breaking news
Kamareddy
-
చెస్‌తో మేధస్సుకు పదును
● డీఈవో అశోక్ మోపాల్: విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలుగా కాకుండా చెస్ వంటి క్రీడలతో వారి మేధస్సును పదును చేసుకోవచ్చని డీఈవో అశోక్ సూచించారు. మంగళవారం నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్లో చెస్ నెట్వర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున చెస్ బోర్డులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు పిల్లలను చెస్ ఆడేందుకు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవోలు గేమ్‌సింగ్, సేవులా, పాఠశాల హెచ్ఎం సీహెచ్ శంకర్, నెట్వర్క్ ప్రతినిధులు సాహితీ, కిరణ్‌కుమార్ గౌడ్, వాసు గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రక్తమోడిన రహదారులు
ఆటో, మోటార్ సైకిల్ ఢీ ● బైకిస్టుతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న యువతి మృతి ఆర్మూర్: ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో చోటు చేసుకుంది. మృతులు నిజామాబాద్ నగరానికి చెందిన జెట్టివార్ సాయిప్రసాద్ (23), ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రా మానికి చెందిన వనం సంధ్యారాణి (25) గా పోలీసులు గుర్తించారు. నగరంలోని చంద్రానగర్ కాలనీకి చెందిన సాయిప్రసాద్ ఆర్మూర్ మండలం చేపూ ర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. నిజామాబాద్ నుంచి సోమవారం అర్ధరాత్రి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఆర్మూర్‌కు బయల్దేరాడు. ఎడపల్లి మండలం జాన్కంపేటకు చెందిన సంధ్యారాణి తన గ్రామానికి చెందిన 12 మందితో కలిసి పెర్కిట్‌లోని ఫంక్షన్హాల్లో క్యాటరింగ్ చేసేందుకు వచ్చింది. ఫంక్షన్ పూర్తయిన తర్వాత కూలీలంతా ఆటోలో ఎడపల్లికి బయల్దేరారు. అంకాపూర్ శివారులోకి రాగానే ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఘటనలో బైక్ నడుపుతున్న సాయిప్రసాద్‌తోపాటు ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్న సంధ్యారాణి అక్కడికక్కడే మరణించింది. ఆటోలో ఉన్న మరో యువతి మరాఠీ హారిక కాలు విరగ్గా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఎండీ నదీమ్ పరారీలో ఉన్నాడు. ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచా రణ చేపట్టారు. మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కూలీ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయి.. మృతురాలు సంధ్యారాణిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు ఇద్దరు కూతుర్లు కాగా, సంధ్యా రాణి పెద్ద కూతురు. వివాహం అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో తల్లిదండ్రుల వద్దే ఉంటూ పని చేసుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించగా, గాంధారి మండలం చద్మల్ తండాలో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మద్నూర్ శివారులో ఆటోబోల్తాపడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. -
ప్రకృతి రైతులు.. ఆధునిక వైద్యులు
సుభాష్‌నగర్: ప్రకృతి రైతులు లాభాల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలు పండిస్తున్నారని.. వారు ఆధునిక వైద్యులని రైతు సంక్షేమ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. మంగళవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సేంద్రియ రైతు చిన్నికృష్ణుడు అధ్యక్షతన నగరంలోని ఎన్డీసీసీబీ వైఎస్ఆర్ భవనంలో ప్రకృతి రైతుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తున్న 9 మంది ఉత్తమ రైతులను ప్రశంసాపత్రం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. అనంతరం గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. వ్యవసాయ కమిషన్ రైతుల కోసమే పని చేస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయంలో మహిళా రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పశు సంపదను పెంపొందించాలని సూచించారు. విచ్చలవిడిగా యూరియా, రసాయనిక ఎరువుల వినియోగంతోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల భూమి పంటల సాగుకు పని రాకుండా భూసారం కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, డీఏవో వీరా స్వామి, ఆత్మా పీడీ తిరుమల ప్రసాద్, ఎన్డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే, డీజీఎం లింబాద్రి, ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ జనార్దన్, సుమారు వందమంది ప్రకృతి రైతులు పాల్గొన్నారు. మితిమీరిన యూరియాను వినియోగించొద్దు రైతు సంక్షేమ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆరోగ్యకరమైన పంటలు పండించాలి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి -
కామారెడ్డిలో దొంగల అలజడి
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో మంగళవారం వేకువజామున దొంగల అలజడి కలకలం రేపింది. పట్టణంలోని జయశంకర్ కాలనీలో దాదాపు 3 గంటల ప్రాంతంలో దొంగలు సంచరిస్తూ చోరీలకు యత్నించారు. కుక్కలు మొరగడంతో కొందరు కాలనీవాసులు ఇళ్ల లో నుంచి బయటకు వచ్చారు. వారు బయటకు రావడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారని కాలనీవాసులు తెలిపారు. ముసుగులు ధ రించిన ముగ్గురు కాలనీల్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇదిలా ఉండగా అదే సమయంలో ఎన్జీవోఎస్ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడినట్లు కాలనీవాసులు తెలిపారు. అక్కడ ఎలాంటి విలువైన వస్తువులు చోరీకి గురి కాలేదని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దొంగల సంచారం పట్టణ వాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. కాలనీల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
గర్ల్స్ కాలేజీకి ఉత్తమ అవార్డు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని నిజామాబాద్ బాలికల కళాశాల ఉత్తమ కళాశాల అవార్డు సాధించింది. ప్రభుత్వ బాలికల కళాశాలలో వివిధ అంశాలు, ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అవార్డు వచ్చినట్లు ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ తెలిపారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కో బాలికల కాలేజీని ఎంపిక చేసి, అత్యధిక అడ్మిషన్లు, ఉత్తమ ఫలితాల సాధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఎంసెట్, నీట్ శిక్షణ నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలను పరిశీలించి అవార్డు అందజేసినట్లు చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ బాలికల కాలేజీకి హైబీజ్ టెన్ఎక్స్టీవీ ఎక్స్‌లెన్స్ అవార్డును మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, హైబీజ్ టెన్ ఎక్స్టీవీ ఉమ్మడిగా నిర్వహించిన కార్యక్రమంలో మంగళవారం మాజీ జేడీ లక్ష్మీనారాయణ, విద్యాపీఠం యాజమాన్య ప్రతినిధి ప్రీతిరెడ్డి నుంచి ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిరంతర కృషి, పట్టుదల, నిబద్ధత, విధి నిర్వహణ, కళాశాల అధ్యాపక సిబ్బంది సమష్టి కృషితోనే అవార్డు వచ్చిందన్నారు. -
మద్నూర్‌లో స్కూల్ ఆటో బోల్తా
● ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలుమద్నూర్(జుక్కల్): మద్నూర్ మండల కేంద్ర శివారులో స్కూల్ ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 12 మంది విద్యార్థులు గాయాల పాల య్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని అవాల్గావ్ గ్రామానికి చెందిన 12 మంది పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆటో లో మద్నూర్‌కు వస్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. గమనించిన వాహనదారులు బో ల్తా పడిన ఆటోను సరిచేసి గాయపడిన విద్యార్థులను మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కపిల్ (8వ తరగతి), హరి (9వ తరగతి) కాళ్లు, చేతులు విరగ్గా, అభిజిత్, సాయి లు, శివ, విష్ణుకాంత్, సాయి గణేశ్‌కు గాయాల య్యా యి. ఆటోలో ఐదుగురు విద్యార్థులు ప్రైవేటు పాఠ శాలకు, ముగ్గురు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆటో డ్రైవర్ గణపతికి ఎలాంటి గాయాలు కాలేదు. కళ్లు తిరగడంతోనే ఆటో అదుపు తప్పిందని డ్రైవర్ వాపోయాడు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, అవాల్గావ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. ఎస్సై రాజు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
మొక్కులు తీర్చేందుకు వెళ్తూ..
● ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. ● ఒకరి మృతి.. పలువురికి గాయాలుగాంధారి(ఎల్లారెడ్డి): మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలంలోని కాయితీ తండాకు చెందిన మంజారావు సింగ్ కుటుంబం మొక్కులు చెల్లించుకునేందుకు చద్మల్ తండాలో ఉన్న లక్ష్మమ్మ ఆలయానికి మంగళవారం ఉద యం ట్రాక్టర్లో బయలు దే రింది. నేరల్ గ్రామ శివారు లో ట్రాక్టర్ బోల్తాపడటంతో మంజారావు సింగ్ కుమారుడు మంజా గణేశ్(15) అక్కడికక్కడే మృతి చెందగా, మంజా మధు, మంజా కిషన్‌తోపాటు మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రావుసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
సుందరం.. సూర్యోదయం
మద్నూర్(జుక్కల్): ఉదయం పడిపోతున్న ఉష్ణోగ్రతలతో సూర్యుడు ఆలస్యంగా వస్తున్నాడు. ఉదయం సమయంలో సూర్యుడు లేలేత కిరణాలతో ఎర్రగా మారి ఆకట్టుకుంటున్నాడు. మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయిస్తున్న సూర్యుడి రూపం సుందరంగా కనిపించింది. జక్రాన్‌పల్లి: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాలానగర్ గ్రామానికి చెందిన సాయిలు(32) మద్యానికి అలవాటు పడ్డాడు. మంగళవారం మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవపడ్డాడు. దీంతో వారి మధ్య గొడవ జరగడంతో క్షణికావేశంలో గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలి
● అడ్డుకోవడానికి ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ● ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఏ ర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ ర వాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రధాన కూడళ్లలో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిజాంసాగ ర్ మండలంలోని మాగి, అచ్చంపేటలలో ఇసుక ల భ్యతపై నివేదికలు అందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ నగేష్, భూగర్భ జలశాఖ ఏడీ సతీష్ యాదవ్ పాల్గొన్నారు. ఇళ్ల మార్కవుట్ వేగవంతం చేయాలి కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లా డారు. పంచాయతీ కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరు కావాలని, విధుల్లో బాధ్యతగా వ్య వహరించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదన్నారు. కార్యదర్శుల హాజరును మండల అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కామారెడ్డి క్రైం: విద్యార్థులను పాఠశాలలకు తరలించే వాహనాల యజమానులు, డ్రైవర్లు ట్రా ఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసు, రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు పాఠశాలలకు ఎలా వస్తున్నారో ప్రధానోపాధ్యాయులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఆటోల్లో ముగ్గురికి మించి ప్ర యాణించరాదన్నారు. ఆరుగురికి మించి చిన్న పిల్లలను ఎక్కించకూడదని స్పష్టం చేశారు. వా హనాలకు చెల్లుబాటయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్, ప ర్మిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. నిర్దేశించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినా, ధ్రువపత్రాలు లేకపోయినా సంబంధిత వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, సుర క్షిత ప్రయాణంపై తగిన జాగ్రత్తలు పాటించాల ని సూచించారు. రహదారి భద్రత నియమాల అమలుపై రవాణా శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
జాతీయ రహదారిపై లారీ బోల్తా
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం పైపుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గుజరాత్ నుంచి మద్నూర్ మీదుగా కర్నూల్‌కు స్టీల్ పైపుల లోడుతో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద ఎదురుగా ఉన్న లారీని ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ● నేడు రీపోస్టుమార్టం చేయనున్న పోలీసులు మాక్లూర్: మండలంలోని బోర్గాం(కె) గ్రామానికి చెందిన పల్నాటి రమేశ్(35) ఈ నెల 19న గుండెపోటుతో మృతి చెందాడు. తన అన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటు ఇజ్రాయిల్‌లో ఉంటున్న అతని తమ్ముడు పల్నాటి కేథర్ మంగళవారం స్వగ్రామానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపడుతున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రమేశ్ మృతదేహాన్ని పూడ్చిన చోట బుధవారం రీ పోస్టుమార్టం చేయనున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఉన్న పురాతన మైసమ్మ ఆలయం ధ్వంసానికి దుండగులు యత్నించారు. గుడిని పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, హిందూవాహిని, భజరంగ్‌దళ్ నాయకులు గుడి వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయని, పోలీసులు ప్రతీ రోజు పెట్రోలింగ్ చేపట్టాలని కోరారు. ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. నాయకులు పుల్లూరి సతీశ్, నరేశ్, రమేశ్, నరేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సదాశివనగర్: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి తీవ్రగాయాలైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. మండలంలోని తిమ్మోజివాడి గ్రామానికి చెందిన గోల్కొండ హరిబాబు(31) ఈ నెల 20న బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
మొక్కలు, చెట్లను కాపాడండి
భిక్కనూరు: ప్రభుత్వం మొక్కలను నాటాలని పదే పదే చెబుతుంటుంటే కొందరు చెట్లను మొక్కలను తమ అవసరాలకు నరుకుతున్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఎల్లమ్మ గుడి సమీపంలో ఉన్న రైతు పెద్దబచ్చగారి శ్రీధర్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్ల కొమ్మలు, పూల మొక్కలను మేకల కాపరులు మంగళవారం వేకువజామున నరికేశారు. ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇలా నరకడం సమంజసం కాదని మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మేపుకోవాలన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు మేకల కాపరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మొక్కలను నరకకుండా చూడాలని ఆయన కోరారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో మంగళవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా తహసీల్దార్ ప్రేమ్‌కుమార్.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులు పాటలు పాడి, డ్యాన్సులు చేశారు. డీటీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ బాబు, తదితరులున్నారు. బాన్సువాడ రూరల్: సంగోజీపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం మహిళలకు ఆ గ్రామ సర్పంచ్ మంద సంగమేశ్వర్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇటీవల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీ చేసింది. కాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కొంత మందికి పంపిణీ నిలిపివేశారు. పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరటంతో పంపిణీ ప్రక్రియను పునఃప్రారంభించారు. సీసీ అక్బర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
యువతకు స్ఫూర్తినిచ్చే ఆత్మకథ
● ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ● రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ ● కుంచె గీసిన బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన నందిని సిధారెడ్డి సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘తన జీవన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కసితో చదివి ఉన్నత స్థితికి ఎదిగిన డాక్టర్ వి.శంకర్ జీవితం స్ఫూర్తిమంతమైనది. నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకు మేల్కొలుపులా కుంచె గీసిన బతుకు చిత్రం పుస్తకం ఉపయోగపడుతుంది’ అని రెరా చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్.సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, అసోసియేట్ ప్రొఫెస ర్ వి.శంకర్ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన మైలురాళ్లన్నింటినీ కలిపి ‘కుంచె గీసిన బతుకు చిత్రం’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించగా, డాక్టర్ నాళేశ్వరం శంకరం సమీక్షించారు. ఈ సందర్భంగా రెరా చైర్మన్ మాట్లాడుతూ శంకర్ తన జీవన ప్రయాణంలో ఎదుర్కొ న్న సవాళ్లను ఎంతో నిజాయితీగా అక్షరీకరించారన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసేలా పుస్తకం ఉందన్నారు. తెలంగాణ సామాజిక చిత్రంతో పా టు ఒక అధ్యాపకుడి అంతర్మథనాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యంవైపు నడవడానికి ఈ పుస్తకం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కుంచె గీసిన బతుకుచిత్రం అనే పేరులోనే ఒక కళాత్మకత ఉందని, ఒక చిత్రకారుడు తన జీవితాన్ని రంగులతో కాకుండా అక్షరాలతో ఎలా తీర్చిదిద్దారో ఈ శీర్షక సూచిస్తుందని నాళేశ్వరం శంకరం అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, తెలుగు విభాగ ప్రతినిధులు విశ్వప్రసాద్, రవీంద్రనాథ్, ఉమామహేశ్వరి, ఎన్సీసీ కోఆర్డినేటర్లు సుధాకర్, శ్రీనివాస్‌రావ్, కవులు సూరారం శంకర్, సిరిగాద శంకర్, సత్యనారాయణ, అశోక్‌కుమార్, ప్రకాశ్, నర్సింహారెడ్డి, నాంపల్లి, ఉస్మాన్, శ్రీనివాస్, భోజిరెడ్డి పాల్గొన్నారు. -
ఫిట్ ఇండియా సైకిల్‌ర్యాలీ
కామారెడ్డి అర్బన్ : ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ మధుమోహన్ ర్యాలీని ప్రారంభించా రు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయంనుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సాగింది. ఖేలో ఇండియాలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సంస్థ చేపట్టిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న లయోలా, మాస్టర్‌మైండ్, దేవునిపల్లి హైస్కూల్, ఆర్కిడ్స్, ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులను అడిషనల్ కలెక్టర్, ని ర్వాహకులు అభినందించారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, పట్ట ణ ఎస్‌హెచ్‌వో రాజారాం, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, వ్యా యామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రమాణ స్వీకారం మాచారెడ్డి : సోమారంపేట, సోమారంపేట తండా గ్రామ పంచాయతీ పాలకవర్గాల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. దీంతో రెండు పంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచాయతీ భవనం విషయంలో రెండు గ్రామాల పాలక వర్గాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం నిర్వహించాల్సిన ఆయా పంచా యతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమా ణ స్వీకారం వాయిదా పడింది. అధికారులు ఇరు గ్రామాలవారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం ఉన్న పంచాయ తీ భవనంలో సోమారంపేట పంచాయతీ పాలకవర్గం, మహిళా సంఘం భవనంలో సోమారంపేట తండా పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడానికి ఒప్పించారు. బుధవారం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఎంపీడీవో గోపిబాబు తెలిపారు. ‘మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’ మాచారెడ్డి : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి సూచించారు. లచ్చాపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం వర్డ్ ఎన్జీవో సంస్థ సహకారంతో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ డ్రగ్స్‌కు అలవాటు పడితే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అంతేగాకుండా చదువుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మంచి స్నేహితులతో దగ్గరగా ఉండాలని, సోషల్ మీడియాను విద్య, జ్ఞాన అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. పిల్లల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, బాల కార్మిక చట్టాల గురించి ఆమె వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భవానీ, వర్డ్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ వంశి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నకిలీ నోట్ల కేసులో ఎనిమిది మంది అరెస్ట్ వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామం కేంద్రంగా బయటపడ్డ దొంగ నోట్ల కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు వర్ని ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. జలాల్పూర్ సర్పంచ్ మమత భర్త బాలుతోపాటు అతడి తమ్ము డు నరేడ్ల శంకర్, అఫంధి ఫారమ్‌కు చెందిన పాల్త్య కళ్యాణ్, చందూర్ గ్రామానికి చెందిన సటోజీ గోపాల్, రమేష్, మహాదేవ్ , ఇల్తేమ్ రవి, రవికుమార్ రెడ్డిలను అరెస్టు చేశామ న్నారు. వారి వద్ద నుంచి రూ. 9.86 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామ న్నారు. రెండు ప్రింటర్లు, ఒక ల్యాబ్ టాప్, 8 ఫోన్లు, ఒక కార్‌ను సీజ్ చేశామన్నారు. నిందితులను దొంగ నోట్ల తయారీ, పంపిణీకి సంబంధించి కేసులో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
హిందువులపై దాడులు గర్హనీయం
కామారెడ్డి అర్బన్ : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు గర్హనీయమని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువు హత్యను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. మతోన్మాద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం మాట్లాడుతూ దేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగినా స్పందించే సెక్యులరిస్ట్‌లు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడులకు వ్యతిరేకంగా హిందువులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆందోళనకు అయ్యప్ప స్వాములు మద్దతు తెలిపారు. నిరసన కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ అశోక్, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షులు సామల గంగారెడ్డి, గోపాలకృష్ణ, బొడ్డు శంకర్, జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, నాయకులు శ్రీకాంత్‌రావు, పాపారావు, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, పూల్లూరు సతీష్, రమేష్, విఫుల్జైన్, కార్యదర్శి అరవింద్, సాయికుమార్, అయ్యప్ప స్వాములు బండి నర్సింలు, శివకుమార్, ముప్పారపు ఆనంద్, శివ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపికలు నిర్వహించగా 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక పోటీలను అదనపు కలెక్టర్ మధు మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జనవరి 2న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో ఎంపికై న 24 మంది క్రీడాకారులు జిల్లా తరపున పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.జైపాల్‌రెడ్డి, కేపీ అనిల్‌కుమార్‌లు తెలిపారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి వెంకటేశ్వరగౌడ్, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూదన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, ప్రభులింగం, విజయలక్ష్మి, సంజీవ్, లక్ష్మణ్, నరేష్, నవీన్, సురేష్ పాల్గొన్నారు. -
యాప్‌తో ఎరువుల కొనుగోలు సులభం
గాంధారిలో యాప్‌పై అవగాహన కల్పిస్తున్న ఏవో రాజలింగంలింగంపేటలో మాట్లాడుతున్న ఏవో అనిల్కుమార్లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ద్వారా రైతులు సులభంగా ఎరువులు కొనుగోలు చేయవచ్చని మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో ఎరువులు పొందవచ్చారు. ఆన్లైన్లో ఎరువుల వివరాలు నమోదై ఉంటాయన్నారు. ఏఈవోలు రాకేష్, రవి, నవ్య, తదితరులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి గాంధారి(ఎల్లారెడ్డి): గ్రామాలు, తండాల్లో ఫెర్టిలైజర్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఏవో రా జలింగం సూచించారు. మంగళవారం స్థానిక రైతు వే దిక భవనంలో ఏఈవోలు, జీపీవోలతో సమావేశం ఏ ర్పాటు చేసి అవగాహన కల్పించారు. పు రుగు మందులు, ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు దేమికలాన్ సింగిల్ విండో కార్యాలయాలలో మంగళవారం యూరియా ఎరువుల కోసం బుకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమపట్టా పాస్ పుస్తకాలతో కార్యాలయాలకు వచ్చి తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ప్రత్యేక అధికారులు లక్ష్మణ్, విష్ణు, సీఈవో నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ప్రారంభం
కామారెడ్డి క్రైం: జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో పిల్లలకు పాలు ఇవ్వడంలో తల్లులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ప్రతి బస్టాండ్, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు కార్యాలయాలు
● కామారెడ్డి జిల్లా కేంద్రంలో సఖి, భరోసా కేంద్రాలు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే ఉంది. జిల్లా కేంద్రంలో సగానికిపైగా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ● బాన్సువాడ డివిజన్ కేంద్రంలో పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయం అద్దె భవనంలో ఉంది. ఇక్కడ సొంత భవనం నిర్మిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్, కార్మిక శాఖ కార్యాలయాలకూ అద్దె భవనాలే దిక్కయ్యాయి. ● ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఎకై ్సజ్ శాఖ, విద్యుత్ శాఖల డివిజనల్ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయాన్ని ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి మార్చారు. సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ● బిచ్కుందలో ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఆదాయం తెచ్చిపెట్టే శాఖలే అయినా సొంత భవనాలకు నిధులు రాకపోవడంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ● బీబీపేటలో ఐకేపీ కార్యాలయం అద్దె భవనంలో ఉంది. ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. అయితే ఎంపీడీవో కార్యాలయం ఎమ్మార్సీ భవనంలో, తహసీల్ కార్యాలయం సొసైటీ భవనంలో కొనసాగుతోంది. ● నస్రుల్లాబాద్‌లో ఐకేపీ కార్యాలయానికి సొంత భవనం లేదు. ● దోమకొండ మండల కేంద్రంలో ఎకై ్సజ్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. -
కార్యాలయానికి చోటేదీ?
కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. దీంతో చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడంతో అరకొర సౌకర్యాల మధ్య ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయ భవనంలోనో.. అద్దె భవనంలోనో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల నిధులు మంజూరైనా పనులు పూర్తి కాకపోవడంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్, ఎకై ్సజ్, విద్యుత్ శాఖల కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల ఇతర శాఖల భవనాల్లో కొనసాగుతున్నాయి. చాలావరకు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. పంచాయతీ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు లేకపోవడంతో అద్దె ఇళ్లలోనే నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన పాల్వంచ, డోంగ్లీ, మహ్మద్‌నగర్, బీబీపేట, రామారెడ్డి, పెద్దకొడప్గల్ తదితర మండలాల్లో తహసీల్, మండల పరిషత్ కార్యాలయాలను ఇతర శాఖలకు చెందిన భవనాల్లో ఏర్పాటు చేశారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్వంచ, డోంగ్లీ మండలాల్లో తహసీల్ కార్యాలయాలను రైతు వేదికల్లో నిర్వహిస్తుండడంతో వ్యవసాయ శాఖ ఏవోలు, ఏఈవోలకు కార్యాలయాలు లేకుండాపోయాయి. పాల్వంచ మండల కేంద్రంలో మండల పరిషత్ కా ర్యాలయాన్ని గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం కార్యాలయాలన్నింటినీ ప్రభుత్వ భవనాల్లోకి షిఫ్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయా శాఖల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు కార్యాలయాలను ఎక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై తలలు పట్టుకుంటున్నారు. ఆయా కార్యాలయాలకు అనువైన ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. అద్దె భవనాల్లో ఉండొద్దన్న సర్కారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి వెంటనే మార్చాలని ఆదేశాలు సొంత భవనాలు లేక ఇబ్బందులు ఇప్పటికిప్పుడు మార్చడం సవాలే అంటున్న అధికారులు -
నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.5 లక్షల ఎకరాల్లో..
నిజాంసాగర్: జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా ఉన్నాయి. ప్రాజెక్టులే కాకుండా చెరువులు, కుంటల్లోనూ నీరుండడంతో యాసంగికి రైతులు ఆశావహ దృక్పథంతో సన్నద్ధమవుతున్నారు. వర్షాకాలంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వరదలతో జలాశయాలన్నీ నిండుకుండలుగా మారాయి. నిజాంసాగర్, కౌలాస్, పోచారం ప్రాజెక్టులు, సింగితం రిజర్వాయర్ ఇప్పటికీ దాదాపు నిండుగా ఉన్నాయి. చెరువులు, కుంటలు కూడా కళకళలాడుతున్నాయి. సాగు నీరు పుష్కలంగా ఉండడంతో ఆయకట్టు కింద పంటల సాగుకు రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకొని వరినాట్లకు ముందుకు వెళ్తున్నారు. చెరువుల కింద 90 వేల ఎకరాల్లో... జిల్లాలో 1,515 చెరువులు, కుంటలు ఉండగా 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ప్రధాన చెరువులు, కుంటల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఆయా చెరువుల కింద ఇప్పటికే నారుమళ్లు పోసిన రైతులు.. నాట్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ కింద 460 ఎకరాల్లో పంటల సాగవనున్నాయి. రిజర్వాయర్ కుడి, ఎడమ పంట కాలువలకు నీటి విడుదల చేపట్టడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.ఉమ్మడి జిల్లా వరదప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవనున్నాయి. ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు, వరినాట్ల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలీసాగర్ రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటరి 49 వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని ప్రధాన కాలువ ద్వారా అందిస్తున్నారు. వారం రోజుల నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, కోటగిరి, నవీపేట్, బోధన్ ప్రాంతాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి. మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు వరి సాగుకు నారుమళ్లును సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు వరినాట్లు వేయనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 17.8 టీఎంసీల నీరుంది. 7 విడతల్లో 12 టీఎంసీల నీటిని ఆయకట్టుకు విడుదల చేయనున్నారు.జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.237 టీఎంసీలతో కళకళలాడుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 9 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు కింద పంటల సాగు కోసం ప్రాజెక్టు నుంచి పంట కాలువలకు నీటి విడుదల చేపడుతున్నారు. రైతులు నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
కొలువుదీరిన పల్లె పాలకులు
● బాధ్యతలు స్వీకరించిన పంచాయతీ పాలకవర్గాలు ● పలుచోట్ల వాయిదాసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఏడెనిమిది పంచాయతీల్లో మినహా మిగిలిన అన్నిచోట్ల బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో 532 పంచాయతీలు ఉన్నాయి. ఈనెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో ఆయా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలుత ఈనెల 20 నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అమావాస్య కారణంగా 22 వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం జిల్లాలోని ఆయా పంచాయతీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారుల ఆధ్వర్యంలో చేపట్టారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులందరూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సభలు, సమావేశాలు జరిగాయి. బాన్సువాడ మండలంలో మూడుచోట్ల.. బాన్సువాడ రూరల్ : సోమ్లానాయక్ తండాలో సర్పంచ్ మీరిబాయి అత్త, ఇబ్రాహీంపేట్ తండాలో వార్డు సభ్యుడి కుటుంబ సభ్యుడు మృతిచెందడంతో ఆయా పంచాయతీలలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు. దేశాయిపేట్‌లో వ్యక్తిగత కారణాలతో సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి బుధవారానికి వాయిదా వేసుకున్నారు. కాగా ఇక్కడ నలుగురు వార్డు సభ్యులు మాత్రం ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్‌తోపాటు మిగిలిన వార్డుమెంబర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ప్రమా ణ స్వీకారం నిలిచిపోయింది. ఎల్లారెడ్డి మండ లం సోమార్‌పేట్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశా రు. మాచారెడ్డి మండలం సోమారంపేట, సో మారంపేట తండా పంచాయతీల పాలకవర్గాలు పంచాయతీ భవనం కోసం ఘర్షణ పడడంతో రెండు గ్రామాలలో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మహ్మద్‌నగర్ మండలం గున్కుల్ గ్రామ సర్పంచ్ రమేశ్‌యాదవ్ అయ్యప్ప మాల విరమణ కోసం శబరిమల వెళ్లడంతో అక్కడ ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. -
నారుమడులపై చలిప్రభావం
బీబీపేట: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలను వ్యవసాయాధికారులు రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే నారు సరిగ్గా ఎదగక, ఎర్రబడి కొన్నిసార్లు చనిపోతుందని వారు తెలుపుతున్నారు. యాసంగిలో వరి సాగు చేసే రైతులు నారుమడి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరి మొలకెత్తటానికి 25–45 డిగ్రీల సెల్సియస్, మొక్కల ఎదుగుదలకు 25–35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండడం మంచిదని, జిల్లాల్లో వారం రోజుల నుంచి 45 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు అవుతోంది. దీంతో భూమిలోని పోషకాలు మొక్కకు అందక ఆకులు పసుపు రంగుగా మారి ఆ తర్వాత ఎండిపోతాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో వరినారు ఎదగని పరిస్థితుల్లో రైతులు చేస్తున్న పలు రకాల మందుల పిచికారీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. నారు ఎర్రబడటం, తెగుళ్లు ఆశించడం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగితే మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. నారుమడి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. ● చలికి నారు దెబ్బతినకుండా నారుమడికి సాయంత్రం నీటిని ఎక్కువగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్తనీరు పెట్టాలి. ● అధిక చలితో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. జింకు లోపం.. ● చలి ఎక్కువగా ఉన్నప్పుడు జింక్ లోపం కనిపిస్తుంది. ● ముదురాకు చివర్లలో, మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. క్రమేపి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. అలాగే ఆకు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ● మొక్కలు గిడసబారతాయి. నత్రజని ఎరువులు వేసినప్పటికీ నారుమడి పచ్చబడదు. చలి తీవ్రతకు నారుమడులు కొద్దిగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే పలు నారుమడుల్లో జింకు లోపం గుర్తించామన్నారు. నివారణకు రైతులకు మందులు పిచికారి ఎలా చేయాలో సలహాలు ఇస్తున్నాం. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుంటే తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. నివారణ జింకు సల్ఫేట్ 2 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. సొంతంగా ఎలాంటి మందులు పిచికారి చేయకూడదు. – రాఘవేంద్ర, ఏఈవో బీబీపేట చలి తీవ్రతకు ఎదగని నారు రెండు సార్లు వడ్లను పోస్తున్న రైతులు వాతావరణంలో మార్పులే కారణమంటున్న వ్యవసాయాధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచన -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మహిళలు, పురుషుల జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా కబడ్డీ అసో సియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో 72వ జిల్లా స్థాయి మహిళ, పురుష కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించి 32 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25 నుంచి 28వరకు కరీంనగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి 72వ సీనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల అభినందన నిర్వహించగా జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్, టీఎస్ పేటా జిల్లా ప్రధానకార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, డెయిరీ కళాశాల అసిస్టెంట్ ప్రోఫెసర్ ఉమాపతి, వ్యాయామ ఉపాధ్యాయులు, అసోసియేషన్ ప్రతినిధులు వెంకటి, అనిల్‌కుమార్, జగదీష్, నవీన్‌కుమార్, రేణుక, విజయలక్ష్మి, అరుణ, రమ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల రక్షణ కోసం పాత చీరలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రబీ సీజన్లో వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు పాత చీరలను వాడుతున్నారు. చేతికి వచ్చిన పంటలను అడవి జంతువులు దాడి చేసి చేసి ధ్వంసం చేస్తాయనే భయంతో ముందు జాగ్రత్తగా పంటల చుట్టూ పాత చీరలను కడుతున్నారు. బిర్నీస్, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు పంటల్లోకి కోతులు, అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గత్యంతరం లేక ఉన్న పంటలను ఎలాగైనా కాపాడుకుందామని కామారెడ్డితో పాటు తదితర ప్రాంతాలలో జరిగే సంతలకు వెళ్లి పాత చీరలను కొనుగోలు చేసి, పంటల చుట్టూ కడుతున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారు నగలు, రూ. 30వేల నగదు అపహరణ నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని అయిలాపూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన బత్తుల పోశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లాడు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వారి ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. పోశెట్టి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా సామాను చిందరవందరగా పడేసి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లోని 5 తులాల బంగారు నగలు, రూ.30వేల నగదును చోరీ చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు. డిచ్‌పల్లిలో పట్టపగలే.. డిచ్పల్లి: మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదు రుగా ఉన్న ఎస్బీఐ మినీ బ్యాంకులో సోమవారం పట్టపగలే చోరీ జరగడం స్థానికంగా కలకలం రే పింది. బాధితులు, డిచ్ పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపిన వివరాలు ఇలా.. డిచ్పల్లి బస్టాండ్ ఎదురుగా రాజు అనే వ్యక్తి ఎస్బీఐ మినీ బ్యాంకు నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్నాహ్యం షాపు గ్లాస్ డోర్‌కు తాళం వేసి భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికీ ఓ కస్టమర్ అతడికి ఫోన్ చేసి షాపు తెరిచి ఉందని ఎక్కడ ఉన్నావని అడిగాడు. దీంతో తాను తాళం వేసి వస్తే డోర్ ఎలా తెరిచి ఉంటుందని ఆందోళన చెందిన వెంటనే బైక్‌పై షాపు వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లి చూడగా టేబుల్ డ్రాలో ఉన్న రూ.60వేలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా నెత్తిన టోపి ధరించిన గుర్తు తెలియని దుండగుడు పెద్ద స్క్రూడ్రైవర్‌తో గ్లాస్ డోర్‌ను తెరిచి లోనికి వచ్చాడు. అదే స్క్రూడ్రైవర్‌తో టేబుల్ డ్రాను తెరిచి, అందులోని రూ.60వేలను అపహరించాడు. సమీపంలోని దుకాణం ముందర బైక్‌పై ఒక యువకుడు వేచి ఉండగా, మరొక యువకుడు లోనికి వచ్చి ఈ చోరీకి పాల్పడి వెంటనే అదే బైక్‌పై పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లమ్మ ఆలయంలో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో గల ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. సాంంకేతిక ఆధారాల సహాయంతో అనుమానితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చోరీకి ఉపయోగించిన గడ్డపార, దొంగిలించబడ్డ గల్లాపెట్టె, ఆటో, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడినది గాంధారి వాసి అయినా ర్యాకం సాయిలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వాసి జూలపాల రాములుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు. -
సర్పంచ్ వేతనం మందిరానికి విరాళం
బాన్సువాడ రూరల్: మండలంలోని సంగోజీపేట్ గ్రామ సర్పంచ్‌గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన మంద సంగమేశ్వర్ తనకు వచ్చే గౌరవ వేతనాన్ని గ్రామంలోని హనుమాన్ మందిరానికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నెలనెలా వచ్చే వేతనాన్ని హనుమాన్ మందిరంలో ధూపదీప నైవేద్యాలకు వినియోగించాలని గ్రామస్తులకు సూచించారు. నెలకు రూ.6500 ,చొప్పున 5ఏళ్లలో రూ. 3.90లక్షలు ఆలయానికి సమకూర్చుతున్నట్లు సంతకం చేసిన వాంగ్మూళ పత్రాన్ని గ్రామస్తులకు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్హరినాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): నిజామాబాద్ నగరంలో నిర్వహించిన క్రీడల్లో లింగంపేట మండల కేంద్రానికి చెందిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్ బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట్రాములు తెలిపారు. 13 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయిలో ఆడనున్నట్లు తెలిపారు. అలాగే మార్చ్ఫాస్ట్లో తృతీయ స్థానం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయుడు రవీందర్‌సింగ్‌లను పాఠశాల సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్త రామ్‌గోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: మున్సిపల్ కార్మికుడు తన నిజాయితీని చాటుకున్నాడు. పొరపాటున తన ఖాతాలో జమైన నగదును వెతికి పట్టుకుని మరీ బాధితుడికి అందించి మానవత్వాన్ని చాటాడు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం చైన్నె గ్రామానికి చెందిన నవీన్‌బాబు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఆయన పొరపాటున రూ. 9వేలను ఫోన్‌పే ద్వారా కామారెడ్డి మున్సిపల్లో వాటర్‌వర్క్స్‌లో పని చేస్తున్న కార్మిక సంఘ నాయకుడు నర్సింగ్‌రావు ఖాతాకు పంపించారు. తన ఖాతాలో జమైనట్లు గమనించిన నర్సింగ్‌రావు వెంటనే సదరు ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి నవీన్‌బాబు ఇంటికి వెళ్లి మరీ తన వద్ద ఉన్న రూ. 9వేలను తిరిగి అందజేశా రు.దీంతో నర్సింగ్‌రావుకు నవీన్‌బాబు, ఆయ న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పిట్లం(జుక్కల్): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల అధ్యక్షుడిగా సన్నపుల కృష్ణను, పట్టణ అధ్యక్షులుగా గుర్రపు బాలరాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియమక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేత, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి రాజేందర్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి మహేశ్ బాబు, కామారెడ్డి టౌన్ మహిళా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రం గోపన్‌పల్లి చౌరస్తా వద్ద గల అయ్యప్ప ఆలయంలో సోమవారం సామూహిక మండల పడిపూజ వైభవంగా నిర్వహించారు. బండయప్ప మఠం పీఠాధిపతి సోమయప్ప స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ స్వాములు ఉత్సవ విగ్రహాలతో ర్యాలీ నిర్వహించారు. -
అటవీశాఖ తీరును నిరసిస్తూ ధర్నా
పిట్లం(జుక్కల్): పిట్లం – బాన్సువాడ రోడ్డు విస్తరణలో భాగంగా మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో నర్సరీ వద్ద రోడ్డు పనులను అటవీశాఖ అధికారులు నిలిపివేయడంతో సోమవారం గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పనులు నిలిపి వేసిన స్థలానికి చేరుకొని ఫారెస్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రజల కోసం రోడ్డు వెడల్పు పనులను చేపడితే, అధికారులు పనులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. దీంతో అటవీశాఖ అధికారులు ఈ రోడ్డు విస్తరణ చేయడానికి వీలులేదని, ఈస్థలం అటవీ శాఖ పరిధిలో ఉందని అందుకే ఆపివేశామని చెప్పడంతో ప్రజలు ఆగ్రహించారు. సింగిల్ రోడ్డుకు ఎందుకు అనుమతిని ఇచ్చారని, ఇప్పుడు రోడ్డు విస్తరణ చేస్తే ఏం నష్టం జరుగుతుందని ప్రశ్నించారు. అధికారులు తీరును నిరసిస్తూ రోడ్డుకు అడ్డుగా వాహనాలను పెట్టి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 60 ఫిర్యాదులు కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఎ ప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సో మవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 60 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజలు త మ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రతి సోమ వారం కలెక్టరేట్‌కు వస్తుంటారన్నారు. ఆయా శాఖ ల అధికారులు వచ్చిన ఫిర్యాదులను విచారించి వీలైనంత త్వరగా పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకూడదని ఆదేశించారు. ఎ న్నికల కోడ్ ముగిసిందని,యధావిధిగా ప్రజావా ణి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందన్నా రు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈఓ చందర్ నాయక్, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
క్రైం కార్నర్పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన ఓ రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాయు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. గుత్ప గ్రామానికి చెందిన బాషెట్టి భూమేశ్వర్(54) అనే రైతు సోమవారం గగ్గుపల్లి గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ బోరు బావి మోటార్‌ను స్టార్ట్ చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యడు. తీవ్ర అస్వస్థతకు గురైన భూమేష్వర్ను స్థానికులు గుర్తించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. వేల్పూర్ మండలంలో.. వేల్పూర్: వేల్పూర్ మండలం అమీనాపూర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు మృతిచెందాడు. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. లక్కోర గ్రామానికి చెందిన అబ్బాని భూమన్న(52) గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు తన టీవీఎస్ మోపెడ్‌పై సోమవారం భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామంలో ఉన్న కూతురు వద్దకు బయలుదేరాడు. అమీనాపూర్ సమీపంలో మూలమలుపువద్ద వేల్పూర్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న ఆటో అతివేగంగా వచ్చి భూమన్నను ఢీకొట్టింది. ఈ ఘటనలో భూమన్న తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ని మండలంలో.. వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో చేపల వేటకని వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. వర్ని ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన నాగని ప్రవీణ్ (29) సోమవారం ఉదయం ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చెరువులోకి దిగిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. రామారెడ్డి (ఎల్లారెడ్డి): ఇటీవల ఆత్మహత్యకు యత్నించి న ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. రా మారెడ్డి మండలం పోసానిపే ట గ్రామానికి చెందిన కనుగందుల నవీన్ (23) వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. రైలు సమీపించగానే భయంతో ప క్కకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆలస్యం కా వడంతో రైలు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. ఆలూర్ మండలంలో కరెంట్ షాక్‌తో రైతు ప్రాణాలు కోల్పోయాడు. వేల్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు, వర్ని మండలంలో చేపలవేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● విపత్తులపై జిల్లాకేంద్రంలో మాక్ డ్రిల్కామారెడ్డి అర్బన్: వరదలు, విపత్తులు, ప్రమాదాలు ఏ సమయంలో వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ, హోంశాఖ సహకారంతో కామారెడ్డి పెద్ద చెరువు గంగమ్మ గుడి వద్ద విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలను అప్రమత్తం చేసే ఈవోసీ సందేశాలు, సైరన్లు, ప్రజలను హెచ్చరించడం, వైర్లెస్ సేవలువంటి ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థలను పరీక్షించారు. ప్రాథమిక నష్టం అంచనాలు వేయడం, అధిక ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు, డ్రోన్ ద్వారా సేవలు అందించడం, ఎన్సీసీ, హోంగార్డు, వలంటీర్ల సేవల కోసం సామాజిక ఆధారిత ప్రతిస్పందన వ్యవస్థను సక్రియం చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, పల శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పరిషత్ ఎన్నికలలోనూ సత్తా చాటుదాం’
నిజాంసాగర్: పంచాయతీ ఎన్నికల మాదిరిగానే రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనూ సత్తా చాటాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం మహమ్మద్‌నగర్ మండలం తుంకిపల్లి గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో విజయాలు సాధించామన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డీఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తుంకిపల్లి సర్పంచ్ రాములు, నాయకులు ప్రజా పండరి, లోక్యానాయక్, కృష్ణ, శంకర్, గోపిసింగ్ తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి/కామారెడ్డి టౌన్: మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న తగిరంచ శ్రావ్య హాకీ రాష్ట్ర జట్టుకు ఎంపికై ంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ చూపడంతో ఆమెను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్ యాకినుద్దీన్ తెలిపారు. జనవరి 2 నుంచి 7 వరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందని పేర్కొన్నారు. ఆమెను జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు నీలం లింగం, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి మధుసూదన్‌రెడ్డి, కళాశాల స్పోర్ట్స్ ఇన్చార్జి నీలం నర్సింలు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. మాచారెడ్డి: మర్రితండాలో సోమవారం ఓ దూడపై అడవి జంతువులు దాడి చేసి కొరికి చంపాయి. అయితే పెద్దపులి లేదా చిరుత దాడిగా గ్రామస్తులు అనుమానించారు. అటవీశాఖ మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దూడపై దాడి చేసింది పులి కాని, చిరుత కాని కాదని పేర్కొన్నారు. ఏదో అడవి జంతువులు దాడిచేయడం వల్లే దూడ మృతిచెంది ఉంటుందన్నారు. -
ఓటరు మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను జనవరి 13 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి బూత్‌ల వారీగా సమీక్షించారు. తహసీల్దార్లతో మాట్లాడి మండలాల వారీగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతిని తెలుసుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఓటరు జాబితాలో స్పష్టంగా లేని ఫొటోలను గుర్తించాలన్నారు. ఫారం– 8 ద్వారా అసలైన ఫొటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, అధికారులు పాల్గొన్నారు. -
రెండూళ్ల ‘పంచాయతీ’
● ఒకే పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారానికి ఇరు గ్రామాల పట్టు ● ఇరు వర్గాల మధ్య వాగ్వాదం.. ● ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదామాచారెడ్డి : సోమారంపేట, సోమారంపేట తండా పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ భవన వివాదంతో నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి. సోమారంపేట గ్రామంలో నూతన పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో సోమారంపేట గ్రామం నుంచి విడిపోయిన సోమారంపేట తండా పంచాయతీ పాలక వర్గం తాము కూడా సోమారంపేట పంచాయతీ భవనంలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని పట్టుబట్టారు. దీనికి సోమారంపేటవాసులు ఒప్పుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమారంపేట పంచాయతీ కార్యాలయంతో పాటు పలు ఇళ్లు సోమారంపేట తండా గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చాయని, పంచాయతీ కార్యాలయంలో తమకు హక్కు ఉంటుందని సోమారంపేట తండా పాలకవర్గం, తండా వాసులు భీష్మించుకుని కూర్చున్నారు. ఎంపీడీవో గోపిబాబు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, పోలీస్ కంట్రోల్ రూం ఎస్సై నరేశ్, కామారెడ్డి పట్టణ, రామారెడ్డి ఎస్సైలు శ్రీరాం, రాజశేఖర్ అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీవో, పోలీసులు కలిసి సోమారంపేట, సోమారంపేట తండా పంచాయతీల పాలక వర్గాలకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయిస్తామని చెప్పడంతో సోమారంపేట తండా పాలక వర్గం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుంది. సోమారంపేట పాలక వర్గం రాకపోవడంతో, వారు వస్తేనే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని తండా పాలకవర్గం అక్కడి నుంచి వెనుదిరిగింది. దీంతో రెండు పంచాయతీల పాలకవర్గాల ప్రమాణా స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీవో ప్రకటించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. -
రాజీ మార్గమే రాజమార్గం
బాన్సువాడ: రాజీ మార్గమే రాజమార్గమని బాన్సువాడ కోర్టు జడ్జి టీఎస్పీ భార్గవి అన్నారు. ఆదివారం బాన్సువాడ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులు అందరూ లోక్ అదాలత్‌లో రాజీ పడి కేసులు పరిష్కరించుకోవాలని, కేసుల పరిష్కరం ద్వారా ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. రాజీతో ఇరువర్గాలు గెలిచినట్లేనని, సివిల్, క్రిమినల్, బ్యాంకు కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయవాదులు ఖలీల్, మొగులయ్య, కోర్టు సిబ్బంది ఉన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో ఆదివారం ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ రాజీ చేసుకోదగ్గ కేసులకు సంబంధించిన వాటిని పరిష్కరించినట్లు వారు తెలిపారు. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి పోలీస్ స్టేషన్లతో పాటు ఎకై ్సజ్ శాఖకు సంబంధించి రాజీపడ దగిన కేసులను న్యాయమూర్తి పరిష్కరించినట్లు వారు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్‌రావు, న్యాయవాదులు పండరి, శ్రీనివాస్, శ్రీకాంత్, నవీద్, సాయిబాబా, సాయిప్రకాష్ దేశ్‌పాండే, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి ఎస్సైలు మహేష్, దీపక్‌కుమార్, భార్గవ్‌గౌడ్, ఆంజనేయులు, ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్ తదితరులున్నారు. బిచ్కుందలో 295 కేసుల పరిష్కారం బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్డులో ఆదివారం లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించారు. జడ్జి వినిల్ కుమార్ ముందు ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించుకుంటామని ఒప్పుకోవడంతో 295 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి వినిల్ కుమార్ మాట్లాడుతూ.. ఆవేశాలకు లోనుకాకుండా చిన్నచిన్న తగాదాలకు కొట్లాడుకోవద్దు.. ఏదైనా సమస్యలు ఉంటే గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఆవేశంలో కేసులు నమోదు చేసుకొని ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని అన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పిట్లం(జుక్కల్)/భిక్కనూరు/పెర్కిట్/కామారెడ్డి అర్బన్: పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం 1992–95 బ్యాచ్ చెందిన 8, 9, 10వ తరగతుల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత విద్యార్థులంతా మళ్లీ ఒకేచోట చేరడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యా యంగా పలకరించుకొని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను సన్మానించారు. అలాగే భిక్కనూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1989–90 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కామారెడ్డి మండలం గర్గుల్ జెడ్పీహెచ్ఎ స్లో 2009–10 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఆర్మూర్‌లోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 1997–2000 బ్యాచ్ డిగ్రీ వి ద్యార్థులు సైతం ఆత్మీయసమ్మేళనంనిర్వహించారు. -
పోగొట్టాలి.. లెక్కలంటే భయం
● చిన్నతనం నుంచే గణితంపై ఆసక్తి పెంచాలి ● ఆధునిక జీవనానికి ఆలంబన గణితం ● నేడు జాతీయ గణిత దినోత్సవం కమ్మర్పల్లి: జీవితంలో ఎన్నో అంశాలు లెక్కలతో ముడిపడి ఉంటాయి. కానీ, లెక్కలు అంటే దిక్కులు చూసే పిల్లలకు ఓ పట్టానా అర్థంకాని సబ్జెక్టుగా గణితం పేరు మోసింది. లెక్కలంటే భయంతో నేటితరం పిల్లలు ‘గణితపోభియా’ నుంచి దూరం కా వడం లేదు. సులభ సాధ్యమైన గణిత బోధన పద్ధతులతో చిన్నతనం నుంచే లెక్కలు నేర్పితే ఆసక్తి పెంపొంది గణిత మేధావులుగా ఎదిగే అవకాశం ఉంది. సోమవారం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం, జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అనవసర భయాలతో .. ఏ విద్యార్థినైనా భయపెట్టే పాఠ్యాంశాలలో గణితందే తొలిస్థానం. లెక్కల భయం విద్యార్థులలో ఆందోళనను పెంచి వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గణిత భావనల్ని మూర్త భావనలకు జోడించి చెప్పడం లేదు. గణితం అనాసక్తికరమైన, సృజనాత్మకత లేని సంక్లిష్టమైన విషయంగా చాలామంది విద్యార్థులు అపోహ పడతున్నారు. కొందరు ఉపాధ్యాయులు గణిత పాఠ్యపుస్తకాల్లో ఒక ఉదాహరణ ఇచ్చి దాని ఆధారంగా సాధన చేయాల్సిన లెక్కల జాబితాను ఇస్తున్నారు. దీంతో పిల్లలు ప్రాథమిక భావనలపై సరైన రీతిలో దృష్టి సారించడం లేదని గణిత మేధావులు చెప్తున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గణిత కార్యక్రమాలు రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం ప్రాథమిక స్థాయిలో 1, 2 తరగతులకు కృత్రిమ మేధ ద్వారా ప్రయోగాత్మకంగా ఒక్కొక్క పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టి గణిత బోధనను సులభతరం చేస్తున్నారు. ఏఎక్స్ఎల్ బోధనలో భాగంగా గణితంలో వెనుకబడిన విద్యార్థులకు కంప్యూటర్ల ద్వారా బోధన జరుగుతోంది. ఉన్నత పాఠశాలల్లో మండల, జిల్లా గణిత ఫోరంలా ఆధ్వర్యంలో టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఉపాధ్యాయులుకొత్త పద్ధతులు పాటించాలి గణిత బోధనలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు ఉపయోగించినప్పుడే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. క్లిష్టమైన గణిత విషయాలను సరళ పద్ధతిలో, అర్థవంతమైన ఉదాహరణలు ఇస్తూ బోధిస్తే విద్యార్థులు గణిత మేధావులుగా తయారవుతారు. – పెద్ది మురళి, గణిత ఉపాధ్యాయుడు -
వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కల్వరాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ చూపినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్థన్ రెడ్డి ఆదివారం తెలిపారు. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన జిజ్ఞాసలో కల్వరాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన కె.ప్రసన్న, జె. స్నేహలు ప్రతిభ చూపినట్లు తెలిపారు. వీరికి గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయురాలు శైలజను అభినందించారు. వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే ఫార్మర్ ఫ్రెండ్లీ ఫర్టిలైజర్ పరికరాన్ని రూపొందించి ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచి బెంగుళూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులకు రూ.4 వేల నగదు పురస్కారం, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు. అబాకస్ జిల్లా స్థాయి పోటీలు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అబాకస్, వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలను ఆదివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 పాఠశాలల నుంచి 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చాటిన 36 మందిని విజేతలుగా ఎంపిక చేశామని జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని విశ్వం ఎడ్యుటెక్ ప్రతినిధి వినాయక్ తెలిపారు. విజేతలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ బాలాజీరావు, ప్రతినిధులు పాల్గొన్నారు. బ్లూబెల్స్ విద్యార్థుల ప్రతిభ పిట్లం(జుక్కల్) జిల్లా కేంద్రంలో ఆదివారం విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో పిట్లం బ్లూబెల్స్ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ సంజీవరెడ్డి.. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. బిచ్కుంద నుంచి.. బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని సద్గురు బండాయప్ప స్వామి స్కూల్ విద్యార్థులు విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ మేనేజ్మెంట్ ఇన్చార్జి సంతోష్ అప్ప తెలిపారు. జూనియర్, సీనియర్ చాంపియన్‌కు అభిశ్రీ , అంజలి ఎంపికయ్యారని అన్నారు. -
నిర్లక్ష్యం నీడన అతిథి గృహం
నిజాంసాగర్(జుక్కల్): ప్రజాప్రతినిధులు, అధికారుల విడిది కోసం రూ.కోటి వెచ్చించి నిర్మించిన అతిథి గృహం నిరుపయోగంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే రెండేళ్లుగా నిరుపయోగంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజాంసాగర్ మండల కేంద్రంలో గెస్ట్ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. రెండేళ్ల కిందట గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. అయితే నాటి నుంచి భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం లేదు. ఫర్నిచర్ ఇతర సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించలేదు. భవన సముదాయం ఆవరణలో బోరుబావి తవ్వి, మోటార్‌ను ఏర్పాటు చేయగా, స్థానిక కాలనీవాసులు వాడుకుంటున్నారు. ● నిరుపయోగంగా మారి రెండేళ్లు ● పట్టించుకోని అధికారులు -
మోడు వారిన పల్లె ప్రకృతి వనం
● ఎండిపోయిన చెట్లు.. కరువైన ఆహ్లాదం ● పట్టించుకోని అధికారులురాజంపేట(భిక్కనూరు): ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో సర్కారు లక్ష్యం నీరుగారిపోతోంది. రాజంపేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయానికి కూత వేటు దూరంలో పల్లె ప్రకృతి వనం ఉంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి అంతటా పచ్చదనంతో కళకళ లాడుతుండగా.. ఈ ప్రకృతివనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పట్టించుకునేవారు లేక కొన్ని మొక్క లు, చెట్లు ఎండిపోగా.. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మరికొన్ని కాలిపోయాయి. అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి ఆహ్లాదక ర వాతావరణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలి
బాన్సువాడ : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ స త్తా చాటాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి సూ చించారు. ఆదివారం బాన్సువాడలోని శ్రీనివాస గా ర్డెన్లో పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుదారులు ఏడుగురు సర్పంచులుగా, ఆరుగురు ఉపసర్పంచులు గా, 29 మంది వార్డు సభ్యులుగా గెలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించి, పార్టీని మరింత పటిష్టం చేయాలని శ్రేణులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం రాజులు, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చీదరి సాయిలు, కార్యదర్శి శంకర్‌గౌడ్, నాయకులు గంగారెడ్డి, శ్రీనివాస్, హన్మండ్లు యాదవ్, లక్ష్మీనారాయణ, మక్కన్న, సాయిలు, చిరంజీవి, ఉమేష్, సర్పంచ్‌లు హన్మండ్లు, రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
మాక్లూర్: మండలంలోని చిన్నాపూర్ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. చిన్నాపూర్ గ్రామానికి చెందిన ఆర్మూర్ స్నేహ (24)అనే వివాహిత కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈక్రమంలో ఆమె జీవితంపై విరక్తి చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్థానికులు గమనించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే భర్త ఘటన స్థలానికి చేరుకొని, అపస్మారక స్థితిలో ఉన్న భార్యను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి భర్త సుమన్, మూడేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలోగల ఎర్రకుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామంలోని చెరువులో ఆదివారం వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడు 5అడుగుల 4 అంగులాల ఎత్తు ఉన్నాడని, తెలుపునలుపు వెంట్రుకలు ఉన్నాయని, నలుపురంగు ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
లోక్ అదాలత్‌కు భారీ స్పందన
● 3,215 కేసులను పరిష్కరించాం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్కామారెడ్డి టౌన్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లాలో ఆరు బెంచీలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆయా కేసులకు ఇరువర్గాలతో మాట్లాడి పరిష్కారం చూపామన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించిన కేసులు తుది తీర్పుగా పరిగణిస్తామని, పై అప్పిల్ ఉండదని పేర్కొన్నారు. ఇరు పక్షాలకు సంతృప్తికరమైన పరిష్కారం లభించడం వల్ల సంబంధాలు చెడిపోకుండా సమాజ శాంతి కాపాడబడుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 3,215 కేసులను పరిష్కరించామని పేర్కొన్నారు. ఇందులో 3,122 క్రిమినల్ కేసులు, 11 సివిల్, 14 ఎంఏసీటీ, 68 ప్రి లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు. బాధితులకు పరిహారం కింద రూ. 94.25 లక్షలు అందించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు సుమలత, దీక్ష, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్, కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్లో యూరియా బుకింగ్!
యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కృత్రిమ కొరతను నివారించేందుకు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే యాసంగి సీజన్లో యూరియా అందించనుంది. – నాగిరెడ్డిపేట● నేటినుంచి అందుబాటులోకి ‘ఫెర్టిలైజర్’ యాప్ ● యూరియా కృత్రిమ కొరతను నివారించేందుకు చర్యలుజిల్లాలో గత సీజన్లో యూరియా కొరత ఏర్పడింది. సరిపడా సరఫరా కాకపోవడంతో బస్తా ఎరువుకోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. వ్యాపారులు యూరియా బస్తాలను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, రైతులు విచ్చలవిడిగా వాడుతుండడం వంటి కారణాలతో దాదాపు ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ప్రవేశపెడుతుంది. ఈ యాప్ ద్వారా రైతులు యూరియాను తమ మొబైల్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. నాన్ పైలట్ జిల్లాగా ఎంపికై న కామారెడ్డిలో సోమవారం నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఆన్లైన్ బుకింగ్ సౌలభ్యం వల్ల యూరియా పంపిణీలో పారదర్శకత పెరగడంతోపాటు కొరత ఏర్పడకుండా ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అలాగే డీలర్ వద్ద ఎంత యూరియా నిల్వ ఉందనే విషయం కూడా స్పష్టంగా తెలియనుంది. దీంతోపాటు రైతులకు గంటల తరబడి పడికాపులు కాసే అవస్థ తప్పుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఈ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా రైతులు 4.04 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గతంలో రైతులు తాను వేసిన పంటసాగుకు అవసరమైన యూరియా మొత్తాన్ని ఒకేసారి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం యాప్ ద్వారా రైతు విడతలవారీగా మాత్రమే యూరియాను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎకరా భూమి ఉన్న రైతుకు 3 బస్తాల యూరియాను ఒకే విడతలో, ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతుకు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాలలోపు భూమి ఉన్న రైతు మూడు విడతల్లో, 20 ఎకరాలపైన భూమి ఉన్న రైతు నాలుగు విడతల్లో యూరియాను బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో సంబంధిత రైతు తనకున్న సాగుభూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్ నంబర్‌ను నమోదు చేస్తేనే యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్‌లో ప ట్టా పాస్‌బుక్ నంబర్‌ను నమోదు చేయగానే పాస్బుక్కు లింకై ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వ స్తుంది. ఓటీపీని యాప్‌లో ఎంట్రీ చేయగానే మండలంలో ఏ డీలర్ వద్ద ఎంత యూరియా నిల్వ ఉందనే వివరాలతోపాటు సదరు రైతుకు ఉన్న భూమి విస్తీర్ణం, సాగుచేస్తున్న పంట వివరాలు కనిపిస్తాయి. దీంతో రైతు తనకు అనువుగా ఉన్న డీలర్ వద్ద యూరియాను బుక్ చేసుకోవచ్చు. కాగా ముందుగా బుక్ చేసిన యూరియాను రైతు తీసుకోకపోతే 24 గంటల్లో బుకింగ్ రద్దయి రైతు బుక్ చేసిన యూరియా బస్తాలు తిరిగి ఓపెనింగ్ బ్యాలెన్స్‌లోకి వెళ్లిపోతాయి.గత సీజన్లో యూరియా కోసం రైతులు అక్కడక్కడ ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మొబైల్ యాప్‌ను తీసుకువచ్చింది. సోమవారంనుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. కొత్త విధానంలో యూరియా పక్కదారి పట్టే అవకాశాలు ఉండవు. – సాయికిరణ్, ఏవో, నాగిరెడ్డిపేట -
నేటితో ప్రత్యేక పాలనకు తెర
● బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్‌లు ● సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేకాధికారుల పాలన మోర్తాడ్(బాల్కొండ): సుదీర్ఘకాలం సాగిన ప్రత్యేకాధికారుల పాలనకు సోమవారంతో తెరపడనుంది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు, వా ర్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి సుమారు 22 నెలల 20 రోజులపాటు ప్ర త్యేకాధికారుల నేతృత్వంలో పంచాయతీల ఆలనా పాలన సాగింది. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మూడు విడతల్లో పంచా యతీ ఎన్నికలను నిర్వహించినా అన్ని గ్రామాలలో ఒకేరోజు పదవీ బాధ్యతలను అప్పగించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇన్నాళ్లూ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించిన వారి నుంచి నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నా రు. నేటి నుంచి ఐదేళ్లపాటు కొత్తగా ఎంపికై న స ర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవిలో కొనసాగనున్నారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్‌పై సందేహాలు.. పంచాయతీరాజ్ నిబంధనలను గత ప్రభుత్వం స డలించగా, వాటిని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పె ట్టింది. దీంతో కొత్తగా ఎంపికై న ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెల కొంది. ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్ ఉంటుందనే ఆశ తో ఆ పదవిని దక్కించుకోవడానికి చాలా మంది పోటీపడి పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రభు త్వం నిబంధనలను మార్చితే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయంలో కొత్త మార్గదర్శకాలు వస్తేనే మార్పులకు అవకాశం ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. -
భార్యను హతమార్చిన భర్త
● పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు ● ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు రెంజల్(బోధన్): భార్యను హత్య చేసిన భర్త నేరుగా వచ్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. గ్రామస్తులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా.. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మల్లుగారి బస్వారెడ్డికి భార్య రుక్మిణి(54), ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు భార్గవ్‌రెడ్డికి వివాహం కాగా, గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్నకుమారుడు హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. బస్వారెడ్డికి మానసిక పరిస్థితి బాగోలేదు. గతంలో ఇంటి నుంచి వెళ్లి, కొన్ని రోజులకు తిరిగివచ్చాడు. ఇటీవల అతడు ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగురోజుల కిందటే ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం అతడు తన భార్య రుక్మిణిని వ్యవసాయ పావుడతో తలపై తీవ్రంగా చితకబాదడంతో ఆమెకు అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే బస్వారెడ్డి రెంజల్‌లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేంతవరకు ఇంట్లోని వారికి కూడా హత్య విషయం తెలియలేదు. ఇంటి ముందు ఆటలాడుకుంటున్న పిల్లలు గుర్తించి చుట్టుపక్కల వారికి వివరించారు. బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్లు గ్రామానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కుమారుడు భార్గవ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని బోధన్‌లోని జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
బంగారు దుకాణాల్లో భారీ చోరీ
● 16 కిలోల వెండి, 34 తులాల బంగారం.. ● రూ.లక్ష నగదు అపహరణ ● బోధన్ పట్టణంలో ఘటనబోధన్: పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న రెండు బంగారు దుకాణాల్లో దుండగు లు భారీ చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం అర్ధరాత్రి వేళ సీసీ కెమెరాలను పక్కకు మళ్లించి రెండు దుకాణాల షట్టర్ల తాళాలు పగులగొట్టారు. ప్రగతి బంగారు, వెండి దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు నాలుగు తులాల బంగారం, 6 కిలోల వెండి, రూ.20 వేల నగదు, శివ బంగారు దుకాణంలో నుంచి 30 తు లాల బంగారం, 10 కిలోల వెండి, రూ.80 వేల నగదు దోచుకెళ్లారు. దుకాణాల యజమానులు ఆదివారం ఉద యం పోలీసులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీములతో పోలీసులు విచారణ చేపట్టారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు ధరించిన నలుగురు దుండగుల కదలికలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బాధితుల ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వం
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను పూర్తిగా విస్మరిస్తోందని విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిప్ప దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పెన్షన్ పెంపు, ఉచిత రవాణా సౌకర్యం, ఉద్యోగాల భర్తీ తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఈశ్వర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శంకర్ ఆత్మ కథనం ‘కుంచె గీసిన బతుకు చిత్రం’ పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ, సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, తెరసం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని సాహితీ అభిమానులు విజయవంతం చేయాలని తెరసం ప్రతినిధులు కోరారు. భిక్కనూరు: వరంగల్‌లో జరుగనున్న ఏబీవీపీ సమ్మేళనానికి వెళ్తున్న విద్యార్థుల వాహనాలను సౌత్ క్యాంపస్ వద్ద శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పచ్చజెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు జాతీయభావంతో మెలగాలని, ఉన్నతంగా చదివి విశ్వవిద్యాలయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకరావాలని సూచించారు. జిల్లా సంఘటన బాధ్యుడు హర్షవర్దన్, ఏబీవీపీ నేతలు అనిల్‌రెడ్డి, స్వామి, శివ, డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్, ప్రతినిధి నరేందర్ ఉన్నారు. కామారెడ్డి అర్బన్: ఉద్యోగ విరమణ పొందిన వెంటనే రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఏక మొత్తంలో చెల్లించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈనెల 24న కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ విషయమై స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రెడ్డి, విజయరామరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 22న గురుకుల ప్రవేశ పరీక్ష మోపాల్(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2026ను ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు డీసీవో విజయలలిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకులాల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులకు 2026 జనవరి 21 చివరి తేదీ అని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫారాలు, క్రీడా సామగ్రితోపాటు ఐఐటీ, నీట్, సీయూ, ఈటీ వంటి జాతీయస్థాయి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, మెరిట్, రిజర్వేషన్ నిబంధన ప్రకారం ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయలలిత కోరారు. -
చదువుతోనే బంగారు భవిష్యత్తు
నిజాంసాగర్(జుక్కల్):/ భిక్కనూరు/ పిట్లం/ పెద్దకొడప్గల్/మాచారెడ్డి /లింగంపేట: చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని పిల్లల చదువులకు తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని అచ్చంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లాల్‌సింగ్ అన్నారు. శనివారం మండలంలోని అచ్చంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్య అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. పాఠశాలలో టీచర్లు చెప్పిన బోధన తీరును తల్లిదండ్రులు పిల్లలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో హెచ్ఎం ప్రసూనదేవి మాట్లాడారు. పిట్లం, పెద్దకొడప్గల్, మాచారెడ్డి, లింగంపేట మండలాల్లోని పలు పాఠశాలల్లో ఫుడ్ పేరెంట్స్ డే నిర్వహించారు. ఈఫుడ్ పెస్టివల్ సందర్భంగా తల్లిదండ్రులు వివిధ రకాల వంటకాలను తయారు చేసి తీసుకొచ్చారు. -
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
బాన్సువాడ : బాన్సువాడ కోర్టులో ఆదివారం నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు అన్నారు. శనివారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో వారు మాట్లాడు తూ కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. రాజీపడటానికి ఇరుపక్షాల వారికి సదావకాశమన్నారు. సమావేశంలో వలంటీర్లు రామకృష్ణరెడ్డి, అయ్యాల సంతోష్, అహ్మద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వినియోగించిన బ్యాలెట్ బాక్స్‌లను అధికారులు మండల పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్‌బాక్స్‌లను గ్రామాల నుంచి తీసుకొచ్చి మండల పరిషత్ కార్యాలయంలోని ఓ గదిలో భద్రపర్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని ప్రత్యేకవాహనంలో జిల్లా కేంద్రానికి తరలించారు. జాతీయస్థాయి శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు కామారెడ్డి టౌన్: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ నూతన విద్యా విధానం శిక్షణ తరగతులకు జిల్లాకు చెందిన బానాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రవికుమార్ హాజరయ్యారు. రాష్ట్ర నుంచి కేవలం ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే హాజరయ్యామని, 20 రోజులపాటు శిక్షణ పొందిన తమకు ధ్రువపత్రాలు అందజేశారని రవికుమార్ తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు వివరిస్తామన్నారు. భిక్కనూరు: సీనియర్ విద్యార్థులు జూనియర్లతో స్నేహ పూర్వకంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని తెలంగాణ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి అన్నారు. సౌత్‌క్యాంపస్‌లో శనివారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్, విద్యార్థుల పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి జీవితం అమూల్యమైనదని దానిని సక్రమైన మార్గంలో ఉపయోగించుకుంటే భవిష్యత్ బంగారుమయం అవుతుందన్నారు. అధ్యాపకులతో గౌరవభావంతో మెలగాలని అన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య సత్ససంబంధాలు ఉన్నప్పుడే యునివర్సిటీ అభివృద్ధి చెందడంతోపాటు విద్యార్థుల విజయాలు సాధ్యమవుతాయన్నారు. సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు అంజయ్య, హరిత, హాస్టల్ వార్డెన్ సునీత, ఏపీఆర్వో పిట్ల సునీత తదితరులు పాల్గొన్నారు. -
పెరగనున్న సహకార సంఘాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు ఆరునెలల్లోగా మరికొన్ని సంస్కరణలు చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంక్) పరిధిలో మరికొన్ని సహకార సంఘాలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 142 సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి తోడుగా మరో 8 సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంగా కొత్త సొసైటీని, కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంగా మరో కొత్త సొసైటీని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించారు. కాగా, ఐలాపూర్ సొసైటీ పరిధిలో నందిపేట ఉంది. మాక్లూర్ మండలంలో మరో రెండు సహకార సంఘాలు, మోపాల్ మండలంలో మరో సహకార సంఘంతోపాటు ఉమ్మడి జిల్లాలో మరో మూడు సొసైటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, మానాల సొసైటీ గతంలోనే కరీంనగర్ డీసీసీబీ పరిధిలోకి వెళ్లడం గమనార్హం. ఇక ఉమ్మడి జిల్లాలోని 63 సహకార బ్యాంకుల శాఖలు ఉన్నాయి. నామినేటెడ్ విధానంలో సహకార పదవులు? డీసీసీబీ, సహకార సంఘాల పాలకవర్గాల పదవులను సైతం మార్కెట్ కమిటీ పాలకవర్గాల పదవుల మాదిరిగా నామినేటెడ్ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులకు పదవుల పంపకంలో కలిసివస్తుందని కీలక నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా డీసీసీబీలను కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తారని పలువురు భావిస్తున్నప్పటికీ ఆర్బీఐ మాత్రం ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాల్లోనే కొనసాగనున్నాయి. బ్యాంకు టర్నోవర్ విషయంలో తక్కువగా ఉండొద్దనే నిబంధన మేరకు ఆర్బీఐ ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోంది. టర్నోవర్ పెంచాం.. 22 నెలలపాటు డీసీసీబీ చైర్మన్‌గా సేవలు అందించాను. ఈ కాలంలో రూ.1,400 కోట్ల టర్నోవర్ పెంచాం. బాధ్యతలు తీసుకునే సమయంలో రూ.1,300 కోట్లు ఉన్న టర్నోవర్‌ను రూ.2,700 కోట్లకు పెంచాం. డిపాజిట్లు భారీగా పెరగడంతోపాటు రుణాలు సైతం ఎక్కువగా ఇచ్చాం. 2023–24లో ఎన్పీఏ 15 శాతం ఉండగా, ప్రస్తుతం దాన్ని 5 శాతానికి తగ్గించాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎన్పీఏ 10 శాతం లోపు మాత్రమే ఉండాలి. 2023–24లో రూ.2 కోట్ల నష్టం ఉండగా, దీన్ని అధిగమించి 2024–25లో రూ.21 కోట్ల లాభం సాధించాం. 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.20 కోట్ల లాభాలు సాధించాం. ఇది మంచి అచీవ్‌మెంట్‌గా నిలిచింది. – కుంట రమేశ్‌రెడ్డి, డీసీసీబీ తాజా మాజీ చైర్మన్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా 8 సొసైటీల ఏర్పాటుకు అవకాశం నందిపేట, పాల్వంచ మండల కేంద్రాల్లో ఏర్పాటుపై ఇప్పటికే నిర్ణయం సహకార సంఘాలు, డీసీసీబీ పదవులు నామినేట్ చేస్తారనే చర్చ గత 22 నెలల్లో రూ.1,300 కోట్ల నుంచి రూ.2,700 కోట్లకు పెరిగిన టర్నోవర్ -
విద్య రంగానికే ప్రాధాన్యత
● విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ● వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : నియోజకవర్గంలో విద్య రంగానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.27 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. మైనారిటీ, ఎస్టీ, ఎస్సీ గురుకుల పాఠశాలలు నెలకొల్పినట్లు ఆయన వివరించారు. ప్రతి పాఠశాలలో తరగతి గదులను నిర్మించినట్లు ఆయన అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు ఘనంగా సన్మానం.. పెన్షనర్ల దినోత్సవం పురస్కరించుకుని బాన్సువాడలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో విశ్రాంత ఉద్యోగులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. పట్టణంలో విశ్రాంత ఉద్యోగులకు తాను భవనం సమకూర్చి నిధులు మంజురు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక శ్రీనివాసగార్డెన్‌లో అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, విశ్రాంత ఉద్యోగులు పరిగె మోహాన్‌రెడ్డి, హన్మండ్లు, రఘురాం, శివరాజులు, కాశీనాథ్, వెంకటి, శ్రీనివాస్, కమ్మరి అనసూయ, వెంకటేశం తదితరులు ఉన్నారు. -
నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు
నిజాంసాగర్(జుక్కల్): వలసల నివారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టగా, కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించడం సబబు కాదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలే మల్లికార్జున్ మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరు తొలగింపు తగదని, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. -
మరింత సులభంగా యూరియా సరఫరా
● బుక్ చేసుకుంటే రైతుల ఇంటికే బస్తాలు ● అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: యూరియా సరఫరాను మరింత సు లభం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యా ప్ను ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నా రు. ఈ నెల 22వ తేదీ నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త యాప్‌పై రైతు వేదికల్లో శిక్షణ కార్యక్రమాలు ఏ ర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని వ్య వసాయ అధికారులకు సూచించారు. రైతులు దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. యాప్ ద్వారా రైతులు తమకు నచ్చిన డీలర్‌ను ఎంచుకుని ఇంటి నుంచే యూరి యాను బుక్ చేసుకునే అవకాశం కల్పించబడిందని పేర్కొన్నారు. భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసు కుని సమీప డీలర్‌తోపాటు జిల్లాలోని ఏ ఇతర అ నుకూలమైన డీలర్ వద్దనైనా యూరియాను రైతు లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. పట్టా పాస్‌పుస్తకం లేని రైతులు ఆధార్ నంబర్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను రైతులు డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఏవో మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గణిత ప్రతిభా పరీక్ష విజయవంతం
కామారెడ్డి టౌన్/తాడ్వాయి/మాచారెడ్డి/భిక్కనూరు: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య హాజరై ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ గణితం నిత్య జీవితంలో అంతర్భాగమని, ఇందులో నైపుణ్యం సాధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. సంగమేష్, కృతిక, బన్ని, హర్షిత్, రక్షిత, జగదీశ్వర్, అల్తాఫ్, లాస్య, రామ్‌చరణ్ విద్యార్థులు ఈ పరీక్షలో ప్రతిభ చాటారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియం, గురుకుల విద్యార్థుల విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో గణిత ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం మాధవి, గణిత ఫోరమ్ ప్రతినిధులు దేవరాజు, వెంకటి తదితరులు పాల్గొన్నారు. అలాగే తాడ్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితంపై టాలెంటు పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి ఎంఈవో రామస్వామి ప్రశంస పత్రాలు, బహమతులను అందజేశారు. మాచారెడ్డి మండల కేంద్రంలో విద్యార్థినీ, విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో దేవెందర్రావ్ మాట్లాడుతూ.. గణితం మనిషి జీవితంలో భాగమ ని అన్నారు.ప్రతిభ చూపిన వారికి ప్రశంస పత్రా లు, బహమతులను అందజేశారు. గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పరీక్షకు భిక్కనూరు మండలంలోని అన్ని పాఠశాలల నుంచి 30 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఏడుగురు విద్యార్థులు ప్రతిభ చూపడంతో ఎంఈవో రాజగంగారెడ్డి ప్రశంసపత్రాలను అందజేశారు. -
యువత రాజకీయాల్లోకి రావాలి
భిక్కనూరు: యువత, మేధావులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామ మొదటి వార్డు సభ్యుడిగా భారీ మెజార్టీతో గెలుపొందిన తొగరి రమేశ్‌ను ఆయన శనివారం సన్మానించారు. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినితీ అక్రమాలపై యువత కదంతోక్కాలన్నారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించడం అంటే అభినందనీయమని, ఇది రాజకీయానికి పునాది వంటిదన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రావణ్‌కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న మండలంలోని గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులను శనివారం హెడ్మాస్టర్ ఎల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యాయులు సన్మానించారు. అండర్–14 బాలుర విభాగంలో రాష్టస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న కృష్ణ, వర్షిత్, శ్రీకాంత్, నిఖిల్‌తేజ, అండర్–17 బాలికల విభాగంలో ఎంపికై న వీణ, భవాని, అండర్–17 బాలుర విభాగంలో రోహిత్, సతీష్‌కుమార్‌లను సన్మానించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు. -
క్రీడారంగం అభివృద్ధికి కృషి
కామారెడ్డి క్రైం: క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో బంగారు పతకాలు సాధించిన జిల్లాకు చెందిన క్రీడాకారులకు రూ.25 వేల చొప్పున చెక్కులను శనివారం తన చాంబర్లో కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన గోతి పరశురాం, కిన్నెర ఆనంద్, మలావత్ ఈశ్వర్ బంగారు పతకాలు సాధించి జిల్లాకు విశేష గుర్తింపు తీసుకొచ్చారన్నారు. వారు సాధించిన విజయాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. భవిష్యత్‌లో జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు అందించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్‌గౌడ్, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, కార్యదర్శి అనిల్, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధం
మద్నూర్(జుక్కల్): మండలంలో ని పెద్ద శక్కర్గాలో షార్ట్‌సర్క్యూట్‌తో కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధం అయింది. వివరాలు ఇ లా.. గ్రామానికి చెందిన జంగం శివప్ప కొన్ని రోజు ల క్రితమే కొత్తగా టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి అతడు తన ఇంటి ముందు కారును పార్క్ చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో కా రులో మంటలు అంటుకున్నాయి. వెంటనే మద్నూ ర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా, వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయిందని బాధితుడు శివప్ప వాపోయాడు. ఈ ఘటనపై పొలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. -
కాసుల కోసం కోత లు!
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీజరియన్ ద్వారా జరుగుతున్న ప్రసవాల సంఖ్య ఆందోళకలిగిస్తోంది. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ, సీజేరియన్ ప్రసవాల సంఖ్యల మధ్య వత్యాసం ధనార్జన ధ్యేయాన్ని కళ్లకు కడుతోంది. సాధారణ ప్రసవాలు చేసే అవకాశం ఉన్నా ఆవైపు ప్రయత్నాలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాసుల కోసం కోతలు పెడుతున్నారు. ప్రసవాల గణాంకాలు వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయనే విమర్శలున్నాయి. తనిఖీలు చేపట్టకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం కాన్పుల్లో 85 శాతం ఆపరేషన్లు కావడం గమనార్హం. కేవలం 15 శాతం మాత్రమే సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కానీ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ ఆస్పత్రులో మొత్తం 4775 ప్రసవాలు కాగా ఇందులో సాధారణ ప్రసవాలు 49 శాతం, సీజేరియన్లు 51శాతం ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొత్తం ప్రసవాల సంఖ్య 2737 కాగా ఇందులో సాధారణ ప్రసవాలు కేవలం 15 శాతం ఉండగా, సిజేరియన్లు 85 శాతం ఉన్నాయి. చర్యలు తీసుకోరు.. అవగాహన కల్పించరు.. జిల్లాలో ఇంత జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆడిటింగ్ నిర్వహించడంతోపాటు అనవసరంగా సిజేరియన్లు చేసే వైద్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు సంబంధితశాఖ సరైన అవగాహన కల్పించడం లేదని అంటున్నారు. సాధారణ కాన్పుకు అవకాశం ఉన్నా కొందరు గర్భిణులు వారి కుటుంబ సభ్యులు ముహూర్తాలు చూసుకుంటూ సీజేరియన్ల వైపు వెళ్తున్నారు. 15శాతం మాత్రమే సాధారణ కాన్పులు 85 శాతం సీజేరియన్లు విస్తుగొలుపుతున్న కాన్పుల గణాంకాలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం ప్రభుత్వ సూచనలు బేఖాతరు పట్టింపు లేనట్టుగా వైద్యారోగ్యశాఖప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణులకు సాధరణ కాన్పు చేసేందుకు ప్రయత్నించాలి. మొదటి కాన్పు మాత్రం తప్పకుండా సాధారణమే చేయాలి. తప్పని పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. అవసరం లేకున్నా సిజేరియన్ చేస్తే చర్యలు తీసుకుంటాం. గర్భిణులు సైతం సాధారణ కాన్పువైపే మొగ్గు చూపాలి. సీజేరియన్ చేసుకుంటే భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. – డాక్టర్ విద్య, డీఎంహెచ్‌వో -
భరోసా ఉన్నట్టా? లేనట్టా?
కామారెడ్డి క్రైం: యాసంగి పనులు ప్రారంభమై పంటలు సాగు లోకి వచ్చినా, డిసెంబర్ ముగిసేందుకు వస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములను గుర్తించి పంటలు వేసిన వాటికి మాత్ర మే భరోసా ఇస్తామని ఇటీవల వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఓ సందర్భంలో అన్నారు. ఈమేరకు అధికారులకు సూచనలు కూడా ఇచ్చారు. కానీ ఎలక్షన్ కోడ్ కారణంగా పనులు ఆగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పరిషత్, మున్నిపల్ ఎన్నికలకు వెళ్తే మళ్లీ ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుందని, తమకు ‘భరోసా’ లేకుండా పోతుందని రైతులు అంటున్నారు. పంట సాగు పెట్టుబడుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శాటిలైట్ సర్వే ఎప్పుడు చేస్తారో, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో తెలియక రైతులు నిరాశకు లోనవుతున్నారు. భరోసా సాయం సకాలంలో అందని పక్షంలో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పేట్టు లేదని అంటున్నారు. పంటలు వేసిన భూములకే భరోసా గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకుని అమలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.10 వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వా త మొదటగా యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేశారు. ఆ తర్వాత వానాకాలం నుంచి ఎకరానికి రూ.15 వేల చొప్పున అందజేస్తామన్నారు. రైతుబంధులో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకం పేరును రైతు భరోసాగా మార్చడంతోపాటు అనేక మార్పులు తీసుకువచ్చింది. రోడ్లు, గుట్టలు సాగు యోగ్యంగా లేని భూములు, వెంచర్లుగా మారిన భూములను గుర్తించి పథకంలో నుంచి తప్పించారు. గత యాసంగిలో 5 ఎకరాలలోపు భూములకే రైతుబంధు నిధులు జమయ్యాయి. ఈ సారి ఇంకా రైతు భరోసా ఊసే లేదు. సాగవుతున్న భూములను శాటిలైట్ ద్వారా గుర్తించి సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో యాసంగి పెట్టుబడి సాయం మరింత ఆలస్యం కావొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 3,28,231 మంది రైతులు గత ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు విడతల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఎన్నికల హామీ ప్రకారం గత యాసంగి నుంచి కాంగ్రేస్ ప్రభుత్వం సీజన్‌కు ఎకరానికి రూ.7.5 వేలు ఇవ్వాల్సి ఉండగా నిధుల కొరత కారణంగా గత యాసంగి నుంచి పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.6 వేలకు మాత్రమే పెంచింది. కామారెడ్డి జిల్లాలో తాజా లెక్కల ప్రకారం మొత్తం 3,28,231 మంది రైతులున్నారు. వారందరికీ పెట్టుబడి సాయం అందించాలంటే రూ.314 కోట్లు అవసరం ఉన్నాయి. హెచ్ఎం నరహరితో ఆనందం పంచుకుంటూ.. రిజిస్టర్లో తన పేరు చూసుకుంటున్న పోచారంసిజేరియన్లకే మొగ్గు..సాధారణ కాన్పులు చేయాలని సాధ్యం కానిపక్షంలోనే సీజరియన్ చేయాలని ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తున్నా ప్రైవేట్ ఆస్పత్రులు పట్టించుకోవడం లేదు. సాధారణ ప్రసవం అయితే ఒక రోజు మాత్రమే అడ్మిట్ చేసుకుని సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు బిల్లు వసూలు చేస్తున్నారు. అదే సీజరియన్ చేస్తే వారంపాటు అడ్మిట్ చేసుకుని సుమారు రూ.50 వేల నుంచి రూ.80 వేలకు పైగా బిల్లు వసూలు చేస్తున్నారు. అన్ని చార్జీలతో భారీ మొత్తంలో వసూలు చేసే అవకాశం ఉండడంతో సిజేరియన్లకే ప్రైవేట్ ఆస్పత్రులు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే సాగులోకి వచ్చిన యాసంగి పంటలు శాటిలైట్ సర్వేతో సాగవుతున్న భూములకే ఇస్తామంటున్న ప్రభుత్వం పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్న రైతులు -
తాడ్వాయిలో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బాజన్నోల స్వామి(52) అనే వ్యక్తి చాకలి వృత్తితోపాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. కాగా తన కుమారుడైన నవీన్ 45 రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం నవీన్ తన తల్లి రాజమణి, తండ్రి స్వామి, మొదటి భార్య నవనీతతో తరచుగా గొడవలు పడుతుండేవాడు. కాగా ఈనెల 18న నవీన్ తన ఇంటికి వచ్చి తన రెండో భార్య రమ్యతో కలసి ఉండాలని తల్లికి చెప్పగా, ఆమె నిరాకరించింది. దీంతో నవీన్ తన తండ్రి స్వామిపై దాడి చేశాడు. దీంతో స్వామి జీవితంపై విరక్తి చెంది ఈనెల 19న రాత్రి తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న స్వామిని కుటుంబసభ్యులు గుర్తించి చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి అతడు మృతి చెందాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. -
‘మీ డబ్బు, మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: ‘మీ డబ్బు, మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన, సేవల శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్మెంట్ కోసం కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘మీ డబ్బు మీ హక్కు‘ అనే నినాదంతో జరుగుతున్న ఈ ప్రచారం ద్వారా, పౌరులు తమకు చెందాల్సిన క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు తదితర ఆర్థిక ఆస్తులను క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందని వెల్లడించారు. ఆర్థిక ఆస్తులపై హక్కు కలిగిన వారు అవసరమైన పత్రాలతో సంబంధిత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించాలన్నారు. అనంతరం శిబిరంలో పాల్గొన్న సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించా యి. ఈ సందర్భంగా నిజమైన హక్కుదారులకు సెటిల్మెంట్ లెటర్లు సైతం జారీ చేశారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం ప్రవీణ్‌కుమార్,ఆయా బ్యాంకుల ప్రతినిధులు అనుపమ, మనీష్ సైనీ, వ రప్రసాద్, ఎల్డీఎం చంద్రశేఖర్ తదితరులు న్నారు. రహదారుల భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి కామారెడ్డి క్రైం: ఈ నెల 22 నుంచి నిర్వహించనున్న జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాలు – 2026ను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా మాట్లాడి భద్రత మాసోత్సవాలపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. రోడ్డు భద్రతను మెరుగుపర్చడం, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియమాల అమలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, తక్షణ సవరణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి నెల 4న రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. -
కామారెడ్డిలో విపత్తుల మాక్ డ్రిల్
● రేపు, ఎల్లుండి సైతం.. ● పాల్గొన్న వివిధ శాఖల అధికారులు కామారెడ్డి అర్బన్: పట్టణంలోని జీఆర్ కాలనీలో, పెద్ద చెరువు వాగు పరిసరాల్లో శనివారం ఉదయం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, ఆయా విభాగాల సేఫ్టీ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక, అత్యవసర సేవలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ శాఖాధికారులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. మాక్ డ్రిల్‌తో విపత్తుల సమయంలో ఎదురయ్యే లోపాలను గుర్తించి విపత్తుల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని అధికారులు వివరించారు. మాక్ డ్రిల్ అనంతరం సమీక్ష నిర్వహించారు. కాగా ఆది, సోమవారాల్లోనూ విపత్తుల మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్టు అగ్నిమాపక, అత్యవసర సేవలశాఖ జిల్లా అధికారి ఆర్.సుధాకర్ తెలిపారు. -
ప్రజలకు సేవ చేయాలి
● బీజేపీ జిల్లా ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి ● పలువురు సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సన్మానంలింగంపేట : పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలు ప్రజలకు మరింత సేవ చేయాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి పట్లోళ్ల విక్రమ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం లింగంపేటలోని జీఎన్ఆర్ గార్డెన్లో బీజేపీ నుంచి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులుగా గెలిచిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలన, ప్రజలకు సేవ అందించాలని సూచించారు. కార్యకర్తలు మరింత శ్రమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి చెందినవారు 21 మంది సర్పంచ్‌లుగా, 18 మంది ఉపసర్పంచ్‌లుగా, 102 మంది వార్డు సభ్యులుగా విజయం సాధించారని ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి తెలిపారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ బీజేపీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. గెలుపు, ఓటములు సహజమని, ఓడినవారు నిరాశ చెందవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు రామ్‌రెడ్డి, బాపురెడ్డి, రాజమోహన్‌రెడ్డి, రవీందర్రావు, లింగారావు, మహారాజుల మురళి, దత్తురాం, రాంచంద్రం, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
బాన్సువాడ: పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్ గ్రామా నికి చెందిన కస్తూరి సంగమేశ్వర్ (36) మహమ్మద్‌నగర్‌లోని యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సంగమేశ్వర్ మొగులాన్పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు. తన భర్త కొంత కాలంగా పని ఒత్తిడితో మానసిన ఆందోళనకు గురవుతున్నారని, పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సీఐ శ్రీధర్ తెలిపారు.పెద్దకొడప్గల్(జుక్కల్): విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పూరి మోహిని(24) అనే మహిళ శుక్రవారం ఉదయం ఉతికిన బట్టలను తన ఇంటి పై భాగంలో ఉన్న ఇనుప సలాకాలకు ఆరేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి గిరి ఉషాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఆటోలో తీసుకొచ్చిన బియ్యం ఓ రైస్ మిల్‌లోకి తీసుకెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేసి ఎనిమిది క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శశికాంత్ రెడ్డి, సిబ్బంది మహేశ్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగడంతో 10.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
● రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్సుభాష్నగర్: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహపడొద్దని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. నగరంలోని నాగారంలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో జోష్–2025 పేరుతో మూడు రోజులపాటు నిర్వహించే క్రీడా పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మార్చ్ఫాస్ట్ చేయగా ముఖ్యఅతిథులు గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. అనంతరం తాహెర్ మాట్లాడుతూ.. మానసిక ఒత్తిళ్లను అధిగమిస్తూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు నిత్యం క్రీడల్లో శిక్షణనిస్తూ ప్రోత్సహించాలని పేర్కొన్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కార్యచరణ రూపొందించారని అన్నారు. పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మైనారిటీ స్కూల్స్ ఆర్సీవో మహ్మద్ అబ్దుల్ బాసిద్, ప్రిన్సిపాళ్లు సూర్యకాంత్‌రెడ్డి, డాక్టర్ సయ్యద్ హమీద్, శోభన్ బాబు, నిషార్ ఫాతిమా, గంగాధర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ హరోన్ ఖాన్, కాంగ్రెస్ నాయకుడు ఎజాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్చరీలోనూ ఐపీఎల్ నిర్వహిస్తాం
● జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ముండాదోమకొండ: క్రికెట్‌లా ఆర్చరీలోనూ ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ మాజీ జాతీయ అధ్యక్షుడు, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా తెలిపారు. శుక్రవారం ఆయన దోమకొండ గడికోటను సందర్శించారు. కోటలోని అద్దాలమేడ, మహరాణి మందిరం, వెంకటపతి భవన్, మహదేవుని ఆలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడికోట వారసుడు, జాతీయ అర్చరీ డైరెక్టర్ కామినేని అనిల్‌కుమార్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానన్నారు. కోచ్ ప్రతాప్‌దాస్ కృషి వల్ల మారుమూల ప్రాంతంనుంచి 14 ఏళ్లలో 50 మంది ఆర్చరీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారన్నారు. కోచ్‌ను అభినందించారు. సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్ తదితరులు అర్జున్ ముండాను సన్మానించారు. భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, దోమకొండ ఎస్సై ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జాతీయ ఆర్చరీ కమిటీ ఉపాధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి, కోశాధికారి జోరిస్పాల్, ప్రతినిధులు సుమంత్ మహతి, అరవింద్, ఆర్చరీ ఒలింపిక్ చాంపియన్ డోలా బెనర్జీ, జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు తిర్మల్ గౌడ్ తదితరులున్నారు. -
22న విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్
● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ● విజయవంతంగా నిర్వహిస్తాం : కలెక్టర్ సంగ్వాన్కామారెడ్డి క్రైం : ముందస్తు అప్రమత్తత ద్వారా విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణలో భాగంగా అన్ని జిల్లా లలో ఈనెల 22 న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాక్ డ్రిల్ ఏర్పాట్లపై సమీక్షించారు. పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 22 న విపత్తు నిర్వహణపై మాక్‌డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. విపత్తుల సమయంలో రక్షణ పొందేలా ప్రజలకు ఇప్పటికే గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వర్షాకాలంలో జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించాయని, ముందస్తు అప్రమత్తత, స్పష్టమైన ప్రణాళికలు, విపత్తుల అంచనా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయ చర్యలు, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతో భారీ నష్టాలు కలుగకుండా చూడగలిగామని వివరించారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి నష్టాలు కలుగకుండా సిద్ధంగా ఉన్నామన్నారు. మాక్‌డ్రిల్‌ను కామారెడ్డిలోని జీఆర్ కాలనీ, కామారెడ్డి పెద్ద చెరువు వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమలు, అగ్నిమాపక, పశుసంవర్ధక, సాగునీటి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్‌కు సన్మానంకామారెడ్డి అర్బన్ : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను టీఎన్జీవోస్ ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వివిధ శాఖల ఉద్యోగుల కృషి వల్ల ఎన్నికలు విజయవంతం అయ్యాయన్నారు. -
ఉన్నత లక్ష్యాలతో పౌరులుగా ఎదగాలి
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణిదోమకొండ: విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని, కష్టపడి చదివి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని, ప్రతి బాలిక సురక్షిత వాతావరణంలో విద్యను అభ్యసించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. శుక్రవారం అంబారిపేట గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల హక్కులు, పోక్సో చట్టం, బాల్యవివాహ నిషేధ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టాలు తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. లీగల్ ఎయిడ్ హెల్ప్‌లైన్‌కు ఏ సమస్య ఉన్నా 15100కు కాల్ చేయవచ్చని అన్నారు. ఎంఈవో విజయ్‌కుమార్, గ్రామ సర్పంచ్ కవిత అనిల్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
పాతికేళ్ల అజ్ఞాత జీవితానికి వీడ్కోలు!
పోలీసులకు లొంగిపోయిన ఎర్రగొల్ల రవిసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రెండున్నర దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలిశాడు. పాతికేళ్ల ఉద్యమ ప్రస్థానానికి వీడ్కోలు పలికి శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట తన సహచరులతో కలిసి లొంగిపోయాడు. పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవికి 2001 లో కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్‌తో పరిచయం ఏర్పడింది. కాలేజీకి వెళ్లిన రవి అటు నుంచి అటే అడవిబాట పట్టాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి చూడలేదు. దండకారణ్యంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన రవి.. ప్రస్తుతం డివిజనల్ కమిటీ సభ్యుడి హోదాలో పనిచేస్తున్నాడు. కాగా రవి పోలీసుల అదుపులో ఉన్నాడంటూ మూడు రోజుల క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో రవి లొంగిపోయి ఇంటికి వస్తే బాగుండు అని అతడి కుటుంబ సభ్యులు ఆశించారు. అతడి రాక కోసం తండ్రి రామయ్య వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ ప్రకటించడంతో రవి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
‘సర్పంచ్ పదవి నుంచి తొలగించాలి’
కామారెడ్డి టౌన్ : రాజంపేట మండలం అన్నారం సర్పంచ్ రవీందర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేశారని, ఆయనను పదవినుంచి తప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. రవీందర్ నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడని గ్రామస్తులు ఆరోపించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: విదేశాల్లో ఉన్నత విద్య అ భ్యసించే మైనారిటీల నుంచి సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి జయరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు జనవరి 19వ తేదీ వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 80969 73346 నంబర్లో గాని కలెక్టరేట్లోని 222 గదిలోని తమ కార్యాలయంలో గాని సంప్రదించాలన్నారు. ‘గణిత ప్రతిభా పరీక్షను విజయవంతం చేయాలి’ కామారెడ్డి టౌన్ : శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లాలో నిర్వహించే మండల స్థాయి గణిత పరీక్షను విజయవంతం చేయాలని తెలంగా ణ గణిత ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాలో ని అన్ని మండల కేంద్రాలలోని ఉన్నత పాఠశాలలో పరీక్ష నిర్వహించాలని ఎంఈవోలు, హెచ్ఎంలు, గణిత ఉపాధ్యాయులను కోరా రు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామారావు, ఆర్థిక కార్యదర్శి నరేందర్, ప్రతినిధు లు సత్యం, చిరంజీవి, వెంకటి, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గణాంకాధికారికి సన్మానం కామారెడ్డి అర్బన్: జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖలో డిప్యూటీ ఎస్‌వోగా పనిచేస్తూ ఎస్‌వోగా ప్రమోషన్ పొందిన లక్ష్మణ్‌ను టీఎన్జీవోస్ ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రతినిధులు శివకుమార్, చక్రధర్, దేవరాజు పాల్గొన్నారు. ‘యూరియా బుకింగ్‌కు యాప్’ భిక్కనూరు: రైతుల సౌలభ్యం కోసం వ్యవసాయ శాఖ యూరియా బుకింగ్ మొబైల్ యాప్‌ను తీసుకువచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తిప్పాపూర్ సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో సొసైటీ, వ్యవసాయ అధికారులు, రైతులకు యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల లభ్యత వివరాలు తెలుసుకునేందుకు యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అపర్ణ, సింగిల్ విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఏఈవోలు వినోద్ కుమార్, లత, రజిత, సొసైటీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నంబర్ ప్లేట్ సక్రమంగా లేని వాహనాలపై ఫోకస్ కామారెడ్డి క్రైం: నంబర్ ప్లేట్ సక్రమంగా లే ని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పట్టణ ట్రాఫిక్ ఎస్సై మహేశ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, సిరిసిల్ల రోడ్, రా మారెడ్డి చౌరస్తా తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా, ట్యాంపరింగ్ చేసి నడు పుతున్న 10కి పైగా బైక్‌లు, ఆటోలను గుర్తించారు. చెడిపోయిన నంబర్ ప్లేట్లను తొల గించి వాటి స్థానంలో కొత్తవి వేయించారు. మరోసారి నంబర్ ప్లేట్ సక్రమంగా లేకుండా పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు. -
ఎరువుల బుకింగ్ యాప్‌పై అవగాహన
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో, కారేగావ్‌లో వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం రైతులకు ఎరువుల బుకింగ్ యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో వినోద్ మాట్లాడుతూ.. ఎరువుల సరఫరాలో రైతులకు ఇబ్బందులు తొలగించడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రైతులు తమ ఇంటి నుంచే యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఏ డీలర్ వద్ద ఎన్ని ఎరువుల బస్తాలు అందుబాటులో ఉన్నాయో ఈ యాప్ ద్వారా క్లుప్తంగా తెలుసుకోవచ్చన్నారు. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఈ యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఏఈవోలు వీణ, లావణ్య, రైతులు పాల్గొన్నారు. పుల్కల్ సొసైటీలో.. బిచ్కుంద(జుక్కల్): పుల్కల్ సొసైటీలో శుక్రవారం వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ ఎరువుల బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో అమర్ మాట్లాడుతూ.. యూరియా విషయంలో కొరత ఏర్పడకుండా అవసరం ఉన్న రైతులు మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యాప్ ప్రవేశపెట్టిందన్నారు. -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
బోధన్‌రూరల్: బోధన్ డివిజన్లోని మంజీర నది తీరంలో ఇసుక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించాలని అధికారులు షరతు విధిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఇసుక వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. తాజాగా శుక్రవారం బోధన్ మండలం కల్దుర్కిలో ఇసుక ట్రాక్టర్‌ను అతివేగంగా నడిపి ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలు బలిగొన్నారు. ఈ నెల 16 న సాలూర ఆర్ఐ ఆనంద్ మందర్న ఇసుక క్వారీలో వేబిల్లులు ఇస్తుండగా ఓ వ్యక్తి వేబిల్లుల బుక్ లాక్కొని క్వారీ నుంచి వెళ్లిపోవాలని దౌర్జన్యానికి దిగాడు. దీంతో సదరు ఆర్ఐ బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. నియంత్రణలో విఫలం.. బోధన్ డివిజన్లోని ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు పనుల కోసం సాలూర, బోధన్ మండల పరిధిలోని మంజీర నదిలో ఇసుక తవ్వకానికి రెవెన్యూ అధికారులు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయితే, ఇసుక ఎక్కువ ట్రిప్పులు తరలించాలనే ధ్యాసతో వాహనాల డ్రైవర్లు అతివేగంగా నడుపుతున్నారు. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరోవైపు మైనర్లు సైతం ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనుమతిలేని ప్రాంతాలకు తరలింపు.. ఇసుక అనుమతులు తీసుకున్న చోటుకు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. మరికొంతమంది వ్యాపారులు అనుమతుల పేరిట ఇసుకను ప్రభుత్వ క్వారీల నుంచి తీసుకొచ్చి డంప్ చేసుకుంటున్నారు. మంజీర తీర గ్రామానికి చెందిన ఓ ఇసుక వ్యాపారి పట్టణ శివారులోని ఆచన్‌పల్లి సమీపాన పాండుఫారం రోడ్డులో నిత్యం ఇసుక డంప్ చేసుకొని, రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయమై స్థానిక కాలనీవాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.● ఒకరి మృతి బోధన్‌రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామ శివారులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కల్దుర్కి గ్రామానికి చెందిన వట్టం రాములు(57) పని నిమిత్తం బైక్‌పై బోధన్‌కు వెళ్తుండగా వెనక నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇసుక ట్రాక్టర్ అతివేగంగా నడపడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై మశ్చేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుడి కొడుకు పవన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.మంజీర నది నుంచి ఇసుక తరలించే వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. ఇసుక వాహనాలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మైనర్లు సైతం ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్నారు. అధికారులు ప్రత్యేక బృందాలను నియమించి వాహనాల వేగానికి అడ్డుకట్ట వేయాలి. – సీహెచ్. దమ్మారెడ్డి, కల్దుర్కి, బోధన్ మండలంరాములు (ఫైల్) బోధన్ డివిజన్లో పెరిగిపోతున్న ఇసుక వ్యాపారుల ఆగడాలు అధికారులపై దాడులకు యత్నాలు.. వాహనాల అతివేగంతో ప్రమాదాలు విఫలమవుతున్న పోలీస్, రెవెన్యూ యంత్రాంగం -
బీఆర్ఎస్లో చేరికలు
భిక్కనూరు: పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ సాయగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. నాయకులు ముదాం శ్రీనివాస్, బాలరాజు, ఎర్రోళ్ల మల్లేశం, మహిపాల్, మన్నె రాకే ష్, కోడూరి రవీందర్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి అర్బన్: హైదరాబాద్‌లోని హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ సంస్థ కార్యాలయంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి ఎం.భానుమతి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లో కలెక్టర్ సంగ్వాన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శిరీష, పద్మశ్రీ, పావని, నగేష్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది గ్రామ పంచాయతీలలో కొలువుదీరనున్న నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు మండలంలోని వివిధ గ్రామాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 27 గ్రామపంచాయతీలకు రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ, ఉపాధిహామీ, విద్యాశాఖలకు సంబంధించి 27 మంది అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. అధికారులు ఈ నెల 22న నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారని ఆయన వివరించారు. దోమకొండ: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శ్రీకాంత్‌లు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీని కలిశారు. ఎన్నికల్లో ముత్యంపేట గ్రామ సర్పంచ్‌గా గెలిచిన ఆశబోయిన అక్షర భర్త శ్రీనివాస్‌తో కలిసి వారు షబ్బీర్ అలీని సన్మానించారు. సోమవారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆయనను కోరినట్లు వారు తెలిపారు. -
క్రీడలతో మానసికోల్లాసం
● ఏసీపీ శ్రీనివాస్ బోధన్‌టౌన్: క్రీడలు మానసికోల్లాసానికి దోహద పడతాయని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా స్థాయి స్పోర్ట్ మీట్–3ని ప్రారంభించారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహింగా ముఖ్య అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నాగయ్య, మైనారిటీ గురుకుల విజిలెన్స్ ఆఫీసర్ జియా హఫీజ్, పీఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు ఎంబెల్లి శంకర్, ప్రధాన కార్యదర్శులు ధన్‌రాజ్, గంగాధర్, ఎస్టీయూ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సంజీవ్, సలీం, తపస్ బాధ్యులు సలీం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినొద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కరపత్రాల ఆవిష్కరణ
సుభాష్‌నగర్: జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఉత్సవాల కరపత్రాలను కలెక్టరేట్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి నవిత, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పుప్పాల విజయ్‌కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ ఉత్సవాలు ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకు కొనసాగుతాయని అన్నారు. జిల్లాలోని వినియోగదారుల సంఘాలు, వివిధ శాఖల అధికారులు, తూనికలు కొలతలు, ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ, రోడ్డు రవాణా శాఖ, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా మొదటిసారి దేశవ్యాప్తంగా 24వ తేదీ నుంచి వినియోగదారుల భారత్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో వినియోగదారుల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇందల్వాయి: మండలంలోని డొంకల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన జక్కుల లింగం, సంజీవరెడ్డి అనే యువకులు కారులో ఇందల్వాయి నుంచి డొంకల్ గ్రామానికి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. రుద్రూర్: మండల కేంద్రంలో చైనా మంజా విక్రయిస్తే చర్యలు తప్పవని కోటగిరి ఎస్సై సునీల్ దుకాణదారులకు హెచ్చరించారు. పొతంగల్ మండల కేంద్రంలో శుక్రవారం దుకాణదారులకు నోటీసులు అందజేశారు. సూచనలకు విరుద్ధంగా ఎవరైనా చైనా మంజాను విక్రయిస్తే చట్ట ప్రకార చర్యలు తీసుకుంటామన్నారు. చైనా మంజా వాడకం వల్ల జంతువులకు, వ్యక్తులకు ప్రాణహాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
మాజీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి
● డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిబాన్సువాడ: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వగృహంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇతర పార్టీ నుంచి గెలిచిన సర్పంచులను కలుస్తున్న ఎల్లారెడ్డి మాజీ సర్పంచి ఏనుగు రవీందర్‌రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, బాన్సువాడ నియోజకవర్గంలో తిరగవద్దని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు చెప్పినా వినకుండా నియోజకవర్గంలో తిరుతున్నారని, ఏనుగు రవీందర్‌రెడ్డి ఆయన సొంతూరులో బీజేపీ సర్పంచ్ గెలిచాడని తెలిపారు. నియోజకవర్గంలో 111 కాంగ్రెస్ సర్పంచులు, 16 మంది కాంగ్రెస్ రెబల్ సర్పంచులు, నలుగురు బీఆర్ఎస్ సర్పంచులు, ఆరుగురు బీజేపీ సర్పంచులు గెలిచారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, మోహన్‌నాయక్, ఎజాస్, అసద్ తదితరులున్నారు. -
అధికారం వైపే..!
● పంచాయతీల్లో అభివృద్ధి కోసం అధికార పార్టీకి పట్టం ● అప్పుడు బీఆర్ఎస్కు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు..శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025– 11లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో 532 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 339 గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే విజయం సాధించారు. 97 గ్రామాల్లో బీఆర్ఎస్, 28 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు గెలవగా.. 68 చోట్ల స్వతంత్రులు, కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు. ఎన్నికల తర్వాత రెబల్స్‌తో పాటు స్వతంత్రులు కొందరు ఇప్పటికే అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. 2019 లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు మద్దతుగా నిలిచారు. అప్పట్లో 525 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 369 గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 121 గ్రామాల్లో కాంగ్రెస్, నాలుగు గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు, 31 గ్రామాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఎన్నికల తర్వాత చాలా మంది సర్పంచ్‌లు గులాబీ కండువా కప్పుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా గౌరవప్రదమైన స్థానాలు పొందాయి. జిల్లాలో ఈసారి జరిగిన ఎన్నికల్లో 97 గ్రామాల్లో బీఆర్ఎస్, 28 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. ప్రధానంగా పెద్ద పంచాయతీలుగా ఉన్న మండల కేంద్రాల్లో చాలాచోట్ల ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించాయి. ఐదు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మరో నాలుగు చోట్ల ఆ పార్టీ రెబల్స్ విజయం సాధించారు. ఆరు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్, ఒకచోట బీజేపీ మద్దతుదారులు, మిగిలినచోట్ల స్వతంత్రులు గెలుపొందారు. తగ్గిన ఏకగ్రీవాలు..రాజకీయాలపై ఆసక్తి పెరగడంతో ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఏకగ్రీవాలు తగ్గుముఖం పడుతున్నాయి. 2019 లో 119 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈసారికి వచ్చేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 81 గ్రామాల్లో మాత్రమే సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పుడైనా, ఇప్పుడైనా ఏకగ్రీవాల్లో తొంభై శాతానికిపైగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు చక్రం తిప్పుతుండడంతో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా అధికార పార్టీకి చెందిన నేతలను సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. అధికార బలముంటే... అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కడితే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో చాలా గ్రామాల్లో ప్రజలు అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపిస్తున్నారు. దీనికి తోడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన వారిని గెలిపించుకుని బలం చాటుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతారు. దీంతో ఆ పార్టీ మద్దతుదారులు సులువుగా గెలవగలుగుతున్నారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీల్లో అయితే అధికార పార్టీ వారే ఎక్కువగా ఉంటున్నారు. పల్లె పోరులో ప్రజలు ‘అధికార’ పార్టీకి అనుకూల తీర్పు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులు గెలిస్తే గ్రామానికి ఎక్కువ నిధులు వస్తాయని ఓటర్లు ఆశిస్తున్నారు. దీంతో మెజారిటీ పంచాయతీలు అధికార పార్టీ ఖాతాలో చేరుతున్నాయి. -
చలానా సొమ్ము తిరిగొచ్చేదెప్పుడో?
● రిజిస్ట్రేషన్ రద్దయినా తిరిగి రాని సొమ్ము ● ఐదేళ్లుగా పెండింగ్‌లో.. ● ఉమ్మడి జిల్లాలో రూ. 10 కోట్లపైనే బకాయిలుదోమకొండ: ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం చలానాల రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది. అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ రద్దయితే దరఖాస్తుదారుకు ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐదేళ్లుగా డబ్బులు వాపస్ రావడం లేదు. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నిజామాబాద్ అర్బన్‌తో పాటు నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్, కామారెడ్డి, బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఏదైనా కారణాలతో రిజిస్ట్రేషన్ రద్దయితే దరఖాస్తుదారుకు తిరిగి డబ్బులను వారి బ్యాంకు అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. అయితే ఐదేళ్లుగా ఈ డబ్బులు తిరిగి రావడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 650 మందికి సంబంధించి రూ. 10 కోట్లకుపైగా రావాల్సి ఉంది. చలానాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోనివారు తమ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారి వివరాలను తీసుకుని బిల్లులు చేసి సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ట్రెజరీకి పంపిస్తారు. కాగా ట్రెజరీ కార్యాలయానికి పంపిన బిల్లులు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. మళ్లీ బిల్లులు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డబ్బులు విడుదల చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. మా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలాన్ని మా కుమారుడి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయడానికి దోమకొండలో ఏడాది క్రితం చలానా కట్టాను. తర్వాత నా పేరుమీద చాలానా తీసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా కుమారుడి పేరు మీద కట్టిన చలానా డబ్బులు రూ.9,600 రావడానికి ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలని అధికారులు అడిగారు. దరఖాస్తు రాసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇచ్చాను. ఏడాది దాటినా ఇంతవరకు డబ్బులు తిరిగి రాలేదు. – బొమ్మెర శ్రీనివాస్, దోమకొండ -
ఓటేయలేదు!
లక్ష మంది● పంచాయతీ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్ శాతం ● పల్లెపోరులోనూ తగ్గుతున్న ఆసక్తి ● ఎన్నికలంటే విరక్తి చెందుతున్నారా?జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు లక్ష మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అలాగే గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌శాతం కన్నా ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించగా, ప్రతి విడతలోనూ గతంలో జరిగిన పోలింగ్ కంటే తక్కువగా నమోదైంది.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘స్థానిక’ ఎన్నికల్లో హోరాహోరీగా తలబడే అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రప్పించి, తమకు ఓటేయించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడెక్కడో ఉన్నవారికి ఫోన్లు చేసి అవసరమైతే వారికి ప్రత్యేక వాహనాలు సమకూర్చి మరీ రప్పిస్తుంటారు. అందువల్లే సార్వత్రిక ఎన్నికల కన్నా స్థానిక ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుంది. అయితే ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడ్డాయి. జిల్లాలో ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలో కన్నా తగ్గింది. కొన్ని గ్రామాల్లో మాత్రమే పోటీలో ఉన్నవారు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వలసవెళ్లిన వారిని రప్పించి ఓట్లేయించారు. అయితే దూరాన ఉన్న వారిని రప్పించిన తర్వాత వాళ్లకు పెట్టే ఖర్చు ఏమోగానీ, ఓట్లేస్తారో లేదోనన్న భయంతో చాలా గ్రామాల్లో వలస వెళ్లిన వారిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. కొందరు ఓటు వేయాలన్న ఉద్దేశంతో సొంతంగా వచ్చి ఓటేసి వెళ్లారే తప్ప చాలా చోట్ల వారిని అభ్యర్థులు పట్టించుకున్నపాపాన పోలేదు. హోరాహోరీగా పోరు సాగిన గ్రామాల్లో మాత్రం ఓటర్లను కేంద్రాలకు చేర్చే ప్రయత్నం చేశారు. జిల్లాలో 532 పంచాయతీలు ఉండగా 6,39,730 మంది ఓటర్లున్నారు. అయితే 81 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కావడంతో 451 పంచాయతీలకు ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో 5,97,509 మంది ఓటర్లు ఉండగా, 4,97,861 మంది ఓటు వేశారు. ఓటు వేయని వారు 99,648 మంది అంటే దాదాపు లక్ష మంది ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదని స్పష్టమవుతోంది.జిల్లాలో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కన్నా, ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. అప్పుడు తొలి విడతలో 81.29శాతం మంది ఓట్లు వేయగా, ఈసారి తొలి విడతలో 79.40 శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పుడు రెండో విడతలో 90.04 శాతం పోలవగా, ఇప్పుడు 86.08 శాతం, అప్పుడు మూడో విడతలో 86.97 శాతం ఓట్లు పోలైతే ఈసారి 85.95 శాతం ఓట్లు పోలయ్యాయి. మూడు విడతల్లోనూ పోలింగ్ శాతం తగ్గిందనేది స్పష్టమవుతోంది. అప్పుడు జిల్లాలో సరాసరిగా 86.10 శాతం పోలింగ్ నమోదైతే, ఈసారి 83.81 శాతం పోలైంది. అప్పటికీ ఇప్పటికీ పోలింగ్ శాతం తగ్గుతుండడాన్ని పరిశీలిస్తే ప్రజల్లో ఓటింగ్‌పై ఆసక్తి తగ్గుతోందని స్పష్టమవుతోంది.ఎన్నికల గోల వద్దనుకొని అప్పట్లో చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఆసక్తి చూపేవారు. ప్రధానంగా చిన్న పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా జరుగుతుండేవి. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 119 చోట్ల గ్రామ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసారి ఏకగ్రీవాల సంఖ్య 81 మాత్రమే. అంటే గతంలో కన్నా 38 పంచాయతీలు తగ్గాయి. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ఇచ్చేవారు. అయితే గత విడతలో ఏకగ్రీవాలకు నజరానా ఇవ్వకపోవడం కూడా ఏకగ్రీవాలు తగ్గడానికి కారణమైందని భావిస్తున్నారు.విడత మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటు వేయనివారు ఒకటో విడత 2,42,913 1,92,870 50,043 రెండో విడత 1,64,301 1,41,424 22,877 మూడో విడత 1,90,295 1,63,567 26,728 మొత్తం 5,97,509 4,97,861 99,648 -
థైరాయిడ్ పరీక్షలకు తాళం
కామారెడ్డి టౌన్: జిల్లాలో ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్ (టీ హబ్)లో థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోయాయి. నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి థైరాయిడ్ పరీక్షలకు కావాల్సిన కిట్లు సరఫరా నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. సకాలంలో పరీక్షలు చేయించుకోలేక సరైన వైద్యం పొందలేకపోతున్నారు. నాలుగు నెలలుగా ఇబ్బందులు.. జిల్లా కేంద్రంలో దేవునిపల్లి వద్ద తెలంగాణ డయాగ్నోస్టిక్స్ టీ హబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేశారు. జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జీజీహెచ్‌లకు ఈ ల్యాబ్ అనుసంధానంగా ఉంటుంది. 31 ప్రభుత్వ ఆస్పత్రులలో సేకరించిన రక్త తదితర పరీక్షల శాంపిల్స్‌కు టీ హబ్‌లో పరీక్షలు నిర్వహించి రిపోర్టులను రోగులకు ఉచితంగానే అందజేస్తారు. అయితే, నాలుగు నెలలుగా కిట్లు సరఫరా లేకపోవడంతో థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోయాయి. థైరాయిడ్‌లో టీఎస్‌హెచ్(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), టీ3, టీ4 పరీక్షలు చేస్తారు. థైరాయిడ్ పరీక్ష ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకుంటే రూ. 2వేల వరకు వసూలు చేస్తున్నారు. దీర్ఘకాలికంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాల్సిన రోగులు, బాధితులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో థైరాయిడ్ బాధితులు, వ్యాధిగ్రస్తుల నుంచి నిత్యం 40 నుంచి 60 మంది రక్త నమూనాలను సేకరించి టీ హబ్‌కు పంపుతున్నట్లు అధికారుల గణాంకాల్లో వెల్లడైంది. ప్రతి నెల 1200 నుంచి 1800 పరీక్షలు చేస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ పరీక్షలు నిలిచిపోయాయి. ఈ విషయమై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల్లో థైరాయిడ్ కిట్లు ప్రభుత్వం నుంచి సరఫరా అవుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కిట్ల సమస్య ఉన్నట్లు వివరించారు. టీ హబ్‌లో నిలిచిన టెస్టులు నాలుగు నెలలుగా కిట్ల కొరత, రోగుల అవస్థలు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న బాధితులు -
‘కొడుకును సూడక ఇరవై ఐదేళ్లాయె...’
● అవ్వ సచ్చిపోయినా ఇంటికి రాలేడు ● పోలీసులకు దొరికిండ్రని అంటుండ్రు ● ఇప్పుడన్నా ఇంటికి పంపుండ్రి సారూ... ● ఎర్రగొల్ల రవి తండ్రి రామయ్య వేడుకోలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘సదువుకునేతందుకు కామారెడ్డికి పోయిన కొడుకు ఇంటికి రాలేదు. కొడుకు కోసం తిరగని జాగ లేదు. కొన్ని దినాలకు అన్నలల్ల పోయిండని తెలిసింది. రావాలని కోరుకున్నం గని కొడుకు దూరాన పోయిండన్నరు. మాకు పత్తా తెల్వదు. ఇరువై ఐదేండ్లాయె. పోయిండంటే ఇంటికి తిరిగి రాలేదు. నిన్నమొన్న పోలీసులకు దొరికిండని అంటున్నరు. కొడుకు ఎట్లున్నడో ఏమో. ఇప్పుడన్న ఇంటికి వస్తె మంచిగ ఉంటది’ అని పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు ఎర్రగొల్ల రవి తండ్రి రామయ్య వేడుకుంటున్నాడు. గత సోమవారం రవితోపాటు మరికొందరు నక్సల్స్ ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులకు చిక్కినట్టు పత్రికల్లో రావడంతో రవి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రవి తండ్రి రామయ్యతోపాటు కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో మాట్లాడా రు. రవి నక్సలైట్లలో కలిసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంటి ముఖం చూడలేదని ఆయన తండ్రి రామయ్య పేర్కొన్నారు. కొడుకు కోసం తల్లి ఎంతో మనాది పడిందని, ఆమె చనిపోయినా కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొడుకు రావాలని కోరుకున్నామని, ఇప్పటి దాకా ఇంటికి రాలేదని తెలిపారు. ఇప్పుడైనా కొడుకు వస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కొడుకు రాక కోసం ఎదురుచూస్తుంటానని తెలిపారు. ఎవరినీ ఇబ్బంది పెట్టినోడు కాదని, అప్పుడు తెలిసో తెలియకో అన్నలల్ల పోయిండన్నారు. ఇరువై ఐదేండ్లుగా కొడుకు కోసం ఎదురుచూసిన తల్లి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా వచ్చి ఇంటి దగ్గర అందరితో కలిసి ఉండాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రామారెడ్డి: రామారెడ్డి మండలంతోపాటు, మాచారెడ్డి, దోమకొండ పాల్వంచ, బీబీపేట మండలాల ప్రజలు పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో నిఖిత సూచించారు. అన్నారం ఇ సాయిపేట గ్రామాల శివారులలో బుధవారం రాత్రి అన్నారంలోని పిట్ల రాజయ్యకు చెందిన పశువుపై పులి దాడి చేసి చంపేసింది. ఈవిషయమై ‘సాక్షి’ డీఎఫ్‌వోను సంప్రదించగా, దాడి ఘటన వాస్తవమన్నా రు. ఈసందర్భంగా ప్రజలు పలు సూచనలు చేశా రు. పులి సంచరిస్తుందని ప్రజల జాగ్రత్తగా ఉండాల ని గ్రామాలలో డప్పు చాటింపు చేయిస్తున్నామని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అటవీ ప్రాంతాలలోకి వెళ్లకూడదని సూచించారు. పులి ఆచూకీ కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఇప్పటికే పులి సంచరిస్తున్న అన్నిచోట్ల ట్రా క్ కెమెరాలను అమర్చినట్లుగా పేర్కొన్నారు. అటవీ జంతువులకు హాని కలిగించే విధంగా ప్రజలు ఎ లాంటి చర్యలు చేయకూడదని పేర్కొన్నారు. -
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్: ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను గురువారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. షబ్బీర్ అలీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తామని వివరించినట్లు తెలిపారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ గోడకు ఆనుకొని ఉన్న దుకాణాల వ్యాపారులకు మున్సిపల్ అధికారులు గురువారం తుది నోటీసులను జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం నిధులతో కామారెడ్డి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే గోడకు ఆనుకొని ఉన్న మున్సిపల్ మడిగెలను ఖాళీ చేయాలని వ్యాపారులకు మున్సిపల్ అధికారులు గతంలో రెండుసార్లు నోటీసులను జారీచేశారు. మొత్తం 94 దుకాణాలకు తుది నోటీసులను 73 మందికి అందజేశారు. త్వరలో ఖాళీ చేయాలని, రైల్వే అభివృద్ధికి సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ 94 మంది వ్యాపారులకు సిరిసిల్లా రోడ్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం పక్కన, ప్రభుత్వ గంజ్ హైస్కూల్ ముందు ఉన్న మున్సిపల్ ఖాళీ స్థలంలో మడిగెలు నిర్మించి కేటాయిస్తామని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులన్నీ ఒకే విధంగా చేపట్టాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి నేషనల్ హైవే అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డిలో జరుగుతున్న మెదక్–ఎల్లారెడ్డి– రుద్రూర్ నేషనల్ హైవే పనులను గురువారం ఆర్అండ్బీ అధికారులు, ఆర్డీవో పరిశీలించారు. రోడ్డు వెడల్పు పనులలో భాగంగా విద్యుత్ స్తంభాలు, డ్రెయినేజీ, పైపులైన్ పనులను వారు తనిఖీ చేశారు. పట్టణంలో ఒకే విధంగా రోడ్డు వెడల్పు పనులను చేయాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి అధికారులకు సూచించారు. అన్ని చోట్ల ఒకే విధంగా పనులు కొనసాగాలని, విబేధాలు లేకుండా పనులను చేయాలని అన్నారు. ఎల్లారెడ్డి: సోమార్‌పేట్‌లో ఇటీవల చోటు చే సుకున్న దాడి ఘటన నేపథ్యంలో శుక్ర వా రం ఎల్లారెడ్డి బంద్‌కు అఖిలపక్షం నాయకు లు పిలుపునిచ్చారు. మండలంలోని సోమా ర్పే ట్ గ్రామంలో సర్పంచ్‌గా గెలుపొందిన పా పయ్య తమ్ముడు కుర్మ చిరంజీవి పలువురిపై ట్రాక్టర్‌తో దాడి చేయగా, ఐదుగురు గా యాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లో చి కిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కేవ లం చిరంజీవిపై మాత్రమే పోలీసులు కేసు నమో దు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో అతడికి సహకరించిన సర్పంచ్ కుర్మ పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబాలపై సైతం కేసు నమోదు చేయా లని ఫిర్యాదు ఇచ్చినా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకపోవడంతో గ్రామస్తులతోపాటు అఖిలపక్షం నాయకులు ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి బంద్‌కు వ్యాపార, విద్యా సంస్థల వారు స్వచ్ఛందంగా సహకరించాలని వారు కోరారు. -
అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
బిచ్కుంద(జుక్కల్): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గుండెనెమ్లిలో చోటు చేసుకుంది. ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాటూరి రారెండ్డి (45) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ అర్బన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఐదుగురికి మెజిస్ట్రేట్ వారం రోజుల పాటు జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ 17 మందిలో ఐదుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా 11 మందికి రూ. పదివేలు, మరొకరికి రూ. పదిహేను వేలు చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ మహ్మద్ సోఫియన్, నగేశ్, ఇంతియాజ్, ఒడ్డె రాజు, విజయ్‌కుమార్‌కు వారం రోజుల పాటు మెజిస్ట్రేట్ జైలు శిక్షను విధించినట్లు ఏసీపీ తెలిపారు. -
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● అధికారులు, సిబ్బందికి అభినందనకామారెడ్డి క్రైం: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డిని గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ సన్మానించారు. సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. సమన్వయంతో పని చేయడం ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయన్నారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, డీపీవో మురళి పాల్గొన్నారు. కలెక్టర్‌కు సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేయడంలో కీలకంగా వ్యవహరించిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అఽభినందించారు. ఆయా శాఖల అధికారులు, ఎంపీడీవోలు గురువారం కలెక్టర్‌ను తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జరిగిన ఎన్నికల్లో సంబంధిత శాఖల అధికారులందరూ బాధ్యతగా పని చేశారని కలెక్టర్ కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎంపీడీఓలు, పలువురు అధికారులు కలెక్టర్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. -
వార్డు మెంబర్ల గెలుపు.. సర్పంచ్ అభ్యర్థుల ఓటమి
బాన్సువాడ రూరల్: ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లో చర్చకు వచ్చే క్రాస్ ఓటింగ్ సమస్య మారుమూల పల్లెల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. 3వ విడత పంచాయతీ ఫలితాల్లో తిర్మలాపూర్, హన్మాజీపేట్ గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వార్డు సభ్యులు విజయం సాధించగా, సర్పంచ్ అభ్యర్థులు మాత్రం ఓటమి పాలయ్యారు. జనరల్ మహిళగా రిజర్వు అయిన తిర్మలాపూర్ గ్రామ పంచాయతీలో మ్యాడ అనసూయ అధికార కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉండగా గొల్ల లక్ష్మి రెబెల్‌గా బరిలో దిగారు. కౌంటింగ్‌లో 8 వార్డులకు గానూ ఆరుగురు వార్డు సభ్యులు మ్యాడ అనసూయ మద్దతుదారులు గెలుపొందారు. కేవలం ఇద్దరు మాత్రమే గొల్ల లక్ష్మి మద్దతుదారులు గెలుపొందారు. వార్డు సభ్యుడిగా పోటీచేసిన సర్పంచ్ అభ్యర్థి భర్త గొల్ల బాలయ్య సైతం ఓటమి పాలయ్యారు. తీరా సర్పంచ్ ఫలితాలు వెలువడే సరికి గొల్ల లక్ష్మి 71 ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో మద్దతుదారులు కంగుతిన్నారు.ఇక హన్మాజీపేట్ గ్రామ పంచాయతీలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బండారు రుక్క వ్వ బరిలో ఉండగా రెబెల్‌గా ఆశనుగొల్ల లావణ్య వెంకాగౌడ్ పోటీ పడ్డారు.10 మంది వార్డు సభ్యు ల్లో 8 మంది రుక్కవ్వ మద్దతుదారులు గెలుపొంద గా ఇద్దరు వార్డు సభ్యులు మాత్రమే లావణ్య మ ద్దతుదారులు గెలుపొందారు. విజయం పక్కా అనుకున్న బండారి రుక్కవ్వ మద్దతుదారులకు స ర్పంచ్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇక్కడ రెబెల్‌గా పోటీ చేసిన లావణ్య వెంకాగౌడ్ 158 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందడం ఆశ్చర్యం కలిగించింది. తమ మద్దతుతో గెలుపొందిన వార్డు సభ్యులు సంబురాలు చేసుకుంటుంటే ఓడిన సర్పంచ్ అభ్యర్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. పల్లెల్లోనూ క్రాస్ ఓటింగ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తిర్మలాపూర్ గ్రామ ముఖచిత్రం క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ -
నాడు తండ్రి.. నేడు కుమారుడు సర్పంచ్
బాన్సువాడ రూరల్: సంగోజీపేట్ గ్రామానికి చెందిన మంద సంగమేశ్వర్ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. సంగమేశ్వర్ తండ్రి దివంగత మంద శ్రీరాములు కూడా 2006 నుంచి 2011 వరకు గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సంగమేశ్వర్ పంచాయతీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి నాగభూషణంపై 252 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదిలా ఉంటే 2006లో జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లోనూ ఈ రెండు కుటుంబాల మధ్య సర్పంచ్ స్థానానికి పోటీ జరిగింది. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసిన సంగమేశ్వర్ తండ్రి మంద శ్రీరాములు, నాగభూషణం కుటుంబానికి చెందిన అతని బాబాయి దివంగత మార్ధాండి నర్సప్పలు ప్రత్యర్థులుగా పోటీచేయడం కొసమెరుపు. మంద సంగమేశ్వర్, సంగోజీపేట్, సర్పంచ్ మంద శ్రీరాములు, మాజీ సర్పంచ్ -
పెద్దపులి జాడ కోసం గాలింపు
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామశివారులో బుధవారం దూడపై పెద్దపులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ రెస్క్యూ టీం ట్రాకర్స్ ట్రాప్ కెమెరాలను గురువారం అమర్చి గాలింపు ముమ్మరం చేశారు. ఇసాయిపేట శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్టు ఇటీవల అమర్చిన ట్రాప్ కెమెరాలో రికార్డయినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి రమేశ్ తెలిపారు. స్థానికులు భయాందోళనకు గురికావొద్దని, రాత్రివేళలో ఒంటరిగా పంట చేల వద్దకు వెళ్లొద్దని సూచించారు. పశువులు, గొర్రెల కాపర్లు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని తెలిపారు. -
క్రైం కార్నర్
లారీ ఢీకొని ఒకరి మృతి ఇందల్వాయి: కాలినడకన రోడ్డు గుండా ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందిన ఘటన ఇందల్వాయి టోల్‌ప్లాజా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మేఘ్యనాయక్ తండాకు చెందిన లకావత్ లింబ్య(70) అనే వృద్ధుడు గురువారం ఉదయం చికిత్స కోసం ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. మందులు తీసుకొని స్వగ్రామానికి కాలినడకన రోడ్డు గుండా వెళ్తుండగా టోల్‌ప్లాజా ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి అతన్ని ఢీకొన్నది. దీంతో ఘటన స్థలిలోనే లింబ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుమారుడు మోజీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. దోమకొండ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన సన్నిది యాదగిరి(52) అనే వ్యక్తి ఈ నెల 15న పనినిమిత్తం సిరిసిల్లా జిల్లా కేంద్రానికి మరో యువకుడితో కలిసి బైక్‌పై వెళ్లారు. తిమ్మాపూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో యాదగిరి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం సిరిసిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రుద్రూర్: మండల కేంద్రంలోని జవహార్‌నగర్ కాలనీ వద్ద రెండు కార్లు గురువారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఐతే ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. -
ఎత్తొండలో మహారాష్ట్రవాసి అదృశ్యం
రుద్రూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సావులి గ్రామానికి చెందిన ఓమాజీ వడాయి అనే వ్యక్తి కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ గురువారం తెలిపారు. ఓమాజీ వడాయి తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి వరినాట్లు పని నిమిత్తం ఎత్తొండ గ్రామానికి వచ్చాడు. ఈ నెల 16న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆయన భార్య జీజాబాయి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
నాడు పతి.. నేడు సతి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో సర్పంచులుగా నాడు పతులు పదవులు నిర్వహిస్తే నేడు సతులు సర్పంచులుగా గెలుపొందారు. రేపల్లెవాడ సర్పంచ్‌గా నాడు దుద్దుల సాయిరాం సర్పంచ్‌గా పని చేశారు. 2018లో సర్పంచ్‌గా గెలిచి ఐదేళ్ల పాలన పూర్తి చేశారు. నేడు రేపల్లెవాడ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో సాయిరాం తన భార్య వనితతో పోటీ చేయించారు. దీంతో దుద్దుల వనిత సర్పంచ్‌గా గెలుపొందారు. అలాగే అల్మాజీపూర్ గ్రామ సర్పంచ్‌గా నాడు 2018 ఎన్నికలలో పుల్గల మాధవి గెలుపొంది ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా పని చేశారు. నేడు అల్మాజీపూర్ జీపీ జనరల్ స్థానానికి కేటాయించడంతో మాధవి భర్త పుల్గల దేవదత్తు సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఖలీల్‌వాడి: జాతీయ స్థాయి రన్నింగ్ పోటీల కు జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని కుమారి పీ అంబిక ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 1500 మీటర్ల పరుగు పందెం పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిందన్నారు. వచ్చే ఏప్రిల్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పరుగుపందెం పో టీల్లో పాల్గొనడానికి తమ కళాశాల విద్యార్థిని వెళ్లడం గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం అంబికను ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకుల సహకారంతో తాను ముందుకు వెళ్లగలుగుతున్నానని అంబిక అన్నారు. ధర్పల్లి: ధర్పల్లి నూతన ఎస్సైగా సామ శ్రీనివా స్ గురువారం బాధ్యత లు చేపట్టారు. ఇది వర కు విధులు నిర్వహించి న ఎస్సై కళ్యాణి సెల వులపై వెళ్లడంతో ఆమె స్థానంలో సామ శ్రీనివాస్ నియమితులయ్యా రు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతులు పరిరక్షించడానికి కృషి చేస్తానన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సుభాష్‌నగర్: జిల్లాలో రేషన్‌కార్డుదారులు తమ వేలిముద్ర సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ గురువారం సూచించారు. జిల్లాలో 4,67,295 కార్డుల్లో 15,72,176 లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. అందులో 11,03,928 (70.22 శాతం) లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారన్నారు. 4,68,251(29.78) లబ్ధిదారులు చేయించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. మిగిలిపోయిన కార్డుదారుల్లో ఐదేళ్లు పైబడిన వారందరూ సమీపంలోని రేషన్‌షాపునకు వెళ్లి ఈకేవైసీని తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రేషన్‌షాపు డీలర్లు కూడా షాపులను తెరిచి ఉంచి ఈకేవైసీకి సహకరించాలన్నారు. రేషన్‌షాపుల్లో ఈకేవైసీకి సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. కామారెడ్డి అర్బన్: జిల్లాలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతిరోజు 18 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి విద్యుత్‌శాఖ ఎస్ఈ రవీందర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఎస్ఈతో రైతులకు సంబంధించిన వివిధ విద్యుత్ సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్రావు, జిల్లా ప్రతినిధలు, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
హస్తం హవా!
● పల్లెపోరులో అధికార పార్టీ జోరు ● చివరి విడతలోనూ కాంగ్రెస్‌దే పైచేయి ● మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు..బొమ్మన్‌దేవ్‌పల్లిలో విజయోత్సవ ర్యాలీపల్లె పోరు ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం తేలింది. జిల్లాలో 532 పంచాయతీలు ఉండగా 81 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4,656 వార్డులకుగాను 1,658 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 21 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన స్థానాలకు ఈనెల 11, 14, 17 తేదీలలో ఎన్నికలు నిర్వహించారు. ఎక్కువ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. ఏకగ్రీవ పంచాయతీలు ఎక్కువగా అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అలాగే కాంగ్రెస్ రెబల్స్, పలువురు స్వతంత్రులు తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పల్లె పాలనలో కాంగ్రెస్ జెండా ఎగిరినట్టయ్యింది. అయితే మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు చాలా చోట్ల ఓటమి పాలవడం గమనార్హం. కొన్ని చోట్ల అధికార పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు, మరికొన్ని మండల కేంద్రాల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు గెలుపొందారు. బాన్సువాడ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలకు చెందిన వారు పోటీ పడ్డారు. గెలుపొందిన వారిలో ఎక్కువగా కాంగ్రెస్ వారే ఉన్నారు. మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు... జిల్లా అంతటా కాంగ్రెస్ హవా కొనసాగినా మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన శంకర్‌రెడ్డి ఓటమి చెందగా.. ఆ పార్టీ రెబల్‌గా బరిలో నిలిచిన నర్సయ్య విజయం సాధించారు. మాచారెడ్డి మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. నరేశ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపగా సంతోష్‌రెడ్డి రెబల్‌గా బరిలో నిలిచి గెలిచారు. బీబీపేటలోనూ అధికార పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఓటమి చెందగా, రెబల్ గెలుపొందారు. పాల్వంచ మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి కూచని శేఖర్, రాజంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీకాంత్ విజయం సాధించారు. లింగంపేటలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. గాంధారిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి చెందగా.. రెబల్ విజయం సాధించారు. తాడ్వాయిలో బీఆర్ఎస్ మద్దతుదారు, సదాశివనగర్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో బీఆర్ఎస్ మద్దతుదారు, పిట్లం, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, మహ్మద్‌నగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతుదారు గెలిచారు. తుది విడతలో మండల కేంద్రాలలోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. డోంగ్లీలో కాంగ్రెస్ మద్దతుదారు రేఖ, మద్నూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు ఉష, జుక్కల్‌లో కాంగ్రెస్ మద్దతుదారు సావిత్రి, నస్రుల్లాబాద్‌లో కాంగ్రెస్ మద్దతుదారు లక్ష్మి, బీర్కూర్‌లో బీఆర్ఎస్ మద్దతుదారు ధర్మతేజ, పెద్దకొడప్గల్లో స్వతంత్ర అభ్యర్థి విజయలక్ష్మి గెలిచారు.తొలి విడతలో పది మండలాల పరిధిలోని 167 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 90 చోట్ల కాంగ్రెస్, 44 చోట్ల బీఆర్ఎస్, 20 చోట్ల బీజేపీ, 13 చోట్ల కాంగ్రెస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. గెలిచాక పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండో విడతలో ఏడు మండలాల పరిధిలోని 197 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 142 స్థానాల్లో కాంగ్రెస్, 34 చోట్ల బీఆర్ఎస్, ఎనిమిది చోట్ల బీజేపీ మద్దతుదారులు, 12 చోట్ల స్వతంత్రులు ఎన్నికయ్యారు.మూడో విడతలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. చివరి విడతలో ఎనిమిది మండలాల పరిధిలోని 168 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 126 చోట్ల కాంగ్రెస్, 22 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల బీజేపీ, 17 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. జిల్లాలో మొత్తం పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 339, బీఆర్ఎస్ 97, బీజేపీ 28, ఇతరులు 68 స్థానాల్లో విజయం సాధించారు. -
పరదాలతో పోలింగ్ బూత్‌లు
● ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు ● పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మూడో విడతలో ఎనిమిది మండలాల పరిధిలో 168 పంచాయతీలు, 1,482 వార్డులు ఉండగా.. 26 సర్పంచ్, 449 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 142 గ్రామాల సర్పంచ్ పదవులు, 1,020 వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. 85.95 శాతం ఓటేశారు. బాన్సువాడలో 25 పంచాయతీలకుగాను పది పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 15 పంచాయతీల్లో సర్పంచ్‌లుగా 68 మంది పోటీ పడ్డారు. బిచ్కుంద మండలంలో 23 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవమవగా.. 22 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 67 మంది, బీర్కూర్‌లో 13 పంచాయతీలుండగా ఒకటి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 12 పంచాయతీల్లో 37 మంది సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. డోంగ్లీ మండలంలో 13 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవమైంది. 12 గ్రామాల సర్పంచ్ పదవులకు 40 మంది పోటీ పడ్డారు. జుక్కల్‌లో 30 పంచాయతీలుండగా ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా కాగా.. 25 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 77 మంది బరిలో నిలిచారు. మద్నూర్‌లో 21 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవంకాగా.. 20 పంచాయతీలకు 69 మంది, నస్రుల్లాబాద్‌లో 19 పంచాయతీలకు గాను మూడు ఏకగ్రీవమవగా.. 16 పంచాయతీల్లో 55 మంది పోటీ చేశారు. పెద్దకొడప్గల్లో 24 పంచాయతీల్లో నాలుగు ఏకగ్రీవమవగా, 20 చోట్ల 49 మంది పోటీ పడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఆయా మండలాల్లో పోలింగ్ కేంద్రాలను, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్‌తోపాటు ఎస్పీ రాజేశ్ చంద్ర, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్య తదితరులు పరిశీలించారు.నస్రుల్లాబాద్: ఫకీరా నాయక్ తండాలో గదులు సరిపోకపోవడంతో పరదాలు కట్టి పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో పరదాలు కట్టి పోలింగ్ బూత్‌లుగా వినియోగించుకున్నారు. లింగంపల్లి తండాలో ఆరు పోలింగ్ కేంద్రాలు ఉండగా.. గదులు సరిపోక హాల్లో రెండింటిని పరదాల మధ్య ఏర్పాటు చేశారు. -
‘బాలల హక్కులను పరిరక్షించాలి’
నాగిరెడ్డిపేట: బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా న్యాయమూర్తి నాగరాణి సూచించారు. నాగిరెడ్డిపేటలోని మోడల్ స్కూల్లో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు తమ ఫిర్యాదులను, సమస్యలను సంబంధిత అధికారులకు నివేదించాలన్నారు. బాల్యవివాహం చట్టప్రకారం నేరమవుతుందని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్ విద్యార్థులకు బాలల హక్కులు, వేధింపులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు వీణ, మోహన్, దత్తు, పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామ శివారులోని ఒడ్డెగూడం సమీపంలో ఓ దూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కామటి చిన్న రాజయ్య దూడను పంట చేను వద్ద కట్టేసి ఉంచారని, తెల్లవారుజామున పెద్దపులి దాడిచేసి చంపేసిందని మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రమేశ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులు, గొర్రెలను అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లవద్దని సూచించారు. ఆర్మూర్‌టౌన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హాకీ జట్టును పట్టణంలోని మినీస్టేడియంలో బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియే షన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమ ణ తెలిపారు. ఎస్జీఎఫ్ఐ అండర్–19 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపి క చేశామన్నారు. ఈనెల 20న రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య, అంజు, హాకీ క్రీడాకారులు శ్రీను, వెంకేటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీర్కూర్‌లో భార్యాభర్తల గెలుపు
బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో భార్యాభర్తలు విజయం సాధించారు. బీర్కూర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన ధర్మతేజ.. తన సమీప ప్రత్యర్థిపై 476 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన భార్య గాయత్రి 13వ వార్డునుంచి పోటీ చేసి 62 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నస్రుల్లాబాద్: బస్వాయిపల్లి గ్రామానికి చెందిన షేక్ ఖాజా సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, గత సర్పంచ్ ఫాతిమ కుమారుడు మసూద్‌పై 124 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా గత ఎన్నికల్లో షేక్ ఖాజా భార్య సుల్తానా బేగం పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం అన్నారంలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారనే ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ప్రచారంతో పాటు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు రావడంతో గుమిగూడిన వారిని లాఠీలతో చెదరగొట్టారు. గొడవ వాతావరణం ఏర్పడడంతో పరిస్థితి చేయిదాటిపోకుండా మరిన్ని పోలీసు బలగాలను రంగంలోకి దించారు. బుధవారం రోజంతా పోలీసులు గ్రామంలోనే ఉన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా ప్రలోభాలు లేకుండా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, నిజామాబాద్‌రూరల్ సీఐ శ్రీనివాస్ ఓటింగ్ సరళిని నిషితంగా పర్యవేక్షించారు. ● కంఠం గ్రామంలో ఉద్రిక్తత నందిపేట్(ఆర్మూర్): కంఠం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన పెంట ఇంద్రుడు, బీజేపీ బలపరిచిన అజిగిరి సాయినాథ్‌లకు సమానంగా 711 ఓట్లు రావడంతో లక్కీ డ్రా ద్వారా విజేతను నిర్ణయించారు. లక్కీడ్రాలో అజిగిరి సాయినాథ్ గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి జాన్ విల్సన్ ప్రకటించారు. ఈ క్రమంలో కౌంటింగ్కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గ్రామానికి వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
కొత్త సర్పంచులు వీరే..
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించిన పోలింగ్ అధికారులు విజేతల వివరాలను ప్రకటించారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో 165 సర్పంచ్ స్థానాలు ఉండగా 19 ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన 146 సర్పంచ్ స్థానాల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. – సాక్షి నెట్వర్క్డోంగ్లీ మండలంపెద్దకొడప్గల్ మండలం.. బీర్కూర్ మండలం.. మద్నూర్ మండలం.. -
ఓటేయడానికి వస్తూ.. అనంతలోకాలకు..
క్రైం కార్నర్పెద్దకొడప్గల్(జుక్కల్): సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తూ ఒకరు మృతిచెందిన ఘటన పెద్దకొడప్గల్ మండలంలోని ఎలకంటి చెరువు సమీపంలో జాతీయ రహదారి–161పై బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన బక్కోల సాగర్(27) అనే వ్యక్తి శాంతాపూర్ గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి మంగళవారం హైదరాబార్ నుంచి ద్విచక్రవాహనంపై పుల్కల్కు బయలుదేరారు. పెద్దకొడప్గల్లో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడ్డారు. ఈ ఘటనలో సాగర్ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. సాగర్ (ఫైల్)అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి భిక్కనూరు: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం బుధవారం గుర్తించారు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పెద్దబచ్చగారి హరిచరణ్‌రెడ్డి(30) కారు సర్వీసింగ్ చేయించేందుకు హైదరాబాద్‌లోని సొంత ఇంటికి సోమవారం వెళ్లాడు. బుధవా రం హరిచరణ్కు వారి కుటుంబీకులు పలుమా ర్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో పక్క ప్లాట్‌లో ఉన్నవారికి ఫోన్ చేసి చూడుమని కోరారు. బెడ్‌పై పడుకుని ఉలుకూ పలుకు లేకుండా ఉన్నట్లు వారు గుర్తించి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి–పద్మలకు తెలియజేయడంతో కుటుంబీకులు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఈ విషయమై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. హరిచరణ్‌రెడ్డి అంత్యక్రియలను హైదరాబాద్‌లో గురువారం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు.. భిక్కనూరు: రామేశ్వర్‌పల్లి గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు పడి ఒకరూ మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. మండల కేంద్రంలో నివసిస్తున్న అల్లం ఎల్లయ్య(33) పాత ఇనుప సామాన్లు చిత్తుకాగితాలను తిరుగుతూ కొనుగోలు చేసే వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. మంగళవారం వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. రామేశ్వర్‌పల్లి చెరువులోకి గణపతి విగ్రహాల ఇనుప ఫ్రేమ్‌లను తీసుకొచ్చేందుకు దిగి ఒడ్డుకు రాలేదని చూసిన వారు చెప్పడంతో పలువురు చెరువులో గాలింపు చర్యలు చేపట్టిననప్పటికి ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులు రెస్క్యూ టీంను రప్పించి చెరువులో వెతికించడంతో ఎల్లయ్య మృతదేహం కనిపించగా బయటకు తీశారు. మృతుడికి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉప సర్పంచ్.. సర్పంచ్ అయ్యాడు
నస్రుల్లాబాద్: బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన తాడ్కోల్ సాయి లు గత పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం గ్రామస్తులు ఆయనను సర్పంచ్‌గా ఎన్నుకోవడమే కాకుండా 10 వార్డులను సైతం క్లీన్ స్వీప్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్యానల్ మొత్తం గెలిచి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గెలవడం జరగలేదని, ఈ విజయం చరిత్రలో నిలుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనపై నమ్మకం ఉంచి ఇంతటి ఘన విజయం అందించిన గ్రామస్తులకు సేవలు అందించి రుణం తీర్చుకుంటానని సాయిలు పేర్కొన్నారు. మంజీర నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం పిట్లం(జుక్కల్): మండలంలోని మంజీర నదిలో తేలుతున్న మృతదేహాన్ని బుధవారం అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఎస్సై వెంకట్రావ్ తెలిపిన వివరాలు.. వర్ని మండలంలోని గోవూరుకు చెందిన కమ్మరి శ్యాంకుమార్ (59)కు కొంతకాలంగా కంటి నొప్పితో బాధపడుతున్నారు. కళ్లు సరిగా కనిపించడం లేదని బాన్సువాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. చికిత్స చేయించుకున్నా కంటి నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 12న మధ్యాహ్నం ఆస్పత్రిలో చూపించుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి వచ్చి పిట్లం మండలంలోని బొల్లక్‌పల్లి గ్రామ శివారులో మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు ఎల్లారెడ్డి/నిజాంసాగర్: రోడ్డు ప్రమాదంలో గా యపడిన వ్యక్తిని కలెక్టర్ తన వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందించారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ వద్ద ఆటోను బైక్ ఢీకొనడంతో ప్రమాదంలో సుందర్‌సింగ్ అనే వ్యక్తి గాయపడ్డాడని, అటువైపు వెళ్తున్న కలెక్టర్ సంగ్వాన్ స్పందించి తన వాహనంలో క్షతగాత్రుడిని ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్‌కుమార్.. ఎల్లారెడ్డి ప్రభుత్వ వైద్యులతో క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకున్నారు. ‘కాంగ్రెస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు’ నిజాంసాగర్(జుక్కల్): సర్పంచ్ ఎన్నికల్లో పల్లె ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ కంచుకోటలుగా భావించిన ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 164 సర్పంచ్ స్థానాలు ఉండగా, వాటిలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు 126 స్థానాల్లో ఘన విజయం సాధించారని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా భారీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
నేడు పెన్షనర్స్ డే ముగింపు ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని న్యూ అంబేడ్కర్ ఆడిటోరియంలో నేడు (బుధవారం) సాయంత్రం అఖిల భారతీయ పెన్షనర్స్ డే ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పండరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలకు జిల్లాలోని రిటైర్ట్ ఎంప్లాయీస్ అందరూ కుటుంబసమేతంగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్, కలెక్టర్ వినయ్కృష్ణరెడ్డితోపాటు ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న క్రీడాపోటీలు నగరంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగుల క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. క్యారమ్, పరుగుపందెం, టేబుల్ టెన్నీస్, షటిల్, మ్యూజిక్ చైర్, స్కిల్ గేం, చెస్, పాటల పోటీలు వంటి అంశాల్లో రిటైర్డ్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి ప్రేమ్‌లాల్ నిజామాబాద్ రూరల్: తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షు డు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించే ప్ర పంచ తెలుగు కవుల సమ్మేళనానికి జిల్లాకు చెందిన కవి,రచయిత ప్రేమ్లాల్కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయనకు సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ అదనపు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి సాయిసుధను నిజామాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జిగా బదిలీ చేస్తు తెలంగాణ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సాయిసుధ ఈ పదవిలో ఇన్చార్జిగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జిగా కొనసాగుతుండగా, ప్రస్తుతం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా ఉంటు అదనపు సీనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జ్జ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సాయిసుధ నిజామాబాద్ జిల్లా న్యాయసేవ సంస్థ ఇన్చార్జిగా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. బాన్సువాడ రూరల్: పంచాయతీ ఎన్నికల నే పథ్యంలో మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి తీసుకెళ్లాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు సరిచూసుకోవాలని ఆర్వోలకు సూచించారు. తప్పనిసరిగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు. -
జంగంపల్లిలో వివాహిత ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరీ (30) ఐకేపీలో సీఏగా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గత కొన్ని రోజులుగా మెడ నొప్పితో బాధపడుతోంది. అలాగే ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో వీరికి కొద్దిగా అప్పులు అయ్యాయి. అట్టి విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతుండేదని కుటుంబీకులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. ధర్పల్లి: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఇలా.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మచ్చ రవి (45) గత కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్తున్నాడు. నెల రోజుల క్రితం సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందాడు. నెల రోజుల తర్వాత మంగళవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో ప్రజలు పాల్గొని రవికి కన్నీటి వీడ్కోలు పలికారు. రవి మృతదేహం వస్తుందనడంతో కుటుంబీకులు ఇంట్లో రోధిస్తుండగా మృతుడి నడ్పి నాన్న మచ్చ రమేష్(60) హైబీపీకి గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
పోలింగ్ శాతం పెరిగేలా..
● మూడో విడత ఆర్మూర్ డివిజన్లో 3.14లక్షల మంది ఓటర్లు ● దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేసిన అధికారులు మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ తుది విడత పోలింగ్‌కు ఓటర్లు పోటేత్తెలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఓటర్లకు పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేస్తూ వారు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసేలా బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో) అవగాహన కల్పిస్తున్నారు. మొదటి విడతలో 81.37 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో కాస్తా తగ్గిపోయింది. ఈ విడతలో 76.71 శాతం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో 85 శాతంకు పోలింగ్ శాతం మించిపోవాలని అధికారులు భావిస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలలోని వివిధ గ్రామాలలో 3,14,091 మంది ఓటర్లు ఉండగా దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులను బీఎల్వోలు పంపిణీ చేశారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి తికమక ఉండకుండా ఉండేందుకు పోలింగ్ బూత్ చిరునామా, ఓటరు సంఖ్య అన్ని ఉండేలా స్లిప్పులను ఎన్నికల సంఘం ముద్రించి బీఎల్వోలకు అందించింది. ఈ స్లిప్పులు ఉంటే ఓటర్లకు తాము ఎక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే విషయం సులభంగా తెలుస్తుంది. వారం రోజుల నుంచి బీఎల్వోలు తమకు నిర్దేశించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్లకు స్లిప్పులను ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. మంగళవారం కూడా పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేశారు. బీఎల్వోలు పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు అందుబాటులో ఉండి సమాచారం కూడా ఇవ్వనున్నారు. పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేయడం వల్ల ఓటర్లకు తమ బాధ్యతను గుర్తుచేసినట్లు ఉంటుందనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1గంటకే ముగిసిపోనుంది. అందుకే ఉదయం నుంచే పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది. ఓటర్లు బద్దకం వీడీ పోలింగ్ స్టేషన్లకు ఎలా తరలివస్తారో బుధవారం వెల్లడికానుంది. -
నందిపేటకు చేరుకున్న గోదావరి పరిక్రమ
● సాధుసంతులకు ఘన సన్మానం ● భక్తిశ్రద్ధలతో కన్యాపూజలు నందిపేట్(ఆర్మూర్): ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలూక్ పీఠాధిపతి రాజేంద్రనాథ్ దాస్జీ 500 మంది సాధుసంతులతో కలిసి చేపట్టిన పవిత్ర గోదావరి పరిక్రమ యాత్ర నందిపేటకు చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, సాధుసంతులు కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన కన్యాపూజలో పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాధిపతి కేదారానంద స్వామి రాజేంద్రనాథ్ దాస్జీకి పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్దాస్ జీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. పరిక్రమ యాత్ర అంటే ఒక పవ్రితమైన ప్రదేశం (నది, పర్వతం, ఆలయం) చుట్టూ ప్రదక్షిణ చేసే ఆధ్యాత్మిక యాత్ర అని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో రక్షణ, హిందూధర్మ ప్రచారం యాత్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన పరిక్రమ యాత్ర తిరిగి నాసిక్‌కు చేరుకుంటుందని, యజ్ఞంతో యాత్రను సంపూర్ణం చేస్తామన్నారు. కేదారేశ్వర ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. -
మధ్యాహ్న భోజన బియ్యంలో తరుగు!
● ఒక్కో బస్తాలో 7 నుంచి 8 కిలోలు తక్కువగా వస్తున్న వైనం ● హెడ్మాస్టర్ల ఆవేదన బోధన్: మధ్యాహ్న భోజనానికి సరఫరా అవుతోన్న సన్నబియ్యంలో తరుగు వస్తోంది. దీంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల మ ధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం సన్న బియ్యం నేరుగా సివిల్ సప్లయ్ గోదాముల నుంచి సరఫరా చేస్తోంది. పాఠశాల విద్యార్థుల సంఖ్య మేరకు 50 కిలోల సంచితో నెలకు సరిపడా 2 నుంచి 4 క్వింటాళ్ల మేరకు సన్నబియ్యం సరఫరా జరుగుతుంది. ప్రతినెల లారీల్లో బియ్యాన్ని పాఠశాలలకు చేర్చుతున్నారు. అయితే 50 కిలోల సంచికి 7 నుంచి 8 కి లోల వరకు తరుగు వస్తోందని పాఠశాలల హెచ్ ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఓ పాఠశాల హెచ్ఎం బియ్యం సంచిని తూకం వేయించగా అందులో 7 కిలోల 50 గ్రాములు తక్కువ వచ్చింది. మధ్యాహ్న భోజనం పథకం పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆ బాధ్యతలను హెచ్ఎంలకు అప్పగించింది. కాగా, తరుగు విషయంలో గతంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బియ్యం తూకం వేసుకొని తీసుకోవాలని సూచించారని హెచ్ఎంలు అంటున్నారు. పాఠశాలలో బియ్యం తూకం వేసే మిషన్ లేకపోవడం గమనార్హం. బియ్యం తరుగుతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు బియ్యం తరుగు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
వైభవంగా దేవునిపల్లి మల్లన్న జాతర
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి మల్లన్న స్వామి ఉత్సవాల్లో(సట్టి తీర్థం) భాగంగా మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉదయం బోనాలు, సాయంత్రం ఎడ్ల బండ్ల ఊరేగింపు, ఒడి బియ్యం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. డప్పు వ్యాయిద్యాలతో సాంప్రదాయంగా అలంకరించిన ఎడ్లబండ్ల ఊరేగింపునకు ఆయా గ్రామాల నుంచి కాకుండా వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవునిపల్లి నవచైతన్య క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధిపేట శ్యామ్ కల్చరల్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, వీడీసీ అధ్యక్షుడు గూడెల్లి గంగారాం, ప్రధాన కార్యదర్శి ద్యావరి నరేష్, ప్రతినిధులు పాల్గొన్నారు. ఘనంగా సుదర్శన నారసింహ హోమం మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న–సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 16 జంటలు ఈ హోమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్‌రెడ్డి, ఈవో ప్రభురాంచంద్రం, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, నర్సింహాచార్యులు, పరంధామాచార్యులు, సంజీవాచార్యులు పాల్గొన్నారు. వేంకటేశ్వర, గోదాదేవిలకు ప్రత్యేక పూజలు తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వేంకటేశ్వరస్వామి, గోదాదేవీలకు ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహేందర్ పంతులు, సదాశివుడు, సద్ది రాంరెడ్డి, పరమేశ్వర్, రవికుమార్ పాల్గొన్నారు. -
ప్రజలకు సమస్యలు రాకుండా చూడాలి
● బోధన్‌లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి ● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బోధన్‌టౌన్(బోధన్): పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో మంగళవారం నూతనంగా కొనుగోలు చేసిన 15 చెత్త సేకరణ ఆటోలకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప ట్టణంలో పారిశుధ్య పనుల్లో ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు ఇ చ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజ లు పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. బల్దియాకు నూతన భవ న నిర్మాణాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు, ప్రిన్సిపల్ కౌసర్ ఆయనకు విన్నవించారు. బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి, డయాలసీస్ రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కో అపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, మహిపాల్ రెడ్డి, తూము శరత్‌రెడ్డి, పాషా, నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, ప్రమోద్ చిన్న, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడతకు సర్వం సిద్ధం
సాక్షి నెట్వర్క్: మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు. జిల్లాలో మూడో విడతలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మంగళవారం బాన్సువాడ మండలానికి సంబంధించి ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బీర్కూర్‌లో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం, నస్రుల్లాబాద్ మండలానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా సామగ్రి స్వీకరణ కేంద్రాల నుంచి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లారు. ఎన్నికల సిబ్బంది ఉదయం ఆరున్నర గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని మొదట మాక్‌పోల్ నిర్వహించిన అనంతరమే పోలింగ్ ప్రారంభించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్‌తో మహిళ మృతి వేల్పూర్: వేల్పూర్ మండలం లక్కోర గ్రామ సమీపంలో కరెంటు షాక్‌తో ఓ మహిళ మృతిచెందింది. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. భీమ్‌గల్ మండలం సంతోష్‌నగర్‌కు చెందిన పాల్థియప్పి అంబి(58) అనే మహిళ లక్కోర పెట్రోలు పంపు వద్ద కూలీపని చేసుకుంటూ జీవించేది. ఈక్రమంలో మంగళవారం పనిలో భాగంగా చెత్తను పెట్రోలు పంపు వెనుక భాగంలో పారవేయడానికి వెళ్లింది. సమీపంలో కరెంటు వైర్లు తెగిపడి ఉండటంతో ఆమెకు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డిలో వృద్ధురాలు ..కామారెడ్డి క్రైం: పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గేటు వద్ద ఓ వృద్ధురాలు మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి గేటు వద్ద మంగళవారం ఓ వృద్ధురాలు పడి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆస్పత్రి వద్దకు చేరుకొని వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మొదట ఆమెను గుర్తుతెలియని వృద్ధురాలిగా భావించారు. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా ఆమె ఇందిరానగర్ కాలనీకి చెందిన గుంటి గంగవ్వ (65)గా గుర్తించారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నస్రుల్లాబాద్: మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు ఇలా.. కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన మన్నె నాగరాజు మంగళవారం నస్రుల్లాబాద్ నుంచి స్వగ్రామానికి సైకిల్‌పై బయలుదేరాడు. గ్రామ శివారులో డీసీఎం వాహనం ఎదురుగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా, సదరు వాహన డ్రైవర్ తనను పక్కకు పడేసి పారిపోయాడని బాధితుడు పేర్కొన్నాడు. స్థానికులు బాధితుడిని గుర్తించి చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు నేత!
● డివిజినల్ కమిటీ మెంబర్ హోదాలో పనిచేస్తున్న ఎర్రగొల్ల రవి ● రూ.5 లక్షల రివార్డు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న జిల్లాకు చెందిన మావోయిస్టు నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ సోమవారం రాత్రి పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రామయ్య, భూమవ్వల కుమారుడైన ఎర్రగొల్ల రవి 2001 లో కామారెడ్డిలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఆయన దండకారణ్యంలోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి ఆయన నుంచి ఇంటి ముఖం చూడలేదు. కొడుకుకోసం తల్లి భూమవ్వ ఎంతగానో తపించింది. లొంగిపోవాలని కొడుకును కోరిన ఆమె తన కోరిక తీరకుండానే ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ రెండున్నర దశాబ్దాలుగా పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీలలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం డివిజనల్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నట్లు సమాచారం. అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ దండకారణ్యంలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు రమేశ్ కూడా అజ్ఞాతంలో పనిచేస్తూ ఇటీవలే లొంగిపోయిన విషయం తెలిసిందే. -
గ్రామాల్లో చాటింపు
దోమకొండ/మాచారెడ్డి: దోమకొండనుంచి అంబారిపేటకు వెళ్లే దారిలో ఇటుకబట్టి వద్ద రైతు శ్రీనివాస్‌కు చెందిన బర్రెను మంగళవారం తెల్ల వారుజామున పులి చంపివేసింది. కొంతసేపటికే సంఘమేశ్వర్ శివారులో రైతు నారాయణకు చెందిన ఆవునూ చంపేసింది. అంబారిపేటలో బర్రె ను చంపిన స్థలాన్ని జిల్లా అటవీ అధికారి నిఖిత, డివిజనల్ పారెస్ట్ అధికారి రామకృష్ణ, పశుసంవర్ధక శాఖ అఽధికారి శివకుమార్ పరిశీలించారు. ఫరీద్‌పేట, అంబారిపేట, గొట్టిముక్కుల, మందాపూర్ ప్రాంతాల్లో ఎడ్లకట్ట వాగు పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని వారు తెలిపారు. అంబారిపేట, సంఘమేశ్వర్ శివార్లలో పశువులపై దాడి చేసిన పెద్దపులి చుక్కాపూర్, మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లిందని గుర్తించామన్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు గ్రామాలలో చాటింపు వేయించారు. ఫారెస్ట్ బీట్ అధికారులు పద్మ, పారూఖ్, అంబారిపేట సర్పంచ్ అరుట్ల కవిత, సంఘమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాస్‌రావు తదితరులు అధికారుల వెంట ఉన్నారు. మాచారెడ్డి మీదుగా.. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను వణికిస్తున్న పెద్దపులి మంగళవారం రాత్రి మాచారెడ్డి మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దమ్మ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ట్రాక్ కెమెరాల్లో నమోదైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. -
నాడు సతి.. నేడు పతి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని గున్కుల్ గ్రామాన్ని 2018లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 2019 లో ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన గంగి సునీత గెలిచి గ్రామ తొలి సర్పంచ్ అయ్యారు. ప్రస్తుత ఎన్నికలలో బీసీ జనరల్ రావడంతో ఆమె భర్త రమేశ్ యాదవ్ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి గెలిచారు. భిక్కనూరు: భిక్కనూరు రైల్వేస్టేషన్ గ్రామం భిక్కనూరు గ్రామపంచాయతీ పరిధిలో కొంత భాగం, బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మరికొంత భాగం ఉండేది. పంచాయతీల పునర్విభజనలో ఈ గ్రామాన్ని పంచాయతీగా చేశారు. ఊరి పేరును శ్రీసిద్దరామేశ్వరనగర్గా మార్చారు. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శ్రీసిద్దరామేశ్వరనగర్ బీసీ జనరల్ అయ్యింది. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన జనగామ శ్రీనివాస్ సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు కేటాయించడంతో ఆయన భార్య రాణి బరిలో నిలిచి గెలిచారు. ఎల్లారెడ్డి: మండలంలోని సోమార్పేట్ గ్రామంలో ట్రాక్టర్ దాడిలో గాయపడిన వారిని మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో ఐదుగురు గాయాలపాలయ్యారని, దాడి చేసిన వారితోపాటు కారకులను సైతం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ● బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఎల్లారెడ్డిరూరల్: సోమార్పేట్ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బిట్ల భారతి, బాలమణిలను ఎమ్మెల్యే మంగళవారం హైదరాబాద్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనకు సంబంధించి ఎస్పీ, డీఎస్పీలతో మాట్లాడి సంపూర్ణ విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. -
నేడు తుది పోరు
● ఎనిమిది మండలాల్లో 142 సర్పంచ్, 1,020 వార్డులకు ఎన్నికలు ● పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. మూడో విడత ఎన్నికలకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు మంగళవారమే చేరుకున్నారు. చివరి విడతలో జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో 168 గ్రామాల సర్పంచ్, 1,482 వార్డులున్నాయి. 26 మంది సర్పంచ్‌లు, 449 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. 13 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 142 గ్రామాల సర్పంచ్, 1,020 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 142 గ్రామాల సర్పంచ్ పదవులకు 462 మంది, 1,020 వార్డులకు 2,790 మంది పోటీ పడుతున్నారు. బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాలకు చేరిన సిబ్బంది.. మూడో విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాలకు మంగళవారమే పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని తీసుకుని వెళ్లారు. పలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి తదితరులు సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సూచించారు. భద్రత విధుల్లో 812 మంది.. తుది విడత పోలిం గ్‌కు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. 812 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు.కామారెడ్డి క్రైం: చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదంచెల భద్రతా వ్యవస్థలో మొత్తం 812 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు, అదనంగా 37 రూట్ మొబైల్ పార్టీలు, 8 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను మోహరించామని తెలిపారు. మూడో విడతలో ఉన్న 10 సమస్యాత్మక, 9 సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంక్ బాటిళ్లు, ఇంక్ పెన్నులు, అగ్గిపెట్టెలు, వాటర్ బాటిళ్లు, కత్తులు తీసుకురావడం నిషిద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.8,52,170 విలువైన 1,054.54 లీటర్ల మద్యం, రూ.4,50,250 విలువైన 1.635 కిలోల గంజాయి, 43 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నేర చరిత్ర కలిగిన 211 మందిని బైండోవర్ చేశామని, ఎన్నికల నియమావళి పరిమితికి మించి తీసుకెళ్తున్న రూ.10,89,000 నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 18 కేసులు నమోదు చేశామని తెలిపారు. -
పోలింగ్ సజావుగా జరగాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలనబిచ్కుంద/నిజాంసాగర్(జుక్కల్): మూడో విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పోలింగ్ అధికారులకు సూచించారు. ఎక్కడా తప్పులు జరగకుండా చూడాలన్నారు. బిచ్కుంద మార్కెట్ యార్డు, జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం సందర్శించారు. బస్సులలో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న సిబ్బంది, ఎన్నికల సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడో విడతలో 144 గ్రామ పంచాయతీలు, 1020 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. బూత్‌లు, గ్రామాల వారీగా ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఎన్నికల సిబ్బంది సహకరించాలన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే మీ పైఅధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వారి వెంట తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవోలు గోపాల్, శ్రీనివాస్ తదితరులు అధికారులు ఉన్నారు. నిబంధనలను పాటించాలి కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో జరుగుతున్న మూడో దశ గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బుధవారం ఎన్నికలు జరిగే అన్ని మండలాల పరిధిలో ఉదయం 5 నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల సామగ్రి సురక్షితంగా నిల్వ చేసే వరకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బెంబేలెత్తిస్తున్న బెబ్బులి
● మరో మూడుచోట్ల పశువులపై దాడి ● ఆందోళనలో ప్రజలుదోమకొండ పాత తాలూకా పరిధిలోని మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లో నాలుగైదు రోజులుగా పెద్దపులి సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతోంది. అంబారిపేటలో లేగదూడను బలితీసుకున్న సంఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు.. వేట మొదలుపెట్టారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి బెబ్బులి పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, మాందాపూర్, సంగమేశ్వర్, జనగామ, అంబారి, ఫరీదుపేట, బండరామేశ్వర్‌పల్లి గ్రామాల శివారు ప్రాంతాల గుండా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పెద్దమల్లారెడ్డిలో ఓ రైతు చేను వద్ద కట్టేసిన ఆవుపై దాడి చేసి దాన్ని చెరకు తోటలోకి లాక్కెళ్లి తిన్నట్లు గుర్తించారు. తర్వా సంగమేశ్వర్ గ్రామ శివారులో లేగదూడపైనా దాడి చేసింది. అంబారిపేట శివారులో గేదైపె దాడి చేసి చంపేసింది. పులి కదలికల ఆధారంగా చుక్కాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా భావిస్తున్నామని జిల్లా అటవీ అధికరి నిఖిత ‘సాక్షి’తో తెలిపారు. పొలాలకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు యాసంగి పంటలు సాగు చేసే సమయంలో పెద్దపులి సంచరిస్తుండడంతో రైతులు పొలాల దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మైదాన ప్రాంతం కావడంతో పులి పొదల చాటున ఉండాల్సిందే. దీంతో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. అంబారిపేట ప్రాంతంలో మూడు రోజులుగా రైతులకు కునుకు ఉండడం లేదు. దాదాపు అందరూ పశువులను పొలాల దగ్గర గుడిసెలు, పందిళ్ల కింద కట్టేసి వస్తుంటారు. పులి దాడులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ వైపు నుంచి పులి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.సాధారణంగా పెద్దపులులు దట్టమైన అటవీ ప్రాంతంలో తిరుగుతాయి. వాటికి అక్కడే రక్షణ ఉంటుంది. కానీ మైదాన ప్రాంతంలో పులి తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లో ప్రస్తుతం పెద్దపులి తిరిగినట్టు భావిస్తున్న గ్రామాల శివార్లలో గుట్టలు ఉన్నాయి తప్ప ఎక్కడా అడవైతే లేదు. అలాంటి మైదాన ప్రాంతంలో పులి సంచరిస్తుండడం సంచలనంగా మారింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారు దాటి ఇసాయిపేట, అన్నారం వైపు వెళితేనే అటవీ ప్రాంతం ఉంటుంది.పెద్దపులి సంచరిస్తుండడంతో అటవీ అధికారులకు కునుకు కరువైంది. మూడు రోజులుగా దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, భిక్కనూరు మండలాల్లోని ఆయా ప్రాంతాల్లో పశువులపై దాడి చేసిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. పులి ఎటువైపు వెళ్లిందన్న దాన్ని పసిగట్టేందుకు పులి అడుగులను గమనిస్తూ కిలోమీటర్ల మేర నడక సాగించారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి రేంజ్‌లలో పనిచేసే అటవీ అధికారులు, సిబ్బంది ఎక్కడినుంచి పులి దాడి చేసిందన్న సమాచారం వచ్చిన్నా ఆ గ్రామాలకు వెళుతున్నారు. అక్కడి పరిసరాలను పరిశీలించి అడుగులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. -
సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత
● ఓడిన అభ్యర్థి ఇంటిపై దాడి ● ట్రాక్టర్‌తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు ● ఆందోళనకు దిగిన గ్రామస్తులుఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: ఎన్నికలలో గెలిచినా ఆ సర్పంచ్ కుటుంబం సంతృప్తి చెందలేదు. బరిలో నిలిచి తమను ఇబ్బందులు పెట్టాడని ప్రత్యర్థిపై కక్ష పెంచుకున్న సదరు సర్పంచ్ తమ్ముడు.. ఏకంగా ట్రాక్టర్‌తో దాడి చేశాడు. ఐదుగురికి గాయాలు కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోమార్‌పేట్‌లో సర్పంచ్ పదవి కోసం కుర్మ పాపయ్యతోపాటు బిట్ల బాలరాజు పోటీ చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికలలో పాపయ్య విజయం సాధించారు. అయితే ఓడిపోయిన బాలరాజును సోమవారం పలువురు పరామర్శించారు. ఇంటిముందు కూర్చొని మాట్లాడుతుండగా.. ఆ దారిలో ట్రాక్టర్ తీసుకుని వచ్చిన సర్పంచ్ తమ్ముడు కుర్మ చిరంజీవులు అక్కడున్నవారిని ఢీకొట్టాడు. ట్రాక్టర్ దుక్కి దున్నే నాగలి కింద గంజి భారతి ఇరుక్కు పోవడంతో ఆమె నడుము విరిగి పోయింది. బూడమీద బాలమణి చేయి విరిగింది. మూడేళ్ల బాలుడు అద్విక్ కాలు విరగ్గా.. తోట శారద, పద్మ సత్యవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంజి భారతి, బాలమణి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురు ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎల్లారెడ్డిలో రాస్తారోకో.. ఎన్నికలలో తన అన్నకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కుర్మ చిరంజీవులు కక్ష పెంచుకున్నాడని, అతడు కావాలనే ట్రాక్టర్‌తో ఢీకొట్టాడని సోమార్పేట్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఎల్లారెడ్డిలోని రామాలయం వద్దనున్న ప్రధాన రహదారిపై నాలుగు గంటల పాటు రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత అందరి సంగతి చూసుకుంటామని సర్పంచ్, అతడి తమ్ముడు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబాలు బెదిరించారని గ్రామస్తులు ఆరోపించారు. ట్రాక్టర్‌తో దాడి చేసిన చిరంజీవులుతో పాటు సర్పంచ్ పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు.. రాస్తారోకోను విరమింపజేసేందుకు పోలీసులు ప్ర యత్నించినా ఎవరూ వినలేదు. దీంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్ ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర మాజీ ఎమ్మెల్యే జాజాలతో ఫోన్లో మాట్లాడా రు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకు లు జలంధర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, సతీష్, బీజేపీ నాయకులు నర్సింలు, బాలకిషన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా ఎల్లారెడ్డి: సోమార్పేట్ సంఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మాజీ ఎమ్మెల్యే జాజాలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేటీఆర్ ఎస్పీతో ఫోన్ ద్వారా మాట్లాడారని, సర్పంచ్ తమ్ముడితో పాటు దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారని జాజాల సురేందర్ తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ మంగళవారం సోమార్‌పేట్‌కు రానున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం ఆయన సోమార్‌పేట్‌కు వస్తారని పేర్కొన్నారు.సోమార్‌పేట్‌లో ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాలని చూసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్ తెలిపారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటినుంచి తన ప్రత్యర్థి అయిన కురుమ పాపయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కుర్మ సాయి బాబా, కుర్మ శంకర్, కుర్మ చిరంజీవులు, కుర్మ సాయిలు, కుర్మ స్వప్న, కుర్మ లత, కుర్మ శోభ, కుర్మ దుర్గవ్వ బెదిరింపులకు దిగుతున్నారని బిట్ల బాలరాజు ఆరోపించారు. తమకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, మీ అంతు చూస్తామని బెదిరించారని పేర్కొన్నారు. సోమవారం కురుమ చిరంజీవులు అనే వ్యక్తి ట్రాక్టర్‌తో ఢీకొట్టగా ఐదుగురికి గాయాలయ్యాయని, తాను తప్పించుకున్నానని.. ట్రాక్టర్‌తో దాడి చేసిన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.సోమార్పేట్ ఘటనలో గాయపడిన తోట శారద, అద్విక్, పద్మ సత్యవ్వలను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అనుచరులు నియోజకవర్గంలో రౌడీయిజం చెలాయిస్తున్నారన్నారు. అమాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. సోమార్‌పేట్‌లో ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఐదుగురిని గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
మూడో దశ పోలింగ్‌కు ర్యాండమైజేషన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్లో చేపట్టారు. సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ల ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: చౌకధరల దుకాణాల ద్వారా డిసెంబర్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యంను ఈనెల 18 వరకు పంపిణీ చేయన్నారు. ఈ విషయాన్ని పౌర సరఫరాల అధికారులు తెలిపారు. విడతల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో బియ్యం పంపిణీని పొడిగించామని పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: తమను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని భిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన పలువురు దళితులు అదనపు కలెక్టర్ విక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం వారు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ గ్రామంలో 40 దళిత కుటుంబాలున్నాయన్నారు. గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయాడని, అంత్యక్రియల్లో డప్పు కొట్టాలని అతడి కుటుంబ సభ్యులు అడిగారని పేర్కొన్నారు. అయితే తమ పిల్లలందరూ చదువుకుంటున్నారని, డప్పు కొట్టేవారు లేరని చెప్పామని వివరించారు. దీంతో గ్రామ పెద్దలు 40 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు, వైద్యం, రవాణా సదుపాయాలు అందకుండా చూస్తున్నారన్నారు. ఎవరైనా ఈ ఆంక్షలను అతిక్రమిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ విషయమై ఎస్పీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేస్తామన్నారు. -
పోలీసుల విస్తృత తనిఖీలు
నందిపేట్(ఆర్మూర్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నందిపేట మండలంలో సోమవారం పోలీసులు, ఎన్నికల అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉమ్మెడ బ్రిడ్జి సమీపంలో అయిలాపూర్, కంఠం, నందిపేట, వెల్మల్ గ్రామాల సమీపంలోని ప్రధాన రోడ్ల వెంట అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్యాంరాజ్ మాట్లాడుతూ వాహనాల్లో మద్యం బాటిళ్లు, రూ. 50 వేలకు మించి నగదు తరలించరాదని హెచ్చరించారు. ఆర్మూర్‌లో..ఆర్మూర్‌టౌన్: పట్టణంలో సోమవారం రాత్రి ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాతబస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులు, హోటళ్లు, పాన్‌షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ ద్వారా పరిశీలించారు. -
అవినీతి రహిత కామారెడ్డికి కృషి చేయాలి
● తాయిలాలు ఇవ్వకుండా గెలిస్తేనే ప్రజాసేవ చేస్తాం ● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికామారెడ్డి టౌన్: అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులను సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా విజయం సాధించినప్పుడే ప్రజలకు సేవ చేయగలమన్నారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిస్తే ప్రజల సొమ్ము దారి తప్పి అభివృద్ధి కుంటపడుతుందన్నారు. ప్రజా సేవ కోసమైతేనే రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఓటర్లు కూడా మద్యం, డబ్బుకు లొంగకుండా నిజాయితీపరులను, ప్రజా సేవకులను గెలిపించుకోవాలని కోరారు. బీజేపీ మద్దతుదారులు మద్యం, డబ్బు పంచకుండా పోటీ చేసి గెలుపొందడం అభినందించదగ్గ విషయమన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే విజయ స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు. -
‘పాలకవర్గంపై కక్షతోనే ఫిర్యాదులు’
గాంధారి: ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గంపై కొందరు కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని సోమ్లానాయక్ తండావాసులు పేర్కొన్నారు. ఈ విషయమై సోమవారం తహాసల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమ్లానాయక్ తండా సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఈనెల 7న పంచాయతీ రిటర్నింగ్ అధికారి ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందించారన్నారు. అయితే పంచాయతీ పరిధిలోని పంతులు నాయక్ తండాకు చెందిన కొందరు వ్యక్తిగత కక్షతో నూతన పాలకవర్గాన్ని రద్దు చేయాలని లేదా తమ తండా అభివృద్ధికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో, తహసీల్దార్లను కోరారు. -
ష్.. గప్‌చుప్!
● ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ● రేపు చివరి విడత పోలింగ్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సైలెన్స్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి అభ్యర్థులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. జిల్లాలో చివరి విడతలో బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి, మలి విడతల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు. చివరి విడతలోనూ పట్టు నిలుపుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీల నేతలు సైతం తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చివరి నిమిషం దాకా ప్రచారం చేశారు. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లభ్యర్థిస్తూనే పలుచోట్ల ర్యాలీలు తీశారు. ప్రచారంలో పార్టీల ప్రముఖులు ఎన్నికల్లో తమ తమ పార్టీల మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభివృద్ధిని చూసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన తనయుడు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారుల కోసం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారంలో పాల్గొన్నారు. బాన్సువాడ కాంగ్రెస్‌లో రెండు గ్రూపులున్నాయి. పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు చాలాచోట్ల పోటీచేస్తున్నారు. ఎవరికివారే పోటాపోటీగా ప్రచారం చేశారు. బీజేపీ నేతలు కూడా వారి మద్దతుదారుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చాలా గ్రామాల్లో ప్రచారం చేశారు. అభివృద్ధి కోసం తమ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, డోంగ్లీ మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే కూడా చాలా గ్రామాల్లో తమ పార్టీ మద్దతుదారుల కోసం ప్రచారం చేశారు. నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేదాకా తమ పార్టీకి చెందిన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. మద్నూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ మద్దతుదారుల తరఫున మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార ప్రచారం చేశారు. -
డ్రా పద్ధతిలో వార్డు సభ్యుడి ఎన్నిక
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డుకు ఆదివారం జరిగిన ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు రావడంతో వారిలో ఒకరిని అధికారులు డ్రా పద్ధతిలో ఎన్నుకున్నారు. 4వ వార్డు స్థానానికి గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్, మంగలి మహేశ్ నామినేషన్లు వేశారు. వీరికి 61 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో ఇరువురి పేర్లను చీటీలలో రాసి డ్రా తీయగా అందులో చాకలి శ్రీకాంత్ పేరు రావడంతో ఆయనను వార్డు సభ్యుడిగా ఎన్నుకున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజీపేట గ్రామానికి చెందిన సోను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికై నట్లు తండావాసులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలు తమిళనాడులోని చైన్నెలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సోను హైదరాబాదులోని జేఎన్టీయూహెచ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. జిల్లాలోని మారుమూల తండా నుంచి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడంతో తండావాసులు సోనును అభినందించారు. బాన్సువాడ: బీర్కూర్ మండలం నుంచి నస్రుల్లాబాద్ వైపునకు వెళ్తున్న కారులో రూ.6.70 లక్షలను ఎస్ఎస్టీ బృందం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. బృందం సభ్యులు జ్యోతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నగదును తీసుకెళ్లకూడదన్నారు. నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని మద్యం, కల్లు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. మూడో విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఎకై ్స జ్ అధికారులు ఆదేశించారు. అందులో భాగంగా నస్రుల్లాబాద్, దుర్కి వైన్సులను, ఆయా గ్రామాల్లో ఉన్న కల్లు దుకాణాలకు ఎకై ్సజ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, సందీప్‌లు సీలు వేశారు. వేల్పూర్: వేల్పూర్ మండలం వెంకటాపూర్, కోమన్‌పల్లి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సరియైన సౌకర్యాలు ఉన్నవి లేనివి చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని మండలస్థాయి అధికారులకు సూచించారు. ఓటర్లకు తాగునీరు, నీడకోసం టెంట్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో బాలకిషన్, ఆర్.ఐ. గోపాల్,జీపీల కార్యదర్శులు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్: ఓ తల్లి రెండు నెలల కు మారుడిని విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీనివాస్ ఈ నెల 5న తన భార్య, కుమారుడు కని పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ నెల 10న సదరు మహిళ తిరిగి ఇంటికి వచ్చింది. అయితే తల్లితోపాటు కుమారుడు లేకపోవడంతో శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తల్లే కుమారుడిని మహారాష్ట్ర పుణెలోని విశాల్ అనే వ్యక్తికి రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు తేల్చారు. బాలుడి విక్రయంలో ఎల్లమ్మగుట్టకు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారు. పోలీసులు బాలుడి తల్లిని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని తండ్రికి అప్పగించారు. -
సంఘటన స్థలం పరిశీలన
దోమకొండ: అంబారిపేట శివారులో పెద్దపులి దాడిలో చనిపోయిన దూడల కళేబరాలను సోమవారం మండల పశువైద్యాధికారి శివకుమార్, సిబ్బంది పరిశీలించారు. సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ పారూఖ్, బీట్ ఆఫీసర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. పాదముద్రల పరిశీలన బీబీపేట: మాందాపూర్ శివారులో పులి సంచరిస్తోందని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సోమవారం అటవీ శాఖ సిబ్బంది వచ్చి పాదముద్రలను సేకరించారు. ఎడ్ల కట్ట వాగు శివారులో పులి సంచరించినట్లు గుర్తించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో రాత్రి సమయంలో ఎవరూ అటవీ ప్రాంతాలకు వెళ్లరాదని చాటింపు వేయించారు.అంబారిపేట శివారులో పంచనామా నిర్వహిస్తున్న పశువైద్యాధికారి శివకుమార్ -
చల్లటి చలికి వెచ్చటి గొంగళి
రామారెడ్డి: జిల్లాలో చలి చంపేస్తోంది. వెచ్చదనం కోసం జనాలు పడరాని పాట్లు పడుతున్నారు. చలి మంటలు వేసుకుంటున్నారు. అయినా రాత్రిపూట ఈ వారం రోజులుగా తీవ్రమైన చలి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. వెచ్చదనం కోసం స్వెట్టర్లు, మఫ్లర్లు, అన్నీ కప్పుకున్నా చలి నుంచి తట్టుకోకపోవడంతో గ్రామాలలో పల్లెల్లో చేతితో తయారుచేసిన గొంగడిని ఖరీదు చేసి చలి బారి నుంచి కొంతమేర ఉపశమనం పొందుతున్నారు. ఒక్కో గొంగడికి రూ.15 వందల నుంచి 2 వేల వరకు డిమాండ్ పలుకుతోంది. అయితే ఈ గొంగళ్లు మూడు నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతిరోజూ వాడినా నాణ్యత బాగా ఉంటోందని, అందుకే అంత డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. గొంగడిని ఎక్కువగా కురుమ, యాదవ కులస్తులే వాడేవారు. కానీ ప్రస్తుతం చలికి తట్టుకోలేక అందరూ గొంగడిని కొని రాత్రి వేళలో కప్పుకుంటున్నారు. ● పల్లెల్లో గొంగడికి పెరిగిన డిమాండ్ ● చేతితో తయారు చేసిన గొంగళికి రూ.1500 నుంచి 2000 వరకు డిమాండ్ గొంగళ్లు అమ్ముతున్న మహిళ గొంగడి కప్పుకున్న వృద్ధుడు -
భిక్కనూరులో చిరుత పులి సంచారం
భిక్కనూరు: మండలంలోని లక్ష్మిదేవునిపల్లి, బంజర్ల, కాచాపూర్ శివారుల్లోని వ్యవసాయ క్షేత్రాల వద్ద చిరుతపులి సోమవారం వేకువజామున సంచరించింది. దూరం నుంచి చూసిన రైతులు పులి కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సెక్షన్ అధికారి బాబా, బీట్ అధికారులు దీపిక, సురేశ్ పరిశీలించి ఆనవాళ్లను సేకరించారు. చిరుతకు సంబంధించిన కాలి గుర్తులు కనిపించాయని అటవీశాఖాధికారులు తెలిపారు. చిరుత దాడి.. దూడ మృతి తాడ్వాయి (ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ శివారులో గల వ్యవసాయ పొలం వద్ద కట్టేసిన దూడపై చిరుత దాడిచేసింది. గ్రామానికి చెందిన భూంపల్లి సంగయ్య రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రం దూడను గ్రామ శివారులోని తన కొట్టం వద్ద కట్టేసి ఇంటికి వచ్చారు. రాత్రి పశువులకు మేత(గడ్డి)ను వేసేందుకు వెళ్లగా కట్టేసిన దూడను చిరుత పులికొరికి చంపివేసినట్లు కనిపించింది. దీంతో సంగయ్య భయాందోళన చెంది గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు చిరుత దాడిచేసి చంపినట్లు నిర్ధారించారు. కాగా, ఎర్రాపహాడ్ శివారు పక్కనే ఉన్న మోతే శివారులో చిరుత తిరుగుతున్నట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. సోమవారం ముస్తాపూర్ బీట్ ఆఫీసర్ కళ్యాణి, ఎర్రాపహాడ్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, మండల పశువైద్యాధికారి రమేశ్ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించారు. -
వచ్చింది పెద్దపులే!
దోమకొండ మండలం అంబారిపేట శివారులోని పంట చేల వద్ద ఆదివారం దూడలపై పులి దాడి నేపథ్యంలో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించిన అధికారులు.. అవి కచ్చితంగా పెద్దపులివే అన్న నిర్ధారణకు వచ్చారు. వెంటనే అక్కడికి చుట్టుపక్కల ప్రాంతంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దూడలను చంపిన ప్రాంతంలో పులి సంచరించినట్లు కెమెరాల్లో రికార్డయ్యింది. జిల్లా అటవీ అధికారి బోగ నిఖిత ఆ ప్రాంతాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. పెద్దపులి ఎటువైపు నుంచి ఎటు వెళ్లిందన్న దానిపై అటవీ సిబ్బందితో సమీక్షించారు. రైతుల్లో ఆందోళన జిల్లాలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టైగర్ తిరిగిన ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రాలే కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి వరి నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నవారు భయపడుతున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ మండలాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించి ఆవులపై దాడులు చేసింది. అయితే దాని జాడ కోసం దాదాపు నెల రోజుల పాటు అటవీ అధికారులు నిఘా వేసినా అది ఎటువైపు వెళ్లిందో తేల్చలేకపోయారు. నాలుగు నెలల తర్వాత మరో పులి రావడం సంచలనంగా మారింది. మైదాన ప్రాంతంలో తిరుగుతున్న పెద్దపులి ఎవరిపై పంజా విసురుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పొలాల దగ్గరకు వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. పెద్దపులి జాడ వెలుగు చూసిన అంబారిపేటకు చుట్టుపక్కల గ్రామాలైన గోపాల్పేట, కోనాపూర్, యాడారం, ఫరీదుపేట, బండరామేశ్వర్‌పల్లి, లచ్చాపేట తదితర గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. అటువైపు పెద్దపులి రావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కవ్వాల్ నుంచి వచ్చిందా...? అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి జాడలు బయటపడిన నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై అటవీ అధికారులు దృష్టి సారించారు. మన దగ్గర పులులు లేవన్న కచ్చితమైన అభిప్రాయంతో ఉన్న అటవీ అధికారులు.. అప్పట్లో జిల్లాలో తిరిగిన పెద్దపులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వివిధ జిల్లాలు తిరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో దాని కదలికలు బయటపడ్డాయి. అయితే అప్పట్లో ట్రాప్ కెమెరాల ద్వారా దాని కదలికలు కనుక్కునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అది ఎటువైపు వెళ్లిందన్నదీ స్పష్టం కాలేదు. తాజాగా అంబారిపేట ప్రాంతంలో దూడలపై పెద్దపులి దాడి చేయడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. దాని కదలికలపై నిఘా పెట్టారు. ఇప్పటికే కెమెరాలకు చిక్కడంతో పెద్దపులి ఇదే ప్రాంతంలో ఉండి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరీవాహక ప్రాంతంతో పాటు పాల్వంచ వాగు పరీవాహక ప్రాంతంలో తిరుగుతుండవచ్చని భావిస్తున్నారు. -
జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది కూడా మైదాన ప్రాంతంలో తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఎగువ మానేరు జలాశయం ఎగువ భాగాన పెద్దపులి తిరుగుతున్నట్టు స్పష్టమైంది. – సాక్షి ప
అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి తిరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అది సంచరించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి సంచారం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. దాని కదలికలను గమనిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నాం. – నిఖిత, జిల్లా అటవీ అధికారి, కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో సంచారం లేగదూడలపై దాడితో వెలుగులోకి.. పాదముద్రలను పరిశీలించి కెమెరా ట్రాప్స్ ఏర్పాటు కెమెరాలో రికార్డయిన పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు అప్రమత్తమైన అటవీ అధికారులు -
హాకీ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బాలబాలికల అండర్–17 హాకీ ఎంపికలు సోమవారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేశారు. వీరు రాష్ట్రస్థాయి అండర్–17 హాకీ క్రీడల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కే హీరాలాల్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి ఆర్ వెంకటేశ్వరగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు నోముల మధుసూదన్‌రెడ్డి, ఆంజనేయులు, స్వామి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘెరం.. తమపై పోటీచేశారని కోపంతో మహిళలపైకి ట్రాక్టర్ ఎక్కించి
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో దారుణం జరిగింది. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేశారని కోపంతో ఒక అభ్యర్థి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సోమర్‌పేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పాపయ్య, బాలరాజ్ అనే ఇద్దరు అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో పాపయ్య గెలుపోందారు. దీంతో ఎన్నికల్లో తమ పైనే పోటీ చేశారనే కోపంతో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి తమ్ముడైన చిరంజీవి అనే వ్యక్తి బాలరాజ్ కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించాడు.ఈ ప్రమాదంలో బాలరాజుతో పాటు వారి కుటుంబ సభ్యులు బాలమణి, స్వరూప, భారతి, పద్మసత్వవలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనతో సోమర్‌పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ ఘటనపై సోమర్‌పేట గ్రామం భగ్గుమంది. గెలిచిన అభ్యర్థి పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా కలిసి ఎల్లారెడ్డిలో 4 గంటలుగా ధర్నా చేపడుతున్నారు. ఎల్లారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మెుహరించారు. రాష్ట్రంలో మూడుదశలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఆదివారం రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. చివరిదశ ఎలక్షన్లు 17 తారీఖున జరగనున్నాయి. -
నాడు ఓటమి.. నేడు గెలుపు
నిజాంసాగర్: మహ్మద్‌నగర్ మండలం హసన్‌పల్లి గ్రామ సర్పంచ్ పదవి కోసం బోయిని హరిన్‌కుమార్, సంగమేశ్వర్ గౌడ్ పోటీ చేశారు. ఈ ఎన్నికలలో హరిన్‌కుమార్ తన ప్రత్యర్థిపై 261 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాగా గత ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రత్యర్థులు కావడం గమనార్హం. నాటి ఎన్నికలలో హరిన్కుమార్పై సంగమేశ్వర్ గౌడ్ గెలిచారు. నిజాంసాగర్: మహమ్మద్‌నగర్ మండలం కోమలంచ గ్రామానికి చెందిన బండారి లక్ష్మి గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆమె 2019లో ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లపాటు ఎంపీటీసీగా సేవలందించారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగియగా.. ఇక చివరి విడతకు సంబంధించి ప్రచార పర్వం సోమవారంతో ముగియనుంది. ఆయా స్థానాలకు ఈనెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో చివరి విడతలో బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ మండలాల పరిధిలోని 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 26 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 1,482 వార్డులకుగాను 4 వందల వార్డులకు సింగిల్ నామినేషనే దాఖలయ్యింది. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పలువురు అభ్యర్థులు ర్యాలీలు తీయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు.. పోలింగ్ జరగనున్న గ్రామాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 163 సెక్షన్ అమలులో ఉండనుంది. 17వ తేదీన కౌంటింగ్ పూర్తై విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో కల్లు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ జోరు..
● రెండో విడతలో మెజారిటీ పంచాయతీలు హస్తం ఖాతాలోకి.. ● పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ మద్దతుదారులు ● గాంధారిలో రికార్డు స్థాయి మెజారిటీరాష్ట్రంలో ప్రజాపాలనకు ఆశీర్వాదమే పంచాయతీ ఎన్నికల ఫలితాలు. జుక్కల్ నియోజకవర్గంలో 75 శాతం పంచాయతీలలో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. మూడో విడతలోనూ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటాం. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని మరింత చూరగొంటాం. – లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే, జుక్కల్ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. అందుకే మా పార్టీకి అండగా నిలిచారు. ఓటర్ల ఆదరణతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ప్రజల మద్దతుతో గ్రామాల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాం. – మదన్మోహన్రావు, ఎమ్మెల్యే, ఎల్లారెడ్డిజిల్లాలో రెండో విడతలో గాంధారి, లింగంపేట, మహ్మద్‌నగర్, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని 197 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 44 గ్రామాల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 1,654 వార్డులు ఉండగా 776 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 153 సర్పంచ్ పదవులకు 606 మంది, 873 వార్డులకు 2,655 మంది పోటీ పడ్డారు. ఆదివారం పోలింగ్ నిర్వహించారు. సర్పంచ్ స్థానాలు ఎక్కువగా కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఆదివారం ఎన్నికలు నిర్వహించిన 153 స్థానాలలో 104 పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోగా.. 29 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు, ఎనిమిది చోట్ల బీజేపీ మద్దతుదారులు, 12 స్థానాలలో స్వతంత్రులు గెలుపొందారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో.. ఎల్లారెడ్డి మండలంలో 31 పంచాయతీలు ఉండగా ఐదు ఏకగ్రీవమయ్యాయి. 26 సర్పంచ్ పదవులకు 70 మంది పోటీ పడ్డారు. 20 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఐదు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒక పంచాయతీలో ఇండిపెండెంట్ గెలుపొందారు. లింగంపేట మండలంలో 41 పంచాయతీలకుగాను 14 ఏకగ్రీవమయ్యాయి. 29 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 24 గ్రామాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల బీఆర్ఎస్, రెండు చోట్ల బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. నాగిరెడ్డిపేట మండలంలో 27 పంచాయతీలకుగాను ఆరు ఏకగ్రీవమయ్యాయి. 21 పంచాయతీలకు ఎన్నికలు జరిగ్గా.. ఎనిమిది గ్రామాల్లో కాంగ్రెస్, ఐదు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ, ఏడు చోట్ల స్వతంత్రులు గెలిచారు. గాంధారి మండలంలో 45 పంచాయతీలు ఉండగా 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29 స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. 22 చోట్ల కాంగ్రెస్, నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్, రెండింటిలో బీజేపీ మద్దతుదారులు, ఒకచోట స్వతంత్య్ర అభ్యర్థి గెలుపొందారు. గాంధారి మండల కేంద్రంలో.. మండల కేంద్రమైన గాంధారిలో మమ్మాయి రేణుక భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె తన సమీప ప్రత్యర్థి ఆకుల కల్పనపై 2,119 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. అడివిలింగాల సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యాన్ని టాస్ నిర్ణయించింది. సర్పంచ్ అభ్యర్థులు మంగళి సంతోష్‌కుమార్, పెంట మానయ్యలకు చెరో 483 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ ద్వారా సర్పంచ్‌ను ఎంపిక చేశారు. టాస్‌లో మంగళి సంతోష్‌కుమార్‌ను అదృష్టం వరించింది.మహ్మద్‌నగర్‌లో 13 పంచాయతీలుండగా ఒకటి ఏకగ్రీవమయ్యింది. 12 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, రెండు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. నిజాంసాగర్ మండలంలో 14 పంచాయతీలకు గాను ఒకటి ఏకగ్రీవమైంది. 13 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏడు గ్రామాల్లో కాంగ్రెస్, నాలుగు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒకచోట బీజేపీ, మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పిట్లం మండలంలో 26 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవమైంది. 25 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 19 చోట్ల కాంగ్రెస్, నాలుగు గ్రామాల్లో బీఆర్ఎస్, రెండు పంచాయతీలలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు.పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మలి విడతలోనూ ఆ పార్టీనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్ పోటీ ఇచ్చింది. బీజేపీ నామమాత్రంగానే జీపీలను గెలుచుకుంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
అంబారిపేట శివారులో చిరుత సంచారం
● రెండు దూడలపై దాడి ● భయాందోళనల్లో గ్రామస్తులుదోమకొండ: అంబారిపేట గ్రామ శివారులో ఆదివారం చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతులు రంగోల్ స్వామిగౌడ్, బంజారా ప్రవీణ్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేసరికి రెండు దూడలు మృతిచెంది ఉన్నాయి. చిరుత దాడిచేసి చంపేసి ఉంటుందని భావించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. పెద్ద సైజులో పాదముద్రలు ఉన్నట్లు గుర్తించామని మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ తెలిపారు. మగ చిరుతపులి లేదా పులి సైజులో పాద ముద్రలు ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రాంతంలో పులి సంచరించే అవకాశాలు తక్కువగా ఉన్నందున మగ చిరుతపులివే అయి ఉంటాయని భావిస్తున్నామన్నారు. అంబారిపేట, ఫరీదుపేట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ పారూఖ్, బీట్ ఆఫీసర్ పద్మ, సర్పంచ్ అరుట్ల కవిత తదితరులున్నారు. -
రెండో విడతలోనూ పోటెత్తారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఏడు మండలాల్లోని 153 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులతో పాటు 873 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే చాలాచోట్ల ఓటర్లు బారులు తీరారు. పెద్ద గ్రామాల్లో భారీ లైన్లు కనిపించాయి. పోలింగ్ సమయం ముగిసే సమయంలో వరుసలో నిల్చున్న వారందరి ఓటేసే అవకాశం కల్పించారు. రెండో విడతలో 86.08 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. లింగంపేట మండలంలో పోలింగ్ ఉదయం మందకొడిగా సాగినా చివరికి 83.64 శాతం ఓట్లేశారు. ఎల్లారెడ్డి మండలంలో అత్యధికంగా 89.72 శాతం పోలింగ్ నమోదు కాగా.. నిజాంసాగర్‌లో 88.73 శాతం, నాగిరెడ్డిపేటలో 88.69 శాతం, మహ్మద్‌నగర్‌లో 86.68 శాతం, గాంధారిలో 85.22 శాతం, పిట్లంలో 84.12 శాతం పోలింగ్ రికార్డయ్యింది. పోలింగ్ కేంద్రాల సందర్శన రెండో విడత ఎన్నికలు జరిగిన గ్రామాలలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవోలు, డీఎస్పీలు సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. 153 సర్పంచ్, 873 వార్డులకు పోలింగ్ ఓటింగ్ శాతం 86.08 గా నమోదు ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ -
అభివృద్ధిలో భాగమవుతా
● పంచాయతీలకు ఫర్నిచర్ అందిస్తా ● ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్రెడ్డిబీబీపేట: పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయడంలో భాగస్వామినవుతానని ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ గ్రామంలోని ఆయన నివాసంలో నూతనంగా ఎన్నికై న పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి అవసరమైన ఫర్నిచర్ అందిస్తానని పేర్కొన్నారు. ఫర్నిచర్ కోసం చిన్న పంచాయతీకి లక్ష రూపాయల వరకు, పెద్ద పంచాయతీలకు రూ. 2 లక్షల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. నూతన పాలకవర్గాలు అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. -
తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదని దాడి
● రెంజల్ మండలం వీరన్న గుట్టలో ఘటన ● నలుగురి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ బోధన్‌రూరల్: తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదనే కక్షతో రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో పలువురిపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. బోధన్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. వీరన్నగుట్ట గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన రిజ్వానా బేగంకు మద్దతు ఇవ్వలేదని, అనుకూలంగా ఓట్లు వేయలేదని ఆమె కొడుకులు ఇబ్రహీం, అబు బాకర్ తమ అనుచరులు సిరాజ్, వాజీద్, ఇలియాస్, అవేజ్, ఆరిఫ్, మోయిన్ ఖాన్ తదితరులతో కలిసి జమీలుద్దీన్, అఫ్సర్, హైమద్‌పై మరణాయుధాలతో ఈ నెల 12వ తేదీన నూర్ మసీద్ వద్ద ప్రార్థనల అనంతరం దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశా మని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి దాడి కి ఉపయోగించిన ఎంహెచ్ 46 ఏఎల్ 6852 నంబర్ కారుతోపాటు రెండు కత్తులు, ఐరన్ రాడ్డులు, కర్రలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొంత పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. సమావేశంలో బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
తిప్పాపూర్‌లో ‘కత్తెర’ హ్యాట్రిక్!
● వరుసగా మూడుసార్లు ఈ గుర్తు అభ్యర్థులదే విజయంభిక్కనూరు: తిప్పాపూర్ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థులకు కత్తెర గుర్తు కలిసివస్తోంది. వరుసగా మూడు ఎన్నికలలోనూ ఈ గుర్తు వచ్చినవారే విజయ తీరాలకు చేరడం గమనార్హం. 2013లో తిప్పాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తాటిపల్లి జమున పోటీ చేశారు. కత్తెర గుర్తుపై పోటీ చేసిన ఆమె గెలుపొందారు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ జనరల్ అయ్యింది. కోక స్వామి కాంగ్రెస్ మద్దతుతో కత్తెర గురుపై పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికలలో ఈ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన కుంట లింగారెడ్డికి కత్తెర గుర్తు వచ్చింది. ఆయన తన సమీప ప్రత్యర్థి రాజయ్యపై 59 ఓట్ల వ్యత్యాసంతో గెలిచారు. వరుసగా మూడు పర్యాయాలు కత్తెర గుర్తుపై పోటీ చేసినవారే గెలుపొందడం మండలంలో చర్చనీయాంశమైంది. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
దోమకొండ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని అంచనూరు గ్రామానికి చెందిన యువకుడు భాస్కరి నందు (23) శుక్రవారం రాత్రి ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నా యి. హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ జీవిస్తు న్న భాస్కర్ గురువారం గ్రామంలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అతడు మనోవేదన కు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. మృతుడి తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యం కారణంతో.. భిక్కనూరు: అనారోగ్య సమస్యల కారణంగా ఇసన్నపల్లి గ్రామానికి చెందిన మందస్వామి(52) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనే యులు తెలిపారు.కొంతకాలంగా ఫిట్స్‌తో బాధపడుతున్న మందస్వామి జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి అతడిని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భిక్కనూరు: మండలంలోని కా చాపూర్ గ్రామానికి చెందిన మె ట్టు నరేశ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయు లు శనివారం తెలిపారు.20 రో జుల క్రితం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన నరేశ్ తిరి గి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారని తెలిపారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
కారు దహనం
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండలం మచ్చర్లలో మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారుకు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఎప్పటిలాగే నర్సయ్య కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ కారు దహనమవుతున్నట్లు గమనించిన స్థానికులు అతడికి సమాచారం అందించారు. నర్సయ్య అక్కడికి చేరుకునే సరికి కారు మంటల్లో కాలిపోతోంది. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
క్రైం కార్నర్
రుద్రూర్: మండలంలోని సులేమాన్‌నగర్ శివారులో మన్నె శ్రీను (43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లికి చెందిన మన్నె శ్రీను గత నాలుగేళ్ల నుంచి రుద్రూర్ మండలం కొందాపూర్లోని తన మేన మామ వద్ద గేదెలు మేపుతూ జీవిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఎడపల్లికి వెళ్లిన అతడు.. శనివారం ఉదయం సులేమాన్‌నగర్ శివారులో మృతదేహమై కనిపించాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న శ్రీను.. మత్తులో మూత్ర విసర్జనకు నడుచుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోర్ల పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి మేనమామ బాల్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై సాయన్న తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు.. బాన్సువాడ: పట్టణానికి చెందిన ఉప్పరి లక్ష్మి(65) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న లక్ష్మి అప్పుడప్పుడు కల్కి చెరువుకు వెళ్లి స్నానం చేసి బట్టలు ఉతుక్కునేది. ఈ నెల 12వ తేదీన చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన లక్ష్మి ప్రమాదవశాత్తు కాలు జారి పడి నీట మునిగి చనిపోయింది. మృతురాలి కుమార్తె గంట లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. -
మలి దశకు రెడీ
● నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు ● 153 సర్పంచ్, 873 వార్డులకు పోలింగ్ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుజిల్లాలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, మహమ్మద్‌నగర్ మండలాలలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలో 197 పంచాయతీలు, 1654 వార్డులు ఉండగా, 44 సర్పంచ్ పదవులు, 776 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 153 సర్పంచ్ పదవులకు 606 మంది, 873 వార్డులకు 2,655 మంది పోటీ పడుతున్నారు. 1,89,177 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఆయా పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. మొదటి విడతలో పలు మేజర్ పంచాయతీల్లో అర్ధరాత్రి దాటిన తర్వాతే కౌంటింగ్ పూర్తయ్యింది. ఈసారి కౌంటింగ్‌లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఏడు మండలాల పరిధిలోని 153 సర్పంచ్, 873 వార్డు స్థానాలలో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో శనివారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయా మండలాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వెళ్లి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి అవసమరైన రవాణా, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడా లోపం జరగకూడదని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.వారం, పది రోజులపాటు అభ్యర్థులు, వారి తరఫున ఆయా రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పోటాపోటీగా ఖర్చు చేశారు. ఊరూరా కుల సంఘాలకు విందులు ఇచ్చారు. చివరి రెండు రోజుల్లో పంపకాలు జరిగాయన్న ప్రచారం ఉంది. ప్రధానంగా పెద్ద పంచాయతీలైన గాంధారి, లింగంపేట, పిట్లం మండల కేంద్రాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గెలుపుకోసం భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మూడు గ్రామాలు కూడా పెద్దవి కావడంతో అక్కడ తీవ్ర పోటీ నెలకొంది. ఆదివారం పోలింగ్ జరిగే స్థానాల్లో పలుచోట్ల ద్విముఖ, కొన్నిచోట్ల త్రిముఖ పోటీ నడుస్తోంది. పోటీలో ఉన్న వారి తరఫున ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పిట్లం, మహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే విస్తృతంగా తమ పార్టీ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. అలాగే ఆయా మండలాల్లోని పెద్ద గ్రామాల్లో సర్పంచ్ పదవితో పాటు వార్డుల్లోనూ గట్టి పోటీ నెలకొంది. చాలా చోట్ల ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్నది రాత్రి వరకు తేలిపోనుంది. -
ఆ పల్లెల్లో తొలిపొరు ..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కన్నారెడ్డి, చిన్నఆత్మకూర్ గ్రామపంచాయతీలలో ఆదివారం తొలిపొరు జరుగనుంది. యేడాది క్రితం మండలంలోని ధర్మారెడ్డి గ్రామపంచాయతీ నుంచి కన్నారెడ్డి, ఆత్మకూర్ గ్రామపంచాయతీ నుంచి చిన్నఆత్మకూర్ వేరు పడి నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో ఆ పల్లెలకు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు తొలిపోరుగా మారాయి. కాగా కన్నారెడ్డి పంచాయతీ పరిధిలో 6 వార్డు స్థానాలుండగా 134మంది పురుషులు, 171మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చిన్నఆత్మకూర్ పంచాయతీ పరిధిలో 8 వార్డు స్థానాలుండగా 289మంది పురుషులు, 331మది మహిళలు ఓటర్లుగా నమోదై ఉన్నారు. సర్పంచ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మహమ్మద్ నగర్ మండలంలో.. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రంగా ఏర్పాటైన తర్వాత గ్రామంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా అందోల్ అశ్విని ఎన్నికల బరిలో నిలువగా, బీఆర్ఎస్ మద్దతుదారుగా దఫేదార్ బాలమణి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సదరు గ్రామ పంచాయతీలో 1,777 మంది ఓటర్లు ఉండగా పురుషులు 838 మంది, సీ్త్రలు 939 మంది ఉన్నారు. అందోల్ అశ్విని తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దఫేదార్ బాలమణి ఇప్పటికే రెండు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికవడంతో పాటు కుమారుడు రాజు ఒక్కసారి సర్పంచ్ కాగా, ఆమె భర్త దఫేదార్ కిషన్ సైతం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దఫేదార్ బాలమణి మూడోసారి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామ ప్రజల తీర్పుతో వీరిలో ఎవరు విజయం సాధిస్తారో ఆదివారం తేలనుంది. -
హసన్‌పల్లిలో ఉత్కంఠగా ప్రత్యర్థుల పోరు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ పంచాయతీలో ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోరు ఉత్కంఠబరితంగా సాగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు మళ్లి ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన మోత్కుల సంగమేశ్వర్ గౌడ్, బోయిని హరీన్ సర్పంచ్ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో మోత్కుల సంగమేశ్వర్ గౌడ్ 27 ఓట్లతో బోయిని హరీన్పై విజయం సాధించారు. గ్రామంలో 997 మంది ఓటర్లు ఉండగా పురుషులు 436 మంది, సీ్త్రలు 561 మంది ఉన్నారు. ఈసారి ఓటర్లు మాత్రం ఎవ్వరికి పట్టం కడుతారో తేలాల్సి ఉంది. -
సర్పంచులు @ పట్టభద్రులు
బీబీపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం బరిలో నిలిచి, గెలుపొందారు. బీబీపేట గ్రామ సర్పంచ్ ఏదుళ్ల సాద్విక ఎంబీఏ పూర్తి చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి మీద 1470 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ప్రజల మన్ననలు పొందింది. ప్రచారంలో సైతం తాను విద్యావంతురాలినని, గ్రామాభివృద్ధే లక్ష్యంగారాజకీయాల్లోకి వస్తున్నాని, ఆశీర్వదించాలని కోరింది. దీంతో ప్రజలు ఆమెను భారీ మెజార్టీతో గెలిపించారు. మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానం కోసం 11 మంది బరిలో నిలువగా పీజీ పూర్తి చేసిన ఆకుల హరీష్ విజయం సాధించారు. ఆయనకు పోటీగా మాజీ సర్పంచులు ఇద్దరు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు అలాగే రాజకీయ నాయకులు సైతం నిలిచినప్పటికీ హరీష్ చెప్పిన నిజాయితీ మాటలకే ప్రజలు పట్టం కట్టారు. 276 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ పదవి పొందారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి సైతం నామినేషన్ వేశాడు. రాజకీయాల్లో కావల్సింది ప్రజాసేవ మాత్రమేనని దానికోసమే రాజకీయాల్లోకి ప్రవేశించానని ఆయన తెలిపారు. నాడు భార్య ఎంపీటీసీ.. నేడు భర్త సర్పంచ్ మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రానికి చెందిన కూచని శేఖర్ సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి మాచారెడ్డి మండలంలో అత్యధికంగా 502 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అతడి భార్య లావణ్య ఎంపీటీసీగా పోటీ చేసి 705 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతకుముందు 2011లో భార్యాభర్తలిద్దరూ వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఇద్దరు రాజకీయాల్లో రాణిస్తుండడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా చూడండి ● ఎన్నికల సిబ్బందితో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్నిజాంసాగర్/ఎల్లారెడ్డి/లింగంపేట: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. శనివారం ఆయన ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్ మండల కేంద్రాలలోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడతలో ఏడు మండలాల పరిధిలోని 153 సర్పంచ్, 873 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయమే మాక్ పోలింగ్ నిర్వహించాలని, 7 గంటలకు తప్పనిసరిగా పోలింగ్ ప్రారంభించాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి పోలింగ్ కంటిన్యూ చేయాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శీతాకాలం నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, బస్ సౌకర్యాం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమాలలో సబ్‌కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శివకృష్ణ, భిక్షపతి, రూట్ అధికారులు అమర్‌ప్రసాద్, తిరుపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహేరాబేగం, ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ తదితరులున్నారు. -
ఏకగ్రీవం చేసి అన్యాయం చేశారు
కామారెడ్డి క్రైం: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసి తమ తండాకు అన్యాయం చేశారని గాంధారి మండలం సోమ్లానాయక్ తండా జీపీ పరిధిలోని పంతులు నాయక్ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు కలెక్టరేట్‌కు తరలివచ్చి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జీపీగా ఏర్పడిన తర్వాత 2019 లో ఓట్లు ఎక్కువగా ఉన్న సోమ్లానాయక్ తండా పెద్దలు కలిసి సర్పంచ్ స్థానాన్ని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేశారన్నారు. తాజా ఎన్నికల్లో తమ గ్రామం నుంచి ఒక నామినేషన్ వేయించామన్నారు. మద్యం, డబ్బులతో మభ్యపెట్టి అతడిని విత్‌డ్రా చేయించారని ఆరోపించారు. ఏవైనా సమస్యలు, నిధుల వినియోగంపై జీపీకి వెళ్లి అడిగితే తమ తండా ప్రజల ఓట్లు తక్కువగా ఉన్నాయనే భావనతో చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి పంతులు నాయక్ తండాను గతంలో మాదిరిగా బూర్గుల్ జీపీలో కలపాలని, లేదా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం కొందరు ఇతరులను మభ్యపెట్టి చేసిన ఏకగ్రీవాన్ని రద్దు చేయాలని, తిరిగి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్నికల నోడల్ అధికారి సతీశ్ యాదవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
కామారెడ్డి టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 2,884 మంది దరఖాస్తు చేసుకోగా వారికోసం జిల్లావ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2210 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 674 విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈవో రాజు పర్యవేక్షించారు.పెద్దకొడప్గల్: బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన పెద్దకొడప్గల్లో విలేకరులతో మాట్లాడారు. నాలుగుసార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా గెలిచానని, మూడేళ్లపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశానని పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి లేదా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇస్తానన్నా తీసుకోలేదన్నారు. ఆ పార్టీ నిర్వహించిన ఏ సమావేశానికీ హాజరుకాలేదన్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించలేక, బీజేపీకి న్యాయం చేయలేక ఇబ్బందిపడుతున్నానని, ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాజీనామా లేఖను బీజేపీ, జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు పంపుతానని పేర్కొన్నారు. దోమకొండ : జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదవుతుండడంతో జనం గజగజ వణుకుతున్నారు. గతేడాది జనవరిలో తీవ్ర ప్రతాపం చూపిన చలి ప్రస్తుతం డిసెంబరులోనే తీవ్రంగా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 5 గంటలనుంచే చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తోంది. చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉదయం పనులకు వెళ్లేవారు, నైట్ డ్యూటీలు చేసేవారు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.బాన్సువాడ : తెలంగాణ జూనియర్స్ వాలీబాల్ జట్టు కెప్టెన్‌గా జిల్లాకు చెందిన విస్లావత్ నరేందర్ ఎంపికయ్యాడు. నస్రుల్లాబాద్ మండలం రాములగుట్ట తండాకు చెందిన నరేందర్ నెమ్లి పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కామారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో నరేందర్ ప్రతిభ చూపడంతో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈనెల 16 నుంచి 21 వరకు రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టుకు నరేందర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నరేందర్‌ను వీఎఫ్ఐ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ హన్మంత్‌రెడ్డి, కోచ్ సురేందర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలు, రవీందర్‌రెడ్డి అభినందించారు. -
బీజేపీ జెండా కనిపిస్తే భయపడుతున్నారు
సుభాష్‌నగర్: బీజేపీ జెండా కనిపిస్తే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని, సర్పంచ్ ఎన్నిక ల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే ప్ర జల వద్దకు పాలన అందిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన 48 మంది పోటీ చేయగా.. 18 మంది విజయం సాధించారని సంతోషం వ్యక్తంచేశారు. కొన్నిచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు. రెండు, మూడు విడతల్లో మరిన్ని సర్పంచ్ స్థానాలు భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంటే.. ఆ అభివృద్ధిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం మొదటి విడతలో గెలుపొందిన సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించారు. పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా..? బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాకు దినేష్ సవాల్ విసిరారు. ఇటీవల ధన్పాల్ సూర్యనారాయణపై అవాస్తవ ఆరోపణలు చేసి గణేశ్‌గుప్తా తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ రెండేళ్లలో రూ.138 కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు న్యాలం రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి,రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ కొత్త ‘పంచాయితీ’
ప్రభుత్వం పాలనను చేరువ చేసేందుకు 2018లో పంచాయతీల పునర్విభజన చేపట్టింది. 500 జనాభాకు మించి ఉన్న గ్రామాలు, తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది. చిన్నచిన్న తండాలు, పల్లెలలో రెండు మూడింటిని కలిపి నూతన పంచాయతీలుగా మార్చింది. పంచాయతీల పునర్విభజనతో తమకు ప్రజాప్రతినిధులుగా అవకాశాలు దక్కుతాయని చాలామంది ఆశించారు. అయితే చిన్న పెద్ద తండాలు, ఆవాసాల మధ్య వివాదాలు తలెత్తుతుండడంతో చిన్న ఆవాసాల ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పల్లెను కూడా గ్రామ పంచాయితీగా గుర్తించాలనే డిమాండ్ పెరుగుతోంది. గోకుల్ తండాలో ఓట్ల బహిష్కరణ రామారెడ్డి మండలంలోని గోకుల్ తండా పరిధిలో మీది తండా, కింది తండా ఉన్నాయి. మీది తండాలో 350, కింది తండాలో 250 మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్న మీది తండావాసులు తమ తండాకు చెందిన వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారని ఆరోపిస్తూ కింది తండావాసులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులు వెళ్లి మాట్లాడినా ఫలితం లేకపోయింది. జనగణన తర్వాతే అవకాశం! కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలంటే అసెంబ్లీ తీర్మానం పూర్తయి ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. 2018 లో అప్పటి ప్రభుత్వం 500 జనాభాకు మించి ఉన్న (2011 జనాభా లెక్కల ప్రకారం) గ్రామాలు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించింది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 65 గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. పాత వాటితో కలిపి కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో 2019 లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పట్లో పంచాయతీల పునర్విభజనకు అవకాశం లేదని తెలుస్తోంది. 2026–27 లో జనగణన చేపట్టనున్నారు. దీనిని బట్టి చూస్తే 2027 చివరికి జనాభా గణన పూర్తయితే కొత్త జనాభా లెక్కల ప్రకారం 500 జనాభా దాటిన పంచాయతీలు, గ్రామాలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2018లో సోమ్లానాయక్ తండా పంచాయతీగా ఏర్పడింది. దీని పరిధిలో తక్కువ ఓటర్లు కలిగిన పంతులు నాయక్ తండా ఉంది. సోమ్లానాయక్ తండావాసులు ఏకగ్రీవాలు చేసుకుంటూ తమకు సర్పంచ్ అవకాశం ఇవ్వడం లేదని పంతులు నాయక్ తండావాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశామని పేర్కొంటున్నారు. ఇవే కాకుండా 2018 లో ఏర్పడిన పంచాయతీల పరిధిలోని పలు హాబిటేషన్లలో ఇలాంటి సమస్యలున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఎక్కువగా ఉన్న పంచాయతీ కేంద్రాల ప్రజలు, నాయకులు తమను పట్టించుకోవడం లేదని హాబిటేషన్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామాలకు అన్యాయం జరుగుతోందనే వాదన కొన్ని హ్యాబిటేషన్ల నుంచి వినిపిస్తోంది.పంచాయతీ ఎన్నికల వేళ కొత్త సమస్య తలెత్తింది. రెండుమూడు పల్లెలు కలిసి ఏర్పాటైన జీపీలలో తమకు సర్పంచ్ అవకాశం రావడం లేదని చిన్న పల్లెలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. – కామారెడ్డి క్రైం ఆవాసాలు, పంచాయతీ కేంద్రాల మధ్య వివాదాలు తమకు సర్పంచ్ అవకాశాలు రావడం లేదని ఆవేదన ప్రత్యేక జీపీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ -
హైవేపై కంటైనర్ బోల్తా
భిక్కనూరు : జంగంపల్లి గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి కంటైనర్ బోల్తాపడింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టి బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులతోపాటు కంటైనర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
పోలీస్ ప్రజావాణి వాయిదా
నిజామాబాద్‌అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు ప్రజావాణిని వాయిదా వేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేశామని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ప్రజావాణి మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని తెలిపారు. పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ మధు శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సంజూష, జీజీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న కీర్తీ, ఎస్ఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న స్పందన, నిషిత కళాశాలలో డిగ్రీ చదువుతున్న సాయిరాం, జీజీ కళాశాల విద్యార్థి అజయ్‌తోపాటు మేడ్చల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న నవీన సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో త్వరలో నిర్వహించనున్న సౌత్ ఇండియా వాలీబాల్ పోటీల్లో అమ్మాయిలు, చైన్నైలో నిర్వహించనున్న పోటీల్లో అబ్బాయిలు పాల్గొంటారన్నారు. విద్యార్థులను పాఠశాల హెచ్ఎం హరిత, పీఈటీ మధు, వీడీసీ సభ్యులు అభినందించారు. ఇందల్వాయి: సమన్వయంతో పనిచేసి పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని, తప్పిదాలు జరగకుండా చూడాలని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందల్వాయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. స్వేచ్ఛ వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎంపీడీవో అనంత్‌రావు, తహసీల్దార్ వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ● అప్రమత్తమైన ప్రయాణికులు సదాశివనగర్(ఎల్లారెడి): మండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో ఓ ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో కలకలం రేగింది. 67 మంది ప్రయాణికులతో కామారెడ్డి వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి పద్మాజివాడి చౌరస్తాలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు గమనించి వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. ఆందోళనతో కిందికి దిగారు. పద్మాజివాడి సర్పంచ్ లోకోటి సుబ్బారావు అక్కడికి చేరుకుని ప్రయాణికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
నేతల ఫొటోలు లేకుండానే ప్రచారం
మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ భ్యర్థులకు రాజకీయ పార్టీల మద్దతు ఉన్నా ఆ పార్టీ స్థానిక నేతల ఫొటోలు లేకుండానే సొంతంగా ప్ర చారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీల ము ఖ్య నేతల ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్‌పై ప్రదర్శించేందుకు ఆలోచిస్తున్నారు. ఒక వేళ ఆ నాయకులపై వ్యతిరేకత ఉంటే ఆ ప్రభావం తమపై చూపుతుందని భయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జోక్యం నేరుగా లేదు. ఎక్కువ మంది అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులు, వారి ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్‌పై ముద్రించి ప్రచారం కొనసాగిస్తున్నారు. అనేక గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, నియోజకవర్గం నాయకుల ఫొటోలు కనిపించడం లేదు. నాయకులపై వ్యతిరేకత ఉంటే తమకు ఎక్కడ దెబ్బ పడుతుందోననే అనుమానం, పార్టీలకు అతీతంగా ఓట్లు రాబట్టుకోవాలనే కాంక్షతో అభ్యర్థులు సొంతంగానే ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్య నేతల ఆశీస్సులు ఉన్నా వారి ఫొటోలు లేకుండా ప్రచారం సాగుతుండటం గమనార్హం. పార్టీలకు దూరంగా ఉంటూ గుర్తు, తమ ఫొటోతోనే బరిలోకి.. పార్టీల నాయకులపై వ్యతిరేకత తమపై ఎక్కడ ప్రభావం చూపుతుందోననే భయం


