బీజేపీ జాతీయ నాయకురాలు బంగారు శృతి
బీజేపీతోనే పట్టణ అభివృద్ధి
అనంతగిరి: బీజేపీతోనే పట్టణాల అభివృద్ది సాధ్యమని బీజేపీ జాతీయ నాయకురాలు, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి బంగారు శృతి అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్ మున్సిపాలిటీల్లో 26 వార్డుల్లో బరిలో నిలిచామని చెప్పారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మున్సిపల్ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులతోనే పట్టణాల అభివృద్ధి కొనసాగుతోందని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించిందన్నారు. వికారాబాద్ మున్సిపల్‌ను బీజేపీ కై వసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కో కన్వీనర్ నల్లకుంట కార్పొరేటర్ అమృత, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర నాయకులు శివరాజు, వడ్లనందు, శ్రీధర్‌రెడ్డి, నవీన్‌కుమార్, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, రాజేందర్‌రెడ్డి, సుచరితారెడ్డి, కేపీ రాజు, నందు, రాచ శ్రీనివాస్‌రెడ్డి, బస్వలింగం తదితరులు పాల్గొన్నారు.


