మున్సిపల్‌ పీఠం బీజేపీదే | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ పీఠం బీజేపీదే

Feb 10 2026 7:25 AM | Updated on Feb 10 2026 7:25 AM

మున్సిపల్‌ పీఠం బీజేపీదే

మున్సిపల్‌ పీఠం బీజేపీదే

17న బీసీ స్టడీ సర్కిల్‌లో అవగాహన సదస్సు

ఎమ్మెల్యే కేవీఆర్‌

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ఈ ర్యాలీలో జై బీజేపీ.. జై జై బీజేపీ నినాదాలు మిన్నంటాయి. అభ్యర్థులతో కలిిసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజాంసాగర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా మున్సిపల్‌ పీఠం బీజేపీ కై వసం చేసుకుంటుందని అన్నారు. కామారెడ్డి అభివృద్ధి, అవినీతి రహిత పాలన కోసం కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల బీసీ విద్యార్థులకు విదేశాల్లోని అత్యున్నత విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య అందించడానికి ఈ నెల 17న నిజామాబాద్‌ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16లోగా నేరుగా నిజామాబాద్‌ సుభాష్‌నగర్‌లోని స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08462–241055 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.

అత్తగారింటికి వెళ్తూ..

అనంత లోకాలకు

నస్రుల్లాబాద్‌: నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు ఇలా.. అంకోల్‌ గ్రామానికి చెందిన పసుపుల సాయిలు(28) సోమవారం భార్య మనీషా, ఏడాది వయస్సు గల కొడుకుతో కలిసి బైక్‌పై బోధన్‌లోని అత్తగారి ఇంటికి బయలుదేరారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండల కేంద్రం వద్ద వారి బైక్‌ను బోధన్‌ నుంచి వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యను అత్తగారింటిలో దింపి,అతడు కరీంనగర్‌లో బతుకు దెరువు కో సం పని చూసుకొని వస్తానని పేర్కొన్నట్లు సమా చారం.కానీ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement