చెరువులో ఒకరి మృతదేహం లభ్యం
బీబీపేట: రెండు రోజుల క్రితం చెరువులో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతవగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ విజయ్ తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట గ్రామానికి చెందిన మద్దూరి దేవరాజు (40) చాకలి వృత్తి నిర్వహిస్తుండేవాడు. బుధవారం ఎప్పటిలాగే బట్టలు ఉతికిన తర్వాత స్నానానికి చెరువులోకి దిగాడు. ఈదుకుంటూ కొంత దూరం వెళ్లిన తర్వాత నీటిలో మునిగి పోయాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా రెండు రోజుల నుంచి గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం దేవరాజు మృతదేహం నీటిపైకి తేలింది. వెంటనే పోలీసులు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


