సంచలన ఆరోపణలు : ట్రంప్‌నకు భారీ షాక్‌ | Cannot Support Iran War In Good Conscience Top Trump Official Resigns | Sakshi
Sakshi News home page

సంచలన ఆరోపణలు : ట్రంప్‌నకు భారీ షాక్‌

Mar 17 2026 8:14 PM | Updated on Mar 17 2026 8:45 PM

Cannot Support Iran War In Good Conscience Top Trump Official Resigns

ఇరాన్‌పై యుద్దం గత 18 రోజులుగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలింది. అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (NCTC) అధిపతి జోసెఫ్ కెంట్, ఇరాన్-అమెరికా యుద్ధానికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. మనస్సాక్షిని చంపుకొని ఇరాన్‌పై వార్‌కు మద్దతుగా నిలవలేను అంటూ లేఖ రాయడం సంచలనం రేపింది. యుద్ధం జరుగుతున్న తరుణంలో అత్యున్నత స్థాయి భద్రతా అధికారి  కీలక ఆరోపణలు చేస్తూ తప్పుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశ మైంది.

ఇరాన్వల్ల అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ట్రంప్ యుద్ధం ప్రారంభించారని కెంట్ తన లేఖలో పేర్కొన్నారు. "నా అంతరాత్మ సాక్షిగా ఈ యుద్ధానికి నేను మద్దతు ఇవ్వలేను" అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఒక పథకం ప్రకారం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ఇరాన్ వల్ల ముప్పు ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ను నమ్మించారని ఆయన విమర్శించారు. ఇరాన్‌పై దాడి చేస్తే విజయం త్వరగా లభిస్తుందని ట్రంప్‌ను కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు తప్పుదోవ పట్టించారని ఆయన లేఖలో రాశారు. మధ్యప్రాచ్యంలోని యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయని ట్రంప్‌కు గత జూన్ నాటికే  తెలుసని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్‌ సుప్రీం

కాగా అతివాద మితవాద వ్యక్తులతో, కుట్ర సిద్ధాంతాలతో గతంలో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ, కెంట్‌ నియామకాన్ని డెమోక్రాట్లు  తీవ్రంగా వ్యతిరేకించారు. 2022 కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సమయంలో, కెంట్ 'ప్రౌడ్ బాయ్స్' అనే అతివాద మితవాద సైనిక బృందంలో సభ్యుడైన గ్రాహం జోర్గెన్‌సన్‌కు కన్సల్టింగ్ పని కోసం డబ్బు చెల్లించారని ఆరోపణలెదుర్కొన్నారు. అయినప్పటికీ, గత ఏడాది జూలైలో 52-44 ఓట్ల తేడాతో ఆయన పదవిలో నియమితులయ్యారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ దాడి వెనుక ఫెడరల్ ఏజెంట్ల హస్తం ఉందనే కుట్ర సిద్ధాంతాలను, అలాగే 2020 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారనే తప్పుడు వాదనలను కూడా కెంట్ గతంలో సమర్థించారు.
ఇదీ  చదవండి: బంగారం, డాలర్‌ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement