breaking news
iran israel war
-
భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్..
ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతుల్లో భాగస్వామ్యం ఉన్నాయన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. మొత్తం సుమారు 119 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా) విలువైన ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా ఈ ఆంక్షలు అమెరికా ప్రకటించింది.ఆంక్షలు విధించిన కంపెనీలు ఇవే.. PP Softtech Private Limited, Sadashiva Overseas Limited, Prakrutees Infra Impex India Private Limited, Portease Partners LLP కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.ఇక, వీటిలో మొదటి మూడు సంస్థలు ఇరాన్ మూలం కలిగిన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని అమెరికా ఆరోపించింది. నాలుగో సంస్థ అయిన Portease Partners ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల పలు షిప్మెంట్లను భారత్‌కు తీసుకురావడంలో కస్టమ్స్ బ్రోకర్‌గా సహకరించిందని పేర్కొంది. 2023 మే నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. ఈ మూడు సంస్థలకు సంబంధించి అమెరికా పేర్కొన్న దిగుమతుల విలువే దాదాపు 119 మిలియన్ డాలర్లు. Portease Partners ద్వారా నిర్వహించబడిన షిప్మెంట్ల విలువను ఇందులో చేర్చలేదు.ముగ్గురు భారతీయులపైనా ఆంక్షలుఇదిలా ఉండగా.. కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయులపై కూడా అమెరికా చర్యలు తీసుకుంది. PP Softtech డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్‌తో పాటు Portease Partners భాగస్వాములు ఇంద్రిస్మియా అషరఫ్మియా షేఖ్, హరీశ్ రామచంద్ర రంగిలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. అయితే, అమెరికా ఆంక్షలు కేవలం నాలుగు భారత కంపెనీలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్ ఆదాయ మార్గాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరుతో విస్తృత ఆంక్షల కార్యక్రమాన్ని వాషింగ్టన్ ప్రారంభించింది. దాదాపు 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై తాజాగా చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా, హాంకాంగ్‌కు చెందిన పలు సంస్థలు, వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఇది కూడా చదవండి: అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్ఈ నేపథ్యంలో ఆంక్షల విధింపుపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వ ఆర్థిక సంబంధాలపై ఒత్తిడిని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే సంస్థలు కూడా భవిష్యత్తులో అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. అమెరికా ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాజా చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించే ప్రయత్నమని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనిజాదెహ్ స్పందిస్తూ.. తమ దేశం ఈ ఆంక్షలను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందుకోసం రెండేళ్ల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.భారత్‌పై ప్రభావం?ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి భారత కంపెనీలపై అమెరికా వరుసగా చర్యలు తీసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఇరాన్‌తో చమురు సంబంధాల ఆరోపణలపై భారత సంస్థలు, వ్యక్తులను అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా చర్యలతో ఇరాన్‌తో వాణిజ్యం చేసే భారతీయ సంస్థలపై అమెరికా నిఘా మరింత కఠినమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
‘పాక్’ అసిమ్ మునీర్‌కి ట్రంప్ ఫోన్.. ఇరాన్ వెళ్లిన మునీర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో మాట్లాడినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్‌తో చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, పాకిస్థాన్ తనకున్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్‌ను మళ్లీ అమెరికాతో చర్చల టేబుల్ వద్దకు తీసుకురావాలని ట్రంప్ కోరినట్లు పాకిస్థాన్‌కు చెందిన 3 వర్గాలు తెలిపాయి.ట్రంప్ ప్రారంభించిన ఈ ఫోన్ సంభాషణ మునీర్ ఇరాన్ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరిగింది. అయితే ఆ సంభాషణలోని పూర్తి వివరాలు బయటకు రాలేదు. వైట్‌హౌస్ కూడా దీనిపై స్పందించలేదు.ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మునీర్ సోమవారం టెహ్రాన్ చేరుకున్నారు. ఆయనతో పాటు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా వెళ్లారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పర్యటన లక్ష్యమని పాకిస్థాన్ సైన్యం తెలిపింది.ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకునే చర్యలకు దిగుతామని హెచ్చరిస్తుండగా, ఇరాన్‌కు ఆర్థికంగా సహకరించే దేశాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించింది. గతంలోనూ పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య చర్చలకు సహకరించి జూన్‌లో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంలో పాత్ర పోషించింది. అయితే ఆ ఒప్పందం తర్వాత విఫలమైంది.ఇరాన్-అమెరికా మధ్య చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ట్రంప్ కోరుతున్నారు. అందుకోసం ఇరాన్‌పై ప్రభావం ఉన్న పాకిస్థాన్‌ను రంగంలోకి దించి, అసిమ్ మునీర్ ద్వారా టెహ్రాన్‌ను చర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. -
హర్ముజ్ విషయంలో మరో బాంబు పేల్చిన ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై పన్ను విధించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్‌కు సంబంధించిన మీడియా కథనాలు ఈ కీలక విషయాలు వెల్లడించాయి.ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. "హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఉన్న దేశాల ఓడల నుండి సముద్రయాన సేవలకు రుసుము వసూలు చేయబడుతుంది రుసుములకు బదులుగా సముద్ర సేవలు, భద్రత మరియు బీమా వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.పర్యావరణ సేవలు మరియు, ప్రత్యేక పరిస్థితులలో, ఇంధనం కూడా అందించబడతాయి. చెల్లింపు ఇరానియన్ రియాల్స్‌లో లేదా ఇరాన్ ఎంచుకున్న ఏదైనా ఇతర కరెన్సీలో చేయబడుతుంది". అని తెలిపాయి.కాగా ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. అమెరికా ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపింది.ఇరాన్‌పై ఆర్థిక యుద్ధంఇరాన్పై ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న ఆర్థిక యుద్ధం ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించిందని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సాంట్ అన్నారు. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులను నిలిపివేయడమే అమెరికా లక్ష్యమని బెస్సాంట్ తెలిపారు. ఇరాన్‌పై ఒత్తిడిని పెంచడానికి అమెరికా తన ప్రభుత్వ సంస్థలన్నింటినీ, అధికారాలన్నింటినీ వినియోగిస్తుందని బెస్సెంట్ చెప్పారు. దీనిని ఒక శత్రువుపై చేపట్టే అతిపెద్ద ఆర్థిక చర్యగా ట్రంప్ గతంలో అభివర్ణించారు మరియు ఇరాన్‌ను ఏకాకిని చేయడంలో పాలు పంచుకోవాలని ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు.గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఆర్థిక కఠిన చర్యలకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడంలో అమెరికాకు మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా శత్రువుగా పరిగణిస్తామని ఇరాన్ కొత్త జాతీయ భద్రతా అధిపతి మొహ్సెన్ రెజాయీ అన్నారు.కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య హర్ముజ్ అంశంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ కీలకమైన జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా యత్నిస్తుంది. ఇప్పుడు ఇరాన్ దానికి టోల్ టాక్స్ వసూలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఇరాన్‌పై ట్రంప్ కొత్త గేమ్.. మద్దతుదారులకు మూడినట్లే!
ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు అమెరికా ఇక నేరుగా రంగంలోకి దిగింది! టెహ్రాన్‌ను మాత్రమే కాదు.. దానికి అండగా నిలిచే దేశాలు, సంస్థలను కూడా టార్గెట్ చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్‌కు డబ్బు అందించినా.. వ్యాపారం చేసినా.. చమురు తరలింపులో సహకరించినా భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఇరాన్‌ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరుచేసేలా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో టెహ్రాన్‌కు అండగా నిలిచే దేశాలపై కూడా అమెరికా ఆంక్షల పిడుగు పడబోతోందా? అన్న ఉత్కంఠ మొదలైంది.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్టులో.. ఇరాన్‌కు ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థలు ఎలాంటి సహాయం చేసినా ఆయా దేశాలు “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇరాన్‌కు సహాయం చేసే మార్గాలపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, ఆర్థిక స్వాప్ ఒప్పందాలు, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, నౌకల రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా టెహ్రాన్‌కు మద్దతు ఇచ్చినా అమెరికా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. అంటే ఇరాన్‌తో నేరుగా వ్యాపారం చేసే సంస్థలతో పాటు పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక చేయూత అందించే వ్యవస్థలపైనా అమెరికా కన్నేయనుంది.ఇరాన్‌తో ఒప్పందం చేసుకునేందుకు తన ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ టెహ్రాన్ వాటిని ఉపయోగించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఇరాన్‌పై అపూర్వ స్థాయిలో ఆర్థిక యుద్ధం, అంతర్జాతీయ ఒంటరితనం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అమెరికా మిత్రదేశాలు కూడా ఈ చర్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ అన్నారు. ఆ దేశ నౌకాదళం ధ్వంసమైందని, వైమానిక దళం బలహీనపడిందని, సైనిక కర్మాగారాలు భారీగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్న ఆయన.. కొత్త చర్యలతో టెహ్రాన్ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం మరింత తగ్గిపోతుందని అన్నారు.ఇరాన్ అణు కార్యక్రమంపైనా ట్రంప్ మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు” అంటూ తన పరిపాలన వైఖరిని పునరుద్ఘాటించారు. ట్రంప్ తాజా హెచ్చరికతో ఇప్పుడు అసలు ప్రశ్న ఇరాన్ గురించే కాదు.. ఇరాన్‌కు అండగా నిలిచే దేశాల సంగతేంటి? అన్నదే. టెహ్రాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా చర్యలు మొదలుపెడితే అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. దీంతో ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న ట్రంప్ వ్యూహం.. ఇప్పుడు ఆ దేశానికి మద్దతిచ్చే వారిని కూడా చుట్టుముట్టే స్థాయికి చేరిందా? అన్న చర్చ మొదలైంది. -
పశ్చిమాసియానే కాదు యూరప్‌లోనూ దాడులకు ఇరాన్ భారీ స్కెచ్?
టెహ్రాన్: ఇప్పటివరకు పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతానికే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు.. ఇప్పుడు క్రమంగా యూరప్ (ఐరోపా) దేశాలకు విస్తరిస్తూ అంతర్జాతీయ యుద్ధ మేఘాలను అలుముకునేలా చేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తాము క్రమంగా పట్టు కోల్పోతున్నామనే నివేదికలు ఇరాన్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇదే తరుణంలో, హర్మూజ్ జలసంధి తమదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ఒక కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం ఇరాన్ ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది.ఈ పరిణామాలే ఇరాన్‌ను రక్షణాత్మక వైఖరి వీడి, యూరప్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై పూర్తి స్థాయి దాడికి యోచించేలా చేశాయంటూ ‘ఫైనాన్షియల్ టైమ్స్’సంచలన నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో డ్రోన్ దాడికి గురైన సైప్రస్‌లోని బ్రిటిష్ వైమానిక స్థావరం కూడా ఇరాన్ దాడి చేసే లక్ష్యాల జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో బ్రిటిష్ సైనిక స్థావరంపై జరిగిన మొదటి దాడి ఇదే కావడంతో, ఇది అప్పట్లోనే ఇరు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రతరం కావడానికి నాంది పలికింది.అలాగే, గత నెలలో తన ‘బెజ్మర్ వైమానిక స్థావరం’ నుండి అమెరికాకు చెందిన 8 బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానాలకు, 250 మంది సైనిక సిబ్బందికి ఆశ్రయమిచ్చి, వారు పనిచేసేందుకు అనుమతించిన ఆగ్నేయ ఐరోపా దేశమైన బల్గేరియాను కూడా ఇరాన్ తన ప్రతీకార లక్ష్యంగా గుర్తించినట్లు ఈ నివేదిక పేర్కొంది.అమెరికాతో శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోవడంతో.. ఇరాన్ తన రక్షణాత్మక వైఖరిని వీడి పూర్తిగా దాడి చేసే సైనిక వ్యూహానికి మారాలని నిర్ణయించుకుందని సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ సుదీర్ఘ సంఘర్షణకు శాశ్వత ముగింపు పలకడానికి, అలాగే హర్మూజ్ జలసంధి నియంత్రణపై ఉన్న వివాదాలను పరిష్కరించడానికి జరుగుతున్న చర్చలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో ఇరాన్ ఈ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. -
"మా దారికి అడ్డొస్తే బాంబులతో లేపేస్తా"
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒమన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధంలో ఒమన్ గనుక తలదూర్చితే వారిపై తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు జరిగే ఈ అత్యంత కీలకమైన జలసంధిని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్‌తో కలిసి ఒమన్ దేశం ఒక ఒప్పందానికి వస్తోందని, ఆ జలసంధి నిర్వహణ లేదా టోల్స్ వసూలు బాధ్యతలను ఇరాన్‌తో కలిసి పంచుకుంటుందనే ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ ఆ దేశంపై రెచ్చిపోయారు.ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ వెంటనే లొంగిపోవాలి, శ్వేత పతాకాన్ని ఎగరవేయాలి.ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను కలిగి ఉండకూడదు. అదే అమెరికా ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఈ అంశంలో ఒమన్ కనుక మా దారికి అడ్డువస్తే, వారిపై తీవ్రమైన దాడులు చేస్తాం" అని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్ దౌత్యవేత్తలతో ఒమన్ అధికారులు ఇటీవల చర్చలు జరుపుతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు.కాగా అమెరికా, ఇరాన్ మధ్య (జూన్ 17న) 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిని తెరవడం, శాంతి చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఈ 60 రోజుల గడువు ముగిసే సమయానికి ఇరు దేశాల మధ్య భద్రతా హామీలు, నౌకా ప్రయాణ స్వేచ్ఛ వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళన పెంచుతున్నాయి. -
యుద్ధాలను వదలని ఫేక్ కోట్
-
ఇరాన్ కొత్త వార్ ప్లాన్.. అమెరికా సైనికుడి ప్రాణానికి భారీ బౌంటీ!
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికుడిని హతమార్చినా, సజీవంగా పట్టుకుని అప్పగించినా 30 వేల డాలర్ల నజరానా అందిస్తామని ప్రకటించింది. ఈ చర్యకు పాల్పడేది మహిళ అయితే రివార్డును రెట్టింపు చేసి 60 వేల డాలర్లు ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది.ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ నజరానా పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. అమెరికాపై పోరాటానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు ఐఆర్ఎన్ఏ కథనాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే అమెరికా సైనికులను ఎక్కడ, ఎప్పుడు పట్టుకోవాలనే విషయంపై ఎలాంటి వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.హార్మూజ్ ప్రతిష్ఠంభన వేళ..హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాతో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో అమెరికా బలగాల పెద్దఎత్తున మోహరింపు లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్‌లో కూలిపోయిన అమెరికా యుద్ధ విమాన పైలట్‌ను రక్షించేందుకు చేపట్టిన చర్య మినహా ఇరాన్లో అమెరికా బలగాల ప్రత్యక్ష మోహరింపునకు సంబంధించిన ఘటనలు పరిమితంగానే ఉన్నట్లు సమాచారం.ట్రంప్‌పైనా గతంలో ముప్పు?ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా ఇరాన్ వైపు నుంచి గతంలో హత్యా ముప్పులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లపై కూడా అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా అమెరికా సైనికులపై నేరుగా నజరానా ప్రకటించడం.. ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో ఉన్న అమెరికా-ఇరాన్ సంబంధాలను మరింత ప్రమాదకర దిశలోకి తీసుకెళ్లే పరిణామంగా మారింది. -
అలా చేస్తేనే.. దారి తెరుస్తాం.. ట్రంప్‌కు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్నది ఇరాన్ నిర్ణయమేనని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటమి వాస్తవాన్ని అంగీకరించండి.. ఊహల్లో విహరించడం ఆపండి. అప్పటివరకు ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తుంది అంటూ హెచ్చరించారు. కేవలం ఆదేశాలు ఇవ్వడం, ట్వీట్ చేయడం లేదా యుద్ధనౌకలను మోహరించడం ద్వారా జలసంధిపై నియంత్రణ సాధించలేరని అమెరికాకు కౌంటరిచ్చారు.మరోవైపు, ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో రాకపోకలు భారీగా పడిపోయాయి. శుక్రవారం కేవలం రెండు నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ Kpler విశ్లేషణ తెలిపింది. వాటిలో ముడి చమురు రవాణా కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు 130కి పైగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి. జలసంధి మూసివేత కొనసాగితే చమురు, ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రజలు భరించాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చెప్పడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవసరమైతే ఆ దేశంపై ఆర్థికంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఒకవైపు హార్ముజ్‌పై ఇరాన్ పట్టు.. మరోవైపు దాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటున్న ట్రంప్.. ఈ ప్రతిష్ఠంభన ఎటు దారితీస్తుందన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆందోళన.చర్చలకు నో ఛాన్స్?ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కూడా ముందుకు కదలడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి.. అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి అధికారిక శాంతి చర్చలు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. -
ఇరాన్‌కు ఖతార్ స్ట్రాంగ్ కౌంటర్.. ముగ్గురు పైలట్లపై బిగ్ సస్పెన్స్!
గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఇరాన్-ఖతార్ మధ్య పైలట్ల వివాదం తెరపైకి వచ్చింది. ముగ్గురు ఇరాన్ యుద్ధ విమాన పైలట్లను ఖతార్ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని ఇరాన్ వర్గాలు ప్రకటించగా ఖతార్ మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA కథనం ప్రకారం, మార్చిలో ఖతార్‌లోని ఒక సైనిక స్థావరంపై దాడి చేసే మిషన్‌లో పాల్గొన్న మూడు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. వాటిలోని పైలట్లు విమానాల నుంచి బయటకు దూకిన అనంతరం ఖతార్ బలగాలకు చిక్కారని ఇరాన్ సైనిక అధికారి పేర్కొన్నారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సహాయం కోరినట్లు ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ఖతర్ కథనం పూర్తిగా భిన్నంగా ఉంది.ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం, ఆ ఇరాన్ పైలట్లు ఖతార్ గగనతలంలోకి ప్రవేశించారు. వారిని సంప్రదించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. అనంతరం చేపట్టిన గాలింపు, రక్షణ చర్యల్లో ఒక పైలట్ మృతదేహాన్ని మాత్రమే గుర్తించినట్లు ఖతార్ వెల్లడించింది. అంతేకాదు, ఆ మృతదేహాన్ని ఇరాన్‌కు అప్పగించే అంశంపై కూడా ఖతార్ సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ఇరాన్‌ను ఆహ్వానించినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని ఆరోపించింది.ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ముగ్గురు పైలట్లు సజీవంగా ఖతార్ అదుపులో ఉన్నారా? లేక ఒక పైలట్ మాత్రమే మరణించాడా?. ఈ వివాదం కేవలం ముగ్గురు సైనికుల ఆచూకీకి సంబంధించినది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ప్రాంతంలో ఇరాన్, ఖతార్ మధ్య ఈ ఆరోపణలు కొత్త రాజకీయ, సైనిక పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇరాన్‌పై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలకు ఉపయోగించుకుంటున్నాయని ఇరాన్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. అందుకే ఈ పైలట్ల వ్యవహారం ఇప్పుడు ఒక కీలక ప్రశ్నగా మారింది. -
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు.. రంగంలోకి జార్జ్ వాషింగ్టన్ నౌక
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎంతో కాలంగా సముద్రంలోనే ఉండి అమెరికాకు సేవలంధిస్తున్న అబ్రహం లింకన్ యుద్ధ నౌక స్థానంలో యుఎస్ మరో వార్‌షిప్‌ను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరొక శక్తివంతమైన నౌక యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ను మధ్యప్రాచ్యానికి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని, లింకన్ నౌక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలకు దీనికి సంబంధం లేదని అధికారులు తెలిపారు.ఎంతోకాలంగా అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌకలో సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ 21న శాన్ డియాగో నుంచి పసిఫిక్ ప్రాంతం కోసం బయలుదేరిన ఈ నౌక, ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం కావడంతో మధ్యప్రాచ్యానికి దారి మళ్లించబడింది. ఎలాంటి పోర్ట్ కాల్ (ఓడరేవు సందర్శన) లేకుండానే ఈ నౌక ఏకంగా 200 రోజులకు పైగా సముద్రంలోనే గడపడం సిబ్బందికి అత్యంత క్లిష్టమైన పరీక్షగా మారింది. గత 250 రోజులకు పైగా సాగుతున్న ఈ ప్రయాణంతో నావికుల్లో తీవ్రమైన అలసట, మానసిక క్షోభ నెలకొన్నాయి.సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్య ఆలోచనలు మరియు కొందరు సిబ్బంది ఓడ నుంచి దూకే ప్రయత్నాలు చేశారన్న వార్తలు కుటుంబ సభ్యులు, చట్టసభ సభ్యుల్లో ఆందోళన రేకెత్తించాయి. మరోవైపు, ఆహార కొరత, నీటి కాలుష్యం, మరుగుదొడ్ల సమస్యలు, బూజు పట్టడం, మెయిల్ వ్యవస్థ దెబ్బతినడం వంటి దుర్భర పరిస్థితులను కుటుంబ సభ్యులు ఎత్తిచూపారు. శాన్ డియాగోలో జరిగిన సమావేశంలో బాధ్యుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ ఆరోపణలను అమెరికా నావికాదళం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తోసిపుచ్చారు. ఆత్మహత్యాయత్నాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సిబ్బందికి కౌన్సెలర్లు, శుద్ధి చేసిన నీరు, భోజనం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే, యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా కేంద్రాలు దెబ్బతినడం వల్ల ఆహారం, పరిశుభ్రతా వస్తువుల అందజేతలో కొన్ని అంతరాయాలు ఏర్పడినట్లు నావీ అంగీకరించింది. ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే స్పష్టత లేకపోవడం, నావికులు మానసికంగా మరింత కుంగిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం లింకన్‌కు విధుల నుంచి విరామం ఇవ్వడానికి జార్జ్ వాషింగ్టన్‌ను పంపుతున్నట్లు తెలుస్తోంది. జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం వియత్నాంలోని డానాంగ్ నుంచి బయలుదేరిన ఈ నౌక సింగపూర్ జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నట్లు యూఎస్ నావీ అధికారులు తెలిపారు. -
హర్ముజ్‌లో హైటెన్షన్‌కు తెర.. అమెరికా–ఇరాన్ కీలక ఒప్పందం
హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒమన్ దేశం దౌత్యంతో అంతర్జాతీయ నౌకయానాన్ని పునరుద్ధించేందుకు ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై ఇరు దేశాలు సంతకం చేశాయని సమాాచారం.ఒకదేశ అంతరంగిక వ్యవహారాల్లో మరో దేశం తలదూర్చకూడదని ఇరు దేశాల సౌర్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నాయి. హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల ప్రయాణానికి సురక్షితంగా తరలివెళ్లేలా మార్గం ఇస్తే ఇరాన్‌కు సంబంధించిన ఆర్థిక ఆంక్షలను సడలించనున్నట్లు అమెరికా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఇక చమురధరలు తగ్గే అవకాశం ఉంది.కాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ జలసంధిని తెరవాలని అమెరికా ఇరాన్‌ను పలుమార్లు కోరినప్పటికీ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరాన్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రహస్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. -
చీకట్లో రహస్య మీటింగ్.. కారులో మెుజ్తాబానేనా?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం మెుజ్తాబా ఖమేనీ ఉనికిపై ఇప్పుడు ఎంతో సస్పెన్స్ నెలకొంది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఆయతుల్లా ఖమేనీ మరణించిన అనంతరం ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎక్కడ బహిరంగంగా కనిపించింది లేదు చివరకు ఖమేనీ అంత్యక్రియలకు సైతం ఆయన హాజరుకాలేదు. దీంతో ఆయన బ్రతికి ఉన్నారా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మీడియా సంచలన కథనం ప్రచురించింది. ఇరాన్ అధ్యక్షుడు ఇటీవలే మోజ్తాబాతో రహస్యంగా భేటీ అయినట్లు వార్త ప్రచురించింది. రహస్య భేటీఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, "పెజెష్కియన్‌ను ఆయన భద్రతా సిబ్బంది టెహ్రాన్‌లోని ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనను తన అధికారిక వాహనం నుంచి దించి, టింటెడ్ అద్దాలు ఉన్న ఒక సాధారణ కారులోకి ఎక్కించారు. ఆ కారులో మొజ్తబా ఖమేనీ వేచి ఉన్నారు. అయితే ఆ ప్రదేశంలో పూర్తిగా చీకటి ఉండటంతో ఇద్దరూ ఒకరినొకరు చూడలేకపోయారు. సమావేశం కేవలం కొన్ని నిమిషాలే కొనసాగింది, అనంతరం పెజెష్కియన్‌ను వెంటనే అక్కడి నుంచి పంపించారు". అంతేకాదు, ఖమేనీ భద్రతా సిబ్బంది ఆయనకు చేతులు కలిపే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొంది.మెుజ్తాబా ఖమేనీ ఉనికిపై సందేహంఅధ్యక్షుడి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశం తనను అవమానించినట్టుగా అనిపించిందని పెజెష్కియన్ భావించారని, తర్వాత తాను మాట్లాడింది నిజంగానే మొజ్తబా ఖమేనీయేనా అని ప్రశ్నించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ భేటీ తర్వాత ఖమేనీ అధికారిక నివాసంలో మరోసారి సమావేశం కావాలని పెజెష్కియన్ కోరినా, ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. అనంతరం ఈ అంశంపై పెజెష్కియన్ మాట్లాడుతూ ఖమేనీతో మాట్లాడటం ఇప్పుడు చాలా కష్టంగా మారిందని అన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడటం చాలా కష్టం. అయినప్పటికీ ఆయన ఉనికి మాకు గొప్ప బలాన్ని ఇస్తోంది. దాని వల్లనే మేము ముందుకు సాగగలుగుతున్నాం అని ఆయన తెలిపినట్లు కథనాలు ప్రచురించాయి.రాజీనామా బెదిరింపులతో మీటింగ్ ఇరాన్ మీడియా కథనం ప్రకారం, ఖమేనీని కలవడానికి పెజెష్కియన్ పలుమార్లు ప్రయత్నించారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు. దీంతో చివరకు ఖమేనీ కార్యాలయం సమావేశానికి అంగీకరించిందని తెలిపింది. సంప్రదాయం ప్రకారం ఆయన నివాసంలో కాకుండా వేరే రహస్య ప్రదేశంలో భేటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఖమేనీ ఉనిపై ట్రంప్ "వారి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు. వారి వైమానిక రక్షణ వ్యవస్థ నాశనమైంది. వారి ప్రధాన నాయకులు చనిపోయారు. ఖమేనీ వెళ్లిపోయాడు. ఆయన కుమారుడు కూడా 90 శాతం వరకు అంతమైపోయాడు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ఇరాన్ విషయంలో ట్రంప్ చేయని ఒకేఒక్క ‘తప్పు’ ఇదే..
టెహ్రాన్: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ ప్రస్తుత చిక్కు నుంచి బయటపడే మార్గం కనుక్కోలేకపోతున్నారు. ఇరాన్‌పై ట్రంప్ దాడులు చేయిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక పొరపాటును మాత్రం చేయలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అదే తన సామర్థ్యాన్ని దాటి ఘర్షణను అతి భారీ స్థాయికి తీసుకెళ్లకపోవడం. ఇరాన్‌పై పరిమిత దాడిని పూర్తి స్థాయి, అతి దీర్ఘకాల యుద్ధంగా మార్చలేదు ట్రంప్.ట్రంప్ ఈ యుద్ధాన్ని పూర్తిస్థాయి భూతల యుద్ధంగా మార్చలేదు. తన ప్రతిష్ఠను కాపాడుకోవాలనే ఉద్దేశాలకు దూరంగానే ఉండి, అదనపు భారీ సైనిక చర్యలకు వెళ్లలేదు. అప్పట్లో వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్థాన్ యుద్ధాల్లో అమెరికా మాజీ అధ్యక్షులు ఓటమిని అంగీకరించకుండా యుద్ధాన్ని నిరంతరం పెంచుకుంటూ వెళ్లారు. ట్రంప్ మాత్రం అటువంటి పని చేయడం లేదు.మొదట ట్రంప్ చేసిన పెద్ద పొరపాటు యుద్ధంలోకి వెళ్లడమే కావొచ్చు. కానీ, ఇప్పటివరకు ఆయన చేయని ఒక ప్రమాదకరమైన తప్పు ఏమిటంటే యుద్ధాన్ని తన నియంత్రణ దాటేలా భారీగా విస్తరించకపోవడమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు లిండన్ బి. జాన్సన్, రిచర్డ్ నిక్సన్, జార్జ్ డబ్ల్యూ బుష్ వారు చేసిన యుద్ధాలను మొదట పరిమిత సైనిక చర్యలతో ప్రారంభించి, తర్వాత క్రమంగా పెద్ద యుద్ధాల్లో చిక్కుకున్నారు. ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత వెనక్కి తగ్గడం కష్టమై, వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనినే slippery slope (చిన్న నిర్ణయం క్రమంగా పెద్ద సమస్యగా మారే పరిస్థితి) అంటారు.సమీప భవిష్యత్తులో ఆ తప్పు చేస్తారా?ట్రంప్ ఆ తప్పును ఇంకా చేయలేదు. కానీ, సమీప భవిష్యత్తులో ఇరాన్ యుద్ధాన్ని విస్తరిస్తే గత అధ్యక్షులలాగే అదే ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. చరిత్ర ఏమి చెబుతుందంటే, బయటపడే మార్గం వెతుకుతూ లేదా తమ ప్రతిష్ఠను, అమెరికా ప్రతిష్ఠను కాపాడాలనే ప్రయత్నంలో యుద్ధాలను తీవ్రతరం చేసిన అధ్యక్షులు ప్రమాదకర మార్గంలో జారిపోయారు.ఒకసారి గీత దాటితే వెనక్కి తిరగలేని కీలక నిర్ణయాత్మక దశకు ట్రంప్ చేరుకుంటారా? అన్నదే సందేహాత్మకంగా ఉంది. ట్రంప్ ముందున్న మరో మార్గం నష్టాలను అంగీకరించి, ప్రధాన లక్ష్యాలు నెరవేరకపోయినా ఈ ఘర్షణ నుంచి వైదొలగడమే మంచిదని ఒప్పుకోవడం.ట్రంప్ గెలవలేని, ఓడిపోలేని యుద్ధంలో చిక్కుకుపోయారు. అమెరికా ప్రభుత్వం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇరాన్‌ను ఎలా శిక్షించాలనే కొత్త ఐడియాలు ఇవ్వాలని పెంటగాన్ సైనిక విశ్లేషకుల బృందాన్ని కోరిందని అమెరికా మీడియా తెలిపింది. ఒకవేళ ట్రంప్ పూర్తిస్థాయి యుద్ధం చేయిస్తే పరిణామాలు అతి ఘోరంగా ఉంటాయి.ఇరాన్‌కు హెచ్చరికల మీద హెచ్చరికలుఇరాన్ తన తాజా ప్రయత్నాన్ని తిరస్కరించిన తర్వాత ఇటీవల ట్రంప్ అసహనం ట్రూత్ సోషల్ ఖాతాలో.. ‘‘ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం ఉంది’’ అని చెప్పారు. “ఇరాన్ నాయకత్వం నమ్మశక్యంకానంత మోసపూరితంగా ఉంది” అని కూడా ట్రంప్ ప్రకటించారు. బలవంతపు దౌత్యంపై ఇస్లామిక్ రిపబ్లిక్ చేసే విమర్శలనే ఆయన వ్యంగ్యంగా ప్రతిధ్వనించినట్టైంది. ఆ తర్వాత ఆయన మళ్లీ మరో హెచ్చరిక చేశారు. “ఒప్పందంపై సంతకం చేయడానికి వారికి ఇదే చివరి అవకాశం” అని ఓవల్ ఆఫీస్‌లో చెప్పారు. -
యుద్ధం ఆపేందుకు తలపట్టుకుంటున్న ట్రంప్?
వాషింగ్టన్: ఇరాన్‌పై దాడులకు అమెరికా సెంట్రల్ కమాండ్ సరికొత్త వ్యూహం అనుసరించనుందా అంటే అవుననే సమాధానమస్తుంది.. ఈ విషయమై ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేలా సరికొత్త వ్యూహాలను తెలియజేయాలని ఆ దేశంలోని సైనికులను కోరిందట.. సంప్రదాయేతర, సృజనాత్మక మార్గాలను" సూచించాల్సిందిగా విస్తృత శ్రేణి సైనిక విశ్లేషకులను సంప్రదించిందని కథనాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది.. ఇరాన్‌పై దాడి చేసి వారం రోజుల్లోగా యుద్ధాన్ని ముగించవచ్చు అనకున్న ట్రంప్‌కు యుద్దం ప్రారంభమై ఐదునెలలు గడుస్తోన్నా యుద్ధం ముగించే దారి దొరకడం లేదు. అలా అని ఇరాన్ భూభాగంలోకి సైనికులను పంపితే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగని దాడులు ఆపేస్తే అమెరికా పట్టు సడలిపోతుంది. దీంతో ఏం చేయాలో తోచక తల పట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌ను ఏవిధంగా మరింతగా దెబ్బతీయవచ్చు లేదా కట్టడి చేయవచ్చు అనే అంశంపై ఆర్మీ విశ్లేషకులు, అధికారుల నుంచి కొత్త ప్రతిపాదనలను సేకరించాలని ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా ఈ అభ్యర్థనను పంపినట్లు సమాచారం. ఇరాన్‌తో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం ,పరిమితమైన సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ సరికొత్త విశ్లేషణలు లేదా ఆలోచనల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.సీఎన్ఎన్ (CNN) నివేదిక ప్రకారం.. గత వారం సెంట్రల్ కమాండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లోని ఒక అధికారి ఈమెయిల్ ద్వారా ఈ బ్రెయిన్‌స్టార్మింగ్ (ఆలోచనల సేకరణ) సెషన్‌ను ప్రారంభించారు. ఈమెయిల్ ద్వారా ఇలా ప్రజల లేదా సిబ్బంది అభిప్రాయాలను సేకరించడం (క్రాగ్సోర్సింగ్ పద్ధతి) సైన్యంలో చాలా అరుదైన విషయం, ఈ విషయాన్ని పట్టి చూస్తే తన నిబంధనల ప్రకారం ఇరాన్‌ను ఒప్పందానికి అంగీకరించేలా చేయడానికి అధ్యక్షుడు ట్రంప్‌కు చాలా కష్టమని తెలుస్తోందని కథనాలు ప్రచురించాయి.అమెరికా గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, తమ వైఖరి మార్చుకోకపోవడంతో అమెరికా రక్షణ రంగానికి ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది. కేవలం బాంబులు వేయడం వల్ల ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదనే వాస్తవం అమెరికాకు అర్థమయ్యింది. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి గ్రౌండ్ ట్రూప్స్ (భూతల సైన్యం)ను పంపడం లేదా భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలపై భారీ దాడులు చేయడం వల్ల అమెరికాకు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ఆయుధ నిల్వలు తరిగిపోవడం, చమురు ధరలు పెరగడం వంటి సమస్యల వల్ల అమెరికా ప్రత్యక్షంగా పెద్ద యుద్ధానికి వెనుకంజ వేస్తోంది.దీంతో కొత్త దారుల కోసం అన్వేషణ ఇప్పటివరకు అనుసరించిన పద్ధతులు కాకుండా, ఎలాంటి పెద్ద యుద్ధ నష్టం లేకుండా ఇరాన్‌ను దెబ్బతీయడానికి లేదా చర్చల ముందుకు రప్పించడానికి పూర్తిగా భిన్నమైన, ఎవరూ ఊహించని మార్గాలు అవసరమని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా ఒక విజయాన్ని లేదా స్పష్టమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నప్పటికీ, దానికి తగిన సరైన సైనిక ప్రత్యామ్నాయాలు తక్షణమే అందుబాటులో లేకపోవడాన్ని ఈ అంతర్గత ఈమెయిల్ స్పష్టం చేస్తోంది. -
ట్రంప్ వెనక్కి తగ్గేలా.. సౌదీ వ్యూహం
పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పుడు సౌదీ రంగప్రవేశం ఆసక్తిగా మారింది. ఇరాక్‌లో అమెరికాతో కలిసి ఇరాన్ ప్రాక్సీలపై విరుచుకపడ్డ సౌదీ అంతలోనే.. ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులు చేయవద్దని ట్రంప్‌కు విజ్ఞప్తి చేసింది. దీనికి తల ఊపిన ట్రంప్ సౌదీ ఎంట్రీతో తాత్కాలికంగా దాడుల ఆలోచన విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే అమెరికాని ఒప్పించేలా సౌదీ మధ్యవర్తిత్వం చేయడంపై ఒక పెద్దకారణం దాగున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ట్రంప్ ఇరాన్‌కు భారీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయకుండా నివారించాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) కోరినట్లు అమెరికా అధికారులు తెలిపారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. అయితే దీని వెనుక "క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్థిక ప్రణాళిక 'విజన్ 2030' కారణమని తెలుస్తోంది.రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా బిన్ ఫరాహ్ అల్-షయా మాట్లాడుతూ.. "రాజ్యంలోని విజన్ 2030 అనేది కేవలం ఒక ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు. విభిన్నమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి, అలాగే పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, పర్యాటకం ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా సౌదీ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఇదొక సమగ్ర జాతీయ ప్రాజెక్ట్" అని పేర్కొన్నారు. ఇరాన్‌పై ఏవైనా పెద్ద దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని, ఇది తమ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుందని సౌదీ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.మాజీ యూఎస్ రక్షణ శాఖ అధికారి, మిడిల్ ఈస్ట్ నిపుణురాలు డానా స్ట్రౌల్ మాట్లాడుతూ.. యెమెన్ హూతీ తిరుగుబాటుదారుల ముప్పును తొలగించడానికి కేవలం సైనిక బలప్రయోగం మాత్రమే సరిపోదని సౌదీ అరేబియా చాలా కష్టపడి నేర్చుకుందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు సైనిక చర్యలు చేపట్టినా హూతీల ముప్పును పూర్తిగా తొలగించలేకపోయాయని, సౌదీ మళ్లీ అటువంటి పెద్ద సంఘర్షణలోకి దిగితే అది 'విజన్ 2030'పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా అధికారులతో చర్చలు జరిపారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే లేదా అలాంటి దాడులకు ఇతర దేశాలు మద్దతు ఇస్తే ఇరాన్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా యుఎస్‌ను బుజ్జగించాల్సి వస్తోంది. -
ఇరాన్ దాడులపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టెహ్రాన్‌తో పాటు కొన్ని మధ్య ప్రాచ్యదేశాల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి హర్ముజ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. ఇటీవలే మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోతూ వస్తున్న ట్రంప్ ఆ దేశాన్ని హెచ్చరిస్తూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే మరోసారి ప్లేటు ఫిరాయంచారు. ట్రంప్ మాట్లాడుతూ.. "ఇరాన్‌పై అమెరికా ప్రతిపాదిత దాడి వాయిదాపడింది. దానికోసం ఇరాన్‌తో పాటు కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఒక రాజీ ప్రతిపాదన తెచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.హర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం, ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు ముప్పును తొలగించే ఒప్పందం ముసాయిదాపై అంగీకారం కుదిరింది" అని ట్రంప్ అన్నారు.ఇరాన్‌పై దాడి విరమణపై కీలక నిర్ణయంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ సైతం ఉంది అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా ఆక్సియోస్ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. ఇరాన్‌పై దాడి విషయంలో సంయమనం పాటించాలని, ఇరాన్‌పై జరగబోయే పెద్ద దాడిని ఎట్టిపరిస్థితుల్లో నివారించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులుప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ల మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే, ఇరాన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు ఒక తాత్కాలిక యుద్ధ విరామానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గత మూడు రోజులుగా ఇరు దేశాలు దాడులను నిలిపివేశాయి. -
గల్ఫ్ దేశాలను వీడండి.. అమెరికా పౌరులకు ట్రంప్ అత్యవసర హెచ్చరిక
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా వరుస దాడులు తీవ్రతరమయ్యాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. భద్రతా ముప్పులు పెరుగుతున్నందున వీలైతే మధ్యప్రాచ్య దేశాలను విడిచి వెళ్లాలని, లేకపోతే ఎప్పుడైనా అత్యవసరంగా బయలుదేరాల్సిన పరిస్థితి రావచ్చని ముందస్తుగా సిద్ధంగా ఉండాలని సూచించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. గగనతల మూసివేతలు, విమాన సర్వీసుల రద్దు, ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచించింది. మధ్యప్రాచ్యానికి వెళ్లే ప్రయాణాలను కూడా పునరాలోచించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. అంతకుముందు చేసిన సూచనల కంటే తాజా సూచన మరింత కఠినంగా ఉండటం గమనార్హం.ఇక, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అవసరమైతే ఇరాన్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, అమెరికా దాడులకు తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్‌కు చెందిన డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని కువైట్ సైన్యం వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం ప్రకటించడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘర్షణలు మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండగా, ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Middle East: Americans currently in the Middle East should exercise caution and heightened vigilance and should be prepared for flight cancellations, periodic airspace closures, and potential travel disruptions. Some airlines in the region have postponed resumption of earlier… pic.twitter.com/d1ZmzRBBHN— TravelGov (@TravelGov) August 1, 2026మరోవైపు.. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే దానికి ‘నిర్ణయాత్మక, తీవ్రమైన ప్రతిస్పందన’ ఇస్తామని హెచ్చరించారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇజ్రాయెల్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులకు తమ భూభాగాన్ని లేదా సౌకర్యాలను ఉపయోగించేందుకు ఏ దేశం అనుమతించవద్దని ప్రాంతీయ దేశాలకు ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, అమెరికా హెచ్చరికలు ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలని ఇరాన్ విమర్శించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రాంతీయ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. -
ఇరాన్ రహస్య కోట.. ట్రంప్ బాంబులు చేరగలవా?
ఒక పర్వతం.. దాని లోపల అంతుచిక్కని సొరంగాలు.. ప్రపంచ శక్తుల కళ్లన్నీ దానిపైనే. ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత రహస్యంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ఇందుకు కారణం.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వరుస హెచ్చరికలు. ‘ఆ ప్రాంతాన్ని త్వరలోనే.. చాలా తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంటాం’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో కొత్త ఉద్రిక్తతలకు తెరతీశాయి. ఇప్పటికే ఇరాన్‌లోని కొన్ని అణు కేంద్రాలపై దాడులు జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడు అమెరికా చూపు పికాక్స్ మౌంటెన్‌పై పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పర్వతం లోపల ఏముంది?ఇరాన్‌లోని నటాంజ్ అణు సముదాయానికి దక్షిణంగా ఉన్న ఈ పర్వత ప్రాంతం బయటికి చూస్తే సాధారణ కొండలా కనిపిస్తుంది. కానీ దాని లోపల భారీ భూగర్భ నిర్మాణం ఉందని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ‘కుహ్-ఎ కొలాంగ్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఆంగ్లంలో పికాక్స్ మౌంటెన్ అనే పేరు వచ్చింది. పికాక్స్ అంటే కొండను తవ్వే పనిముట్టు. పేరు మాదిరిగానే ఈ ప్రాంతం లోపల భారీ సొరంగ వ్యవస్థ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఉపగ్రహ చిత్రాల్లో ఈ ప్రాంతంలో నాలుగు సొరంగ ప్రవేశ మార్గాలు కనిపిస్తున్నాయి. రెండు తూర్పు వైపు, మరో రెండు పడమర వైపు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలి చిత్రాల్లో అక్కడ నిర్మాణ వాహనాలు, కొత్త రహదారి పనులు, సొరంగాల వద్ద కదలికలు కనిపించడం అనుమానాలను పెంచింది.అణు కేంద్రానికి ప్రత్యామ్నాయమా?2020లో నటాంజ్ అణు కేంద్రంలో జరిగిన అనుమానాస్పద విధ్వంసం తర్వాత.. మరింత సురక్షితమైన, ఆధునిక భూగర్భ కేంద్రాన్ని నిర్మిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఆ కేంద్రం పికాక్స్ మౌంటెన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. సెంట్రిఫ్యూజ్‌లు యురేనియం శుద్ధికి ఉపయోగపడతాయి. తక్కువ స్థాయి శుద్ధితో అణు విద్యుత్ అవసరాలకు ఉపయోగించే యురేనియం తయారు చేయవచ్చు. అయితే అత్యధిక స్థాయి శుద్ధి చేస్తే అణ్వాయుధాల తయారీలోనూ ఉపయోగించే అవకాశం ఉంటుంది.Iran : ( Video ) Israeli Channel 14 explains what Pickaxe Mountain is and what it has become . Iran's most strategic asset in its necular program. 👇 pic.twitter.com/TipMFrNOM9— Kbar57 (@kbar57) July 30, 2026ట్రంప్ ఎందుకు గురి పెట్టారు?పికాక్స్ మౌంటెన్‌లో అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉండవచ్చని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే అమెరికా ఆందోళనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. జూలై 21న ట్రంప్ మాట్లాడుతూ.. “ఆ ప్రాంతాన్ని త్వరలోనే భారీగా దెబ్బతీస్తాం” అని వ్యాఖ్యానించారు. తర్వాత కూడా ఒప్పందం కుదరకపోతే పికాక్స్ మౌంటెన్‌ను లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అక్కడ ఎలాంటి అణు కార్యకలాపాలు జరగడం లేదని చెబుతోంది. అమెరికా బెదిరింపులు దాడికి సాకులు మాత్రమేనని విమర్శిస్తోంది.అమెరికా బాంబులతోనైనా కూలుతుందా?పికాక్స్ మౌంటెన్కు ఉన్న అతిపెద్ద రక్షణ.. దాని లోతు. ఈ కేంద్రం భూమికి దాదాపు 100 మీటర్ల లోపల ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో GBU-57 బంకర్ బస్టర్ బాంబులు ఒకటి. ఇవి భారీగా రక్షణ కలిగిన నిర్మాణాలను ఛేదించేందుకు రూపొందించబడ్డాయి. అయితే ఇంత లోతులో ఉన్న పికాక్స్ మౌంటెన్‌ను పూర్తిగా ధ్వంసం చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. లోపలి నిర్మాణం ఎలా ఉందో స్పష్టంగా తెలియకపోవడం కూడా మరో సమస్య. కేంద్రంలోని సొరంగ మార్గాలు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సరఫరా మార్గాలను దెబ్బతీయడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అంచనాల ప్రకారం.. 2025లో ఇరాన్ వద్ద దాదాపు 440 కిలోల (970 పౌండ్ల) 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల్లో కొంత భాగం లేదా మొత్తం పికాక్స్ మౌంటెన్ భూగర్భ కేంద్రంలో ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అంతేకాదు.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత నటాంజ్, ఫోర్డో అణు కేంద్రాల్లో దెబ్బతినకుండా మిగిలిన కొన్ని అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను కూడా పికాక్స్ మౌంటెన్కు తరలించి ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఒక పర్వతం.. రెండు దేశాల పోరుపికాక్స్ మౌంటెన్ ఇప్పుడు కేవలం ఓ అణు కేంద్రం అనుమానంతో ఉన్న ప్రాంతం మాత్రమే కాదు.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతీకగా మారింది. ఒకవైపు అమెరికా “అణు బెదిరింపును అడ్డుకోవాలి” అంటోంది. మరోవైపు ఇరాన్ “దాడికి ప్రతీకారం తప్పదు” అని హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భూమి లోపల దాగిన ఈ రహస్య కేంద్రంపై నిజంగా బాంబులు పడతాయా? లేక ఇది కేవలం ఒత్తిడి వ్యూహమా? అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఇరాన్ ఉలిక్కిపడేలా.. ట్రంప్, నెతన్యాహు మెగా ఆపరేషన్!
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై ఇప్పటివరకు జరగని స్థాయిలో దాడుల ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.ఈ దాడుల్లో ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యవస్థను కొనసాగించే సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ఉండొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ ఆపరేషన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని సమాచారం. పెంటగాన్ కూడా లక్ష్యాలపై స్పందించేందుకు నిరాకరించింది.ప్రపంచ మార్కెట్లు సోమవారం ప్రారంభమయ్యేలోపు ఈ ఆపరేషన్‌ను ముగించాలని అమెరికా వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇంధన సరఫరాలపై దాడులు జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను కూడా ఈ ప్రణాళికల్లో భాగస్వామిగా ఉంచినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌తో టెల్ అవీవ్ సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌పై పూర్తి స్థాయి సైనిక చర్యకు తిరిగి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఓ ఇజ్రాయెల్ అధికారి స్పష్టం చేశారు.ట్రంప్ అధ్యక్షతన క్యాంప్ డేవిడ్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరాన్‌పై సైనిక ఎంపికలపై చర్చ జరిగినట్లు సమాచారం. కొందరు అధికారులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్‌పై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ చాలా తీవ్రంగా దెబ్బతీస్తాం అనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా లక్ష్యం ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అధ్యక్షుడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని పెంటగాన్ పేర్కొంది. టెహ్రాన్ నగర విద్యుత్ సరఫరాను దెబ్బతీయడం వంటి ప్రత్యామ్నాయాలపైనా అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎలాంటి అమెరికా దాడి జరిగినా ప్రతీకార చర్యలకు సమగ్ర ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని కీలక మౌలిక వసతులు, ప్రాంతీయంగా ఉన్న అమెరికా ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించాయి. -
ట్రంప్-నెతన్యాహు భేటీ.. ఇరాన్‌పై ఫైనల్ గేమ్‌కు రంగం సిద్ధం?
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన కీలక భేటీ ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైట్‌హౌస్‌లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్‌ను ఎదుర్కొనే భవిష్యత్ వ్యూహాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.అమెరికాను వెంటనే మరో యుద్ధంలోకి నెట్టాలనే ఉద్దేశంతో కాకుండా.. దౌత్య చర్చలు, ఆర్థిక ఆంక్షలు, అవసరమైతే సైనిక చర్య అనే మూడు మార్గాలను పరిశీలించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.ఇరాన్‌పై మూడు మార్గాలు.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ముందున్న అవకాశాలపై చర్చ జరిగింది.1. చర్చల మార్గం:ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాల మధ్య ఇంకా తీవ్ర విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో నెతన్యాహుకు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.2. ఆర్థిక ఒత్తిడి:ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించడం, నౌకా నిర్బంధాన్ని కొనసాగించడం ద్వారా ఒత్తిడి పెంచే అంశాన్ని కూడా పరిశీలించారు.3. సైనిక చర్య:చర్చలు, ఆంక్షలు ఫలించని పరిస్థితుల్లో తిరిగి సైనిక దాడులను విస్తరించే అవకాశాన్ని కూడా చర్చించినట్లు సమాచారం.చమురు ధరలపై ట్రంప్ ఆందోళనఇరాన్తో ఘర్షణ కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, ఇంధన మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరాన్‌కు ప్రస్తుతం ఉన్న ప్రధాన వ్యూహాత్మక ఆధారం హార్మూజ్ జలసంధి అని, దానిని ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని నెతన్యాహు పేర్కొన్నట్లు సమాచారం.సిరియా నుంచి సౌదీ వరకు.. ఇరాన్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర పరిణామాలపైనా ట్రంప్, నెతన్యాహు చర్చించారు. సిరియాలో ఇజ్రాయెల్, టర్కీ సైనిక ఉనికి, దక్షిణ సిరియాలో భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. అలాగే, అమెరికా-సౌదీ అణు ఒప్పందం, భవిష్యత్‌లో సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రక్షణ రంగంలో అమెరికాపై ఆధారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. వచ్చే పదేళ్లలో స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు, కొత్త తరం యుద్ధ విమానాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నెతన్యాహు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్-నెతన్యాహు భేటీ తర్వాత మధ్యప్రాచ్య పరిణామాలు మరింత కీలక దశలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇరాక్‌పై దాడులు.. 20 మంది మృతి, మరో 32 మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్‌కు చెందిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (పీఎంఎఫ్)పై అమెరికా-సౌదీ దాడుల్లో దాదాపు 20 మంది ఫైటర్స్ మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు. తమ దళాలు పూర్తి అప్రమత్త స్థితిలో ఉన్నాయని పీఎంఎఫ్ ప్రకటించింది. టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ప్రకటనలో పీఎంఎఫ్ స్పందిస్తూ.. "పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా, అమెరికా చేపట్టిన ద్రోహపూరిత ఉగ్రదాడిని ఖండిస్తున్నాం" అని పేర్కొంది.పీఎంఎఫ్‌కు ఇరాన్ మద్దతు ఉంది. పీఎంఎఫ్ అనేది శిక్షణ పొందిన ఇరాకీ మిలీషియాల సమాఖ్య. ఈ దాడులు అత్యంత ప్రమాదకర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని పీఎంఎఫ్ తెలిపింది. అంతేగాక, ఇవి ఇరాక్ సార్వభౌమాధికారంపై దాడితో పాటు అధికారిక భద్రతా సంస్థల ఉల్లంఘన అని ఆరోపించింది. 2026 ఏప్రిల్ 2న, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, మొసుల్ పశ్చిమ ప్రాంతంలో వైమానిక దాడుల్లో మరణించిన పీఎంఎఫ్ ఫైటర్ భౌతికకాయాన్ని బాగ్దాద్‌లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ సభ్యుడు మోస్తూ కనిపించాడు.అమెరికా, సౌదీ అరేబియా సంయుక్తంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. అమెరికా దళాలు, సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా మిలిటెంట్లపై ఇరాక్‌లో దాడులు చేపట్టాయి. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ కూడా ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర మిలీషియాలు సోమవారం, మంగళవారం ఇరాక్ భూభాగం నుంచి డ్రోన్లను ప్రయోగించి తూర్పు ప్రాంతం, రియాద్ ప్రాంతాల్లోని చమురు కేంద్రాలపై దాడులు చేశాయని ఆరోపించారు.సౌదీ అరేబియా తన ఆత్మరక్షణ హక్కు ప్రకారం స్పందిస్తూ ఆ మిలీషియాలకు చెందిన నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని ఆయన చెప్పారు. "సౌదీ అరేబియా రాజ్యం ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. అయితే తమపై జరిగే ఏ దాడికైనా కఠినంగా ప్రతిస్పందిస్తుంది" అని ఆయన అన్నారు. బుధవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో, బాగ్దాద్, వాసిత్, నైనెవెహ్, బస్రా, కిర్కుక్, కర్బలా, దియాలా ప్రావిన్సుల్లోని తమ పలు ప్రధాన కార్యాలయాలపై అమెరికా-సౌదీ దాడులు జరిగాయని పీఎంఎఫ్ తెలిపింది. ఉత్తర ఇరాక్‌లోని నైనెవెహ్, మధ్య ఇరాక్‌లోని దియాలా ప్రాంతాల్లో జరిగిన దాడులే అత్యంత ప్రాణనష్టం కలిగించాయని ఒక అధికారి తెలిపారు. -
ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఇదే గతి... నడివీధిలో ఇద్దరికి ఉరి
టెహ్రాన్: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో సంబంధం ఉన్న కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు విధించిన ఉరిశిక్షను అమలు చేసినట్లు ఇరాన్ న్యాయవ్యవస్థ మంగళవారం ప్రకటించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఉరిశిక్షను బహిరంగ ప్రదేశంలో అమలు చేశారు."అబోల్ఫజల్ సెపాహి, అమీర్-హొస్సేన్ సఫారీకి విధించిన మరణదండనను ఈ ఉదయం అమలు చేశాం" అని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ ఆన్లైన్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక మెహర్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. మధ్య ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని మలెక్షహర్ నగరంలోని ఒక చౌరస్తాలో ప్రజల సమక్షంలో ఉరిశిక్ష అమలు చేశారు.జనవరి 8న ఈ ఇద్దరు మచెట్లు, కత్తులతో పోలీసు అధికారులపై దాడి చేశారని, వారిని రహదారి సూచిక బోర్డులకు కట్టేసి నేలపై ఈడ్చారని, పెట్రోలు పోసి నిప్పంటించారని మిజాన్ తెలిపింది. వారిపై "మొహారెబెహ్ (దేవుడిపై యుద్ధం చేయడం)" అనే అభియోగంతో పాటు, ఆయుధాలు ప్రదర్శించి ప్రజల్లో భయం, భీతావహ పరిస్థితులు సృష్టించడం, దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడడం వంటి ఆరోపణలు నమోదయ్యాయని పేర్కొంది.డిసెంబర్ చివరలో జీవన వ్యయం పెరగడంపై ప్రారంభమైన నిరసన ఉద్యమం వేగంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారింది. జనవరి 8, 9 తేదీల్లో అవి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ హింసలో 3,000 మందికి పైగా మరణించారని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సహించిన "ఉగ్రవాద చర్యలే" కారణమని వారు ఆరోపించారు. అయితే విదేశాల్లో ఉన్న హక్కుల సంస్థలు మాత్రం భద్రతా బలగాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయని చెబుతున్నాయి.ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత దేశంలో ఘర్షణలు, నిరసనలకు సంబంధించి అరెస్టులు, ఉరిశిక్షల అమలు పెరిగాయి.జూలై 19న కూడా ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఇదే తరహా ఆరోపణలపై మరో ఇద్దరికి ఉరిశిక్ష అమలు చేశారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక ఉరిశిక్షలు అమలు చేసే దేశాల జాబితాలో చైనా తర్వాత ఇరాన్ రెండో స్థానంలో ఉంది. -
ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ‘ఏఐ’ దండయాత్ర
వాషింగ్టన్: ఖర్గ్ ద్వీపం విషయంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ని రెచ్చగొట్టారు. ఆ ఐలాండ్‌పై దాడి చేస్తున్నట్లు ఉన్న ఏఐ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా అమెరికా వద్ద అవసరానికి మించి ఆయుధాలున్నాయని తమ వద్ద ఉన్నాయని ఇరాన్ శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదన్నారు.ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను ఇప్పటిది కాదు.. యుద్ధం ప్రారంభం నుంచే తరచుగా ఆ ద్వీపంపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా బలగాలు "చాలా సులభంగా" ఆక్రమించగలవని, అమెరికా కావాలనుకుంటే ఇరాన్ చమురు సంపదను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని ఆయన గతంలో పేర్కొన్నారు. సైనిక దాడులపై వ్యాఖ్యలు: గతంలో జరిగిన దాడుల సమయంలో, ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, సరదాగా మరోసారి దాడులు చేయగలమని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి కయ్యానికి కాలు దువ్వారు.ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ట్రంప్ స్పందించారు " "ప్రపంచంలోనే అత్యధికంగా, అమెరికా అవసరానికి మించి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి.వాటిలో శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదు." అని అన్నారు.ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన 'ట్రూత్ సోషల్'లో అనేక AI చిత్రాలను పంచుకున్నారు. వాటిలో ఒక చిత్రం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై జరిగిన వైమానిక దాడిని చూపించింది. దానికి ఆయన, ఖర్గ్పై దాడి అని శీర్షిక పెట్టారు. -
భారీ దాడులకు సిద్ధమైన అమెరికా.. ఒక్కసారిగా ఎందుకు ఆగింది?
వాషింగ్టన్: ఇరాన్‌పై భారీ సైనిక దాడి చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పెంటగాన్ వద్ద ఉన్న వాయు రక్షణ ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయని సీనియర్ సలహాదారులు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. శుక్రవారం ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు, సీనియర్ సలహాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా సైన్యం వద్ద పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయన్న అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత పెంచాలన్న అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్న సమయంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని హెచ్చరించారు.వాయు రక్షణ ఆయుధ నిల్వలు తగ్గిపోవడమే అమెరికా వరుస రాత్రి దాడులను నిలిపివేయడానికి ప్రధాన కారణమా, లేక ఈ విరామం కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పశ్చిమాసియాలో పెద్ద యుద్ధం చెలరేగడం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇంధన సరఫరా అంతరాయం, శరణార్థుల సంక్షోభం మరింత పెరగడం వంటి అంశాలపై కూడా ట్రంప్, ఆయన సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్‌పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం సాధ్యమేనని, కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని జనరల్ డాన్ కేన్ వ్యక్తిగతంగా ట్రంప్‌కు వివరించారు.ముగ్గురు అమెరికా సైనికులు మృతితో.. గత వారం జోర్డాన్‌లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అమెరికా వాయు రక్షణ వ్యవస్థను దాటి దాడి చేయడంతో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత ఈ చర్చలు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.శుక్రవారం అమెరికా బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని, దాడికి రెడీగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించినా, చివరకు భారీ బాంబు దాడులకు ఆయన అనుమతి ఇవ్వలేదు. ఈ వారం ప్రారంభంలో ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీ దాడి చేయించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాను. నిర్ణయానికి చాలా దగ్గరగా ఉన్నాను. అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ తీర ప్రాంత రాడార్లు, నౌకలపై దాడి చేసే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ వాహనాలు, రవాణా వ్యవస్థలు, పిక్‌యాక్స్ పర్వతం అడుగున ఉన్న భూగర్భ అణు కేంద్రం వంటి వ్యూహాత్మక లక్ష్యాలపై పలుదశల్లో దాడి చేసే ప్రణాళికలను పెంటగాన్ సిద్ధం చేసింది. అయితే దీర్ఘకాలం దాడులు కొనసాగితే ఇప్పటికే తగ్గిపోయిన క్షిపణి నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని అధికారులు హెచ్చరించారు.ట్రంప్ సీనియర్ సలహాదారుల్లో పలువురు, జారెడ్ కుష్నర్ సహా, భారీ సైనిక దాడికి బదులుగా నిరంతర దౌత్య చర్చలు, ఆర్థిక ఒత్తిడి కొనసాగించే వ్యూహానికే మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో, అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. దాదాపు రెండు వారాలుగా నిరంతరంగా సాగిన వైమానిక దాడుల తర్వాత అమెరికా సైన్యం తొలిసారి రాత్రి దాడులను నిలిపివేసింది. తాత్కాలిక కాల్పుల విరమణను పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై రాజీ మార్గం కనుగొనేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని యాన్బు, జిజాన్ ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు ప్రకటించారు.హోదైదాపై సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే అరామ్కోకు చెందిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని వారు తెలిపారు. -
మరో కలకలం రేపిన ఇరాన్.. ఇక ట్రంప్ ఊరుకుంటారా?
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన స్థావరాలను, అణు కేంద్రాలను వేగంగా పునర్నిర్మిస్తోంది ఇరాన్. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఇటీవలి నెలల్లో అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో ధ్వంసమైన వంతెనల నుంచి క్షిపణి స్థావరాల వరకు పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఇరాన్ తిరిగి నిర్మించిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.ఒక ఉపగ్రహ చిత్రాల సమాహారంలో.. పశ్చిమ ఇరాన్‌లోని కంగావర్ వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరానికి వెళ్లే ప్రవేశ రహదారి మార్చి తొలి రోజుల్లో జరిగిన దాడులతో దెబ్బతిన్నట్టు కనిపించింది. కొన్ని వారాల తర్వాత తీసిన చిత్రాల్లో, దాడుల వల్ల మూసుకుపోయిన అదే ప్రవేశ ద్వారం వరకు కొత్తగా తారు వేసిన రహదారి కనిపించింది.వాల్ స్ట్రీట్ జర్నల్ సేకరించిన మరికొన్ని చిత్రాల ప్రకారం.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధం ఉన్న బందర్ అంజలి నౌకాశ్రయంలో జూలై తొలి వారం నుంచే పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.అమెరికా ఇటీవల జరిపిన దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల్లో మరమ్మతు పనులు ప్రారంభమైనట్లు కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించినట్టు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రాలు బయటకు రావడంతో, ఇరాన్ తన అణు మౌలిక వసతులను ఎంత వేగంగా తిరిగి పునరుద్ధరించగలదనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. ఊహించిన దానికంటే వేగంగా.. అణు కేంద్రాల పునరుద్ధరణ సామర్థ్యంపై కొత్త అంచనాలు వెలువడుతున్నాయి. చాలా మంది నిపుణులు ఊహించిన దానికంటే వేగంగా ఇరాన్ కీలక అణు కేంద్రాలను తిరిగి అందుబాటులోకి తెస్తోంది. గతంలో అమెరికా లక్ష్యంగా చేసుకున్న పలుచోట్ల పునర్నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు కొత్త చిత్రాలు సూచిస్తున్నాయి.అమెరికా మాజీ రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ మాట్లాడుతూ.. దాడుల తర్వాత ఇరాన్ తన సైనిక సామర్థ్యంలో కొంత భాగాన్ని వేగంగా పునరుద్ధరించిందన్నారు. అయితే అణు కేంద్రాల మరమ్మతు వేగం కూడా ఇరాన్ పునరుద్ధరణ సామర్థ్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు.అమెరికా గూఢచారి సంస్థల అంచనా ప్రకారం.. అలీ ఖమేనీ మరణం తర్వాత నాయకత్వంలో వచ్చిన మార్పులతో ఇరాన్ అణ్వాయుధ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ముజ్తబా ఖమేనీ బహిరంగంగా అణ్వాయుధాల తయారీకి మద్దతు ప్రకటించకపోయినా, అలాంటి కార్యక్రమాల పట్ల ఆయన తన తండ్రికంటే ఎక్కువగా సానుకూలంగా ఉండవచ్చని అమెరికా గూఢచారి సంస్థలు భావిస్తున్నాయి.అలీ ఖమేనీ మాత్రం మతపరమైన ఫత్వా ఆధారంగా అణ్వాయుధాలు నిషిద్ధమని బహిరంగంగా ప్రకటించేవారు. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంచనాల్లో చాలావరకు యుద్ధానికి ముందు సేకరించిన సమాచారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ కొన్ని పరికరాలను అత్యంత భద్రత కలిగిన భూగర్భ కేంద్రం పికాక్స్ మౌంటెన్ ప్రాంతానికి తరలించింది. -
ఇరాన్ అణు బాంబు ప్లాన్ ట్రంప్ వార్నింగ్ తో ..!
-
సౌదీ ఆఫర్‌తో కొత్త పవర్ గేమ్... పాక్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన కొత్త పౌర అణు ఒప్పందం మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలను మార్చే అంశంగా మారింది. బయటకు చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న వ్యూహాత్మక అవకాశాలే ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కారణమవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాకు తన దేశంలోనే యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఈ సాంకేతికతను ఒక నిర్దిష్ట స్థాయికి మించి అభివృద్ధి చేస్తే, అణు ఆయుధాల తయారీకి అవసరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ పరిణామం ఇజ్రాయెల్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, సౌదీ భవిష్యత్తులో అణు సామర్థ్యం సాధించే అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఒక దేశం అణు సాంకేతికతను అభివృద్ధి చేసిన తర్వాత దాని వినియోగం పూర్తిగా శాంతియుతంగానే ఉంటుందని ఎప్పటికీ హామీ ఇవ్వలేమన్నది ఇజ్రాయెల్ వాదన. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే, సౌదీ కూడా అదే దిశలో అడుగులు వేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సౌదీ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.ఈ పరిణామంలో మరో దేశం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే పాకిస్థాన్. సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. రక్షణ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రెండు దేశాలు సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి గతంలో సౌదీ మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పటికీ, ఇరు దేశాలు వాటిని అధికారికంగా అంగీకరించలేదు. 1980లలో పాకిస్థాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌదీతో రహస్య అవగాహన ఉందనే వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే పాకిస్థాన్ నుంచి అణు సహకారం పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు సౌదీకి అణు సాంకేతికతపై మరింత సానుకూలత లభించే అవకాశం రావడంతో ఈ పాత చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి.అయితే ఒక దేశం అణు ఆయుధాన్ని తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. యురేనియం శుద్ధి సామర్థ్యం ఒక భాగం మాత్రమే. దానికి తోడు అణు వార్‌హెడ్ రూపకల్పన, క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, సాంకేతిక పరీక్షలు, భద్రతా వ్యవస్థలు వంటి అనేక అంశాలు అవసరం. అయినప్పటికీ, అణు సామర్థ్యానికి దారితీసే సాంకేతిక మార్గం తెరుచుకోవడం కూడా అంతర్జాతీయ భద్రతలో కీలక పరిణామంగానే పరిగణిస్తారు. అమెరికా దృష్టిలో ఈ ఒప్పందం కేవలం అణు విద్యుత్ ప్రాజెక్టు కాదు. మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని కొనసాగించడం, సౌదీతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, చైనా వంటి దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఇందులో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక ఇజ్రాయెల్ మాత్రం భద్రతా కోణంలో ఈ పరిణామాన్ని చూస్తోంది. భవిష్యత్తులో సౌదీ అణు సామర్థ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉందని ఆ దేశంలోని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్ పరిశీలన, అంతర్జాతీయ పర్యవేక్షణ, భద్రతా నిబంధనలు వంటి అనేక దశలు ముందున్నాయి. అయినప్పటికీ, ఈ పరిణామం ఒక విషయం స్పష్టం చేస్తోంది. -
‘మేం చమురు అమ్మకపోతే.. ఎవరినీ అమ్మనివ్వం’
పశ్చిమాసియాలో క్రూడాయిల్ సంక్షోభం మరింత ప్రమాదకర మలుపు తిరిగింది. అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా సైనిక చర్యల కారణంగా తమ చమురు ఎగుమతులకు అడ్డంకులు కలిగిస్తే ఆ ప్రాంతం నుంచి చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ‘మమ్మల్ని చమురు అమ్మకుండా నిరోధిస్తే.. ఈ ప్రాంతంలో ఏ ఒక్క దేశాన్ని కూడా చమురు అమ్మనివ్వం’ అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ గాలిబాఫ్ చేసిన ప్రకటనతో గ్లోబల్ ఇంధన మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి.అమెరికాతో సాగుతున్న సైనిక ఘర్షణలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం అత్యంత స్పష్టంగా ఉందని గాలిబాఫ్ తెలిపారు. తమ భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తే పశ్చిమాసియాలోని చమురు మౌలిక వసతులను, సరఫరా మార్గాలను స్తంభింపజేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి భద్రతపై అమెరికా దళాల ఉనికి తీవ్రంగా ఖండించారు. ఇరాన్ భద్రతా ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే వరకు ఈ జలసంధిలో పూర్వ పరిస్థితులు నెలకొనవని చెప్పారు.ముదురుతున్న ఉద్రిక్తతలు.. వ్యూహాత్మక దాడులుఒకవైపు ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు ఉధృతం చేస్తామని అమెరికా హెచ్చరిస్తుండగా.. మరోవైపు దౌత్యపరమైన చర్చలు ఎలాంటి పురోగతి సాధించకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికి తోడు ఎర్రసముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం, ఇంధన రవాణాకు మరో కీలకమైన ప్రాంతంలో కొత్త ఆటంకాలను సృష్టిస్తోంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుఇరాన్ వ్యూహాత్మక హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఒకవేళ హార్మూజ్ జలసంధిలో సరఫరాకు విఘాతం కలిగితే గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. సైనిక దాడుల కంటే ముందే దౌత్య మార్గాల ద్వారా ఈ సంక్షోభానికి తెరదించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయమని కొందరు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
‘‘పక్కకెళ్లి ఆడుకో ట్రంప్’’ అంటున్న మిత్రదేశాలు.. భారీ మూల్యం
సముద్రం మీదుగా వెళ్లే ప్రతి చమురు బొట్టుతోపాటు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ప్రాంతమే పర్షియన్ గల్ఫ్..! జపాన్ నుంచి పశ్చిమ ఐరోపా దేశాల వరకు తమ ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఆధారపడతాయి. అలాంటి గల్ఫ్ ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంటే.. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఆయిల్ సరఫరాలు నిలిచిపోతుంటే.. జపాన్, ఐరోపా వంటి మిత్రదేశాలు అమెరికాకు ఈ యుద్ధంలో సైనిక సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు..? ఈ యుద్ధంలో అమెరికా ఎందుకు ఏకాకిగా మిగిలిపోయింది..? దీని వెనుక దశాబ్దాల నాటి డీప్ జియోపాలిటిక్స్, దౌత్యపరమైన తప్పిదాలు, తెరవెనుక జరిగిన ఒక పెద్ద రాజకీయ గేమ్ ఉందంటే మీరు నమ్ముతారా..? జపాన్, ఐరోపా దేశాలు గల్ఫ్ ప్రాంతానికి తమ నేవీ నౌకలను పంపి సహాయం చేద్దామన్నా, వాళ్ల దగ్గర అసలు ఆ స్థాయి 'లాంగ్ రేంజ్' యుద్ధనౌకలే లేవు..! రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. ప్రపంచ దేశాలతో అమెరికా ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ‘‘ప్రపంచ సముద్ర మార్గాలను మేమే పారడోల్ చేస్తాం, మీకు రక్షణ ఇస్తాం. కానీ దానికి ప్రతిఫలంగా మీ సైనిక, రక్షణ విధానాలను మేమే నియంత్రిస్తాం..!’’ అని అమెరికా చెప్పింది. ఎందుకంటే, ఆయా దేశాలు మళ్లీ పెద్ద నావికాదళాలను నిర్మిస్తే.. అమెరికాకు ఎదురుతిరుగుతాయేమోనన్న ఒక భయం..! అందుకే ఒక్క జపాన్, సామ్రాజ్యవాద చరిత్ర ఉన్న బ్రిటన్, స్వతంత్రంగా ఉండే ఫ్రాన్స్ తప్ప.. ప్రపంచంలో ఏ దేశానికి సుదూర ప్రాంతాలకు వెళ్లి యుద్ధం చేసే అంటే.. Power Projection నావికాదళాలు లేనేలేవు! మిగతా దేశాల ఓడలన్నీ కేవలం తమ సొంత తీరాలను కాపాడుకునే 'కోస్టల్ పెట్రోల్' బోట్లు మాత్రమే. ఒకవేళ ఏదైనా సుదూర యుద్ధ నౌక ఉన్నా.. అది డాక్‌లోనే ఉంటుంది. దాన్ని యుద్ధానికి సిద్ధం చేసి గల్ఫ్‌కు పంపడానికి నెలల సమయం పడుతుంది!ట్రంప్ ముందు ప్రతిపాదన ఇక రెండో కారణాన్ని విశ్లేషించుకుందాం..! ఫిబ్రవరి 11న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. నెతన్యాహు ట్రంప్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేయొచ్చు. కేవలం 4 రోజుల్లో ఈ యుద్ధం ముగిసిపోతుంది..! ఇరాన్ నాయకుల సమాచారం మా దగ్గర ఉంది. అక్కడ విప్లవం వచ్చి, ఇరాన్ రాజధాని పేరు 'ట్రంపోపోలిస్'గా మారుతుంది. మీకంటే ధైర్యవంతుడైన ప్రెసిడెంట్ చరిత్రలోనే ఉండరు..!’’ అంటూ.. ట్రంప్‌ను నెతన్యాహు ఆకాశానికెత్తేశారు..! ఈ సమావేశం జరిగినప్పుడు ఆ గదిలోనే ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వంటి నిపుణులందరూ ట్రంప్‌ను వారించారు. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్, ఇది అత్యంత భయంకరమైన ఆలోచన..! నెతన్యాహు 30 ఏళ్లుగా ఇదే మాట చెబుతూ.. తన యుద్ధాన్ని అమెరికాతో బలవంతంగా చేయించాలని చూస్తున్నారు. ఈ యుద్ధం జరిగితే గల్ఫ్ నాశనమవుతుంది’’ అని తీవ్రంగా హెచ్చరించారు. కానీ విదేశాంగ విధానం గురించి ఏమీ తెలియని మిలిటరీ మంత్రులు మాత్రం.. ‘‘యుద్ధమే కదా?? చేసేయండి..’’ అని తాపీగా చెప్పేశారు. దాంతో.. వెనువెంటనే కార్బన్ షిప్‌లు, నౌకలు గల్ఫ్ వైపు బయలుదేరాయి..! యుద్ధానికి వెళ్లేముందు అమెరికా సాధారణంగా తమ మిత్రదేశాలైన జపాన్, బ్రిటన్‌లతోపాటు.. నాటోతో రహస్య సమాచారాన్ని పంచుకుంటుంది. కానీ.. ఈసారి మాత్రం ఎలాంటి ఇంటెలిజెన్స్ షేరింగ్ జరగలేదు..! ఐరోపా దేశాలు, జపాన్‌పై అమెరికా ఆగ్రహం ఇరాన్ దగ్గర ఉన్న అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు.. పర్షియన్ గల్ఫ్‌లోని ప్రతి చమురు శుద్ధి కర్మాగారాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బూడిద చేయగలవు..! స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్లే ప్రతి నౌకను ఇరాన్ సులువుగా టార్గెట్ చేయగలదు. ఇప్పటికే ఈ అంశాలు ఈ యుద్ధంలో రూఢీఅయ్యాయి. అమెరికా యుద్ధనౌకలు కూడా గల్ఫ్‌లో కదలకుండా నిలబడితే.. అంటే లంగర్ వేసినట్లుగా స్టేబుల్‌గా ఉంటే.. ఇరాన్ క్షిపణులకు ఈజీ టార్గెట్‌గా మారిపోతాయని తేలిపోయింది. నాలుగు రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం అలా కొనసాగుతుండడంతో.. ట్రంప్ ప్రభుత్వం కంగారుపడి.. ఐరోపా దేశాలు, జపాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘మీ సైన్యాలను పంపండి..!’’ అంటూ గగ్గోలు పెట్టింది..! కానీ ఆలోచించండి.. ఒకవైపు ‘‘మీరు నౌకాదళాలను అభివృద్ధి చేసుకోవద్దు..’’ అని దశాబ్దాలుగా చెప్పిన అమెరికా, ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ‘‘సైన్యాన్ని పంపండి’’ అంటే వాళ్లు ఎక్కడి నుంచి తెస్తారు..? పైగా, తమకు తెలియకుండా, తమ ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసే ఒక యుద్ధంలోకి.. మిత్రదేశాలు ఎందుకు దూకుతాయి..? అందుకే ఐరోపా, జపాన్ ఈ యుద్ధంలో అస్సలు పాల్గొనదలచుకోలేదని తెలుస్తోంది..!సమస్యలకు పరిష్కార మార్గం ఏది? ఈ యుద్ధంలో ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే.. సమస్య పరిష్కారానికి అస్సలు చర్చలు జరగడం లేదు. దౌత్యపరమైన ప్రయత్నాల ఊసే లేదు. నామ్‌కే వాస్తేగా కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకుంటున్నా.. అవి ఏకపక్షంగా ఉంటున్నాయి. అమెరికా ఈ యుద్ధంతో ప్రపంచానికి కేవలం యుద్ధాన్ని కొనసాగించేందుకు వనరులను సమకూర్చుకోవడానికే కాల్పుల విరమణ అనే పరిస్థితిని పరిచయం చేసింది. సాధారణంగా ఏదైనా అంతర్జాతీయ సంక్షోభం వచ్చినప్పుడు.. అగ్ర నాయకులు మాట్లాడటానికి ముందే, 'టెక్నికల్ టీమ్‌లు' రహస్య చర్చలు జరిపి, కాంట్రాక్ట్‌లను సిద్ధం చేస్తాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో తన స్టేట్ డిపార్ట్మెంట్ నిపుణులను, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను పూర్తిగా పక్కన పెట్టింది..! ట్రంప్ పంపిన జారెడ్ కుష్నర్ వంటి ప్రైవేట్ రాయబారులు చర్చల కోసం ఖతార్ రాజధాని 'దోహా' వెళ్లినప్పుడు.. ఇరాన్ ప్రతినిధులు ముఖం మీదే చెప్పారు.. ఏమని అంటే.. ‘‘ఈ వారం మీతో మాట్లాడటానికి ఏమీ లేదు! ముందు సరిగ్గా టెక్నికల్ చర్చలు జరపండి..!’’ అనేది దాని సారాంశం. దాంతో ఆ రాయబారులు వెనక్కి వెళ్లక తప్పలేదు..! యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు అమెరికా-ఇరాన్ మధ్య అసలైన 'టెక్నికల్ టాక్స్' జరగనే లేదనేది బహిరంగ రహస్యం..!సో ఫైనల్‌గా చెప్పాలంటే.. జపాన్‌తోపాటు, ఐరోపా దేశాలు గల్ఫ్‌కు రాకపోవడానికి కారణం వాళ్ల స్వార్థం కాదు.. అమెరికా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతోపాటు.. ట్రంప్ అహంకారమే..! మిత్రదేశాల సలహాలను పక్కన పెట్టి, కేవలం అబద్ధాలు చెప్పి, మభ్యపెట్టే వాళ్ల మాటలు విని యుద్ధానికి దిగితే.. ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ గల్ఫ్ సంక్షోభం ప్రపంచానికి నిరూపించింది. ఇప్పుడు ఈ ఇంధన సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థే ఒక పెద్ద మందగమనం అంటే.. Depression వైపు వెళ్తోంది..! - హెచ్. కమలాపతి రావు, సీనియర్ జర్నలిస్టు. -
ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకపడ్డ అమెరికా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఇరాన్‌పై అమెరికా దాడులు చేసింది. ఆ దేశ మిలటరీ స్థావరాలే లక్ష్యంగా (బుధవారం) అమెరికా వైమానిక దళాలు విరుచుకపడ్డాయి. ఆ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం ఇది వరుసగా 12వ రాత్రి కావడం ఆందోళన కలిగించే విషయంఅమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో "ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు అమెరికా దళాలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై మరిన్ని దాడులను ప్రారంభించాయి. ఆ ప్రాంతీయ జలాల్లో పయనించే పౌర నావికులకు ,వాణిజ్య నౌకలకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును పూర్తిగా మట్టుబెట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది." అని ప్రకటన విడుదల చేసింది.మధ్యప్రాచ్య సముద్ర మార్గాల్లో నౌకాయాన భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఇరాన్ సైనిక శక్తులను దెబ్బతీసేందుకు ఈ దాడులు తీవ్రతరం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా ఇరాన్ సైతం అమెరికాకు ఘాటుగా బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా తమపై దాడులు చేస్తే కన్నుకు కన్ను అన్న రీతిలోనే సమాధానం ఉంటుందని తెలిపారు. -
"కన్నుకు.. కన్ను".. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో టెహ్రాన్ ఘాటుగా బదులిచ్చింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై మండిపడ్డారు. "హర్ముజ్ జలసంధిలో పయనించే ఏ నౌకపైనా ఇరాన్ దాడులు చేయకూడదు. ఇరాన్ మిస్సైళ్లు, రాకెట్లు లేదా డ్రోన్లతో ఏ నౌకపైనైనా దాడి చేస్తే... దానికి ప్రతికారంగా ఇరాన్‌లోని ఒక వంతెనను లేదా విద్యుత్ ప్లాంట్‌ను అమెరికా దళాలు బాంబులతో పేల్చివేస్తాయి. అని హెచ్చరించారు.దీనిపై స్పందించిన అరాఘ్చీ "మా రక్షణ విధానం చాలా స్పష్టం 'కంటికి కన్ను' ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగే ఏ రకమైన దాడికైనా మా స్పందన అత్యంత శక్తివంతంగా, నిర్ణయాత్మకంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.అనంతరం ఆ దేశ ఆర్మీ అధికారులు మాట్లాడుతూ అమెరికా చేస్తున్న ఈ బెదిరింపుల వల్ల యుద్ధం మరింతగా పెరగడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కాగా అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమవ్వడంతో దాడులు తీవ్రతరమవుతున్నాయి. దీంతో వరుస దాడులతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. -
అమెరికాని రూ. 96 వేల కోట్లు అడిగిన పాకిస్థాన్!
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికా సహాయాన్ని కోరింది. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించిన తర్వాత, పాకిస్థాన్ అమెరికా నుండి 10 బిలియన్ (రూ. 96,536 కోట్ల) డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని కోరినట్లు రాయిటర్స్ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణంలో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించి, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ దౌత్యపరమైన క్రెడిట్‌ను ఉపయోగించుకుని, ఇప్పుడు వాషింగ్టన్ నుండి ఈ భారీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలని పాకిస్థాన్ ఆశిస్తోంది. ఒకవేళ అమెరికా గనుక ఈ 10 బిలియన్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపితే, అది పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు సంజీవనిలా మారుతుంది. దీనివల్ల పాకిస్థాన్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ పడిపోకుండా స్థిరపడుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. అయితే,ఈ విన్నపంపై అటు అమెరికా, ఇటు పాకిస్థాన్ ప్రభుత్వం గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.కానీ, పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌తో భేటీ అయినప్పుడు.. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దెబ్బతింటుందో వివరించినట్లు పాక్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పాకిస్థాన్ ప్రస్తుతం ఐఎంఎఫ్ నుండి పొందిన 7 బిలియన్ల ప్యాకేజీ కింద కొనసాగుతోంది. ఈ లోన్ పొందడం కోసం పాక్ ప్రభుత్వం ప్రజలపై భారీగా పన్నులు పెంచడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడం వంటి కఠినమైన సంస్కరణలను అమలు చేస్తోంది.2023లో ఒక దశలో పాకిస్థాన్ దేశం పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి రాగా, అప్పట్లో ఐఎంఎఫ్ ఇచ్చిన మూడు బిలియన్ల అత్యవసర నిధులు కాపాడాయి. ఆ తర్వాత వాతావరణ మార్పుల తట్టుకునేందుకు మరో 1.3 బిలియన్ల లోన్ కూడా పొందింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, చైనా, సౌదీ అరేబియాలు ఇచ్చే అప్పులపైనే పాకిస్థాన్ విదేశీ నిల్వలు ఆధారపడి ఉన్నాయి.అసలు ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి?ఇది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తన ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అందించే చాలా అరుదైన ఆర్థిక ప్యాకేజీ. ఏదైనా మిత్రదేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దాని కరెన్సీని కాపాడటానికి, డాలర్ ఫండింగ్ లేదా గ్యారెంటీల రూపంలో అమెరికా ఈ సహాయాన్ని అందిస్తుంది. గతంలో 2002లో ఉరుగ్వే దేశానికి, 2025లో అర్జెంటీనా దేశానికి అమెరికా ఇటువంటి ప్యాకేజీలను ప్రకటించింది. -
‘హర్మూజ్‌కు ప్రత్యామ్నాయం దొరికింది’.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
టెహ్రాన్: హర్మూజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలను ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అన్వేషణ వైపు మళ్లిస్తున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇరాన్‌కు ఉన్న వ్యూహాత్మక ఆధిపత్యం నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఒమన్ తదితర దేశాలు పైప్లైన్లు, రైల్వేలు, కొత్త పోర్టుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి.సాధారణ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి మీదుగా రోజుకు 100 నుంచి 150 నౌకలు ప్రయాణిస్తూ ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్, సహజవాయువు, ఆహార పదార్థాలు, ఇతర సరుకులను రవాణా చేస్తుంటాయి. అయితే ఇరాన్‌తో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు, సముద్ర భద్రతపై నెలకొన్న ఆందోళనల కారణంగా ఈ మార్గంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో గల్ఫ్ దేశాలకు స్పష్టమైంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎగుమతులు కొనసాగించే దిశగా భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి.సౌదీ అరేబియా ప్రత్యేక వ్యూహంసౌదీకి తూర్పున పర్షియన్ గల్ఫ్, పశ్చిమాన ఎర్ర సముద్రం ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తూర్పు ప్రాంతాల నుంచి చమురును పెట్రోలైన్ ద్వారా యాంబూ పోర్టుకు తరలిస్తోంది. అలాగే జెద్దా–దమ్మామ్ మధ్య సుమారు 7 బిలియన్ డాలర్లతో రైల్వే, హైవే ప్రాజెక్టులను చేపడుతోంది.ఫుజైరాపై యూఏఈ దృష్టిదుబాయ్, అబుదాబి పోర్టులు హార్మూజ్ లోపల ఉండటంతో యూఏఈకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే హార్మూజ్ వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఉన్న ఫుజైరా, కోర్ఫక్కన్ పోర్టులను ప్రత్యామ్నాయ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోంది. 2027 నాటికి రెండో ఈస్ట్-టు-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌ను పూర్తి చేసి ఫుజైరా ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఒమన్‌కు భౌగోళిక ప్రయోజనంసోహార్, దుఖ్మ్, సలాలా పోర్టులు హార్మూజ్ వెలుపల ఉండటంతో ఒమన్‌కు సహజంగానే వ్యూహాత్మక ప్రయోజనం ఉంది. అయితే సౌదీ, యూఏఈతో పోలిస్తే పరిమిత ఆర్థిక వనరుల కారణంగా భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే అవకాశం తక్కువగా ఉంది.ఖతార్, కువైట్‌కు సవాళ్లుఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతులు పూర్తిగా హార్మూజ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా సౌదీ లేదా యూఏఈ భూభాగం గుండా పైప్‌లైన్ నిర్మించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఖతార్‌పై విధించిన దిగ్బంధనం కారణంగా పొరుగు దేశాలపై పూర్తి స్థాయి విశ్వాసం నెలకొనలేదు.కువైట్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. సౌదీ మార్గాన్ని వినియోగిస్తే ఆర్థిక ఆధారపడటం పెరుగుతుందనే ఆందోళన ఉంది. మరోవైపు ఇరాక్ మార్గంలో భద్రతా సమస్యలు ప్రత్యామ్నాయ ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి.ప్రాజెక్టులు ఉన్నా.. అమలులో సవాళ్లుఇరాక్ కారిడార్, హిజాజ్ రైల్వే పునరుద్ధరణ, ఇండియా–యూఏఈ–ఒమన్ సముద్రగర్భ పైప్‌లైన్ వంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వాటి అమలుకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. హార్మూజ్ సాధారణ స్థితికి వస్తే భారీ పెట్టుబడులతో చేపట్టిన ప్రాజెక్టుల అవసరం తగ్గే అవకాశం ఉంది. పైప్లైన్లు కూడా దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సముద్ర మార్గాల ద్వారా జరిగే భారీ స్థాయి చమురు రవాణాను రైళ్లు, ట్రక్కులు లేదా పైప్లైన్లు పూర్తిగా భర్తీ చేయలేవని నిపుణులు చెబుతున్నారు.అత్యవసర పరిస్థితుల కోసమే ప్రత్యామ్నాయాలుగల్ఫ్ దేశాలు చేపడుతున్న ఈ భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల లక్ష్యం హార్మూజ్ జలసంధిని పూర్తిగా పక్కన పెట్టడం కాదని, అత్యవసర పరిస్థితుల్లో కొంతకాలం ఎగుమతులు కొనసాగించే సామర్థ్యాన్ని పెంచుకోవడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రణాళికలు విజయవంతం కావాలంటే నిధులతో పాటు ప్రాంతీయ రాజకీయ విశ్వాసం, స్థిరత్వం కూడా కీలకమని అభిప్రాయపడుతున్నారు.- హెచ్. కమలాపతి రావు, సీనియర్ జర్నలిస్టు. -
పశ్చిమాసియా ఉద్రిక్తత.. భూగర్భంలోకి ఇరాన్ అణు రక్షణ వ్యవస్థ
టెహ్రాన్: అమెరికాతో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అణుబాంబుల తయారికీ ఎంతో కీలకమైన అణు సెంట్రిఫ్యూజ్‌లను ఆనటాంజ్ సమీపంలోని ‘పిక్‌యాక్స్ మౌంటెన్’ అని పిలిచే అత్యంత భద్రమైన భూగర్భ ప్రాంగణంలోకి తరలించినట్లు తెలుస్తోంది. గగనతలం నుంచి వీటిపై దాడులు చేసిన సైతం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం... అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ—2025 జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ ముగిసిన కొద్ది నెలలకే ఇరాన్ ఈ పరికరాలను అక్కడకు మార్చిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆ ఘర్షణలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌కు చెందిన అణు కర్మాగారాలపై దాడులు చేశాయిఅయితే, ఈ పిక్‌యాక్స్ స్థావరం ఆ దాడుల నుంచి తప్పించుకుంది. అంతేకాకుండా, ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమైన మరింత తీవ్రమైన వైమానిక దాడుల్లో కూడా ఇది చెక్కుచెదరకుండా సురక్షితంగా ఉంది. ఈ భూగర్భ కేంద్రం కఠినమైన గ్రానైట్ రాతి కింద 300 అడుగులకు పైగా లోతులో నిర్మించబడిందని భావిస్తున్నారు. ఇది 2025లో బాంబు దాడులకు గురైన నటాంజ్, ఫోర్డో అణు శుద్ధి కర్మాగారాల కంటే చాలా లోతైనది. పర్వతం చుట్టూ సుమారు 15 నెలలుగా ట్రక్కుల రాకపోకలు, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని శాటిలైట్ చిత్రాలు, నిఘా సమాచారం వెల్లడించాయి. ఈ ప్రాంగణాన్ని ఇరాన్ నిలకడగా అభివృద్ధి చేస్తోందని ఇది సూచిస్తోంది అక్కడకు చేర్చిన సెంట్రిఫ్యూజ్‌లను ఎక్కడి నుండి తీసుకువచ్చారనేది స్పష్టంగా తెలియలేదు, కానీ ఇరాన్‌లోని ఇతర అణు కేంద్రాల నుండి వాటిని మార్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఐఏఈఏ పరిశీలనకు దూరంఅంతర్జాతీయ పరమాణు ఇంధన సంస్థ (IAEA) ఇన్ స్పెక్టర్లను ఈ పిక్‌యాక్స్ కాంప్లెక్స్‌ను సందర్శించడానికి ఇరాన్ అనుమతించలేదు. లోపల ఏమి జరుగుతుందనే దానిపై ఎటువంటి వివరణాత్మక సమాచారాన్ని కూడా అందించలేదు.2021లోనే ఇరాన్ పిక్‌యాక్స్ సైట్లో "అణు కార్యకలాపాలు" చేపడతామని తమకు తెలియజేసిందని IAEA డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రోసీ మార్చిలో తెలిపారు. అయితే అంతర్జాతీయ పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో, ప్రపంచ కంటికి కనిపించకుండా ఈ భూగర్భ స్థావరాన్ని ఇరాన్ రహస్య కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుందేమోనన్న ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.‘పిక్‌యాక్స్’ తదుపరి లక్ష్యం కావచ్చు ట్రంప్ఈ భూగర్భ ప్రాంగణం త్వరలోనే అమెరికా దాడికి ప్రధాన లక్ష్యం కానుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే హెచ్చరిస్తున్నారు.గత వారం ఆయన మాట్లాడుతూ, "పిక్‌యాక్స్ ప్రధాన ద్వారం వద్దే మేము ఒక పెద్ద, బలమైన దాడి చేయడానికి అనువైన లక్ష్యంగా ఉంది" అని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ సైట్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
ఐఆర్జీసీ ప్రతీకార దాడులు
అమెరికా సైనిక, ఆర్థిక, సాంకేతిక మౌలిక వసతులే లక్ష్యంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా బహ్రెయిన్‌లో ఉన్న ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్‌కు చెందిన ప్రధాన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా ప్రతికార దాడిఇరాన్ అధికారిక వార్తా సంస్థల (ఐఆర్ఎన్ఏ, తస్నీమ్) వివరాల ప్రకారం.. తమ ఏరోస్పేస్ బలగాలు ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా దాడులను నిర్వహించాయి. ఇటీవల ఇరాన్‌లోని దార్ఖోవిన్ వద్ద అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న పౌర అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా బలగాలు జరిపిన వైమానిక దాడులకు నిరసనగా ఈ క్షిపణి దాడి చేపట్టినట్లు ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) హార్మూజ్ జలసంధిలో నౌకాయాన భద్రత నెపంతో ఇరాన్ స్థావరాలపై దాడులకు దిగుతుండటంతో ఇరాన్ సైతం గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా రాడార్ వ్యవస్థలు, వైమానిక స్థావరాలతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ డిజిటల్ వనరులను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది.స్వతంత్ర వర్గాల స్పందన.. ప్రస్తుత పరిస్థితిఐఆర్జీసీ చేసిన ఈ క్షిపణి దాడి ప్రకటనపై అమెజాన్ సంస్థ గానీ, బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధ్రువీకరణ విడుదల చేయలేదు. దాడి వల్ల జరిగిన ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం వివరాలపై స్వతంత్ర వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.గ్లోబల్ టెక్నాలజీ, ఆర్థిక రంగాలపై ప్రభావంయుద్ధాల్లో కేవలం మిలిటరీ క్యాంపులనే కాకుండా ప్రధాన టెక్ కంపెనీల డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తోంది. బహ్రెయిన్ వంటి కీలక ఆర్థిక కేంద్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మౌలిక వసతులపై దాడి జరగడం వల్ల ప్రాంతీయ డిజిటల్ సేవలు, గ్లోబల్ సప్లై చైన్, అంతర్జాతీయ వాణిజ్య నెట్‌వర్క్‌లు దెబ్బతినే ప్రమాదముంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో భద్రతా సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
ఖర్గ్ ద్వీపం కోసం ఆలోచిస్తే.. ఇరాన్ భారీ వార్నింగ్
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి భారీ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఖర్గ్ ద్వీపం ఆక్రమించడానికి వాషింగ్టన్ యత్నిస్తే అక్కడికి వచ్చిన సైనికులు ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ట్రంప్ ఖర్గ్ ద్వీపంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పర్షియన్ గల్ఫ్‌లోని, బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం ఆ దేశంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన ఆస్తులలో ఇది ప్రధానమైనది. ఇరాన్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే సరఫరా అవుతుంది.దీంతో దీనిని ఎలాగైనా ఆక్రమించాలని ట్రంప్ తొలినుంచి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేలా పరిమిత భూతల దాడి చేసే ఆలోచన ఉందని మాట్లాడారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ "ఖర్గ్ ద్వీపంపై భూతల దాడి చేయడానికి అమెరికా సైనికులు వస్తే... వారిని 'స్వాగతించడానికి' మా సైన్యం, మా ప్రజలు నిమిషాలు లెక్కిస్తూ, సిద్ధంగా ఎదురుచూస్తున్నారు." అని అన్నారు.మళ్లీ ఉద్రిక్తతప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమై, మళ్లీ భారీ ఎత్తున దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. -
ఫ్యామిలీకి అదే చివరి కాల్ అనుకున్నా.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ప్రమాద పరిస్థితుల్లో పనిచేశారని ఆయన వెల్లడించారు. మేము ఎప్పుడు చనిపోతామో.. మాపై బాంబులు ఎప్పుడు వేస్తారోననే భయంతో వణికిపోయినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన.. ‘చర్చలు జరుగుతున్న సమయంలో ఏ క్షణంలోనైనా సమావేశంపై బాంబు దాడి జరగొచ్చనే భయం ఉండేది. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది చివరి సంభాషణ కావచ్చేమో అన్న ఆలోచన వచ్చేది’ అని తెలిపారు.అనంతరం.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమంలో యురేనియం ఎన్రిచ్మెంట్ను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని, తమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. ‘చర్చలు జరపాలి.. బెదిరింపులు లేదా ప్రలోభాలతో మమ్మల్ని మార్చలేరు’ అని అరాఘ్చి వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా తమ లక్ష్యాలను సాధించలేమని భావించిన తర్వాతే అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సైనిక ఒత్తిడితో ఇరాన్‌ను లొంగదీయవచ్చన్న వాదనలను కూడా అరాఘ్చి ఖండించారు. ‘ఇరాన్ వెనిజులా కాదు. ఒక నాయకుడిని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోదు. ఇరాన్లో అధికార వ్యవస్థ అనేక స్థాయిల్లో పనిచేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై వరుసగా తొమ్మిదో రోజు వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాన్ మీడియా ప్రకారం.. తబ్రిజ్, చాబహార్, కొనారక్, బందర్ మహ్షహర్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా సిరియాలోని అల్-తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించింది. -
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్న వేళ, ఇరాక్‌లో జరిగిన ఓ ఆపరేషన్‌లో అమెరికా సైనికుడు మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు. దీంతో, ఇరాన్‌పై దాడుల మరింత పెంచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో ఇరాన్‌కు ప్రయాణాలను నివారించాలని, ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశం విడిచి రావడాన్ని పరిశీలించాలని భారత్ సూచించింది.అమెరికా సైనికుడు మృతిఅమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఉత్తర ఇరాక్‌లో కూలిపోయిన ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్లోని పేలని ఆయుధ భాగాలను నిర్వీర్యం చేసే సమయంలో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో సైనికుడు స్వల్పంగా గాయపడ్డాడు. జూలై 18న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సైనికుల వివరాలను వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చిన తర్వాత వెల్లడిస్తామని CENTCOM తెలిపింది. ఈ తాజా మరణంతో గత దాదాపు ఐదు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది.ఇరాన్‌పై వరుస దాడులుఉద్రికత్తల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు ప్రారంభించింది. ఇది వరుసగా తొమ్మిదో రాత్రి దాడులుగా CENTCOM పేర్కొంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. అయితే తాజా దాడుల్లో ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారో, ఎంత నష్టం జరిగిందో అమెరికా అధికారులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా తెలిపింది.ఇరాన్ ప్రయాణంపై భారత్ కీలక సూచనపశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం భారత పౌరులకు ప్రయాణ సూచన జారీ చేసింది. ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దేశం విడిచి వెళ్లే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, తాజా భద్రతా పరిస్థితులను గమనించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.బహ్రెయిన్‌లో అమెరికా పౌరులకు హెచ్చరికఇదే సమయంలో బహ్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి ముప్పు ఉందని సమాచారం అందినట్లు పేర్కొంది. అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఖమేనీ అంత్యక్రియల్లో హైడ్రామా.. ఇరాన్ విదేశాంగ మంత్రిపై రాళ్ల వర్షం!
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత దేశ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఆయనకు ఘన నివాళులు అర్పించాల్సిన అంత్యక్రియలే అధికార పోరుకు వేదికగా మారాయి. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీపై అమెరికాతో రాజీని వ్యతిరేకించే అతివాదులు బహిరంగంగా విమర్శలు గుప్పించడం, అమెరికాతో రాజీకి వెళ్లారని దేశద్రోహులుగా ముద్ర వేయడంతో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఖమేనీ అంతిమయాత్రలో పాల్గొన్న అధ్యక్షుడు పెజెష్కియన్‌ను లక్ష్యంగా చేసుకుని అతివాదులు కొందరు ట్రంప్‌తో రాజీపడ్డవారికి మరణం అంటూ నినాదాలు చేశారు. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి అరాఘ్చీపై కొందరు రాళ్లు విసిరారు. దేశాన్ని అమ్ముకున్న వ్యక్తి అంటూ దూషించారు.కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ? ఖమేనీ వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ ప్రజల్లో కనిపించకపోవడం ఊహాగానాలకు తావిచ్చింది. ఆయన నిజంగా పాలనను నడిపిస్తున్నారా? లేక ఆయన పేరుతో ఇతర నేతలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాఘ్చీలు మోజ్తాబా ఖమేనీ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.మొజ్తబాపై తిరుగుబాటుఅమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ నిపుణుడు అరాష్ అజీజీ వ్యాఖ్యానిస్తూ.. మొజ్తబా ఖమేనీ ప్రజల్లో కనిపించకపోవడంతో ఘాలిబాఫ్, ఆయన మిత్రులే పాలనను నడిపిస్తున్నారనే అభిప్రాయం బలపడింది. దీంతో అతివాదులు మొజ్తబాపై తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అని అన్నారు. అతివాది ఎంపీ మహ్మూద్ నబవియన్ కూడా సోషల్ మీడియాలో ఇరాన్ ప్రభుత్వం తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా?" అంటూ ప్రశ్నిస్తూ, తర్వాత ఖమేనీ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. తిరుగుబాటు దారుల్ని అడ్డుకుంటాం అని ప్రకటించారు.అధ్యక్షుడికి బహిరంగ బెదిరింపులు రాజకీయ విమర్శలు వ్యక్తిగత బెదిరింపుల దాకా వెళ్లాయి. ఐఆర్‌జీసీతో అనుబంధం ఉన్న మతగాయకుడు మొహమ్మద్ అలీ బఖ్షీ.. సుప్రీం లీడర్ ఆదేశాలు అమలు చేయకపోతే కత్తి మీ గొంతుకే చేరుతుంది. మీకు నరకం చూపిస్తాం’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియన్‌ను హెచ్చరించారు. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కువకాలం నిలవలేదు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకలపై దాడులు ప్రారంభించడంతో అమెరికా ప్రతిదాడులకు దిగింది. దీంతో అతివాదులు అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అమెరికా-ఇజ్రాయెల్‌లపై మరింత దూకుడుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.మాజీ విదేశాంగ మంత్రి మనూచెహర్ మొట్టాకీ కూడా ప్రాంతంలోని ఏదైనా అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసి వందమంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకురావాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవలి పరిణామాల్లో అతివాదుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు కనిపిస్తున్నాయి. ఐఆర్జీసీ మద్దతురాలు ఎంపీ మహ్మూద్ నబవియన్ను పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ నుంచి తొలగించారు. అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకించిన మరో సభ్యుడినీ తప్పించారు.జర్మనీకి చెందిన భద్రతా విశ్లేషకుడు హమీద్రెజా అజీజీ అభిప్రాయం ప్రకారం.. ఘాలిబాఫ్ హార్డ్లైన్ వర్గాలను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. దేశంలో అస్థిరత పెరుగుతున్న వేళ ఈ వర్గాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి అని పేర్కొన్నారు.ఒకే లక్ష్యం.. కానీ విభేదాలు అంతర్గతంగా తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ ఇరాన్ నాయకత్వం మొత్తం ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం పొందడం, హర్మూజ్ జలసంధిపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, దేశంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అయితే వాటిని సాధించడానికి అమెరికాతో రాజీ పడాలా? లేక సైనికంగా ప్రతిస్పందించాలా? అన్న విషయంలోనే అధికార వర్గాల్లో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. 🔻حمله مخالفان توافق به عراقچی با شعار:«مرگ بر وطنفروش خائن» «بیشرف، بیشرف»🔻شعار «مرگ بر سازشگر» در حضور پزشکیان در مراسم تشییع جنازه خامنهای.🔻 Opponents of the agreement attack Araqchi with the slogans: "Death to the traitorous sellout!" and "Dishonorable!… pic.twitter.com/ThBhZLP1tf— Siamak Tadayon Tahmasbi (@SiamakTadayonT) July 6, 2026 -
ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. దాడికి దాడే సమాధానం..
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి భీకర వైమానిక దాడులు నిర్వహించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, జోర్డాన్ దాడిలో మరో అమెరికా సైనికుడు ఇంకా గల్లంతయ్యాడు. నలుగురు గాయపడగా చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చే వరకు వారి పేర్లను వెల్లడించబోమని సెంట్కామ్ తెలిపింది. అలాగే, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, జోర్డాన్ దాడికి బాధ్యులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.🚨 Cluster missiles from Iran are raining down on U.S. military bases in Bahrain and Jordan.In one of the fiercest attacks on the Epstein Club since the war began... pic.twitter.com/c5RYWJ7gp3— IRGC (@IRGC_NEWS) July 18, 2026ఈ సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇద్దరు అమెరికా సైనికుల మరణం తమ సంకల్పాన్ని మరింత బలపరిచిందని, దీనికి తగిన ప్రతిస్పందన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ పోర్టు నగరంతో పాటు హాజీబాద్ సమీప ప్రాంతాలపై అమెరికా దాడులు జరిపింది. అయితే ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.మరోవైపు, ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ అమెరికాకు "మరచిపోలేని గుణపాఠం నేర్పుతాం" అంటూ హెచ్చరించారు. అమెరికా ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోందని, అధ్యక్షుడు ట్రంప్ హామీలకు విశ్వసనీయత లేదని ఆయన విమర్శించారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ ఆరోపిస్తుండగా.. వాణిజ్య నౌకలను ఇరాన్ బెదిరిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.After death of 2 American soldiers in Jordan due to Iranian missile strikes, US forces launched a massive strikes campaign against IRGC targets across Iran. Currently over 30 US fighter jets are hitting the IRGC targets across Iran. pic.twitter.com/fjNH7MxQh2— Baba Banaras™ (@RealBababanaras) July 19, 2026ఇక గల్ఫ్ దేశాలు పరిస్థితిని అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అన్ని పక్షాలు వెంటనే కాల్పులు నిలిపి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.🚨 U.S. President Donald Trump has reportedly ordered CENTCOM to “open the gates of hell” on Iran following the deaths of American service members in Jordan.U.S. officials say tonight’s strikes are expected to be significantly larger than previous rounds.Meanwhile, U.S.… pic.twitter.com/G5jhqPtgcQ— The Iran Watcher 🇮🇷 (@TheIranWatcher) July 18, 2026 -
"రక్తానికి రక్తం" రగిలిపోతున్న ఇరాన్
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందనే తరుణంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఇరాన్లో ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్‌గా చేసుకొని ఓ వివాదాస్పద హోర్డింగ్‌ను ప్రదర్శనకు ఉంచారు. మధ్య టెహ్రాన్‌లోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఈ భారీ బ్యానర్‌పై "రక్తానికి రక్తం" అనే నినాదాన్ని పర్షియన్ భాషలో రాశారు.ఇరాన్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంది. తమ దేశాధినేత మాజీ సుప్రీంలీడర్ ఆయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో చంపడంతో ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ట్రంప్‌ను చంపేస్తామంటూ నినాదాలు హోరెత్తాయి. తాజాగా టెహ్రాన్‌లో ట్రంప్‌ను చంపేస్తామంటూ బ్యానర్ వెలిసింది. ఈ బ్యానర్లో వెనుక భాగంలో అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' తగలబడుతున్నట్లు చూపించారు. దాని ముందర అమెరికా ఫ్లాగ్‌తో కప్పబడిన శవపేటికలపైన డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌తో పాటు ఆయన ఐదుగురు పిల్లలు—ఇవాంకా, డాన్ జూనియర్, ఎరిక్, టిఫానీ, మరియు బారన్ ట్రంప్‌ల చిత్రాలను ముద్రించారు.ట్రంప్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ ఇలాంటి హోర్డింగ్‌ను ఏర్పాటు చేయడం ఇది రెండవసారి. అంతకుముందు టెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్‌లో ట్రంప్ శవపేటికలో పడుకుని ఉన్నట్లు ఒక బిల్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఆ చిత్రంలో ట్రంప్ జుట్టు చెల్లాచెదురై, కళ్ళు, నోరు మూసి ఉండి, ఎర్రటి టైపై చేతులు పెట్టుకుని శవపేటికలో ఉన్నట్లు చూపించారు.వ్యూహాత్మక ప్రచారంటెహ్రాన్లోని వలియాస్ర్ స్క్వేర్‌లో ఉండే ఇలాంటి పెద్ద పెద్ద మురల్స్ (గోడచిత్రాలు) అన్నింటినీ 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్'తో సంబంధం ఉన్న 'ఓజ్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్' రూపొందిస్తుంది. ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ఇరాన్ తన సంప్రదాయ విప్లవాత్మక ఇమేజరీ, యుద్ధ స్మారకాలు, లాజికల్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టెహ్రాన్‌లోని బిజీ రోడ్లపై ఇలాంటి భారీ బిల్ బోర్డులను వాడుతోంది.మోజ్తబా ఖమేనీ హెచ్చరికగత వారం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన టెలిగ్రామ్ ఛానల్లో మాట్లాడుతూ, తన తండ్రి హత్యకు ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామని ప్రకటించారు. "ఈ ప్రతీకారం మా దేశం యొక్క డిమాండ్. దీనికి కారణమైన నేరగాళ్లు (పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరి పేర్లు మాకు తెలుసు) తమ బెడ్లపై ప్రశాంతంగా ప్రాణాలు వదలలేరు. ఆ కోరిక తీరకుండానే వారు సమాదుల్లోకి వెళ్తారు" అని హెచ్చరించారు.ఇరాన్‌ను బాంబులతో ముంచెత్తండి: ట్రంప్మరోవైపు, ఇరాన్ తనను ఒకవేళ విజయవంతంగా హత్య చేస్తే, ఆ దేశాన్ని ఊహించని స్థాయిలో బాంబులతో ముంచెత్తాలని డొనాల్డ్ ట్రంప్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ తో ట్రంప్ మాట్లాడుతూ.. "నేను చాలా కాలంగా ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే, వారు ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాలని నేను ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చాను" అని పేర్కొన్నారు.రగులుతున్న యుద్ధ జ్యాలలుమరోవైపు ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అమెరికా రాబోయే రోజుల్లో డజన్ల కొద్దీ రీఫ్యూయలింగ్ (ఇంధనాన్ని నింపే) విమానాలను ఇజ్రాయెల్‌కు పంపుతోందని ఆక్సియోస్ (Axios) నివేదిక పేర్కొంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఇరాన్ పై భారీ వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ఈ మేరకు వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి దేశానికి చెందిన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలే టార్గెట్‌గా దాడులు జరపాలని అందుకు గానూ పెద్దఎత్తున గగనతల ఇంధన సరఫరా విమానాలను ఇజ్రాయెల్ పంపినట్లు ఆక్సియోస్ కథనాలు ప్రచురించింది. కాగా ఇదివరకే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సమీపంలో ఉన్న బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం ,దక్షిణ ఇజ్రాయెల్‌లోని రామోన్ ఎయిర్‌పోర్టులలో పదుల సంఖ్యలో ఇంధన సరఫరా విమానాలున్నాయి. అయితే వీటికి అదనంగా భారీగా రీప్యూయలింగ్ విమానాలను పంపేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.దాడులు ప్రధానంగా అణుఇంధన కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర వ్యూహాత్మక లక్ష్యాలపై ఉండనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ దాడికి ప్రణాళికలు ఖచ్చితంగా రచించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ దూరం ప్రయాణించి దాడులు చేసే యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపడానికి ఈ ట్యాంకర్ విమానాలు చాలా కీలకం.కాగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఇటీవల పూర్తిగా విఫలమైంది. దీంతో దౌత్యపరమైన చర్చలు ఆగిపోయి, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ సైతం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
డొనాల్డ్ ట్రంప్‌ను హతమారిస్తే. రూ. 96కోట్లు
ఇరాన్‌పై వరుసగా ఏడవ రాత్రి కూడా అమెరికా దాడులు నిర్వహించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరిచేలా ఈ దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చి వేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టాన్ని కలిగించామని ఇరాన్ గురువారం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా (సాయుధ ముఠాల) సంకీర్ణ కూటమి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు 96.28 కోట్ల రూపాయలు) బహుమతిని ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన రగులుతున్న ఇప్పటికే యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోసింది. డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి లేదా ఆ ఆపరేషన్‌కు నిధులు సమకూర్చిన వారికి, సహాయం చేసిన వారికి ఈ బహుమతి అందుతుందని 'ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్' (IRI) తెలిపింది. ఈ 10 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తమ సభ్యులు, మద్దతుదారుల నుండి సేకరించిన విరాళాల ద్వారా సమకూర్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు.ఇటీవల వైట్ హౌస్‌లో ఇరాక్ ప్రధాన మంత్రి అలీ అల్-జైదీతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... 2020లో ఇరాన్ అగ్ర సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ, ఇరాకీ మిలీషియా నాయకుడు అబూ మహదీ అల్-ముహందిస్లను చంపడంలో తన పాత్రను బహిరంగంగా ప్రస్తావించారు. దీనికి ప్రతిచర్యగా ఐఆర్ఐ ఈ ప్రకటన చేసింది.ఇరాక్, సిరియా , గల్ఫ్ ప్రాంతంలోని ఇతర చోట్ల ఉన్న అమెరికా దళాలు, దౌత్య కార్యాలయాలు మరియు మిత్రదేశాలపై వందలాది డ్రోన్, రాకెట్, క్షిపణి దాడులకు ఈ గ్రూపులే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల వెలుపల తన సైనిక ఒత్తిడిని కొనసాగించడానికి టెహ్రాన్‌కు ఈ మిలీషియాలు ప్రధాన ఆయుధాలుగా మారాయి. -
ఇరాన్ దెబ్బకు ఆరు దేశాలు అలర్ట్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు వరుసగా ఏడో రాత్రికి చేరుకోగా హర్మూజ్ జలసంధి చుట్టూ సైనిక కదలికలు, నౌకా రవాణా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. దక్షిణ ఇరాన్‌లోని హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌పై అమెరికా దాడుల్లో ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాత్రం ఈ దాడుల లక్ష్యం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమేనని పేర్కొంది.ఆధిపత్య పోరు..ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఘర్షణకు కేంద్రంగా మారింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) రెండు చమురు ట్యాంకర్లు మైన్ల కారణంగా పేలిపోయాయని, కొన్ని నౌకల రాకపోకలను అడ్డుకున్నామని ప్రకటించింది. అయితే అమెరికా ఈ వాదనలను ఖండించింది. అమెరికా, ఇరాన్ రెండూ ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమ ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని నౌకలు మాత్రం పరిమిత స్థాయిలో రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం.ఇరాన్ హెచ్చరిక..అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరించారు. తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సీనియర్ సైనిక సలహాదారు మేజర్ జనరల్ మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. ఇరాన్ ఇక సమాన స్థాయి ప్రతీకార చర్యలకే పరిమితం కాదు.. ఎలాంటి రాజకీయ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదు అని ఆయన హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ ప్రధానంగా అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై ప్రతీకార చర్యలకు దిగుతామని ప్రకటించగా, తాజా హెచ్చరికతో దాడుల పరిధి విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన దాడులను కేవలం అమెరికా సైనిక లక్ష్యాలకే పరిమితం చేయకపోవచ్చని సంకేతాలు ఇస్తోంది.గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు, సైనిక స్థావరాలు మరింత అప్రమత్తంగా మారే అవకాశం ఉంది.గల్ఫ్ దేశాలకు టెన్షన్.. ఇరు దేశాల మధ్య యుద్ధ ఘర్షణ ఇప్పుడు సరిహద్దులను దాటి గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తోంది. తాజాగా కువైట్‌లో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ ప్రాంతాల్లోనూ క్షిపణులు, డ్రోన్ దాడుల ఆరోపణలు వచ్చాయి. కొన్ని దాడులు అమెరికా మిత్రదేశాలపై జరిగాయని ఇరాన్ ప్రకటించగా, వాటిలో కొన్ని వాదనలను ఆయా దేశాలు ఖండించాయి. దీంతో, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి.కువైట్‌పై ప్రభావంఇరాన్ దాడుల్లో కువైట్‌లోని కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడటంతో ప్రజలను ఇంధనం, విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఖతార్‌లో అప్రమత్తతగల్ఫ్లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉన్న ఖతార్‌పై కూడా ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రయత్నాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఖతార్ తెలిపింది.బహ్రెయిన్‌కు ప్రత్యేక సవాల్బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన కీలక స్థావరం ఉంది. దీంతో ఈ చిన్న దేశం వ్యూహాత్మకంగా అత్యంత సున్నిత ప్రాంతంగా మారింది. గల్ఫ్ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.సౌదీ అరేబియా, యూఏఈ పరిస్థితిగల్ఫ్లో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, యూఏఈలు తమ చమురు మౌలిక సదుపాయాల రక్షణపై దృష్టి పెట్టాయి. గతంలో చమురు కేంద్రాలపై జరిగిన దాడుల అనుభవంతో, ఇప్పుడు డ్రోన్లు, క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.ఒమన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యంహర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఒమన్ ఈ సంక్షోభంలో కీలక పాత్రలో ఉంది. నౌకా రవాణా భద్రత, సముద్ర మార్గాల రక్షణపై దృష్టి పెట్టింది. -
ఇరాక్ సంచలన వ్యూహం.. ఇరాన్‌కు సూపర్ స్ట్రోక్!
బాగ్దాద్/వాషింగ్టన్: ప్రపంచ చమురు రాజకీయాల్లో భారీ మార్పులకు తెరలేచింది. ఎన్నో ఏళ్లుగా చమురు ఎగుమతులకు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం వెతికే పనిని ఇరాక్ ప్రారంభించింది. ఈ దిశగా అమెరికాకు చెందిన దిగ్గజ చమురు సంస్థలు చెవ్రాన్, బీపీ, కొనోకోఫిలిప్స్తో కలిసి 60 బిలియన్ డాలర్లకు పైగా విలువైన మెగా ఎనర్జీ ఒప్పందాలు కుదుర్చుకుంది.ఈ ఒప్పందాల్లో భాగంగా చెవ్రాన్ ఇరాక్‌లోని భారీ చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటు, సిరియా లేదా టర్కీ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరే కొత్త పైప్‌లైన్ మార్గాలపై అధ్యయనం చేయనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హర్మూజ్ జలసంధిపై ఇరాక్ ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో బీపీ ఉత్తర ఇరాక్‌లోని కిర్కుక్ చమురు క్షేత్రాల పునరాభివృద్ధి చేపడుతుండగా, కొనోకోఫిలిప్స్ 42 శాతం వాటాతో ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది. దీంతో ఇరాక్ చమురు ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఎందుకింత కీలకం? ప్రపంచంలో సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో గణనీయమైన భాగం హర్మూజ్ జలసంధి మీదుగానే ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఎగసిపడుతుంటాయి. ఇప్పుడు ఇరాక్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడంతో ప్రపంచ ఇంధన రంగంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రకటించినవి ప్రాథమిక ఒప్పందాలే. సాంకేతిక అధ్యయనాలు, ప్రభుత్వ అనుమతులు, పెట్టుబడుల తుది ఆమోదం అనంతరమే ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ ఈ నిర్ణయం మధ్యప్రాచ్య ఇంధన రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇరాక్ వ్యూహం ఏమిటి?ఇరాక్ లక్ష్యం కేవలం చమురు ఉత్పత్తి పెంచడం మాత్రమే కాదు. ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, రవాణా వ్యయాలను తగ్గించడం, భౌగోళిక-రాజకీయ ప్రమాదాలను తగ్గించడం కూడా ఈ ప్రణాళికలో భాగమే. భవిష్యత్తులో హర్మూజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా చమురు ఎగుమతులు ఆగిపోకుండా చూసే దిశగా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి.భారత్‌కు ఎలాంటి ప్రయోజనం?భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. ఇరాక్ నుంచి కూడా భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇరాక్‌కు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలు సిద్ధమైతే సరఫరాలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత కొంత మేర తగ్గి, భారత్ వంటి దిగుమతి దేశాలకు దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చేశాం, భారీ నష్టం : ఇరాన్ ప్రకటన
మధ్యప్రాచ్యంలో యుద్ధం మళ్లీ ఉద్రిక్త స్థాయికి చేరింది. ఇరాన్‌పై అమెరికా రాత్రికి రాత్రే జరిపిన వైమానిక దాడులతో ఇరాన్ వార్ మరింత ముదిరింది. ఎనిమిది మంది ప్రాణాలు తీసిన అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక విమానాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. జోర్డాన్‌లో మోహరించిన అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలను, ఇంధనం నింపే విమానాలను (Refuelling aircraft) పూర్తిగా ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించడం కలకలం రేపింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటనమధ్యప్రాచ్య ప్రాంతీయ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ ఇరాన్ మొదటిసారిగా తూర్పు సిరియాపై క్షిపణి దాడులు చేసింది. ఇరాన్‌లోని ఇరాన్‌షహర్‌లో తన సైనికుల మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. తాము అనేక అమెరికా ఇంధన సరఫరా విమానాలు, యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలని జోర్డాన్ ప్రజలకు పిలుపునిచ్చింది. అయితే, ఇరాన్‌కు చెందిన 3 క్షిపణులను తాము కూల్చివేసామని, తమకు ఎలాంటి నష్టం జరగలేదని జోర్డాన్ సైన్యం పేర్కొన్న తరువాత ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇరాన్‌షహర్‌లో ఇరాన్ సైనికుల హత్యకు ప్రతీకారంగా, సిరియా, జోర్డాన్, ఇరాక్ సరిహద్దుల్లోని 'అల్-తాన్ఫ్' లో ఉన్న అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్‌పై కూడా దాడి చేసినట్లు ఐఆర్జిసి తెలిపింది. అయితే, తాము ఫిబ్రవరిలోనే ఆ బేస్ నుండి వైదొలిగామని అమెరికా గతంలో ప్రకటించిందిఇతర గల్ఫ్ దేశాలపై దాడులు అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న ఇతర గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతార్ఫై క్షిపణి దాడులు చేయడంతో పాటు, కువైట్‌లోని అత్యంత కీలకమైన విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారాన్ని ఇరాన్ దెబ్బతీసింది. ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్, సులేమానియా ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. ఇరాన్ అసమ్మతి గ్రూప్ 'కొమాలా'ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో కనీసం 9 మంది మరణించారు.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ఇరాన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్శుక్రవారం ఇరాన్ జరిపిన పలు వైమానిక దాడులను బహ్రెయిన్ సాయుధ బలగాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థల (Air defence systems) ద్వారా విజయవంతంగా అడ్డుకొని, ధ్వంసం చేశాయి. బహ్రెయిన్‌లోని పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడాన్ని అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనగా బహ్రెయిన్ సైన్యం తీవ్రంగా ఖండించింది. అలాగే కూల్చివేసిన క్షిపణుల శిథిలాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.కాగా గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా కుప్పకూలిపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశించారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు అమెరికా.. ఇరాన్‌లోని కీలక ఓడరేవులు, వంతెనలు, విద్యుత్ గ్రిడ్లను ధ్వంసం చేసింది. ఇరాన్ తీరప్రాంత నగరాలైన అహ్వాజ్, బుషెహర్, బందర్ అబ్బాస్, కిష్ ఐలాండ్ వంటి ప్రాంతాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. రైల్వే లైన్లు, విమానాశ్రయాలు దెబ్బ తినడంతో ఇరాన్ లో భారీగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్తునుపొదుపగా వాడాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ దాడుల్లో ఇరాన్ వైపు డజన్ల కొద్దీ ప్రజలు మరణించగా, వందలాది మంది గాయపడినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆ రూ. 40 వేలతోనే : రామమందిర్ విరాళాల గోల్మాల్ గుట్టు -
ఇరాన్ పై ట్రంప్ భీకర దాడులు
-
చిన్నారుల ఆసుపత్రులను సైతం వదలరా..?
టెహ్రాన్: అమెరికా,ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నపిల్లలకు వైద్యచికిత్స చేస్తున్న కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిందని అది అత్యంత అనాగరికత చర్యని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.అమెరికా చేసిన దాడులతో ఆసుపత్రి ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందన్నారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల క్యాన్సర్ చికిత్స విభాగంపై ఈదాడుల ప్రభావం పడిందని క్యాన్సర్ రోగులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు కీమోథెరపీ చికిత్స అందించే ఈ ఆసుపత్రిని ఖాళీ చేయించాల్సి వచ్చింది.ఈ అంశమై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి మాట్లాడుతూ ఈ దాడి "ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన క్రూరమైన దాడులను గుర్తుకు తెస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నపిల్లలకు ఈ దాడి తీవ్ర వేదనను, ఆందోళనను కలిగించింది.వెంటనే కీమోథెరపీ చేయించుకుంటున్న211 మంది రోగులను ఆసుపత్రి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇది తమ ప్రాణాల కోసం వీరోచితంగా పోరాడుతున్న చిన్నారులపై జరిగిన ఈ దాడి అత్యంత అమాయకులైన మానవులపై జరిగిన ఒక పిరికిపంద యుద్ధ నేరం " అని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు."మానవ హక్కుల గురించి నిరంతరం నీతులు చెప్పే దేశాలు, ఆసుపత్రులు. ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని చూసీచూడనట్లు నటిస్తున్నాయి. అలాంటి వారు తమ నైతిక విశ్వసనీయతను ఎప్పుడో పూర్తిగా కోల్పోయారు," అని మండిపడ్డారు.ఇరాన్ అంతటా పేలుళ్లు - ప్రాణనష్టంఅల్ జజీరా నివేదిక ప్రకారం.. ఇరాన్‌లోని కెస్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్ సిరిక్ , చబహార్ , కొనారక్, రాస్క్ సిటీ,సహా పలు ప్రాంతాలపై అమెరికా దాడులతో తెగబడింది. అదే విధంగా ఇరాన్ ఆర్మీ స్థావరాలపై ఏకకాలంలో అమెరికా విరుచుకపడుతుంది. ఈ దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మరణించారని, దేశవ్యాప్తంగా వందలాది మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. అమెరికా దాడుల వల్ల ఇప్పటివరకు ఇరాన్లో కనీసం 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారని టెహ్రాన్ వెల్లడించింది. -
ఇరాన్‌కు అమెరికా గట్టి దెబ్బ.. ‘ప్లాన్ బీ’ అమలు!
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పరస్పర దాడుల్లో భాగంగా అమెరికా మరోసారి ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపింది. హర్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ దక్షిణ ప్రాంతంలో కీలక రవాణా మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా జరిపిన తాజా దాడుల్లో రెండు వంతెనలు, ఒక రైల్వే స్టేషన్, ఒక విమానాశ్రయం దెబ్బతిన్నట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. హర్మూజ్ ప్రావిన్స్‌లోని వంతెనలపై జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. దాడుల్లో పలువురు గాయపడినట్లు సమాచారం.వరుసగా ఆరో రోజు దాడులుఅమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) గురువారం రాత్రి కొత్త దాడులను ప్రకటించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరిచే లక్ష్యంతో ఈ దాడులు కొనసాగిస్తున్నట్లు అమెరికా తెలిపింది. తాజా దాడులు వరుసగా ఆరో రోజు జరుగుతున్న అమెరికా సైనిక చర్యల్లో భాగంగా భావిస్తున్నారు. ఇరాన్‌లోని బుషెహర్ నగరంలో కూడా రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. బుషెహర్‌లో ఇరాన్ ఏకైక పౌర అణు విద్యుత్ కేంద్రం ఉంది.BREAKING: US STRIKES ON IRAN SO FAR TONIGHT TARGETED 3 BRIDGES, RAILWAY STATION, POWER STATION & AIRPORT - Bandar Khamir, an important overpass connecting Bandar Abbas to Lar. There were cars on the bridge during the attack, leaving at least 1 dead and several injured.-… pic.twitter.com/dXZy9Lk5vP— Sulaiman Ahmed (@ShaykhSulaiman) July 16, 2026జలసంధిపై ఆందోళనప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఈ ఘర్షణకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఏ చిన్న సైనిక చర్య జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని కీలక వసతులపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది.ఇరాన్ ప్రతిదాడులుఅమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించాయి. జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్‌లోని అహ్వాజ్ ప్రాంతంలో చిన్నారుల క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో అమెరికా దాడులు జరిగాయని, దీనికి ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నామని ఇరాన్ పేర్కొంది. అహ్వాజ్ ప్రాంతంలో అమెరికా దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. వాటిని అమానవీయ చర్యగా అభివర్ణించింది. అయితే, అమెరికా వర్గాలు మాత్రం తమ దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నవేనని చెబుతున్నాయి.🚨 BREAKING NEWS : 💥💥The US has completely destroyed the IRGC headquarters in Iran. This was the primary location from which Iran controlled its air force. The attack was so massive that surrounding buildings were completely destroyed. An uncontrollable fire is raging at the… pic.twitter.com/dGmVyTI4yB— Israel_Military (@IsraelMillitary) July 15, 2026గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలుఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. కువైట్ తమ వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగాయి. ఇరాన్ సైనిక అధికారులు హర్మూజ్ జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. అమెరికా ఈ ప్రాంతం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇటీవలి అమెరికా దాడుల్లో ఇరాన్లో కనీసం 30 మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహజెరాని తెలిపారు. -
ట్రంప్‌ను అంతం చేస్తాం : శవపేటికతో ఇరాన్ హోర్డింగ్ కలకలం
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్త కుట్రలు పన్నుతోందన్న నిఘా సమాచారం మేరకు ట్రంప్ చాలా ఘాటుగా స్పందించారు. తనను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే, ఇరాన్ సర్వనాశనం కాక తప్పదని హెచ్చరించారు. అయితే ఇటీవల ట్రంప్, నెతన్యాహూ సహా, 13 మంది నేతల పేర్లతో హిట్ లిస్ట్‌ను ప్రకటించింది ఇరాన్. తాజాగా టెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్‌లో డొనాల్డ్ ట్రంప్ శవపేటికలో ఉన్నట్లు చూపుతున్న ఒక భారీ బిల్బోర్డ్ (హోర్డింగ్) కలకలం రేపుతోంది. ఈ భారీ బిల్‌బోర్డ్‌లో ట్రంప్ బాడీని ఒక నల్లటి శవపేటికలో ఉన్నట్లు చూపించడం సంచలనంగా మారింది.అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ ట్రంప్‌ను అంతం చేస్తామని ఇరాన్పదే పదే చెబుతోంది. ఆ శవపేటికపై పర్షియన్ , ఇంగ్లీష్ భాషలలో "మేము ట్రంప్‌ను చంపుతాము" (We Will Kill Trump) అని రాసి ఉంది. యుద్ధం ప్రారంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిని గుర్తుచేస్తూ "మినాబ్ పిల్లల జ్ఞాపకార్థం" అనే నినాదాలు కూడా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్కొత్తగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో, తెరిచి ఉన్న నల్లటి శవపేటికలోంచి అమెరికా అధ్యక్షుడి మృతదేహం బయటకు తొంగి చూస్తున్నట్లుగా ఉంది. జుట్టు చెదిరిపోయి ఉంది, కళ్ళు, నోరు మూసుకుని ఉన్నాయి. ముందుకు పొడుచుకు వచ్చిన పొట్టపై ఉన్న ఎర్రటి టై మీద అతని చేతులు ఉన్నాయి. పాదాలు నిటారుగా పైకితేలి ఉన్నాయి.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవడు కూడా మరణించారు. వీరితోపాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ తదితర కీలక సైనిక, రాజకీయ నాయకులు కూడా హతమయ్యారు. ఈ ఘోర హత్యలు ఇరాన్ ప్రజల్లో, ప్రభుత్వంలో ప్రతీకార జ్వాలలు రగిలిస్తున్నాయి. తమ నేతల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞచేసిన ఇరాన్ వ్యూహంలో భాగంగానే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో విప్లవాత్మక చిత్రాలు, యుద్ధ స్మారకాలు , సైనిక శక్తిని ప్రదర్శించే ఇలాంటి భారీ బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేస్తోంది.ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులుకాగా ఇరాన్ బిల్‌బోర్డులపై బెదిరింపు లేదా వ్యంగ్య చిత్రాలు కొత్తేమీ కాదు. మే నెలలో, పాశ్చాత్య, ముఖ్యంగా అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా ఒక ద్విభాషా బిల్‌బోర్డులో, ట్రంప్ నోటికి కుట్లు వేసినట్లుగా, దానిపై హోర్ముజ్ జలసంధి చిత్రాన్ని, దాని పక్కన "ది బ్రేకింగ్ పాయింట్" అన్న బోర్డులను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఏకంగా 10 అడుగుల కోబ్రా : చున్నీలా మెడలో చుట్టేసుకుంది -
పశ్చిమాసియా అగ్నిగుండం
దుబాయ్: హార్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ వైమానిక దాడులకు దిగుతుండడం పట్ల అమెరికా రగిలిపోతోంది. ప్రతీకారంగా బుధవారం ఇరాన్ ఓడరేవును దిగ్బంధించింది. ఇరాన్ సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. కనీసం ఏడుగురు సైనికులు మరణించారు. 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. హార్మూజ్ జలసంధిలో వ్యూహాత్మక ప్రాంతమైన గ్రేటర్ తున్బ్ ఐలాండ్‌పై అమెరికా దాడులు చేసింది. 1971లో ఇరాన్ అప్పటి యూఏఈ నుంచి అబూ మూసా, గ్రేటర్ తున్బ్, లెసర్ తున్బ్ అనే మూడు ద్వీపాలను ఆక్రమించింది. వాటిని తిరిగి స్వా«దీనం చేసుకోవడానికి యూఏఈ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఆ మూడు దీవులను అమెరికా స్వాదీనం చేసుకుంటే హార్మూజ్‌పై పట్టు చిక్కినట్లేనని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఇరాన్‌పై మరిన్ని దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం రాత్రి స్పష్టంచేశారు. అమెరికా కనీసం 13 క్షిపణులు ప్రయోగించిందని, ఏడుగురు జవాన్లు మరణించారని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ తెలియజేసింది. నాలుగైదు రోజులుగా అమెరికా సైన్యం సాగిస్తున్న దాడుల్లో కనీసం 35 మంది మరణించారని, 300 మందికిపైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దళాలు మోహరించి ఉన్న మూడు దేశాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.గల్లంతైన భారత నావికుడు మృతి హార్మూజ్ జలసంధితో ఇరాన్ వైమానిక దాడిలో గల్లంతైన భారతీయ నావికుడు విగతజీవిగా మారాడు. ఒమన్ తీరంలో సైప్రస్ జెండాతో కూడిన జీఎఫ్ఎస్ గెలాక్సీ నౌకపై ఈ నెల 12న ఇరాన్ సైన్యం దాడికి దిగింది. నౌకలోని 10 మంది భారతీయులు క్షేమంగా బయటపడగా, ఒకరు గల్లంతయ్యారు. బాధితుడిని మహారాష్ట్రలోని పుణేకు చెందిన 30 ఏళ్ల మెరైన్ ఇంజనీర్ హేరంభ్ కర్మార్కర్గా గుర్తించారు. అతడు మరణించినట్లు తాజాగా నిర్ధారించారు. ఈ సంఘటన పట్ల దుబాయ్‌లోని భారత కాన్సులేట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. హేరంభ్ కుటుంబానికి సహాయం అందించేందుకు యూఏఈ అధికారులు, షిప్పింగ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. హేరంభ్ భౌతికకాయం కోసం ఎదురు చూస్తున్నామని హేరంభ్ బంధువు వివేక్ బుధవారం చెప్పారు. మృతదేహాన్ని త్వరగా పంపించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్మార్కర్‌కు భార్య, తల్లి, సోదరి ఉన్నారు. -
ఇరాన్ రక్షణ స్థావరాలపై అమెరికా దాడులు
టెహ్రాన్:ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు ప్రారంభించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై మిసైళ్లతో విరుచుకపడుతోంది. ఇరాన్‌పై దాడులను యూఎస్ కమాండ్ కంట్రోల్ అధికారికంగా ధృవీకరించింది. కాగా పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్, అమెరికా పరస్పరం దాడులకు తెగబడుతుండడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.అమెరికా మిలిటరీకిసెంట్రల్ కమాండ్ 90 నిమిషాల పాటు ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణి నిల్వ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా గ్రేటర్ తుంబ్ ఐలాండ్, చాబహార్ వంటి తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా బాంబు దాడులు చేసింది.అమెరికా దాడులకు ప్రతి స్పందనగా ఇరాన్ సైతం దాడులకు తెగబడుతుంది. ఈ రోజు తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. ఈ దాడులతో బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. -
ఇరాన్ మాజీ అధ్యక్షుడి సీక్రెట్ ప్లాన్ ఫెయిల్.. ఇజ్రాయిల్ షాక్
-
జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్ దాడిలో భారతీయుడు మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన మొంబాసా, అల్ బహియాహ్ అనే రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది సభ్యుడు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.దాడి ఎక్కడ జరిగింది?ఈ రెండు ట్యాంకర్లు ఒమన్ ప్రాదేశిక జలాల్లోని హార్మూజ్ జలసంధి దక్షిణ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో క్షిపణి దాడి జరిగింది. దాడి అనంతరం రెండు నౌకల్లోనూ మంటలు చెలరేగినా, అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకొచ్చినట్లు యూఏఈ తెలిపింది. కాగా, ఈ దాడిని యూఏఈ ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సార్వభౌమాధికారాన్ని, జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది.ఇక, అమెరికా ఇటీవల ఇరాన్‌పై కొత్తగా వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత ఉధృతమవుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.Breaking 🚨 Just moments ago, a large shipment of smuggled weaponry destined for an Israeli cargo vessel near the Strait of Hormuz was destroyed by Iran. This is clearly visible in the footage. pic.twitter.com/YFzs2VQwMc— Asif Ali (@AsifAli_Haider) July 14, 2026ఇదిలా ఉండగా.. మరణించిన వ్యక్తి భారతీయుడే అని యూఏఈ ధృవీకరించింది. గాయపడిన వారిలో కూడా పలువురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగితే, చమురు సరఫరా మరియు ధరలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. -
భారత్ సహా ప్రపంచానికి ట్రంప్ షాక్.. 20% భరించాల్సిందే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. హార్మూజ్ జలసంధి గుండా రవాణా అయ్యే ప్రతి సరుకుపై అమెరికా 20% ఛార్జీ వసూలు చేస్తుందని ప్రకటించారు. "ఇప్పటి నుంచి అమెరికాను 'హార్మూజ్ జలసంధి సంరక్షక దేశం'గా పిలుస్తారు. ఈ అత్యంత ఉద్రిక్త ప్రాంతంలో భద్రత, రక్షణ కల్పించే పనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సరుకులపై 20% రేటుతో తిరిగి వసూలు చేస్తాం. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది" అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.హార్మూజ్ జలసంధి తెరిచే ఉందని, అలాగే కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇరాన్ నౌకలు దేశంలోకి రావడం, బయటకు వెళ్లడం అడ్డుకునే దిగ్బంధాన్ని అమెరికా మళ్లీ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. "హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది. ఇరాన్ ఉన్నా లేకపోయినా అలాగే ఉంటుంది. ఇరాన్ నౌకలు, ఆ దేశ వినియోగదారుల నౌకల రాకపోకలను మాత్రమే అడ్డుకునే దిగ్బంధాన్ని మళ్లీ అమలు చేస్తున్నాం. మిగతా అన్ని దేశాల నౌకలకు హార్మూజ్ జలసంధి వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవు" అని ట్రంప్ తెలిపారు. ఈ పోస్టుకు కొన్ని గంటల ముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడారు. "ఆ జలసంధిని మేమే నియంత్రిస్తాం. దాన్ని నిర్వహించే బాధ్యత కూడా మాదే కావచ్చు. ఆ జలసంధికి సంరక్షకులమవుతాం. దానికి అయ్యే ఖర్చు మాకు తిరిగి రావాలి" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ ఘాటు హెచ్చరికట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సైనిక కమాండ్ ప్రతినిధి వీడియో సందేశం ద్వారా స్పందించారు. హార్మూజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ జలమార్గం విషయంలో అమెరికాతో సహకరించే గల్ఫ్ దేశాల చర్యను యుద్ధ చర్యగానే పరిగణిస్తామని హెచ్చరించారు.అమెరికా, ఇరాన్ వరుసగా రెండో రోజు పరస్పర దాడులు జరుపుకుంటున్న వేళ ఈ హెచ్చరిక వచ్చింది. హోర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉందని రెండు దేశాలూ చెబుతున్నాయి. -
ఇరాన్ చేరుకున్న రష్యా ప్రళయ విమానం
టెహ్రాన్: ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన ఆదివారం నాడు ఇరాన్‌లోని తమ మిలటరీ స్థావరాలపై అమెరికా దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి Tu-214PU 'డూమ్స్‌డే' (ప్రళయ) విమానాన్ని టెహ్రాన్‌కు పంపింది. ఈ చర్య ద్వారా ఇరాన్‌కు మాస్కో బహిరంగంగానే తమ అండను ప్రకటించినట్లయింది.పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ముగింపుకు రాలేదు. ఇరు దేశాలు చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతాయని భావించే లోపే, పరిస్థితులు తిరిగి మొదటికి వచ్చాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్న ఈ తరుణంలో, రష్యా ఇరాన్‌కు ఒక అత్యాధునిక విమానాన్ని పంపడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ విధంగా ఉపయోగంఇరాన్కు అమెరికా నుంచి దాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ విమానం ఇరాన్ గగనతలంలో నిరంతరం నిఘా ఉంచుతోంది. అమెరికా యుద్ధ విమానాలు లేదా క్షిపణులు దూసుకొస్తే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ముందే అప్రమత్తం చేస్తోంది.ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ విమానం ఇప్పుడు ఇరాన్‌కు చేరుకోవడం హాట్‌టాఫిక్‌గా మారింది. దీని రాకతో ఇరాన్‌కు రక్షణ పరంగా మరింత బలం చేకూరిందనేది వాస్తవం.Tu-214PU ప్రత్యేకతలుఇది సాధారణ విమానం కాదు. ఇందులో అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్, కంట్రోల్ నెట్‌వర్క్‌లు, ప్రత్యేక డేటా లింక్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సదుపాయాల వల్ల సంక్షోభ సమయాల్లో విమానంలో ప్రయాణిస్తూనే యుద్ధ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగానే దీనిని రష్యా "ప్రళయ విమానం" అని పిలుస్తుంది.భూమిపై అణు దాడులు సంభవించినప్పుడు దేశ అధ్యక్షుడు, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు ఈ విమానంలోకి ఎక్కి ఆకాశం నుంచే యుద్ధ వ్యూహాలను రచించవచ్చు. కాక్‌పిట్ మినహా ఈ విమానానికి ఎలాంటి కిటికీలు ఉండవు. ఇది అణు విస్ఫోటనం వల్ల వచ్చే రేడియేషన్, విద్యుదయస్కాంత తరంగాల నుండి లోపల ఉన్నవారిని రక్షిస్తుంది. అలాగే ఆకాశంలోనే దీనికి ఇంధనం నింపే సదుపాయం ఉండడం వల్ల, వరుసగా కొన్ని రోజుల పాటు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ప్రయాణించగలదు.అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ ఈ విమానం రష్యాలో చాలాసార్లు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ప్రస్తుతం రష్యా వద్ద ఇటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అనే విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. -
ట్రంప్, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్? ఇరాన్ రివెంజ్ లిస్ట్ కలకలం!
టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. టెహ్రాన్ మున్సిపాలిటీకి చెందిన 'హమ్షాహ్రీ' (Hamshahri) పత్రిక వివాదాస్పద ప్రచురణలో 13 మంది కీలక నేతలతో కూడిన రివెంజ్ లిస్ట్‌ను ప్రకటించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, పలువురు యూరోపియన్ నాయకులతో సహా 13 మంది విదేశీ నేతలతో కూడిన ప్రతీకార జాబితాను ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు 'ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ'.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రాఫిక్ వెలుగులోకి రావడం గమనార్హం. తన తండ్రి మరణానికి ప్రతీకారం తప్పదని, ఇందుకు బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మొజ్తాబా ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దానిని కచ్చితంగా నెర వేరుస్తానని కూడా అన్నారు.శాంతియుత మరణం ఉండదు - మోజ్తబా ఖమేనీఈ వారం ప్రారంభంలో జరిగిన తన తండ్రి అంత్యక్రియల తర్వాత మోజ్తబా ఖమేనీ శనివారం తన మొదటి బహిరంగ సందేశాన్ని విడుదల చేస్తూ, ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. ప్రతీకారం తమ దేశ సంకల్పం, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ నేరస్థులకు కంటిమీద కునుకు ఉండదు. వారికి ప్రశాంత మరణం ఉండదని ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ టార్గెట్ చేయబోయే వ్యక్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సుప్రీం లీడర్ పేర్కొన్నప్పటికీ, ఆయన ఎవరి పేర్లను ప్రత్యక్షంగా వెల్లడించలేదు. అలాగే, హమ్షాహ్రీ పత్రిక ప్రచురించిన ఈ జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!ఆన్లైన్లో విడుదల చేసిన ఈ ఇన్ఫోగ్రాఫిక్లో మోజ్తబా ఖమేనీ ప్రకటనతో పాటు 13 మంది విదేశీ నాయకుల ఫోటోలను ప్రదర్శించారు. వారిలో ముఖ్యులు:డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని)కీర్ స్టార్మర్ (బ్రిటన్ ప్రధాని)మార్కో రూబియో (అమెరికా విదేశాంగ మంత్రి)పీట్ హెగ్సెత్ (అమెరికా రక్షణ మంత్రి)ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు)జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని)ఫ్రీడ్రిచ్ మెర్జ్ (జర్మనీ ఛాన్సలర్)ఈ గ్రాఫిక్ ఆన్లైన్లో మాత్రమే పబ్లిష్ అయింది. ఆదివారం నాటి ప్రింట్ ఎడిషన్‌లో దీనిని ప్రచురించలేదు.ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? The Islamic Republic of Iran has published a list of its "revenge targets" in the daily newspaper Hamshahri and calls for the murder of the following individuals pic.twitter.com/fYxQYJpuOm— Afshin Ismaeli (@Afshin_Ismaeli) July 12, 2026 -
అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన మిస్టరీ వ్యక్తి ఎవరు?
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో నల్ల ముసుగు ధరించిన ఓ వ్యక్తి కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ముందు వరుసలో నిలబడి ప్రార్థనల్లో పాల్గొన్న ఆ వ్యక్తిని చూసిన చాలామంది మొజ్తబా ఖమేనీ తొలిసారి బహిరంగంగా కనిపించారని ఊహించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వేగంగా వైరల్ కావడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే కొద్ది గంటల్లోనే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ముసుగు వెనుక ఉన్న వ్యక్తి మొజ్తబా ఖమేనీ కాదని, అలీ ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలు కావడం వల్లే ఆయన ముఖాన్ని ముసుగుతో కప్పుకున్నట్టు సమాచారం. ఈ పరిణామం ఇరాన్ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది.ఆ ముసుగు మనిషి ముందు వరుసలో నిలబడి అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన బేస్‌బాల్ టోపీ ధరించి, ముఖాన్ని నల్ల ముసుగుతో కప్పుకున్నారు. అయితే, ఆయన మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించడంతో ఆయన ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.జవాద్ ఖమేనీకి ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడుల్లోనే అలీ ఖమేనీ మరణించారు. మొజ్తబా ఖమేనీ ముఖం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు అమెరికా నిఘా నివేదికలు తెలిపాయి.మొహమ్మద్ జవాద్ ఖమేనీ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పెద్ద మనవడు. అలీ ఖమేనీ పెద్ద కుమారుడు మొస్తఫా ఖమేనీ. మొస్తఫా కుమారుడే మొహమ్మద్ జవాద్ ఖమేనీ. మొస్తఫా ఖమేనీ సుమారు 1965లో జన్మించినట్టు అక్కడి మీడియా తెలిపింది. అలీ ఖమేనీ అంత్యక్రియలు గురువారం జరిగాయి. 6 రోజుల పాటు సాగిన కార్యక్రమంలో 43 మిలియన్ల మంది పాల్గొన్నట్టు ప్రభుత్వ మీడియా తెలిపింది. కాగా, మొజ్తబా ఖమేనీ శనివారం టెలిగ్రామ్‌లో లిఖితపూర్వక సందేశం విడుదల చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని అందులో పేర్కొన్నారు. -
ప్రపంచానికి డేంజర్ బెల్.. ఇరాన్ సీక్రెట్ మిషన్ లీక్?
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మౌనంగా మరో మిషన్ మొదలుపెట్టిందా? అంతర్జాతీయంగా ఈ ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఇరాన్‌లోని కీలక సైనిక, న్యూక్లియర్ సంబంధిత కేంద్రాల్లో మళ్లీ కదలికలు మొదలైనట్లు సూచిస్తున్నాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనపై అనుమానాలు మరింత పెరిగాయి.మధ్యప్రాచ్యం ఇప్పటికే ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. అమెరికా ఇరాన్ స్థావరాలపై దాడులు చేయడం, ఆ తర్వాత హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. ఈ సమయంలోనే ఇరాన్ తన దెబ్బతిన్న సదుపాయాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయని సమాచారం. కాగా, అత్యంత ఆసక్తిని రేపుతున్న ప్రాంతం ఇరాన్‌లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్. పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ఈ ప్రాంతాన్ని గతంలోనే న్యూక్లియర్ ఆయుధాల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలతో అనుసంధానం చేశాయి. తాజాగా అక్కడ భారీ స్థాయిలో కదలికలు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు, నేలను సరిచేసే పనులు, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.కేవలం పార్చిన్ మాత్రమే కాదు.. తబ్రీజ్, కెర్మాన్షా సమీపంలోని కొన్ని క్షిపణి స్థావరాలు, వైమానిక స్థావరాల్లో కూడా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భూగర్భ సదుపాయాల వద్ద వాహనాల రాకపోకలు పెరగడం కూడా నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రాలైన నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు పెద్దఎత్తున పునర్నిర్మాణ కార్యకలాపాలకు స్పష్టమైన ఆధారాలు బయటపడలేదని సమాచారం.CNN reports that newly released satellite imagery suggests #Iran may be rebuilding suspected #nuclear #facilities following recent U.S. strikes, raising fresh questions about the extent of the damage and Tehran's ongoing nuclear activities. pic.twitter.com/4YvsbIs97X— The Kabul Tribune (@TheKabultribun) July 11, 2026ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య గతంలో కుదిరిన అవగాహన ప్రకారం, ఇరాన్ తన పరమాణు కార్యక్రమాన్ని నియంత్రించాలని, ఆయుధాల తయారీ దిశగా వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు ఆ ఒప్పంద భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు అమెరికా, పశ్చిమ దేశాల భద్రతా నిపుణులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఉపగ్రహ ఆధారాలు మరింత బలపడితే, ఇరాన్‌పై కొత్త ఆంక్షలు లేదా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు దౌత్య చర్చలు.. మరోవైపు రహస్య కదలికల అనుమానాలు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. -
తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను: ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తొలి సందేశం విడుదల చేశారు. అల్ జజీరా కథనం ప్రకారం.. "నా తండ్రి రక్తం చిందేలా చేశారు.. నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది మా దేశం కోరిక కూడా" అని చెప్పారు.అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మందికి మొజ్తబా ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రికి నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం శత్రువుకు గట్టి దెబ్బగా అని, అది చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు.ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ వైపు 1,000 క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వేలాది క్షిపణులను కూడా ప్రయోగిస్తామని పేర్కొన్నారు.ఇరాన్‌పై ట్రంప్‌నకు వైరం ఎప్పుడు మొదలైంది?ఈ వివాదం మూలాలు 2020 జనవరిలో ఉన్నాయి. అప్పట్లో ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాక్‌లోని బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ ఖాసిం సోలేమానీ మరణించారు.ఆ సమయంలో సోలేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆ తర్వాత అమెరికా సంస్థలు, ట్రంప్‌ను, ఆయన మాజీ అధికారులను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేయవచ్చని పలుసార్లు ప్రకటించాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. ట్రంప్‌ను ఇరాన్ చంపేసే ప్రయత్నాలు చేస్తుందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? టెహ్రాన్ అప్లైడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోస్తఫా ఖోష్చెష్మ్ మీడియాతో మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి ఎప్పటి నుంచో ఇరాన్ నియంత్రణలోనే ఉందని, యుద్ధం తర్వాత దానిపై నియంత్రణ వదులుకోవడాన్ని ఇరాన్ ప్రజలు అంగీకరించరని చెప్పారు.యుద్ధం సమయంలో హార్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయని, అది ఇరాన్ చేతిలో అత్యంత శక్తిమంతమైన ఒత్తిడి సాధనంగా మారిందని చెప్పారు. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దేశీయంగా ఒత్తిడి పెరిగిందని, సైనిక బలాన్ని ఉపయోగించినా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవలేకపోయారని తెలిపారు. అమెరికాతో చర్చలు జరపడం వల్ల ఇరాన్‌కు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, పైగా ఇంకా ఎక్కువ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. -
ఇరాన్ మాస్టర్ ప్లాన్ ట్రంప్ కు స్పాట్ పెట్టారుగా.....!
-
అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా స్పందించింది. అమెరికా ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ కీలక నేతలు హెచ్చరించారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల బృందానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి జరిగితే దానికి తగిన సమాధానం ఇస్తామని, ఒత్తిళ్లు, బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని ఆయన హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులు, ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తర్వాత కూడా వివాదాలు పూర్తిగా చల్లారలేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘనల ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా వైపు నుంచి కొత్త హెచ్చరికలు రావడం, ఇరాన్ నుంచి ప్రతీకార చర్యల ప్రకటనలు రావడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా హార్మూజ్‌లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు హామీలు కోరుతుండగా, ఇరాన్ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.మరోవైపు దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్ చర్చలు కొనసాగించేందుకు ఇరాన్‌తో అంగీకారం కుదిరిందని చెబుతున్నప్పటికీ, కాల్పుల విరమణ ముగిసిందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక హెచ్చరికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా, మధ్యప్రాచ్య భద్రత, ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అంశంగా మారాయి. -
ఖమేనీకి ఎదురుదెబ్బ.. అమెరికా షాక్ ట్రీట్మెంట్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ టార్గెట్‌గా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమేనీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్న ఆర్థిక నెట్‌వర్క్‌పై అమెరికా భారీ ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఇరానీ వ్యాపారవేత్త, బ్యాంకర్ అలి అన్సారితో పాటు మొత్తం 14 మంది వ్యక్తులు, సంస్థలు అమెరికా ఆంక్షల జాబితాలో చేరాయి.కాగా, అలి అన్సారి ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, బ్యాంకులు, పెట్టుబడి సంస్థల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ వ్యవస్థ ద్వారా ఇరాన్ ప్రభుత్వ నిధులను విదేశాలకు మళ్లించి, రియల్ ఎస్టేట్, హోటళ్లు, వాణిజ్య భవనాలు తదితర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు అమెరికా ఆరోపించింది. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం మొజ్తబా ఖమేనీకి అనుబంధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు, అలాగే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నట్లు పేర్కొంది.తాజా ఆంక్షల పరిధిలో ఇరాన్‌కు చెందిన మూడు కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్‌లో నమోదైన పలు ఫ్రంట్ కంపెనీలు కూడా ఉన్నాయి. షెల్ కంపెనీల ద్వారా ప్రతి ఏడాది బిలియన్ల డాలర్ల విలువైన లావాదేవీలు నిర్వహిస్తూ అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు ఈ నెట్వర్క్ పనిచేస్తోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.లావాదేవీలు కట్.. అయితే, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచి, దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తాజా ఆంక్షల ప్రధాన ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఆంక్షల కారణంగా జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలకు అమెరికాలో ఉన్న ఆస్తులు స్తంభించి పోనున్నాయి. అమెరికా పౌరులు, సంస్థలు వారితో ఎలాంటి ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. అలాగే ఇతర దేశాల బ్యాంకులు లేదా కంపెనీలు వీరితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే ద్వితీయ స్థాయి ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక, దౌత్య విభేదాల నేపథ్యంలో తాజా ఆంక్షలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, అమెరికా చేసిన ఆరోపణలను ఇరాన్ గతంలో పలుమార్లు ఖండించింది. తమపై విధిస్తున్న ఆంక్షలు రాజకీయ ఒత్తిడి కోసం చేస్తున్న చర్యలేనని, అవి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ వాదిస్తోంది. తాజా ఆంక్షలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
ఫైటర్ జెట్ల పహారాలో ఖమేనీ పార్థివదేహం
టెహ్రాన్: ఇరాన్ మజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘట్టం తుదిదశకు చేరుకుంది. మష్హాద్‌లోని ఇమామ్ రెజా పవిత్రక్షేత్రంలో పార్థివదేహం ఖననం చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు లక్షల సంఖ్యలో జనం మష్హాద్ బాట పట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ఆ నగర వీధులన్నీ జనసముద్రంగా మారాయి.ఈ రోజు ఉదయం ఇరాక్‌లోని నజాప్ విమానాశ్రయం నుంచి ఖమేనీ భౌతికకాయం ఉన్న విమానం మష్హాద్ నగరానికి బయిలుదేరింది. ఈ అంత్యక్రియల విమాన ప్రయాణానికి అత్యంత భారీ భద్రత,అధికారిక ప్రోటోకాల్‌ను కేటాయించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్వయంగా ఆ విమానంలో ఖమేనీ భౌతికకాయంతో పాటు ప్రయాణించి ఎస్కార్ట్‌గా నిలిచారు.ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భౌతిక కాయం తరలిస్తున్న విమానానికి అత్యంత పటిష్ట భద్రత కల్పించారు. వాయుతలంలో ఆ విమానానికి ఇరు దేశాల వైమానికి దళాలు ఫైటర్ జెట్స్తో భద్రత కల్పించాయి. మష్హాద్ చేరుకున్న అనంతరం అక్కడి నుండి హెలికాప్టర్ల ద్వారా కర్బలాకు తరలించే సమయంలో కూడా భారీ సైనిక ఎస్కార్ట్ మధ్యే శవపేటికను తరలించారు.కాగా ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్సులో ఉన్న రైల్వే వంతెనపై దాడులు చేసింది. దీంతో టెహ్రాన్- మష్హాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.Iranian Fighter Jets escorted the plane carrying the caskets of Ayatollah Khamenei and his familyThis explains reports of the jet activity I was reading. https://t.co/7TxUPwnwD4 pic.twitter.com/gfTXLUwe21— Ryan Rozbiani (@RyanRozbiani) July 9, 2026 -
అంత్యక్రియల వేళ.. ఇరాన్‌కు గుండెకోత
టెహ్రాన్: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ముగింపు వేళ ఇరాన్ కీలక వీడియో విడుదల చేసింది. ఆయన నివాసంపై అమెరికా జరిపిన దాడికి సంబంధించిన చిత్రాలను తొలిసారిగా అధికారికంగా పంచుకుంది. ఇంతవరకూ కేవలం శాటిలైట్ చిత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా తొలిసారిగా అధికారికంగా వీడియోను విడుదల చేసింది.ఫిబ్రవరి 28 అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడికి సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో దాడులలో భవనం పూర్తిగా శిథిలమైన చిత్రాలు క్షిపణుల దాడులు భవనం కుప్పకూలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని అంత్యక్రియలు ముగింపువేళ ఈ చిత్రాలు ఇరానీయలను తీవ్రమైన బాధకు గురి చేస్తున్నాయి.కాగా ఈ దాడిలో ఖమేనీ ఆయన కుటుంబసభ్యులతో సహా 14 నెలల మనవరాలు 40 మంది అధికారులు సైతం మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ భవనంపై ఏకకాలంలో 35 క్షిపణులను ప్రయోగించాయి. అయితే అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయనను మషద్‌లో ఖననం చేయనున్నారు.కాగా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న అమెరికా దాడులకు తెగబడింది. చైనా, రష్యా, ఇరాన్‌లకు భూమర్గం ద్వారా జరిగే వస్తురవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వేబ్రిడ్జిపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఆందోళన నెలకొంది.Iran released footage of leader Khamanei's residence after the US attack that martyred him and his family, including 14-month old Zahra pic.twitter.com/dpSEJWKeGP— COMBATE |🇵🇷 (@upholdreality) July 8, 2026 -
గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్..
దుబాయ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం అమెరికా ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులు చేపట్టింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హై అలర్ట్‌లోకి వెళ్లింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలుచోట్ల సైరన్లు మోగాయి.తాజా పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ దేశాల్లో హెచ్చరిక సైరన్లు మోగించగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమాన్ దేశాలు కూడా తమ వైమానిక రక్షణ వ్యవస్థలను పూర్తి అప్రమత్త స్థితిలో ఉంచాయి.ఇదిలా ఉండగా అమెరికా దాడుల్లో ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, చాబహార్, జాస్క్, సిరిక్, అబూ మూసా దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఆగ్నేయ ఇరాన్‌లోని ఇరాన్షహర్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఓ అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) వెల్లడించింది. ఈ ఘటనలో విమానాశ్రయ భవనాలు దెబ్బతిన్నాయి.BREAKING:🚨🇮🇷 🇺🇸Gulf states hosting United States military bases—namely the UAE, Kuwait, Qatar, and Bahrain—have been attacked by Iran because Trump violated a ceasefire during Khamenei's funeral procession. pic.twitter.com/0YsQb5XZAg— Mr. Hass 💛 (@Lassegaf_1) July 8, 2026ఇక, ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విధుల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఖాలెద్ ఖాదేరీ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇక అమల్లో లేదని ప్రకటించారు. ఇరాన్‌పై భీకర దాడులతో అమెరికా సైన్యం విరుచుకుపడుతోంది.WATCH 🔴Footage captures a massive U.S. strike hitting Iran’s Chabahar Port, Iran pic.twitter.com/zmYAro1P3u— Open Source Intel (@Osint613) July 8, 2026 -
ఇరాన్ హిట్ లిస్ట్‌లో నేనే నంబర్ వన్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇరాన్ టార్గెట్ చేసిన హిట్ లిస్ట్‌లో (కిల్ లిస్ట్)లో మొదటి స్థానంలో ఉన్నానని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసే ఇరాన్ ప్లాన్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇరాన్ దాడి అవకాశం ఉన్నప్పటికీ అలాంటి బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు.నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇటీవల ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక దాడులను సమర్థించారు. ఇరాన్ దూకుడు చర్యలకు ప్రతిస్పందనగానే అమెరికా బలంగా వ్యవహరించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే వెంటనే స్పందిస్తామని తెలిపారు.కాగా, 2020లో ఇరాన్ సైనిక అధికారి ఖాసిం సులేమానీ హత్య తర్వాత ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నాయకులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్‌పై హత్యాయత్నాలకు సంబంధించిన కుట్రలను అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా వెలుగులోకి తెచ్చాయి. అయితే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి స్థానంలో ఉన్నానన్న ట్రంప్ వ్యాఖ్యకు సంబంధించి ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.ఇక, ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి, నాటో సభ్యదేశాలు, మధ్యప్రాచ్య దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపై ఈ ఉద్రిక్తతల ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
"ఖర్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటాం"
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డేంజర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్ దీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదివరకే ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని ఆ దేశంతో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. కాగా తాజాగా మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఏ జరగనుందా అనే ఆందోళన టెన్షన్ సర్వత్వా నెలకొంది. కాగా ఈ రోజు బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ " ఇరానీయులు అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. రేపు గురువారం ఆయన స్వస్థలం మషాద్ నగరంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ దాడి చేస్తామని ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరానీయన్లు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అమెరికాకు మరణం, ఇరాన్‌కు మరణం అనే నినాదాలతో హోరెత్తించారు. -
మళ్లీ యుద్ధమా? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందం (MoU) ముగిసిందని, ఇకపై ఎలాంటి చర్చలు ఉండవంటూ ప్రకటించారు. మరొకవైపు ఇరాన్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో, టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్‌కు చెందిన అత్యంత ప్రమాద కరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడులు చేశాం. వాళ్లు దుర్మార్గులు, మానసిక రోగులంటూ దుమ్మెత్తి పోశారు. అంతేకాదు ఇరాన్‌ను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా (Denuclearisation) మారుస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?ఇది ఇలా ఉంటే ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ సుమారు 1,506 పాయింట్లు, అంటే 1.93శాతం పతనమై, 76,673.86 వద్దకు చేరగా, నిఫ్టీ 50 కూడా 461 పాయింట్లు 1.89శాతం నష్టపోయి 23,937.65దిగువకు పడిపోయింది. ఫార్మా, మెటల్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో నడిచాయి.చమురుపై ప్రభావంఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశంవైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒకేసారి 5 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 5.3 శాతం ఎగిసి 78.09 డాలర్ల స్థాయిని అధిగమించగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 5.4 శాతం పెరిగి 74.23 డాలర్ల వద్దకి చేరుకుంది.ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!స్పెయిన్‌పై ట్రంప్ ఆగ్రహం.. నాటోపై అసంతృప్తిఇరాన్పై సైనిక చర్యల కోసం అమెరికాకు తమ సైనిక స్థావరాలను, వైమానిక మార్గాన్ని ఉపయోగించు కోవడానికి స్పెయిన్ నిరాకరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. స్పెయిన్‌ను నాటోలో ఒక దారుణ మైన భాగస్వామిగా అభివర్ణిస్తూ, ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌ను ఆదేశించారు. ఉగ్రవాదానికి పెద్ద పీట వేసే ఇరాన్ విషయంలో నాటో కూటమి తమకు మద్దతుగా నిలబడటం లేదని, గ్రీన్లాండ్ విషయంలో కూడా నాటో ప్రవర్తన తనకు నచ్చలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: యువ క్రికెటర్ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి? -
హార్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు కౌంటర్ గా అమెరికా దాడులు
-
ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవు: ట్రంప్
ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని తెలిపారు. చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని అన్నారు. ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. దీంతో యుద్ధం మరింత భీకరంగా కొనసాగే ముప్పు ఉందని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరానీయులను "అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది."వాళ్లు తమ సొంత ప్రజలకు హాని చేశారు. నిరసనల్లో పాల్గొన్న 54,000 మందిని చంపారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై మేము చాలా శక్తిమంతంగా దాడి చేశాం. వాళ్లలో ఏదో సమస్య ఉంది" ట్రంప్ అన్నారు.ఈ ఘర్షణ లక్ష్యం ఇదే..ఇరాన్‌ను "దుష్ట దేశం"గా పేర్కొన్న ట్రంప్.. ఈ ఘర్షణ లక్ష్యం ఇరాన్ అణు సామర్థ్యాన్ని లేకుండా చేయడమేనని, అమెరికా ఇరాన్‌ను "డి-న్యూక్" చేస్తుందని మరోసారి చెప్పారు."గత రాత్రి మేము ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేశాం. మీరు దాడి చేసిన ప్రతిసారీ మేమూ దాడి చేస్తామని నేను వాళ్లకు చెప్పాను. వాళ్లు నీచంగా వ్యవహరిస్తారు. అందరి వెంట పడతారు. బహుశా నా వెంట కూడా పడవచ్చు. వాళ్లు మాకు నచ్చరు. నాకు వాళ్లు నచ్చరు. వాళ్లు దుష్టులు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని తొలగించడమే మా లక్ష్యం. మేము దాన్ని డి-న్యూక్ చేస్తాం" అని ట్రంప్ చెప్పారు. -
హార్ముజ్ లో హైటెన్షన్.. మళ్లీ మొదలైన యుద్ధం
-
హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్ కామెంట్స్.. స్ట్రాంగ్ వార్నింగ్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధి అంటే ప్రాంతీయేతర శక్తులు సైనిక బలప్రదర్శన చేసే వేదిక కాదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిపై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై స్పందించిన ఘరీబాబాది.. సంక్షోభాలు సృష్టించే వారే వాటి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు.ఘరీబాబాది ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "హార్మూజ్ జలసంధి ప్రాంతీయేతర శక్తుల సైనిక బలప్రదర్శన వేదిక కాదు. హార్మూజ్ భద్రతకు హామీ ఇచ్చే బాధ్యతాయుత శక్తిగా ఇరాన్ ఈ జలమార్గంలో జరిగే ఏ సైనిక కదలికనైనా అత్యంత అప్రమత్తంగా గమనిస్తోంది. హార్మూజ్ భద్రత తీరప్రాంత దేశాల చేతుల్లోనే ఉంటుంది. సంక్షోభాలు సృష్టించే వారు తమ సాహసోపేత చర్యల పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది తీవ్రమైన హెచ్చరిక" అని పేర్కొన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ ఏమన్నాయి? ఒమాన్ తన సార్వభౌమ ప్రాదేశిక జలాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి పని చేయడానికి అంగీకరించిందని కీర్ స్టార్మర్, ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. "హార్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలక సముద్ర మార్గం. అన్ని దేశాల నౌకలు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించే పరిస్థితిని పునరుద్ధరించడం ప్రపంచ ఆందోళనగా మారింది. తన సార్వభౌమ ప్రాదేశిక జలాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి పనిచేయడానికి ఒమాన్ సుల్తానేట్ అంగీకరించింది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.అంతేగాక, "హార్మూజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి మద్దతుగా సైనిక మిషన్‌ను మోహరించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రాంతీయ స్థిరత్వం, అన్ని దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, ప్రపంచ భద్రత, నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణం, అంతర్జాతీయ చట్టాన్ని పరిరక్షించేందుకు తమ భాగస్వామ్య దేశాలతో సన్నిహిత సహకారం కొనసాగించాలనే నిబద్ధతను బ్రిటన్, ఫ్రాన్స్ మరోసారి స్పష్టం చేశాయి" అని పేర్కొన్నారు.జూలై 2న బహ్రెయిన్‌లో జరిగిన అమెరికా నేతృత్వంలోని ప్రాంతీయ భద్రతా సదస్సును ఇరాన్ తీవ్రంగా విమర్శించింది. ఆ సైనిక సదస్సు చట్టబద్ధతను, ఆ ప్రాంతంలో అమెరికా కమాండ్ వ్యవస్థ అధికారాన్ని ఘరీబాబాది తిరస్కరించారు. "హార్మూజ్‌పై అధికారం సెంట్కామ్(అమెరికా సెంట్రల్ కమాండ్)ది కాదు, ఇరాన్‌దే" అని పేర్కొన్నారు. బహ్రెయిన్‌లో జరిగే సైనిక సదస్సు పర్షియన్ గల్ఫ్‌కు చట్టబద్ధ వ్యవస్థను, భద్రతను ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. تنگه هرمز میدان نمایش نظامی قدرتهای فرامنطقهای نیست. ایران بهعنوان قدرت مسئول و ضامن امنیت تنگه، نسبت به هر حرکت نظامی در این آبراه حساس هشدار میدهد. امنیت هرمز با دولتهای ساحلی است؛ بحرانسازان مسئول پیامدهای ماجراجویی خود خواهند بود؛ این هشدار جدی است. pic.twitter.com/v9n2GdHnb6— Gharibabadi (@Gharibabadi) July 4, 2026 -
ఇరాన్, అమెరికా.. చర్చల ముసుగులో హత్యా కుట్ర?
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్న తరుణంలో మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ హత్యా కుట్రకు పూనుకోవచ్చని అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఇరాన్‌కు రహస్య హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మరియు పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్లను లక్ష్యంగా చేసుకుని హత్యా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్లు సమాచారం. వీరిద్దరూ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున, వారిపై దాడి జరిగితే మొత్తం చర్చల ప్రక్రియ కుప్పకూలే ప్రమాదం ఉందని వాషింగ్టన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది.ఈ నేపథ్యంలో అమెరికా కొన్ని మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఇరాన్‌కు గోప్యంగా హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, యుద్ధ ప్రారంభ దశలో ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అమెరికా వర్గాలు అంగీకరించినప్పటికీ, ప్రస్తుత శాంతి చర్చల దశలో అలాంటి చర్యలు పరిస్థితిని పూర్తిగా దెబ్బతీస్తాయని భావించినట్లు సమాచారం.అమెరికా ఇలా.. యుద్ధ ప్రారంభంలో ఇజ్రాయెల్ ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచే లక్ష్యంతో దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడుల్లో కొంతమంది ఉన్నతాధికారులు మరణించినట్లు కూడా కథనాలు చెబుతున్నాయి. అయితే, తర్వాతి దశలో చర్చల ప్రక్రియ ప్రారంభమైన తరువాత అమెరికా వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శాంతి చర్చలను కొనసాగించాల్సిన అవసరాన్ని అమెరికా అధికారులు ప్రాధాన్యంగా పేర్కొంటూ, హింసాత్మక చర్యలు జరిగితే మొత్తం ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, ఇరాన్ తరఫున అరాఘ్చీ, ఘాలిబాఫ్లు అమెరికా మరియు ప్రాంతీయ దేశాలతో జరుగుతున్న చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్‌లో అమెరికా–ఇరాన్ మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు సమాచారం ఉంది. ఇది హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పునరుద్ధరణతో పాటు తదుపరి అణు చర్చలకు మార్గం సుగమం చేసేలా ఉన్నట్లు చెబుతున్నారు.అయితే ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ తిరిగి బలపడుతుందని, దాని మిసైల్ సామర్థ్యాలు మరియు ప్రాంతీయ ప్రభావం పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య కొనసాగుతున్న సంక్లిష్ట సమీకరణాలు, మధ్యప్రాచ్య శాంతి చర్చల భవిష్యత్తుపై కొత్త అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. -
అలీ ఖమేనీ అంత్యక్రియలకు కొడుకు మొజ్తబా ఖమేనీ గైర్హాజరు!
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా హాజరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. తీవ్ర భద్రతా ఆందోళనలే ఇందుకు కారణమని భారతదేశంలోని సుప్రీం లీడర్ ప్రతినిధి అయతొల్లా హకీమ్ ఎలాహీ తెలిపారు.ఓ ఇంటర్వ్యూలో అయతొల్లా హకీమ్ ఎలాహీ మాట్లాడుతూ.. అంత్యక్రియలకు ముందు ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. "గత వారం నేను ఇరాన్లో ఉన్నాను. మొజ్తబాను కలిసిన నా స్నేహితులతో మాట్లాడాను. ఆయన బయటకు రావాలని, ప్రజలను కలవాలని కోరుకుంటున్నారని వారు చెప్పారు. కానీ, భద్రతా సిబ్బంది అందుకు అనుమతించడం లేదు. అది చాలా ప్రమాదకరమని, ఆయనకు భద్రత కల్పించడం సాధ్యం కాదని వారు చెప్పారు. ఆయన బయటకు రారని నేను భావిస్తున్నాను" అని ఎలాహీ చెప్పారు.కాగా, ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు అయతొల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు చెప్పేందుకు టెహ్రాన్‌కు చేరుకుంటున్నారు. ఇరాన్‌కు ఇజ్రాయెల్, అమెరికాతో జరిగిన ఘర్షణల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అంత్యక్రియలు జరుగుతున్నాయి.ఇరాన్లో పరిస్థితుల గురించి ఎలాహీ మాట్లాడుతూ.. సుప్రీం లీడర్ మరణించినప్పటి నుంచి దేశమంతా సంతాపంలో ఉందని, ఆయనకు మద్దతు ఇచ్చే వారు ఈ నష్టాన్ని భర్తీ చేయలేనిదిగా భావిస్తున్నారని చెప్పారు. "వారికి ఇది చాలా పెద్ద నష్టం. తమ ఆత్మను, ప్రాణాన్ని కోల్పోయినట్టుగా వారు భావిస్తున్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని వారు నమ్ముతున్నారు" అని చెప్పారు.ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు జులై 4న టెహ్రాన్‌లో ప్రారంభం కానున్నాయి. అనంతరం జులై 7న ఖోమ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరగా జులై 9న ఆయన స్వస్థలం మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తారు. అయితే, జులై 3న టెహ్రాన్‌లో జరిగే సంతాప కార్యక్రమానికి విదేశీ ప్రతినిధులు హాజరవుతారు. -
హార్ముజ్‌కు మళ్లీ వెళ్లం
హార్ముజ్ జలసంధి.. పశ్చిమాసియా సంఘర్షణలో అత్యంత ప్రభావితమైన ప్రాంతం. హార్ముజ్ గుండా ప్రయాణించడం అంటే నావికులు అసాధారణ ప్రమాదాలను ఎదుర్కోవడమే. యుద్ధంతో హార్ముజ్ జలసంధిలో నెలలపాటు చిక్కుకుపోయిన నావికులు ఎట్టకేలకు బయటకొచ్చారు. కానీ, మళ్లీ హార్ముజ్ పేరెత్తితేనే భయపడుతున్నారు. తాము మళ్లీ హార్ముజ్‌కు వెళ్లబోమని చెబుతున్నారు. పొట్టకూటికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య నౌకాయానానికి నావికులను అందించే అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సముద్రయాన నిపుణులను పంపిస్తుంది. 2025లో ప్రపంచ వాణిజ్య నౌకా రవాణాలో 320,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ తొలి దాడుల తర్వాత, ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. దీంతో ఘర్షణ సమయంలో గల్ఫ్‌లో వాణిజ్య నౌకాయానం లక్ష్యంగా మారింది. జూన్‌లో, ఒమన్ తీరంలో ఒక నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. అలాగే, భారతీయులు అధిక సంఖ్యలో ఉన్న మరో రెండు నౌకలపైనా దాడులు జరిగాయి. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది భారత నావికులు గల్ఫ్‌ను వదిలి వచ్చేశారు. వీరిలో, ఇరాన్ షిప్పింగ్ శాఖ సహాయంతో వెళ్లిన 3,600 మందికి పైగా ఉన్నారు. భారత నావికులున్న నౌకలపైనా దాడులు జరిగాయి. మరికొందరు తమ సహచరులు చనిపోవడాన్ని చూశారు.యుద్ధాన్ని ముగించడానికి మధ్యంతర ఒప్పందం కుదిరినప్పటికీ, దాడులు కొనసాగుతుండటం, ఇప్పటికీ హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఉద్రిక్తంగానే ఉండటంతో.. ఘర్షణ సమయంలో జలసంధిలో ఉండిపోయి బయటపడిన వారిలో చాలామంది ఆందోళన చెందుతూనే ఉన్నారు. దాడి తర్వాత తీవ్ర నిరాశ... ‘‘మార్షల్ దీవుల జెండా ఉన్న ఒక బల్క్ క్యారియర్ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాన్ని స్వయంగా చూశాను. మార్చిలో, మా కంపెనీకి చెందిన ‘సేఫ్సీ విష్ణు’ అనే ముడి చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఆ దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించారు. కొన్ని వారాల తర్వాత, మా నౌకపైనా దాడి జరిగింది. తెల్లవారుజామున, నా షిఫ్టుకు సిద్ధమవుతుండగా దాడి జరిగింది. మాకేమీ కాలేదు. కానీ, దాడి తర్వాత మా సిబ్బంది మొత్తం తీవ్ర నిరాశలోకి జారిపోయారు. అది జీవితాన్ని మార్చే అనుభవం, ఊహించలేనంత భయంకరమైనది. ఆ దాడి నన్ను కూడా తీవ్రంగా కుదిపేసింది. నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. గల్ఫ్‌కు తిరిగి వెళ్లాలంటే భయంగా ఉంది. కానీ నేను పోషించాల్సిన కుటుంబం కూడా ఉంది కాబట్టి తప్పదు’’ అని గుజరాత్‌లోని చిన్న మత్స్యకార గ్రామానికి చెందిన 31 ఏళ్ల సీతారామ్ తండేల్ చెబుతున్నారు. పరిస్థితులు మెరుగుపడితేనే తిరిగి వెళ్తా.. ‘‘గల్ఫ్ నుంచి బయలుదేరడానికి సిద్ధమైన మార్షల్ దీవుల జెండా ఉన్న ఒక సరుకు రవాణా నౌకలో మార్చిలో చేరాను. మేం దాటడానికి చాలా ప్రయతి్నంచాం. దాడుల తీవ్రత ఎక్కువగా ఉంది. మా కంపెనీకి చెందిన మరో నౌకపై దాడి జరిగింది. ఘర్షణలు తగ్గినప్పుడు ‘ఈ ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా’మని ధృవీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేయమని కోరారు. చివరికి, అర్ధరాత్రి వేళ ఆ ప్రమాదకర ప్రాంతం గుండా ప్రయాణించాం.’’ అని కేరళకు చెందిన 45 ఏళ్ల రతీసన్ కుట్టియన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. పరిస్థితులు మెరుగుపడితేనే గల్ఫ్‌కు తిరిగి వెళ్తానంటున్నారు. నావికుడిగా ప్రయాణించాల్సిందే.. ‘‘ఒక సరుకు రవాణా నౌకలో హార్ముజ్ వైపు వెళ్తుండగా, మా ముందున్న నౌకపై దాడి జరిగింది. మా నౌక అబుదాబికి వెనుదిరిగింది. నేను యుద్ధ ప్రాంతంలో ఉన్నానని నా భార్యకు చెప్పలేదు. ఇప్పుడు విషయం తెలిసి ఇక ఎప్పుడూ గల్ఫ్ వెళ్లొద్దని చెబుతోంది. ఒక నావికుడిగా ప్రపంచమంతా ప్రయాణించాల్సిందేనని తెలుసు. కానీ.. తెలిసి తెలిసి ప్రాణాపాయ స్థితుల్లోకి వెళ్లలేం కదా’’ అంటున్నారు కేరళకు చెందిన 49 ఏళ్ల హరిదాస్. ఇక ఎప్పటికీ వెళ్లను.. ‘‘రెండు దశాబ్దాలకు పైగా సముద్ర ప్రయాణంలో గడిపాను. గల్ఫ్ నుంచి చైనా, సింగపూర్‌కు చమురును రవాణా చేస్తూ, అనేకసార్లు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాను. కానీ యుద్ధం నా దృక్పథాన్ని మార్చేసింది. మేం సింగపూర్‌కు బయలుదేరడానికి రెండు రోజుల ముందు యుద్ధం మొదలైంది. మా నౌకకు 10, 15 మీటర్ల దూరంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. కొన్ని క్షిపణులు మాకు అతి దగ్గరగా దూసుకెళ్లాయి. నౌకను కదలించవద్దని ఆదేశాలు రావడంతో, దాదాపు మూడు నెలల పాటు అక్కడే నిలిచిపోయాం. భయమేసినా ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి. కాల్పుల విరమణ తర్వాతే నౌక కదిలింది. మే 29న దుబాయ్ మీదుగా నౌక బయలుదేరింది. విధులు ముగించుకుని దిగిపోయాను. ఇక హార్ముజ్‌కు ఎప్పటికీ వెళ్లను. నా ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు’’ అంటున్నారు 42 ఏళ్ల నావికుడు హిరేన్‌కుమార్ ప్రవీణ్. -
ఇరాన్ పద్మవ్యూహం... అమెరికాకు అసలైన అగ్నిపరీక్ష!
దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతున్న పశ్చిమాసియాలో.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఓ కొలిక్కి రావాలంటే సైనిక చర్య తప్పేలా లేదా? అమెరికా ఒకవేళ సైనిక చర్యకు దిగితే.. ఏయే మార్గాలను ఎంచుకుంటుంది? ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం అంటే.. అమెరికాకు భారీ నష్టమే కాకుండా.. ఊహించని రిస్క్ కూడా. అసలు ఇరాన్‌పై సైనిక చర్య అమెరికాకు సాధ్యం అవుతుందా? ప్రాణనష్టం లేకుండా యుద్ధాన్ని ముగించడం అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చే ఇజ్రాయెల్‌కు సాధ్యమేనా?..ఇరాన్ ఓ కంచుకోట..!భౌగోళికంగా ఇరాన్ ఒక సహజమైన కోట లాంటిది. ఆ దేశం చుట్టూ ఎత్తైన పర్వతాలుంటే.. లోపల భయంకరమైన ఎడారులు, ఉప్పు నేలలు ఉన్నాయి. శత్రు సైన్యం ఇరాన్ లోపలి నగరాల వరకు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అందుకే, అమెరికా మిలటరీ ప్లానర్స్ ఒక సరికొత్త వ్యూహాన్ని ఆలోచిస్తున్నారు. ఇరాన్ లోపలికి వెళ్లకుండా, కేవలం దాని దక్షిణ తీరప్రాంతాన్ని(Southern Coastline) టార్గెట్ చేయడం! ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఆర్థిక, సైనిక వనరులు ఉన్నాయి. కానీ మిలిటరీ నిపుణులు ఒక మాట అంటారు. ఇరాన్లో అడుగుపెట్టే మొదటి తొలి మైలు దూరాన్ని కిలోమీటర్లలో కొలవవచ్చు, కానీ తదుపరి 100 మైళ్లను సంవత్సరాలలో కొలవాల్సి ఉంటుందనేది దాని సారాంశం..! అందుకే.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ముందు కేవలం ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..1. ఖార్గ్ ఐలాండ్ (Kharg Island): ఈ ద్వీపం ఇరాన్‌కు చమురు విషయంలో గుండెకాయలాంటిది. భూతల దాడులకు దిగితే.. అమెరికా కన్నుపడే మొదటి ప్రాంతం ఇదే. ఇరాన్ దేశ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో 90% నుంచి 95% ఇక్కడి నుంచే జరుగుతాయి. పర్షియన్ గల్ఫ్‌లో లోతు తక్కువగా ఉండటం వల్ల, ఇరాన్ తన మెయిన్‌ల్యాండ్ నుంచి పైప్లైన్ల ద్వారా చమురును ఈ దీవికి తెచ్చి, ఇక్కడ పెద్ద ట్యాంకర్లలో లోడ్ చేస్తుంది. అంటే, ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీన్ని ఆక్రమిస్తే ఇరాన్ మోకాళ్లపై పడుతుందని అమెరికా అనుకోవచ్చు. కానీ రిస్క్ ఏంటంటే.. ఇక్కడ దాడి జరిగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ క్రాష్ అవుతుంది. అంతేకాదు, పక్కనే ఉన్న అరబ్ దేశాల ఆయిల్ ఫీల్డ్స్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుంది.2. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ (Strait of Hormuz): ఇక అమెరికా ఎంచుకునేందుకు అవకాశమున్న రెండో మార్గం.. హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు ఇది అత్యంత కీలకమైన జలసంధి. అయితే దీన్ని కంట్రోల్ చేయడం అమెరికా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే దీని చుట్టూ ఇరాన్ బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంది. బందర్ అబ్బాస్ నగరం, ఖేష్మ్ ఐలాండ్లను దాటుకుని అమెరికా ఇక్కడ నిలబడటం చాలా కష్టం. ఇరాన్ దగ్గర వందలాది స్పీడ్ బోట్లు, మిస్సైల్ బ్యాటరీలు ఉన్నాయి. అవి అమెరికా నౌకాదళంపై నిరంతరం రాకెట్ల వర్షం కురిపించగలవు. ఇక్కడ ఆపరేషన్ మొదలైతే, అది పరిమితంగా కాకుండా.. ఒక సుదీర్ఘమైన ప్రపంచ ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది.3. మూడు ద్వీపాలు.. ఫైబర్-ఆప్టిక్ డ్రోన్ల ముప్పు: ఇక అమెరికా వద్ద ఉండే మూడో ఆప్షన్.. గల్ఫ్‌లో ఉండే మూడు చిన్న ద్వీపాలు. అవి.. అబు మూసా, గ్రేటర్ టంబ్, లెస్సర్ టంబ్. అమెరికా సైన్యం వీటిని ఈజీగా ఆక్రమించి.. మిలిటరీ బేస్‌లు పెట్టొచ్చు. కానీ, అమెరికా సేనలకు అసలు నరకం ల్యాండింగ్ అయ్యాక మొదలవుతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది... అదే ఫైబర్-ఆప్టిక్ డ్రోన్. సాధారణ డ్రోన్లను అమెరికా తన టెక్నాలజీతో ‘జామ్’ చేయగలదు. కానీ ఈ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ మీద పనిచేయవు, వీటికి వెనుక 60 కిలోమీటర్ల పొడవైన వైర్ ఉంటుంది. వీటిని జామ్ చేయడం అసాధ్యం! ఇరాన్ కొండల చాటు నుండి ఈ డ్రోన్లను వందల సంఖ్యలో వదిలితే.. ఈ ద్వీపాల్లో ఉండే అమెరికా సైనికులు కేవలం ‘సిట్టింగ్ డక్స్’ అంటే.. సులభమైన టార్గెట్స్ లాగా మిగిలిపోతారు.4. చాబహార్ పోర్ట్ (Chabahar Port): భూతల దాడుల కోసం అమెరికా వద్ద ఉండే నాలుగో ఆప్షన్ చాబహార్ పోర్ట్. దీన్ని భారత్ కూడా అభివృద్ధి చేసింది. ఇరాన్ దగ్గరున్న ఏకైక ఓపెన్ ఓషన్ డీప్-వాటర్ పోర్ట్ ఇది. ఇది గల్ఫ్ దేశాలకు కొంచెం దూరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. ఇక్కడ ల్యాండ్ అవ్వడం అమెరికాకు ఈజీ. కానీ సమస్య ఏంటంటే.. ఇక్కడ అమెరికాకు ఎలాంటి లెవరేజ్ దొరకదు. ఇరాన్ ప్రధాన నగరాలకు, ఆయిల్ ఫీల్డ్స్‌కు చాబహార్ చాలా దూరంలో ఉంది. దీన్ని పట్టుకుని అమెరికా సాధించేది ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఇరాన్‌ను లొంగదీసుకోవాలంటే, అమెరికా సైన్యం దేశం లోపలికి నడుచుకుంటూ వెళ్లాలి. అంటే మళ్లీ ఒక పెద్ద గ్రౌండ్ వార్‌లోకి దిగాల్సిందే.5. ఖుజెస్తాన్ (Khuzestan)-ప్రాక్సీల వ్యూహం: గ్రౌండ్ వార్‌కు అమెరికా సిద్ధమైతే.. ఆ దేశం ఎంచుకునే ఐదో ఆప్షన్ ఖుజెస్తాన్ మాత్రమే. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన రూట్. ఇది చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కువైట్‌లోని అమెరికా బేస్ నుంచి ఇక్కడికి రావడం అమెరికాకు ఈజీ. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ కూడా ఇరాన్‌పై దాడికి ఇదే రూట్‌ను వాడుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అమెరికా సైన్యం మాత్రం ఇరాక్‌లోని బస్రా మీదుగా రావాలి. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్న 2 లక్షల మంది 'ప్రాక్సీ మిలిషియా' సైన్యం కాపు కాసి ఉంటుంది. అంటే, అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దును తాకక ముందే.. ఇరాక్‌లోనే ఒక భారీ అంతర్జాతీయ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ 5 ప్రాంతాలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇరాన్‌లోకి ఎంటర్ అవ్వడానికి అమెరికాకు దారులు ఉన్నాయి. కానీ, గెలవడానికి దారులు లేవు. వెస్ట్రన్ బోర్డర్లో ఉన్న కుర్దిష్ తిరుగుబాటుదారులను వాడుకోవాలని చూసినా.. అది ఇరాన్ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచి దేశాన్ని మరింత ఏకం చేస్తుంది. చివరగా చెప్పాలంటే.. యుద్ధంలో ఎవరు మొదట కొట్టారు? లేదా ఎంత గట్టిగా కొట్టారు? అనేది ముఖ్యం కాదు. చివరి వరకు తట్టుకుని ఎవరు నిలబడ్డారు? అనేదే ముఖ్యం.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
నాటోతో అమెరికాకు తల్లాక్?
ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.. క్లుప్తంగా నాటో.. ఇప్పుడు నాటో-అమెరికా మధ్య ఇడుపు కాయితం.. అదే విడాకులు జరగనున్నాయా? నాటో నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగిపోతుందా? అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సైనిక అత్యవసర పరిస్థితి లేదా యుద్ధం వస్తే.. నాటో కూటమికి ఎలాంటి సైనిక సహాయం పంపాలనే నియమాలను ఆయన మార్చేశారు. దీని సారాంశం ఏమిటంటే.. నాటో దేశాలకు ఇకపై అమెరికా మద్దతు చాలా చాలా తక్కువగా ఉంటుంది.నాటోకు ఈ సపోర్ట్ ఉండదు..•విమాన వాహక నౌకలు (Carriers) ఉండవు•క్యారియర్ యుద్ధ విమానాలు ఉండవు•ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు (Precision munitions) ఉండవు•లాజిస్టికల్ సరఫరా (రవాణా సదుపాయాలు) ఉండదు•శాటిలైట్ మద్దతు కూడా చాలా పరిమితంగా ఉంటుంది.చైనాతో యుద్ధానికి సిద్ధం??అమెరికా అధికారిక ప్రకటన ప్రకారం.. చైనాతో ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చనే ఉద్దేశంతో అమెరికా పనిచేయాలని హెగ్సెత్ భావిస్తున్నారు. అందుకే.. చైనాతో పోరాడటానికి అవసరమయ్యే ఏ సైనిక వనరులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించకూడదని నిర్ణయించారు. ఇక అనధికారికంగా చూస్తే ఇరాన్ యుద్ధం తర్వాత, ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యుద్ధాలు చేసే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోయింది. అన్ని వనరులను కేవలం చైనా కోసమే కేటాయించాలని అమెరికా నిర్ణయించుకున్నప్పుడు, ఇక ప్రపంచంలో మరెక్కడా జోక్యం చేసుకోలేదు. ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రభుత్వం నడిపిన తీరు వల్ల, తూర్పు అర్ధగోళం నుంచి అమెరికా తన పట్టును కోల్పోతుందనేది నిర్వివాదాంశం..! రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. అదేంటంటే.. ఐరోపా (Europe) ఇక తనను తాను కాపాడుకోవాలే తప్ప.. అమెరికా సాయం ఉండదు.భవిష్యత్ ఏమిటి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో.. నాటో కూటమి పేపర్‌పై మాత్రమే మిగిలి ఉంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికా చేతులెత్తేస్తే, ఐరోపా దేశాల వద్ద లేని ప్రత్యేకమైన అమెరికన్ ఆయుధాలు రావని తేలిపోతే.. ఇక నాటో కూటమికి అర్థమే ఉండదు. దీంతో, నాటో కథ ముగిసినట్లే అవుతుంది!. 1949 నుండి నాటో ప్రణాళిక ఎలా ఉందంటే అమెరికా కొన్ని పెద్ద సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది, ఐరోపా దేశాలు వాటిని చేయవు. ఐరోపా దేశాలు ఎప్పుడూ అమెరికాపై ఆధారపడేలా చేయడం కోసమే యూఎస్ఏ అలా చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే, వారి సైన్యాలన్నింటినీ అమెరికానే కమాండ్ చేయాలనేది దాని ఆలోచన. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు ముగిసిపోయింది. ఐరోపాలో అమెరికా తన సైనిక ప్రభావాన్ని కోల్పోయింది.ఐరోపాకు కింకర్తవ్యమ్..?ఇప్పుడు ఐరోపా దేశాలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నందున, అమెరికాతో ఉన్న 'ఇంటర్ఆపరబిలిటీ' (Interoperability) అంటే.. కలిసి పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. అమెరికా ఆయుధ వ్యవస్థలు చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి, ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి డిజైన్ అయ్యాయి. కానీ ఐరోపా దేశాలు ఎదుర్కొనే యుద్ధాలు అలాంటివి కావు. ఒక యుద్ధంలో తమ సైన్యాన్ని నడిపించే అమెరికాతో కలిసి పనిచేయడం కోసమే ఐరోపా దేశాలు ఇంతకాలం అమెరికా ఆయుధాలను కొనుగోలు చేశాయి. కానీ అమెరికా సైన్యమే రానప్పుడు, ఇక ఆ ఆయుధాలను వాడటంలో ఎలాంటి అర్థం లేదు. ప్రస్తుత డ్రోన్ల యుగంలో.. అమెరికా తరహా ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడానికి ఐరోపాకు 10 నుండి 15 ఏళ్ల సమయం లేదు. అంత వేగంగా వాటిని నిర్మించలేరు. కాబట్టి, వారు ఉక్రెయిన్ తరహా ఆయుధాలను తయారు చేసుకుంటారు. వీటికి బ్యాకప్‌గా బహుళ-దేశాల అణ్వాయుధ రక్షణను ఏర్పాటు చేసుకుంటారు.ఇది ఎలా సాగుతుందో కాలమే చెప్పాలి. సరిగ్గా ఒక సంవత్సరంలోనే ఐరోపా, అమెరికా సైన్యాలు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల వారు కలిసి పనిచేయాల్సి వచ్చినా, వేర్వేరు కమాండ్ స్ట్రక్చర్స్, వేర్వేరు వ్యూహాలతో పనిచేయాల్సి ఉంటుంది. వాషింగ్టన్ తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం వల్ల నాటో కూటమికి చరమగీతం పాడినట్లవ్వడమే కాకుండా.. ఐరోపా దేశాలు తీసుకునే ఆయుధ కొనుగోలు నిర్ణయాలు కూడా ఈ కూటమిని శాశ్వతంగా ముగించేలా చేస్తాయి. నాటో (NATO) ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. కానీ ఇప్పుడు అమెరికా ఒక వ్యూహాత్మక విచ్ఛిన్నం (Strategic breakdown), సరికొత్త ప్రపంచ సమీకరణాల వైపు అడుగులు వేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐరోపా, అమెరికా ఒకే వైపు కాకుండా, రెండు వేర్వేరు ధ్రువాలుగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు. -
ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ
అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించి ఇరాన్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరుదేశాల మధ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని ట్రంప్ చెప్పగా, తాము అమెరికా అధికారులతో చర్చలు జరపడానికి వెళ్లడం లేదని ఇరాన్ సోమవారం సాయంత్రం స్పష్టం చేసింది.ఈ చర్చల కోసం అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన సలహాదారులు స్టీవ్ విట్కాఫ్ , ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సాంకేతిక చర్చలతో పాటు జరిగే ఉన్నత స్థాయి సమావేశాలకోసం దోహాకు వెళ్లనున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది.ఇరాన్ స్పష్టీకరణఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రతినిధి బృందం రాబోయే రెండు రోజులు దోహాలోనే ఉంటుందని, అయితే వారు అమెరికా అధికారులను కలవడానికి కాకుండా, ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికా తన కాల్పుల విరమణ ఒప్పంద బాధ్యతలను నెరవేర్చేలా చేయడానికి మాత్రమే వెళ్తున్నారని తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.ఇదీ చదవండి: హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులురూట్ ఫీజులపై ఒమన్‌తో చర్చలుహార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ఓడల మార్గాల్లో మార్పులు, ఫీజుల వసూలు వంటి కొత్త నిబంధనలపై ఒమన్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఘరీబాబాదీ పేర్కొన్నారు. ఒకవేళ ఒమన్ కలిసి రాకపోయినా, ఇరాన్ ఒంటరిగానే ముందుకు వెళ్తుందని హెచ్చరించారు. గత రెండు వారాలుగా ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి, గత గురువారం నుండి ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులు పెద్ద ముప్పుగా మారాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరు దేశాలు దాడులు కొనసాగిస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని మూడు హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసింది. అమెరికా మద్దతుతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుండి వెనక్కి తగ్గాల్సి ఉన్నప్పటికీ, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూప్ ఈ ఒప్పందాన్ని తిరస్కరించడంతో అక్కడ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్ -
ఇరాన్ ఫ్రీజింగ్ ఆస్తులు.. మసూద్ పెజెష్కియన్ కీలక ప్రకటన
టెహ్రాన్ : ఇరాన్ ప్రజలకు ఆదేశ అధ్యక్షుడు మసూజ్ పెజెష్కియన్ శుభవార్త చెప్పాడు. ఆ దేశానికి చెందిన ఆరు బిలియన్ డాలర్లను విడుదల చేయడానికి ఖతార్ అంగీకరించిందని పేర్కొన్నారు. త్వరలోనే ఆ డబ్బు విడుదల కానుందని పేర్కొన్నారు.అయితే అమెరికా మాత్రం స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులేవీ విడుదల చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.గత కొంత కాలంగా ఇరాన్- అమెరికా చర్చలు సజావుగా సాగకపోవడానికి స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులు సైతం ఓ కారణం విదేశాల్లో ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ పట్టుబట్టడం దానికి అమెరికా ససేమిరా అనడంతో చర్చల వ్యవహారం ఎంత మాత్రం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు సైతం నిధులు విడుదల చేసేది లేదన్నారు.అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ఫెజెష్కియన్ మాత్రం దానికి విభిన్నంగా మాట్లాడారు “ ఇటీవలే రూపొందించిన ప్రణాళికల ప్రకారం, ఖతార్‌లోని మొత్తం 12 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులలో ఆరు బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేసి దేశానికి తిరిగి ఇవ్వనున్నారు, అంతే కాకుండా తదనంతరం అవసరమైన తదుపరి చర్యలు చేపడుతారు.” అని అన్నారు. అయితే ఈ యుద్ధ ఉద్రిక్తతల వేళ చర్చల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ 'నిస్సహాయతతో' చర్చల్లోకి ప్రవేశించిందని, 60 రోజుల చర్చల కాలంలో టెహ్రాన్‌కు ' పది సెంట్లు కూడా ' అందవని తేల్చి చెప్పారు. అదే విధంగా ఈ యుద్ధంలో ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, వాయు, రక్షణ వ్యవస్థలు భారీ స్థాయిలో డ్యామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. -
ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇరాన్, అమెరికా యుద్ధం.. రెండోరోజు అప్డేట్స్.. యూఎస్, గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక.. 👉అమెరికా దాడులపై స్పందించిన ఇరాన్. ఇంకా దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దళాలు ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు చేయగా, దానికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు మరియు మిత్రదేశాలపై ప్రతిదాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అధికార వర్గాలు అమెరికా చర్యలను “ఉద్రిక్తత పెంచే దాడులు”గా అభివర్ణించాయి.👉ఇరాన్ ప్రకటనలో గల్ఫ్ దేశాలకు కూడా స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. అమెరికా తమ భూభాగాన్ని లేదా సైనిక స్థావరాలను ఉపయోగిస్తే, దాని ఫలితాలు “విపరీతంగా ఉంటాయి” అని హెచ్చరించింది.👉ఇరాన్ హెచ్చరికల ముఖ్యాంశం గల్ఫ్ దేశాలపై కూడా దృష్టి సారించింది. అమెరికా సైనిక చర్యలకు సహకరిస్తే, ఆ దేశాలు కూడా పరిణామాలు ఎదుర్కొంటాయని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి.గల్ప్‌లో సైరన్ల మోత.. 👉పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ (Sirik), బందర్-ఎ-లెంగెహ్ (Bandar-e Lengeh), ఖెష్మ్ (Qeshm) ద్వీపం ప్రాంతాల్లో ఉన్న సైనిక లక్ష్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా అధికారులు తెలిపారు.👉అమెరికా దాడులు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు హార్మూజ్ జలసంధి తమకు కీలక వ్యూహాత్మక ఒత్తిడి సాధనమని ఇరాన్ స్పష్టం చేసింది. జలసంధిపై తమ ప్రభావాన్ని వదులుకుంటే, అమెరికా మరోసారి దాడులు చేసేందుకు అవకాశం కల్పించినట్టే అవుతుందని టెహ్రాన్‌కు చెందిన అబ్బాస్ అస్లానీ తెలిపారు.👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బలప్రయోగం ద్వారా హార్మూజ్ జలసంధిలో పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తోందని, అయితే అలాంటి చర్యలు టెహ్రాన్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.👉ఇజ్రాయెల్–లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్వీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం హెజ్బొల్లాకు మళ్లీ ఊపిరి పోసినట్టేనని, ఆ సంస్థను పూర్తిగా నిర్మూలించాల్సింది పోయి కాల్పుల విరమణతో అవకాశం కల్పించారని విమర్శించారు. లెబనాన్ సైన్యం హెబ్బొల్లాను నియంత్రించగలదన్న వాదన ప్రమాదకర భ్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.👉అమెరికా–ఇరాన్ తాజా ఘర్షణలతో టెహ్రాన్ ప్రజల్లో మళ్లీ యుద్ధ భయాలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఎంత సున్నితంగా ఉందో ఈ పరిణామాలు చూపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరిస్తూ, దాడులు కొనసాగితే సైనికంగా పూర్తిగా ముగిస్తాం అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా పేర్కొంది.U.S. Navy and Air Force fighter jets conducted strikes tonight on 10 Iranian military targets at multiple locations in and near the Strait of Hormuz for Iran's drone attack on M/T Kiku. pic.twitter.com/Z0TLZRqmF6— U.S. Central Command (@CENTCOM) June 28, 2026👉ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లతో అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్‌లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగగా, కువైట్ తన గగనతల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసి శత్రు డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించింది.👉బహ్రెయిన్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. బహ్రెయిన్‌లో అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరం ఉండటంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ సార్వభౌమాధికారంపై దాడిగా దీనిని బహ్రెయిన్ ఖండించింది.👉ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద భద్రతా పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పు పెరగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.👉ప్రస్తుతం ఇరు దేశాలు మరిన్ని సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, మధ్యప్రాచ్యంలో పరిస్థితి గంట గంటకూ ఉద్రిక్తంగా మారుతోంది. అంతర్జాతీయ సమాజం మాత్రం సంయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపునిస్తోంది.👉ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో కొన్ని అమెరికా మిత్రదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పూర్తి నష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
మరోసారి మిసైళ్ల మోత.. ఇరాన్‌లోని కీలక స్థావరాలపై బాంబుల వర్షం
ఫ్లోరిడా: ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు చేసింది. ఆదివారం తెల్లవారుజామున మిసైళ్లతో విరుచుకుపడింది. ఎం/వి ఎవర్ లవ్లీ వాణిజ్య సరుకు రవాణా నౌకపై ఇరాన్ దాడికి ప్రతిగా శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశాన్ని ఇరాన్‌కు అమెరికా ఇచ్చింది. అయితే, ఇరాన్ దాన్ని లెక్క చేయకుండా డ్రోన్‌ను ప్రయోగించి ఎం/టి కికు నౌకను ఢీకొట్టింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఆ ట్యాంకర్, 2 మిలియన్లకు పైగా బ్యారెళ్ల ముడి చమురుతో హార్మూజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఓ ప్రకటనలో తెలిపింది.ఏయే ప్రాంతాల్లో దాడులు? వాణిజ్య నౌకలపై ఇరాన్ కొనసాగిస్తున్న దూకుడుకు నేరుగా ప్రతిగా సెంట్కామ్ దళాలు దాడులు చేపట్టాయి. అమెరికా సైనిక విమానాలు ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలు, సమాచార ప్రసార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్‌లేయర్ కెపాబిలటీస్ లక్ష్యంగా దాడులు చేశాయి. కాగా, హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని సెంట్కామ్ తెలిపింది. https://t.co/9JgYDCZXuB— U.S. Central Command (@CENTCOM) June 27, 2026మా సహనం నశించింది: ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రాహీం అల్ఫిఖర్ ఎక్స్‌లో వరుస పోస్టులు చేశారు. "మీరు మా సార్వభౌమాధికారంపై దాడి చేశారు. ఇక పరిస్థితుల్ని మార్చే కార్యాచరణకు సిద్ధంగా ఉండండి. మీరు తప్పుగా అంచనా వేశారు. మా సహనం నశించింది. కాళరాత్రిని చూడడానికి సిద్ధంగా ఉండండి. మీరు అన్ని హద్దులు దాటారు. మా నిర్ణయం మాటలకే పరిమితం కాదు.. కొన్ని గంటల్లో మా శక్తిని చూపిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇరాన్ సైన్యంలోని అత్యున్నత ఉమ్మడి యుద్ధ కమాండ్‌కు చెందిన అధికార ప్రతినిధి. మరోవైపు, బహ్రెయిన్ శనివారం ఇరాన్ తమ భూభాగంపై పలు డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని, శాంతిని కాపాడే ప్రయత్నాలకు ముప్పు తెచ్చిందని తెలిపింది.You miscalculated, and our patience has run out... so prepare for a long, endless night.— العميد إبراهيم ذو الفقاري (@Ibrahim_alFiqar) June 27, 2026 -
కొనసాగుతున్న ఇరాన్ దాడులు
మనామా: బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ శనివారం పలుసార్లు డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడి తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, పశ్చిమాసియాలో శాంతిని కాపాడే ప్రయత్నాలకు ముప్పు తెచ్చిందని బహ్రెయిన్ ఆరోపించింది.పశ్చిమాసియాలో ఇటీవల జరిగిన ఘర్షణలకు ముగింపు పలికే ఉద్దేశంతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత.. అమెరికా-ఇరాన్ తొలిసారి పరస్పరం సైనిక దాడులు చేసుకున్న కొన్ని గంటలకే బహ్రెయిన్‌లో ఈ డ్రోన్ దాడి జరిగినట్టు సమాచారం.ఇరాన్‌కు చెందిన పలువురు డ్రోన్లు దాడి చేశాయని పేర్కొంటూ బహ్రెయిన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన బహ్రెయిన్ సార్వభౌమాధికారంపై బహిరంగ ఉల్లంఘన అని పేర్కొంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నాలను ఇరాన్ దెబ్బతీస్తోందని ఆరోపించింది.బహ్రెయిన్ చేసిన ఆరోపణలపై టెహ్రాన్ ఇప్పటి వరకూ బహిరంగంగా స్పందించలేదు. అయితే, ఇరాన్ ప్రభుత్వం మాత్రం అమెరికాపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసిన తర్వాత, ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు జరిపిందని తెలిపింది.బహ్రెయిన్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భంగపరచాలనే ఉద్దేశంతోనే ఈ డ్రోన్ దాడి జరిగింది. తాజా పరిణామాలు ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి.అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా జరిగిన కాల్పులు, కొనసాగుతున్న ఘర్షణల కారణంగా శాంతి ఒప్పంద ప్రయత్నాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రాంతీయ భద్రతపై మరో ఆందోళన తలెత్తింది. హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య చమురు నౌకను శనివారం ఓ క్షిపణి తాకినట్టు యునైటెడ్ కింగ్డమ్ సముద్ర వాణిజ్య కార్యకలాపాల సంస్థ తెలిపింది. -
వీడియోలతో అమెరికా కవ్వింపు.. గల్ప్ దేశాలపై ఇరాన్ పంజా
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు దిగడంతో ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి, దానికి అమెరికా చేపట్టిన ప్రతీకార వైమానిక దాడులు, అనంతరం ఇరాన్ స్పందనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.సమాచారం ప్రకారం, హార్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఎవర్ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనకు ఇరాన్ మద్దతు ఉన్న బలగాలే కారణమని అమెరికా ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ దాడి జరిగిందని పేర్కొంటూ, అమెరికా మరోసారి ఇరాన్ తీరప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కొన్ని కీలక సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.అమెరికా దాడుల వీడియోలు విడుదల.. మరోవైపు.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై నిర్వహించిన సైనిక దాడులకు సంబంధించిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ నౌకల నుంచి క్షిపణులు ప్రయోగించడం, ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించడం, అనంతరం భారీ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలపై ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు CENTCOM తెలిపింది. ఈ వీడియోల్లో అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల నుంచి వరుసగా క్షిపణులు దూసుకెళ్లడం, లక్ష్య ప్రాంతాలను తాకిన తర్వాత భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం కనిపిస్తోంది. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను కాపాడేందుకు, తమ బలగాల రక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా దాడులు జరిపిందని ఆరోపించింది. అనంతరం, అమెరికా చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇతర అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఎంత మేర నష్టం జరిగిందనే విషయంపై అమెరికా ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.ఈ పరిణామాలతో గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలసంధి గుండా రోజూ లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
మళ్లీ తీవ్ర కలకలం.. ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేసి, వాటిని బూడిద చేశాయి. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, హార్మూజ్‌లో ఓ సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డ కొన్ని గంటలకే యూఎస్ సేనలు టెహ్రాన్‌పై దాడులు చేయడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై మిసైల్ దాడి జరిగినట్లు బ్రిటిష్ సైన్యం కూడా పేర్కొంది. అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు అనవసరంగా దాడి చేశాయి. దానికి ప్రతిస్పందనగానే ఇరాన్‌పై అమెరికా దాడులు చేసింది.అమెరికా ఏమంది? క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడులను డ్రోన్ దాడికి "బలమైన ప్రతిస్పందన"గా అభివర్ణించింది. ఇరాన్ ప్రమాదకర ప్రవర్తన వల్ల కీలక అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో నౌకల రాకపోకల స్వేచ్ఛ దెబ్బతింటోందని పేర్కొంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం సహకారాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. ఇరాన్ ఏమంది? ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా కారణమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఓడరేవు నగరం తహెరూయెహ్ పియర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ ప్రాంతంలో క్షిపణి తాకడంతోనే పేలుడు జరిగిందని తెలిపింది.అమెరికా-ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. యుద్ధానికి తుది పరిష్కారం దిశగా అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతున్న వేళ హార్మూజ్ జలసంధి తెరిచి ఉంచేలా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇరాన్ యుద్ధంలో బాంబులు పేలుతుంటే.. వీరిపై రూ.కోట్ల వర్షం
యుద్ధం అంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం, దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రమే అనుకుంటాం. కానీ ప్రతి యుద్ధం వెనుక మరో ఆర్థిక కోణం కూడా ఉంటుంది. ఒకవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే, మరోవైపు కొన్ని రంగాలు మాత్రం భారీగా లాభపడతాయి. ఇరాన్-అమెరికా యుద్ధం కూడా అలాంటి పరిస్థితినే తీసుకొచ్చింది. ఈ యుద్ధం వల్ల అసలు ఎవరు ఎక్కువ లాభం పొందారు? ఎవరు నష్టపోయారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇరాన్-అమెరికా యుద్ధం కేవలం రణరంగానికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావం చూపింది. యుద్ధం తొలి నాలుగు రోజుల్లోనే అమెరికా నేతృత్వంలోని కూటమి 5,000కు పైగా ఆయుధాలు వినియోగించింది. మొత్తం యుద్ధ వ్యయం 35-40 బిలియన్ డాలర్ల వరకు చేరి ఉండొచ్చని అంచనా.యుద్ధం వల్ల లాభం పొందినవారుఆయుధాల తయారీ సంస్థలుటోమాహాక్ క్షిపణులు, పెట్రియట్ క్షిపణుల తయారీ కంపెనీలుద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఎగుమతి సంస్థలుముడి చమురు వ్యాపార సంస్థలుయుద్ధ పరిణామాలపై పందేలు కాసిన కొందరు పెట్టుబడిదారులుమరోవైపు రష్యా, చైనా దేశాలు కూడా భౌగోళిక రాజకీయాల పరంగా ప్రయోజనాలు పొందాయి. అయితే యుద్ధ భారం మాత్రం సాధారణ ప్రజలపై పడింది. ఇంధన ధరల పెరుగుదలతో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇలా కాల్పుల మోతలో కాసుల వర్షం..! యుద్ధంలో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను పెద్ద ఎత్తున ప్రయోగించారు. దీంతో వాటి తయారీ సంస్థలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో టోమాహాక్ క్షిపణి ధర లక్షల డాలర్లలో ఉండటంతో ఆయుధ పరిశ్రమకు భారీ ఆదాయం లభించింది. పెరిగిన డిమాండ్ వల్ల తయారీ సమయం కూడా 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెరిగింది.ఇరాన్ తక్కువ ధర కలిగిన షాహెద్ డ్రోన్లను వినియోగించగా, వాటిని కూల్చేందుకు అమెరికా అత్యంత ఖరీదైన పెట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. తక్కువ ఖర్చుతో దాడులు చేసిన ఇరాన్‌కు ఎదురుగా అమెరికా అత్యధిక వ్యయం చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయుధ తయారీ సంస్థల అమ్మకాలు, ఆర్డర్లు, వాటాల విలువలు వేగంగా పెరిగాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ప్రముఖ రక్షణ సంస్థలు ఈ పరిణామాలతో భారీ లాభాలు పొందాయి.హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి అమెరికా గ్యాస్ ఎగుమతి సంస్థలకు అనుకూలంగా మారింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగడంతో అమెరికా నుంచి గ్యాస్ ఎగుమతి చేసే సంస్థలు భారీ ఆదాయాన్ని నమోదు చేశాయి.ముడి చమురు ధరలు కూడా యుద్ధ ప్రభావంతో ఒక్కసారిగా పెరిగాయి. దీంతో చమురు వ్యాపార సంస్థలు, వ్యాపారులు అధిక లాభాలు ఆర్జించారు. కొంతమంది సంస్థలకు యుద్ధం వల్ల కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురైనా, పెరిగిన ధరల కారణంగా గత ఎన్నో సంవత్సరాల్లో లేనంత లాభాలు నమోదయ్యాయి.యుద్ధం సమయంలో అమెరికా గల్ఫ్ దేశాలకు భారీ విలువైన ఆయుధాల విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో రక్షణ వ్యయాన్ని మరింత పెంచే ప్రణాళికలూ ప్రకటించింది. ఈ వ్యయ భారం చివరకు అమెరికా పన్ను చెల్లింపుదారులపై పడే అవకాశం ఉంది.ఈ యుద్ధంలో మరో ఆసక్తికర అంశంగా ప్రిడిక్షన్ మార్కెట్. యుద్ధం, కాల్పుల విరమణ వంటి పరిణామాలపై ముందుగానే పందేలు కాసి కొందరు కోట్ల డాలర్ల లాభాలు పొందినట్లు పరిశోధనలో వెల్లడైంది. దీనిపై అమెరికా సెనెట్ దర్యాప్తునకు ఆదేశించింది.మొత్తంగా చూస్తే ఈ యుద్ధంలో అత్యధిక లాభం ఆయుధ తయారీ సంస్థలు, గ్యాస్ ఎగుమతిదారులు, చమురు వ్యాపారులు పొందారు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల ప్రజలు అధిక గ్యాస్ ధరల భారం భరించాల్సి వచ్చింది. తక్కువ ధర డ్రోన్లను అడ్డుకునేందుకు ఖరీదైన క్షిపణులు కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడింది. -
నాటో చీఫ్‌కు మెలోనీ స్ట్రాంగ్ వార్నింగ్..
రోమ్: నాటో చీఫ్ మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలో ఇటలీ కూడా భాగస్వామి అయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మండిపడ్డారు ఇరాన్‌పై జరిగిన యుద్ధంలో ఇటలీ ప్రత్యక్షంగా పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని తప్పుగా ప్రతిబింబిస్తున్నాయని ఆమె హెచ్చరిస్తూ కౌంటరిచ్చారు.ఫ్రాన్స్–ఇటలీ ద్వైపాక్షిక సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడిన మెలోనీ..‘నాటో ప్రధాన కార్యదర్శ మార్క్ రుట్టే చాలా ఉత్సాహంగా వివరణ ఇచ్చే క్రమంలో వేర్వేరు అంశాలను ఒకటిగా కలిపేశారు. ఇటలీ అనుమతించిన విమానాల స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేం ఇరాన్‌పై జరిగిన సైనిక దాడుల్లో పాల్గొనలేద’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఇటీవల మార్క్ రుట్టే అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చాయి.అమెరికా ఇరాన్‌పై చేపట్టిన "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" సందర్భంగా యూరప్‌లోని అమెరికా స్థావరాల నుంచి వేలాది విమానాలు ఎగిరాయని, అందులో ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి కూడా వందలాది విమానాలు బయలుదేరాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రత్యక్షంగా యుద్ధానికి సహకరించిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇటలీ ప్రభుత్వం దీనిని వెంటనే ఖండించింది. తమ భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి కేవలం సాంకేతిక, లాజిస్టిక్, నిర్వహణ సంబంధిత విమానాలకే అనుమతి ఇచ్చామని, యుద్ధ కార్యకలాపాలు, దాడులు లేదా ఆయుధ మద్దతుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటలీ రాజ్యాంగం, అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలో మాత్రమే వ్యవహరించామని తెలిపింది.మరోవైపు.. ఈ వివాదంపై ఇటలీ విదేశాంగ మంత్రి అంటోనియో తజానీ కూడా స్పందిస్తూ.. రుట్టే వ్యాఖ్యలను అతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాటో చీఫ్ ఉద్దేశం లాజిస్టిక్ సహకారం గురించేనని, ఇటలీ యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇక, ఈ వివాదం ఇటలీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం అసలు నిజాలు చెప్పిందా? లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, మెలోనీ ప్రభుత్వం మాత్రం ఇరాన్ యుద్ధంలో ఇటలీకి ప్రత్యక్ష పాత్ర లేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. -
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట
దేశంలోని బల్క్, కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా వాణిజ్య గ్యాస్ సరఫరాపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేసింది.ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు దేశంలో ఏ స్థాయిలో సరఫరా ఉండేదో, ఆ పాత నిబంధనలనే పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా స్పష్టం చేశారు. బల్క్ గ్యాస్ సరఫరా 50 శాతానికి పెంపు ప్యాక్డ్ సిలిండర్లతో పాటు, సంక్షోభం ప్రారంభమైన సమయంలో పూర్తిగా నిలిపివేసిన ‘బల్క్ ఎల్పీజీ’ సరఫరాపై కూడా కేంద్రం సడలింపులు ఇచ్చింది.పాత వినియోగంతో పోలిస్తే పరిశ్రమలకు 50 శాతం మేర బల్క్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ వంటి భారీ ఇంధన ఆధారిత పరిశ్రమలకు గ్యాస్ కొరత తీరనుంది. -
ఇప్పుడు హార్మూజ్ పరిస్థితి ఏంటి? ఇంధన రవాణా కొనసాగుతోందా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి అంతా హార్మూజ్ జలసంధిపైనే నిలిచింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం భవిష్యత్తుపై ఇటీవల అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం హార్మూజ్ జలసంధి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఇంధన రవాణా కొనసాగుతోందా? ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చేలా అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ వివరాలు తెలిపారు. హార్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా జరగడం భారత్‌కు కూడా చాలా ముఖ్యం. గత 24 గంటల్లో హార్మూజ్ జలసంధి నుంచి 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు బయటకు వెళ్లిందని క్రిస్ రైట్ తెలిపారు. హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా ఘర్షణలకు ముందు ఉన్న స్థాయికి ఎక్కువగా చేరుకుందని, నౌకాదళ రక్షణతో ట్యాంకర్ రాకపోకలు క్రమంగా పునరుద్ధరణ అవుతున్నాయని క్రిస్ రైట్ తెలిపారు.ఇరాన్-ఇజ్రాయెల్/అమెరికా ఉద్రిక్తతలు, ఘర్షణల కారణంగా హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా కొంతకాలం తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో, యుద్ధానికి ముందు ఎంత మేరకు చమురు ట్యాంకర్లు ప్రయాణించేవో దాదాపు అదే స్థాయికి మళ్లీ చేరుతున్నాయని క్రిస్ రైట్ చెప్పారు. నౌకాదళ భద్రత ఉండటంతో ట్యాంకర్ రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపారు.72 నౌకలు.. 20 మిలియన్ బ్యారెళ్ల చమురు న్యూయార్క్‌లో జరిగిన రాయిటర్స్ గ్లోబల్ ఎనర్జీ ఫోరంలో క్రిస్ రైట్ మాట్లాడుతూ.. గత 24 గంటల్లో సుమారు 72 నౌకల ద్వారా 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఈ జలమార్గం గుండా తరలించారని చెప్పారు. ఈ పరిమాణం ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతుకు సమానం. రైట్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ముడి చమురు ఎగుమతులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నాయి. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇప్పుడు ఇరాన్‌కు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ బెదిరింపును చాలా కాలంగా టెహ్రాన్ అత్యంత కీలక వ్యూహాత్మక సాధనంగా భావిస్తూ వచ్చింది.“జలసంధిపై ఇరాన్ ఒకప్పుడు ఉన్న ప్రభావం క్రమంగా తగ్గుతోంది” అని రైట్ అన్నారు. ఘర్షణ సమయంలో ఆ దేశ సైనిక సామర్థ్యాలు చాలా బలహీనపడ్డాయని చెప్పారు. నౌకా రవాణా మెరుగుపడటంతో ప్రపంచ చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. సరఫరా అంతరాయాలపై భయాలు తగ్గడంతో బుధవారం ప్రామాణిక ముడి చమురు ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు $3 కంటే ఎక్కువగా పడిపోయింది. ఫిబ్రవరిలో ఇరాన్ ఘర్షణ ప్రారంభానికి ముందు ఉన్న కనిష్ఠ స్థాయికి చేరింది.వెనిజులాలో చమురు ఉత్పత్తి పెరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో తొలగింపు తర్వాత అమెరికా పరిపాలనలో ఆ దక్షిణ అమెరికా దేశం నుంచి ఎగుమతులు పెరిగాయని చెప్పారు.ప్రస్తుత స్థాయితో పోలిస్తే వెనిజులా చమురు ఉత్పత్తి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రైట్ తెలిపారు. 2029లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసేలోపు రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరవచ్చని చెప్పారు. -
నయా పైసా చెల్లించలేదు.. రెచ్చిపోయిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిహారం కింద ఇరాన్‌కు ఇప్పటి వరకూ తామూ నయాపైసా కూడా చెల్లించలేదని తెలిపారు. అదేవిధంగా హర్ముజ్‌లో ఎలాంటి టోల్ విధించబోమని ఇరాన్ ఇదివరకే తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ ఇరాన్ ఇచ్చిన ఈ సమాచారం అబద్ధమని తేలితే, ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చలను తక్షణమే నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు.అయితే, ఇరాన్లో ఆహార కొరత తీవ్రంగా ఉన్నందున, వారి నిధులను పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉంచి కేవలం అమెరికా రైతులకు సంబంధించిన మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రమే వాటిని వాడేలా అనుమతిస్తామని వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ బంకుల్లో ధరలను తగ్గించకుండా వినియోగదారులను దోచుకుంటున్నారనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే దర్యాప్తు చేయాలని అమెరికా న్యాయశాఖను కోరినట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరోసారి కలకలం రేపుతున్నాయి.కాగా గత సోమవారం స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఒప్పందం షరతుల్లో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ వెసులుబాటు ఆగస్ట్ 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. -
ఇరాన్‌కు వెళ్లొద్దు.. భారత ప్రభుత్వం అడ్వైజరీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌కు సంబంధించిన ప్రయాణ హెచ్చరికలను భారత ప్రభుత్వం మరోసారి సవరించింది. ప్రస్తుతం ఇరాన్లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, భారతీయులు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా ట్రావెల్ అడ్వైజరీలో ఇరాన్లో పరిస్థితులు గతంతో పోలిస్తే కొంత స్థిరపడుతున్నాయని పేర్కొంది. అయినప్పటికీ భద్రతా పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదని, ఎలాంటి ఆకస్మిక పరిణామాలనైనా తోసిపుచ్చలేమని హెచ్చరించింది. ఇరాన్‌లోని భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు అత్యవసర ప్రయాణాలు చేయవద్దు. అందువల్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణలు, వైమానిక దాడులు, క్షిపణి దాడులు పశ్చిమాసియా ప్రాంతాన్ని తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో జూన్ 8న భారత ప్రభుత్వం అత్యవసర సూచనలు జారీ చేస్తూ భారతీయులు ఇరాన్‌కు వెళ్లవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశం విడిచి రావాలని సూచించింది. అయితే తాజా సమీక్షలో పరిస్థితులు కొంత మెరుగుపడినట్లు గుర్తించిన భారత రాయబార కార్యాలయం, గత హెచ్చరికలను పూర్తిగా ఎత్తివేయకుండా జాగ్రత్తతో కూడిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. Advisory issued by Indian Embassy in Tehran:Embassy of India, Tehran, has been closely monitoring the prevailing security situation in the Islamic Republic of Iran. In light of recent positive developments and the improvement in the overall situation, the Embassy wishes to… pic.twitter.com/XkBnyyw8Uq— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 24, 2026ఇరాన్లో ప్రస్తుతం నివసిస్తున్న భారతీయులు స్థానిక భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని, రాయబార కార్యాలయంతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని కోరింది. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కాగా, ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు మరియు ఇతర పౌరుల భద్రతపై భారత ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని అధికారులు తెలిపారు. పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే వెంటనే కొత్త సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. -
ట్రంప్‌నకు భారీ షాక్ ఇచ్చిన అమెరికా సెనేట్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక బలగాలను వెనక్కి తీసుకురావాలని ఆదేశించే తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. ప్రభుత్వ సైనిక అధికారాలపై రెండు ప్రధాన పార్టీలు కలిసి అభ్యంతరం చెప్పిన అరుదైన ఘటనగా ఇది నిలిచింది. అలాగే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనను కాంగ్రెస్ వ్యక్తం చేసింది. ఈ తీర్మానం 50-48 ఓట్లతో ఆమోదం పొందింది. రిపబ్లికన్ సెనేటర్లు రాండ్ పాల్, సూసన్ కాలిన్స్, లిసా మర్కోవ్‌స్కీ, బిల్ క్యాసిడీ డెమొక్రాట్లకు మద్దతుగా ఓటు వేశారు. డెమొక్రటిక్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇంతకుముందు ఇలాంటి యుద్ధ అధికారాల తీర్మానాలకు వ్యతిరేకంగా ఉన్న రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్కానెల్, డేవ్ మెక్కార్మిక్ ఈ ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల ఈ తీర్మానం ఆమోదం పొందింది.కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే అధ్యక్షుడి అధికారాన్ని పరిమితం చేయాలని డెమొక్రట్లు చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ ఓటింగ్ జరిగింది. ఇటీవలి వారాల్లో కొందరు రిపబ్లికన్లు కూడా ఈ ప్రయత్నాలకు క్రమంగా మద్దతు పెంచారు. ఈ తీర్మానం ఇంతకుముందు అమెరికా ప్రతినిధుల సభలోనూ 215-208 ఓట్లతో ఆమోదం పొందింది. నలుగురు రిపబ్లికన్లు డెమొక్రట్లతో కలిసి అనుకూలంగా ఓటు వేశారు.ఆ ఓటింగ్ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చట్టసభ సభ్యులపై విమర్శలు చేశారు. వారిని "గ్రాండ్స్టాండర్స్" అని పేర్కొంటూ, వారి చర్యలను "దేశభక్తికి విరుద్ధం" అని అన్నారు. రెండు సభల్లోనూ ఈ తీర్మానం ఆమోదం పొందినా, ఇది ఉమ్మడి తీర్మానం మాత్రమే. అందువల్ల అధ్యక్షుడి సంతకం అవసరం లేదు. దీనికి చట్టబద్ధ అమలు పవర్ కూడా లేదు. సెనేట్ ఓటింగ్‌పై స్పందించిన శ్వేతసౌధ అధికారి ఈ తీర్మాన ప్రాధాన్యాన్ని తగ్గించి చూపించారు."ఉమ్మడి తీర్మానాలు అధ్యక్షుడి వద్దకు వెళ్లవు. వాటికి చట్టబద్ధ అమలు శక్తి లేదు" అని ఆ అధికారి తెలిపారు. ఈ తీర్మానం ఎక్కువగా ప్రతీకాత్మకమేనని, కొందరు రిపబ్లికన్ సెనేటర్లు గైర్హాజరు కావటం వల్లే ఇది ఆమోదం పొందిందని కూడా ఆయన అన్నారు.శ్వేతసౌధం ఏమంటోంది? ఈ తీర్మానం అధ్యక్షుడు అమెరికా సాయుధ బలగాలను ఇరాన్‌పై జరుగుతున్న శత్రుత్వ చర్యల నుంచి వెనక్కి తీసుకురావాలని ఆదేశిస్తోంది. అయితే, అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. "ఏప్రిల్ 7న కాల్పుల విరమణతో శత్రుత్వ చర్యలు ముగిశాయి. అందువల్ల అమెరికా బలగాలను వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి లేదు" అని అక్కడి మీడియా తెలిపింది. ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చిన డెమొక్రటిక్ సహాయకుడు ఈ అభిప్రాయాన్ని ఖండించారు. ఈ తీర్మానం అమల్లో ఉంటుందని, దీని ప్రభావంపై విభేదాలు వస్తే అది న్యాయపరమైన అంశంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఈ ఏడాది ఆరంభం నుంచి ఇరాన్‌కు సంబంధించిన యుద్ధ అధికారాలపై సెనేట్ ఇప్పటికే 10 సార్లు ఓటింగ్ నిర్వహించింది. గత నెలలో సెనేట్ మద్దతు పొందిన మరో ప్రతిపాదన ముందుకు వెళ్లినా, తుది ఓటింగ్ ఇంకా జరగలేదు. ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూర్చేందుకు డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నా, భవిష్యత్తులో ఇరాన్‌కు సంబంధించిన ఏ సైనిక చర్య జరిగినా కాంగ్రెస్ పర్యవేక్షణ ఉండాలని కొందరు డెమొక్రటిక్ సెనేటర్లు పట్టుబడుతున్నారు. ఈ తీర్మానం యుద్ధ అధికారాల సమతుల్యతపై అమెరికా కాంగ్రెస్, అధ్యక్షుడి మధ్య వాషింగ్టన్లో కొనసాగుతున్న చర్చకు ప్రతిబింబంగా నిలిచింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా సైనిక ప్రమేయంపై ఈ చర్చ సాగుతోంది. -
అణ్వాయుధాలపై కీలక నిర్ణయం.. జేడీ వాన్స్
జెనీవా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల్లో భాగంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నుండి పరిశీలకులను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని పేర్కొన్నారు.స్విట్జర్లాండ్‌లో బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా నిన్న అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ భేటీపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ " చర్చల్లో చాలా మంచి పురోగతి లభించింది. అంతకుముందు రోజు జరిగిన చర్చలు కూడా చాలా సానుకూలంగా సాగాయి. అణు తనిఖీల కోసం ఇన్స్పెక్టర్లను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించింది. అణు పరిశీలకులతో చర్చలు శుక్రవారం నుంచే ప్రారంభం అయ్యే అవకాశంఉంది. ఇరుపక్షాల సాంకేతిక బృందాలు తమ పనిని కొనసాగిస్తాయి " అని వాన్స్ అన్నారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి తెరిచే ఉందని ఈ కీలకమైన రవాణా మార్గం నిరంతరం అందుబాటులో ఉండేలా చూసేందుకు చర్చల ప్రతినిధులు ఒకప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపాలని అమెరికా కోరుకుంటోందన్నారు. అదే విధంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించే లక్ష్యంతో లెబనాన్ కోసం ఒక ఘర్షణ నివారణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని వాన్స్ అన్నారు.ఇరాన్‌తో చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా,ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపిందని వాన్స్ అన్నారు. అలాగే, వాషింగ్టన్ ఈ ప్రాంతంలోని దేశాలపై ఎలాంటి ఒప్పందాన్ని రుద్దడం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఒకవేళ దౌత్యం విఫలమైతే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంకా చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయని వాన్స్ పరోక్షంగా ఇరాన్‌ను హెచ్చరించారు. -
అమెరికాకు భారీ షాక్.. ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ!
యుద్ధాలు కేవలం యుద్ధభూములకే పరిమితం కావు. అవి దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రజల జీవన ప్రమాణాలను, అంతర్జాతీయ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీనికి తాజా ఉదాహరణ అమెరికా-ఇరాన్ ఘర్షణ. కేవలం కొన్ని వారాల పాటు సాగిన ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటికే 132 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 లక్షల కోట్లకు పైగా) ఆర్థిక భారం మోపినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థ మూడీస్ అనలిస్టిక్స్ ‘Moody’s Analytics’ అంచనా వేసింది. అయితే ఇది కేవలం అమెరికా నష్టమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు మద్దతు, ఇజ్రాయెల్ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. పరిస్థితి మరింత దిగజారడంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు, ప్రాంతీయ సైనిక చర్యలతో స్పందించింది. యుద్ధం పూర్తిస్థాయి ప్రాంతీయ సంక్షోభంగా మారుతుందేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ప్రపంచ మార్కెట్లను వణికించింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ..ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు హార్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయవచ్చనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరుకునే పరిస్థితి ఏర్పడింది. చమురు ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ఖరీదు పెరగడమే కాదు. విమాన ప్రయాణాలు, సరుకు రవాణా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల ఖర్చులు, ఆహార ధరలు ఇలా ప్రతి రంగంపైనా ప్రభావం పడింది. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లింది.అమెరికాపై ఎఫెక్ట్ ఎలా?Moody’s Analytics లెక్కల ప్రకారం యుద్ధం వల్ల అమెరికాలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గ్యాలన్ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. ట్రక్కింగ్, విమానయాన, తయారీ రంగాలపై అదనపు భారం పడింది. ఫలితంగా వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఇలా ప్రతి అమెరికా కుటుంబం సగటున వందల డాలర్ల అదనపు ఖర్చును భరించాల్సి వచ్చినట్లు అంచనా. మరోవైపు ప్రభుత్వం సైనిక చర్యలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నౌకాదళ మోహరింపు, మధ్యప్రాచ్యంలోని సైనిక స్థావరాల నిర్వహణ కోసం భారీ మొత్తాలను ఖర్చు చేసింది. మరోవైపు.. అమెరికా ఇప్పటికే 40 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉన్న జాతీయ రుణంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మరో భారీ సైనిక ఘర్షణ ఫెడరల్ బడ్జెట్‌పై అదనపు ఒత్తిడిని పెంచిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడం రాజకీయంగా కూడా పెద్ద అంశం. సాధారణంగా గ్యాస్ ధరలు పెరిగితే అధికార ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అందుకే యుద్ధం ప్రభావం అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధభూమిలోనే కాదు.. మార్కెట్లలో కూడా నష్టంఈ యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి వెనక్కి తగ్గడంతో ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపించాయి. బంగారం, డాలర్ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. యూరప్‌లో ఇప్పటికే మందగమనం ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఇంధన ఖర్చుల పెరుగుదల మరింత దెబ్బతీసింది. ఆసియా దేశాల్లో దిగుమతి ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరిగింది.భారత్‌పై ప్రభావం?భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి భారత్‌కు ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల పరిస్థితులు కొంత సద్దుమణగడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయినప్పటికీ జలసంధి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే ప్రభావం భారత్‌పైనా గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.యుద్ధం ముగిసినా..ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ఘర్షణలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఆర్థిక ప్రభావం మాత్రం వెంటనే తగ్గే పరిస్థితి లేదు. చమురు సరఫరా గొలుసులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా కొన్ని నెలల పాటు కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ఈ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2 నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం సంభవించే అవకాశం ఉండేదని అంచనా.కాగా, యుద్ధాలు గెలుపు-ఓటముల గురించి మాత్రమే కావు. వాటి అసలు ఖరీదు ఆర్థిక వ్యవస్థలు, సాధారణ ప్రజలు, ప్రపంచ మార్కెట్లు చెల్లిస్తాయి. అమెరికా-ఇరాన్ ఘర్షణ కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధం కొన్ని వారాల్లో ముగిసినా, దాని ఆర్థిక ప్రతిధ్వనులు మాత్రం నెలలు, సంవత్సరాల పాటు వినిపించే అవకాశముంది. మిసైళ్లు కొన్ని నిమిషాల్లో పేలిపోతాయి... కానీ వాటి ఆర్థిక ప్రభావం మాత్రం ఏళ్ల తరబడి దేశాలను వెంటాడుతుంది. అమెరికాకు 132 డాలర్ల బిలియన్ల బిల్లు, ప్రపంచానికి ట్రిలియన్ల డాలర్ల భయం మిగిల్చిన ఘర్షణగా ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోనుంది. -
హార్మూజ్‌పై ట్రంప్ కొత్త ఎత్తుగడ.. చమురు ప్రపంచానికి షాక్?
వాషింగ్టన్: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం 60 రోజుల తర్వాత శాశ్వత ఒప్పందంగా మారకపోతే, ప్రపంచ ఇంధన సరఫరాలకు ప్రాణాధారంగా భావించే హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలపై అమెరికా టోల్లు (రుసుములు) విధించే అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు.ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికలో చేసిన పోస్టులో.. ప్రస్తుతం అమలులో ఉన్న 60 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) సమయంలో ఎలాంటి టోల్లు ఉండవని స్పష్టం చేశారు. అయితే చర్చలు విఫలమై తుది ఒప్పందం కుదరకపోతే, మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా ‘Guardian Angel’గా అందించిన భద్రతా సేవలకు ప్రతిఫలంగా అమెరికానే టోల్లు విధించవచ్చని పేర్కొన్నారు. గతం, వర్తమానం, భవిష్యత్తులో అందించిన భద్రతా సేవల ఖర్చులకు ఇది పరిహారం అని ఆయన వ్యాఖ్యానించారు.There will be NO TOLLS in the Hormuz Strait for 60 days during the Cease Fire Period, and there will be NO TOLLS after the 60 day period has expired, unless they are imposed by and for the United States of America, should the deal not be completed, for services rendered as the… pic.twitter.com/f2DtGeiLUf— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) June 20, 2026ఇరాన్ వాదన.. అమెరికా ఖండనఇదిలా ఉండగా, తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య లెబనాన్‌లో కొనసాగుతున్న ఘర్షణలు కాల్పుల విరమణకు విరుద్ధమని ఆరోపించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ వాదనను ఖండించింది. జలసంధి తెరిచే ఉందని, ఒక్కరోజులోనే 55 వాణిజ్య నౌకలు 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో ప్రయాణించాయని వెల్లడించింది.స్విట్జర్లాండ్‌లో కీలక చర్చలుఈ వివాదాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ మహ్మద్ బాకిర్ క్వాలిబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధులతో స్విట్జర్లాండ్‌లో కీలక చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, హార్మూజ్ భవిష్యత్ నిర్వహణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?ట్రంప్ తాజా వ్యాఖ్యలు కేవలం రాజకీయ హెచ్చరికలు మాత్రమే కావు. హార్మూజ్‌పై టోల్లు లేదా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే ప్రపంచ చమురు ధరలు, రవాణా వ్యయాలు, ఇంధన మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం శాంతి చర్చల ఫలితాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పుడు అందరి దృష్టి స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలపైనే ఉంది. -
ఇరాన్ సంచలన ప్రకటన.. 'హర్ముజ్ క్లోజ్'
టెహ్రాన్: ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా శాంతి ఒప్పందం నియమాలను ఉల్లంఘించిందని అందుకే హర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తిరిగి హర్ముజ్‌ను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హర్ముజ్ మూసివేత తమ ప్రతిస్పందనలో కేవలం ఒక అడుగు మాత్రమేనని టెహ్రాన్ స్పష్టం చేసింది. కాగా ఇటీవలే 2026, జూన్ 17న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్‌లోని వర్సల్స్ ప్యాలెస్‌లో, అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ టెహ్రాన్‌లో ఈ మైత్రి ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో గత నాలుగు నెలలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడం, నిలిచిపోయిన హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తిరిగి తెరవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.ఒప్పంద నిబంధనలు ఈ 14 సూత్రాల ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగించారు. ఈ సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షల ఎత్తివేతపై తుది చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే, ఈ ఒప్పందం జరిగిన మూడు రోజులకే ఈ రోజు (జూన్20న), ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇరాన్ హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
గ్రీన్ సిగ్నల్ : హోర్ముజ్ గుండా నౌకలు అలా వెళ్లవచ్చు!
పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్తతల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిమూసివేతతోఅంతర్జాతీయ చమురు సంక్షోభం ఏర్పడింది. అయితే ఈ విషయంలో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత, తాజాగా సముద్ర సమాచార సంస్థ జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (JMIC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి)లోని దక్షిణ మార్గం గుండా నౌకలు పగలap రాత్రి తమ ట్రాన్స్‌పాండర్ సిగ్నల్స్ (AIS) ఆన్ చేసుకుని ప్రయాణించవచ్చని తెలిపింది. అంతకు ముందు అమెరికా సైన్యం నౌకలు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేసి, డార్క్‌గా కేవలం రాత్రి వేళల్లోనే ప్రయాణించాలని సూచించిన సంగతి తెలిసిందే. JMIC తాజా ప్రకటన ప్రకారం ఇక నౌకలు తమ రేడార్లు, రన్నింగ్ లైట్లు, VHF రేడియో కమ్యూనికేషన్లను సాధారణంగా వాడుకుంటూ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఈ మార్గంలో వెళ్లే నౌకలు అమెరికా నావికాదళ విభాగానికి (NCAGS) సమాచారం అందించడం తప్పనిసరి కాదు, కానీ సంప్రదిస్తే మంచిదని సూచించింది.ఇదీ చదవండి: చైనాకు కౌంటర్ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్భద్రతా హెచ్చరికలుఈ జలసంధిలో మైన్లు (Mines) ఉండే అవకాశం ఉందని, వాటిని తొలగించే ప్రక్రియలు జరుగుతున్నాయని, అందువల్ల నౌకలు జాగ్రత్తగా ఉండాలని JMIC హెచ్చరించింది. అయితే దక్షిణమార్గంలో మైన్లు లేవని అమెరికా నావికాదళం గతంలోనే ప్రకటించింది.కాగా ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైన తరువాత ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, హోర్ముజ్ జలసంధిగుండా వెళ్లే నౌకలు తమ అనుమతి తీసుకోవాలని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఇది భవిష్యత్తులో టోల్ వసూళ్లపై వివాదానికి దారి తీయ వచ్చనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ఐదేళ్లు లివిన్, ఇపుడు రేప్ అంటే? కేసు కొట్టేసిన హైకోర్టు60 రోజుల వ్యవధిలో అవగాహన ఒప్పందంలోని వివాదాస్పద వివరాలను అమెరికా, ఇరాన్‌లు పరిష్కరించు కోగలవా అనే దానిపై కూడా సందేహాలు తలెత్తాయి. దీనికి తోడు తదుపరి చర్చల కోసం స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన సమావేశం రద్దవ్వడం, వాషింగ్టన్ హెచ్చరికలను లెక్కచేయకుండా ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై దాడి చేయడం వంటి పరిణామాలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. హోర్ముజ్ ప్రాంతంలో భద్రతా ముప్పు స్థాయిని 'మితమైనది'గా JMIC ప్రస్తుతం అంచనా వేస్తోంది. ఒప్పందం కుదరడానికి ముందున్న 'గణనీయమైన' స్థాయితో పోలిస్తే ఇది మెరుగైనదే.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం -
అమెరికా లేకుంటే.. ఇజ్రాయెల్ పరిస్థితి ఇదేనా?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్ విభేదాలు, హెజ్బొల్లా-హమాస్ ముప్పుల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్‌తో అమెరికా అవగాహన ప్రయత్నాలను ఇజ్రాయెల్ విమర్శిస్తున్న వేళ.. ఇజ్రాయెల్‌కు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికానే అని వాన్స్ వ్యాఖ్యానించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోగలదా?. రక్షణ నిపుణులు, వ్యూహాత్మక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దీనికి సరళమైన సమాధానం లేదు. స్వల్పకాలిక యుద్ధాలు, పరిమిత దాడులను ఇజ్రాయెల్ స్వయంగా ఎదుర్కోగలిగినా, దీర్ఘకాలిక ప్రాంతీయ యుద్ధంలో అమెరికా సహకారం కీలకంగా మారుతుందని వారు చెబుతున్నారు.అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిఇజ్రాయెల్ భౌగోళికంగా చిన్న దేశమే అయినప్పటికీ, సైనిక పరంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో తప్పనిసరి సైనిక సేవా విధానం ఉండటంతో భారీ స్థాయిలో శిక్షణ పొందిన రిజర్వ్ బలగాలు అందుబాటులో ఉంటాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాల వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, సైబర్ యుద్ధ సామర్థ్యాలు, అత్యున్నత నిఘా సాంకేతికత ఉన్నాయి. అలాగే మోసాద్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన భద్రతా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సాధారణ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తన సరిహద్దులను రక్షించుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని పూర్తిగా కలిగి ఉంది.అమెరికా ఎందుకు ముఖ్యమైంది?ఇజ్రాయెల్ బలమైన దేశమే అయినప్పటికీ, అమెరికాతో దాని సంబంధం కేవలం మిత్రదేశ స్థాయిలో మాత్రమే లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారింది. ప్రతీ సంవత్సరం అమెరికా ఇజ్రాయెల్‌కు బిలియన్ల డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో ఆధునిక యుద్ధ విమానాలు, ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ సాంకేతికత, గూఢచార సమాచార సహకారం ఉంటాయి. ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐరన్ డోమ్ వ్యవస్థ అభివృద్ధి, నిర్వహణలో అమెరికా ఆర్థిక సహకారం కీలక పాత్ర పోషించింది. గాజా, లెబనాన్ ప్రాంతాల నుంచి వచ్చే రాకెట్లను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ ప్రధాన రక్షణ కవచంగా నిలుస్తోంది.ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం వస్తే..ఇటీవలి కాలంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీలు, ఇతర ప్రాంతీయ మిత్ర బలగాలు ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం, ఒకేసారి ఇరాన్, హెజ్బొల్లా, హమాస్ వంటి పలు వర్గాల నుంచి దాడులు జరిగితే ఇజ్రాయెల్‌పై భారీ ఒత్తిడి పడుతుంది. క్షిపణి నిరోధక వ్యవస్థల నిల్వలు వేగంగా ఖాళీ కావడం, ఆయుధాల వినియోగం పెరగడం, ఆర్థిక వ్యయం విపరీతంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి ఆయుధాలు, విడిభాగాలు, ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, గూఢచార సమాచారం నిరంతరం అందడం ఇజ్రాయెల్‌కు కీలక బలంగా మారుతుంది.అయితే, అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు లభించే అతిపెద్ద మద్దతు కేవలం సైనిక సహాయం మాత్రమే కాదు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా రాజకీయ అండ కూడా అత్యంత కీలకం. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో ఇజ్రాయెల్‌పై విమర్శలు లేదా చర్యలకు సంబంధించిన అనేక తీర్మానాలను అమెరికా గతంలో వీటో చేసింది. అమెరికా మద్దతు తగ్గితే ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.వాన్స్ అసలు సందేశం ఇదేనా?జేడీ వాన్స్ వ్యాఖ్యలను కేవలం రక్షణ అంశంగా మాత్రమే కాకుండా రాజకీయ సంకేతంగా కూడా విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అవసరమైతే వాషింగ్టన్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా తెలియజేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్ విషయంలో దౌత్యపరమైన పరిష్కారాలను అమెరికా ప్రాధాన్యంగా చూస్తున్న సమయంలో, ఇజ్రాయెల్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తే రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు.మొత్తానికి.. ఇజ్రాయెల్ స్వయంగా తనను తాను రక్షించుకునే శక్తి కలిగిన దేశమే. కానీ మధ్యప్రాచ్య స్థాయిలో దీర్ఘకాలిక, బహుముఖ యుద్ధం ఎదురైతే అమెరికా సహాయం దాని సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అందుకే నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. ఇజ్రాయెల్‌కు అమెరికా అవసరం మనుగడ కోసం కాదు.. ఆధిపత్యం కొనసాగించడానికి అని తెలుస్తోంది.ఇజ్రాయెల్ వద్ద సైన్యం..దాదాపు 1.7 లక్షల యాక్టివ్ సైనికులు4 లక్షలకుపైగా రిజర్వ్ దళాలువందల సంఖ్యలో ఆధునిక యుద్ధవిమానాలుఅధునాతన డ్రోన్లుసైబర్ యుద్ధ సామర్థ్యాలుప్రపంచంలోనే అత్యుత్తమ గూఢచారి వ్యవస్థల్లో ఒకటైన మోసాద్అణ్వాయుధ సామర్థ్యం (అధికారికంగా అంగీకరించకపోయినా)అమెరికా నుంచి వచ్చే సహాయంలో..అత్యాధునిక ఆయుధాలుF-35 యుద్ధవిమానాలుక్షిపణి నిరోధక వ్యవస్థల కోసం నిధులురాడార్, నిఘా సాంకేతికతవిడిభాగాలు, మందుగుండు సామగ్రి -
నెతన్యాహు.. కాస్త బుర్ర వాడండి: ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య మళ్లీ ముదురుతున్న ఘర్షణలను ఆపేందుకు తానే నేరుగా జోక్యం చేసుకున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ నాయకత్వానికి "Calm down and use your head" (శాంతించండి... కాస్త ఆలోచించండి) అని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ వెల్లడించారు.కాగా, ఇటీవల లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, ప్రతిగా హెజ్బొల్లా కూడా రాకెట్ దాడులకు దిగింది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి యుద్ధం ప్రాంతమంతా వ్యాపించే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. ఇరాన్ కూడా పరోక్షంగా సహకరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. చివరకు శుక్రవారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు.అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో నేరుగా చర్చించినట్టు తెలిపారు. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలని సూచించానని, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పారు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ నాయకత్వాన్ని "కాస్త సెన్స్‌తో వ్యవహరించేలా చేయాల్సి వస్తోంది" అంటూ వ్యాఖ్యానించారు.అంతకుముందు జూన్ ప్రారంభంలో కూడా ట్రంప్, నెతన్యాహూతో మాట్లాడి బీరూట్ వైపు సాగుతున్న ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయించానని ప్రకటించారు. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా హెజ్బొల్లాతోనూ సంప్రదింపులు జరిగాయని, ఇరు పక్షాలు కాల్పులు తగ్గించేందుకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించిన పలు ఒప్పందాలు కొద్ది రోజులకే విఫలమయ్యాయి. తాజా ఒప్పందం కూడా ప్రాంతీయ శాంతి చర్చలు, అమెరికా-ఇరాన్ చర్చల భవిష్యత్తుకు కీలకంగా మారింది -
అమెరికా దాడిపై నావికుడి భార్య కన్నీటి ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా దాడులు జరిపింది. ఆ అటాక్‌లో ముగ్గురు భారతీయులు మరణించడం భారత్‌లో తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపింది. తాజాగా ఆ దాడిలో మరణించిన చీఫ్ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ సతీమణి తీవ్ర ఆవేదనతో స్పందించారు. ఇప్పటి వరకూ ఈ అంశంలో కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఇటీవల హర్ముజ్ ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' చమురు ట్యాంకర్‌పై అమెరికా సైనిక దళాలు దాడులు జరిపాయి. ఈదాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పట్నాల సురేశ్ తెలుగువారున్నారు. ఇరాన్ రేవులపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని (Blockade) ఉల్లంఘించిందనే ఆరోపణలతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ అటాక్ చేసింది. అయితే ప్రమాదంలో చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, డెక్ కాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా అనే ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.కాగా ఈ ఘటనపై మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. "...ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సిబ్బంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇప్పటివరకు ఎవరూ కనీసం దీనిపై సరైన స్పందన ఇవ్వలేదు. నేను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడుగుతున్నాను. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తారు? అమెరికా ప్రభుత్వాన్ని కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను... మా కుటుంబంలో నా భర్త ఒక్కరే సంపాదించేవారు. ఇక నా పిల్లలను నేను ఎలా పెంచాలి?..." అనే ఆవేదన వ్యక్తం చేశారు.కాగా ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్‌కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. మరోవైపు ట్రంప్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ దాడులు చేసింది ఇరాన్ అని దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని తెలిపారు. -
ఇజ్రాయెల్‌పై అమెరికా ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంపై విమర్శలు చేస్తున్న ఇజ్రాయెల్ నేతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన ఏకైక ప్రపంచ నాయకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అన్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ తమ ప్రధాన సమస్య అని భావించే వారు వాస్తవ పరిస్థితిని గుర్తించాలని ఘాటు హెచ్చరిక చేశారు.వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వాన్స్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరిపడిందని, అమెరికా అందించిన దౌత్య, సైనిక సహకారాన్ని కొందరు ఇజ్రాయెల్ మంత్రులు గుర్తించడం లేదని విమర్శించారు. "Wake up and smell the reality" అంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేసినప్పటికీ, ఏప్రిల్ 8న కుదిరిన తొలి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించాలని భావించగా, ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి తాజాగా అమెరికా–ఇరాన్ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని వ్యాఖ్యానించడం ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపైనే వాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇక ట్రంప్ కూడా ఇటీవల నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఉనికికి అమెరికా మద్దతే ప్రధాన కారణమని పేర్కొన్డాను. అలాగే నెతన్యాహును "crazy" అని వ్యాఖ్యానించినట్లు అమెరికా మీడియా నివేదించింది.అయితే నెతన్యాహు స్పందిస్తూ, అమెరికాతో ఉన్న కీలక సంబంధాలను కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని, యుద్ధ సమయంలో అమెరికా అందించిన సహకారాన్ని ఇజ్రాయెల్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. -
మళ్లీ దాడులకు సిద్ధమైన అమెరికా..! లాస్ట్ వార్నింగ్ వచ్చేసింది..
బ్రస్సెల్స్: అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని హామీలను ఇరాన్ పాటించకపోతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గురువారం తెలిపారు. నాటో రక్షణ మంత్రుల సమావేశం అనంతరం బ్రస్సెల్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఒప్పందం అమలు, చర్చల సమయంలో ఇరాన్ నిబంధనలు పాటించకపోతే ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. "ఈ చర్చల గడువులో ఇరాన్ చెప్పినట్టు చేయకపోతే, మేము మళ్లీ చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటామని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరాన్ నిబంధనలు పాటించకపోతే, అత్యంత కఠినమైన సముద్ర దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసే సామర్థ్యం మాకు ఉంది" అని పీట్ హెగ్సెత్ అన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య 3 నెలలకు పైగా సాగిన ఘర్షణలకు ముగింపు పలికే లక్ష్యంతో ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందంలో శత్రుత్వానికి ముగింపు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభించడం వంటి అంశాలు ఉన్నాయి.ఇరాన్ బాధ్యతగా వ్యవహరిస్తేనే.. ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించినప్పటికీ ఒప్పందం ద్వారా లభించే ఆంక్షల సడలింపు, ఇతర ప్రయోజనాల వంటివి ఇరాన్ తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.తాజా వ్యాఖ్యలతో, ఒప్పందం అమలు సమయంలో ఇరాన్ చర్యలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్టు మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని "పనితీరు ఆధారిత ఒప్పందం"గా పేర్కొంటున్నారు. ఇందులో ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదల, ఇతర చర్యలు అన్నీ ఇరాన్ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి.అయితే ఇరాన్ నిధుల విడుదల, సముద్ర ఆంక్షల సడలింపు వంటి హామీలను ఏ క్రమంలో అమలు చేయాలనే విషయంలో రెండు పక్షాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. ఘర్షణల సమయంలో హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడటంతో ఇంధన మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. అనేక నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది.ఈ ఒప్పందంతో ఆ ప్రాంతంలో సముద్ర రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని వాషింగ్టన్ భావిస్తోంది. అదే సమయంలో ఇరాన్ ఒప్పంద నిబంధనలు పాటించకపోతే, సైనిక, ఆర్థిక ఒత్తిడిని మళ్లీ తీసుకురావచ్చని అమెరికా స్పష్టం చేసింది. -
ఆంక్షలతో అల్లాడిన జీవితాలు.. ఇరానీల మౌన వేదన
టెహ్రాన్ ‘విజయం’ అంటోంది.. కానీ ఇరాన్ ప్రజలు ‘ఉపశమనం’ అంటున్నారు. అమెరికాతో ఒప్పందాన్ని ప్రభుత్వం రాజకీయ గెలుపుగా చూపిస్తుండగా, సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు మాత్రం తమ జీవితం మెరుగుపడుతుందా?.. ధరలు తగ్గుతాయా? ఉద్యోగాలు వస్తాయా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అనే దానిపైనే దృష్టి పెట్టారు. ఆర్థిక కష్టాలు, యుద్ధ భయాలే ఈ ఒప్పందానికి అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలు మాత్రం దాన్ని తమ జీవితాల్లో కొంత వెలుగు నింపే అవకాశంగా చూస్తున్నారు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై పరిమితులు విధించడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఇరానియన్ రియాల్ విలువ క్షీణించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు విలాసంగా మారిపోయాయి.టెహ్రాన్‌కు చెందిన 45 ఏళ్ల ఉపాధ్యాయుడు అలీ రెజా మాటల్లో చెప్పాలంటే.. మాకు రాజకీయ విజయాలు అవసరం లేదు. మార్కెట్‌కు వెళ్లినప్పుడు సరుకులు కొనగలిగితే అదే విజయం.. ఈ భావన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిలో అమెరికాతో ఒప్పందం అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో గెలుపు కాదు.. కుటుంబ ఖర్చులు తగ్గే అవకాశం అని భావిస్తున్నారు.ఆంక్షల అసలు ప్రభావం ప్రజలపైనే.. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్లో కేవలం చమురు ఆదాయం మాత్రమే తగ్గలేదు. విదేశీ బ్యాంకింగ్ వ్యవస్థలతో సంబంధాలు దెబ్బతినడంతో మందులు, వైద్య పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా కష్టతరమయ్యాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు దొరకక చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇరాన్ యువత పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. నిరుద్యోగం, తక్కువ వేతనాలు, విదేశాల్లో అవకాశాల కొరత కారణంగా వేలాది మంది యువకులు నిరాశలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్య పూర్తిచేసినా సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఆర్థిక ఆంక్షల కారణంగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడంతో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అందుకే అమెరికాతో ఒప్పందం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువత ఆశిస్తోంది.మహిళల ఆశలుఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్లో మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే సమాజంలో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశ కొంతమంది మహిళల్లో ఉంది. అయితే ఒప్పందం వల్ల రాజకీయ స్వేచ్ఛలు పెరుగుతాయా అనే విషయంలో మాత్రం సందేహాలు ఉన్నాయి. అలాగే ఇరాన్లో మహిళల విద్యా స్థాయి గణనీయంగా పెరిగినా, ఉద్యోగ అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ప్రైవేట్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని, మహిళల ఉపాధి పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ ఒప్పందాన్ని ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ఒక అవకాశంగా చూస్తున్నారు. మరోవైపు, 2022లో జరిగిన Mahsa Amini protests తర్వాత మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛల అంశాలు ఇరాన్లో ప్రధాన చర్చగా మారాయి. ఆర్థికంగా ప్రపంచంతో సంబంధాలు పెరిగితే సమాజంలో మరింత తెరవెనుకత, సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందనే ఆశ కొందరు మహిళల్లో ఉంది. ప్రజల్లో ఆందోళన..మరో ముఖ్యమైన అంశం యుద్ధ భయం. గత కొంతకాలంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌తో పెరిగిన ఘర్షణలు ప్రజల్లో ఆందోళన పెంచాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరిస్తే తమ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఈ ఒప్పందం ద్వారా ఉద్రిక్తతలు తగ్గితే అదే తమకు పెద్ద ఊరట అని చెబుతున్నారు. అయితే ఆశలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందాలు కుదిరినా తరువాత అవి నిలవలేదు. అందుకే ‘ఈసారి నిజంగా మార్పు వస్తుందా?’ అనే సందేహం చాలా మందిలో కనిపిస్తోంది. ఒప్పందం కుదిరిందనే వార్త కంటే, దాని ఫలితాలు తమ జేబుల్లో కనిపిస్తాయా లేదా అన్నదే వారికి ముఖ్యం.రాజకీయంగా చూస్తే టెహ్రాన్ దీనిని విజయగాథగా చెప్పుకోవచ్చు. కానీ సాధారణ ఇరానీయులకు ఇది విజయోత్సవాల విషయం కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు తగ్గడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, యుద్ధ భయం తగ్గడం, పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దొరకడం వారికి అసలైన విజయం అదే. అందుకే అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలు ‘గెలుపు’గా కాదు, ‘బతుకును నిలబెట్టే ఆశాకిరణం’గా చూస్తున్నారు. దీంతో, ఈ ఒప్పందం నిజంగా ఇరాన్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందా? లేక రాజకీయ ప్రచారానికే పరిమితమవుతుందా? అన్నది రాబోయే నెలల్లో తేలనుంది. -
ఇక అణ్వాయుధాల జోలే లేదు.. నెతన్యాహు
టెల్ అవీవ్: ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. అమెరికా,ఇరాన్‌ల మధ్య డీల్ కుదరడంతో ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగే ఉండే అవకాశం లేదన్నారు. అది ఈ రోజైనా..రేపైనా అని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంపై ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆ దేశ ప్రజలకు వివరణ ఇచ్చారు. ఇరాన్‌పై యుద్ధం విషయంలో తాను చేసింది సరైందేనని సమర్థిస్తూ మాట్లాడారు. "మనం ఏమి సాధించామని ప్రజలు నన్ను అడుగుతున్నారు? దానికి నేను సమాధానమిస్తాను - మనం ఏమి సాధించాం? మనపై ఉన్న తక్షణ వినాశన ముప్పును మనం తొలగించుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యాన్ని సంపూర్ణ వినాశనం ముప్పు నుండి కాపాడాం" అని అన్నారు. శత్రుదేశం ఇరాన్‌కు ఈ రోజే కాదు రేపు.. ఎప్పుడూ అణ్వాయుధాలు ఉండవు. అని నెతన్యాహు పేర్కొన్నారు.తాము ఇజ్రాయెల్ దేశం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశామని. గాజా, లెబనాన్ మరియు సిరియాలలో కూడా మేము ఇదే చేశామని అన్నారు. తాను ఒక నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని ఇజ్రాయెల్‌కు అవసరమైనంత కాలం తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి అవసరమైనంత కాలం మేము ఈ భద్రతా మండలాల్లోనే ఉంటామని నెతన్యాహూ తేల్చి చెప్పారు.ట్రంప్‌తో విభేదాలుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో గల విభేదాలపై స్పందించారు. కొన్నిసార్లు అధ్యక్షుడు ట్రంప్‌కు, నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను వివేకంతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అని అన్నారు.నెతన్యాహుపై విమర్శలుఇజ్రాయెల్లో నెతన్యాహు నాయకత్వాన్ని విమర్శిస్తూ విపక్ష నేత నఫ్తాలి బెన్నెట్ మాట్లాడారు. నెతన్యాహూ అధికారం అంతర్యుద్ధంతో ప్రారంభమై, అక్టోబర్ 7 నాటి మారణకాండతో కొనసాగి, ఇప్పుడు ఇరాన్‌పై చారిత్రాత్మక వైఫల్యంతో ముగుస్తోంది అని విమర్శించారు. ఈ వ్యతిరేకతల నేపథ్యంలో నెతన్యాహూ వివరణ ఇచ్చారు.ఎట్టకేలకు శాంతి ఒప్పందంకాగా గత మూడు నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు లభించింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. -
హర్మూజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని వెల్లడించారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం పూర్తయ్యింది. అందరికీ అభినందనలు. హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నాను. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నాను. ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చు. చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి" అని పేర్కొన్నారు.అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని స్పష్టం చేసింది. అమెరికాపై తమకు ఇంకా అపనమ్మకం కొనసాగుతోందని మరోసారి పేర్కొంది.కాగా, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 4న టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ మొసల్లా ప్రార్థనా మందిరంలో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో అంతిమయాత్రలు సాగనున్నాయి. చివరి అంత్యక్రియలు జూలై 9న మష్హద్లో నిర్వహించి, అదే రోజు ఇమామ్ రిజా పవిత్ర స్థలంలో ఖమేనీకి ఖననం చేయనున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. -
నెతన్యాహుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన రహస్య చర్చల ఫలితంగా కుదిరిన శాంతి ఒప్పందం చివరి దశలో ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. మొత్తం ప్రక్రియను దాదాపు పట్టాలు తప్పించిందని ట్రంప్ ఆరోపించారు. నెతన్యాహు చాలా కఠినమైన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నెతన్యాహూ చాలా కఠినమైన వ్యక్తి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చల ప్రక్రియను మరింత క్లిష్టం చేశాయి’ అని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ నేరుగా నెతన్యాహూను విమర్శించడం విశేషంగా మారింది.అయితే, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే, రెండు గంటల్లో ఇజ్రాయెల్ భూమిమీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పంద చర్చల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామిగా లేకపోవడం గమనార్హం. దీంతో ఒప్పందంలోని కొన్ని అంశాలను ఇజ్రాయెల్ అంగీకరించడం కష్టమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా-ఇరాన్ ఒప్పందంపై వార్తలు వెలువడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై కొనసాగుతున్న పోరాటాన్ని నిలిపివేయడానికి నెతన్యాహుపై అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ మధ్య విభేదాలా?ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలపై కొత్త చర్చ మొదలైంది. ఇరాన్ అంశంలో ఇరు దేశాల తుది లక్ష్యం ఒకటే అయినప్పటికీ, దాన్ని సాధించే మార్గాల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య చర్చలు, ఒప్పందాలు, ఆంక్షల సడలింపులతో సమస్య పరిష్కారం చేయాలని అమెరికా భావిస్తుండగా.. కఠిన భద్రతా చర్యలు, సైనిక ఒత్తిడి, ముందస్తు దాడుల ద్వారా ఇరాన్‌ను నియంత్రించాలని ఇజ్రాయెల్ అనుకుంటోంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
యుద్ధానికి బ్రేక్.. అసలు ముప్పు పొంచి ఉందా?
గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం (Framework Agreement)తో యుద్ధ భయాలు కొంత మేర తగ్గాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య భద్రతపై నెలకొన్న అనిశ్చితికి ఇది ఉపశమనం కలిగించినప్పటికీ, సంక్షోభం పూర్తిగా ముగిసిందని చెప్పేందుకు ఇంకా సమయం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్‌పై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అధికారుల ప్రకారం, ఈ ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలకు సడలింపులు, విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన సుమారు 25 బిలియన్ డాలర్ల ఇరానియన్ ఆస్తుల విడుదల, కొత్త ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, తన అణు కార్యక్రమ విస్తరణను తాత్కాలికంగా నిలిపివేస్తామని అంగీకరించినట్లు సమాచారం.డాలర్ బలహీనం.. అయితే అసలు సమస్య ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ వేర్వేరు వ్యాఖ్యానాలు చేస్తుండటంతో ఒప్పందం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని కొన్ని అంశాలపై ఇరాన్, అమెరికా అధికారులు భిన్న ప్రకటనలు చేయడం కూడా అనిశ్చితిని పెంచుతోంది. ముఖ్యంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత విధానం, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఈ ఒప్పందం వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పడిపోగా, ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరిగాయి. యుద్ధ భయాలు తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి కొంత మేర తగ్గిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ముప్పు తప్పలేదు.. కాగా, ఒప్పందం కుదిరిందనే కారణంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇరాన్ వద్ద ఇప్పటికీ ఉంది. అలాగే లెబనాన్, ఇజ్రాయెల్‌కు సంబంధించిన ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు, అణు చర్చల భవిష్యత్తు వంటి అంశాలు మళ్లీ పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కుదిరింది కేవలం ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇజ్రాయెల్ అంశం.. ఇజ్రాయెల్ అంశం కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ చాలా కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తాజా ఒప్పందం ఇరాన్‌కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే, ఇజ్రాయెల్ నుంచి రాజకీయ, దౌత్య లేదా భద్రతాపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ, మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తిస్థాయి ముగింపు లభించిందని చెప్పడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా–ఇరాన్ తదుపరి అడుగుల వైపే ఆసక్తిగా ఎదురుచూస్తోంది.అలాగే, ప్రాంతీయ భద్రత కూడా మరో ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు. -
ఇరాన్ శాంతి ఒప్పందంలో మరో ట్విస్ట్
టెహ్రాన్: అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోని అతివాదుల వర్గం చర్చలు అవసరం లేదంటూ ధర్నాలు చేపడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని అక్రమ చొరబాటుదారుడిగా అభివర్ణిస్తూ వాషింగ్టన్‌తో ఆయన రాజీ పడుతున్నారని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టంతా ఇరాన్- అమెరికా చర్చలపైనే.. ఈ భేటీలో శాంతి ఒప్పందం కుదురుతుందా ఈ యుద్ధానికి శాశ్వతంగా తెరపడుతుందా అనే అంతా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని అతివాద వర్గం మాత్రం చర్చలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం వల్ల 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' పై టెహ్రాన్ నియంత్రణ, ప్రభావం తగ్గుతుందని వాదిస్తున్నారు.ఈ మేరకు ( శనివారం) ఆ దేశంలోని అతివాద గ్రూపులకు చెందిన మద్దతు దారులు రాజధాని టెహ్రాన్‌తో పాటు మషహాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అబ్బాస్ అరాగ్చీ నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గౌరవం లేని, రాజీపడే అరాగ్చీ నశించాలి, అరాగ్చీ, సిగ్గు తెచ్చుకో... లొంగిపోవడం ఆపు, దేశద్రోహి, చొరబాటుదారుడైన అరాగ్చీ నశించాలి" అంటూ తీవ్ర పదజాలంతో అరాగ్చీపై మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే ఏ ఒప్పందం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పూర్తి అంగీకారం లేకుండా జరగదని స్పష్టం చేశారు.అయితే ఈ నిరసనల నేపథ్యంలో అరాగ్చీ స్పందించారు. హర్ముజ్ అనేది ఇరాన్ యొక్క ప్రధాన రక్షణ ఆయుధాలలో ఒకటని ఆయన స్పష్టం చేశారు. ఈ రాబోయే ఒప్పందం వల్ల ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం తొలగిపోతుందని పేర్కొన్నారు.కాగా అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌లోని అతివాదులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇరాన్ మరింత దూకుడుగా అణు విధానాన్ని అవలంబించాలని 'అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం' నుండి ఇరాన్ వైదొలగాలని, నేరుగా అణుబాంబు తయారీ వైపు అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు 🚨🇮🇷 Footage reportedly shows demonstrators on the streets of Iran turning on their own negotiators, chanting for revenge and demanding the talks be scrapped. One chant is aimed straight at the foreign minister: "Araghchi, have some shame, put the negotiations aside."… pic.twitter.com/GXOtPIg1ug— Mario Nawfal (@MarioNawfal) June 13, 2026 -
పశ్చిమాసియా యుద్ధంలో బిగ్ ట్విస్ట్..?
-
మా యురేనియం మా వద్దే.. దాచి పెట్టిన ఇరాన్
-
ట్రంప్‌నకు షాకిచ్చిన నెతన్యాహు
జెరూసలేం: అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించకుండా కుదిరే ఏ ఒప్పందమైనా మధ్యప్రాచ్య భద్రతకు ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌పై కఠినమైన ఒత్తిడి కొనసాగించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ డిమాండ్లకు ట్రంప్ తలొగ్గిందంటూ విమర్శలు చేస్తున్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమంపై పరిమితులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఆర్థిక ఉపశమనం కల్పించే ఒప్పందం కుదిరితే, ఆ దేశం తన ప్రాంతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళన..ఇజ్రాయెల్ భద్రతా వర్గాల అభిప్రాయం ప్రకారం.. ఆంక్షల సడలింపుతో ఇరాన్‌కు భారీగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అందుబాటులోకి వస్తాయి. ఆ నిధులను ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకోవడానికి, అలాగే ప్రాంతంలోని తన మిత్ర వర్గాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించవచ్చని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్‌లోని హెజ్బొల్లా, గాజాలోని హమాస్, యెమెన్‌లోని అన్సర్ అల్లాహ్ వంటి ఇరాన్ అనుకూల శక్తులకు మరింత బలం చేకూరే ప్రమాదం ఉందని పేర్కొంటోంది. ఇదే సమయంలో ఇరాన్‌కు అమెరికా లొంగిపోయిదంటూ ఇజ్రాయెల్ తాజాగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి.చర్చలే ముఖ్యం.. ఇక అమెరికా మాత్రం దౌత్య చర్చల ద్వారానే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించవచ్చని నమ్ముతోంది. యుద్ధం లేదా ప్రత్యక్ష ఘర్షణల కంటే చర్చల ద్వారా అణు విస్తరణను అడ్డుకోవడం అంతర్జాతీయ భద్రతకు మేలు చేస్తుందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అణు ఆయుధాల అభివృద్ధికి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధి చేయకుండా నిరోధించడం, అంతర్జాతీయ తనిఖీలను పునరుద్ధరించడం చర్చల ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ హామీలతో సంతృప్తి చెందడం లేదు. గతంలో కుదిరిన అణు ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ఆగలేదని, కేవలం ఆలస్యమైందే తప్ప మూల సమస్య పరిష్కారం కాలేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అందువల్ల ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేసే కఠినమైన ఒప్పందం తప్ప మరో మార్గం లేదని భావిస్తోంది.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఘర్షణలు, సిరియా మరియు ఇరాక్‌లో ఇరాన్ అనుకూల బలగాల కార్యకలాపాలు, ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీల దాడులు వంటి పరిణామాలు ఇప్పటికే ప్రాంతీయ భద్రతా పరిస్థితిని సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ ఒప్పందం కుదిరితే అది మొత్తం మధ్యప్రాచ్య శక్తి సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా లెక్కలు వేరుఅమెరికా మాత్రం పరిస్థితిని మరో కోణంలో చూస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే అనేక ఘర్షణలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్‌తో ప్రత్యక్ష సైనిక సంఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాషింగ్టన్ భావిస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణాపై దాని ప్రభావం భారీగా ఉండవచ్చు. అందుకే దౌత్య చర్చల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, పరిమితం చేయడం యుద్ధం కంటే మెరుగైన మార్గమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ తనిఖీల ద్వారా ఇరాన్ కార్యకలాపాలపై నిఘా కొనసాగించవచ్చని వారి అభిప్రాయం.ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావంఈ ఒప్పందం కుదిరితే మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు కూడా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ ఆర్థికంగా బలపడితే ప్రాంతీయ శక్తి సమతుల్యత మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినట్లుగా, తన జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని భావిస్తే అంతర్జాతీయ ఒప్పందాలకు అతీతంగా స్వతంత్ర చర్యలు తీసుకునే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. -
హర్ముజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంపై శాంతి చర్చల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచితంగా ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ అంశమై ఇరు దేశాలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.పశ్చిమాసియా యుద్ధంలో ప్రధానంగా చర్చంతే హర్ముజ్‌పైనే యుద్దం ప్రారంభంలోనే ఇరాన్ హర్ముజ్‌ని దిగ్భందించడంతో ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ జలసంధిని తెరవాలని ఎన్ని సార్లు కోరినా ఇరాన్ ససేమిరా అంది. తాజాగా శాంతి చర్చల ప్రస్థావన నేపథ్యంలో అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు.అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ" జలసంధి నిర్వహణ మునుపటిలా ఉండదు. ఇందులో అంతర్జాతీయ జలమార్గం ఏది లేదు. ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సౌర్వభౌమాధికారం కిందకి వస్తుంది. ఈ జలసంధి గుండా పయణించే నౌకలకు అందించే సేవలు ఇకపై ఉచితంగా ఉండవు. ఇందులో నుంచి ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది." అని అన్నారు.ఈ విషయమై ఒమన్‌తో చర్చలు పూర్తయ్యాయి. హర్ముజ్ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి అని అన్నారు. కాగా ఇదివరకూ హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇరుదేశాలు మునుపటి కార్యాచరణనను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కలిసి ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు అదే యుద్ధం ముగింపుపై ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఒకే వ్యూహంతో ముందుకెళ్లిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం తమ తమ దేశీయ రాజకీయ అవసరాల కారణంగా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధం ఎలా మొదలైంది?ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్‌పై భారీ సైనిక చర్య ప్రారంభమైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతా ముప్పులను తగ్గించడం, టెహ్రాన్ ప్రభావాన్ని కట్టడి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రారంభ దశలో ట్రంప్, నెతన్యాహు ఒకే వైఖరితో ముందుకు సాగారు.ఇప్పుడు ఎందుకు విభేదాలు?ప్రస్తుతం ట్రంప్ ప్రధానంగా యుద్ధాన్ని ముగించి ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) దాదాపు సిద్ధమైందని, త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, నెతన్యాహు మాత్రం ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి కార్యక్రమం, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై మరింత కఠిన చర్యలు అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.ట్రంప్ రాజకీయ లెక్కలునవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) ట్రంప్‌కు కీలకం. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం, చమురు ధరల అస్థిరత, ప్రజల్లో యుద్ధ వ్యతిరేక భావన పెరగడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే యుద్ధాన్ని ముగించిన నాయకుడు అనే గుర్తింపుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.నెతన్యాహు లక్ష్యం వేరుఇక నెతన్యాహు కూడా దేశీయ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌లో భద్రతా అంశం అత్యంత కీలకమైన రాజకీయ అంశం కావడంతో, ఇరాన్‌పై పూర్తి స్థాయి వ్యూహాత్మక ఆధిపత్యం సాధించకుండానే యుద్ధాన్ని ముగించడం ఆయనకు రాజకీయంగా ప్రమాదకరంగా మారవచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఆయన మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.బయటపడుతున్న ఉద్రిక్తతఇటీవల ట్రంప్ ఇరాన్‌పై ప్రణాళికాబద్ధమైన దాడులను రద్దు చేసి, చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయం నెతన్యాహును ఆశ్చర్యానికి గురి చేసిందని వార్తలు వెలువడ్డాయి. ఆ నిర్ణయం గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఇరాన్‌పై మరోసారి యుద్ధాన్ని ప్రారంభించవద్దని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించినట్లు కూడా రాయిటర్స్ వెల్లడించింది. "మరింత జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారు" అని ట్రంప్ హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.శాంతి చర్చలపై విభేదాలుప్రస్తుతం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర పరిమితంగా ఉండటం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా కొంత సడలింపు చూపుతుందనే అనుమానాలు నెతన్యాహు వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తంగా ట్రంప్‌నకు యుద్ధం ముగింపు రాజకీయ లాభం అయితే, నెతన్యాహుకు ఇరాన్‌పై మరింత ఒత్తిడి కొనసాగించడం రాజకీయ అవసరంగా మారింది. ఈ విభిన్న లక్ష్యాలే ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తున్న చీలికకు ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌ను లైట్ తీసుకున్న నెతన్యాహు?
జెరూసేలం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ముందే సమాచారం లేకపోవడం, ఆయనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న తిరుగులేని శక్తి పరిమితులను బహిర్గతం చేస్తున్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్‌తో తాము జరుపుతున్న అణు చర్చలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రతీకార దాడులకు వెళ్లవద్దని ఆయన ఇజ్రాయెల్‌ను కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని లైట్ తీసుకుంది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ట్రంప్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా అగ్రరాజ్య హోదాకు, దాని శక్తికి అవమానకరం. దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా నెతన్యాహును కోరినప్పటికీ, ఇజ్రాయెల్ వెనుకాడకుండా దాడికి తెగబడింది. ఇది పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం ఎంతలా తగ్గిపోయిందో స్పష్టం చేస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ఇరాన్‌తో త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లేదా మంగళవారంలోగా సంతకాలు జరుగుతాయి అని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడు చర్చలకి రండి’ అని పిలుపునిచ్చారు. కానీ, ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులు ఈ చర్చల ప్రక్రియను మరింత సంక్లిష్టం చేశాయి.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉంది.ఇరాన్ అణు ప్రణాళికలు,క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతు..వీటన్నింటినీ ఇజ్రాయెల్ తన దేశ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తోంది. అమెరికా కుదుర్చుకునే తాత్కాలిక దౌత్య ఒప్పందాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేవని నెతన్యాహు నమ్ముతున్నారు.ఈ పరిణామాలు సాంప్రదాయ మిత్రదేశాలైన అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక ‘ప్రపంచ శాంతి దూత’గా నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ఇమేజ్‌కు భంగం కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్‌తో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ దానిని అంగీకరించేలా లేదనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో బలంగా వ్యక్తమవుతోంది. -
ఇరాన్ కోసం మెట్టు దిగిన ట్రంప్.. భారీ ఆఫర్!
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన తాజా శాంతి ఒప్పంద ముసాయిదాలో, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల అంశంపై కొంత సడలింపు చూపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని, పూర్తి వివరాలు రెండో దశ చర్చల్లో ఖరారు కావాల్సి ఉందని సమాచారం.ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం వెలుపలికి తరలించాలని, లేదా పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేసింది. అయితే తాజా చర్చల్లో ఇరాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని కొనసాగించబోమని హామీ ఇవ్వడం, అలాగే అణు నిల్వల భవిష్యత్‌పై ప్రత్యేక చర్చలకు అంగీకరించడం వల్ల చర్చల్లో పురోగతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక, ట్రంప్ గతంలో పలుమార్లు ఇరాన్ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, వాటిని ఇరాన్ వద్ద ఉంచబోమని ప్రకటించారు. కానీ తాజా అవగాహన ఒప్పందంలో యురేనియం నిల్వల నిర్వహణపై మరింత సౌలభ్యవంతమైన విధానం అవలంబిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో తుది నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఐరాస ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ యురేనియం నిల్వలపై సంతకాల కార్యక్రమం జెనీవాలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జేడీ వాన్స్ పర్యటనకు అవసరమైన పరికరాలతో నాలుగు సీ-17 విమానాలు ఐరాపాకు ప్రయాణం అయ్యాయి.ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం తమ శుద్ధి చేసిన యురేనియం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, దాన్ని విదేశాలకు తరలించే ఒప్పందం ఇప్పటివరకు కుదరలేదని స్పష్టం చేసింది. ఇరాన్ అధికారులు యురేనియం నిల్వలపై తుది నిర్ణయం భవిష్యత్ అణు చర్చల్లోనే తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళిక అమల్లోకి వస్తే, హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం, ఆంక్షల సడలింపు, అణు చర్చల కొనసాగింపు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యురేనియం నిల్వల భవితవ్యమే ఈ ఒప్పంద విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది. -
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్‌కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సురేశ్ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్ ఇంజినీర్ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్‌ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.మృతుడు సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరారు. సురేశ్ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఒమన్ తీరంలో నౌకపై దాడివైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్‌పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్ దాడిలో సురేష్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు -
ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ స్ట్రాంగ్ రియాక్షన్.. ఆయన భరించలేని..
టెహ్రాన్: ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ పార్లమెంట్‌లోని జాతీయ భద్రతా కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం అజీజీ స్పందించారు. ట్రంప్‌నకు మరింత శక్తిమంతమైన, మరింత బాధాకరమైన ప్రతిస్పందన ఎదురవుతుందని అజీజీ వార్నింగ్ ఇచ్చారు."ట్రంప్‌నకు సరైన అవకాశాలు లేవు కాబట్టి అతని చర్యలను ముందుగానే ఊహించవచ్చు. ట్రంప్ దాదాపు ఎలాంటి విజయాలు సాధించలేదు. అమెరికా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు ఏమీ అందని విధంగా ఆయన భారీ మూల్యం చెల్లించాడు. ఏదైనా తప్పుడు అంచనాతో అడుగు వేస్తే గతం కంటే మరింత బాధాకరమైన ప్రతిస్పందన వస్తుంది. ట్రంప్ హెచ్చరికలు భ్రమలు మాత్రమే. ఇరాన్ నుంచి వచ్చే ఏ ప్రతిస్పందనైనా ట్రంప్‌నకు భరించలేని పరిణామాలు తెచ్చిపెట్టవచ్చని ఆయనకు తెలుసు" అని ఆయన చెప్పారు. కాగా, యూఎస్ హెచ్చరికలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం అంతర్జాతీయంగా నెలకొంది. -
గల్ప్ దేశాలకు కొత్త టెన్షన్
ప్రపంచానికి హెచ్చరిక.. ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం మళ్లీ ప్రారంభం.. -
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
ప్రపంచదేశాలకు ఇరాన్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకూ హర్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఇరాన్ హెచ్చరికలు ఇంతటితో ఆగలేదు.నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే క్షిపణులు, నౌకాదళ బలగాలతో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన నెలకొంది.హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే గమ్యస్థానాలకు చేరుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అందుకే హర్ముజ్ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్‌గా మారింది.ఇరాన్ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు రెండు డాలర్లకుపైగా పెరిగాయి. సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైతే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు, అమెరికా మాత్రం పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని చెబుతోంది. కొన్ని వాణిజ్య నౌకలు ఇప్పటికీ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాయని, తమ యుద్ధనౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఇరాన్ హెచ్చరికలతో అనేక నౌకా సంస్థలు ఇప్పటికే తమ ప్రయాణాలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా–ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే హర్ముజ్ జలసంధి అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే కీలక సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్‌పై అమెరికా భీకర దాడులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ నామమాత్రంగానే మిగిలి.. పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక హర్ముజ్ జలసంధి నుంచి గల్ఫ్ దేశాల వరకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ప్రపంచం ఉత్కంఠగా పరిణామాలను గమనిస్తోంది.అమెరికా బలగాలు తాజాగా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై వరుసగా రెండో రోజు భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నాయి. ఈ దాడుల్ని అమెరికా స్వీయ రక్షణ దాడులుగా అభివర్ణించడం గమనార్హం. తాజా దాడుల్లో హర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని సిరిక్, మినాబ్, ఖేష్మ్ (Qeshm) దీవి, జాస్క్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. బందర్ అబ్బాస్ సమీపంలో కూడా వైమానిక హెచ్చరిక వ్యవస్థలు చురుగ్గా పనిచేసినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది. పలు రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.అంతేకాకుండా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే అసలుయె ప్రాంతంలోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై కూడా అమెరికా దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంధన, పెట్రోకెమికల్ రంగాలపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్ పశ్చిమ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పహారా పెంచాయి. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.సంచలన వ్యాఖ్యలుఅమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. "ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడాల్సి వస్తుంది" అంటూ ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా దాడులు ఇరాన్ సామర్థ్యాలను దెబ్బతీసేలా, తమ సైనిక కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు సృష్టించేలా కొనసాగుతాయని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్ స్పందనఅమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతోందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆరోపించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా ఈ దాడులను ఖండిస్తూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హైఅలర్ట్‌లోకి వెళ్లింది. తాజా పరిణామాలు చూస్తే అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం పరిమిత ప్రతీకార దాడుల దశ దాటి.. మరింత విస్తృత ఘర్షణ వైపు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్ దేశాల స్థిరత్వంపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
మూల్యం చెల్లించుకోవాల్సిందే : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమతో ఒప్పందానికి రాకుండా, గ్రేట్ డీల్‌ను మిస్ చేసుకుంది అంటూ ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పదే పదే ప్రకటించే ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది, అన్నీ ఉత్తమాటలే, చేతలేమీ లేవు అంటూ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ప్లాట్ఫామ్లో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సైనిక సామర్థ్యం దారుణంగా క్షీణించిందని, మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాన్ని ఇరాన్ నాయకత్వం చేజేతులా వృధా చేసుకుందన్నారు. ఇరాన్ సైన్యం పూర్తిగా అతలాకుతలమైంది. అసలు నౌకాదళం, వాయుసేన వంటి చాలా విభాగాలు ఉనికిలోనే లేవు, పూర్తి ఓటమి పాలయ్యారంటూ అని ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు అంతా మాటలే.. చేతల్లో ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్ పెత్తందారు కథ ముగిసింది!!! అంటూ ఇరాన్‌పై ధ్వజమెత్తారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన గడువును ప్రస్తావిస్తూ చర్చలను తెగనీయకుండా సాగదీశారని ఇరాన్ నేతలను విమర్శించారు. ఎంతో మేలు చేకూర్చే ఒప్పందంపై చర్చలకు చాలా సమయం తీసుకున్నారు,ఇప్పుడు దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!!!" అని ఆయన హెచ్చరించారు. > ఇదీ చదవండి: భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్ వీడియోఇరాన్ లక్ష్యాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో వాషింగ్టన్‌తో చర్చల భవిష్యత్తుపై తాము పునఃసమీక్షిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. అమెరికా పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబిస్తూ, కాల్పుల విరమణ అవగాహనలను పదేపదే ఉల్లంఘిస్తూ దౌత్య ప్రక్రియను దెబ్బతీస్తోందని ఆరోపించారు.అయితే మధ్యప్రాచ్యంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ఇరాన్‌తో గ్రీట్ డీల్‌కి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నప్పటికీ, దీన్ని ఇరాన్ ఖండిస్తూ వస్తోంది. సైనిక దాడులు కొనసాగుతున్నంత కాలం దౌత్యం విజయవంతం కాలేదని స్పష్టం చేస్తూ మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తకాగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో అమెరికాకు చెందిన 'అపాచీ' దాడి హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నిఘా కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ తాజా ఘర్షణల తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఇది మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనలను పెంచింది.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ -
రెండు వారాల్లో కీలక ప్రకటన: ట్రంప్
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడిు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు.అమెరికా హెలికాప్టర్ అపాచీపై దాడి చేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. అమెరికా స్థావరాలపై మొత్తం 21పైగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో జరిపిందని దానికి ప్రతిచర్యగా ఈ అటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.అయితే డొనాల్ట్ ట్రంప్ సైతం ఈ దాడులపై గుర్రుగా ఉన్నారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. ఇరాన్ అని దానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు. యుద్ధంలో అమెరికా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోందని మరో రెండు వారాల్లో ఇరాన్‌పై సంపూర్ణ విజయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ ప్రకటనతో చమురు ధరలు సైతం దిగొస్తాయని ప్రకటించారు.అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సైతం ఘూటుగానే బదులిచ్చింది. ఎలాంటి దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిదాడి తీవ్రంగా జరుగుతుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహు సైతం ఇరాన్‌పై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. -
మేమే గెలిచాం.. యుద్ధం ముగింపుకు రాయబారాలు
-
భారతీయ నౌకపై దాడి.. 24 మంది నావికులు..!
టెహ్రాన్: హర్ముజ్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను రక్షించింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.ఒమన్ తీర సమీపంలో 'ఎంటి మారివెక్స్'అనే ఆయిల్ సరఫరా చేస్తున్న నౌకలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 24మంది నావికులు ఉన్నారు. దీంతో హుటాహుటీన స్పందించిన నావిక దళం వారందరినీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడి ఎవరూ చేశారని సమాచారం ఇంకా తెలియలేదు. కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్ఫరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ మాటలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.Helicopter rescue operation underway for 24 Indian seafarers after vessel Marivex was struck off the coast of OmanFootage from the scene show the crew being lifted from the damaged vessel after fighting for survival at sea pic.twitter.com/crlSDYaU6y— RT (@RT_com) June 8, 2026 -
మళ్లీ ఉద్రిక్తతలు.. ఆ దేశం విడిచి వెళ్లండి: భారత్
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు ఇరాన్‌కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాయం సూచించింది.గత 24 గంటల్లో పలు నగరాల్లో సైనిక చర్యలు, వ్యూహాత్మక కేంద్రాలపై వైమానిక దాడులు, భారీ క్షిపణి దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. “ఆ ప్రాంతంలో తాజా పరిణామాల దృష్ట్యా, ఇరాన్‌కు ప్రయాణించవద్దన్న మా గత సూచనను మరోసారి తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వెంటనే బయటకు రావాలి” అని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 100వ రోజుకు చేరుకున్న వేళ, సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రాంతీయ స్థాయిలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే భయం నెలకొంది.ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ బలగాలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక సముద్ర మార్గం. తాజా సైనిక చర్యల్లో ఇరాన్‌లోని ఒక పెట్రోకెమికల్ సముదాయంపై దాడి జరగగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాత్రం రెండు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌ను కోరిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దానికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేపట్టింది. అనంతరం సోమవారం ఇరు పక్షాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇజ్రాయెల్‌లోనూ.. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో చేసిన పోస్టులో.. భారతీయులు ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.“ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లోని భారతీయులు అన్ని వేళలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా అనుసరించాలి” అని తెలిపింది.అధికారిక మార్గాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న భద్రతా సూచనలను పరిశీలించాలని రాయబార కార్యాలయం సూచించింది.భారతీయులు తమ నివాసాలు, కార్యాలయాల సమీపంలోని ఆశ్రయ కేంద్రాల గురించి తెలుసుకుని, వాటికి దగ్గరగా ఉండాలని తెలిపింది. తమ నివాసం లేదా ఉద్యోగ ప్రాంతం వద్ద ఉన్న ఆశ్రయ ప్రదేశాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించింది.తదుపరి సమాచారం వచ్చే వరకు ఇజ్రాయెల్‌లో అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని భారతీయులకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని 24 గంటల సహాయ కేంద్రం ద్వారా సంప్రదించాలని తెలిపింది. -
ఇరాన్ కు వెళ్లొద్దు.. ఇండియన్స్ కు భారత్ మెసేజ్
-
స్టాక్ మార్కెట్ క్రాష్.. వణికిపోతున్న సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కదులుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత మళ్లీ పెరగడంతో భారత ప్రామాణిక సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి. వార్తల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇది అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలపై నీరు పోసింది. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 188.20 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 23,178.50 వద్ద, సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 10.82 శాతం క్షీణించి 73,632.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.51 శాతం, 1.52 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. -
ఇరాన్ ఆస్తులపై అమెరికా షాకింగ్ నిర్ణయం..?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ ను రెచ్చగొడుతున్నారు. విదేశాల్లో ఫ్రీజైన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించే యోచన చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అసలే అమెరికా ఆంక్షలతో మండిపడుతున్న ఇరాన్ ఈ వ్యవహారంతో చర్చలకు పూర్తిగా ఫులిస్టాప్ పెట్టే అవకాశం ఉంది.పశ్చిమాసియా యుద్ధం తాలూకా విధ్వంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంతో ప్రపంచ దేశాలు ట్రంప్‌పై మండిపడ్డాయి. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరడంతో అమెరికా కొంత తగ్గి ఇరాన్‌తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరలేదు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంతో పరిస్థితులు కొంతమేర ప్రశాంతంగా ఉన్నాయి. ఇదంతా తెలిసిన కథేఅయితే మరోసారి అమెరికా ఇరాన్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది. ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనవి ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేసి యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌళిక స్థావరాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. దీంతో ఆదేశాలు ట్రంప్‌పై గుర్రుగా ఉన్నాయి. దీంతో వాటిని శాంతపరిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ ఆస్తులు విదేశాల్లో ఎందుకు ?ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు,సహజ వాయువు ఉత్పత్ చేసే దేశాలలో ఒకటి. అది ఇతర దేశాలకు చమురును విక్రయించినప్పుడు, ఆయా దేశాలు ఇరాన్‌కు చెల్లించాల్సిన కోట్లాది డాలర్ల డబ్బు అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ సొమ్మును అమెరికా లీగల్‌గా బ్లాక్ చేసింది. ఇవే కాకుండా ఆంక్షలు రాకముందు విదేశాలలో ఇరాన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన భవనాలు, భూములు లేదా ఇతర కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు.బంగారు నిల్వలను సైతం అమెరికా బ్లాక్ చేసింది.ఎంత డబ్బు ఫ్రీజ్ అయ్యింది.?ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 బిలియన్ డాలర్ల నుండి 123 బిలియన్ డాలర్లు సుమారుగా రూ. 8.3 లక్షల కోట్ల నుండి రూ. 10.2 లక్షల కోట్ల డబ్బు ఫ్రీజైనట్లు విశ్లేషకుల అంచనా అయితే, ఇందులో నేరుగా అమెరికా నియంత్రణలో నేరుగా అమెరికా నియంత్రణలో దాదాపు 24 బిలియన్ డాలర్లు ఉంది. ఆడబ్బుని వెంటనే చెల్చించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.మిగతా కరెన్సీ దక్షిణ కొరియా, జపాన్, యూరప్, మరియు కొన్ని గల్ఫ్ దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ఇరాన్ ఆయా దేశాలకు చమురు అమ్మగా వచ్చిన డబ్బు అది. కానీ అమెరికా విధించిన బ్యాంకింగ్ ఆంక్షల భయం వల్ల ఆ దేశాలు ఇరాన్‌కు ఆ డబ్బు ఇవ్వకుండా తమ వద్దే నిలిపివేశాయి. అయితే ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల పునర్నర్మాణం కోసం వాడాలని అమెరికా భావిస్తోంది. ఇదే జరిగితే ఇక యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది. -
పాక్ గాలితీసిన భారత మాజీ ఆర్మీచీఫ్
కోల్‌కతా: భారత రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవణే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా మధ్య పాక్ మధ్యవర్తిత్వం ఒట్టిమాటే అన్నారు. పాక్ చేసేది మధ్యవర్తిత్వం కాదని కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమేనన్నారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత మాజీ సైన్యాధిపతి నరవణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకం విడుదల కాకముందే దేశంలో ప్రకంపనలు సృష్టించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని పలు అంశాలను ప్రస్థావించడంతో లోక్‌సభలో పెద్ద దుమారం చేలరేగింది. కాగా తాజాగా నరవణే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు.నరవణే మాట్లాడుతూ" ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలలో పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెబుతోంది. కానీ అది కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమే, జాతీయ భద్రత ఎప్పుడూ ఆర్థిక భద్రతపైనే ముడిపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థే అన్నింటిని నడిపిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్వయం సమృద్ధిపైనే ఉండాలి" అని అన్నారు.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా ఇవి ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
హార్ముజ్ జలసంధిలో యుద్ధం.. పెట్రోల్, డీజిల్ దొరకటం కష్టమేనా?
-
ఈ ఒక్క కారణంతో భయంకర ఆపరేషన్, దాడులు ఆగిపోయి..
ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వను చాలా లోతైన, బలమైన, రక్షణతో కూడిన ప్రదేశంలో భద్రపరచి ఉంచారా? ప్రస్తుతం దాన్ని బయటకు తీసుకురావడం లేదా వినియోగించడం సులభం కాదా? ఆ నిల్వ తక్షణ ప్రమాదం సృష్టించే స్థితిలో లేదని ట్రంప్ అంటున్నారు. అందువల్ల దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వెంటనే సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఒక్క కారణంతో ఎంత పెద్ద యుద్ధం ఆగిందో తెలుసా?పశ్చిమాసియా ఘర్షణ మళ్లీ తెరపైకి వచ్చిన వేళ వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సున్నితమైన దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పలు వివరాలు తెలిపారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వెలికితీసేందుకు అమెరికా సైన్యాన్ని ఇరాన్‌లోకి పంపే సైనిక ప్రణాళికను పరిశీలించినప్పటికీ చివరకు తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు.ట్రంప్ తెలిపిన వివరాలు ప్రకారం.. సరిహద్దులు దాటి చేపట్టాల్సిన ఆ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని తేలింది. భారీ స్థాయి సైనిక సమీకరణ అవసరమయ్యేది. ఆ క్లిష్టమైన మిషన్ పూర్తి కావాలంటే కనీసం 2 వారాలు పట్టేదని, భారీ స్థాయిలో సైనిక సామగ్రిని ఇరాన్ భూభాగంలోకి తరలించాల్సి వచ్చేదని చెప్పారు. సున్నితమైన అణు పదార్థాన్ని "న్యూక్లియర్ డస్ట్"గా పేర్కొన్న ట్రంప్.. ఆ నిల్వను స్వాధీనం చేసుకునే పలు మార్గాలను పెంటగాన్ అధికారులు పూర్తిగా పరిశీలించారని తెలిపారు.యురేనియం సమాధిలో పాతిపెట్టినట్టే.. సైనిక ప్రణాళికను నిలిపివేసినా అలాంటి చర్య చేపట్టే శక్తి వాషింగ్టన్కు ఇప్పటికీ ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. "మేము ఇప్పుడే దాన్ని తీసుకోగలం" అని ట్రంప్ అన్నారు. "మనం అనుకుంటే వాళ్లు మమ్మల్ని అడ్డుకోలేరని నేను భావిస్తున్నాను. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అది సమాధిలో పాతిపెట్టినట్టే ఉంది" అని చెప్పారు. ఆ పదార్థం ప్రస్తుతం సురక్షితంగానే ఉందని, తక్షణ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. శుద్ఙచేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలంటే టెహ్రాన్‌తో అధికారిక దౌత్య ఒప్పందం అవసరం లేదని కూడా చెప్పారు.అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ముఖాముఖి భేటీపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే, వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దౌత్యం ఖరారైతే, అలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగవచ్చని అంగీకరించారు. "అది జరిగితే... నేను గౌరవప్రదంగానే వ్యవహరిస్తాను" అని ట్రంప్ చెప్పారు.మొజ్తబా ఖమేనీ, తన తండ్రి హత్య అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. ఆయన తండ్రి అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడిలో మరణించారు. ఖమేనీ కుటుంబ సభ్యులపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కచ్చితమైన దాడులు చేసినప్పటికీ, మొజ్తబా ఖమేనీ సరైన వైఖరి ప్రదర్శిస్తారని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. "మేము అతని తండ్రి, అతని భార్య, అతని కుమారుడిని చంపాము. కాబట్టి నేనంటే ఆయను ఇష్టం ఉండకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల్లో కాయనకు చాలా మంచి పేరు ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇలాంటి కఠిన వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. అక్సియోస్ ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికా సీనియర్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం టెన్నెసీలోని ఓక్ రిడ్జ్కు వెళ్లి, ఇరాన్‌తో జరగబోయే అణు చర్చల్లో కీలక పాత్ర పోషించనున్న సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు.వైట్ హౌస్, యుద్ధ చర్యలు నిలిపివేయడం, సమగ్ర అణు చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా టెహ్రాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు సంబంధించిన సమాచారం తెలిసిన అమెరికా అధికారులు, ప్రాంతీయ మధ్యవర్తులు తెలిపినట్టు, ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలపై రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.ఈ అత్యంత కీలక చర్చలు తుది దశలో ఉన్నట్టు సమాచారం వచ్చినా, స్పష్టమైన పురోగతి సాధించే అవకాశం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఓ అమెరికా అధికారి, ఓక్ రిడ్జ్కు ఉన్నత స్థాయి ప్రతినిధుల పర్యటన ఒప్పందం ఖరారవుతుందనే హామీ కాదని, అయితే చర్చలు తీవ్రమైన దశలోకి ప్రవేశించాయని సూచించే స్పష్టమైన సంకేతమని చెప్పారు.అయితే ఈ విభేదాలు ఇప్పటికీ దౌత్య ప్రక్రియకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇరాన్ శుద్ఙచేసిన యురేనియాన్ని సాఫ్ట్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా 60 రోజుల గడువు కోరుతోంది. ఇరాన్ మాత్రం 90 రోజుల గడువుపై పట్టుదలగా ఉంది.ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, నిలిపివేసిన యూఎస్డీ 24 బిలియన్ ఆస్తుల విషయంలో దౌత్య చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం ట్రంప్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. -
పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు
పశ్చిమాసియాలో ఉద్రికత్తల మధ్య కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు మరణించిన వైనం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మంజూర్ అహ్మద్ (55) దాదాపు 30 ఏళ్లుగా కువైట్‌లో టైలర్‌గా పని చేస్తున్నారు. మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.జూన్ 8న రత్లాం జిల్లాలో జరగాల్సిన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు మంజూర్ ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. బుధవారం ఉదయం 7:30 గంటలకు ముంబైకి విమానంలో వచ్చి, అక్కడి నుండి రైలులో తన సొంత ఊరైన ఉజ్జయినికి వెళ్లాలని అనుకున్నారు. విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు, తన కుమారుడు అనస్ అహ్మద్‌తో మాట్లాడి, రైల్వే స్టేషన్ నుండి తనను తీసుకువెళ్లడానికి రమ్మని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత్‌కు తిరిగి వస్తున్న అతనికి ఎంతో సంతోషంగా పూలమాలలతో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవు తుండగా, ఈ విషాద వార్త వారి చెవిని పడిందని అహ్మద్ కుమారుడు అనస్, తండ్రితో జరిగిన ఆ చివరి ఫోన్ సంభాషణను గుర్తు చేసుకున్నారు. నాగదా రైల్లో వస్తానని చెప్పారు.. రిసీవ్ చేసుకోడానికి రమ్మన్నారు.. కానీ అది చివరి కాల్ అవుతుందని అనుకోలేదని కంటతడిపెట్టారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి తరలించారు, ఆ తర్వాత బంధువులు అంత్యక్రియల కోసం రోడ్డు మార్గంలో ఉజ్జయినికి తీసుకువెళ్లారు.మరోవైపు భారత్ ఈ దాడిని ఖండించింది. దాడులను నిలిపివేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పిలుపునిచ్చింది.ఆ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు , కేంద్రాలు అప్రమత్తంగా ఉన్నాయని, అక్కడి భారతీయ సమాజానికి చురుకుగా మద్దతునిస్తూనే ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడి చేసి, 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చడంతో మధ్యప్రాచ్య యుద్ధం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా, టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు ప్రారంభించింది. మార్చిలో కువైట్‌లోని ఒక విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు , అదే నెలలో యూఏఈ రాజధాని అబుదాబిలో క్షిపణిని అడ్డగించడం వల్ల వెలువడిన శకలాల కింద పడి మరికొరు ఇలా ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మృతి చెందారు. -
ఆయతుల్లా ఖమేనీ చివరి క్షణాల్లో ఏం జరిగింది..?
టెహ్రాన్: ఆయతుల్లా ఆలీ ఖమేనీ మృతి ప్రపంచాన్ని ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయన మృతిచెందడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దాడికి ముందు ఖమేనీ గడిపిన క్షణాల గురించి ఆ దేశ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు.ఇరాన్- అమెరికా యుద్ధం మెుదలయి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. అయినా ఈ యుద్ధం ముగింపు అంశంలో ఎటువంటి స్పష్టత లేదు. ఇన్ని రోజుల ఈ యుద్ధంలో అత్యంత భయానక అంశం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి చేసి చంపడం.. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. అయితే ఆ సందర్భంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నానని తెలిపారు.ఈ రోజు (శుక్రవారం) అబ్బాస్ అరాగ్చీ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. "ఇరాన్‌పై దాడులు ప్రారంభం అయ్యాక.. సుప్రీం లీడర్ని సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాం. దానికి ఆయన నిరాకరించారు. ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రదేశానికి ప్రవేశం లభించేంత వరకు తాను ఎటువంటి ఆశ్రయానికి గానీ, సురక్షిత ప్రాంతానికి గానీ వెళ్ళనన్నారు... నా ప్రజలకు ఏది జరిగినా, అది నాకు కూడా జరుగుతుంది ," అని ఖమేనీ అన్నట్లు అరాఘ్చి తెలిపారు.సుప్రీం లీడర్‌పై దాడి జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే ఉన్నానని ఆ దాడిలో ఆయనకు ఏమయిందా అని కలవర పడ్డానని తెలిపారు. అయితే దాడులకు ఇరాన్ ఇచ్చిన ప్రతీకారం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎంతో కలవరపాటుకు గురిచేసిందన్నారు. అదే విధంగా ఇరాన్ పొరుగు దేశాల్లో అమెరికా స్థావరాలు లేకపోయి ఉంటే వాటిపై దాడులు జరిగేవి కావన్నారు. పస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సర్వాధికారాలు కలిగి ఉన్నారని కొత్త సుప్రీం లీడర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతన్నామన్నారు. అతని ఆదేశాలను యుథాతధంగా అమలు చేస్తున్నామన్నామన్నారు. ఆయుతుల్లా ఖమేనీకి ఏలాంటి గౌరవం దక్కేదో ఇతనికీ అదే విధమైన గౌరవం దక్కుతుందన్నారు. -
పాకిస్తాన్‌కు కొత్త టెన్షన్.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్
ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం పాత్రను ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రశ్నిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి."ఇజ్రాయెల్ దృష్టిలో పాకిస్థాన్ విశ్వసనీయ మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వం చేసే దేశం అన్ని పక్షాల విశ్వాసాన్ని పొందాలి. పాకిస్థాన్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు" అంటూ రూవెన్ అజర్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు సంబంధించిన సున్నితమైన అంశాల్లో పాకిస్థాన్ పాత్రపై తమకు సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.అమెరికా లేదా ఇతర దేశాలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్‌ను సంప్రదించవచ్చని, అయితే అది ఇజ్రాయెల్ అభిప్రాయాన్ని మార్చదని అజర్ వ్యాఖ్యానించారు. తమకు ప్రధానంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, అలాగే ఇరాన్ ప్రభావాన్ని నియంత్రించడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.పాకిస్థాన్‌పై ఎందుకు అనుమానాలు?ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం మధ్యవర్తిగా వ్యవహరించే దేశం తటస్థ వైఖరిని కలిగి ఉండాలి. అయితే పాకిస్థాన్‌కు ఇప్పటికీ ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అంతేకాకుండా, గతంలో ఇజ్రాయెల్ విధానాలపై ఇస్లామాబాద్ చేసిన విమర్శలు కూడా ఆ దేశ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అజర్ సూచించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో పాకిస్థాన్ పాత్ర పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇస్లామాబాద్ దౌత్య సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ప్రాంతీయ మిలిటెంట్ సంస్థల కార్యకలాపాలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా అంగీకరించలేమన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలు కొత్త దౌత్య చర్చలకు తెరతీశాయి.భారత్‌పై ప్రశంసలుఇదే సందర్భంగా భారత్ పాత్రను కూడా రూవెన్ అజర్ ప్రశంసించారు. పశ్చిమాసియాలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్‌కు కీలక పాత్ర ఉందని, ప్రాంతీయ శాంతి ప్రయత్నాల్లో న్యూఢిల్లీ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.78 ఏళ్లుగా దూరంగానే పాక్–ఇజ్రాయెల్పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో సంక్లిష్టంగానే ఉన్నాయి. 1947లో పాకిస్థాన్, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామాబాద్ ఆ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా నిలుస్తూ, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించబోమనే వైఖరిని కొనసాగిస్తోంది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా కూడా పాలస్తీనా అంశంలో అరబ్ దేశాలకు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ విధానం పాకిస్థాన్ విదేశాంగ విధానంలో కీలక భాగంగా కొనసాగుతోంది. అధికారిక సంబంధాలు లేకపోయినా, గతంలో రెండు దేశాల మధ్య పరోక్ష స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాలు లేవు. దౌత్య సంబంధాలు కూడా నెలకొనలేదు.ఇక రూవెన్ అజర్ తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యం, ఇరాన్ అంశంలో దాని పాత్ర, అలాగే మధ్యప్రాచ్య దౌత్య సమీకరణాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందన కోసం అంతర్జాతీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. -
ఇరాన్ భారీ షాక్.. కువైట్‌లో హైఅలర్ట్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడులు చేసింది. కాగా, ఇరాన్ దాడితో కువైట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. దాడిలో విమానాశ్రయ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కాగా, అమెరికా-ఇరాన్ సీజ్ఫైర్ తర్వాత ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. ఇక, ఇరాన్ దాడుల కారణంగా కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. అనంతరం 4వ టెర్మినల్‌లో కార్యకలాపాలు ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు. అయితే, బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడులతో దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడులు నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి తరలివెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కువైట్ తీసుకున్న చర్యలుదాడుల నేపథ్యంలో వైమానిక రక్షణ వ్యవస్థలను కువైట్ ప్రభుత్వం పూర్తిగా యాక్టివేట్ చేసింది. ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేసింది. అనుమానాస్పద వస్తువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించింది. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచింది. ప్రస్తుతం కువైట్ అంతటా హైఅలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని దాడులు జరిగే అవకాశంపై భద్రతా సంస్థలు నిఘా కొనసాగిస్తున్నాయి. వైమానిక రక్షణ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.اللحظات الأولى للاعتداء الإيراني الغاشم من قبل المسيرات الذي تعرض له مبنى الركاب T1 في مطار الكويت الدولي بتاريخ 3 يونيو 2026 وتسبب بخسائر بالأرواح وإصابات بشرية بليغة وأضرار مادية جسيمةThe first moments following the brutal Iranian drone attack on Terminal 1 (T1) at Kuwait… pic.twitter.com/eTzQoVXB4K— الطيران المدني (@Kuwait_DGCA) June 3, 2026భారతీయులకు ప్రమాదమా?ప్రస్తుతం కువైట్‌లో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సాధారణ ప్రజలపై ప్రత్యేక దాడులు జరిగినట్లు సమాచారం లేదు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున అధికారిక సూచనలను పాటించడం అవసరం. కొన్ని విమాన సర్వీసులు తాత్కాలికంగా ప్రభావితమయ్యాయి. మరోవైపు.. ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే, మృతుని కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. బాధిత కుటుంబానికి, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాధ్యమైనంత మేరకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు కువైట్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.ఇదిలా ఉండగా.. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడిలో విమానాశ్రయ కార్మికులు, ప్రయాణికులతో సహా కనీసం 63 మంది గాయపడ్డారని తెలిపింది.NEW: Video shows full extent of the damage to Terminal 1 at Kuwait International Airport caused by the brutal Iranian drone and missile attacks that struck the facility earlier today.One person was killed and more than 60 injured in Iranian drone strikes on the airport, local… pic.twitter.com/S8UjuZLRis— Breaking Aviation News & Videos (@aviationbrk) June 3, 2026 -
ఖమేనీ అంత్యక్రియలు ఫిక్స్..? కదిలిరానున్న ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీ మరణించి దాదాపు మూడు నెలలు గడుస్తోంది. యుద్ధం ప్రారంభమైన రోజే ఆయన మరణించినప్పటికీ పలు భద్రతా కారణాలతో ఆయన అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియల వివరాలను బహిర్గతం చేసింది. ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను మూడు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో భారీ ఊరేగింపులు జరుపుతామంది.ఇరాన్ ప్రకటనలో.. "ఊరేగింపులు రాజధాని టెహ్రాన్‌తో పాటు, అక్కడి పవిత్ర నగరాలైన కోమ్, మషాద్ లలో జరుగుతాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంతాప సభలు జరుగుతాయి. ఇక చివరగా ఖమేనీ పార్థివ దేహాన్ని మషాద్ నగరంలో ఖననం చేస్తాం" అని తెలిపింది.అయితే ఈ అంత్యక్రియల తేదీలను మాత్రం ఇరాన్ స్పష్టంగా ప్రకటించలేదు. జూన్ మధ్యలో (ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెల ప్రారంభంలో) ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఖచ్చితమైన తేదీలను మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే టెహ్రాన్ నగరంలోనే ఈ వీడ్కోలు కార్యక్రమం దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా సాగనున్నట్లు. తెలుస్తోంది. అంత్యక్రియల ఉత్సవాలకు సుమారు 2 కోట్ల (20 మిలియన్ల) మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. -
నేను లేకుంటే నువ్వు జైల్లోనే.. నెతన్యాహుకు.. ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్‌లోని హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతో ఫోన్లో ఆయనను తీవ్ర పదజాలంతో "అసలు నువ్వు ఏం చేస్తున్నావ్" హెచ్చరించినట్లు ఆక్సియోస్ కథనం ప్రచురించింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరే దశకు వచ్చింది. అయితే, ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు పెంచడంతో.. "ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అమెరికాతో చర్చలు నిలిపివేస్తాం" అని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ట్రంప్ నెతన్యాహూతో మాట్లాడి కాల్పులు విరమించాలని కోరారు. అయితే దీనికి తొలుత అంగీకరించిన ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్‌పై కాల్పులు జరపింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహూకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డట్లు సమాచారం.అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ట్రంప్ చాలా కోపంగా నెతన్యాహును ఉద్దేశించి ఫోన్లో ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది" అసలు నువ్వు ఏం చేస్తున్నావు. నీకు పిచ్చి పట్టింది నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావు.ఈ దాడుల వల్ల ప్రపంచంలో నిన్నూ, ఇజ్రాయెల్‌ను అందరూ అసహ్యించుకుంటున్నారు" అని నెతన్యాహుని తీవ్ర పదజాలంతో మందలించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.అనంతరం ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో.. నెతన్యాహుతో మాట్లాడి బీరూట్‌పై పెద్ద ఎత్తున జరపాలనుకున్న దాడిని విరమించుకునేలా చేశానని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గిందని ప్రకటించారు. ఇందుకు నెతన్యాహుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.అయితే, నెతన్యాహు కార్యాలయం మాత్రం తాము పూర్తిగా వెనక్కి తగ్గినట్లు ఒప్పుకోలేదు. "హెజ్బుల్లా గనుక మా నగరాలపై దాడులు ఆపకపోతే.. మేము బీరూట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి తీరుతాం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు" అని నెతన్యాహు స్పష్టం చేశారు. -
ఖమేనీ విషయంలో కీలక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశాధినేత ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దేశ వ్యవహారాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.ఇరాన్ సుప్రీం లీడర్ విషయంలో ఆరోగ్యం విషయంలో తీవ్ర సందిగ్ధత నడుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కోమాలో ఉన్నారని ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కీలక వాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మాట్లాడుతూ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత చురుగ్గా నిమగ్నమవుతున్నారని తెలిపారు. ఆ మేరకై ఆయనకు కొన్ని సంకేతాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అదే దాడిలో ఆయన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం, కొడుకు గాయపడటంతో ఇరాన్ నాయకత్వంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవగా, వాటన్నింటికీ తెరదించుతూ మొజ్తాబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని అమెరికా ఇప్పుడు స్పష్టం చేసింది. -
ఇక కాల్పులుండవు.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, హిజ్బుల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. ఈ విషయమై ఇజ్రాయెల్ అధ్యక్షునితో చర్చలు జరపామని దానికి నెతన్యాహూ అంగీకరించినట్లు పేర్కొన్నారు.లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఆపారు. బీరూట్ దక్షిణ శివార్లపై దాడులు చేయాలని, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరుపక్షాలతో మాట్లాడి తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగేలా ఒప్పందం చేశారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో నేను చాలా ఫలప్రదమైన ఫోన్ సంభాషణ జరిపాను. బీరూట్‌కు ఎటువంటి సైనిక బలగాలు వెళ్లవు. హిజ్బుల్లాతో కాల్ మాట్లాడాను. అన్ని రకాల కాల్పులను నిలిపివేయడానికి వారు అంగీకరించారు — ఇజ్రాయెల్ వారిపై దాడి చేయదు, వారు ఇజ్రాయెల్‌పై దాడి చేయరు"" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్‌లో రాశారు.లెబనాన్ రాజధాని వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ బలగాలను తన ఆదేశాలతో వెనుకకి తిరిగినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తుల ద్వారా జరిగిన చర్చల ఆధారంగా.. హిజ్బుల్లా కూడా కాల్పులు జరపకుండా ఉండేందుకు అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.అయితే శాంతి చర్చల ఒప్పందంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకూ చర్చలు ప్రస్థావనే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని వాటిని ఆపే వరకూ ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవని తేల్చి చెప్పింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఈ కథనాలను ప్రచురితం చేసింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న నానుడి ఇప్పుడు ఇరాన్- అమెరికా యుద్దంలో సరిగ్గా సరిపోతుంది. శాంతి చర్చలు ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తోన్నా చర్చలలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఓసారేమో అమెరికా మెుండి చేయడం.. మరోసారేమో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం ఇదే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి శాంతి చర్చలను వాయిదా వేస్తోన్నట్లు ఇరాన్ ప్రకటించింది.గాజా,లెబనాన్లలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, అలాగే లెబనీస్ భూభాగం నుండి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై తమ డిమాండ్లు, తమ మిత్రదేశాల డిమాండ్లు నెరవేరే వరకు చర్చలు పునఃప్రారంభం కావని తెలిపింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది.కాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్‌లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టుపక్కల కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 26 ఏళ్లలో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే అతిపెద్దది. కాగా లెబనాన్‌పై ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఇరాన్‌పై మళ్లీ భీకర దాడులు? ప్రపంచాన్ని వణికిస్తున్న అంచనా!
టెహ్రాన్: ఇరాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతికూలత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక దాడులు మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో, ట్రంప్ ఇరాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తూ కొత్త షరతులు పెడుతున్నట్టు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. చర్చలు విఫలమైతే మరింత తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ పూర్తి స్థాయిలో, మరింత భీకరంగా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని యూఎస్ సైన్యానికి చెందిన కల్నల్ (రిటైర్డ్), రచయిత, రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు డగ్లస్ అబోట్ మాక్గ్రెగర్ తెలిపారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాక్గ్రెగర్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లలో ట్రంప్‌కి మద్దతు ఇచ్చే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ప్రజాదరణ ఓట్లలో మూడో వంతు ఉన్నా, ఇప్పుడు అంతకంటే చాలా తక్కువగా ఉంది. అది సుమారు 20 శాతం స్థాయికి పడిపోయి ఉండొచ్చు.ప్రస్తుతం చాలా మంది అమెరికన్లు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో (ఇరాన్, గల్ఫ్ దేశాలు, చమురు రవాణా మార్గాలు) జరుగుతున్న ఘర్షణలు, సైనిక చర్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే వాటి ప్రభావం ఇంకా వారి రోజువారీ జీవితంలో నేరుగా కనిపించడం లేదు. కానీ, అమెరికా చర్యల వల్ల చమురు సరఫరా దెబ్బతింటే, పెట్రోలు ధరలు పెరిగితే, ఇంధన కొరత వస్తే, ఆర్థిక సమస్యలు తలెత్తితే వాటి ప్రభావం అమెరికా ప్రజల జీవితాలపై నేరుగా పడుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పటివరకు ఆసక్తి చూపని అమెరికన్లు కూడా "పర్షియన్ గల్ఫ్‌లో ఏమి జరుగుతోంది?" అని గమనించడం ప్రారంభిస్తారు.చమురు, సహజ వాయు రంగాలకు చెందిన ప్రముఖులు స్పష్టంగా చెప్పారు.. ఎక్సాన్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయినా, ఇతర చమురు, ఆర్థిక విశ్లేషకులు అయినా ఒకే విషయం చెబుతున్నారు. మరో 3 నుంచి 8 వారాల్లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని, అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.ఉదాహరణకు, కాలిఫోర్నియా పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే చమురు దిగుమతులపై చాలా ఆధారపడుతుందనే విషయాన్ని ఎవరూ అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ అకస్మాత్తుగా యుద్ధం లేదా సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినా, సాధారణ అమెరికన్లలో ఎక్కువ మంది దానిని వ్యతిరేకించరు. అధిక శాతం మంది అమెరికన్లు దానిని బలహీనతగా చూడరు. యుద్ధం ముగిస్తే స్వాగతిస్తారు’’ అని తెలిపారు.ఇజ్రాయెల్ ఊరుకోదు ఒకవేళ యుద్ధం ఆగితే అమెరికా స్వాగతించినా, ఇజ్రాయెల్ అలా చేయదని డగ్లస్ అబోట్ మాక్గ్రెగర్ తెలిపారు. ‘‘అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూల వర్గాలు, భారీ సంపద కలిగిన వ్యక్తులు అధ్యక్షుడికి, ‘మీరు ఇలా చేస్తే మేము ఇక మీకు మద్దతు ఇవ్వము. మాకు రక్షణ లేకపోతే, మీపై రాజకీయ దాడులు మొదలవుతాయి. కాపిటల్ హిల్‌లో మీ ప్రత్యర్థులు మీపై విరుచుకుపడతారు. ప్రస్తుతం వారికి, మీకు మధ్య నిలబడి ఉన్నది మేమే. మేము మీకు మద్దతు ఇస్తున్నాం. మాధ్యమాలపై మా ప్రభావం ఉంది. ఆర్థిక వ్యవస్థపై మా ప్రభావం ఉంది. రాజకీయ శక్తి కావాలనుకునేవారికి ఇవి అత్యంత ప్రభావవంతమైన అంశాలు. కాబట్టి మీరు ఏమి చేస్తారు?’ అని వారు అడుగుతారు.ప్రస్తుతం నెతన్యాహూతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడి, మనం చేయగలిగేది ఇదేననిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నెతన్యాహూను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ నెతన్యాహూ లెక్కలు ట్రంప్ లెక్కలకు పూర్తిగా భిన్నం. ట్రంప్‌నకు యుద్ధ తీవ్రతను తగ్గించడం లేదా ముగించడం రాజకీయంగా ప్రయోజనకరంగా అనిపించవచ్చు. కానీ, నెతన్యాహూ మాత్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం, విదేశాంగ విధానం, మధ్యప్రాచ్య వ్యవహారాలపై ఇజ్రాయెల్‌కు గణనీయమైన ప్రభావం ఉందని భావిస్తున్నారు. అందువల్ల, యుద్ధం ఆగిపోతే లేదా ఉద్రిక్తతలు తగ్గిపోతే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇంత ప్రభావం ఉన్న సమయంలో నెతన్యాహూ ఎందుకు వెనక్కి తగ్గుతారు? నెతన్యాహూ కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ లేదా పరిమిత సైనిక చర్యతో సంతృప్తి చెందరు. ఇరాన్ సైనిక, రాజకీయ శక్తిని తీవ్రంగా బలహీనపరచే వరకు ఒత్తిడి కొనసాగించాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. అంతేకాక, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు లేదా సంస్థలకు కూడా ఒక బలమైన హెచ్చరిక పంపాలనుకుంటున్నారు.ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిలబడితే లేదా దాని భద్రతకు ముప్పుగా మారితే, తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికను అందరికీ ఇవ్వాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు’’ అని తెలిపారు. -
ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం?!
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తన కోడలు లారా ట్రంప్ నిర్వహించిన ‘ఫాక్స్ న్యూస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు. అందుకు వారు అంగీకరించారు, ఇది చాలా ఆసక్తికరమైన విషయం’ అని పేర్కొన్నారు.మరోవైపు, న్యూయార్క్ టైమ్స్, యాక్సియోస్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలను పంపారు. అయితే ఈ కొత్త షరతుల కారణంగా పశ్చిమాసియాలో అధికారికంగా యుద్ధం ముగింపు, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి పట్టే మరింత సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు ఒప్పందంలో భాగంగా ‘లేబనాన్’ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లేబనాన్లోకి 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులను తీవ్రం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీంతో పాటు వ్యాపార పరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని ట్రంప్ ప్రతిపాదించగా, అలాంటి నిబంధన ఏదీ ఒప్పందంలో లేదని ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కొట్టిపారేసింది. అంతేకాకుండా, సదరు జలసంధిపై తమ పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటే బిల్లును ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఆమోదించబోతోందని స్పష్టం చేసింది.తమ అణు కార్యక్రమంపై అమెరికాతో కీలక చర్చలు ప్రారంభించడానికి ముందే, గతంలో అమెరికా స్తంభింపజేసిన తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేస్తామంటూ ట్రంప్ మునుపు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ వాదనలపై టెహ్రాన్ (ఇరాన్) మొదటి నుంచి సందేహాలు వ్యక్తంచేస్తుండటంతో, కీలక ప్రాధాన్యతల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా వ్యత్యాసాలు కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
అమెరికా-ఇరాన్ శాంతిచర్చలకు బ్రేక్?.. టెహ్రాన్‌లో భారీ నిరసనలు
టెహ్రాన్: ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుతం శాంతిచర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాలకు పలు విషయాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒప్పందం ఇంకా తుది దశకు చేరుకోలేదు. అయితే ఇరాన్‌లోని ఓ అంతర్గత గ్రూపు ఈ చర్చలు జరగకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నట్లు అక్కడి కథనాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలికంగా సాగుతున్న ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరుదేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్న తరుణంలో, ఇరాన్ అంతర్గతంగా తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అమెరికాతో ఎలాంటి రాజీని ఇష్టపడని ఇరాన్‌లోని ఒక బలమైన మితవాద వర్గం ఈ ఒప్పందాన్ని ఎలాగైనా చెడగొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.పార్లమెంట్ సభ్యులు, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులతో కూడిన ఈ కరడుగట్టిన మితవాద బృందం దేశంలో అమెరికాతో చర్చలు జరపవద్దంటూ వీధులలోకి వచ్చి నిరసనలు తెలపడం, మీడియాల చర్చలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.గత శుక్రవారం రోజు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మితవాద శక్తులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. వీధుల్లో జెండాలు పట్టుకుని, అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖమేనీని చంపిన వారికి బుద్ధి చెప్పాల్సిందేనని నినాదాలు ఇచ్చాయి. అంతేకాకుండా ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీపై ఈ బృందం విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ మాత్రం చర్చల బృందానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపాల్సిందేనని బృందానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది -
హర్ముజ్‌లో భారత నౌకల ప్రయాణం .. సీక్రెట్ స్ట్రాటజీ ఇదే..!
ఢిల్లీ: హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి పలు దేశాల్లో లాక్డౌన్లు సైతం విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత సంక్షోభం సమయంలోనూ భారత నౌకలు మాత్రం నిరాటంకంగా హర్ముజ్‌లో రాకపోకలు సాగించాయి. దీనికి భారత అనుసరించిన వ్యూహాన్ని తాజాగా అధికారులు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఫిబ్రవరి 28న ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్ముజ్‌ని మూసివేసింది. రుపక్షాల మధ్య ఏప్రిల్ 9న కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఈ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు మరియు దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనిలో ప్రయాణించడానికి గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు సైతం భయపడుతుంటే, భారతీయ నౌకలు మాత్రం సురక్షితంగా ప్రయాణిస్తూ దేశానికి అవసరమైన ఇంధన సరఫరాను అందిస్తున్నాయి. ఈ దౌత్య సీక్రెట్‌ను తాజాగా ఓడరేవుల మంత్రిత్వ శాఖ షిప్పింగ్ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు.ఈ హర్ముజ్‌లో భారత్ నౌకల ప్రయాణానికి ప్రధాన కారణం భారత విదేశాంగ శాఖ ఇరాన్‌తో అనునిత్యం దౌత్య చర్చలు జరపడేమన్నారు. అదే విధంగా ఏ నౌకలు ముందుగా ప్రయాణించాలనే ప్రాధాన్యతలను అనునిత్యం పర్యవేక్షించడం. దేశ ప్రయోజనాలకు అత్యవసరమైన చమురు, గ్యాస్, ఎరువుల నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా అనునిత్యం ప్రణాళికలు వేస్తూ నౌకలు రవాణా జరిపేలా ప్రణాళికలు రచించామన్నారు. ప్రస్తుతం హర్ముజ్‌లో 13 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కాగా యుద్ధ ప్రారంభమైన నాటి నుంచి హర్ముజ్‌లో అత్యధిక నౌకలను నడుపుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ఇటీవలే శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బిడబ్ల్యూ టైర్, బిడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వి వంటి నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు అవసరాలలో 20 శాతం ఈ ఇరుకైన హార్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఈ మార్గంలో రవాణా మందగించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగి ఆసియా దేశాలపై ఆర్థిక భారం పడుతున్న తరుణంలో, భారత్ తన వ్యూహాత్మక చతురతతో ఇంధన భద్రతను కాపాడుకుంటోంది. -
బ్లాకేడ్ ఎత్తేస్తున్నా.. మీ భార్యలకు హాయ్ చెప్పండి.. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై తాను త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై తాను వైట్‌హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.ఇరాన్- అమెరికా చర్చలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోన్నా అందులో ఎటువంటి పురోగతి ఉండడం లేదు. పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అనంతరం అమెరికా పలుమార్లు చర్చలకు ప్రయత్నించగా ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు.ఈ విషయమై తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ " ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై నేను ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈ విషయమై ప్రస్తుతం వైట్ హౌస్ 'సిట్యుయేషన్ రూమ్' (టాప్-సెక్యూరిటీ బంకర్) లో సమావేశం కాబోతున్నాను. మా అద్భుతమైన, మునుపెన్నడూ లేని నౌకాదళ దిగ్బంధం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు ఇక 'ఇంటికి వెళ్లే' ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ అభిమాన అధ్యక్షుడి తరపున మీ భార్యలకు, భర్తలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నా తరపున హలో చెప్పండి" అని పోస్ట్ చేశారు.ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్‌లో అమర్చిన ల్యాండ్మైన్లను ఇరాన్ తక్షణమే తొలగిస్తుందని పేర్కొన్నారు. . ఇరాన్ వద్ద భూగర్భంలో దాగి ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అమెరికా బయటకు తీస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ లతో కలిసి సమన్వయంతో ఆ నిల్వలను వెలికితీసి, పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు. కాగా ప్రస్తుతం జరిగిన చర్చలు కేవలం అంతగా ప్రాధాన్యత లేని కొన్ని చిన్నపాటి అంశాలపైనే జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. -
సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్ అలర్ట్
పశ్చిమాసియాలో ఇప్పుడు యుద్ధం అంటే కేవలం క్షిపణులు, ఫైటర్ జెట్లు కాదు.. “డ్రోన్ వార్” అనేది కొత్త భయంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ ఉపయోగిస్తున్న “షాహెద్” కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలకే సవాల్‌గా మారాయి. ఇప్పుడు అదే మోడల్‌ను సౌదీ అరేబియా కూడా అనుసరించే ప్రయత్నంలో ఉందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.ఇరాన్ తయారు చేసిన షాహెద్-136 డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. కానీ వీటి దాడి ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. చాలా తక్కువ ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఈ డ్రోన్లు రాడార్లకు చిక్కకుండా టార్గెట్‌పై నేరుగా దూసుకెళ్తాయి. ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడం వల్ల అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కూడా ఓవర్‌లోడ్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇరాన్ ప్రధాన యుద్ధ వ్యూహంగా మారింది.ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్ దేశాలపై వరుసగా డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. సౌదీ చమురు క్షేత్రాలు, రియాద్ సమీప ప్రాంతాలు, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్, అరాంకో ఆయిల్ ఫెసిలిటీలపై దాడుల ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అనేక డ్రోన్లు, క్షిపణులను సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినప్పటికీ ఈ దాడులు రియాద్‌ను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి.ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కొత్త వ్యూహంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రియాద్ సమీపంలో భారీ డ్రోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి, ఇరాన్ షాహెద్ తరహా లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికా–సౌదీ డిఫెన్స్ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. ఇరాన్ “స్వార్మ్ డ్రోన్ స్ట్రాటజీ” ప్రపంచ యుద్ధ విధానాన్నే మార్చేసిందని వారు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో వేల డ్రోన్లు ప్రయోగించి శత్రువు రక్షణ వ్యవస్థను చేధించడం, ఆర్థిక నష్టం కలిగించడం, చమురు ఉత్పత్తిని దెబ్బతీయడం.. ఇదే కొత్త యుద్ధ ఫార్ములాగా మారుతోంది. ఇప్పుడు అదే పద్ధతిని సౌదీ కూడా అధ్యయనం చేస్తోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.ఇక, ఇప్పటివరకు పూర్తిగా రక్షణాత్మక వైఖరిలో కనిపించిన సౌదీ.. ఇప్పుడు ప్రతీకార దాడుల దిశగా కూడా అడుగులు వేస్తోందని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ డ్రోన్, క్షిపణి లాంచ్ సైట్లపై సౌదీ సీక్రెట్‌గా వైమానిక దాడులు నిర్వహించిందని అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెద్ద వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం మొత్తం “డ్రోన్ కోల్డ్‌వార్” దిశగా వెళ్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ యుద్ధ విమానాల కంటే ఇప్పుడు చౌకైన డ్రోన్లే ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇరాన్ ప్రత్యేకతగా భావించిన డ్రోన్ వార్ఫేర్.. ఇప్పుడు సౌదీతో పాటు ఇతర దేశాలు కూడా అనుసరించే స్థాయికి చేరుకోవడం ప్రపంచ భద్రతా సమీకరణాల్లో పెద్ద మార్పుగా కనిపిస్తోంది.డ్రోన్ స్వార్మ్ అంటే ఏమిటి?ఒకేసారి డజన్ల నుంచి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడంరాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గందరగోళానికి గురిచేయడంఒకటి కాదు.. వరుస దాడులతో శత్రువును అలసటకు గురిచేయడంతక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే కొత్త యుద్ధ వ్యూహంసౌదీకి అసలు భయం ఏంటి?చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచ ఆయిల్ మార్కెట్ దెబ్బతింటుందిఅరాంకో వంటి కంపెనీలకు భారీ నష్టం వచ్చే ప్రమాదంగల్ఫ్ ప్రాంత భద్రతపై ప్రపంచ పెట్టుబడిదారుల్లో భయం పెరుగుతుందిసౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశంఅమెరికా ఎందుకు అలర్ట్?గల్ఫ్‌లో అమెరికా మిలిటరీ బేస్‌లు ఉన్నాయిఇరాన్ డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందిఅమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకే సవాల్‌గా మారుతోందిగల్ఫ్లో యుద్ధం పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం -
హర్ముజ్ ఒప్పందం ఖరారు..? కొట్టిపడేసిన వైట్‌హౌస్
టెహ్రాన్: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.అయితే ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ తన అధికారిక వైట్‌హౌస్ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొందిదిగొచ్చిన ధరలుహర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి. -
ఇరాన్ లో ఇంటర్నెట్ చిచ్చు
-
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఇకపై సురక్షితంగా ఉండవు. ఇజ్రాయెల్‌ను ఖచ్చితంగా కూకటివేళ్లతో పెకిలించాలి.. అది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, వాషింగ్టన్ రోజురోజుకూ తన పూర్వ వైభవానికి దూరమవుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా తన టెలిగ్రామ్ ఛానెల్లో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఖమేనీ..‘పశ్చిమాసియా ప్రాంతంలో తన దుశ్చర్యలకు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై అమెరికాకు సురక్షితమైన ఆశ్రయం ఉండదు. కాలం వెనక్కి తిరగదు. ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయవు. అమెరికా తన పూర్వ వైభవానికి దూరమవుతోంది.ఇదే సమయంలో అమెరికా దళాలు దక్షిణ ఇరాన్లో దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్లో అమెరికా తాజాగా జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలేనని టెహ్రాన్ పేర్కొంది. అమెరికా ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తోందని ఇరాన్ ఆరోపించింది. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ప్రతీకారానికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్ సంకేతం ఇచ్చింది. కాగా, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి.మరోవైపు, ఖమేనీ.. హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. పాలస్తీనా, అల్-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని వ్యాఖ్యానించారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలుబాలిస్టిక్ క్షిపణులు: ఇరాన్ వద్ద 2,000 కి.మీ. వరకు దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇవి గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను చేరగలవు.డ్రోన్లు: ఇరాన్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇవి గల్ఫ్‌లోని ఆయిల్ ఫీల్డ్స్, నౌకలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.నౌకాదళం: స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఇరాన్ చిన్న నౌకలు, మైన్స్, టార్పెడోలు ఉపయోగించి అమెరికా నౌకాదళాన్ని ఇబ్బంది పెట్టగలదు.ప్రాక్సీ గ్రూపులు: హిజ్బుల్లా, హౌతీలు వంటి మిత్ర గ్రూపుల ద్వారా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో పరోక్ష దాడులు చేయగలదు.గల్ఫ్‌లో అమెరికా స్థావరాలుఖతార్: అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్ – అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్, 10,000 పైగా సైనికులు.బహ్రెయిన్: నేవల్ సపోర్ట్ యాక్టివిటీ – అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం.సౌదీ అరేబియా: ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ – మధ్యప్రాచ్యంలో కీలకమైన ఎయిర్ ఆపరేషన్ల కేంద్రం.యుఏఈ: అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ – అమెరికా F-35, డ్రోన్ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రం.ఇరాన్ హెచ్చరికల ప్రభావం..ప్రాంతీయ స్థిరత్వం: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింటుంది.అమెరికా వ్యూహం: అమెరికా తన స్థావరాల భద్రతను పునఃపరిశీలించాల్సి వస్తుంది.గల్ఫ్ దేశాలు: అమెరికా రక్షణపై ఆధారపడుతున్న ఈ దేశాలు, ఇరాన్ దాడుల భయంతో కొత్త దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ప్రపంచ మార్కెట్లు: భారత్, యూరప్, ఆసియా దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడుతున్నందున, ఏవైనా అంతరాయాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.


