సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


