నాడు పతుల్‌.. నేడు సతుల్‌.. | - | Sakshi
Sakshi News home page

నాడు పతుల్‌.. నేడు సతుల్‌..

Feb 15 2026 7:00 AM | Updated on Feb 15 2026 7:00 AM

నాడు

నాడు పతుల్‌.. నేడు సతుల్‌..

నాడు పతుల్‌.. నేడు సతుల్‌.. ● అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ● వరుసగా రెండోసారి ఎన్నిక ● రెండు దశాబ్దాలుగా వారి కుటుంబమే.. ● వారికి సున్నా.. ● ఒకటి, రెండు...

బాన్సువాడ : రాజకీయాలలో వారసత్వాలు సా ధారణమయ్యాయి. పలుచోట్ల గత కౌన్సిల్‌లో భర్తలు ప్రాతినిధ్యం వహించగా ఈసారి వారి భార్యలకు అవకాశం దక్కింది. 2020 ఎన్నికలలో 5వ వార్డునుంచి గెలిచిన కాసుల బాల్‌రాజ్‌కు ఈసారి రిజర్వేషన్‌ అనుకూలించలేదు. దీంతో ఆయన భార్య విజయ బరిలో నిలిచి గెలిచారు. ఎనిమిదో వార్డుకు గతంలో దొన్కంటి వెంకటి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి ఆయన భార్య శ్యామల పోటీ చేసి విజయం సాధించారు. 14 వార్డు కౌన్సిలర్‌గా వ్యవ హ రించిన నార్ల నందకిషోర్‌కు ఈసారి రిజర్వేషన్‌ కలసిరాలేదు. దీంతో ఆయన భార్య వసంత పోటీ చేసి గెలుపొందారు.

గత కౌన్సిల్‌లో జంగం గంగాధర్‌ చైర్మన్‌గా వ్య వహరించారు. ఈసారి ఆయన కుమారుడు జంగం రాజశేఖర్‌ 2వ వార్డునుంచి పోటీ చేసి గెలిచారు.

బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీలో ఇ ద్దరు కౌన్సిలర్లు వరుసగా రెండోసారి విజయం సాధించారు. 4వ వార్డు నుంచి గైక్వాడ్‌ రుక్మిణి పోటీ చేసి గెలిచారు. ఆమె గత కౌన్సిల్‌లోనూ సభ్యులుగా ఉన్నారు. 11వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై న గడుమల లింగమేశ్వర్‌ కూడా గత కౌన్సిల్‌ సభ్యుడే..

గడుమల లింగమేశ్వర్‌ రుక్మిణి గైక్వాడ్‌

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డిలోని 45వ వార్డులో పిట్ల వేణు కుటుంబానికి గట్టి పట్టు ఉంది. రెండు దశాబ్దాలుగా ఆ కుటుంబానికి చెందినవారే ఇక్కడ కౌన్సిలర్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2005లో పిట్ల వేణు తల్లి చంద్రకళ పోటీ చేసి గె లిచారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల లో ఆయన భార్య విద్య కౌన్సిలర్‌గా ఎన్నిక య్యారు. పిట్ల వేణు 2020లో గెలిచి.. తాజా ఎన్నికలలోనూ గెలిచి మరోసారి కౌన్సిల్‌లో అడుగు పెట్టబోతున్నారు.

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి పట్టణంలో ఎన్నిక ల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులకు కనీ సం ఒక్క ఓటు కూడా పడలేదు. ఆరో వార్డునుంచి బరిలో నిలిచిన రాజు, 19వ వార్డు నుంచి పోటీ చేసిన మహ్మద్‌ ఇక్రమ్‌, మూడో వార్డునుంచి పోటీపడిన మహిపాల్‌లకు సున్నా ఓట్లు నమోదయ్యాయి. వీరంతా స్వతంత్ర అభ్యర్థులు.

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి బల్దియా ఎన్నికలలో పోటీ చేసిన పలు పార్టీల అభ్యర్థులకు అతిస్వల్ప ఓట్లు వచ్చాయి. ఓ అభ్యర్థికి ఒక్కటే ఓటు రావడం గమనార్హం. మరో అభ్యర్థికి రెండు ఓట్లు పడ్డాయి. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులుండగా.. 254 మంది ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలపగా.. బీజేపీ 48 వార్డుల్లో, ఎంఐఎం 8 చోట్ల, జనసేన 7, టీఆర్‌ఏపీ 6, సీపీఎం 3, బీఎస్పీ, ఏఐఎఫ్‌బీ, ఆప్‌ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. స్వతంత్రులు 81 మంది బరిలో ఉన్నారు. కాగా ఈ ఎన్నికలలో ఆప్‌ అభ్యర్థికి ఒక్క ఓటు పోలవగా.. బీఎస్పీ అభ్యర్థికి రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఏపీకి పోలైన మొత్తం ఓట్లు 35 మాత్రమే. ఏఐఎఫ్‌బీకి 54 ఓట్లు, జనసేనకు 247 ఓట్లు, సీపీఎంకు 357 ఎంఐఎంకు 806 ఓట్లు వచ్చాయి. 81 మంది స్వతంత్రులకు కలిపి 6,435 ఓట్లు రాగా.. 580 ఓట్లు చెల్లుబాటు కాలేదు. నోటాకు 1,414 మంది ఓటేశారు.

నాడు పతుల్‌.. నేడు సతుల్‌.. 1
1/4

నాడు పతుల్‌.. నేడు సతుల్‌..

నాడు పతుల్‌.. నేడు సతుల్‌.. 2
2/4

నాడు పతుల్‌.. నేడు సతుల్‌..

నాడు పతుల్‌.. నేడు సతుల్‌.. 3
3/4

నాడు పతుల్‌.. నేడు సతుల్‌..

నాడు పతుల్‌.. నేడు సతుల్‌.. 4
4/4

నాడు పతుల్‌.. నేడు సతుల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement