రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్ పరిధి ఖమ్మం – పందిళపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి(45) ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి కుడివైపు చాతి భాగం కింద పుట్టు మచ్చ ఉండగా కుడి చెయ్యిపై హిందీలో సంజ్‌య్, ఇంగ్లిష్‌లో జోటీ అని పచ్చబొట్టు ఉంది. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 98481 14202, 87126 58589 నంబర్లలో సంప్రదించాలని జీఆర్పీ పోలీసులు సూచించారు.


