వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులు, రుణాలు, అడ్వాన్సులు, గ్రీన్ బడ్జెట్, పరిపాలన వ్యయం నమోదు చేశారు. అలాగే, విలీన గ్రామాలకు కొంత, వార్డ్ బడ్జెట్ కింద కొంత ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. మేయర్‌తో చర్చ 2025–26 ప్రతిపాదిత బడ్జెట్ సిద్ధం చేసిన కేఎంసీ అకౌంట్స్ విభాగ అధికారులు మేయర్ పునుకొల్లు నీరజతో చర్చించినట్లు తెలిసింది. ఆదాయ, వ్యయ ప్రతిపాదనలు, గతంతో పోలిస్తే పెంపు, 2024–25 రివైజ్డ్ బడ్జెట్ అమలును వివరించినట్లు సమాచారం. అలాగే, కమిషనర్ అభిషేక్ అగస్త్యతోనూ ఈ అంశంపై చర్చించగా, ఈనెల 27 లేదా 29వ తేదీన కేఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
రోడ్డు ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి
కొత్తగూడెంటౌన్: మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాక్షి దినపత్రిక ఉద్యోగి సోమవారం మృతి చెందాడు. కొత్తగూడెం న్యూ గొల్లగూడేనికి చెందిన తాటిపల్లి రాజేష్‌కుమార్(38) సాక్షి దినపత్రికలో సీనియర్ యాడ్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 14న మధ్యాహ్నం బైక్‌పై రామవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కొత్తగూడెం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అదే కారులో క్షతగాత్రుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఏడేళ్లలోపు కూతుళ్లు ఇద్దరు ఉన్నారు. ఈ విషయమై కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ ఎం.కరుణాకర్‌ను వివరణ కోరగా.. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు రుద్రంపూర్ తిలక్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. లారీడ్రైవర్ ఆత్మహత్య కొణిజర్ల: ఓ వైపు అప్పుల బాధ, మరోవైపు పెళ్లయిన కొద్దిరోజులకే కూతురి భర్త మృతిని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనికెళ్ల గంగెడ్లపాడుకు చెందిన లారీడ్రైవర్ తాళ్ల ఆనందరావు(51)కు భార్య శౌరమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం చేయగా ఈ ఏడాది జనవరిలో అల్లుడు మృతి చెందాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన ఆనందరావు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. -
ఉపాధి పనుల్లో ఆశావర్కర్లు, అంగన్వాడీలు!
కొణిజర్ల: కొణిజర్ల మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన పనులపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఓపెన్ ఫోరమ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ చుంచు శ్రీనివాసరావు పాల్గొని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించిన అంశాలపై ఆరా తీశారు. పలు గ్రామాల్లోని మస్టర్లలో కొట్టివేతలు, మార్పులు కనిపించాయని ఆయన తెలిపారు. అలాగే, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లినట్లుగా మస్టర్లు వేశారని పేర్కొన్నారు. మొక్కలు నాటినట్లు నమోదు చేసిన ప్రదేశాల్లో మొక్కలు కానరాలేదని తనిఖీ బృందాలు గుర్తించాయని పేర్కొన్నారు. ఈమేరకు బాధ్యులైన సిబ్బంది నుంచి రూ.1.20లక్షల రికవరీకి ఆదేశించగా, ఆయా ప్రాంతాల్లో కొత్త మొక్కలు నాటాలని ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఏపీడీ రామకృష్ణ, ఏడీవీఓ పవన్, అంబుడ్స్‌మెన్ రమేష్, క్వాలిటీ కంట్రోల్ అధికారి వీరయ్య, ఎంపీడీఓ రోజారాణి, ఎస్ఆర్పీ సాంబశివాచారి, పంచాయతీరాజ్ ఏఈలు రమేష్, కిషోర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలో కొత్తగా జాబ్‌కార్డులు మంజూరు చేయాలని, ఉపాధి కూలీలకు సకాలంలో నగదు చెల్లించాలని సీపీఎం నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.అక్రమాలు జరిగాయని గుర్తింపు, రికవరీకి ఆదేశం -
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ఎన్టీఆర్నగర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో సామగ్రి కాలిపోయాయి. ఎన్టీఆర్ కాలనీకి చెందిన మున్సిపాలిటీ కాంట్రాక్టు కార్మికురాలు తడికమళ్ల జయమ్మ ఇంట్లో సోమవారం షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్రిజ్, టీవీ, మంచం, రెండు బీరువాలతో పాటు కూలర్, బంరు ఆభరణాలు, నగదు కాలిపోగా, అగ్నిమాపక శాఖ సిబ్బంది వై.వెంకటేశ్వరరావు, సతీష్, బాబురావు చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే సామాగ్రి పూర్తిగా కాలిపోగా కట్టుబట్టలే మిగలడంతో బాధిత కుటుంబం రోడ్డున పడినట్లయింది. కాగా, బాధిత కుటుంబానికి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు ఎం.డీ.కమల్‌పాషా, గాదె చెన్నారావు, సందీప్‌గౌడ్ రూ.4వేల ఆర్థిక సాయం అందజేశారు. -
ఏడాదిలో 290 సెల్ఫోన్ల రికవరీ
ఖమ్మం క్రైం: సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తుండగా, ఐటీ సెల్ బృందం ట్రాక్ చేశాక స్వాధీనం చేసుకుని బాధితులకు అందిస్తున్నామని అదనపు డీసీపీ నరేష్కుమార్ తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో రూ.7లక్షల విలువైన 48 ఫోన్లను యజమానులకు ఆయన అందజేసి మాట్లాడారు. ఇందులో రూ.10వేలు మొదలు రూ.1.50 లక్షల విలువైన ఫోన్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 680 ఫోన్లు పోగొట్టుకున్నట్లు పోర్టల్‌లో నమోదు కాగా 582ఫోన్లను గుర్తించి, 290 ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఐటీ సెల్ నోడల్ ఆఫీసర్, ఏసీపీ వెంకటేశ్, ఎస్సై సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ హేమనాధ్, కానిస్టేబు ళ్లు నరేష్, శ్రీనును కమిషనర్, అదనపు కమిషనర్ అభినందించారు. అదనపు డీసీపీ నరేష్కుమార్ -
ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో జరగనున్న ఖేలో ఇండియా ఉషూ టోర్నీకి తెలంగాణ నుంచి ఖమ్మంకు చెందిన పి.పవిత్రాచారి ఎంపికై ంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం భాగల్పూర్లో జరిగిన సౌత్ జోన్ పోటీల్లో ప్రతిభ చాటిన ఆమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈసందర్భంగా ఆమెను డీవైఎస్ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణచారి అభినందించారు. న్యాయవ్యవస్థపై అవగాహన అవసరం కొణిజర్ల: బాలికలు న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖరరావు తెలిపారు. తనికెళ్లలోని తెలంగాణ గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఆకాంక్ష ట్రస్టు ఆధ్వర్యాన సోమవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన బాలికల సంరక్షణకు ఉన్న చట్టాలు, సెక్షన్లను వివరించారు. ఆయా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా అవసరమైన సమయంలో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, అధ్యాపకులు కే.పీ.ఐశ్వర్య, కె.రజిని, కె.రజితతో పాటు ఎన్.శ్రీనివాసశర్మ, సీహెచ్.హైమావతి, ప్రతిభారెడ్డి, నాగమణి, లలిత, వంగూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కావొద్దు పెనుబల్లి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా సిద్ధమై వార్షిక పరీక్షలు రాయాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. మండలంలోని వీఎం బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం సోమవారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాక భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదివాక జవాబులు సూటిగా సకాలంలో రాయాలని సూచించారు. వీఎం బంజర్ ఎస్సై కె.వెంకటేష్, పాఠశాల హెచ్ఎం ఎస్.సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రూ.45.16 లక్షలకు పాలేరు సంత ఖరారు కూసుమంచి: మండలంలోని పాలేరులో ప్రతీ శుక్రవారం జరిగే సంత ఏడాది కాలం నిర్వహణ అప్పగించేందుకు సోమవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కొత్తూరుకు చెందిన బజ్జూరు ఉపేందర్‌రెడ్డి రూ.45.16లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.37.60లక్షలు పలకగా, ఈసారి రూ.7.56 లక్షలు అదనంగా ఆదాయం సమకూరింది. వేలంలో మొత్తం 19మంది పాల్గొనగా ప్రభుత్వ మద్దతు ధర రూ.51,29,700గా నిర్ణయించి పాట మొదలుపెట్టడంతో ఉపేందర్‌రెడ్డి అత్యధికంగా పాడారు. ఎంపీఓ రాంచందర్‌రావు, గ్రామ కార్యదర్శి హరీష్ తదితరులు పాల్గొన్నారు. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు కల్లూరు/కల్లూరు రూరల్: మండలంలోని కొర్లగూడెంకు చెందిన మహిళ బైరెడ్డి పద్మావతి సోమవారం తన ఇంటి ముందు పని చేసుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి 25 గ్రాముల బంగారం గొలుసు లాక్కుని పారిపోయారు. కన్నుమూసి తెరిచేలోగా నిందితులు పారిపోయారని బాధితురాలు వాపోయింది. రూ.లక్షకు పైగా విలు వైన గొలుసు చోరీపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. -
నేత్రపర్వంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ దివ్యక్షేత్రమైన శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి(గుట్ట) కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ సోమవారం సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది. స్వామి జన్మనక్షత్రం(స్వాతి) నిర్వహించే ఈ గిరి ప్రదక్షిణ గత నెలలో మొదలుకాగా ఈసారి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామిని ఆలయం నుంచి పల్లకీపైకి చేర్చి గుట్ట కిందకు తీసుకొచ్చాక భజనలు, భజంత్రీలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ చేశారు. ఈసందర్భంగా భక్తులు నృసింహ నామ స్మరణతో మైమరిచిపోయారు. ప్రదక్షిణ పూర్తయ్యాక గుట్టపై ఆలయం పక్కనే రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని అర్చకులు వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన భక్తులు -
అన్ని రైళ్లూ ఆలస్యమే !
● గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు ● మూడో లైన్ పనులే కారణమంటున్న అధికారులు ● పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇక్కట్లు 14వ తేదీ రాత్రికి బదులు 15న తెల్లవారుజామున ఒంటి గంటకు తిరుపతికి చేరిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ (రన్నింగ్ స్టేటస్)ఖమ్మం రాపర్తినగర్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడాది కాలంగా కొనసాగుతున్న మూడో లైన్ నిర్మాణ పనులు ప్రయాణికులకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. రోజుల తరబడి రైళ్లు రద్దు చేయడం.. మిగతా రోజుల్లో గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదంతా ప్రహసనంగా భావిస్తున్న పలువురు రైలు ప్రయాణానికి దూరంగా ఉంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణాన్ని ఎంచుకున్నా సమయానికి గమ్యస్థానాలకు చేరలేక... ఆలస్యం కారణంగా సమయం కోల్పోతున్నారు. ఖమ్మం మీదుగా 107 రైళ్లు ఖమ్మం రైల్వేస్టేషన్ మీదుగా 107 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇందులో 83 రైళ్లకే ఇక్కడ హాల్టింగ్ ఉంది. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులు కృష్ణా, పద్మావతి తదితర రైళ్లను ఎంచుకుంటుండగా గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ, కోణార్క్, హౌరా, గౌతమి, పద్మావతి, చార్మినార్, జీ.టీ, వందేభారత్, మచిలీపట్నం తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రోజుకు 13వేల మంది తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే రద్దయినప్పుడు కాకుండా మిగతా రోజుల్లో దాదాపు అన్ని రైళ్లు నిర్ణీత సమయానికి మించి గంట, రెండు గంటలు ఒక్కోసారి అంతకు మించి ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఎక్కువమంది రాకపోకలు సాగించే కృష్ణా, గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పిల్లాపాపలతో ముందుగానే స్టేషన్లకు చేరుకుంటున్న వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మూడో రైల్వేలైన్ నిర్మాణానికి తోడు స్టేషన్లలోనూ అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో కూర్చునేందుకు సరిపడ బల్లలు లేక వారి వస్థలు మరింత పెరుగుతున్నాయి. ఎప్పుడు వెళ్తామో.. ఏమో ఏడాదికాలంగా ఖమ్మం మీదుగా వెళ్లే రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవాడాకి మూడే లైన్ నిర్మాణ పనులే కారణమని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, చాలా మంది తిరుపతి వెళ్లేందుకు కృష్ణా ఎక్స్్ప్రెస్ను ఎంచుకుంటారు. నిర్ణీత సమయానికి ఈ రైలు నడిస్తే ఉదయం ఖమ్మంకు 10గంటలకు వచ్చి తిరుపతికి రాత్రి 9–40గంటలకు చేరాలి. కానీ గంటల తరబడి ఆలస్యంతో తిరుపతి వెళ్లేసరికి ఒక్కోరోజు అర్ధరాత్రి 12, ఒంటి గంట దాటుతోంది. దీంతో ఆ సమయాన తిరుమల వెళ్లడానికి బస్సులు లేక స్టేషన్, ఆరుబయట వేచి ఉండాల్సి వస్తోంది. ఇక దర్శనం అనంతరం తిరుగు ప్రయాణానికి సైతం ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్న కొందరికి దర్శనం ఆలస్యమై వారు బయలుదేరాల్సిన రైలు అందుకోలేకపోతున్నారు. ప్రతిరోజు ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాఫీగా నడిస్తే ఖమ్మం స్టేషన్‌కు ఉదయం 10గంటలకు చేరాలి. అయితే, గత శుక్రవారం నాలుగున్నర గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 2–30గంటలకు చేరింది. ఇదే రైలు రాత్రి 9–40గంటలకు తిరుపతి చేరుకోవాల్సి ఉన్నా ఆలస్యం కారణంగా అర్ధరాత్రి 12–50 అయింది. దీంతో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన భక్తులు స్టేషన్లోనే పడిగాపులు కాసి శనివారం ఉదయం కొండపైకి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇదే రైలు ఆదివారం 2–20గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 12–20కి, సోమవారం 1–10గంటల ఆలస్యంగా 11–10గంటలకు ఖమ్మం చేరుకుంది. ప్రతిరోజు తిరుపతి – ఆదిలాబాద్ మార్గంలో నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఖమ్మంకు మధ్యాహ్నం 2–51కి రావాలి. కానీ గురువారం మూడు గంటల ఆలస్యంతో సాయంత్రం 5–50కి, శుక్రవారం గంటన్నర ఆలస్యంతో గంటలకు 4–20కి, శనివారం 3–10 గంటల ఆలస్యంతో సాయంత్రం 6గంటలకు వచ్చింది. అలాగే, ఆదివారం 2–50గంటల ఆలస్యంతో సాయంత్రం 5–40కు, సోమవారం కూడా 2–50గంటల ఆలస్యంగా సాయంత్రం 5–40కి చేరింది. గుంటూరు – సికింద్రాబాద్ మధ్య ప్రతిరోజు నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఖమ్మంలో షెడ్యూల్ ఉదయం 8–34గంటలు కాగా శుక్రవారం 40నిమిషాల ఆలస్యంతో 9–15కు వచ్చింది.పనులతో తగ్గిన రైళ్ల వేగం మూడో మూడో లైన్ పనుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. మూడో లైన్ నిర్మాణం పూర్తయితే అన్ని రైళ్లు కచ్చితమైన సమయానికి నడుస్తాయి. – ఎం.డీ.జాఫర్, రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్, ఖమ్మం -
మధ్య గేట్ వద్ద అండర్ పాస్ నిర్మించండి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంను రెండు చీలుస్తూ వెళ్తున్న రైల్వే లైన్లో భాగంగా మధ్య గేట్ వద్ద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో సోమవారం ఆయనకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కమాన్‌బజార్, గాంధీచౌక్ ప్రాంతాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలకు ప్రధాన మార్గమైన గేట్‌ను నాలుగు నెలలుగా మూసేయడంతో వ్యాపార లావాదేవీలు స్తంభిస్తున్నాయని తెలిపారు. కాగా, రైల్వే శాఖపై రాజ్యసభలో జరిగిన చర్చలోనూ ఎంపీ రవిచంద్ర ఈ అంశాన్ని ప్రస్తావించారు. మూడో లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచడమే కాక గేట్ స్థానంలో ఆర్ఓబీ లేదా అండర్ పాస్ నిర్మించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ వినతి -
స్నేహతుడి పాడే మోసిన మాజీ ఎంపీ
ఎర్రుపాలెం: మండల కేంద్రానికి చెందిన కూరగాయల వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు జానకి వెంకటశివ (45) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. ఆదివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితుడు, ఏపీ రాష్ట్రానికి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్.. పాడే మోశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డితోపాటు బండారు నర్సింహారావు, చావా రామకృష్ణ పాల్గొన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి ఖమ్మంమయూరిసెంటర్: విద్యారంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సభ్యులు ఇటికాల రామకృష్ణ కోరారు. ఆదివారం ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి ఎన్నో చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించడం లేదని, దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని వాపోయారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఖమ్మంలో యూనివర్సిటీ ఎర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, దీనిని అమలు చేయాలన్నారు. సమీకృత గురుకులాల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేయడమేనని రామకృష్ణ ఆరోపించారు. సమావేశంలో లక్ష్మణ్, మధు, శివనాయక్, మనోజ్, గోపి, ప్రతాప్, నరేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. లోక్యాతండాలో ముగిసిన హోలీకూసుమంచి: మండలంలోని లోక్యాతండాలో మూడు రోజుల హోలీ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. తండాలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించారు. తండావాసులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, డప్పులు వాయిస్తూ ఆట పాటలతో ఆనందంగా గడిపారు. మహిళలు సైతం నృత్యం చేస్తూ సందడి చేశారు. దేవాలయాల నిర్మాణాలకు విరాళం కామేపల్లి: మండలంలోని మర్రిగూడెం, తాళ్లగూడెం, కెప్టెన్‌బంజర గ్రామాల్లోని దేవాలయాల నిర్మాణాలకు మర్రిగూడెం గ్రామానికి చెందిన డీఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దిరిశాల నరేశ్చౌదరి ఆదివారం కమిటీ సభ్యులకు విరాళాలు అందజేశారు. కెప్టెన్బంజరలోని శ్రీ రామాలయంలో ధ్వజస్తంభానికి, మర్రిగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి తొలుత రూ.3 లక్షలు కమిటీ సభ్యులకు అందజేశారు. తాళ్లగూడెంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పి కమిటీ సభ్యులకు రూ.2 లక్షల నగదును అందజేశారు. దీంతో గ్రామస్తులు దాత నరేశ్చౌదరిని సత్కరించారు. కార్యక్రమంలో దిరిశాల ధనమ్మ, తోటకూరి శివయ్య, నల్లమోతు లక్ష్మయ్య, నల్లమోతు వెంకటనర్సయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పేకాటస్థావరంపై దాడి ఎర్రుపాలెం: మండలంలోని కాచవరం సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా మొర్సుమల్లి గ్రామానికి చెందిన ఆరుగురు కాచవరం సమీపంలో పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.3 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
ఒకరోజు ఆదాయం రూ.21, 945పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 339 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.11,625, 250 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.10, 320 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు టెస్ట్‌లు గుండాల: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్పోర్ట్స్ పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు కాచనపల్లిలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిన్నెరసాని, కాచనపల్లి, బోయినపల్లి మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలో ప్రవేశాల కోసం సోమవారం కాచనపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారని, అవకాశాన్ని నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, తీసుకురావాలని, టీషర్టుతో హాజరు కావాలని పేర్కొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
మధిర: మధిర పట్టణంలో జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ మొదటి బ్యాచ్ 1970–71 చదివిన వారు ఆదివారం కోనస్ వీ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఆనాడు చదువుకున్న తీపి గుర్తులును నెమరు వేసుకున్నారు. 72 మందికి గనాఉ 60 మందికిపైగా హాజరయ్యారు. బస్సు, కారుడ్రైవర్ పరస్పర దాడులు పాల్వంచరూరల్: బస్సు, కారు ఢీకొనడంతో రెండు వాహనాల డ్రైవర్లు ఒకరిపైఒకరు దాడులు చేసుకున్న ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్దమ్మగుడి వద్ద బీసీయం జాతీయ రహదారిపై భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారుకు రాసుకపోయింది. దీంతో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బదినడంతో కారుడ్రైవర్ నవీన్ బస్సుడ్రైవర్ రమేశ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు డ్రైవర్లు ఫిర్యాదు చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ సతీశ్ వెల్లడించారు. వ్యక్తి అదృశ్యంపై కేసు దుమ్ముగూడెం: మండలంలోని జడ్.వీరభద్రారం గ్రామానికి చెందిన కొమరం రాముడు కనిపించకుండా పోయిన ఘటనపై ఎస్ఐ వెంకటప్పయ్య ఆదివారం కేసు నమోదు చేశారు. కొమరం రాముడు జడ్.వీరభద్రారం గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. వివాహం అనంతరం అతను కనిపించకపోవడంతో అతని భార్య లక్ష్మీదేవి ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
డీఎస్పీ జవహర్లాల్ మృతి తీరని లోటు
రఘునాథపాలెం: ప్రజలకెంతో సేవ చేసే మంచి అధికారిని కోల్పోవడం తీరని లోటు అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, విత్తన, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ సోదరుడు డీఎస్పీ జవహర్లాల్ సంతాపసభ ఆదివారం మండలంలోని ఆయన స్వగ్రామం ఈర్లపుడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ చిత్రపటానికి పూలమాల వేసిన వారు మాట్లాడారు. నివాళులర్పించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ వై.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మదనలాల్, లింగాల కమల్‌రాజు, గుండాల కృష్ణ, నాగండ్ల కోటేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్‌కుమార్, గుత్తా రవి, మెంటం రామారావు, చెరుకూరి ప్రదీప్, తాత వెంకటేశ్వర్లు, దయాకర్, మాటేటి కిరణ్, అబ్బాస్, నరసింహారావు, వెంకటేశ్వర్లు, చిన్నా, శ్రీనివాస్, వాంకుడోత్ దీపక్, పుచ్చకాయల వీరభద్రం, పోటు లెనిన్, మల్లికార్జున్‌రావు, బానోతు మంజుల, తనయ్రాదే, ఆకాంక్ష, రామకోటి, సుందర్‌లాల్, మంగీలాల్, మోతీలాల్, మణిలాల్ తదితరులు ఉన్నారు. -
ఘనంగా పసుపు దంచే వేడుక
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(గుట్ట)పై మార్చి 24వ తేదీన జరగనున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం పసుపు దంచే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేశ్‌శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు ఆధ్వర్యంలో సుమారు 800 నుంచి 1000 మంది మహిళలు పసుపుకొట్టి స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కలిపారు. ఈ సందర్భంగా స్వామి కల్యాణ విశేషాలను తెలుపుతూ వీడియో టీజర్‌ను వికాస తరంగిణి జిల్లా అధ్యక్షురాలు దేవినేని రోజారమణి ఆవిష్కరించారు. ఈ నెల 22 జరగనున్న శ్రీనివాస గిరి సంకీర్తన కరపత్రాన్ని కంచర్ల భార్గవ్ – శ్రావ్య, బుగ్గవీటి ఫణీంద్రబాబు – విజయలక్ష్మి దంపతులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరుట్ల లక్ష్మణాచార్యులు, పసుమర్తి వెంకటేశ్వరరావు, కందుకూరి రామకృష్ణ, తాటికొండ శ్రీలత, లక్ష్మిరెడ్డి, వంకదారు నర్సింహకుమార్, బండి వెంకటేశ్వర్లు, కంఠాల వెంకటేశ్వరరావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, మిట్టపల్లి నర్సింహారావు, పురుషోత్తం, జమ్ముల సీతారామిరెడ్డి, రమేశ్, రాంజీఅంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు. 24న శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం -
‘రాజీవ్ యువ వికాసానికి’ దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: గిరిజన యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఆసక్తి గల గిరిజన నిరుద్యోగులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈనెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు 94928 06325, 98485 22841 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని, లేదా తమ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–16, 20, సీనియర్ పురుషుల, మహిళల విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా జట్టుకు ఎంపికై న వారిని ప్రకటించారు. అండర్–16 బాలుర జట్టులో వి.చరణ్‌గౌడ్(కొణిజర్ల), ఆర్. భరత్(పాతర్లపాడు), అండర్–20 బాలుర విభాగంలో ఎ.గౌతమ్(వైరా), డి.వివేక్‌చంద్ర(పాలేరు), ఎస్.గోపి(ఖమ్మం), బి.వీరభద్రం(ఖమ్మం), పురుషుల విభాగంలో వి.వేణు, ఎం.మురళి(కుంచపర్తి), అండర్–20 బాలికల విభాగంలో డి.బిందు (ఖమ్మం), జె.నవ్య(వల్లాపురం), మహిళల్లో ఎ.మైథీలి(ఖమ్మం) ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మందుల వెంకటేశ్వర్లు, కోచ్ ఎండీ. గౌస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలరించిన ‘స్వేచ్ఛ’ఖమ్మంగాంధీచౌక్: నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘స్వేచ్ఛ’ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. పరమాత్మ శివరాం రచించిన ఈ నాటికకు బీఎం రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో సాంస్కృతిక రంగం పాత్ర విశేష మైందన్నారు. మిత్ర గ్రూపు చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, ఎంఏ జబ్బార్ తదితరులు మాట్లాడుతూ నెల నెలా వెన్నెల కార్యక్రమాలను కొనియాడారు. ఆర్క్స్ సంస్థ కార్యదర్శి ఏఎస్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షుడు నాగబత్తిని రవి, ప్రజానాట్యమండలి అధ్యక్ష, కార్యదర్శులు నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నాడు కళ .. నేడు వ్యథ !
పచ్చని ఆకులు, పలు రకాల పూలతో ఓ పల్లె ప్రకృతి వనం కొద్ది నెలల క్రితం వరకు కళకళలాడింది. ప్రస్తుతం అందులో వృక్షాలన్నీ ఎండి హరిత కళ మాయమైంది. అశ్వారావుపేట మండలం పాత మామిళ్లవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగేళ్ల క్రితం పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయగా, వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ మొక్కలు ఏపుగా పెరిగి మూడు నెలల క్రితం పచ్చని ఆకులు, వివిధ రకాల పుష్పాలతో ఆహ్లాదాన్ని పంచాయి. ఇటీవల ఎండలు పెరగడంతో పచ్చదనం మాయమై మొక్కలన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. – అశ్వారావుపేటరూరల్ -
సమస్యలు పరిష్కారం కాక బాధితుల ఆందోళన
● దరఖాస్తులు ఇవ్వడం.. ఆపై ప్రదక్షిణలు ● కలెక్టరేట్లో 14 నెలల్లో 1,084 దరఖాస్తుల పెండింగ్ ● మండల స్థాయి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నా అదే పరిస్థితిప్రతీ వారం కిటకిటే.. ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు. మండల స్థాయిలో తమ గోడు వెల్లబోసుకున్నా పరిష్కారం కాని సమస్యలపై బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కిటకిటలాడుతోంది. వందల సమస్యలు ఈ ప్రజావాణిని తాకుతున్నాయి. ఇక్కడ కొన్నింటిని వెంటనే పరిష్కరిస్తున్న ఉన్నతాధికారులు.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన వాటిని ఆయా మండలాలకు పంపుతున్నారు. అయితే అక్కడికి వెళ్లే దరఖాస్తులు త్వరగా పరిష్కారం కావడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చేసేదేమీ లేక మళ్లీ ఉన్నతాధికారులకు సమస్యను నివేదించేందుకు వస్తున్నామని చెబుతున్నారు. భూ సమస్యలే అధికం.. జిల్లా వ్యాప్తంగా అత్యధిక మంది ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఇస్తున్నారు. ఏడాది కాలంలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై 1,876 మంది ఫిర్యాదు చేయగా.. 1,141 దరఖాస్తులను డిస్పోజ్ చేశారు. 51 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయి. 684 దరఖాస్తులు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. భూ సమస్యలు కొన్ని సంక్లిష్టంగా ఉంటుండగా పరిష్కారానికి కొంత సమయం పడుతోంది. తమ భూమి ఆక్రమించారని, పాస్‌బుక్‌లో పేరు నమోదు కాలేదని, తన భూమిని వేరే వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఇలాంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి. వాటిని ఆయా తహసీల్దార్లకు పంపిస్తుండగా అక్కడ పరిష్కారం కాకపోవడంతో విసుగెత్తిన బాధితులు ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెండింగ్‌లో 1,084 అర్జీలు.. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 14 నెలల్లో వచ్చిన 3,642 అర్జీలకు 2,453 పరిష్కారం కాగా.. 1,084 పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కొన్ని శాఖలకు సంబంధించి అసలే పరిష్కారం కాకపోవడం గమనార్హం. టీఎస్ఈడబ్ల్యూఐడీసీ (తెలంగాణ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కి 17 అర్జీలు రాగా.. అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. టీజీఎస్ ఆర్టీసీకి వచ్చిన 12 దరఖాస్తులదీ అదే పరిస్థితి. దేవాదాయ శాఖలో 7 ఫిర్యాదులు రాగా..రెండే పరిష్కారమయ్యాయి. స్టేట్ ఆడిట్‌కు సంబంధించి రెండుకు రెండు, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ)లో 38 దరఖాస్తులకు 35, ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో 123 దరఖాస్తులకు 90, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో 157కు 123, కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో 86కు 73, సింగరేణిలో 23 దరఖాస్తులకు 19 పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాది కాలంలో 20లోపు వచ్చిన దరఖాస్తులను కూడా పరిష్కరించకపోవడం గమనార్హం. మండలాల్లోనూ అదేతీరు స్థానికంగా మండలాల్లో పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలపై ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిని గమనించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ గతేడాది ఆగస్ట్ నుంచి మండల స్థాయి సమస్యలను అక్కడే పరిష్కరించేందుకు మండలాల్లో ప్రజావాణిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 21 మండలాల్లో 994 ఫిర్యాదులు రాగా.. 811 పరిష్కరించారు. 183 పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూకి సంబంధించి 657 దరఖాస్తులు రాగా.. 558 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. 99 పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఇతర శాఖలకు సంబంధించి 337 దరఖాస్తులు రాగా.. 253 పరిష్కారం అయ్యాయి. 84 పెండింగ్‌లో ఉన్నాయి.శాఖ మొత్తం డిస్పోజ్ ఫార్వర్డ్ పెండింగ్ 36 శాఖలు 1,304 936 42 326 రెవెన్యూ 1,876 1,141 51 684 ఎంపీడీఓలు 462 376 12 74మొత్తం 3,642 2,453 105 1,084గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది మార్చి 10 వరకు కలెక్టరేట్ ప్రజావాణికి అందిన దరఖాస్తుల పరిస్థితికలెక్టరేట్ నుంచి ఎండార్స్ చేసిన దరఖాస్తుల్లో ఎక్కువ పెండింగ్‌లో ఉన్న తహసీళ్లుతహసీల్ దరఖాస్తులు ఖమ్మంఅర్బన్ 123 కూసుమంచి 73 రఘునాథపాలెం 60 తిరుమలాయపాలెం 28 పెనుబల్లి 28 కల్లూరు 27 వేంసూరు 25కారణం తెలియక.. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి మొక్కుబడి కార్యక్రమంగా మారిందనే చర్చ సాగుతోంది. ప్రతి సోమవారం ఫిర్యాదుదారులు రావడం, అధికారులు దరఖాస్తులు స్వీకరించడం మామూలైంది. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పలు ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొని ఆర్జీలను స్వీకరించి.. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలపాలి. కానీ దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు.. సంబంధిత కార్యాలయాలకు పంపడంతోనే సరిపోతోంది. అక్కడ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడం ఫిర్యాదుదారులకు తలకు మించిన భారమవుతోంది. -
ప్రజా సమస్యలపై పోరాడాలి
ఖమ్మంమయూరిసెంటర్ : బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని, పాలకవర్గ సమావేశాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తాలని అన్నారు. ప్రతిపక్ష పాత్ర పటిష్టంగా పోషించి నగరాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్పొరేటర్లకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, ఎవరి బెదిరింపులకూ భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. అనంతరం బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, ఎస్కే.మక్బూల్‌ను పువ్వాడ అభినందించారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో.. ఖమ్మం ఖిల్లా మజీద్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో అజయ్‌కుమార్ పాల్గొన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లిం మైనారిటీలు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కమర్, కార్పొరేటర్ మక్బుల్, షౌకత్ ఆలీ, నాగండ్ల కోటేశ్వరరావు, బిక్కసాని జస్వంత్, నజీముద్దీన్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్ పాల్గొన్నారు.బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాజీ మంత్రి పువ్వాడ సూచన -
ఆ మొక్కలూ ఆఫ్టైపే..
స్పందించని ఆయిల్ ఫెడ్ యాజమాన్యం దమ్మపేట: పామాయిల్ సాగులో కొన్ని మొక్కలు చనిపోగా, వాటి స్థానంలో ఆయిల్ ఫెడ్ నర్సరీ అందజేసిన మొక్కలు కూడా ఆఫ్‌టైప్ కావడంతో రైతులు నిర్ఘాంతపోతున్నారు. మండలంలోని జగ్గారం గ్రామానికి చెందిన రైతు చెలికాని సూరిబాబు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న 30 ఎకరాల భూమిలో ఏడేళ్ల నుంచి పామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల కిందట తోటలో 50 మొక్కలు చనిపోగా, వాటి స్థానంలో ఆయిల్ ఫెడ్ నర్సరీ నుంచి తెచ్చిన కొత్త మొక్కలను నాటి, సాగు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడేళ్ల సాగు అనంతరం 50 మొక్కల్లో 30 మొక్కలు ఆఫ్టైప్కి చెందినవని తెలిసింది. ఈ మొక్కలకు ఎలాంటి గెలల కాపు లేకపోగా, వాటి సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం వృథాగా భావించిన రైతు, వాటిని నరకడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అసిస్టెంటు, ఉన్నతాధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించే వరకు నరకవద్దని సూచించారు. రోజులు గడుస్తున్నా ఏ ఒక్క ఉన్నతాధికారి తోట సందర్శనకు వచ్చిందే లేదని రైతు వాపోతున్నాడు. ఈ ఆఫ్‌టైప్ మొక్కలతో రూ.లక్షల్లో రైతులకు నష్టం జరుగుతున్నప్పటికీ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నాడు. ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. -
మక్కల కొనుగోళ్లకు రెడీ..
● మార్క్‌ఫెడ్ ద్వారా రెండు జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటు ● వచ్చేనెల రెండో వారం నుంచి కొనుగోళ్లకు సిద్ధం ● ఉమ్మడి జిల్లాలో 1.27లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుఖమ్మంవ్యవసాయం: యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోళ్లకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయించగా.. సీజన్ సమీపించడంతో మార్క్‌ఫెడ్ రాష్ట్ర అధికారులు ఇటీవల జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల గుర్తింపు, రవాణా తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయాన కొనుగోలు చేసిన పంట రవాణాకు సంబంధించి గత విధానం కాకుండా ఆన్లైన్ టెండర్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. అత్యధికంగా జిల్లాలో... రాష్ట్రంలో మొక్కజొన్న యాసంగి పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం కూడా ఒకటి. మొక్కజొన్నలను ప్రధానంగా కోళ్ల పరిశ్రమల్లో దాణాగా వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవల కోళ్లకు వైరస్ వ్యాపిస్తోందని పరిశ్రమల యజమానులు వాటి ఉత్పత్తిని తగ్గించడంతో ప్రైవేట్ మార్కెట్లో మక్కల ధరపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మక్కలకు క్వింటాకు రూ. 2,225గా మద్దతు ధర నిర్ణయించింది. కానీ ప్రైవేట్ మార్కెట్లో క్వింటా ధర రూ.2,150 మించకపోగా, భవిష్యత్ పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. దీంతో రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువే.. ప్రస్తుత యాసంగి సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.27 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. నీటి వనరుల ఆధారంగా ఖమ్మం జిల్లాలో 94 వేల ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో 33 వేల ఎకరాల్లో పంట వేశారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 80 వేల ఎకరాల్లో పంట సాగైతే ఈ ఏడాది మరో 50 వేల ఎకరాల్లో సాగవడం విశేషం. వానాకాలం కురిసిన వర్షాలతో జలాశయాల్లో నీరు ఉండడం, జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ నుంచి యాసంగి పంటలకు నీరు విడుదల కావడంతో వరి, మొక్కజొన్న పెద్దమొత్తంలో సాగు చేశారు. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, చింతకాని, బోనకల్, వైరా, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం, తిరుమలాయపాలెం, ఏన్కూరు, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి తదితర మండలాల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, పాల్వంచ, చంద్రుగొండ, సుజాతనగర్, జూలూరుపాడు, బూర్గంపాడు తదితర మండలాల్లో మక్క పంటను వేశారు. ఏప్రిల్ మొదటి, రెండో వారం నుంచి పంట చేతికందే అవకాశం ఉంది. రైతులకు అందుబాటులో ఉండేలా... ఉమ్మడి జిల్లాలో పంట సాగైన ప్రాంతాల ఆధారంగా రైతులకు సౌకర్యంగా ఉండేలా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది ఖమ్మం జిల్లాలో 34 కేంద్రాలు ఏర్పాటు చేసి 64,413 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో ఐదు కేంద్రాల ద్వారా 3,344 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం పెరగడతో ఖమ్మం జిల్లాలో 45 – 50 వరకు, భద్రాద్రి జిల్లాలో 15 కేంద్రాల వరకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.సన్నాహాలు చేస్తున్నాం... యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోళ్లకు సమాయత్తమవుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో పంట రవాణాకు ఆన్లైన్ టెండరింగ్ విధానంపై దృష్టి సారించాం. పంట సాగు ఆధారంగా అక్కడ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తాం. – సునీత, మార్క్‌ఫెడ్ మేనేజర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
తాగునీటిలో విషప్రయోగం
తిరుమలాయపాలెం: కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుని అంతమొందించేందుకు తాగునీటిలో విషం కలిపి హత్య చేసిన ఘటన మండలంలోని సోలీపురం శివారు పీక్యాతండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోతు రామోజీ (59) కాకరవాయి గ్రామంలో ఓ రైతు భూమిని కౌలుకి తీసుకున్నాడు. రామోజీ పక్కనే ఇదే తండాకు చెందిన బానోతు రవి మరో రైతు భూమిని అధిక ధరకు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో రామోజీ చేస్తున్న భూమిని కౌలుకి తీసుకునేందుకు కుట్ర పన్నాడు. కొన్నిసార్లు వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. గత నెల (ఫిబ్రవరి) 12న రామోజీ చేను వద్ద తాగునీటి క్యాన్ని పెట్టుకోగా ఎలాంటి అనుమానం రాకుండా రవి విషం కలిపాడు. ఇది గమనించని రామోజీ ఆ నీటిని సేవించి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా విషం కలిపిన నీటిని సేవించినట్లు గుర్తించి రామోజీ కుమారుడు కొందరు అనుమానితులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బానోత్ రవిపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా తాగునీటిలో విషం కలిపింది తానేనని ఒప్పుకున్నాడు. చికిత్స పొందుతున్న రామోజీ శనివారం సాయంత్రం మృతిచెందాడు. దీంతో పీక్యాతండాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కూచిపూడి జగదీశ్ తెలిపారు. నీరు సేవించిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి -
విద్యార్థుల్లో ‘మేధ’స్సు పెంచేలా...
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన ● పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలోని ఏడు పాఠశాలల్లో అమలు.. ● ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ ● ఇటీవల రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థికి అభినందనలు ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ – కృత్రిమ మేధ)కి ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ క్రమాన విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఈ విధానంలో బోధన చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఏడు పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనను గత నెల 24 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. విద్యార్థులకు కొనసాగుతున్న ఈ బోధనపై ఈనెల 11న హైదరాబాద్‌లో అధికారులకు శిక్షణ ఏర్పాటుచేయగా... జిల్లా విద్యార్థి అనర్గళంగా మాట్లాడడంతో అభినందనలు దక్కాయి. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్.. ఏఐ బోధనపైనా శ్రద్ధ చూపుతుండడంతో సత్ఫలితాలు రావడం మొదలైందని చెబుతున్నారు. 70 మంది విద్యార్థులకు.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి కూడా ఉపయోగించుకుని విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐని ఉపయోగిస్తోంది. జిల్లాలో ఏఐ బోధనకు ఏడు పాఠశాలలు ఎంపిక కాగా.. ఇందులో ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ)లో కొంత బలహీనంగా ఉన్న విద్యార్థులను ఎంపిక చేశారు. పాఠశాలకు 10మంది చొప్పున మొత్తం 70 మందికి ఏఐ ద్వారా బోధిస్తున్నారు. దీని ద్వారా వారు ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకునే వీలుంటుంది. ఆపై ఇతర విద్యార్థులతో సమానంగా సబ్జెక్ట్‌పై పట్టు సాధించనున్నారు. వారానికి 40 నిమిషాలు.. విద్యార్థులకు వారానికి 40 నిముషాల చొప్పున ఈ ఏఐ విధానంలో బోధన సాగిస్తున్నారు. ఇవి 20 నిమిషాల చొప్పున రెండు సెషన్లు ఉంటాయి. 20 నిమిషాలు తెలుగు, 20 నిమిషాలు మ్యాథ్స్ ప్రస్తుతం బోధిస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన సబ్జెక్ట్‌లు కూడా బోధించనున్నారు. విద్యార్థులు తమకు అర్థమయ్యే వరకు ఈ సబ్జెక్ట్‌లను నేర్చుకునేందుకు ఏఐ విధానంలో అవకాశం ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడడంతో పాటు గణితంపై పట్టు సాధించేందుకు ఏఐ దోహదపడుతుంది. ఇక్కడ జరుగుతున్న బోధన అనుకూల ఫలితాలిస్తే మిగిలిన పాఠశాలల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే కంప్యూటర్లు, సామగ్రి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సత్తుపల్లి మండలంలోని సిద్ధారం ఎంపీయూపీఎస్, సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ ఎంపీపీఎస్, ఖమ్మంలోని ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాల, పాండురంగాపురం ఎంపీపీఎస్, మల్లెమడుగు ఎంపీపీఎస్‌తో పాటు నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం స్కూల్లో ఏఐ ఆధారిత బోధన మొదలైంది. ఈ పాఠశాలలకు రెండు, మూడు రోజుల్లో అదనంగా కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రి అందించనున్నట్లు జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి కె.రవికుమార్ తెలిపారు. ఈనెల 20లోగా ఇవి పాఠశాలలకు చేరనుండడంతో బోధన ఊపందుకుంటుందని భావిస్తున్నారు.సత్తా చాటిన జిల్లా విద్యార్థి.. ఏఐ బోధన సాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నేర్చుకున్న విధానంపై మంచి స్పందన వచ్చింది. దీంతో ఇతర జిల్లాల అధికారులకు కూడా ఈనెల 11న హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాలోని నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని ఎంపీపీఎస్‌లో 4వ తరగతి చదువుతున్న పవన్‌సాయి పాల్గొన్నాడు. సాయిని స్టేజీపైకి పిలవగా.. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ జి.రమేష్.. ఇన్నాళ్లూ ఏం నేర్చుకున్నావని ఆరా తీశారు. దీంతో విద్యార్థి నేర్చుకున్న అంశాలను స్పష్టంగా చెప్పడంతో అభినందనలు దక్కాయి. కాగా, జిల్లా నుంచి డీఈఓ సోమశేఖరశర్మ, ఏఎంఓ రవికుమార్‌తో పాటు మరో ముగ్గురు కూడా పాల్గొన్నారు. -
ఔరా.. వైరా..
తడారిన భూములకు ఊపిరి పోస్తోంది. ఎండిన గొంతుల దాహార్తి తీరుస్తోంది. అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది.. లక్షలాది బతుకులకు అన్నం పెడుతోంది. పర్యాటక కేంద్రంగా కూడా వరి్ధల్లుతున్న ఆ జలాశయం వయసు వందేళ్లు.. ఖమ్మం జిల్లాలో అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేరొందిన వైరా జలాశయంపై కథనమిది. వైరా: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన వైరా జలాశయం.. సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. కల్పతరువుగా నిలుస్తున్న ఈ జలాశయాన్ని స్వాతంత్య్రానికి ముందు నైజాం నవాబు నిర్మించారు. వృథా నీటిని అరికట్టేలా.. తొలినాళ్లలో ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి అటవీ ప్రాంతం నుంచి ప్రవహించే నిమ్మవాగు, ఏన్కూరు మండలం నుంచి ప్రవహించే గండివాగు, గిన్నెలవాగు, పెద్దవాగుల నుంచి వచ్చే మరో ఏరు.. వైరా సమీపాన కలిసి అతిపెద్ద ప్రవాహంగా తయారై వృ«థాగా పోయేది. ఈ పరిస్థితుల్లో ప్రవాహానికి అడ్డుకట్ట నిర్మించి వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలని.. నాటి పాలకుడైన నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆలోచన చేశారు. దీంతో సాయిద్ జాదా నవాబ్ అలావత్జంగ్ బçహదూర్ 1923వ సంవత్సరంలో శంకుస్థాపన చేయగా అప్పటి నిజాం ప్రభుత్వ కార్యదర్శి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అయిన నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బçహదూర్ పర్యవేక్షణలో సుమారు రూ.36 లక్షలతో ఏడేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. డంగు సున్నం, రాయితో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా.. 274 చదరపు మైళ్ల భూమి ముంపునకు గురైంది. అలాగే, 130 చదరపు మైళ్ల భూమిని రైతుల నుంచి సేకరించి.. అప్పట్లోనే సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులుగా ఉన్నప్పుడు మొత్తం 60 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు 88 అడుగులు కాగా, పొడవు 5,800 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు 19 మైళ్ల దూరం ప్రవహిస్తూ.. 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాయి. కుడి కాల్వ 15 మైళ్ల దూరం ప్రవహించి 29 ఉపకాల్వల ద్వారా 16 వేల ఎకరాలు, ఎడమ కాల్వ ఐదు మైళ్ల దూరం ప్రవహిస్తూ 22 ఉప కాల్వల ద్వారా తొమ్మిది వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిoది. 1930లో కేవలం 12 వేల ఎకరాల భూములను సాగులోకి తెచ్చేలా డిజైన్ చేసినా ప్రస్తుతం రెండింతలుగా సాగవుతుండడం విశేషం. దాహార్తి తీరుస్తూ.. ఖమ్మం జిల్లాలోని వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, వేంసూరు, కొణిజర్ల, చింతకాని, ఏన్కూరు, పెనుబల్లి తదితర 11 మండలాల్లోని 420 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారానే తాగునీరు అందుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ రిజర్వాయర్ నుంచి ఫ్లోరైడ్ రహిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ కృషితో మహర్దశ.. జలయజ్ఞంలో భాగంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక కృషి వల్ల ఈ జలాశయం రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు అప్పట్లో రూ.51 కోట్లు మంజూరు చేయగా మహర్దశ పట్టింది. జలాశయం ఆధునికీకరణలో భాగంగా కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీత, సిమెంట్‌తో లైనింగ్ చేయించి కాల్వలు పటిష్టం చేశారు. దీంతో ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నం ఫలించింది. పర్యాటకంగానూ అభివృద్ధి రిజర్వాయర్ కట్టపై పచ్చిక బయళ్లు.. అందమైన పూల తోటలు.. చుట్టూ నీరు.. కొండపై నుంచి చూస్తే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మైమరిపింపజేస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తూ.. అందమైన సాయంత్రాలు గడిపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సూర్యోదయం లేదా సాయంసంధ్య వేళల్లో ఇక్కడి దృశ్యాలను తిలకించేందుకు రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి. ఈమేరకు పర్యాటక అభివృద్ధిలో భాగంగా పిల్లల పార్క్ నిర్మించి.. పూలతోటలు అభివృద్ధి చేయడమే కాక ప్రత్యేక టైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2006లో పర్యాటక శాఖ రూ.70 లక్షలు వెచ్చిoచింది. ఇక్కడ పలు టీవీ సీరియళ్ల షూటింగ్ కూడా జరగడం విశేషం. మత్స్యకారులకు జీవనోపాధి వైరా రిజర్వాయర్‌పై కొణిజర్ల, వైరా, తల్లాడ మండలాలకు చెందిన సుమారు 500 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడానికి.. ముందు నుంచే మత్స్యకారులు చేపలు, రొయ్య పిల్లలు వేసి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేటతో జీవనం సాగిస్తుంటారు. -
నిల్వ పంటకు రుణ సౌకర్యం
● పంట తాకట్టుపై విలువలో 75శాతం మేర రుణాలు ● ఆరు నెలల పాటు వడ్డీ మినహాయింపు ● ఖమ్మం జిల్లాకు రూ.10.30 కోట్ల నిధులు ఖమ్మంవ్యవసాయం: పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో నిల్వ చేసి రుణం పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ‘రైతు బంధు’ పేరిట ఈ పథకాన్ని మార్కెటింగ్ శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు రూ.10.30 కోట్ల నిధులు కేటాయించింది. 2013–14 నుంచి ఈ పథకం అమలులో ఉన్నా అంతగా ఆదరణ లభించడం లేదు. తొలుత కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిన పంటలకు మాత్రమే పథకాన్ని అమలు చేయగా, కరోనా సమయంలో మిర్చి రైతులకు ఉపయోగపడింది. 2020–21లో అత్యధికంగా జిల్లాలో 1,513 మంది రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి రూ.1,732.52 లక్షల మేర రుణం పొందారు. కాగా, ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండడంతో రైతులకు అవసరం రాకపోగా, పత్తి పంటకు మాత్రం అవకాశం లేదు. ఇక గత ఏడాది మిర్చికి మంచి ధర ఉండటంతో కేవలం 36 మంది రూ.65 లక్షలను రైతుబంధు పథకం కింద రుణం తీసుకున్నారు. ఈ ఏడాది మాత్రం మిర్చి ధర బాగా పతనమైన నేపథ్యాన రైతులు ‘రైతుబంధు’ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.. మార్కెట్ల వారీగా నిధుల కేటాయింపు రైతుబంధు పథకానికి మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెట్ల వారీగా నిధులను మంజూరు చేసింది. ఖమ్మం జిల్లాలోని ఎనిమిది మార్కెట్లకు గాను ఏన్కూరు మినహా మిగిలిన ఏడింటికి నిధులు అందాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రూ.5 కోట్లు, వైరాకు రూ.3 కోట్లు, మధిరకు రూ.కోటి, మద్దులపల్లికి రూ.50 లక్షలు, కల్లూరుకు రూ.50 లక్షలు, నేలకొండపల్లికి రూ.20 లక్షలు, సత్తుపల్లి మార్కెట్‌కు రూ.10 లక్షలు కేటాయించగా మద్దులపల్లి మార్కెట్ పరిధిలో 33 మంది రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.2 లక్షల రుణం.. ఆరు నెలలు వడ్డీ మినహాయింపు పంట నిల్వ ఆధారంగా ఒక్కో రైతుకు రూ.2 లక్షల మేర రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. రుణం కావాలనుకునే రైతులు పంటను గోదాంలు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి ధ్రువపత్రాలు సమర్పిస్తే అధికారులు ధర ఆధారంగా 75 శాతం మేర రుణంగా చెల్లిస్తారు. ఇది అత్యధికంగా రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఇక రుణాలకు ఆరు నెలల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. 180 రోజుల నుంచి 270 రోజుల వరకు 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. 270 రోజుల్లో రుణం చెల్లించి పంట తీసుకోకపోతే వేలంలో విక్రయించి వచ్చే నగదును మార్కెటింగ్ శాఖ జమ చేసుకుంటుంది. అంతేకాక నిల్వ చేసిన పంటకు బీమా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.సద్వినియోగం చేసుకోవాలి పండించిన పంటలను గోదాంలు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి రైతుబంధు ద్వారా రుణాలు పొందొచ్చు. పంట ధరల ఆధారంగా 75 శాతం మేర రుణంగా అందిస్తాం. గతంలో ధాన్యానికే వర్తింపజేసిన ఈ పథకాన్ని కరోనా తర్వాత మిర్చి పంటకు కూడా వర్తింపజేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.ఏ.అలీం, ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి -
వేగంగా మ్యాన్‌రైడింగ్ పనులు
● త్వరలోనే కేపీయూజీ మైన్‌లో అందుబాటులోకి... ● తీరనున్న కార్మికుల కష్టాలుమణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలోని కొండాపురం భూగర్భ గని(కేపీయూజీ)లో మ్యాన్ రైడింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరో పది రోజుల్లో మ్యాన్ రైడింగ్ అందుబాటులోకి రానుండగా, కార్మికుల ఇక్కట్లు తీరనున్నాయి. ప్రస్తుతం రోజుకు 1.2 కి.మీ. మేర గనిలోకి నడిచి వెళ్లాల్సి రావడంతో కార్మికుల పని గంటలపై ప్రభావం పడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ మిషనరీ హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎంఈహెచ్ఎల్) ఆధ్వర్యాన చేపట్టిన మ్యాన్ రైడింగ్ అందుబాటులోకి వస్తే అటు కార్మికుల ఇక్కట్లు తీరతాయని.. ఇటు ఉత్పత్తి మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ పనులు చాన్నాళ్ల క్రితమే పూర్తి కావాల్సి ఉన్నా డిసెంబర్లో ఏర్పడిన బుంగల కారణంగా ఆలస్యమైంది. పెరగనున్న ఉత్పత్తి ఆది నుంచి రకకాల కారణాలతో అవరోధాలు ఎదురవుతుండగా, బొగ్గు ఉత్పత్తి కోసం అధికారులు అవస్థలు పడుతున్న నేపథ్యాన కేపీయూజీ మైన్‌లో మ్యాన్ రైడింగ్ పూర్తయితే ఉత్పత్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడ లభించే జీ–6 గ్రేడ్ బొగ్గుకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో మ్యాన్ రైడింగ్ అందుబాటులోకి రాగానే కార్మికుల పనిగంటలు పెరుగుతాయని, తద్వారా నిర్దేశిత లక్ష్యాలు సునాయాసంగా సాధించొచ్చని చెబుతున్నారు. లక్ష్య సాధనకు కృషి గతంలో కోల్సీమ్స్ కారణంతో ఎస్ఎంఎస్ పనులు ఆగిపోవడం, ఆపై గని అంతర్భాగంలో బుంగ ఏర్పడడం వంటి కారణాలతో నిర్దేశిత లక్ష్యాలకు చేరువగా ఉత్పత్తి నమోదవుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే లక్ష టన్నుల లక్ష్యానికి మించి అదనంగా 41వేల టన్నులు ఉత్పత్తి సాధించారు. ప్రస్తుతం అధికారుల ప్రత్యేక దృష్టితో ఉత్పత్తి లక్ష్యాలు క్రమక్రమంగా పెంచుతూ ఈ ఏడాది 2.10లక్షల టన్నులుగా నిర్దేశించారు. అయితే, డిసెంబర్, జనవరిలో బుంగ ప్రభావం చూపినా, ప్రస్తుతం రోజుకు 500 టన్నుల బొగ్గు వెలికితీస్తున్నారు. దీంతో లక్ష్యంలో 1.60లక్షల టన్నుల మేర నమోదయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కాగా, మరో ఇరవై ఏళ్ల భవిష్యత్ ఉన్న కేపీయూజీలో మైన్ రైడింగ్ అందుబాటులోకి రానుండడంపై కార్మికులు, యూని యన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.త్వరలో అందుబాటులోకి... త్వరలోనే మ్యాన్ రైడింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తద్వారా గనిలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి లక్ష్య సాధన సులువవుతుంది. ఇక భూగర్భ గనిలో నీరు ఉబికిరావడం సాధారణమే అయినా బయటకు పంపింగ్ చేస్తూ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చూస్తున్నాం. – దుర్గం రాంచందర్, ఏరియా జీఎం -
భూగర్భ గనులే కీలకం
● సింగరేణిలో 100 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదుపై దృష్టి ● ఇటీవల రీజియన్లలో పర్యటించిన ఉన్నతాధికారులు ● ‘చైతన్య యాత్ర’ల పేరిట కార్మికులతో మమేకంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా త్వరలో ఆర్థిక సంవత్సరం ముగి యనున్నందున కార్మికులు గైర్హాజరు కాకుండా, నెలకు 20 మస్టర్లు తగ్గకుండా పనిచేస్తూ ఆయా గనులు, డిపార్ట్మెంట్లకు నిర్దేశించి లక్ష్యాల సాధనకు కృషి చేసిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. అంతేకాక డైరెక్టర్లతో సహా సింగరేణి సీఎండీ బలరామ్ శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం, భూపాలపల్లి, గోదావరిఖని, ఇందారం, న్యూటెక్ తదితర ఏరియాల్లోని భూగర్భ గనుల్లో పర్యటించి ఉత్పత్తిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్పత్తికి ఏమైనా అవాంతరాలు, ఇతరత్రా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. మిగిలిన తక్కువ సమయంలో లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి సాధించాలని, ఉత్పత్తి చేసిన బొగ్గును రవాణా చేయాలని సూచించారు. ఇంకా మిగిలే ఉంది.. సింగరేణిలో గత ిఫిబ్రవరి 12వ తేదీ నాటికి 60.41 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 56.41 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించారు. మిగిలిన సమయంలో 15.59 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉంది. ఈ ఉత్పత్తి కాస్త పురోగతిలోనే ఉన్నప్పటికీ లక్ష్యం మాత్రం చేరలేదు. ఇప్పటి వరకు భూగర్భ గనుల్లో 52.10 లక్షల టన్నులకు 40.58 లక్షల టన్నులు సాధించగా, ఓపెన్ కాస్ట్ గనుల్లో 55.18 మిలియన్ టన్నులకు 52.34 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైంది.ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు భూగర్భగనుల్లో ఉత్పత్తి ఇలా.. ఏరియా గని లక్ష్యం ఉత్పత్తి శాతం (టన్నుల్లో) (టన్నుల్లో) కొత్తగూడెం పీవీకే–5 3,02,688 1,32,173 44 మణుగూరు కొండాపురం 2,10,000 1,31,652 72 గోదావరిఖని 1, 3 ఇంకై ్లన్ 2,07,500 1,14,434 55 గోదావరిఖని 2, 2ఏ ఇంకై ్లన్ 2,42,625 1,16,489 48 గోదావరిఖని 11 ఇంకై ్లన్ 7,08,650 5,73,841 81 గోదావరిఖని వకీల్‌పల్లి 3,02,685 3,15,104 104 భూపాలపల్లి కేటీకే–1, 1ఏ 2,16,500 1,56,123 72 భూపాలపల్లి కేటీకే –5 ఇంకై ్లన్ 2,17,000 1,74,238 80 భూపాలపల్లి కేటీకే –6 ఇంకై ్లన్ 1,56,325 1,09,662 70 భూపాలపల్లి కేటీకే –8, 8ఏ 2,43,350 1,59,833 66 అడ్రియాల ఏఎల్పీ 3,86,515 3,86,515 100 మందమర్రి కేకే –5 ఇంకై ్లన్ 1,73,000 1,76,912 102 మందమర్రి కాసిపేట 2,08,125 1,26,230 61 మందమర్రి కాసిపేట –2 1,73,000 95,546 55 శ్రీరాంపూర్ ఎస్కే 1,03,750 48,508 47 శ్రీరాంపూర్ ఆర్కే–5 ఇంకై ్లన్ 2,34,875 2,11,456 90 శ్రీరాంపూర్ ఆర్కే–6 ఇంకై ్లన్ 1,55,625 1,64,724 106 శ్రీరాంపూర్ ఆర్కే–7 3,11,250 2,64,343 85 శ్రీరాంపూర్ ఆర్కే రాంటెక్ 1,38,375 1,64,724 106 శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ –1 1,03,975 81,019 78 శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 3, 3ఏ 2,42,625 2,04,888 84 బెల్లంపల్లి ఐకే–1ఏ ఇంకై ్లన్ 2,06,813 1,67,679 81 అధికారులు బాధ్యతగా పనిచేయాలి ఈ ఏడాది కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యసాధన 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధనకు బదిలీ వర్కర్ నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి. గనుల్లో 100 శాతం ఉత్పత్తి సాధనకు సింగరేణి వ్యాప్తంగా భూగర్భ గనుల్లో కార్మిక చైతన్య యాత్రలు నిర్వహించాం. పోటీ ప్రపంచంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించి, ఉత్పత్తికి డిమాండ్ పెరిగేలా చూడాలి. ఉత్పత్తితో పాటు రక్షణకూ ప్రాధాన్యమిస్తూ ప్రమాద రహిత సింగరేణిగా కీర్తి గడించాలి. – ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీ -
ట్రాఫిక్ ఇక్కట్లు లేని నగరంగా ఖమ్మం
● ప్రజల వినతి మేరకు రోడ్ల విస్తరణ ● తీగల వంతెన పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మంఅర్బన్: ప్రజల వినతి మేరకు రోడ్లు విస్తరిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లు లేని నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దే కృషి జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మున్నేటిపై తీగల వంతెన నిర్మాణ పనులను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. బ్రిడ్జి పనులు రెండువైపుల నుంచి చేపడుతూ జూన్‌లోగా పూర్తిచేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.180 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.39కోట్లు భూసేకరణ పరిహారం చెల్లించనున్నామని తెలిపారు. ఈ బ్రిడ్జి పూర్తయితే ఖమ్మంకు మణిహారంగా మారుతుందన్నారు. కాగా, భూములు, ఆస్తులు కోల్పోయిన వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇక పొన్నెకల్ నుండి ఇల్లెందు క్రాస్ రోడ్డుకు జాతీయ రహదారిని అనుసంధానించేలా రోడ్డు నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, ఈఈ యుగంధర్, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, వివిధ ఉద్యోగులు, నాయకులు చంద్రశేఖర్, విశ్వనాథ్, రావూరి సైదబాబు, సాధు రమేష్‌రెడ్డి, శరత్, బాలగంగాధర్ తిలక్, తుపాకుల యలగొండస్వామి, పాటిబండ్ల యుగంధర్, క్రాంతిసిన్హా పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో... ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం కాల్వొడ్డులోని మదర్సాలో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రషీద్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత పోరు
అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. పలుచోట్ల ఆధిపత్య పోరుతో విభేదాలు ముదరగా.. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో కార్పొరేటర్లు, నేతల మధ్య వైరం పెరిగి ఎవరికివారు తమదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పాత, కొత్త నేతలు పెత్తనం కోసం వర్గాలుగా విడిపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈనెల 12న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఓ కార్పొరేటర్, మరో నేత మధ్య ‘నువ్వెంత.. అంటే నువ్వెంత’ అనే స్థాయిలో మాటల యుద్ధం జరగడం గమనార్హం. మంత్రి సమావేశంలో ఉంటే మాటెత్తని నేతలు.. ఆయన పరోక్షంలో జరిగే సమావేశాల్లో మాత్రం పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం● పాత, కొత్త నేతల మధ్య పొసగని వైనం ● అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న కొందరు నేతలు ● ఖమ్మం నియోజకవర్గంలో ముదిరిన విభేదాలు పైచేయి.. పంచాయితీఎవరి దారి వారిదే.. జిల్లాలో చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పొసగడం లేదు. పార్టీలో మొదటి నుంచీ వర్గ పోరు ముఖ్య నేతలకు తలనొప్పిగా మారగా.. అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితిలో మార్పు కానరావడం లేదు. ఖమ్మం నియోజకవర్గంలో అయితే నేతలు తలోదారి అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడం.. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, ఎంపీ, రాజ్యసభ సభ్యులు ఉండటంతో కిందిస్థాయి నేతలు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు. నేతలు ఏ కార్యక్రమం నిర్వహించినా ఎక్కడో అక్కడ అసంతృప్తి బయటపడుతుండడం.. మంత్రులు, ఎంపీలు హాజరయ్యే కార్యక్రమాల్లో వారి వారి అనుచరగణం హడావుడి సర్వసాధారణమైంది. నేతలు ఎక్కువవడంతో... ఖమ్మం నియోజకవర్గంలో నేతల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధిపత్య పోరు నానాటికీ అధికమవుతోంది. జిల్లాకు చెందిన పలువురు నేతలే కాక ఈ నియోజకవర్గానికి చెందిన ఇంకొందరు జిల్లా కేంద్రంగా ఉండే నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే అంతర్గత పోరు నెలకొంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని నాయకత్వం సూచిస్తుండగా.. ఇక్కడి నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండడం గమనార్హం. ద్వితీయ శ్రేణి నేతలు కొందరు జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలను నేరుగా కలుస్తూ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని చెబుతున్నారు. పార్టీ కార్యకలాపాలపై ప్రభావం ఖమ్మం నియోజకవర్గంలో నెలకొన్న విభేదాల ప్రభావం పార్టీ కార్యకలాపాలపై పడుతోందని నాయకత్వం భావిస్తోంది. సమావేశాలు, సభలకు నేతలు, కార్యకర్తలంతా హాజరయ్యే పరిస్థితి ఉండడం లేదు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సైతం జన సమీకరణపై ఎవరికి వారు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈనెల 12న ఖమ్మం 10వ డివిజన్లో యూజీడీ శంకుస్థాపనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాగా.. వెయ్యి మందికి పైగా జనం పాల్గొంటారని అంచనా వేశారు. కానీ సభా ప్రాంగణంలో వందల్లో కూడా ప్రజలు లేకపోవడంతో కార్పొరేటర్లు, నేతలకు మంత్రి తుమ్మల సుతిమెత్తగా చురకలు అంటించినట్లు సమాచారం. అయితే, ఇప్పటికే పరిస్థితి ‘చేయి’ దాటకున్నా దీనికి అడ్డుకట్ట వేసేలా మంత్రి తుమ్మల కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కలవని పాత – కొత్త నీరు ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్లకు.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరు, విజయం సాధించాక ఇంకొందరు కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు మేయర్ పునుకొల్లు నీరజ కూడా హస్తం గూటికి వచ్చారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా గతంలో మాదిరి బీఆర్ఎస్ నుంచి చేరిన కార్పొరేటర్లదే హవా నడుస్తోందన్న భావన కాంగ్రెస్ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లలో ఉంది. ఇదే సమయాన పార్టీ మారిన తమ ప్రాబల్యంతోనే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందని.. మంత్రి తుమ్మల అందరినీ సమానంగా చూస్తున్నారని పార్టీలో చేరిన కార్పొరేటర్లు, నేతలు తమ అనుయాయులతో చెబుతుండగా, ఇది జీర్ణించుకోలేకే పాత నేతలు వైరానికి కాలు దవ్వుతున్నారనే ప్రచారం ఉంది. -
విద్యార్థులకు ఆత్మవిశ్వాసమే కీలకం
● మొహమాటం వీడితే ఇంగ్లిష్‌పై పట్టు ● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కొణిజర్ల: విద్యార్థులు మొహమాటాన్ని విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇంగ్లిష్‌పై పట్టు సాధించొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మండలంలోని పెద్దమునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ‘ఉయ్ కెన్ లెర్న్’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులకు వివిధ కారణాలతో చదివే అవకాశం లేకున్నా పిల్లలు మంచిస్థాయికి చేరాలని చదివిస్తున్నందున వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని, మూడునెలల్లోనే ఆశించిన మార్పు తీసుకొచ్చిన ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. అనంతరం పలువురు విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడించిన కలెక్టర్ వారిని అభినందించారు. డీఈఓ ఈ సోమశేఖరశర్మ, ఏఎంఓ రవికుమార్, ఎంఈఓ అబ్రహం, ఎంపీడీఓ రోజారాణి, ఎంపీఓ రాజేశ్వరి, హెచ్ఎం కృష్ణయ్య, ఇన్చార్జ్ తహసీల్దార్ రాము పాల్గొన్నారు. ఆయకట్టు చివరి వరకు సాగర్ జలాలు చింతకాని: పంటలు ఎండిపోకుండా సాగర్ ఆయకట్టు చివరి భూములకు సైతం నీరందిస్తామని, రైతులు నీటిని వృథా కాకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. చింతకాని మండలం నాగులవంచలోని సీతంపేట ఎన్నెస్పీ మేజర్ కాల్వను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ కట్టపై రైతులతో సమావేశమై సాగు చేసిన పంటలు, సాగునీటి లభ్యత, ధరణి సమస్యలపై ఆరాతీశారు. కొద్దిరో జుల పాటు ఆయకట్టుకు సాగర్ జలాలు అందిస్తే పంటలకు ఢోకా ఉండదని రైతులు చెప్పగా.. పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయితే, పత్తి, మొక్కజొన్న, పెసర, మిర్చి మాత్రమే కాక ఆయిల్‌పామ్‌పై రైతులు దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందుకోసం రైతులకు అధికా రులు అవగాహన కల్పించాలన్నారు. కాగా, మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలని, నాగులవంచలో గ్రంథాలయం, బ్యాంక్, ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను గ్రామస్తులు కోరారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, ఏడీఏ విజయ్‌చంద్ర, ఇరిగేషన్ ఈఈ రామకృష్ణ, ఏఈలు మహేష్, సురేష్, సందీప్, విద్యుత్ ఏఈ ఉమామహేశ్వరి, తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఏఓ మానస పాల్గొన్నారు. పంటలు ఎండకుండా సమన్వయంతో పనిచేయాలి ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎక్కడ కూడా యాసంగి పంటలు ఎండిపోకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన ప్రతీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, నీటిపారుదల శాఖ ఏఈతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలతో మండలాల వారీగా వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటుచేసి రైతులకు నీటి విడుదల షెడ్యూల్‌పై సమాచారం ఇవ్వాలని చెప్పారు. పంట చేతికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉంటూ నీరు సరఫరా చేయాలని తెలిపారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఏఓ పుల్లయ్య, జల వనరుల శాఖ ఎస్ఈలు వాసంతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఇంట్లో పుస్తకాల గది ఉండాలి..
● కట్నం తీసుకోవద్దు.. తీసుకుంటే వెనక్కి ఇవ్వాలి ● స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ నేలకొండపల్లి: ప్రతీ ఇంట్లో పుస్తకాల గది ఏర్పాటుచేసుకోవాలని స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సూచించారు. నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం వద్ద స్వేరోస్ ఆధ్వర్యాన చేపట్టిన భీమ్ దీక్షను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాన్షీరాం జయంతి నుంచి అంబేద్కర్ జయంతి వరకు దీక్ష కొనసాగుతుందని, ఈ దీక్ష నెల మాత్రమే కాకుండా జీవితాంతం చేపట్టాలని పిలుపునిచ్చారు. దీక్షలో భాగంగా కుటుంబమంతా వారానికి కనీసం మూడు రోజులు పుస్తక పఠనం చేయాలని, ఫోన్లకు దూరంగా ఉండాలని అన్నారు. స్వేరోలు ఏ పని చేసినా ఆ రంగంలో అందరికంటే గొప్పగా రాణించేలా కష్టపడాలని సూచించిన ఆయన అప్పులు చేసి పెళ్లి జరిపించడం కాకుండా తీసుకున్న కట్నం వెనక్కి ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు పొందే అవకాశాలు తగ్గుతున్నందున సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జ్ఞానం పెంచుకోవాలని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో స్వేరోస్‌ను అన్ని ఖండాలకూ విస్తరిస్తామన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, జ్ఞాన ఖడ్గధారణ చేయడమే కాక పిల్లల కాళ్లు కడిగారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ప్రతినిధులు వీరయ్య, ప్రవీణ్, బల్గూరి దర్గయ్య, బాలప్రసాద్, రమేష్, సదానందం, పుల్లయ్య, కిషన్, ప్రకాష్, లలిత, శోభ తదితరులు పాల్గొన్నారు. -
కోతలు లేని సరఫరానే లక్ష్యం
● వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ ● ఖమ్మం సర్కిల్ ఎస్ఈ శ్రీనివాసాచారి నేలకొండపల్లి: వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్నందున కోతలు లేకుండా, డిమాండ్‌కు తగి నట్లు సరఫరా చేయడమే తమ లక్ష్యమని ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని శనివారం పరిశీలించిన ఆయన నేలకొండపల్లిలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. విని యోగదారులకు మర్యాద ఇవ్వడమే కాక వారి సమస్యలు సత్వరం పరిష్కరించాలని సూచించారు. అంతేకాక ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. 36 సబ్స్టేషన్ల ఇంటర్ లింక్ ఉద్యోగులతో సమీక్ష అనంతరం ఎస్ఈ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 36 విద్యుత్ సబ్స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా సరఫరా కోసం ఇంటర్ లింక్ పనులు చేపడుతుండగా ఇప్పటికే 11చోట్ల పూర్తయ్యాయని చెప్పారు. అలాగే, కొత్తగా ఏడు సబ్స్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు లోడ్‌కు అనుగుణంగా 767సబ్స్టేషన్లలో 250 చోట్ల అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి మొబైల్ వాహనాలు సమకూర్చామని, వినియోగదారులకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కాగా, జిల్లాలో 2.54 లక్షల మందికి గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందుతోందని, ఇప్పటివరకు వీరు రూ.40.55కోట్ల సబ్సిడీ పొందారని ఎస్ఈ వెల్లడించారు. ఈసమావేశంలో డీఈఈలు చింతమళ్ల నాగేశ్వరరావు, హీరాలాల్, ఏఈలు కె.రామారావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ఇల్లెందు మండలం పూబల్లిలోఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత ఇల్లెందు జేకే బస్టాండ్ వద్ద 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి, అనంతరం బోయితండాలో బీటీ రోడ్డు, రొంపేడులో చెక్‌పోస్టు, కోటిలింగాలలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుండి బయలుదేరి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యే సభలో పాల్గొనేందుకు మంత్రి బయలుదేరతారు. మంత్రి తుమ్మల... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఖమ్మం విద్యానగర్ కాలనీ, 10వ డివిజన్లోని చైతన్యనగర్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఆతర్వాత కోదాడ, తుంగతుర్తిలో జరిగే కార్యక్రమాలకు బయలుదేరతారు. ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేనెల 20నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. పది, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 20నుంచి 26వ తేదీ వరకు ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30గంటల నుంచి 5–30గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. అలాగే, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. సాగునీరు వృథా కాకుండా పర్యవేక్షణ ముదిగొండ: ఎక్కడ కూడా సాగునీరు వృథా కాకుండా పర్యవేక్షిస్తూ పంటలకు అందేలా చూడాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. ముదిగొండ మండలం కమలాపురంలో శనివారం పర్యటించిన ఆమె పంట కాల్వ, చెరువు, పంటలను పరిశీలించాక గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. రబీలో ఏయే పంటలు సాగు చేశా రు. సాగునీటి సరఫరా ఎలా జరుగుతోందని ఆరా తీసి మాట్లాడారు. చెరువులో నీటి మట్టం తక్కువగా ఉన్నందున సాగర్ నీటితో నింపాలని కోరగా, సమన్వయంతో పనిచేస్తూ సాగునీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆమె అధికారులకు ఊచించారు. తొలుత అంకమ్మ దేవాలయంలో అదనపు కలెక్టర్ పూజలు చేశారు. ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి, ఎంపీఓ వాల్మికీ కిషోర్, నాయబ్ తహసీల్దార్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బి.లక్ష్మి, మాజీ ఎంపీటీసీ వల్లూరి భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి అభిషేకం, పల్లకీసేవ ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం శ్రీవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశాక, స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. ఆతర్వాత పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. కాగా, పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో పెద్దసంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలతో కలిసి వచ్చి పూజలు చేశారు.ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. స్తంభాలకు ‘యూనిక్’ నంబర్లు ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత సమస్యలను ప్రాంతం ఆధారంగా త్వరగా గుర్తించేలా 33 కేవీ, 11 కేవీ స్తంభాలకు యూనిక్ పోల్ నంబర్ వేయిస్తున్నామని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటి వరకు 33 కేవీ విభాగంలో 55 ఫీడర్లు, 11 కేవీ పరిధిలో 159 ఫీడర్లలో ఈ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. -
లోక్యాతండాలో డూండ్ వేడుకలు
మూడు రోజుల పాటు హోలీ వేడుకలు జరుపుకునే మండలంలోని లోక్యాతండా వాసులు రెండో రోజైన శనివారం డూండ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈమేరకు గత హోలీ నుంచి ఇప్పటి వరకు జన్మించిన మగ బిడ్డకు అన్నప్రాసన, నామకరణం జరిపించారు. అలాగే, గేర్యా(వేడుకల పెద్దలు) తండావాసులతో కలిసి కోలాటమాడుతూ డూండ్ జరుపుకునే వారి గృహాలకు వెళ్లారు. అక్కడ తల్లీబిడ్డలను ఆశీర్వదించగా డూండ్ నిర్వహించిన వారు విందు ఏర్పాటుచేశారు. కాగా, శనివారం తెల్లవారుజామున తండాలో నిర్వహించిన కామ దహనానికి తండా వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా కామదహనం ప్రదేశానికి వెళ్లి పూజలు చేశారు. – కూసుమంచి -
జిల్లా న్యాయ సేవాసంస్థ సభ్యుల నియామకం
ఖమ్మం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులుగా సీనియర్ న్యాయవాదులైన మందడపు శ్రీనివాసరావు, పి.సంధ్యారాణితో పాటు సామాజిక కార్యకర్త డాక్టర్ డి.పూర్ణచంద్రరావులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవాసంస్థ అధ్యక్షులుగా జిల్లా జడ్జి వ్యవహరిస్తుండగా, కలెక్టర్, సీపీ, చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, ప్రభుత్వ న్యాయవాదులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. వీరితో పాటు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, న్యాయ సేవాసంస్థ కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న వారిని సభ్యులుగా నియమిస్తారు. ఇందులో భాగంగానే వీరిని నియమించగా రెండేళ్ల పాటు సభ్యులుగా కొనసాగనున్నారు.సబ్‌జైల్ సూపరింటెండెంట్‌గా కుటుంబరాజు సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సబ్‌జైలు సూపరింటెండెంట్‌గా ఉబ్బల కుటుంబరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. మధిర సబ్‌జైల్ సూపరింటెంటెండ్‌గా ఉన్న ఆయనను ఇక్కడకు బదిలీపై చేశారు. ఈనెల 11న సత్తుపల్లి సబ్‌జైల్ నుంచి రిమాండ్ ఖైదీ పరారు కాగా, బాధ్యులుగా సూపరింటెండెంట్ సోమరాజు సంపత్, వార్డర్లను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ స్థానంలో నియమితులైన కుటుంబరాజు విధుల్లో చేరారు. ఆరేళ్ల క్రితం ఒకరు.. ఇప్పుడు ఇంకొకరు ● ఇద్దరు కుమారుల మృతితో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు కారేపల్లి: స్నేహితులతో కలిసి సంతోషంగా హోలీ ఆడిన బాలుడు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మండలంలోని దుబ్బతండాకు చెందిన బానోత్ రమేశ్–శైలజ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడికి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆరేళ్ల క్రితం జ్వరంతో మృతి చెందాడు. ఇక పెద్ద కుమారుడు సాయికృష్ణ(12) కారేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా 20రోజుల క్రితం జ్వరం వచ్చింది. చికిత్స అనంతరం కోలుకుని పాఠశాలకు వెళ్తుండగా ఈ నెల 14వ తేదీన హోలీ వేడుకల్లో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. ఈక్రమాన శనివారం సాయికృష్ణ అస్వస్థతకు గురి కాగా, స్థానిక ఆస్పత్రిలో చూపించి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం ఒకరు, ఇప్పుడు ఇంకో కుమారుడు మృతి చెందడంతో రమేశ్–శైలజ గుండెలవిసేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సేవా లోపంపై ట్రావెల్స్ సంస్థకు జరిమానా ఖమ్మం లీగల్: సేవా లోపం కింద హైదరాబాద్‌కు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం రూ.35వేలు చెల్లించాలంటూ ఖమ్మం జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎం.మాధవీలత శనివారం తీర్పునిచ్చారు. వివరాలిలా.. ఖమ్మం వాసి వనం నీతు గత ఏడాది ఏప్రిల్ 15న కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నుంచి ఖమ్మం వచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ ఏసీ బస్సులో రూ.8,032 చెల్లించి టికెట్లు బుక్ చేసింది. ఖమ్మం వస్తుండగా మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తగా బస్సు నిలిచిపోయినా యాజమాన్యం స్పందించలేదు. మూడు గంటలపాటు రోడ్డుపైనే ఉన్నా క రూ.7వేలకు క్యాబ్ మాట్లాడుకుని ఖమ్మం వచ్చారు. ఆపై న్యాయవాది చార్లెస్ వినయ్ ద్వారా వినియోదారుల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించగా టికెట్ రుసుము రూ.8,032తో పాటు ఏడు శాతం వడ్డీ, క్యాబ్ చార్జీ రూ.7వేలు, మనోవేదనకు గురైనందుకు రూ.10వేలు, లిటిగేషన్ ఖర్చుల కింద రూ.10వేలు కలిపి రూ.35 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు. -
ఎరువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు
పెనుబల్లి: పంటలకు కావాల్సిన ఎరువుల ధరలు పెంచితే వ్యాపారులు లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. పెనుబల్లి సొసైటీతో పాటు కారాయిగూడెం, వీఎం బంజర్‌లోని పలు షాపుల్లో శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్, రికార్డులను పరిశీలించి అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఏఓ ఏవీఎస్ ఎస్. రాజు, ఏఈఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి వైరారూరల్: సాగర్ ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని డీఏఓ డి.పుల్లయ్య సూచించారు. వైరా మండలం అష్ణగుర్తి, రెబ్బవరం, తాటిపూడిల్లో పంటలను ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. వారబందీకి అనుగుణంగా నీరు వినియోగించుకోవాలని తెలిపారు. తహసీల్దార్ కే.వీ.శ్రీనివాసరావు, ఏఓ మయాన్ మంజుఖాన్, ఎంపీడీఓ సరస్వతి, ఇరిగేషన్ ఏఈ హరికృష్ణ, ఏఈఓలు రాజేష్, వెంకటనర్సయ్య పాల్గొన్నారు. -
పర్యాటక వెలుగులు..!
ఆహ్లాదం.. ఆకర్షణీయంవెలుగుమట్ల అర్బన్‌పార్కు ●వీకెండ్స్‌లో మరింత రద్దీ ●రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు ●పిక్నిక్లకు వేదికగా మారిన పార్కుఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్కు పర్యాటకులను ఆకర్షిస్తోంది. వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు పర్యాటపరంగా నగరవాసులకు వరంగానే చెప్పొచ్చు. ఏళ్లుగా ఈపార్కును గత పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈక్రమంలో నూతన ప్రభు త్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పార్కు అభివృద్ధికి నోచుకుంది. పాలకుల ప్రత్యేక దృష్టి.. వీకెండ్స్‌లో నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అధికారులు కోట్లాది రూపాయలు వెచ్చించి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా, గతంలో కంటే సందర్శకులు పెరిగినట్లు పార్కు అధికారులు చెబుతుండడంతో చిన్న చిన్న పార్టీలు, గ్రూప్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు తదితర వాటికి వేదిక కావాలని గత కొన్ని మాసాలుగా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థలు ప్రత్యేక దృష్టి సారించారు. సందర్శకుల సందడి.. రానురాను పార్కుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దీంతో గతంలో రోజు 20 నుంచి 30 మంది వరకు పార్కు సందర్శన వస్తుండగా.. ప్రస్తుతం రోజుకు 100 నుంచి 200 వరకు వస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సుమారు 300 నుంచి 500 వరకు వస్తుండడంతో మరింత రద్దీ పెరిగింది. ఇటీవల కాలంలో ఆహ్లాదంతో పాటు విజ్ఞానపరంగా ఉపయోగపడుతుందని భావించిన జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పిక్నిక్ పరంగా పెద్ద ఎత్తున వచ్చిపోతున్నారు. పార్కులోని వివిధ రకాల మొక్కలు, పచ్చదనం, సేదదీరడానికి హట్, పార్కు వీక్షించేందుకు వాచ్ టవర్, చిల్డ్రన్ పార్కు, యోగా షెడ్డు తదిత రాలతో పాటు పార్కునంతా వీక్షించడానికి ఓపెన్ జీపు సైతం అందుబాటులో ఉంచారు. ఇవేకాక సైకిల్ ట్రాకింగ్, పచ్చికబయళ్లు, తాగు నీటి ప్లాంట్ సౌకర్యాలు కల్పిస్తుండడంతో నగరవాసులను ఆకర్షిస్తోంది. చకచకా అభివృద్ధి పనులు.. పార్కు అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించి రూ. 2 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో ఇప్పటికే ఖమ్మం–వైరా ప్రధాన రోడ్డు నుంచి పార్కు వరకు డబుల్ లేన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నారు. ఇవే త్వరగా పూర్తయితే ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు ఒక వేదికగా తయారవుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా, రోడ్డు విస్తరణలో కొంతమంది ప్లాట్లదారులు తమ విలువైన స్థలాలు కోల్పోతుండడంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పనుల్లో అక్కడక్కడ జాప్యం జరుగుతుండగా.. వాటిని సెటిల్ చేసే పనుల్లో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ప్లాస్టిక్ నిషేధం.. పార్కు లోపల ప్లాస్టిక్ నిషేధం అమలుకు శ్రీకారం చుట్టారు. బయట ఫుడ్ అనుమతి లేకుండా పార్కు లోపలే ప్లాస్టికేతర తినుబండరాలు విక్రయించేలా చేస్తున్నారు. ఇదే అమలైతే పచ్చదనం అందించడంతో పాటు ప్లాస్టిక్ జాడలేకుండా ప్రజాప్రతినిధులు, అధికారుల చర్యలు చేపట్టారు. పని వేళలు.. పర్యాటకులు అర్బన్ పార్కును సందర్శించేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. టిక్కెట్ ధర పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, పార్కింగ్‌కు ద్విచక్రవాహనానికి రూ.10, కారుకు రూ.20, బస్సుకు రూ.100 వసూలు చేస్తున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్‌లో ఎండ ప్రభావం లేకుండా సోలార్ షెడ్డు సైతం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక వైపు వాహనాల నీడ పార్కింగ్, మరో వైపు సోలార్ విద్యుత్ తయారీకి ఎంతో ఉపయోగకరంగా మారింది. ఆహ్లాదంగా ఉంది.. పచ్చదనంతో అటవీపార్కు చాలా బాగుంది. ప్రధాన రోడ్డు నుంచి పార్కులోకి రోడ్డు సరిగా లేకపోవడం కాస్తా ఇబ్బందిగా ఉంది. మా పిల్లలు పాఠశాల తరఫున సందర్శించి బాగుందని చెబితే నేను చూడాలని వచ్చా. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే నగరవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – డి.సతీష్, పర్యాటకుడు, ఖమ్మం -
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
నేలకొండపల్లి: రహదారిపై స్కూటీని తప్పించే క్రమాన స్తంభాన్ని ఢీకొట్టిన కారు పొలాలకు దూసుకెళ్లింది. మండలంలోని అజయ్‌తండాకు చెందిన తేజావత్ ప్రసాద్, తేజావత్ రూప్లా, గోవిందరావుతో పాటు సూర్యాపేటకు చెందిన లింగా కారులో శనివారం చెరువుమాధారం నుంచి ఆజయ్‌తండాకు వెళ్తున్నారు. ఈక్రమంలో గ్రామంలోని పాఠశాల సమీపాన ఎదురుగా వచ్చిన స్కూటీని తప్పించబోయి కారు స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న వారు గాయపడగా.. స్థానికులు బయటకు తీసి ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. కాగా, ప్రమాదంలో స్తంభం విరిగిపోగా ఆ సమయాన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఇసుక టిప్పర్ సీజ్.. పెనుబల్లి: ఏపీ ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్‌ను వీఎం బంజర్ పోలీసులు శనివారం తెల్ల వారుజామున సీజ్ చేశారు. ఎలాంటి పన్ను చెల్లించకుండా తెలంగాణ ఆదాయానికి గండి కొట్టేలా పలువురు ఏపీ నుంచి ఇసుక తీసుకొచ్చి పెనుబల్లి, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని లారీ అసోసియేషన్ బాధ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై కె.వెంకటేష్ తనిఖీలు చేపట్టగా టిప్పర్ పట్టుబడింది. భద్రాచలం నుంచి తీసుకొస్తున్న ఇసుక టన్ను రూ.1,300 నుంచి రూ.1,400కు విక్రయిస్తుండగా(పన్నుతో కలిపి), ఏపీ నుంచి తీసుకొచ్చే ఇసుక టన్ను రూ.900 నుంచి రూ.వెయ్యి వరకే విక్రయిస్తూ ఎలాంటి పన్ను చెల్లించడం లేదని గుర్తించారు. ఈమేరకు లారీ యజమాని, డ్రైవర్, ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వివాహిత ఆత్మహత్య.. బోనకల్: ఓ వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మండలంలోని ఆళ్లపాడుకు చెందిన షేక్ మస్తాన్ – జరీనా(28)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అత్త మైబూబీతో కలిసి శనివారం మధ్యాహ్నం ఇంటి ఎదుట ఉన్న జరీనా, కాసేపు విశ్రాంతి తీసుకుంటానని ఇంట్లోకి వెళ్లింది. ఆమె ఇద్దరు కుమారులు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆటోడ్రైవర్‌గా కిరాయికి వెళ్లిన మస్తాన్ స్థానికంగా లేకపోవడంతో ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం ● అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి చింతకాని: మండలంలోని నర్సింహాపురం సమీపాన గ్యాస్ గోదాం వద్ద ఆటోను గుర్తుతెలియని ఓ వాహనం ఢీకొట్టిన ఘటనలో రఘునాథపాలెంకు చెందిన గాజుల అనిల్‌కుమార్(35) మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు... సొంత ఆటో ఉన్న అనిల్‌కుమార్ ఖమ్మంలోని ఓ దినపత్రిక ప్రెస్ నుంచి పేపర్ పార్సిళ్లను తీసుకొచ్చి గ్రామాల్లో వేస్తుంటాడు. ఇలాగే శనివారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి అల్లీపురం, చింతకాని మండలం కొదుమూరు, లచ్చగూడెం మీదుగా ఆటోలో చింతకానికి వస్తుండగా నర్సింహాపురం సమీపాన ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో సైతం నుజ్జునుజ్జయింది. ఆయనకు భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమేరకు మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి.. ఖమ్మంరూరల్: మండలంలోని కరుణగిరి వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ బీతపూడి నరేంద్ర(46) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దానవాయిగూడెంకు చెందిన నరేంద్ర రాజీవ్‌గృహకల్పలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన ప్లాంట్ నుంచి ట్రాలీ ఆటోలో వాటర్ క్యాన్లు తీసుకుని దానవాయిగూడెం వెళ్తూ ప్రధాన రహదారిపైకి వస్తుండగా ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరేంద్రను ఖమ్మం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆయన భార్య రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
సైలో బంకర్ సమస్య పరిష్కరించండి
సత్తుపల్లి/సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని ఓసీల నుంచి బొగ్గు రవాణాకు ఏర్పాటుచేసిన సైలోబంకర్ ద్వారా స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యాన స్పందించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. ఈమేరకు హైదరాబాద్‌లో సింగరేణి సీఎండీ బలరాంను శనివారం కలిసిన ఆమె సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు, కిష్టారం వాసుల దీక్షలపై వివరించారు. కాలుష్య ప్రభావంతో పలువురు మృతి చెందగా, బాంబ్ పేలుళ్లులో ఇళ్లు దెబ్బతిన్నందున బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య వినతితో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సింగరేణి ఓసీలు, సైలోబంకర్ ద్వారా ఎదురవుతున్న సమస్యలను శనివారం శాసన మండలిలో ప్రస్తావించారు. సింగరేణి సీఎండీని కలిసిన ఎమ్మెల్యే -
ఇక్కడ పుట్టిన వారంతా భారతీయులే...
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రవక్త మహమ్మద్ ఉల్లేఖనం ప్రకారం ముస్లింలు ఏ ప్రదేశంలో పుడితే అదే వారి మాతృభూమి అని.. తద్వారా భారత్‌లో పుట్టిన ముస్లిం, మైనార్టీలంతా భారతీయులే అయినందున మాతృభూమిని ప్రేమించడం కర్తవ్యమని ప్రవచనకారుడు, పీస్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజుల్ రెహమాన్ తెలిపారు. ఖమ్మంలో డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ ది రిలీఫ్ అండ్ ఎడ్యుకేషనల్(డేర్) ఆధ్వర్యాన శనివారం ఇఫ్తార్ విందుతో పాటు సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో రెహమాన్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం ‘డేర్’రాష్ట్ర కార్యదర్శి నోమాన్ రిజ్వీ, ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కంభంపాటి నారాయణ, డాక్టర్ జగదీష్ మాట్లాడారు. ఈసదస్సులో వైద్యులు బొల్లికొండ శ్రీనివాసరావు, జి.వెంకటేశ్వర్లు, కూరపాటి ప్రదీప్‌కుమార్, రవికుమార్, జంగాల సునీల్, కిరణ్, కుప్పు ధనమూర్తి, సురేందర్, సురేష్, తేజ, బాబు రత్నాకర్, విజయలక్ష్మి, పుష్పలతతో పాటు డాక్టర్ అన్వర్, ఆరిఫ్, ముస్తాక్, ఫయాజ్, గులాం షరీఫ్, మన్సూర్ ఇలాహి తదితరుల పాల్గొన్నారు. -
కిష్టారం సింగరేణి బాధితుల దీక్ష విరమణ
సత్తుపల్లి/సత్తుపల్లిరూరల్: సింగరేణి సైలో బంకర్‌తో అనారోగ్యం బారిన పడుతున్నామని చేపట్టిన దీక్షలను సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ వాసులు శనివారం విరమించారు. దీక్షలు శనివారం 34వ రోజుకు చేరగా, వారికి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిపరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే, ఎంపీ రఘురాంరెడ్డి సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఫోన్లో చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. సింగరేణి పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, మార్కెట్ చైర్మన్ ఆనంద్‌బాబు, నాయకులు గాదె చెన్నారావు, ఎం.డీ.కమల్‌పాషా, మారోజు నాగేశ్వరరావు, కడారి మదీనా, వాడపల్లి నాగమణి, నాగరత్నం, అశోక్, ప్రవీణ్, ఏసమ్మ, నిర్మల, కమల, అరుణ పాల్గొన్నారు. గాయపడిన కానిస్టేబుల్‌కు పరామర్శ.. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకునే క్రమాన తీవ్రంగా గాయపడిన ఐడీ పార్టీ కానిస్టేబుల్ నరేష్‌ను కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, తుమ్మల యుగంధర్ పరామర్శించారు. వీరి వెంట సీఐ టి.కిరణ్, నాయకులు పాల్గొన్నారు. -
జిల్లా న్యాయ సేవాసంస్థ సభ్యుల నియామకం
ఖమ్మం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులుగా సీనియర్ న్యాయవాదులైన మందడపు శ్రీనివాసరావు, పి.సంధ్యారాణితో పాటు సామాజిక కార్యకర్త డాక్టర్ డి.పూర్ణచంద్రరావులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవాసంస్థ అధ్యక్షులుగా జిల్లా జడ్జి వ్యవహరిస్తుండగా, కలెక్టర్, సీపీ, చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, ప్రభుత్వ న్యాయవాదులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. వీరితో పాటు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, న్యాయ సేవాసంస్థ కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న వారిని సభ్యులుగా నియమిస్తారు. ఇందులో భాగంగానే వీరిని నియమించగా రెండేళ్ల పాటు సభ్యులుగా కొనసాగనున్నారు.సబ్‌జైల్ సూపరింటెండెంట్‌గా కుటుంబరాజు సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సబ్‌జైలు సూపరింటెండెంట్‌గా ఉబ్బల కుటుంబరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. మధిర సబ్‌జైల్ సూపరింటెంటెండ్‌గా ఉన్న ఆయనను ఇక్కడకు బదిలీపై చేశారు. ఈనెల 11న సత్తుపల్లి సబ్‌జైల్ నుంచి రిమాండ్ ఖైదీ పరారు కాగా, బాధ్యులుగా సూపరింటెండెంట్ సోమరాజు సంపత్, వార్డర్లను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ స్థానంలో నియమితులైన కుటుంబరాజు విధుల్లో చేరారు. ఆరేళ్ల క్రితం ఒకరు.. ఇప్పుడు ఇంకొకరు ● ఇద్దరు కుమారుల మృతితో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు కారేపల్లి: స్నేహితులతో కలిసి సంతోషంగా హోలీ ఆడిన బాలుడు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మండలంలోని దుబ్బతండాకు చెందిన బానోత్ రమేశ్–శైలజ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడికి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆరేళ్ల క్రితం జ్వరంతో మృతి చెందాడు. ఇక పెద్ద కుమారుడు సాయికృష్ణ(12) కారేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా 20రోజుల క్రితం జ్వరం వచ్చింది. చికిత్స అనంతరం కోలుకుని పాఠశాలకు వెళ్తుండగా ఈ నెల 14వ తేదీన హోలీ వేడుకల్లో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. ఈక్రమాన శనివారం సాయికృష్ణ అస్వస్థతకు గురి కాగా, స్థానిక ఆస్పత్రిలో చూపించి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం ఒకరు, ఇప్పుడు ఇంకో కుమారుడు మృతి చెందడంతో రమేశ్–శైలజ గుండెలవిసేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సేవా లోపంపై ట్రావెల్స్ సంస్థకు జరిమానా ఖమ్మం లీగల్: సేవా లోపం కింద హైదరాబాద్‌కు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం రూ.35వేలు చెల్లించాలంటూ ఖమ్మం జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎం.మాధవీలత శనివారం తీర్పునిచ్చారు. వివరాలిలా.. ఖమ్మం వాసి వనం నీతు గత ఏడాది ఏప్రిల్ 15న కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నుంచి ఖమ్మం వచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ ఏసీ బస్సులో రూ.8,032 చెల్లించి టికెట్లు బుక్ చేసింది. ఖమ్మం వస్తుండగా మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తగా బస్సు నిలిచిపోయినా యాజమాన్యం స్పందించలేదు. మూడు గంటలపాటు రోడ్డుపైనే ఉన్నా క రూ.7వేలకు క్యాబ్ మాట్లాడుకుని ఖమ్మం వచ్చారు. ఆపై న్యాయవాది చార్లెస్ వినయ్ ద్వారా వినియోదారుల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించగా టికెట్ రుసుము రూ.8,032తో పాటు ఏడు శాతం వడ్డీ, క్యాబ్ చార్జీ రూ.7వేలు, మనోవేదనకు గురైనందుకు రూ.10వేలు, లిటిగేషన్ ఖర్చుల కింద రూ.10వేలు కలిపి రూ.35 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు. -
సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్లపై వేటు
● సత్తుపల్లి సబ్‌జైల్ ఉద్యోగుల సస్పెన్షన్ ● ఇటీవల రిమాండ్ ఖైదీ తప్పించుకోవడంతో చర్యలుసత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సబ్‌జైల్ సూపరింటెండెంట్ ఎస్.ప్రవీణ్, వార్డర్లు ఎన్.మారేశ్వరరావు, బి.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన అశ్వారావుపేట మండలం ఆసుపాకకు చెందిన రిమాండ్ ఖైదీ పెండ్ర రమేష్ సబ్‌జైల్ నుంచి పరారయ్యాడు. భార్యపై హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన పరారు కాగా, మూడు గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు జైళ్ల శాఖ డీఐజీ ఎం.సంపత్ ఈనెల 12వ తేదీన విచారణ నిర్వహించారు. ఈమేరకు బాధ్యతారహితంగా వ్యవహరించారని తేలుస్తూ జైలు సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్లను సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మధిర సబ్‌జైల్ హెడ్‌వార్డర్ ఎ.వెంకటమురళిని సత్తుపల్లి సబ్‌జైలుకు బదిలీ చేయగా ఆయన శుక్రవారం విధుల్లోకి చేరారు. అలాగే, సూపరింటెండెంట్‌గా మధిర సబ్ జైల్ సూపరింటెండెంట్ యు. కుటుంబరాజును నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.కేయూ దూరవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తులు ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్(గతంలో ఎస్డీఎల్సీఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 25వరకు ఉందని ఖమ్మం అధ్యయన కేంద్రం కోఆర్డి నేటర్ డాక్టర్ గోపి తెలిపారు. బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ మ్యాథ్స్, బ్యాచ్‌లర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పీజీ కోర్సుల్లో ఎంఏ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్ డెవలప్మెంట్, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంకామ్, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అవకాశముందని తెలిపారు. దరఖాస్తులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయొచ్చని, వివరాలకు 98492 50633, 80088 11998 నంబర్లలో సంప్రదించాలని లేదా కేయూ దూరవిద్య కేంద్రం వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు. పోస్టాఫీస్ ద్వారా రామయ్య పరోక్ష సేవలు భద్రాచలం: పోస్టాఫీస్ ద్వారా భద్రగిరి రామయ్య పరోక్ష సేవలు అందించడానికి తపాలా శాఖ సిద్ధమైంది. శ్రీ సీతారాముల కల్యా ణం, మహాపట్టాభిషేకంలో స్వయంగా పాల్గొనలేని భక్తులు సమీపాన పోస్టాఫీస్‌కు వెళ్లి అంతరాలయ అర్చన, తలంబ్రాలకైతే రూ.450, ముత్యాల తలంబ్రాలకు రూ.150 చొప్పున చెల్లించి పూర్తి చిరునామా, వివరాలతో దరఖాస్తు అందజేయాలి. ఆపై స్వామి వారి తలంబ్రాలు భక్తులకు చేరవేస్తామని, ఈ అవకాశం ఏప్రిల్ 1వ తేదీ వరకే ఉంటుందని ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి, భద్రాచలం హెడ్ పోస్టాఫీస్ పోస్‌మాస్టర్ బీ.వీ.రామ్మోహన్రావు తెలిపారు. -
బీసీ యువతకు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
● తూనికలు, కొలతలతో పాటు నాణ్యతలోనూ నగుబాటే ● తనిఖీల మాటే మరిచిన శాఖ ఉద్యోగులు ● ఫలితంగా కొనసాగుతున్న వ్యాపారుల మోసాలు నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం ఖమ్మంక్రైం: నిత్యం ఏదో ఒక వస్తువు కొనడం తప్పనిసరైన ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓ చోట మోసం సహజమైపోయింది. వీధివ్యాపారులు మొదలు బడా స్టోర్లలోనూ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇనుప కాంటాల్లోనే కాదు ఎలక్ట్రానిక్ కాంటాలను సైతం రీడింగ్ తగ్గించి తక్కువ తూకంతో సరుకులు అంటగడుతున్నారు. తనిఖీల మాటే లేదు... జిల్లాలో ఉన్న తూనికలు, కొలతల శాఖ(లీగల్ మెట్రాలజీ) పూర్తిగా నిర్వీర్యమైందనే చెప్పాలి. అరకొర దాడులతో ఏళ్ల తరబడి నెట్టుకొస్తుండడంతో వ్యాపారులకు భయం లేకుండా పోయింది. చాలామంది వ్యాపారులకు తూనికల కొలతల శాఖ ఉందని తెలియదంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ సిబ్బంది తనిఖీలకు వచ్చినా పెద్దగా జరిమానా లేకపోవడంతో కడతామని.. లేదా సిబ్బందికే డబ్బులు ఇస్తే వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ఫలితంగా తూకం రాళ్లు, ఎలక్ట్రానిక్ కాంటాలను ఏటా బరువు నిర్ధారించి సీల్ వేయించుకోవాల్సిన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నలుగురే సిబ్బంది గతంలో ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో కొనసాగిన తూనికలు, కొలతల శాఖ కార్యాలయాన్ని ఇప్పుడు కలెక్టరేట్‌కు మార్చారు. అయితే, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎన్ని పోస్టులో ఇప్పుడూ అవే కొనసాగుతున్నాయి. కాగా, ఆరుగురు ఉద్యోగులకు గాను నలుగురు పనిచేస్తుండగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. అలాగే, మహబూబాద్ జిల్లా తూనికల కొలతల శాఖాధికారే ఇక్కడా ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండడంతో అజమాయిషీ కరువైందని చెబుతున్నారు. కొన్ని కేసులు.. కొంత జరిమానా తూనికల, కొలతల శాఖ ఆధ్వర్యాన జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తూకం రాళ్లు, ఎలక్ట్రానిక్ కాంటాలపై ముద్రలు వేయడం, లైసెన్స్‌ల జారీకి రూ.34,46,820 వసూలయ్యాయి. అలాగే, అక్రమ కాంటాలు,ప్యాకింగ్‌లు చేస్తున్న వారిపై 37 కేసులు నమోదు చేయగా, రూ.9,26లక్షల జరిమానా జమ అయింది. ఇక ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్న వారిపై 37కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ముద్రల కోసం రూ.8.05లక్షలు, జరిమానా రూ.3.10లక్షలు వసూలయ్యాయి. అలాగే, కాంటాలకు సంబంధించి పది కేసులు, ప్యాకింగ్‌లో అవకతవకలపై జరిమానాగా రూ.3లక్షల మేర వసూలు చేశామని జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్చార్జ్ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. వినియోగదారులు ఎక్కడైనా మోసపోయినట్లు గ్రహిస్తే తమ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ద్వారా నిరుద్యోగ బీసీ యువతకు హైదరాబాద్‌లోని హకీంపేటలో ఆర్టీసీ ద్వారా డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. హెచ్ఎంవీ(హెవీ మోటర్ వాహనం), ఎల్ఎంవీ(తేలికపాటి మోటార్ వాహనం) డ్రైవింగ్‌లో 38 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ఆతర్వాత అర్హత సాధించిన వారికి పర్మనెంట్ లైసెన్స్ ఉచితంగా అందిస్తారని జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. అలాగే, శిక్షణ సమయంలో ఆర్టీసీ ద్వారా ఉచిత వసతి సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువకులు తమ కార్యాలయంలో ఈనెల 31వ తేదీలోగా సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 23ఖమ్మంమయూరిసెంటర్: ప్రతిదీ లాభాల కోణంలో చూస్తున్న వ్యాపారులు ప్రజారోగ్యాన్ని అంగట్లో సరుకుగా మార్చేశారు. ఖమ్మం కిన్నెరసాని థియేటర్ సమీపాన ఓ హోటల్ ఖార్కానాను పరిశీలించగా.. కనీస నిబంధనలేమీ పాటించకుండా పిండివంటలు తయారు చేస్తున్నట్లు తేలింది. డ్రెయినేజీపైనే గ్యాస్ స్టౌలు ఏర్పాటుచేయగా, వాడిన నూనెనే మళ్లీ వాడుతుండడం, మిగిలిపోయిన పదార్థాలతో కొత్తవి తయారుచేస్తున్నట్లు కనిపించింది. ఖమ్మం అర్బన్: చిరువ్యాపారులు కొందరు కళ్ల ముందే మోసం చేస్తున్నారు. ఇది మోసమని కూడా తెలియకపోవడంతో వినియోగదారులకు నష్టం ఎదురవుతోంది. చెరుకు రసం, కొబ్బరినీళ్లు ఇంటికి తీసుకెళ్లే వారు లీటర్, రెండు లీటర్ల చొప్పున బాటిళ్లు ఎంచుకుంటారు. అయితే, ఓ చోట పరిశీలించగా లీటర్ బాటిల్‌గా చెప్పిన సీసాలో 700 ఎం. ఎల్.కు మించి పట్టలేదు.గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దుస్తులు అమ్మే రామయ్య రోజుకు రెండు లీటర్ల పెట్రోల్ పోయిస్తాడు. ఇదే తరహాలో ఓ రోజు వెళ్తుండగా మధ్యలో వాహనం ఆగిపోయింది. ఏదో సమస్య ఉందని భావించి పరిశీలించినా ఏదీ తేలలేదు. చివరకు ఆ గ్రామ యువకులు పరిశీలించి పెట్రోల్ అయిపోయిందని చెప్పగా ఎండలో మూడు కి.మీ. మేర వాహనం తోస్తూ వచ్చాడు. ఎప్పుడూ వెళ్లే బంక్‌కు కాకుండా ఇంకో బంక్‌కు వెళ్లడంతో పెట్రోల్ తక్కువగా పోసి తనను మోసం చేశారని రామయ్యకు అర్థమైంది.ఖమ్మంకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి సుబ్బారావు నెల జీతం రాగానే షాప్‌నకు వెళ్లి కిరాణా సరుకులు తీసుకొచ్చాడు. ఆయన ముందే అన్నింటినీ ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేసి ప్యాక్ చేశారు. ఇంటికి వచ్చాక ఆయన భార్యకు అనుమానం వచ్చి సమీపంలోని షాపులో తూకం వేయించగా ఒక్కో ప్యాకెట్‌కు 100నుంచి 150గ్రాముల వరకు తక్కువగా వచ్చింది. -
భగభగమంటున్న భానుడు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎండ తీవ్రత నానాటికీ పెరుగుతోంది. అనేక ప్రాంతాల్లో శుక్రవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైరాలో అత్యధికంగా 40.8 డిగ్రీలుగా నమోదు కాగా, ముదిగొండ, సింగరేణి, సత్తుపల్లి, పెనుబల్లి, రఘునాథపాలెం, ఎర్రుపాలెం, వేంసూరు, మధిర మండలాల్లో దాదాపు అదే పరిస్థితి నెలకొంది. మిగిలిన మండలాల్లో 37.2 – 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9గంటలకే ఎండ మొదలై 11 గంటలకల్లా తీవ్రత పెరుగుతుండడంతో మధ్యాహ్నం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. అలాగే, యాసంగి పంటలు చేతికందుతున్న వేళ ఎండలతో రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. కోటాకు మించి విద్యుత్ వినియోగం ఉష్ణోగ్రతల ప్రభావం విద్యుత్ వినియోగంపై పడింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, ఫ్యాన్ల వినియోగం పెరగగా.. అదే స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. జిల్లాకు కేటాయించే కోటాకు మించి విద్యుత్ వినియోగం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. నిత్యం జిల్లా విద్యుత్ కోటా 6.96 మిలియన్ యూనిట్లు కాగా, మార్చి ఆరంభం నుంచి నిత్యం 9మిలియన్ యూనిట్ల మేర వినియోగం జరుగుతోందని, ఈనెల 2, 4, 7వ తేదీల్లో అత్యధికంగా 9.02 నుంచి 9.09 మిలియన్ యూనిట్లు దాటిందని సమాచారం. గత ఏడాది మార్చి 1 నుంచి 13వ తేదీ వరకు జిల్లాలో 100.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించగా, ఈ ఏడాది 115.57 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు -
నాణ్యతలో రాజీ పడొద్దు..
● లిఫ్ట్ పనులు సకాలంలో పూర్తిచేయాలి ● మంచుకొండ ఎత్తిపోతల పనులను పరిశీలించిన మంత్రి తుమ్మలరఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగర్ నీరు అందించడానికి రూ.66 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు నాణ్యతగా చేస్తూనే సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వకు ఆనుకుని నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఉగాది నాటికి ట్రయల్ రన్ జరిపేలా పనుల్లో వేగం పెంచాలని, ఓవైపు పంప్ హౌస్, మరోవైపు పైపులైన్ పనులు చేపడితే సకాలంలో పూర్తవుతాయని తెలిపారు. తద్వారా సాగర్ జలాలను మండలంలోని చెరువుల్లో నింపి సాగుకు ఇబ్బంది లేకుండా చూడొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, మార్కెట్, ఆత్మ, సొసైటీల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, రావూరి సైదబాబు, తాతా రఘురాంతో పాటు తమ్మిన్ని నాగేశ్వరరావు, బండి వెంకన్న, రెంటాల ప్రసాద్, రమేష్, లాలు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి రెండురాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో శ్రీ అంకమ్మ జాతర సందర్భంగా రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు అమరగాని ఎల్లయ్య తెలిపారు. చెరువుమాధారంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16నుంచి 18వ తేదీ వరకు జరిగే పోటీల్లో మొదటి ఆరు స్థానాల్లో నిలిచే జట్లకు రూ.30 వేలు, రూ.25వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.8వేల నగదు బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని తెలిపారు. జట్ల వివరాలు నమోదు చేసేందుకు 63026 47907, 81427 14306 నంబర్లలో సంప్రందించాలని సూచించారు. ఈ సమావేశంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఈవూరి శ్రీనివాసరెడ్డి, కనమర్లపూడి రాము, తుమ్మా ధనమూర్తి, ఆకుల వెంకటేశ్వర్లు, ఆకుల మల్లేష్, గుంజి రవి తదితరులు పాల్గొన్నారు. రైసెట్లో ఉచిత శిక్షణ ఖమ్మంరూరల్: మండలంలోని తరుణి హాట్లో ఉన్న రైసెట్ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యవతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ సి.చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా నెల పాటు కొనసాగే లేడీస్ టైలరింగ్‌లో శిక్షణకు ఈనెల 21నుండి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించడమే కాక యూనిఫామ్, ట్రైనింగ్ మెటీరియల్, టూల్ కిట్ ఇస్తామని తెలిపారు. కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల(కిచెన్ గార్డెన్) పెంపకానికి ఉద్యాన యూనివర్సిటీ ఇటీవల ప్రతిపాదించింది. ఈమేరకు ప్రభుత్వం అనుమతిస్తే ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ పర్యవేక్షణలో జిల్లాలోని వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల ద్వారా ఆకుకూరలు, కూరగాయలు, మునగ, కరివేపాకు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కల పెంపకం చేపట్టనున్నారు. తద్వారా విద్యార్థుల్లో పంటల సాగుపై అవగాహన కల్పించడమే కాక, పంటలను వంటల్లో వినియోగానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు ఉద్యాన శాఖ అధికారుల ద్వారా తెలిసింది. నేడు భీమ్ దీక్షలు ప్రారంభం నేలకొండపల్లి/ఖమ్మంమయూరిసెంటర్: స్వేరోస్ ఆధ్వర్యాన పలువురు భీమ్ దీక్షను మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం వద్ద శనివారం స్వీకరించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 500 మందికి పైగా దీక్ష చేపడతారని చెబుతుండగా, స్వేరోస్ వ్యవస్థాపకుడు, పూర్వ గురుకులాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ప్రారంభించనున్నారు. శనివారం నుంచి ఏప్రిల్ 14 వరకు వీరు దీక్షలో ఉంటారని తెలంగాణ స్వేరోస్ కన్వీనర్ బి.దర్గయ్య తెలిపారు. ఈమేరకు క్షేత్రం వద్ద ఆయన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ మహానీయులు జయంతి సందర్భంగా 2012 నుంచి దీక్షలు స్వీకరిస్తున్నామని వివరించారు. కాగా, దీక్ష పోస్టర్లను శుక్రవారం ఖమ్మంలో ఆవిష్కరించగా స్వేరో రాష్ట్ర అధ్యక్షుడు చిలకబత్తిని వీరయ్యతో పాటు దేవరగట్టు బాలప్రసాద్, మొండితోక ఈదయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి రూ.1.11 లక్షల విరాళం సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ద్వారకాపురి కాలనీలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి శివ టెంట్‌హౌస్ నిర్వాహకులు సాధు వసంత్ – సునీత శుక్రవారం రూ.1.11 లక్షలను విరాళంగా అందించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ద్రోణంరాజు మల్లికార్జున శర్మ, వందనపు సత్యనారాయణ, రాగాల చంద్రారెడ్డి, సోమిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వారిని కాపాడిన పోలీసులు ఖమ్మంక్రైం: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఓ దినపత్రిక జర్నలిస్టులను ట్రాఫిక్ పోలీసు సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. పలువురు జర్నలిస్టులు ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌కు శుక్రవారం వెళ్లగా.. కిందకు దిగే సమయాన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. దీంతో వారు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, సిబ్బందితో పాటు సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ప్రసాద్ చేరుకున్నారు. లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య పరిష్కరించేందుకు సాయపడగా అంతా కిందకు దిగడంతో ఊపిరి పీల్చుకుని పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
●ఉపాధ్యాయిని.. ఇప్పుడు లెక్చరర్
మధిర: మండలంలోని రాయపట్నం గ్రామానికి చెందిన మాచారపు నాగేశ్వరరావు – సుబ్బమ్మ కుమార్తె కళావతి తల్లిదండ్రులు, భర్త పోలిశెట్టి నాగరాజు ప్రోత్సాహంతో పాటు పట్టుదలగా చదివి ఉద్యోగాలు సాధిస్తోంది. ఆమె పదో తరగతిలోనే చదువు ఆపేసి టైలరింగ్ నేర్చుకోవాలని పలువురు సూచించినా తల్లిదండ్రుల సహకారంతో చదువు కొనసాగించింది. 1–5వ తరగతి వరకు రాయపట్నం ప్రాథమికోన్నత పాఠశాలలో, 6 – 10వ తరగతి వరకు బనిగండ్లపాడు సెయింట్ ఆన్స్‌లో, ఇంటర్ పల్లగిరిలోని మరియనివాస్లో, డిగ్రీ మధిర సుశీల కళాశాలలో పూర్తి చేశాక ఎంఏ ఇంగ్లిష్ కూడా చదివి ఎమ్మెస్సీ, బీఈడీ, ఎంఈడీ పూర్తిచేశారు. ఎంఈడీ కేయూ క్యాంపస్‌లో చదివిన ఆమె బంగారు పతకం సాధించింది. ఆపై డీఎస్సీ 2008 ద్వారా ఎంపీపీఎస్ అన్నాయిపాలెంలో ఎస్జీటీగా చేరిన కళావతి, మోడల్ స్కూల్లో పీజీటీ గణితం ఉపాధ్యాయినిగా ఎంపికై కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పనిచేశారు. తాజాగా ఇంగ్లిష్ జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై న ఆమె గురువారం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు. -
ప్రశ్నిద్దాం.. అది మన హక్కు
● వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం ● 1986లో ఏర్పాటు.. 2019లో మరింత బలోపేతం ● ఇప్పటివరకు జిల్లాలో 10,206 కేసులు.. 10,055 పరిష్కారం నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవంఖమ్మంలీగల్: కొనుగోళ్లు, సేవల కోసం డబ్బు చెల్లించే ప్రతీఒక్కరు వినియోగదారులుగానే పరిగణనలోకి వస్తారు. ఈసమయాన నాణ్యతను ప్రశ్నించడం, రశీదు తీసుకోవడం, ధరల తెలుసుకోవడం హక్కుగా సంక్రమిస్తాయి. అదేసమయాన చౌకబారు, నాణ్యత లేని వస్తువులు వచ్చినట్లు తెలిస్తే ప్రశ్నించడం కూడా వినియోగదారుల హక్కుగానే భావించాలి. నేడు(శనివారం) వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా హక్కుల రక్షణకు ఉన్నచట్టం, ఫిర్యాదు చేయాల్సిన తీరు, ఇటీవల వెలువడిన తీర్పులపై కథనం న్యాయం.. నష్టపరిహారం వినియోగదారుల రక్షణ చట్టం –1986 ద్వారా ఫిర్యాదు వినడంతో పాటు న్యాయం చేయడమే కాక నష్ట పరిహారం ఇప్పించడానికి ఒక వ్యవస్థ ఏర్పడింది. ఈ చట్టం 1986లో వచ్చింది. అంతకుముందు వినియోగదారులు 40 రకాల చట్టాలపై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో ఇంగ్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని చట్టాలను అధ్యయనం చేశాక ప్రత్యేక తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019లో మరింత బలోపేతం చేస్తూ కొత్త చట్టం ఏర్పరిచారు. అంతర్జాల వేదికలు, ఈ–కామర్స్ ద్వారా కూడా రక్షణ లభించేలా ఇందులో నిబంధనలు పొందుపరిచారు. చట్టం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 10,206 కేసులు నమోదు కాగా.. వీటిలో 10,055 పరిష్కారమయ్యాయి. చట్టం లక్ష్యాలు దోపిడీకి గురైన, మోసపోయిన, దొంగ వ్యాపారంతో విసిగిపోయిన వినియోగదారులకు రక్షణ కవచంలా ఈ చట్టం ఉపయోగపడుతుంది. కష్టాలు, నష్టాలు, కడగండ్ల నుంచి తప్పించడానికి సాయపడుతోంది. సాధారణ, తక్కువ ఖర్చు, కాలయాపన లేకుండా న్యాయం చేకూర్చడమే ఈ చట్టం ఉద్దేశం. ఫిర్యాదులు జిల్లా పరిధిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటైంది. ఎవరైనా వ్యక్తిగా, సామూహికంగా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే, కేంద్ర, రాష్ట్ర, జిల్లాస్థాయిలో మూడంచెలుగా న్యాయవ్యవస్థ, జాతీయ కమిషన్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల నివారణ కమిషన్, జిల్లా స్థాయిలో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటైంది. కొన్న వస్తువులు పాడైనా, నాసిరకంవి వచ్చినా, ఆశించిన రీతిలో లేకున్నా, లోపాలు ఉన్నా, అధికధర వసూలు చేసినా రాతపూర్వకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. జరిమానా.. శిక్షలు ఎవరికి వ్యతిరేకంగానైతే ఉత్తర్వులు జారీ అవుతాయో, వాళ్లు ఆ ఉత్తర్వులను అమలుపర్చకపోతే వారికి శిక్ష విధించే అధికారం ఫోరమ్‌లు, కమిషన్లకు ఉంటుంది. వ్యక్తికి నెల తగ్గకుండా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2వేలు తగ్గకుండా రూ.10వేల వరకు జరిమానా లేదా ఈ రెండింటినీ విధించవచ్చు. అయితే, వీటిపై అప్పీల్‌కు వెళ్లొచ్చు. ఫిర్యాదు చేయడం ఇలా... వస్తువు ధర ఆధారంగా రూ.50లక్షల నష్టపరిహారం వరకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇక రూ.50లక్షలకు పైన రాష్ట్ర వినియోగదారుల ఫోరం, ఆపైన జాతీయ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి. కోర్టు రుసుముతో పాటు ఫిర్యాదు ఆధారంగా ఫీజు చెల్లించి పూర్తి వివరాలు సమర్పించాలి. వినియోగదారుల తరఫున న్యాయవాది లేదా సొంతంగానూ వాదనలు వినిపించవచ్చు. అయితే, వివాదం తలెత్తిన రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. e.jagrithi.gov. in ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇతర వివరాల కోసం 08742– 254347 నంబర్లో సంప్రదించవచ్చు.ధంసలాపురానికి చెందని తుమ్మ అప్పిరెడ్డి భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్‌లోని అర్చన ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టూర్ ఆపరేటేర్ బద్దం బోజిరెడ్డి ద్వారా 2023 ఏప్రిల్‌లో రూ.71వేలు చెల్లించి ప్యాకేజీ తీసుకొన్నారు. ఆపై రకరకాల కారణాలతో వాయిదా వేస్తుండగా, అప్పిరెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారం కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ చేసిన అనంతరం టూర్ కోసం చెల్లించిన రూ.71వేలు, కేసు నమోదు చేసిన నాటి నుంచి ఏడు శాతం వడ్డీతో కలిపి చెల్ల్లిండచమే కాక ఇబ్బందికి వేదనకు రూ.10వేలు, లిటిగేషన్ ఖర్చులకు రూ.10వేలు కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది. తల్లాడ మండలం మల్లవరానికి చెందిన దుగ్గిదేవర వెంకటలాల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కోవిడ్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్సకు రూ.54,963 బిల్లు చెల్లించాడు. ఈ బిల్లు ఇవ్వాలని బీమా కంపెనీని సంప్రదిస్తే నిరాకరించారు. దీంతో సేవాలోపం కింద ఆయన జిల్లా వినియోగదారుల కమిషన్‌లో 2022 జనవరి 28న ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఇరుపక్షాల వాదనలు విన్న సేవా లోపం జరిగిందని నిర్ధారించారు. దీంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ(వనస్థలిపురం) తరఫున ఫిర్యాదికి రూ.73,707 చెల్లించాలని తీర్పు చెప్పారు. -
లోక్యాతండాలో ప్రారంభమైన హోలీ వేడుకలు
కూసుమంచి: అన్నిచోట్ల ఒకేరోజు హోలీ ఆడితే కూసుమంచి మండలం లోక్యాతండాలో మాత్రం మూడు రోజుల పాటు సందడి ఉంటుంది. ఈ మూడు రోజు లు తండావాసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మొదటిరోజైన శుక్రవారం కోలాటంతో వేడుకలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున కామదహనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి తండాలో గత హోలీ నుంచి ఇప్పటి వరకు మగబిడ్డ పుట్టిన ఇంట డూండ్ వేడుక(అన్నప్రాసన, నామకరణం)లు నిర్వహించనున్నారు. ఇక మూడోరోజైన ఆదివారం తండావాసులు రంగులు చల్లుకోవడంతో వేడుకలు ముగిస్తాయి. ఇందులో పాల్గొనేందుకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తండావాసులే కాక బంధువులు రావడంతో స్థానికంగా సందడి నెలకొంది. కాగా, తొలి రోజు తండావాసులు గ్రామ కూడలిలో చేరి కోలాటమాడారు. చిన్నాపెద్ద తేడా లేకుండా పాల్గొని సంప్రదాయ తలపాగ, పంచెకట్టుతో ఆకట్టుకున్నారు.మూడు రోజుల పాటు సాగనున్న సంబురాలు -
పిండిప్రోలు సబ్‌స్టేషన్‌కు ఇంటర్‌లింక్ లైన్
తిరుమలాయపాలెం: వేసవి కార్యాచరణలో భాగంగా శుక్రవారం మండలంలోని పిండిప్రోలు సబ్‌స్టేషన్‌కు అనుసంధానంగా కొత్త 33 కే.వీ. ఇంటర్‌లింక్ లైన్ ఏర్పాటుచేశారు. ఈ లైన్‌ను ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి శుక్రవారం చార్జ్ చేశాక మాట్లాడారు. ఇంటర్ లింక్ లైన్‌తో పిండిప్రోలు, తిప్పారెడ్డిగూడెం, హైదర్‌సాయిపేట ఉపకేంద్రాలకు అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా చేయొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఆరెంపుల, కూసుమంచి, మరిపెడ 132 కే.వీ. సబ్ స్టేషన్ నుంచి సరఫరా చేస్తున్నా, సాంకేతిక కారణాలతో ఇబ్బంది ఎదురైతే ప్రత్యామ్నాయ లైన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఖమ్మం రూరల్ డీఈఓ సీహెచ్.నాగేశ్వరావు, ఏడీఈ బి.రామకృష్ణ, ఏఈలు ఆర్.భాస్కర్, కిలారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
●అన్నదమ్ములు.. ‘జాబ్’పాట్
కామేపల్లి: మండలంలోని గోవింద్రాలబంజరకు చెందిన గంగారపు సత్యనారాయణ – జ్యోతిర్మయి కుమారులు సాయికృష్ణమనాయుడు, రత్నేశ్వరనాయుడు ఏ పరీక్ష రాసినా విజయం సొంతమవుతోంది. గ్రూప్–1, 2, 3 ఫలితాల్లో అన్నదమ్ములు సత్తా చాటడం విశేషం. సాయికృష్ణమనాయుడు గ్రూప్–1లో 435 మార్కులు, గ్రూప్–3లో 578 ర్యాంక్ సాధించగా ఇప్పటికే డీఎంహెచ్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక రత్నేశ్వరనాయుడు గ్రూప్–1లో 467 మార్కులు, గ్రూప్–2లో 197వ ర్యాంక్, గ్రూప్–3లో 27వ ర్యాంక్ సాధించి వరుస విజయాలు కై వసం చేసుకున్నాడు. ఆయన ప్రసుత్తం సీటీఓలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. -
జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ నిరసన
మధిర: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈమేరకు మధిర వైఎస్సార్ చౌరస్తాలో శుక్రవారం జరిగిన నిరసనలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జాప్యాన్ని ప్రశ్నించడమే కాక అక్రమాలపై నిలదీస్తుండడంతోనే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. నాయకులు బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, వై.వీ.అప్పారావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, షేక్ ఖాదర్, వేమిరెడ్డి పెదనాగిరెడ్డి, ఆళ్ల నాగబాబు, పరిశ శ్రీనివాసరావు, కొత్తపల్లి నర్సింహారావు, షేక్ సైదా, అబ్దుల్ ఖురేషి, పట్టాభి రామశర్మ, బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య ఎర్రుపాలెం: అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ పి.వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ములుగుమాడు గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరావు (37) తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. తర్వాత చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు మృతుడి భార్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తప్పిపోయిన వ్యక్తి అప్పగింత మధిర: భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని మధిర టౌన్ పోలీసులు అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు తన భార్యతో గొడవపడి శుక్రవారం ఇంటి నుంచి వెళ్లాడు. శ్రీనివాసరావు కుమారుడు సాయికుమార్ తన తండ్రి మధిరలో ఉన్నాడని తెలుసుకుని 100కు సమాచారం అందించాడు. మధిర టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొట్టే రిత్విక సాయి ఐపీఎస్ అతని లొకేషన్ ద్వారా ఇంటి నుంచి వెళ్లిపోయిన శ్రీనివాసరావు ఆచూకీని తెలుసుకున్నారు. మధిర రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించి ఎస్సై చంద్రశేఖరరావు అతనిని టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. బ్లూ కోర్టు కానిస్టేబుల్ కొండ, మల్లికార్జున్ ద్వారా సాయికుమార్‌కు అతని తండ్రిని అప్పగించారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు టౌన్ ఎస్హెచ్ఓ సాయికి కృతజ్ఞతలు తెలిపారు. -
కొలువు.. మాకిది సులువు..
● పట్టుబట్టారు.. ఉద్యోగాలు సాధించారు.. ● ఒకటికి మించి జాబ్‌లు కొల్లగొట్టిన యువత ● ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూనే విజయకేతనం ఎగురవేసిన కొందరు ● గ్రూప్ 1, 2, 3కి తోడు జేఎల్‌గా ఎంపికై న పలువురు యువత అనుకుంటే సాధించలేనిదేదీ లేదని, కొలువు కొట్టడం మాకెంతో సులువైన పని అని కొందరు నిరూపించారు. స్పష్టమైన లక్ష్యాలు ఉండడం లేదని, గాలివాటంగా వెళ్తున్నారని కొన్ని కుటుంబాల్లో పెద్దల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఇంకొందరు మాత్రం వాటిని పటాపంచలు చేస్తూ సత్తాచాటుతున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్ – 1, 2, 3 ఫలితాలతోపాటు జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న వారిని పరిశీలిస్తే ఎంతో కఠోర శ్రమ.. పట్టుదల చూపించి.. ఉద్యోగాలు సాధించారని వెల్లడవుతోంది. స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవడమే కాక నిరంతరం శ్రమించడం, ఒక ఉద్యోగం వచ్చి నా పట్టు వీడకుండా మరిన్ని ఉద్యోగాలు సాధిస్తున్న యువత ఇంకొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ●సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. తల్లాడ: మండలంలోని మల్లవరానికి చెందిన కటికి ఉపేంద్రకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా వదులుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమించాడు. తాజాగా ఆయన గ్రూప్–3లో 384వ ర్యాంక్ సాధించాడు. ఆయన రెండేళ్ల వయస్సులోనే తండ్రి బాబూరావు ప్రమాదవశాత్తు మృతి చెందగా తల్లి ప్రోత్సాహంతో పట్టుదలగా చదివాడు. ఆయన 1 – 4వ తరగతి వరకు సాయిచైతన్య, 5 – 10వ తరగతి వరకు బాలభారతి విద్యాలయం, ఇంటర్ ఖమ్మం రెజొనెన్స్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. తల్లి సాయమ్మ ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఉపేంద్రను పలువురు అభినందిస్తున్నారు. -
పట్టాలైనా.. పక్కా రోడ్లయినా..
ఖమ్మం రాపర్తినగర్/చింతకాని: పట్టాలు ఉన్నంత వరకు రైలు చక్రాలకు ఉండే యాక్సిల్‌తో.. పట్టాలు ముగియగానే సాధారణ టైర్లతో రోడ్డుపైనా పరుగులు తీయగల వాహనాన్ని రైల్వే అధికారులు వినియోగిస్తున్నారు. పట్టాలపై పగుళ్లను గుర్తించేందుకు యూఎఫ్ఎస్డీ యంత్రాన్ని అమర్చిన కారులో అధికారులు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ వరకు గురువారం పరిశీలించారు. ఈ కారు రామకృష్ణాపురం రైల్వే గేట్ (107) వద్ద ఆగింది. అందులో ఉన్న ఎస్ఎస్ఈటీవే కృష్ణకుమార్ కిందకు దిగడంతో.. స్థానికులు ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గతంలో పట్టాలపై పగుళ్లను గుర్తించేందుకు సిబ్బంది కాలినడకన వెళ్లే వారని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక యంత్రం అమర్చిన ఈ కారుకు రైలు చక్రాలకు ఉండే యాక్సిల్ ఉండటంతో పట్టాలపై వెళ్తుందని ఎస్ఎస్ఈటీవే కృష్ణకుమార్ వివరించారు. పట్టాలపై వెళ్లేటప్పుడు యాక్సిల్ కిందకు వచ్చి వాహనం కాస్త పైకి లేస్తుందని చెప్పారు. మళ్లీ కిందకు దింపితే రోడ్డుపై సాధారణ టైర్లతో వెళ్లొచ్చని వివరించారు. -
చికిత్స పొందుతున్న హెచ్ఎం మృతి
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని వెంగళరావునగర్ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడు అగ్గి రవి (42) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన ఆయన ప్రస్తుతం భీమునిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. సత్తుపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఎర్రగుంటకు వెళ్లే క్రమాన జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రవిని ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భార్య కవిత దమ్మపేట మండలం మొండివర్రె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రవి సోదరుడు కూడా గతంలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందినట్లు తెలిసింది. -
దీక్షలు విరమించండి.. సీఎండీకి నివేదిస్తా
సత్తుపల్లి: సైలో బంకర్‌తో స్థానికులకు ఎదురవుతున్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నందున దీక్షలు విరమిస్తే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని కిష్టారం అంబేద్కర్‌నగర్‌లో సైలో బంకర్‌కు వ్యతిరేకంగా 30రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. స్థానికులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సింగరేణి సీఎండీ బలరాంనాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం లభించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ సైలోబంకర్ సమస్యను ఎమ్మెల్యే రాగమయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించారరని తెలిపారు. ప్రజల ఆవేదనపై ప్రభుత్వంతోనైనా గట్టిగా చర్చించనున్నందున తమపై నమ్మకంతో దీక్షలు విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం షాలేం రాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సైతం సైలో బంకర్ బాధితులు కలిశారు. సమస్యపై సింగరేణి సీఎండీతో కలిసి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులం మాట్లాడతామని, అయినా ఫలితం లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ఈమేరకు దీక్షలను విరమించాలని ఆయన సూచించగా, చర్చించుకుని శనివారం చెబుతామని అటు సింగరేణి డైరెక్టర్, ఇటు మంత్రికి అంబేద్కర్‌నగర్ కాలనీవాసులు బదులిచ్చారు.సైలోబంకర్ బాధితులతో సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
‘వికసిత్ భారత్’ గడువు పొడిగింపు
ఖమ్మం రాపర్తినగర్: వికసిత్ భారత్ ద్వారా నిర్వహించే యువ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు ఎన్‌వైకే జిల్లా అధికారి ప్రవీణ్ఉకమార్ సింగ్, ఎన్ఎస్ఎస్ పీఓ శ్రీనివాస్, అర్గనైజింగ్ కమిటీ నిర్వాహకులు డాక్టర్ కే.వీ.రమణరావు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూపొందించిన ఒక్క నిమిషం వీడియోను అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ పోటీలు 19వ తేదీన ఖమ్మంలోని కవిత మెమోరియాల్ డిగ్రీ కళాశాలలో జరుగుతాయని తెలిపారు. మందులు, సామగ్రి సరఫరాకు టెండర్లు ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అవసరమైన మందులు, ఇతర సామగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ తెలిపారు. మందులతో పాటు శస్త్రచికిత్సలకు అవసరమైన సామగ్రి, ప్రయోగశాలలో రసాయనాలు, ఆర్థో ఇంప్లాంట్లు, క్యాథల్యాబ్ ఇంప్లాంట్లను రెండేళ్ల పాటు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఏజెన్సీలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ పేరుతో రూ.10వేల డీడీ లేదా చెక్కు అందజేసి ఈనెల 20 టెండర్ దరఖాస్తు తీసుకోవచ్చని, పూర్తిచేశాక ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 5గంట ల్లోగా అందజేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక ఖమ్మంఅర్బన్/ముదిగొండ: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటున్న జిల్లా జట్టులో ఖమ్మం మల్లెమడుగు, ముదిగొండ మండలం మేడేపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు స్థానం దక్కింది. మల్లెమడుగు పాఠశాల విద్యార్థులు శ్రీవాణి, పల్లవి, జానీ, మోహనకృష్ణతో పాటు మేడపల్లి జెడ్పీహెచ్ఎస్ నుంచి కీర్తి, మణిదీప్చంద్ర, తనుశ్రీ, ధోని ఎంపికయ్యారు. వనపర్తిలో మంగళవారం మొదలుకానున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వీరు బయలుదేరారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్ంఎలు కృష్ణవేణి, బి.నాగేశ్వరరావు, అమ్మ ఆదర్శ పాఠశాలల అధ్యక్షులు ఝూన్సీ, అలివేలి, ఝాన్సీ, కార్పొరేటర్లు లలితారాణి, నిరంజన్, పీడీ బి.కృష్ణయ్యతో పాటు కృష్ణమూర్తి, సూర్యం, కృష్ణ, తిరుపతిరావు, శ్రీనివాసరావు, జానీమియా, వెంకటేశ్వర్లు, బట్టపోతుల సతీష్, వైకుంఠాచారి తదితరులు అభినందించారు. భూనిర్వాసితులకు ఇళ్ల పట్టాలు ఖమ్మం మయూరిసెంటర్: కేఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, విస్తరణకు ఇళ్లు, ఇంటి స్థలాలు సేకరించారు. ఈమేరకు నిర్వాసితులు ఐదుగురికి మేయర్ పి.నీరజ గురువారం ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కేఎంసీ అధికారులు పాల్గొన్నారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన జారీ చేసిన చెక్కు చెల్లకపోవడంతో సదరు వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం మద్యపాన నిషేధ, ఆబ్కారీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి రాళ్లబండి శాంతిలత గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన బి.వెంకటేశ్వరరావు వద్ద ఖమ్మంకే చెందిన కె.గోపీ రవీంద్రనాధ్ కుమార్ 2016 మే నెలలో రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. అనంతరం అప్పు చెల్లించే సమయంలో జారీ చేసిన చెక్కును బ్యాంకు జమచేస్తే సరిపడా నగదు లేక బౌన్స్ అయింది. ఈమేరకు న్యాయవాది చుంచుల మల్లికార్జునరావు ద్వారా వెంకటేశ్వరరావు కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం రవీంద్రనాధ్ కుమార్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.2లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. రోడ్డు ప్రమాదం కేసులో... ఖమ్మం లీగల్: రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు ప్రధమ శ్రేణి న్యాయస్థానం న్యాయమూర్తి బెక్కం రజిని గురువారం తీర్పు వెల్లడించారు. 2021 జనవరి 9న ఖమ్మం చైతన్యనగర్‌లో నడిచి వెళ్తున్న పోలూరి శ్రీనివాసరావును పావురాల వెంకటనారాయణ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు విచారణ అనంతరం చార్జీషీట్ దాఖలు చేశారు. ఈమేరకు వెంకటనారాయణపై నేరం రుజువు కావడంతో మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పిటీషనర్ తరపున ఏపీపీ డి.వీరయ్య వాదించగా, కానిస్టేబుల్ మత్తయ్య సహకరించారు. -
వచ్చే ఏడాది అన్ని స్కూళ్లలో ఏఐ
నేలకొండపల్లి/ముదిగొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ఆధారిత బోధన ప్రారంభిస్తామని జిల్లా విద్యా శాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు. నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెం పాఠశాలను గురువారం సందర్శించిన ఆయన ఏఐ ఆధారితో బోధన, విద్యార్థులను సామర్‌ాధ్యలను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం ఏడు పాఠశాలల్లో ఈ బోధన ప్రారంభించగా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. దీంతో వచ్చే ఏడాది అన్ని పాఠశాలల్లో మొదలుపెడతామని చెప్పారు. కాగా, ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 97 కేంద్రాలు ఏర్పాటుచేయగా 16,500 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. కాగా, ముదిగొండ మండలం బాణాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించగా విద్యార్థులకు టీఎల్ఎం మేళా, ప్రతిభాపాటవ, సాంస్కృతిక అంశాల్లో పోటీలు జరిగాయి. ఈ మేరకు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఇ.వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో డీఈఓ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ ప్రవేశాల సంఖ్య పెంచాలన్నారు. కాగా, పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎగ్జామినేషన్ బోర్డు అసిస్టెంట్ కమిషనర్ గోపగాని రమేష్, ఏఎంఓ రవికుమార్, ఓపెన్ స్కూల్ జిల్లా కోర్డినేటర్ మద్దినేని పాపారావు, ఎంఈఓలు బి.చలపతిరావు, రమణయ్య, హెచ్ఎంలు హరి శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, కె.శాంతి, ఖాధర్, శ్రీను, సుబ్బారావు, పద్మావతి తదతరులు పాల్గొన్నారు. -
నిప్పంటించడంతో విరిగిపడిన చెట్టు
తల్లాడ: మండలంలోని లక్ష్మీనగర్ గ్రామ సమీపాన భారీ వృక్షం మొదట్లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా అది కాలిపోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో 33 కేవీ లైన్ తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి భారీ వృక్షం మొదట్లో నిప్పు పెట్టగా కాలుతూ పెద్ద కొమ్మ విరిగి పక్కనే ఉన్న స్తంభంపై పడినట్లు తెలుస్తోంది. ఈక్రమాన మరో రెండు స్తంభాలు కూడా ఒరిగిపోయాయి. ఈమేరకు వైరా అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పగా, విద్యుత్ శాఖాదికారులు మరో లైన్ నుంచి సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్ ఏఈ రాయల ప్రసాద్ మాట్లాడుతూ చెట్లు, పొలాల్లో నిప్పు పెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని గుర్తించాలని తెలిపారు.విద్యుత్ స్తంభంపై పడడంతో సరఫరాకు అంతరాయం -
గ్రూప్–1, 2 ఫలితాల్లో సూర్యతండా వాసి ప్రతిభ
పట్టుబట్టి కొలువు కొట్టి.. మధిర: మండలంలోని దేశనేనిపాలెంకు చెందిన మందలపు సుధాకర్ గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 74వ ర్యాంకుతో సత్తా చాటాడు. రైతు కుటుంబానికి చెందిన ఆయన ఇప్పటికే గ్రూప్–4 ద్వారా ఉద్యోగం సాధించి ఖమ్మం కార్పొరేషన్లో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్–2 లోనూ ప్రతిభచాటిన సుధాకర్ ఇంటర్మీడియట్ మధిర శ్రీనిధి జూనియర్ కళాశాలలో, బీటెక్ హైదరాబాదులో పూర్తి చేశాడు. తల్లిదండ్రుల సహకారంతో కష్టపడి చదివిన తాను, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే జీవితానికి భరోసా అని నమ్మానని తెలిపాడు.కారేపల్లి: ఇటీవల విడుదలైన గ్రూప్–1, 2 ఫలితాల్లో కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన బాధావత్ భువనేశ్వర్ ప్రతిభ చాటాడు. గ్రూప్–1లో 432 మార్కులు సాధించగా, గ్రూప్–2లో 376 మార్కులతో రాష్ట్రస్థాయి 322, జోనల్ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. కాగా, ఇప్పటికే గ్రూప్–4లో ప్రతిభ చాటిన ఆయన జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూనే ఇప్పుడు గ్రూప్–1, 2కు ఎంపికవడంపై పలువురు అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాదావత్ లక్ష్మణ్–సరోజ కుమారుడైన భువనేశ్వర్ తల్లి ఆయన చిన్నతనంలోనే మృతి చెందింది. దీంతో మేనమామ, 2017లో గ్రూప్–1కు ఎంపికై జిల్లా ఆడిట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న బానోతు రాము ప్రోత్సాహంతో చదివి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యాడు. -
500 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కొణిజర్ల: అక్రమంగా తరలిస్తున్న సుమారు 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లయీస్ అధికారులు కొణిజర్ల మండలం తనికెళ్లలో స్వాధీనం చేసుకున్నారు. తనికెళ్లలోని ఓ దాబా సమీపాన గురువారం రెండు లారీలు నిలిపారనే సమాచారంతో సివిల్ సప్లయీస్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీలు అంజయ్య, యాదయ్య, సీఐ వసంత్‌కుమార్ చేరుకుని తనిఖీ చేయగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు తేలింది. దీంతో రెండు లారీలను కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఓ లారీ డ్రైవర్, ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన గజరావు గోపీ ఏన్కూరు సమీపాన బొలేరో వాహనాల ద్వారా తీసుకొచ్చిన 485 సంచుల బియ్యాన్ని లారీలో లోడ్ చేశాడని తేలింది. అలాగే, మరో డ్రైవర్ ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బి.రాము అదే ప్రాంతం నుంచి 600 సంచుల్లో తరలిస్తుండగా, పెద్దపల్లి జిల్లాకు తీసుకెళ్లాలన్న సమాచారంతో తనికెళ్ల సమీపంలోని దాబాకు వద్దకు చేరుకున్నామని అంగీకరించారు. అయితే, డ్రైవర్ల వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో లారీలను సీజ్ చేశారు. అనంతరం సివిల్ సప్లయీస్ డీటీ ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. తనిఖీల్లో ఆర్ఐ కిరణ్‌కుమార్, చెకింగ్ ఇన్స్పెక్టర్ నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.పెద్దపల్లి జిల్లాకు తరలించే క్రమాన సీజ్ -
పూర్వ వీఆర్‌ఓల్లో ఆశలు
● ఉగాది నాటికి ‘భూభారతి’ ● తద్వారా సొంత శాఖలోకి తీసుకుంటారని ప్రచారం ● ఉమ్మడి జిల్లాలో 562మంది ఎదురుచూపులు ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లీ తాము సొంత శాఖ అయిన రెవెన్యూలోకి వెళ్తామని పూర్వ వీఆర్వోల్లో ఆశలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వం నవంబర్ 19, 2020న వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 2022 జూలై 23న వీఆర్వోలను ఇతర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్దుబాటు చేసింది. ఆ సమయాన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీ లేక.. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కలిగిన వీఆర్వోలను అటెండర్, స్వీపర్, కామాటి, కుక్, తోటమాలి, జీపు డ్రైవర్, రికార్డు కీపర్, రికార్డ్ అసిస్టెంట్, వార్డు అధికారి, సీనియర్ స్టెనో, జూనియర్ స్టెనో తదితర పోస్టుల్లో సర్దుబాటు చేశారు. అయితే, సరైన స్థాయి పోస్టులు లేక, ఆశించిన గౌరవం కూడా లభించటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు... కొత్త ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెబుతుండగా, పూర్వ వీఆర్వోలు ఆశలు రెకేత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11వేల పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్న క్రమంలో పూర్వ వీఆర్వోలు 5వేల మందిని ఈ పోస్టుల్లోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఫలితంగా పూర్వ వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తీసుకోనుండగా, ఇంకొందరు నిరుద్యోగులకూ ఉద్యోగాకాశాలు దక్కే అవకాశముంది. ఏం పేరు? రాష్ట్రప్రభుత్వం భూభారతిలో విధులు నిర్వర్తించే వారికి గ్రామ పరిపాలన అధికారి(జీపీఏ) లేదా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వీఏఓ)గా పేరు పెట్టే అవకాశముందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. ఉగాది నాటికి స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, గ్రామస్థాయిలో వీఆర్వోలు కీలకం కానున్నందున జీపీఏనే పేరు ఖరారు చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ సమస్యలూ పరిష్కరిస్తే... తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంతో సర్వీస్ రక్షణతో పాటు పదోన్నతులు కోల్పోయామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇంక్రిమెంట్లు కోల్పోయామని, నేటికీ సర్వీస్ క్రమద్ధీద్దీకరణ జరగలేదని, ప్రొబేషనరీ పీరియడ్ ఖరారు చేయడం లేదనే వాదన ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జీసీసీలో సేల్స్మెన్లుగా, పెట్రోల్ బంక్ ఆపరేటర్లుగా కేటాయించిన 16మందికి వేతనాలు అందడం లేదని చెబుతున్నారు. అంతేకాక ఇద్దరు వీఆర్వోలు మృతి చెందడంతో కారుణ్య నియామకాల్లోనూ అవకాశం ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. కాగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇటీవల రెవెన్యూ అసోసియేషన్‌తో కలిసి పూర్వ వీఆర్వోలు సమావేశమయ్యారు. భూభారతిలో అవకాశం కల్పించడమే కాక ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆయనను కోరారు.ఉమ్మడి జిల్లాలో గ్రామాలు, వీఆర్వోల వివరాలు జిల్లా మండలాలు రెవెన్యూ వీఆర్వోలు గ్రామాలు ఖమ్మం 21 352 329 భద్రాద్రి 23 240 233 మొత్తం 44 592 562వేతనాలు అందడం లేదు వీఆర్వో వ్యవస్థ రద్దయ్యాక నన్ను గిరిజన కార్పొరేషన్ సొసైటీ(జీసీసీ)కి కేటాయించారు. ప్రభుత్వం 60శాతం, కార్పొరేషన్ 40శాతం నిధులతో వేతనం ఇవ్వాలి. కానీ సక్రమంగా వేతనాలు అందక ఇబ్బందిగా ఉంది. ఇతర శాఖల్లో మాదిరి కార్పొరేషన్లో పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్లు సౌకర్యాలు అందడం లేదు. – మట్టా వెంకటమ్మ, జీసీసీ ఉద్యోగి, మణుగూరుసీనియారిటీతో పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చి అప్పగించే ప్రతీ పనిని బాధ్యతగా చేస్తాం. అయితే, మా సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు వర్తింపచేయాలి. ప్రతీ గ్రామానికి ఒక సహాయకుడిని నియమిస్తే క్షేత్రస్థాయిలో సులువుగా పాలన సాగుతుంది. – గరికె ఉపేంద్రరావు, వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
చేతికి రాగానే కొనుగోళ్లు !
సిద్ధంగా 19.39లక్షల గన్నీబ్యాగ్‌లు ధాన్యం కొనుగోళ్లకు 64.62 లక్షల గన్నీ బ్యాగ్‌ల అవసరముండగా, ప్రస్తుతం 19.39 లక్షల బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. మిగతా 45.23 లక్షల బ్యాగ్‌లను ఈ నెలాఖరు నాటికి సమకూర్చుకుంటారు. ఇందులో 20.74 లక్షల సంచులు కొత్తవి, మిగతావి ఉపయోగించినవి సిద్ధం చేస్తారు. కొనుగోళ్ల ఆధారంగా గన్నీల కొరత రాకుండా కేంద్రాలకు సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.కొనుగోళ్ల వివరాలు.. ధాన్యం (అంచనా) 25,84,928 క్వింటాళ్లు సన్న రకం 18,53,370 క్వింటాళ్లు దొడ్డు రకం 7,31,558 క్వింటాళ్లు కేంద్రాలు 344 అవసరమైన గన్నీ బ్యాగ్‌లు 64.62 లక్షలు అందుబాటులో ఉన్నవి 19.39 లక్షలుసాక్షిప్రతినిధి, ఖమ్మం: ఈ యాసంగి రైతులు సాగు చేస్తున్న ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే నెల 1నుంచి జిల్లాలో కొనుగోళ్లు మొదలుకానుండగా 344 కేంద్రాల ద్వారా 25,84,928 క్వింటాళ్ల సేకరణను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో సన్న రకాలు 18,53,370 క్వింటాళ్లు, 7,31,558 క్వింటాళ్లు దొడ్డు రకం ఉన్నాయి. కేంద్రాలకు కావాల్సిన గన్నీ సంచులు సమకూరుస్తూనే, ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు సిద్ధం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి రెండో జోన్లో ఉన్న జిల్లాలో ఈ నెలాఖరు నాటికే వరి కోతలు మొదలుకానున్నాయి. దీంతో వచ్చే నెల మొదటి వారం నుంచి కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. 2.10లక్షల ఎకరాల్లో వరి సాగు జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుతో బోర్లు, బావులు, ఇతర నీటి వనరుల కింద 2,10,830 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో సన్న రకం 1,29,064 ఎకరాలు, దొడ్డు రకం 81,766 ఎకరాలు ఉన్నాయి. సన్నరకాలు క్వింటాకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ ఎక్కువగా సన్న రకాలే సాగు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం సాగుతో అంతా కలిపి 54,51,516 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు, రైతులు అవసరాల కోసం పోగా మిగిలిన ధాన్యం కొనేలా పౌర సరఫరాల సంస్థ కసరత్తు చేస్తోంది. ఈమేరకు 25,84,928 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని భావిస్తుండగా, ఇందులో సన్నరకాల కోసమే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటుచేసే అవకాశముంది. పీఏసీఎస్ కేంద్రాలే ఎక్కువ జిల్లాలో మొత్తం 344 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ఇందులో సన్న రకాల కోసం 282, దొడ్డు రకాల కోసం 62 కేంద్రాలు ఉంటాయి. వీటిలో ఐకేపీ 151, పీఏసీఎస్‌లు 162, డీసీఎంఎస్ 28, మెప్మా ఆధ్వర్యంలో మూడు కేంద్రాలను తెరుస్తారు. కాగా, ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసే వాటిలో 60 కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లే ఉంటాయి. కాగా, వచ్చే నెల 1 నుంచి జూన్ వరకు ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఉంటాయి.. ఎక్కడ కోతలు మొదలైతే అక్కడ తొలుత కొనుగోళ్లు ప్రారంభించేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో ఏర్పాటుచేసిన కేంద్రాల స్థానంలో ఈసారి కూడా ఉంటాయని తెలిపారు.వచ్చే నెల 1నుంచి యాసంగి ధాన్యం సేకరణ 344 కేంద్రాల ద్వారా 25.84 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు అంచనా ఇందులో సన్నరకాలే.. 18.53లక్షల క్వింటాళ్లు ఏర్పాట్లలో నిమగ్నమైన పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తున్నాం .. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. వచ్చే నెల 1నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి. ఏదైనా ప్రాంతంలో అంతకన్నా ముందే ధాన్యం వచ్చినా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొనుగోళ్లు చేపడతాం. – చందన్‌కుమార్, డీఎస్ఓ -
రేపటి నుంచి ఒంటి పూట బడులు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధి పాఠశాలలు ఈనెల 15వ తేదీ శనివారం ఒకటే పూట కొనసాగనున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకోగా, అన్ని పాఠశాలల్లో అమలుచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.సోమశేఖరశర్మ సూచించారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని, ఆతర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు. కాగా, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న పాఠశాలలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. 16న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 16న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. అండర్–14, 16, 18, 20, పురుషులు మహిళల విభాగాల్లో 100, 400, జవాలీన్త్రో అంశాల్లో పోటీలు ఉంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షపీక్ అహ్మద్ తెలిపారు. క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. 15వ బెటాలియన్ కమాండెంట్‌గా పెద్దబాబు సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగా రంలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా ఎన్. పెద్దబాబు గురువారం బాధ్యతలు స్వీకరించా రు. యాపలగడ్డలోని రెండో బెటాలియన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు అసిస్టెంట్ కమాండెంట్ ఎస్.శ్రీధర్‌రాజు, ఎస్డీ రంగారెడ్డి, అధికారులు స్వాతం పలికారు. 1991వ బ్యాచ్‌కు చెందిన పెద్దబాబు యాపలగడ్డలోని రెండో బెటాలియన్‌లో అడిషనల్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా కమాండెంట్‌గా పదోన్నతి కల్పించి గంగారం బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ కమాండెంట్‌గా ఉన్న పీజేపీసీ.చటర్జీ హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు బదిలీ అయ్యారు. హోలీ సందర్భంగా ఆంక్షలు ఖమ్మంక్రైం: చిన్నాపెద్ద తేడా లేకుండా జిల్లావాసులు శుక్రవారం హోలీ పండుగ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, పండుగను సంబురంగా జరుపుకునే క్రమాన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీ పోలీస్ యాక్ట్ ద్వారా శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలే తప్ప రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా వ్యవహరిస్తే వాహనాలు సీజ్ చేస్తామని పేర్కొన్నారు. పరిచయం లేని వ్యక్తులపై రంగులు చల్లినా, గొడవలు సృష్టించినా చర్యలు తప్పవన్నారు. అలాగే, ప్రధాన కూడళ్లు, సాగర్ కెనాల్, మున్నేరు, ఇతర రిజర్వాయర్ల వద్ద బందోబస్తు ఉంటుందని తెలిపారు. అంతేకాక కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, వైన్స్ బార్లలో సాయంత్రం 6గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నందున షాపులు తెరిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు. విధుల్లోకి జూనియర్ లెక్చరర్లు ఖమ్మం సహకారనగర్: ఇటీవల జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న వారికి ఇటీవల హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందజేశారు. ఇందులో జిల్లాకు 57మంది లెక్చరర్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు వీరంతా విధుల్లో చేరుతున్నారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. లెక్చరర్ల రాకతో కళాశాలల్లో సబ్జెక్ట్ అధ్యాపకుల కొరత తీరనుందని పేర్కొన్నారు. జిల్లా కోర్టులో సౌర విద్యుత్ ఖమ్మం లీగల్: జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్యానళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపై అందరూ దృష్టి సారించాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించినట్లవుతుందని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కోర్టులో సౌర విద్యుత్ వినియోగానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి హరికృష్ణ, ఉద్యోగలు రాధేశ్యామ్, ఓంకార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నేరెళ్ల శ్రీనివాస్, చింత నిప్పు వెంకట్ తదితరలు పాల్గొన్నారు. -
తాగు, సాగునీటికి ఇబ్బందులు రావొద్దు
● చివరి ఆయకట్టు వరకు సాఫీగా నీటి సరఫరా ● పాలేరు రిజర్వాయర్‌తో పాటు పంటలు పరిశీలించిన కలెక్టర్ఖమ్మం రూరల్/కూసుమంచి: వేసవికాలం మొదలైనందున తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో కలెక్టర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆయన నీటిమట్టం, సాగర్ నుండి వస్తున్న నీటి వివరాలు ఆరా తీయడంతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు సూచనలు చేశారు. వారబందీ విధానంలో నీరు విడుదల చేస్తూనే మధ్యలో ఎక్కడా వృథా కాకుండా చూడాలని, తద్వారా చివరి ఆయకట్టుకు చేర్చాలని తెలిపారు. సాగునీటి విడుదల, ఆపే విషయమై రైతులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అలాగే, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో పంటలను పరిశీలించిన కలెక్టర్ సాగునీటి సమస్యపై రైతులతో మాట్లాడారు. తల్లంపాడు కాల్వ గట్టు నుండి యడవల్లి వరకు బైక్‌పై వెళ్లిన కలెక్టర్ అక్కడ మిర్చి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సాగర్ ఆయకట్టులో ఎకరం కూడా ఎండిపోకుండా అధికారులు పర్యవేక్షించాలని, పంట కోతలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తహసీల్దార్ కరుణశ్రీ, ఇరిగేషన్ డీఈఈ మధు, ఏడీఏ సరిత, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు. పిల్లల సమగ్రాభివృద్ధికి చర్యలు ఖమ్మంవన్‌టౌన్: బాలల సదనంలో ఉంటున్న పిల్లల సమగ్రాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. బాలల సదనం పిల్లలను కలెక్టరేట్‌కు తీసుకురాగా ఆయన చదువు, ఇతర వివరాలు తెలుసుకున్నారు. పిల్లలను క్యాంటీన్‌కు తీసుకుని వెళ్లి స్వయంగా భోజనం వడ్డించారు. ఇటీవల వండర్ లాకు వెళ్లివచ్చిన పిల్లల అనుభవాలు తెలుసుకోవడమే కాక బాలల సదనంలో కంప్యూటర్లు సమకూర్చాలని, పర్యాటక ప్రదేశాలతో పాటు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్‌కు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, డీసీపీయూ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఖమ్మం సహకారనగర్: మహిళలను గౌరవిస్తూ వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళా అధికారులు, ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారన్నారు. తల్లిదండ్రులు సైతం అమ్మాయిలపై వివక్ష చూపకుండా అబ్బాయిలతో సమానంగా చదివించాలని తెలిపారు. కాగా, కలెక్టరేట్లోని మహిళా ఉద్యోగులు వారి ఇంటి పరిసరాల్లో ఎవరికై నా ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్‌తో వెళ్లి అభినందనలు తెలపాలన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ కళావతిబాయి తదితరులు మాట్లాడగా బాల సదనం చిన్నారులు, పలు కళాశాలల విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అలాగే, చదువు, క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థినులు, ఎన్సీసీ కేడెట్లు, మహిళా ఉద్యోగులకు డీఆర్వో పద్మశ్రీ జ్ఞాపికలు అందజేశారు. ఆతర్వాత బేటీ బచావో, బేటీ పడావో పోస్టర్లను ఆవిష్కరించారు. డీడబ్ల్యూఓ కెరాంగోపాల్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అరుణ, వివిధ శాఖల అధికారులు విష్ణు వందన, సమ్రీన్ తదితరులు పాల్గొన్నారు. ●రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని అంగన్వాడీ సెంటర్–4 టీచర్ ఉపవాణి బెస్ట్ టీచర్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఆమెకు డీడబ్ల్యూఓ జ్ఞాపిక, సర్టిఫికెట్ అందజేశారు. అంబులెన్స్ ప్రారంభం ఖమ్మంవైద్యవిభాగం: మారుమూల ప్రాంతాల ప్రజలకు సత్వరమే వైద్యసేవలు అందేలా ఆర్ఐఎన్ఎల్ సంస్థ బాధ్యులు కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా ఆర్ అంబులెన్స్ అందజేశారు. కామేపల్లి, కారేపల్లి ప్రాంత వాసుల కోసం సమకూర్చిన ఈ అంబులెన్స్ పత్రాలను కలెక్టరేట్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అందించగా ఆయన కొద్దిదూరం వాహనం నడిపారు. మాధారం డోలమైట్ మైన్ డీజీఎం, ఇన్చార్జ్ బీ.యూ.వీ.ఎన్.రాజు మాట్లాడగా డీఎంహెచ్ఓ కళావతిబాయి, ఆర్ ఐఎన్ఎల్ ఉద్యోగి పి.చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సీతారామ’తో 8లక్షల ఎకరాలకు సాగునీరు
● ఈ నెలాఖరుకల్లా రైతులందరికీ భరోసా జమ ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లిటౌన్: రానున్న నాలుగేళ్లలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని, తద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏడు నుంచి ఎనిమిది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టులో భాగమైన సత్తుపల్లి మండలం యాతాలకుంటలోని ట్రంక్ టన్నెల్ పనులను గురువారం ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్ వి.పాటిల్‌తో కలిసి పరిశీలించారు. ఈక్రమంలో టన్నెల్లోకి మంత్రి తుమ్మల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి పనులను పరిశీలించాక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే ఉగాదికల్లా బేతుపల్లి చెరువు, లంకాసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరతాయని, తద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. జిల్లా యంత్రాంగానికి ప్రజల సహకారం.. ఆపై శ్రీరామచంద్రుడి దయతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు టన్నెల్ భూసేకరణ, అటవీ అనుమతుల కోసం కలెక్టర్ చొరవ చూపితే పాలేరుకు సైతం గోదావరి జలాలు చేరతాయన్నారు. ఇద్దరు కలెక్టర్లు కష్టపడుతూనే మనస్సు పెట్టి పనిచేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. సంప్రదాయ పంటలు వద్దు.. నీళ్ల విలువ రైతులకే ఎక్కువగా తెలుస్తుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈమేరకు సంప్రదాయ పంటలు కాకుండా ఆయిల్‌పామ్ వంటివి సాగు చేస్తే రైతులు రాజుల్లా బతకవచ్చన్నారు. ఉపాధిహామీ పథకంతో ఉచితంగా నీటి గుంతలు తవ్విస్తున్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ రైతులు అవగాహనతో లాభదాయక వ్యవసాయం చేస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా బాగు పడతాయని తెలిపారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎస్ఈలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసాచారి, మార్కెట్ చైర్మన్లు దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజాచౌదరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.రాజేశ్వరి, ఎఫ్డీఓ మంజులతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, డాక్టర్ మట్టా దయానంద్, సాధు రమేష్‌రెడ్డి, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, చల్లగుళ్ల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
పండితాపురం సంత వేలం మరోసారి..
● రూ.2.35కోట్ల వరకు కొనసాగిన పాట ● ప్రభుత్వ మద్దతు ధర రాక వాయిదా కామేపల్లి: రాష్ట్రంలోనే పేరున్న మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీ కృష్ణప్రసాద్ సంత నిర్వహణను అప్పగించేందుకు నిర్వహించిన వేలంలో ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో పాటను రద్దు చేశారు. జీపీ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్ అధ్యక్షతన గురువారం వేలం పాట నిర్వహించగా బోడా శ్రీను, భూక్యా వీరన్న, బానోత్ శంకర్, భూక్యా నాగేంద్రబాబు ధరావత్తు, సాల్వెన్సీగా రూ.35లక్షల చొప్పున చెల్లించారు. సాయంత్రం 4గంటల వరకు హోరాహోరీగా సాగిన వేలంలో చివరకు రూ.2,35,70,000తో హెచ్చు పాటదారుడిగా బోడా శ్రీను నిలిచాడు. అయితే, ప్రభుత్వ మద్దతు రాకపోవడంతో రద్దు చేసిన అధికారులు తిరిగి ఈనెల 17న మరోమారు వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు మొదటి, రెండు స్థానాల్లో ఉన్న బోడా శ్రీను, భూక్యా వీరన్న చెల్లించిన ధరావత్తు, సాల్వెన్సీ సొమ్మును జీపీ అధికారులు ఆధీనంలోకి తీసుకోగా, మిగతా వారి నగదు చెల్లించారు. అయితే, ప్రభుత్వ మద్దతు ధర ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు. వేలం పాటను జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఎల్పీఓ రాంబాబు పర్యవేక్షించగా ఎస్సై సాయికుమార్ ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీఓలు ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ, కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు. -
●అత్యాధునికంగా ఖమ్మం స్టేషన్ !
ఖమ్మం రాపర్తినగర్: అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న ఖమ్మం రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఈ స్టేషన్లో ముఖద్వారం, ప్లాట్‌ఫాంల ఆధునికీకరణ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల ఏర్పాటు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.25.41 కోట్లు కేటాయించగా ఇప్పటికే 45 శాతం మేర పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. కొద్దినెలల్లో పనులు పూర్తికానుండగా స్టేషన్ కొత్తరూపు సంతరించుకునే అవకాశముంది. కాగా, ఒకేసారి రెండు రైళ్లు వచ్చినా సాఫీగా రాకపోలు జరిగేందుకు రెండు మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆఖరు దశకు చేరాయని, రెండేసి లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫాం పొడిగింపు, దివ్యాంగుల కోసం కొత్త టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, వెయిటింగ్ హాల్ నిర్మాణం కూడా పూర్తికావొస్తున్నాయి. వేగంగా ఆధునికీకరణ పనులు -
చివరి దశకు ‘యాతాలకుంట’
● మిగిలిన టన్నెల్ పనులు 681 మీటర్లే.. ● కాల్వల్లో ఇప్పటికే గోదావరి పరవళ్లు ● అధికారులతో నేడు మంత్రి తుమ్మల సమీక్ష సత్తుపల్లి: యాతాలకుంట టన్నెల్ నిర్మాణ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంటున్నాయి. 1,781 మీటర్ల పనులకు గాను 1,100 మీటర్ల మేర పూర్తయ్యాయి. ఇంకా 681 మీటర్ల పని మిగిలి ఉంది. భూ నిర్వాసితులకు రూ.15 కోట్లు చెల్లించడంతో రైతుల నుంచి అడ్డంకులు తొలిగిపోగా.. పనుల్లో వేగం పుంజుకుంది. రోజుకు నాలుగు షిఫ్టుల్లో 24 గంటలూ పనులు చేపడుతున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సత్తుపల్లి ట్రంక్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బుగ్గపాడు వద్ద కాల్వల నిర్మాణ పనులకు కొంత ఆటంకం ఏర్పడినా ఇటీవలే రైతులకు పరిహారం చెల్లించడంతో ఆ సమస్య పరిష్కారం అయింది. కమలాపురం పంప్‌హౌస్ నుంచి.. యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయితే కమలాపురం పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలు దమ్మపేట మండలం మల్లెపూల వాగు మీదుగా బేతుపల్లి పెద్దచెరువుకు చేరుకుంటాయి. అక్కడి నుంచి బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ ద్వారా వేంసూరు, సత్తుపల్లి మండలాల్లోని పొలాలకు గోదావరి జలాలు చేరుకుంటాయి. అయితే సీతారామ ప్రాజెక్టు కింద రూ.29 కోట్లతో అంతర్గతంగా కాల్వల నిర్మాణానికి భూమి సేకరిస్తున్నారు. దీంతో చివరి పొలాలకు కూడా సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తారు. రాజీవ్ లింక్ కెనాల్‌తో.. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా కాల్వలు డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే జూలూరుపాడు మండలం వినోభానగర్‌లోని రాజీవ్ లింక్ కెనాల్ నుంచి ఏన్కూరు వద్ద ఎన్నెస్పీ కెనాల్‌కు అనుసంధానం చేయగా తల్లాడ, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు మండలాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్ నిర్మాణం భద్రమే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంతో యాతాలకుంట టన్నెల్ పనులపై అధికారులు పలుమార్లు సమీక్షలు చేసి నిర్మాణ పనులు భద్రమేనని నిర్ధారించుకున్నారు. 5.25 మీటర్ల వెడల్పు గల టన్నెల్ నిర్మిస్తున్నారు. టన్నెల్ తవ్వేప్పుడు వస్తున్న నీటిని ఆరు మోటార్లతో బయటకు తోడుతున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి జియాలజిస్ట్ బృందం తనిఖీ చేసి సొరంగం లోపల భూమి పరీక్షలు నిర్వహించి సూచనలు చేస్తోంది. నేడు మంత్రి సమీక్ష.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి యాతాలకుంట టన్నెల్ పనులను గురువారం పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే సత్తుపల్లి పట్టణానికి తాగునీరు, పరిసర ప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంటుంది. -
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ఖమ్మంఅర్బన్: పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 10వ డివిజన్ చైతన్యనగర్‌లో అమృత్ –2లో భాగంగా రూ.249 కోట్లతో చేపడుతున్న మురుగు నీటి పైపులైన్, అండర్‌గ్రౌండ్ డ్రైయిన్ నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం నగరాభివృద్ధికి ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నామని చెప్పారు. డ్రైయిన్ల నిర్మాణంలో పేదల స్థలాలు ఏమైనా కోల్పోయినా వారికి ప్రత్యామ్నాయం చూపించి పక్కాగా పనులు చేపట్టాలన్నారు. గతంలో వచ్చిన పరిస్థితి మరోసారి ఖమ్మం నగరానికి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ న్యాయపరంగా తొలగించాలని మంత్రి మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పేదలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందించాలని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రపంచంలో వచ్చే మార్పులపై మనం కూడా దృష్టి పెట్టాలని, రెండేళ్ల క్రితం దేశంలో పట్టణీకరణ కారణంగా అర్బన్ జనాభా పెరిగిందని అన్నారు. ఖమ్మం నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి తుమ్మలకు ధన్యవాదాలు తెలపాలన్నారు. ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఉందని, ఖమ్మం లాంటి చిన్న నగరానికి కూడా ఇది వచ్చిందంటే మంత్రి తుమ్మల కృషే కారణమని అన్నారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా ఉన్నట్టుగానే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం కూడా నగరంలో రాబోతోందని, తద్వారా దేశంలో పెద్ద నగరాలతో పాటు ఖమ్మం నిలవనుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేయర్ పునుకొల్లు నీరజ, ఆర్డీఓ నరసింహారావు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్లు చావా మాధురి నారాయణరావు, సరిపూడి రమాసతీష్, లకావత్ సైదులు, నిరీషారెడ్డి, రావూరి కరుణసైదబాబు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పల్లెబోయిన చంద్రం, హుస్సేన్, మున్సిపల్ ఎస్ఈ రంజిత్, తహసీల్దార్ రవి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు సాధు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారం నగరాభివృద్ధికి చర్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి మురుగు నీటి పైప్‌లైన్ నిర్మాణ పనుల శంకుస్థాపన -
ఖాళీ పోస్టుల భర్తీకి 22న పరీక్షలు
● జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్ రావు ఖమ్మంలీగల్: జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలో ఖాళీ పోస్టుల భర్తీకి ఈనెల 22న పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి కె.వి. చంద్రశేఖర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని, సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. స్టేనో/టైపిస్ట్ పరీక్ష ఉదయం 9 నుంచి ఉదయం 9.45 వరకు, టైపిస్ట్ కం అసిస్టెంట్ పరీక్ష ఉదయం 10.15 గంటల నుంచి ఉదయం 11 వరకు, జూనియర్ అసిస్టెంట్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు, రికార్డు అసిస్టెంట్ పరీక్ష 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు https://khammam.dcourts.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. 31లోగా దరఖాస్తు చేసుకోండిఖమ్మంవన్టౌన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రెండో దశకు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జీఎం టి.సీతారాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.5 వేలు, 6 వేల చొప్పున చెల్లిస్తామని, 12 నెలల ఇంటర్న్‌షిప్ కాల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 21 – 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, వివరాలకు 1800 11 6090 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ‘లిఫ్ట్’ పనుల్లో నాణ్యత లోపించొద్దు● ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి రఘునాథపాలెం : లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో నాణ్యత లోపించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని జల వనరుల శాఖ ప్రభుత్వ సలహాదా రు పెంటారెడ్డి అధికారులకు సూచించారు. రఘునాథపాలెం మండలంలో రూ.66 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను బుధవారం ఆయన తనిఖీ చేశా రు. పంప్‌హౌస్, పైపులైన్ నిర్మాణం, మోటార్ల కొనుగోలు, సబ్‌స్టేషన్ నిర్మాణం తదితర పనులపై సమీక్షించి ఇంజనీర్లకు, కాంట్రాక్ట్ సంస్థకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ పాల్గొన్నారు. సబ్జైల్లో వరంగల్ రేంజ్ డీఐజీ విచారణ సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సబ్జైల్లో రిమాండ్ ఖైదీ పెండ్ర రమేష్ పరారీ, పట్టుబడిన ఘటన నేపథ్యంలో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ మాలారపు సంపత్ బుధవారం విచారణ చేపట్టారు. రిమాండ్ ఖైదీ పరారీ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరా తీశారు. జైలులో ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. సబ్‌జైల్ బయట గోడకు ఆనుకొని ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జైల్ ప్రాంగణమంతా కలియతిరిగి ఉద్యోగులు, ఖైదీలను విచారించారు. ఈ ఘటనపై త్వరలోనే శాఖా పరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ఆయన వెంట ఉమ్మడి ఖమ్మం జిల్లా సబ్‌జైళ్ల అధికారి జి.వెంకటేశ్వర్లు, సత్తుపల్లి జైల్ సూపరింటెండెంట్ ఎస్.ప్రవీణ్ ఉన్నారు. కొనసాగుతున్న ఐటీ తనిఖీలు !ఖమ్మం సహకారనగర్ : శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు చేస్తున్న తనిఖీలు నగరంలో బుధవారం సైతం కొనసాగాయి. అడ్మిషన్లు, ఫీజుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంల బదిలీఖమ్మంమయూరిసెంటర్ : టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో డిప్యూటీ ఆర్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న జి.ఎన్.పవిత్ర, భవానీ ప్రసాద్‌ను బదిలీ చేస్తూ సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ ప్రసాద్‌ను మహబూబ్‌నగర్‌కు, జి.ఎన్.పవిత్రను షాద్‌నగర్‌కు బదిలీ చేశారు. కాగా, వీరి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. -
చదువుతోనే గుర్తింపు
● విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలు రాయాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మంఅర్బన్: చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని, విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలు బాగా రాయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. నగరంలోని పాండురంగాపురం పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, వసతి, విద్యాబోధనను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాలు విద్యార్థుల భవిష్యత్‌కు తొలిమెట్టని అన్నారు. పలు అంశాలపై విద్యాబోధన చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. వారితో మమేకమై ఎలా చదువుతున్నారు? టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థికి గొప్ప లక్ష్యం ఉండాలని, దాన్ని సాధించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సౌకర్యాలు ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అన్ని రకాల పుస్తకాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట డీఈఓ సోమశేఖరశర్మ తదితరులు ఉన్నారు. -
తేజా @ ఖమ్మం
మార్కెట్లో పెరిగిన మిర్చి విక్రయాలు ● విదేశీ ఎగుమతులకు అడ్డాగా ఖమ్మం ● తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న తేజా మిర్చి ● గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన విక్రయాలుఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన మిర్చిఖమ్మంవ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్లలో మిర్చి విక్రయం ఎక్కువగా ఉంటుంది. అయితే కాలక్రమంలో ఖమ్మం మార్కెట్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ప్రాంతంలో తేజా మిర్చి సాగు అధికంగా ఉండడం, ఈ మిర్చికి విదేశాల్లో డిమాండ్ ఉండడంతో ఎగుమతిదారులు ఈ రకం మిర్చి కొనుగోళ్లకు ఖమ్మం మార్కెట్‌ను ఎంచుకున్నారు. తేజా మిర్చి, మిర్చి ఆయిల్ చైనా, మలేషియా, బంగ్లాదేశ్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి అవుతోంది. విదేశీ ఎగుమతులు పెరుగుతుండగా రైతులు ఈ పంట సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ.. రాష్ట్రంలో తేజా మిర్చి సాగు పెరుగుతోంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2.50లక్షల ఎకరాల్లో ఈ రకం మిర్చి సాగు చేశారు. గతంలో ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేజా మిర్చి సాగు ఉండేది. కానీ ఇప్పుడు ఈ జిల్లాలతో పాటు నల్లగొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నిర్మల్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లోనూ తేజా మిర్చి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఒక్క ఖమ్మం జిల్లాలోనే 60 వేలకు పైగా ఎకరాల్లో మిర్చి సాగు చేయడం గమనార్హం. ఖమ్మం కేంద్రంగా ధర నిర్ణయం.. గతేడాది తేజా రకం మిర్చి క్వింటా రూ. 20 వేల నుంచి రూ. 23వేల వరకు ధర పలికింది. దీంతో వివిధ ప్రాంతాల రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపారు. అయితే ఈ ఏడాది చైనాలో తేజా మిర్చి ఉత్పత్తి పెరిగింది. ఈ ప్రభావం ఇక్కడ మిర్చి ధరపై పడింది. ఇప్పుడు చైనా నుంచి ఆశించిన ఆర్డర్లు లేకపోవడంతో ఎగుమతిదారులు కొనుగోళ్లు తగ్గించడంతో పాటు కొనుగోలు చేసేవారు సైతం తక్కువ ధర పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం మిర్చి ధర గరిష్టంగా రూ.14 వేలు ఉండగా, మోడల్ ధర రూ.13,500 ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పండించిన ప్రాంతాల్లో అక్కడి వ్యాపారులు ఖమ్మం మార్కెట్ ఆధారంగా రూ.12వేల నుంచి రూ. 12,500 ధరతో కొనుగోలు చేస్తున్నారు.జనవరి నుంచి మార్చి 11 వరకు ఖమ్మం మార్కెట్‌కు మిర్చి బస్తాల వివరాలు నెల 2024 2025 జనవరి 4,32,362 3,81,442 ఫిబ్రవరి 8,57,438 9,61,737 మార్చి 1,81,248 5,10,995 మొత్తం 14,71,048 18,54,174పోటెత్తుతున్న మిర్చి.. తేజా రకం మిర్చికి ఖమ్మం మార్కెట్ అడ్డాగా మారడం, విదేశీ ఎగుమతిదారులు ఈ మార్కెట్లో కొనుగోళ్లు చేస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పంట సాగు చేసిన రైతులు ఇక్కడ విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం ఈ మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. దీంతో ఖమ్మంలో మిర్చి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా రెండో కోత తర్వాత ఇక్కడ విక్రయాలు మరింతగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 11 వరకు 3.80 లక్షల మిర్చి బస్తాలు అధికంగా విక్రయానికి వచ్చాయి. -
పత్తి సాగుపై రైతులకు అవగాహన
వైరా: వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం కిసాన్ మేళా నిర్వహించారు. ఆఽధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న మాట్లాడుతూ సంప్రదాయ విధానంలో కంటే అధిక సాంద్రత పద్ధతిలో అఽధిక దిగుబడి సాధించవచ్చని చెప్పారు. వరి సాగు పద్ధతులపై మరో ప్రధాన ఽశాస్త్రవేత్త డాక్టర్ వెంకన్న వివరించారు. వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మేలైన వరి సాగుకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అపరాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె రుక్మిణీ దేవి మాట్లాడుతూ.. జిల్లాలో అపరాల సాగు పెరుగుదలకు కృషి చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖాధికారి మధుసూదన్, పశువైద్య శాఖ ఏడీఏ డాక్టర్ కె శ్రీరమణి, మధిర, వైరా ఏడీఏలు విజయచంద్ర, టి.కరుణశ్రీ, ప్రొఫెసర్ ఐ.వి. శ్రీనివాసరెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్టినేటర్ డాక్టర్ కె.రవికుమార్, శాస్త్రవేత్తలు వి. చైతన్య, డాక్టర్ ఫణిశ్రీ, రైతులు రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.వైరా కేవీకేలో కిసాన్ మేళా -
‘హస్తం’లో మల్లగుల్లాలు!
సీతారామ ఎత్తిపోతల పథకం పేరు మార్పు యోచన? ● ఇందిరా/రాజీవ్ పేరు పెట్టాలని కాంగ్రెస్ ముఖ్యనేతల చర్చ ● వైఎస్ హయాంలో రాజీవ్, ఇందిరాసాగర్లు ప్రారంభం ● తెలంగాణ వచ్చాక సీతారామగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేరుపై చర్చ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ పేర్లతో చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేసిందనే అభిప్రాయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. డీపీఆర్‌కు అనుమతులు సాధించడం మొదలు భారీ స్థాయిలో నిధులు సైతం తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నందున, సీతారామ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌కు గతంలో ఉన్న ఇందిరాసాగర్ లేదా రాజీవ్‌సాగర్ పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎలా ఉంటుందనే చర్చ ఇటీవల ముఖ్యనేతల మధ్య జరిగినట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టారు. దుమ్ముగూడెం ఆనకట్ట ఆధారంగా రాజీవ్ సాగర్ ఉండగా, కొత్తగా వేలేరుపాడు మండలం రుద్రంకోట కేంద్రంగా ఇందిరాసాగర్ నిర్మించేలా డిజైన్ చేశారు. వీటికి సంబంధించి కొంతమేర పనులు చేపట్టాక రాష్ట్ర విభజన జరిగింది. దీంతో ఇందిరాసాగర్ ప్రాంతం పూర్తిగా ఏపీ పరిధిలోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్లను రద్దు చేస్తూ కొత్తగా సీతారామ బహుళార్థక సాధక ఎత్తిపోతల పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొమ్మిదేళ్లుగా... సీతారామ ప్రాజెక్ట్ పనులు 2016లో మొదలైతే తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటివరకు పూర్తికాలేదు. 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నపళంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించేందుకు రాజీవ్ సాగర్ లింక్ కెనాల్‌ను ప్రతిపాదించింది. ఏడాది కాలంలో ఈ కాలువ పనులు పూర్తి చేశారు. దీంతో తొలిసారిగా సాగర్ ఆయకట్టుకు ఈ నెల 5న గోదావరి జలాలను తరలించారు. మరోవైపు గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 13 వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంచనా వ్యయాన్ని రూ.19 వేల కోట్లకు సవరించాల్సి వచ్చింది. ఫాయిదా వచ్చేనా ? ఉమ్మడి ఖమ్మం జిల్లా అనాదిగా భద్రాచల సీతారాముల పేరుతోనే ప్రసిద్ధి పొందింది. తానీషా కాలం నుంచి నేటి ముఖ్యమంత్రుల వరకు సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సీతారామ పేరు ఈ జిల్లాకు సెంటిమెంట్‌తో ముడిపడిన అంశంగా ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు పేరులో మార్పులు చేస్తే ఫలితాలు ఎంత మేరకు సానుకూలంగా ఉంటాయనే అనుమానాలు కూడా అధికార పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. రాజీవ్ కెనాల్ తరహాలో సీతారామ ప్రాజెక్టు స్వరూప స్వభావాల్లో ఎలాంటి మార్పులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా లింక్ కెనాల్‌ను తెర మీదకు తెచ్చింది. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ అని పేరు పెట్టగా, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పైగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వచ్చాయి. ఇదే తరహాలో సీతారామ పేరు మార్చకుండా భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా చేపట్టబోయే ఇల్లెందు నియోజకవర్గ మాస్టర్ ప్లాన్‌కు రాజీవ్/ఇందిరా సాగర్ల పేరును పరిశీలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయాలు ఇంజనీరింగ్ వర్గాల నుంచి వస్తున్నాయి. పైగా సీతారామకు సంబంధించిన తొలి శంకుస్థాపన సైతం ఇల్లెందు నియోజకర్గంలోనే జరిగింది. కానీ తర్వాత మార్పుల్లో ఈ నియోజకవర్గాన్ని సీతారామ లబ్ధిదారుల జాబితా నుంచి దాదాపుగా మినహాయించారు. అనుబంధ పనులు ప్రస్తుతం సీతారామలో ఎక్కడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేదు. రోళ్లపాడు దగ్గర 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించే అంశంపైనా ప్రస్తుత ప్రభుత్వం చర్చ చేసింది. దీంతోపాటు సీతారామ ద్వారా నీరు అందని భద్రాచలం, తక్కువ ప్రయోజనం పొందే పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల కోసం కొత్తగా ఎత్తిపోతలు చేపట్టే ప్రతిపాదనలు ఉన్నాయి. సీతారామకు అనుబంధంగా చేపట్టబోయే పనులు అనేకం ఉన్నందున, వాటికి కొత్తగా పేర్లు పెట్టడం ద్వారా స్వామికార్యం, స్వకార్యం రెండూ జరిగిపోతాయనే చర్చ హస్తం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
దేవాలయ వివాదంపై అధికారుల విచారణ
నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం వివాదం ముదురుతోంది. కొంత కాలంగా దేవాలయాన్ని నిర్వాహకులు పట్టించుకోవటం లేదని, కనీసం దీప, ధూప, నైవేద్యం కూడా పెట్టటం లేదని గ్రామస్తులు దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. కొంతకాలంగా అంకమ్మతల్లి దేవాలయం విషయంలో వివాదం తలెత్తింది. జాతర సమయంలో తప్ప, మిగతా సమయంలో దేవాలయంలో కనీసం దీప, ధూప, నైవేద్యం కూడా పెట్టటం లేదని గ్రామస్తులు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఈ.వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ ఈఓ పి.శ్రీకాంత్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 14 నుంచి జరిగే జాతర అనంతరం మరోమారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, గ్రామస్తుల అభిప్రాయాలు, ప్రస్తుత నిర్వాహకుల వివరణ తీసుకుని నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఏడు నామినేషన్లు దాఖలు ఖమ్మంసహకారనగర్: ఖమ్మం జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం ఏడు సభ్యులకు గాను మూడు రోజుల్లో ఏడుగురు నామినేన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి అవధానుల శ్రీనివాస్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి బి.శ్రీధర్‌సింగ్, మహిళా విభాగానికి సంబంధించి జి.మృదుల, ఉబ్బన సరిత, జనరల్ కేటగిరికి సంబంధించి ఏలూరి శ్రీనివాసరావు, కోల రాంబాబు, జి.బాలకృష్ణ, ఎర్రా రమేశ్ నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా ఎన్నికల ఫలితాలు మాత్రం హైకోర్టు ఆదేశానుసారం వెల్లడిస్తామని చెప్పారు. ఏకగ్రీవమయ్యే అవకాశం.. హౌస్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించి ఏడుగురు సభ్యులు ఉండగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా.. మొత్తంగా ఏడు నామినేషన్లు మాత్రమే దాఖలు కావటంతో ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి ఎద్దుల పోటీలు వేంసూరు: మండలంలోని కందుకూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం సందర్భంగా గొర్ల సత్యనారాయణరెడ్డి (బుల్లిబాబు) జ్ఞాపకార్థం గురువారం నుంచి మూడురోజులపాటు జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి ఎద్దులు కందుకూరు చేరుకున్నాయి. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.40 వేలు, 3వ బహుమతి రూ.30 వేలు, 4వ బహుమతి రూ.25 వేలు 5వ బహుమతి రూ.20 వేలు, 6వ బహుమతి రూ.15 వేలు, 7వ బహుమతి రూ.10 వేలు, 8వ బహుమతి రూ.7 వేలు అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు. -
జాతీయస్థాయి పోటీల్లో రజతం
ఖమ్మంస్పోర్ట్స్: బిహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న జాతీయస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో ఖమ్మానికి చెందిన బి.వైశాలి రజత పతకం సాధించింది. హైప్టాథ్లిన్ ఈవెంట్లో పతకం సాధించిన ఆమెను డీవైఎస్ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ ఎండీ గౌస్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు నున్న రాధాకృష్ణ, అధ్యక్షులు మందుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి షఫీక్ అహ్మద్, సభ్యులు కృష్ణయ్య, సుధాకర్, శశి, రవి, వెంకటేశ్వర్లు, పవన్‌కుమార్, శ్రీనివాస్, హజీరా ఫాతిమా, ముజహిద్, నవీద్ తదితరులు అభినందించారు. -
గ్యాస్ లీక్ అయి వ్యాపించిన మంటలు
సత్తుపల్లిటౌన్: పిండి వంటలు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి పైపు నుంచి మంటలు వ్యాపించిన ఘటన బుధవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన జెరిపిటి వెంకటేశ్వరరావు ఇంట్లో కుటుంబ సభ్యులు కలిసి ఇంటి వరండాలో పిండి వంటలు చేసేందుకు గ్యాస్ పొయ్యి వెలిగింయారు. పైపు లీక్ కావటంతో మంటలు వ్యాపించడంతో మహిళలు దూరంగా వెళ్లిపోయారు. ఫైరింజన్‌కు సమాచారం అందించటంతో వీధిలో కొద్దిదూరం వరకు వచ్చి రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఆగిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే సుమారు రూ.2 లక్షల విలువైన సామగ్రి దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. యువతి అదృశ్యం చింతకాని: మండలంలోని నేరడ గ్రామానికి చెందిన యువతి కనిపించకుండా పోయినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవటంతో ఆమె తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నాగుల్‌మీరా తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి కొణిజర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని శాంతినగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ జి.సూరజ్, స్థానికుల కథనం ప్రకారం.. వైరా మున్సిపాలిటీ పరిధిలోని కొణిజర్ల మండలం దిద్దుపూడికి చెందిన అమర్లపూడి పుల్లయ్య (63) షుగర్ వ్యాధి పరీక్ష చేయించుకునేందుకు గాను తన ద్విచక్రవాహనంపై వైరా వెళ్తున్నాడు. దిద్దుపూడి అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సూరజ్ తెలిపారు. పుల్లయ్య సీపీఐ కార్యకర్త కావడంతో ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, యర్రా బాబు, దొండపాటి రమేశ్, కొండపర్తి గోవిందరావు, పవన్, నాగభూషణం, లాజర్, గోపాల్‌రావు, వెంకటేశ్వర్లు, దావీదు నివాళులర్పించారు. లింక్ ఓపెన్ రూ.3.50 లక్షలు మాయం కూసుమంచి: కూసుమంచికి చెందిన పుసులూరి ఉపేందర్ ఖాతా నుంచి తనకు తెలియకుండానే రూ.3.50 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఉపేందర్ సెల్‌కు పీఎం కిసాన్ పేరుతో ఓ లింక్ రాగా దాన్ని ఓపెన్ చేశాడు. దీంతో అతని ఖాతా నుంచి సోమవారం రూ.2 లక్షలు, మంగళవారం ఉదయం మరో రూ.1.50 లక్షలు మాయమయ్యాయి. ఉపేందర్ వరి కోత మిషన్లను లీజుకు తీసుకుని నడుపుతుండగా వాటికి అడ్వాన్స్ చెల్లించేందుకు ఫోన్‌పేను ఓపెన్ చేసి డబ్బులు పంపేందుకు యత్నించగా ఖాతాలో నగదు లేకపోవటాన్ని గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించి ఖమ్మంలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా వారు విచారణ చేపట్టారు. పీఎం కిసాన్ లింక్ ఓపెన్ చేయటం వలనే నగదును సైబర్ నేరగాళ్లు డ్రా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని బాధితుడు తెలిపాడు. ◘ షార్ట్ సర్క్యూట్‌తో ఎలకి్ట్రకల్ షాప్ దగ్ధం తిరుమలాయపాలెం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రికల్ షాప్ దగ్ధమైన ఘటన బుధవారం మండలంలోని కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీరామ ఎలకి్ట్రకల్ షాప్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. షాప్‌లోనే నివాసం ఉండటంతో సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని షాపు నిర్వాహకుడు రాము వేడుకుంటున్నాడు. రూ.2 లక్షల ఆస్తి నష్టం -
కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రస్తుత సమాజంలోనే కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌లో నిర్వహించనున్న ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాల్లో అందరూ భాగస్వాములు కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ నేటికీ వివిధ రూపాల్లో కులవివక్ష కొనసాగుతుండగా, పలు పట్టణాల్లో ఇంకా దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని తెలిపారు. వీటిని పారద్రోలేందుకు చట్టాలు, జీఓలు ఉన్నా పాలకవర్గాలు అమలు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యాన ఏప్రిల్‌ను మహనీయుల మాసంగా ప్రకటించి పూలే, అంబేద్కర్ జన జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ప్రసాద్, నందిపాటి మనోహర్, నాయకులు మాచర్ల భారతి, బండి రమేష్, బొట్ల సాగర్, కొమ్ము శ్రీను, నకిరేకంటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు -
ఏప్రిల్ నెలాఖరు వరకు నీళ్లు ఇవ్వాల్సిందే...
కొణిజర్ల: కొణిజర్ల మండలం పెద్దగోపతి, చిన్నమునగాల, కాచారం గ్రామాల్లో పంటలను జల వనరుల శాఖ అఽధికారులు మంగళవారం పరిశీలించారు. ఎస్ఈ వాసంతి, ఈఈ బాబూరావు, డీఈ గౌతమి శిల్ప, ఏఈ నవీన్ పంటలు పరిశీలించగా పలువురు రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపల్లె మేజర్ కింద తమ పంటలు ఎండిపోతుంటే నీళ్లు ఇవ్వకుండా, దిగువ మండలాలకు తరలించేడమేమిటని నిలదీశారు. అంతేకాక అధికారులు వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎస్ఈ వాసంతి స్పందిస్తూ ఎన్నెస్పీ నుంచి బోనకల్ బ్రాంచ్ కాల్వకు విడుదల చేసే నీటిని తగ్గించారని, ఆ దామాషా ప్రకారమే మేజర్లకు నీరు విడుదల చేస్తున్నామని బదులిచ్చారు. అయినా సాయంత్రం నుంచి ఐదు రోజుల పాటు నిరంతరాయంగా నీరు విడుదల చేస్తామని చెప్పగా, కనీసం ఇప్పుడు వారం పాటు ఇవ్వాలని, ఏప్రిల్ 15 వరకు కాకుండా నెలాఖరు వరకు విడుదల చేస్తేనే పంటలు చేతికి వస్తాయని రైతులు పేర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్ఈ తెలిపారు. ఎన్నెస్పీ ఆయకట్టు రైతుల డిమాండ్ -
కమ్యూనిస్టు యోధుడు, పోరాట సారథి రవన్న
ఖమ్మంమయూరిసెంటర్: విప్లవ కమ్యూనిస్టు యోధుడు, ప్రతిఘటన పోరాట సారధి రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) అని, ఆయన ఆశయాల సాధన కోసం అందరూ ఉద్యమించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏపీ, తెలంగాణ అధికార ప్రతినిధులు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్డీ ఆధ్వర్యాన రవన్న తొమ్మిది వర్ధంతి సభ సందర్భంగా మంగళవారం ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించాక భక్తరామదాసు కళాక్షేత్రంలో సమావేశమయ్యారు. తొలుత ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించాక నాయకులు మాట్లాడారు. విద్యార్థిగా ఉన్నప్పుడే విప్లవోద్యమానికి ఆకర్షితుడైన ఆయన ప్రతిఘటన పోరాట పంథా అమలు చేశాడని తెలిపారు. రవన్న ఆయన ఆశయ సాధనకు ఉద్యమిస్తూనే పాలకుల విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు ఆవునూరి మధు, వి.కోటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్, గౌని ఐలయ్య, బండార ఐలయ్య, ఝాన్సీ, మంగ, అరుణోదయ నాగన్న, డేవిడ్ కుమార్, రాజేంద్రప్రసాద్, కోలా లక్ష్మీనారాయణ, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సభలో పీపీ, సాధినేని -
హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రుణమాఫీ పూర్తిచేసి రైతుభరోసా ఇస్తుండగా సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఈ బడ్జెట్లోనూ ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. – పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రిజిల్లా సస్యశ్యామలమే లక్ష్యం ‘సీతారామ’ ప్రాజెక్టు పూర్తితో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం. ఖమ్మంలో అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నా. నగరం మొత్తం యూజీడీ కోసం రూ.1,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించా. – తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిసైలో బంకర్ సమస్యను ప్రస్తావిస్తా.. అంబేద్కర్‌నగర్, బీసీ కాలనీవాసులు సైలో బంకర్‌తో పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. సీతారామ ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు నిధులు కోరతా. గంగదేవిపాడు, తాళ్లపెంట రైతులకు పాస్‌పుస్తకాలు, చెక్‌డ్యామ్‌లకు నిధులు కేటాయించాలని విన్నవిస్తా. – డాక్టర్ మట్టా రాగమయి, ఎమ్మెల్యే, సత్తుపల్లి కళాశాలలు రావాలి.. నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ, పీజీ కళాశాలలు మంజూరు చేయాలని నివేదిస్తా. కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో సాగర్ కాల్వలపై లిఫ్ట్‌ల నిర్మాణం ఆవశ్యకతను కూడా ప్రస్తావిస్తా. పర్యాటక కేంద్రంగా వైరా రిజర్వాయర్ అభివృద్ధి నిధులు కోరతాను. – మాలోత్ రాందాస్‌నాయక్, ఎమ్మెల్యే, వైరా -
రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో అంకమ్మ తల్లి, అక్కమ్మ పేరంటాల శ్రీరామలింగయ్య స్వామి తిరునాళ్ల సందర్భంగా మంగళవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థాయి న్యూ జూనియర్స్ ఎడ్ల పూటీ పందేలు నిర్వహించారు. ఈ పోటీల్లో వరుసగా ఐదు బహుమతులను ఏపీలోని గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు(రూ.30వేలు), బాపట్ల జిల్లా చిన్నగంజాంకు చెందిన ముంగర విజయలక్ష్మి(రూ.25ఏలు), కృష్ణా జిల్లా కొత్తపాలెంకు చెందిన ముత్తి నాని(రూ.20వేలు), బాపట్ల జిల్లా పెద్దపూడికి చెందిన ఆళ్ల హరికృష్ణ(రూ.17వేలు), బాపట్ల జిల్లా జజిరకి చెదిన యలమందల గోపాలకృష్ణ(రూ.15వేలు)కు చెందిన ఎడ్లు గెలుచుకున్నాయి. కాగా, సీనియర్స్ ఎడ్ల పూటీ పందేలు బుధవారం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ పూజారి వేమిరెడ్డి వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గాయపడిన కానిస్టేబుల్‌కు పరామర్శ ఖమ్మంక్రైం: సత్తుపల్లిలో పారిపోతున్న దొంగను పట్టుకునే క్రమాన కత్తి పోట్లకు గురై ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మల్లెల నరేష్‌ను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ఆయన, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఎకై ్సజ్ ఉద్యోగులకు రివార్డులుఖమ్మంక్రైం: గంజాయి రవాణా, అమ్మకం కేసుల్లో నిందితుల అరెస్ట్, శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టిన ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎకై ్సజ్ ఉద్యోగులు రివార్డులు అందుకున్నారు. వీరిని హైదరాబాద్‌లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఖమ్మం, కొత్తగూడెం ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు నాగేందర్‌రెడ్డి, జానయ్య, మణుగూరు, భద్రాచలం సీఐలు రాజిరెడ్డి, రహీమున్నీసాబేగంతో పాటు రాజు, సర్వేశ్వరరావు, రవికుమార్, కానిస్టేబుళ్లు మారేశ్వరావు, నాగేశ్వరరావు, పగిడిపర్తి గోపి రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి తిరుమలాయపాలెం: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్.. బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఏనెకుంటతండాకు చెందిన సుమన్‌నాయక్(30) మోటార్ సైకిల్‌పై కాకరవాయి వెళ్లి ఇంటికి వస్తుండగా కూలీలను దించేందుకు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమన్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య సునీత, 45 రోజుల కుమారుడు ఉన్నాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఆయన మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోగా, సుమన్ మృతదేహం వద్ద సునీత రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. బల్లేపల్లి వద్ద ఒకరు... ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని బల్లేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఘునాథపాలెంకు చెందిన రేవూరి సాయిప్రసాద్(35) గత నెల 26న ఖమ్మంలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈఘటనలో గాయపడిన ఆయనకు ఖమ్మం చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా మృతి చెందాడు. ఈమేరకు సాయిప్రసాద్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. యువతిపై అత్యాచారం చింతకాని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి సమీప గ్రామానికి చెందిన ఒక యువతిపై అత్యాచారం చేశాడు. ఈనెల 7వ తేదీన యువతిని బలవంతంగా బయటకు తీసుకెళ్లిన ఆయన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు. -
తొలిసారి తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి చరిత్రలోనే తొలిసారి తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. కారేపల్లి మండలం ఎర్రబోడు మాణిక్యారానికి చెందిన గడిబోయిన వెంకటేశ్వర్లు చాన్నాళ్లుగా తుంటి నొప్పితో ఇబ్బంది పడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో సంప్రదిస్తే కీలు మార్పిడికి రూ.3 లక్షలు అవుతుందని చెప్పారు. నలుగురు కుమార్తెల తండ్రి అయిన ఆయన అంత వెచ్చించలేక, హైదరాబాద్ వెళ్లలేక ఖమ్మం పెద్దాస్పత్రిలో సంప్రదించాడు. దీంతో వైద్యులు ఆయన ‘ఎవాస్క్యూలర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమొరల్ హెడ్’తో బాధపడుతుండగా రెండు తుంటి కీళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈమేరకు తుంటి కీలు మార్చి ‘అన్ సిమెంటెడ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్’ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రొఫెసర్లు ఎల్.కిరణ్‌కుమార్, హనుమాన్సింగ్, అసిస్టెంట్ ప్రొఫె సర్లు వినయ్‌కుమార్, మదన్‌సింగ్, అనస్తీషియన్ రవి, అసోసియేట్ ప్రొఫెసర్ యుగంధర్ ఆధ్వర్యాన ఆపరేషన్ చేయగా వెంకటేశ్వర్లు రెండో రోజునే వాకర్ సాయంతో నడక ప్రారంభించాడు. మరో పది రోజుల్లో ఇంకో తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నామని వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.6లక్షల వ్యయమయ్యే ఈ చికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందింది. వైద్యులను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త కిరణ్‌కుమార్, ఆర్ఎంఓ రాంబాబు, వినాయక్ రాథోడ్ అభినందించారు.విజయవంతంగా పూర్తిచేసిన పెద్దాస్పత్రి వైద్యులు -
మహిళలు స్వయంశక్తితో ఎదగాలి
వైరారూరల్: మహిళలు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్వయంశక్తితో ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఆయన మంగళవారం వైరా మండలం పుణ్యపురం పర్యటన ముగించుకుని నుంచి ఖమ్మం వెళ్తుండగా కేజీ సిరిపురంలో గ్రామ మహిళా సమాఖ్య సమావేశం జరుగుతోందని తెలిసి హాజరయ్యారు. గ్రామ పరిస్థితి, తాగునీటి సరఫరా, పాఠశాల నిర్వహణ, వైద్యులు, గ్రామ కార్యదర్శి పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధిస్తే వారి కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈమేరకు ఇందిరా మహిళా శక్తి ద్వారా సీ్త్ర టీ స్టాళ్లు, మిల్క్ పార్లర్ తదితర యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఏ వ్యాపారం ఎంచుకున్నా శిక్షణ ఇప్పించాక ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఆ తర్వాత కూడా అధికారులు తోడుగా నిలుస్తారని కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో అడిషనల్ డీఆర్డీఓ నూరొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఉద్యోగి
ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ సమయం సమీపించినా తీరు మార్చుకోలేని ఎకై ్సజ్ ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం బస్ డిపో రోడ్డులో సాయికృష్ణ బార్ నిర్వహించిన శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం మూసివేశాడు. మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్న ఆయన ఏడాది లైసెన్స్ ఫీజు చెల్లించగా ఎకై ్సజ్ శాఖ అధికారులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో బార్ లైసెన్స్‌కు జిరాక్స్ కాపీ కావాలని న్యాయవాది చెప్పడంతో శ్రీనివాస్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లానాయక్‌ను సంప్రదించాడు. ఇందుకోసం రూ.2వేలు డిమాండ్ చేయగా ఆర్థిక సమస్యలతో అంత ఇచ్చుకోలేనని చెప్పాడు. అయితే, లైసెన్స్ శ్రీనివాస్ తల్లి పేరిట ఉన్నందున ఆమెనే తీసుకురావాలని సూచించాడు. కానీ వృద్ధురాలైన ఆమె రాలేదని చెప్పినా ససేమిరా అనడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారి సూచన మేరకు రూ.1,500 ఇస్తానని శ్రీనివాస్ చెప్పగా సోమ్లానాయక్ అంగీకరించాడు. ఈమేరకు నగదుతో శ్రీనివాస్‌ను పంపించి మాటువేసిన ఏసీబీ అధికారులు డబ్బు తీసుకుంటుండగా సోమ్లాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోన్నారు. కాగా, ఏసీబీ దాడి జరిగిన సమయాన ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి సహా పలువురు అధికారులు ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను హైదరాబాద్‌లో రివార్డులు అందుకుంటుండడం గమనార్హం. 2012లో ఇదే ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి పట్టుబడిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు.లైసెన్స్ కాపీ జిరాక్స్ ఇచ్చేందుకు రూ.2వేలు డిమాండ్ -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత
తమిళనాడు జైలులో పరిచయంతో కలిసి దోపిడీలు ● వైరాలో దోచుకున్నాక కర్ణాటకలోనూ చోరీ ● రూ.37 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం వైరా: వివిధ నేరాలకు పాల్పడిన వారు తమిళనాడు జైలులో శిక్ష అనుభవించారు. అయితే, బెయిల్‌పై బయటకు వచ్చాక సైతం వారి స్నేహం కొనసాగింది. జల్సాల కోసం ఒకరు.. చేసిన అప్పులు తీర్చేందుకు మరొకరు చోరీలకు పాల్పడే వారు పాత అలవాట్లు మానుకోలేక మళ్లీ దొంగతనాలనే ఎంచుకున్నారు. అడ్డొస్తే ప్రాణాలు సైతం తీసేందుకు వెనకడుగు వేయని నైజం కలిగిన వారు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఈమేరకు వైరాలో వృద్ధురాలు ఒంటరిగా ఉండడాన్నిగమనించి వారి ఇంట్లో గతనెల 12న చోరీ చేసిన ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వీరి వివరాలను మంగళవారం వైరాలో పోలీసు కమిషనర్ సునీల్‌దత్.. ఏసీపీ ఎం.ఏ.రెహమాన్‌తో కలిసి వెల్లడించారు. అందరినీ కలిపింది జైలు... ఏపీలోని పల్నాడు జిల్లా పోరేటిపాడుకు చెందిన రాయపాటి వెంకయ్య అలియాస్ దొంగల వెంకన్న, అదేజిల్లా దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన షేక్ నాగుల్‌మీరా, తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా మాణిక్యంపాలెంకు చెందిన ముత్తు అలియాస్ ముత్తురాజ్, వీరప్పన్ సత్రకు చెందిన విజయ్ అలియాస్ విజయ్‌కుమార్‌కు తమిళనాడులోని జైలులో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వివిధ నేరాలపై వెళ్లిన క్రమాన ఏర్పడిన పరిచయాన్ని బయటకు వచ్చాక కొనసాగించారు. ఈక్రమంలో ముఠాగా ఏర్పడిన వారు అధికారుల పేరిట తనిఖీలకు వెళ్లి దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే గతనెల 12న వైరాలోని సుందరయ్య నగరలో వృద్ధురాలు శీలం వెంకట్రావమ్మ ఒంటరిగా ఉందని గుర్తించారు. దీంతో నలుగురు కారులో వచ్చి పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఓ వ్యక్తికి ధరంచి వెంకట్రామ్మ ఇంటిలోకి వెళ్లి ఆమె కొడుకు గంజాయి అమ్ముతున్నాడని, ఇంట్లో సోదాలు చేయాలని చెబుతూ లోనకు ప్రవేశించారు. ఆపై వృద్ధురాలిని బంధించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారు వాడిన కారు, వచ్చివెళ్లిన రహదారులపై సీసీ పుటేజీల సాయంతో తెలంగాణ, ఏపీలో గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే నలుగురు మరోమారు కారులో వస్తుండగా వైరా మండలం దాచాపురం సమీపాన తనిఖీల్లో పోలీసులకు మంగళవారం పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.నాలుగు రాష్ట్రాల్లో కేసులు ఈ కేసులో పట్టుబడిన రాయపాటి వెంకన్నపై తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిపి 30 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. మరో నిందితుడు షేక్ నాగులు మీరాపై ఏపీ, కర్ణాటకలో 10 కేసులు ఉండగా, ముత్తుపై తమిళనాడు, కర్ణాటకలో 11, విజయ్‌పై తమిళనాడులో నాలుగు కేసులు ఉన్నాయని చెప్పారు. ఇందులో హత్య కేసులు కూడా ఉండడం గమనార్హం. కాగా, వైరాలో దోపిడీ అనంతరం ఫిబ్రవరి 16న విజయవాడలో కారు కిరాయి తీసుకుని 22వ తేదీన కర్ణాటక చేరుకున్నారు. అక్కడ వెంకన్న, నాగుల్‌మీరా, ముత్తు ఓ ఇంటికి వెళ్లి పౌర సరఫరాల శాఖ ఉద్యోగులుగా చెబుతూ కత్తులతో బెదిరించి 120 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. కాగా, వైరాతో పాటు కర్ణాటక చోరీ చేసిన ఆభరణాలు కలిపి రూ.37లక్షల విలువైన ఆభరణాలే కాక రెండు కార్లు, వేట కొడవళ్లు, గడ్డపార వంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. కాగా, కేసు విచారణకు వైరా ఏసీపీ రహమాన్ ఆధ్వర్యాన సీఐ నునావత్ సాగర్ నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేయడమేకాక చోరీ సొత్తు రికవరీచేసిన సీఐ సాగర్, వైరా తల్లాడ, కొణిజర్ల ఎస్సైలు భాగ్యరాజ్, కొండలరావు, సూరజ్, ట్రెయినీ ఎస్ఐలు పవన్, వెంకటేష్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లకు సీపీ రివార్డులు అందజేశారు. -
ఔను.. వీరు విజేతలు !
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన గ్రూప్ – 1, 2 ఫలితాల్లో జిల్లా వాసులు పలువురు సత్తా చాటారు. కష్టపడి చదివిన వీరు మెరుగైన మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి అభినందనలు అందుకుంటున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే ఇతర ఉద్యోగాలు చేస్తూనే గ్రూప్స్‌కు సిద్ధం కాగా, ఇంకొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ సిద్ధమయ్యారు.● గ్రూప్–1, 2లో సత్తాచాటిన జిల్లా వాసులు ● ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న కొందరు..●కల్లూరు మండలం నుంచి ఇద్దరు కల్లూరురూరల్: గ్రూప్–1 ఫలితాల్లో కల్లూరు మండలం నుంచి ఇద్దరు యువకులు మంచి మార్కులు సాధించారు. మండలంలోని ఎర్రబోయినపల్లికి చెందిన దొడ్డాపునేని సందీప్ గ్రేప్–1 ఫలితాల్లో 506 మార్కులు సాధించాడు. ఆయన ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఎస్సైగా పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సర్వేశ్వరరావు – పద్మ దంపతుల కుమారుడైన సందీప్ ఏన్కూరు రెసిడెన్షియల్ స్కూల్, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ తర్వాత బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్సై పోస్టుతో పాటు గతంలో గ్రూప్–4, రైల్వే శాఖలో ఉద్యోగం, పంచాయతీ కార్యదర్శి, అటవీ శాఖతో పాటు ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగం కలిపి ఆయన ఆరు ఉద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఇక చిన్నకోరుకొండికి చెందిన కుమ్మరి పంకజ్ గతంలోనే గురుకుల డిగ్రీ లెక్చరర్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో పాటు గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్–1 పరీక్షలో 404 మార్కులు సాధించాడు. ఆయన తల్లిదండ్రులు కుమ్మరి ప్రభాకర్‌రావు, కృష్ణప్రియ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు.●గ్రూప్–2లో స్టేట్ ర్యాంక్.. కామేపల్లి: గ్రూప్–2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయగా కామేపల్లి మండలం గోవింద్రాలబంజరకు చెందిన గంగారపు సత్యనారాయణ–జ్యోతిర్మయి దంపతుల చిన్న కుమారుడు రత్నేశ్వరనాయుడు రాష్ట్రస్థాయిలో 197వ ర్యాంకు సాధించాడు. అలాగే, జోనల్లో 27వ ర్యాంకు వచ్చింది. ఆయనకు గ్రూప్–1లోనూ 467 మార్కులు సాధించడం విశేషం. ప్రసుత్తం రత్నేశ్వరనాయుడు ఖమ్మం కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా సివిల్స్ సాధనే తమ కుమారుడి లక్ష్యమని సత్యనారాయణ తెలిపారు.●ఇది నాలుగో ఉద్యోగం.. తల్లాడ: తల్లాడ మండలం మల్లవరానికి చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు గ్రూప్–2లో 387 మార్కులతో రాష్ట్రంలో 148వ ర్యాంకు, జోన్లో 20వ ర్యాంక్ సాధించాడు. సన్నకారు వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన బీకామ్ పూర్తి చేశాక 2018లో తొలిసారిగా ఏపీలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాదించాడు. 2019లో తెలంగాణలో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఉద్యోగం, 2020లో విద్యుత్ శాఖలో జేఏఓగా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం జేఏఓగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందినా పట్టుదలతో చదివి తన ప్రతిభతో ఉద్యోగాలు సాధిస్తున్న ఆయన పలువురి అభినందనలు అందుకున్నాడు. కాగా, వెంకటేశ్వరరావు పదో తరగతి వరకు బాలభారతి విద్యాలయం, ఇంటర్ కేఎస్ఎం కళాశాల, డిగ్రీ ఖమ్మం డీఆర్ఎస్ కళాశాలలో చదివాడు. -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు
భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలోని బాలురు, కాచనపల్లిలోని బాలికల స్పోర్ట్స్ స్కూళ్లతో పాటు హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ఐదో తరగతికి ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్ స్థాయిలో ఈనెల 16 నుంచి 18వరకు, జిల్లాస్థాయిలో 26 నుంచి 28వ తేదీ వరకు పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 9 – 11 ఏళ్ల వయస్సు కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అర్హులని వెల్లడించారు. భద్రాద్రి జిల్లా విద్యార్థులు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో, ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉసిరికాయలపల్లిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగే డివిజన్ స్థాయి పోటీలకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అపై జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తుది ఎంపిక పోటీలు నిర్వహించి ప్రవేశాలకు అర్హులను ఎంపిక చేస్తామని పీఓ తెలిపారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగగా, 19,835మంది విద్యార్థుల్లో 19,104మంది హాజరు కాగా 731మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. డీఈసీ, హెచ్పీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు తాను 46 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించారు. 14 నుంచి ఖమ్మం మార్కెట్‌కు సెలవులు ఖమ్మంవ్యవసాయం: హోలీ, వారాంతం నేపథ్యాన ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈనెల 14న శుక్రవారం హోలీ, 15న శనివారం వారాంతపు సెలవు, 16న ఆదివారం సాధారణ సెలవు ఉంటాయని, 17న సోమవారం మార్కెట్లో కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులతో పాటు వ్యాపారులు, కార్మికులు గమనించాలని కోరారు. ఏజెన్సీ నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్లో క్లీనింగ్ కాంట్రాక్టు దక్కించుకుని కార్మికుల వేతనాల్లో కోత విధిస్తున్న మహబూబాబాద్‌కు చెందిన సాయినాథ్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యులకు అధికా రులు మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న అంశంపై ‘సాక్షి’లో మంగళవారం ‘కార్మికుల కష్టం కాజేస్తున్నారు’ శీర్షికన కథనంప్రచురితమైంది. దీంతో ఏజెన్సీకి నోటీస్ జారీ చేసినట్లు కలెక్టరేట్ ఏఓ అరుణ తెలిపారు. ఈ నోటీసుకు అందే వివరణ ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గృహ నిర్మాణ పనుల పరిశీలన మధిర: మండలంలోని చిలుకూరును ఇందిరమ్మ ఇళ్లకు పైలట్ గ్రామంగా ఎంపిక చేయగా 37మంది లబ్ధిదారులు నిర్మాణాలను మొదలుపెట్టారు. ఈమేరకు పనులను మంగళవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నమూనా, ఇప్పటివరకు అయిన వ్యయం తెలుసుకున్నారు. దశల వారీగా బిల్లులు మంజూరు కానున్నందున, నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఎం శ్రీనివాసరావు, గ్రామకార్యదర్శి మరీదు కొండలరావు, నాయకులు నిడమానూరు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆశల పల్లకిలో..
పెండింగ్ పనులకు నిధులు, కొత్త పథకాల అమలు, వీటి కోసం అర్హుల ఎదురుచూపులు... ఇలా ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో తమ కలలు సాకారం అవుతాయా.. అని ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో పనులకు కావాలి ్సన నిధులపై నివేదికలతో హైదరాబాద్ పయనమయ్యారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఉమ్మడి జిల్లాకు ఈ సారి బడ్జెట్లో నిధుల కేటాయింపు దండిగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంరూ.19వేల కోట్లలో ఎంత? ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే సీతారామ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.19,324 కోట్లకు ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఎంత మేర నిధులు ఈ బడ్జెట్లో కేటాయిస్తారో తేలాల్సి ఉంది. భారీగా నిధులు వస్తేనే ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమయ్యే అవకాశముంది. ఇప్పటివరకు భద్రాద్రి జిల్లాలో ప్రధాన కాల్వ 104 కి.మీ. మేర పూర్తికాగా. భూసేకరణ, అటవీ అనుమతుల జాప్యంతో వైరా, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాల్లో పనులు పెండింగ్ ఉన్నాయి. పర్యాటకంపై మరింత దృష్టి గత బడ్జెట్లో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న కనకగిరి గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి పేర్కొనగా.. ఎకో టూరిజం పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యాన ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు మహర్దశ వస్తుందని భావిస్తున్నారు. తద్వారా నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం, భద్రాచలం, ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వరాలయం తదితర పుణ్యక్షేత్రాలు కూడా నూతన శోభను సంతరించుకునే అవకాశముంది. రేషన్ కార్డులు, ఇళ్ల కోసం కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రజాపాలన సభల్లో ఖమ్మం జిల్లాలో 37,152 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి 26న కొందరితో జాబితా విడుదల చేసినా మిగతా కార్డుల జారీపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే, మండలానికి ఒక్కో గ్రామంలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. దీంతో తమకు ఎప్పుడు అందుతాయని మిగతా గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. సమస్యల జాబితా చాంతాడంత ●గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీపీలకు నిధులు కేటాయిస్తే మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. ఉమ్మడి జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, ఖమ్మంలో యూనివర్సిటీ, నియోజ కవర్గాల్లో కళాశాలల ఏర్పాటు, ప్రాజెక్టులు తదితర సమస్యలకూ ఈ సమావేశాల్లో పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు. ఇక కొత్త మండలాల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. ●ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే మురుగునీటి సమస్య పరిష్కారమై పారిశు ద్ధ్యం మెరుగుపడుతుంది. ఖమ్మంలో యూజీడీ నిర్మాణానికి రూ.1,200 కోట్ల కేటాయింపుపై ఈ బడ్జెట్లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ●సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన సింగరేణి గనుల నుంచి బొగ్గులోడింగ్ ఏర్పాటు చేసిన సైలో బంకర్‌తో అంబేద్కర్ నగర్, బీసీ కాలనీ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బంకర్‌ను తొలగించాలని దీక్షలు చేపట్టిన నేపథ్యాన సమస్య త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ●నాగార్జునసాగర్ కెనాల్‌కు మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధిలోని భూములు ఆయకట్టుకు చివరలో ఉన్నాయి. దీంతో సాగునీరు అందని కారణంగా దీన్ని జోన్–3 నుంచి జోన్–2లోకి మార్చేందుకు రూ.800 కోట్లతో వైరా, కట్టలేరు నదులపై ఆనకట్టలు నిర్మించి ఎత్తిపోతల ద్వారా ఈ రెండు మండలాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదన ఉంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధిర నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు. అలాగే, మధిరలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ●ఖమ్మంరూరల్ మండలం ఎం.వీ.పాలెం కేంద్రంగా కొత్త మండలం చేయాలన్న డిమాండ్ ఉంది. కూసుమంచి మండలం పాలేరుకు ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైనా ఏర్పాటు కాలేదు. అలాగే బీచురాజుపల్లి వద్ద ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మాణంలో పట్టాభూమి కోల్పోతున్న వారు మార్కెట్ ధర ప్రకారం పరిహారం డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఆసక్తి సీతారామ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యతపై అంచనా పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తారని భావన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇతర పథకాలకు ఎదురుచూపులు భారీగా నిధులు సాధిస్తామంటున్న ఎమ్మెల్యేలు -
ఖమ్మం అంతటా యూజీడీ!
● రూ.1,200 కోట్లతో 900 కి.మీ. నెట్‌వర్క్‌కు ప్రతిపాదనలు ● అమృత్–2.0 కింద రూ.249 కోట్లతో తొలిదఫా నిర్మాణం ● నేడు 9.5 కి.మీ. పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలో నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఓపెన్ డ్రెయినేజీలతో పారిశుద్ధ్య లోపం ఎదురవుతుండగా సగానికి పైగా కార్మికులను డ్రెయినేజీలను శుభ్రం చేయడానికే కేటాయించాల్సి వస్తోంది. దీంతో అధికారులు, పాలకులు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను ప్రభుత్వానికి సమర్పించారు. నగరంలో 900 కి.మీ. మేర యూజీడీ నిర్మాణానికి రూ.1,200 కోట్లు అవసరమని అందులో పొందుపర్చారు. ఎక్కడా మురుగు కనిపించకుండా.. ఖమ్మం నగరమంతా యూడీజీ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. ఇది కార్యరూపం దాలిస్తే ఇళ్ల నుంచి మురుగునీరు, వ్యర్థాలు యూజీడీలోకి చేరేలా కనెక్షన్ ఇస్తారు. ఆపై మురుగునీటి శుద్ధీకరణ కోసం ఏడు ఏస్టీపీ(సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు నిర్మిస్తారు. తద్వారా నగరంలోని 60 డివిజన్ల పరిధిలో ఎక్కడా ఓపెన్ డ్రెయినేజీ ఉండదని చెబుతున్నారు. కాగా, ఎస్టీపీల్లో శుద్ధి చేశాక ఆ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించడంతో పాటు మిగిలితే మున్నేటిలోకి వదలనున్నారు. నేడు శంకుస్థాపన మహానగరాలకు దీటుగా విస్తరిస్తున్న ఖమ్మంలో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాటే పారిశుద్ధ్య సమస్య పెరుగుతుండగా అమృత్–2.0 ద్వారా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ)ని నిర్మాణానికి ఏర్పాట్లుచేశారు. తొలిదశలో రూ.249 కోట్ల నిధులతో 9.6 కి.మీ. మేర నిర్మించే యూజీడీ పనులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేస్తారు. యూజీడీతో పాటు రెండు ఎస్టీపీల నిర్మాణానికి సైతం ఆయన శంకుస్థాపన చేయనుండగా, పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఖానాపురం ఊర చెరువు నుండి ధంసలాపురం వరకు.. యూజీడీ నిర్మాణం ఖానాపురం ఊర చెరువు వద్ద మొదలవుతుంది. ఊర చెరువులో మురుగునీరు కలవకుండా కనెక్టింగ్ పాయింట్ ఏర్పాటుచేస్తారు. అక్కడ నుండి బైపాస్ రోడ్డు, లకారం చెరువు–మినీ లకారం చెరువుల మధ్య నుండి ధంసలాపురం చెరువు మీదుగా మున్నేరు వరకు నిర్మిస్తారు. ఇందులోకి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రెండు ఎస్టీపీలు నిర్మించనున్నారు. ధంసలాపురం చెరువు వద్ద 44 ఎంఎల్డీల సామర్థ్యంతో, పుట్టకోట చెరువు వద్ద 9.5 ఎంఎల్డీ సామర్థ్యంతో వీటి నిర్మాణం చేపడుతారు. యూజీడీతో పాటు ఈ రెండు ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే నగరంలో మురుగు సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. ఇక గోళ్లపాడు చానల్ ఆధునికీకరణలో భాగంగా నిర్మించిన యూజీడీకి సంబంధించి శ్రీనివాసనగర్ ప్రాంతంలో ఎస్టీపీ పూర్తయితే మురుగునీరు మున్నేరులో కలవకుండా అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. నీటి కలుషితం కావొద్దనే.. ప్రస్తుతం నగరంలో గృహాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుండి వస్తున్న మురుగు నీరు నేరుగా చెరువులు, మున్నేరులో కలిసి అందులోని నీరు కలుషితమవుతోంది. తద్వారా భవిష్యత్‌లో భూగర్భ జలాలు కలుషితతమయ్యే ప్రమాదముంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అధికారులు ఖమ్మంలో యూజీడీ నిర్మాణానికి సిద్ధమయ్యారు. చెరువులు, మున్నేరులో మురుగు నీరు కలవకుండా అడ్డుకునేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును పూర్తిచేసి దశల వారీగా మిగతా చోట్ల కూడ నిర్మిస్తే భవిష్యత్‌లో నగరవాసులకు ఓపెన్ డ్రెయినేజీ ఎక్కడ కానరాదని చెబుతున్నారు. -
ఒక్క ఎకరం కూడా ఎండిపోవద్దు..
● సమన్వయంతో చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినేలకొండపల్లి: నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా కార్యాచరణ సిద్ధంచేశామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూనే ఒక్కో హామీ అమలుచేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పలు చోట్ల రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్న నేపథ్యాన ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా సాగునీటి సరఫరాకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సన్న రకం ధాన్యం అమ్మిన రైతులందరికీ వారంలోగా బోనస్ జమ చేస్తామని, ఈ నెలాఖరులోపు రైతు భరోసా నిధులు అందిస్తామని తెలిపారు. ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మార్కెట్, సొసైటీ చైర్మన్లు వెన్నపూసల సీతారాములు, బాలాజీ, నాయకులు శాఖమూరి రమేష్, భద్రయ్య, గుండా బ్రహ్మం, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైరాకు కోటా కంటే ఎక్కువ ఇళ్లు వైరా: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుండగా, వైరాలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ వినతితో మరిన్ని ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైరాలోని క్యాంపు కార్యాలయంలో ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, గుమ్మా రోశయ్య, గోసు మధు, సీతారాములు, నర్సిరెడ్డి, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రిటైనింగ్ వాల్ పనుల్లో వేగం పెంచాలి ఖమ్మంఅర్బన్: మున్నేటికి ఇరువైపులా రూ.690కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్స్ పనుల్లో వేగం పెంచాలని, ఇందుకు అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి జలవనరులు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇచ్చేలా నివేదిక సమర్పిస్తే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అంతేకాక ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ నర్సింహారావు, జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈలు ఉదయ్‌ప్రతాప్, రమేష్‌రెడ్డి, మన్మధరావు పాల్గొన్నారు. -
●మండుటెండల్లో బంతిపూల సోయగం
ఓ పక్క ఎండ మండిపోతుండగా సాగునీరు అందక వరి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అయితే, పెద్దసంఖ్యలో ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు జరుగుతాయని.. తద్వారా బంతిపూలకు డిమాండ్ ఉంటుందని గ్రహించిన కొణిజర్లతో పాటు పల్లిపాడుకు చెందిన పలువురు రైతులు గత నెలలో బంతి సాగు చేశారు. ప్రస్తుతం తోటలు విరబూయగా పెళ్లిళ్లకు కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఉగాది, శ్రీరామనవమి నాటికి ఇంకాస్త ధర పెరిగితే లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు. – కొణిజర్ల -
దరఖాస్తు చేసుకుంటే స్థలాల రిజిస్ట్రేషన్
● రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి ● ఎల్ఆర్ఎస్ అవగాహన సదస్సులో డీఆర్ రవీందర్ ఖమ్మంమయూరిసెంటర్: 2020 ఏడాదికి ముందు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి నుంచి నిర్ణీత రుసుము కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) ఎం.రవీందర్ తెలిపారు. ఖమ్మంలోని జెడ్పీ సమావేశ మందిరం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో సోమవారం రియల్ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ల నిర్వాహకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ను రిజిస్ట్రేషన్ శాఖకు ఇటీవల ప్రభుత్వం లింక్ చేసిందని తెలిపారు. వెంచర్లలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తయి, మిగిలిన వాటికి ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేసి ఉంటే ఫీజులు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఈమేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయడమే కాక ఫీజు చెల్లించి, అండర్ టేకింగ్ ఇస్తే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అంతేకాక 2020 ఆగస్టు 26కు ముందు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోలేకపోయినా వారి స్థలా లకు అన్నీ సక్రమంగా ఉంటే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించొచ్చని తెలిపారు. తద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు. కాగా, కేఎంసీలో జరిగిన సమావేశంలో కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల కోసం కార్యాలయంలో ఎనిమిదింటితో పాటు పన్నుల వసూళ్ల కేంద్రాల్లోనూ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పా టు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తం చేసిన అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట, సబ్ రిజిస్ట్రార్ టి.సంపత్‌కుమార్, జాయింట్ రిజిస్ట్రార్ ఎస్.రమా కిషోర్‌రెడ్డి, కేఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
వైరల్ ఫీవర్‌తో వ్యక్తి మృతి
పెనుబల్లి: మండలంలోని యడ్లబంజర్ గ్రామానికి చెందిన రైతు బన్నే శ్రీనివాసరావు (35) వైరల్ ఫీవర్ బారిన పడి మృతి చెందాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనను ఆదివారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింగా వైరల్ ఫీవర్‌గా నిర్ధారించి చికిత్స చేస్తుండగానే సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి నేలకొండపల్లి: రోడ్డుప్రమాదంలో గాయపడిన మండలంలోని ఆరెగూడెంకు చెందిన కొమ్మినేని జగ్గయ్య(86) చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేలకొండపల్లి శివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనను హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే సోమవారం మృతి చెందాడు. జగ్గయ్యకు భార్య, ఇరువురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ఆయన మృతదేహం వద్ద మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు శాఖమూరి రమేష్, వడ్డె జగన్, మార్తి సైదయ్య, కె.భాస్కర్‌రావు తదితరులు నివాళులర్పించారు. స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడు మృతి ఖమ్మంరూరల్: మండలంలోని బారుగూడెం పరిధి శ్రీ సిటీకి చెందిన పిట్టల మనీష్(31) ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీసిటీకి చెందిన పిట్టల సుధాకర్ – నిర్మల పెద్ద కుమారుడు మనీష్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఆళ్లగడ్డలో తన స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్లాడు. ఈక్రమంలోనే మరికొందరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఆళ్లగడ్డ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మనీష్ మృతి చెందాడు. కాగా, ఆయనకు గత ఏడాది వివాహం జరగగా భార్యాభర్తలిద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మనీష్ తండ్రి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, మృతదేహం మంగళవారం స్వగృహానికి చేరుకుంటుందనే సమాచారం అందగా, మనీష్ మృతి చెందినట్లు తెలియడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆటో బోల్తా, 14 మంది కూలీలకు గాయాలు సత్తుపల్లిటౌన్: కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోలాపడడంతో 14 మందికి గాయాలయ్యాయి. కాకర్లపల్లికి చెందిన 14 మంది ఉపాధి హామీ కూలీలు సోమవారం ఉదయం సత్తుపల్లి తామర చెరువుమీదుగా కాకర్లపల్లి శివారులోని ఉపాధి పనులకు బయలుదేరారు. తామరచెరువు అలుగు వద్ద ఆటో కట్టపైకి వెళ్లే సమయాన అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో గాయపడిన కూలీలను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, తీవ్రగాయాలైన కె.పుల్లమ్మను ఖమ్మం తీసుకెళ్లారు. క్షతగాత్రులకు ఎంపీడీఓ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పరామార్శించారు. పసికందు విక్రయ కేసులో ముగ్గురికి జైలుశిక్షకొత్తగూడెంటౌన్: రెండు రోజుల మగ శిశువును విక్రయించిన కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలుశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా.. 2016లొ కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన నందబాల బాల వరలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు తమ రెండో కుమారుడు, రెండు రోజుల మగ శిశువును సిరిసిల్లకు చెందిన గాజుల రవీందర్‌కు విక్రయించారు. రూ. 80 వేలకు ఒప్పందం చేసుకోగా, అడ్వాన్స్ రూ.50 వేలు ఇచ్చి రవీందర్ పసికందును తీసుకెళ్లాడు. విషయం తెలియడంతో అప్పటి ఐసీడీఎస్ సూపర్వైజర్ పయ్యావుల రమాదేవి కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. తొమ్మిది మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి ముగ్గురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.విశ్వశాంతి వాదించగా, సీఐ శివప్రసాద్, నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్‌కుమార్, సిబ్బంది అబ్దుల్ ఘని, బి.శోభన్ సహకరించారు. -
సామాజిక బాధ్యత అవసరమే..
● నగరాల అభివృద్ధిలో కీలకంగా సీఎస్ఆర్ ఫండ్ ● పలుచోట్ల ఈ నిధులతోనే పనులు ● ఖమ్మంలోనూ సంస్థలు ముందుకొస్తే ఫలితం ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక బాధ్యత కలిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలు అందించే ఆర్థిక తోడ్పాటు నగరాభివృద్ధికి అండగా నిలవనుంది. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) ఫండ్‌తో ఇప్పటికే పలు నగరాల్లో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఆర్థికంగా బలపడి ఆదాయ పన్ను చెల్లించే వారు సీఎస్ఆర్ ద్వారా సహకారం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని పూణే వంటి నగరాల్లో అభివృద్ధి తెలియచేస్తోంది. ఇటీవల పూణే నగరంలో కేఎంసీ బృందం పర్యటించిన సమయాన అక్కడి వ్యాపారులు, సంస్థలు, ఆదాయపన్ను చెల్లింపుదారులు పూణే మున్సిపల్ కార్పొరేషన్‌కు సీఎస్ఆర్ ద్వారా భారీగా విరాళాలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిధులతో అక్కడి కార్పొరేషన్ అధికారులు ఒక ఆస్పత్రిని నిర్మించడం విశేషం. అంతేకాక నగరంలోని పలు కూడళ్ల సుందరీకరణ, నిర్వహణ పనులు చేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిధులకు తోడుగా... అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, నగరాల్లో ప్రజల సామాజిక బాధ్యత, భాగస్వామ్యం కీలకంగా నిలుస్తోంది. ఖమ్మంలో ప్రస్తుతం ప్రజలు చెల్లించే పన్నులతో పాటు ప్రభుత్వం మంజూరు చేసే నిధులతోనే అభివృద్ధి పనులను చేపడుతున్నారు. వీటికి తోడు సామాజిక బాధ్యత కలిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ ఆస్పత్రులు, పాఠశాలల బాధ్యులు సీఎస్ఆర్ ఫండ్ అందజేస్తే మరికొన్ని పనులు వేగంగా చేపట్టేందుకు వీలవుతుంది. పూణే స్టడీ టూర్లో కేఎంసీ కార్పొరేటర్లు, అధికారులు సీఎస్ఆర్ ద్వారా అందుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. దీంతో ఖమ్మంలోనూ వ్యాపార, వాణిజ్య సంస్థలే కాక కార్పొరేట్ సంస్థలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలు మొదలుపెట్టారు. తద్వారా కేఎంసీకి నిధులు సమకూరి అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఏర్పడడమే కాక ఆయా సంస్థలకు ఆదాయపన్నులో రాయితీ లభించనుంది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సీఎస్ఆర్ ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులు సమకూరితే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడం వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా అంగన్వాడీ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, పార్క్‌ల అభివృద్ధి, యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్, వాల్ పెయింటింగ్స్ కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం కేఎంసీకి వస్తున్న ఆదాయ పన్ను, ప్రభుత్వం మంజూరు చేసే వివిధ రకాల నిధులు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, చిన్నచిన్న అభివృద్ధి కార్యక్రమాలకే సరిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిధులు లేక పనులు ఆగిపోయిన సందర్భాలు ఎదురయ్యాయి. వీటన్నింటిని అధిగమించాలంటే దేశంలోని పలు మహానగర పాలక సంస్థలకు అందుతున్న విధంగానే ఖమ్మం నగరానికి సీఎస్ఆర్ ఫండ్ వస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. అనేక అవకాశాలు ఖమ్మం నగరానికి చెందిన పలువురు వ్యాపారులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించడంలో ముందు వరుసలో నిలుస్తున్నారు. మున్నేటి వరద వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వీరు స్పందించి ఇటు కలెక్టర్, అటు సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిధులు సమకూరుస్తున్నారు. ఇతర పట్టణాలు, నగరాలతో పోలిస్తే ఖమ్మంలో సామాజికంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం, అవసర సమయాన నిధులను అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిని ఒప్పించి కేఎంసీకి సీఎస్ఆర్ ఫండ్ సేకరించగలిగితే వారికి యూటీ(యుటిలైజేషన్ సర్టిఫికెట్) అందుతుంది. తద్వారా ఆదాయ పన్నులో మినహాయింపు లభించనుంది. ఆపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి, సుందరీకరణకు కీలకంగా నిలుస్తారు. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులు, పాఠశాలలు, బంగారు ఆభరణాల షోరూంలు, షాపింగ్‌మాల్స్ ఉన్నందున వీటి ద్వారా నిధులు రాబట్టవచ్చనే భావనకు వచ్చిన ప్రజాప్రతినిధులు ఆ దిశగా త్వరలోనే కార్యాచరణ మొదలుపెట్టే అవకాశముందని తెలుస్తోంది. -
కార్మికుల కష్టం కాజేస్తున్నారు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిబంధనల ప్రకారం కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాల్లో కాంట్రాక్టర్ కోత విధిస్తున్నాడు. ఇదేమిటని అడిగితే విధుల నుంచి తొలగిస్తాడనే భయంతో పనిచేయాల్సి వస్తోందని కలెక్టరేట్లో క్లీనింగ్ సెక్షన్ కార్మికులు చెబుతున్నారు. ‘ఎంత వేతనం వస్తుంది’ అని కలెక్టర్ అడిగినా నోరు విప్పలేని పరిస్థితి ఎదుర్కొంటున్న వారి సమస్యలపై సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో భారత కార్మిక సంఘాల కేంద్రం(టీయూసీఐ) నాయకులు ఆవుల అశోక్, పుల్లయ్య, కె.శ్రీను కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వేతనాల్లో కోత.. అడిగితే బెదిరింపులు కలెక్టరేట్లో క్లీనింగ్ కోసం ఏటా టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన వారికి అప్పగిస్తున్నారు. ఈ ఏడాది మహబూబాబాద్‌కు చెందిన సాయినాథ్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ దక్కగా 20 మంది వరకు సూపర్వైజర్లు, వర్కర్లు పనిచేస్తున్నారు. సూపర్వైజర్కు రూ.19,500, వర్కర్‌కు రూ.15,600 వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలి. కానీ వర్కర్‌కు రూ.7వేలు, సూపర్వైజర్కు రూ.14వేలే ఇస్తుండడంతో ఒక్కొక్కరు రూ.5వేల మేర ప్రతీనెలా నష్టపోతున్నారు. ప్రతిరోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉండగా మంత్రుల సమీక్షలు, ఇతర సమావేశాలు ఉన్నప్పుడు అదనంగా పనిచేస్తున్నా లాభం ఉండడం లేదని చెబుతున్నారు. అంతేకాక తమకు రావాల్సినంత చెల్లించాలని కాంట్రాక్టర్‌ను అడిగితే పనిలో నుంచి తీసే స్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు. ఈమేరకు ప్రజావాణిలో టీయూసీఐ నాయకులు ఆవుల అశోక్, పుల్లయ్య, కె.శ్రీను తదితరులు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేసి గత మార్చి నుంచి ఇప్పటి వరకు వర్కర్లకు రావాల్సిన వేతనాలు ఇప్పించాలని కోరారు. ఈ విషయమై ఏఓ అరుణను వివరణ కోరగా మంగళవారం విచారణకు హాజరు కావాలని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యులను సమాచారం ఇచ్చామని, విచారణలో తేలే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కలెక్టరేట్లో క్లీనింగ్ ఏజెన్సీ బాధ్యులపై ఫిర్యాదు -
పారదర్శకంగా సేవలు అందించాలి
ఖమ్మంసహకారనగర్: నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని టీటీడీసీలో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ అంశాలపై ఏర్పాటుచేసిన రెండు రోజుల శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు చేయాల్సిన విధులు, బాధ్యతలను పక్కాగా నిర్వర్తించేలా శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలు, వివిధ పనుల కోసం జారీచేసే మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. భూచట్టాలపై పట్టు సాధించి దరఖాస్తులను పరిష్కరించాలని, భూలావాదేవీల పరిష్కారంలో అవకతవకలకు పాల్పడొద్దని సూచించారు. అంతేకాక కుటుంబం, విధులను సమాంతరంగా నిర్వర్తిస్తే ఇబ్బందులు ఉండవని కలెక్టర్ తెలిపారు. అనంతరం రిటైర్డ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సురేశ్ పొద్దర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు టి.కరుణాకర్‌రెడ్డి, అధికారులు పలు అంశాలపై అవగాహన కల్పించారు.జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం తనిఖీ చేశారు. నియోజకవర్గాల వారీగా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన గదుల్లో పరిశీలించి భద్రతపై సూచనల చేశారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ స్వామి, డీటీ అన్సారీ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రాథమిక దశలో గుర్తిస్తే కళ్లకు రక్షణ
ఖమ్మంవైద్యవిభాగం: తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా తొలి దశలోనే గుర్తిస్తే గ్లకోమా బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో ప్రత్యేక కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ తెలియకుండానే కంటి చూపును దెబ్బతీసే గ్లకోమాపై అవగాహన అవసరమని చెప్పారు. కంటి వైద్య నిపుణులు రామూనాయక్ మాట్లాడుతూ వెలుతురు చుట్టూ రంగుల వలయాలు కనిపించడం, కంటినొప్పి, దృష్టి కోల్పోవడం వంటి లక్షణాలే కాక కళ్లకు దెబ్బ తగిలినవారు, స్టెరాయిడ్ వాడేవారు, మధుమేహం, రక్తపోటు బాధితులు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్, కంటి విభాగం వైద్యులు ఆయేషాబేగం, సీనియర్ రెసిడెంట్లు రాజశేఖర్, ఆస్మా, శ్రావణి, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు వీణ, నరేష్, పాల్గొన్నారు. -
నీరు వృథా చేయకుండా వాడుకోండి
బోనకల్: వారబందీ విధానంలో విడుదలవుతున్న సాగర్ జలాలను వృథా చేయకుండా పంటలకు ఉపయోగించుకోవాలని జల వనరుల శాఖ ఎస్ఈ వాసంతి రైతులను కోరారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందించే ఆళ్లపాడు మైనర్‌ను సోమవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆళ్లపాడు రైతులు వారబందీ విదానంలో కాకుండా పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు. దీంతో స్పందించిన ఆమె ఆళ్లపాడు మైనర్‌కు ఎక్కువ మొత్తంగా నీరు విడుదల చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. అలాగే, తహసీల్దార్ పున్నంచందర్ ఆధ్వర్యాన కాల్వపై అడ్డంకులను తొలగించగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, జేఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.జల వనరుల శాఖ ఎస్ఈ వాసంతి -
రైల్వే బోర్డు చైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో ఆయనతో భేటీ అయిన ఎంపీ ఇక్కడ రైల్వే సమస్యలను ప్రస్తావించారు. పలు స్టేషన్ల ఆధునికీకరణ, ప్లాట్‌ఫాంల విస్తరణ, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, ఇంకొన్ని స్టేషన్లలో హాల్టింగ్, కొత్త రైళ్ల మంజూరుపై చర్చించారు. ఈమేరకు సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ఆయిల్‌పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయండి ఖమ్మంవన్‌టౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విస్తృతంగా ఉన్నందున కేంద్రప్రభుత్వం ఆధ్వర్యాన ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండగా, ప్రస్తుతం 91,200హెక్టార్లలో ఉన్న సాగును ఏటా 40వేల హెక్టార్ల మేర విస్తరించాలనే లక్ష్యం ఉందని తెలిపారు. సుస్థిర వ్యవసాయానికి మద్దతు ఇస్తూనే నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈనేపథ్యాన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ ఆధ్వర్యాన ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఎంపీ వెల్లడించారు. లైబ్రరీ భ వనానికి రూ.2 కోట్లు ఖమ్మంగాంధీచౌక్: జిల్లా కేంద్ర గ్రంథాలయ అదనపు భవన నిర్మాణానికి సోమవారం రూ, 2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్‌కు ఆనుకుని ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అదనపు నిర్మాణాలకు రూ.2.80 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించగా ఖమ్మం ఎమ్మెల్యే అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.80లక్షలు కేటా యించారు. మిగతా రూ.2 కోట్లను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మంజూరు చేసింది. కాగా, జిల్లా లైబ్రరీ పాత పురాతన భవనం శిథిలమై 2024 జనవరి 13న కూలిపోయింది. కూలిన భవనం పక్కన మరో భవనం ఉన్నా పూర్తిస్థాయిలో సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పరిపాలనా విభాగాన్ని ఖమ్మం పాత మున్సిపాలిటీ భవనంలోకి మార్చారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో నూతన భవనాలు నిర్మించనుండగా ఇక్కట్లు తీరనున్నాయి. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఓ పక్క కొనసాగుతుండగానే ఇప్పటికే పూర్తయిన పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుపెట్టా రు. ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఏర్పాటుచేయగా వివిధ జిల్లాల నుంచి 20వేలకు పైగా సంస్కృతం జవాబుపత్రాలను పంపించారు. తొలిజు 24మంది అధ్యాపకులతో పాటు ఇద్దరు చీఫ్ ఎగ్జామినర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జామినర్లు విధులు నిర్వర్తించారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 15జవాబుపత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. 398 మంది గైర్హాజరు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని డీఐ ఈఓ రవిబాబు తెలిపారు. మొత్తం 17,078 మంది విద్యార్థుల్లో 398మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతీ గదిలో గోడ గడియారాలు ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రచారం ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత ప్రమాదాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ల వారీగా ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారుల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు సొంతంగా మరమ్మతు చేయకుండా సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే పరిష్కరిస్తామంటూ వివరిస్తామని వెల్లడించారు. -
ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందిస్తున్న ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకసారి అందిన దరఖాస్తు రెండో సారి రాకుండా పరిష్కరించాలని, అలా సాధ్యం కాకపోతే కారణాలను వివరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్ఓ పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ●ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లికి చెందిన పెందుర్తి కృష్ణవేణి కుమారుడు శ్యాంప్రసాద్ మృతి చెందిన నాలుగేళ్లకు ఆమె కూడా కన్నుమూసింది. దీంతో శ్యాంప్రసాద్ కుటుంబీకులు తప్పుడు ధ్రువపత్రాల ఆధారంగా ఐదెకరాల భూమిని బదలాయించుకున్నారని కృష్ణవేణి కుమార్తెలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ●సింగరేణి మండలానికి చెందిన సయ్యద్ చాంద్ పాషా సర్వే నంబర్ 161లోని పట్టా భూమిలో 1981 నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నందున స్థలాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు. ●జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, చివరి ఆయకట్టుకు నీరందేలా ఎన్నెస్పీ నీటిని ఏప్రిల్ చివరి వరకు విడుదల చేయాలని, సన్నధాన్యం అమ్మిన రైతులందరికీ బోనస్ జమ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు బండి కృష్ణారెడ్డి, మందనపు రామారావు, మల్లెంపాటి రమేష్, పగడవరపు శ్రీనివాస్, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణఇద్దరం దివ్యాంగులమే... దివ్యాంగులమైన మా ఇద్దరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే మొదటి జాబితాలో పేరు రాలేదు. ప్రత్యేక చొరవ తీసుకుని మాకు ఇల్లు మంజూరు చేయించాలి. – నాగమణి – నాగేశ్వరరావు, చిన్నగోపతికుమారుడే ఇబ్బంది పెడుతున్నాడు బ్యాంక్ రుణం తీర్చేందుకు ఇంటి స్థలాన్ని విక్రయించాలని యత్నిస్తే పెద్ద కుమారుడు అడ్డుకుంటున్నాడు. స్థానికంగా అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదు. నా సమస్యపై కలెక్టర్ సారే స్పందించాలి. – దంతాల భూదెమ్మ, రేపల్లెవాడ -
మారితే.. మనం ఎటు?!
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో జరిగిన పునర్విభజనతో నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. కొన్ని స్థానాలు జనరల్ నుంచి రిజర్వ్‌లోకి, రిజర్వ్డ్గా ఉన్న స్థానాలు కొన్ని జనరల్‌కు మారాయి. అలాగే, తొమ్మిదిగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పదికి చేరింది. ఇక వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి పునర్విభజన చేపట్టేలా కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే, 2026 తర్వాత జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్ట సవరణ చేయగా.. ఇప్పడు ఈ ప్రక్రియపై ఎందుకు కసరత్తు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంరెండుగా ఖమ్మం.. ఈసారి చేపట్టనున్న డీలిమిటేషన్ విధి విధానాలు ఇప్పటివరకై తే బయటకు రాలేదు. ఒక్కో నియోజకవర్గానికి ఎంత మంది జనాభాను పరిగణనలోకి తీసుకుంటారో తేలాల్సి ఉంది. అయితే, డీ లిమిటేషన్ చేపడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాలో 2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. గత పునర్విభజన సమయాన కొత్తగా అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుత జనాభాను పరిశీలిస్తే ఈసారి పునర్విభజనలో ఒక్క నియోజకవర్గమైనా పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం జనాభా పరంగా రెట్టింపు అయినందున ఈ నియోజకవర్గం రెండుగా ఏర్పడే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది.ఇప్పుడే ఎందుకు? పెరుగుతున్న జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంటారు. తద్వారా నియోజకవర్గాల సంఖ్య పెరగడమే కాక సరిహద్దులు మారుతుంటాయి. ఇందుకోసం తొలిసారిగా 1963లో డీ లిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నియోజకవర్గాల సరిహద్దులు, రిజర్వేషన్లు నిర్ణయిస్తుంది. చివరిసారి 2008లో 2001 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టారు. ఆ సమయంలోనే 84వ చట్ట సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా మరోమారు పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యాన ఇప్పుడు పునర్విభజనకు సిద్ధం కావడాన్ని కొన్ని పార్టీలు తప్పుపడుతున్నాయి. మారిన రిజర్వేషన్లు.. 2008లో చేపట్టిన డీలిమిటేషన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల పరిధి, రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. తద్వారా కొందరు నేతలకు ఇబ్బంది ఎదురుకాగా, మరికొందరికి కలిసొచ్చింది. అప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా అశ్వారావుపేట ఏర్పాటైంది. ఇందులో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు చేరాయి. రాష్ట్ర విభజన తర్వాత కుక్కునూరు, వేలేరుపాడు ఏపీలోకి వెళ్లగా.. ఇక్కడ కొత్తగా అన్నపురెడ్డిపల్లి మండలం చేరింది. ఇక బూర్గంపాడు నియోజకవర్గం రద్దయి ఆ స్థానంలో పినపాక చేరింది. అంతేకాక జనరల్ నియోజకవర్గమైన సుజాతనగర్ రద్దు కాగా.. ఆ స్థానంలో ఎస్టీ రిజర్వ్డ్గా వైరా నియోజకవర్గం ఏర్పడింది. అలాగే సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు జనరల్ నుంచి ఎస్సీ రిజర్వ్‌కు, ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న పాలేరు జనరల్ కేటగిరీలోకి వచ్చింది. ఈ క్రమంలో జనరల్ కేటగిరీలో కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు మాత్రమే మిగిలాయి. ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం నియోజకవర్గాల పునర్విభజన చర్చ మొదలవడంపై రాజకీయ పార్టీల నాయకులు దృష్టి సారించారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే తమకు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న మండలాలు ఇతర నియోజకవర్గంలో కలిసే అవకాశం ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే నియోజకవర్గానికి ఎంత జనాభా ఉండాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఇంకొందరు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు జనరల్‌గా ఉన్నాయి. ఈసారి పునర్విభజనపై పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో రిజర్వ్ స్థానాలు తగ్గుతాయా, పెరుగుతాయా.. రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయా, స్థానాల సంఖ్య పెరుగుతుందా అన్న అంశంపై అయోమయం నెలకొంది. కాగా, గత పునర్విభజన సమయాన కీలక నేతలు కొందరు సిట్టింగ్ స్థానాలు వదిలి ఇతరచోట్ల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. సుజాతనగర్ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరుకు వెళ్లగా, పాలేరులో పోటీ చేసి పలుమార్లు గెలిచిన సంభాని చంద్రశేఖర్, ఒకసారి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లికి, సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ కార్యక్షేత్రాన్ని మార్చా రు. ఈసారీ ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయా అన్న అనుమానాలు నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్విభజనపై పార్టీల్లో చర్చ చివరిగా 2008లో స్థానాల పునర్విభజన అప్పుడు తొమ్మిది నుంచి 10కి పెరిగిన అసెంబ్లీ సీట్లు రిజర్వేషన్లలోనూ మార్పులు ఈసారి పెంపు, రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ -
రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
నేలకొండపల్లి : నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. తొలుత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామదాసు వాడిన బావిని పరిశీలించారు. ఆడిటోరియంలో రామదాసు చరిత్రకు సంబంఽధించిన చిత్రా పటాలను చూసి, ఆయన చరిత్ర గురించి అర్చకులు సౌమిత్రి రమేష్కుమారా చార్యులను అడిగి తెలుసుకున్నారు. అనంత రం శ్రీ ఉత్తరేశ్వరస్వామి, శ్రీ వైద్యనాథస్వామి ఆలయాలను సందర్శించారు. ఆ తర్వాత బౌద్ధక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సౌర విద్యుత్ సర్వే పూర్తి చేయాలిమంత్రి భట్టి ఆదేశం ఖమ్మంవ్యవసాయం : జిల్లాలో నిర్దేశించిన సౌర విద్యుత్ గ్రామాల్లో సర్వే త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ ఎస్ఈగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇనుగుర్తి శ్రీనివాసా చారి ఆదివారం హైదరాబాద్‌లో భట్టిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. నిర్ణయించిన గ్రామాల్లో సోలార్ సర్వే పూర్తి చేసి టెండర్లు పిలవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. రామయ్యకు పుష్పార్చనభద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడి పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 338 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.11,410, 250 మంది బోటింగ్ చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.11,970 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
‘తాయిలం’ అందేనా ?
● ప్రతి ఏటా రామాలయంపైనే ఉత్సవాల భారం ● నిర్వహణ ఖర్చులకు హుండీ ఆదాయమే మార్గం ● ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులుభద్రాచలం: భద్రగిరి రామయ్యకు సర్కారు తాయిలం అందడం లేదు. ప్రతీ ఏడాది ఉత్సవాల సమయంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నా నిరుత్సాహమే మిగులుతోంది. దేవస్థానంలో జరిగే ప్రధాన ఉత్సవాల నిర్వహణ వ్యయం తలకు మించిన భారం అవుతుండడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. చివరికి భక్తులు సమర్పించే హుండీ ఆదాయమే దిక్కుగా మారడంతో ఆ నిధులనే ఉత్సవాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆలయ అభివృద్ది కుంటుపడుతోందని ఇటు భక్తులు, అటు అధికారులు ఆవేదన చెందుతున్నారు. నవమి వ్యయం రూ.2 కోట్లకు పైగానే.. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో ముక్కోటి, శ్రీరామనవమి ముఖ్యమైనవి. వీటితో పాటు భక్తరామదాసు జయంతి ఉత్సవాలనూ ఘనంగా నిర్వహిస్తారు. అయితే వీటిలో ముక్కోటి సందర్భంగా తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం, శ్రీరామనవమి వేడుకలకు భక్తులు భారీగా హాజరవుతుంటారు. ఆ సమయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది సైతం వందల సంఖ్యలో ఉంటారు. కాగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వస్తువుల ధరలు, వివిధ విభాగాల కార్మికుల జీతభత్యాలు పెరుగుతుండగా ఏటేటా నిర్వహణ వ్యయం సైతం పెరుగుతోంది. గతంలో రూ. కోటి – కోటిన్నర మధ్యలో ఖర్చు కాగా, ఈ ఏడాది రూ.రెండు కోట్లకు పైగానే అవసరమని అధికారులు అంటున్నారు. వీటిలో ఉత్సవ నిర్వహణ పనులకు రూ.కోటిన్నర, క్రతువు నిర్వహణ, తలంబ్రాలు, పట్టువస్త్రాలు, ఇతర ఖర్చులకు మరో కోటి వరకు ఖర్చవుతుందని అనధికారికంగా చెబుతున్నారు. ముక్కోటికి సైతం రూ.కోటిన్నర వరకు వ్యయం అవుతున్నట్లు అంచనా. ఖర్చులకు కానుకలే దిక్కు.. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి అందే సాయం మాత్రం రూ.15వేలు మాత్రమే. అది కూడా పేపర్లపై లెక్కలు చూపడం మాత్రమే. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు. నవమి వేడుకలకు సాయం అందించాలని అటు అధికారులు, ఇటు భక్తులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేదు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు అందించే స్థాయిలో కాకున్నా భక్తుల మనోభావాలను గౌరవించి ఉత్సవాల నిర్వహణకు ఎంతో కొంత అందించాలని పలువురు కోరుతున్నారు. కాగా హుండీల ద్వారా భక్తులు సమర్పించే కానుకలనే ఉత్సవాల నిర్వహణకు వెచ్చిస్తున్నారు. గతం కంటే ఆదాయం పెరిగినా ఆలయ అఽభివృద్ధికి, భక్తులకు మరింతగా వసతుల కల్పనకు వెచ్చించాల్సిన నిధులను ఉత్సవాల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. భద్రాచలంలో భక్తులకు వసతి కష్టాలు నిత్యం ఎదురవుతుంటాయి. ఆలయానికి వచ్చే ఆదాయంతో రంగనాయకుల గుట్ట మీద, కింద దేవస్థానం భూముల్లో డార్మెటరీ, 100 గదుల వసతి గృహాలను నిర్మిస్తే ఈ సమస్య తీరే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ సర్కారైనా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దేవస్థానంలో ఉత్సవాల నిర్వహణకు ఒక్క పైసా విదల్చలేదు. ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామన్న హామీని సైతం విస్మరించింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారైనా నిధులు ఇవ్వకపోతుందా అని భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గతేడాది శ్రీరామనవమి ఉత్సవాలకు నిధులు కేటాయిస్తుందని భావించినా విడుదల చేయలేదు. ఈ ఏడాదైనా రామయ్యపై కరుణ చూపేనా అని భక్తులు, అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ ఏడాది హాజరు కావడంతో పాటు ఆలయ అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఆశిస్తున్నారు.తక్షణమే సాయం అందించాలి భక్తుల ఆదాయం భక్తులకే చెందాలి. ఉత్సవాల నిర్వహణ పేరుతో పక్కదారి పట్టించడం సరైంది కాదు. హుండీ ఆదాయాన్ని భక్తుల వసతుల కల్పనకు కేటాయించాలి. ఆలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. వీటికి అయ్యే ప్రతీ పైసా ప్రభుత్వమే భరించాలి. – బూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు