యుద్ధం ముగిసింది.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వార్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన | 12 Day War Ends: Donald Trump Announces Israel Iran Ceasefire And Said He Hopes It Will Become Permanent | Sakshi
Sakshi News home page

యుద్ధం ముగిసింది.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వార్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన

Jun 24 2025 7:02 AM | Updated on Jun 24 2025 10:35 AM

12 Day War Ends: Trump Announces Israel Iran Ceasefire

కాల్పుల విరమణను ఇరాన్‌, ఇజ్రాయెల్‌ అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు.‌ కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. 12 రోజలు యుద్ధానికి ఇది ముగింపు.. యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో పోస్ట్‌ చేశారు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయన్న ట్రంప్‌.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు.

కాగా, కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్‌ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్‌లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్‌లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. 

దోహా నగర సమీపంలోని అల్‌–ఉదేయిద్‌ అమెరికా ఎయిర్‌బేస్‌పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్‌ ‘ఆపరేషన్‌ బేషరత్‌ ఫతాహ్‌’ అని పేరుపెట్టింది. ఇరాక్‌లోని అయిన్‌ అల్‌ అసద్‌ బేస్‌పై ఇరాన్‌ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement