సైబర్ నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్‌లైన్‌లో ఉద్యోగం, షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌తో డబ్బులు వస్తాయని ఆశ చూపి, రూ.47 లక్షలు మోసం చేసిన కేసులో ఒకరిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ ఆదివారం తెలిపారు. టీజీసీఎస్‌బీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్రాక్‌డౌన్–1.0లో భాగంగా జిల్లాకు చెందిన బాధితుడికి వాట్సాప్, టెలిగ్రామ్‌లో పరిచయమై ఆన్‌లైన్‌లో ఉద్యోగం, షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని మోసంచేసిన ఎండీ ఫిరోజ్‌ను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. విచారణలో కీలకపాత్ర పోషించిన సైబర్ క్రైమ్ సీఐ నరేశ్, ఎస్‌ఐలు రంజిత్‌కుమార్, విజయ్‌కుమార్, సైబర్‌క్రైం ఉద్యోగులను సీపీ ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు.


