breaking news
Vikarabad
-
కబ్జాలు.. దందాలు
యథేచ్ఛగా చెరువులు, కుంటలు, దారుల ఆక్రమణ వికారాబాద్: అనుమతులు లేకుండా రిసార్ట్స్‌ను నిర్వహించడమే కాకుండా ప్రాజెక్టు(చెరువులు, కుంటలు)ల్లో అక్రమ బోటింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల వికారాబాద్ సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మహిళలు మృత్యువాత పడటం చర్చనీయాంశమయింది. ఈ ఘటనతో అనేక కొత్త విషయాలు వెలుగు చూశాయి. చెరువులో అక్రమ బోటింగ్ తోపాటు బఫర్ జోన్‌ను ఆక్రమించారు. పశువులు నీళ్లు తాగేందుకు వెళ్లే పానాదిని కూడా వదల్లేదు. దారిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అసైన్డ్ భూమిలో నిర్మాణాలు చేపట్టడం, చెరువులోకి స్థానికులెవరూ రాకుండా అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. వివరాలు సేకరించిన అధికారులు వాటిని బహిర్గతం చేయలేదు. చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. విచారణ పారదర్శకంగా జరగకుండా కొన్ని శక్తులు ప్రభావితం చూపుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఒక్క సర్పన్‌పల్లి ప్రాజెక్టులోనే కాదు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. చాలా మండలాల్లో చెరువులు, కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. చూసీచూడనట్లుగా.. జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. అక్రమా ర్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కబ్జా రాయుళ్ల కన్ను చెరువులు, కుంటలు, నాలాలు, వాగులు, దారులపై పడింది. కొన్ని చోట్ల చెరువులు, కుంటలను ఆక్రమించి పొలాల్లో కలిపేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కబ్జా చేసిన భూములను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా చెరువులను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు. అధికారులకు అన్ని విషయాలు తెలిసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. రికార్డులు తారుమారు జిల్లాలో మొత్తం 1,196 చెరువులు ఉన్నాయి. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద చెరువు లు, కుంటల్లో పూడిక తీత పనులు చేట్టింది. ఈ సమయంలో ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో నీటి పారుదల శాఖ అధికారులు కేవలం పూడిక తీత పనులతోనేసరిపెట్టారు. కబ్జాల జోలికి వెళ్లలేదు. హద్దులు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించలేదు. తదనంతర కాలంలో ఆక్రమణలు మరింత పెరిగాయి. చెరువులు, కుంటలు, దారులు, పానాదులు, నాలాల రికార్డులు తరుమారయ్యాయి. రెవెన్యూ, నీటిపారుదల శాఖల వద్ద చాలా చెరువులకు సంబంధించిన రికార్డులు కనిపించడంలేదు. కంచే చేను మేసిన చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆక్రమణలు మచ్చుకు కొన్ని.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివసాగర్ చెరువు ఆక్రమణకు గురైంది. నాలుగు వైపులా కబ్జాలకు గురవుతోంది. కొందరు బడా బాబులు ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారు. మరికొందరు చెరువు చివరి భాగాన్ని పూడ్చి వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇదే మున్సిపల్ పరిధిలోని కొత్తగడి సమీపంలోని కొంపల్లి చెరువు పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న సర్పన్‌పల్లి ప్రాజెక్టుదీ ఇదే పరిస్థితి. కొందరు వ్యాపారులు బఫర్ జోన్‌తో పాటు చెరువును పూర్తిగా కబ్జా చేశారు. వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు స్థలంలో కాటేజీలు నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. ఫీడర్ చానల్‌ను దారిమళ్లించి చెరువులోకి నీరు రాకుండా చేశారు. తూములను ధ్వంసం చేశారు. కట్టను సైతం వదలలేదు. దీన్ని ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయిస్తునారు. పరిగి పట్టణ పరిధిలోని పల్లవి కళాశాల వెనుక గల మరో చెరువు కూడా పూర్తిగా ఆక్రమణకు గురైంది. తాండూరు మున్సిపల్ పరిధిలోని గొల్ల చెరువు సగానికి పైగా ఆక్రమించారు. తాజాగా ధారూరు మండలం అల్లాపూర్ వద్ద పోతుల వాగును ఓ వ్యక్తి ఆక్రమించి తన పొలంలో కలుపుకొన్నాడు. దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చారు. దీంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు కాగ్నా నదిలో కలిసే పరిస్థితి లేకుండా పోయింది. అనుమతులు లేకుండారిసార్ట్స్ల నిర్వహణ ప్రాజెక్టుల్లో అక్రమ బోటింగ్ ప్రజల ప్రాణాలతో చెలగాటం పట్టించుకోని అధికారులు జిల్లాలో చెరువులు, కుంటలు, దారులను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. పంట కాల్వలను కబ్జా చేసి పొలాల్లో కలిపేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా రిసార్ట్స్ నిర్వహించడమే కాకుండా సమీప ప్రాజెక్టుల్లో అక్రమ బోటింగ్ చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. పడవ ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
సమన్వయంతో పని చేయండి
● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ● కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశం అనంతగిరి: అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందేలా చూడాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, బ్యాంకర్లు, పంచాయతీ రాజ్, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పశు సంవర్ధక, వెటర్నరీ, మిషన్ భగీరథ, నేషనల్ హైవే, గృహ నిర్మాణం, మార్కెటింగ్, అటవీ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖలు చేపట్టిన పనులపై సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద నర్సరీలు, మొక్కల పెంపకం తదితర పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3,815 మందికి వృద్ధాప్య, వితంతు తదితర పెన్షన్లు అందజేస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 1.60 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం కింద రూ.490 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుత సీజన్‌కు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచామని పేర్కొ న్నారు. పొలాల్లో మట్టి నమూనాల సేకరించి సాయిల్ హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. జాతీయ వైద్య కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్డీఏ శ్రీనివాస్, దిశ కమిటీ సభ్యులు అంతారం లలిత, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, వడ్ల నందు, జానకిరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమాజాన్ని మార్చే శక్తి మీడియాకే ఉంది సమాజాన్ని మార్చే శక్తి మీడియాకే ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని అంబేడ్కర్ భవన్లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తలపై మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మీడియా పాత్ర ఉండాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ మానస కృష్ణ కాంత్, పీఐబీ ఏడీజీ శృతి పాటిల్, ఎం అండ్ సీఓ శివచరణ్, సీడీఏసీ ప్రాజెక్ట్ మేనేజర్ జగధీష్ బాబు, ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు విద్యాధర్, శ్రీహరి, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం
అనంతగిరి: ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ ముందుండి పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మండల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కేదార్నాథ్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, నాయకులు సతీష్‌కుమార్, రమేష్, వీరేశం, జహంగీర్, యాదగిరి, వేణు, శ్రీనివాస్, రాములు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీ బదిలీ అనంతగిరి: జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న టీబీ హనుమంత్‌రావు రాచకొండ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ఎస్పీ నారాయణరెడ్డి శాలువా, పూలమాలలతో ఘనంగా తస్కరించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీటీసీ ఏఎస్పీ మురళీధర్, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడుపు పెంపు షాద్‌నగర్‌రూరల్: దూర విద్యావిధానంలో ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు ప్రభుత్వం గడువును పొడగించినట్లు పట్టణంలోని జియోన్ హైస్కూల్ పాఠశాల హెచ్ఎం సుధాకర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీ లోపు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘పాలమూరు – రంగారెడ్డి’పై స్పష్టత ఇవ్వాలి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య కొందుర్గు: పదేళ్ల క్రితమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ సర్వేకు రూ.10వేలు కోట్లు నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేటాయించారని.. నేటికీ సర్వే చేపట్టకపోవడం బాధాకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మంగళవారం పార్టీ నాయకులు మాణిక్యరావు, అనిత ఆధ్వర్యంలో జిల్లేడ్ చౌదరిగూడ మండల సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగయ్య మాట్లా డుతూ.. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.9 వేల కోట్ల ఖర్చుతో జూరాల బ్యాక్ వాటరుతో 73 కిలోమీటర్లు నిర్మాణం పనులు చేపడితే 12 మండలాలలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్దుల జంగయ్య, మండల కార్యదర్శి వెంకటేశ్ నాయకులు యాదయ్య, భీమయ్య, పద్మ,లక్ష్మి, రాములు, లింగమయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పశువులకు సీజనల్ గండం
కొడంగల్ రూరల్: వర్షాకాలంలో చిరుజల్లులు, చిత్తడి నేలలు పాడి పశువుల్లో పలు రోగాలకు కారణమవుతాయి. కలుషిత నీరు, ముసిరే వర్షం, ఈగలు, దోమలు, పచ్చిక అనారోగ్యానికి దారితీస్తాయని పశువైద్యాధికారులు చెబుతున్నారు. వానాకాలంలో పశుపోషకులు కొంతమేర జాగ్రత్తలు పాటించడంతో మూగజీవాలు ఆరోగ్యంగా ఉంటాయని పేర్కొంటున్నారు. పశువులకు సోకే వ్యాధులు వర్షాకాలంలో పశువులకు గాలికుంటువ్యాధి, గొంతువాపు వ్యాధి, నీలినాలుక, పీపీఆర్, అమ్మోరు, చిటుకు వ్యాధులు సోకుతుంటాయి. గాలికుంటువ్యాధి: ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు గాలికుంటువ్యాధి సోకుతుంది. దీని లక్షణం పశువుల నోటి నుంచి చొంగ కారుతుంది. పశువులకు ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. నోటిలో పుండ్లు ఏర్పడి మేత సరిగ్గా తినక నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. దూడల్లో ఇలాంటి లక్షణాలు కనిపించగానే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి. నివారణ చర్యలు: వ్యాధి నిరోధక టీకాను 6 నుంచి 8 వారాల పైబడిన దూడలకు మొదటి మోతాదు వేయాలి. 4 నుంచి 6 నెలల వయసు కలిగిన దూడలకు బూస్టర్ మోతాదు ఇప్పించాలి. టీకాను ప్రతీ ఏడాది ఇప్పిస్తే వ్యాధిని నివారించేందుకు అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేయాలని, పశువుల కొట్టంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. నీలి నాలుక వ్యాధి: వ్యాధి సోకిన సమయంలో జ్వరం, నోటిలో పుండ్లు, నావికారంధ్రం, కాళ్ల గిట్టలు, నాలుక భాగంలో శోధం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువుల నాలుక వాచిపోయి నీలిరంగుగా మారుతుంది. న్యూమోనియా లక్షణాలు కనిపిస్తూ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ముక్కు నుంచి జిగురు లాంటి ద్రవం కారుతుంది. కాలిగిట్టల దగ్గర ఎర్రగా వాచడం, మెడ భాగంలో వాపుగా ఉండడం, ముక్కు, కంటి, నోటి నుంచి తరచూ లాలజలం కారుతుంది. నివారణ చర్యలు: పశువులను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. ఐదు రోజులపాటు యాంటీ బయాటిక్ టీకాలు వేయించాలి. సులభంగా జీర్ణమయ్యే గంజి, ఓఆర్ఎస్ వంటి ద్రావణాన్ని అందించాలి. దోమలు రాకుండా తెరలు వాడాలి. అమ్మోరు: మేకలు, గొర్రెల్లో ప్రాణాంతకమైన అంటువ్యాధి. జ్వరం, చర్మంపై బొబ్బలు ఏర్పడి శరీరం అంతా వ్యాపిస్తుంది. చూడి గొర్రెల్లో గర్భస్రావం అవుతుంది. ఆహారం, నీరు తీసుకోకుండా నీరసించిపోతాయి. నివారణ: వ్యాధి సోకిన వాటిని మంద నుంచి వేరుచేయాలి. మూడు నెలలు నిండిన గొర్రెలకు షీప్ప్యాక్స్ వ్యాక్సిన్ ఇస్తే వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఒకసారి టీకా ఇప్పించడంతో మూడేళ్లవరకు వ్యాధి రాకుండా ఉంటుంది. చిటుకు వ్యాధి: మేకలు గొర్రెల్లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి చిటుకు. ఏడాదిలోపు గొర్రెలకు సోకుతుంది. విరోచనాలు, కండరాలు కొట్టుకోవడం, శ్వాసకోశ ఇబ్బందులు కనిపిస్తాయి. నివారణ చర్యలు: వైద్యుల సూచనలు పాటిస్తూ ఎంటెరోటాక్సెమియా వ్యాక్సిన్‌ను సమయానుకూలంగా వేయించాలి. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తు టీకాలు వేయిస్తే కట్టడి పశువైద్యాధికారుల సూచన జాగ్రత్తలు తప్పనిసరి పశువుల పెంపకంలో రైతు లు జాగ్రత్తలు పాటిస్తూ పశుపోషణకు కృషి చేయా లి. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు టీకా లను ఇప్పించాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ పశువుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలి. మూగజీవాల కొట్టాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. – పరమేశ్, పశువైద్యాధికారి, రావులపల్లి -
సస్యరక్షణే ముఖ్యం
కందుకూరు: పండ్ల తోటల్లో మామిడి తర్వాత అధికంగా సాగు చేసేది జామ పంట. నికరాదాయంతో పాటు ఏడాదికి రెండుసార్లు దిగుబడి వస్తుండటంతో రైతులు జామ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో దాదాపు 15,800 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం జామ సాగులో ఉంది. కాకపోతే విదేశాల నుంచి తెచ్చిన తైవాన్ రకం జామ ద్వారా దేశంలోకి నులి పురుగుల బెడద తీవ్రతరం అయింది. దీంతో తైవాన్ రకంతో పాటు దేశీయ రకాలైన అలహాబాద్ సఫేదీ, లక్నో–49 తదితర రకాలకు నులి పురుగులు ఆశించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నులి పురుగులు వేర్లను ఆశించడంతో చెట్టు ఎండిపోయి చనిపోతుంది. లక్షణాలు గుర్తించక నీళ్లు పెట్టడం, అధికంగా ఎరువులు వేయడంతో ఉపయోగం ఉండటంలేదని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ తెలిపారు. నులి పురుగుల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను గురించి ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. లక్షణాలు ● ఆకులు పసుపు రంగులోకి మారడం. ● కొమ్మలు, లేత చిగుర్లు వడలిపోవడం, నులి పురుగులు ఆశించిన తొలి దశలో భూమిలో తగినంత తేమ ఉన్నా మొక్కలు వాడిపోయి కన్పిస్తాయి. ● చెట్టు ఎదుగుదల లోపించడం, చెట్టు మోడు భారడం. ● పూత, పిందె రాలడం లేదా ఆలస్యం అవడం, వచ్చినా త్వరగా రాలిపోవడం. ● నీరు, ఎరువులు అందించినా మొక్క కోలుకోకపోవడం. ● ఈ లక్షణాలు అన్నీ ఎండు తెగులు లక్షణాలు పోలి ఉండటం. ● వేర్లు ముడులు ముడులుగా మారి, బుడిపెలని కలిగి ఉండటం, వేరు వ్యవస్థ క్షీణించి ఉండటం. ● నులి పురుగులు సోకిన వేరు భాగాల్లో ఎండు తెగులు శిలీంధ్రం ఆశించి వేరు కుళ్లి పోవడం. పంట నష్టం ఈ నులి పురుగులతో ఒక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు జామ తోటల్లో 60–100 శాతం, నర్సరీల్లోనైతే 90–100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. వ్యాప్తి నివారణ చర్యలు ● నులి పురుగులు లేనివిగా నిర్ధారించబడిన నర్సరీల నుంచి మాత్రమే ఆరోగ్యవంతమైన జామ అంట్లను కొనుగోలు చేయాలి. ● జామ అంట్లు కట్టడానికి, నర్సరీల్లో అంటు మొక్కలను పెంచడానికి నులిపురుగులు లేని స్వచ్ఛమైన మట్టిని వాడుకోవాలి. ● ఆకులు పచ్చబారి, వాడిపోయి వేరుపై బొడిపెలు లాంటివి కలిగి ఉన్న మొక్కలను తోటలో నాటరాదు. నర్సరీలో యాజమాన్య పద్ధతులు ● ఒక టన్ను మట్టిలో 50–100 కిలోల వేప చెక్క పిండి లేదా గానుగ పిండి, జీవ నియంత్రణ కారకాలైన పర్పురియోసిల్లమ్ లిలాసినస్, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, ట్రై కోడెర్మా హార్జియానమ్ ఒక్కో కిలో చొప్పున కలిపిన మట్టిని అంట్లు కట్టే ముందు సంచుల్లో నింపాలి. ● కార్బోఫ్యూరాన్ 3జీ లేదా ఫోరేట్ 10జీ 5 కిలోలను ఒక టన్ను మట్టికి కలపాలి. ● నారు మడులను, నారు మొక్కలను పెంచడానికి వాడే మట్టిని వేసవి కాలంలో తెల్లపాలిథీన్ షీటుతో (45–60 రోజులు) కప్పి ఉంచి సోలరైజేషన్ ప్రక్రియ ద్వారా నులి పురుగులను నివారించవచ్చు. ● డయాజోమెట్ గుళికలు ఎకరాకు 60 కిలోల చొప్పున వేసి కలియబెట్టి పాలిథీన్ షీటుతో కప్పి, ఒక వారం ఉంచి తర్వాత షీటును తీసి, మట్టిని తిరిగి కలియబెట్టి 2–3 రోజుల తర్వాత మొక్కలను నాటుకోవాలి. ఈ పద్ధతితో నులిపురుగులను త్వరితగతిలో నివారించవచ్చు. తోటల్లో యాజమాన్యం ● వేసవిలో లోతుగా దక్కులు దున్ని మట్టిని కలియబెట్టాలి. ● కొత్తగా జామ తోటలు వేసే ముందు మట్టిని నులిపురుగులకై పరీక్ష చేయించుకోవాలి. ● నులిపురుగులు ఉన్న భూమిలో మొక్కలు నాటే ముందు జీవనియంత్రణ కారకాలతో సమృద్ధి చేయబడిన వానపాముల ఎరువు లేదా వేప పిండి గుంటకి 5 కిలోల చొప్పున వేసుకుని అంట్లని నాటాలి. ● ఒక టన్ను వానపాముల ఎరువు లేదా పశువుల ఎరువు లేదా వేప పిండిలో 5 కిలోల చొప్పున పర్పూరియోసిల్లమ్ సిలాసినమ్, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ట్రై కోడెర్మా హార్జినియమ్ కలిపి 30 రోజులు ఉంచి సమృద్ధి చేసిన మిశ్రమాన్ని 3–4 కిలోలు ఒక చెట్టుకు 6 నెలల వ్యవధిలో వేయాలి. ● పైన సూచించిన జీవ నియంత్రణ కారకాలతో ఉన్న వేప పిండి లేదా పశువుల ఎరువును 20 కిలోలను 200 లీటర్ల నీటిలో 2 రోజుల పాటు నానబెట్టి 2–3 లీటర్లతో ఒక్కో చెట్టు పొదళ్లు తడిపి నులి పురుగులను నివారించవచ్చు. జామ పంటలో నులిపురుగుల బెడద ముందస్తు చర్యలతో కట్టడి చేయవచ్చు కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
● జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్ ● విద్యార్థులకు ఉపన్యాస పోటీలు తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేరా యువ భారత్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు చెట్లు మానవాళికి ఎలా ఉపయోగపడతాయి అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం శంకర్ నాయక్ మాట్లాడుతూ.. పలు కాలుష్య కారకాల వల్ల పర్యావరణం కలుషితమవుతోందన్నారు. భూగోళంపై ఆక్సిజన్ శాతం పెరగాలంటే చెట్లు విపరీతంగా విస్తరించాలన్నారు. ఇందుకు విధిగా ప్రతి ఒక్కరూ ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అనే నినాదంతో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. భవిష్యత్‌లో కాలుష్య వాతావరణాన్ని తగ్గించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఉపన్యాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమొంటో తోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధికారి అంజయ్య, అధ్యాపకులు వెంకటస్వామి, విద్యా సాగర్, వెంకన్న, జి వెంకటస్వామి, గోవర్ధన్, రమ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పనిసరి
మహేశ్వరం: రైతులంతా ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పక చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి డి.ఉష సూచించారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. రైతులు పట్టాపాస్ బుక్, ఆధార్, ఆధార్‌కు అనుసంధానం ఉన్న ఫోన్ నంబర్‌తో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతీ రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య(యూనిక్ కోడ్)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. రైతు రుణాలు, ఇతర ఆర్థికసాయం పొందేందుకు ఈ నంబర్ తప్పనిసరి అని చెప్పారు. పంటలో కలుపు నివారణ, నానో యూరియా వాడే విధానం, వరి పంట సాగులో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుధారాణి, మండల వ్యవసాయాధికారి నాగమణి, టెక్నికల్ ఏఓ యాదగిరి గౌడ్, ఏటీఎం శ్రీవిద్య, విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి ఉష -
క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
తాండూరు రూరల్: జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు తాండూరులో నిర్వహిస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జినుగుర్తిలో వాలీబాల్ క్రీడాకారుడు పి.శ్రీనివాస్ జ్ఞాపకార్థం టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వాలీబాల్ అంటే గుర్తుకు వచ్చేది జినుగుర్తి గ్రామమని గుర్తు చేశారు. హెల్మెట్ పెట్టుకోక తన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని శ్రీనివాస్ తండ్రి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన కొడుకు జ్ఞాపకార్థంగా 100 హెల్మెట్లను పంపిణీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, పురుషోత్తంరావు, సంపత్‌కుమార్, రమేశ్‌కుమార్ ఉత్తమ్‌చందు, రాంలింగారెడ్డి, ఆంజనేయులు, సాయిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాలకు నాణ్యతలేని సన్నబియ్యం
● అన్నంలో పురుగులు ● ఇది ప్రభుత్వ తప్పిదమే ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి మర్పల్లి: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు నాణ్యత లేని సన్నబియ్యం సరఫరా చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తరచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని, విద్యార్థులు తినలేకపోతున్నారని తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో భోజనం సరిగ్గా లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో మండల అధికారులు విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులను సముదాయించారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్‌రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు పట్లోళ్ల రామేశ్వర్‌తో కలిసి మంగళవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులకు అందుతున్న భోజనంపై ఆరా తీశారు. అనంతరం ఎస్ఓ సునీతతో మాట్లాడారు. పాఠశాలకు సన్న బియ్యం సరఫరా కాకపోవడంతో ఐదు రోజుల క్రితం మోమిన్‌పేట్ మండలంలోని వసతి గృహం నుంచి రెండు బస్తాల బియ్యం తెచ్చుకున్నట్లు సునీత తెలిపారు. అవి నాణ్యత లేవని తెలిపారు. పురుగులు వచ్చినట్లు ఒకరిద్దరు విద్యార్థులు తమ దృష్టికి తెచ్చారన్నారు. అనంతరం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇకపై విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి మల్లేశ్ యాదవ్, జిల్లా, మండల నాయకులు బలరాంగౌడ్, యాదవరెడ్డి, శ్రీమంత్‌కుమార్, మధు, శేఖర్, సంగమేశ్వర్, రమేష్, శ్రీకాంత్, మహేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాలనీల సమస్యలు పరిష్కరించండి
తాండూరు టౌన్: పట్టణ శివారులోని 8వ వార్డు పరిధిలో గల రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా కాలనీవాసులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెండు కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేక పోయాయన్నారు. కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. సిట్ విచారణకు హాజరు తాండూరు: పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్ జాదవ్ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న తన ఫోన్‌ను గత ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేసి ఉంటారని పోలీసులకు తెలిపారు. సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు వెల్లడించారు. అందుబాటులో అన్ని ఎరువులు ఏడీఏ రుద్రమూర్తి తాండూరు రూరల్: నియోజకవర్గంలో ఎరువుల కొరత లేదని వ్యవసాయశాఖ తాండూరు ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. మంగళవారం మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీఏ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 0మాట్లాడుతూ.. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్, డీసీఎంఎస్, మన గ్రోమార్ దుకాణాల్లో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. వివిధ మండలాల్లో యూరియా అందుబాటులో ఉందన్నారు. పెద్దేముల్–58 మెట్రిక్ టన్నులు, బషీరాబాద్–125, తాండూరు–162, యాలాల్లో–93 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. యూరియా ఒక్క బస్తాకు రూ.267 మాత్రమే చెల్లించాలని రైతులకు సూచించారు. 90 మెట్రిక్ టన్నుల డీఏపీ కూడా అందుబాటులో ఉందన్నారు. బస్తా డీఏపీకి రూ.1,350 మాత్రమే చెల్లించాలని చెప్పారు. వర్షాకాలం సీజన్లో నియోజకవర్గంలో 1.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి టీపీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్ ఇబ్రహీంపట్నం: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని టీపీఎస్ఏ(తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేయబడిన కార్యదర్శులకు మొదటి నియామకమైన 2019 ఏప్రిల్ 11 నుంచి వర్తింపులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని, జిల్లాలో ఓపీఎస్ క్యాటగిరీలో విధులు నిర్వహిస్తున్న వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్షన్ చేయాలని, పెండింగ్ జీతభత్యములు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు దేవేందర్, దీపిక, నయీం, గౌస్, నవీన్‌యాదవ్, శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు. జీజేసీ ప్రిన్సిపాల్‌గా రమణకుమారి దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల(జీజేసీ) ప్రిన్సిపాల్‌గా రమణకుమారి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి ఇన్నాళ్లుగా ఇన్చార్జిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తానన్నారు. -
మహిళలకు అండగా భరోసా కేంద్రం
● ఎస్పీ నారాయణరెడ్డి ● బాధితులకు మరింత మెరుగైన సేవలందించాలని సూచన అనంతగిరి: మహిళలకు అండగా జిల్లా భరోసా కేంద్రం పని చేస్తోందని ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పోలీస్ కేంద్రంలోని భరోసా కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం అందిస్తున్న సేవలను కొనియాడారు. బాధితులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కేంద్రం మహిళలు, పిల్లలకు అండగా నిలుస్తోందన్నారు. గృహ హింస, లైంగిక వేధింపులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి అన్ని విధాలా సహాయం అందిస్తోందని తెలిపారు. బాధితులకు న్యాయం అందించడంలోనూ, వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలోనూ ఇక్కడి సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు హనుమంత్ రావు, మురళీధర్, డీఎస్పీలు, భరోసా కేంద్రం సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం వికారాబాద్‌లోని తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. తద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. నిరంతరం వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు మురళీధర్, టీవీ హనుమంత్‌రావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య
పరిగి: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని యాబాజిగూడలో చోటు చేసుకుంది. ఎస్ఐ సంతోష్‌కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పద్మమ్మ, జంగయ్యకు ముగ్గురు కూతుళ్లు సంతానం. 13ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో పద్మమ్మ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇదిలా ఉండగా రెండో కూతురు నవీంద్ర (15) రంగారెడ్డి జిల్లా పాల్మాకుల కస్తూర్బాగాంధీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇటీవల స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో తల్లి పద్మమ్మ నవీంద్రను హాస్టల్లో వదిలి వెళ్లింది. రెండు రోజు రోజుల తర్వాత తల్లికి ఫోన్ చేసిన బాలిక తనకు చదువు ఇష్టంలేదని మారాం చేయడంతో పాటు బాగా ఏడ్చింది. దీంతో ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం స్కూల్‌కు వెళ్లమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. దీంతో బాలికను మరో స్కూల్లో చేర్పించాలనే ఉద్దేశంతో టీసీ తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా పద్మమ్మ గత సోమవా రం ఉదయం తమ బంధువుల గ్రామమైన బస్పల్లి కి వెళ్లింది. రాత్రి వచ్చేసరికి నవీంద్ర ఇంట్లో ఉరేసు కుంది. ఇదే గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ మంగళవా రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ● యాబాజిగూడలో ఘటన ● ఓ యువకుడిపై అనుమానం వ్యక్తంచేస్తూ తల్లి ఫిర్యాదు ● కేసు నమోదు చేసిన పోలీసులు -
క్షయ వ్యాధిపై ఆందోళన చెందొద్దు
కుల్కచర్ల: క్షయ వ్యాధి(టీబీ) పట్ల ఎవరూ భయాందోళన చెందొద్దని జిల్లా టీబీ నియంత్రణ అధికారి రవీంద్రయాదవ్, మండల వైద్యాధికారి కిరణ్‌గౌడ్ అన్నారు. టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా మంగళవారం తిర్మలాపూర్, ఘణపూర్, సాల్వీడు గ్రామాల్లో టీబీ, రక్తపోటు, హెచ్ఐవీ, మధుమేహం వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వచ్ఛతను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడంతో అనారోగ్య పరిస్థితులు తగ్గుతాయన్నారు. ఎవరూ కూడా వ్యాధుల పట్ల భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల రోగాలకు చికిత్స ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరిశ్వర్ రెడ్డి, వైద్య సిబ్బంది యాదమ్మ, రాజు, గోపాల్, గౌరీబాయి, తదితరులు పాల్గొన్నారు. టీబీ నియంత్రణ అధికారి రవీంద్రయాదవ్ -
పింఛను మొత్తం పెంచాల్సిందే
● వచ్చేనెల నుంచి అమలు చేసి తీరాలి ● చేతకాకపోతే సీఎం గద్దె దిగాలి ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనంతగిరి: ఎన్నికల హామీ మేరకు ఆగస్టు నెల నుంచి ఆసరా, చేయూత పెన్షన్ల మొత్తం పెంచాలని, లేకుంటే సీఎం రేవంత్‌రెడ్డి గద్దె దిగాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని సత్యభారతి ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ మొత్తం పెంచుతా మని చెప్పి అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయకపోవడం సరికాదన్నారు. అధికార, ప్రతిపక్షాలకు విమర్శించుకోవడం తప్ప ప్రజల బాధలు పట్టడం లేదన్నారు. దివ్యాంగుల పెన్షన్ మొత్తాన్ని రూ.6 వేలకు, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను రూ.4వేలకు, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి రూ.15వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆగస్టు 13న హైదరాబాద్‌లో లక్షలాది మందితో మహా ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఎవ్వరికీ అవసరం లేని అందాల పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం వద్ద నిధులు ఉంటాయి కానీ.. పెన్షన్ మొత్తం పెంచడానికి ఎందుకు ఉండవని ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి వితంతువులు, వృద్ధులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య, జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు పీ ఆనంద్ మాదిగ, జిల్లా ఇన్చార్జ్ ప్రశాంత్ మాదిగ, చేయూత పెన్షన్ల జిల్లా కమిటీ అధ్యక్షురాలు మంజుల, మహిళా నాయకురాళ్లు పద్మమ్మ పుష్ప, సునీ త, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాస్, ప్రధాన కార్యదర్శి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
భయం గుప్పిట్లో కాలనీలు
● కొడంగల్‌లోని మొచ్చగేరి, కుమ్మరిగేరికి పొంచి ఉన్న ముంపు ముప్పు ● భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులే ● రెండేళ్ల క్రితం తీవ్ర నష్టం కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్ సమీపంలో గల మొచ్చగేరి, కుమ్మరిగేరి ప్రజలు భయం గుప్పి ట్లో కాలం గడుపుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఈ రెండు కాలనీల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు తీరని నష్టం జరిగింది. పట్టణ శివారులో చెరువు ఉంది. ఈ చెరువుకు ఉన్న పాటు కాలువ ముచ్చగేరి, కుమ్మరిగేరికి సమీపంలో ఉంది. పాటు కాలువ పొంగి ప్రవహించినా లేక తెగిపోయినా ఈ కాలనీలు మునుగుతాయి. రెండేళ్ల క్రితం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. 93.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొడంగల్ పెద్ద చెరువు పాటు కాలువ పొంగి ప్రవహించింది. దీంతో ఈ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. నిద్రలో ఉన్న ప్రజలు అర్ధరాత్రి వేళ ఏం చేయాలో తోచక బిత్తరపోయారు. ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు టీవీ, ఫ్రిజ్, బీరువా, మంచాలు నీటిలో మునిగాయి. ఇండ్లలో ఉన్న సామగ్రిమొత్తం నీట మునిగింది. బాధితులు కన్నీరు మున్నీరుగా రోదించారు. విషయం తెలుసుకున్న అప్పటి మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు బాధితులను పరామర్శించారు. మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలు తెప్పించి రోడ్డును తవ్వించారు. వరద నీరు వెళ్లడానికి దారి కల్పించారు. చాలా సేపటి తర్వాత వరద నీరు తగ్గుముఖం పట్టింది. కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించే కుమ్మరి, మొచ్చ కులస్తులకు రక్షణ కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎఫ్టీఎల్లో ఆక్రమణల తొలగింపు
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కొహెడలోని పిట్టెల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలసిన ఆక్రమ నిర్మాణాలను మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తొలగించారు. సర్వే నంబర్ 141లోని కొంత భాగంలో చెరువు పరిధిలో ఉండగా ఎఫ్టీఎల్లోకి ప్రహరీ గోడలు వెలిశాయి. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఏఈ వంశి ఆధ్వర్యంలో జేసీబి సహాయంతో గోడలను తొలగించారు. ఈ సందర్భంగా వంశి మాట్లాడుతూ... చెరువులు, కుంటలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని, ఎవరైనా చెరువులను ఆక్రమించినా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
దుద్యాల్: తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని హస్నాబాద్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కొడంగల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన చాకలి వెంకటమ్మ, ఇస్వప్పకు ముగ్గురు కుమారులు. వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులకు పెద్ద కుమారుడు నవీన్(24) చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇటీవల తన బైక్‌పై గుజరాత్, ఆరుణాచలంతో పాటు ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు. ఈ విషయమై తల్లిదండ్రులు అతన్ని మందలించారు. బైక్‌పై వందల కిలోమీటర్ల ప్రయాణం సురక్షితం కాదని, ప్రమాదాలు జరిగే అవకాశంతో పాటు ఆరోగ్యం పాడవుతుందని చెప్పారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల పేరుతో మరోసారి బైక్‌పై వెళ్లొద్దని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం ఉదయం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. చేతికి వచ్చిన చెట్టంత కొడుకు ఇలా చేస్తాడని ఊహించలేదని బాధిత తల్లిదండ్రులు రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం హస్నాబాద్‌లో విషాదం -
దశలవారీగా అభివృద్ధి పనులు
తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ పరిధిలో దశల వారీగా పలు అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి అన్నారు. సోమవారం సాయిపూర్ 9వ వార్డు పరిధిలోని కుమ్మరికుంటలో రూ.5 లక్షలతో మురుగు కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డులను సుందరీకరించుటలో భాగంగా పలు సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో జనావాసాల మధ్య వరదనీరు, మురుగునీరు నిలవకుండా ఉండేందుకు సైడ్ డ్రైన్లను నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో పలు అభివృద్ధి పనులు చకాచకా జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, బంటు మల్లప్ప తెలిపారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి -
17న లయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్
క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట కొడంగల్: కొడంగల్ పట్టణ లయన్స్ క్లబ్ ఇన్‌స్టాలేషన్‌ను ఈ నెల 17న(గురువారం) సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇన్స్టాలేషన్ ఆఫీసర్‌గా లయన్ నటరాజ్, ముఖ్య అతిథులుగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, జిల్లా సెకండ్ వైస్ గవర్నర్ లయన్ శశికాంత్, ఇండక్షన్ అధికారిగా లయన్ మృత్యుంజయ, ఇన్స్టాలేషన్ కమిటీ చైర్మన్‌గా ముద్దప్ప దేశ్‌ముఖ్ వ్యవహరిస్తారని చెప్పారు. క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వేలాది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు. మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్ దోమ: అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న వాహనాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామ సమీపంలో కొందరు టిప్పర్లలో మట్టిని నింపి యఽథేచ్ఛగా తరలిస్తున్నారని సమాచారం అందిందన్నారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి అక్కడి చేరుకొని ఐదు టిప్పర్లు, ఓ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను స్థానిక పోలీసులు సీజ్ చేసి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అక్రమ మట్టి వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదని టాస్క్‌ఫోర్స్ సీఐ హెచ్చరించారు. ఆర్ఐగా అదనపు బాధ్యతలు ధారూరు: మండల ఆర్ఐగా దేవెందర్రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ఐ స్వప్న పర్యవేక్షిస్తున్న ధారూరు, నాగారం, అంపల్లి, గురుదోట్ల, దోర్నాల్, హరిదాస్‌పల్లి, కొండాపూర్‌కలాన్, గడ్డమీదిగంగారం, నర్సాపూర్, రాజాపూర్, నాగసమందర్, అల్లిపూర్, రుద్రారం, ఎబ్బనూర్, మోమిన్‌కలాన్, తరిగోపుల, కుక్కింద, ధర్మాపూర్ గ్రామాలను అతనికి కేటాయించినట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. మున్నూరుసోమారం, రాంపూర్‌తండా, నాగ్సాన్పల్లి, అవుసుపల్లి, మైలారం, మోమిన్‌ఖుర్దు, కుమ్మర్‌పల్లి, కొండాపూర్‌ఖుర్దు, కేరెళ్లి, అల్లాపూర్, అంతారం, బూర్గుగడ్డ, చింతకుంట, బాచారం, గట్టెపల్లి కాచారం గ్రామాలను ఆర్ఐ స్వప్న పర్యవేక్షిస్తారన్నారు. పొలాల్లోకి పశువులను వదలొద్దని ఫిర్యాదుచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించిన రైతులు ధారూరు: మండల కేంద్రంలోని కొంతమంది పశువుల వ్యాపారులు మేత కోసం మూగజీవాలను పంట పొలాల్లోకి వదులుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు సేకరించిన ఫొటోలు, వీడియోలను సీఐ రఘురామ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న కంది పంటలు వేశామని వ్యాపారులు పశువులను వదిలేయడంతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పశువులను పట్టుకుని జరిమానా విధిస్తామన్నారు. తిరుపతిగారి మల్లేశం తన పంట పొలాన్ని వ్యాపారుల పశువులు నాశనం చేశాయని ఎస్ఐ అనితకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన మహిళ.. స్నాప్‌చాట్‌తో ఆచూకీమీర్పేట: ఏడాది క్రితం అదృశ్యమైన మహిళ కేసును మీర్‌పేట పోలీసులు ‘స్నాప్‌చాట్’ ద్వారా ఛేదించారు. ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. అల్మాస్గూడ వినాయకహిల్స్‌లో నివాసముండే ఓ మహిళ(22) కుటుంబ వివాదాల కారణంగా గతేడాది జూన్ 8వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి పోయింది. దీంతో ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మహిళ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్ కానీ, ఆమెకు సంబంధించి ఎలాంటి ఆధారాలు వెంట తీసుకెళ్లకపోవడంతో కేసును సవాలుగా తీసుకున్న మీర్‌పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళ మరొకరి సెల్ఫోన్లో స్నాప్‌చాట్ ఐడీని సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా మహారాష్ట్ర ముంబయిలో ఆమెను అదుపులోకి తీసుకుని సోమవారం తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అక్కడికి ఎందుకు వెళ్లిందనే విషయంపై స్పష్టత లేదు. -
విద్యార్థులకు గుడ్డు ఇవ్వాల్సిందే
తాండూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంలో కోడి గుడ్డు ఇవ్వాల్సిందేనని తాండూరు ఎంఈఓ వెంకటయ్య స్పష్టం చేశారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ‘నెల రోజులుగా గుడ్డు లేదు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. సోమవారం ఉన్నతాధికారుల సూచన మేరకు ఏంఈఓ వెంకటయ్య చెన్‌గేస్‌పూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు. వారానికి మూడు రోజులు విద్యార్థులకు గుడ్డు అందజేయాలన్నారు. అలాగే నాణ్యమైన భోజనం అందించాలని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీధర్, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏంఈఓ వెంకటయ్య -
పర్యవేక్షణే పరమావధి
● మధ్యాహ్న భోజనంపై అప్రమత్తత ముఖ్యం ● నిర్వాహకులకు బిల్లులు విడుదల చేయాలి ● ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రుల సూచన దౌల్తాబాద్: మధ్యాహ్న భోజన మెనూ బాగున్నా అమలులో ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో గిట్టుబాటు కాక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ఏజెన్సీ వారికి కష్టమవుతుంది. గతేడాది రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం వికటించి పిల్లలు అస్వస్థతకు గురికావడంతో అంతటా అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. అప్పట్లో నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షించారు. ఈ విద్యా సంవత్సరం తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. బాధ్యతే ముఖ్యం అనేక బడుల్లో కొంతకాలంగా ఆహార కమిటీల పాత్ర అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని బడుల్లో నేరుగా విద్యార్థులకు భోజనం వడ్డిన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ సభ్యుల పర్యవేక్షణ కూడా కొన్ని చోట్ల సరిగ్గా ఉండడంలేదు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైతే మేలు. బడిలో వంట చేసే పాత్రలు ఎలా ఉన్నాయో.. సరి చూడాలి. వండిన భోజనాన్ని మొదట ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు రుచి చూడాలి. వీరు భోజనం రుచి చూసిన తర్వాతనే మిగతా వారికి అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అంది అస్వస్థతకు గురికాకుండా ఉంటారు. నిధులు పెంచాలి దౌల్తాబాద్ మండల పరిధిలోనూ మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు అంతంతమాత్రంగానే ప్రభుత్వం ధరలు అందిస్తుంది. మరోవైపు బకాయి బిల్లులు చెల్లింపులకు నోచుకోక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావం వంట తయారీపై పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నిధులు పెంచితే పిల్లలకు నాణ్యమైన భోజనం అందే వీలుంటుంది. ఈ విషయమై ఎంఈఓ వెంకట్స్వామిని వివరణ కోరగా ఇప్పటికే బడుల్లో మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ పెంచామన్నారు. బడుల్లో మెరుగైన మెనూ అమలయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
దోమ: సాగులో వాడే క్రిమి సంహారక మందు తాగి ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బాలమణి దంపతులకు శ్రీకాంత్(27) ఏకై క కుమారుడు. అతను కొంత కాలంగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతూ ఇబ్బందులకు గురవుతుండేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈ నెల 12వ తేదీ రాత్రి ఊటుపల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు డీగ్రి వరకు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు చేదొడు వాదొడుగా ఉండేవాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. -
నేడు ఫోన్ ట్యాపింగ్ కేసువిచారణకు థారాసింగ్
తాండూరు: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పీసీసీ ప్రధాన కార్యదర్శి, పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ జాదవ్ థారాసింగ్కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తాను విచారణకు హాజరవుతానని ఆయన తెలిపారు. ఏఈఓకు మెమో దోమ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫార్మర్ రిజిస్ట్రీని వ్యవసాయ విస్తరణ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని సోమవారం ‘సాక్షి’లో దినపత్రికలో ఫార్మర్ రిజిస్ట్రీకి పైసా వసూల్ అనే కథనం ప్రచురితమయింది. ఇందుకు స్పందించిన ఉన్నతాధికారులు ఏఈఓ హారికకు మెమో జారీ వివరణ తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్‌రావుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయన ఏఈఓ హారికకు మెమో ఇచ్చి ఫార్మర్ రిజిస్ట్రీ ఆరోపణలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చేవెళ్ల: ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయటంతో వెనకనుంచి బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చనువెళ్లి గ్రామానికి చెందిన తలారి నర్సింలు(38) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన బైక్‌పై చేవెళ్లకు వెళ్తుండగా పామెన బస్‌స్టేజి సమీపంలోని పెట్రోల్ బంకు సమీపంలో ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో నర్సింలు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడిన నర్సింలును చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్
బొంరాస్‌పేట: మండల పరిధిలోని జాతీయ రహదారి163 పక్కన ఆగి ఉన్న లారీని.. వేగంగా వెళ్తున్న బైక్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తండ్రీకొడుకులు తీవ్ర గాయాలపాలయ్యారు. దౌల్తాబాద్ మండలం పోచమ్మగడ్డతండాకు చెందిన సబావత్ నెహ్రూనాయక్, తనకొడుకు అరుణ్‌తో కలిసి సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై కొడంగల్ వైపు వెళ్తున్నాడు. రేగడిమైలారం శివారు బాపనోనిబావి వద్ద మరమ్మతులకు గురై, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కిందపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల అరుణ్ కాలు విరగగా, నెహ్రూనాయక్ తలకు గాయాలయ్యాయి. స్థానికులు వీరిని కొడంగల్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేగడిమైలారం శివారులో ప్రమాదం తండ్రీ కొడుకులకు గాయాలు -
ఫోన్ చోరీ..ఖాతా ఖాళీ
లాటరీ తగిలిందని, మీ కొడుకును కస్టమ్స్ అధికారులు పట్టుకొన్నారని.. ఏదో నేపంతో సైబర్ కేటుగాళ్లు ఉచ్చులోకి లాగి డబ్బులు కాజేస్తున్నారు. అపరిచితుల కాల్స్, వాట్సాప్ లింకులను ఓపెన్ చేయొద్దని పోలీసులు పదేపదే పేర్కొంటున్నా అక్కడక్కడ అమాయకులు మోసపోతున్న ఉదంతాలున్నాయి.మోమిన్‌పేట: బస్సులు, సంతలలో ఫోన్లను చోరీ చేయడం ఆపై డబ్బులు లాగేసుకోవడం ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త విధానం. ప్రతిఒక్కరూ డిజిటల్ లావాదేవీలు జరపడంతో కేటుగాళ్లు చోరీల కోసం నూతన దారులు అన్వేషిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మండల సర్కిల్ కార్యాలయ పరిధిలో గడిచిన రెండేళ్లలో 33 ఫిర్యాదు రాగా అందులో 8 కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దాదాపు రూ.10,46,883 సొత్తును రికవరీ చేశారు. ఫోన్ పోగొట్టుకొన్న వెంటనే సిమ్‌ను బ్లాకు చేయాలని పోలీసు అధికారులు పదేపదే చెబుతున్నారు. మరోవైపు అమయాకులు ఆన్లైన్ గేమ్‌లు, వాట్సాప్‌లో వచ్చే లింక్‌లను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మాయమవుతాయి. అప్పుడు వెంటనే 1930కి కాల్ చేయడంతో మాయమైన నగదు ఓల్డ్‌లో పెడుతారని అధికారులు పేర్కొంటున్నారు. లబోదిబోమన్న బాధితులు ఇటీవల మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ రషీద్ విధుల్లో భాగంగా వికారాబార్కు వెళ్లాల్సి రావడంతో బస్టాండులో బస్సు ఎక్కాడు. అంతలోనే ఫోన్న చోరీకి గురైంది. వెంటనే బ్యాంకులకు సమాచారం అందించడంతో డబ్బులు పోలేదు. కానీ ఈ ఏడాది మార్చి 2వ తేదీన మోమిన్‌పేటకు చెందిన రుద్రశెట్టి శివకుమార్ వికారాబాద్ వెళ్లడానికి బస్టాండులో బస్సు ఎక్కాడు. అంతలోనే ఫోన్ అపహరణకు గురైంది. మరుసటి రోజు బ్యాంకులకు సెలవు ఉండటం, బ్యాంకులకు సమాచారం ఇవ్వాలన్న ఆలోచన కూడా అతనికి తెలీదు. దీంతో ఖాతాలలో నుంచి రూ.1.44 లక్షలు విత్‌డ్రా చేశారు. అదే విధంగా మర్పల్లి గ్రామానికి చెందిన రాజు ఫోన్ పోగొట్టుకోవడంతో ఖాతా నుంచి రూ.10లక్షలు మాయమయ్యాయి. డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన పిన్ నంబరును గుర్తించి డబ్బులను కాజేశారు. లబోదిబోమంటూ వారం రోజులకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఇప్పటికే రూ.68వేలు నిలుపుదల చేశారు. ఇలాంటి కేసుల్లో 8 మంది బాధితులకు డబ్బులను సీఐ వెంకట్ వారి ఖాతాలలో జమ చేయించారు. సైబర్ నేరగాళ్లు ఏ విధంగానైనా డబ్బులు కాజేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. హెచ్చుమీరుతున్న సైబర్ నేరాలు అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్ల కొత్తపంథా అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన ఆశ్చర్యానికి గురయ్యా ఫోన్ చోరీకి గురైందన్న బాధలోనే ఉన్నా. సిమ్‌ను బ్లాక్ చేయించాను. కానీ అప్పటికే ఖాతాలో ఉన్న డబ్బులను కాజేశారు. బ్యాంకులకు సమాచారం ఇవ్వాలనే విషయం తెల్వదు. బ్యాంకులో సురక్షితంగా ఉంటాయని భ్రమపడ్డా. ఫోన్ పోయిన డిజిటల్ లావాదేవీలకు సిక్రెట్ పిన్ ఉంటదిగా అనుకొన్నా. దాన్ని కనుగొన్నారంటే ఆశ్చర్యానికి గురయ్యా. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి డబ్బులు వచ్చాయి. – శివకుమార్, బాధితుడు, మోమిన్‌పేట -
అక్రమమని తేల్చినా..
బషీరాబాద్: జుంటివాగు ప్రభుత్వ భూమి కబ్జాపై ఉరుకులు పరుగులు పెట్టిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అంతలోనే నీరసించారు. మాచనూరు రెవెన్యూ పరిధిలోని జుంటివాగు భూమి కబ్జాకు గురైనట్లు ఈ నెల 9న ఇరిగేషన్ డీఈ క్రిష్ణయ్య, యాలాల తహసీల్దార్ వెంకటస్వామి తేల్చిన విషయం విదితమే. ఎంత భూమి కబ్జా అయ్యిందో సర్వే చేసి హద్దులు పాతారు. అయితే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన సదరు వ్యక్తి అధికారులు పాతిన హద్దులను సోమవారం చెరిపేశాడు. అలాగే కబ్జా చేసిన 20 గుంటల ప్రభుత్వ భూమిలో గదుల నిర్మాణం కూల్చివేయాలని అధికారులు ఆదేశించినా పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నాడు. సదరు భూ కబ్జాదారుపై అధికారులు చర్యలకు వెనకడుగు వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ● కొనసాగుతున్న నిర్మాణం ● కబ్జాదారు బరితెగింపు -
బస్సులు ఆపాలని రాస్తారోకో
పూడూరు: హైదరాబాద్– వికారాబాద్ ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నా మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు వద్ద ఎందుకు ఆపడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా విసుగు చెందిన యువజన సంఘాల నాయకులతో కలిసి చిన్నారులు సోమవారం ఉదయం హైదరాబాద్–బీజాపూర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. బస్‌పాసులు తీసుకుని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కానీ బస్సుల మాత్రం ఇక్కడ ఆపడం లేదని వాపోయారు. ఈ మేరకు విసుగు చెందిన కౌకుంట్ల, అంతారం, అంగడిిచిట్టంపల్లి, చన్గోముల్ గ్రామాలకు చెందిన విద్యార్థులు రోడ్డుపై బస్సులను ఆపి ఆందోళన చేపట్టారు. ఎందుకు ఆపడంలేదని ప్రశ్నించారు. పోలీసులు చేరుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది. విద్యార్థుల నిరసనతో రోడ్డుపై నిలిచిన వాహనాలు -
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
చేవెళ్ల: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్సీసులను పెంచాలని కోరుతూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మండలంలోని కమ్మెట–ఎన్కేపల్లి చౌరస్తాలో సోమవారం ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సులు సమయానికి రావటం లేదని, తగిన సంఖ్యలో సర్వీసులు లేవని రోడ్డుపై ధర్నాకు దిగారు. మండలంలోని కమ్మెట, ఎన్కేపల్లి, గొల్లగూడ, ఈర్లపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు కమ్మెట–ఎన్కేపల్లి చౌరస్తా నుంచి అటూ శంకర్పల్లి, చేవెళ్ల, హైదరాబాద్‌లకు నిత్యం వెళ్తుంటారన్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో తమకు సరిపడా బస్సులు రావటం లేదని, దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఉదయం సమయంలో విద్యార్థులు సమయానికి రాకపోవటంతో కళాశాలలు, పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. ఈ ధర్నాతో ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు నిలిచిపోయాయి. విష యం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి, డిపో అధికారులతో మాట్లాడిస్తామని నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కమ్మెట చౌరస్తాలో రోడ్డుపై బైఠాయింపు -
పంచాయతీలపై నజర్
బొంరాస్‌పేట: గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని ఇన్చార్జి ఎంపీడీఓ వెంకన్‌గౌడ్ అన్నారు. తాజాగా మంజూరైన నిధులు, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నిర్వహణ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. మండలంలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన రెండు గిరిజన పంచాయతీలతో కలిపి మొత్తం 35 పంచాయతీలుండగా 32 మంది కార్యదర్శులున్నారు. మండలంలో కొనసాగుతున్న పంచాయతీరాజ్ శాఖ పనుల గురించి సోమవారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. మంజూరైన నిధులు ప్రతీ గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ సోక్పిట్స్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వరదనీరు వెళ్లే ప్రధాన కాల్వ చివరి భాగంలో ఇంకుడు గుంతలు నిర్మాణం, 322 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఈజీఎస్ నిధుల్లోనే ప్రత్యేకంగా రూ.12వేల చొప్పున మంజూరయ్యాయన్నారు. మండల కేంద్రంలో వారాంతపు సంత జరిగే ప్రాంతంలో కమ్యూనిటీ షానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.3లక్షలు మంజూరయ్యాయని, స్థల సేకరణకు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. కట్టుకాల్వతండా, పాలబాయితండాలో తడిచెత్త, పొడిచెత్త నిల్వ కోసం రూ.2లక్షలతో షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. పారిశుద్ధ్యంపై స్పెషల్ ఫోకస్ షానిటేషన్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, మురుగు నిల్వ లేకుండా, దోమల నివారణకు చర్యలు, వాటర్ట్యాంకుత పరిసరాలను శుభ్రం చేయడం, పిచ్చిమొక్కుల తొలగింపు, పాఠశాలలు, అంగన్వాడీల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో మండలంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. అంగన్వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, బీటీ, సీసీ రోడ్ల పనులు వేగం పుంజుకున్నాయి. ఎంపీడబ్ల్యూ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులున్నారని, ఒక్కో కార్మికుడికి రూ.9,500 చొప్పున వేతనం అందుతుందని తాజాగా ఏప్రిల్, మే, జూన్ వేతనాల చెక్కులు అందించామన్నారు. వనమహోత్సవానికి సిద్ధం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మరో వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నాం. ప్రత్యేకంగా బీఐపీ ప్లాంటేషన్ చేపట్టనున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు పారిశుద్ధ్య కార్మికుల వేతనాల విడుదల ఇన్చార్జి ఎంపీడీఓ వెంకన్‌గౌడ్ -
రాస్నంలో కంటి వైద్య శిబిరం
యాలాల: మండల పరిధిలోని రాస్నం గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో సోమ వారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి పొరుగు గ్రామాల ప్రజలు సైతం విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వంద మందికి పైగా పరీక్షలు నిర్వహించిన సిబ్బంది అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మొగులయ్య, మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు మన్నాన్, సాయన్న, హన్మయ్య, సత్తయ్య, ఖాజా పాష, సిద్దేశ్వర్ తదితరులు ఉన్నారు. పోచమ్మతల్లి ఆలయ నిర్మాణానికి విరాళం కుల్కచర్ల: ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అండగా ఉంటామని బీఆర్ఎస్ నాయకుడు రాజప్ప అన్నారు. మందిపల్‌లో నిర్మిస్తున్న పోచమ్మతల్లి ఆలయ నిర్మాణానికి సోమవారం ఆయన రూ.10వేలు విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయాల నిర్మాణాలకు గ్రామస్తులు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, ప్రసన్న, మొగులయ్య, వెంకటయ్య, ప్రసాద్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొక్కల పరిరక్షణ అందరి బాధ్యత దౌల్తాబాద్: మొక్కలు నాటి పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లో సోమవారం వన మహోత్సవం కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీ ఓ మాట్లాడుతూ.. మొక్కలు మానవ మనుగడకు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వెంకట్‌రెడ్డి, వీర న్న, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దస్తప్ప, ఏపీఓ అంజిలయ్య, టీఏ కృష్ణహరి, పంచాయతీ కార్యదర్శి గోపాల్ తదితరులున్నారు. సీఎంఆర్ఎఫ్తో పేదలకు మేలు కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి నాయక్ దుద్యాల్: ముఖ్యమంత్రి సహాయనిధి పథకంతో పేదలకు మేలు చేకూరుతుందని కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవినాయక్ అన్నారు. మండల పరిధిలోని సాగారం తండాకు చెందిన నరేశ్ రాథోడ్‌కు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.50 వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును సోమవారం బాధితులకు రవినాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గోపాల్ నాయక్, లాలు నాయక్, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు పూడూరు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని పీఏసీఎస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని అంగడిచిట్టంపల్లి, నిజాంపేట్‌మేడిపల్లి, పోతిరెడ్డిపల్లి, పూడూరు, చీలాపూర్, ఎన్కేపల్లి తదితర గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ తీసుకున్న వారు వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగయ్య, నాయకులు రవి, రాములు, తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
బంట్వారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని బీజేపీ కోట్‌పల్లి మండల అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల్లో వేస్తున్న సీసీ రోడ్లన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజార్టీ స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల జెడ్పీటీసీ ఇన్చార్జిగా కృష్ణాయాదవ్, ఎంపీటీసీల ఇన్చార్జిగా రావిరాల రవిని నియమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓగులాపూర్ రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్ -
పశుపోషకులకు ‘షాక్’
దుద్యాల్: విద్యుదాఘాతానికి మూగజీవాలు బలవుతున్నాయి. రూ.లక్షల విలువ చేసి కాడెడ్లు, పాడి పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలకు తెగిపడిన విద్యుత్ తీగల కారణంగా పలువురు రైతులు మృతి చెందగా మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. బాధిత కుటుంబాలకు విద్యుత్‌శాఖ పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నా మెజార్టీ ప్రజలకు అవగాహన లేక నష్టపోతున్నారు. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారనే అవవాదులు లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. మచ్చుకు కొన్ని.. ● మండల పరిధిలోని పోలేపల్లి తండాకు చెందిన రాథోడ్ చందు నాయక్ పాడి గేదె ట్రాన్స్‌ఫార్మార్ వద్ద విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. దీంతో రైతు రూ.70 వేలు నష్టపోయాడు. ● పల్లెగడ్డకు చెందిన ముకుందరెడ్డికి చెందిన కాడెద్దు మృతి చెంది రూ.60 వేల నష్టం వాటిల్లింది. ● కొడగంల్ మండలం పలుగురాళ్ల తండాకు చెందిన మునేగారి సాయిలుకు చెందిన కాడెద్దు మృతి చెందడంతో రూ.50వేలు నష్టం చవిచూశాడు. ● రోటిబండ తండాకు చెందిన పాండు నాయక్(61) పశువులకు మేత కోస్తూ విద్యుదాఘాతంతో విగతజీవిగా మారాడు. బాధితుల ఖాతాలో పరిహారం విద్యుత్ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కేసు నమోదు తర్వాత పశువైద్యుల సాయంతో పంచనామా చేయించాలి. పరిహారం పొందేందుకు కేసుకు సంబంధించిన పత్రాలతో విద్యుత్ శాఖ సహాయక ఇంజనీర్ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. మరణ ధ్రృవపత్రం, ఎఫ్ఐఆర్, పంచనామా నివేదిక, ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం తదితర జిరాక్స్ కాపీలను జతచేసి విద్యుత్ ఏఈకి అందజేయాలి. ఏఈ నుంచి పత్రాలు ఏడీఈకి చేరుతాయి. ఆ పత్రాలు ఉన్నతాధికారులకు అందిన తర్వాత బాధితలు బ్యాంకులో పరిహారం జమచేస్తారు. దరఖాస్తు ఇలా ● అంగవైకల్యం పొందితే ప్రమాద విషయం వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. బిల్లులు, ఇతర ఖర్చులకు సంబంధించిన నకలు జత చేసి విద్యుత్‌శాఖ ఏఈకి దరఖాస్తు సమార్పించాలి. ఉన్నాధికారుల పరిశీలన అనంతరం పరిహారం జమచేస్తారు. ● పశువులు మృత్యువాత పడితే విద్యుత్‌శాఖ అధికారులకు, పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలి. పశువైద్యాధికారి నుంచి పశువు ఖరీదు తెలిపే పత్రం, మృతి చెందినట్లు ధృవీకరణ పత్రం తీసుకోవాలి. మృతి చెందిన పశువు నిమిత్తం పరిహారం బాధితుడికి అందిస్తారు. విద్యుత్ ప్రమాదాల కారణంగా మూగజీవాల మృత్యువాత అవగాహన లేక.. పరిహారం అందక నష్టపోతున్న రైతులు అర్హులకే పరిహారం విద్యుత్ ప్రమాదాలకు సంబంధించిన బాధిత కుటుంబాలు అర్హులైతే పరిహారం తప్పకుండా అందుతుంది. ప్రమాద స్థాయిని బట్టి పరిహారం అందుతుంది. మూగ జీవాల విషయంలో పశువైద్యాధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకుంటున్నాం. విద్యుత్ సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం – ఆనంద్, విద్యుత్ ఏఈ, దుద్యాల్ ప్రమాదం నిర్ధారనైతేనే.. మూగ జీవాలకు విద్యుత్ ప్రమాదం సంబవించినట్లైతే వెంటనే పశువైద్యులకు తెలియజేయాలి. ప్రమాదం జరిగిన పశువుకు నిర్ధారణ పరీక్షలు చేస్తాం. విద్యుత్ షాక్‌తోనే ప్రమాదం జరిగిందని నిజ నిర్ధారణ తర్వాత పశువుకు సంబంధించి మరణ దృవ పత్రం, పరీక్షకు సంబంధించిన ప్రతాలు పశు యాజమానికి అందజేస్తాం. – పరమేశ్వర్, పశువైధ్యాధికారి, కొడంగల్ -
అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలి
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన దోర్నాల్ గ్రామస్తులు ధారూరు: మండల పరిధిలోని దోర్నాల్ పంచాయతీ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని సోమవారం గ్రామస్తులు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీ ఇచ్చారు. గ్రామానికి చెందిన కమ్మరి మోహన్ అక్రమంగా ఇటి నిర్మాణం చేపట్టాడని గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన రాజకీయ ఒత్తిడితో ఏం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికై నా అధికారులు తగిన చొరవ తీసుకుని వెంటనే ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. నేడు సింహ గర్జన సన్నాహక సమావేశం కుల్కచర్ల: ఆసరా, దివ్యాంగుల పెన్షన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు 13న నగరంలో దివ్యాంగుల సింహ గర్జనను విజ యవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నా యకుడు వెంకట్రాములు అన్నారు. సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంగళవారం వికారాబాద్‌లో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. తీన్మార్ మల్లన్నపై దాడి అప్రజాస్వామికం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ తాండూరు టౌన్: క్యూన్యూస్ కార్యాలయం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి అప్రజాస్వామికమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు శాంతియుతంగా నిరసన తెలపడం లేదా చట్టపరంగా ఆయన్ను ఎదుర్కోవాలన్నా రు. మీడియాపై, జర్నలిస్టు మల్లన్నపై దాడి సబబు కాదన్నారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా మల్లన్న తన క్యూన్యూస్ ద్వారా అక్రమాలను ప్రశ్నిస్తున్నారన్నారు. పజాస్వా మ్య దేశంలో దాడులు సమంజసం కాదని, వెంటనే దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ‘ప్రజావాణి’ని వినియోగించుకోవాలి కోట్‌పల్లి ఎంపీడీఓ డానియల్ బంట్వారం: మండల పరిషత్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోట్‌పల్లి ఎంపీడీఓ డానియల్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఒక్క ధరఖాస్తు కూడా రాలేదు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రప్ప, ఆర్ఐ భాగ్యలక్ష్మి, ఈజీఎస్ ఏపీఓ ఎలీషా, వెటర్నరీ అధికారి జగన్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి సమస్య పరిష్కారానికి రూ.18 లక్షలు
మోమిన్‌పేట: గ్రామంలో తాగునీటి అవసరాలకు ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.18లక్షలు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు సిరాజుద్దీన్ తెలిపారు. సమస్యలున్న కాలనీలో బోరుబావులు తవ్విస్తున్నామన్నారు. మొత్తం తొమ్మిది బోరు బావులు మంజూరు చేస్తే ఏడు బోర్లు వేయించామన్నారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రత్యేకచొరవ తీసుకుని నిధులు మంజూరు చేయడంతో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి స్వప్న, కాంగ్రెస్ నాయకులు ఎజాస్ పటేల్, రవి, హాజి, తాజుద్దీన్, మోసిన్, ముజ్జు తదితరులు ఉన్నారు. -
ఉత్తమ సేవలకు అవార్డులు
అనంతగిరి: వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి నగరంలోని గాంధీ భవన్ ప్రకాశం హాల్లో ఆదివారం అవార్డులు అందజేశారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వికారాబాద్‌కు చెందిన శ్రీ వివేక వాణి విద్యాలయం కరస్పాండెంట్ ఎం.నాగయ్య స్వరూప దంపతులతో పాటు గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ చేవెళ్ల చంద్రశేఖర్ ఉష దంపతులకు అవార్డులు అందజేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల వంటి రంగాల్లో సేవ చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, సామాజిక వేత్త, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
చిత్రకారులను కళాకారులుగా గుర్తించాలి
ఆమనగల్లు: చిత్రకారులను కళాకారులుగా గుర్తించాలని చిత్ర కళాకారుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రూపం వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో చిత్రకారులకు చేతినిండా పని ఉండేదని.. ప్రస్తుతం పనిలేక జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చిత్రకారులు చురుకుగా పాల్గొన్నారని, కేసులకు భయపడకుండా ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న బోర్డులను చెరిపి తెలంగాణ పదం చేర్చారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రకారుల బాధ లను గుర్తించి న్యాయం చేయాలని కోరా రు. ఈ సమావేశంలో చిత్రకారులు కొండల్, లింగంగౌడ్, గోపి, యాదయ్య, మల్లేశ్ పాల్గొన్నారు. చిత్ర కళాకారుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి -
ఏఐకి సై
● ప్రాథమిక పాఠశాల నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యకు కసరత్తు ● కొడంగల్ నియోజకవర్గంలోని 112 స్కూళ్లకు 265 కంప్యూటర్ల పంపిణీ ● సీఎం ఇలాకాలో విద్యకు ప్రాధాన్యత కొడంగల్: నియోజకవర్గంలో ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యకు అడుగులు పడుతున్నాయి. కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లోని 112 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ బోధనకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా 265 కంప్యూటర్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. 30 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలలో ఏఐ బోధన ప్రారంభించనున్నట్లు ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. గతంలో ఉన్నత పాఠశాలల్లో ఈ తరహా బోధన అమలు చేశామని తెలిపారు. ఒక్కో స్కూల్‌కి ఐదు చొప్పున కంప్యూటర్లు అందజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు వచ్చాయన్నారు. వీటిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా ఆయా పాఠశాలలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యా రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పేదలకు చేరువలో విద్య, వైద్యం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విద్య, వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారా మెడికల్ కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, వెటర్నరీ కాలేజీ, కొత్త మండలమైన దుద్యాల్ తోపాటు దౌల్తాబాద్, బొంరాస్పేట్కు జూనియర్ కళాశాలలను మంజూరు చేశారు. కొడంగల్ ప్రభుత్వాస్పత్రిని విస్తరించి 220 బెడ్ల సామర్థ్యం కలిగిన టీచింగ్ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ, మైనార్టీ వెల్ఫేర్, బీసీ సంక్షేమ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాలు మంజూరు చేశారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఉన్నతమైన ఆశయానికి అండగా.. పేద విద్యార్థులకు ఉదయం పూట బలవర్ధకమైన అల్ఫాహారం అందించాలనే ఉన్నతమైన ఆశయం వెనుక ఐదుగురి కృషి ఉంది. అందులో మొదటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సీఎం చొరవతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, వయాట్రీస్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ఇండియా హెడ్ మిచెల్ డొమినికా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, తెలంగాణ సోషల్ ఇంఫాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ సహకారం ఉంది. పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్మించిన కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్‌లో ఆహారాన్ని వండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. వంట కోసం ఉపయోగించే నీటిని ఆర్ఓ ప్లాంట్‌లో శుద్ధి చేస్తారు. బాయిలర్ ప్లాంట్, గ్యాస్ బ్యాంక్, ఎప్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వండిన ఆహారం వేడిగా, పరిశుభ్రంగా ఉండడానికి తగిన చర్యలు తీసుకున్నారు. బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇలా.. సోమవారం – ఇడ్లీ, సాంబారు మంగళవారం – పూరీ, ఆలూ కుర్మా బుధవారం – ఉప్మా, సాంబార్ గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ శుక్రవారం – ఉగ్గాని / పొంగల్, చట్నీ శనివారం – బోండా, చట్నీ 28వేల మందికి అల్పాహారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 28వేల మంది విద్యార్థులకు రోజూ ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నారు. ఈ బాధ్యతను హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తీసుకుంది. ఇందుకోసం కొడంగల్ పట్టణంలో కేంద్రీ కృత కమ్యూనిటీ కిచెన్ షెడ్‌ను నిర్మించారు. నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ హెల్తీ న్యూట్రీషన్ బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ) నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
వామ్మో వానరం
అటవీ ప్రాంతాల్లోని కోతులు జనారన్యంలో సంచరిస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పాలకులు పట్టించుకోక పోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. దోమ: గ్రామాల్లో కోతుల గుంపులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్లు, దుకాణాలు, పంటలపై దాడులు చేస్తూ బీభీత్సం సృష్టిస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు అనుబంధ గ్రామాలు ఉదన్‌రావుపల్లి, పాలేపల్లి, లింగన్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల్లో సంచరిస్తున్నాయి. విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్న క్రమంలో వెంట పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. రహదారులపై సంచరిస్తూ వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నారుల దగ్గర తినుబండారాలు కనిపిస్తే వాటిని ఎత్తుకెళ్లేవరకు వదలడం లేదు. ఇళ్లలోకి చొరబడి నిత్యావసర సరుకులను చిందరవందర చేస్తున్నాయి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలిపిన పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం సర్వేకు ఆదేశాలిచ్చినా అధికారులు కోతులను తరలించడంలో నిర్లక్ష్యం వహించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాపలా తప్పనిసరి కోతుల బెడద వల్ల పనులు వదులుకుని కుటుంబానికి ఒకరు ఇళ్ల వద్దే కాపలా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లపై బండరాళ్లు, గూన పెంకలు ధ్వం చేసి ఇళ్లలోకి చొరబడి తినుబండారాలు, కిరాణా దుకాణాల నుంచి చిరుతిళ్ల డబ్బాలు, పండ్ల వ్యాపారుల ఫలాలు ఎత్తుకెళ్తున్నాయి. పంట చేలను పాడు చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లు, దుకాణాలు, పంటపొలాల ధ్వంసం ఇబ్బంది పడుతున్న జనం పట్టించుకోని పాలకులు విద్యార్థులకు ఇబ్బంది పాఠశాలకు వచ్చే విద్యార్థులు దారిపొడువునా వానరాలే ఉండడంతో పాఠశాలకు వచ్చేందు కు ఆందోళన చెందుతున్నారు. మ ధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా వచ్చి భ యాందోళనకు గురిచేస్తున్నాయి. ఉపాధ్యాయులు సైతం ఆందోళన చెందుతున్నారు. అధికారులు కోతులను తరలించేందుకు చర్యలు తీసుకోవాలి. – శ్రీవిద్య, హెచ్ఎం, దోమ జెడ్పీహెచ్ఎస్వంట సామగ్రి ఎత్తుకెళ్తున్నాయి కోతుల బెడద కారణంగా ఇంటి నుంచి ఎక్కడకు వెళ్లడం లేదు. ఇంట్లో ఎవరూ లేకుంటే పెంకలు, బండలు ధ్వంసం చేస్తున్నాయి. వంట సామగ్రి ఎత్తుకెళ్తున్నాయి. ఇంట్లోకి వచ్చిన కోతులను తరిమేందుకు యత్నిస్తే ఎదురుతిరుగుతున్నాయి. తమ కిరాణ దుకాణంలో తినుబండారాల డబ్బలు ఎత్తుకెళ్తున్నాయి. – వెంకటమ్మ, దోమ -
రూ.50 కోట్ల రుణ మంజూరు పత్రాల పంపిణీ
శంషాబాద్ రూరల్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముచ్చింతల్ శివారులో గల స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో గ్రామీణ స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ, పౌల్ట్రీ రంగాల వారికి రూ.50 కోట్ల రుణాల మంజూరు పత్రాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, మిల్లెట్ ఆహార పదార్థాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేశ్ రంజన్, సీజీఎం–వన్ సుధాకర్‌రావు, హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ సర్వేష్ రంజన్, సైఫాబాద్ రీజినల్ హెడ్ సోనాలికా తదితరులు పాల్గొన్నారు. -
కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా
ధారూరు: కర సేవకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు పత్తి వైద్యనాథ్ శనివారం ఉదయం మృతిచెందారు. మధ్యాహ్నం మండలంలోని అంపల్లి గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతోపాటు బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సీనియర్ నాయకుడు పాండుగౌడ్, మండల అధ్యక్షుడు రాజునాయక్, మాజీ సర్పంచ్ బాబయ్య, నాయకులు నరోత్తమ్‌రెడ్డి, ఎం.రమేశ్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాండూరును మరిచే ప్రసక్తే లేదు మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు రూరల్: ఎవరెన్ని కుట్రలు చేసినా తనకు రాజకీయ జన్మనిచ్చిన తాండూరును మరిచే ప్రసక్తే లేదని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దస్తగిరిపేట్‌లో అకాల మరణం పొందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ భగవాన్ కరీం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పరిమళ, మాజీ సర్పంచ్ శేఖర్, నాయకులు బోయరాజు, సలీం, రాజశేఖర్, రఘు, భగవాన్, పుణిత్కుమార్, అయూబ్‌ఖాన్, శివానంద్, ఆనంద్‌గౌడ్ పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేద్దాం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అనంతగిరి: విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి గార్డెన్లో పీఆర్టీయూ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లలు మంజూరయ్యేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపా రు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. స్కావేంజర్ల సమస్యలను సాధ్యమైనంత తర్వగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పలుగం దామోదర్‌రెడ్డి, జి ల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రోజుకో మాట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అనంతగిరి: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. శనివారం వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడారు. ఒకసారి బిల్లు ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని, మరోసారి పార్టీ పరంగా అమలు చేస్తామని ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, పార్టీపట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, నాయకులు రాజేందర్ గౌడ్, మల్లేశం, గయాజ్, లక్ష్మయ్య, సురేష్‌గౌడ్, దత్తు, అశోక్, మల్లికార్జున్, శివకుమార్, మల్లేశం, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
ధారూరు: పశువుల మందపై పిచ్చికుక్క దాడి చేయడంతో ఓ ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలోని నాగసమందర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మాజీ వైస్ ఎంపీపీ వరద మల్లికార్జున్‌కు చెందిన పశువులపాకలోకి ఓ పిచ్చి కుక్క వెళ్లి ఆవును కరవడంతో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. గ్రామంలో ఎక్కడ పశువులు కనిపించినా కుక్క వెంబడించింది. గమనించిన గ్రామస్తులు పట్టుకునేందుకు యత్నించినా దొరకలేదు. నాగారంలో చిన్నారిపై దాడి మండల పరిధిలోని నాగారంలో చాకలి కృష్ణయ్య కూతురుపై శుక్రవారం రాత్రి ఓ కుక్కదాడి చేసి గాయపరిచింది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో వీధి శునకాలను తరలించేందుకు అధికారులు చొర తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.పశువుల మందపై దాడి ఆవు మృత్యువాత -
యువతను సేవ వైపు మళ్లించాలి
● రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోధ మయానంద మహరాజ్ తాండూరు టౌన్: యువతను సామాజిక సేవా త త్పరత వైపు మళ్లించేందుకు శ్రీ రామకృష్ణ సేవా స మితి కృషి చేయాలని హైదరాబాద్ రామకృష్ణ మ ఠం అధ్యక్షుడు శ్రీ పూజ స్వామి బోధ మయానంద మహారాజ్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రామకృష్ణ, వివేకానంద భావ ప్రచార పరిషత్ రాష్ట్ర అర్ధ వార్షిక సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 18 సేవా సమితులు, 71 మంది ప్రతినిధుల భక్త బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు బానిసలుగా కాకుండా వారిని సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీనవం వైపు మళ్లించాలన్నారు. వారిలో ఏకాగ్రతను పెంపొందించి, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరం చేయాలన్నారు. సేవా సమితి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని, రామకృష్ణ మఠం ద్వారా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడటం, అనేక అవార్డులు అందుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం శ్రీ రామకృష్ణ ప్రభ అనే ఆధ్యాత్మిక విశ్వాస మాస పత్రిక, బాలల మాస పత్రిక ‘మొలక’ను స్వామీజీలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ భావ ప్రచార పరిషత్ అధ్యక్షుడు స్వామి పూజనానంద మహరాజ్, వేదానంద మహరాజ్, తాండూరు సమితి సభ్యులు సూర్యప్రకాష్, బాలకృష్ణ, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కరించండి
పరిగి: మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు పేర్కొన్నారు. శనివారం పరిగి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్యకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వారంరోజులుగా సక్రమంగా తాగునీరు అందడంలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్న బోరుకు మోటర్ లేక నీటిసమస్య రోజు రోజుకు తీవ్రతరమవుతుందన్నారు. ఈ అధికారులు స్పందించి ఉన్న బోరులోనైన నూతన మోటర్‌ను ఏర్పాటు చేయించి నీటి సమస్య పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేత -
గోశాలకు సాగు భూములెందుకు?
మొయినాబాద్: గోశాల ఏర్పాటుకు రైతులు సాగు చేసుకుంటున్న భూములెందుకు ఇస్తున్నారు.. బీడులుగా మారిన ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి.. వాటిని ఇవ్వండని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రైతులు చేపడుతున్న రిలే నిరహార దీక్షలో శనివారం ఆయన పాల్గొన్నారు. పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎనికేపల్లి 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల భూముల్లో 30 ఎకరాలను 1954లోనే ప్రభుత్వం రైతులకు అసైన్డ్ చేసిందని అన్నారు. మిగతా భూమిని సైతం విడతలవారీగా అసైన్డ్ చేయగా కొంత ప్రభుత్వ భూమిగా ఉందన్నారు. మొత్తం భూమిని రైతులు సుమారు 80 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారని.. వర్షాధార పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి పేద రైతుల భూములను గోశాలకోసం లాక్కోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎకరాకు 300 గజాల ఇంటి స్థలం పరిహారంగా ఇస్తామని చెబుతోందని.. 80 ఏళ్ల క్రితం 50 కుటుంబాలుగా ఉన్న రైతులు నాలుగు తరాలు గడవడంతో ఇప్పుడు 500 కుటుంబాలకు పెరిగాయన్నారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయమై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, పార్టీ మండల మాజీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, పద్మనాభం, మాజీ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. బీడు భూములు ఇవ్వండి ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయండి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి -
చెంచుల సంక్షేమానికి కృషి
● అనంతగిరిపల్లి చెంచు కాలనీలో మల్టీ పర్పస్ సెంటర్ ● రూ.60 లక్షలతో భవన నిర్మాణం ● స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనంతగిరి: చెంచుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి చెంచు కాలనీలో ప్రధానమంత్రి జన్మాన్ పథకం కింద నిర్మించనున్న మల్టీ పర్పస్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచు కాలనీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.60 లక్షల వ్యయంతో మల్టీ పర్పస్ సెంటర్ భవనా న్ని నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరక్టర్ కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మైపాల్ రెడ్డి, షరీఫ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ కుమార్, సీనియర్ నాయకులు ఎండీ.హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం
● కల్తీ కల్లు విక్రయాలను నిరోధించాలి ● ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ● వికారాబాద్‌లో శాఖ కార్యాలయం ప్రారంభం వికారాబాద్: డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రం వికారాబాద్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ నూతన కార్యాలయ భవవాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. పోలీస్, ఎకై ్సజ్ శాఖల అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఇవి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో నిఘా పెట్టాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ఇతర రాష్ట్రాల సహకారం తీసుకోవాలన్నారు. ఈత, తాటి, కర్జూర చెట్లు పెంచాలి రాష్ట్ర వ్యాప్తంగా చెరువు కట్టల మీద, గుట్టలపైన, కాల్వల పక్కన ఈత, తాటి, కర్జూర వంటి మొక్క లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల మేర స్థలంలో వీటిని నాటేలా చూడాలన్నారు. నగరానికి సమీపంలో ఉన్న వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు నీరా, కల్లు ఎగుమతి చేసే విషయంపై దృష్టి సారించాలని తెలిపారు. కల్లు దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ కల్తీ కల్లు విక్రయాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. ఇందుకు పాల్పడుతు న్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కల్తీ కల్లు, మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపా లని మహేందర్‌రెడ్డి, పల్లెలను పాడు చేస్తున్న డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎంపీ కొండా అన్నారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సూపరింటెండెంట్ విజయభాస్కర్, అదనపు కలెక్టర్ సుధీర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ,ఎకై ్సజ్ శాఖ సర్కిల్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
87 కిలోల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ సీజ్
ఆటో డ్రైవర్‌పై కేసు తాండూరు రూరల్: అక్రమంగా తరలిస్తున్న కల్తీ అల్లంవెల్లుల్లి పేస్టు డబ్బాలను కరన్‌కోట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం మండల పరిధిలోని గౌతపూర్ చెక్‌పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సజ్జతుల్లా ఖాన్ తన ఆటోలో 87 కిలోల అల్లంవెల్లుల్లి పేస్ట్ డబ్బాలు తీసుకెళ్తున్నాడు. చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అల్లంవెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి డ్రైవర్ ఎలాంటి పత్రాలు చూపించలేదు. దీంతో కల్తీగా భావించి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. అల్లంవెల్లుల్లి శాంపిల్స్ ల్యాబ్ పంపిస్తామన్నారు. ఆర్‌యూపీపీటీఎస్ జిల్లా కమిటీ నియామకం షాద్‌నగర్: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీటీఎస్) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా నందిగామ మండలం నర్సప్పగూడ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అనురాధను, ప్రధాన కార్యదర్శిగా ఫరూఖ్‌నగర్ ఉర్దూమీడియం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దార్ల రాఘవేంద్రాచారిని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. డెలివరీ బాయ్‌పై దాడి కేసులో ఇద్దరి రిమాండ్ అత్తాపూర్: డెలివరీ బాయ్‌పై దాడి కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన ఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రేహాన్ (20) పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 208 సమీపంలో జీప్టో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సులేమాన్ (25), యూనస్ (25)ను తోడుగా తీసుకువచ్చాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరో వ్యక్తిని ఎందుకు తీసుకువచ్చావు అని రేహాన్ సులేను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మరో ఇద్దరు స్నేహితులు ఇమ్రాన్ (25) సలీం (22) పిలిచాడు. నలుగురు కలిసి రేహాన్‌పై దాడి చేయడంతో పాటు పదునైన కత్తితో ఎడమ చేయి, ఎడమ కాలుపై గాయాలు చేసి పారిపోయారు. రేహాన్‌ను చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. రేహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పీఎస్‌లను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు గచ్చిబౌలి: ఫీల్డ్ విజిట్‌లో భాగంగా ట్రైనీ ఐపీఎస్‌లు పోలీస్ స్టేషన్లను శనివారం సందర్శించా రు. గచ్చిబౌలి, రాయదుర్గం పీఎస్‌లో నలుగురు చొప్పున ట్రైనీ ఐపీఎస్‌లకు రిసెప్షన్, రికార్డులు, లాకప్, సీసీ కెమెరాల పరిశీలన ఎలా ఉంటుందో ఎస్హెచ్ఓలు వారికి వివరించారు. డయల్ 100 తో పాటు పీఎస్‌లకు ఫోన్లలో ఎలా ఫిర్యా దు చేస్తారు, పెట్రోల్ మొబైల్ సిబ్బంది ఎలా స్పందిస్తారు, ఎఫ్ఐఆర్ల నమోదు, హోంగార్డు, కానిస్టేబుల్ నుంచి ఎస్హెచ్ఓ వరకు వారు నిర్వహించే విధులను క్షణ్ణంగా వివరించారు. -
భోజనం బాగోలేదని ఆందోళన
మర్పల్లి: మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని, నాణ్యత కూడా పాటించడం లేదంటూ మర్పల్లి కేజీబీవీ విద్యార్థినులు శనివారం ఆందోళనకు దిగా రు. ఉదయం పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని, తిన లేకపోతున్నామని బాలికలు కుటుంబ సభ్యుల దృష్టికి తెచ్చారు. ఆగ్రహించిన వారుపిల్లలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. భోజనంలో తరచూ పురుగులు వస్తున్నాయ ని తెలిపారు. ఒక్క రోజు కూడా మెనూ అమలు కావడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా పిల్లలను నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో విధులు నిర్వహించే కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థి నులను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. రోజూ ఒక టీచర్ నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటుందని, ఇది కచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది నచ్చని ఓ ఉపాధ్యాయురాలు తోటి సిబ్బంది, విద్యార్థులను రెచ్చగొట్టి ఇలా గొడవలు చేయిస్తోందని తెలిపారు. సదరు టీచర్‌కు రాజకీయ పలుకుబడి ఉండటంతో నైట్ డ్యూటీ చేయడం లేదని పేర్కొన్నారు. విద్యార్థినుల భోజన విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు వివరించారు. మర్పల్లి కేజీబీవీలో విద్యార్థినుల నిరసన ఇది సిబ్బంది పనేనన్న ప్రిన్సిపాల్ నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడి -
‘రియల్’ మబ్బులు..!
మూడేళ్లుగా ఆగిన భూముల క్రయవిక్రయాలు ● అగ్రిమెంట్ల వద్దే నిలిచినకొనుగోళ్ల ప్రక్రియ ● రోజురోజుకూ పడిపోతున్న రిజిస్ట్రేషన్లు ● ఆందోళనలో వ్యాపారులు, రైతులు మోమిన్‌పేట: మూడేళ్లుగా రియల్ వ్యాపారం డీలా పడింది. గతంలో మూడుపూలు ఆరుకాయలుగా విరాజిల్లిన ఈ దందా ప్రస్తుతం నెమ్మదించింది. పలువురు వ్యాపారులు అప్పులు చేసి భూములు కొనుగోలు చేశారు. మరి కొందరు అగ్రిమెంట్ల చేసుకొని మిన్నకుండి పోయారు. గతంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు 40కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఒక్కో రోజు స్లాట్ దొరికే పరిస్థితి కూడా ఉండేది కాదు. ప్రస్తుతం రోజుకు పది కూడా దాటడం లేదు. అవి కూడా రెండు మూ డు కుంటలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నాలుగైదు ఏళ్ల క్రితం వరకు ఎకరం భూమి రూ.లక్షల్లో పలికేది. మూడేళ్ల నుంచి రూ.కోట్లకు చేరుకుంది. అయినా రియల్ వ్యాపారం బాగుండటంతో కొంత మంది వ్యాపారులు అప్పులు చేసి సిండికెట్‌గా ఏర్పడి భూములు కొనుగోలు చేశారు. రెండేళ్ల నుంచి రియల్ దందా పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక.. వ్యాపారం సాగక ఏం చేయాలో తెలియక హైరానా పడుతున్నారు. అగ్రిమెంట్ల వద్దే ప్రక్రియ నిలిచిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సాధారణంగా అగ్రిమెంట్ చేసుకుంటే నిర్ణీత గడవులోగా డబ్బు చెల్లించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకుండా డబ్బు పోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుందనే ఆశతో చాలా మంది అగ్రిమెంట్ చేసుకొని భూ యజమానులకు రూ.లక్షలు అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. ప్రస్తుతం రియల్ వ్యాపారం లేకపోవడంతో మిగిలిన డబ్బు చెల్లించి భూమి కొంటే నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. గతంలో మండలంలో రియల్ భూం అందనంత ఎత్తుకు వెళ్లింది. పెట్టిన పెట్టుబడికి మూడు నుంచి నాలుగు వందల రెట్ల లాభాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం ఎన్కతల గ్రామంలో 852 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ కంపెనీ కోసం ప్రభుత్వం భూమిని సేకరించింది. దీంతో ఈ ప్రాంత భూములకు రెక్కలు వచ్చాయి. 111 జీఓ ఎత్తివేయడంతో.. మూడేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీఓను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించడంతో రియల్ దందా ఒక్కసారిగా కుదేలైంది. వెంచర్లు ఏర్పాటు చేసిన చాలా గ్రామాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. అప్పట్లో మండలంలోని ఏ గ్రామంలోనైనా రోడ్డు పక్కన ఎకరా రూ.కోటిపైనే పలికింది. మోమిన్‌పేట – శంకర్పల్లి రోడ్డు పక్క ఎకరం రూ.4 కోట్ల పైమాటే. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రియల్ దందా పుంజుకుంటుందని చాలా మంది వ్యాపారులు భావించారు. కానీ వారి ఆశలు ఫలించలేదు. మూడేళ్ల క్రితం ఎన్కతలలో ప్రభుత్వం భూమిని సేకరించింది. దీన్ని టీజీ ఐఐసీ రూ.45 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. రెండు నెలల నుంచి మౌలిక వసతులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ భూం తిరిగి ఊపందుకుంటుందని వ్యాపారులు, రైతులు భావిస్తున్నారు. -
బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్
కేశంపేట: ‘హైడ్రా పేరుతో పేదల గుడిసెలు కూల్చేందుకు బుల్డోజర్లు వెళ్తున్నాయని, పెద్దల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే.. బస్తీమే సవాల్ అంటాడు, తెల్లారితే పరార్ అవుతాడు’ అని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండలంలోని వేములనర్వలో శనివారం జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కాకునూరు గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ రూ.2,500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఒక్కో మహిళకు 18 నెలలకు సంబంధించిన రూ.45 వేలు చెల్లించాలని కోరుతూ ఢిల్లీలోని సోనియాగాంధీ అడ్రస్‌కు పోస్టు కార్డులు పంపించారు. రైతుబంధు సాయాన్ని పెంచుతామని, రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చినప్పటికీ అభివృద్ధి చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. కరువుతో విలవిల్లాడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. ఆయన హయాంలో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం తొంభై శాతం పూర్తయిందని, కేవలం పది శాతం పనులను చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు. అమ్మ ఒడి వాహనాల్లో డీజిల్ లేక తోయాల్సిన పరిస్థితి హన్వాడలో చూశామన్నారు. తమ పాటలతో ఆకట్టుకున్న కాకునూరుకు చెందిన అక్కమ్మ, రాములమ్మ జానపద బృందాన్ని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గండ్ర జగదీశ్వర్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనురాధ పర్వాత్రెడ్డి, కాకునూర్ మాజీ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు రమాదేవి, జంగారెడ్డి పాల్గొన్నారు. ఇదీ ముఖ్యమంత్రి తీరు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభయహస్తం మేనిఫెస్టో అమలుకు పోస్టుకార్డు ఉద్యమం సోనియాగాంధీకి లేఖలు -
సారే హాజరు.. విద్యార్థులే లేరు!
కుల్కచర్ల: ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా పలు చోట్ల సర్కారు బడులకు ఆదరణ కరువవుతోంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కుస్మసముద్రం పంచాయతీ ఆలుగడ్డతండా ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకరు ఒకటో తరగతి, మరొకరు రెండో తరగతిలో ఇద్దరు విద్యార్థులు చేరారు. వీరికి పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖ అధికారులు ఓ ఉపాధ్యాయుడిని నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా గత మూడు రోజులుగా ఆ ఇద్దరు కూడా బడికి రావడం లేదు. దీంతో ఉపాధ్యాయుడు నవీన్‌కుమార్ శుక్రవారం వారి ఇళ్లకు వెళ్లి ఆరా తీయగా పూణెకు వలస వెళ్లిన తల్లిదండ్రులతో పాటు వెళ్లిపోయారని తెలుసుకుని అవాక్కయ్యాడు. ఇక చేసేదేమీ లేక బడికి వెళ్లి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విద్యార్థులు లేకపోవడంతో అట్టహాసంగా తెరుచుకున్న బడి మళ్లీ మూతపడే అవకాశముంది. -
సైబర్ నేరాలపై అప్రమత్తత ముఖ్యం
మోమిన్‌పేట: సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో సైబర్ నేరాల అప్రమత్తతపై విలేకరులతో మాట్లాడారు. ఫోన్ పోగొట్టుకున్న మరు క్షణమే సిమ్‌ను బ్లాక్ చేయించాలన్నారు. ప్రతిఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తుండటంతో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. సర్కిల్ పరిధిలో 8 సైబర్ కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం రూ .42,58,555లు పోగొట్టుకోగా రూ.8,65,778 రికవరీ చేశామని వెల్లడించారు. ఇంకా పెండింగ్‌లో రూ.1,81,105 ఉన్నాయన్నారు. మోమిన్‌పేటకు చెందిన శివకుమార్ ఫోన్ పోగొట్టుకోగా అందులో ఉన్న రూ.1,44,000 పోయాయి. ఇలానే మర్పల్లికి చెందిన రాజువి రూ.10 లక్షలు పోయాయి. వెంటనే స్పందించి సిమ్ బ్లాకు చేయడంతో మొత్తం రికవరీ చేశామన్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కానిస్టేబుళ్లు జావిద్, అనిల్‌కుమార్ చాకచక్యంగా వ్యహరించి డబ్బులను రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ఆయన వెంట ఎస్ఐ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. సీఐ వెంకట్ -
● ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ● తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి ● ఫోన్‌ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన
తాండూరు: ప్రజల భాగస్వామ్యంతోనే తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో కొనసాగుతోందని మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి అన్నారు. శుక్రవారం సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. వాటిని సావధానంగా ఆలకించిన ఆయన వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీఈఈ మణిపాల్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్, ఆర్ఐలు అశోక్, రమేష్, టీపీపీఓలు శాంతిప్రియ, నరేష్, వంశీ, టీఎంసీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ప్రశ్న: మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. పాత తాండూరులోని హనుమాన్ ఆలయం వద్ద కాలువల్లో మురుగు తీయడం లేదు. ఉన్న కాల్వలు ధ్వంసమయ్యాయి. దోమల బెడద ఎక్కువగా ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలి. – నారా రాకేష్, పాతతాండూరు కమిషనర్: మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లపై చెత్త వేయకుండా ముగ్గులు వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: 12వ వార్డులో పార్కులు అధ్వానంగా మారాయి. పిల్లలు ఆడుకునేందుకు వీలులేకుండా పోయింది. పార్కు స్థలంలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. వీధి దీపాలు సైతం వెలగడం లేదు. 28వ వార్డులోని శాంతినగర్ పార్కు అధ్వానంగా ఉంది.వాటిని బాగు చేయాలి. – మేరి విజయకుమార్, 12వ వార్డు, జమీర్, 28వ వార్డు తాండూరు జవాబు: త్వరలో పట్టణంలోని పార్కులనుసందర్శించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. పార్కు స్థలంలో కార్లు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి త్వరలోపనులను ప్రారంభిస్తాం. ప్రశ్న: 35వ వార్డులో మురుగు కాల్వలను శుభ్రం చేయడం లేదు. దీంతో దుర్వాసన, దోమలు వృద్ధి చెందుతున్నాయి. వీధి దీపాలు కూడా వెలగడం లేదు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. – సురేష్, తాండూరు జవాబు: పారిశుద్ధ్య సిబ్బందిని పంపి మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తెస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న:10వ వార్డులోని ప్రభుత్వ నంబర్ వన్ పాఠశాల వద్ద వీధి దీపాలు వెలగడం లేదు. మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. సాయిపూర్ రోడ్లులో చెత్త వేస్తున్నారు. హనుమాన్, కట్ట మైసమ్మ ఆల యాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. – శివ, 10వ వార్డు, తాండూరు జవాబు: పాఠశాల వద్ద వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. రోడ్లపై చెత్త వేయరాదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ఆలయాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపడతాం. ప్రశ్న: వార్డు నంబర్ 31.. రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో చెత్తాచెదారంపేరుకుపోయింది. డీఎస్పీ కార్యాలయం వద్ద మురుగు కాల్వను శుభ్రం చేయడం లేదు. రెండు రోజులకు ఒక్కసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. – అమ్జాద్ అలీ, అహ్మద్‌పాషా, తాండూరు జవాబు: ఇళ్ల ముందు మురుగు కాల్వలను మూసి వేయడంతో సమస్య వస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాల్వలపై నిర్మించిన కట్టడాలని తొలగించాలి. అప్పుడే సమస్యపరిష్కారమవుతుంది. ఆ దిశగా ప్రజలకు అవగహన కల్పిస్తాం. ప్రశ్న: పాత తాండూరులోని 18వ వార్డులో మురుగు కాల్వలు లేవు. ఉన్నవి దెబ్బతిన్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలి. – జావీద్, పాత తాండూరు జవాబు: వార్డులో మురుగు కాల్వల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. -
అర్హులను ఓటర్లుగా నమోదు చేయాలి
బంట్వారం: అర్హులైన వారిని (18 ఏళ్లు నిండిన) ఓటర్లుగా నమోదు చేయాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. శుక్రవారం బంట్వారం మోడల్ స్కూల్లో బూత్ లెవల్ అధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఓటర్ల వివరాలు తెలుసుకోవాలన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, డీటీ మహేష్, ఎంపీఓ నాగరాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బ్యూలా, ట్రైనర్స్ రవీందర్‌రెడ్డి, యాదయ్య, మధుసుదన్‌రెడ్డి, ఆర్ఐ రాంగోపాల్, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ -
వడ్డీ తిరిగొచ్చింది!
వికారాబాద్: ప్రభుత్వం ఎట్టకేలకు మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ నిధులు విడుదల చేసింది. 2023 మార్చి నుంచి 2025 మార్చి వరకు రెండేళ్ల పాటు సభ్యులు బ్యాంకులకు చెల్లించిన మొతాన్ని విడు దల చేసింది. తొలుత 22 నెలలకు సంబంధించిన డబ్బులు మంజూరవగా తాజాగా మరో రెండు నెలల నిధులు తిరిగొచ్చాయి. ఈ మొత్తాన్ని మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియను వేడుకలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కళాజాత బృందాలతో నియోజకవర్గ స్థాయిలో అవగాహన చేపట్టనున్నారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వడ్డీ రాయితీ, బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రమాద బీమా చెక్కులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వడ్డీ రాయితీ చెల్లింపు ఇలా.. మహిళా సంఘాలకు ఆయా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తుంటాయి. రుణం పొందిన సభ్యులు నెలకు రూ.100కు 9.5శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. సభ్యులు బ్యాంకులకు చెల్లించిన ఈ మొత్తాన్ని ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ చేస్తుంది. తద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం రెండు మూడేళ్లకు ఒక్కసారి నిధులు విడుదల చేస్తోంది. ఈ సొమ్మును సంఘం సభ్యులకు పంచనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సర్కారు లక్ష్యం. 10,805 సంఘాలకు లబ్ధి జిల్లాలో మొత్తం 657 గ్రామైక్య సంఘాలు ఉండగా వీటి పరిధిలోని 16,054 స్వయం సహాయక సంఘాల్లో 1,63,703 మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 10,805 సంఘాలు రుణాలు పొందేందుకు అర్హత సాధించాయి. నాలుగేళ్లుగా ఈ గ్రుపులకు రుణాలు ఇస్తున్నారు. వీటి ఖాతాల్లోనే ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ రాయితీ జమ చేయనున్నారు. ఇటీవల 2023 మార్చి నుంచి 2025 జనవరి వరకు రూ.28.38 కోట్లు విడుదల చేయగా తాజాగా మారోసారి నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన రూ.4.28 కోట్లు మంజూరయ్యాయి. దీంతో రూ.32.66 కోట్లు సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ వారంలో ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన మరో రెండు సంవత్సరాల బకాయిలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఈ మొత్తం రూ.30 కోట్ల వరకు ఉండొచ్చని తెలిసింది. ఇవి గత ప్రభుత్వ హయాంలోవి కావడంతో ఇస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము చెల్లించిన వడ్డీ డబ్బులు తిరిగి రావడంపై మహిళా సమాఖ్య సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రెండేళ్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 10,805 విడుదలైన మొత్తం రూ.32.66 కోట్లు నేటి నుంచి మహిళా సంఘాలకు అందజేత కసరత్తు చేస్తున్న డీఆర్డీఏ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్న సభ్యులు కొన్ని సంఘాలకే నిధులు వడ్డీ డబ్బులు కొద్ది మొత్తంలో విడుదల చేశారు. దీంతో కొన్ని సంఘాలకే నిధులు అందాయి. మండలంలో చాలా సంఘాలకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఆ దిశ చొరవ చూపి సకాలంలో డబ్బు అందేలా చూడాలి. – పద్మమ్మ, సంఘం సభ్యురాలు, బొంపల్లి సంతోషంగా ఉంది ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ డబ్బులు చెల్లించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవలే తమ సంఘానికి వడ్డీ డబ్బులు జమయ్యాయి. ఇంకా తొమ్మిదేళ్ల వడ్డీ డబ్బులు రావాల్సి ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సత్యమ్మ, సంఘం సభ్యురాలు, బొంపల్లి -
కాంగ్రెస్ సంబురాలు
తాండూరు టౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాలా అన్నారు. శుక్రవారం స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే చేయించి, బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. వెనుకబడిన తరగతి వర్గాల ప్రజలు సైతం రాజకీయాల్లో రాణించాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం దేశ వ్యాప్తంగా కులగణన ప్రక్రియ చేపట్టి బీసీలను రాజ్యాధికారం దిశగా పయణించేలా చూడాల ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రభాకర్‌గౌడ్, నాయకులు సంతోష్, వెంకటయ్య, శ్రీనివాస్, జిలాని, అనిల్, భీంశంకర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి ● సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ తాండూరు టౌన్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అంతే కా కుండా విద్య, ఉద్యోగ, కాంట్రాక్టులకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు వర్తించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి షుకూర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మధులత, నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత, విజయలక్ష్మి, జగదీశ్వరి, వెంకటేష్, పరమేష్, రాము, సురేష్, శివ, బస్వరాజ్ నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగి: కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీపీపీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే హామీలన్నీ అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, పార్ట పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లాకు మంత్రి జూపల్లి అనంతగిరి: వికారాబాద్‌లో నిర్మించిన ఎకై ్సజ్ స్టేషన్ నూతన భవనాన్ని శనివారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి విజయభాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, ఎకై ్సజ్ కమిషనర్ హరికిరణ్ పాల్గొంటారన్నారని ఆయన చెప్పారు. -
అటవీ భూమి కబ్జాపై విచారణ
ధారూరు: అన్యాక్రాంతమవుతు న్న అటవీ భూములపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘కొన్నది కొంత–కొల్లగొట్టింది ఎంతో, పోతులవాగు స్వాహా’ తదితర కథనాలకు అటవీశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ కన్జర్వేటర్ అధికారి సువర్ణ స్పందించారు. ఆమె ఆదేశం మేరకు శుక్రవారం మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ సమీప సర్వేనంబర్ 11లోని అటవీ భూమిలో విజిలెన్స్ అధికారులు పర్యటించారు. అటవీశాఖ విజిలెన్స్ డిస్ట్రిక్ట్ ఫారెస్టు ఆఫీసర్ రాజశేఖర్, ఎఫ్ఆర్ఓ వీరేశం, ధారూరు ఫారెస్టు రేంజర్ రాజేందర్, ఇతర అధికారులు ఫారెస్టు భూమి, ఎఫ్ బ్లాక్‌లోని గెజిట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఫారెస్టు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేయిస్తే అటవీ భూమి ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తోందని తేల్చారు. గతంలో కందకాన్ని ఇద్దరు వ్యక్తులు తమ పొలంలో కలుపుకొన్నట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అటవీ భూమి ఎంత, వాటి హద్దు లెక్కడ అనేది గుర్తించలేక పోయారు. జాయింట్ సర్వేలో హద్దులు గుర్తిస్తేనే ఫారెస్టు భూమి ఎంతమేరకు కబ్జాకు గురైందని బయటపడుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పీసీసీఎఫ్‌కు నివేదించేందుకు నిర్ణయించారు.సంయుక్త సర్వే చేయాలని నిర్ణయించిన విజిలెన్స్ అధికారులు -
కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ● పలు అభివృద్ధి పనులకు భూమిపూజ కొడంగల్: కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామ ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. కొడంగల్ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో 112 ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ విద్యా బోధన కోసం 265 కంప్యూటర్లను అందజేశారు. కడా కార్యాలయంలో పలువురికి రూ.1,58,28,500 విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. పట్టణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రూ.300 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, యువజన కాంగ్రెస్ సమన్వయ కర్త కృష్ణంరాజు, నాయకులు నయీమ్, ఆసీఫ్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, దాము తదితరులు పాల్గొన్నారు. -
కాసుల కక్కుర్తి
● చికిత్సల పేరుతో ఘరానా మోసం ● నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ ● పట్టించుకోని వైద్యాధికారులు పరిగి: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ హెచ్చుమీరుతున్నాయి. శస్త్ర చికిత్సల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అబార్షన్లు(గర్భస్రావం) సైతం చేస్తున్నారు. వైద్యం ముసుగులో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాఫియా జరుగుతుంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల పరిగి పట్టణ కేంద్రంలోని విజేత ఆస్పత్రిలో జరిగిన ఘటన. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు మాత్రం డబ్బులకు ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పట్టణ కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియనన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాలకే మొగ్గు చూపుతున్నారు. మాతాశిశు ఆరోగ్యం కోసం సాధారణ ప్రసవాలు చేయాలని చెబుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రైవేట్ వైద్యశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టానుసారంగా ఈ దందా నడుస్తోంది. నిత్యం ఘటనలు నిబంధనల ప్రకారం లింగ నిర్ధారణ, అబార్షన్లు చేయరాదని ప్రభుత్వం సూచిస్తున్నా ప్రైవేట్ ఆస్పత్రిలో మాత్రం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రసవాల పేరుతో ఈ దారుణాలు నిత్యకృత్యమైనా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గైనకాలజిస్ట్లు అడ్డగోలుగా ప్రసవాలు, అబార్షన్లు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గర్భం దాల్చిన మహిళ 23 వారాల లోపు ఉండి, ఏదైనా సమస్య ఉంటే అందరి ఆమోదంతో అబార్షన్ చేయాలని నిబంధనాలున్నాయి. కానీ ఇటీవల విజేత ఆస్పత్రిలో జరిగిన ఘటనను చూస్తే 26 వారలకు పైగా కవలలు ఉన్నారని, ఆ గర్భిణికి ఎలాంటి ఇబ్బందులు లేకున్నా డబ్బులకు ఆశపడి అబార్షన్ చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. మామూళ్ల మత్తు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న వారిలో రిస్క్, హైరిస్క్ ఉన్న వారికి మాత్రమే సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేస్తుండగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం ఎలాంటి రిస్క్, హైరిస్క్ లేకున్నా సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్లో ముహూర్తం ప్రకారం ప్రసవాలు చేస్తామని చెబుతుండటం గమనార్హం. అంతే కాకా గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు జరిగితే వచ్చే ఫీజు చాలా తక్కువ. సిజేరియన్ల ద్వారా దాదాపు రూ.70వేల నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంత తతంగం జరుగుతున్నా మామూళ్ల మత్తులో ఉన్న వైద్యారోగ్యశాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. షోకాజ్ నోటీసులు జారీ పట్టణంలో ఇటీవల జరిగిన ఘటనపై ఆస్పత్రికి షోకాజ్ నోటీసులు అందజేశాం. ఎంటీపీ కమిటీ మీటింగ్ నిర్వహించి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. నోటీసులకు వచ్చే సమాధానంపై ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. – లలితాదేవి, జిల్లా వైద్యాధికారి నొప్పులతో వస్తే కాన్పు చేశాం పురిటి నొప్పులతో వస్తేనే కాన్పు చేశామని విజేత ఆస్పత్రి వైద్యురాలు నవత అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. నందిని అనే మహిళకు పైళ్లె ఏడాదిన్నర అయినా గర్భం దాల్చక పోవడంతో చికిత్స కోసం వచ్చిందన్నారు. దీంతో రెండు నెలల్లోనే ఆమె గర్భం దాల్చిందన్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా ఇక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. ఇటీవల నందిని భర్తకు ఆరోగ్యం బాగలేకపోయిన మధ్యలో చికిత్స చేయించుకుంది. ఆమెకు కడుపునొప్పి వచ్చిన ప్రతిసారీ కుటుంబసభ్యులు, అత్తామామకు చెప్పాం. నొప్పులతో ఈ నెల 7న ఆస్పత్రికి రావడంతో కాన్పు చేయాలని సూచించాం. ఈ విషయాన్నిఆమె అత్తామామకు తెలియజేశాం. రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పు చేశాం. కానీ అబార్షన్ చేశారని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఉన్నతాధికారులకు ఈ వ్యవహారంపై నివేదిక అందజేశామని వివరించారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంరెడ్డిపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున విశ్వనీయ సమాచారం మేరకు పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. డ్రైవర్ రాములుపై కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదర్శ జంటకు ప్రభుత్వం ఆర్థికసాయం నవాబుపేట: కులాంతర వివాహం చేసుకున్న ఆదర్శ జంటకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థికసాయాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య అందజేశారు. మండల పరిధిలోని ముబారక్పూర్ గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయిహర్షితను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.2.50 లక్షలు మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే యాదయ్య శుక్రవారం కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో నవాబుపేట ఎస్సీ హాస్టల్ వార్డెన్ శుక్లవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి పూడూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో మంజూరైన ఇళ్లు ఏ దశలో ఉన్నాయని, కొలతల ప్రకారం మార్కింగ్ ఇస్తున్నారని హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ క్రిష్ణయ్య, డీఈఈ ముక్రం, ఎంపీడీఓ పాండు పాల్గొన్నారు. నిర్మాణ దారుడిపై కేసునమోదు ఇబ్రహీంపట్నం రూరల్: బాలికతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఎంపీపటేల్‌గూడ సమీపంలో అనిల్ కన్స్ట్రక్షన్ యజమాని, భవన నిర్మాణ రంగంలో జార్ఖండ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికతో పనిచేయిస్తుండగా.. బాలికకు విముక్తి కల్పించారు. అనంతరం యజమానిపై కేసు నమోదు చేశారు. యువకుడి దారుణ హత్య చాంద్రాయణగుట్ట: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..బాబానగర్‌కు చెందిన అజీజ్ అక్తర్(26) ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు. అతనిపై పలు దొంగతనం కేసులు ఉండడంతో కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్‌ను గతంలో ఓపెన్ చేశారు. ఉదయం బాలాపూర్ రోడ్డులోని నా లా పక్కన అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించా రు. చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, సీఐ గోపీ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని మెడ, కడుపు, వీపుపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ట్లుగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నెల రోజులుగా గుడ్డు లేదు!
సర్కారు బడిలో విద్యనభ్యసించే చిన్నారులకు పోషకాహారం అందని ద్రాక్షగా మారింది. వేసవి సెలవుల అనంతరం స్కూల్ ప్రారంభమైన నాటి నుంచి మధ్యాహ్న భోజనంలో గుడ్డును ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. తాండూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి బిల్లుల గండం వేధిస్తోంది. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. నిబంధనల ప్రకారం వా రంలో మూడు రోజులు గుడ్డు అందజేయాలి. కానీ మండలంలోని చెన్‌గేస్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం(జూన్ 12) నుంచి విద్యార్థులకు ఇప్పటివరకు గుడ్డు ఇవ్వలేదు. దీంతో చిన్నారులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్ తారాసింగ్ అవాక్కయ్యారు. చెన్‌గేస్‌పూర్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెరిగిన గుడ్డు ధర అనంతరం చిన్నారులతో కలిసి తహసీల్దార్ సహపంక్తి భోజనం చేశారు. శుక్రవారం నాడు అన్నం, పప్పు, వెజిటెబుల్ కర్రి, గుడ్డు పెట్టాలని మెనూలో ఉంది. కానీ ఆ నిబంధనను అమలు చేయలేదు. దీంతో విద్యార్థులకు ఎందుకు గుడ్డు ఇవ్వలేదని ఆయన నిర్వాహకులను ప్రశ్నించారు. నాలుగు నెలల నుంచి తమకు బిల్లులు రావడం లేదని, అందుకే గుడ్డు పెట్టలేదని మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సావిత్రమ్మ సమాధానమిచ్చారు. ఇప్పటివరకు అప్పు చేసి సరుకులు తెచ్చి వడ్డిస్తున్నామని గోడును విలిబుచ్చారు. రూ.5 ఇవ్వాల్సిన గుడ్డును, రూ.6 ఇస్తున్నారని వాపోయారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఆయన వెంట హెచ్ఎం శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ బాబు, రికార్డు అసిస్టెంట్ ఉలేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.పాఠశాల తనిఖీకి వెళ్లి అవాకై ్కన తహసీల్దార్ నాలుగు నెలల నుంచి బిల్లులు రాలేదన్న నిర్వాహకులు అన్నం, పప్పుతో సర్దుకుంటున్న విద్యార్థులు -
పార్టీలో అందరూ సమానమే
తాండూరు: హస్తం పార్టీలో కొత్త, పాత అనే బేధాభావం లేదని అందరూ పార్టీ కుటుంబ సభ్యులేనని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులతో పాటు ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ పదవుల కోసం నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలిస్తున్నామన్నారు. పైరవీలతో ఏ నాయకుడికి పదవులు రావన్నారు. అందరూ సమష్టిగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఽథారాసింగ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
దోమ: ఇంట్లో వెళ్లిన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గీ మున్సిపాలిటీ పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎదుల మల్లేశం(21) ఈ నెల 9న ఇంట్లో నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై బయలుదేరాడు. అప్పటి నుంచి అతని ఫోన్ నంబర్లు కలవకపోవడం, నగరానికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అతని ఫొటోతో పాటు బైక్ నంబర్లను వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయగా దోమ మండలంలోని ఊటుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. శుక్రవారం గమనించగా అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొంత కాలంగా మృతుడు నగరంలో స్విగ్గి, రాపిడో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి అక్క శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఊటుపల్లి అటవీ ప్రాంతంలో ఘటన -
విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సన్మానం అనంతగిరి: దేశ భవిష్యత్ దశ దిశను మార్చేది విద్యే అని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని ఎన్నెపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్త మ ఫలితాలు సాధించిన విద్యార్థులను అలాగే ఇటీవల కళాశాలలో వివిధ విభాగాలకు జరి గి న ఎన్నికల్లో నాయకులుగాఎంపికైన విద్యార్థి నులకు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య పట్ల సానుకూల శక్తితో ముందుకు వెళ్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఎన్ని సమస్య లు ఎదురైనా శ్రద్ధ, నిబద్ధత, క్రమశిక్షణతో ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. దేశ భవిష్యత్ యువత పైనే ఉందని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీదే అన్నారు. న్యాయ, వైద్య, ఐఐటీ తరగతులు నిర్వహించేందుకు చేయూత అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన మాక్ పోలింగ్ వీడియో ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశా రు.కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కళాశాల ప్రిన్సిపాల్ మహమూ దా ఫాతిమా, రిటైర్డ్ డీఎండబ్ల్యూఓ హను మంతరావు, నాయకులు హఫీజ్, అబ్దుల్ బషీర్, వెంకట్‌రెడ్డి, ఫక్రుద్దీన్, విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి దుద్యాల్: ఇంటర్ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని హకీంపేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటర్ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. శ్రద్ధగా చదువుకొని వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రాజేందర్ రెడ్డి అమ్మవారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యుగంధర్ రెడ్డి, ఆలయ చైర్మన్ జయరాములు పాల్గొన్నారు. అనంతరం కళాశాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి సందర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కడా ప్రత్యేక అధికారి వెంటకట్‌రెడ్డి ఉన్నారు. సౌకర్యాలు కల్పిస్తాం బొంరాస్‌పేట: కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మండల కేంద్రంలో ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్ర వారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల బోధనను పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లా డి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటర్ విద్యతోపాటు ఎంసెట్, నీట్, ఐఐటీ పరీక్షల నిర్వ హణకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కళాశాల కు 5నుంచి 10 కిలో మీటర్ల దూరం నుంచి వ చ్చే విద్యార్థులకు త్వరలో ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని తెలిపారు. ఫర్నిచర్ కోసం రూ.2.50 లక్షలు వెంటనే మంజూరు చేస్తామన్నారు. మరుగుదొడ్ల లే ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పడంతో సమ స్య ను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రారెడ్డి, అధ్యాపక బృందం దినేశ్, సురేశ్, శేఖర్, హరికృష్ణ, నాగరాజు, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక సేవే యువమంచ్ లక్ష్యం
తాండూరు టౌన్: సామాజిక సేవా కార్యక్రమాలే మార్వాడీ యువమంచ్ లక్ష్యమని సంస్థ తాండూరు అధ్యక్షుడు అనిల్ సార్డా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బాలాజీ మందిర్‌లో ది స్టార్ ఆసుపత్రి నానక్‌రాంగూడ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిల్ సార్డా మాట్లాడుతూ.. సమాజానికి తమ వంతుగా ఏదో ఒకటి చేయాలనే తపనతో మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు, రక్తదానం, నేత్రదాన శిబిరాలు, చలివేంద్రాలు, ఉచిత కృత్రిమ అవయవాల అమరిక, పేద విద్యార్థులకు చేయూత వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. శిబిరంలో కార్డియాలజి, ఆర్థోపెడిక్ వంటి సేవలతో పాటు మరిన్ని వైద్య సేవలను అందించామన్నారు. కార్య క్రమంలో మంచ్ క్యాంప్ చైర్మన్ దీపక్ బూబ్, తాండూరు ప్రధాన కార్యదర్శి సచిన్ రాఠి, సభ్యులు అంకిత్ సార్డా, గిరిధర్ పర్తాని, రోహిత్ సోని, నిఖిల్ గగరాణి, దీపక్ సోని, సన్నీ అగర్వాల్, కుంజ్ బిహారీ సోని, మహేష్ సార్డా తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వండి
అనంతగిరి: అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య పేర్కొన్నారు. ఈ నెల 15న నిర్వహించనున్న వీహెచ్పీఎస్ సభను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వీహెచ్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులకు చేయూత పెన్షన్లను రూ.4వేలకు పెంచాలని డిమాండ్‌తో వికారాబాద్ జిల్లా కేంద్రంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరో పోరాటానికి తాము సిద్ధమయ్యామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మలికార్జున్, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాం ప్రసాద్, నాయకులు సుధీర్, నర్సింలు, సుభాష్, పుష్పరాణి, పద్మమ్మ, జ్ఞానేశ్వర్ గౌడ్, రాజు, వెంకటయ్య, గౌసోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య 15న నిర్వహించనున్న సభకు మందకృష్ణ రాక -
రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించండి
దౌల్తాబాద్: మండలంలోని ఆయా గ్రామాలకు నిర్మిస్తున్న బీటీ రోడ్ల నాణ్యతపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాజీ మహిపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు బోడమర్రితండాకు వేసిన రోడ్డును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలో ఆయా గ్రామాలకు తండాలకు వేస్తున్న బీటీ రోడ్లను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కమీషన్లకు అమ్ముకున్నారన్నారు. దీంతో వారు నాణ్యత లేకుండా రోడ్లును వేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు పకీరప్ప, ఆశప్ప, కేశవరెడ్డి. బాల్‌రాజు తదితరులున్నారు. -
వన మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం
అనంతగిరి: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2025లో భాగంగా ప్రతి గ్రామంలో వంద మంది పౌరులతో యాప్‌లో ఫీడ్ బ్యాక్ ఇచ్చేలా పంచాయతీ సెక్రటరీలు చర్యలు తీసుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ సుధీర్ అన్ని మండలాల ఎంపీడీఓలకు సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి పలు అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో ఇంకుడు గుంతలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 19 కొత్త జీపీల్లో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి నాటేలా చూడాలన్నారు. వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వానికి తావులేకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, పీఆర్ ఈఈ ఉమేష్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సుధీర్ బూత్ లెవల్ అధికారులకు సూచించారు. వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. మార్పులు చేర్పులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, బీఎల్ఓలు, మాస్టర్ ట్రైనర్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు అదనపు కలెక్టర్ సుధీర్ -
దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు రూరల్: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బషీరాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శివగీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక పద్ధతిన పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మ్యాథమిటిక్స్, ఫిజిక్స్, కెమెస్ట్రి, వృక్షశాస్త్రం, జువాలజీ, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 14వ తేదీలోపు రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయా సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఎంఈఓ కార్యాలయానికి తాళం వేసి కార్మికుల ఆందోళన ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాలయానికి కార్మికులు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. ఏడాదిగా బిల్లులు, గౌరవ వేతనం చెల్లించడం లేదని అన్నారు. గుడ్లు, రాగిజావ పెట్టాలని ప్రభు త్వం చెబుతోంది తప్ప అందుకు తగ్గ నిధులు మంజూరు చేయడంలేదన్నారు. అప్పులు చేసి గుడ్లు తీసుకొచ్చి పెడుతున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ఎంఈఓ, ఎస్టీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగతున్నా మోక్షం కలగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్ఐ నాగరాజు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి తాళం తీయించారు. ఎస్ఎఫ్ఐ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి
అనంతగిరి: విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు.. రోజూ ఎంత మంది వస్తున్నారు.. గుడ్లు, పాలు ఇస్తున్నారా, బాలామృతం ప్లష్ ఇస్తున్నారా, దివ్యాంగులు, తీవ్ర, అతితీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. అనంతరం హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. పిల్లలకు యూనిఫామ్స్ వేసి, చార్టుపై రాసి పిల్లలతో చదివించాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎనిమిది, పదో తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలన్నారు. ఇంగ్లిష్ పద్యాలు చదివించారు. 8వ తరగతి విద్యార్థులకు ఐఎఫ్‌పీ ద్వారా బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. పోటీ తత్వంలో ముందుకు సాగాలని సూచించారు. తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. వంట గది, కొత్తగా నిర్మించిన డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. వంట తయారు చేసే విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్, బియ్యం, సరుకుల నిల్వలను చూశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థీ మెరిట్ సాధించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలలో పెండింగ్ పనులు ఉంటే సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్షచౌదరి, ఎంఈఓ బాబు సింగ్, హెచ్ఎం శివకుమార్, అంగన్వాడీ టీచర్ లక్ష్మి తదితరలు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థీ మెరిట్లో పాసవ్వాలి కలెక్టర్ ప్రతీక్ జైన్ -
అంగన్వాడీ భవన నిర్మాణం ప్రారంభం
దౌల్తాబాద్: మండల కేంద్రంలో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకట్‌రెడ్డి, వీరన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో రూ.వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. మండల కేంద్రంలో రెండు అంగన్వాడీ భవనాలకు రూ.40లక్షలు నిధులు మంజూరయ్యాయని వాటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దస్తప్ప, సహకార సంఘం డైరెక్టరు ఆశప్ప, ఏఈ నాగేందర్ పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన బంట్వారం: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని ఎస్ఐ విమల సూచించారు. గురువారం ఆమె బంట్వారం చౌరాస్తాలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్సు దిగి నడుచుకుంటే వెళ్లే సమయంలో జా గ్రత్తలు పాటించాలన్నారు. ఏమైనా ఇబ్బందు లు ఎదురైతే 100కి కాల్ చేయాలని బాలికలకు సూచించారు. అంతకుముందు ఆమె వాహనాలను తనిఖీ చేసి పత్రాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి అనంతగిరి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) నర్సింలు, రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం వికారాబాద్‌లోని విద్యుత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంస్థ చేపట్టే విద్యుత్ అఽభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులను విడుదల చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అవసరమయ్యే సామగ్రిని మంజూరు చేశామన్నారు. అధికారులు తమ తమ హెడ్‌క్వార్టర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ఈ రవిప్రసాద్, డీఈలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి స్వాధీనం అనంతగిరి: ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని కొత్రెపల్లి రెవెన్యూ శివారులో సర్వే నంబర్ 164 ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన సమాచారంతో అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి అన్యాకాంత్రం అయిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ నరేష్ , సిబ్బంది తదితరులు ఉన్నారు. కుటుంబ కలహాలతో ఉరేసుకున్న రైతు పరిగి: కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పత్తి జంగయ్య(50) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం భూమి, ఇల్లు విషయంలో కుటుంబీకులు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి చెందిన జంగయ్య పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య పెంటమ్మ, కొడుకు నర్సింహులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిత్యం 37మంది జననం
వికారాబాద్: గత దశాబ్ద కాలంగా చూస్తే జిల్లాలో జనాభా పెరుగుదల రేటు నిలకడగా కనిపిస్తోంది. అక్షరాస్యతా శాతంలో అట్టడుగున ఉండగా జననాల రేటులో రాష్ట్ర సగటుకు దగ్గరగానే ఉంది. లింగ నిష్పత్తి విషయంలో మన జిల్లా మెరుగ్గా ఉంది. లింగ నిష్పత్తి విషయంలో రాష్ట్ర సగటు కంటే మన జిల్లాలో ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం జనాభా 9.27 (2011 సెన్సెస్) లక్షలు ఉంది. ఇందులో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1001 మంది మహిళలు ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో 13,779 మంది జన్మించగా ప్రతి రోజు సగటున 37మంది ప్రతి గంటకు 1.57 మంది పుడుతున్నట్టు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. చిన్న పిల్లల లింగ నిష్పత్తి విషయంలో మర్పల్లి మండలంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 1022 మంది బాలికలు అత్యధికంగా ఉండగా యాలాల మండలంలో అత్యల్పంగా ప్రతి వెయ్యి మందికి 900 బాలికలు ఉన్నారు. అక్షరాస్యతా శాతంలో జిల్లాలో వికారాబాద్ మండలం ముందుండగా దౌల్తాబాద్ అన్ని మండలాల కంటే అట్టడుగున ఉంది. మొత్తం జనాభాలో పట్టణ జనాభా 87 శాతం ఉండగా గ్రామీణ జనాభా 13శాతం ఉన్నారు. విస్తీర్ణంలో వికారాబాద్ మండలం పెద్దదిగా ఉండగా జనాభా పరంగా తాండూరు మండలంలో అత్యధిక జనాభా నివసిస్తున్నారు. మొత్తం జనాభా 9,27,140లో 4.7 లక్షల జనాభా ఆయా పనులకు వెళుతున్నారు. ఇందులో 1.65 లక్షల మంది రైతులుగా, 1.91 లక్షల మంది వ్యవసాయ కూలీలుగా ఇంటి పనులకు 0.10 లక్షలు, 1.03 లక్షల జనాభా ఇతర పనులకు వెళుతున్నారు. లింగ నిష్పత్తిలో మెరుగు జిల్లాలో వెయ్యి మంది పురుషులకు 1,001 మంది సీ్త్రలు ఏడాదికి 13,779 జననాలు మొత్తం జనాభా 9.27 లక్షలు నేడు ప్రపంచ జనాభా దినోత్సవం -
ఎట్టకేలకు మోక్షం!
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025నేడు తాండూరు మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి కసరత్తు 8లోuతాండూరు: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్: 98499 05909 గత నెల 3నుంచి 15 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు అక్కడికక్కడే పరిష్కరించిన వినతులు 15,119 రైతుల నుంచి వచ్చిన మరో 11,802 అర్జీలు మిస్సింగ్ సర్వే నంబర్లకుసంబంధించినవి 4,013 -
విజేత ఆస్పత్రిలో డీఎంహెచ్ఓ విచారణ
● అబార్షన్ ఘటనపై వివరాల సేకరణ ● బాధ్యులపై చర్యలు తప్పవని వెల్లడి పరిగి: ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేసిన పట్టణంలోని విజేత ఆస్పత్రిలో గురువారం డీఎంహెచ్ఓ లలితాదేవి విచారణ చేపట్టారు. బుధవారం జరిగిన ఘటనపై ఆరా తీయడంతో పాటు రికార్డులు పరిశీలించారు. హాస్పిటల్లో పనిచేస్తున్న ఇద్దరు గైనకాలజిస్టులతో పాటు అబార్షన్ చేయించుకున్న నందిని, ఆమె కుటుంబ సభ్యుల నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ డీఎంఎచ్ఓలు డాక్టర్ రవీంద్ర యాదవ్, ప్రవీణ్‌యాదవ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలి భ్రూణ హత్యలకు పాల్పడిన విజేత ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ స్పందించి.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హాస్పిటల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆస్పత్రిని మూసేయాలన్నారు. లేదంటే జిల్లా వ్యాప్త నిరసనలు చేపడుతామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి ‘ప్రైవేటు’ గండి
● పరిగి బస్టాండ్ ఎదుట పెద్ద సంఖ్యలో ప్రైవేటు వాహనాలు ● నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల తరలింపు ● పట్టించుకోని అధికారులు పరిగి: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికులను తరలించి ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. పరిగి బస్టాండ్ ఎదుట ఉదయం నుంచే ప్రైవేటు వాహనాలను నిలుపుతున్నారు. బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయాణికులను ఆపి తమ వాహనాల్లో ఎక్కించుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద (పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్) ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం కొడంగల్, పరిగి, తాండూరు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్‌కు వెళ్తుంటారు. ప్రైవేటు వాహన యజమాను లు వారిని నిబంధనలకు విరుద్ధంగా తరలించి ఆర్టీసీకి రావాల్సిన ఆదాయన్ని కొళ్లగొడుతున్నారు. నిబంధనలు గాలికి మోటారు వెహికల్ చట్టం ప్రకారం ఆర్టీసీ బస్టాండ్‌కు 500 మీటర్ల పరిధిలో ప్రైవేటు వాహనాలను నిలుపరాదు. కానీ పరిగి పట్టణంలో ఇది అమలు కావడం లేదు. నిబంధనలను తుంగలో తొక్కి బస్టాండ్ ఎదుటే వాహనాలను నిలిపి ప్రయాణికులకు ఎక్కించుకుంటున్నారు. ఆర్టీసీ సర్వీసులు సమయానుకూలంగా నడపకపోవడం ప్రైవేటు వాహనాలకు కలిసి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళల సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో సీట్లు లేక పురుషులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్టాండ్ ముందే ప్రైవేటు వాహనాలను నిలుపుతున్నా ఆర్టీసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనిపించని స్పెషల్ టీంలు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి అందులో పోలీసు శాఖను భాగస్వామ్యం చేస్తూ బస్టాండ్‌కు 500 మీటర్ల పరిధిలో ప్రైవేటు వాహనాలను నిలిపితే చర్యలు తీసుకోవాలి. కొన్ని నెలలుగా ఈ టీంలు పనిచేయడం లేదు. దీంతో ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రైవేటు వాహనాలను ఆపితే చర్యలు తీసుకుంటాం. మోటారు వెహికల్ చట్టాన్ని విధిగా పాటించాలని ఆదేశాలు జారీ చేస్తాం. బస్టాండ్ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి ప్రైవేటు వాహనాలను కట్టడి చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. – సుఖేందర్‌రెడ్డి, డీఎం, పరిగి -
వైభవం.. పెరుగుబసంతం
● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ● గరుడ వాహనంపై విహరించిన అనంత పద్మనాభుడు ● స్వామివారికి పట్టు వస్త్రాలుసమర్పించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనంతగిరి: అనంతగిరి గుట్టపై వెలసిన శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ ఆషాఢమాస చిన్నజాతర ఉత్సవాల్లో భాగంగా గురువారం పెరుగుబసంతం వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల మధ్య కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయ పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ పెరుగుబసంతంకు సంబంధించిన ప్రత్యేక మహా ప్రసాదాన్ని తయారు చేసి ఉట్టిలో ఉంచారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ స్తంభంపైకి ఉట్టిని ఎక్కించారు. ఉట్టిని పగుల గొట్టి మహా ప్రసాదన్ని భక్తులకు చల్లారు. ప్రసాదం అందుకోవడానికి భక్తులు ఆరాట పడ్టారు. అనంతరం ప్రత్యేక హారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మహా ప్రసాదాన్ని పొలాల్లో చల్లితే.. పెరుగుబసంతంలో పంచే మహా ప్రసాదాన్ని పొలా ల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని, ఇంట్లో ఉంచితే కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.గరుడ వాహ న సేవలో, పెరుగుబసంతం వేడుకల్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వేడుకల్లో ఆలయ ఈవో నరేందర్, ట్రస్టీ పద్మనాభం, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మికాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
లారీ, కారు ఢీ ఇద్దరి దుర్మరణం
కొత్తూరు: లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మాజీ సర్పంచ్‌తో పాటు అతని బంధువు చనిపోయిన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం, దిలావర్గూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరిగి చంద్రశేఖర్‌రెడ్డి (45), అతని బంధువు నందిగామ మండలం, దేవుని మామిడిపల్లికి చెందిన ఎర్రగుంట చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. అనంతరం రాత్రి కారులో నందిగామ నుంచి కొత్తూరు రైల్వే బ్రిడ్జిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారావు తెలిపారు. మాజీ మంత్రి నివాళి..మహేశ్వరం: చంద్రశేఖర్‌రెడ్డి మృతి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు దిలావర్గూడకు చేరుకున్నారు. మృతుడికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, సుభాన్‌పూర్ మాజీ సర్పంచ్ గుత్తి పద్మపాండు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహగౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుల్లో దిలావర్గూడ మాజీ సర్పంచ్, అతని బంధువు కొత్తూరు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం -
మీడియా స్వేచ్ఛను అడ్డుకోవద్దు
షాద్‌నగర్‌రూరల్: ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్ హాలులో టీడబ్ల్యూజేఎఫ్ తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్‌గౌడ్, నరేశ్, నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజాస్వమ్యంలో మీడియా స్వేచ్ఛ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. నాటి స్వాతంత్య్ర ఉద్యమంతో పాటుగా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్తంభంగా గుర్తించడంతో పాటుగా పూర్తి స్వేచ్ఛను కల్పించాయన్నారు. గత ప్రభుత్వం మీడియా విలువలకు తిలోధకాలను ఇస్తూ పాత్రికేయుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. సమాజంలో జరుగుతున్న నిజాలను రాస్తే కొందరు నాయకులు జీర్ణించుకోలేక హత్యలు, దాడులు చేయడం, కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాతికేయులు అసత్యాలను కాకుండా నిజాలను నిర్భయంగా రాయాలని, అప్పుడే వారికి సమాజం అండగా నిలబడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సింలు మాట్లాడుతూ.. గతంలో పత్రికకు ఎంతో విలువ ఉండేదని, వచ్చిన వార్తలకు స్పందించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునే వారమన్నారు. ఇప్పుడు పత్రికలలో వార్తలు రాస్తే దాడులు, కేసులు, బెదిరింపులకు పాల్పడే సంస్కృతి పెరిగిందని, ఇది సరికాదని హితవు పలికారు. జర్నలిస్టులు తమ స్వేచ్ఛను సక్రమంగా వినియోగించుకోవాలని, దుర్వినియోగం చేయొద్దని సూచించారు. సమావేశంలో నేతలు రఘునాయక్, చెంది తిరుపతిరెడ్డి, కొంకళ్ల చెన్నయ్య, ఎండీ.ఇబ్రహీం, శ్రీనునాయక్, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, బాబయ్య, చెంది మహేందర్‌రెడ్డి, వెంకటేశ్‌గుప్తా పాల్గొన్నారు.ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
ద్రవరూపంలో యూరియా
మోమిన్‌పేట: కేంద్ర ప్రభుత్వం గుళికల రూపంలో ఉన్న యూరియా, డీఏపీలకు బదులుగా ద్రవ రూపంలో తయారు చేస్తుంది. దీంతో రైతుకు రవాణా, దూరభారం, ధర తగ్గుతుంది. అర లీటరు నానో యూరియా, డీఏపీ ఒక బస్తా యూరియా, డీఏపీతో సమానం. పత్తి, కూరగాయల సాగుకు పైపాటుగా పిచికారీ చేయాలి. దుకాణం నుంచి తీసుకురావడం, పొలానికి తీసుకుపోవడం నానో యూరియా, డీఏపీ చాలా సులువు. అదే బస్తా తీసుకెళ్లడంతో అన్నదాతలకు భారం అవుతుంది. ఒక బస్తా గుళికల యూరియా ఎకరా పొలంలో వాడటంతో 60 శాతం మాత్రమే మొక్క గ్రహించ గలుగుతుంది. మిగతా 40శాతం గాలిలో కలిసి వాయు కాలుష్యం ఏర్పడుతుంది. డీఏపీ కూడా దుక్కిలో వేయాల్సి ఉన్న పైపాటుగా వేయడంతో నష్టమే కానీ మొక్కకు ఎలాంటి ఫలితం దక్కదు. రైతులు నానో యూరియా, డీఏపీలను నేరుగా కానీ ఏదైన పురుగు మందులో కలిపి పత్తిపై పిచికారీ చేయాలి. పిచికారీ చేయడంతో నేరుగా ఆకులు ద్వారా మొక్క వంద శాతం గ్రహిస్తుంది. రసాయనిక ఎరువులు నేరుగా భూమిలో వేయడంతో భూ సాంద్రత తగ్గుతుంది. వర్షాభావ పరిస్థితిలో, అధిక వర్షపాతంలోను నానో యూరియాను పంటపై పిచికారీ చేయవచ్చు. దీంతో పంట ఎదుగుదల ఎక్కడ ఆగదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డీఏపీని కూడా ద్రవ రూపంలో తయారు చేస్తుంది. రైతులు సేంద్రియ ఎరువులను భూమిలో వేసి కలియ దున్నుకొని నానో ఎరువులను పంటలపై పిచికారీ చేస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు సూచించారు. అవగాహన కల్పిస్తున్నాం ప్రస్తుతం పత్తి విత్తనాలు విత్తుకొని నెల రోజులు కావొస్తుంది. వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి. పైపాటుగా నానో డీఏపీని మొదటి సారి పిచికారీ చేసుకోవచ్చు. తిరిగి రెండోసారి 50 రోజులకు పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు ఒక లీటరు రెండు దఫాలుగా పిచికారీ చేయాలి. నానో ఎరువులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా చాలా మంది రైతులకు నానో డీఏపీ, యూరియాలపై అవగాహన లేదు. ప్రతి ఫర్టిలైజరు దుకాణాలలో విరివిగా నానో యూరియా, డీఏపీలను అందుబాటులో ఉంచాలి. రానురాను అన్ని రసాయనిక ఎరువులు ద్రవ రూపంలో వస్తాయి. – జయశంకర్, ఏఓ, మోమిన్‌పేట నానో డీఏపీతో రైతుకు ప్రయోజనం ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం -
పకడ్బందీగా ఓటరు నమోదు
పూడూరు: గ్రామాలకు వెళ్లే అధికారులు ఓటరు నమోదు పక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్ఓ, బీఎల్ఓ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది సరి చేయాలన్నారు. తప్పులు, ఒప్పులు సరి చేయడంతో పాటు డబుల్ ఉన్న ఓట్లను తొలగించాలని చెప్పారు. ఓటరు జాబితాను తప్పులు లేకుండా తయారు చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను సేకరించాలన్నారు. జాబితా నుంచి ఓటరును ఎలా తొలగించాలనేది వివరంగా తెలిపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భరత్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో బీఎల్ఓల పాత్ర కీలకం దౌల్తాబాద్: క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ కీలకమని తహసీల్దారు గాయత్రి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బీఎల్ఓలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నికల బాధ్యత బీఎల్ఓలపై ఆధారపడి ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును కలిగి ఉండాలని ఆయా గ్రామాల బీఎల్ఓలు ఆ దిశగా వారిని చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీ చాంద్‌పాషా, హెచ్ఎం శ్రీహరిరెడ్డి, ట్రైనర్లు భీమప్ప, సాయిలుగౌడ్, బీఎల్ఓలు పాల్గొన్నారు.వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
మోమిన్‌పేట: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో తపస్ ముందంజలో ఉంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఆయా గ్రామాల పాఠశాలలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఉద్యమించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం తీసుకురావాలన్నారు. ప్రస్తుతమున్న పెన్షన్ విధానంతో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు ఎక్కువ మొత్తంలో సభ్యత్వం పొందాలని కోరారు. కార్యక్రమంలో తపస్ మండలశాఖ అధ్యక్షుడు మధుకర్, ప్రధాన కార్యదర్శి మహేష్, జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యాయులు మైపాల్‌రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి తాండూరు రూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆనందం అన్నారు. పెద్దేముల్ మండలం కందనెల్లి ఉన్నత పాఠశాలలో గురువారం తపస్ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సరెండర్ బిల్లులు, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తపస్ సంఘం ద్వారా ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం పెద్దేముల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్, సంతోష్, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రావు, బస్వరాజ్, మహేష్, వెంకట్, సంతోష్, అనిల్ పాల్గొన్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి -
ఖబరస్తాన్ కబ్జాను అడ్డుకోండి
బషీరాబాద్: ముస్లింలకు చెందిన ఖబరస్తాన్ స్థలంలో కబ్జాలను అడ్డుకోవాలని మైల్వార్‌కు చెందిన మైనార్టీలు గురువారం తహసీల్దార్ షాహెదాబేగంకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని 235 సర్వేనంబర్‌లోని 4.35 ఎకరాల భూమిలో 70 ఏళ్లుగా ఖబరస్తాన్ కొనసాగుతోందని తెలిపారు. ఈ స్థలాన్ని కొంత మంది కబ్జా చేసి పశువుల కొట్టాలు వేసుకున్నారన్నారు. ప్రస్తుతం ఇక్కడే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి నర్సిములుగౌడ్ దగ్గరుండి ఖబరస్తాన్ స్థలంలో ఇళ్లకు ముగ్గు పోయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి, కబ్జాలను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, మైనార్టీ నాయకులు ఇద్రీస్, ఇర్ఫాన్, ఖుతుబ్, అజీజ్, మహబూబ్ తదితరులు ఉన్నారు. తహసీల్దార్‌కు ముస్లిం నేతల వినతి -
చదువు ఇష్టంలేక పారిపోయాడు
కుల్కచర్ల: ఇంటర్ చదవడం ఇష్టం లేక పారిపోయిన విద్యార్థి తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గండీడ్ మండలం రుసుంపల్లి గ్రామానికి చెందిన సందీప్ మండలంలోని బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్(ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా చదవడం ఇష్టంలేని సందీప్ మంగళవారం ఉదయం గురుకుల పాఠశాల గోడ దూకి పారిపోయాడు. కుల్కచర్ల నుంచి బస్సులో మహబూబ్‌నగర్ వరకు వెళ్లి, అటునుంచి రైలులో తిరుపతికి వెళ్లాడు. బుధవారం శ్రీవారిని దర్శించుకొని అదేరోజు రాత్రికి రేణిగుంటకు చేరుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో స్టేషన్లో ఉన్న ఒక వ్యక్తి ఫోన్‌తో తన అమ్మతో మాట్లాడాడు. ఫోన్‌పే ద్వారా రూ.500 డబ్బులు వేయాలని కోరాడు. వెంటనే ఆమె సదరు వ్యక్తితో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆయన బాలుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. గురువారం కుటుంబీకులు, కుల్కచర్ల పోలీసులు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు విద్యార్థిని కుల్కచర్లకు తీసుకువచ్చారు. విద్యార్థులు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలని ఎస్ఐ రమేష్ సూచించారు. తిరుపతిలో ప్రత్యక్షమైన గురుకుల పాఠశాల విద్యార్థి -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
అనంతగిరి: పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పలువురు కార్మిక సంఘాల ముఖ్య నాయకులు, డిమాండ్ చేశారు. బుధవారం కార్మిక, రైతు, ప్రజ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీ చౌరస్తా నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కార్యాలయం ఎదుట సమావేశం ఏర్పాటు చేసి పలువురు నాయకులు మాట్లాడుతూ 12గంటల పని విధానాన్ని రద్దు చేసి 8గంటలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి పారిశ్రామిక సంబంధాల కోడ్, ట్రేడ్ యూనియన్‌లో ఉద్యోగుల కార్మిక సంఘటిత శక్తిని బలహీన పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ల ప్రకారం యాజమాన్యాలు సర్వీస్ కండిషన్లు మార్చాలనుకుంటే ముందస్తు నోటీస్ ద్వారా తెలియజేయవలసిన అవసరం ఉండదని, పారిశ్రామిక సంబంధాల కోడ్ అమలయితే 300 మంది లోపు కార్మికులను ప్రభుత్వ అనుమతి లేకుండా యథేచ్ఛగా కార్మికుల్ని తొలగించుకోవచ్చనే నిబంధనలు తీసుకొచ్చారన్నారు. సామాజిక భద్రత కోడ్ అమలు వల్ల ఉద్యోగులు పొందే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 నుంచి 10 శాతం తగ్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై గీత, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, టీఎస్‌టీఎఫ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అనసూయ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్ రద్దు కోసం నిరసన కొడంగల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలు గు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, 29కార్మిక చట్టాలను పునరుద్దరించాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు అరుణ జ్యోతి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తాలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించినట్లు వారు తెలిపారు. కనీసవేతనం రూ. 26వేలు అందించాలని, కార్మిక వర్గానికి ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకటయ్య, పకిరప్ప, చంద్రకళ, కుర్మాని సాయిలు, డప్పు రాములు, రాములు, మంజుల పాల్గొన్నారు. కార్మిక సంఘాల డిమాండ్ భారీ ర్యాలీలు, నిరసనలు -
నాటిన ప్రతి మొక్కా బతకాలి
● వన మహోత్సవాన్ని పకడ్బందీగాఅమలు చేయాలి ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● కలెక్టర్ ప్రతీక్‌జైన్ నవాబుపేట: వన మహోత్సవంలో భాగంగా జిల్లా లో నాటిన ప్రతి మొక్కా బతకాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం మండలంలోని చించల్ పేటలో మొక్కలు నాటారు. అక్నాపూర్, అత్తాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌కు స్వాగతం పలికేందుకు విద్యార్థులను లైన్లో నిలబెట్టటాన్ని గమనించిన ఆయన హెచ్ఎం పాండు, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాయని తెలిపారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరైన వారు పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో 9వేల ఇళ్లు గ్రౌండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఇళ్ల నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జిల్లా వ్యాప్తంగా 10వేల దరఖాస్తులు వచ్చాయని, ప్రతి వారం 500 అర్జీలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. భూ సమస్యలు ఉన్న వారు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కావడం లేదని, దీంతో పనులు ఆగిపోయాయని ఎమ్మెల్యే యాదయ్య కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన త్వరలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. బడి బయట పిల్లలు ఉండరాదన్నారు. అత్తాపూర్‌లో ప్రాథమిక పాఠశాల మూతపడిన విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎందుకు పిల్లలను పాఠశాలకు పంపడం లేదని గ్రామస్తులను అడిగారు. పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారని చెప్పడంతో పాఠశాల భవనాన్ని గ్రంథాలయానికి వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి మోహన్‌రెడ్డి, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, మండల నాయకులు నాగిరెడ్డి, ప్రభాకర్, రవీందర్‌రెడ్డి, ఎక్బాల్, అనంతరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈ సందర్భంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ హలి, సంబంధిత అధికారులు ఉన్నారు. వసతులు కల్పించండి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు వంటి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలల్లో మరమ్మతులపై దృష్టి సారించాలన్నారు. మౌలిక వసతులు, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఐఓ శంకర్ నాయక్ తదితరలు పాల్గొన్నారు. 09 వీకేబీ 101: -
మంత్రి కొండా సురేఖను కలిసిన నాయకులు
కొడంగల్ రూరల్: రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు చండీ, కుబేర, పాశుపత యాగాలు నిర్వహించనున్నట్లు డీడీఎన్ఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, దౌల్తాబాద్ వాసుదేవశర్మ తెలిపారు. బుధవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్‌లో కలిసి యాగాలకు రావాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని సంఘం నాయకులు తెలిపారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు జీ లక్ష్మీనరసయ్య శర్మ, జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి, జ్యోషి కిట్టు స్వామి, దత్తాత్రేయరావు తదితరులు పాల్గొన్నారు. రేపు కొబ్బరి కాయల విక్రయానికి వేలం మోమిన్‌పేట: మండలంలోని ఏన్కతల గ్రామంలో వెలసిన శనైశ్చరస్వామి ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరి కాయలు విక్రయించడానికి ఈ నెల 11న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఉదయం 10గంటలకు ఆలయం ప్రాంగణంలో వేలం నిర్వహిస్తామని ఆసక్తి గల వారు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. గురుకుల కళాశాల నుంచి విద్యార్థి అదృశ్యం కుల్కచర్ల పీఎస్‌లో ఫిర్యాదు కుల్కచర్ల: గిరిజన గు రుకులకళాశాలనుంచి విద్యార్థి అదృశ్యమైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు లు, అధ్యాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బండవెల్కిచర్ల గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్న సందీప్(16) మంగళవారం ఉదయం 7:35 నిమిషాలకు పాఠశాల ప్రహరీ దూకి పారిపోయాడు. అటెండెన్స్ సమయంలో విద్యార్థి గైర్హాజరును గమనించిన సిబ్బంది హాస్టల్లో వెతికారు. మధ్యాహ్నం వరకూ ఆచూకీ తెలియకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం 7:35 నిమిషాలకు మరుగుదొడ్ల వద్ద ఉన్న ప్రహరీ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. కాలేజీ ప్రిన్సిపల్ మధూసూదన్, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంతరెడ్డి ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. సందీప్ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం రుసుంపల్లితో పాటు బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపల్ కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సాగు.. సాగదే!
ఎనిమిది మండలాల్లో వర్షాభావం.. ● మోమిన్‌పేట్, వికారాబాద్, మర్పల్లి, బంట్వారం, నవాబుపేట్, కులకచర్ల, తాండూరు, బషీరాబద్ మండలాల్లో 30 మి.మీ.ల నుంచి 45 మి.మీ.ల లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ధ్రువీకరించింది. ● నైరుతి రుతు పవనాలు కారణంగా గత నెల జూన్ 10, 12, 13, 30వ తేదీల్లో వర్షాలు కురిశాయి. ● దీంతో నెల రోజుల్లో 72 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ● జూలై 1నుంచి 3వ తేదీ వరకు కురిసిన వర్షాలతో 40 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ● వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం ఇది సాధారణం కన్నా తక్కువే. ● మరో వారం రోజులు వర్షాభావ పరిస్థితులు సంభవిస్తే రైతులు పొలాల్లో వేసుకొన్న పంటలు పూర్తిగా ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాండూరు: కర్షకులకు ఖరీఫ్ కష్టాలు మొదలయ్యాయి. పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొతర ఒక వైపు.. సరైన వర్షాలు కురవకపోవడం మరోవైపు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మే నెలలో దండిచికొట్టిన వానలు జూన్, జూలైలో ముఖం చాటేశాయి. తేలికపాటి వర్షాలకు కొంతమంది రైతులు ఆరుతడి పంటలు సాగు చేశారు. వీటికి అడపాదడపా వానలు కురుస్తున్నా సీజన్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు. ● జిల్లాలోని 20 మండలాల్లో 5.63 లక్షల ఎకరాల్లో ఈసారి పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ● ఇప్పటికే సగం మంది పత్తి, కంది, మొక్కజొన్న వరి సాగు చేశారు. మిగిలిన వారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ● ప్రస్తుత సీజన్లో 2.58 లక్షల ఎకరాల్లో పత్తి, 1.14 లక్షల ఎకరాల్లో కంది వేశారు. ● జిల్లా వ్యాప్తంగా ఈరోజు వరకు 146.4 మిల్లీలీటర్ల వర్షపాతానికి గాను 134.2 మిల్లీమీటర్లు నమోదైంది. ● తేలికపాటి భూముల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది. ● నల్లరేగడి నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తుకోవాలి. ● పెసర, మినుము తదితర స్వల్పకాలిక పంటలు 70శాతానికి పైగా సాగయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దోబూచులాడుతున్న వరుణుడు ఇప్పటి వరకు కురవని భారీ వర్షం వర్షాలు లేక ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం జిల్లాలో5.63 లక్షల ఎకరాలలో పంటల సాగుకు అంచనా ఈ సీజన్లో జిల్లాలో 134.2ఎంఎంల సగటు వర్షపాతం నమోదు -
జుంటివాగు పరిశీలన
బషీరాబాద్: మండలంలోని జుంటివాగును బుధవారం ఇరిగేషన్ డీఈ కృష్ణయ్య, యాలాల తహసీల్దార్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రెండు శాఖల అధికారులు పరిశీలించారు. ఈ నెల 8న కబ్జా చెరలో జుంటివాగు అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో అధికారుల బృందం జుంటివాగును పరిశీలించింది. వాగు పొడవున 200 మీటర్ల మేర 5 మీటర్ల లోపలికి కబ్జా చేసినట్లు గుర్తించారు. పక్కనే ఉన్న పొలం యజమాని సంతోష్ కుమార్, వీణ దంపతులు చెక్‌డ్యామ్‌కు వింగ్ వాల్ కింద తాండూరు మండలం మాచనూరు రెవెన్యూ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 39జీ 2లో 20 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని తెలిపారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టినట్ల అధికారుల బృందం గుర్తించింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేసి స్థలాన్ని ప్రభుత్వ స్వాధీనం చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే వాగు రోజు రోజుకూ కబ్జాలకు గురై కుచించుక పోయిందని పలువురు రైతులు ఆరోపించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ భానుప్రకాశ్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రవణ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే
● కనీస వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలి ● దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొన్న కార్మికులు తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న తీరుకు నిరసనగా పలు కార్మిక సంఘాలు బుధవారం పట్టణంలో సమ్మె నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో వేర్వేరుగా మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను, 29 కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. వీటి వల్ల కార్మికుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల 12గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి వస్తుందన్నారు. సామాజిక భద్రతా పథకాలను తగ్గిస్తూ, ఏకంగా కార్మిక సంఘాలను రద్దు చేయాలనే యోచనలో కేంద్రం ఉందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం కింద రూ.26 వేలు చెల్లించడంతో పాటు, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు, పీఎఫ్, బీమా సౌకర్యాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్, కార్యదర్శి రవీందర్, నాయకులు గోపాల్, మునీర్, దస్తప్ప, మీనాజుద్దీన్, దేవి, అబ్దుల్లా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, మల్క య్య, కృష్ణ, బాలమణి, బేబి, భారతి, మల్లమ్మ, సుమలత, శాంత, అరుణ, శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
కొడంగల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీ్త్రనిధి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, ఆర్గనైజర్ రాజేశ్వరీ అన్నారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాల్లో భాగంగా బుధవారం పట్ణణంలో వెటర్నరీ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. సంఘాల్లో లేని మహిళలను గుర్తించి వారిని కొత్త సంఘాల్లో చేర్పించాలన్నారు. ఆగిపోయిన సంఘాలను గుర్తించి వాటిని పునరుద్ధరించాలన్నారు. మహిళా వృద్ధాప్య సంఘాలను, కిషోర బాలికలసంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం వల్ల వారు ఆర్థికాభివృద్ధి సాధంచే అవకాశం ఉంటుందన్నారు. జీవిత బీమా, ప్రమాద బీమా తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా క్యాంటిన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మహిళలను స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో కొడంగల్ మున్సిపల్ మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి పూడూరు: మహిళా సమాఖ్య సంఘాల ద్వారా రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ నర్సింలు అన్నారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా మండలంలోని మేడిపల్లికలాన్, పరిగి మండలం రూఫ్‌ఖాన్‌పేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలపై కళాజాత బృందంతో అవగాహన కల్పించారు. అనంతరం ప్రాజె క్టు మేనేజర్ మాట్లాడుతూ.. మహిళలు సంఘటితంగా ఉండి ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెట్రోల్ బంక్ లు, ప్రై వేటు బస్సుల కొనుగోలు, క్యాంటిన్ల వంటివి ఏర్పా టు చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎంలు బందయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సీసీలు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. సీ్త్రనిధి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ -
ఓటరు జాబితాలో తప్పులుండొద్దు
● అదనపు కలెక్టర్ సుధీర్ ● బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ అనంతగిరి: బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, మార్పులు చేర్పులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం వికారాబాద్ మండలంలోని బీఎల్ఓలకు మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫారం 6, 7, 8 నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో అవసరమైన చోట పాత ఫొటోలను తొలగించి, నూతన ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. పేర్లలో తప్పులను సవరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేయాలని, కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చూడాలన్నారు. మరణించిన వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జిల్లా మాస్టర్ ట్రైనర్, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. ఆధార్ నంబరు అనుసంధానం చేయాలి పరిగి: ఓటరు కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం చేయాలని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం పరిగి పట్టణంలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఎల్ఓలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎల్ఎంటీ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణకే ఆదర్శం ఎన్కేపల్లి
బొంరాస్‌పేట: ఎన్కేపల్లి యావత్ తెలంగాణకే ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల విద్యాప్రగతి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. శ్రీబలభీమ న్యూస్ ఛానెల్, మాస్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు, మాట్లాడారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రయాదవ్, సీఐ శ్రీధర్‌రెడ్డి, వెంకట్రాములుగౌడ్, నర్సింలుగౌడ్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌గౌడ్ మాట్లాడారు. గ్రామం నుంచి ప్రైవేట్ బడులకు వెళ్లేవారు ఇక్కడ చేరడం, గురుకులాలకు ఎక్కువ మొత్తంలో ప్రవేశాలు సాధించడం, మహిళా సంఘాల చొరవ, ప్రభుత్వ బడులను కాపాడుకొంటూ విద్యాప్రగతి సాధించడంలో మండలంలోనే ప్రథమ స్థాయిలో నిలిచిందని వారు ప్రశంసించారు. విద్యార్థులకు కుటుంబ సభ్యులు సైతం జ్ఞానం అందివ్వాలని, విద్యా పర్యవేక్షణ చేయాలని ప్రధాన వక్త భాస్కరయోగి పేర్కొన్నారు. పలకల పంపిణీ పాఠశాలలోని నూతన 120మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచితంగా పలకలు, ఐడీ కార్డులు, టై, బెల్టు, బూట్లు, బ్యాగులు, పాఠశాలకు సీసీకెమెరాలు, ఫరేడ్ డ్రమ్స్ అందజేశారు. మొక్కలు నాటిన అధికారులు కొడంగల్ ఫారెస్టు రేంజ్ అధికారి సవిత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వనమహోత్సవం నిర్వహించారు. అడవులను కాపాడాలని గ్రామస్తులకు సూచించారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులకు, తల్లిదండ్రులకు జ్ఞాపికలు అందజేశారు. పూర్వ ఉపాధ్యాయులు రహీం, అలీమ్, హెచ్ఎం జ్యోతిపరమేశ్వరి దంపతులకు సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో టీవీవీ జిల్లా కార్యదర్శి రవీందర్‌గౌడ్, ఎంఈఓలు హరిలాల్, రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి -
ఎంపీ సేవలు అభినందనీయం
కుల్కచర్ల: గ్రామీణ ప్రాంత పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకమైన వాహనాన్ని ఏర్పాటుచేసి శుభ్రం చేయిస్తున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయమని వైజీఆర్ స్వచ్ఛంద సంస్థ మండల కో ఆర్డినేటర్ రాంచంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం కుల్కచర్ల మండలం ఘణపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీరోజు పార్లమెంటరీ నియోజకవర్గంలోని 36 పాఠశాలలను శుభ్రం చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటుచేసిన వాహనం ద్వారా స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాసుల కోసం కవలల విచ్ఛిన్నం!
ఆరు నెలల గర్భిణికి అబార్షన్ ● మగ కవలలను పొట్టన పెట్టుకున్న వైనం ● ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన ● తమకు తెలియకుండా గర్భస్రావం ఎలా చేశారని వైద్యుల నిలదీత ● పరిగి పీఎస్‌లో ఫిర్యాదు పరిగి: కాసులకు కక్కుర్తి పడి ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేశారు. తమ అనుమతి లేకుండా గర్భస్రావం ఎలా చేస్తా రని సంబంధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఘట న పరిగి మండలంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. కళ్లాపూర్ తండాకు చెందిన హన్మంత్ నాయక్(24)కు గతేడాది చౌడాపూర్ మండలం, కొత్తపల్లి తండాకు చెందిన నందినితో వివాహం జరిగింది.నెల రోజుల క్రితం విద్యుత్‌షాక్‌కు గురైన హన్మంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 5న మృతి చెందాడు. అప్పటికే నందిని ఆరు నెలల గర్భిణి. హన్మంత్ అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజున ఇరు కుటుంబాలకు చెందిన వారు కూర్చుని మాట్లాడుకున్నారు. హన్మంతు ఇంటికి ఒక్కడే కొడుకు కావడంతో అతనికి వారసత్వం ఉండాలని, ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని నందినికి సూచించారు. ప్రసవం తర్వాత తమ ఆస్తులను పిల్లల పేరున చేయడంతో పాటు ఆతర్వాత నందిని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని అత్తింటి వారు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా గత సోమవారం నందిని అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లింది. ఆతర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం పరిగిలోని విజేత ఆస్పత్రిలో ఆమెకు అబార్షన్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న హన్మంతు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని గర్భం నుంచి వెలికి తీసిన ఇద్దరు మృత మగ కవలలను చూసి గుండెలు బాదుకున్నారు. తమ అనుమతి లేకుండా అబార్షన్ ఎలా చేస్తారని వైద్యులను నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను, ఆస్పత్రి సిబ్బందిని స్టేషన్‌కు తరలించారు. హన్మంతు తల్లి మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజేత ఆస్పత్రిలో గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. ఇక్కడ అబార్షన్లతో పాటు ప్రసవాల కోసం వచ్చిన వారికి సిజేరియన్లు చేయడం నిత్యకృత్యమని పలువురు ఆరోపించారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆస్పత్రి నిర్వాహకులను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. సమాధానం చెప్పకుండా ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. -
ఎరువులు అందుబాటులో ఉంచండి
● జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి ● ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు దుద్యాల్: మండలంలో సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు సూచించారు. బుధవారం దుద్యాల్, పోలేపల్లి గ్రామాల్లోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. హకీంపేట్ రైతు వేదికలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పంటల సాగుపై సందేహాలు ఉంటే ఏఈవోను సంప్రదించాలని అన్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు ఎక్కువగా వాడరాదని సూచించారు. మోతాదుకు మించి వాడితే పంట ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత సీజన్‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఏఈవో భావన ఉన్నారు. -
పరిహారం ఇప్పించండి సారూ
తాండూరు రూరల్: జాతీయ రహదారి నిర్మాణంతో రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు కోల్పోతున్నామని, బాధితులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని గ్రామస్తులు కోరారు. బుధవారం తాండూరు మండలం కోటబాసుపల్లి గ్రామస్తులు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..తాండూరు–చించోళి ప్రధాన రోడ్డు మార్గంలో ఎన్‌హెచ్ 167 జాతీయ రహదారిని నిర్మిస్తున్నారన్నారు. ఈ నిర్మాణంలో కోటబాసుపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న 27ఇళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. రోడ్డువెడల్పులో ఇళ్లుపోతే ఎక్కడ నివసించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం ఇస్తే మరోచోట ఇళ్లు నిర్మించుకుంటామన్నారు. కావున ప్రభుత్వం పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలని సబ్ కలెక్టర్‌ను వారు కోరారు. ఈ విషయంలో కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ మొగులప్ప, మాజీ సర్పంచు కుర్వ నాగార్జున, గ్రామస్తులు రఘునాథ్‌రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. సబ్‌కలెక్టర్‌ను కోరిన కోటబాసుపల్లి గ్రామస్తులు జాతీయ రహదారి నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్నామని ఆవేదన -
విచ్చలవిడిగా గడ్డిమందు!
దుద్యాల్: ప్రభుత్వం నిషేధించిన కలుపు నివారణ మందులను తెలిసీతెలియక కొంతమంది రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటక నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా సైతం విక్రయిస్తుండటంతో పత్తి, మొక్కజొన్న, వరి, కంది తదితర పంటలు సాగు చేసిన రైతులు గడ్డిని నియంత్రించేందుకు విరివిగా నిషేధిత మందును వినియోగిస్తున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉండటంతో అలవోకగా తెచ్చుకుంటున్నారు. మన జిల్లాలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్, యాలాల, బషీరాబాద్, తాండూరుతోపాటు నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి, దామరగిద్ద, ఉట్కూర్, నారాయణపేట తదితర మండలాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. గరిష్టంగా 40 కిలోమీటర్లలోపు దూరం ఉండటంతో ఇలా వెళ్లి అలా తెచ్చేస్తున్నారు. కొంతమంది దళారులు వీటిని రైతులకు తీసుకువచ్చి ఇస్తున్నారు. స్ప్రే చేసిన కొద్ది గంటల్లోనే గడ్డి పూర్తిగా మాడిపోతుండటంతో రైతులు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. గడ్డి మందుతో దుష్ఫలితాలు ● గడ్డి మందును పంటల్లో పిచికారీ చేయడం ద్వారా భూమి సహజత్వాన్ని కోల్పోతుంది. ● నేలలు నిస్సారవంతంగా మారి పంటలు ఎదగవు, దిగుబడులు పూర్తిగా పడిపోతాయి. ● మందు స్ప్రే చేసిన గడ్డిని మేస్తే పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయే ప్రమాదం ఉంది. ● గడ్డిమందు పిచికారీ చేసే రైతులు శ్వాసకోస వ్యాధులతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ. జిల్లాలో జోరుగా నిషేధిత కలుపు మందుల వినియోగం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న వైనం దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తప్పవంటున్న పర్యావరణవేత్తలు -
మహేందర్‌రెడ్డి మరణం తీరని లోటు
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బంట్వారం: బీజేపీ సీనియర్ నాయకుడు పట్లోల్ల మహేందర్‌రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కోట్‌పల్లి మండలం బార్వాద్‌కు చెందిన మహేందర్‌రెడ్డి గత నెల 28న విద్యుత్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం గ్రామంలో నిర్వహించిన సంస్మరణ సభకు ఎంపీ హాజరై సంతాపం తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు మాధవరెడ్డి, వడ్ల నందు, శివరాజ్, నరేందర్‌రెడ్డి, శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, బార్వాద్ మాజీ సర్పంచ్ వెంకటేష్ యాదవ్, అడ్వకేట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులను కాపాడుదాం అనంతగిరి: బాలల హక్కులను కాపాడటం మన బాధ్యత అని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సరిపడా భూములను గుర్తించాలన్నారు. ప్రతి బుధ, శుక్రవారాలు ఆయా మండలాల ప్రత్యేక అధికారులు పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. చెంచు కుటుంబాలను గురించి వారికి ఇంటి స్థలం 80 చదరపు గజాలు కేటాయించాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలను చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకోవడం నేరమన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ యాదయ్య, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ రేణుకాదేవి, డీపీఓ జయసుధ, డీసీపీఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిద్రలోనే మృత్యు ఒడికి మొయినాబాద్: తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని, కుర్చీలో కునుకు తీసిన ఓ వ్యక్తి నిద్రలోనే మరణించాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం వట్టినాగులపల్లికి చెందిన గోలియా శ్యామ్ సుందర్‌సింగ్(55) నాగిరెడ్డిగూడ రెవెన్యూలోని సుజాత స్కూల్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని కుర్చీలో నిద్రపోయాడు. కొంత సేపటి తర్వాత తోటి ఉద్యోగులు నిద్రలేపే ప్రయత్నం చేయగా లేవలేదు. వెంటనే భాస్కర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బసిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్ పట్టా పరిగి: మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన రామచంద్రయ్య యాదవ్ డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్టాక్‌మార్కెట్ ప్రవర్తన, భారత దేశ వృద్ధి అనే అంశంపై పరిశోధనలు చేశారు. ప్రొఫెసర్ నకులరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన సాగించారు. స్టాక్ మార్కెట్ మార్గదర్శకాలు, ఆర్థిక వృద్ధిపై నివేదికను అందజేశారు. పరిశోధనలు పూర్తి కావడంతో బుధవారం డాక్టరేట్ పట్టా పొందారు. కేసులు నమోదు చేయాలి అనంతగిరి: సర్పన్ పల్లి ప్రాజెక్ట్‌లో రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇద్దరు మహిళా పర్యాటకులు మృతి చెందిన ఘటనపై నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు వై గీత కోరారు. బుధవారం సర్పన్‌పల్లి ప్రాజెక్టు పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న రిసార్ట్‌లపై ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రిసార్ట్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టినప్పటికీ, ఎవరు మూసివేశారన్న విషయమై స్పష్టత లేదన్నారు. అనంతగిరి చుట్టూ అనుమతి లేకుండా కొనసాగుతున్న రిసార్ట్‌లను వెంటనే సీజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందురుపాటి గోపాల్ రెడ్డి, బి. మల్లేష్, మాదారం వెంకటేష్, పీర్ మహమ్మద్, మునీర్ తదితరులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్, రిమాండ్
నవాబుపేట: ఇద్దరు చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన బుధవారం నవాబుపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఎత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన మీనపల్లి సత్యమ్మ వారం క్రితం పొలం నుంచి మధ్యాహ్న సమయంలో ఇంటికి వస్తుంది. అదే సమయంలో రాజస్థాన్‌కు చెందిన సేవారాం, దీపారాంలు లూనాపై ఆమె దగ్గరికి వచ్చి ఈ రోడ్డుఎక్కడికి పోతుందని మాటలు కలిపి మెడలోని (40 గుండ్లు గల) బంగారాన్ని అపహరించారు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారు సదశివాపేట వద్ద ఉన్నారనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. తామే బంగారు గొలుసును అపహరించినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
అనంతగిరి: జీవో నెంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు పూజారి శ్రీకాంత్ తెలిపారు. బుధవారం వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరి రాములు పిలుపుమేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వారు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, కలెక్టర్ ప్రతిక్ జైన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020, సెప్టెంబర్ 9న గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందన్నారు. వివిధ శాఖల్లో 16,758 మందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేయగా, మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకున్నా నేటికి మండల రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నారని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టే గ్రామ పరిపాలన అధికారి నియామకాల్లో వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ ధారూరు మండల అధ్యక్షుడు సంగమేష్, మర్పల్లి అధ్యక్షుడు సంగమేశ్వర్, వికారాబాద్ మండల అధ్యక్షుడు బండకింది శ్రీనివాస్, యాలాల మండల అధ్యక్షుడు నర్సింహులు, పెద్దేముల్ మండల అధ్యక్షుడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ జిల్లా కలెక్టర్‌కు వినతి -
జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎల్‌హెచ్‌పీఎస్ కృషి
జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ బొంరాస్‌పేట: మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎల్‌హెచ్‌పీఎస్ కృషి చేసిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు. భారత్ ముక్తి మోర్చా, ఎల్‌హెచ్‌పీఎస్ తరఫున పోరాడామన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సంఘం ముందుంటుందన్నారు. పీఆర్టీయూ సభ్యత్వ కార్డుల పంపిణీ యాలాల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ ముందుంటుందని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన , మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములుతో కలిసి 2025–26గాను సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేశ్‌కుమార్, మొగులయ్య, కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నష్టపోయా న్యాయం చేయండి దోమ: నకిలీ విత్తనాలతో నష్టపోయిన తనకు న్యాయం చేయాలని దొంగఎన్కేపల్లికి చెందిన రైతు పోట్టిగారి సాయిరెడ్డి కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 2024 డిసెంబర్ 06న పరిగి పట్టణంలోని శ్రీమహేశ్వరీ ఫెర్టిలైజర్ దుకాణంలో రూ.1,300 వెచ్చించి హైబ్రిడ్ వరి విత్తనాలు (25 కేజీల బస్తా) తీసుకెళ్లి పొలంలో నాటేశామన్నారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని యజమాని చెప్పినప్పటికీ కేవలం ఎనిమిది క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపారు. ఈ విషయమై పరిగి ఏడీఏకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తనకు న్యాయం చేయాలని కోరారు. పోతులవాగు కబ్జాను అడ్డుకోండి ధారూరు: మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ సమీపంలోని పోతులవాగును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్దేముల్ మండలం మారేపల్లి రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ధారూరు తహసీల్దార్, ఇరిగేషన్ డీఈ రవికుమార్, కోట్‌పల్లి ప్రాజెక్టు కుడి కాల్వ ఏఈ మాధురీలతకు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులకు విన్నవించగా పోలీసులకు ఫిర్యాదు చేసి, చేతులు దులుపుకొన్నారని తెలిపారు. వాగు కాల్వకు గ్రానైట్‌తో సోలింగ్ చేసి, కాల్వను చిన్నదిగా చేశారని, దీంతో కింది భాగంలోని తమ పొలాలు నీట మునిగే ప్రమా దం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కాల్వకు రాళ్లు పేర్చడం ద్వారా పశువులు వెళ్లకుండా చేసి, మూగజీవాల దాహార్తి తీర్చుకునే అవకా శం లేకుండా చేశారని మండిపడ్డారు. వాగును కబ్జా చేసిన వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్లాట్ కబ్జా చేసిన వారిపై ఫిర్యాదు బంజారాహిల్స్: బోగస్ డాక్యుమెంట్లతో తన ప్లాట్‌ను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు చాడ రమేష్‌చందర్‌రెడ్డి మంగళవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాలాపూర్ మండలం అల్మాస్గూడ వినాయకహిల్స్ సర్వేనంబర్ 94 నుంచి 97తో పాటు 103లో తనకు 300 గజాల ప్లాట్ ఉందని, ఈ ప్లాట్‌ను ఇద్దరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి ఆధారాలతో తాను మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు.సంబంధిత ఎస్ఐ కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోగా, సివిల్ తగాదా అంటూ కేసును మూసివేశారని ఆరోపించారు. -
నిబంధనలు పాటించని క్లినిక్‌ల సీజ్
షాబాద్: వచ్చిరాని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్లినిక్‌లను సీజ్ చేశారు. అర్హత లేకున్న నిర్వహిస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షాబాద్‌లో నిర్వహిస్తున్న క్లినిక్‌లపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని తనిఖీ చేసేందుకు వెళ్లగా, అప్పటికే వారు మూసివేసి వెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లినిక్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు. కఠిన చర్యలు తప్పవు డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు -
అవగాహన కల్పించండి
బంట్వారం: వయోజనులంతా ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. మంగళవారం కోట్‌పల్లి మండలం రాంపూర్ జెడ్పీహెచ్ఎస్లో బీఎల్ఓలకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలన్నారు. మార్పులు, చేర్పులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పాత ఫొటోలు తొలగించి కొత్త ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు. పేరులో తప్పులుంటే సవరించాలన్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు నమోదు అయ్యేలా చూడాలన్నారు. మరణించిన వారి పేర్లను నిబంధనల ప్రకారం ఫారం–7 ద్వారా తొలగించాలన్నారు. మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ డానియల్, ఎంఈఓ చంద్రప్ప, అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సుధీర్ -
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించండి
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయంలో మంగళవారం ఎంఈఓ పాండుకు పీడీఎస్‌యూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. సర్కారు బడులను బలోపేతం చేయకుండా విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అనిల్, సాయి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ -
స్వయం ఉపాధితో నిలదొక్కుకోవాలి
బొంరాస్‌పేట: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సెర్ప్ ఆదేశాలతో మండల మహిళా సమాఖ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగా మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను చర్చించారు. బ్యాంకు రుణాలు, శ్రీనిధి, సీఐఎఫ్, చిరు వ్యాపారాలు, పాఠశాలల ఏకరూప దుస్తులు కుట్టడం, కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు అంశాలపై చర్చించారు. నూతనంగా కిశోర, వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీఎం సాయన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, నర్సింలుగౌడ్, రాంచంద్రారెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి సునిత, సీసీ రాంచంద్రయ్య, గ్రామ సంఘాల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి -
మాడ్గులలో ఆపరేషన్ ముస్కాన్
మాడ్గుల: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బందీలుగా ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మాడ్గుల మండలంలో సీఐ వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం మండలంలో బాల కార్మికుల స్థావరాలుగా నిలిచే పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నల్లచెరువు శివారులో ఉన్న పౌల్ట్రీ ఫారంలో పని చేస్తున్న ఇద్దరు బాలికలను గుర్తించారు. యాజమాన్యంపై విచారణ జరుగుతున్నట్లు సీఐ తెలిపారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా! తాండూరు: మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా గతంలో సామూహిక మరుగుదొడ్ల కొనసాగిన స్థలాన్ని కబ్జా చేశారు. మున్సిపల్ పరిధిలోని 34వ వార్డులో మూడు దశాబ్దాల క్రితం సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతం ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో నాలుగేళ్ల క్రితం మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించి మరుగుదొడ్లను తొలగించారు. దీంతో ఆ స్థలంలో మూడేళ్ల క్రితం అంగన్వాడీ భవనం నిర్మించారు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో మిగిలిన స్థలాన్ని ఆక్రమించి దుకాణాన్ని నిర్మించారు. స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బంగారు గొలుసు చోరీ ఇబ్రహీంపట్నం: మహిళ మెడలోని గొలుసును లాక్కొని పరారైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కప్పపహాడ్ గ్రామానికి చెందిన బూడిద పద్మమ్మ ఆరుబయట నిలబడి ఇంట్లోకి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 4 తులాల గొలుసును లాక్కొని పరారయ్యాడు. -
విద్యాభివృద్ధిలో త ల్లిదండ్రులు కీలకం
జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి తాండూరు రూరల్: విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు సైతం బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గౌతపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో హెచ్ఎం లీలావతి అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హారైన డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమై న విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ వెంకటయ్య, గ్రామస్తులు నాగప్ప, రాజప్పగౌడ్, పురుషోత్తంరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్షయపై ఆందోళన అనవసరం ప్రోగ్రాం జిల్లా అధికారి రవీందర్‌యాదవ్ తాండూరు రూరల్: క్షయ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ రవీందర్ యాదవ్ అన్నారు. మంగళవారం జినుగుర్తి గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. టీబీ వ్యాధి సోకిన వారు ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే నివారించవచ్చన్నారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో జినుగుర్తి పీహెచ్సీ డాక్టర్ రశీద్, ఏఎన్ఎంలు కరుణశీల, నర్మద, సుశీల, ఆశవర్కర్లు లలిత, రాములమ్మ పాల్గొన్నారు. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ అనంతగిరి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు వినతిపత్రం అందజేశారు. వంద శాతం సబ్సిడీతో రుణాలు అందజేసి జీవనోపాధి కల్పించాలన్నారు. ప్రతీ దివ్యాంగుడికి రూ.50లక్షల ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఫ్యూచర్‌సిటీతో మహర్దశ యాచారం: ఫ్యూచర్‌సిటీతో యాచారానికి మహర్దశ పట్టనుందని, కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వనగరం వై పే ప్రపంచ చూపు ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నస్దిక్‌సింగారం, అయ్యవారిగూడెం, యాచారం గ్రామాల్లో మంగళవారం ఆయన రూ. 2.5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ ఫార్మాసిటీ నిర్మించి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తే, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యూచర్‌సిటీ నిర్మించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నారని అన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఈసీ శేఖర్‌గౌడ్, బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, యాచారం మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీలు రాంరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పాలన
బంట్వారం: దివంగత సీఎం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేనివని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన బంట్వారం మండల పరిషత్ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108 లాంటి ఎన్నో గొప్ప పథకాలు వైఎస్సార్ ప్రవేశపెట్టినవేనని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ అడుగుజాడల్లో పాలన కొనసాగిస్తోందన్నారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం అధికారులకు సూచ నలు ఇచ్చారు. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. వన మహోత్సవంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్ విజయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. హామీల అమలుకే ‘ప్రజల వద్దకు స్పీకర్’ మర్పల్లి: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేసేందుకు వారంలో రెండు రోజులు ప్రజల వద్దకు స్పీకర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజ్ మల్లయ్య అధ్యతన ప్రజల వద్దకు స్పీకర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మర్పల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డిప్యూటేషన్‌పై వెళ్లడంతో అధ్వానంగా మారిందని ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు గత ప్రభుత్వం నిర్మించిన 120 ఇళ్లను అర్హులకు అందజేస్తామన్నారు. గ్రామాల్లో విద్యుత్, తాగునీటి తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.8లక్షల కోట్ల అప్పులు చేసిందని.. రాష్ట్రాదాయంలో సగం డబ్బు వారు చేసిన అప్పలకు కిస్తీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్త శుద్ధితో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మొక్కలు నాటి సంరక్షించాలి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ సూచించారు. తల్లిదండ్రులు, పిల్లల పేరున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్క నాటారు. అనంతరం స్త్రీ శక్తి భవనంలో ఏర్పాటు చేసిన మహిళ సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేశ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగదీశ్వర్, డీసీసీ ఉపాధ్యక్షుడు రవీదర్, నాయకులు కృష్ణారెడ్డి, రాములు యాదవ్, రామేశ్వర్, దివాకర్, ప్రభాకర్, ఖలీమొద్ధీన్, శంకరయ్యగౌడ్, మండల ప్రత్యేకాధికారి కృష్ణమోహన్, తహసీల్దార్ పురుషోత్తం, ఏఓ శ్రీకాంత్, వెటర్నరీ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం మధూకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రిజ్వాన తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
ధారూరు: అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసిన కేసులో నిందితునికి జీవితఖైదు, రూ.7వేల జరిమాన విధిస్తూ మంగళవారం వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్‌జడ్జి డాక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ధారూరు మండలం అవుసుపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల నాగమణి చెల్లెలు కవితకు అదే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల చంద్రయ్యతో 2008లో వివాహమైంది. వివాహ సమయంలో తల్లిదండ్రులు నగదు రూ. లక్ష, 3 తులాల బంగారం, ఇతర వస్తువులు వరకట్నంగా ఇచ్చారు. పెళ్లైన కొద్ది రోజులకు భర్త చంద్రయ్య తాగుడుకు బానిసై కవితను మానసికంగా, శారీరకంగా వేదించేవాడు. అదనంగా రూ.50వేలు తీసుకరావాలని భార్యపై వత్తిడి తెచ్చాడు. 2012, మార్చి 3న ఓ కంపెనీలో కూలీ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. తల్లిదండ్రుల నుంచి అదనపు కట్నం ఎందుకు తీసుకరాలేదని కవితను బూతులు తిడుతూ కర్రతో చితకబాదాడు. ఆమె నిత్యం పడుతున్న బాధలు భరించలేక అతని ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుని బయటకు పరుగుతీసింది. పక్క ఇంట్లో ఉన్న అంజిలమ్మ, లక్ష్మయ్యలు మంటలను ఆర్పెసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది. ఈ సంఘటనపై ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితునిపై 498(ఎ), 302 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. అప్పటి డీఎస్పీ చౌడేశ్వరీ, ఎస్ఐ రమేశ్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. జరిమాన రూ.7వేలు చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితునికి శిక్షపడేలా చేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. రూ.7 వేల జరిమానా తీర్పు వివరాలు వెల్లడించిన ఎస్పీ నారాయణరెడ్డి -
ఆర్టీసీ బస్సునుంచి దింపివేత.. అంబులెన్స్ వచ్చేలోపు మృత్యువాత
కేశంపేట: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్న వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆర్టీసీ సిబ్బంది బస్సులో నుంచి దింపేశారు. ఆతర్వాత కొద్ది నిమిషాలకే బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేశంపేటకు చెందిన నారని అనసూయమ్మ (64)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. భర్త రాములు మూడేళ్ల క్రితం, పెద్ద కూతురు ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందారు. ప్రస్తుతం అనసూయమ్మ కేశంపేటలోనే కుమారుడి వద్ద ఉంటోంది. ఇటీవల ఆరోగ్యం బాగో లేకపోవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పదిహేను రోజులుగా దగ్గు, దమ్ము అధికం కావడంతో మూడుసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోసారి హైదరాబాద్ వెళ్లేందుకు అనసూయను తీసుకుని ఆమె కొడుకు, కోడలు మంగళవారం కేశంపేటలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు కొత్తూర్ వద్దకు రాగానే అనసూయనకు దమ్ము ఎక్కువైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది ముగ్గురినీ కిందకు దింపేశారు. బాధితులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ వచ్చే సరికే అనసూయ మృతిచెందారు. -
రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి
బడంగ్పేట్: బాలాపూర్ మండలంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ.. బాలాపూర్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలు ఏళ్ల తరబడి తిష్టవేశారని అన్నారు. తనపై రెక్కీ సైతం నిర్వహించారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
దుద్యాల్: మండలంలోని పలు పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. అసలే వర్షాకాలం.. అడపాదడపా కురుస్తున్న వానలతో గుంతల్లో నీరు నిలుస్తోంది. రోడ్లపై పారుతున్న మురుగుతో జనం అవస్థలు పడుతున్నారు. వీధుల్లో పరిశుభ్రత కరువైంది. దోమలు వ్యాప్తి చెంది జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంచాయతీ బోర్లు, కుళాయిల వద్ద మురుగు నీటి నిల్వతో తాగునీరు కలుషితమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు నిత్యం పలు వార్డుల్లో పర్యటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మండలంలోని దుద్యాల, హస్నాబాద్, కుదురుమల్ల, హకీంపేట, లగచర్ల, చిలుముల మైల్వార్, గౌరారం, ఈర్లపల్లి, పోలేపల్లి వంటి పెద్ద గ్రామాల్లో విషజ్వరాలు సోకకుండా పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని కోరుతున్నారు. లేదంటే డెంగీ, డయేరియా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వీధుల్లో పారుతున్న మురుగు కలుషితమవుతున్న తాగునీరు పట్టించుకోని అధికారులు -
లారీ బైక్ ఢీ.. వ్యక్తి మృతి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి సమీపంలో లారీ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైకిస్టు మృతి చెందిన సంఘటన మంగళవారం వికారాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లికి చెందిన వై. యాదయ్య(29) వికారాబాద్ పట్టణంలోని మొబైల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. 10. 30గంటల ప్రాంతంలో ఎన్నెపల్లి చౌరస్తా దాటాక ఓ లారీ డ్రైవర్ రివర్స్ తీస్తున్న క్రమంలో వెనుకల గమనించకుండా అటుగా వస్తున్న యాదయ్య బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో యాదయ్యకు తీవ్రగాయాలవ్వడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలిస్తుండగా తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుని అన్న నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ భీంకుమార్ తెలిపారు. -
ఆకలి కేకలపై విచారణ
బషీరాబాద్: ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం ఆపితే ఏజెన్సీలను రద్దు చేస్తామని బషీరాబాద్ ఎంఈఓ రాములు హెచ్చరించారు. ‘ఆకలి కేకలుశ్రీ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి డీఈఓ రేణుకాదేవి స్పందించారు. మైల్వార్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పస్తులపై విచారణ జరిపి, మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని ఎంఈఓ రాములును ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఎంఈఓ ప్రధానోపాధ్యాయుడు వెంకటప్ప, ఏజెన్సీ నిర్వాహకులు భువనేశ్వరి, ప్రమీల, సంగీత తదితరులతో సమావేశమయ్యారు. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతోనే వంట బంద్ చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయమై వివరణ తీసుకోవడంతో పాటు మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని ఏజెన్సీ వారు రాసి ఇచ్చారని స్పష్టంచేశారు. మంగళవారం మధ్యాహ్నం 150 మంది పిల్లలకు భోజనం పెట్టించారు. మధ్యాహ్న భోజనం పునరుద్ధరణ -
ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి
‘స్థానిక’ ఎన్నికలకు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి చేపట్టనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ సిద్ధమవుతోంది.8లోu9లోuకొడంగల్ రూరల్: అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పరిధిలో బూత్ లెవల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. మంగళవారం ఆయన పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని పార్టీల అధ్యక్ష్య, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పారీల్ట నాయకులు తమ పరిధిలో ప్రతీ అంశంపై సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, ఎలక్షన్ డీటీ అనిత, ఆయా పార్టీల నాయకులు కృష్ణ, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, ఇందనూర్ బషీర్, ఎస్బి.గుల్షన్, తలారి శేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. చాలా రూట్లలో బస్సులు లేక విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రవీందర్, నర్సింలు, శేఖర్, సత్యం, రాజు, రమేశ్, నవీన్ రాథోడ్ తదితరులు ఉన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మధ్యాహ్న భోజనం తనిఖీ బొంరాస్‌పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు. వర్షాకాలంలో ఎదురయ్యే కలుషిత ఆహార సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో నిర్వహించిన బీఎల్ఓలకు నిర్వహించిన అవగాహన సమావేశాన్ని పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన బీఎల్ఓ విధులను వివరించారు. -
ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి
కుల్కచర్ల: ఎన్నికల నిర్వహణపై సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని ఆర్డీఓ వాసుచంద్ర అన్నారు. మంగళవారం చౌడాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే ఎన్నికలపై అధికారులు, బూత్‌లెవల్ అధికారులు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాహిదాఖాతుం, ఇన్చార్జి ఎంపీఓ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ వాసుచంద్ర -
సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా
తాండూరు రూరల్: గ్రామాల్లో మహిళ సంఘాలను బలోపేతం చేయాలని అదనపు డీఆర్డీఏ నర్సింలు అన్నారు. మంగళవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో మహిళ సంఘాల సభ్యులతో మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. సంఘంలో లేని మహిళలను నూతన సంఘంలో చేర్పించి అవగాహన కల్పించాలన్నారు. సంఘం సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందని వివరించాలన్నారు. మహిళలకు వడ్డిలేని రుణాలు, పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్, స్కూల్ యూనిఫాంలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ప్రోగ్రాం మేనేజర్ భీమయ్య, ఏపీఏం ఆనంద్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి భానుప్రియ, కోశాధికారి నాగమణి, సీసీలు, వీఓఏలు, ఆయా గ్రామాల మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఎదగాలి దోమ: మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా ప్రాజెక్ట్ అధికారి(డీపీఎం) నర్సింలు, కమలాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికల ఇందిరా క్రాంతి మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సదర్భంగా మహిళా సంఘాల సభ్యులకు, వీఓఏలకు, సీసీలకు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడే అంశాలను ఎంపీడీఓ గ్యామతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన సంఘాలను ఏర్పాటుకు వీఓఏలు, సీసీలు చర్యలు తీసుకోవాలన్నారు. 15–18 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలను కిషోర బాలికల సంఘాలుగా, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులను దివ్యాంగుల సంఘాలుగా బలోపేతం చేయాలన్నారు. ప్రతీ సంఘానికి లోన్లు ఇప్పించి రెగ్యులర్‌గా కట్టించేలా శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు నారాయణ, జంగయ్య, నర్సింలు, లక్ష్మారెడ్డి, శ్రీశైలం, అనసూయ, సుజ్ఞాని, అంజమ్మ, అకౌంటెంట్ మంజుల పాల్గొన్నారు. అడిషనల్ డీఆర్డీఏ నర్సింలు -
‘ఆరోగ్య మహిళ’ను వినియోగించుకోవాలి
అనంతగిరి: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం ఆమె రామయ్యగూడ, సిద్దులూర్ పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, అందించే సేవలపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్, పోషకాహార లోప సమస్యలు, జననేంద్రియాలకు సంబంధించి సమస్యలు, కుంటుంబ నియంత్రణ, లైంగిక వ్యాధుల నిర్వహణ వంటి సమస్యలకు పరిష్కారం చూపేలా స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. సాధారణ వ్యాధితో ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అవరసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు, పీహెచ్సీలో లేదా టీహబ్‌లో చేయించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఫార్మసీ స్టోర్లలో మందులను ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం బంట్వారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ లలితాదేవి అన్నారు. మంగళవారం ఆమె కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారానికోసారి నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమంపై ఆమె డాక్టర్ మేఘనను అడిగి తెలుసుకున్నారు. 15 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు సంబంధించి తప్పనిసరిగా అవసరమైన వైద్య పరీక్షలు చేయాలన్నారు. వీరిలో లోపాలను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందికి సూచించారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మేఘన, సీహెచ్ఓ ఖయూం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
తారు.. బేజారు
యాచారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో యాచారం, కందుకూరు మండలాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని భావించిన స్థానికులకు నిరాశ తప్పడం లేదు. రహదారులు నిర్మించక పోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీకి భూసేకరణలో భాగంగా యాచారం–కందుకూర్ మండలాల మధ్యలో ఉన్న చిన్న రోడ్డును విస్తరించాలని సంకల్పించారు. ఈ రహదారిని వంద అడుగులకు విస్తరిస్తే ఫార్మాసిటీకి మార్గం సులువుతుందని అభిప్రాయం. అప్పట్లో 25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.వంద కోట్లకు పైగా నిధులను టీజీఐఐసీ నుంచి మంజూరు చేశారు. కందుకూరు నుంచి మీరాఖాన్‌పేట గ్రామం సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ అయింది. కానీ మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, నందివనపర్తి, మొగుళ్లవంపు నుంచి యాచారానికి రహదారి పనులు ముందుకు కదలడం లేదు. దుమ్ము, ధూళితో నరకం మీరాఖాన్‌పేట గ్రామం సరిహద్దు నుంచి నస్దిక్‌సింగారం వరకు వంద అడుగుల రోడ్డు విస్తరణ కోసం గత నాలుగేళ్ల కింద పనులు ప్రారంభించారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి, రోడ్డుపై మట్టి పోశారు. కానీ పనుల్లో కదలిక లోపించింది. యాచారం–కందుకూర్ మండలాల సరిహద్దు కలిపే ఈ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఫ్యూచర్‌సిటీ నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలో భాగంగా తరచూ రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీస్ ఉన్నతాధికారులు ఈ రోడ్డు నుంచే నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్ గ్రామాల్లో పర్యటిస్తారు. రోడ్డుపై పోసిన మట్టి ఎండలకు దుమ్ము లేస్తుంది. బైక్‌లపై వెళ్లే ప్రయాణికులకు కళ్లు, నోట్లోకి పోయి శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. రోడ్డు విస్తరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కందుకూరు మండలంలో చకచక రహదారి పనులు జరిగితే ఇక్కడ మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో పెంచాలని కోరుతున్నారు. ఐదేళ్లయినా గ్రహణంవీడని ఫార్మాసిటీ రోడ్డు కందుకూరులో కళకళ యాచారంలో వెలవెల అవస్థలు పడుతున్న వాహనదారులు -
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025
8లోuవికారాబాద్: వారం రోజులుగా ఊరిస్తున్న మేఘాలు చిరు జల్లులకే పరిమితమవుతున్నాయి. మొదట్లో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేసుకున్నారు. ఆ వెనువెంటనే వరుణుడు మొహం చాటేడయంతో ఆందోళన చెందుతున్నారు. సీజన్ ఆరంభంలోనే విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. పూర్తి స్థాయిలో విత్తనాలు వేసేందుకు సరిపడా వర్షాల కురవడం లేదు. 60 మిల్లీ మీటర్ల వర్షపాతం కోసం రెండు నుంచి మూడు పెద్ద వర్షాలు కురిస్తేనే పూర్తి స్థాయిలో విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.61 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సాధారణ వర్షపాతంతో విత్తనాలు వేసేందుకు సరిపోవడం లేదని పూర్తి స్థాయిలో కురిసిన తర్వాతే విత్తుకుంటే మేలని అధికారులు సూచిస్తున్నారు. పెసర, మినుము, జొన్న వద్దు ముందుస్తుగా వర్షాలు కురిస్తే రోహిణి లేదంటే మృగశిర కార్తెలో విత్తనాలు విత్తుకుంటారు. ఈ ఏడాది మే 24న రోహిణి కార్తె ప్రారంభమైంది. జిల్లా వ్యాస్తంగా 5.61 లక్షల ఎకరాలు సాగవనుండగా ఇప్పటి వరకు 3.11లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. ఈ సీజన్లో ప్రస్తుతం 60 శాతం విత్తనాలు వేయగా 40 శాతం రైతుల ఇళ్లలోనే మగ్గుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెసర, మినుము, జొన్న విత్తనాలు వేయకపోవడమే మేలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల మొలకలు రాకపోగా అక్కడక్కడా విత్తనాలు మొలకెత్తాయి. మరికొన్ని చోట్ల కలుపుతీతకు సిద్ధంగా ఉన్నాయి. మెజార్టీ రైతులు మొలకలు వస్తాయా రావా? అని ఆందోళన చెందుతున్నారు. న్యూస్రీల్వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా చినుకు జాడ లేదు. ముందస్తు వర్షాలు రైతును మురిపించినా ఆతర్వాత ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఒక్క పెద్ద వాన కూడా కురువక సాగు ముందుకు కదలడం లేదు. సాగుకు సరిపడా కురవని వర్షాలు 40 శాతం విత్తనాలు ఇళ్లకే పరిమితం ప్రారంభం కాని వరినాట్లు ఆందోళనలో రైతులు వరి సాగుకు ఆందోళన గతేడాది వర్షాకాలంలో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8వేల ఎకరాల్లో నారుపోసుకున్నారు. వర్షాల జాడ లేక చెరువుల్లోకి నీరు రాలేదు. దీంతో రైతులు వరి నారుకు పోయాలా.. వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నారు. బోరుబావులు ఉన్న వారు మాత్రం వరి నారు పోసుకున్నారు. వరి సాగుకు ఆందోళన గతేడాది వర్షాకాలంలో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8వేల ఎకరాల్లో నారుపోసుకున్నారు. వర్షాల జాడ లేక చెరువుల్లోకి నీరు రాలేదు. దీంతో రైతులు వరి నారుకు పోయాలా.. వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నారు. బోరుబావులు ఉన్న రైతులు మాత్రం వరి నారు పోసుకున్నారు. పత్తి సాగుకే మొగ్గు జిల్లాలో 16 రకాల పంటలు సాగు చేస్తుండగా ఇందులో సింహభాగం పత్తి, కంది, మొక్కజొన్న, వరి పైర్లు వేస్తున్నారు. గతేడాది పత్తి క్వింటాల్‌కు రూ.8 వేలకు పైగా ధర రావడంతో రైతులు పత్తిసాగుకు మొగ్గు చూపుతున్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికి 1,98,926 ఎకరాల్లో సాగు చేశారు. 80,428 ఎకరాల్లో కంది సాగు చేశారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతంలో 30–60 వేల ఎకరాల్లో సాగు చేసే మొక్కజొన్న ఇప్పటి వరకు 14,755 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. కోతుల బెడద ఎక్కువైన నేపథ్యంలో కూరగాయలు, వేరుశనగ సాగు విస్తీర్ణం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నెలాఖరు వరకు ఓకే ఈ నెలాఖరు వరకు అన్ని రకాల విత్తనాలు విత్తుకోవచ్చు. ఎక్కువ శాతం పత్తి, కంది సాగుకు మొగ్గు చూపుతున్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. లోటు వర్షపాతం కారణంగా విత్తనాలు విత్తుకోవడం పూర్తవలేదు. – మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి -
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
తాండూరు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్, ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ ప్రెసిడెంట్ నర్సిములు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి ఇబ్బంది పెడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జీఓలు తెచ్చి కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని సవరిస్తూ, 10 గంటలకు పెంచుతూ జీఓ జారీ చేయడాన్ని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, రాములు, నరేశ్, ప్రకాశ్, అశోక్, రమేశ్ తదితరులు కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. పిలుపునిచ్చిన సీఐటీయూ, ఏఐటీయూసీ మున్సిపల్ కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేత -
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
తాండూరు రూరల్: పాఠశాలకు ఉపాధ్యాయలు సమయపాలన పాటించాలని పెద్దేముల్ ఏంఈఓ నర్సింగ్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని బండపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసిన పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలకు సంబంధించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలన్నారు. వర్షాకాలం సందర్భంగా మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సందడిగా పీర్ల ఊరేగింపు దుద్యాల్: మండల పరిధిలోని కుదురుమల్లలో మొహర్రం ఊరేగింపును సోమవారం ఘనంగా నిర్వహించారు. చావిడిలో ఏర్పాటు చేసిన పీర్లను 10వ రోజు గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. దీంతో గ్రామస్తులు ఊదు, బెల్లం చదివింపులు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, యువకులు, గ్రామస్తులు ఆటపాటలతో సందడి చేశారు. మొహర్రం ఉత్సాహం బొంరాస్‌పేట: మండల పరిధిలోని పలు గ్రా మాల్లో సోమవారం మొహర్రం సందడి నెలకొంది. వడిచర్ల, నాగిరెడ్డిపల్లి, రేగడిమైలారం గ్రామాల్లో పీర్లను ఊరేగించి సాయంత్రం నిమజ్జనం చేశారు. చిన్నాపెద్ద ఆడిపాడారు. పరిగి తహసీల్దార్‌పై చర్యలకు డిమాండ్ అనంతగిరి: అక్రమాలకు పాల్పడిన పరిగి తహసీల్దార్ ఆనంద్‌రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అవినీతికి పాల్పడిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. విచారణ పేరుతో కాలాయాపన చేయడం తగదన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బుగ్గప్ప, వెంకటయ్య, శ్రీనివాస్, చంద్రయ్య, శ్రీనివాస్‌నాయక్, మల్కయ్య తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి మర్పల్లి: ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుకునే పేద విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని మర్పల్లి ఎంపీడీఓ రాజ్ మల్లయ్య సూచించారు. సోమవారం మండల పరిధిలోని పట్లూర్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారని వార్డెన్ తుల్జారామ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 30 మంది విద్యార్థులు ఉన్నారని బదులిచ్చారు. అనంతరం వసతి గృహంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఏవైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. -
సర్కార్ బడుల బలోపేతానికి కృషి
పూడూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కంకల్ ప్రభుత్వ పాఠశాలకు జిల్లా అధికార ప్రతినిధి కొండాల రవీందర్ రూ.30 వేలు వెచ్చించి సీసీ కెమెరాలను అందజేశారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. ఉన్న ఊరుకు, చదువుకున్న పాఠశాలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరప్ప 200 రకాల పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీశైలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణాచారి, నాయకులు మాణిక్యం, రవి, నర్సింలు, నవీన్, వెంకటేశ్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి -
మట్టి గణపతినే పూజిద్దాం
జిల్లా బీసీ సంక్షేమాధికారి ఉపేందర్ అనంతగిరి: కుమ్మరి కుల వృత్తుల వారిని ప్రోత్సహించడానికి, పర్యావరణాన్ని పరిక్షించడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మూలనకు మట్టి గణపతులనే పూజించాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి ఉపేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి గణపతి ప్రతిమలు కావాల్సిన వారు దిగువ తెలిపిన వారిని సంప్రదించాలని ఆయన కోరారు. కొడంగల్–అంజిలయ్య (93916 45200) తాండూర్–శ్రీశైలం (96405 18846), పరిగి–శంకర్ (96760 38986) వికారాబాద్–అంజిలయ్య (99664 66982)లో సంప్రదించాలన్నారు. పోతులవాగు కబ్జాదారులపై ఫిర్యాదు ధారూరు: మండల పరిధిలోని అల్లాపూర్ సమీపంలోని పోతులవాగును కబ్జా చేసిన వ్యక్తులపై ఇరిగేషన్ ఏఈ నీరజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నది కొంతే.. కొల్లగొట్టింది ఎంతో అనే శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. వికారాబాద్ ఇరిగేషన్ డీఈ రవికుమార్‌తో కలిసి కబ్జాదారులైన జయలింగారెడ్డి, రసూల్ఖాన్లపై తగిన చర్య తీసుకోవాలని ఆమె ఎస్ఐ అనితను కోరింది. పోతులవాగును కబ్జాచేసి మట్టి పోసి రాళ్లతో గోడ నిర్మించి ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి వాస్తవం మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా పోతులవాగును అరకిలోమీటర్ మేరకు కబ్జా చేసి తమ పొలంలోకి కలుపుకొన్నారని రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశం మేరకు నీటిపారుదలశాఖ అధికారులు పోతులవాగును, కోట్‌పల్లి ప్రాజెక్టు కుడి కాలువ రోడ్డును దున్నేసి కబ్జా చేసింది వాస్తమనని వారి పరిశీలనలో తేల్చారు. ప్రాథమిక విచారణ మేరకు ఇద్దరు వ్యక్తులు వాగును, కాల్వ రోడ్డును ఆక్రమించినట్లు గుర్తించారు. -
కబ్జాచెరలో జుంటివాగు
బషీరాబాద్: మండలంలోని కాశీంపూర్ శివారులో జుంటివాగు కబ్జాకు గురవుతోందని పలువురు రైతులు ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ కుటుంబం వాగు అంచున 17.13 ఎకరాల వ్యసాయ భూమి కొనుగోలు చేసింది. కొద్ది రోజులుగా వీరు సదరు భూమిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పొలానికి ఆనుకొని ఉన్న 200 మీటర్ల పొడవునా మట్టిపోశారు. ఈ ప్రాంతం బషీరాబాద్, యాలాల, తాండూరు మూడు మండలాలు కలిసే శివారులో ఉండటంతో అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. చెక్‌డ్యాంకు పక్కనే బఫర్ జోన్ కిందకు వచ్చే పొలంలో గదుల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం తాండూరు మండలం గోనూరు కాగ్నా నది నుంచి అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ విషయమై భూ యజమానిని అడగగా తాము పదేళ్ల క్రితం పట్టా భూములను కొనుగోలు చేశామని, ఇందులో కొంత భూమి వాగులో కలిసిందని, దీన్ని సాగులోకి తెచ్చుకునేందుకు చదును చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. ● పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ●● ఆందోళనలో పరిసర ప్రాంత రైతులు కఠిన చర్యలు తీసుకుంటాం జుంటివాగు శిఖం భూమి కబ్జా చేసినట్లు కొంతమంది రైతులు మా దృష్టికి తెచ్చారు. ఈ భూముల వివరాలు రెవెన్యూ శాఖ వద్ద ఉన్నాయి. వాగు రికార్డులు పరిశీలించి కబ్జా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నేను సెలవులో ఉన్నా.. రెండు రోజుల్లో చెక్‌డ్యాం, వాగు భూమిని సర్వే చేస్తాం. – కృష్ణయ్య, డీఈ, తాండూరు -
తప్పుల్లేకుండా ఓటరు జాబితా
యాలాల: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ లెవెల్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామ ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూడాలన్నారు. ఇందుకుగాను ఏదైనా సలహాలు, సూచనలు అవసరమైతే వెంటనే మండల స్థాయి అధికారులను సంప్రదించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటస్వామి, డీటీ కిరణ్‌కుమార్, ఆర్ఐలు వేణు, శివచరణ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
పుస్తక విజ్ఞానం.. మరింత విస్తృతం
బొంరాస్‌పేట: ‘పుస్తకం హస్త భూషణం’ అన్నారు విద్యావంతులైన పెద్దలు. ప్రచార, ప్రసార మాధ్య మాలు లేని కాలంలో పరిజ్ఞానాన్ని పంచిన పుస్తక ప్రపంచం మరుగున పడబోతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ తిరిగి లైబ్రరీలను బలోపేతం చేయడం, పునఃప్రారంభించడం, ప్రజాపఠనాలయాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టబోతోంది. జిల్లా వ్యాప్తంగా త్వరలో పుస్తక విజ్ఞానాన్ని విస్తృతం చేయబోతోంది. గ్రామీణ గ్రంథాలయాలివే.. జిల్లా వ్యాప్తంగా పుట్టపహాడ్, మరికల్, నవాబుపేటలో గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటి నిర్వహణ సంపూర్ణంగా జరగడానికి కృషిచేపట్టనున్నారు. పౌర పఠన మందిరాల నిర్వహణకు ప్రతినెలా దిన పత్రికలకు వెయ్యిరూపాయలు, నిర్వాహకుడికి గౌరవవేతనంగా వెయ్యి రూపాయ లు పంచాయతీల ద్వారా అందజేస్తున్నారు. మంజూరుకు సిద్ధంగా మండల పరిధిలోని రేగడిమైలారం, కొడంగల్ మండలం రుద్రారంలో విద్యావంతులు ఎక్కువ ఉన్న గ్రామాల్లో త్వరలో పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ నిర్వాహకులు 37 పోస్టులకుగానూ 10మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. నిర్వహణలోని ప్రజా పఠనాలయాలు దాదాపూర్, పీరంపల్లి, బార్వాడ్, కరన్‌కోట్, నవల్గా, నారాయణ్‌పూర్ గ్రామాల్లోని ప్రజా పఠనాలయాలు నిర్వహణలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను జిల్లా చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి, కార్యదర్శి సురేశ్‌బాబు పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన వాటిని పునఃప్రారంభించేందుకు కృషిచేస్తున్నామని చెబుతున్నారు. నవంబరు 14 నుంచి 20వరకు ఏటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి సాధారణంగా రోజువారీగా 250 మంది పాఠకులు వస్తున్నారు. పరిగిలో 70మంది, తాండూరులో 100, కొడంగల్ 40మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా నిత్యం పెద్ద సంఖ్యలో పాఠకులు గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు. లైబ్రరీల వివరాలు త్వరలో మరిన్ని పబ్లిక్ రీడింగ్ రూమ్స్ గ్రంథాలయాల పునఃప్రారంభానికి కసరత్తు మరో వారంలో ప్రారంభిస్తాం జిల్లా అక్షరాస్యులకు పఠనాసక్తిని పెంచాలని ప్రత్యేక కృషి చేస్తున్నాం. బసవాపూర్, రుద్రారం, రేగడిమైలారం, చౌడాపూర్, ముజాహిద్పూర్కు త్వరలోనే పబ్లిక్ రీడింగ్ రూమ్స్ మంజూరు కానున్నాయి. జీపీల పర్యవేక్షణలో కొనసాగే వీటి నిర్వహణకు రూ.2 వేలు ఖర్చు చేస్తారు. స్వయం సహాయక సంఘాల స్వచ్ఛందంగా ఆసక్తి చూపితే రూ.5 వేల వరకు అందించే అవకాశం ఉంది. – శేరి రాజేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వికారాబాద్ -
కరెంటు సమస్య తీర్చండి
ధారూరు: పొలాల్లో వేసిన ట్రాన్స్ఫార్మర్లు తరుచూ కాలిపోవడం, కొత్తగా అమర్చిన మోటార్లు నడవకపోవడంపై ధారూరు రైతులు సోమవారం శాసనసభ స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పదేపదే చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచి, కొత్త లైన్ వేయించాలని అభ్యర్థించారు. ఒకే లైన్లో 25 కేవీల రెండు మినీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. లోడ్ అధికం కావడంతో ఇవి తరచూ పాడవుతున్నాయని తెలిపారు. ఫలితంగా పంటలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని చెప్పారు. రెండు మినీ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 63 కేవీల ఒకే ట్రాన్స్ఫార్మర్ అమర్చాలని స్పీకర్‌కు విన్నవించారు. ప్రస్తుతం వరి సాగుకు నారు పోశామని, కరెంట్ మోటార్లు సరిగా నడవక నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన స్పీకర్ ట్రాన్స్‌కో ఎస్ఈకి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎక్కువ కెపాసిటీ కలిగిన కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కలిసిన రైతులు -
అధ్వాన రోడ్డు.. అవస్థలు చూడు
తాండూరు రూరల్: గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షానికి రహదారులన్నీ గుంతలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రిపూట గోతులు కనిపించకపోవడంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారులు మాత్రం పనులు ప్రారంభించడం లేదని తాండూరు మండలవాసులు ఆరోపిస్తున్నారు. కనీసం గుంతలను సైతం పూడ్చాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. పెద్ద గుంతలతో ఇబ్బంది మండలంలోని సంగెంకలాన్ గ్రామం తాండూరు పట్టణానికి 18 కిలో మీటర్లు దూరంలో ఉంది. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ప్రధానంగా గ్రామస్తులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంగెంకలాన్ నుంచి మల్కాపూర్ మీదుగా ప్రధానరోడ్డు తాండూరు–చించోళి మార్గం ద్వారా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మల్కాపూర్ గేటు నుంచి సంగెంకలాన్ గ్రామానికి 5 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఆ రహదారి పూర్తి గా ధ్వంసమైంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వినతిపత్రం అందజేత సంగెంకలాన్కు వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆ గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాళ్ల సంజీవ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్అండ్బీ కార్యాలయంలో ఏఈ శ్రవణ్‌కు వినతిపత్రం అందజేశారు. గుంతలమయమైన రోడ్డుతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. నిధులున్నా ప్రారంభం కాని పనులు ఇబ్బందులు పడుతున్న సంగెంకలాన్ గ్రామస్తులు త్వరగా పూర్తి చేయాలని బీజేపీ నేతల వినతి త్వరలో పనులు ప్రారంభం మల్కాపూర్ నుంచి సంగెంకలాన్ గ్రామానికి బీటీ రోడ్డు రెన్యూవల్‌కు ప్రభుత్వం రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎస్ఎస్ఆర్ కంపెనీ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. కాంట్రాక్టర్‌ను పిలిచి మాట్లాడాను. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తారు. – శ్రవణ్, ఏఈ, ఆర్అండ్బీ శాఖ, తాండూరు -
పని గంటలు తగ్గించాలి
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 282ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎన్టీఆర్ చౌరస్తాలో సీఐటీయూ ఽఆధ్వర్యంలో జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు కార్మిక సంఘాలు జూలై 9న సార్వత్రిక సమ్మెకు సిద్ధమైతే రేవంత్‌రెడ్డి సర్కార్ జీవోలు తీసుకురావడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ అడుగుజాడల్లో నడుస్తుందా అని మండిపడ్డారు. ఓవైపు పని గంటలు తగ్గించాలని ఉద్యమిస్తుంటే పనిగంటలు పెంచడం సరైంది కాదన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. పాశమైలారంలో జరిగిన దుర్ఘటన విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. కార్యక్రమంలో ఆశవర్కర్ల యూనియన్ నాయకులు మంగమ్మ, ఉమాదేవి, చంద్రకళ, మాణెమ్మ, సుజాత, బుచ్చిరెడ్డి, మల్లేశం, వెంకటయ్య, పద్మమ్మ, అరుణ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ -
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి మృతి
దౌల్తాబాద్: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవిగౌడ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మాయిపల్లికి చెందిన నర్సప్ప(48), భార్య లక్ష్మిపై గ్రామానికి చెందిన వైరివర్గం దాడి చేసింది. ఈ మేరకు దంపతులిద్దరూ ఘటన పై ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి బయట కూర్చున్నారు. ఛాతిలో నొప్పి వస్తోందని పడుకున్నాడు. భార్య ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలసుకున్న పోలీసులు మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలను పిలిచి మాట్లాడుదామనే లోపు ఈ ఘటన చోటు చేసుకుందని.. కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
అనంతగిరి: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాజు, అక్బర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నెలలుగా ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించడం తగదన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు నాయకులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు తేజ, జిల్లా నాయకులు పవన్, అభిషేక్, సిద్ధార్థ, కార్తీక్, బద్రీనాథ్, ఫైజల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు -
చండీయాగాన్ని జయప్రదం చేయండి
పరిగి: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నగరంలోని తుల్జాభావన్ ధర్మశాలలో నిర్వహించనున్న పంచకుండాత్మక చండీయాగం, కుబేరపాశుపత యాగాలను జయప్రదం చేయాలని దూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థచారి కోరారు. సోమవారం పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జిల్లా డీడీఎన్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14, 15, 16 తేదీల్లో డీడీఎన్ఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్చకులు నియమ నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలను సమర్పిస్తూ ప్రజలకు తీర్థప్రసాదాలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కల్యాణ్‌రావు, కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సభ్యులు శివానందం, అఖిలేష్, నటరాజేశ్వర్, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు జయతీర్థ చారి -
ఎనికేపల్లిలో ఉద్రిక్తత
● గోశాల పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య భూమిపూజ ● పరిహారం తేల్చకుండా ఎలా చేస్తారని చుట్టుముట్టిన రైతులు ● పనులు చేపట్టేందుకు వెళ్లిన జేసీబీని అడ్డుకున్న వైనం ● లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. ఇద్దరికి స్వల్ప గాయాలు మొయినాబాద్: గోశాలకు కేటాయించిన ఎనికేపల్లి భూముల వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం 7.30 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్‌కుమార్ భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. గోశాల ఏర్పాటుకోసం భూమి పూజ చేశారు. అంతలోనే రైతులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. పరిహారం విషయం తేల్చకుండా పనులు ఎలా మొదలు పెడతారని నిలదీశారు. పరిస్థితి చేజారి పోతుందని గమనించిన పోలీసులు వలయంగా ఏర్పడి ఎమ్మెల్యేను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. తప్పుదోవ పట్టించారు అధికారులు, పోలీసులు తమను తప్పుదోవ పట్టించారని రైతులు ఆరోపించారు. ఉదయం 8.30 గంటలకు ఎమ్మెల్యే వచ్చి తమతో మాట్లాడతారని అధికారులు సమాచారం ఇచ్చారని, కానీ 7.30 గంటలకే వచ్చి భూమి పూజ చేశారన్నారు. గ్రామం నుంచి భూముల వద్దకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే భూమి పూజ పూర్తయిన తరువాత పంపారన్నారు. లాఠీ ఝలిపించిన పోలీసులు ఎమ్మెల్యే యాదయ్య వెళ్లిపోయిన తరువాత రైతులు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో భూములను చదును చేసేందుకు జేసీబీ అక్కడికి రాగా రైతులంతా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలు ఝులిపించారు. లాఠీ దెబ్బలకు ఓ మహిళ చెయ్యికి గాయాలుకాగా, మరొకరికి వీపులో వాతలు వచ్చాయి. రైతులు రాత్రి వరకు అక్కడే బైఠాయించారు. ఖాళీ భూములు ఇవ్వాలిప్రభుత్వం ఏర్పాటు చేసే గోశాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్రత్నం అన్నారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. మండలంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, రైతులు సాగుచేసుకొనే భూములను తీసుకోవడం సరికాదన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డిని ఈ నెల 13న కలసి మాట్లాడటానికి సమయం తీసుకున్నారని.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌కు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు భీమేందర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రుణ ప్రణాళిక ఖరారు
● ఏటా పరిమితి పెంపు ● లక్ష్యం చేరుకోవడంలో విఫలం ● గతేడాది 60 శాతానికే పరిమితం ● తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్న రైతులు ● ఈ ఏడాది రుణ లక్ష్యంరూ. 8,525 కోట్లు వికారాబాద్: ఎట్టకేటకు బ్యాంకర్లు రెండు రోజుల క్రితం రుణ ప్రణాళిక విడుదల చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలు తదితర రంగాలకు ఆయా రంగాల ప్రాధాన్యత మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత రుణం ఇవ్వాలనే ప్రణాళికను కలెక్టర్‌కు నివేదించారు. గతేడాది పెట్టుకున్న లక్ష్యాలతో పాటు అందులో ఏయే రంగంలో ఎంతెంత రుణం ఇచ్చారనే విషయాలపై చర్చించారు. గత లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమైన బ్యాంకర్లు మళ్లీ అంతకు మించి లక్ష్యాలను సిద్ధం చేశారు. గతేడాదికి సంబంధించి 60 శాతం లక్ష్యాన్ని మ్రాతమే చేరుకున్నారు. లక్ష్యం చేరుకోవడంలో నిర్లక్ష్యం గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను లక్ష్యానికి మించి అందజేస్తున్న బ్యాంకర్లు పంట రుణాల విష యంలో మాత్రం విఫలమవుతున్నారు. జిల్లాలో 3.12 లక్షల మంది రైతులుండగా వీరిలో 1,86,107 మందికి ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. గతే డాది ఈ ఖాతాదారులకు రూ.3,547 కోట్లు వ్యవ సాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లు కలుపుకొని రూ.2,014 కోట్లు అనగా 60 శాతంలోపే రుణాలిచ్చారు. దీర్ఘ కాలిక రుణాల్లో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2025–26గాను రూ.8,525 కోట్ల లక్ష్యం వ్యవసాయ, అనుంబధ రంగాలు, ఇతర రంగాల ను కలుపుకొని 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2,69,593 మంది ఖాతాదారులకు రూ.8,525 కో ట్లు రుణాలివ్వాలని బ్యాంకర్లు లక్ష్యం పెట్టుకున్నా రు. పంటరుణాలు రూ.2582 కోట్లు, వ్యవసాయ, అనుంబంధ రుణాలు (వానాకాలం, యాసంగి) రూ.3,547 కోట్లు , సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఔత్సాహికులకు రూ.608 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.1,190 కోట్లు, అప్రధాన్యతా రంగాలకు చెందిన రూ.1,092 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ఫిర్యాదులను పరిష్కరించాలి
● కలెక్టర్ ప్రతీక్జైన్అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సో మవారం వికారాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయ న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయని.. వాటిని పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆకలి కేకలు!
● మైల్వార్ ప్రాథమిక పాఠశాలలో అందని మధ్యాహ్న భోజనం ● ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని నిర్వాహకుల నిరసన ● పస్తులతో అవస్థలు పడిన 150 మంది చిన్నారులు బషీరాబాద్: మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. మండల పరిధిలోని మైల్వార్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5 తరగతుల వరకు 150 మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు భువనేశ్వరీ, ప్రమీళ, సంగీత వీరికి నిత్యం మిడ్ డేమీల్స్ వండిపెట్టేవారు. బిల్లులు రావడం లేదని వంట చేయలేదు. సోమవారం మధ్యా హ్నం లంచ్ బెల్ కొట్టగానే విద్యార్థులు రోజూ మాదిరిగానే ప్లేట్లు పట్టుకుని బయటకు వచ్చారు. ఈ సమయంలో.. ‘బిల్లులు రావడం లేదని ఏజెన్సీ వాళ్లు వంట చేయలేదు. మీరంతా ఇళ్లకు వెళ్లి తిని రావాలి’ అని ఉపాధ్యాయులు చెప్పారు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న చిన్నారులు ఇళ్లకు పరుగులు తీశారు. కొంతమంది భోజనం చేసి రాగా, ఇళ్లకు తాళాలు వేసి పొలం పనులకు వెళ్లిన వారి పిల్లలు కడుపు మంటతోనే తిరిగొచ్చారు. సాయంత్రం వరకూ ఆకలితోనే అలమటించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. వంట వండటం లేదని ముందే చెబితే తాము టిఫిన్లు కట్టి పంపించే వాళ్లమని హెచ్ఎం వెంకటప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని తాను ఎంఈఓకు చెప్పగా ఏజెన్సీ వాళ్లకు నచ్చజెప్పాలని సూచించారని, నిర్వాహకులు మాత్రం వినలేదని తెలిపారు. -
ఫార్మా రైతులకు ప్లాట్లు
కందుకూరు: వంద శాతం హక్కులతో పారదర్శకంగా ప్రభుత్వం ఫార్మా రైతులకు ప్లాట్లను అందజేస్తోందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూ లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవు ట్లో సోమవారం కందుకూరు, యాచారం మండలాల భూ నిర్వాసితులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. మొదటి రోజు 60 గజాల లబ్ధిదారులు 670 మందికి ప్లాట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన లేఅవుట్లో ప్రభుత్వమే అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తుందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామన్నారు. రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే సబితారెడ్డి లాటరీ ప్రారంభానికి కంటే ముందే స్థానిక ఎమ్మె ల్యే సబితారెడ్డి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. తొందరపడి ఎవరూ ప్లాట్లు విక్రయించొద్దని, భవిష్యత్‌లో మంచి లాభం వస్తుందని సూచించారు. అంతకుముందు అక్కడ జరుగుతున్న ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు సంకల్పించిందని, దీంతో ఈ ప్రాంతం నాశనమయ్యేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉండేలా ఫ్యూచర్‌సిటీని ప్రకటించారన్నారు. రైతుల భూముల విలువలు మరింత పెరుగుతాయని, భవిష్యత్‌లో గజం ధర రూ.లక్ష పలుకుతుందన్నారు. పర్యవేక్షించిన అధికారులు మొదటి రోజు కుర్మిద్ద, మేడిపల్లి, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, నానక్‌నగర్, పంజగూడ, తాటిపర్తి రెవెన్యూ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 60 గజాల చొప్పున ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు. కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు ఎఫ్సీఏడీఏ కమిషనర్ శశాంక, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు తదితరులు లాటరీ ప్రక్రియను పర్యవేక్షించారు. లాటరీ ద్వారా కేటాయింపు షురూ మొదటి రోజు 60 గజాల లబ్ధిదారులకు.. ప్రక్రియను ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి -
డీహెచ్‌కు సెలవు!
● త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు? ● తాండూరు నర్సింగ్ కళాశాల భవనంలో కొడంగల్ మెడికల్ కాలేజీ ● ఇప్పటికే వర్చువల్‌గా పరిశీలించిన కేంద్ర బృందం తాండూరు: తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రి ఇక జనరల్ ఆస్పత్రిగా మారనుంది. ఇందుకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. నేడో.. రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వైద్యాధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. 23 ఏళ్లుగా తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఆధీనంలో ఉమ్మడి జిల్లాలో సేవలందించిన ఈ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్(డీఎంఏ) ఆధీనంలోకి వెళ్లనుంది. వీవీపీ వైద్యులు, సిబ్బంది రానున్న రోజుల్లో ఇతర ఆస్పత్రులకు వెళ్లే అవకాశాలున్నాయి. జనరల్ ఆసుపత్రిగా మారితే వైద్య సేవలు సక్రమంగా అందుతాయా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 200 పడకలకు అప్‌గ్రేడ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించిన తాండూరులో ఉమ్మడి జిల్లా ప్రభుత్వాస్పత్రి ఏర్పాటుకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 2002 ఆగస్టు 1న తాండూరులో జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రారంభించారు. వంద పడకలతో ప్రారంభించి రోగుల సంఖ్య పెరగడంతో 200 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ ప్రతీ రోజు 800 వరకు ఓపీతో పాటు 180 మంది వరకు ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందుతున్నాయి. బోర్డులు మార్చి అనుమతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొడంగల్ పట్టణ శివారులో కాలేజీ భవన నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి. కళాశాల ఏర్పాటుకు 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి తప్పనిసరి. కానీ కొడంగల్‌లో పీహెచ్సీ మాత్రమే ఉండడంతో అనుమతులు సాధ్యపడలేదు. దీంతో తాండూరు జిల్లా ఆస్పత్రి బోర్డు తొలగించి కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా బోర్డులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ప్రతిపక్షాలు బోర్డులు తొలగించి నిరసన వ్యక్తం చేశాయి. చురుగ్గా భవన నిర్మాణ పనులు తాండూరు శివారులో నర్సింగ్ కళాశాల భవనంలోనే కొడంగల్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి కొన్నాళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా ఆస్పత్రితో పాటు, ఎంసీహెచ్ ఆస్పత్రుల్లో 350 పడకలు అందుబాటులో ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభు త్వం నుంచి సులువుగా మెడికల్ కళాశాల అనుమతులు తీసుకురావొచ్చనే యోచనతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. నాలుగు రోజుల క్రితమే కేంద్ర బృందం మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులను వర్చువల్‌గా పరిశీలించింది. టీవీవీపీ ఉద్యోగుల్లో ఆందోళన ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఇతర జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు సమయంలో టీవీవీపీ ఆధీనంలో పని చేసిన వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో ఇక్కడ సైతం బదిలీలు తప్పవనే ఆందోళనలో ఉద్యోగులున్నారు. ఇక్కడి ఉద్యోగులను డీఎంఏ పరిధిలోకి విలీనం చేసి వైద్య సేవలను పొందాలనే డిమాండ్ సైతం పెరుగుతోంది. లేదా జిల్లా ప్రభుత్వ, జనరల్ ఆసుపత్రిలో నియమించే ఉద్యోగులను ఒకే గొడు గు కిందకు తీసుకురావాలని వైద్యులు, సిబ్బంది కోరుతున్నారు. తాండూరు జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలుఅదనపు వైద్య సేవలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఎంసీహెచ్‌లు డీఎంఏలోకి మారనున్నాయి. మరో వారం రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. జనరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయితే అదనపు వైద్య సేవలు అందుతాయి. రెండు ఆస్పత్రుల్లో 200 మంది వైద్యుల సేవలు అవసరం ఉంటుంది. – డాక్టర్ ఆనంద్, డీసీహెచ్ఎస్, వికారాబాద్ -
మంత్రికి శుభాకాంక్షలు
పరిగి: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఇటీవల కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మగారములు, గనుల శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్‌ను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సన్మానించారు. సోమవారం సచివాలయంలోని మంత్రి చాంబర్లో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడు స్పీకర్ పర్యటన మర్పల్లి: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మంగళవారం మర్పల్లికి విచ్చేయనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల సురేశ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. రేపు జాబ్ మేళా అనంతగిరి: టీంలీస్ సర్వీసెస్ లిమిటెడ్ (డి–మార్ట్ కోసం)లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10.30గంటలకు వికారాబాద్‌లోని ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్‌మేళాకు హాజరవ్వాలన్నారు. వివరాలకు 96760 47444 నంబర్లో సంప్రదించాలన్నారు. హౌసింగ్ డీఈఈ బదిలీ తాండూరు రూరల్: తాండూరు డివిజన్ హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్ను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు బదిలీ చేస్తూ సోమ వారం హౌసింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది నెలల క్రితం తాండూరుకు వచ్చిన ఆయన నియోజకవర్గంలోని పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండల పరిధిలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో తనదైన ముద్రవేశారు. ఆయన సేవలపై కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖలీమొద్దీన్ స్థానంలో కొడంగల్ డీఈ ఎం.చందర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిగి తహసీల్దార్‌గా వెంకటేశ్వరి పరిగి: పరిగి తహసీల్దార్‌గా వెంకటేశ్వరిని నియమిస్తూ సోమవారం రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆనంద్‌రావు అక్రమంగా భూ రిజిస్ట్రేషన్ చేశారని ప్రజా సంఘాల నాయకులు నిరసనలు తెలపడంతో ఉన్నతాధికారు లు ఆయన్ను ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం డి–సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరిని పరిగి తహసీల్దార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 13న కేఏఎన్‌పీఎస్ రాష్ట్ర మహాసభలు జిల్లా కన్వీనర్ వెంకటయ్య తాండూరు టౌన్: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రెండవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ వెంకటయ్య పిలుపు నిచ్చారు. ఈ మేరకు సోమవారం తాండూరులో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ‘వైరుధ్యాల జీవనం, నయా ఉదారవాద భారత దేశంలో ప్రజలస్వామ్యం, అభివృద్ధి, సామాజిక న్యాయం’అనే అంశంపై రిటైర్డ్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు ప్రసంగిస్తారన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలను రూపుమాపేందుకు కేఏఎన్‌పీఎస్ పోరాడుతుందన్నారు. వర్గీకరణలో ఎస్సీ ఉపకులాల వైపు నిలబడడంతో పాటు, రాజ్యాంగ విరుద్ధ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఈ పోరాటానికి మద్ధతు ఇస్తూ ఐక్యతను చాటేందుకు మహాసభలకు ప్రతీ ఒక్కరు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమితి జిల్లా కో కన్వీనర్ కిష్టప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.నరేశ్, ఎం.వెంకటయ్య, ఎం.శ్రీను పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. -
ప్రజారోగ్యంౖపై దృష్టి పెట్టాలి
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● డీఎంహెచ్ఓ లలితాదేవి ● పలు ఆస్పత్రుల సందర్శన కొడంగల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగాసందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. రోగులకు అందుబాటులో ఉంటూ సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రయాదవ్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్ ఫాతిమా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి దౌల్తాబాద్: ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అఽధికారి లలితాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. నెలలు నిండిన గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్‌యాదవ్, వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, పీహెచ్సీ వైద్యాధికారిణి అమూల్య ఉన్నారు. రోగులకు ఇబ్బంది కలగొద్దు దుద్యాల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని డీఎంహెచ్ఓ లలితాదేవి సూచించారు. శుక్రవారం మండలంలోని హకీంపే ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్ వివరాలుపరిశీలించారు. మెరుగైన వైద్యం మన బాధ్యత బొంరాస్‌పేట: రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని డీఎంహెచ్ఓ లలితాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆమె సందర్శించారు. వసతులపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీంద్రయాదవ్, మండల వైద్యాధికారి హేమంత్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి
మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి తాండూరు టౌన్: మున్సిపల్ కార్మికులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులు, సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు నిత్యం చెత్త సేకరణ, తరలింపు తదితర పనుల వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. తరచూ జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధుల బారిన పడుతుంటారని తెలిపారు. కార్మికులు ఎలాంటి అనారోగ్యం పాలైనా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా సిబ్బందితో పాటు, కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్, మెప్మా టీఎంసీ రాజేందర్, జవాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విరబూసిన బ్రహ్మ కమలాలు తాండూరు టౌన్: పట్టణంలోని ఓ వ్యాపారి ఇంట్లో బ్రహ్మ కమలాలు విరబూసాయి. ఏడాదికి ఒక్కసారి పూలు పూసే ఆ చెట్టుకు శుక్రవారం ఏకంగా ఏడు కమలాలు పూశాయి. పట్టణంలోని వాల్మీకి నగర్‌కు చెందిన వ్యాపారి పునీత్ కుమార్ ఇంట్లో ఈ అరుదైన విషయం చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు చెట్టు వద్ద పూజలు చేశారు. ఒకేసారి ఏడు పుష్పాలు పూయడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. నేడు బీఎల్ఓలకు శిక్షణ ధారూరు: మండలంలోని బూత్ లెవల్ ఆఫీసర్లకు శనివారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాస్టర్స్ ట్రైన ర్స్ బీఎల్ఓలకు శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సుధీర్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మండలంలోని బీఎల్ఓలు సకాలంలో హాజరు కావాలనీ ఆయన సూచించారు. జాతీయ రక్షణ నిధికి రూ.3లక్షల విరాళం తాండూరు/యాలాల: జాతీయ రక్షణ నిధికి ఆర్బీఓఎల్ తరఫున రూ.3 లక్షల విరాళం అందజేసినట్లు కంపెనీ సీఈఓ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖకు తమ కంపెనీ తరఫున ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతినెలా జాతీయ రక్షణ నిధికి తమ వంతు సాయం అందజేస్తామని ఆయన తెలిపారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ బొంరాస్‌పేట: చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. బొంరాస్‌పేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు. అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత స్థానానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్ శంకర్‌నాయక్, ప్రిన్సి పాల్ విజయ్‌కుమార్, ఎంఈఓ హరిలాల్, నాయ కులు నర్సింలుగౌడ్, రాంచంద్రారెడ్డి, అధ్యాపకులు దినేశ్, సురేశ్, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు. -
మత్తుకు బానిసలు కావొద్దు
కొడంగల్: తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. శుక్రవారం కొడంగల్‌లో సీఐ కార్యాలయానికి, కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి, గంజాయి చాక్లెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు తెస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. వ్యసనాలకు గురికావడం వల్ల కుటుంబాలు చెల్లాచెదురవుతాయని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. బొంరాస్‌పేటలో పోలీస్‌స్టేషన్ నూతన భవన నిర్మాణానికి రూ.2.96 కోట్లు, దుద్యాల్ పోలీస్‌స్టేషన్‌కు రూ.3 కోట్లు, కొడంగల్ సీఐ కార్యాలయానికి రూ.85 లక్షలు,కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు రూ.2.96 కోట్లు కేటాయించారు. అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మిస్తామని డీజీపీ తెలిపారు. భవనాలను త్వరగా నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీసులు డీజీపీకి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఐజీ తాీప్సీర్ ఎగ్బాల్, ఎస్పీ నారాయణరెడ్డి, హౌసింగ్ ఐజీ రమేష్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, తహసీల్దార్ విజయ్‌కుమార్, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యం డీజీపీ జితేందర్ -
బాధితులకు న్యాయం చేస్తాం
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోయే వారికి న్యా యం చేస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన పట్టణంలోని జాతర స్థలాన్ని సందర్శించారు. ఇండ్లు కోల్పోతున్న వారి కోసం జాతర స్థలంలో వెంచర్ చేస్తున్నారు. ఆ వెంచర్లో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటి స్థలాలను కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. విశాలమైన రోడ్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తాండూరు సబ్‌కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలి పరిగి: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించడం తోపాటు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం పరిగి పట్టణంలో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. పనుల వేగంపెంచి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ మున్సి పల్ పరిధిలోని 8వ వార్డులో ఇందిరమ్మ, బుడగ జంగం కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ -
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
కొడంగల్: బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన జాతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బీఎల్ఓలకు, సూపర్ వైజర్లకు ఒక్కరోజు శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫారం 6, 7, 8 నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటరు జాబితాలో అవసరమైతే పాత ఫొటోలను తొలగించి కొత్త ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. పేర్లలో తప్పులు ఉంటే సవరించాలని సూచించారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లను నమోదు చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చూడాలని ఆదేశించారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. పేరు మార్పుల కోసం ఫారం 8 వినియోగించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంఈఓ రాంరెడ్డి, మాస్టర్ ట్రైనర్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ -
ప్రత్యేక బస్సు ప్యాకేజీ
తాండూరు టౌన్: రానున్న గురుపౌర్ణమిని పురస్కరించుకుని గానుగాపూర్లోని దత్తాత్రేయ స్వామి దర్శనార్ధం వెళ్లనున్న భక్తుల కోసం తాండూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు ప్యాకేజీని తీసుకొచ్చినట్లు డిపో మేనేజర్ సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు తాండూరు బస్టాండ్ నుంచి బయలుదేరనున్న బస్సు కల్బుర్గిలోని శరణు బసవేశ్వర టెంపుల్ దర్శనానంతరం గానుగాపూర్‌కు చేరుకుంటుందన్నారు. 10వ తేదీన దత్తాత్రేయ స్వామి దర్శనానంతరం బయలుదేరి అదే రోజు సాయంత్రం 5గంటలకు తాండూరుకు చేరుకోనున్నట్లు తెలిపారు. స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుని వద్ద రూ.700 చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ముందస్తుగా తమ సీట్లను బస్ స్టేషన్‌కు వచ్చి బుక్ చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ల 9959226251, 9441717503, 830934 8157లో సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నేడు పీఎస్ భవనాలకు భూమిపూజ కొడంగల్: నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో శుక్రవారం పోలీస్ స్టేషన్ల నూతన భవన నిర్మాణాలకు భూమిపూజ చేయనున్నారు. కొడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంతో పాటు కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట మండల కేంద్రాల్లో నూతన భవనాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కొడంగల్‌లోని పాత పోలీస్‌స్టేషన్ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. గురువా రం మార్కింగ్ వేయించారు. భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. సర్కారు వారి చేతి సంచులు! బొంరాస్‌పేట: రేషన్ కార్డుదారులకు ప్రభు త్వం త్వరలో చేతి బస్తాలు (క్యారీ బ్యాగులు) అందించనుంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతీ కార్డుదారునికి ఒక్కో బ్యాగు చొప్పున ఇస్తారు. ఆరు గ్యారంటీల లోగో, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల ఫొటోలతో ఉన్న ఈ హ్యాండ్ బ్యాగులు ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరాయి. వారం రోజుల్లో వీటిని రేషన్ దుకాణాలకు పంపిస్తారు. -
సర్వం లీకేజీలమయం
తాండూరు: మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణ పరిధిలో 36 వార్డుల్లో 14,706 గృహాలు, 85వేల జనాభా ఉంది. వీరికి రోజుకు 12 ఎంఎల్డీ నీరు అవసరం కాగా 9 ఎంఎల్డీల నీటి మాత్రమే సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ ప్రజల తాగునీటి అవసరాలను మిషన్ భగీరథ, కృష్ణా జలాలు, కాగ్నానది వద్ద గల రెండు పంప్‌హౌస్ తీరుస్తున్నాయి. పట్టణ పరిధిలో 14,706 ఇళ్లు ఉండగా 7,158 ఇళ్లకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరో రెండు వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినా ఇప్పటి వరకు సరఫరా చేయడం లేదు. 10 వాటర్ ట్యాంక్‌ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఆరేళ్ల క్రితం తాండూరు మున్సిపాలిటీలో ఎన్టీఆర్ కాలనీ, రాజీవ్ కాలనీ, రసూల్‌పూర, కోకట్ రోడ్డు, గౌతాపూర్ శివారు ప్రాంతాలు కలిశాయి. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంది లేదు. వాటర్ ట్యాంక్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇళ్లకు పైప్‌లైన్ వేసి ట్యాప్‌లు బిగించలేదు. దీంతో ట్యాంక్ అలంకార ప్రాయంగా దర్శనమిస్తోంది. 325 వరకు బోరు మోటార్లు, పంపులు ఉన్నా సగానికి పైగా కబ్జా చేసి వాడుకుంటున్నారు. 122 చేతిపంపులు ఉండగా కొన్ని మరమ్మతులకు నోచుకోవడం లేదు. పట్టణ ప్రజల దాహార్తి తీరుస్తున్న కాగ్నా నదిలోని పంప్‌హౌస్‌లు పాడయ్యే స్థితికి చేరాయి. పాత తాండూరులోని పంప్ హౌస్ పైప్‌లైన్‌కు లీకేజీలు ఏర్పడి నీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు వృథాగా పోతోంది. -
జలం.. కలుషితం
తాగునీటి అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజల దాహం మాత్రం తీరడం లేదు. మిషన్ భగీరథ, వాటర్ ట్యాంకులు, బోరు బావులు, నల్లా కనెక్షన్లు ఎన్ని ఉన్నా నిత్యం తాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు. ● గాడిన పడని తాగునీటి సరఫరా ● వర్షాలు పడుతున్నామెరుగుపడని పరిస్థితి ● ప్రజల దాహం తీర్చని ‘భగీరథ’ ● ప్రైవేటులో కొనుగోలు చేస్తున్న జనం ● పట్టించుకోని అధికార యంత్రాంగం వికారాబాద్: మున్సిపల్ పరిధిలో రోజు తప్పించి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. లీకేజీల కారణంగా తాగునీరు కలుషితం అవుతుండటంతో 90శాతం ప్రజలు ఆ నీళ్లు తాగడంలేదు. దాదాపు 90శాతం అవసరాలకు మిషన్ భగీరథ పథకంతీరుస్తోంది. మిగతా లోటును బోరు బావులు, హ్యాండ్ పంపుల ద్వారా పూడుస్తున్నారు. పలుచోట్ల తరచూ పైప్లైన్లు లీకేజీలు అవుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చినా తక్షణం స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం పైప్‌లైన్‌కు అమర్చిన ట్యాప్‌లు, మీటర్లను చాలా వరకు ప్రజలు తొలగించారు. దీంతో తాగునీరు వృథాగా పోతోంది. అంతేకాకుండా నల్లాల వద్ద నిలిచి నీటి సరఫరా ఆగిపోయిన తర్వా త పైపుల్లోకి చేరి కలుషితమవుతున్నాయి. మరుసటి రోజు వండ్రు నీరు వస్తోంది. దీంతో ఆ నీటిని ప్రజలు తాగడం లేదు. చాలా మంది బుబుల్స్ కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. 10,600 నల్లా కనెక్షన్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం 16,000 ఆవాసాలు ఉండగా 70 వేల జనాభా నివసిస్తున్నారు. వీరికి మిషన్ భగీరథ నామ్స్ ప్రకారం రోజుకు ఒకరికి 100 లీటర్ల చొప్పున సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన మున్సిపాలిటీకి రోజుకు 7 ఎంఎల్డీ (మిలియల్ లీటర్ ఫర్డే) నీళ్లు అవసరం. ప్రస్తుతం రోజు తప్పించి రోజు సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద 14 ఎంఎల్డీ వాటర్ సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 10.4 ఎంఎల్డీ సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో 198 బోరు బావులు, 56 చేతిపంపులు ఉన్నాయి. నల్లాలు లేని చోట వాటిని వినియోగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా భూగర్భ జలాలు పెరగలేదు. ఇది ప్రజల తాగునీటి అవసరాలపై ప్రభావం చూపుతోంది. పైప్‌లైన్ లీకేజీలతో సతమతంవికారాబాద్ మున్సిపల్ జనాభా 70 వేలు మొత్తం నివాసాలు 16వేలు నల్లా కనెక్షన్లు 10,600 రోజుకు అవసరమైన తాగునీరు 14 ఎంఎల్డీ సరఫరా అవుతున్నది 10.4 ఎంఎల్డీ -
చురుగ్గా బ్రిడ్జి నిర్మాణ పనులు
తాండూరు: పట్టణ పరిధిలోని తాండూరు – కొడంగల్ మార్గంలో చిలుక వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిలువ వాగు ప్రక్షాళణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల క్రితం దాదాపు రూ.16 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి పునర్మిర్మాణ పనులు చేపట్టారు. వర్షాలు పడేలోపు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశించడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి పనులు 70శాతం మేర పూర్తయ్యాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే మార్కెండేయ కాలనీ, టీచర్స్ కాలనీ, ఆదర్శనగర్, తులసీ నగర్, సాయిపూర్ కాలనీకు మేలు చేకూరుతుంది. అంతేకాకుండా వాహనాల రాకపోకలకు సులభతరం అవుతుంది. మరో వారం రోజుల వ్యవధిలో బ్రిడ్జి పైనుంచి రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయి వర్షాలు పడకముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సర్ధార్‌నగర్‌ను సందర్శించిన తమిళనాడు బృందం
షాబాద్: మండలంలోని సర్ధార్‌నగర్ గ్రామాన్ని తమిళనాడు బృందం గురువారం సందర్శించింది. గ్రామ పరిపాలన, పౌరసేవలు, వివిధ పథకాల అమలు బాగుందని కితాబిచ్చింది. ఎంసీఆర్హెచ్ఆర్డీ ద్వారా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్శిక్షణ బృందం అనిల్‌కుమార్, వెంకటరమణ తమిళనాడు సర్పంచులు, బ్లాక్ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల బృందంతో కలిసి గ్రామంలో సౌకర్యాలు, వనరులు, అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. పంచాయతీ భవనం, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు.