రీకౌంటింగ్‌లో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

రీకౌంటింగ్‌లో గందరగోళం

Feb 14 2026 9:28 AM | Updated on Feb 14 2026 9:28 AM

రీకౌం

రీకౌంటింగ్‌లో గందరగోళం

సరితలు ఓడిపోయారు... శ్వేతలు గెలిచారు చైర్మన్‌ అభ్యర్థులకు షాక్‌

చైర్మన్‌ అభ్యర్థులకు షాక్‌

మహబూబ్‌నగర్‌లో మేయర్‌ పదవి..

దేవరకద్ర కాంగ్రెస్‌ చేతిలోకి..
సరితలు ఓడిపోయారు... శ్వేతలు గెలిచారు
ప్రజాతీర్పు మా పాలనకు నిదర్శనం

అమరచింత మున్సిపాలిటీ

దేవరకద్ర: మున్సిపాటిటీ ఎన్నికల ఫలితాలు ముందుగా హంగ్‌గా భావించినప్పటికీ స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్‌ వశమైంది. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా అందులో 6 వార్డుల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. మెజార్టీ స్థానాలు 7 రావాల్సి ఉంది. అయితే ఎవరికి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో హంగ్‌ అవుతుందని అందరూ భావించారు. ఒక అభ్యర్థి కలిస్తే కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చే అవకాశం ఉండడంతో స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్‌లోకి రావాలని మండల నాయకులు చర్చలు సాగించారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన చంద్రమౌళి అరుణకు టికెట్‌ దక్కక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. గెలిచిన తరువాత కాంగ్రెస్‌లోకి రావాలని అందరూ బుజ్జగింపులు చేశారు. చివరకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అరుణ భర్త చంద్రమౌళితో చర్చించగా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. దీంతో దేవరకద్ర హంగ్‌ తొలగి కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలోకి చేరింది.

గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు సంబంఽధించిన ఫలితం నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని ఉత్కంఠకు తెరలేపింది. మొదటగా 8వ వార్డులో 2 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందని అభ్యర్థి జయమ్మ సమీప ప్రత్యర్థి వెంకటమ్మపై గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఓట్ల తేడా స్వల్పంగా ఉండడంతో మరోసారి కౌంటింగ్‌ చేయాలని కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటమ్మ అధికారులను కోరారు. మరోసారి కౌంటింగ్‌ చేసిన అధికారులు ఒక్క ఓటు తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జయమ్మ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం వెంకటమ్మ అభ్యర్థన మేరకు మరోసారి కౌంటింగ్‌ చేశారు. చివరికి ఒక్క ఓటు మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటమ్మ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జయమ్మ మరల కౌంటింగ్‌ చేపట్టాలని అధికారులను కోరారు. అయితే ఇప్పటికే పలుమార్లు కౌంటింగ్‌ చేశామని చెప్తూ అధికారులు తిరస్కరించారు. దీంతో ఒక్కసారి గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు బీఎస్‌ కేశవ్‌, ఆంజనేయగౌడ్‌, హనుమంతు, రాఘవేంద్రరెడ్డి కౌంటింగ్‌ సెంటర్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్యమాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి అధికారులు, పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని నిరసన తెలిపారు. రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించడం తగదని పోలీసులు నచ్చచెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి జయమ్మ కౌంటింగ్‌ హాలులోకి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా అధికారులు స్పందించలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన జయమ్మ కోర్టుకు వెళ్తానని మీడియాకు తెలిపారు.

అలంపూర్‌ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి చైర్మన్‌ ఆభ్యర్థిగా పేరు వినిపిస్తున్న ఇస్మాయిల్‌ ఓటమి పాలయ్యరు. మూడో వార్డు నుంచి కాంగ్రెస్‌ నుంచి ఇస్మాయిల్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ఆసీఫ్‌ఖాన్‌, బీజేపీ నుంచి జంగం నాగమల్లయ్య పోటీలో నిలిచారు. ఇందులో ఆసిఫ్‌ ఖాన్‌ గెలుపోందారు.

కల్వకుర్తి టౌన్‌: మున్సిపాలిటీలోని 16వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి పసుల లలిత, బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎడ్మ రాధికను ఓడించింది. కల్వకుర్తి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎడ్మ సత్యం తన భార్యను ఆ పార్టీ తరఫున చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 487 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 435 ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో మాజీ చైర్మన్‌ సత్యం, ఈ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి కుమారుడు రమాకాంత్‌రెడ్డిని కొట్టాడని స్వయంగా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రస్తావించారు. ఎమ్మెల్యే సైతం ఈ వార్డు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని చెప్పటంతో విజయం సులువైంది.

కొల్లాపూర్‌/మక్తల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మా పాలనకు నిదర్శనమని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి పేర్కొన్నారు. కొల్లాపూర్‌, మక్తల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో వారు ఆయా ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థానాలు గెల్చుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో ప్రజలు తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల గెలుపునకు కృషిచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లను మంత్రి వాకిటి శాలువాతో సన్మానించారు.

మబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో 37వ డివిజన్‌ జనరల్‌ మహిళకు కేటాయించగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి న్యాయవాది నేహాశ్రీ పోటీ చేసి ఓడిపోయారు. ఈమె గెలిచి ఉంటే మేయర్‌ పదవి రేసులో ఉన్నారు. ఈమె తండ్రి ఎన్‌పీ వెంకటేష్‌ చాలా కాలంగా ఒలింపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కుమార్తె గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

జూపల్లి

కృష్ణారావు

వరాల తల్లి.. పోలేపల్లి ఎల్లమ్మ

ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

కల్వకుర్తిలో తప్పని ఓటమి

నాటకీయ పరిమాణాల

మధ్య కాంగ్రెస్‌ అభ్యర్థి

గెలిచినట్లు ప్రకటన

నారాయణపేట: సరితలు ఓడిపోయారు.. శ్వేతలు గెలిచారు అంటే ఆశ్చర్యపోతున్నారా.. ఆశ్చర్యపోవాల్సిందే మరి.. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు 16వ వార్డులో చైర్‌పర్సన్‌ అభ్యర్థి సరిత భట్టడ్‌, 19వ వార్డు సిట్టింగ్‌ కౌన్సిలర్‌ సరితగౌడ్‌ ఓటమి చవి చూశారు. 20వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి కే. శ్వేత, 4వ వార్డు బీజేపీ అభ్యర్థి కొండ శ్వేత తాజా మాజీ కౌన్సిలర్‌ విజయం సాధించారు. దీంతో సరితలు ఇద్దరు ఓడిపోవడంతో బలం లేనట్లుందని.. శ్వేతలు గెలువడంతో విజయాలపై బలం బాగుందని చర్చించుకుంటున్నారు.

రీకౌంటింగ్‌లో గందరగోళం 1
1/4

రీకౌంటింగ్‌లో గందరగోళం

రీకౌంటింగ్‌లో గందరగోళం 2
2/4

రీకౌంటింగ్‌లో గందరగోళం

రీకౌంటింగ్‌లో గందరగోళం 3
3/4

రీకౌంటింగ్‌లో గందరగోళం

రీకౌంటింగ్‌లో గందరగోళం 4
4/4

రీకౌంటింగ్‌లో గందరగోళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement