breaking news
Kamareddy District News
-
‘ముక్కోటి’ వేళ.. పోటెత్తిన భక్తులు
కామారెడ్డి అర్బన్: జిల్లాలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం కోసం తెల్లవారుజామునుంచే బారులు తీరారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హన్మాన్ వెంకటేశ్వరస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, విఠలేశ్వరస్వామి, చిన్నమల్లారెడ్డి, లింగాపూర్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాలు, అడ్లూర్ రామాలతోపాటు జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. -
గణితం.. ఆలోచనా శక్తిని పెంచే శాస్త్రం
మాట్లాడుతున్న డీఈవో రాజుకామారెడ్డి టౌన్: గణితం సంఖ్యల శాస్త్రం మాత్రమే కాదని, అది విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంపొందించే మహత్తర విద్య అని డీఈవో రాజు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గంజ్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంచాలనే లక్ష్యంతో ఫోరం ఇలాంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫోరం తీసుకుంటున్న నిర్ణయాలు ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గణిత ఫోరం అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలం కుమారస్వామి, కోశాధికారి నరేందర్, గణిత ఉపాధ్యాయులు శివ, వెంకటి, నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’కు ముందడుగు!
● బల్దియా ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల ● కసరత్తు చేస్తున్న బల్దియా అధికారులుకామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు పడుతున్నాయి. తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాబితా ఆధారంగానే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసి ఏడాది కావస్తోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి తాజాగా షెడ్యూల్ జారీ అయ్యింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల డాటాను మున్సిపల్ వార్డుల వారీగా విభజించి, కొత్త జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఓటరు జాబితా సవరణకు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుండ మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనవరి 10న తుది జాబితా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్లు షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. బుధవారం వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారు. జనవరి ఒకటో తేదీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను నోటీస్‌బోర్డులపై అంటిస్తారు. ఐదు రోజుల పాటు పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 5న మున్సిపల్ కమిషనర్లు, యూఎల్బీ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారి, అధికారులతో సమావేశం ఉంటుంది. జనవరి 10న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ బాధ్యతలను సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా జాబితాను రూపొందించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్లు తమ పేర్లను ముసాయిదా జాబితాలో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. -
భక్తితో పాటు క్రమశిక్షణ అవసరం
● గణపతి సచ్చిదానంద స్వామి ● నిజామాబాద్‌లోని ఉత్తర తిరుపతి ఆలయంలో ప్రవచనాలుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముక్కోటి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. అడుగడుగునా గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఇందూరు నగరంలోని ఉత్తర తిరుపతి ఆలయంలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భక్తులకు ప్రవచనాలు చెప్పారు. సచ్చిదానంద స్వామి విలేకరులతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసం విషయంలో ఏకాగ్రతతో వ్యవహరించాలన్నారు. స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవద్దన్నారు. ఫోన్లతో సైతం ఉపయోగాలు ఉంటాయని, వాటిని అవసరం మేరకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందూరులోని ఉత్తర తిరుపతి ఆలయం తిరుపతి ఆలయం మాదిరిగా నిర్మాణం చేశామన్నారు. ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు దత్తాత్రేయ, ఆంజనేయస్వామి, లక్ష్మీ అమ్మవారు, శ్రీచక్రం ఉన్నాయన్నారు. అయోధ్య ఆలయం శైలిలో ఉత్తర తిరుపతి ఆలయ నిర్మాణం ఉందన్నారు. ప్రతి మనిషికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పరిజ్ఞానాన్ని మంచికి వాడాలన్నారు. పిల్లలను ఆధ్యాత్మికం వైపు నడిపేందుకు పెద్దలు కృషి చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలన్నారు. ఉత్తర తిరుపతి ఆలయంలో వేంకటేశ్వర స్వామిని పోలీసు కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని రామాలయంలోనూ ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. -
లక్ష్యం నెరవేరింది
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జిల్లాలో ఎంతో మంది యువకులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించారు. 2025 సంవత్సరంలో వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారు. ముఖ్యంగా గ్రూప్–1, 2, 3, 4 ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. అలాగే గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, నర్సింగ్ ఆఫీసర్లు, నర్సింగ్ స్టాఫ్ వంటి కొలువులు కొట్టారు. ఈ ఏడాదిలో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు ఆరు వందల పైచిలుకు ఉంటారని అంచనా. అలాగే ప్రైవేటు రంగంలోనూ వందలాది మంది ఉద్యోగాలు పొందారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో జిల్లాకు చెందిన యువత మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. ఇతర ప్రైవేటు సంస్థల్లో అనేక మంది ఉద్యోగాలు పొంది నవ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. జేఈఈ ద్వారా జాతీయ విద్యాసంస్థల్లో ఎందరో విద్యార్థులు ఐఐటీ సీట్లు సాధించారు. నీట్ ద్వారా మరెందరో విద్యార్థులు మెడిసిన్ సీట్లు పొందారు.ఈ ఏడాది ఎందరో నిరుద్యోగుల లక్ష్యం నెరవేరింది. పట్టుబట్టి కొలువులు కొట్టిన వారెందరో ఉన్నారు. మరికొందరు ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసుకున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి 2025లో కొలువులు సాధించిన పలువురు ఉన్నత చదువులకు బాటలు వేసుకున్న మరికొందరు.. -
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ రెగ్యులర్ 1, 3, 5 సెమిస్టర్లు, డిగ్రీ 2, 4 సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఫలితాలు విడుదలయ్యాయి. వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, తెలంగాణ విశ్వ విద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్ ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు ఎన్.రాములు, ఏ.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్: గొర్రెలు, మేకల కాపరులు సీజనల్ వ్యాధులపై కనీస అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి భాస్కరన్ సూచించారు. మంగళవారం మోడెగాం, మల్లుపేట్, భూంపల్లి గ్రామాల్లో నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకొకసారి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును వేయించాలన్నారు. ఈ మందును వేయడం వల్ల రోగ నిరోధక శక్తి, ఉత్పాదకత పెరుగుతుందన్నారు. మూడు గ్రామాల్లో 250 గొర్రెలు, 785 మేకలకు ఈ మందు వేశామన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి రాంప్రసాద్, సర్పంచ్‌లు గౌడెల్లి గంగాధర్, ఆకారపు రమ మహేశ్‌రెడ్డి, గైని శ్రీనివాస్, ఉప సర్పంచ్‌లు హరీశ్, రాజయ్య, పిల్లి గంగమణి, పశు వైద్య సిబ్బంది మురళి, కాశీరెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ● వినయ్‌కృష్ణారెడ్డి బదిలీనిజామాబాద్ అర్బన్: జిల్లా కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠీని జిల్లాకు కేటాయించారు. ఆమె 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్, ఇదివరకు పనిచేసిన కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. వినయ్‌కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలల్లోనే అతి తక్కువ కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడం విశేషం. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆకస్మిక బదిలీ జరిగింది. -
కొనసాగుతున్న రైల్వే డబ్లింగ్ పనులు
● ట్రాఫిక్‌కు అంతరాయంనవీపేట: డబుల్ రైల్వే లైన్ విస్తరణ పనులు కొనసాగడంతో మండల కేంద్రంలోని ప్రధాన రైల్వేగేటు సమీపంలో మంగళవారం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మేడ్చల్ –ముద్ఖేడ్ డబుల్ రైల్వే లైన్ పనులలో భాగంగా నవీపేట నుంచి బాసర వరకు మొదటి దశ పనులు పూర్తి కానున్నాయి. జనవరిలో 13 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌పై రైలు పరుగెత్తనుంది. ఇరువైపులా లైన్ విస్తరణ పనులు పూర్తయ్యాయి. నవీపేట మండల కేంద్రంలో ట్రాక్ వద్ద పనులను మంగళవారం నిర్వహించారు. ట్రాక్ లెవల్, బీటీ భర్తీ పనులను నిర్వహించడంతో గేటును కొద్దిసేపు మూసేశారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వా హనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
రుణాలను సకాలంలో మంజూరు చేయాలి
కామారెడ్డి క్రైం: రైతులకు పంట రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశించిన రుణ పంపిణీ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ, పీఎంఈజీపీ, ఇతర అన్ని రకాల రుణాలకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్, ఎల్డీఎం చంద్రశేఖర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గాంధారి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గాంధారి, వండ్రికల్ గ్రామాలను సందర్శించారు. మండల కేంద్రంలో రసాయన ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. అనంతరం వండ్రికల్లో పర్యటించి అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో సరదాగా మాట్లాడారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, ఇటుకలు, సిమెంట్ కొరత లేదన్నారు. ఇళ్లు నిర్మించుకుంటున్నవారికి దశల వారీగా బిల్లులు వస్తాయన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో మురళి, డీఆర్డీవో సురేందర్, హౌసింగ్ పీడీ గౌతమ్, గాంధారి తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణ, ఎల్లారెడ్డి ఏడీఏ సుధామాధురి, ఏవో రాజలింగం ఆర్ఐ ప్రదీప్, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ నుంచి బాబాపూర్‌కు వెళ్లే దారిలో ఓ దుకాణం వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మంగళవారం ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన యజమాని రాగి శ్రీనివాస్‌కు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎరుపు రంగు చొక్క, బూడిద రంగు పాయింట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడిని యాచకుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బోధన్: ఎడపల్లి మండలం మంగళ్పహాడ్ గ్రామంలో మంగళవారం చి లిగిరి రమేష్‌కు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు గొర్రెలు మృతి చెందాయి. వీధి కుక్కల దాడుల వల్ల భయాందోళనకు గురవుతున్నామని పెంపకందార్లు పేర్కొంటున్నారు. -
మహిళల సౌకర్యార్థం మరుగుదొడ్డి నిర్మాణం
పిట్లం(జుక్కల్): నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రఫీ, ఇర్షాద్ పేర్కొన్నారు. వారు మంగళవారం మండల కేంద్రంలో ఆటో రిక్షాలు, ఇతర వాహనాల ద్వారా ప్రయాణించే విద్యార్థుల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు.బీబీపేట: మల్కాపూర్ మహిళా సమాఖ్య భవనంలో మహిళల సౌకర్యార్థం మరుగుదొడ్డి నిర్మాణానికి గ్రామానికి చెందిన దాత సిరిగాద స్వామి ముందుకు వచ్చారు. మంగళవారం మరుగుదొడ్డి నిర్మాణానికి సర్పంచ్ రామగల్ల నాగరాజు పనులను ప్రారంభించారు. సుమారు రూ. 40 వేల వరకు నిర్మాణానికి ఖర్చవుతుందని ఆయన తెలిపారు. మహిళా సమాఖ్య భవనానికి ఇప్పటివరకు మరుగుదొడ్లు లేకపోవడంతో అక్కడకు వచ్చే మహిళలు చాలా ఇబ్బందులు పడేవారని, దీంతో స్వామి స్పందించి నిర్మాణానికి ముందుకు రావడం మంచి విషయమని ఆయనకు మహిళా సమాఖ్య సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కొరట్పల్లిలో బాలిక ఆత్మహత్య
● ప్రేమించిన బాలుడు మోసం చేయడమే కారణమంటూ మృతురాలి కుటుంబీకులు ఆరోపణ ● ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనడిచ్పల్లి : మండలంలోని కొరట్పల్లి తండా వడ్డెర కాలనీకి చెందిన ఓ బాలిక(17) సోమవారం సా యంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇ లా.. వడ్డెక కాలనీకి చెందిన బాలిక, కొరట్పల్లి గ్రామానికి చెందిన బాలుడు కొన్నిరోజులుగా ప్రే మించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలియడంతో ఇటీవల బాలిక అతడిని కలువకుండా వారి కుటుంబీకులు కట్టడి చేశారు. అయినా వారు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో సోమవారం ఇరువురి మధ్య ఏం జరిగిందో కానీ సాయంత్రం ఇంట్లో ఎ వరూలేని సమయంలో బాలిక ఉరేసుకుని ఆత్మహ త్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రేమించిన బాలుడు మోసం చేయడంతోనే బాలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కొరట్పల్లి గ్రామంలోని బాలుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు శాంతించారు. అనంతరం సాయంత్రం బాలిక మృతదేహానికి తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసమే ఉచిత శిక్షణ
నిజామాబాద్ రూరల్: నిరుద్యోగులకు స్వయం ఉ పాధి కల్పించడం కోసమే బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఆటోనగర్‌లో మంగళవారం ఇన్స్ట్యూట్ బైతుల్ మాల్ ఆ ధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన హాజరై, శిక్షణ కోర్సులను ప్రారంభించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. శిక్షణ కేంద్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తనవంతుగా రూ.2లక్షలు అందజేసినట్లు తెలిపారు. నిరుద్యోగ మహిళలు, విద్యార్థులకు ఉపాధికి అనుకూలమైన పలు కోర్సుల్లో (కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, మె హందీ డిజైన్, అడ్వాన్సడ్ బ్యూటీషియన్) శిక్షణ ఇ వ్వనున్నట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.నిజామాబాద్ రూరల్: హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని బోధన్ రోడ్లోగల నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఈ ఏడాది హజ్‌కు వెళ్లనున్న యాత్రికుల కోసం జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. హజ్ యాత్రలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ ఏర్పాట్లు, వసతి, రవాణా తదితర లాజిస్టిక్ అంశాలపై అవగాహన కల్పించారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖుస్రో పాషా, హజ్ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ బాలుడి మృతి
అవయవ దానం చేసిన తల్లిదండ్రులు నందిపేట్(ఆర్మూర్): తనపై దొంగతనం నెపం వేయడంతో బాలుడు ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొడుకు మృతి బాధను దిగమింగుకొని అవయవదానానికి తల్లిదండ్రులు ముందుకువచ్చారు. వివరాలు ఇలా.. నందిపేట మండలం బాద్గుణ గ్రామానికి చెందిన బరుకుంట ముత్తెన్న తన డబ్బులు రూ. 25వేలు పోయాయంటూ అదే గ్రామానికి చెందిన బరికుంట సన్నిత్ (17)పై దొంగతనం నెపం వేశాడు. దీంతో మనస్తాపం చెందిన సన్నిత్ ఈనెల 27న పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. దీంతో ముత్తెన్నపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. తమ కొడుకు మృతిచెందడంతో అవయవదానానికి మృతుడి తల్లిదండ్రులు ముత్తెన్న, పోసాని ముందుకువచ్చారు. విషాద సమయంలోనూ ఆదర్శంగా నిలుస్తూ అవయవాలు అందించిన కుటుంబాన్ని గ్రామస్తులు అభినందించారు. -
రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపిక
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మోడల్‌స్కూల్‌కు చెందిన విద్యార్థిని శ్రీజ రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపికై నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ జహంగీర్ మంగళవారం తెలిపారు. జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో శ్రీజ మూడో బహుమతి పొంది ఎంపికై నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న శ్రీజను ఉపాధ్యాయులు అభినందించారు. బాన్సువాడ రూరల్: బోర్లం గ్రామం పాత ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జనవరి 4న సద్గురు సమర్థ మహారాజ్ దివ్యదర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వాహకులు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లను రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ఆవిష్కరించారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పర్వారెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, సర్పంచ్ మన్నె రమేష్, నర్సింహులు, సాయిలు, భరత్ తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీదుపేటలో ఈ నెల 6న అగ్నిప్రమాదంలో ఎర్రొళ్ల రాజయ్య, శ్యామల ఇళ్లు దగ్ధమైంది. మంగళవారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించిన సర్పంచ్ నర్సింహారెడ్డి.. ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. సోమవారం నాటికి 1 లక్షా 53 వేల టన్నుల క్రషింగ్ జరిగినట్లు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావ్ తెలిపారు. ఈ సీజన్లో 3 లక్షల టన్నుల క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పర్మిట్ల ఆధారంగా చెరుకును గానుగకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ బట్టుపల్లి రేణుక దక్షిణభారత దేశం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దయానంద సరస్వతి తెలిపారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉపాధ్యాయులు, గ్రామస్తులు రేణుకను అభినందించారు. పిట్లం(జుక్కల్): తిమ్మనగర్ జీపీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ చీరలను మహిళలకు సర్పంచ్ ప్రవీణ్ పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. బాన్సువాడ: బీర్కూర్‌లో మంగళవారం డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలను సర్పంచ్ ధర్మతేజ, ఉప సర్పంచ్ పరమేశ్వర్ కులకర్ణిలు పంపిణీ చేశారు. వార్డు సభ్యులు మెహరినీత, నాగమణి, జీవిత, హేమలత, భాగ్య పాల్గొన్నారు. -
సవాల్ స్వీకరించిన నేతలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
బాన్సువాడ: ఆరోపణలు చేసిన వారి సవాల్‌ను స్వీకరించి అయ్యప్ప ఆలయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్కి గ్రామంలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిలు.. మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, మాజీ సర్పంచ్ నారాగౌడ్లపై చేసిన తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అవి అబద్ధాలని నిరూపించడానికి అయ్యప్ప ఆలయానికి వస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం శోచనీయమని ఆన్నారు. శాంతియుతంగా ఆలయంలో కుర్చుంటే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మాసాని శ్రీనివాస్‌రెడ్డి, పాత బాలకృష్ణ, నందురెడ్డి, ప్రతాప్‌సింగ్, అక్బర్, శ్రీనివాస్, లయక్, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో మంజీరా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సోమవారం రాత్రి ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నుంచి ఇసుకను తరలిస్తుండటంతో కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ వద్ద గొడవ పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. పెట్రోల్ బంక్ వద్ద కారు మళ్లింపు విషయంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు వివరించారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట గ్రామ శివారులో మంగళవా రం లారీని వెనుక వస్తున్న మరో లారీ ఢీకొన్న ట్లు స్థానికులు తెలిపారు. రెండు లారీలు జహీరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నాయన్నా రు. గండిమాసానిపేట గ్రామ శివారులోని జీవదాన్ పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశా డు. దీంతో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు వారు తెలిపారు. నవీపేట: పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని బా వపై దాడి చేసిన బావమరిదిని రిమాండ్ చేసిన ట్లు ఎస్సై శ్రీకాంత్ మంగళవానం తెలిపారు. లింగాపూర్‌కు చెందిన గంధం శ్రీనివాస్ తన బా వ హన్మండ్లుతో తాగిన మైకంలో గొడవపడ్డా డు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ గొ డ్డలితో హన్మండ్లుపై దాడి చేశాడు. బాధితుడి భార్య రూప ఫిర్యాదు మేరకు నిందితుడిపై హ త్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండుకు పంపినట్లు తెలిపారు. -
కువైట్‌లో రాంపూర్ వాసి..
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బంటు రవి అలియాస్ ప్రకాష్(50) కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఈ నెల 27న రవి తన గదిలో భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో స్థానికులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా రవి గత 12 సంవత్సరాలుగా ఉపాధి కోసం కువైట్‌లో ఉంటున్నట్లు తెలిపారు. మృతదేహం మంగళవారం రాత్రి ఇండియాకు వస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీ, కుమారుడు త్రిజాల్ ఉన్నారు. -
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
పిట్లం(జుక్కల్): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. పిట్లం ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 20 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా మంగళవారం ఉదయం ప్రార్థనలో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఒక్కరు మాత్రమే ప్రార్థనలో పాల్గొన్నారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు మాత్రమే ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు మొబైల్ యాప్‌లో ఆన్లైన్ అటెండెన్స్ వేయాల్సి ఉన్నా ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థనలో ఎందుకు పాల్గొనడం లేదని, లేదా పాఠశాలకు వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్లి పోతున్నారా లేదా పాఠశాలకు ఎప్పుడు వస్తే అప్పుడే అటెండెన్స్ వేసుకుంటున్నారా అని పలువురు చర్చించుకున్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలు నేర్పించి, భవిష్యత్తులో వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లవలసిన ఉపాధ్యాయులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, కాలయాపన చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎంఈవో దేవిసింగ్‌కు వివరణ కోరగా పలువురు పాధ్యాయులు కాంప్లెక్స్ మీటింగ్‌కు వెళ్లారని తెలిపారు. -
గణిత ప్రతిభా పరీక్షలో ప్రథమ స్థానం
బాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్షలో బోర్లం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన బి.రామ్‌చరణ్ ప్రథమ స్థానం సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ తెలిపారు. గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రతిభా పోటీలో పాఠశాల విద్యార్థి ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఈమేరకు విద్యార్థి రామ్‌చరణ్‌తో పాటు గణితం గైడ్ టీచర్ పద్మ శ్రీనివాస్‌ను హెచ్ఎం అభినందించారు. మాచారెడ్డి: జిల్లా స్థాయి గణిత పరీక్షలో చుక్కాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన వైష్ణవి, ప్రదీప్‌రెడ్డిలు ప్రథమ, తృతీయ స్థానం సాధించగా, మాచారెడ్డి ఉన్నత పాఠశాలకు చెందిన విష్ణుప్రియ ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా గణిత పరీక్షలు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంఈవో దేవేందర్‌రావ్, మాచారెడ్డి హెచ్ఎం వెంకటాచారి, ఉపాధ్యాయులు అభినందించారు. -
పౌర హక్కులకు భంగం కల్గించొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ఐ కిరణ్లింగంపేట(ఎల్లారెడ్డి): పౌర హక్కులకు భంగం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్ఐ కిరణ్ వెల్లడించారు. మంగళవారం ఆయన మెంగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సమాజంలో ప్రతీ పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కులమత బేధాలు లేకుండా సమాజంలో అందరూ సమానమే అని భావించాలన్నారు. తక్కువ కులం అని ఎవ్వరిని వివక్షకు గురి చేసినా నేరమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో విజయాలు సాధించి, మానవ సమాజంలో ఎంతో వికాసం పొంది, రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 సంవత్సరాలు అయినా సాటి మనిషిని మనిషిగా గౌరవించకుండా అమానుషంగా హింసించడం, బాధించడం, దురదృష్టకరమైన విషయం అన్నారు. సర్పంచ్ కొమ్ముల మౌనిక, కార్యదర్శి బాలమణి, జీపీవో దీపిక, రమేశ్ పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ చాంపియన్‌గా నిజామాబాద్
సుభాష్‌నగర్: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ 10వ సబ్ జూనియర్ బాలుర చాంపియన్‌షిప్‌గా నిజామాబాద్ జట్టు నిలిచిందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ప్రభాకర్‌రెడ్డి, మర్కంటి గంగామోహన్ సోమవారం తెలిపారు. ఫైనల్లో మెదక్ జిల్లా జట్టుపై 2–1 పరుగుల తేడాలో విజయం సాధించిందన్నారు. టోర్నీలో బెస్ట్ ఆల్ రౌండర్‌గా రేవంత్ నిలిచి బహుమతి అందుకున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా జట్టుకు కోచ్, మేనేజర్లుగా అనికేత్, తిరుపతి వ్యవహరించారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 91 వినతులు కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవా రం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదు లు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కా ర్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. సమస్యల ను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూ పడం గానీ చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యా దులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు క లెక్టర్ విక్టర్, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మ ద్, వివిధ శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు. -
40 వేలిచ్చినా పని చేస్తలేరంటూ హంగామా ..
ఓ అధికారికి లంచంగా రూ.40 వేలిచ్చినా పని చేయడం లేదని మహ్మద్‌నగర్‌కు చెందిన తూర్పాటి చంద్రవ్వ ఆరోపించారు. సోమవారం ఆమె కలెక్టరేట్లోని ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ఎదుట బైఠాయించి దాదాపు గంటపాటు నానా హంగామా చేశారు. ఆమె మాట్లాడుతూ.. తన భర్త చిన్న దానయ్య పేరిట రెండేళ్ల క్రితం వెల్డింగ్ యూనిట్ కోసం దళితబంధు పథకం మంజూరైందన్నారు. రూ.10 లక్షలు చిన్నదానయ్య అకౌంట్లో జమ కూడా అయ్యాయన్నారు. ఆ విషయం తెలిసే లోపే అప్పుల బాధ భరించలేక తన భర్త చిన్న దానయ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. తన భర్త అకౌంట్ నుంచి దళితబంధు మొత్తాన్ని తన అకౌంట్‌కు బదిలీ చేయాలని రెండేళ్లుగా తిరుగుతున్నానని వాపోయింది. ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన అధికారులు రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేశారనీ, తన దగ్గర అంత మొత్తం లేకపోవడంతో బ్రతిమిలాడుకుని రూ.40 వేలు ఓ అధికారికి ఇచ్చానని ఆమె చెబుతోంది. డబ్బులు ఇచ్చినా ఫైలు ముందుకు కదపడం లేదని ఆరోపిస్తూ కార్యాలయం ముందర నేలపై కూర్చుని గంటకు పైగా శోకం పెడుతూ బైఠాయించింది చంద్రవ్వ. పోలీసులు కలుగజేసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడిస్తామంటూ సర్ది చెప్పి పంపారు. -
ఇందిరా మహాశక్తి చీరల పంపిణీ
బిచ్కుంద(జుక్కల్): ఖద్గాంలో ఇందిరా మహాశక్తి చీరలను సోమవారం సర్పంచ్ రాధికాబాయి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఏఎంసీ వైస్ చైర్మన్ శంకర్ పటేల్, ఉపసర్పంచ్ సయ్యద్ మన్ను, మాజీ సర్పంచ్ జీవన్, రాజు పటేల్ పాల్గొన్నారు. పిట్లం(జుక్కల్): కంభాపూర్ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ చీరలను సర్పంచ్ సుజాత పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఐకేపీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని మొగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ బస్వంత్పటేల్ చేతుల మీదుగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, ఉప సర్పంచ్ బాలు పటేల్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కంకర ప్లాంట్ ఏర్పాటును నిలిపివేయాలి
శివారులో జరుగుతున్న కంకర ప్లాంట్ ఏర్పాటు పనులను నిలిపివేయాలని కోరుతూ బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు సోమవారం ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు తాతల కాలం నుంచి గ్రామ శివారులోని గుట్టమీద ఉన్న బండలు పగులగొట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. చుట్టూ 350 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయని అన్నారు. కంకర మిషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే భారీ పేలుళ్లకు వ్యవసాయ భూముల్లోని బోర్లు ఎత్తిపోయి రైతు మనుగడ కష్టమవుతుందన్నారు. కంకర ప్లాంట్ ఏర్పాటును తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
రూ. 1,100లకే అంత్యక్రియల బాధ్యతలు
మాచారెడ్డి: గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలకు ఇబ్బంది కలగకుండా ఆ బాధ్యతను పంచాయతీ చూసుకోవాలని తీర్మానించినట్లు పాల్వంచ మండలం పరిదిపేట సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం గ్రామపంచాయతీ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. రూ. 1,100 లతో దరఖాస్తు చేసుకుంటే మృతుడి అంత్యక్రియల పూర్తి బాధ్యతలను పంచాయతీ భుజాన వేసుకుంటుందని పేర్కొన్నారు. కోతులు, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
పట్టణ సుందరీకరణే లక్ష్యం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి టౌన్: పట్టణంలో మౌలిక వసతుల కల్పన, సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు విస్మరించిన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, నాయకులు పండ్ల రాజు, అశోక్‌రెడ్డి, కన్నయ్య, చందు తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ మత సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ అని షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, ప్రేమ, మానవత్వాన్ని పెంపొందించిన యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం అమలవుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. సోమవారం భిక్కనూరు గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యుడు గజ్జె వేణు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత రాజకీయాల్లోకి రా వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, ఉప సర్పంచ్ దుంపల మోహన్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అందె దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గోన్నారు. పేదలకు కొండంత అండ సీఎంఆర్ఎఫ్కామారెడ్డి టౌన్: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆర్థికంగా కుంగిపోయిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు సుమారు రూ.50 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, నాయకులు పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్టు
లింగంపేట/మాచారెడ్డి/బీబీపేట:గ్రామ పంచాయ తీ పెండింగు బిల్లుల చెల్లింపుల విషయంలో సోమ వారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న సర్పంచ్‌లను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లింగంపేట, బీబీపేట, మాచారెడ్డి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌లు మాట్లాడుతూ.. తమకు రావలసిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. కామారెడ్డి టౌన్: హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ‘తెలంగాణ విద్యా విధానం–2025’ ఉన్నత స్థాయి సమావేశంలో జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. సోమవారం డాక్టర్ కేశవ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 24 మంది నిపుణులు విద్యా సంస్కరణలపై చర్చించారు. జిల్లా నుంచి ఎల్ఎఫ్ఎల్ కేటగిరీలో ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ రావు, ఎస్జీటీ(ఉర్దూ) కేటగిరీలో ఎండీ ఖుర్షీద్ అహ్మద్ పాల్గొని విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సిఫార్సులు చేశారు. విద్యా కమిషనర్ దేవ్సేన, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్లౌడ్ బరస్ట్..!
భారీ వర్షాలతో నీటమునిగిన కామారెడ్డి పట్టణం (ఫైల్)ఈ ఏడాది వరుణుడు బీభత్సం సృష్టించాడు. మేఘాలకు చిల్లులు పడ్డట్టుగా ఆగస్టు ఆఖరి వారంలో దంచికొట్టిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు వరదల్లో కొట్టుకుపోయాయి. చెరువులు, కుంటలే కాదు ప్రాజెక్టులకూ తీవ్ర నష్టం వాటిల్లింది. పరామర్శలే తప్ప పరిహారం రాక అన్నదాతలు నిరాశ చెందారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులకు సైతం నిధులు మంజూరు కాకపోవడంతో ఆయా మార్గాలలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాకేంద్రంలోని ఓ కాలనీలో వరద బాధితులను రక్షిస్తున్న పోలీసులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో 2025 సంవత్సరంలో క్లౌడ్ బరస్ట్ పెద్ద విపత్తును తెచ్చిపెట్టింది. వరదలతో నలుగురి ప్రాణాలు ఆవిరవగా, పదుల సంఖ్యలో పశువులు, వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వరదలతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర ప్రభుత్వ బృందం వచ్చి చూసి వెళ్లినా రైతులకు నయాపైసా పరిహారం అందలేదు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులూ రాలేదు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ. 251.36 కోట్లు అవసరమవుతాయని ఆయా శాఖల అధికారులు అంచనా వేశారు. ఇందులో తక్షణ మరమ్మతుల కోసం రూ. 38.68 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ. 212.68 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో 50 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. సీఎం పర్యటన సమయంలో 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. తర్వాత పంట నష్టం లెక్కలు తగ్గించారు. పెట్టిన పెట్టుబడులే దాదాపు రూ. వంద కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది. నీట మునిగిన పంటలతో పాటు, వరదలతో కొట్టుకుపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించి రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖ ద్వారా శాశ్వత మరమ్మతు పనులు చేపట్టేందుకు రూ.125.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రూ.45.50 కోట్లు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి నీటి వనరులు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పోచారం ప్రాజెక్టుతో పాటు కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్‌తో సహా 203 చెరువులు, కాలువలకు నష్టం జరిగింది. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ.44 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. కానీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు అలాగే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌజింగ్‌బోర్డు కాలనీల్లో వందలాది ఇళ్లు వరదల్లో మునిగిపోయి సామగ్రితో పాటు ద్విచక్రవాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. భారీగా నష్టం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించి, దెబ్బతిన్న పంటలు, రోడ్లు, వంతెనలను పరిశీలించారు. వరదల్లో మునిగి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. కానీ పరిహారం కోసం అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. భారీ వరదలతో అతలాకుతలమైన జిల్లా దెబ్బతిన్న రోడ్లు.. కొట్టుకుపోయిన వంతెనలు ఇళ్లలోకి చేరిన వరద నీరు.. ఇబ్బందిపడ్డ ప్రజలు అన్నదాతకు అపార నష్టం.. ఆదుకోని సర్కారు -
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
నెలలో రెండో ఘటన నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో చైన్‌స్నాచింగ్ ఘటనలు మళ్లీ పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లా కేంద్రంలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. తెల్లవారుజామున ముసుగు ధరించుకొని బైక్‌లపై వస్తున్న దుండగులు జనంలేని ప్రాంతాల్లో ఉండే మహిళల బంగారు గొలుసులు లా క్కెళ్తున్నారు. వారం రోజుల క్రితం వినాయక్‌నగర్, కసాబ్‌గల్లీలో అడ్రస్ అడుగుతూ మహిళల మెడలో ని పుస్తెలతాడును లాకెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేస్తుండగా, తాజాగా సోమవారం సుభాష్‌నగర్ ఎస్బీఐ బ్యాంక్ వెనుక ప్రాంతంలో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఇంటి వద్ద పూలు తెంపుతున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. క్లూ దొరికింది.. సుభాష్‌నగర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి చైన్ స్నాచర్ల క్లూ దొరికింది. త్వరలోనే పట్టుకుంటాం. మిగతా రెండు కేసుల్లో విచారణ వేగంగా జరుగుతోంది. బంగారం రేటు పెరగడంతోనే చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. మహిళలు అప్రమత్తంగా ఉండాలి. – రాజావెంకటరెడ్డి, ఏసీపీ, నిజామాబాద్సంవత్సరం చోరీలు పోలీసులు ఛేదించినవి 2022 26 13 2023 40 18 2024 37 07 2025 17 13 జిల్లాలో జరిగిన చైన్‌స్నాచింగ్‌లు -
బైకును ఢీకొట్టిన లారీ
● ఇద్దరికి గాయాలు ఎల్లారెడ్డి: పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఎర్రారం గ్రామానికి చెందిన గూల గోపాల్, గూల మల్లేష్ అలియాస్ సాతెల్లి మల్లేశ్ బైక్‌పై ఎల్లారెడ్డి నుంచి సొంతూరికి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిజాంసాగర్ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోపాల్ తలకు తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హైదరాబాద్‌కు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. -
క్రైం కార్నర్
● పాతకక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడినవీపేట: మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో బావపై బావమరిది గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. లింగాపూర్ గ్రామానికి చెందిన గంధం శ్రీనివాస్ సోదరిని ఆశాజ్యోతి కాలనీకి చెందిన చెందిన హన్మాండ్లు కొన్నేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గుండారం గ్రామ శివారులోని మహంకాళి ఆలయంలో హన్మాండ్లు ఆదివారం బంధువులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో హన్మాండ్లుకు ఇతర వ్యక్తులతో స్వల్పంగా ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని బావమరిది గంధం శ్రీనివాస్‌కు ఫోన్లో చెప్పగా ఆయన స్నేహితులను తీసుకొనికి మహంకాళి ఆలయానికి వచ్చారు. కానీ అప్పటికే గొడవ సద్దుమణిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన గంధం శ్రీనివాస్ బావ హన్మాండ్లుకు ఫోన్ చేసి తాగిన మైకంలో దూషించాడు. ఇరువురు గొడవపడగా పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని హన్మాండ్లు తల, వీపుపై గంధం శ్రీనివాస్ గొడ్డలితో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన హన్మాండ్లును ఆస్పత్రికి తరలించామని, బాధితుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దోమకొండ: చేపలవేటకు వెళ్లిన యువకుడు నీటమునిగి మృతిచెందిన ఘటన దోమకొండ మండలం కోనాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెంట స్వామి(40) రోజూ మాదిరిగా గ్రామ శివారులోని ఎగువ మానేరు నీటిలో చేపలవేటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. రాత్రి ఒడ్డు వద్దకు శవం కొట్టుకువచ్చింది. మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
‘పోచారం’లో చేపపిల్లల విడుదల
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టులో సోమ వారం మెదక్ జిల్లా మత్స్య సహకార శాఖ ఆధ్వర్యంలో రెండో విడత చేపపిల్లలను వి డుదల చేశారు. ఈ సందర్భంగా మెదక్ జి ల్లా మత్స్య సహకారశాఖ ఏడీ మల్లేశం, పో చారం ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం కా ర్యదర్శి శివయ్య మాట్లాడారు. ఇటీవల మొ దటివిడతలో 9.28 లక్షల చేపపిల్లలను విడుదల చేశామన్నారు. ప్రస్తుతం 3.24 లక్షల చేపపిల్లలను విడుదల చేశామని తెలిపారు. కార్యక్రమంలో పోచారం సర్పంచ్ సంజీవరావు, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారులకు ఏఎస్పీ సూచనలు కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని కిరాణ, జనరల్ స్టోర్స్ వ్యాపారులతో కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏఎస్పీ చైతన్యరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మాంజా విక్రయాలపై వ్యాపారులకు పలు సూచనలు ఇచ్చారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినందున దానిని విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. బాక్సింగ్‌లో బంగారు పతకం గాంధారి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి అర్జున్ గజానన్ దేశ్‌ముఖ్ ఓపెన్ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటాడు. ఈనెల 28న హైదరాబాద్‌లోని జీ హెచ్ఎంసీ క్రీడా మైదానంలో శివాజీ మహా రాజ్ రాష్ట్రస్థాయి ఆహ్వానిత పోటీలు నిర్వ హించారు. ఇందులో అర్జున్ బంగారు పత కం సాధించాడని అధ్యాపకులు తెలిపారు. ముందస్తు అరెస్టులు కామారెడ్డి టౌన్: అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాజు, సాగర్ గౌడ్, హనుమాండ్లు, రవి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఇంటర్‌లింకింగ్ వ్యవస్థ కామారెడ్డి అర్బన్: వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా నూతన సాంకేతిక మార్పులు చేపడుతున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ రవీందర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సరఫరా కు అటంకం కలగకుండా ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఇంటర్ లింకింగ్‌తో విద్యుత్ అంతరాయాలు కనీసం రెండు గంటలకు తగ్గాయ న్నారు. కామారెడ్డి సర్కిల్లోని 134 విద్యుత్ సబ్స్టేషన్లు, ఐదు 33 కేవీ లైన్లలో ఇప్పటికే ఇంటర్ లింకింగ్ వ్యవస్థను పూర్తి చేశామని, మిగిలిపోయిన ఐదు సబ్స్టేషన్లలో ఆరు లైన్ల పనులకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఉత్తమ రక్తదాతల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉత్తమ రక్తదాతలు, సేవా సంస్థలు, యువజన సంఘాలకు జాతీ య పురస్కారాలు అందించనున్నట్లు జిల్లా రక్తదాతల సమూహం వ్యవస్థాపకుడు బాలు తెలిపారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 94928 74006 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
చైనా మాంజా నిషేధం
● విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు ● ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: పర్యావరణానికి తీవ్రమైన విపత్తుగా మారిన చైనా మాంజా(సింథటిక్/నైలాన్ దారం) విక్రయాలు, వినియోగంపై జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేస్తున్నామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో చైనా మాంజాను విక్రయించే దుకాణాలు, గోదాంలు, మార్కెట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. చైనా మాంజాను ఉపయోగించి గాలిపటాలు ఎగురవేసే సమయంలో అనేక పక్షులు, పశువులు, ప్రజలు, ముఖ్యంగా బైక్‌లపై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. చైనా మాంజాను విక్రయించడం, కొనుగోలు చేయడం పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం నేరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఎలాంటి హాని కలిగించని సాధారణ పత్తి దారాన్ని మాత్రమే ఉపయోగించి గాలిపటాలు ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో చైనా మాంజా విక్రయానికి సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసి, రూ.1.52 లక్షల విలువైన 65 బెండళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరిగితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు గాని, డయల్ 100 కు గానీ సీసీఎస్ సీఐ శ్రీనివాస్ (సెల్: 8712686112) కు గానీ సమాచారం అందించాలని ఒక ప్రకటనలో కోరారు. -
జిల్లాలో యూరియా కొరత లేదు
● సమస్యలుంటే ఫిర్యాదు చేయండి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. యాసంగి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా లభ్యత, యూరియా బుకింగ్ యాప్ తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు ఇచ్చారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో యాసంగి సీజన్‌కుగాను 39,645 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 24,812 మెట్రిక్ టన్నులు వచ్చిందని తెలిపారు. దీంట్లో నుంచి ఇప్పటికే 16,745 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 14,833 మెట్రిక్ టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లలో ఉదయం 6 నుంచి యూరియా విక్రయాలు ప్రారంభం అవుతాయన్నారు. రైతులు తమ పట్టా పాస్‌పుస్తకం, ఆధార్ కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. కౌంటర్ల దగ్గర రైతులకు కనీస సౌకర్యాలను అందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. యూరియా పక్కదారి పట్టకుండా ప్రత్యేక తనిఖీల బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయి టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5779 కు గానీ, జిల్లా స్థాయి టోల్‌ఫ్రీ నంబర్ 89777 46047 లోగానీ సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఏవో మోహన్‌రెడ్డి, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు. -
నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ గంజ్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్షను నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావాలన్నారు. ఇలాంటి ప్రతిభా పరీక్షలు గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విద్యార్థుల ఆలోచనా శక్తిని అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ఫోరం జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శి రామారావు, ఖజానాదారు నరేందర్, ప్రతినిధులు పాల్గొన్నారు. బాన్సువాడ : బీర్కూర్ మండలం బరంగెడ్గి జీపీవో మల్లేశ్‌ను తొలగించాలని బరంగెడ్గి సర్పంచ్ అనీల్ కుమార్ సోమవారం తహసీల్దార్ భుజంగరావుకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 28న గ్రామ శివారులో మట్టి తవ్వకాలు జరుపుతున్న విషయం కొందరు రైతులు తమ దృష్టికి తీసుకురాగ వెంటనే జీపీవో మల్లేశ్‌కు తాను ఫోన్ చేసి మట్టి తవ్వకాలు నిలిపివేయాలని సూచించడంతో తనను జీపీవో ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడని, వెంటనే మల్లేశ్‌ను తొలగించి ఇతరులను నియమించాలని సూచించారు. కాల్ రికార్డు కాపీని సమర్పిస్తున్నానని తెలిపారు. విచారణ చేస్తామని తహసీల్దార్ భుజంగరావు అన్నారు. రైతులు బాలయ్య, గంగొండ ఉన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మోతె సర్పంచ్ వజీర్ సుజాతబాయి సూచించారు. సోమవా రం మోతెలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. వైద్యులు సూచించిన పద్ధతి లో ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతీ రోజు యోగా, వ్యాయామం చేయాలన్నారు. 250 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైద్యులు నాగేశ్వర్రావు, ఆనంద్, రోహిత్, శ్రీదేవి, కీర్తి, గ్రామ ఉపసర్పంచ్ రవి పాల్గొన్నారు. సంగోజీవాడిలో ఉచిత వైద్య శిబిరం తాడ్వాయి(ఎల్లారెడ్డి):సంగోజీవాడిలో సోమవా రం మల్లారెడ్డి, నారాయణ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి 155 మందికి వైద్య పరీక్షలు చేశారు. మాత్రలను పంపిణీ చేశారు. సర్పంచ్ తాజోద్దీన్, వైద్య సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను తమ కార్యాలయంలో అందజేయాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎల్లారెడ్డి ఎంపీవో ప్రకాశ్‌లు వేర్వేరుగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖర్చుల వివరాలను ఎన్నికలు జరిగిన 45 రోజులలో అందజేయాలని వెల్లడించారు. ఎన్నికల ఖర్చుల వివరాలను అందజేయని అభ్యర్థులు తర్వాత జరిగే ఎన్నికలలో పోటీకి అనర్హులని చెప్పారు. -
పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
మాచారెడ్డి: సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని మాచారెడ్డి ఎంఈవో సురభి దేవేందర్‌రావ్ పిలుపునిచ్చారు. సోమవారం మాచారెడ్డి విద్యావనరుల కేంద్రంలో బడి బాగు– సర్పంచ్ల పాత్ర అంశంపై ఆయన మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధి ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలాగే గ్రామ భవిష్యత్తు ప్రథమ పౌరులైన సర్పంచ్‌లపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండలంలోని 25 గ్రామాల సర్పంచ్‌లను ఆత్మీయంగా సత్కరించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌రెడ్డి, భాస్కర్, వెంకటచారి, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి
మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మృతుడి తల్లిదండ్రులు ప్రజావాణికి వచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, ప్రతినిధులు మాట్లాడుతూ.. అచ్చంపేట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుకుంటున్న గొట్టం అజయ్ అనే విద్యార్ధి ఈ నెల 27న మంజీరా కెనాల్లో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఆయన కుటుంబం వీధిన పడిందన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. -
గిన్నిస్ బుక్‌లో కామారెడ్డి కళాకారులు
కామారెడ్డి అర్బన్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 27న 7,209 మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కూచిపూడి కళా వైభవం–2 పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ ప్రదర్శనలో కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం గురువు, జాతీయ కళాకారుడు వంశీప్రతాప్గౌడ్, ప్రతినిధులు కనకతార, హర్షిత సారథ్యంలో 30 మంది నృత్య విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ రికార్డు సృష్టించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్న జిల్లా కళాకారులను పలువురు అభినందించారు. -
కొనుగోలు కేంద్రాల్లో సమస్యల కుప్ప
● నత్తనడకన మక్కల సేకరణ ● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు ● పట్టించుకోని అధికారులుతాడ్వాయి : కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధానంగా గోనె సంచుల కొరతతో కొనుగోళ్లు ముందుకు సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాడ్వాయి మండలంలో వర్షాధారంగా ఎక్కువగా మక్క సాగవుతుంది. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సింగిల్‌విండోల ఆధ్వర్యంలో తాడ్వాయి ఎండ్రియాల్, ఎర్రాపహాడ్, దేమికలాన్, కన్కల్, కరడ్‌పల్లి, సంగోజీవాడి, కాళోజీవాడి, బ్రాహ్మణపల్లి, కృష్ణాజీవాడి, సోమారంలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే సరిగా కొనుగోళ్లు జరక్కపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. గన్నీ సంచుల కొరతతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. మండలంలో ఇప్పటివరకు 50 వేలకుపైగా క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారు. మరో 50 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాల్సి ఉంది. గన్నీ సంచులు, సుతిల్ తాళ్లు లేక తరచూ కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరుతోనూ రైతులు విసిగిపోతున్నారు. వరుస క్రమంలో కాకుండా ఇష్టారీతిన మక్కలు సేకరిస్తున్నారని, తాము నెలరోజులుగా వేచి చూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్కల సేకరణ నత్తనడకన సాగుతుండడంతో చాలామంది రైతులు విసుగు చెంది దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు తక్కువ ధర చెల్లిస్తుండడంతో నష్టపోతున్నారు. మరోవైపు సేకరించిన మక్కలకు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలలో జమ కావడం లేదు. మంగళవారంతో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. మక్కలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదాలు..
జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల విసురుతూ అడ్డంగా దోచుకుంటున్న సంఘటనలు రోజూ రెండు మూడు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది కిడ్నాప్‌లు, అత్యాచారాలు పెరిగాయి. రోడ్డు ప్రమాద మరణాలు కొంత మేర తగ్గాయి. హత్యలు, హత్యా యత్నాలు దాదాపు వారానికొకటి కామన్‌గా మారాయి. 2025లో జరిగిన నేరాలపై రౌండప్..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రూపంలో వల విసురుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నిలువునా ముంచుతున్నారు. అన్నీ తెలిసిన వారూ వాళ్ల వలలో చిక్కి మోసపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది సైబర్ నేరాలకు సంబంధించి 980 పిటిషన్లు వచ్చాయి. 160 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సైబర్ నేరస్తులు రూ. 5.82 కోట్లు కొల్లగొట్టగా.. పోలీసులు అందులో రూ. 1.07 కోట్లు రికవరీ చేశారు. సైబర్ నేరాలపై పోలీస్ యంత్రాంగం ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసపోతూనే ఉన్నారు. రకరకాల మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. జిల్లాలో చిన్నపాటి దొంగతనాలు కాస్త తగ్గినా.. దోపిడీ కేసులు మాత్రం పెరిగాయి. 2024లో 506 చిల్లర దొంగతనాలు జరగ్గా ఈసారి 434 కి తగ్గాయి. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు సంబంధించి గతేడాది 214 కేసులు నమోదవగా ఈసారి 224 నమోదయ్యాయి. గతేడాది 15 దోపిడీ కేసులు నమోదవగా ఈసారి 35 కి పెరిగాయి. జిల్లాలో పేకాట ఆగడం లేదు. పోలీసులు దాడులు చేసి, కేసులు పెడుతున్నా సరే పేకాడేవారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతేడాది 214 సంఘటనల్లో 1,113 మందిపై గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి వారినుంచి రూ.38.10 లక్షలు స్వీధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సంవత్సరం 305 సంఘటనల్లో 1,733 మందిపై గ్యాంబ్లింగ్ కేసులు పెట్టి రూ.32.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గంజాయి అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయి. అప్పుడప్పులు పోలీసులు దాడులు చేస్తున్నా దందాకు అడ్డుకట్ట పడడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే కృత్రిమ కల్లు తయారీకి వాడే అల్ప్రాజోలం దందా విచ్చలవిడిగా నడుస్తోంది. చాలా ప్రాంతాల్లో కల్లు తయారీకి దీనిని వాడుతున్నారు.జిల్లాలో పది రోజులకో హత్య జరుగుతోంది. ఈ ఏడాది 36 మంది హత్యకు గురయ్యారు. మరో 30 మందిపై హత్యాయత్నం జరిగింది. గతేడాది 37 మంది హతమవగా 20 మందిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఏడాది కిడ్నాప్ కేసులు పెరిగాయి. గతేడాది 39 కిడ్నాపులు నమోదయితే ఈసారి 43 కు చేరాయి. రేప్ కేసులు కూడా పెరిగాయి. గతేడాది 61 కేసులు నమోదవగా, ఈసారి 67 నమోదయ్యాయి. పోక్సో కేసులు గతేడాది 89 నమోదవగా, ఈసారి 101 కి చేరాయి. వరకట్నపు వేధింపుల కేసులు గతేడాది 312 నమోదైతే, ఈసారి 247 కి తగ్గాయి. సామాన్యుడిని ముంచిన సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలు పెరిగిన కిడ్నాప్‌లు, అత్యాచారాలు తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలురోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు కొంతమేర సత్ఫలితాలనిచ్చాయి. 2024 సంవత్సరంలో 569 రోడ్డు ప్రమాదాలు జరిగి 275 మంది చనిపోగా.. ఈ సంవత్సరంలో 486 రోడ్డు ప్రమాదాల్లో 211 మంది మృత్యువాతపడ్డారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ కేసులు పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 11,413 కేసులు పెట్టారు. తాగి వాహనాలు నడుపుతూ దొరికిన వారికి భారీ జరిమానాలతో పాటు ఒకటి, రెండు రోజుల జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై 3,16,839 కేసులు, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారిపై 1,368 కేసులు, ఓవర్ స్పీడ్‌కు సంబంధించి 98,717 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై 1,32,315 కేసులు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినవారిపై 2,493 కేసులు నమోదయ్యాయి. -
‘కర్షక పీడిత ప్రజల మనిషి వీఎల్’
కామారెడ్డి అర్బన్: సీనియర్ న్యాయవాది, సీపీఐ నాయకుడు వీఎల్ నర్సింహారెడ్డి ప్రజాస్వామికవాదిగా పేదలు, కార్మిక, కర్షక, పీడిత ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా మనిషి అని సీపీఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ అన్నారు. ఆదివారం కామారెడ్డి జీఎస్ఆర్ కళాశాలలో వీఎల్ నర్సింహారెడ్డి సంస్మరణ సభ నిర్వహించగా.. సీపీఐ జిల్లా కార్యదర్శి దశరథ్ అధ్యక్షత వహించారు. నర్సింహారెడ్డి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలు నిర్బంధానికి గురైనప్పుడు వారి పక్షాన ఉండి అనేక బెయిళ్లు ఇప్పించి ఉచితంగా వాదించారని, పేదల న్యాయవాదిగా ప్రసిద్ధి చెందారని నేతలు కొనియాడారు. న్యాయవాదులు క్యాతం సిద్ధిరాములు, వెంకటరాంరెడ్డి, వేణుగోపాల్, నవీన్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు లక్ష్మణ్, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. పిట్లం(జుక్కల్): కుర్తి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన సందర్భంగా ఆదివారం గ్రామ ప్రజలు ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింఽధే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు విచ్చేసిన ఎమ్మెల్యేను, సర్పంచ్ సాయవ్వలను గ్రామస్తులు, పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు గ్రామంలో విజయత్సోవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్ పని చేయాలని, తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కామారెడ్డి అర్బన్: మనిషిని మాధవుడిగా మార్చే గొప్ప శక్తి అయ్యప్పమాలకు ఉందని, మాలధా రుల్లో 40 రోజుల తర్వాత మార్పురాకపోతే ఫలితం శూన్యమని వైశ్యుల కులగురువు, హల్థీపురం పీఠాధిపతి వామనశ్రమ స్వామీజీ అన్నారు. కామారెడ్డి అయ్యప్ప ఆలయ తృతీయ పుష్కర మ హా కుంభాభిషేకం కార్యక్రమంలో వామనశ్రమ స్వామీజీ పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో వేదపండితుడు అంజనేయశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు నస్కంటి శ్రీనివాస్, గొనే శ్రీనివాస్, పట్నం రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు తీసుకునేప్పుడు జాగ్రత్త!
మీకు తెలుసా.. రామారెడ్డి: చట్టబద్ధంగా (లీగల్‌గా) అప్పు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మోసాలు జరగకుండా అనవసరమైన వేధింపులు లేకుండా జాగ్రత్తపడవ చ్చు. మీరు అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే.. ● సాధారణంగా ఆర్బీఐ గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వంటి వాటి నుంచి రుణాలు తీసుకోవచ్చు. ● చిన్న మొత్తంలో రుణాలను ఎన్బీఎఫ్సీ(బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఆర్బీఐ గు ర్తింపు పొందిన ప్రయివేట్ సంస్థలు రిజిస్టర్డ్ మైక్రోఫైనాన్న్స్ సంస్థల ద్వారా పొందవచ్చు. ● లైసెన్స్ ఉన్న వడ్డీ వ్యాపారులు, ప్రయివేట్ వ్యక్తుల దగ్గర తీసుకుంటే, వారికి ప్రభుత్వం ఇచ్చిన ‘మనీ లెండింగ్ లైసెనన్స్’ ఉందో లేదో సరిచూసుకోవాలి. ● అప్పు తీసుకునేటప్పుడు కేవలం మాటల మీద ఆధారపడకుండా పత్రాలను సిద్ధం చేసుకోవాలి ● ప్రామిసరీ నోట్ అప్పు తీసుకున్నట్లు, తిరిగి చెల్లిస్తానని రాసి ఇచ్చే పత్రం. దీనిపై రెవె న్యూ స్టాంపు ఉండాలి. ● లోన్ అగ్రిమెంట్ వడ్డీ రేటు, చెల్లింపు గడువు, ఆలస్యమైతే జరిమానా వంటి వివరాలన్నీ ఇందులో ఉండాలి. ● భద్రత కోసం బ్యాంకులు లేదా సంస్థలు పోస్ట్ డేటెడ్ చెక్కులు అడుగుతాయి. ● వడ్డీ రేటు చట్టం ప్రకారం నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయడం నేరం. బ్యాంకుల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ● వ్యక్తిగత రుణాలకు వడ్డీ సాధారణంగా ఏడాదికి 10.5% నుంచి 24% వరకు ఉండవచ్చు. ● బంగారు రుణాలు ఏడాదికి 8% నుంచి 15% వరకు ఉంటాయి. ● గృహ రుణాలు ఏడాదికి 8.5% నుంచి 11% మధ్యలో ఉంటాయి. ● వ్యాపార రుణాలు ఏడాదికి 12% నుంచి 18% వరకు ఉండవచ్చు. ● ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకునే అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేశాయి. ● లైసెన్స్ ఉన్న వడ్డీ వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదు. ● సాధారణంగా ఇది ఏడాదికి 12% నుంచి 18% మించకూడదని నిబంధనలున్నాయి. ● ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ పేరుతో ఎంత కట్ అవుతుందో ముందే అడగండి. ● మీరు గడువు కంటే ముందే అప్పు తీర్చేయాలనుకుంటే ఏవైనా పెనాల్టీలు ఉంటాయో తెలుసుకోవాలి. ● ఆన్లైన్ లోన్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ప్లేస్టోర్‌లో చాలా ఫే క్ లోన్ యాప్‌లు ఉన్నాయి. ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందిన యాప్‌లలోనే అప్పు తీసుకోవాలి. ● మీ ఫోన్ కాంటాక్ట్స్, గ్యాలరీకి అనుమతి అడిగే యాప్‌లకు దూరంగా ఉండండి. ● ఎప్పుడూ ఖాళీ పేపర్ల మీద లేదా ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేయకండి. ● మీరు చెల్లించే ప్రతి రూపాయికి రసీదు అడగండి. లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే చెల్లింపులు చేయండి. ● అప్పు తీసుకునేటప్పుడు సాక్షుల సంతకాలు ఉండేలా చూసుకోండి. -
జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం సాధించిన కానిస్టేబుల్
సదాశివనగర్ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న జె.లక్ష్మణ్ అథ్లెటిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీలలో 12వ మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. జావెలిన్ త్రో 50 ఏళ్లు పైబడిన విభాగంలో 28.3 మీటర్ల ప్రదర్శనలో లక్ష్మణ్ ద్వితీయ స్థానం సాధించడం పోలీస్ శాఖకు గర్వకారణంగా ఉందని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. లక్ష్మణ్‌ను సహచర సిబ్బంది అభినందించారు. సూపర్ బ్రెయిన్ యోగాతో ఏకాగ్రత ● గుంజిళ్ల మాస్టర్ అందె జీవన్ రావు డిచ్పల్లి: సూపర్ బ్రెయిన్ యోగా ఆచరణతో విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని గుంజిళ్ల మాస్టర్ అందె జీవన్‌రావు తెలిపా రు. ఈనెల 26, 27వ తేదీలలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భక్తి వేదాంత ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘వాస్తవికత నిర్మాణంలో సూపర్ బ్రెయిన్ యోగా పాత్ర’ అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. సూపర్ బ్రెయిన్ యోగాతో మెదడు లోని కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ఆల్ఫా తరంగాల క్రియాశీలత పెరగడంతో అనవసర విషయాలు, సమాచారం మెదడును చేరవని దీంతో వాస్తవికత ప్రామాణికత పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక కమ్మర్పల్లి: హాసాకొత్తూర్ జెడ్పీహెచ్ఎస్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న రిషిత రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం అరుణశ్రీ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన రిషిత రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. గోదావరిలో పసికందు మృతదేహం నవీపేట: యంచ శివారులోని గోదా వరి నది నీటిలో ఆదివారం మగశిశువు మృతదేహం తేలియాడుతూ కనిపించింది. గుర్తు తె లియని వ్యక్తులు శిశువు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో ఉంచి గోదావరి నదిలో పడేశారని ఎస్సైలు శ్రీకాంత్, యాదగిరి గౌడ్ తెలిపారు. రెండు రోజుల క్రితం జన్మించిన మగశిశువును నీటిలో పడేసి ఉంటారన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
హరినామ సప్తాహంలో మాజీ ఎమ్మెల్యే
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మల్కాపూర్ శివారు హనుమాన్ ఆలయంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న హరినామ సప్తాహంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే పాల్గొన్నారు. వార్కారీలను సన్మానించి ఆలయంలో భజన, పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంవైపు వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. బీఆర్ఎస్ నాయకులు నాల్చర్ రాజు, వెంకట్రావు, డాక్టర్ రాజు తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: స్థానిక ప్రసన్న వేంకటేశ్వరస్వామి పంచముఖి హన్మాన్ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ వైద్య కిషన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి కళాకారిణి డాక్టర్ ఏ.మనోజ్ఞ, డాక్టర్ ఎస్సీ కృష్ణకుమారి బృందంతో ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శన ఉంటుందని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చైర్మన్ కిషన్‌రావు కోరారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో బగళాముఖి అమ్మవారి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు క్రాంతి పటేల్, వెంకటేశం, సతీష్, రేవంత్, సాయినాథ్ తదితరులున్నారు. -
బంగారు ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య
● నిందితుడి పట్టివేత ● ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుడు పొల్కంపేట గ్రామానికి చెందిన ముద్రబోయిన కుమార్ బంగారు ఆభరణాల కోసమే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఇంట్లో వృద్ధురాలు సులోచన ఒంటరిగా ఉన్న విషయం గమనించిన కుమార్ ఇంటి వెనుక ఉన్న తలుపును పైకి లేపి ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించి ఆమెను తీవ్రంగా గాయపర్చి హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలను తీసుకెళ్లడానికి వచ్చిన క్రమంలో అతడిని పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి పుస్తెలతాడు, కమ్మలు, ఉంగరం, బంగారు గాజులు (సుమారు నాలుగు తులాలు) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు గతంలో చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడని తెలిపారు. పని చేయకుండా ఆవారాగా తిరిగేవాడన్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్, సీబ్బంది రమేశ్, సంపత్, జవ్వినాయక్, లీక్యానాయక్, మదన్‌లాల్‌లను జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించినట్లు తెలిపారు. -
యోగాతో ఆరోగ్యవంతమైన కుటుంబం
భిక్కనూరు: మహిళలు నిత్యం యోగ సాధన చేస్తే వారి కుటుంబం ఆరోగ్యవంతమైన కుటుంబంగా మారుతుందని భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ అన్నారు. ఆదివారం భిక్కనూరులో పతంజలి మ హిళ యోగ కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లా డారు. పాశ్చాత్యులు యోగ సాధన చేస్తుంటే మన వాళ్లు జిమ్‌ల వెంట తిరుగుతున్నారన్నారు.చిన్న పె ద్ద అనే తేడా లేకుండా అందరూ యోగ సాధనలో భాగమైనప్పుడు ఆరోగ్యం బాగుంటుందన్నారు. మనస్సుకు ప్రశాంతత కలుగడంతో పాటు ఏకాగ్రత ఏర్పడుతుందన్నారు. మండల కేంద్రంలో ఉచి త మహిళా యోగ కేంద్రాన్ని నిర్వహించేందకు మందుకు వచ్చిన రిటైర్డు లైబ్రేరియన్ నర్సింలును ఆమె అభినందించారు. సర్పంచ్ బల్యాల రేఖను శాలువాతో మహిళ యోగా సాధకులు సత్కరించారు. కామారెడ్డి అర్బన్: టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో జనగామలో నిర్వహిస్తున్న రాష్ట్ర విద్య వైజ్ఞానిక మహాసభల్లో కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల బాబు, ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, రూప్సింగ్, నారాయణ, సురేష్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. వివక్ష లేని విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని, అందరికి సమాన విద్య అందించాలనే సందేశం ఇస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు బాబు పేర్కొన్నారు. -
‘గాంధీ పేరు రూపుమాపే కుట్ర’
ఎల్లారెడ్డిరూరల్: గాంధీ పేరు రూపుమాపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ఆరోపించారు. ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత మల్లికార్జున్ మాట్లాడుతూ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రజల కోసం మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం ప్రారంభించారన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం గాంధీజీ పేరు తొలగించడం సరి కాదన్నారు. ఉపాధిహామీ పథకం పేరును కొనసాగించాలని గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని, పరిషత్ ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ రజిత, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు వినోద్‌గౌడ్, నాయకులు ఊషాగౌడ్, గోపి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా..
● వలస కార్మిక సంఘాల పోరుబాట ● ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు లేఖలను అందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ మోర్తాడ్(బాల్కొండ): వలస కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాటను ఆరంభించాయి. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలను ఆరంభించే అవకాశం ఉండటంతో అప్పట్లోగా తమ డిమాండ్లను ప్రజాప్రతినిధుల దృష్టికి చేరవేయాలనే సంకల్పంతో వలస కార్మిక సంఘాలు లేఖలు రాస్తున్నాయి. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను స్వయంగా కలిసి లేఖలను అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకవస్తారనే ఆలోచనతో కార్మిక సంఘాల ప్రతినిధులు కార్యాచరణ మొదలు పెట్టారు. కొన్ని అంశాలపై దృష్టిసారించినా... ఇప్పటికే రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికులకు సంబంధించి కొన్ని అంశాలపై దృష్టిసారించింది. అవి పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో వలస కార్మికుల కుటుంబాలకు ప్రయోజనాలు దక్కడం లేదు. దీంతో డిమాండ్ల సాధన కోసం బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని ఇప్పటి నుంచే నడుం కట్టాలని వలస కార్మిక సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. ఆదివారం ప్రారంభించిన లేఖల అందజేత కార్యక్రమంను రోజూ కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈక్రమంలో ఒక్కో ప్రజాప్రతినిధిని స్వయంగా కలిసి డిమాండ్లను వినిపించనున్నారు. -
‘ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’
నిజాంసాగర్: ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి సూచించారు. ఆదివారం నిజాంసాగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నవోదయ విద్యాలయాలు దేశానికి ఆదర్శమన్నారు. నవోదయ విద్యాలయాల్లో చదివినవారు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రస్తుత విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపాల్ సీతారాం బాబు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏడు నెలలుగా ఎదురుచూపులు
● రేషన్ డీలర్లకు అందని కమీషన్ ● ఇబ్బంది పడుతున్న డీలర్లుదోమకొండ: జిల్లాలో రేషన్ డీలర్లకు కమీషన్ డబ్బులు అందడం లేదు. దీంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,337 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. ఒక్కో రేషన్ డీలర్ నెలకు 80 నుంచి 100 క్వింటాళ్ల వరకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా బియ్యం పంపిణీ చేస్త్న్ను రేషన్ డీలర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా క్వింటాలుకు రూ. 55, రాష్ట్ర ప్రభుత్వం రూ. 85 చొప్పున అందిస్తున్నాయి. రాష్ట్రం వాటా అందుతున్నా కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం జూన్ నుంచి విడుదల కావడం లేదు. కమీషన్ డబ్బులు విడుదల కాకపోవడంతో తాము ఇబ్బందిపడుతున్నామని డీలర్లు పేర్కొంటున్నారు. హమాలీ డబ్బులు, రూం కిరాయి, కరెంట్ బిల్లు, బియ్యం అందజేస్తే వ్యక్తికి జీతం ఇవ్వడం ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కమీషన్ డబ్బులు విడుదల చేయాలని కోరుతున్నారు.రేషన్ బియ్యం పంపిణీ చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు కమీషన్ చెల్లిస్తాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.55 చొప్పున ఇస్తుంది. ఇది జూన్ నెల నుంచి రావడం లేదు. వెంటనే కమీషన్ డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలి. – మల్లారెడ్డి, రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, దోమకొండ -
సేవ చేయడమే లక్ష్యం
బీబీపేట : ప్రతి గ్రామంలో పార్టీలకతీతంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చానని, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామలో నూతన సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులతో మాటాముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 గ్రామాల పంచాయతీల పాలకవర్గాల ప్రతినిదులు సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సుభా ష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కనీసం లక్ష రూపాయల విలువ చేసే ఫర్నిచర్ అందిస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఫర్నిచర్ ఉన్నట్లయితే మరే అభివృద్ధికి అయినా సరే ముందుంటానని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు మిట్టపల్లి సురేందర్, పాటమ్మ రాంబాబు పాల్గొని పాటలు పాడారు. ● పార్టీలకతీతంగా గ్రామాలకు ఫర్నిచర్ అందిస్తా ● ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్‌రెడ్డి -
ఏళ్ల తర్వాత.. ఒక్కచోటికి..
● జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ● ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురైన మిత్రులు బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 1973–75 బ్యాచ్ ఇంటర్ విద్యార్థులు బోధన్‌టౌన్(బోధన్): వారంతా పూర్వ విద్యార్థులు. 50ఏళ్ల క్రితం ఇంటర్ చదివి ఎక్కడెక్కడో స్థిరప డ్డారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేసి, రిటైర్డ్ అయిన అందరూ మళ్లీ ఇన్నేళ్లకు ఒకేచోట కలిశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973–75లో ఇంటర్ విద్యను అభ్యసించిన వి ద్యార్థులు ఆదివారం అదే కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొని, చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆటపాటలతో అలరించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, సాయిలు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. వేల్పూర్‌లో 47 ఏళ్ల తర్వాత.. వేల్పూర్: వేల్పూర్ హైస్కూలులో 1977–78 ఎ స్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. పాఠశాలలో చదు వుకున్న రోజులు గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. ఒకరినొకరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కామారెడ్డిలో 30 ఏళ్ల తర్వాత.. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి వివేకానంద పాఠశాల 1994–95 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పట్టణంలోని ఓ హోటల్లో పూర్వ విద్యార్థు లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ వారంతా ఒక్కచోట కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. నాడు బోధించిన ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. భీమ్‌గల్‌లో 25 ఏళ్ల తర్వాత.. కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ జెడ్పీహెచ్ఎస్ల 1999–2000 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ వారంతా ఒకేచోట కలుసుకోవడంతో ఆప్యాయంగా పలుకరించుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. వెల్మల్‌లో 21 ఏళ్ల తర్వాత.. నందిపేట్(ఆర్మూర్): మండలంలోని వెల్మల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం 2003–04 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వీరంతా 21 ఏళ్ల తర్వాత కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాడు చదువు చెప్పిన గురువులను సన్మానించారు. నిజాంసాగర్ నవోదయలో.. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సదరు విద్యాలయం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు చదివిన సుమారు 33 బ్యాచ్‌ల విద్యార్థులు పాల్గొన్నారు. నవోదయలో చదివి ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉన్నవారితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ప్రయివేట్ కంపెనీలు స్థాపించిన విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. నవోదయ ప్రిన్సిపాల్ సీతారాంబాబు, పూర్వ విధ్యార్థులు పాల్గోన్నారు. -
అన్నను చంపిన తమ్ముడి అరెస్టు
భిక్కనూరు: మండలంలోని మోటాట్పల్లి గ్రామంలో అన్నను చంపిన తమ్ముడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, ఎస్సై అంజనేయులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారు వారు విలేకరులతో మాట్లాడారు. మోటాట్పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రాజు తన సమీప బంధువువైన మహిళతో వివాహేతర సంబందం పెట్టుకోవడంతో తన తమ్ముడు శివకుమార్‌కు పెళ్లి సంబంధాలు రావడంలేదు. అలాగే ఖరీఫ్ పంటకు సంబంధించిన డబ్బులను రాజు దుబార చేస్తున్నాడు. దీంతో అన్నపై కోపంతోనే హత్య చేసినట్టు తమ్ముడు ఒప్పుకున్నాడు. ఈమేరకు నిందితుడు శివకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ,ఎస్సైలు వివరించారు. -
పేరు మార్పుపై నిరసన
కామారెడ్డి టౌన్: ఉపాధి హామీ పథకం పేరు మార్చడం తగదని డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బాపూజీ పేరును తొలగించడం ఆయన ఆశయాలను అవమానించడమేనన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, నాయకులు పండ్ల రాజు, శ్రీను, గంగాధర్, లక్ష్మణ్, మోహన్ పాల్గొన్నారు. -
అద్దె అరకలకు డిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): యాసంగి సీజన్లో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకలకు డిమాండ్ పెరిగింది. ఒక్క రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు తడి పంటల సాగు పనులను రైతులు పూర్తి చేసుకుంటున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం, తెల్గాపూర్, శేర్‌ఖాన్‌పల్లి, శనివార్‌పేట గ్రామాల్లో ఆరుతడి పంటలు జోరుగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నాగలి, ఎడ్లు లేకపోవడంతో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్ ప్రాంతాల్లో ఉన్న ఎడ్లను అద్దెకు తీసుకు వచ్చి ఆరుతడి పంటలు సాగు చేయడంలో రైతులు నిమగ్నం అవుతున్నారు. నాగటేడ్లకు రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు. అంతేకాకుండా నెలకు రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఎడ్లకు అద్దె ఇస్తూ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. గ్రామాల్లో పశువుల సంతతి రోజురోజుకు కనుమరుగవడంతో రైతులకు వ్యవసాయం కష్టంగా మారింది. కామారెడ్డి అర్బన్: హైదరాబాద్ శంషాబాద్‌లోని జనవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహించే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 44వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలో ఏబీవీపీ మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు తరలిరావాలన్నారు. ఏబీవీపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్, ప్రతినిధులు గిరి, స్వామి, అనిల్, సంజయ్, కౌశిక్, అక్షయ్, అజార్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: మండల కేంద్రంలో ఉచి త మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తామని, తమకు అందరూ సహకరించా లని వెస్టర్న్ ఆస్పత్రి వైద్యులు సయ్య ద్ అక్బర్ హసన్, ఫైజల్‌లు అన్నారు. ఆదివారం వారు భిక్కనూరు జీపీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సూచన మేరకు తాము భిక్కనూరులో పెద్ద ఎత్తున ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించేందుకు వచ్చామన్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలను నిర్వహింపజేస్తామన్నారు. సర్పంచ్ బల్యాల రేఖ, ఉప సర్పంచ్ దుంపల మోహన్‌రెడ్డి, నేతలు ఎడ్ల రాజిరెడ్డి, సుదర్శన్, లింబాద్రి వార్డు సభ్యులున్నారు. -
అందని స్కానింగ్ సేవలు
కామారెడ్డి టౌన్: పేదలకు ఉచితంగా అధునాతన వైద్య పరీక్షలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టీ–హబ్’ (తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్) లక్ష్యం జిల్లాలో నీరుగారుతోంది. రోగ నిర్ధారణ కోసం వచ్చే రోగులు స్కానింగ్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. యంత్రం ఉన్నా నడిపే నాథుడు లేకపోవడంతో దానిని మరోచోటికి తరలించారు. దీంతో స్కానింగ్ అవసరం ఉన్న వారు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఖాళీగా రేడియాలజిస్ట్ పోస్టు జిల్లా కేంద్రంలోని నూతన మెడికల్ కళాశాల పక్కన టీ–హబ్ సెంటర్లో రక్త పరీక్షలు సజావుగానే జరుగుతున్నప్పటికీ, కీలకమైన రేడియాలజీ విభాగం సేవలు మాత్రం నిలిచిపోయాయి. రేడియాలజిస్ట్ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. రేడియాలజిస్ట్‌ను నియమించకపోవడంతో రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్కానింగ్ యంత్రం నిరుపయోగంగా మారింది. జీజీహెచ్‌కు తరలింపు.. టీ – హబ్‌లో వినియోగంలో లేదనే సాకుతో అక్కడి స్కానింగ్ యంత్రాన్ని అధికారులు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి తరలించారు. అయితే అక్కడ కూడా రోగుల రద్దీ విపరీతంగా ఉండటం, టెక్నికల్ సమస్యల కారణంగా సామాన్యులకు సకాలంలో స్కానింగ్ సేవలు అందడం లేదు. ముఖ్యంగా గర్భిణులు, అత్యవసర చికిత్స అవసరమైన వారు గంటల తరబడి వేచి చూడలేక ప్రైవేట్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో కేవలం జీజీహెచ్, మూడు ఏరియా ఆస్పత్రుల్లో తప్ప మిగతా సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో ఎక్కడ కూడా స్కానింగ్ సేవలు అందుబాటులో లేవు. దీంతో అపెండిసైటిస్, కడుపునొప్పి, స్టోన్స్, కడుపులో ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. గర్భిణుల నుంచి ఒక్కో అ ల్ట్రాసౌండ్ స్కానన్కు రూ.800 నుంచి రూ. 2,000 వరకు ప్రైవేట్ సెంటర్లు దండుకుంటున్నాయి. పేదలు అప్పులు చేసి మరీ పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని టీ–హబ్‌లో తక్షణమే రేడియాలజిస్ట్‌ను నియమించి, అన్ని రకాల స్కానింగ్ సేవలు ఒకే చోట అందేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెరుగు వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. డీఎంఈ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లీ టీ–హాబ్లో కూడా స్కానింగ్ సేవలు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని అన్నారు. టీ – హబ్‌లో యంత్రం ఉన్నా నిపుణుడు లేడు యంత్రాన్ని జీజీహెచ్‌కు తరలించిన అధికారులు ప్రైవేట్ సెంటర్లలో రూ.వేలల్లో ఫీజులు పట్టించుకోని వైద్యారోగ్య శాఖ -
పరుగు పందెంలో సత్తాచాటిన అక్కాచెల్లెళ్లు
బోధన్‌టౌన్(బోధన్): జిల్లాకేంద్రంలో ఇటీవల నిర్వహించిన పరుగుపందెం పోటీల్లో బోధన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు. పట్టణంలోని విజయసాయి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న తోకల అనన్య, తోకల మోక్ష అక్కాచెల్లెల్లు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 12 బాలికల విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో వారు పాల్గొన్నారు. 6వ తరగతి చదువుతున్న అనన్య ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వగా, 5వ తరగతి చదువున్న మోక్ష తృతీయ స్థానంలో నిలిచి సత్తా చాటిందని అథ్లెటిక్స్ ఫిట్నెస్ క్లబ్ బోధన్ కోచ్ రహన్ తెలిపా రు. పరుగు పందెంలో అక్కాచెల్లెల్లు విజేతలు గా నిలవడం అభినందనీయం కోచ్ అన్నారు. ఆవుల మందపై చిరుత దాడి నిజాంసాగర్(జుక్కల్): చిరుత దాడి చేసిం ఆవును హతమార్చిన ఘటన శుక్రవారం రాత్రి మండలంలోని చెరువు ముందరి తండా శివారులో చోటు చేసుకుంది. తండాకు చెందిన లాల్‌సింగ్ తన పశువులను గ్రామ శివారులోని కొట్టంలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ అటవీప్రాంతం నుంచి వచ్చిన చిరుత కొట్టంలోకి చొరబడడంతో పశువులు పరుగు తీశాయి. చిరుత దాడిలో ఒక ఆవు హతమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సెక్షన్ అధికారి శంకరప్ప ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. చిరుత దాడి వాస్తమేనని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. రాత్రి వేళ రైతులు పంట పొలాల వద్దకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావునిజాంసాగర్(జుక్కల్): గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శనివారం జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని సర్పంచులు ఎమ్మెల్యేను కలిసి ఘనంగా సన్మానించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సర్పంచులు ప్రజా సేవ చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు.కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్‌రెడ్డి, సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మద్దెలచెరువు అభివృద్ధికి కృషి చేస్తా పిట్లం(జుక్కల్): మద్దెల చెరువు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఆయన శనివారం మండలంలోని మద్దెల చెరువు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కళావతిని సర్పంచ్ గెలిపించినందుకు గ్రామస్తులకు ధ్యనవాదాలు తెలిపారు. గ్రామంలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్ కళావతిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో ... బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వం అధికారికంగా శనివారం బిచ్కుందలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు శైలేష్, అమృత్‌రాజ్, ఆనంద్‌రాజ్, నాయకులు విఠల్‌రెడ్డి, నాగ్నాథ్, అసద్‌అలీ, సాయగౌడ్, నాగ్నాథ్ పటేల్, దర్పల్ గంగాధర్, బిచ్కుంద, మద్నూర్ ఏఎంసీ చైర్మన్లు, తహసీల్దార్ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ ఖయ్యుం, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
పత్తాలేని పాస్‌బుక్!
రైతులకు తప్పని తిప్పలు..కామారెడ్డి క్రైం : భభూముల రిజిస్టేషన్లు చేసుకుని నెలలు గడుస్తున్నా రైతులకు పట్టా పాస్‌పుస్తకాలు రావడం లేదు. నూతన పట్టా పాస్బుక్ల కోసం నెలలుగా రైతులు నిరీక్షిస్తున్నారు. దీంతో కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్న కారణంగా పాస్‌బుక్‌లు తయారు చేసి ఇచ్చే ఏజెన్సీలు ప్రింటింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ధరణి స్థానంలో భూభారతి వచ్చాక కొన్ని సాంకేతిక అంశాల జోడింపు కారణాలతో పాస్‌బుక్ ప్రింటింగ్‌ను ప్రభుత్వమే ఆపిందని అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా దాదాపు సుమారు 6 నెలలు నుంచి పాస్‌బుక్‌లు రావడం లేదు. ధరణి పోయి భూభారతి వచ్చినా.. గత ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను తీసుకువచ్చి రెవెన్యూ రికార్డులను ఆన్లైన్ చేసే ప్రక్రియను 2016లో మొదలుపెట్టి 2018 వరకు చేపట్టింది. రికార్డులను ఆన్లైన్ చేసే క్రమంలో అనేక తప్పిదాలు దొర్లాయి. లక్షల మందికి సంబంధించి రికార్డులు తప్పుగా నమోదయ్యాయి.ఽ ధరణిలో సమస్యల పరిష్కారానికి అన్ని రకాల మాడ్యూల్స్ అందుబాటులో లేకపోవడంతో రైతుల సమస్యలు పేరుకుపోయాయి. దీంతో ధరణిపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అయితే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతామని కాంగ్రెస్ ప్రకటించింది. హామీ మేరకు 6 నెలల క్రితం ధరణి వెబ్‌సైట్‌ను రద్దు చేసి దాని స్థానంలో భూ భారతిని తీసుకువచ్చింది. అప్పటి నుంచి పట్టాపాస్ పుస్తకాల ప్రింటింగ్, సరఫరా నిలిచిపోయింది. నిత్యం అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యం 90 నుంచి 100 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వాటిలో సగం వరకు కొత్తగా భూమిని కొనుగోలు చేసిన వారు, వారసత్వం కింద తమ పేరిట భూములు నమోదు చేసుకునే వారుంటారు. పాస్‌బుక్ పోగొట్టుకున్న వారు కూడా చాలామంది కొత్త పాస్‌బుక్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త పాస్బుక్ల కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూములు రిజిస్ట్రేషనై నెలలు గడుస్తున్నా.. నిలిచిన పాస్‌బుక్ ప్రింటింగ్ ప్రక్రియ సుమారు ఆరు నెలలుగా నిరీక్షిస్తున్న రైతులు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతున్న రైతులుఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో నెల రోజుల వ్యవధిలో పోస్ట్ ద్వారా కొత్త పాస్‌బుక్ వచ్చేది. కొత్త బుక్ కోసం దరఖాస్తు నమోదు కాగానే సీసీఎల్ఏ నుంచి సమాచారం సంబంధిత ముద్రణ సంస్థకు వెళ్తుంది. అక్కడ ముద్రణ పూర్తి చేసుకుని పోస్టల్ శాఖ ద్వారా రైతుల ఇంటికే పాస్‌బుక్ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ కలిగిన ముద్రణ సంస్థలకు బిల్లులు, పోస్టల్ శాఖకు రవాణా చార్జీల బిల్లులు పెండింగ్‌లో ఉన్న కారణంగా వారంతా కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. అయితే భూ భారతిలో కొన్ని మార్పులు చేసే క్రమంలో బుక్ ప్రింటింగ్ నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా రైతులకు తిప్పలు తప్పడం లేదు. మా నాన్న పేరు మీదున్న భూమిని వారసత్వం కింద నా పేరుమీదకు రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఆరు నెలలు గడుస్తున్నా పట్టా పాస్పుస్త కం రాలేదు. అధికారులను సంప్రదిస్తే వస్తది అంటున్నారే తప్ప స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. – రాకేశ్, రామారెడ్డి భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్త పాస్‌పుస్తకం కోసం మీసేవ ద్వారా డబ్బులు చెల్లించాను. 9 నెలలు గడుస్తోంది. ఇప్పటికీ బుక్కు రాలేదు. ప్రభుత్వం స్పందించి కొత్త పట్టా పాస్బుక్కు అందించాలి. – శివరాం బాలాగౌడ్, రామారెడ్డి -
యువకుడిపై గొడ్డలితో దాడి
● ఘాతుకానికి పాల్పడింది సమీప బంధువే ● మద్యం తాగి మాటామాటా పెరిగి ఘర్షణకు దిగిన ఇరువురుగాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లి గ్రామంలో యువకుడిపై అతడి సమీప బంధువే గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. ముదెల్లి గ్రామానికి చెందిన కాగుల మోహన్ శుక్రవారం కట్టమైసమ్మ పండుగ చేసి, అక్కడే భోజనాలు చేశారు. అనంతరం రాత్రి వరుసకు మామాఅల్లుళ్లు అయిన నట్టోల్ల నర్సింలు, చింతకింది రంజిత్, గ్రామానికి చెందిన మరో ఇద్దరు కలిసి నర్సింలు ఇంటివద్ద మద్యం తాగారు. రంజిత్, నర్సింలు సమీప బంధువులు కావడంతో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. దీంతో ఆగ్రహించిన నర్సింలు గొడ్డలితో రంజిత్‌పై దాడి చేయగా మెడపై తీవ్ర గాయమైంది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం బాన్స్వాడ ఆస్పత్రికి తరలించారు. కాగ నర్సింలుతో పాటు సంతో ష్, చాకలి బాలయ్య, కాగుల మోహన్ యాదవ్, కాగుల రాము, కాగుల మారుతిలపై బాధితుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భిక్కనూరు: డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు వహించాలని జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్ అన్నారు. శనివారం భిక్కనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైం, సైబర్ సెక్యూరిటీ అంశాలపై అవగాహన కల్పించారు. విజ్ఞాన శాస్త్రం అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేందుకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టాలెంట్ పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బెంగుళూరులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాద్యాయులు గడ్డం మల్లేశ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం భవానీ, ఉపాధ్యాయులు, ఉమ, ప్రసన్న,నర్సింహారెడ్డి, శంకర్‌రెడ్డి, తమ్మలిరాజు పాల్గొన్నారు. పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ నస్రుల్లాబాద్ : స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి తనిఖీ చేశారు. మండలంలో క్రైం రేటు తగ్గించాలని 100 నెంబరుకు వ చ్చిన కాల్స్‌పై వెంటనే స్పందించాలన్నారు. ఎస్సై రాఘవేంద్ర, కానిస్టేబుల్లు ఉన్నారు. అనుమానం వస్తే సమాచారం అందించాలి మద్నూర్(జుక్కల్): గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మద్నూర్ ఎస్సై రాజు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతు శాంతి భద్రతలను కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
నిజాంసాగర్(జుక్కల్): పిట్లం–నిజాంసాగర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని ఒడ్డేపల్లి గ్రామ శివారులో రోడ్డుపైన గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి కాలినడకన వెళ్తున్నాడు. ఈక్రమంలో అతడినివె గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి భుజంపై సూర్యుడి బొమ్మ ఉందని, అచూకీ తెలిసిన వారు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ సెల్ 8712686172 నంబర్‌ను సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. -
కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు
కామారెడ్డి టౌన్: పెండింగ్ బిల్లులు, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు శనివారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. సీఐటీయూ, ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆశాలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న బారికేడ్లను తొలగించి, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గేటు ముందే బైఠాయించి ప్రభుత్వం, అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందూరి చంద్రశేఖర్, ముదాం అరుణ్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కొత్త నర్సింలు, ఆశా వర్కర్లు రాజశ్రీ, మమత, సంగీత, గీత తదితరులు పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) కాలభైరవుడి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. రూ.2,72,355 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. హుండీ లెక్కింపును దేవాదాయ సహాయ కమిషనర్ వి విజయరామారావు, ఇస్సన్నపల్లి, రామారెడ్డి సర్పంచ్‌లు దోకి లచ్చయ్య, రమేశ్, బండి ప్రవీణ్, నవీన్ పర్యవేక్షించారు. మహిళా సంఘ సేవా సమితి సభ్యులు భక్తులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాల వెంకట్‌రెడ్డి, ముల్క నాగరాజు, కేంద్ర కమిటీ సభ్యుడు కాసం శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా కట్కూరి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శిగా ఎం.రాఘవేంద్ర, అసోసియేట్ అధ్యక్షుడిగా జీవై ప్రభాకర్, కోశాధికారిగా ఎస్ఏ ముకీద్, ఉపాధ్యక్షులుగా ఎస్.శ్యాంసుందర్‌రెడ్డి, బి.పవిత్రన్, కే.లిఖిత్‌రెడ్డి, పి.శ్రీలత, సంయక్త కార్యదర్శులుగా జి.రాజాగౌడ్, కే.కృష్ణారెడ్డి, బి.శివచైతన్య, సౌజన్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కే.నవతేజ, ప్రచార కార్యదర్శిగా ఎన్.రవి, కార్యవర్గ సభ్యులుగా తేజస్విని, రజని, రాజేశ్, సాయి ప్రసన్న, సలహాదారుగా జే.శ్రావణ్‌కుమార్ ఎన్నికయ్యారు. -
జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య.. ఒకరిపై హత్యాయత్నం
జిల్లాలోని వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురికాగా.. మద్యం మత్తులో ఒకరిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలు కలకలం రేపాయి. లింగంపేట మండలం పొల్కంపేటలో వృద్ధురాలిని దుండగులు నగల కోసం కొట్టి చంపారు. వివాహేతర సంబంధం కారణంగా కుటుంబం పరువుపోతోందని, తనకు పెళ్లి కావడం లేదని అన్నను తమ్ముడు గొడ్డలితో నరికి చంపిన ఘటన భిక్కనూరు మండలం మొటాట్పల్లిలో చోటు చేసుకుంది. గాంధారి మండలం ముదెల్లిలో జరిగిన దావత్లో నర్సింలు అనే వ్యక్తి గొడ్డలితో రంజిత్ అనే వ్యక్తిపై దాడి చేశాడు. – సాక్షి నెట్వర్క్8లోవివరాలు -
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
భిక్కనూరు: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో రాజీవ్‌గాంధీ సంఘటన మిషన్ ప్రతినిధి సుభాష్ భాయ్‌తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బిల్లుతో ఉపాధి హామీ కూలీలకు భవిష్యత్తులో జరిగే నష్టాలను వివరించారు. సర్పంచ్ చేపూరి రా ణి, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, వీడీసీ అధ్యక్షుడు సూ ర్యకాంత్రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణారెడ్డి, రాజు, శశికుమార్, కల్యాణి, రవి, ఉపాధి కూలీలు ఉన్నారు. -
నిబంధనలు పాటించకపోతే ఆటోలు సీజ్
దోమకొండ: ఆటో రిక్షాల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల భద్రత ముఖ్యమని, ఆటోలకు ఫిట్నెస్తో పాటు పర్మిట్ కచ్చితంగా ఉండాలని జిల్లా సహయక మోటర్ వాహనాల తనిఖీ ఇన్‌స్పెపెక్టర్ కృష్ణతేజ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలపై విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడిపితే సీజ్ చేస్తామన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. క్రైం కార్నర్ -
వృద్ధురాలి దారుణ హత్య
● ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని కొట్టి చంపిన దుండగులు ● లింగంపేట మండలం పొల్కంపేటలో చోటుచేసుకున్న ఘటన లింగంపేట(ఎల్లారెడ్డి): బంగారం కోసం ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు హతమార్చిన ఘటన లింగంపేట మండలంలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. పొల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన(69)కు ఇద్దరు కుమారులు రాజు, శ్రీని వాస్, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సులోచన భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందడంతో ఇద్దరు కుమారు లు ఆమెను వంతుల వారీగా పోషిస్తున్నారు. ఈక్రమంలో సులోచన వారం రోజుల క్రితం పెద్ద కుమారుడు రాజు వద్దకు వెళ్లింది. తల్లిని ఇంటి వద్ద ఉంచి రాజు తన భార్య, పిల్లలతో కలిసి మూడు రోజుల క్రితం తిరుపతికి వెళ్లారు. శు క్రవారం రాత్రి వారు నాగిరెడ్డిపేటకు చేరుకోగా అక్కడే ఉన్న తన పెద్ద అక్క వద్దకు వెళ్లారు. పొల్కంపేటలో వృద్ధురాలు ఇంట్లో ఒక్కరే ఉండగా, దుండగులు రాత్రివేళ ఇంట్లోకి ప్రవేశించి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని, కొట్టి చంపారు. శనివారం ఉదయం వృద్ధురాలి హత్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా వృద్ధురాలి ఇంటి పరిసరాల్లోని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
మేధో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి
కామారెడ్డి క్రైం: విద్యార్థులు తమ మేధోసామర్థ్యాన్ని మెరుగుపర్చుకుని ఉన్నత స్ధానా ల్లో నిలవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నా రు. చెస్ నెట్వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చెస్ బోర్డులను శనివారం కలెక్టరేట్లో పంపిణీ చే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. చెస్‌తో విద్యార్థుల ఏకాగ్రత, క్రమశిక్ష ణ, నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. అ నంతరం విద్యార్థులతో చెస్ ఆడి వారిని ఉ త్సాహపరిచారు. కార్యక్రమంలో డీఈవో రా జు, ప్రవాస భారతీయుడు రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ కలెక్టర్ విక్టర్‌కు సన్మానం కామారెడ్డి అర్బన్ : తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న జిల్లా అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్‌ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా సన్మానించారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు దేవేందర్, కార్యదర్శి సాయిరెడ్డి, ప్రతినిధులు రాజలింగం, సంతోష్‌కుమార్, ఠాగూర్, నిజాం, తురబ్అలీ, శశికిరణ్, శివకుమార్, సతీశ్‌కుమార్, టీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాల వెంకట్‌రెడ్డి, ముల్క నాగరాజు, అసోసియేట్ అధ్యక్షుడు చక్రధర్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి రచన పోటీల్లో యశశ్రీకి ప్రథమ బహుమతి కామారెడ్డి అర్బన్ : తెలంగాణ సాహిత్య అ కాడమీ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థా యి నాటిక రచన పోటీల్లో కామారెడ్డి మండ లం లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం యశశ్రీ రాసిన ‘మా వూరి మల్లన్న జాతర’ రాష్ట్రస్థాయి ప్రథమ బహు మతి దక్కింది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శనివారం నిర్వహించిన బాలల సాహితీ సృజన సదస్సులో యశశ్రీకి రూ. 2,500 నగదుతోపాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అలాగే లింగాపూర్‌కు చెందిన ఎం శ్రీజ రాసిన ‘పూలజాతర’ నాటి కకు ప్రోత్సాహక బహుమతిగా రూ.వెయ్యి నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశా రు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సాహిత్య అ కాడమీ కార్యదర్శి బాలాచారి, బాలచెలిమి సంపాదకులు వేదకుమార్, పలువురు బాల సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ కామారెడ్డి క్రైం: ‘యూరి యా బుక్ చేసేదెలా?’, ‘యూరియా కష్టా’ శీర్షిక న ‘సాక్షి’లో ఈ నెల 25వ తేదీన కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యూరియా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామ ని డీఏవో మోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భిక్కనూర్ మండలం కాచాపూర్ సింగిల్ విండో ద్వారా 222 మంది రై తులకు 444 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏర్కొన్నారు. కానీ అదే రోజు ఉద యం కార్యాలయం తెరవకముందే రైతులు వచ్చి పాస్‌పుస్తకాలను వరుస క్రమంలో పెట్టడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో యూరియా పంపిణీపై దుష్పచారం జరిగిందని వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. రైతులు ఆందోళనకు గురి కావొద్దన్నారు. -
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: వనపర్తిలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ రాష్ట్రస్థాయి అండర్–14 బాలికల హాకీ పోటీల్లో కేజీబీవీ కామారెడ్డి పాఠశాల 8వ తరగతి విద్యార్థి బి.పవిత్ర ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. శనివారం పాఠశాల ప్రత్యేకాధికారి టి.లావణ్య, వ్యాయామ ఉపాధ్యాయురాలు స్రవంతి, టీచర్లు పవిత్రను అభినందించారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు .. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రమేశ్, అర్జున్, సాయితేజ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీఈటీ గణేష్ తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్స్‌పాల్ సుధాకర్ మాట్లాడుతు శనివారం అండర్ 14లో నిజామాబాద్‌లో జరిగిన జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో గురుకుల పాఠశాల ముగ్గురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా తాండూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో వీరు పాల్గొంటారని ఆయన తెలిపారు. పీఈటీ గణేష్, ఉపాధ్యాయులు సంతోష్, నాగరాజు పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లు కామారెడ్డి అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు కరాటే, హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయా జిల్లాలకు శనివారం బయల్దేరి వెళ్లారు. గోదావరిఖనిలో ఈనెల 29 వరకు నిర్వహించే స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కరాటే రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది క్రీడాకారులతో అండర్–17 బాలబాలికల జట్టు వెళ్లిందని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కే.హీరాలాల్ తెలిపారు. అలాగే నారాయణపేట్‌లో నిర్వహించనున్న హ్యాండ్ బాల్ అండ్ – 14 పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వెళ్లారన్నారు. హ్యాండ్ జట్టుకు ఉప్పల్వాయి పీడీ సురేశ్ టీం కోచ్‌గా, ఎక్లారా పీడీ మౌనిక మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు హీరాలాల్ తెలిపారు. నిజామాబాద్‌అర్బన్: జీవో 252ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్టులు శనివారం కలెక్టరేట్ వద్ద డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో జర్నలిస్టులను విడదీయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. విలేకరులు, డెస్క్ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. డెస్క్ జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు మద్దతుగా టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే (143) నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జమాల్పూర్ గణేశ్, భూపతి, సుభాష్, పంచరెడ్డి శ్రీకాంత్, రాంచందర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, డెస్క్ జర్నలిస్టుల ఫోరం అడహక్ కమిటీ కన్వీనర్ చిట్నే భీంరావ్, కో–కన్వీనర్లు శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, నరేంద్ర, స్వామి, రాకేష్, సందీప్, సలహాదారులు కేవీ రమణ, భద్రారెడ్డి, ప్రభాకర్, డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు. -
ఆలయ ముఖ ద్వారాల తయారీలో ప్రత్యేక గుర్తింపు
బ్రహ్మచారి చేతిలో రూపుదిద్దుకున్న ఆలయ దర్వాజాలు, ముఖ ద్వారాలుకర్రపై కళాఖండాన్ని చెక్కుతున్న బహ్మచారి సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్ మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి కర్రపై అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదువుకుంటూనే వుడ్ కార్వింగ్పై దృష్టి పెట్టాడు. పదో తరగతి పూర్తవగానే పూర్తి స్థాయి సమయం కార్వింగ్కు కేటాయించాడు. ఎప్పటికప్పుడు తన మేధస్సును పెంపొందించుకుంటూ అద్భుతమైన విగ్రహాలు, కళాకండాలను రూపొందిస్తూ అందరి మన్ననలు అందుకున్నాడు. విగ్రహాలు, ఆలయ ముఖ ద్వారాలు, పెద్ద దర్వాజాలు, రథాలు తయారు చేస్తున్నాడు. భారీ ఖర్చుతో నిర్మించుకునే బంగళాలకు అవసరమైన ప్రధాన ద్వారాలు కూడా తయారు చేస్తాడు. ఆధునిక భవనాలు నిర్మించుకునేవారు ఇంట్లో కర్రతో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపు తుండడంతో బ్రహ్మచారి వి గ్రహాల తయా రీపై ఫోకస్ చేశా డు. గణపతి, నరసింహస్వామి, అ య్యప్ప, సరస్వతీ మాత వంటి దేవతామూర్తుల విగ్రహాలెన్నో ఆ యన తయా రు చేశాడు. విగ్రహాన్ని చెక్కడానికి అవసరమైన కర్ర తెప్పించుకుని మొదలుపెడతారు. ఒక్కో విగ్రహం తయారీకి పది రోజుల సమయం పడుతుందని చెబుతున్నాడు. విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ఎవరికి ఏ విగ్రహం కావాలన్నా సరే ముందుగా ఆర్డర్ ఇస్తే స్వయంగా తానే చెక్కుతాడు. దేవాలయాలకు అవసరమైన రథాలను బ్రహ్మచారి పూర్తిగా కర్రతోనే తయారు చేస్తాడు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు వీలుగా రథాలు తయారు చేసి ఇవ్వడంలో ఆయనది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ఆలయ ముఖద్వారాలు, ప్రధాన ద్వారాలతోపాటు రథాలను తయారు చేయడంలో ఎంతో పేరు సంపాదించాడు. అలాగే భారీ ఖర్చుతో నిర్మించే ఇళ్లకు మెయిన్ డోర్లు తయారు చేస్తాడు. వందలాది ఇళ్లకు ఆయన డోర్లు తయారు చేశాడు.ఆయన చేయి పడిందంటే కర్ర(కట్టె) జీవం ఉట్టిపడే విగ్రహమవుతుంది. ఆలయ ముఖ ద్వారాలు.. ఉత్సవ విగ్రహాలు.. రథాలను తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. కర్రను చెక్కి దేవుడిని సృష్టిస్తున్న అపరబ్రహ్మగా గుర్తింపు పొందాడు కమ్మరి బ్రహ్మచారి. కర్రను చెక్కి దేవుడిని సృష్టించే అపర బ్రహ్మ! విగ్రహాల తయారీలో ఆయనది అందెవేసిన చేయి ఆలయ ముఖ ద్వారాలు, రథాల తయారీలో నిష్ణాతుడు బ్రహ్మచారి చేతిలో రూపుదిద్దుకుంటున్న కళాకండాలనుదేవాలయాలకు ముఖ ద్వారాల తయారీలో బ్రహ్మచారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కామారెడ్డి జిల్లాలోతోపాటు పొరుగున ఉన్న నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ తదితర జిల్లాల నుంచి ఆయనకు ఆర్డర్లు వస్తుంటాయి. కొన్ని ముఖద్వారాలైతే 15 నుంచి 21 ఫీట్లు ఎత్తువి తయారు చేయాల్సి ఉంటుంది. అలాంటివి ఎన్నో ఆయనకు ఆర్డర్లు వస్తుంటాయి. కొన్ని ఆలయాలకు పెద్ద దర్వాజాతోపాటు రథం తయారీకి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వ్యయం అవుతుంది. అలాంటివి ఆయన ఎన్నో తయారు చేసి ఇచ్చాడు. దేవుని విగ్రహాలు, ఆలయాల ముఖ ద్వారాలు, రథాలు తయారు చేయించే అవకాశం దేవుడే క ల్పించాడేమో అనిపిస్తుంది. మా తాత, తండ్రు లు ఇదే పని చేశారు. నేను వారిని అనుసరించా ను. అయితే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చే స్తూ చెక్కడంలో రాణించాను. దేవుని గుడులకు అవసరమైన ప్రధాన ద్వారాలు, ముఖద్వారా లు, రథాలు, దేవుని విగ్రహాలు తయారు చేయడంలో ఎంతో సంతృప్తి ఉంది.– బ్రహ్మచారి, కళాకారుడు -
రంగుల ముగ్గు ప్యాకెట్ల పంపిణీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ముగ్గుల ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు పంపరి శ్రీనివాస్, నిమ్మ విజయకుమార్ రెడ్డి, రవి, జూలూరి సుధాకర్, సలీం, తాటి ప్రసాద్, గడ్డమీది మహేష్, రంగా రమేష్ గౌడ్, చిన్న పోచయ్య, నవీన్, ఆబిద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ను మాజీ డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిలు శాలువాలతో సత్కరించారు. -
ప్రజలతో మమేకమవ్వాలి
● ఎల్లారెడ్డి మాజీఎమ్మెల్యే జాజాల సురేందర్ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలో బీఆర్ఎస్ తరుఫున పోటీచేసి గెలుపొందిన సర్పంచ్‌లు, ఉనసర్పంచ్లు, వార్డుసభ్యులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై మంచిపేరు తెచ్చుకోవాలని ఎల్లారెడ్డి మాజీఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచించారు. మండలకేంద్రంలో శనివారం వారిని ఆయన సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిద్ధయ్య, ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీచైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మనోహార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అంకిత భావంతో పనిచేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మానం కార్యక్రమం జరిగింది. ఈసభలో సురేందర్ మాట్లాడారు. గెలుపొందిన ప్రజాప్రతినిధులు అంకిత భావంతో పని చేసి ప్రజల్లో విశ్వాసం పొందాలన్నారు. ఓడిన వారు కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దివిటి రమేశ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, విష్ణువర్ధన్‌రెడ్డి, లింగంపేట పట్టణ అధ్యక్షుడు అశోక్, భవానిపేట సర్పంచ్ సురేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
అన్నను చంపిన తమ్ముడు
భిక్కనూరు: అన్నను సొంత తమ్ముడే హతమార్చిన ఘటన మండలంలోని మొటాట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని మొటాట్పల్లికి చెందిన ఎర్రొల్ల రాజు(32, శివకుమార్ సొంత అన్నదమ్ముల్లు. రెండేళ్ల క్రితం రాజు తమ దగ్గరి బంధువైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని హైదరాబాద్‌కు తీసుకువెళ్లాడు. అక్కడే వారు సహజీవనం చేస్తుండటంతో ఈ విషయమై కుటుంబంలో తరచు గొడవలు జరుగుతుండేవి. రెండు నెలల క్రితం రాజు ఒక్కడే గ్రామానికి వచ్చి, కూలి పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. రాజు వివాహేతర సంబంధం కారణంగా తమ పరువు పోయిందని, తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని తమ్ముడు శివకుమార్ అన్నతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి కూడా అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈక్రమంలో శివకుమార్ శనివారం వేకువజామున లేచి నిద్రిస్తున్న అన్న రాజును గొడ్డలితో నరికి హతమార్చాడు. సమాచారం అందుకున్న సీఐ సంపత్‌కుమార్, ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● అన్న వివాహేతర సంబంధంతో కుటుంబంలో గొడవలు ● పరువు పోతుందని భావించి ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
● మృతులు ఆర్మూర్ మండలం మంథని వాసులు ● కొండగట్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా కోరుట్లలో చోటుచేసుకున్న ఘటన ఆర్మూర్: మండలంలోని మంథని గ్రా మా నికి చెందిన దంపతులు జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతిచెందారు. గ్రామానికి చెందిన దంపతులైన కత్రాజ్ మోహ న్, రాధ తమ కూతురు కీర్తితో కలిసి శనివారం కొండగట్టు దర్శనానికి వెళ్లారు. తి రిగి కారులో వారు స్వగ్రామానికి వస్తుండగా కోరుట్ల సమీపంలో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ ప్రమాద స్థలిలోనే మృత్యువాత పడ్డారు. కూతురు కీర్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్ప ల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించడంతో మంథనిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. నవీపేట: మండల కేంద్రంలోని ప్రయివేట్ హాస్టల్లో పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. మోపాల్ మండలంలోని బాడ్సికి చెందిన మేడ్చల్ సూర్య(18) నవీపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న అక్షయ మెస్, ప్రయివేట్ హాస్టల్ ఉంటున్నాడు. ఎప్పటిలాగే శనివారం సాయంత్రం కళాశాల నుంచి వచ్చిన అతడు హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు కరెంట్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ నిర్వాహకుడు దేవెందర్‌కు సమాచారమిచ్చారు. ఎస్సై యాదగిరిగౌడ్, ఏఎస్సై గఫార్ ఘటన స్థలాన్ని పరిశీలింరు. మృతుడి తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. -
రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో జిల్లా వాసుల సత్తా
కామారెడ్డి టౌన్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా వాసులు తమ సత్తా చాటారు. 45 ఏళ్ల పైబడిన వయసు విభాగంలో నిర్వహించిన 10 కిలోమీటర్ల పరుగు పందెంలో జిల్లా కేంద్రానికి చెందిన గెరిగంటి లక్ష్మీనారాయణ ఉత్తమ ప్రతిభ కనబర్చి నిర్ణీత లక్ష్యాన్ని కేవలం 45 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్మీనారాయణకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ స్వర్ణ పతకం, విజేత సర్టిఫికేట్ అందజేశారు. ఇదే కేటగిరీలో జిల్లా కేంద్రానికి చెందిన దండబోయిన నరేందర్ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు. 35 వయస్సు పైబడిన కేటగిరీలో మహమ్మద్ జునోద్దీన్ రెండవ స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. విజేతలను జిల్లా అథ్లెటిక్ ప్రధాన కార్యదర్శి నరేశ్‌కుమార్, క్రీడా అభిమానులు అభినందించారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి వర్ని: చందురు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన హంస్డా (30) ఇటీవల వ్యవసాయ పనుల కోసం చందూరుకు వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటూ వ్యవసాయ కూలీగా పనులు చేస్తుంది. బుధవారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లగా, చందురు శివారులో రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాజంపేట(భిక్కనూరు): రాజంపేట శివారులో పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఎస్సై రాజు గురువారం తెలిపారు. మండల కేంద్రం సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.44,770 నగదును, ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. భిక్కనూరు: మండల కేంద్రంలోని టోల్‌ప్లాజా వద్ద ముందు వెళ్తున్న ఓ కారును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ చెందిన క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు విహారయాత్ర కోసం గురువారం రెండు స్కూల్ బస్సుల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద స్పీడ్ బ్రేకర్ల వద్ద ముందు వెళ్తున్న కారును ఒక స్కూల్ బస్సు వెనుకనుంచి ఢీకొంది. దీంతో కారు ముందుకు వెళ్లడంతో కారు కంటే ముందు ఉన్న మరో స్కూల్ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రెండువైపులా దెబ్బతినగా, కారులో ప్రయాణిస్తున్న సదాశివనగర్ మండలం యాచారం గ్రామానికి చెందిన ప్రకాశ్ గాయపడ్డాడు. బస్సులో ఉన్న విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పాఠశాల యాజమాన్యం వెంటనే మరో రెండు బస్సులను స్కూల్ నుంచి రప్పించి విద్యార్థులను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ● పేద ముస్లింలకు దుప్పట్లు, స్వెట్టర్ల పంపిణీనిజామాబాద్ రూరల్: మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని బోధన్ రోడ్డులోగల ఓ ఫంక్షన్హాల్లో బుధవారం రాత్రి పేద ముస్లింలకు, ఇమామ్, మౌజాలకు దుప్పట్లు, స్వెటర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ముస్లింలకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి విద్యా మంత్రిగా విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాల ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేలా సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. మహమ్మద్ అజ్మతుల్లా, మానాల మోహన్‌రెడ్డి, కర్నె సురేందర్, నర్సయ్య, అనంతరావు బోడిరే స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళ మృతదేహం లభ్యం
వర్ని: మండలంలోని పొట్టిగుట్ట శివారులోగల నిజాంసాగర్ ప్రధాన కాలువలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం కాలువ నీటి ప్రవాహంలో మహిళ మృతదేహం కొట్టుకురాగా, స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. నవీపేట: మండలంలోని యంచ గోదావరి నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మిర్యాల పవన్‌కుమార్(22) అనే యువకుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈనెల 22న ఆర్మూర్‌కు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లాడు. అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో 23న అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యంచ గోదావరిలో గురువారం ఉదయం పవన్ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ అర్బన్: భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భర్త రోడ్డెక్కి ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా..ఆర్మూర్‌కు చెందిన ప్రశాంత్‌కు ఈ ఏడాది ఆగస్టులో కోరుట్ల ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. కొన్ని రోజులకే తన భార్య బావ వరుసైన నిజామాబాద్‌కు చెందిన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించాడు. దీంతో తాను భార్య వల్ల మోసపోయానని కొంతకాలంగా వాట్సప్ స్టేటస్ పెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులను కూడా ఆశ్రయించాడు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో గురువారం వినాయక్ నగర్‌లోని లింబాద్రి ఇంటి ముందు ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు, పెద్దలు వచ్చి తనకు న్యాయం చేయాలి అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. నా తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి అని ప్రశాంత్ ఫ్లెక్సీలో పేర్కొన్నాడు. భార్య వివాహేతర సంబంధాన్ని గుర్తించి వినూత్న రీతిలో భర్త నిరసనకు దిగడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. -
అటల్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ● ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి ఆర్మూర్: దేశ సమగ్ర అభివృద్ధికి దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహర్ వాజ్‌పేయి అవలంభించిన విధానాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు బాలు, పోల్కం వేణు, జెస్సు అనిల్, సుంకరి రంగన్న, ఆకుల రాజు, బాయావత్ సాయి, తిరుపతి నాయక్, నర్సారెడ్డి, కుమార్, ప్రసన్న గౌడ్, బాసెట్టి రాజ్‌కుమార్, పులి యుగేందర్, శీను, విజయ్ ఆనంద్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో.. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి విద్యార్థులు, నాయకులు పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. నాయకులు అమృత్ చారి, పృథ్వి, సమీర్, మనోజ్, అక్షయ్, శివ, దుర్గదాస్, దిగంబర్, బంతిలాల్ పాల్గొన్నారు. -
లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఓం ప్రకాష్ 38 మందికి పరీక్షలు చేశారు. ఏడుగురికి మోతిబిందు ఉన్నట్లు గుర్తించి వారిని బోధన్ లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రికి సిఫారసు చేశారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాజు, సభ్యులు జగదీష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడి చౌరస్తాలో గాంధారి నుంచి బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారిపై భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతోంది. దీంతో వాహనాలు, రోడ్డు వెంబడి నడిచే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రి రక్త నిధి, రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆయప్ప ఆలయ కమిటీ పిలుపు మేరకు మాలధారణలో ఉన్న పలువురు అయ్యప్ప స్వాములు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. వారితో పాటు పలువురు భక్తులు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సభ్యుడు వేణుగోపాల్ మాట్లాడుతూ.. రక్తం ప్రాణదానంతో సమానమని, యువత అధిక సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. లింగంపేట(ఎల్లారెడ్డి): బోనాల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దివిటి రమేశ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం బోనాల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజాగౌడ్, అలాగే కొర్పోల్ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా బ్యాగరి సాయిలును ఎన్నుకున్నట్లు తెలిపారు. నాయకులు గన్నూనాయక్, విఠల్, రూప్సింగ్, గాండ్ల నర్సింలు, సాయాగౌడ్, బండి నర్సింలు, శ్రీకాంత్, శ్రీనివాస్, పర్వయ్య తదితరులు పాల్గొన్నారు. -
సేవలు అంతంత మాత్రమే
నస్రుల్లాబాద్: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) నూతనంగా ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన తర్వాత మండల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో నూతన మండలాల్లో భవనాన్ని ఏర్పాటు చేశారు. అందులో డిప్యూటేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించారు. కాని ఉదయం నుంచి సాయత్రం వరకు మాత్రమే ఆస్పత్రి తెరిచి ఉంచి మూసి వేయడంతో ప్రథమ చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. అన్ని హంగులతో ఏర్పడిన ఆస్పత్రిలో సేవలు అంతంత మాత్రమే ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తప్పని వ్యాక్సినేషన్ ఇబ్బందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి వారం మండలంలోని నెమ్లి, దుర్కి, నస్రుల్లాబాద్, అంకోల్‌తండా ఆరోగ్య ఉప కేంద్రాల్లో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది. భవిష్యత్తులో కొన్నిరకాల వ్యాధులు రాకుండా టీకాలు ఇస్తారు. దీనికి అవసరమైన మెడికల్ వస్తువులను బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తీసుకుని వస్తారు. అయితే నస్రుల్లాబాద్‌లో పీహెచ్సీ ఏర్పాటైనా బీర్కూర్ వెళ్లక తప్పడం లేదు. స్థానికంగా వాక్సిన్లు ఉంచకపోవడంతో అక్కడికే వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు. నస్రుల్లాబాద్ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం కోతులు, కుక్కల బెడద ఎక్కువ.. నస్రుల్లాబాద్ మండల వ్యాప్తంగా కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. నిత్యం ఏదో గ్రామం నుంచి కోతి, కుక్క కాటు గాయాల బారిన పడుతున్నారు. వాక్సిన్ తీసుకుందామని నస్రుల్లాబాద్ ఆస్పత్రికి వెళ్తే అక్కడ అందుబాటులో వ్యాక్సిన్లు లేవని బాన్సువాడ లేదా బీర్కూర్ వెళ్లాలంటూ సిబ్బంది చెబుతున్నారు. పీహెచ్సీ ఏర్పాటైనా సరైన వైద్యం అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోతి, కుక్క, పాము కాటు మందులు నస్రుల్లాబాద్ పీహెచ్సీలో అందుబాటులో ఉంచాలి. ఎంత ధనవంతు డు అయినా వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ దవాఖానాకే రావా ల్సి ఉంటుంది. కాని అక్కడే లేదంటే ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి వాక్సిన్ స్టోరేజీ చేసేలా ఏర్పాట్లు చేయాలి. – రాము, మైలారం కోతి, కుక్క కాటులకు వాక్సిన్ కోసం నస్రుల్లాబాద్ నుంచి బాన్సువాడ వెళ్లాల్సిందే అవస్థలు పడుతున్న గర్భిణులు, బాలింతలు సేవలు మెరుగుపర్చాలని ప్రజల వేడుకోలు -
నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్‌నగర్: జిల్లా ఆదివాసీ నాయక్‌పోడు నూతన కార్యవర్గాన్ని గురువారం నగరంలోని జిల్లా సేవా సంఘంలో ఎన్నుకున్నారు.అంతకుముందు సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం గౌరవాధ్యక్షుడు బండారి భోజన్న ఆధ్వర్యంలో ఎన్నికలు చేపట్టారు.జిల్లా అధ్యక్షుడిగా గాండ్ల రాంచందర్,ప్రధాన కార్యదర్శిగా పుట్ట శివశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కావాల్కడి పోశెట్టి,కోశాధికారిగా శానం పవన్‌కుమార్,అధికార ప్రతినిధిగా పుట్ట దుర్గ మల్లేశ్ ఎన్నికయ్యారు.అలాగే నూతనంగా ఎ న్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల తో క లిసి ఆదివాసీ నాయక్‌పోడు జిల్లా ప్రజాప్రతిని ధు ల ఫోరం కూడా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా ఎ ర్రం శ్రీనివాస్,ప్రధానకార్యదర్శిగా దాత్రికి అంజ య్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుంకరి రాజు, కార్యవ ర్గ స భ్యులు ఎన్నికయ్యారు. రెండు కార్యవర్గాలతో ప్ర మాణస్వీకారం చేయించారు.అనంతరం నూతన కా ర్యవర్గాలను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఆదివాసీ నాయక్‌పోడు సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కలను గురువారం హైదరాబాద్‌లో ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓంశాంతి కేంద్రం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు కలిశారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్చార్జి బీకే జయదిదీ, వనజ దిదీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు సేవలు అందించి గుర్తింపు పొందాలి
భిక్కనూరు: ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు ప్రజలకు సేవలు అందించి గుర్తింపు పొందాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ హైదరాబాద్ వెళ్లి షబ్బీర్‌అలీ దంపతులను సత్కరించారు. తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి సర్పంచ్‌గా ప్రజలతో ఎన్నుకునేలా చేసినందుకు ఆమె షబ్బీర్‌అలీ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికి అందేలా చూడాలని సూచించారు. అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు షబ్బీర్‌అలీ సర్పంచ్ రేఖను అభినందించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, యువజన కాంగ్రెస్ నాయకుడు సాయికృష్ణలు ఉన్నారు. షబ్బీర్ అలీతో డీసీసీ అధ్యక్షుడి భేటీ నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని గురువారం హైదరాబాద్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మల్లికార్జున్ కాంగ్రెస్ ముఖ్యనేత షబ్బీర్ అలీ ఆశీర్వాదం తీసుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నికపై షబ్బీర్ అలీతో చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ -
పనులు సరే.. రక్షణ చర్యలేవీ?
● మాధవనగర్ వద్ద శరవేగంగా జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణం ● ప్రయాణికుల రక్షణ కోసం కనీస చర్యలు చేపట్టని అధికారులు నిజామాబాద్ రూరల్: మాధవ్‌నగర్ ఆర్వోబీ వద్ద పనులు శరవేగంగా నిర్వహిస్తున్నప్పటికీ, ప్రయాణికుల రక్షణ కోసం కనీస ఏర్పాట్లు చేయలేదు. దీంతో వాహనాల రాకపోకల సమయంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్వోబీ పనుల వద్ద తీసిన లోతైన గుంతలు, వాటి పక్కన ఎలాంటి ప్రమాద సూచికలు లేకపోవడంతో వాహనదారులు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆర్వోబీ ప్రాంతంలో విద్యుత్ లైట్లు సైతం ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో ఆ ప్రాంతంలో అందకారం అలుముకుంటుంది. దీంతో రాత్రివేళల్లో వాహనదారులు ఈ ప్రాంతంలో గుంతలు గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రమాదాలు జరగకుండా భారీకేడ్లను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
యువత వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి
సుభాష్‌నగర్: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవితాన్ని నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ధన్పాల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానిగా ఉన్న సమయంలో దేశం కోసం అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. అణు పరీక్షల ఒప్పందం, తదితర ఇతర ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి ప్రపంచంలోనే భారత్‌కు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని, గతేడాది ఆయన 100వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినంగా ప్రకటించిందని పేర్కొన్నారు. వాజ్‌పేయి జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శనీయమని, ఆయన వ్యక్తిత్వాన్ని పుస్తకాల్లో చదివి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మల్లేశ్ యాదవ్, స్వామి యాదవ్, మాస్టర్ శంకర్, సాయిరాం, బంటు రాము, నారాయణ యాదవ్, పల్నాటి కార్తీక్, భూపతి తదితరులు పాల్గొన్నారు. -
డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి
సుభాష్‌నగర్: అక్రెడిటేషన్ కార్డుల విషయంలో జర్నలిస్టులను విభజించే కుట్రను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని డెస్క్ జర్నలిస్టులు పేర్కొన్నారు. మీడియా కార్డుల పేరుతో తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు. ఈమేరకు గురువారం జిల్లా కేంద్రంలో డెస్క్ జర్నలిస్టులు సమావేశమయ్యారు. నూతన అక్రెడిటేషన్ల జారీ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్– 252పై చర్చించారు. జర్నలిస్టులను విభజించేలా, డెస్క్ జర్నలిస్టులకు అన్యా యం చేసేలా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులందరికీ పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 27న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అడ్‌హక్ కమిటీ.. డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా సీహెచ్ భీంరావు, కో కన్వీనర్లుగా కామిరెడ్డి అశోక్‌రెడ్డి, బి. సందీప్,ఏ. నరేంద్ర స్వామి, కె. రాకేష్, జి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు గౌరవ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు. -
పర్వతారోహకురాలికి ఆర్థిక సాయం
కామారెడ్డి టౌన్: మాచారెడ్డి మండలం సోమార్పేటకు చెందిన పర్వతారోహకురాలు బానోత్ వెన్నెలకు బీజేపీ నేతలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈనెల 28న లేహ్ లడఖ్‌లోని 6,100 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడానికి వెన్నెల సన్నద్ధమవుతోంది. ఈ యాత్రకు రూ. 5.50 లక్షలు ఖర్చవనున్నాయి. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యేతోపాటు ఆయన చిన్ననాటి మిత్రులైన డాక్టర్ విజయ్, ఆనంద్, డాక్టర్ దినేశ్‌రెడ్డి, డాక్టర్ రవీందర్‌రెడ్డి, వ్యాపారవేత్త గబ్బుల శేఖర్ సమకూర్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు ఈ మొత్తాన్ని వెన్నెలకు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు నరేందర్, సురేష్, సంతోష్‌రెడ్డి, రాజ్‌గోపాల్ పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఇతర బిల్లులను తక్షణమే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలకు రూ.700 కోట్ల చొప్పున కేటాయించి జీపీఎఫ్, మెడికల్ బిల్లులు క్లియర్ చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు బాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, నాయకులు రూప్ సింగ్, ఎమీలియా, నారాయణ, బాలయ్య, సాయి గౌతమ్, నాంపల్లి, ఏసురత్నం, రాజు, రాజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: మండల కేంద్రంలోని జెండా గల్లీలో ఉన్న వీరభద్రస్వామికి భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర పంచమి శతభిష నక్షత్రం సందర్భంగా భక్తులు వీరభద్రస్వామికి అర్చనలు, అభిషేకాలు జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. -
దొంగ నోట్ల పంచాయితీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వర్ని మండలం జలాల్పూర్లో జాలీ నోట్లు వెలుగు చూడడంతో ఎక్కడివారక్కడ అప్రమత్తమయ్యారు. జలాల్పూర్ నుంచి వచ్చారా? అయితే నగదు వద్దు.. డిజిటల్ పేమెంట్లు మాత్రమే చేయండి.. వర్ని, బోధన్, బాన్సువాడ పట్టణాల్లో వ్యాపారులు ప్రత్యేకంగా ఇలా చెబుతుండడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు పోలీసులు కేసులు నమోదు చేస్తారనే భయంతో తమ వద్ద ఉన్న రూ.500 నోట్లను గ్రామస్తులు కాల్చివేస్తుండడం విశేషం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జలాల్పూర్ గ్రామంలో ఓటర్లకు దొంగనోట్లు పంపిణీ చేసిన ఘటన విస్తుగొలుపుతోంది. సర్పంచ్ అభ్యర్థి తమకు నకిలీ కరెన్సీ ఇచ్చి మోసం చేశాడని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. జలాల్‌పూర్‌కు చెందిన కల్యాణ్, గోపాల్, శంకర్, రవి అనే నలుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నుంచి ఈ దొంగనోట్లు తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతం నుంచి జడ్చర్లకు నకిలీ నోట్లు రాగా, రూ.1 లక్షకు రూ.3 లక్షల చొప్పున రూ.500 నకిలీ నోట్లను తెచ్చారు. గత మూడు నెలల కాలంలో రెండుసార్లు ఇలా దొంగనోట్లను తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే నోట్ల చలామణి ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. పెట్రోల్ బంక్‌లో చలామణి చేసేందుకు ప్రయత్నం చేయగా బెడిసికొట్టింది. బంక్‌లో తీసుకోకపోవడంతో మరో మార్గం ఆలోచించారు. అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో ఆ నోట్లను ఖర్చు పెట్టినట్లు తెలిసింది.నకిలీ నోట్ల వ్యవహారం బ్యాంకు అధికారుల ద్వారా వెలుగులోకి వచ్చింది. వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ చెల్లించేందుకు వచ్చిన వ్యక్తి దొంగనోట్లు తీసుకురావడంతో వాటిని గుర్తించి పట్టుకున్నారు. జలాల్‌పూర్‌కు చెందిన నరెడ్ల చిన్న సాయిలు తన క్రాప్ లోన్ కట్టేందుకు రూ.2.09 లక్షలు (రూ.500 నోట్లు) తీసుకొచ్చాడు. అవన్నీ నకిలీ నోట్లు కావడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను తీసుకెళ్లినవి నకిలీ నోట్లు అనే విషయం చిన్నసాయిలుకు తెలియకపోవడం గమనార్హం. బంధువు అయిన సర్పంచ్ భర్త బాలు నకిలీ నోట్లను సాయిలు ఇంట్లో దాచిపెట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఇంట్లో లభించిన నోట్లను సాయిలు బ్యాంకుకు తీసుకెళ్లాడు. ఇంతకుముందు జలాల్పూర్ సర్పంచ్ అభ్యర్థి మమత భర్త బాలు, తన సోదరుడు శంకర్‌తో కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఈ కరెన్సీని పంపిణీ చేసినట్లు తెలియడంతో పోలీసులు ఈ బృందాన్ని అరెస్టు చేశారు. బాలు కాంగ్రెస్, శంకర్ బీజేపీ పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో ఈ కేసును తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నకిలీ కరెన్సీ బృందంలో ఉన్న గోపాల్ అనే వ్యక్తి ఈ వ్యవహారంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ బైక్‌ను సైతం ఉపయోగించినట్లు పలువురు చెబుతున్నారు. మరోవైపు వర్ని మండలంలోని జాకోరా, జలాల్పూర్, బడాపహాడ్ గ్రామాల్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ చలామణి అయినట్లు తెలియడంతో గత నెలలో ‘సాక్షి’లో దొంగ నోట్ల కలకలం పేరిట వార్త ప్రచురితమైంది. ఎన్నికల సమయంలో వర్ని మండలం జలాల్పూర్లో పంపిణీ మహారాష్ట్ర నుంచి జడ్చర్ల మీదుగా జిల్లాలోకి.. రూ.లక్షకు రూ.3 లక్షలు తీసుకొచ్చిన ఘనులు -
పరిహారంపై రైతుల్లో అసంతృప్తి
బాన్సువాడ : జాతీయ రహదారి పనులతో భూము లు కోల్పోయిన రైతులు.. తక్కువ పరిహారం ఇస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిహారం పెంచాలని కోరేందుకు కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచా రం నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వరకు 765–డి జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. పోచారం నుంచి రుద్రూర్ వరకు 51.66 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డును 150 ఫీట్ల వెడల్పుతో వేస్తుండడంతో రహదారి పక్కన ఉన్న భూములు పోతున్నాయి. దీని కోసం గతంతోనే భూ సేకరణ జరిపారు. ఎల్లారెడ్డి డివిజన్లో 16.1118 ఎకరాలు, బాన్సువాడ డివిజన్లో 38.2400 ఎకరాల భూమిని సేకరించారు. పలువురు వ్యవసాయ భూములు, విలువైన స్థలాలు, ఇళ్లు కోల్పోయారు. భూ సేకరణలో భాగంగా ప్రభుత్వం ఎకరానికి రూ.8.60 లక్షల పరిహారం చెల్లించింది. కానీ మార్కెట్ కంటే ఈ ధర చాల తక్కువగా ఉండడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిహారం తక్కువగా ఉండడంతో బాధిత రైతులు కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఎకరానికి కనీసం రూ.20 లక్షలైనా పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. త్వరలోనే కలెక్టర్‌ను కలిసి తమ గోడు వినిపిస్తామని బాధిత రైతులు తెలిపారు.మా భూముల్లోంచి జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. నా భూమి 23 గుంటలు పోయింది. తీవ్రంగా నష్టపోయాను. ఉన్నతాధికారులు స్పందించి ఎకరానికి కనీసం రూ. 20 లక్షలైనా పరిహారం చెల్లించాలి. – హన్మండ్లు, రైతు, తిర్మలాపూర్ ఉన్న పొలం రోడ్డులో పోయింది. ప్రస్తుతం మాకు మరే ఆధారం లేదు. ప్రభుత్వం ఎకరానికి రూ.8.60 లక్షలే చెల్లించింది. పరిహారం పెంచాలి. కలెక్టర్‌ను కలుస్తాం. కనీసం రూ.20 లక్షలు ఇవ్వాలని కోరుతాం. – కుర్మ రమేశ్, రైతు, తిర్మలాపూర్గ్రామం సేకరించిన భూమి (ఎకరాల్లో..) పోచారం 2.2843 మాల్తుమ్మెద 0.0350 నాగిరెడ్డిపేట్ 0.0300 జాన్కంపల్లి 1.0875 రాఘవపల్లి 0.0200 కన్నారెడ్డి 1.3225 మాచాపూర్ 2.1975 సఫ్దాల్పూర్ 0.2250 ఎల్లారెడ్డి 0.0475 లింగారెడ్డిపేట 1.2150 తిమ్మారెడ్డి 1.2150 మట్టడ్పల్లి 1.1875 అన్నసాగర్ 2.3400 గున్కుల్ 4.1700 తున్కిపల్లి 0.2700 బూర్గుల్ 10.1800 నర్వ 2.0700 ముగ్దుంపూర్ 1.2500 తిర్మలాపూర్ 7.000 తాడ్కోల్ 0.2200 బాన్సువాడ 0.1300 సోమేశ్వర్ 1.100 దుర్కి 5.0400 కంశెట్‌పల్లి 0.1100 నస్రుల్లాబాద్ 4.3900 జాతీయ రహదారి ‘765–డి’తో భూములు కోల్పోయిన రైతులు ఎకరానికి రూ.8.60 లక్షలే చెల్లించిన సర్కారు ఎకరానికి రూ.20 లక్షలు ఇవ్వాలని అన్నదాతల డిమాండ్ చలో కలెక్టరేట్‌కు సన్నద్ధం -
మందుల కోసం వెళ్లి మృత్యువాత
● ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి ● లచ్చాపేటలో విషాదఛాయలుమాచారెడ్డి: మందుల కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై అనంత లోకాలకు చేరారు. ఈ ఘటన గురువారం మాచారెడ్డి మండలం లచ్చాపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లచ్చాపేట గ్రామానికి చెందిన జక్కుల సాయి (22), మిరుదొడ్డి అజయ్ (22) ప్రాణ స్నేహితులు. సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యాడు. మందులు అయిపోవడంతో స్నేహితుడు అజయ్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరు కలిసి బైక్‌పై గజ్యానాయక్ తండా చౌరస్తాకు వెళ్లి మందులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరి బైక్ లచ్చాపేట స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరిని 108 అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.మృతులు సాయి, అజయ్ ప్రాణ స్నేహితు లు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని గ్రామస్తులు తెలిపారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకేసా రి మృత్యువాత పడడంతో గ్రామస్తులు తీవ్ర ఆవే దనకు లోనయ్యారు. చేతికి అందిన కొడుకులు మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు జక్కుల సాయికి తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్యలతోపాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మరో మృతుడు మిరుదొడ్డి అజయ్‌కు సైతం తల్లిదండ్రులు లక్ష్మి, నరసింహులుతోపాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ కేసు నమోదు చేసుకున్నారు. -
ఫోన్ పోతే ఆందోళన చెందొద్దు
● సీఈఐఆర్ విధానంలో రికవరీకి అవకాశం ● ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: సెల్‌ఫోన్ పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ విధానంలో రికవరీకి అవకాశం ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిరంతరంగా సెల్ఫోన్ల రికవరీకి చర్యలు చేపడుతున్నామన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నెలకు 150కి పైగా సెల్ఫోన్లను రికవరీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 15 రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో పోగొట్టుకున్న, చోరీకి గురైన 112 సెల్ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.18 లక్షలు ఉంటుందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.3 కోట్ల విలువైన 1,894 సెల్ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేస్తామని, వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్‌రాజు(87126 86114)ను సంప్రదించి ఫోన్లు తీసుకువెళ్లాలని సూచించారు. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే పాత సిమ్ కార్డును బ్లాక్ చేసి కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలని సూచించారు. రికవరీలో ప్రతిభ కనబరిచిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పనిచేయని సర్వర్.. జారీ కాని సర్టిఫికెట్లు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో రెండు నెలలుగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో సంబంధిత వెబ్సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. రోజూ మీసేవ కేంద్రాలు, బల్దియా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారికి సర్వర్ డౌన్ అన్న సమాధానమే వస్తోంది. ఏకంగా సర్వర్ పనిచేయడం లేదని నోటీస్ అతికించారు. పెండింగ్‌లో 1500లకుపైగా దరఖాస్తులు.. మున్సిపల్ పరిధిలో పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, మరణించిన వారికి డెత్ సర్టిఫికెట్ల కోసం వందలాది మంది మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండు నెలలుగా వెబ్సైట్ మొరాయిస్తుండడంతో సుమారు 1500లకు పైగా జనన, మరణ దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది.సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ సర్టి ఫికెట్లతో కావాల్సిన పలు పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ రికార్డుల్లో పేరు నమోదుకు, బీమా క్లెయిమ్‌లు, ఇన్సూరెన్స్ డబ్బులు, ఆస్తి బదిలీలు, బ్యాంక్ ఖాతా క్లోజింగ్ తదితర పనులకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. రెండు నెలలుగా సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందన్నారు. సమస్య పరిష్కారం కాగానే సర్టిఫికెట్స్ జారీ చేస్తామన్నారు. రెండు నెలలుగా సమస్య నిలిచిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ మీ సేవ, బల్దియా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు -
చిక్కిన ప్రధాన అంతర్రాష్ట్ర ముఠాలు..
జిల్లా పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు ప్రధాన అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకున్నారు. ● సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా నకిలీ కరెన్సీ దందా నిర్వహిస్తున్న ముఠాను గుర్తించి పశ్చిమ బెంగాల్, యూపీ, బిహార్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలలో ఏకకాలంలో దాడులు చేసి 13 మంది ముఠాను అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ కరెన్సీ, నగదు, నేరానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. ● జిల్లాలోని జాతీయ రహదారుల వెంట జరిగిన 9 దోపిడీ కేసులను సమగ్రంగా దర్యాప్తు చేసి ఓ పార్ధీ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో నలుగురిపై పీడీ యాక్టు పెట్టారు. ● కొంతకాలంగా జాతీయ రహదారులపై నిలిపిన వాహనదారులపై దాడులు, దగ్గర్లో ని గ్రామాల్లో ఇళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన నలుగురు నిందితులు గల మరో పార్ధీ ముఠాను గాంధారి పోలీసులు అరెస్ట్ చేశారు. ● భిక్కనూరు మండలం అంతంపల్లి, తలమడ్ల గ్రామ శివార్లలో దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన కంజర్ భట్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 15.45 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ● ఐదేళ్లుగా తాడ్వాయి, గాంధారి, లింగంపేట్, రాజంపేట్, బాన్సువాడ పీఎస్‌ల పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న గడ్డపార గ్యాంగ్‌లోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ● సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అమాయకులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు సభ్యుల గే గ్యాంగ్‌ను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా కామారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొమ్మిది నేరాలకు పాల్పడింది. -
క్రైం కార్నర్
ఆటో ఢీకొని ఒకరి మృతి బోధన్‌రూరల్: సాలూర మండలంలోని హున్సా గ్రామానికి చెందిన ముద్ద రాజ్‌కుమార్ (54) అనే వ్యక్తి ఆటో ఢీకొని మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ముద్ద రాజ్‌కుమార్ పని నిమిత్తం బోధన్‌కు వెళ్తుండగా సాలూర శివారులో ఎదురుగా అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తమ్ముడు సంగ్రామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. రామారెడ్డి: పురుగుల మందు సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. రామారెడ్డికి చెందిన చాతరబోయిన శంకర్(53) ఈ నెల 23న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. సొంత పొలం దగ్గర గడ్డిమందు సేవించి అపస్మారకస్థితిలో కనిపించడంతో కుటుంబసభ్యులు మొదట కామారెడ్డి ఆస్పత్రికి అనంతరం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు. మృతుడి భార్య చిన్న పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు. -
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్ రూరల్: అన్నివర్గాల అభ్యున్నతికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 668 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలతో కలిసి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఆగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు త్వరగా ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెయూ(డిచ్పల్లి): నగరంలోని ఎల్లమ్మ గుట్టలో ఈనెల 28న నిర్వహించనున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, న్యాయవాది గొర్రె పాటి మాధవరావు ప్రథమ వర్ధంతి స్మారకోపన్యాస సభను విజయవంతం చేయాలని తెలంగాణ యూ నివర్సిటీ లా డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ జెట్లింగ్ యెల్లోసా అన్నారు. తెయూ క్యాంపస్‌లో బుధవారం స్మారక సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎల్లోసా మాట్లాడుతూ.. గొర్రెపాటి మాధవరావు సామాజిక కార్యకర్తగా, పేద ప్రజల కు అందుబాటులో ఉండి అనేక సేవలు అందించా రని తెలిపారు. ప్రథమ వర్ధంతి సభకు ముఖ్య వక్త గా నల్సార్ న్యాయ శాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కృష్ణదేవరాజు వస్తున్నారని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్రవంతి, పీడీఎస్‌యూ ప్రతినిధులు జన్నారపు రాజేశ్వర్, కార్తీక్ పాల్గొన్నారు. -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి
● రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్ ● కలెక్టరేట్ వద్ద ఒక రోజు నిరసన దీక్షకామారెడ్డి టౌన్: ఉద్యోగ విరమణ చేసినవారికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో బుధవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2024 నుంచి రాష్ట్రంలో సుమారు 16 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా కేవలం వెయ్యి మందికే బెనిఫిట్స్ అందాయన్నారు. జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర బకాయిలు చెల్లంచకపోవడంతో వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు డబ్బుల్లేక అల్లాడుతున్నామన్నారు. పైరవీలు చేసిన వారికే నిధులు అందుతున్నాయని, సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఇప్పటివరకు 26 మంది ఉద్యోగులు మరణించారన్నారు. నిలిచిపోయిన రూ. 9వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించి, దీక్షను విరమించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రం, ఆర్థిక కార్యదర్శి లక్ష్మీరాజం, ప్రతినిధులు మధుసూదన్‌రావు, రాజేశం, రవికుమార్, శంకర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా బుక్ చేసేదెలా?
● స్మార్ట్‌ఫోన్ లేని రైతుల్లో ఆందోళనభిక్కనూరు: యూరియా పక్కదారి పట్టకుండా చూ సేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఆన్లైన్లో బుక్ చేసుకునేలా ‘ఫెర్టిలైజర్ బు కింగ్ యాప్’ను రూపొందించింది. ఈ యాప్‌ద్వారా యాసంగి సీజన్లో యూరియా అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ విధానంపై స్మార్ట్‌ఫోన్ లేని రైతులు ఆందోళన చెందుతున్నారు. తామెలా యూరి యా తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది రైతులకు స్మార్ట్ఫోన్లు లేవు. వారు ఫీచర్ ఫోన్లనే వాడుతున్నారు. వృద్ధులు, నిరక్షరాస్యులు యాప్‌లు ఉపయోగించలేదు. యూరియా కావాలంటే తాము ఏం చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరుతున్నారు. -
పారదర్శకతకు డిజిటల్ న్యాయం అవసరం
సుభాష్‌నగర్: కేసుల పరిష్కారం, అణగారిన వర్గాలకు సులభంగా న్యాయం అందేందుకు, పారదర్శకత, జవాబుదారీతనం కోసం డిజిటల్ న్యాయం అవసరమని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లోగల జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో బుధవారం జాతీ య వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ‘డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వా రా త్వరితగతిన, సమర్థంగా కేసుల పరిష్కారం’ అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. అనంత రం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో వినియోగదారుల హెల్ప్‌లైన్, జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ నెంబర్ 1915 లేదా 1800 001915 ద్వారా ఫిర్యాదులు నమోదు చేస్తామని తెలిపారు. కేసుల సమర్థవంతమైన, వేగవంతమైన పరిష్కారాన్ని సాధించడానికి డిజిటల్ న్యాయం ఒక శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. తక్కు వ ఖర్చుతో న్యాయం అందుతుందని, పేపర్‌లెస్ వ్యవస్థ ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు. మార్కెట్లో ఏదైనా సేవలను వినియోగించుకునే సమయంలో వినియోగదారులు అ నుసరించాల్సిన విలువైన సూచనలను ఆయన చేశా రు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జీఎం శ్రీకాంత్‌రె డ్డి, ఆహార భద్రత అధికారి నవిత, లీగల్ మెట్రా లజీ అధికారి సుజావత్ అలీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ వి శీరకాంత్, మాయావర్ రాజేశ్వర్, అనిల్‌కుమార్, ప్రవీ ణ్, వర్మ, మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేష్, గైని రత్నాకర్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ -
క్రిస్మస్ వేడుకలకు చర్చీల ముస్తాబు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాలలో జరిగే క్రిస్మస్ వేడుకలకు చర్చిలను ముస్తాబు చేశారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చర్చీల వద్ద శామియాలు వేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నిరకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. వేడుకల అనంతరం అన్నదానం ఉంటుందని పాస్టర్లు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైనట్లు చర్చి ఫాదర్ తెలిపారు. గురువారం ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు. -
నాడు భార్య.. నేడు భర్త సర్పంచ్
బాన్సువాడ రూరల్: కొత్తాబాది గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తుఫ్రాన్ సాయాగౌడ్ తన సమీప ప్రత్యర్థి దేవిసింగ్పై 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2018 నుంచి 2024 వరకు కొత్తాబాది సర్పంచ్‌గా ప్రస్తుతం సర్పంచ్‌గా ఎన్నికై న సాయాగౌడ్ సతీమణి అంకిత బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. గ్రామ సర్పంచ్‌గా 5 ఏళ్ల పాటు సేవలందించారు. గతంలో తన భార్య అంకిత సర్పంచ్‌గా చేసిన అభివృద్ధి పనులే తన గెలుపునకు కారణమని, తాను కూడా అదే పంథాలో గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని నూతన సర్పంచ్ సాయాగౌడ్ అన్నారు. కాగా సతీమణికి పదవీ విరమణ సన్మానం, భర్తకు పదవీ బాధ్య తల స్వీకరణ ఒకే వేదికపై జరగడం విశేషం. తుఫ్రాన్ సాయాగౌడ్, సర్పంచ్, కొత్తాబాది అంకిత సాయాగౌడ్, మాజీ సర్పంచ్ కొత్తాబాది -
గల్ఫ్‌లో ఆగమైన పర్మల్లవాసి
● స్వదేశానికి రప్పించాలి ● సీఎం ప్రవాసీ ప్రజావాణిలో కుటుంబ సభ్యుల వినతిసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన యువకుడు.. రెండు రోజులకే అదృశ్యమయ్యాడు. ప్రభుత్వం చొరవ తీసుకుని అతడిని ఇండియాకు రప్పించాలని బాధితుడి భార్య ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించింది. వివరాలిలా ఉన్నాయి. లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన మాలోత్ శ్రీరాం నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబి వెళ్లాడు. అతడు నవంబర్ 13న లేబర్క్యాంపు నుంచి అదృశ్యమయ్యాడు. మతిస్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరిగిన శ్రీరాం.. నెల రోజులకు క్యాంపునకు వెళ్లగా అక్కడి నిర్వాహకులు అనుమతించలేదు. కాగా పారిపోయాడంటూ కేసు నమోదు చేసిన కంపెనీ యాజమాన్యం.. డిపోర్టేషన్ కోసం 4,500 దినార్లు(రూ.లక్షా పదివేలు) జరిమానా చెల్లించాలని డిమండ్ చేస్తోంది. పేదరికంతో ఉన్న తాము ఆ ఖర్చు భరించే పరిస్థితుల్లో లేమని శ్రీరాం భార్య సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను స్వదేశానికి రప్పించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించింది. అబుదాబిలోని ముసఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ జీవిస్తున్న తన భర్తను రప్పించాలని తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని కోరింది. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావులు స్పందించి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. -
క్రిస్మస్ శుభాకాంక్షలు : కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన రోజున అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో జిల్లా మరింత ప్రగతిని సాధించాలని అభిలషించారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): yìl^Œl-ç³-ÍÏ Ð]l$…yýlÌS MóS…{§ýl…ÌZ° õÜtsŒæ »êÅ…MŠS {V>Ò$׿ çÜÓ Ä¶æ$… E´ë«¨ Õ„ýS׿ çÜ…çܦ (BÆŠ‡-G-‹ÜD-sîæ-I) B« §ýlÓ-Æý‡Å…ÌZ E_™èl Õ„ýS-׿MýS$ §ýlÆý‡Rê-çÜ$¢Ë$ Bà-Ó-°-çÜ$¢-¯]l²r$Ï çÜ…çܦ OyðlÆð‡-MýStÆŠ‡ Æý‡Ñ-MýS$-Ð]l*ÆŠ‡ º$«§ýl-ÐéÆý‡… JMýS {ç³MýS-r-¯]lÌZ MøÆ>Æý‡$. çÜ…çܦ B«§ýlÓ-Æý‡Å…ÌZ òÜÌŒæ ¸ù¯ŒS Çõ³ÆŠ‡, ïÜïÜsîæÒ Õ„ýS׿, HïÜ Çõ³-Ç…VŠæ, Ððlhrº$ÌŒæ ¯]lÆý‡Þ-È, ´ëç³yŠæ, ç³^èlaâ¶æ$Ï ™èlĶæ*-È, ™ól¯ðlే-sîæ-ి ò³…ç³MýS…,ç³#rt Vöyýl$ VýS$ÌS ò³…ç³MýS… MøÆý‡$Þ-ÌSÌZ Õ„ýS׿ CÐ]lÓ-¯]l$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. Õ„ýS-׿-™ø´ër$ E_™èl ¿Zf¯]l çܧýl$-´ë-Ķæ$…, àçÜtÌŒæ Ð]lçÜ-†, Õ„ýS׿ A¯]l…™èlÆý‡… {«§ýl$Ò-MýSÆý‡×æ ç³{™èl… A…¨Ýë¢Æý‡° õ³ÆöP-¯é²Æý‡$. °gê-Ð]l*-»ê§Šæ, M>Ð]l*-Æð‡yìlz hÌêÏ-ÌSMýS$ ^ðl…¨¯]l 19 ¯]l$…_ 45 çÜ…Ð]l-™èlÞÆ>ÌS Ð]lĶæ$çÜ$ MýSÍ-W¯]l {V> Ò$׿ {´ë…™èl Ķæ¬Ð]l-MýS$Ë$ Ð]l*{™èlÐól$ §ýlÆý‡Rê çÜ$¢ ^ólçÜ$Mø-Ð]lyé-°MìS AÆý‡$áÌS° ™ðlÍ-´ëÆý‡$. BçÜMìS¢ VýSÌS ÐéÆý‡$ B«§éÆŠ‡, Æó‡çÙ¯ŒS M>ÆŠ‡z, 10Ð]l ™èlÆý‡VýS† {«§ýl$Ò-MýSÆý‡×æ ç³{™èl…, I§ýl$ ´ë‹Ü-´ùÆý‡$t OòÜk ¸÷sZË$, »êÅ…MŠS Rê™é hÆ>MŠSÞ M>ï³ ¡çÜ$-Mö° Ð]l_a õ³Æý‡$ ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-MøÐéÌS° õ³ÆöP-¯é²Æý‡$. నియామకం ● ఏడుగురు న్యాయవాదుల ఎంపిక నిజామాబాద్‌లీగల్: జిల్లాలో భారత ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిళ్లను నియమించింది. జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది చింతకుంట సాయిరెడ్డిని స్టాండింగ్ కౌన్సిల్‌గా, మరో ఆరుగురు న్యాయవాదులు బండారి కృష్ణానంద్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, దయావర్ నాగేశ్వర్, ఆకుల సురేశ్, పడిగెల వెంకటేశ్వర్, టి.నరసింహారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్లను అడిషనల్ స్టాండింగ్ కౌన్సిళ్లుగా ఎంపిక చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరు జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించనున్నారు. వీరి పదవికాలం మూడు సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటాయి. జిల్లాకు చెందిన న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియామకం అవ్వడంపై హర్షం వ్యక్తంచేస్తూ బార్ అసోసియేషన్‌తోపాటు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. మాక్లూర్:నాలుగు రోజుల క్రితం అంత్యక్రియ లు నిర్వహించి పూడ్చిన శవాన్ని పోలీసులు బ యటికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించిన ఘట న చర్చనీయాంశమైంది. వివరాలు ..మాక్లూర్ మండలం బోర్గాం(కే)లో ఈ నెల 19న రాత్రి భోజనం అనంతరం ని ద్రించిన పల్నాటి రమేశ్(35) గుండెపోటు వచ్చి మృతి చెందాడు. మరుసటి రోజు కులస్తు లు, బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే,తన అన్న రమేశ్ మృతిపై అనుమానం ఉందని ఇజ్రాయిల్ దేశంలో ఉన్న తమ్ముడు పల్నాటి కేధార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉన్నతాధికారుల సమక్షంలో పూడిచిపెట్టిన శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం జరిపించారు. నివేదిక ఆధారంగా నిజాలు తెలుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యాచారయత్నం.. ఒకరి అరెస్టు నిజామాబాద్‌అర్బన్:ఖలీల్వాడిలో పూజ ఆస్పత్రిలో సోమవారం నర్సుపై అత్యాచార యత్నానికి పాల్పడిన రో హిత్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న నర్సుపై అత్యాచారానికి ఒడిగట్టిన రోహిత్‌పై కేసు నమోదైంది. సదాశివనగర్(ఎల్లారెడ్డి): తిర్మన్‌పల్లిలో బుధవారం ప్రమాదవశాత్తు చెరుకు తోట దగ్ధమైన ట్లు గ్రామస్తులు తెలిపా రు.గ్రామంలోని నారె డ్డి రాజిరెడ్డికి చెందిన ఎ కరం చెరుకు తోట షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్ర మాదానికి గురైందని పేర్కొన్నారు. నష్ట పరి హారం చెల్లించాలని బాధిత రైతు కోరారు. ఫ్యా క్టరీ యాజమాన్యం తక్షణమే స్పందించి కాలిపోయిన చెరుకును క్రషింగ్‌కు తరలించాలని వేడుకున్నారు. -
అదుపులో నేరాలు!
● తగ్గిన హత్యలు, రోడ్డు ప్రమాదాలు ● ఆపరేషన్ కవచ్‌తో సత్ఫలితాలు.. ● 2025 నేర సమీక్షలో ఎస్పీ రాజేశ్ చంద్ర‘‘నేరాల నియంత్రణకు జిల్లా పోలీసు శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కొన్ని రకాల నేరాలు అదుపులోకి వస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి’’ అని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం 2025 నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసరావు, విఠల్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైంజిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 5,979 కేసులు నమోదయ్యాయి. గతేడాది 6,006 కేసులు రికార్డయ్యాయి. గతేడాది 37 హత్య కేసులు నమోదవ్వగా.. ఈసారి 34 హత్య కేసులున్నాయి. కాగా జిల్లాలో హత్యాయత్నం కేసులు మాత్రం పెరిగాయి. గతేడాది 20 హత్యాయత్నం కేసులుండగా.. ఈసారి 30 కి చేరాయి. గతేడాది 39 కిడ్నాప్ కేసులు నమోదు కాగా ఈసారి 43 కు పెరిగాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. 2024 లో 569 ప్రమాదాలు జరిగి 275 మంది మృతి చెందగా 263 మంది గాయాలపాలయ్యారు. ఈ ఏడాది మొత్తం 486 రోడ్డు ప్రమాదాల్లో 211 మంది చనిపోగా మరో 242 మంది గాయపడ్డారు. పెరిగిన పోక్సో, అత్యాచారం కేసులు.. మహిళలపై వేధింపులకు సంబంధించి గతేడాది 112 కేసులు నమోదవగా ఈసారి 109కి తగ్గాయి. గతేడాది 61 అత్యాచార కేసులు కాగా ఈసారి 67 కు పెరిగాయి. గతేడాది 89 పోక్సో కేసులు నమోదు కాగా ఈసారి 101 వెలుగుచూశాయి. గతేడాది 312 వరకట్నం, గృహహింస కేసులవగా ఈసారి 247 నమోదయ్యాయి. మొత్తం మహిళా సంబంధిత నేరాలు 2024 లో 517 కేసులవగా.. ఈసారి 526కు పెరిగాయి. పెరిగిన దోపిడీలు.. చిన్నపాటి దొంగతనాలు మినహా మిగతా దొంగతనాలు, దోపిడీల కేసులు పెరిగాయి. 2024లో 506 చిల్లర దొంగతనాలు జరగ్గా ఈసారి 434 జరిగాయి. తాళం వేసిన ఇళ్లలో చోరీల విషయానికి వస్తే గతేడాది 214 కేసులు నమోదు కాగా ఈసారి 224 నమోదయ్యాయి. గతేడాది 15 దోపిడీ కేసులవగా ఈ సంఖ్య 35 కు పెరిగింది. ఆస్తి సంబంధిత నేరాల్లో 45 శాతం కేసులను ఛేదించి 40 శాతం సొత్తు రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు.జిల్లాలో 2024లో 205 సైబర్ నేరాలు జరగ్గా.. ఈ ఏడాది 160కి తగ్గింది. వాస్తవానికి ఏడాదిలో జిల్లావ్యాప్తంగా మొత్తం 930 ఫిర్యాదులు వచ్చాయి. విచారణ తర్వాత డబ్బులు నష్టపోయిన 160 కేసులను నమోదు చేశారు. ఆయా కేసుల్లో బాధితులు రూ.5.82 కోట్లను పోగొట్టుకోగా.. ఇందులో రూ. 1.07 కోట్లను రికవరీ అయ్యాయి.‘‘పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును.. అది వాస్తవమైనా, తప్పుడుదైనా సరే కచ్చితంగా రి కార్డు చేస్తాం. ఫిర్యాదు స్వీకరించిన విషయాన్ని ఫి ర్యాదుదారు ఫోన్‌కు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం. తక్షణమే కేసు విచారణ చేపట్టి బాధితులకు న్యా యం చేస్తాం’’ అని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నా రు. కొత్త సంవత్సరంలో జిల్లా పోలీసు యంత్రాంగం మరిన్ని నూతన పద్ధతులు అవలంబించనుందని వివరించారు. జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో అనేక విజయాలు సాధించిందన్నారు. ‘కిడ్స్ విత్ ఖాకీ’ అనే ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడంతో పాటు న్యాయం, చట్టం గురించి అవగాహన కల్పించామన్నారు. విద్యార్థులు ఇంటి దగ్గరకు వెళ్లిన తరువాత పేరెంట్స్‌కు తాము నేర్చుకున్న విషయాలను వివరించడం ద్వారా ఎన్నో సత్ఫలితాలు సాధించామన్నారు. వరదల సమయంలో ప్రతి పోలీసు ఎంతో బాధ్యతగా పనిచేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారని కొనియాడారు. పోలీస్ వార్షిక నివేదికలో ‘సాక్షి’ కథనం.. జిల్లా పోలీసు శాఖ రూపొందించిన 2025 వార్షిక నివేదికలో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించారు. వివిధ సందర్భాల్లో పోలీసులు పలువురి ప్రాణాలు కాపాడిన విషయంపై ‘ఆపద్బాంధవులు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఇందులో ప్రముఖంగా ముద్రించారు.నేరాల నియంత్రణ, ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతను పెంచే ఉద్దేశంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐదు నెలల క్రితం ఆపరేషన్ కవచ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ 5 నెలల్లో 97,822 వాహనాలను, 26,636 మంది అనుమానితులను తనిఖీ చేశారు. 1,041 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 64 మంది నిందితులను గుర్తించారు. నంబర్ ప్లేట్ సరిగాలేని 43 వాహనాల సీజ్ చేశారు. రెండు గంజాయి, రెండు పశువుల అక్రమ రవాణా, నాలుగు ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. చోరీకి గురైన ఏడు బైక్‌లు, ఒక ఆటోను గుర్తించి, నిందితులను పట్టుకున్నారు. -
పొరపాట్ల వల్ల కొన్ని చోట్ల గెలవలేకపోయాం
బాన్సువాడ: ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రెస్ మద్దతు సర్పంచులు గెలిచిన నియోజకవర్గంగా బాన్సువాడ ఫస్ట్ స్థానంలో నిలిచిందని, బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు బాన్సువాడలో మూడు చోట్లనే గెలవడంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పొరపాట్ల వల్ల కొన్ని చోట్ల గెలవలేకపోయామన్నారు. దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి ఉంటే గ్రామ ప్రథమ పౌరుడిగా సర్పంచు ఉంటారని అన్నారు. తనకు కూడా 1983లో పోచారం సర్పంచ్ కావాలని ఆకాంక్ష ఉండేదని, కానీ రిజర్వేషన్ల కారణంగా ఇప్పటి వరకు సర్పంచు కాలేకపోయానని అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేలా, వీధులన్నీ శుభ్రంగా ఉండేలా, వీధి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేసే వారికి బి. ఫారాలు ఇస్తామని అన్నారు. త్వరలో రైతు భరోసా నిధులు: ఎంపీ సురేష్ షెట్కార్ రైతుల ఖాతాల్లో త్వరలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులకు అభినందనలని, రెండేళ్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని, అత్యవసర పనులకు నిధులు మంజూరు చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచులుగా గెలిచిన వారు కూడా అందరితో కలిసిపోవాలని అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, బద్యానాయక్ తదితరులున్నారు. సర్పంచు కావాలనే తన కోరిక నెరవేరలేదు సర్పంచుల సన్మాన కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి -
యూడీఐడీ నమోదు చేసుకోవాలి
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని దివ్యాంగులందరు సదరం యూడీఐడీ నమోదు చేసుకోవాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. బుధవారం కామారెడ్డి డివిజన్లోని మీ సేవ అపరేటర్లు, డీఆర్డీవో సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించారు. అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి యూడీఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించారు. ఈడీఎం ప్రవీణ్, డీపీఎం సురేష్‌కుమార్, అపరేటర్లు విజయ, సంధ్య, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: జిల్లా కు చెందిన సీనియర్ న్యాయవాది బండారి సురేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర లా మినిస్ట్రీ అండ్ జస్టిస్ విభాగం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. లింగాపూర్ గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి 16 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. తన నియామ కానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ రామారావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి టౌన్: యువతులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేష న్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రథమ్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతుల కోసం 60 రోజుల పాటు ఉచితంగా వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నా రు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీఎం శాలిని, ప్రథమ్ ఎన్జీవో స్టేట్ హెడ్ హనుమంత్, ఫౌండర్ మెంబర్ నయాబ్ రసూల్, ప్రాజెక్ట్ హెడ్ ప్రణయ్ చందర్, మేనేజర్లు రంగారావు, రాజు పాల్గొన్నారు. నిజాంసాగర్: నాగమడుగు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు అవసరమయ్యే భూముల వివరాలను తమకు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం ఒడ్డేపల్లి గ్రామ పంచాయతీలో బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో నాగమడుగు భూనిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. పంపుహౌస్‌తో పాటు పైపులైన్లకోసం భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో పూర్తి సమాచారం తెప్పిస్తామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ అంజయ్య, నాయకులు ప్రజాపండరి పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాల య పరిధిలోని పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల పరీక్షల ఫీజు జనవరి 5లోగా చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్ తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో జనవరి 7వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పీజీ(ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంకాం) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్(ఏపీఈ) అన్ని సబ్జెక్టులకు రూ. 500, ఐపీసీహెచ్ (అన్ని సబ్జెక్టులకు రూ. 600) ఎంబీఏ, ఐఎంబీఏ, ఎంసీఏ అన్ని సబ్జెక్టులకు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు వెబ్సైట్ www.telanganauniversity.ac.inను సంప్రదించాలని సూచించారు. -
యూరియా కష్టాలు
● తెల్లవారుజామునుంచే క్యూలైన్.. ● కొరత లేదన్న సొసైటీ అధికారులు భిక్కనూరు : యాసంగి సీజన్ ప్రారంభంలోనే రైతు లకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. రైతులు సింగిల్ విండో కార్యాలయాలకు వచ్చి బారులు తీరుతున్నారు. కాచాపూర్ సింగిల్‌విండోకు యూరి యా బస్తాలు వచ్చాయన్న సమాచారంతో రైతులు బుధవారం వేకువ జామున ఐదు గంటల నుంచే బారులు తీరారు. క్యూలో చెప్పులను ఉంచి చలిలో వేచి ఉన్నారు. ఒక్కో రైతుకు రెండు చొప్పున 444 యూరియా బస్తాలను అందించామని విండో సీఈవో మహేశ్వరి తెలిపారు. శుక్రవారం కూడా గ్రామంలో 444 బస్తాలను పంపిణీ చేశామన్నారు. యూరియా కొరత లేదని, కావాలని కొందరు చెప్పులను క్యూ లైన్లో పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. లింగంపేటలో.. లింగంపేట : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 900 బస్తాల యూరి యా నిల్వ ఉండడంతో బుధవారం పలు గ్రామా లకు చెందిన రైతులు యురియా కొనుగోలు చేయడానికి తరలివచ్చారు. పోతాయిపల్లిలో 300, భవానిపేటలో 300, అయిలాపూర్‌లో 300 బస్తాల యూరియా నిల్వలు ఉన్నాయని సీఈవో పెంటయ్య తెలిపారు. రైతులకు అవసరమైన యురి యా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
అధికార పార్టీ ప్రలోభాలకు లొంగొద్దు
● కేసీఆర్ బాటలోనే నడుద్దాం ● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి టౌన్: అధికార పార్టీ చేసే ప్రలోభాలకు లొంగి పార్టీలు మారవద్దని, నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు సూచించారు. నియోజకవర్గంలో పార్టీ మద్దతుతో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు బుధవారం జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నయాపైసా మంజూరు చేయలేదని విమర్శించారు. రాబోయే కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుందని, వాటిని ఆపే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో మిమ్మల్ని గెలిపించారని, కేసీఆర్ చూపిన బాటలో నడిచి పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ వేధింపులకు గురిచేస్తే భయపడాల్సిన పనిలేదని, జిల్లాలో పార్టీ తరపున ఉచిత లీగల్ టీం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పీటీసీలు గోపి గౌడ్, రామ్ రెడ్డి, అశోక్, మండల పార్టీ అధ్యక్షులు బాలచంద్రన్, రాజా గౌడ్, బలవంతరావు, ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిక భిక్కనూరు: బస్వాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నేత గౌరిగారి మహిపాల్‌రెడ్డి బుధవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కండువాను కప్పి స్వాగతించారు. బీఆర్ఎస్ నేతలు బుర్రి గోపాల్, మల్లారెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
నేడు క్రిస్మస్
● జిల్లాలో ముస్తాబైన చర్చీలు ● ప్రార్థనలు చేయనున్న క్రైస్తవులుకామారెడ్డి టౌన్: క్రైస్తవులు బుధవారం క్రిస్మస్ను ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని చర్చీలను ముస్తాబు చేశారు. జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ వెస్లీ, అశోక్నగర్కాలనీ, గోదాంరోడ్, రామారెడ్డిరోడ్, హరిజనవాడ, గొల్లవాడ తదితర కాలనీలోని ప్రార్థన మందిరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీ, ఏసుక్రీస్తు జననాన్ని చాటిచెప్పే పశువుల పాకలు ఏర్పాటు చేశారు. చర్చీల లోపలా అందంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
బైక్‌ను ఢీకొన్న బస్సు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో బుధవారం బస్సు ఢీకొని బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మెల్లకుంట తండాకు చెందిన మూడ్ బిచ్చు, తన భార్య మూడ్ మోతి బైక్‌పై బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మెదక్ బయల్దేరారు. అదే సమయంలో గోపాల్‌పేటలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద మెదక్ వైపు నుంచి ఎల్లారెడ్డి వెళ్తున్న బోధన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న బిచ్చు, అతని భార్య మోతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
జాతీయ రహదారిపై లారీ బోల్తా
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం పైపుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గుజరాత్ నుంచి మద్నూర్ మీదుగా కర్నూల్‌కు స్టీల్ పైపుల లోడుతో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద ఎదురుగా ఉన్న లారీని ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ● నేడు రీపోస్టుమార్టం చేయనున్న పోలీసులు మాక్లూర్: మండలంలోని బోర్గాం(కె) గ్రామానికి చెందిన పల్నాటి రమేశ్(35) ఈ నెల 19న గుండెపోటుతో మృతి చెందాడు. తన అన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటు ఇజ్రాయిల్‌లో ఉంటున్న అతని తమ్ముడు పల్నాటి కేథర్ మంగళవారం స్వగ్రామానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపడుతున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రమేశ్ మృతదేహాన్ని పూడ్చిన చోట బుధవారం రీ పోస్టుమార్టం చేయనున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఉన్న పురాతన మైసమ్మ ఆలయం ధ్వంసానికి దుండగులు యత్నించారు. గుడిని పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, హిందూవాహిని, భజరంగ్‌దళ్ నాయకులు గుడి వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయని, పోలీసులు ప్రతీ రోజు పెట్రోలింగ్ చేపట్టాలని కోరారు. ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. నాయకులు పుల్లూరి సతీశ్, నరేశ్, రమేశ్, నరేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సదాశివనగర్: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి తీవ్రగాయాలైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. మండలంలోని తిమ్మోజివాడి గ్రామానికి చెందిన గోల్కొండ హరిబాబు(31) ఈ నెల 20న బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
సుందరం.. సూర్యోదయం
మద్నూర్(జుక్కల్): ఉదయం పడిపోతున్న ఉష్ణోగ్రతలతో సూర్యుడు ఆలస్యంగా వస్తున్నాడు. ఉదయం సమయంలో సూర్యుడు లేలేత కిరణాలతో ఎర్రగా మారి ఆకట్టుకుంటున్నాడు. మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయిస్తున్న సూర్యుడి రూపం సుందరంగా కనిపించింది. జక్రాన్‌పల్లి: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాలానగర్ గ్రామానికి చెందిన సాయిలు(32) మద్యానికి అలవాటు పడ్డాడు. మంగళవారం మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవపడ్డాడు. దీంతో వారి మధ్య గొడవ జరగడంతో క్షణికావేశంలో గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హిందువులపై దాడులు గర్హనీయం
కామారెడ్డి అర్బన్ : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు గర్హనీయమని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువు హత్యను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. మతోన్మాద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం మాట్లాడుతూ దేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగినా స్పందించే సెక్యులరిస్ట్‌లు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడులకు వ్యతిరేకంగా హిందువులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆందోళనకు అయ్యప్ప స్వాములు మద్దతు తెలిపారు. నిరసన కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ అశోక్, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షులు సామల గంగారెడ్డి, గోపాలకృష్ణ, బొడ్డు శంకర్, జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, నాయకులు శ్రీకాంత్‌రావు, పాపారావు, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, పూల్లూరు సతీష్, రమేష్, విఫుల్జైన్, కార్యదర్శి అరవింద్, సాయికుమార్, అయ్యప్ప స్వాములు బండి నర్సింలు, శివకుమార్, ముప్పారపు ఆనంద్, శివ తదితరులు పాల్గొన్నారు. -
కామారెడ్డిలో దొంగల అలజడి
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో మంగళవారం వేకువజామున దొంగల అలజడి కలకలం రేపింది. పట్టణంలోని జయశంకర్ కాలనీలో దాదాపు 3 గంటల ప్రాంతంలో దొంగలు సంచరిస్తూ చోరీలకు యత్నించారు. కుక్కలు మొరగడంతో కొందరు కాలనీవాసులు ఇళ్ల లో నుంచి బయటకు వచ్చారు. వారు బయటకు రావడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారని కాలనీవాసులు తెలిపారు. ముసుగులు ధ రించిన ముగ్గురు కాలనీల్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇదిలా ఉండగా అదే సమయంలో ఎన్జీవోఎస్ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడినట్లు కాలనీవాసులు తెలిపారు. అక్కడ ఎలాంటి విలువైన వస్తువులు చోరీకి గురి కాలేదని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దొంగల సంచారం పట్టణ వాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. కాలనీల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
యాప్‌తో ఎరువుల కొనుగోలు సులభం
గాంధారిలో యాప్‌పై అవగాహన కల్పిస్తున్న ఏవో రాజలింగంలింగంపేటలో మాట్లాడుతున్న ఏవో అనిల్కుమార్లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ద్వారా రైతులు సులభంగా ఎరువులు కొనుగోలు చేయవచ్చని మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో ఎరువులు పొందవచ్చారు. ఆన్లైన్లో ఎరువుల వివరాలు నమోదై ఉంటాయన్నారు. ఏఈవోలు రాకేష్, రవి, నవ్య, తదితరులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి గాంధారి(ఎల్లారెడ్డి): గ్రామాలు, తండాల్లో ఫెర్టిలైజర్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఏవో రా జలింగం సూచించారు. మంగళవారం స్థానిక రైతు వే దిక భవనంలో ఏఈవోలు, జీపీవోలతో సమావేశం ఏ ర్పాటు చేసి అవగాహన కల్పించారు. పు రుగు మందులు, ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు దేమికలాన్ సింగిల్ విండో కార్యాలయాలలో మంగళవారం యూరియా ఎరువుల కోసం బుకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమపట్టా పాస్ పుస్తకాలతో కార్యాలయాలకు వచ్చి తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ప్రత్యేక అధికారులు లక్ష్మణ్, విష్ణు, సీఈవో నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు. -
చెస్‌తో మేధస్సుకు పదును
● డీఈవో అశోక్ మోపాల్: విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలుగా కాకుండా చెస్ వంటి క్రీడలతో వారి మేధస్సును పదును చేసుకోవచ్చని డీఈవో అశోక్ సూచించారు. మంగళవారం నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్లో చెస్ నెట్వర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున చెస్ బోర్డులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు పిల్లలను చెస్ ఆడేందుకు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవోలు గేమ్‌సింగ్, సేవులా, పాఠశాల హెచ్ఎం సీహెచ్ శంకర్, నెట్వర్క్ ప్రతినిధులు సాహితీ, కిరణ్‌కుమార్ గౌడ్, వాసు గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపికలు నిర్వహించగా 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక పోటీలను అదనపు కలెక్టర్ మధు మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జనవరి 2న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో ఎంపికై న 24 మంది క్రీడాకారులు జిల్లా తరపున పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.జైపాల్‌రెడ్డి, కేపీ అనిల్‌కుమార్‌లు తెలిపారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి వెంకటేశ్వరగౌడ్, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూదన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, ప్రభులింగం, విజయలక్ష్మి, సంజీవ్, లక్ష్మణ్, నరేష్, నవీన్, సురేష్ పాల్గొన్నారు. -
మొక్కులు తీర్చేందుకు వెళ్తూ..
● ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. ● ఒకరి మృతి.. పలువురికి గాయాలుగాంధారి(ఎల్లారెడ్డి): మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలంలోని కాయితీ తండాకు చెందిన మంజారావు సింగ్ కుటుంబం మొక్కులు చెల్లించుకునేందుకు చద్మల్ తండాలో ఉన్న లక్ష్మమ్మ ఆలయానికి మంగళవారం ఉద యం ట్రాక్టర్లో బయలు దే రింది. నేరల్ గ్రామ శివారు లో ట్రాక్టర్ బోల్తాపడటంతో మంజారావు సింగ్ కుమారుడు మంజా గణేశ్(15) అక్కడికక్కడే మృతి చెందగా, మంజా మధు, మంజా కిషన్‌తోపాటు మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రావుసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
యువతకు స్ఫూర్తినిచ్చే ఆత్మకథ
● ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ● రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ ● కుంచె గీసిన బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన నందిని సిధారెడ్డి సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘తన జీవన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కసితో చదివి ఉన్నత స్థితికి ఎదిగిన డాక్టర్ వి.శంకర్ జీవితం స్ఫూర్తిమంతమైనది. నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకు మేల్కొలుపులా కుంచె గీసిన బతుకు చిత్రం పుస్తకం ఉపయోగపడుతుంది’ అని రెరా చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్.సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, అసోసియేట్ ప్రొఫెస ర్ వి.శంకర్ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన మైలురాళ్లన్నింటినీ కలిపి ‘కుంచె గీసిన బతుకు చిత్రం’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించగా, డాక్టర్ నాళేశ్వరం శంకరం సమీక్షించారు. ఈ సందర్భంగా రెరా చైర్మన్ మాట్లాడుతూ శంకర్ తన జీవన ప్రయాణంలో ఎదుర్కొ న్న సవాళ్లను ఎంతో నిజాయితీగా అక్షరీకరించారన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసేలా పుస్తకం ఉందన్నారు. తెలంగాణ సామాజిక చిత్రంతో పా టు ఒక అధ్యాపకుడి అంతర్మథనాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యంవైపు నడవడానికి ఈ పుస్తకం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కుంచె గీసిన బతుకుచిత్రం అనే పేరులోనే ఒక కళాత్మకత ఉందని, ఒక చిత్రకారుడు తన జీవితాన్ని రంగులతో కాకుండా అక్షరాలతో ఎలా తీర్చిదిద్దారో ఈ శీర్షక సూచిస్తుందని నాళేశ్వరం శంకరం అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, తెలుగు విభాగ ప్రతినిధులు విశ్వప్రసాద్, రవీంద్రనాథ్, ఉమామహేశ్వరి, ఎన్సీసీ కోఆర్డినేటర్లు సుధాకర్, శ్రీనివాస్‌రావ్, కవులు సూరారం శంకర్, సిరిగాద శంకర్, సత్యనారాయణ, అశోక్‌కుమార్, ప్రకాశ్, నర్సింహారెడ్డి, నాంపల్లి, ఉస్మాన్, శ్రీనివాస్, భోజిరెడ్డి పాల్గొన్నారు. -
రక్తమోడిన రహదారులు
ఆటో, మోటార్ సైకిల్ ఢీ ● బైకిస్టుతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న యువతి మృతి ఆర్మూర్: ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో చోటు చేసుకుంది. మృతులు నిజామాబాద్ నగరానికి చెందిన జెట్టివార్ సాయిప్రసాద్ (23), ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రా మానికి చెందిన వనం సంధ్యారాణి (25) గా పోలీసులు గుర్తించారు. నగరంలోని చంద్రానగర్ కాలనీకి చెందిన సాయిప్రసాద్ ఆర్మూర్ మండలం చేపూ ర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. నిజామాబాద్ నుంచి సోమవారం అర్ధరాత్రి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఆర్మూర్‌కు బయల్దేరాడు. ఎడపల్లి మండలం జాన్కంపేటకు చెందిన సంధ్యారాణి తన గ్రామానికి చెందిన 12 మందితో కలిసి పెర్కిట్‌లోని ఫంక్షన్హాల్లో క్యాటరింగ్ చేసేందుకు వచ్చింది. ఫంక్షన్ పూర్తయిన తర్వాత కూలీలంతా ఆటోలో ఎడపల్లికి బయల్దేరారు. అంకాపూర్ శివారులోకి రాగానే ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఘటనలో బైక్ నడుపుతున్న సాయిప్రసాద్‌తోపాటు ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్న సంధ్యారాణి అక్కడికక్కడే మరణించింది. ఆటోలో ఉన్న మరో యువతి మరాఠీ హారిక కాలు విరగ్గా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఎండీ నదీమ్ పరారీలో ఉన్నాడు. ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచా రణ చేపట్టారు. మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కూలీ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయి.. మృతురాలు సంధ్యారాణిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు ఇద్దరు కూతుర్లు కాగా, సంధ్యా రాణి పెద్ద కూతురు. వివాహం అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో తల్లిదండ్రుల వద్దే ఉంటూ పని చేసుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించగా, గాంధారి మండలం చద్మల్ తండాలో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మద్నూర్ శివారులో ఆటోబోల్తాపడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. -
మద్నూర్‌లో స్కూల్ ఆటో బోల్తా
● ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలుమద్నూర్(జుక్కల్): మద్నూర్ మండల కేంద్ర శివారులో స్కూల్ ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 12 మంది విద్యార్థులు గాయాల పాల య్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని అవాల్గావ్ గ్రామానికి చెందిన 12 మంది పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆటో లో మద్నూర్‌కు వస్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. గమనించిన వాహనదారులు బో ల్తా పడిన ఆటోను సరిచేసి గాయపడిన విద్యార్థులను మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కపిల్ (8వ తరగతి), హరి (9వ తరగతి) కాళ్లు, చేతులు విరగ్గా, అభిజిత్, సాయి లు, శివ, విష్ణుకాంత్, సాయి గణేశ్‌కు గాయాల య్యా యి. ఆటోలో ఐదుగురు విద్యార్థులు ప్రైవేటు పాఠ శాలకు, ముగ్గురు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆటో డ్రైవర్ గణపతికి ఎలాంటి గాయాలు కాలేదు. కళ్లు తిరగడంతోనే ఆటో అదుపు తప్పిందని డ్రైవర్ వాపోయాడు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, అవాల్గావ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. ఎస్సై రాజు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
మొక్కలు, చెట్లను కాపాడండి
భిక్కనూరు: ప్రభుత్వం మొక్కలను నాటాలని పదే పదే చెబుతుంటుంటే కొందరు చెట్లను మొక్కలను తమ అవసరాలకు నరుకుతున్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఎల్లమ్మ గుడి సమీపంలో ఉన్న రైతు పెద్దబచ్చగారి శ్రీధర్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్ల కొమ్మలు, పూల మొక్కలను మేకల కాపరులు మంగళవారం వేకువజామున నరికేశారు. ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇలా నరకడం సమంజసం కాదని మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మేపుకోవాలన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు మేకల కాపరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మొక్కలను నరకకుండా చూడాలని ఆయన కోరారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో మంగళవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా తహసీల్దార్ ప్రేమ్‌కుమార్.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులు పాటలు పాడి, డ్యాన్సులు చేశారు. డీటీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ బాబు, తదితరులున్నారు. బాన్సువాడ రూరల్: సంగోజీపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం మహిళలకు ఆ గ్రామ సర్పంచ్ మంద సంగమేశ్వర్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇటీవల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీ చేసింది. కాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కొంత మందికి పంపిణీ నిలిపివేశారు. పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరటంతో పంపిణీ ప్రక్రియను పునఃప్రారంభించారు. సీసీ అక్బర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గర్ల్స్ కాలేజీకి ఉత్తమ అవార్డు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని నిజామాబాద్ బాలికల కళాశాల ఉత్తమ కళాశాల అవార్డు సాధించింది. ప్రభుత్వ బాలికల కళాశాలలో వివిధ అంశాలు, ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అవార్డు వచ్చినట్లు ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ తెలిపారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కో బాలికల కాలేజీని ఎంపిక చేసి, అత్యధిక అడ్మిషన్లు, ఉత్తమ ఫలితాల సాధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఎంసెట్, నీట్ శిక్షణ నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలను పరిశీలించి అవార్డు అందజేసినట్లు చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ బాలికల కాలేజీకి హైబీజ్ టెన్ఎక్స్టీవీ ఎక్స్‌లెన్స్ అవార్డును మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, హైబీజ్ టెన్ ఎక్స్టీవీ ఉమ్మడిగా నిర్వహించిన కార్యక్రమంలో మంగళవారం మాజీ జేడీ లక్ష్మీనారాయణ, విద్యాపీఠం యాజమాన్య ప్రతినిధి ప్రీతిరెడ్డి నుంచి ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిరంతర కృషి, పట్టుదల, నిబద్ధత, విధి నిర్వహణ, కళాశాల అధ్యాపక సిబ్బంది సమష్టి కృషితోనే అవార్డు వచ్చిందన్నారు. -
ప్రకృతి రైతులు.. ఆధునిక వైద్యులు
సుభాష్‌నగర్: ప్రకృతి రైతులు లాభాల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలు పండిస్తున్నారని.. వారు ఆధునిక వైద్యులని రైతు సంక్షేమ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. మంగళవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సేంద్రియ రైతు చిన్నికృష్ణుడు అధ్యక్షతన నగరంలోని ఎన్డీసీసీబీ వైఎస్ఆర్ భవనంలో ప్రకృతి రైతుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తున్న 9 మంది ఉత్తమ రైతులను ప్రశంసాపత్రం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. అనంతరం గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. వ్యవసాయ కమిషన్ రైతుల కోసమే పని చేస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయంలో మహిళా రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పశు సంపదను పెంపొందించాలని సూచించారు. విచ్చలవిడిగా యూరియా, రసాయనిక ఎరువుల వినియోగంతోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల భూమి పంటల సాగుకు పని రాకుండా భూసారం కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, డీఏవో వీరా స్వామి, ఆత్మా పీడీ తిరుమల ప్రసాద్, ఎన్డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే, డీజీఎం లింబాద్రి, ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ జనార్దన్, సుమారు వందమంది ప్రకృతి రైతులు పాల్గొన్నారు. మితిమీరిన యూరియాను వినియోగించొద్దు రైతు సంక్షేమ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆరోగ్యకరమైన పంటలు పండించాలి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి -
ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలి
● అడ్డుకోవడానికి ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ● ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఏ ర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ ర వాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రధాన కూడళ్లలో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిజాంసాగ ర్ మండలంలోని మాగి, అచ్చంపేటలలో ఇసుక ల భ్యతపై నివేదికలు అందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ నగేష్, భూగర్భ జలశాఖ ఏడీ సతీష్ యాదవ్ పాల్గొన్నారు. ఇళ్ల మార్కవుట్ వేగవంతం చేయాలి కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లా డారు. పంచాయతీ కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరు కావాలని, విధుల్లో బాధ్యతగా వ్య వహరించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదన్నారు. కార్యదర్శుల హాజరును మండల అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కామారెడ్డి క్రైం: విద్యార్థులను పాఠశాలలకు తరలించే వాహనాల యజమానులు, డ్రైవర్లు ట్రా ఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసు, రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు పాఠశాలలకు ఎలా వస్తున్నారో ప్రధానోపాధ్యాయులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఆటోల్లో ముగ్గురికి మించి ప్ర యాణించరాదన్నారు. ఆరుగురికి మించి చిన్న పిల్లలను ఎక్కించకూడదని స్పష్టం చేశారు. వా హనాలకు చెల్లుబాటయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్, ప ర్మిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. నిర్దేశించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినా, ధ్రువపత్రాలు లేకపోయినా సంబంధిత వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, సుర క్షిత ప్రయాణంపై తగిన జాగ్రత్తలు పాటించాల ని సూచించారు. రహదారి భద్రత నియమాల అమలుపై రవాణా శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
ఫిట్ ఇండియా సైకిల్‌ర్యాలీ
కామారెడ్డి అర్బన్ : ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ మధుమోహన్ ర్యాలీని ప్రారంభించా రు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయంనుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సాగింది. ఖేలో ఇండియాలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సంస్థ చేపట్టిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న లయోలా, మాస్టర్‌మైండ్, దేవునిపల్లి హైస్కూల్, ఆర్కిడ్స్, ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులను అడిషనల్ కలెక్టర్, ని ర్వాహకులు అభినందించారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, పట్ట ణ ఎస్‌హెచ్‌వో రాజారాం, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, వ్యా యామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రమాణ స్వీకారం మాచారెడ్డి : సోమారంపేట, సోమారంపేట తండా గ్రామ పంచాయతీ పాలకవర్గాల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. దీంతో రెండు పంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచాయతీ భవనం విషయంలో రెండు గ్రామాల పాలక వర్గాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం నిర్వహించాల్సిన ఆయా పంచా యతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమా ణ స్వీకారం వాయిదా పడింది. అధికారులు ఇరు గ్రామాలవారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం ఉన్న పంచాయ తీ భవనంలో సోమారంపేట పంచాయతీ పాలకవర్గం, మహిళా సంఘం భవనంలో సోమారంపేట తండా పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడానికి ఒప్పించారు. బుధవారం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఎంపీడీవో గోపిబాబు తెలిపారు. ‘మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’ మాచారెడ్డి : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి సూచించారు. లచ్చాపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం వర్డ్ ఎన్జీవో సంస్థ సహకారంతో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ డ్రగ్స్‌కు అలవాటు పడితే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అంతేగాకుండా చదువుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మంచి స్నేహితులతో దగ్గరగా ఉండాలని, సోషల్ మీడియాను విద్య, జ్ఞాన అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. పిల్లల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, బాల కార్మిక చట్టాల గురించి ఆమె వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భవానీ, వర్డ్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ వంశి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నకిలీ నోట్ల కేసులో ఎనిమిది మంది అరెస్ట్ వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామం కేంద్రంగా బయటపడ్డ దొంగ నోట్ల కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు వర్ని ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. జలాల్పూర్ సర్పంచ్ మమత భర్త బాలుతోపాటు అతడి తమ్ము డు నరేడ్ల శంకర్, అఫంధి ఫారమ్‌కు చెందిన పాల్త్య కళ్యాణ్, చందూర్ గ్రామానికి చెందిన సటోజీ గోపాల్, రమేష్, మహాదేవ్ , ఇల్తేమ్ రవి, రవికుమార్ రెడ్డిలను అరెస్టు చేశామ న్నారు. వారి వద్ద నుంచి రూ. 9.86 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామ న్నారు. రెండు ప్రింటర్లు, ఒక ల్యాబ్ టాప్, 8 ఫోన్లు, ఒక కార్‌ను సీజ్ చేశామన్నారు. నిందితులను దొంగ నోట్ల తయారీ, పంపిణీకి సంబంధించి కేసులో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
కొలువుదీరిన పల్లె పాలకులు
● బాధ్యతలు స్వీకరించిన పంచాయతీ పాలకవర్గాలు ● పలుచోట్ల వాయిదాసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఏడెనిమిది పంచాయతీల్లో మినహా మిగిలిన అన్నిచోట్ల బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో 532 పంచాయతీలు ఉన్నాయి. ఈనెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో ఆయా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలుత ఈనెల 20 నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అమావాస్య కారణంగా 22 వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం జిల్లాలోని ఆయా పంచాయతీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారుల ఆధ్వర్యంలో చేపట్టారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులందరూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సభలు, సమావేశాలు జరిగాయి. బాన్సువాడ మండలంలో మూడుచోట్ల.. బాన్సువాడ రూరల్ : సోమ్లానాయక్ తండాలో సర్పంచ్ మీరిబాయి అత్త, ఇబ్రాహీంపేట్ తండాలో వార్డు సభ్యుడి కుటుంబ సభ్యుడు మృతిచెందడంతో ఆయా పంచాయతీలలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు. దేశాయిపేట్‌లో వ్యక్తిగత కారణాలతో సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి బుధవారానికి వాయిదా వేసుకున్నారు. కాగా ఇక్కడ నలుగురు వార్డు సభ్యులు మాత్రం ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్‌తోపాటు మిగిలిన వార్డుమెంబర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ప్రమా ణ స్వీకారం నిలిచిపోయింది. ఎల్లారెడ్డి మండ లం సోమార్‌పేట్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశా రు. మాచారెడ్డి మండలం సోమారంపేట, సో మారంపేట తండా పంచాయతీల పాలకవర్గాలు పంచాయతీ భవనం కోసం ఘర్షణ పడడంతో రెండు గ్రామాలలో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మహ్మద్‌నగర్ మండలం గున్కుల్ గ్రామ సర్పంచ్ రమేశ్‌యాదవ్ అయ్యప్ప మాల విరమణ కోసం శబరిమల వెళ్లడంతో అక్కడ ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. -
బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ప్రారంభం
కామారెడ్డి క్రైం: జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో పిల్లలకు పాలు ఇవ్వడంలో తల్లులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ప్రతి బస్టాండ్, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.5 లక్షల ఎకరాల్లో..
నిజాంసాగర్: జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా ఉన్నాయి. ప్రాజెక్టులే కాకుండా చెరువులు, కుంటల్లోనూ నీరుండడంతో యాసంగికి రైతులు ఆశావహ దృక్పథంతో సన్నద్ధమవుతున్నారు. వర్షాకాలంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వరదలతో జలాశయాలన్నీ నిండుకుండలుగా మారాయి. నిజాంసాగర్, కౌలాస్, పోచారం ప్రాజెక్టులు, సింగితం రిజర్వాయర్ ఇప్పటికీ దాదాపు నిండుగా ఉన్నాయి. చెరువులు, కుంటలు కూడా కళకళలాడుతున్నాయి. సాగు నీరు పుష్కలంగా ఉండడంతో ఆయకట్టు కింద పంటల సాగుకు రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకొని వరినాట్లకు ముందుకు వెళ్తున్నారు. చెరువుల కింద 90 వేల ఎకరాల్లో... జిల్లాలో 1,515 చెరువులు, కుంటలు ఉండగా 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ప్రధాన చెరువులు, కుంటల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఆయా చెరువుల కింద ఇప్పటికే నారుమళ్లు పోసిన రైతులు.. నాట్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ కింద 460 ఎకరాల్లో పంటల సాగవనున్నాయి. రిజర్వాయర్ కుడి, ఎడమ పంట కాలువలకు నీటి విడుదల చేపట్టడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.ఉమ్మడి జిల్లా వరదప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవనున్నాయి. ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు, వరినాట్ల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలీసాగర్ రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటరి 49 వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని ప్రధాన కాలువ ద్వారా అందిస్తున్నారు. వారం రోజుల నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, కోటగిరి, నవీపేట్, బోధన్ ప్రాంతాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి. మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు వరి సాగుకు నారుమళ్లును సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు వరినాట్లు వేయనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 17.8 టీఎంసీల నీరుంది. 7 విడతల్లో 12 టీఎంసీల నీటిని ఆయకట్టుకు విడుదల చేయనున్నారు.జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.237 టీఎంసీలతో కళకళలాడుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 9 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు కింద పంటల సాగు కోసం ప్రాజెక్టు నుంచి పంట కాలువలకు నీటి విడుదల చేపడుతున్నారు. రైతులు నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు కార్యాలయాలు
● కామారెడ్డి జిల్లా కేంద్రంలో సఖి, భరోసా కేంద్రాలు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే ఉంది. జిల్లా కేంద్రంలో సగానికిపైగా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ● బాన్సువాడ డివిజన్ కేంద్రంలో పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయం అద్దె భవనంలో ఉంది. ఇక్కడ సొంత భవనం నిర్మిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్, కార్మిక శాఖ కార్యాలయాలకూ అద్దె భవనాలే దిక్కయ్యాయి. ● ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఎకై ్సజ్ శాఖ, విద్యుత్ శాఖల డివిజనల్ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయాన్ని ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి మార్చారు. సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ● బిచ్కుందలో ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఆదాయం తెచ్చిపెట్టే శాఖలే అయినా సొంత భవనాలకు నిధులు రాకపోవడంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ● బీబీపేటలో ఐకేపీ కార్యాలయం అద్దె భవనంలో ఉంది. ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. అయితే ఎంపీడీవో కార్యాలయం ఎమ్మార్సీ భవనంలో, తహసీల్ కార్యాలయం సొసైటీ భవనంలో కొనసాగుతోంది. ● నస్రుల్లాబాద్‌లో ఐకేపీ కార్యాలయానికి సొంత భవనం లేదు. ● దోమకొండ మండల కేంద్రంలో ఎకై ్సజ్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. -
కార్యాలయానికి చోటేదీ?
కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. దీంతో చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడంతో అరకొర సౌకర్యాల మధ్య ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయ భవనంలోనో.. అద్దె భవనంలోనో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల నిధులు మంజూరైనా పనులు పూర్తి కాకపోవడంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్, ఎకై ్సజ్, విద్యుత్ శాఖల కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల ఇతర శాఖల భవనాల్లో కొనసాగుతున్నాయి. చాలావరకు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. పంచాయతీ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు లేకపోవడంతో అద్దె ఇళ్లలోనే నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన పాల్వంచ, డోంగ్లీ, మహ్మద్‌నగర్, బీబీపేట, రామారెడ్డి, పెద్దకొడప్గల్ తదితర మండలాల్లో తహసీల్, మండల పరిషత్ కార్యాలయాలను ఇతర శాఖలకు చెందిన భవనాల్లో ఏర్పాటు చేశారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్వంచ, డోంగ్లీ మండలాల్లో తహసీల్ కార్యాలయాలను రైతు వేదికల్లో నిర్వహిస్తుండడంతో వ్యవసాయ శాఖ ఏవోలు, ఏఈవోలకు కార్యాలయాలు లేకుండాపోయాయి. పాల్వంచ మండల కేంద్రంలో మండల పరిషత్ కా ర్యాలయాన్ని గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం కార్యాలయాలన్నింటినీ ప్రభుత్వ భవనాల్లోకి షిఫ్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయా శాఖల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు కార్యాలయాలను ఎక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై తలలు పట్టుకుంటున్నారు. ఆయా కార్యాలయాలకు అనువైన ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. అద్దె భవనాల్లో ఉండొద్దన్న సర్కారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి వెంటనే మార్చాలని ఆదేశాలు సొంత భవనాలు లేక ఇబ్బందులు ఇప్పటికిప్పుడు మార్చడం సవాలే అంటున్న అధికారులు -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారు నగలు, రూ. 30వేల నగదు అపహరణ నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని అయిలాపూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన బత్తుల పోశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లాడు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వారి ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. పోశెట్టి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా సామాను చిందరవందరగా పడేసి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లోని 5 తులాల బంగారు నగలు, రూ.30వేల నగదును చోరీ చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు. డిచ్‌పల్లిలో పట్టపగలే.. డిచ్పల్లి: మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదు రుగా ఉన్న ఎస్బీఐ మినీ బ్యాంకులో సోమవారం పట్టపగలే చోరీ జరగడం స్థానికంగా కలకలం రే పింది. బాధితులు, డిచ్ పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపిన వివరాలు ఇలా.. డిచ్పల్లి బస్టాండ్ ఎదురుగా రాజు అనే వ్యక్తి ఎస్బీఐ మినీ బ్యాంకు నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్నాహ్యం షాపు గ్లాస్ డోర్‌కు తాళం వేసి భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికీ ఓ కస్టమర్ అతడికి ఫోన్ చేసి షాపు తెరిచి ఉందని ఎక్కడ ఉన్నావని అడిగాడు. దీంతో తాను తాళం వేసి వస్తే డోర్ ఎలా తెరిచి ఉంటుందని ఆందోళన చెందిన వెంటనే బైక్‌పై షాపు వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లి చూడగా టేబుల్ డ్రాలో ఉన్న రూ.60వేలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా నెత్తిన టోపి ధరించిన గుర్తు తెలియని దుండగుడు పెద్ద స్క్రూడ్రైవర్‌తో గ్లాస్ డోర్‌ను తెరిచి లోనికి వచ్చాడు. అదే స్క్రూడ్రైవర్‌తో టేబుల్ డ్రాను తెరిచి, అందులోని రూ.60వేలను అపహరించాడు. సమీపంలోని దుకాణం ముందర బైక్‌పై ఒక యువకుడు వేచి ఉండగా, మరొక యువకుడు లోనికి వచ్చి ఈ చోరీకి పాల్పడి వెంటనే అదే బైక్‌పై పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లమ్మ ఆలయంలో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో గల ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. సాంంకేతిక ఆధారాల సహాయంతో అనుమానితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చోరీకి ఉపయోగించిన గడ్డపార, దొంగిలించబడ్డ గల్లాపెట్టె, ఆటో, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడినది గాంధారి వాసి అయినా ర్యాకం సాయిలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వాసి జూలపాల రాములుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు. -
నారుమడులపై చలిప్రభావం
బీబీపేట: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలను వ్యవసాయాధికారులు రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే నారు సరిగ్గా ఎదగక, ఎర్రబడి కొన్నిసార్లు చనిపోతుందని వారు తెలుపుతున్నారు. యాసంగిలో వరి సాగు చేసే రైతులు నారుమడి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరి మొలకెత్తటానికి 25–45 డిగ్రీల సెల్సియస్, మొక్కల ఎదుగుదలకు 25–35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండడం మంచిదని, జిల్లాల్లో వారం రోజుల నుంచి 45 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు అవుతోంది. దీంతో భూమిలోని పోషకాలు మొక్కకు అందక ఆకులు పసుపు రంగుగా మారి ఆ తర్వాత ఎండిపోతాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో వరినారు ఎదగని పరిస్థితుల్లో రైతులు చేస్తున్న పలు రకాల మందుల పిచికారీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. నారు ఎర్రబడటం, తెగుళ్లు ఆశించడం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగితే మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. నారుమడి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. ● చలికి నారు దెబ్బతినకుండా నారుమడికి సాయంత్రం నీటిని ఎక్కువగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్తనీరు పెట్టాలి. ● అధిక చలితో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. జింకు లోపం.. ● చలి ఎక్కువగా ఉన్నప్పుడు జింక్ లోపం కనిపిస్తుంది. ● ముదురాకు చివర్లలో, మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. క్రమేపి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. అలాగే ఆకు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ● మొక్కలు గిడసబారతాయి. నత్రజని ఎరువులు వేసినప్పటికీ నారుమడి పచ్చబడదు. చలి తీవ్రతకు నారుమడులు కొద్దిగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే పలు నారుమడుల్లో జింకు లోపం గుర్తించామన్నారు. నివారణకు రైతులకు మందులు పిచికారి ఎలా చేయాలో సలహాలు ఇస్తున్నాం. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుంటే తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. నివారణ జింకు సల్ఫేట్ 2 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. సొంతంగా ఎలాంటి మందులు పిచికారి చేయకూడదు. – రాఘవేంద్ర, ఏఈవో బీబీపేట చలి తీవ్రతకు ఎదగని నారు రెండు సార్లు వడ్లను పోస్తున్న రైతులు వాతావరణంలో మార్పులే కారణమంటున్న వ్యవసాయాధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచన -
పంటల రక్షణ కోసం పాత చీరలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రబీ సీజన్లో వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు పాత చీరలను వాడుతున్నారు. చేతికి వచ్చిన పంటలను అడవి జంతువులు దాడి చేసి చేసి ధ్వంసం చేస్తాయనే భయంతో ముందు జాగ్రత్తగా పంటల చుట్టూ పాత చీరలను కడుతున్నారు. బిర్నీస్, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు పంటల్లోకి కోతులు, అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గత్యంతరం లేక ఉన్న పంటలను ఎలాగైనా కాపాడుకుందామని కామారెడ్డితో పాటు తదితర ప్రాంతాలలో జరిగే సంతలకు వెళ్లి పాత చీరలను కొనుగోలు చేసి, పంటల చుట్టూ కడుతున్నారు. -
సర్పంచ్ వేతనం మందిరానికి విరాళం
బాన్సువాడ రూరల్: మండలంలోని సంగోజీపేట్ గ్రామ సర్పంచ్‌గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన మంద సంగమేశ్వర్ తనకు వచ్చే గౌరవ వేతనాన్ని గ్రామంలోని హనుమాన్ మందిరానికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నెలనెలా వచ్చే వేతనాన్ని హనుమాన్ మందిరంలో ధూపదీప నైవేద్యాలకు వినియోగించాలని గ్రామస్తులకు సూచించారు. నెలకు రూ.6500 ,చొప్పున 5ఏళ్లలో రూ. 3.90లక్షలు ఆలయానికి సమకూర్చుతున్నట్లు సంతకం చేసిన వాంగ్మూళ పత్రాన్ని గ్రామస్తులకు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్హరినాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): నిజామాబాద్ నగరంలో నిర్వహించిన క్రీడల్లో లింగంపేట మండల కేంద్రానికి చెందిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్ బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట్రాములు తెలిపారు. 13 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయిలో ఆడనున్నట్లు తెలిపారు. అలాగే మార్చ్ఫాస్ట్లో తృతీయ స్థానం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయుడు రవీందర్‌సింగ్‌లను పాఠశాల సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్త రామ్‌గోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: మున్సిపల్ కార్మికుడు తన నిజాయితీని చాటుకున్నాడు. పొరపాటున తన ఖాతాలో జమైన నగదును వెతికి పట్టుకుని మరీ బాధితుడికి అందించి మానవత్వాన్ని చాటాడు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం చైన్నె గ్రామానికి చెందిన నవీన్‌బాబు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఆయన పొరపాటున రూ. 9వేలను ఫోన్‌పే ద్వారా కామారెడ్డి మున్సిపల్లో వాటర్‌వర్క్స్‌లో పని చేస్తున్న కార్మిక సంఘ నాయకుడు నర్సింగ్‌రావు ఖాతాకు పంపించారు. తన ఖాతాలో జమైనట్లు గమనించిన నర్సింగ్‌రావు వెంటనే సదరు ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి నవీన్‌బాబు ఇంటికి వెళ్లి మరీ తన వద్ద ఉన్న రూ. 9వేలను తిరిగి అందజేశా రు.దీంతో నర్సింగ్‌రావుకు నవీన్‌బాబు, ఆయ న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పిట్లం(జుక్కల్): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల అధ్యక్షుడిగా సన్నపుల కృష్ణను, పట్టణ అధ్యక్షులుగా గుర్రపు బాలరాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియమక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేత, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి రాజేందర్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి మహేశ్ బాబు, కామారెడ్డి టౌన్ మహిళా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రం గోపన్‌పల్లి చౌరస్తా వద్ద గల అయ్యప్ప ఆలయంలో సోమవారం సామూహిక మండల పడిపూజ వైభవంగా నిర్వహించారు. బండయప్ప మఠం పీఠాధిపతి సోమయప్ప స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ స్వాములు ఉత్సవ విగ్రహాలతో ర్యాలీ నిర్వహించారు. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
క్రైం కార్నర్పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన ఓ రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాయు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. గుత్ప గ్రామానికి చెందిన బాషెట్టి భూమేశ్వర్(54) అనే రైతు సోమవారం గగ్గుపల్లి గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ బోరు బావి మోటార్‌ను స్టార్ట్ చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యడు. తీవ్ర అస్వస్థతకు గురైన భూమేష్వర్ను స్థానికులు గుర్తించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. వేల్పూర్ మండలంలో.. వేల్పూర్: వేల్పూర్ మండలం అమీనాపూర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు మృతిచెందాడు. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. లక్కోర గ్రామానికి చెందిన అబ్బాని భూమన్న(52) గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు తన టీవీఎస్ మోపెడ్‌పై సోమవారం భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామంలో ఉన్న కూతురు వద్దకు బయలుదేరాడు. అమీనాపూర్ సమీపంలో మూలమలుపువద్ద వేల్పూర్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న ఆటో అతివేగంగా వచ్చి భూమన్నను ఢీకొట్టింది. ఈ ఘటనలో భూమన్న తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ని మండలంలో.. వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో చేపల వేటకని వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. వర్ని ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన నాగని ప్రవీణ్ (29) సోమవారం ఉదయం ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చెరువులోకి దిగిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. రామారెడ్డి (ఎల్లారెడ్డి): ఇటీవల ఆత్మహత్యకు యత్నించి న ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. రా మారెడ్డి మండలం పోసానిపే ట గ్రామానికి చెందిన కనుగందుల నవీన్ (23) వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. రైలు సమీపించగానే భయంతో ప క్కకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆలస్యం కా వడంతో రైలు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. ఆలూర్ మండలంలో కరెంట్ షాక్‌తో రైతు ప్రాణాలు కోల్పోయాడు. వేల్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు, వర్ని మండలంలో చేపలవేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మహిళలు, పురుషుల జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా కబడ్డీ అసో సియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో 72వ జిల్లా స్థాయి మహిళ, పురుష కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించి 32 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25 నుంచి 28వరకు కరీంనగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి 72వ సీనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల అభినందన నిర్వహించగా జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్, టీఎస్ పేటా జిల్లా ప్రధానకార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, డెయిరీ కళాశాల అసిస్టెంట్ ప్రోఫెసర్ ఉమాపతి, వ్యాయామ ఉపాధ్యాయులు, అసోసియేషన్ ప్రతినిధులు వెంకటి, అనిల్‌కుమార్, జగదీష్, నవీన్‌కుమార్, రేణుక, విజయలక్ష్మి, అరుణ, రమ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ తీరును నిరసిస్తూ ధర్నా
పిట్లం(జుక్కల్): పిట్లం – బాన్సువాడ రోడ్డు విస్తరణలో భాగంగా మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో నర్సరీ వద్ద రోడ్డు పనులను అటవీశాఖ అధికారులు నిలిపివేయడంతో సోమవారం గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పనులు నిలిపి వేసిన స్థలానికి చేరుకొని ఫారెస్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రజల కోసం రోడ్డు వెడల్పు పనులను చేపడితే, అధికారులు పనులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. దీంతో అటవీశాఖ అధికారులు ఈ రోడ్డు విస్తరణ చేయడానికి వీలులేదని, ఈస్థలం అటవీ శాఖ పరిధిలో ఉందని అందుకే ఆపివేశామని చెప్పడంతో ప్రజలు ఆగ్రహించారు. సింగిల్ రోడ్డుకు ఎందుకు అనుమతిని ఇచ్చారని, ఇప్పుడు రోడ్డు విస్తరణ చేస్తే ఏం నష్టం జరుగుతుందని ప్రశ్నించారు. అధికారులు తీరును నిరసిస్తూ రోడ్డుకు అడ్డుగా వాహనాలను పెట్టి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 60 ఫిర్యాదులు కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఎ ప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సో మవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 60 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజలు త మ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రతి సోమ వారం కలెక్టరేట్‌కు వస్తుంటారన్నారు. ఆయా శాఖ ల అధికారులు వచ్చిన ఫిర్యాదులను విచారించి వీలైనంత త్వరగా పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకూడదని ఆదేశించారు. ఎ న్నికల కోడ్ ముగిసిందని,యధావిధిగా ప్రజావా ణి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందన్నా రు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈఓ చందర్ నాయక్, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● విపత్తులపై జిల్లాకేంద్రంలో మాక్ డ్రిల్కామారెడ్డి అర్బన్: వరదలు, విపత్తులు, ప్రమాదాలు ఏ సమయంలో వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ, హోంశాఖ సహకారంతో కామారెడ్డి పెద్ద చెరువు గంగమ్మ గుడి వద్ద విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలను అప్రమత్తం చేసే ఈవోసీ సందేశాలు, సైరన్లు, ప్రజలను హెచ్చరించడం, వైర్లెస్ సేవలువంటి ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థలను పరీక్షించారు. ప్రాథమిక నష్టం అంచనాలు వేయడం, అధిక ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు, డ్రోన్ ద్వారా సేవలు అందించడం, ఎన్సీసీ, హోంగార్డు, వలంటీర్ల సేవల కోసం సామాజిక ఆధారిత ప్రతిస్పందన వ్యవస్థను సక్రియం చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, పల శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఓటరు మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను జనవరి 13 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి బూత్‌ల వారీగా సమీక్షించారు. తహసీల్దార్లతో మాట్లాడి మండలాల వారీగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతిని తెలుసుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఓటరు జాబితాలో స్పష్టంగా లేని ఫొటోలను గుర్తించాలన్నారు. ఫారం– 8 ద్వారా అసలైన ఫొటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, అధికారులు పాల్గొన్నారు. -
రెండూళ్ల ‘పంచాయతీ’
● ఒకే పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారానికి ఇరు గ్రామాల పట్టు ● ఇరు వర్గాల మధ్య వాగ్వాదం.. ● ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదామాచారెడ్డి : సోమారంపేట, సోమారంపేట తండా పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ భవన వివాదంతో నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి. సోమారంపేట గ్రామంలో నూతన పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో సోమారంపేట గ్రామం నుంచి విడిపోయిన సోమారంపేట తండా పంచాయతీ పాలక వర్గం తాము కూడా సోమారంపేట పంచాయతీ భవనంలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని పట్టుబట్టారు. దీనికి సోమారంపేటవాసులు ఒప్పుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమారంపేట పంచాయతీ కార్యాలయంతో పాటు పలు ఇళ్లు సోమారంపేట తండా గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చాయని, పంచాయతీ కార్యాలయంలో తమకు హక్కు ఉంటుందని సోమారంపేట తండా పాలకవర్గం, తండా వాసులు భీష్మించుకుని కూర్చున్నారు. ఎంపీడీవో గోపిబాబు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, పోలీస్ కంట్రోల్ రూం ఎస్సై నరేశ్, కామారెడ్డి పట్టణ, రామారెడ్డి ఎస్సైలు శ్రీరాం, రాజశేఖర్ అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీవో, పోలీసులు కలిసి సోమారంపేట, సోమారంపేట తండా పంచాయతీల పాలక వర్గాలకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయిస్తామని చెప్పడంతో సోమారంపేట తండా పాలక వర్గం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుంది. సోమారంపేట పాలక వర్గం రాకపోవడంతో, వారు వస్తేనే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని తండా పాలకవర్గం అక్కడి నుంచి వెనుదిరిగింది. దీంతో రెండు పంచాయతీల పాలకవర్గాల ప్రమాణా స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీవో ప్రకటించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. -
‘పరిషత్ ఎన్నికలలోనూ సత్తా చాటుదాం’
నిజాంసాగర్: పంచాయతీ ఎన్నికల మాదిరిగానే రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనూ సత్తా చాటాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం మహమ్మద్‌నగర్ మండలం తుంకిపల్లి గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో విజయాలు సాధించామన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డీఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తుంకిపల్లి సర్పంచ్ రాములు, నాయకులు ప్రజా పండరి, లోక్యానాయక్, కృష్ణ, శంకర్, గోపిసింగ్ తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి/కామారెడ్డి టౌన్: మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న తగిరంచ శ్రావ్య హాకీ రాష్ట్ర జట్టుకు ఎంపికై ంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ చూపడంతో ఆమెను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్ యాకినుద్దీన్ తెలిపారు. జనవరి 2 నుంచి 7 వరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందని పేర్కొన్నారు. ఆమెను జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు నీలం లింగం, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి మధుసూదన్‌రెడ్డి, కళాశాల స్పోర్ట్స్ ఇన్చార్జి నీలం నర్సింలు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. మాచారెడ్డి: మర్రితండాలో సోమవారం ఓ దూడపై అడవి జంతువులు దాడి చేసి కొరికి చంపాయి. అయితే పెద్దపులి లేదా చిరుత దాడిగా గ్రామస్తులు అనుమానించారు. అటవీశాఖ మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దూడపై దాడి చేసింది పులి కాని, చిరుత కాని కాదని పేర్కొన్నారు. ఏదో అడవి జంతువులు దాడిచేయడం వల్లే దూడ మృతిచెంది ఉంటుందన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పిట్లం(జుక్కల్)/భిక్కనూరు/పెర్కిట్/కామారెడ్డి అర్బన్: పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం 1992–95 బ్యాచ్ చెందిన 8, 9, 10వ తరగతుల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత విద్యార్థులంతా మళ్లీ ఒకేచోట చేరడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యా యంగా పలకరించుకొని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను సన్మానించారు. అలాగే భిక్కనూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1989–90 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కామారెడ్డి మండలం గర్గుల్ జెడ్పీహెచ్ఎ స్లో 2009–10 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఆర్మూర్‌లోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 1997–2000 బ్యాచ్ డిగ్రీ వి ద్యార్థులు సైతం ఆత్మీయసమ్మేళనంనిర్వహించారు. -
క్రైం కార్నర్
మాక్లూర్: మండలంలోని చిన్నాపూర్ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. చిన్నాపూర్ గ్రామానికి చెందిన ఆర్మూర్ స్నేహ (24)అనే వివాహిత కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈక్రమంలో ఆమె జీవితంపై విరక్తి చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్థానికులు గమనించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే భర్త ఘటన స్థలానికి చేరుకొని, అపస్మారక స్థితిలో ఉన్న భార్యను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి భర్త సుమన్, మూడేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలోగల ఎర్రకుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామంలోని చెరువులో ఆదివారం వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడు 5అడుగుల 4 అంగులాల ఎత్తు ఉన్నాడని, తెలుపునలుపు వెంట్రుకలు ఉన్నాయని, నలుపురంగు ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కల్వరాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ చూపినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్థన్ రెడ్డి ఆదివారం తెలిపారు. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన జిజ్ఞాసలో కల్వరాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన కె.ప్రసన్న, జె. స్నేహలు ప్రతిభ చూపినట్లు తెలిపారు. వీరికి గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయురాలు శైలజను అభినందించారు. వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే ఫార్మర్ ఫ్రెండ్లీ ఫర్టిలైజర్ పరికరాన్ని రూపొందించి ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచి బెంగుళూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులకు రూ.4 వేల నగదు పురస్కారం, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు. అబాకస్ జిల్లా స్థాయి పోటీలు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అబాకస్, వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలను ఆదివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 పాఠశాలల నుంచి 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చాటిన 36 మందిని విజేతలుగా ఎంపిక చేశామని జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని విశ్వం ఎడ్యుటెక్ ప్రతినిధి వినాయక్ తెలిపారు. విజేతలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ బాలాజీరావు, ప్రతినిధులు పాల్గొన్నారు. బ్లూబెల్స్ విద్యార్థుల ప్రతిభ పిట్లం(జుక్కల్) జిల్లా కేంద్రంలో ఆదివారం విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో పిట్లం బ్లూబెల్స్ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ సంజీవరెడ్డి.. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. బిచ్కుంద నుంచి.. బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని సద్గురు బండాయప్ప స్వామి స్కూల్ విద్యార్థులు విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ మేనేజ్మెంట్ ఇన్చార్జి సంతోష్ అప్ప తెలిపారు. జూనియర్, సీనియర్ చాంపియన్‌కు అభిశ్రీ , అంజలి ఎంపికయ్యారని అన్నారు. -
ఆన్లైన్లో యూరియా బుకింగ్!
యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కృత్రిమ కొరతను నివారించేందుకు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే యాసంగి సీజన్లో యూరియా అందించనుంది. – నాగిరెడ్డిపేట● నేటినుంచి అందుబాటులోకి ‘ఫెర్టిలైజర్’ యాప్ ● యూరియా కృత్రిమ కొరతను నివారించేందుకు చర్యలుజిల్లాలో గత సీజన్లో యూరియా కొరత ఏర్పడింది. సరిపడా సరఫరా కాకపోవడంతో బస్తా ఎరువుకోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. వ్యాపారులు యూరియా బస్తాలను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, రైతులు విచ్చలవిడిగా వాడుతుండడం వంటి కారణాలతో దాదాపు ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ప్రవేశపెడుతుంది. ఈ యాప్ ద్వారా రైతులు యూరియాను తమ మొబైల్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. నాన్ పైలట్ జిల్లాగా ఎంపికై న కామారెడ్డిలో సోమవారం నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఆన్లైన్ బుకింగ్ సౌలభ్యం వల్ల యూరియా పంపిణీలో పారదర్శకత పెరగడంతోపాటు కొరత ఏర్పడకుండా ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అలాగే డీలర్ వద్ద ఎంత యూరియా నిల్వ ఉందనే విషయం కూడా స్పష్టంగా తెలియనుంది. దీంతోపాటు రైతులకు గంటల తరబడి పడికాపులు కాసే అవస్థ తప్పుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఈ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా రైతులు 4.04 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గతంలో రైతులు తాను వేసిన పంటసాగుకు అవసరమైన యూరియా మొత్తాన్ని ఒకేసారి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం యాప్ ద్వారా రైతు విడతలవారీగా మాత్రమే యూరియాను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎకరా భూమి ఉన్న రైతుకు 3 బస్తాల యూరియాను ఒకే విడతలో, ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతుకు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాలలోపు భూమి ఉన్న రైతు మూడు విడతల్లో, 20 ఎకరాలపైన భూమి ఉన్న రైతు నాలుగు విడతల్లో యూరియాను బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో సంబంధిత రైతు తనకున్న సాగుభూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్ నంబర్‌ను నమోదు చేస్తేనే యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్‌లో ప ట్టా పాస్‌బుక్ నంబర్‌ను నమోదు చేయగానే పాస్బుక్కు లింకై ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వ స్తుంది. ఓటీపీని యాప్‌లో ఎంట్రీ చేయగానే మండలంలో ఏ డీలర్ వద్ద ఎంత యూరియా నిల్వ ఉందనే వివరాలతోపాటు సదరు రైతుకు ఉన్న భూమి విస్తీర్ణం, సాగుచేస్తున్న పంట వివరాలు కనిపిస్తాయి. దీంతో రైతు తనకు అనువుగా ఉన్న డీలర్ వద్ద యూరియాను బుక్ చేసుకోవచ్చు. కాగా ముందుగా బుక్ చేసిన యూరియాను రైతు తీసుకోకపోతే 24 గంటల్లో బుకింగ్ రద్దయి రైతు బుక్ చేసిన యూరియా బస్తాలు తిరిగి ఓపెనింగ్ బ్యాలెన్స్‌లోకి వెళ్లిపోతాయి.గత సీజన్లో యూరియా కోసం రైతులు అక్కడక్కడ ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మొబైల్ యాప్‌ను తీసుకువచ్చింది. సోమవారంనుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. కొత్త విధానంలో యూరియా పక్కదారి పట్టే అవకాశాలు ఉండవు. – సాయికిరణ్, ఏవో, నాగిరెడ్డిపేట -
దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వం
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను పూర్తిగా విస్మరిస్తోందని విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిప్ప దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పెన్షన్ పెంపు, ఉచిత రవాణా సౌకర్యం, ఉద్యోగాల భర్తీ తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఈశ్వర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శంకర్ ఆత్మ కథనం ‘కుంచె గీసిన బతుకు చిత్రం’ పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ, సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, తెరసం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని సాహితీ అభిమానులు విజయవంతం చేయాలని తెరసం ప్రతినిధులు కోరారు. భిక్కనూరు: వరంగల్‌లో జరుగనున్న ఏబీవీపీ సమ్మేళనానికి వెళ్తున్న విద్యార్థుల వాహనాలను సౌత్ క్యాంపస్ వద్ద శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పచ్చజెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు జాతీయభావంతో మెలగాలని, ఉన్నతంగా చదివి విశ్వవిద్యాలయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకరావాలని సూచించారు. జిల్లా సంఘటన బాధ్యుడు హర్షవర్దన్, ఏబీవీపీ నేతలు అనిల్‌రెడ్డి, స్వామి, శివ, డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్, ప్రతినిధి నరేందర్ ఉన్నారు. కామారెడ్డి అర్బన్: ఉద్యోగ విరమణ పొందిన వెంటనే రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఏక మొత్తంలో చెల్లించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈనెల 24న కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ విషయమై స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రెడ్డి, విజయరామరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 22న గురుకుల ప్రవేశ పరీక్ష మోపాల్(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2026ను ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు డీసీవో విజయలలిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకులాల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులకు 2026 జనవరి 21 చివరి తేదీ అని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫారాలు, క్రీడా సామగ్రితోపాటు ఐఐటీ, నీట్, సీయూ, ఈటీ వంటి జాతీయస్థాయి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, మెరిట్, రిజర్వేషన్ నిబంధన ప్రకారం ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయలలిత కోరారు.


