తండ్రి బాటలో రామ్ చరణ్.. మాట నిలబెట్టుకున్న గ్లోబల్ స్టార్ | Ram Charan To Provide Free Health Insurance To Around 500 Members Of Tollywood Dancers Association | Sakshi
Sakshi News home page

Ram Charan: తండ్రి బాటలో రామ్ చరణ్.. మాట నిలబెట్టుకున్న గ్లోబల్ స్టార్

Feb 1 2026 8:50 AM | Updated on Feb 1 2026 10:05 AM

Ram Charan helps To health insurance to tollywood dancers association

మెగా ఫ్యామిలీ ఇంట సంబురం నెలకొంది. మెగా కోడలు ఉపాసనకు కవలలు జన్మించారు. అర్ధరాత్రి ఉపాసన ఓ బిడ్డ, పాపకు జన్మనిచ్చింది.  దీంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా.. ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసనకు ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురి క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్....

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించి చేసిన ప్రతిపాదనను తాజాగా  ఆమోదించారు. సినిమా షూటింగ్‌లలో ఎంతో శ్రమించే డ్యాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రామ్ చరణ్ ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు.

ఈ పథకం ద్వారా ప్రతి డ్యాన్సర్ కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా అందనుంది. ఇందుకోసం ఆయన సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను  రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తన భార్య ఉపాసనతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సినీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై డ్యాన్సర్ సంఘాలు, పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం 500 కుటుంబాలకు వైద్యపరమైన భరోసా లభించనుంది.

కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ స్పోర్ట్స్‌ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement