ఇళ్ల కూల్చివేత సరికాదు.. | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల కూల్చివేత సరికాదు..

Mar 2 2026 8:18 AM | Updated on Mar 2 2026 8:18 AM

ఇళ్ల

ఇళ్ల కూల్చివేత సరికాదు..

రఘునాథపాలెం: మండలంలోని మంచుకొండలో పేకాటస్థావరంపై పోలీసులు దాడి చేసి, ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపరాఉ. గ్రామ శివారులోని చెట్టు నీడన జూదం అడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఆదివారం దాడులు చేసి, వారి వద్ద నుంచి రూ.300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు.

ఖమ్మంఅర్బన్‌: వెలుగుమట్ల భూదాన్‌ కాలనీలోని పేదల ఇళ్లను కూల్చివేయడం సరైన చర్య కాదని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.తిరుపతయ్య అన్నారు. ఆదివారం కూల్చివేత ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని, ఈ భూమి ప్రభుత్వానికి చెందింది కాదని, భూదాన్‌ ఉద్యమంలో భాగంగా ఒక ట్రస్టుకు దానం చేసిన భూమి అని తెలిపారు. కూల్చివేసిన స్థలంలోనే బాధితులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాదావత్‌ రాజు, ఖాదర్‌బాబా, హరికృష్ణ, ఆదినారాయణ, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

ఖమ్మంఅర్బన్‌: జాతీయస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఖమ్మం జిల్లాకు చెందిన జలవనరులశాఖ ఉద్యోగి ఎంపికయ్యాడు. కల్లూరు సర్కి ల్‌ పరిధిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బి.విజయ్‌కుమార్‌.. 2025 – 26 ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ – పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌నకు ఎంపికవగా.. మార్చి 5 నుంచి 10 వరకు ఛండీగఢ్‌లో పోటీలు జరగనున్నాయి. కాగా, విజయ్‌కుమార్‌ను పలువురు అభినందించారు.

టీటీ టోర్నీలో ప్రతిభ

ఖమ్మంస్పోర్ట్స్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లో ఫిబ్రవరి 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి పారా టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఖమ్మానికి చెందిన రెడ్డి సాయిశివ 15వ ర్యాంకు సాధించాడు. కాగా, అతడిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, టేబుల్‌ టెన్నిస్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్‌, వీవీఎస్‌ మూర్తి, పరిటాల చలపతిరావు, షేక్‌ మజార్‌, ఆనం రాజేశ్‌, రామారావు, సంతోష్‌, అశ్విన్‌, లాలయ్య అభినందించారు.

ఘనంగా

తిరు స్వరూప ప్రదర్శన

ఖమ్మంరూరల్‌: కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం ఏసు తిరు స్వరూప మహా ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. వైరా రోడ్డులోని ఆర్‌సీఎం జాన్‌ మజ్జుకోని చర్చి నుంచి కరుణగిరి చర్చి వరకు ప్రదర్శన సాగింది. ఉమ్మడి జిల్లా ఆర్‌సీఎం బిషప్‌ డాక్టర్‌ సగిలి ప్రకాష్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఫాదర్‌ గొర్రెముచ్చు సురేశ్‌, ఫాదర్‌ తలపునేని అంతోని, కరుణగిరి డైరెక్టర్‌ ఫాదర్‌ జ్వానేశ్‌, కొమ్ము ప్రసాద్‌, ఎం.ప్రసాద్‌ పాల్గొన్నారు. కాగా, ప్రదర్శనలో ఆధ్యాత్మిక గేయాలు ఆలపిస్తూ అలరించారు. కరుణగిరి వేదికపై విశ్రాంత బిషప్‌ మైపన్పాల్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్‌ ప్రకాష్‌.. మైపన్‌పాల్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఫాదర్‌ సురేపల్లి ఐజక్‌, ఫాదర్‌ వీజీ శౌరి, జయరాజు పాల్గొన్నారు.

బౌద్ధక్షేత్రం సందర్శన

నేలకొండపల్లి: స్థానిక బౌద్ధక్షేత్రాన్ని ఆదివారం బౌద్ధభిక్షువు రేవత్‌ దీక్ష భూమి సందర్శించారు. చరిత్రను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి వరకు పాదయాత్రను ప్రారంభించారు. తొలి రోజు కొద్ది దూరం నడిచిన అనంతరం చంద్ర గ్రహణం వల్ల రెండు రోజులు వాయిదా వేశారు. శాంతి సాధన కోసం సోమవారం దేవాలయాలు, చర్చి, మసీద్‌లలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శీలం వెంకటలక్ష్మి, ఉపసాకులు పత్తిపాటి వెంకటేశ్వర్లు, బొనిగల విజయ తదితరులు పాల్గొన్నారు.

పేకాటస్థావరంపై దాడి

ఇళ్ల కూల్చివేత సరికాదు.. 1
1/3

ఇళ్ల కూల్చివేత సరికాదు..

ఇళ్ల కూల్చివేత సరికాదు.. 2
2/3

ఇళ్ల కూల్చివేత సరికాదు..

ఇళ్ల కూల్చివేత సరికాదు.. 3
3/3

ఇళ్ల కూల్చివేత సరికాదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement