breaking news
Mahabubnagar District News
-
వామ్మో.. రక్తపింజర
జడ్చర్ల టౌన్: రాజాపూర్ సమీపంలోని కుమ్మరి వెంకటేశ్ నీటికుంటలో శనివారం ఐదున్నర అడుగుల ఆడ రక్తపింజర కనిపించింది. గుర్తించిన రైతు సర్ప రక్షకుడు సదాశివయ్యకు సమాచారం ఇచ్చారు. ఆయన తన శిష్యులైన భరత్, అభిలాష్‌ను పంపించగా వారు చాకచక్యంతో నీరు ఖాళీచేసి పట్టుకున్నారు. సాధారణంగా రాళ్లు, ఇటుకలు, ఎలుకలు ఉండే ప్రాంతం, వరి పొలాల్లో ఎక్కువగా ఇలాంటి సర్పాలుంటాయని.. నవంబర్, డిసెంబర్లో చలి ఎక్కువగా ఉండటం, ప్రత్యుత్పత్తి కాలం కావడంతో బయటకు వస్తాయని వారు తెలిపారు. ఈ క్రమంలో ఇళ్లు, కల్లాలు, నీటిగుంతల్లోకి చేరుతాయని చెప్పారు. రెండు నెలల్లో.. జడ్చర్ల పరిసరాల్లో నవంబర్, డిసెంబర్లో మొత్తం 31 రక్తపింజరలు పరిరక్షించినట్లు డా. సదాశివయ్య తెలిపారు. మగవి 6 అడుగులు, ఆడవి ఐదున్నర అడుగల పొడువున్న వాటిని పట్టుకున్నట్లు చెప్పారు. ఇవి కొండచిలువను పోలి ఉంటాయని.. నెమ్మదిగా ఉన్నట్లు కనిపించినా వాయువేగంతో ఎగురుతూ వచ్చి కాటు వేస్తాయని వివరించారు. ఒక్కసారి కాటు వేస్తే 16 మందిని చంపగలిగే విషాన్ని విడుదల చేస్తాయని, ప్రాణాలు త్వరగా పోతాయని చెప్పారు. ఈ పాములు నలుపు, గోధుమరంగు మచ్చలు కలిగి ఉంటాయని.. కనబడితే సెల్‌నంబర్ 99635 36233 సమాచారం ఇవ్వాలని కోరారు. -
క్యారెట్ సాగుతో రైతులకు లాభాలు
● వరికి ప్రత్యామ్నాయంగా క్యారెట్ సాగు ● ఎరువులు, పురుగు మందుల వినియోగం తక్కువే అలంపూర్: జిల్లాలో ఎర్ర నేలలు, మసక నేలలు విస్తారంగా ఉన్నాయని, వీటిలో వరికి ప్రత్యామ్నాయంగా క్యారెట్‌ను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా క్యారెట్ సాగు వివరాలను రైతులకు వివరించారు. పొలం తయారీ: పొలాన్ని దుక్కి చేసి సిఫార్సు చేసిన ఎరువులను వేసి పొలం మెత్తగా ఉండేటట్లు చూడాలి. చిన్న చిన్న మడులుగా చేసుకొని 25 సెంటీమీటర్ల దూరంలో బోదెలు వేసుకోవాలి. రకాలు: కరోడ, పూసా కేసర్, పూసా యమదగ్ని, నాంటెస్ ఇండియా గోల్డ్ ఈ రకాలను సాగు చేస్తే 100 నుంచి 120 రోజుల లోపు పంట చేతికొస్తుంది. విత్తన మోతాదు: ఎకరానికి 3 కిలోల విత్తనం సరిపోతుంది. ఎరువులు : ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, యూరియా 40 కిలోలు, ఎస్ఎస్పీ(సూపర్) 110 కిలోలు పొటాష్ 60 కిలోలు. సూపర్ మొత్తం 110 కిలోలు, పొటాష్ 60 కిలోలు, యూరియా 20 కిలోలు ఆఖరి దుక్కిలో వేయాలి. మిగితా 20 కిలోల యూరియా పంట 40 నుంచి 45 రోజుల సమయంలో పైపాటుగా వేయాలి. దుంప ఊరే సమయంలో 13:0:45ను 5 గ్రాములు లీటరు నీటిలో కలిపి ఎకరానికి కిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. కలుపు యాజమాన్యం: విత్తనం వేసిన రెండు రోజుల లోపు పెండి మిథాలను ఒక లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 25 రోజుల తర్వాత మెట్రిబుజిన్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నీటి యాజమాన్యం : 8 నుంచి 15 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి. డ్రిప్ ద్వారా, ఎత్తైన మడుల ద్వార నీరందిస్తే నాణ్యత గల దుంపలు కాయడంతో అధిక దిగుబడి పొందవచ్చు. సస్యరక్షణ : ఈ పంటలో సస్యరక్షణ చాలా తక్కువ. ఆకు మచ్చ నివారణకు మాంకోజెబ్ 3 గ్రా ములు లీటరు నీటికి కలిపి పచికారీ చేసుకోవాలి. పంట కోత: దుంపలు ముదిరిన తర్వాత నారింజ రంగుకు మారుతాయి. దుంపలు ముదిరిన తర్వాత పొలానికి నీరు పెట్టి మరుసటి రోజు ఆకులతో సహా దుంపలను తీసివేయాలి. కోత అలస్యం అయితే దుంపల నాణ్యత తగ్గుతుంది. యాజమాన్య పద్ధతులను బట్టి ఎకరానికి 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. పంట సాగులో మెలకువలు : విత్తనాన్ని ఇసుకతో కలిపి నాటుకోవాలి. విత్తనం, ఇసుక 1:4 నిష్పత్తిలో కలిపి నాటుకోవాలి. నత్రజని అధిక మోతాదులో వాడితే కోత ఆలస్యమై పగుళ్లు ఏర్పడతాయి. కాల్షియం లోపంతో దుంపపై నొక్కులు ఏర్పడి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ● పొలాన్ని సరిగ్గా దుక్కి చేయకపోతే, సేంద్రియ ఎరువులు వాడకపోతే దుంప నేలలోకి వెళ్లకుండా చీలిపోతుంది. కాబట్టి దుక్కి జాగ్రత్తగా చేయాలి పాడి–పంట -
మరో రెండు హత్యలు చేయించాడు!
● సీన్ రీ కన్స్ట్రక్షన్తో సంచలన విషయాలు వెలుగులోకి.. ● మరో రెండు హత్యలు చేసినట్లు నేరం అంగీకరించిన ఏ–1 నిందితుడు ● ఆసక్తికరంగా మారిన విచారణ, విస్తుపోయిన అధికారులు ● ముగిసిన సుపారీ గ్యాంగ్ కస్టడీ, రిమాండ్‌కు తరలింపు గద్వాల క్రైం: సాహసోపేతమైన కేసును గద్వాల పోలీసులు ఛేదించి నిందితులను 2025 నవంబర్ 27వ తేదీన రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులోని నిందితులను శుక్రవారం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని రెండు రోజులుగా విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ భీమరాయుడును గతేడాది నవంబర్ 21వ తేదీన ధరూరు మండలం జాంపల్లి స్టేజీ సమీపంలో సుపారీ గ్యాంగ్ బొలెరోతో ఢీ కొట్టి హత్య చేశారు. ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్ చేసిన హత్యగా తెలిసి 11మంది నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మాజీ సర్పంచ్‌ను హత్య చేసేందుకు రూ.25లక్షలు సుపారీ గ్యాంగ్‌కు ఏ–1 చెల్లించాడు. ఈ కేసు విషయంలో గద్వాల పోలీసులు నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ చేయగా.. మిల్లు వీరన్న ఈ రెండు హత్యలు చేసినట్లు నేరం అగీకరించడంతో విచారణ అధికారులు విస్తుపోయారు. ఈ కేసు ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. సీన్ రీ కన్స్ట్రక్షన్... కోర్టు అనుమతితో ఆరుగురు నిందితులను శుక్రవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. రెండో రోజు మాజీ సర్పంచ్ హత్య చేసిన విధానంపై నిందితులతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ను విచారణ అధికారులు తెలుసుకున్నారు. మృతుడు రోజువారీ కార్యక్రమాలు, ఎక్కడికి వెళ్తున్నాడు. ఏ సమయంలో ఇంటికి వెళ్తున్నాడు. ఎక్కడ ఉంటున్నాడు ఇలా అనేక విషయాలను పసికడుతున్న విషయాలను విచారణ అధికారులకు నిందితులు తెలియజేశారు. ఈ హత్య కేసు ఎలాంటి సంచలనలకు దారీతీస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితిగా మారిందని పోలీసులు పెదవిరుస్తన్నారు. ఒక హత్య కేసు తీగ లాగితే డొంక కదిలినట్లుగా మారింది. చేసినట్లు అంగీకరించారు.. నందిన్నె మాజీ సర్పంచ్ భీమరాయుడు హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నాం. విచారణ సమయంలో ఏ–1 మిల్లు వీరన్న తాను చేసిన మరో రెండు హత్యలను బహిర్గతం చేశాడు. 2006లో నందిన్నెకు చెందిన ఎర్రప్పను దాడి చేసి నోట్లో పురుగుల మందుపోసి హత్య చేసినట్లు పేర్కొన్నాడు. 2014లో కర్ణాటకకు చెందిన తాయప్పతో వ్యాపారానికి ముందుస్తుగా చెల్లించిన నగదు ఇవ్వడం, వ్యాపార వ్యవహారాలు బహిర్గతం చేయడంతో కారులో తీసుకెళ్లి వెనుక నుంచి గొంతుకు తాడు సహాయంతో బిగించి హత్యచేసి కర్ణాటకలోని ఈడుపునూర్ సమీపంలో రోడ్డు ప్రమాదంగా నమ్మించినట్లు పేర్కొన్నాడు. ఈ రెండు హత్య కేసులో నిందితుడికి సహకరించిన వారి వివరాలపై విచారణ ఉంటుంది. కస్టడీ సమయం పూర్తికావడంతో గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించాం. నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకుంటాం. – శ్రీను, సీఐ, గద్వాల -
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్యాయత్నం
భూత్పూర్: తల్లి మందలించిదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్, తండావాసుల కథనం ప్రకారం.. వాల్యాతండాకు చెందిన డేగావత్ వసురాం, భార్య శారద, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. కొన్నిరోజులుగా డేగావత్పూజ(రెండో కుమార్తె) భోజనం సరిగ్గా చేయడంలేదని తల్లి మందిలించింది. శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాకు (నాయనమ్మ) వద్దకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వచ్చింది. శివరాంపల్లి నుంచి వాహనంలో వచ్చి వాల్యాతండా స్టేజీ వద్ద దిగి తండా సమీపంలోనే వ్యవసాయ పొలం వద్ద ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొద్ది దూరంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద తండాకు చెందినవారు వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా పొగ రావడం గమనించిన వెళ్లి చూడగా యువతి మంటల్లో ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108వాహనంలో జనరల్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పూజ డీఆర్డీఏలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తుందని, పూజ తండ్రి వసురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ముంపు బాధితులకు న్యాయం చేస్తాం
చారకొండ: మండలంలోని గోకారంలో నిర్మించే రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కోరుతూ ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు ప్రకాష్, పెద్దయ్య పర్వతాలు, నాయకులు సాంబయ్యగౌడ్, ఇతర నాయకులు శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి నివాసాల్లో వారిని వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందించారు. దీంతో అంసెబ్లీ పాయింట్లో సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ముంపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందిస్తూ ప్రజలకు నష్టం జరగకుండా రీఅలైన్మెంట్ చేయించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చినట్లు వారు తెలిపారు. ‘నిర్వాసితులను విస్మరించొద్దు’ డిండి–నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చారకొండ మండలంలోని గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించే వరకు పోరాటం చేస్తామని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 33వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని సర్పంచ్ ఎన్నికలు సైతం బహిష్కరించినా తమ గోడును ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోయారు. -
వైభవంగా వెంకన్నస్వామి కల్యాణం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతినెల పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర, బెల్లం కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తజనావళి తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్చరణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామిదంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితోపాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన ఇటిక్యాల పీఎస్‌లో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవినాయక్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి లక్ష్మన్న (75) కూడలిలో కిరాణం సరుకులు తీసుకొని ఇంటికి వెళ్తుండగా జాతీయ రహదారిపై పుల్లారెడ్డి పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో కర్నూలు నుంచి గద్వాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో లక్ష్మన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఉప్పరి మహేష్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ శేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మద్యం మత్తులో మహిళ ఆత్మహత్యాయత్నం కొల్లాపూర్: మద్యం మత్తులో మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు.. మండలంలోని కుడికిళ్ల గ్రామానికి చెందిన మీనుగ సుమిత్ర అనే మహిళ శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. సుమిత్ర కుటుంబీకులను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. బాలిక ఆత్మహత్యాయత్నం గోపాల్పేట: మండలంలోని ఓ గ్రామంలో బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. బాలిక మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివి తర్వాత ఇంటివద్దే ఉంటూ కూలీ పనులు చేస్తుండేది. అదే గ్రామానికి చెందిన ఓ బాలుడిని ప్రేమిస్తుండగా.. రెండేళ్ల కిందట పెద్దలు మందలించారు. శుక్రవారం ఆ బాలుడు మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నట్లు తెలియడంతో శనివారం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు గమనించి వెంటనే కారులో గోపాల్‌పేటకు అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఉరేసుకొని వ్యక్తి మృతి గోపాల్పేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏదుల మండలంలోని గొల్లపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రేవల్లి ఎస్ఐ రజిత తెలిపిన వివరాలు.. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వీరపాగ రేణుక, బంగారయ్య(50) నలుగురు కుమార్తెలు, కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొంత కాలంగా బంగారయ్య తాగుడుకు బానిసయ్యాడు. డిసెంబర్ 10న భార్యను కొట్టి గొల్లపల్లిలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వృద్ధుడి బలవన్మరణం నాగర్‌కర్నూల్ క్రైం: పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన పర్వతాలు (70) చాలా రోజులుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతూ మధ్యాహ్నం తర్వాత మృతి చెందాడు. ఘటనకు సంబంధించి మృతుడి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య జడ్చర్ల: మండలంలోని కిష్టారంలో దేవమ్మ, మల్లేశ్ కుమార్తె రాజేశ్వరి (17) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజేశ్వరీ ఉరి వేసుకోగా చుట్టుపక్కల వారు గమనించి వెంటనే కిందకు దించి జడ్చర్లలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలిక హైదరాబాద్‌లోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఇంటికి వచ్చింది. బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అప్పగించారు. ఇంటి పనులు నేర్చుకోవాలని.. ఏ పని చేయకుండా ఉంటే ఏమిటని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సొమ్మును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి : ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: సంక్రాంతి పండగ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చిన తర్వాత నగరంలో నుంచి భారీగా స్వగ్రామాలకు వెళ్తుంటారని ఈ క్రమంలో అవసరం జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటికి తాళాలు వేసి వెళ్లే సందర్భాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అన్నారు. ఇంట్లో ఉండే విలువైన బంగారం, వెండి, డబ్బులు, ఇతర ముఖ్యమైన పత్రాలను బ్యాంక్ లాకర్ లేదా విశ్వసనీయమైన వ్యక్తుల దగ్గర భద్రపరచాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించకుండా టైమర్ లైట్లు లేదా రాత్రివేళ లైట్లు వెలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల భద్రత మరింత పెరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో ఊరికి వెళ్లాం.. ఇంటి వద్ద లేను వంటి సమాచారం షేర్ చేయరాదన్నారు. అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు మరింత జాగ్రత్తలు తీసుకుంటూ అపార్ట్మెంట్లు అయితే తప్పక వాచ్మెన్లను అప్రమత్తం చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా దొంగల ముఠాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 పోలీస్ కంట్రోల్ రూం నం.87126 59360కు సమాచారం ఇవ్వాలని కోరారు. నేడు కోయిల్‌సాగర్ నీటి విడుదల దేవరకద్ర: యాసంగి పంటల సాగుకు గాను కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 5 తడులు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో తడి కింద 10 రోజులపాటు నీటిని విడుదల చేసి మధ్యలో విరామం ఇస్తారు. యాసంగి సీజన్లో భాగంగా ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద ఉన్న 12 వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తారు. కుడి కాల్వ కింద 8 వేలు, ఎడమ కాల్వ కింద 4 వేల ఎకరాల మేర నీటిని అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మొదటి తడి ఆదివారం విడుదల చేస్తారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 32.2 అడుగుల వద్ద 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉన్న రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి.. మరో టీఎంసీని వేసవిలో తాగునీటికి వినియోగిస్తారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘టెట్’కు 306 మంది హాజరు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష శనివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటి రోజు కేవలం ఒక్క ఫాతిమా విద్యాలయ కేంద్రంలో మాత్రమే పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష జరిగింది. మొదటి రోజు పలువురు అభ్యర్థులు ఉదయం 7.30 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. మొత్తం 360 మంది అభ్యర్థులకు గాను 306 మంది హాజరవగా.. 27 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఎన్ఆర్ క్వింటాల్ రూ.2,749 జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,749, కనిష్టంగా రూ.2,289 ధరలు లభించాయి. అలాగే హంస రూ.1,811, కందులు గరిష్టంగా రూ.6,810, కనిష్టంగా రూ.5,610, వేరుశనగ గరిష్టంగా రూ.8,791, కనిష్టంగా రూ.6,269, మినుములు రూ.7,881, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,856, పత్తి గరిష్టంగా రూ.7,129, కనిష్టంగా రూ.4,500, ఉలువలు రూ.3,900 చొప్పున వచ్చాయి. ● వామ్మో రక్తపింజర ● తల్లి మందలించిందని యువతి ఆత్మహత్యాయత్నం ● రూ.17 లక్షల పత్తి విత్తనాలు చోరీ ● విద్యార్థిని బలవన్మరణం -
సావిత్రిబాయి స్ఫూర్తితో విద్యాభివృద్ధికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యారంగంలో జిల్లాను మరింత మెరుగుపరిచి ముందంజలో నిలిపేందుకు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సావిత్రిబాయిపూలే జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 52 శాతం మంది మహిళలు, 58 శాతం బాలికలు చదువుతున్నారని, ప్రభుత్వ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ మహిళా ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ వారు మరింత అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను ఇంకా మెరుగుపరిచి.. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేయాలన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి విద్యా శాఖ ద్వారా ఎంపిక చేసిన పాఠశాలలకు చెందిన 17 మందికి ఉత్తమ మహిళా ఉపాధ్యాయ అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్‌కుమార్, డీపీఆర్ఓ శ్రీనివాస్, ట్రెయినీ డీపీఓ నిఖిల, డీఎంహెచ్ఓ కృష్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, ఉద్యానవన అధికారి వేణుగోపాల్, ఏఎంఓ శ్రీనివాస్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్‌స్ట్రాగాంలో వచ్చి..వాట్సప్‌లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్‌నగర్‌లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్‌స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
కలెక్టర్ చొరవ.. ప్రధాని ప్రశంసలు
నారాయణపేట: నారాయణపేట జిల్లాకేంద్రంలో నిరాదరణకు గురైన బారంబావి.. కలెక్టర్ హరిచందన చొరవతో భావితరాలకు అందుబాటులోకి వచ్చింది. ముళ్లపొదలు, చెత్తాదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా మారిన బారంబావిని చూసిన 2021లో అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పునరుద్ధరించి ఇటు ప్రజల మన్ననలతోపాటు మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్రమోదీచే ప్రశంసలు అందుకుంది. అలాగే 2021 నుంచి అక్కడే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బావి చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బారంబావి పునరుద్ధరణకు చొరవ తీసుకున్న అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన, ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. చారిత్రకమైన మెట్లబావి పునరుద్ధరణపై స్థానిక ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. -
వైద్య సిబ్బందిపై ఆగ్రహం
భూత్పూర్: వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఉదయం 10.30 గంటలైనా విధుల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, స్టోర్ రూంతోపాటు కుక్కకాటు, పాముకాటు మందుల వివరాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ కిషన్, ఆర్ఐ వెంకటేష్ తదితరులున్నారు. -
భత్యంపై ఉద్యోగుల అసంతృప్తి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం కాకుండా తక్కువ భత్యం చెల్లించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల విధులను సజావుగా నిర్వహించిన తమకు సరైన టీఏడీఏ చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికలు జరగగా.. మొత్తం 3,674 పోలింగ్ కేంద్రాల్లో 9,610 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించారు. స్టేజ్–1 రిటర్నింగ్ అధికారిగా ఎనిమిది రోజుల పాటు విధులు నిర్వహించినందుకు రోజుకు రూ.500 చొప్పున రూ.4 వేలు చెల్లించాల్సి ఉంది. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఏడు రోజుల విధులకు గాను రూ.3,500, రిటర్నింగ్ అధికారి స్టేజ్–2 వారికి రూ.4 వేలు, ప్రిసైడింగ్ అధికారికి రూ.2,500, పోలింగ్ అధికారులకు రూ.1,300 భత్యం చెల్లించాలని ఎన్నికల సంఘం ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీచేసింది. కానీ, ఎక్కడైనా రూ.2 వేలు మాత్రమే భత్యం చెల్లించి అధికారులు చేతులు దులుపుకొన్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్నికల భత్యం తక్కువగా చెల్లించడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు తమ వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు చేస్తూ చర్చ కొనసాగిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ సిబ్బందికి రూ.2,500 చొప్పున భత్యం చెల్లించగా, రెండో విడతలో రూ.1,500కే పరిమితం చేశారు. మూడో విడతలో గొడవ చేస్తారనే ఉద్దేశంతో రూ.2 వేల చొప్పున భత్యం చెల్లించారని తెలుస్తోంది. ఈ విషయమై ఉద్యోగులు పంచాయతీ అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదని పలువురు ఉద్యోగులు వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచించే భత్యం ఒకలా ఉంటే అధికారులు చెల్లించే భత్యానికి తేడా ఉందన్నారు. అసలు ఈ నిధులు ఎటు వెళ్తున్నాయని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇన్చార్జి డీపీఓ, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డిని సంప్రదించగా బిల్లులు ప్రభుత్వానికి పెట్టామని, మంజూరైతే చెల్లిస్తామని పేర్కొన్నారు. -
బీసీ బిల్లు ఆమోదం తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి
అమరచింత: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును తీర్మాణం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపినా ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకపోవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండల కేంద్రంలోని జీఎస్ భవన్లో శుక్రవారం ఆయా గ్రామాల్లో సీపీఎం పార్టీ మద్దతుతోపాటు ఒంటరిగా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులను ఆయన సన్మానించారు. ఈసందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రం ఆమోదం కోసం పంపి నెలలు కావస్తున్నా ఫైల్ పెండింగ్‌లో పెట్టడం సరైంది కాదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ పంపిన బిల్లులను ఒకే రోజులో క్లియర్ చేస్తున్నారని, కానీ బీసీల 42 శాతం బిల్లును మాత్రం అమలు చేయించడంలో బీజేపీ శ్రద్ద చూపడం లేదని దుయ్యబట్టారు. రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకై నా బీసీలకు కల్పించిన రిజర్వేషన్ అమలు తర్వాతే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు అమలు కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి, ప్రధాని వద్దకు సీఎం తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్నాయని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తు గద్దె నెక్కుతున్న రోజులు వస్తున్నాయని వీటిని అరికట్టడంతో ఎన్నికల కమిషనర్ తన బాధ్యతలను విస్మరిస్తుందన్నారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో సీపీఎం ప్రజా పక్షాన ఉంటూ ఎన్నికల బరిలో నిలుస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి చైర్మన్ స్థానాలను సీపీఎం కై వసం చేసుకునేలా పార్టీ కార్యకర్తలు సైనికులుగా మారాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మహమూద్, మాజీ వైస్ చైర్మన్ జీఎస్.గోపి, వెంకటేష్, అజయ్,రాఘవేంద్ర, విష్ణు, ఎస్ఈ శ్యాంసుందర్,దేవర్ల మోహన్, సర్పంచ్ కుర్వ బాలయ్య, ఉప సర్పంచ్ వెన్నెల పాల్గొన్నారు. -
అడవిలో అమ్మ.. పర్వతాపూర్ మైసమ్మ
● సెంటిమెంట్ దేవతగా ప్రతీతి ● నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం.. వారం పాటు కొనసాగింపు ● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు నవాబుపేట: తరతరాలుగా కొలిచిన వారి కోర్కెలు తీరుస్తూ ఇష్ట దైవంగా పేరొందింది పర్వతాపూర్ మైసమ్మ దేవత. జిల్లాకేంద్రం నుంచి మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో 9 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన మైసమ్మ ఆలయం కాకర్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే ఓ నెమలి చెట్టు కింద పుట్టలో అమ్మవారి విగ్రహం బయట పడిందని పూర్వీకులు చెబుతున్నారు. కట్టెలు కొట్టి విక్రయించే వ్యక్తి అడవిలో దారి తప్పితే చెట్టుకింద ఉన్న ఓ శిల ప్రత్యేక కాంతి రూపంలో దారి చూపిందని.. మరుసటి రోజు ఆ వ్యక్తి గ్రామస్తులకు విషయం చెప్పి పూజలు చేయడం ప్రారంభించినట్లు ప్రతీతి. ఆది, మంగళవారం రద్దీ.. జిల్లావాసులు చాలామంది కొత్త వాహనం కొనుగోలు చేసినా, ఏదేని శుభకార్యాలు, ఎన్నికల ప్రచారాలు దేవాలయం వద్ద పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. దీంతోపాటు ఆది, మంగళవారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించడం ఇక్కడ ప్రత్యేకం. కాగా ఆలయం అభివృద్ధి చెందుతుండటంతో ఇతర రోజుల్లో సైతం భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఆలయ అభివృద్ధి.. కాకర్లపహాడ్‌కు చెందిన నారాయణరెడ్డి మొదట ఆలయ నిర్మాణం చేపట్టారు. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రూ.కోటితో అమ్మవారికి నగలు చేయించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అలాగే గతంలో ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి లక్మారెడ్డి, నాటి ఎమ్మెల్యేలు ఎర్ర సత్యం, చంద్రశేఖర్, ఎర్ర శేఖర్, మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య తదితరులు రూ.కోట్లు వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అన్ని ఏర్పాట్లు చేశాం.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశాం. బోనాల రోజు ఆలయానికి వచ్చే భక్తులందరూ ఆలయం వద్ద బోనాలు సమర్పించేందుకు సౌకర్యాలు కల్పించాం. – జగన్మోహన్రెడ్డి, ఆలయ చైర్మన్ -
మట్టి రహిత సేద్యం
సింగారం ద్వారక స్కూల్ విద్యార్థులు వైష్ణవి, అనూష మట్టి లేకుండా వ్యవసాయం చేసే విధానాన్ని ప్రదర్శించారు. నీరు, నత్రజని, జలచరాలను ఉపయోగించి ఈ రకమైన వ్యవసాయం చేయవచ్చని చూపించారు. కృత్రిమంగా ఏర్పాటు చేసిన కొలనులో చేపలను పెంచి వాటి ద్వారా వచ్చిన నీటి వ్యర్థాలను శుద్ధి చేసి అదే నీటిని వర్టికల్ ఫార్మింగ్ (నిలువుగా వ్యవసాయం చేయడం)కు సరఫరా చేయాలి. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఇలాంటి సేద్యం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెంచవచ్చు. సేంద్రియ సుస్థిర వ్యవసాయం ధన్వాడ జెడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు రాజేందర్, ప్రవీణ్ రసాయన పదార్థాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే విధానంపై ప్రాజెక్టును రూపొందించారు. జీవామృతం పంటలకు ఉపయోగించడం, అంతర పంటలు వేయడం, పంట మార్పిడితో మనిషి ఆరోగ్యంతోపాటు, పంట దిగుబడి పెంచుకోవచ్చు. -
నిప్పంటుకొని ఇల్లు దగ్ధం
కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు కచ్చా ఇంటికి నిప్పు అంటుకొని పూర్తిగా ఇళ్లు దగ్ధమైన ఘటన మున్సిపాలిటీలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని సంపల్లి గ్రామానికి చెందిన కథల మొగులయ్య భార్య సత్యమ్మతో కలిసి శుక్రవారం ఉదయం మేసీ్త్ర పనికి వెళ్లగా ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్ళారు. మధ్మాహ్న సమయంలో ఇంటి నుంచి దట్టంగా పొగలు రావడంతో స్థానికులు పోలీసుల, కొడంగల్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లో ఉన్నా వంటసామగ్రితో పాటు వస్తువులు బూడిదయ్యాయి. సిలిండర్ పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైరింజన్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకోచ్చారు. రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి వంటపాత్రలు రెవెన్యూ అధికారులు అందజేశారు. -
సాంకేతికతతో పిల్లలపై దృష్టి
దామరగిద్ద సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు అనిల్‌నాయక్, రవినాయక్ సెల్‌ఫోన్ ప్రభావంతో పిల్లలు చెడు మార్గంలోకి వెళ్లకుండా సాంకేతికత పరిజ్ఞానంతో తల్లిదండ్రులు కట్టడి చేసే ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఫోన్లో జీపీఎస్ అమర్చడం వలన అవతలి వ్యక్తి ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత విద్య అభ్యసించడం కోసం సుదూర ప్రాంతాలకు పంపించినప్పుడు ఇలాంటి జీపీఎస్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది. దొంగలు అపహరించిన ఫోన్ పట్టుకోవచ్చు. -
ప్రాణాలు పణంగా.. చదువుల ప్రయాణం
నడక తప్పట్లేదు రోజూ ఉదయాన్నే తయారై బస్సు కోసం చూస్తాం. కానీ ఒక్కటే బస్సు ఉండటంతో అందులో చోటు దొరకదు. తప్పక రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. బ్రిడ్జి దాటేటప్పుడు రైలు వస్తే చాలా భయ మేస్తుంది. మాకు చదువు కావాలి కానీ, ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడలేకపోతున్నాం. వెంటనే అదనపు బస్సు సౌకర్యం కల్పించాలి. – వైష్టవి, 9వ తరగతి ప్రమాదం అంచున.. బ్రిడ్జి పైన నడుస్తున్నప్పుడు రైలు కూత వినిపిస్తే కాళ్లు వణికిపోతాయి. పక్కకు తప్పుకోవడానికి కూడా సరిగ్గా చోటు ఉండదు. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి చీకటి పడుతోంది. అధికారులకు మా కష్టాలు కనిపిస్తలేవా? ప్రతిరోజూ యుద్ధం చేస్తున్నట్టే ఉంది మా ప్రయాణం. – మణివర్ధన్, 10వ తరగతి మదనాపురం: అక్షరం నేర్చుకోవాలంటే ఆశయం ఉండాలి. కానీ, ఇక్కడ ఆశయంతోపాటు సాహసం కూడా చేయాల్సిందే. బడికి వెళ్లాలన్నా.. ఇంటికి రావాలన్నా విద్యార్థులకు అడుగడుగునా గండాలే ఎదురవుతున్నాయి. మదనాపురం మండలంలోని నర్సింగాపురం, నెల్విడి, కొన్నూరు, ద్వారకానగర్ గ్రామాల విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటిస్తున్నా.. మండల విద్యార్థులకు కనీసం బస్సు సౌకర్యం కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఆయా గ్రామాల నుంచి సుమారు 100 మందికిపైగా విద్యార్థులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకోవడానికి మండల కేంద్రానికి రావాల్సిందే. ఉదయం 7.40 గంటలకు వచ్చే ఒక్క బస్సు తప్పా మరే ఇతర రవాణా సౌకర్యం వారికి అందుబాటులో లేదు. ఆ ఒక్క బస్సులో అందరూ వెళ్లలేక, సగం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలకు చేరుకోవాల్సి వస్తోంది. ఈ ప్రయాణంలో విద్యార్థులు మదనాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ బ్రిడ్జిపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు. ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు సాగిస్తుంటే పక్కకు తప్పుకోవడానికి కూడా చోటులేని ఆ ఇరుకై న బ్రిడ్జిపై విద్యార్థులు పడుతున్న అవస్థలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా, లేదా రైలు వచ్చే సమయంలో కంగారుపడినా ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చదువు కోవడానికి వెళ్తున్న పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అని తల్లిదండ్రులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వేట్రాక్‌పై విద్యార్థులప్రమాదకర నడక నాలుగు గ్రామాలకు కలిపి ఉదయం ఒకే బస్సు సౌకర్యం అధికారులకు పట్టని చిన్నారుల ఇక్కట్లు -
వేరుశనగ యంత్రం బోల్తా.. వృద్ధుడి దుర్మరణం
తిమ్మాజిపేట: మండలంలోని బావాజిపల్లి సమీపంలో వేరుశనగ మిషన్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తాడూర్ మండలంలోని గోవిందాయపల్లికి చెందిన వేరుశనగ మిషన్ మారేపల్లి సమీపంలో ఓ రైతు పొలంలో వేరుశనగ పంట నూర్పిడి చేశాక.. తిరిగి వెళ్తున్న క్రమంలో బావాజిపల్లి సమీపంలో మలుపు ఉండడం కూలీలందరూ కిందకు దిగగా.. బాలయ్య (61) అలానే కూర్చొన్నాడు. ఈ క్రమంలో మలుపు వద్ద మిషన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బాలయ్య మిషన్ కింద పడి దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి నవాబుపేట: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఇప్పటూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఇప్పటూర్‌కు చెందిన బెస్త యాదయ్య (55) గ్రామ సమీపంలో సోలార్ ప్లాంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. గురువారం యథావిధిగా విధులకు వెళ్లిన ఆయనకు రాత్రి సమయంలో సోలార్ ప్లాంట్‌లో ఉన్న బోరు వద్ద విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మృతుడి కుమారుడు బెస్త హరికృష్ణ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. పోలీసు కస్టడీలో మాజీ సర్పంచ్ హత్య నిందితులు గద్వాల క్రైం: గతేడాది నవంబర్ 21న కేటీదొడ్డి మండలంలోని నందిన్నె మాజీ సర్పంచ్ భీమరాయుడును కర్నూల్ జిల్లాకు చెందిన సుపారీ గ్యాంగ్ బొలెరా గూడ్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన విధితమే. శుక్రవారం కోర్టు అనుమతితో కేసులోని నిందితులు ఏ1 మిల్లు వీరన్న, ఏ2 సురేందర్, ఏ3 బోయ వీరన్న, ఏ5 తెలుగు కృష్ణ, ఏ6 తెలుగు మధుబాబులను గద్వాల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హత్యకు దారీ తీసిన రాజకీయ, ఆర్థిక, భూ సంబంధ, పాత కక్షలపై విచారణ చేపడుతున్నారు. హత్య చేసేందుకు ముఠా సభ్యులు కుదుర్చుకున్న ఒప్పంద వ్యవహారంలో ఏ1తో ఏర్పడిన పరిచయంపై విచారణ చేసినట్లు తెలిసింది. సుపారీ గ్యాంగ్‌కు ఆర్థికపరమైన విషయంలో సహకరించిన వ్యక్తులు, గూడ్స్ వాహనంతో హత్య చేస్తే కేసు నుంచి తప్పించుకోవచ్చని చెప్పిన వ్యక్తులెవరు.. హత్య వెనుక మృతుడి బంధువుల ప్రమేయం.. హత్యలో పాత్రదారులుగా రాజకీయ నాయకులు ఉన్నారా.. అనే కోణంలో ఏ1 మిల్లు వీరన్నను విచారించినట్లు సమాచారం. హత్యకు సహకరించిన నిందితులను సైతం విడివిడిగా విచారించారు. ఈ విషయంపై గద్వాల సీఐ శ్రీనును ‘సాక్షి’ సంప్రదించగా కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని, త్వరలో వివరాలను వెల్లడిస్తామని సీఐ తెలిపారు. ఆధార్ సేవ కేంద్రంలో చోరీ జడ్చర్ల: స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆధార్ సేవా కేంద్రంలో చోరీ జరిగింది. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ట్లు కేంద్ర నిర్వాహకులు రఫిక్ శుక్రవారం తెలిపారు. తాళాలు పగులగొట్టి కంప్యూటర్ మానిట ర్ ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేరుశనగ.. సంరక్షణ ఇలా..
అలంపూర్: యాసంగి మొదలవడంతో నీటి వసతి ఉన్న రైతులు ఈ ఏడాది వేరుశనగ సాగు చేపట్టారు. డిమాండ్, అధిక లాభా లు వస్తాయన్న ఆశతో వేరుశనగ సాగుపై దృష్టి పెట్టారు. అయితే ఈ పంటలో జింకు, ఇనుము దాతువు లోపాలతో దిగుబడి తగ్గే అవ కాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ పేర్కొంటున్నారు. పంటలో జింకు, ఇనుప ధాతువు లోప నివారణకు కింది జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. జింకు లోపానికి కారణాలు: భాస్వరం ఎరువుల వాడకం ఎక్కువగా ఉన్నప్పుడు. ఉదజని సూచిక 7.0 దాటినప్పుడు. భూమిలో మెగ్నిషీయం అధిక మోతాదులో ఉన్నప్పుడు పంటలో జింకు లోపం ఏర్పడుతుంది. జింకు లోప లక్షణాలు : ఆకులపై గోధమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు, కొమ్మలు చిన్నవిగా మారుతాయి. నివారణ: జింకు లోప నివారణకు ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి భూమిలో కలపాలి. పంట దశలో లోపం కనిపిస్తే చీలేటెడ్ జింక్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే పంటకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇనుము ధాతువు లోపం : ఇనుము లోపం కనిపించినప్పుడు ఆకులు ఈనెలు పచ్చగా ఉండి మిగిలిన భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. దీని వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగదు. నివారణ : ఫెర్రస్ సల్ఫేట్ లేదా అన్న భేడి 2 గ్రాములు, నిమ్మ, ఉప్పు 1 గ్రాము, యూరియా 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే ఇనుప ధాతువు నివారించవచ్చని పేర్కంటున్నారు. పాడి–పంట -
భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
నారాయణపేట: జిల్లా కేంద్రంలో మణికంఠ శెట్టి అనే వ్యక్తి ఇంట్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టగా దాదాపు రూ. 2,05,025 విలువ గల గుట్కా ప్యాకెట్లు లభించాయన్నారు. గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి మణికంఠ శెట్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచినా, అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. మద్దిమడుగు హుండీ లెక్కింపు అమ్రాబాద్: పదర మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ హుండీని శుక్రవారం అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. 40 రోజులకుగాను రూ.31,26,413 నగదు, మిశ్రమ వెండి 770 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తాన్ని అమ్రాబాద్ ఎస్బీఐలో భద్రపర్చారు. హుండీ లెక్కింపులో దేవాదాయ, ధర్మాదాయ ఇన్స్పెక్టర్ మదన్‌కుమార్, ఈఓ రంగాచారి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాములునాయక్, మాజీ పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
రోడ్డుపై వాయు విద్యుదుత్పత్తి
నారాయణపేట లిటిల్ స్టార్స్ స్కూల్ విద్యార్థులు నిరోనిక, సాయిచరణ్ రోడ్డుపై వెళ్తున్న వాహనాల వేగానికి వీచే గాలి నుంచి విద్యుదుత్పత్తి చేసే పరికరాన్ని ప్రదర్శించారు. రోడ్డుకు మధ్యలో ఫ్యాన్ రెక్కలతో కూడిన స్తంభాలను (టర్బన్) ఏర్పాటు చేయడం వలన వాహన వేగానికి వచ్చే గాలి ద్వారా వాయు విద్యుదుత్పత్తి అయి ట్రాన్స్ఫార్మర్కు చేరుతుంది. ప్రతి ఇంటిపైన దీనిని అమర్చడం వల్ల ఎలక్ట్రిసిటీని ఆదా చేయవచ్చు. ఇంధన రహితంగా వాహనాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌ను ఆదా చేయవచ్చు. -
మీ సేవా కేంద్రాల్లో అధిక చార్జీలు వసూలు చేయొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ జడ్చర్ల: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మీసేవా సెంటర్లను ఎప్పటికప్పుడు పరిశీలించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీసీ నిర్వహించి మాట్లాడారు. అధిక మొత్తంలో డబ్బులు తీసుకోకుండా మీసేవ సెంటర్ల నిర్వాహకులను నియంత్రించాలని సూచించారు. సీఎం, కలెక్టర్ ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. 22ఏలో ఫాం–1, ఫాం–2 మళ్లీ ఒకసారి పరిశీలించాలని, భూ భారతి దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలన్నారు. ఎన్నికల ఓటరు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన కావేరమ్మపేటలో మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోదారులతో మాట్లాడి మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ధ్రువీకరణ పత్రాల జారీకి ఎంతమేరకు రుసుం తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మాత్రమే రుసుం తీసుకోవాలని అంతకు మించి అధికంగా వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే మీసేవ కేంద్రాలు ఎవరి పేరు మీద ఉంటే వారే నిర్వహించాలని, కేంద్రాలను అద్దెకు ఇవ్వడం వంటివి చేస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. పాఠశాలల ఆకస్మిక తనిఖీ.. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని రాంనగర్, కొనపాలమూరు పాఠశాలలను అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పదోతరగతి విద్యార్థులకు ప్రణాళికబద్ధంగా తరగతులు బోధించాలని సూచించారు. -
మట్టిలో పోషకాల ఆధారంగా పంటల సాగు
జడ్చర్ల: మట్టిలో పోషకాల ఆధారంగా పంటలు సాగు చేయాలని డీఏఓ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్టెబోయిన్‌పల్లి గురుకుల విద్యాలయంలో మట్టి ప్రాముఖ్యత, మట్టి నమూనాల సేకరణ, మట్టిలో ప్రధాన, సూక్ష్మ పోషకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 50 మంది విద్యార్థులను రైతులుగా ఎంపిక చేసి మట్టి నమూనాలు సేకరించి ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ పంటలు సాగుకు సంబంధించి విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడటం వలన భూమిలో పోషకాలు నిర్జీవంగా మారే అవకాశం ఉందన్నారు. అంతేగాక నేల, గాలి, నీటి కాలుష్యం ఏర్పడుతుందని, రసాయన ఎరువులను వినియోగించడం కారణంగా సాగు వ్యయం పెరుగుతుందన్నారు. మట్టి పరీక్షల ఫలితాల ఆధారంగా లోపాలను గుర్తించి సరైన పోషకాల రక్షణ చర్యలు చేపడితే నేల ఆరోగ్యకరంగా ఉండి ఎక్కువ దిగుబడులు వస్తాయన్నారు. వి ద్యార్థి దశలోనే నేలపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్‌లో మంచి పరిణామాలు ఉద్భవించే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో ఏఓలు గోపినాథ్, ప్రదీప్‌కుమార్, భూసార పరీక్ష కేంద్రం ఏఓ రేవతి, ఏఈఓలు నవనీత, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, నోడల్ అధికారి అయేషా తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో జిల్లా ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయం అని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం ఆమె చాంబర్లో టీఎన్జీఓ యూనియన్ నాయకులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ యూనియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అలాగే ఈ సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, అసోసియేట్ అధ్యక్షుడుం శ్యాంసుందర్‌రెడ్డి, కోశాధికారి కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, నందకిషోర్, సహ కార్యదర్శి ప్రియాంక, పట్టణ అసోసియేట్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్, సహాయ కార్యదర్శి చక్రపాణి, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు రాజాపూర్: వివిధ పనులపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. రాజాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ముఖ్యంగా 22ఏకు సంబంధించిన ప్రభుత్వ భూములు, ప్రొహిబిటెడ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ విజయేందిర, ఆర్డీఓ నవీన్‌కుమార్‌కు తహసీల్దార్ రాధాకృష్ణ మొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ భారతి, ఆర్ఐలు యాదయ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల కట్టడికి పటిష్ట చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడంతోపాటు వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ద్విచక్ర వాహనదారు లు తప్పకుండా హెల్మెట్ ధరించడంతోపాటు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలని, కారు డ్రైవర్లు సైతం సీటు బెల్ట్ తప్పక పెట్టుకోవాలని సూ చించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. అనంతరం బైపాస్ రోడ్డు మార్గంలో త రచూ ప్రమాదాలు జరుగుతున్న హాట్స్పాట్ల ను ఎస్పీ పరిశీలించారు. బైపాస్ రోడ్డు మధ్య లో డివైండర్లు అక్రమంగా తొలగించి రాంగ్రూట్లో వెళ్తున్నారని ప్రధానంగా బైక్ వాహనదారులు ఇలా చేస్తున్నట్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కందులు క్వింటా రూ.6,612 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో కందులు క్వింటాల్ గరిష్టంగా రూ.6,612, కనిష్టంగా రూ.5,950 ధరలు లభించాయి. సీజన్ తగ్గడంతో వరి ధాన్యం అమ్మకానికి రాలేదు. కేవ లం కందులు మాత్రమే అమ్మకానికి వచ్చాయి. జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌ను విజయవంతం చేద్దాం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 5న నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌ను విజయవంతం చేద్దామని డీఈఓ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో వివిధ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన పలు కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయాలని, సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఎన్సీఆర్టీఈ నిబంధనల ప్రకారం ప్రదర్శనలో జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రదర్శనలు ఉంటాయని, ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారన్నారు. సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థులు కొత్త ప్రయోగాలతో రావాలని ఆకాంక్షించారు. గతేడాది నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌తో జిల్లాకు మంచి పేరు వచ్చిందని గుర్తుచేశారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు సైన్స్ ఫెయిర్ ఉంటుందని చెప్పారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి షంషీర్‌అహ్మద్, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. జోనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో గత నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జోనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి తన్షిత ప్రతిభ కనబరిచినట్లు స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈ పోటీల్లో తన్షిత–37 కేటగిరిలో పాయింట్ ఫైట్‌లో కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. ఈ మేరకు శుక్రవారం తన్షితను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాస్టర్ రవికుమార్, సలహాదారులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
తాలు పేరిట.. నిలువు దోపిడీ
అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ కిలోకు రూ.24చొప్పున నష్టం.. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్‌కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. రైతులకు ఫోన్లు చేసి మరీ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్‌కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్‌కు4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక బస్తాలో 40.600 కిలోలు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది. ఖరీఫ్‌లో రైస్ మిల్లర్లఅక్రమార్జన రూ.45 కోట్లు క్వింటాల్‌కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో.. అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే.. మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు -
ముసాయిదా ప్రక్రియ పకడ్బందీగా పూర్తిచేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి సరిచేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న 200 పోలింగ్ కేంద్రాలను అవసరమైతే 270కి పెంచాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను జాగ్రత్తగా పూర్తిచేయాలని, ఆయా పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయవంతం చేసేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్చార్జి ఎంఈ విజయ్‌కుమార్, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఆర్ఓలు యాదయ్య, మహమ్మద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. తప్పొప్పులను సరిచేయాలని వినతి నగరంలోని డివిజన్ నం.40లో నివసిస్తున్న తనతోపాటు కుటుంబ సభ్యుల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో డివిజన్ నం.57లో చూపించడం తగదని డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెన్హర్ అన్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా డివిజన్ నం.40లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేటకు చెందిన కొందరు పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అలాగే ఎంతో దూరంలో ఉన్న బొక్కలోనిపల్లి, బండమీదిపల్లి, ఏనుగొండలో నివసిస్తున్న వారి పేర్లు సైతం ఇందులోనే ఉన్నాయని ఆరోపించారు. ఇలా ఎన్నో తప్పొప్పులు జరిగాయని వాటన్నింటినీ వెంటనే సరిచేయాలని విన్నవించారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
మిడ్జిల్: విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున మిడ్జిల్ మండలంలోని లింభ్యాతండా సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని వస్పుల గ్రామానికి చెందిన గొరిగె మదన్ (24) పోలేపల్లి సెజ్‌లోని హెటిరో కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 31, బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి విధులకు హాజరయ్యాడు. డ్యూటీ ముగించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తన మోటార్ సైకిల్‌పై ఇంటికి వస్తుండగా.. జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రహదారిపై లింభ్యాతండా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మదన్ ఘటనా స్థలంలో మృతి చెందాడు. మృతదేహానికి పోర్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య మనీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య గొరిగె మనీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నీటిసంపులో పడి చిన్నారి మృతి అమ్రాబాద్: నీటిసంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మండారి రాణి, సైదయ్య దంపతుల కుమార్తె జనశ్రీ(రెండున్నరేళ్లు) తన తల్లి ఇంట్లో పని చేస్తుండగా ఇద్దరు అన్నలతో కలిసి ఆడుకుంటుంది. ఈ క్రమంలో నీటిసంపు మూత తీసి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడింది. తల్లి గమనించి బయటకు తీయగా నీళ్ల మింగి పరిస్థితి విషమంగా మారింది. 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వ్యక్తి అనుమానాస్పద మృతి అయిజ: మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు (50) గురువారం మండలంలోని మేడికొండ గ్రామ సమీపంలో రోడ్డుపై అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆంజనేయులకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈయనకు గతేడాది గుండెపోటు వచ్చిందని, ఇప్పుడు కూడా గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైలు కిందపడి యువతి ఆత్మహత్య గద్వాల క్రైం: గుర్తు తెలియని యువతి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సెంకడ్ రైల్వేగేట్ సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కాచిగూడ నుంచి గుంటూరుకు వెళ్తున్న రైలు గద్వాల రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయంలో స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువతి (26) రైలు పట్టాలపై కూర్చొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రమాదంలో సదరు యువతి అక్కడికక్కడే పడి మృతి చెందింది. గమనించిన లోకో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కేసు నమోదు చేసి మృతురాలి వివరాలపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాల్సిందిగా ఆయన తెలిపారు. రేడియం స్టిక్కర్ షాపు దగ్ధం అచ్చంపేట రూరల్: ప్రమాదవశాత్తు రేడియం స్టిక్కర్ షాపు దగ్ధమైన ఘటన గురువారం మధ్యాహ్నం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియం సమీపంలో రాంబాబు అనే వ్యక్తికి చెందిన రేడియం స్టిక్కర్ షాపు డబ్బా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో డబ్బాను సగం తెరిచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు డబ్బాకు నిప్పంటుకొని వస్తువులు దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ అధికారి శంకర్, సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.2 లక్షల నష్టం సంభవించినట్లు బాధితుడు రాంబాబు తెలిపారు. -
‘పాలమూరు’ను పట్టించుకోని కేసీఆర్
దేవరకద్ర రూరల్: బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణ మీద ఉన్న ప్రేమతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు భారీగా నిధులు మళ్లించడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగలేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూత్పూర్లో సభ నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. 2015, జూన్‌న్11న నాడు ముఖ్యమంత్రి హోదాలో ఇదే ప్రాంతంలో కర్వెన ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేసి భూములు కోల్పోయిన వారికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. నేటికీ పదేళ్లు గడిచినా పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, అవసరాల కోసం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచి ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు. కర్వెన ప్రాజెక్ట్ ప్రధాన కాల్వల కోసం అంగుళం భూమి కూడా సేకరించకుండా ఎన్నికల సమయంలో హంగు ఆర్భాటాలతో నార్లాపూర్ దగ్గర మోటార్ ప్రారంభించారని ఎద్దేవా చేశారు. 2017లో కోయిల్‌సాగర్ నుంచి అదనంగా 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తానని ప్రగల్భాలు పలికిన హరీశ్‌రావు కనీసం 50 ఎకరాలకు కూడా అందించలేదని విమర్శించారు. మామ అల్లుళ్లు కలిసి పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఐదు సార్లు సమీక్ష నిర్వహించారని.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్ట్ వద్ద మట్టి, కాంక్రీట్ పనులు చేపట్టినట్లు వివరించారు. నిపుణులతో చర్చించి గతంలో ఉన్న లోపాలను సరిచేసి పనులు చేపడతామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేసి ఉమ్మడి జిల్లా ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే భూత్పూర్కు రావాలన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అధికారులతో సమీక్ష.. అంతకుముందు పుర పరిధిలోని సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రూ.15 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకొని వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదిలో యువకుడి గల్లంతు
కొల్లాపూర్ రూరల్: ప్రమాదవశాత్తు మండలంలోని సోమశిల సమీపంలో ఉన్న కృష్ణానదిలో పడి యువకుడు గల్లంతైన ఘటన గురువారం చోటు చేసుకుంది. తోటి మిత్రులు చెప్పిన వివరాలు.. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులతో కలిసి బింగిని అశోక్ డిసెంబర్ 31 రాత్రి వేడుకలు చేసుకోవడానికి సోమశిల చేరుకున్నారు. ఈ సందర్భంగా తోటి మిత్రులు చెప్పినా వినకుండా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వైజాక్ జాలర్లకు చెందిన పుట్టి వేసుకొని అశోక్ అర్ధరాత్రి నదిలో వెళ్లాడు. అతడు ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన మిత్రులు గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ పుట్టిలో అశోక్‌కు సంబంధించిన చెప్పులే ఉన్నాయని మత్స్యకారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కొల్లాపూర్ ఇన్చార్జి ఎస్ఐ సతీష్ సోమశిలకు చేరుకొని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గల్లంతైన అశోక్ కర్నూలు జిల్లాకు చెందినవాడని తెలిపారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో సెక్యూరిటీ సెంటర్లో పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అతడికి భార్య, కుమార్తె ఉన్నట్లు తోటి మిత్రులు తెలిపారు. -
మన్యంకొండ.. భక్తులే నిండ
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం గురువారం భక్తజన సందోహంతో పులకించింది. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొన్నారు. ఉదయం 7 నుంచే భక్తులు ప్రధాన ముఖద్వారం నుంచి గర్భాలయం వరకు దర్శనానికి బారులు తీరారు. దేవస్థానంతో పాటు పక్కనున్న శివాలయం, కొండ దిగువనున్న అలివేలు మంగతాయారు ఆలయంలో భక్తులు పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఛైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు అన్ని ఏర్పాట్లు చేశారు. -
సోత్‌జోన్ పోటీలకు బయలుదేరిన పీయూ జట్టు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్, ఆల్ ఇండియ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పీయూ షటిల్ బ్యాట్మింటన్ జట్టు గురువారం బయలుదేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని క్లీఫ్ డీమ్డ్ యూనివర్సిటీలో ఈనెల 3వ నుంచి 6వ తేదీ వరకు పోటీలు జరగనుండగా పీయూ జట్టు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు, కోచ్‌లకు వీసీ శ్రీనివాస్ క్రీడా దుస్తులను అందజేశారు. విద్యార్థులు ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్, కోచ్ అరుణ్, సత్యభాస్కర్‌రెడ్డి, రజిని, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
మన హక్కులపై మాట్లాడేందుకు భయమెందుకు?
సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణానీటిలో తెలంగాణ హక్కులపై మాట్లాడేందుకు కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. కృష్ణా బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఎలాంటి హక్కు ఉండదని చెప్పారు. వాస్తవానికి మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 574 టీఎంసీలు రావాలన్నారు. గతంలో కేటాయించిన వాటా తాత్కాలిక సర్దుబాట్ల కోసం చేసిందే తప్ప శాశ్వతం కాదని చెప్పారు. ప్రభుత్వాలు ఏవైనా ప్రజల హక్కులను కాపాడాలని కోరారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లవని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు పదవులు అలంకార ప్రాయంగా మారాయని దుయ్యబట్టారు. వాటిని బిరుదులుగా భావించకుండా బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో అతీగతీ లేదని విమర్శించారు. హెలికాప్టర్లో తిరిగేందుకే మంత్రుల ఆరాటం తప్ప ప్రాజెక్ట్ పనులపై లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 36 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉంటే ఇప్పటికీ 7లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోందన్నారు. ప్రజల సాగునీటి హక్కుల కోసం ఉద్యమిస్తానని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని తన ఆపనని స్పష్టం చేశారు. ● కృష్ణానీటిలో తెలంగాణ హక్కులను కాపాడాలి ● మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి -
జోగుళాంబ క్షేత్రం.. భక్తజన సంద్రం
● నూతన సంవత్సర వేళ.. ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు ● వాహనాల రద్దీతో ఇబ్బందులు కురుమూర్తి గిరులు కిటకిట.. చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధిచేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలంపూర్: నూతన సంవత్సరం మొదటిరోజు గురువారం జోగుళాంబ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయాల ఆవరణ కిటకిటలాడింది. క్షేత్రానికి వచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులుతీరి జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తుల వాహనాల రాకపోలతో ప్రధాన రహదారులు రద్దీగా మారి ట్రాఫిక్ సమస్య తలెత్తగా పోలీసులు నియంత్రించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అలంపూర్ చౌరస్తా నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి బస్సు కొరత వేధించింది. -
పనిలోనూ ‘నూతనో’త్సాహమే..
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటూ కూలీలు సైతం నూతన సంవత్సర వేడుకులను ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుక చేసుకోవాలనే ఉత్సాహం ఉండాలే తప్పా.. దానికి డీజే శబ్దాలు, విసురుకోవడానికి రంగుల పేపర్లు, శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్లెక్సీలు ఉండాల్సిన అవసరం లేదని నిరూపించారు. గురువారం అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ శివారులో రాఘవేందర్ వ్యవసాయ పొలంలో నాట్లు వేయడానికి వెళ్లిన కూలీలు యూరియా బస్తానే టేబుల్‌గా ఉంచి కేక్ కట్ చేసి మహిళలు ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. – అడ్డాకుల -
జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుదాం
● అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నూతనోత్సవంతో ప్రభుత్వ అధికారులందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి పాటు పడుదామని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. గురువారం నాలుగో తరగతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాను అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ పాలనలో కిందిస్థాయి ఉద్యోగుల పాత్ర కీలకమని వారు నిబద్ధతతో పని చేయాలన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల ఏదైనా జరిగితే కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. ఓ ప్రమాదంలో తన సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయానని, అలాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించి, సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ఈ రోడ్డు భద్రత కారక్రమంలో తాను కూడా తన వంతు బాధ్యతగా తన సొంత డబ్బులతో జిల్లా కలెక్టరేట్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్ సిబ్బంది ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, హెల్మెట్ వినియోగంపై అవగాహన కలిగించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
‘సవాయిగూడెం’లో ఓటు చోరీ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో ఓటు చోరీకి సంబంధించిన ఓ కేసును జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఓటర్ లిస్టులో చనిపోయిన వారు ఉన్నారని.. వలస వెళ్లిన వారు డబుల్ ఓటర్లుగా ఉన్నారని పలువురు గ్రామస్తులు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌తో పాటు రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని తొలగించాలని రెండేళ్ల నుంచి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు గ్రామంలోని 65 మంది పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలను పాత ఓటర్ లిస్టు ప్రకారమే నిర్వహించారు. దీనిపై గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా కోర్టులో పిల్ వేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వో తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్, సామగ్రి అంతా కోర్టుకు సమర్పించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతుదారు గెలుపు.. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వెల్లడించిన జాబితా ప్రకారం గ్రామంలో మొత్తం 2,201 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు యామిని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలత బరిలో నిలిచారు. శ్రీలతకు 913 ఓట్లు రాగా.. యామినికి 918 ఓట్లు వచ్చాయి. దీంతో యామిని ఐదు ఓట్లు తేడాతో గెలుపొందారు. మొత్తంగా 1,882 ఓట్లు పోల్ కాగా.. యామినికి 918, శ్రీలతకు 913, నోటాకు 12 రాగా.. 39 ఓట్ల చెల్లలేదు. వందకు పైగా దొంగ ఓట్లు వేయించారు.. గ్రామంలో వందకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని.. పోలింగ్ రోజు పేర్లు తొలగించిన వారి స్థానంలో పలువురు ఓటు వేసేందుకు రాగా అభ్యంతరం తెలిపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అయినా అధికార కాంగ్రెస్ నేతల అండదండలతో పోలీసులు బందోబస్తు మధ్య వారితో ఓటు వేయించారని చెబుతున్నారు. ఈ దొంగ ఓట్లతోనే తాము ఓటమి పాలైనట్లు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన పలువురు తెలిపారు. ఇది ముమ్మాటికీ ఓటు చోరేనని.. ఓటు చోరీ గురించి గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నేతలు దీనిపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని.. సవాయిగూడెం ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఓటు చోరీకి సంబంధించి ఇది రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు అని చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లోదొంగ ఓట్లు వేశారని పిల్ విచారణకు స్వీకరించిన వనపర్తి జిల్లా కోర్టు జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వోలకు నోటీసుల జారీ 8న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు బ్యాలెట్ బాక్స్, సామగ్రి సమర్పించాలని సూచన -
కొత్త ఏడాదిలో పారదర్శకమైన సేవలు అందించాలి
మహబూబ్‌నగర్ క్రైం: గతేడాదిలో ఎదుర్కొన్న సవాళ్లను, సాధించిన విజయాలను గుర్తు చేసుకుని నూతన ఏడాదిలో పోలీస్ అధికారులు మరింత క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కేక్‌కట్ చేయడంతో పాటు పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శకమైన సేవలు అందించడం పోలీస్‌శాఖ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఏఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరిబాబు, సీఐలు పాల్గొన్నారు. ● కాగా.. ఎస్పీ డి.జానకికి సెలక్షన్ గ్రేడ్ కింద పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
డ్రంకన్ డ్రైవ్‌లో 86 మంది పట్టివేత
మహబూబ్‌నగర్ క్రైం: నూతన సంవత్సర వేడుల నేపథ్యంలో బుధవారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగరంలో మొత్తం ఐదు బృందాలతో పాటు జడ్చర్లలో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో 86 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పాయింట్స్‌ను అర్ధరాత్రి తర్వాత ఎస్పీ డి.జానకి పరిశీలించారు. మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు 26 కేసులు, టూటౌన్ 8, జడ్చర్లలో 10, కోయిలకొండలో 8, నవాబ్‌పేటలో 7 కేసులు నమోదు చేశారు. రూ.279.29 కోట్ల మద్యం అమ్మకాలు తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని మద్యం డిపో నుంచి డిసెంబర్లో రూ. 279.29 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసినట్లు డిపో అధికారులు గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట టీజీఎస్బీసీఎల్ స్టాక్ పాయింట్ పరిధిలో 158 వైన్స్, 25 బార్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క నెలలోనే రూ. 279.29 కోట్ల విలువైన 2.70.400 ఐఎంఎల్ (లిక్కర్) కాటన్లు, 2.29.400 బీర్ల కేసులను తిమ్మాజిపేట డిపో నుంచి సరఫరా చేశారు. సాధారణంగా స్టాక్ పాయింట్ నుంచి ప్రతినెలా రూ. 150కోట్ల విలువైన మద్యం సరఫరా చేస్తారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 31న రూ. 10కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి స్థానిక తెలంగాణచౌరస్తాలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మౌలిక వసతుల కోసం నిధుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా రహదారులు, డ్రెయినేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్ గోనెల శ్రీనివాసులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములుయాదవ్, అజ్మత్‌అలీ, ఖాజాపాషా, రాషెద్‌ఖాన్, అంజద్‌అలీ, ప్రశాంత్, షేక్ఉమర్పాషా తదితరులు పాల్గొన్నారు. -
మహబూబ్‌నగర్
హ్యాపీగా.. జాలీగా.. శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026పార్క్‌లో రైలు ప్రయాణం న్యూ ఇయర్ సందర్భంగా గురువారం జిల్లావ్యాప్తంగా సందడి కనిపించింది. పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు జనంతో కిటకిటలాడాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా కొత్త సంవత్సరం వేడుకల్లో ఆడిపాడి.. సంతోషంగా గడిపారు. ఇళ్ల ముందు వివిధ ఆకృతుల్లో రంగవల్లులతో అలంకరించారు. వాటి మధ్యలో ‘వెల్కం న్యూయర్–2026’ అనే అక్షరాలు వచ్చేలా ముగ్గులను తీర్చిదిద్దారు. కుల, మతాలకతీతంగా నూతన సంవత్సర కేక్‌లు కట్ చేసి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో మయూరీ ఎకో పార్క్‌లో సందర్శకుల తాకిడి కనిపించింది. – స్టేషన్ మహబూబ్‌నగర్ భక్త జనసంద్రం నూతన సంవత్సరం సందర్భంగా జోగుళాంబ క్షేత్రం గురువారం భక్తులతో కిటకిటలాడింది. –8లో u -
భక్తిశ్రద్ధలతో మన్యంకొండకు పాదయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం మన్యంకొండకు మహాపాదయాత్ర చేపట్టారు. బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బండమీదిపల్లి, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవస్థానం వరకు నిర్వహించారు. వందలాది మంది భక్తులు గోవిందనామ, హరి నామ సంకీర్తనలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం భక్తులు మన్యంకొండ శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు గొండ్యాల రాఘవేంద్రశర్మ మాట్లాడుతూ ఇలాంటి యాత్రలు చేయడం వల్ల హిందువుల్లో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. భక్తిమార్గం దిశగా యువతను నడిపించడానికి ఇలాంటి పాదయాత్రలు చాలా ఉపయోగపడుతాయన్నారు. ధనుర్మాసంలో విష్ణు క్షేత్రాన్ని దర్శించుకోవడం మోక్షదాయకమని పేర్కొన్నారు. గుండ వెంకటేశ్వర్లు, తల్లం నాగరాజు, సూది రాము, రాఘవ, రాఘవేందర్శర్మ పాల్గొన్నారు. -
పుర పోరు.. కసరత్తు జోరు
మున్సిపాలిటీల వారీగావార్డుల వివరాలు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. 2 మినహా మిగిలిన 19 మున్సిపాలిటీల్లో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్‌లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. మహబూబ్‌నగర్ (కార్పొరేషన్)మొత్తం వార్డులు 376తొలిసారిగా కార్పొరేషన్లో.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్‌గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు. కొత్తగా దేవరకద్ర.. మద్దూరు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన రోజే దేవరకద్ర, మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమయంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామాలను కలుపుకుని 16 వార్డులుగా విభజించారు. అదేవిధంగా దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకుని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి ఓటర్ల జాబితా సైతం.. నేడు ముసాయిదా విడుదల రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ 60దేవరకద్ర 12వనపర్తి 33అయిజ 20 -
కనులపండువగా శ్రీనివాస కల్యాణం
స్టేషన్ మహబూబ్‌నగర్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోఠి పీఠం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ వైభవాన్ని గొండ్యాల రాఘవేంద్రశర్మ, ఉత్తర ద్వారా దర్శన వైభవాన్ని తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, గోవింద నా వైభవాన్ని ఇరువింటి శ్రవణ్‌కుమార్ శర్మ భక్తులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీవేంకటేశ్వర సేవా మండలి సభ్యులు గుండా వెంకటేశ్వర్లు, సుదర్శన్‌గౌడ్, విజయభాస్కర్‌రెడ్డి, నందకిషోర్, మిర్యాల వేణుగోపాల్, లక్ష్మయ్య, నాగరాజు, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు సీమ నరేందర్ పాల్గొన్నారు. శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్న పండితులు -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సైబర్ నేరాలపై చాలా అప్రమత్తంగా ఉండాలని వాట్సప్‌లలో న్యూ ఇయర్ శుభాకాంక్షలు పేరుతో వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లలో ఏపీకే పైల్స్ జతచేసి పంపే అవకాశం ఉందని, అప్రమత్తంగా లేకపోతే సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి లింక్‌లు ఓపెన్ చేయడం వల్ల మోబైల్లో ఉండే వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయాలని సూచించారు. ● జిల్లాలో ఉన్న ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలకనుగుణంగా కుటుంబసభ్యుల మధ్యలో వేడుకలు చేసుకోవాలన్నారు. అవసరం మేరకే యూరియా వినియోగించండి జడ్చర్ల: రైతులు పంటలకు అవసరం మేరకే యూరియాను వినియోగించాలని వ్యవసాయ శాఖ నోడల్ అధికారి బాలునాయక్ పేర్కొన్నా రు. బుధవారం డీఏఓ వెంకటేశ్‌తో కలిసి జడ్చర్లలో ఆగ్రో సేవా కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. యూరియా కొనుగోలు, కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా యూరియా బుకింగ్, రైతులకు యాప్ ద్వారా బుకింగ్‌పై ఎంతమేరకు అవగాహన కలిగి ఉన్నారని విచారించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 17,610 మంది రైతులు 52,545 బస్తాల యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకొని కొనుగోలు చేశారని తెలిపారు. ఇంకా 26,220 బస్తాల యూరియా నిల్వ యాప్ ద్వారా కొనుగోలుకు సిద్ధంగా ఉందన్నారు. -
సాలార్‌నగర్ ‘భూ ఆధార్’ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గండేడ్ మండలం సాలార్నగర్లో ‘భూ ఆధార్’ సర్వే పైలట్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామంలోని ప్రతి భూ యజమానికి సంబంధించిన భూమి వివరాలను స్పష్టమైన సరిహద్దులతో పాటు కచ్చితమైన అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలని, అమలు సమయంలో ఎదురయ్యే సమస్యలు, అభ్యంతరాలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ నవీన్, అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే అశోక్, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్యాలతో ముందుకు..
జీవితంలో ఉన్నతంగా ఎదగాలని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. గతేడాది చేసిన తప్పిదాలు పునరావృతం కానివ్వను. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలతో మార్పు తీసుకురావాలని అనుకుంటున్నా. భవిష్యత్‌లో క్లాట్–2026 పరీక్షను క్రాక్ చేసేందుకు కృషి చేస్తా.. చదువుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తా. – మేఘన, ఎంపీసీ మొదటి సంవత్సరం సరికొత్త ఆలోచనలతోముందుకు.. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తా. కుటుంబసభ్యులు, స్నేహితుల తో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. చదువుకే అధిక ప్రాధా న్యత ఇస్తా. ఈ మేరకు సమయంలో మార్పులు చేసుకుంటాను. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదిగేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటాను. – కృతిక, ఎంపీసీ మొదటి సంవత్సరం తప్పిదాలను సరిదిద్దుకుంటా.. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లే విధంగా ప్రయత్నిస్తాను. చదువుపై ప్రత్యేక దృష్టిసారించి జీవిత లక్ష్యమైన జేఈఈ మెయిన్స్ క్రాక్ చేసే విధంగా కృషి చేస్తా. మంచి ఆలోచలనతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాం. – ప్రతిక, ఎంపీసీ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ సీటు సాధిస్తా.. ఎంబీబీఎస్ సీటు సాఽధించాలన్నదే నా లక్ష్యం. కొత్త సంవత్సరంలో సీటు సాధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ప్రణాళికా బద్ధంగా చదువుకుంటాను. నీట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతా. చదువులో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తా. – దీక్షిత, బైపీసీ మొదటి సంవత్సరం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: గత జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకొని కొత్త సంవత్సరంలో నూతనోత్సాహంతో ముందుకెళ్తామని విద్యార్థులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని వాగ్దేవీ జూనియర్ కళాశాలలో బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాక్ షోకు మంచి స్పందన లభించింది. కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కొత్త సంవత్సరంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తామన్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు, అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని.. గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు సరికొత్త ఆలోచనలు, కార్యాచరణతో విజయ తీరాలకు ‘సాక్షి’ టాక్ షోలో వాగ్దేవీ జూనియర్ కళాశాల విద్యార్థులు -
రెండోరోజు కొనసాగిన ధర్నా
● గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించొద్దని రైతుల నిరసన గోపాల్పేట: ఏదుల రిజర్వాయర్ పక్కనే ఉందని, గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టి స్థానికంగా ఉండే రైతుల భూములను కొల్లగొట్టొద్దని ప్రారంభించిన ధర్నా బుధవారం రెండోరోజుకు చేరింది. ఏదుల రిజర్వాయర్‌కే తూము ఉందని దీనిద్వారా నీటిని వదిలితే కోడేరు మండలంలోని పలు గ్రామాలకు సైతం నీరు వెళుతుందని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్‌కు ఏర్పాటు చేసిన తూము వద్దకు రెండు గ్రామాల రైతులు, అఖిలపక్ష నాయకులు చేరుకుని విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నిర్మించారని, అప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రపోజల్ పెట్టగా అప్పటి మంత్రి నిరంజన్‌రెడ్డిని భూములు కోల్పోతామని చెప్పగా గొల్లపల్లి రిజర్వాయర్‌ను విరమించుకున్నారని వివరించారు. ఇప్పుడేమో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పడం రైతులను ముంచడమే అవుతుందని అన్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి గొల్లపల్లి రిజర్వాయర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ధర్నాను ఉధ్రుతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు అర్జున్‌రావు, జానయ్య, శ్రీవర్దన్‌రెడ్డి, రాములు, చెన్నారం మాజీ సర్పంచు రమేష్, ఇందిర, రాములు, అబ్దుల్ మహమూద్, రెండు గ్రామాల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నయా జోష్‌లో ప్రత్యేక ఆంక్షలు
● జిల్లాకేంద్రంపై ప్రత్యేక దృషిసారించిన పోలీసులు ● తొమ్మిది బ్రీత్ అనలైజర్స్తో నాలుగు బృందాల తనిఖీలు ● బైపాస్, చించోళి రహదారిపై పెట్రోలింగ్ మహబూబ్‌నగర్ క్రైం: న్యూఇయర్ వేడుకలకు ఓవైపు యువత సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కొత్త ఏడాది వేడుకలను ఎలాంటి అనుమతి లేదని.. ఎవరి ఇళ్లలో వారు చేసుకోవాలని పోలీస్ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 31రాత్రి వేడుకలు అంటే ముఖ్యంగా మద్యం ఏరులై పారేలా కనిపిస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1న అత్యధికంగా అమ్మకాలు సాగించేందుకు మద్యం దుకాణాలు, బార్లు సిద్ధమవుతున్నాయి. ఈ జోష్‌లో చాలామంది ఉదయం నుంచి పార్టీల్లో మునిగి తేలుతుంటారు. ప్రధానంగా యువత, విద్యార్థులు ఎంతో ప్రత్యేకంగా చేసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. మద్యం తాగి వాహనాలను నడుపుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. ● పాలమూరు జిల్లావాసులతోపాటు నగర యూత్ డిసెంబర్ 31తోపాటు న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి వరకు జరుపుకోవడం జరిగింది.. బుధవారం సాయంత్రం నుంచే సంబురాలు మొదలు పెట్టడంతోపాటు ఎక్కడిక్కడ బృందాలుగా ఏర్పడి దావత్‌లు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ నగరంతోపాటు జడ్చర్లలో ఆయా అపార్టుమెంట్లలో.. ఉమ్మడి కుటుంబాల్లో భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పట్టణంలో దుకాణాలన్నీ అమ్మకాలతో సందడిగా మారాయి. ముఖ్యంగా బేకరీలకు గిరాకీ బాగా పెరిగింది. వేడుకలు జరపుకొనే వారికోసం వేలాది కేకులను నిర్వహకులు తయారు చేయడం కోసం ఏర్పాట్లు చేసి విక్రయాలు నిర్వహించారు. ● యువత, విద్యార్థులు నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని సాయంత్రం నుంచే మందు, విందు, వాహనం తదితర అంశాలకు సంబంధించిన నగదు, ఇతరత్రా సామగ్రిపై చర్చించుకున్న దృశ్యాలు కన్పించాయి. తమకు అనువైన చోట్ల పార్టీలు చేసుకోవడానికి స్థలాల ఎంపికలో ఎవరికివారు బీజీబీజీగా గడిపారు. మద్యం తాగి రాత్రి 12గంటలు దాటిన వెంటనే ద్విచక్ర వాహనాలపై రోడ్లపై రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అమలు చేశారు. నగరంలోని బైపాస్ రోడ్‌లోని పిస్తాహౌజ్ నుంచి పాలకొండ చౌరస్తా వరకు అదేవిధంగాా చించోళి రోడ్డు మార్గంలో కోయిలకొండ ఎక్స్‌రోడ్ నుంచి వీరన్నపేట వరకు వరకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. ● గట్టి బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో డీఎస్పీ ఆధ్వర్యంలో ఆరు నుంచి 8మంది సీఐలతోపాటు ఎస్ఐలు, కానిస్టేబుల్స్ భారీ స్థాయిలో బందోబస్తులో పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీస్ సిబ్బందిని రప్పించారు. జిల్లా కేంద్రంలో 9 బ్రీత్అనలైజర్లతో వాహనదారులను తనిఖీలు నిర్వహించారు. మద్యం మ త్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు బార్ల యాజమానులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మద్యం మత్తు లో వాహనాలు నడిపేవారు ప్రమాదాలు చేయకుండా బుధవారం రాత్రి8గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణంలో ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రతి వాహనదారుడిని, వాహనాల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం మ త్తులో వాహనాలు నడిపినవారిపై పోలీసులు న్యా య స్థానాలు కఠినంగా వ్యవహరించనున్నాయి. ఇయర్ వేడుకలకు ఎలాంటి అనుమతి లేదు. ఎవరికి వారు ఇళ్లలో నిర్వహించుకోవాలి. ఎక్కువమంది రోడ్లపైకి రాకూడదు. ఈ 31వేడుకల్లో ప్రధానంగా డ్రంకన్‌డ్రైవ్, త్రీబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాం. 31న రోజు రాత్రి 11గంటల నుంచి రోడ్లపై తనిఖీలు చేశాం. పిస్తాహౌజ్, అంబేద్కర్ చౌరస్తా, వన్‌టౌన్ చౌరస్తా, భగిరథ కాలనీకమాన్ వద్ద ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేసి డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేశాం. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బృందం పనిచేసింది. మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కల్గించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. – వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ డీఎస్పీ -
టీ–20 లీగ్‌లో డేవిడ్ సెంచరి
10 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై మహబూబ్‌నగర్ విజయం మహబూబ్‌నగర్ జట్టుతో ఎండీసీఏ ప్రతినిధులు మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ రెండో ఫేజ్‌లో మహబూబ్‌నగర్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. జట్టులో వాసుదేవ్ 58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. వి.వినీత్ 24 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు మహ్మద్ షాదాబ్ అహ్మద్ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు, మహ్మద్ ముఖితుద్దీన్ 4 ఓవర్లలో 18 పరుగులు, రాకేష్‌నాయక్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి చెరో వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన మహబూబ్‌నగర్ జట్టు నిర్ణీత 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ డేవిడ్ క్రిపాల్రాయ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అజేయంగా సెంచరీ చేశారు. కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 పరుగులు, అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ క్రిపాల్రాయ్కు దక్కగా రూ.5 వేల నగదు, మెమోంటో అందుకున్నారు. ఈ నెల 3న మహబూబ్‌నగర్ జట్టు ఖమ్మం జట్టుతో తలపడనుంది. ● ఎండీసీఏ అభినందనలు.. టీ–20 లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో లీగ్‌లో సత్తాచాటి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. మ్యాచ్‌లో మెరుగైన ప్రతిభ కనబర్చినందుకు ప్రోత్సాహకంగా ఎండీసీఏ తరఫున డేవిడ్ క్రిపాల్రాయ్కు రూ.5 వేలు, అబ్దుల్ రాఫేకు రూ.2,500 నగదు అందజేశారు. సంఘం ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, శివశంకర్, నరేష్ క్రీడాకారులను అభినందించారు. -
చోరీలపై దృష్టి ఏది?
● మహబూబ్‌నగర్ లక్ష్మీనగర్ కాలనీలో వరస దొంగతనాలు ● నాలుగు రోజుల కిందట భారీ మొత్తంలో అపహరించిన దొంగల ముఠా ● కోల్పోతున్న మొత్తాన్ని ఎఫ్ఐఆర్లో చూపడం లేదని పోలీసులపై విమర్శలు మహబూబ్‌నగర్ క్రైం: ఇటీవల కాలంలో రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా దొంగతనా లు పెరిగిపోయాయి. రెండు మూడు రోజులకు ఓ సారి ఏదో ఏరియాలో చోరీల పరంపర సాగుతుంది. ప్రధానంగా లక్ష్మీనగర్ కాలనీలో వరస దొంగతనాలతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం మీనాక్షి అపార్ట్మెంట్లో ఓ ప్లాట్‌లో భారీగా దొంగతనం జరిగినట్లు సమాచారం. 20 తులాల వరకు బంగారం, వెండి, అధి క మొత్తంలో డబ్బు అపహరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి పోలీసు బృందం అపార్ట్మెంట్ దగ్గర వివరాలు సేకరించినట్లు సమాచారం. సదరు దొంగల ముఠా అర్ధరాత్రి వేళలో కాలనీలో తిరిగిన దృశ్యాలు స్థానికంగా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ప్రధానంగా రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అధిక మొత్తంలో కొత్త కాలనీలు ఉండటం వల్ల రాత్రి పెట్రోలింగ్ నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దీంతో తాళాలు వేసి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. అఽ దిక మొత్తంలో దొంగతనాలు జరుగుతున్న మరోవైపు పోలీస్ అధికారులు మాత్రం వారు చూపించే అధికారిక లెక్కల్లో చాలా తక్కువగా చూపడం హాస్యస్పదంగా ఉంది. దీంతో పాటు దొంగతనం జరిగిన సమయంలో బాధితులు కోల్పోయిన బంగారం లేదా వెండి, డబ్బులలో కనీసం 40శాతం కూడా ఎఫ్ఐఆర్లలో చూపడం లేదనే విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ దొంగతనం విషయంపై రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్‌ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
ట్రాన్స్జెండర్లకు వందశాతం సబ్సిడీ రుణాలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు వందశాతం సబ్సిడీతో ఆర్థిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి జరీనాబేగం బుధవారం ప్రకనటలో తెలిపారు. అర్హులైన ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్‌కు ఒక్కొకరికి రూ.75వేల చొప్పున మొత్తం 1యూనిట్‌కు రూ.75వేలు వందశాతం సబ్సిడీ కింద జిల్లాకు కేటాయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా మేజిస్ట్రేట్ జారీచేసిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని, 18 నుంచి 55ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు ఆదాయం మించొద్దని తెలిపారు. నమూనా దరఖాస్తులను, అర్హత ప్రమాణాలను జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో పొంది ఈనెల 9వ తేదీలోగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ సంక్షేమాధికారిణి కార్యాలయం, కలెక్టరేట్లో అందజేయాలని ఆమె కోరారు. కురుమూర్తి ఆలయం చుట్ట్టూ గిరి ప్రదక్షిణ చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండలం అమ్మాపురుం కురుమూర్తి స్వా మి ఆలయ గిరులలో బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గిరి ప్ర దక్షిణ నిర్వహించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్దియాదిరెడ్డి, అమ్మాపు రం సంస్థానాదీశీలు రాజ శ్రీరాంభూపాల్, కురుమూర్తి స్వామి ఆలయ మా జీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వందంలాది మంది భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి ఆలయ రాజగోపురం వద్ద ప్రదక్షిణను ప్రారంభించి స్వామివారి ప్రధాన ఆలయం సమీపం నుంచి కురుమూర్తి గుట్టల వెన క భాగాన అమ్మాపురం సమీపంలోని ఆత్మకూర్, దేవరకద్ర పట్టణాల ప్ర ధా న రోడ్డుగుండా రాజగోపురం వరకు 4 కిలోమీటర్లు ప్రదక్షిణ కొనసాగింది. మొక్కజొన్న లారీల పట్టివేత చిన్నచింతకుంట: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి రాష్ట్రంలోని నారాయణపేటకు అక్రమంగా మొక్కజొన్న తరలిస్తున్న లారీలను పట్టుకొని దేవరకద్ర మార్కెట్‌కు తరలించడంతో పాటు లారీల యజమానులకు జరిమానా విధించినట్లు ఎస్ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి మండలంలోని లాల్కోట చౌరస్తాలో వాహన తనిఖీలు చేపడుతుండగా.. రెండు లారీల్లో మొక్కజొన్న అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా తరలిస్తున్నట్లు తమ విచారణలో బయటపడిందని చెప్పారు. ఒక్కో లారీలో 30 టన్నుల మొక్కజొన్న ఉందని.. మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు లారీలకు రూ.17 వేల జరిమానా విధించారని, చెల్లించిన అనంతరం లారీలను డ్రైవర్లకు అప్పగించినట్లు ఎస్ఐ వివరించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ప్రోత్సాహకం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్):దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభు త్వం రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు, ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వయోవృద్ధు సంక్షేమ శాఖ సంక్షేమ అధికా రి జరీనా బేగం బుధవాం ప్రకటనలో పేర్కొన్నారు. లక్ష వివాహ ప్రోత్సాహక బహుమతిని దివ్యాంగులు, దివ్యాంగులను విహహం చేసుకు న్నా.. ఈ బహుమతి వర్తిస్తుందని తెలిపారు. దివ్యాంగులు, సకలాంగులను వివాహం చేసుకొన్న మే 19 2025 తర్వాత దివ్యాంగులు, దివ్యాంగులను వివాహం చేసుకొన్న దంపతులు www.e pa-r-r.-te a nfa na. gov.in అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సంబంధిత సమగ్ర శిశు అభివృద్ధి ఆధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను సమర్పించి సద్వినియోగం చేసుకోగలరని కోరారు. -
చిన్నారిపై పిచ్చికుక్క దాడి
ఊట్కూరు: ఇంటి ఆవర ణలో ఆడుకుంటున్న నా లుగేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసిన ఘటన పట్టణంలో బుధవారం జ రిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని గాంధీనగర్ వీధిలో నివాసం ఉంటున్న చాకలి రాజు, అనితల కుమార్తె అక్షిత ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా పిచ్చికుక్క దాడి చేసింది. దాడిలో బాలిక ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకొని కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉరేసుకొని వ్యక్తి మృతి అచ్చంపేట రూరల్: పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటిలో ఉరేసుకొని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సద్దాంహుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం కాలనీకి చెందిన మందుల బాలస్వామి(40) కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. తాగుడుకు బానిసైన తరుచుగా భార్య స్వాతి తో గొడవ పడుతుండేవాడు. తాగేందుకు డ బ్బులు లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇసుక డంపులు సీజ్ ఉప్పునుంతల: మండలంలోని పెద్దాపూర్ శివారు దుందుబీ వాగు పరిసర ప్రాంతంలో అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపులను బుధవారం తహసీల్దార్ సునీత పరిశీలించి సీజ్ చేశారు. పదిచోట్ల దాదాపుగా 350 ట్రిప్పుల(ట్రాక్టర్) ఇసుక అక్రమంగా నిల్వ చేశారని తహసీల్దార్ తెలిపారు. సీజ్చేసిన ఇసుక డంపులను సంబంధిత పెద్దాపూర్ జీపీఓ అంజనేయులకు అప్పగించారు. దుందుబీ వాగు నుంచి అనుమతిలేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. ఎమ్మారై రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అమ్రాబాద్: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ఎఫ్డీఓ రామ్మూర్తి అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం అమ్రాబాద్‌లో అడవుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ మనుగడకు అడవులు ఎంతో ముఖ్యమని, వాటిని నాశనం చేస్తే జీవ వైవిద్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొన్ని చోట్ల అడవులను నరకడం, వన్యప్రాణుల వేటాడుతున్నారని.. అలాంటి వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ వీరేష్, సెక్షన్ అధికారిణి భాగ్య, ఎఫ్బీఓ నాగేష్ తదితరులు ఉన్నారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి మానవపాడు: కాలిన గాయాలతో చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన మండలంలోని జల్లాపురంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి వివరాల మేరకు.. మానవపాడు మండలంలోని జల్లాపురం గ్రామానికి చెందిన సుకన్య (27) డిసెంబర్ 27న సాయంత్రం ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. దీంతో కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
గాయపడిన వ్యక్తి మృతి
జడ్చర్ల: రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి వైద్యం అందించినా నయం కాకపోవడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సీఐ కమలాకర్ కథనం మేరకు.. మండలంలోని ఉదండాపూర్ గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య (47) ఈ నెల 22న పోలేపల్లి సెజ్‌లోని పరిశ్రమలో పని చేసేందుకు మోటార్ బైక్‌పై వెళ్లాడు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి బయలు దేరగా సెజ్ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం సోమవారం ఇంటికి తీసుకురాగా.. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. తన భర్త మరణానికి కారణమైన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని మృతుడి భార్య చెన్న కృష్ణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నీటి సంపులో పడి బాలుడు మృతి కల్వకుర్తి రూరల్: మండలంలోని మార్చాల గ్రామంలోని మా మిడితోటలో నీటి సంపులో పడి హర్షిత్(2) బాలు డు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలోని మామిడి తోటలో చెట్ల పాదులు తీసేందుకు వంగూరుకు చెందిన మంజుల, మల్లేష్ దంపతులు కూలికి వచ్చారు. భార్యాభర్తలు పనిచేస్తుండగా వారి కుమారుడు హర్షిత్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. బాబు కోసం వెతకగా సంపులో పడి ఉండటాన్ని గుర్తించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఉరి వేసుకొని యువకుడి బలవన్మరణం నారాయణపేటఎడ్యుకేషన్: మండలంలోని భై రంకొండ గ్రామానికి చెందిన కంకరి మధు (23) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. గ్రామ శివారులోని సంతోష్ వెంచర్ బల్డింగ్ మెట్లకు ఉన్న కడ్డీలకు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పాడ్డాడు. విషయం తెలుసుకున్న స్థా నికులు, కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న హీరో ఫైనాన్స్‌లో దాదాపు రూ. 6,00,000 లోన్ తీసుకొని జమ చేసిన కూడా వారు అకౌంట్లో జమ చేయకుండా మోసం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ముఖగుర్తింపు హాజరు అమలు..
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 2,400 పాఠశాలల్లో చదువుతున్న 2.60 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ముఖగుర్తింపు హాజరు విధానం అమలులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు 16,200 మంది ఉపాధ్యాయులకు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు పని సమయంలో సెల్ఫోన్లు వినియోగించరాదని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ సంవత్సరం నుంచి ఉపాధ్యాయులు సైతం టెట్ అర్హత సాధించాలని ఆదేశించింది. అన్ని కేజీబీవీలు, హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మెనూను మార్చింది. ఉదయం అల్పాహారం, వారంలో 5 సార్లు కోడిగుడ్డు, రెండుసార్లు మాంసం అందించాలని సూచించింది. మెస్ ఛార్జీలు సైతం పెంచింది. ప్రైమరీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్య ప్రారంభించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 75 పాఠశాలల్లో ఏర్పాటు చేయగా.. ఉమ్మడి జిలాలో 280 పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రీప్రైమరీలో చిన్నారులకు ఆట బొమ్మలు తదితర అవసరమైన అన్ని వసతులతో బోధన సాగనుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని 64, ఉమ్మడి జిల్లాలో 190కి పైగా పాఠశాలల్లో ఏఐ విద్య అందిస్తున్నారు. మూడు పాఠశాలల్లో కలెక్టర్ నిధులతో ఆస్ట్రానమీ ల్యాబ్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన పెంచేందుకు ల్యాబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉమ్మడి జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఒక్కో పాఠశాలలో సుమారు 2 వేలకు పైగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి అధికారులు స్థలాలను పరిశీలించారు. వీటిలో సింథటిక్ ట్రాక్, ల్యాబ్, తరగతి గదులు, హాస్టల్, డైనింగ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి సకల సౌకర్యాలు కల్పించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ సంక్షేమ వసతిగృహంలో జులై 27న కలుషిత ఆహారం తిని సుమారు 30 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. పెద్దకొత్తపల్లి ఎస్సీ గురుకులంలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, వనపర్తి, గద్వాలలోని పలు హాస్టల్స్‌లో ఇలాంటి ఘటనలు చో టు చేసుకున్నాయి. గద్వా జిల్లా ఎర్రవల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 10 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. -
ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తు
పాలమూరు: వైకుంఠ ఏకా దశి సందర్భంగా ఆలయా ల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్పీ జానకి మంగళవారం జిల్లా లో వివిధ ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్ల ను పరిశీలించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. కట్టుదిట్టమైన ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేక పోలీసు బృందాలతో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్ట ప్రకా రం కఠిన చర్యలు తీసుకుంటామని, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ పూర్తిచేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తుదిదశకి చేరుకున్న ధాన్యం కొనుగోళ్లు, సేకరణ వేగవంతంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. వానకాలం 2025–26 ధాన్యం సేకరణపై మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పౌర సరఫరాలశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లర్ల నుంచి పొందిన బ్యాంకు గ్యారంటీలను పరిశీలించగా, మిల్లర్లకు అందజేసిన పాడికి సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న బ్యాంకు గ్యారంటీలను మూడురోజుల్లో కచ్చితంగా సేకరించాలని పౌరసరఫరాల శాఖ డీటీలను ఆదేశించారు.ఇప్పటివరకు జిల్లాలో 26,015 మంది రైతుల నుంచి 1,30,459 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. సీఎం ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి సీఎం ప్రజావాణి ఫిర్యాదులతో పాటు కలెక్టర్ ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ఎన్నికల ఓటరు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. -
స్థానికం.. సంస్థాగతం!
పాలమూరులో కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం 3 జిల్లాల్లో ‘ఢీ’సీసీ.. ఈ ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్ 22న ఐదు జిల్లా లకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మె ల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్ కుమార్‌రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్‌నగర్‌లో సంజీవ్ ముదిరాజ్, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్‌రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు. గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు షాకిచ్చారు. ఆగస్ట్ 3న బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన అదే నెల పదో తేదీన బీజేపీలో చేరారు. ● 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారనే ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ సైతం తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్‌లో చేరారని.. అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరింది. విచారణ చేపట్టిన స్పీకర్ డిసెంబర్ 17న అనర్హత పిటిషన్‌ను కొట్టివేయడంతో ‘బండ్ల’కు ఊరట లభించినట్లయింది. నా స్టయిలే వేరు.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలని.. ఇంకా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలి పిస్తే సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమపై పీసీబీ చర్యలు తీసుకోకుంటే నేనే స్వయంగా ఓ ఫార్మా కంపెనీని తగలబెడతానని వీడియో రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది.కాంగ్రెస్: పై‘చేయి’.. అయినా డీలా.. మూడు విడతలుగా డిసెంబర్ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది. నిలబెట్టుకున్న హామీ.. మంత్రిగా వాకిటి ముదిరాజ్‌లకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జూన్‌లో చేపట్టిన రెండో దశ మంత్రివర్గ విస్తరణలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించారు. జూన్ 11న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 16న రాష్ట్ర మత్స్య, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం -
ముక్కోటి దండాలు
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారినిపల్లకీలో ఊరేగిస్తున్న భక్తులు పిల్లలమర్రి రోడ్డు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బారులుతీరిన భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలో అన్ని వైష్ణవ దేవాలయాలు జనంతో పోటెత్తారు. ఉత్తరద్వారం నుంచి వెళ్లి ఆ కోనేటిరాయుడిని దర్శించుకుని పులకించిపోయారు. పిల్లలమర్రిలోని శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. సింహగిరి శ్రీలక్ష్మినృసింహస్వామి దేవాలయం, టీడీ గుట్ట తిరుమలనాథ దేవాలయం, జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, గంగాపూర్‌లోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే క్యూలో నిల్చున్నారు. మన్యంకొండ, శ్రీకురుమూర్తిస్వామి ఆలయాలకు వేలాదిమంది తరలివచ్చి ‘ముక్కోటి’ దండాలతో స్వామివారిని దర్శించుకున్నారు. – వివరాలు 8, 9లో.. -
పోలీస్ నిఘాలో శ్రీశైలం రహదారి
దోమలపెంట: హైదరాబాద్, శ్రీశైలం రహదారిలో నల్లమల పరిధిలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. వివరాల ప్రకారం ఇటీవల హైదరాబాద్ కు చెందిన మహిళ శ్రీశైలంలో స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో బ్రహ్మగిరి అటవీ చెక్‌పోస్ట్ దాటి కొంతదూరం వెళ్లిన కారు నిలిపి కిందకు దిగగా.. తనను ఓ వ్యక్తి వెంబడించాడని సోషల్ మీడియాలో ఆ మహిళ పోస్ట్ చేసి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీ డియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై స్పందించా రు. వెంబడించిన వ్యక్తి దారి దోపిడి చేసే వ్యక్తేమోనని శ్రీశైలానికి రాకపోక లు సాగించే భక్తులు, పర్యాటకులు భావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుడడంతో అమ్రాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ శంకర్‌నాయక్ ఆదేశాల మేరకు నల్లమలలోని శ్రీశైలం ప్రధాన రహదారిలో పోలీసుల పికెటింగ్ చేస్తున్నట్లు దోమలపెంట ఎస్ఐ జయన్న మంగళవారం తెలిపారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు, పర్యాటకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రహదారి మొత్తం పోలీసుల నిఘాలో ఉందని భరోసా కల్పించారు. ‘ట్రెండ్ హ్యుందాయ్’ షోరూం 2.0 ప్రారంభం పాలమూరు: ట్రెండ్ హ్యుందాయ్ నూతన కారు షోరూం 2.0ను ట్రెండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గట్టు గోపాల్‌రెడ్డి మంగళవారం జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నూతన షోరూం కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా, అత్యాధునికంగా అభివృద్ధి చేశామన్నారు. ఇందులో ప్రీమియం కస్టమర్ లాంజెస్, న్యూకార్ డెలివరీ ఏరియా, కస్టమర్ ఇంటరాక్షన్ క్యాబిన్, డిజిటల్ ఇంటరాక్షన్, డిజిటల్ కీయాస్క్, ఈవీ కార్ సర్వీసింగ్బే, చార్జింగ్ పాయింట్ వంటి సౌకర్యా లు కల్పించామని వెల్లడించారు. కార్యక్రమంలో ట్రెండ్ గ్రూప్ డైరెక్టర్ గట్టు సంయుక్తారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గట్టు సిరి చందనరెడ్డి, షోరూం సేల్స్ మేనేజర్ హర్షవర్ధన్‌రెడ్డి, సర్వీస్ మేనేజర్ వసీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పత్తి పంట దగ్ధం
అడ్డాకుల: మండలంలోని బలీదుపల్లి శివారులో ఓ షెడ్డు లో నిల్వ చేసిన పత్తి కి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో కాలిపో యిన ఘటన మంగళవారం ఉద యం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కుమ్మరి నర్సింహ తన వ్యవసాయ పొలంలో పండించిన పత్తిని పొలంలోని గేదేల షెడ్డులో నిల్వ చేశాడు. ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు షెడ్డులో ఉన్న పత్తికి రెండు చోట్ల నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పొగ రావడంతో పరిసర రైతులు గుర్తించి వెంటనే నర్సింహ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశా రు. షెడ్డు గ్రామానికి దగ్గరలో ఉండడంతో చుట్టుపక్కల వారందరు వచ్చి నీళ్లతో మంటలను ఆర్పేశారు. నిల్వచేసిన పత్తి పనికి రాకుండా మారింది. ఈ ఘటనలో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. దీనిపై 100కు సమాచారం ఇవ్వడంతో అడ్డాకుల పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ విచారణ చేసి వివరాలను సేకరించారు. ఘటనపై బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పత్తికి నిప్పు పెట్టింది ఎవరన్నది తెలియరాలేదు.బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ధాన్యం కొను‘గోల్మాల్’పై విచారణ
● అక్రమంగా పంపిన ధాన్యానికి రూ.14.90 లక్షలు జమ ● ట్రక్ ీషీట్లు ఎత్తుకెళ్లిన జగదీశ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వీపనగండ్ల: నిబంధనలకు విరుద్ధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి అనధికార రైస్‌మిల్లుకు పంపిన 624 క్వింటాళ్ల వరిధాన్యానికి ఆగమేఘాలపై రూ.14, 90, 735లను అధికారులు జమ చేసిన ఘటన వనపర్తి జిల్లా, వీపనగండ్ల మండలం, గోపల్దిన్నెలోని ఐకేపీ సెంటర్లో చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలపై మంగళవారం గ్రా మంలో అడిషనల్ డీఆర్డీఓ సరోజ, డీపీఎం ప్రభాకర్ జరిపిన వి చారణలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. గ్రామంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేసేందుకు రూ.18వేల జీతంతో అదే గ్రామానికి చెందిన జగదీశ్ అనే ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని జిల్లా అధికారులు సూచించినా.. ఇదే జిల్లాలోని రైస్ మిల్లర్లకు పంపించేవారు. కాని అనధికార ఆన్లైన్ ఉద్యోగి మహిళా సంఘం సభ్యులకు తెలియకుండా రెండు ట్రక్ సీట్లను తీసుకొని ఎలాంటి సంబంధంలేని గద్వాల జిల్లాలోని ఎంఎస్ఇమాన్ రైస్ మిల్లుకు పంపించగా.. వారం రోజుల్లోనే రంగవరం గ్రామానికి చెందిన చల్మారెడ్డి అనే రైతు ఖాతాలో రూ.5, 25, 580, గోపల్‌దిన్నెకు చెందిన కావలి నాగేంద్రం ఖాతాలో రూ.2, 29, 344, పి శ్రీనివాసులు ఖాతాలో రూ.లక్షా38, 562, ఆన్లైన్ ఉద్యోగి కావలి జగదీశ్ ఖాతాలో రూ.5, 65, 715, ఆబోతు దేవయ్య ఖాతాలో రూ.31, 534 వారం రోజుల్లోనే జమ చేసినట్లు వెల్లడైంది. 2064 ట్రక్‌సీటు నెంబర్ ద్వారా 770 బ్యాగులు, 2058 నెంబర్ ద్వారా 790 బ్యాగులు మొత్తం 1, 560 బ్యాగులు, 624 క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించినట్లు చూపించిన అధికారులు విచారణలో ఇట్టి ధాన్యాన్ని గ్రామంలోని హమాలీలెవరూ తూకం వేయలేదని.. అసలు లారీయే గ్రామంలోకి రాలేద ని గన్నీ బ్యాగులను మహిళా సంఘ సభ్యులు ఇవ్వలేదని గద్వాలలోని రైస్‌మిల్లు వద్ద వేబీచ్ కాంట కాలేదని విచారణలో వెల్లడైంది. డబ్బులు మాత్రం రైతు ఖాతాలో జమకావడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆన్లైన్లో ఇమాన్ రైస్‌మిల్లు పేరు కనిపించడం వల్లే ధాన్యాన్ని అక్కడకు పంపించానని ఆపరేటర్ జగదీశ్ తెలియజేయగా.. తాము ధాన్యాన్ని విక్రయించడం వల్లే తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని రైతులు చల్మారెడ్డి, దేవయ్య అధికారులకు తెలియజేశారు. నిజమైన రైతులకు సకాలంలో డబ్బులు జమ చేయకుండా అక్రమంగా వెళ్లిన ధాన్యానికి డబ్బులు జమ చేసిన అంశంతోపాటు 5ఏళ్లుగా గ్రామంలో జరిపిన ధాన్యం కొనుగోళ్లపై కూడ పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సర్పంచ్ దొడ్ల కవిత, పలువురు రైతులు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ మహిళా సంఘ సభ్యులు తమకు తెలియకుండా ట్రక్ సీట్లను ఎత్తుకెళ్లిన విషయమై జగదీశ్‌పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.లక్షలు జ మ కావడంపై ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లకు కూడా ఈ విషయంలో సంబంధం ఉందని పూర్తి స్థాయిలో విచా రణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ ఏపీఎం రాంబాబు, డీఆర్పీ తిరుతప మ్మ, ఏపీఎం మద్దిలేటి, ఉపసర్పంచ్ వెంకటస్వామి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ బాల్‌రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
విద్యారంగం.. పురోగమనం
● పాలమూరులో ట్రిపుల్ ఐటీ, జవహర్ నవోదయ, న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు అడుగులు ● విద్యానిధి ద్వారా ఉచిత ఐఐటి, నీట్ శిక్షణ ఈ ఏడాది పాలమూరు విశ్వవిద్యాలయంలో 4వ స్నాతకోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, ఛాన్స్లర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరయ్యారు. చదువులో ప్రతిభ కనబర్చిన 80 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు వసతిగృహ, కళాశాలల భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. గద్వాల, కొల్లాపూర్ పీజీ సెంటర్లో హాస్టల్స్ ప్రారంభించారు. పీయూలోని అన్ని విభాగాల్లో డిజిటలైజేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో మైగ్రేషన్, కాన్వగేషన్, మార్కుల మెమోలు తదితరాలకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. పీయూ పరిధిలోని 80 కళాశాలల్లో 42 వేల మంది విద్యార్థులు చదువుతున్న వారికి ప్రయోజనం కలగనుంది. సిబ్బందికి ఈపీఎఫ్ అమలు, వేతనాల పెంపు వంటి నిర్ణయాలు అధికారులు తీసుకున్నారు. పీయూ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన మన్నె సత్యనారాయణరెడ్డి యూనివర్సిటీకి రూ.10 కోట్లు విరాళం ఇవ్వగా.. భారీ ఆడిటోరియం నిర్మించనున్నారు. -
ముసాయిదా ప్రక్రియ షురూ
● మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ ● కార్పొరేషన్ అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమావేశం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం ఓటరు జాబితాకు సంబంధించి ముసాయిదా ప్రక్రియ ఆరంభమైంది. మొదటిరోజు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌కేంద్రాలను గుర్తించారు. గతంలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు ఈ ఏడాది జనవరి 27న కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. అప్పట్లో ఉన్న 49 వార్డులు ఇప్పుడు 60 డివిజన్లకు పెరిగాయి. దీంతో తాజాగా పోలింగ్ కేంద్రాలను పునర్ వ్యవస్థీరించారు. ఇక 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఆయా వార్డుల వారీగా బుధవారం విభజించనున్నారు. ఈ వివరాలను జనవరి 1న కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచనున్నారు. ఒకవేళ వీటిపై ఏమైనా అభ్యంతరాలు వస్తే స్వీకరిస్తారు. చివరకు 10న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ, డివిజన్ల వారీగా ఓటరు జాబితా విభజనను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అంద రూ అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్చార్జ్ ఎంఈ విజయ్‌కుమార్, ఏసీపీ కరుణాకర్‌గౌడ్, ఆర్ఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ముక్కోటి’ దర్శనభాగ్యం
● వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ● ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చిన స్వామివారు ● ఘనంగా శేషవాహన సేవ, జనసంద్రమైన మన్యంకొండ మన్యంకొండలో శేషవాహనంలో ఊరేగుతున్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి మన్యంకొండలో శేషవాహనంపై ఊరేగుతున్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి మహబూబ్‌నగర్ రూరల్/చిన్నచింతకుంట: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం మంగళవారం జనసంద్రమైంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.ఽ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి వేడుకలను మన్యంకొండలో ప్రతిఏటా అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే దేవస్థానంలో ఈ ఏడాది కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్త కోటికి దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకారోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి శేషవాహనసేవ నిర్వహించారు. శోభాయామానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న సభామండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. శేషవాహనంలో స్వామివారు ఊరేగుతూ స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి సేవను చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం స్వామివారిని తిరిగి శేషవాహనంలో హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పూలపందిరిలో స్వామివారిని శేషవాహనంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాటు చేశారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారాన్ని కూడా ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ద్వారం గుండానే భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఉదయం 6:30 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. దేవస్థానం ముందున్న కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. ఎక్కడ చూసిన మన్యంకొండలో భక్తులే కనిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చాలా మంది భక్తులు దిగువ కొండ నుంచి కొండపై వరకు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు సమర్పించారు. దేవస్థానంతోపాటు స్టేజీ సమీపంలోని అలివేలు మంగతాయారు దేవస్థానంలో కూడా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్వామివారి గర్భగుడిని సర్వాంగసుందరంగా ముస్తాబుచేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితోపాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. కాంచనగృహలో వైకుంఠ దర్శనం ● చిన్నచింతకుంట మండలం అమ్మాపురం కాంచన గృహలో వెలిసిన వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తిస్వామి ఆలయానికి భక్తులు మంగళవారం పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే కురుమూర్తి కొండకు చేరుకున్నారు. ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేసి ఉత్తర ద్వారంతోపాటు ఆలయ ప్రాంగణమంతా పూలమాలలతో అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాలనుంచి తరలి వచ్చిన భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకొని తరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నేడు గిరి ప్రదక్షిణ కురుమూర్తి స్వామి ఆలయం వద్ద బుధవారం గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ మండలాధ్యక్షుడు శివన్న తెలిపారు. కార్యక్రమానికి హిందూ సంఘాలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి వివిధ గ్రామాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
గుప్తనిధుల తవ్వకాలు చేపట్టిన నిందితుల విచారణ
అచ్చంపేట రూరల్/కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మండలంలోని మొలచింతపల్లి సమీపంలో దాదాపు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అడవీలో దేవునిబొక్కలో ఉన్న చెంచులు ఆరాధించే పురాతన శివాలయంలో కొందరు మూడురోజులుగా గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ఫారెస్టు అధికారులు ఆదివారం అక్కడికెళ్లి 15మంది దుండగులను పటుకుని అదుపులోకి తీసుకొన్నారు. కొల్లాపూర్ నుంచి రెండు వాహనాల్లో వారిని సోమవారం డీఎఫ్ఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారివద్ద ఉన్న పరికరాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను ఎఫ్డీఓ చంద్రశేఖర్, ఇతర అధికారులు వేర్వేరుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా విచారించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా పలు దఫాలుగా విచారణ చేశా రు. కొల్లాపూర్ మండలం కుడికిల్లకు చెందిన సాంబశివుడు, పాన్‌గల్ మండలం రాయినిపల్లికి చెందిన 15మంది తన అనుచరులతో కలిసి ఒక్కొక్కరికి రూ.10వేలు అడ్వాన్స్ ఇచ్చి తవ్వడానికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. వేర్వేరుగా వారినుంచి వివరాలు రాబట్టారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లలేని ప్రదేశంలో ఉన్న పవిత్రమైన శివాలయం వద్దకు ఎలా వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు టీంగా ఏర్పడి వెళ్లారని, శనివారం సాయంత్రం నుంచి ఆలయం వద్ద తవ్వకా లు జరిపారని ప్రాథమికంగా అంచనాకు అధికా రులు వచ్చారు. కాగా, కట్టుదిట్టంగా ఉన్న సెక్షన్, బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, అటవీ ప్రాంతంలోకి వెళ్లినవారిని ఎవరైనా ప్రోత్సహించారా? వారికి డబ్బులు, వస్తువులు ఎవరు సమకూర్చారనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎఫ్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. సిబ్బంది అలసత్వం ఉన్నట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కొల్లాపూర్ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ధరూరు మండల కేంద్రానికి చెందిన వినోద్ (25) పట్టణంలోని ఈదమ్మ ఆలయం సమీపంలో ఉన్న కారం, పిండి గిర్నిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులకు వచ్చిన అతడు.. కారం గిర్ని మిషన్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి సవరన్న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహిత అనుమానాస్పద మృతి అడ్డాకుల: మూసాపేట మండలం దాసర్‌పల్లికి చెందిన వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. దేవరకద్ర మండలం గోపన్‌పల్లికి చెందిన మోతే జ్యోతి(35)ని 15 ఏళ్ల కిందట మూసాపేట మండలం దాసర్‌పల్లికి చెందిన సంతోష్‌కు ఇచ్చి వివాహం చేశారు. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేస్తూ సంచార జీవనం సాగిస్తున్నారు. వీరికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. సొంత ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వ భవనాలు, ఇతర చోట్ల ఉండేవారు. రెండు వారాల కిందట గ్రామానికి రాగా.. ఇటీవల జ్యోతి అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం తెల్లవారుజామన మృతి చెందింది. జ్యోతి మృతదేహాన్ని వాహనంలో ఆమె స్వగ్రామమైన గోపన్‌పల్లికి భర్త తీసుకెళ్లాడు. అక్కడ మహిళ బంధువులు తిప్పి పంపారు. అదే వాహనంలో దాసర్‌పల్లికి సమీపంలోని గుట్ట వద్దకు తీసుకొచ్చాడు. మృతురాలి బంధువులు అక్కడికెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు దాసర్‌పల్లికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా జ్యోతిని భర్త చంపి ఉంటాడని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. బొటానికల్ గార్డెన్లో సిగ్నేచర్ స్పైడర్ కనువిందు జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న తెలంగాణ బొటానికల్ గార్డెన్లో సిగ్నేచర్ స్పైడర్ కనువిందు చేసింది. గార్డెన్లో ఉన్న నెట్‌కు సోమవారం సాయంత్రం సిగ్నేచర్ స్పైడర్ కనిపించడంతో గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య కెమెరాలో బంధించారు. శాసీ్త్రయంగా ఆర్జియోపే అనసూజ స్పైడర్ అని పిలుస్తారని తెలిపారు. వేటలో ఆకర్షణ కోసం ఎక్స్ ఆకారంలో స్కిల్ సంబంధిత గుర్తును ఏర్పాటు చేస్తుందని, చూడటానికి సిగ్నేచర్‌లా ఉంటుందని, అందుకే సిగ్నేచర్ స్పైడర్ అని పిలుస్తారన్నారు. ఇది తలకిందులుగా వేలాడుతూ పసుపు, నలుపు గీతలతో ఉంటుందని, చిన్నపాటి గార్డెన్లు, తోటలు, అడవుల్లో కనిపిస్తుందన్నారు. దీని వలలో పడిన ఈగలు, దోమలు, సీతాకోక చిలుకలు, కందిరీగలు తింటూ జీవిస్తుందని చెప్పారు. ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి శివారులోని కోళ్లఫారం సమీపం నుంచి ఆదివారం అర్ధరాత్రి భారత్ బెంజ్ వాహనం ద్వారా అక్రమంగా ఇసుకను తరలించేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న కురుమూర్తి గ్రామస్తులు, సమీప రైతులు అడ్డుకున్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ.. అధికార పార్టీకి చెందిన కొందరు కొన్నిరోజులుగా అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకు గ్రామసమీపంలోని కోళ్ల ఫారంను అడ్డగా చేసుకున్నారని తెలిపారు. పగలు ట్రాక్టర్ల ద్వారా కోళ్ల ఫారం సమీపంలో డంపులు చేసి రాత్రి సమయంలో తరలిస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే ఆదివారం అర్ధరాత్రి భారత్ బెంజ్ నుంచి మట్టిని తీసుకొచ్చి ఇసుకను తరలించేందకు య్రత్నాలు చేశారన్నారు. అట్టివారి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మట్టిని కోళ్లఫారం వద్దనే పోయించి వాహనాలను వదిలేశారని మండిపడ్డారు. ఇప్పటికై నా పోలీసులు ఇసుక అక్రమ తరలింపును అరికట్టకపోతే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ ఓబుల్‌రెడ్డిని వివరణ కోరగా రాత్రి సమయంలో భారత్ బెంజ్‌లో కోళ్లఫారానికి మట్టిని తీసుకొచ్చారని తెలిపారు. -
ముక్తిమార్గం.. ఉత్తర ద్వారదర్శనం
● నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం ● ఉత్తరద్వార దర్శనానికి ఆలయాల్లో ఏర్పాట్లు స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. దీనిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనంతోపాటు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. బ్రాహ్మణవాడి వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పల్లకీసేవ అనంతరం ఉత్తరద్వార దర్శనసేవలు నిర్వహిస్తారు. శ్రీనివాసకాలనీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణాలు నిర్వహించనున్నారు. సింహగిరి లక్ష్మీనరసింహస్వామిహాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు చేసి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. అదేవిధంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్తరదార్వ దర్శనాలు కల్పించనున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేడుకలు పిల్లలమర్రి రోడ్డులోని శ్రీకంచికామకోటి పీఠం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఉత్తరద్వార దర్శనానికి అనుమతించనున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 3:30గంటలకు సేవాకర్తలచే విశేష సహస్రనామార్చన నిర్వహించనున్నారు. ఉదయం 5గంటల తర్వాత సర్వదర్శన కార్యక్రమం ప్రారంభమవుతుందని, భక్తులు ఉదయం 6గంటల తర్వాత దర్శనానికి రావాలని వేంకటేశ్వర సేవా మండలి సభ్యులు సూచించారు. 31వ తేదీ ఉదయం 7గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. కురుమూర్తి ఆలయంలో పూలతో అలంకరించిన వైకుంఠ దర్శన మండపం చిన్నచింతకుంట: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. అందుకు ఆలయంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి ప్రధాన ఆలయ మండపంలో ఉత్తర ద్వార దర్శనం మండపాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనంతోపాటు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. -
కొండనాగుల సొసైటీకి ఉత్తమ అవార్డు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతు సేవలో తరిస్తున్న వివిధ సొసైటీల పనితీరును గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో మొత్తం 8 సింగిల్ విండో సొసైటీలకు రూ.15 లక్షల చొప్పున గ్రాంట్లు విడుదలయ్యాయి. కాగా.. అచ్చంపేట మండలంలోని కొండనాగుల పీఏసీఎస్ కార్యాలయం రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఉత్తమ అవార్డు లభించింది. ఈ మేరకు సింగిల్ విండో కార్యదర్శి రాజవర్ధన్రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన 2025 అంతర్జాతీయ సహకార సంవత్సరం కార్యక్రమంలో భాగంగా రాజవర్ధన్‌రెడ్డి ఉత్తమ అవార్డు అందుకున్నారు. సింగిల్ విండో తరపున ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు రుణాల మంజూరులో బాధ్యత వహించి ప్రభుత్వ పథకాల అమలుకు సహకరిస్తూ ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో చూపిన శ్రద్ధకుగాను ఈ అవార్డు లభించినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో నాబార్డు సీజీఎం ఉదయ్‌కుమార్, జాయింట్ రిజిస్ట్రార్, కార్యక్రమ సమన్వయకర్త నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
వాగులు లూటీ
● జోరుగా ఇసుక అక్రమ దందా ● చిట్యాల వాగులో ఏకంగా తాత్కాలిక రోడ్డు ఏర్పాటు మక్తల్: ఇసుకాసురాలు వాగులను లూఠీ చేస్తున్నా రు. మక్తల్ మండలంలోని చిట్యాల, దాసర్‌దొడ్డి వాగులతో పాటు మాగనూర్ మండలంలోని వాగు ల నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల మక్తల్, నేరడ్గం గ్రామా ల వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను మాగనూర్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఇసుక రవా ణా ఆ గడం లేదు. తమను ఎవరు అడ్డుకుంటారనే విధంగా అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు. అను మతుల మాటున అక్రమ దందా సాగిస్తున్నారు. చి ట్యాల వాగులో ఏకంగా తాత్కాలిక రోడ్డు నిర్మించు కున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక తరలింపుపై అధికారులకు సమాచా రం ఇచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా రెవెన్యూ, పోలీస్, మై నింగ్ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకెళ్లే ఇసుక పక్కదారి పట్టకుండా నిఘా ఏర్పాటు చేస్తాం. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కొందరు టీఎస్ఎండీసీ అనుమతుల పేరుతో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. – సతీశ్‌కుమార్, తహసీల్దార్, మక్తల్ -
మహబూబ్‌నగర్ శుభారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ రెండో ఫేజ్‌లో మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం చేసింది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 43 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 56 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్‌తో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అబ్దుల్ రాఫే (మహబూబ్‌నగర్) నిలిచాడు. పాలమూరు జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి ఉదేశ్‌కుమార్, ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, కోచ్ అబ్దుల్లా, శివశంకర్, రమణ అభినందించారు. -
వ్యవసాయరంగంలో రోబోలు..
వ్యవసాయరంగంలో రోబోలను ఉపయోగించడం ద్వారా పంటలను పర్యవేక్షించడంతో పాటు కూలీల కొరత తీరుతుంది. నేలలో పీహెచ్ స్ధాయిని కొలవడం, పండ్లు, కూరగాయలను సేకరించడం, విత్తనాలు నాటడం, నీటి పారుదల ఆటోమేషన్, పర్యావరణ అనుకూలత మేరకు ఎరువులు చల్లడం, రసాయన ఎరువుల పిచికారీ చేయడం వంటి పనులను రోబోలతో చేయవచ్చు. ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. – ఎం.కుమార్, విద్యార్థి, కారుకొండ ఎంపీయూపీఎస్, బిజినేపల్లి మండలం -
ప్రయోగాత్మక విద్యాబోధనతో సత్ఫలితాలు
తరగతి గదిలో జ్ఞాన ప్రసారం కాకుండా.. జ్ఞాన నిర్మాణం జరగాలంటే ప్రతి ఉపాధ్యాయుడు ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలను బోధించాలి. తద్వారా విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు జీవశాస్త్ర విభాగంలో జీర్ణ వ్యవస్థలో జిహ్వికపాత్ర, శ్వాస వ్యవస్థలో ఉదరవిధానం, కనవిభజనలో సమవిభజన జరిగే విధా నం. బౌతికశాస్త్రంలో అంతరిక్ష రహస్యం వంటి అంశాల్లో కళాత్మకమైన బోధన సామగ్రి తయా రు చేసి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుంది. – నాగిళ్ల శ్రీశైలం, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, రాజాపూర్ జెడ్పీహెచ్ఎస్, కోడేరు మండలం -
వైజ్ఞానిక ప్రదర్శన అదుర్స్
● ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలు ● నిజజీవితంలో ఉపయోగపడేలా ప్రదర్శనల తయారీ బిజినేపల్లి: పెరటితో ట పెంపకంలో భాగంగా ఒక అడుగు విస్తీర్ణంలోనే పలు రకాల కూర గాయల మొక్కలను స్టెపుల వారీగా పెంచడం బాగుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నా రు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బిజినేపల్లి మండలం కారుకొండ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు వ్యవసాయంపై 3 రకాల ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను తిలకించిన కలెక్టర్.. సరికొత్త ఆలోచనకు పదునుపెట్టిన విద్యార్థులను అభినందించారు. కందనూలు: సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సరికొత్త ఆలోచనకు పదునుపెట్టారు. ఉపాధ్యాయుల ప్రేరణతో నూత న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. నాగర్‌కర్నూ ల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జిల్లా నలుమూల ల నుంచి హాజరైన విద్యార్థులు తమ ఎగ్జిబిట్లతో కలిగే ప్రయోజనాలను సందర్శకులకు వివరించారు. నిత్య జీవితంలో ప్రజలకు ఉపయోగపడేలా విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలను సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శించారు. ఆటోమేటిక్ ఫర్టిలైజర్ పరికరం ద్వా రా ఎరువులను సులభంగా మొక్కలకు అందించవచ్చు, శ్రమ, ఖ ర్చు తగ్గుతుంది. రైతులకు వెన్నునొప్పి, చేతినొప్పి, అలసట రా కుండా ఉంటుంది. విలువైన సమయం ఆదా అవుతుంది. ఈ ఆటోమేటిక్ ఫర్టిలైజర్ పరికరం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. – పి.గీతాంజలి, విద్యార్థిని, పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్, తెలకపల్లి మండలం నివాసగృహాలు, కర్మాగారాలు, అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక, అటవీశాఖ అధికారులకు సత్వర సమాచారం అందేలా జీఎస్ఎం మాడ్యుల్ రూపొందించాం. దీన్ని ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇంటి వద్ద యజమాని లేనప్పటికీ ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ చేస్తుంది. – వి.శివకుమార్, విద్యార్థి, కొండారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్, వంగూరు మండలం ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు. జంక్‌ఫుడ్ అంటే ప్రాసెస్ చేసిన పోషకాలు తక్కువగా ఉంటాయి. కృత్రిమ రుచులు, రంగులతో పాటు ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, షుగర్, బీపీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. – నిషా, విద్యార్థిని, కేజీబీవీ, బిజినేపల్లి మండలం -
నగరంలో మత్తు పదార్థాల నిల్వలపై తనిఖీలు
మహబూబ్‌నగర్ క్రైం: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలపై సోమవారం రాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వ హించారు. నార్కోటిక్ డాగ్‌స్క్వాడ్‌తో కీలక ప్రాంతాల్లో విస్తృతంగా సోదా లు నిర్వహించారు. ముఖ్య కూడళ్లు క్లాక్‌టవర్, పాన్‌చౌరస్తా, రాంమందిర్ చౌర స్తా లో ఉన్న దుకాణాలు, పాన్ దుకాణాల్లో తనిఖీలు చేసి మత్తు పదార్థాల నిల్వ లు, అ క్రమ విక్రయాలపై ఆరా తీశారు. న్యూఇయర్ వేడుకల్లో మత్తు పదార్థాల వి క్రయాలు, నిల్వలు, వినియోగానికి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ అప్పయ్య, ఎస్ఐ శీనయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
సాగులో నూతన ఒరవడి
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్‌పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సగానికి తగ్గిన దిగుబడి.. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రైతులు పత్తిపంట సాగుచేస్తున్నారు. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 2.86 లక్షలు, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలకు మించి పత్తి సాగవుతోంది. మహబూబ్‌నగర్‌లో 80 వేలు, వనపర్తిలో తక్కువగా 12 వేల ఎకరాల్లోనే రైతులు పత్తి సాగు చేశారు. అయితే ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి నిరాటంకంగా కురిసిన వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. మొక్క దశ నుంచే దెబ్బతినడంతో పత్తి దిగుబడి సగానికి తగ్గింది. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. కౌలుకు తీసుకుని సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సీసీఐ కొనుగోళ్ల ద్వారా క్వింటాకు రూ.8 వేల వరకు ధర పలికినా రైతులకు గిట్టుబాటు కాలేదు. పాలమూరులో వినూత్న పంటల వైపు రైతుల మొగ్గు పలుచోట్ల ఆయిల్‌పాం, వాణిజ్య తోటల పెంపకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు -
ఇతర పంటలకే ప్రాధాన్యం..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు అధికంగా వరి, పత్తి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి నాగర్‌కర్నూల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పత్తి పంట సాగు తగ్గించి వరి వైపు రైతులు మొగ్గుచూపారు. మహబూబ్‌నగర్‌లో ఈసారి వరి 10 వేల విస్తీర్ణం పెరగగా.. పత్తి 2 వేల ఎకరాలు తగ్గింది. నాగర్‌కర్నూల్‌లో వరి విస్తీర్ణం ఏకంగా 66 వేల ఎకరాలు పెరిగింది. అలాగే పత్తి విస్తీర్ణం సైతం గతేడాది కన్నా 4 వేలు అధికంగా సాగైంది. నారాయణపేటలో వరి గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో రైతులు అధికంగా సాగుచేశారు. ఇక్కడ అధికంగా 50 వేల ఎకరాల్లో కందిపంట సాగవుతోంది. వనపర్తి జిల్లాలో వరి 8 వేల ఎకరాలు పెరగగా.. పత్తి విస్తీర్ణం 5 వేల ఎకరాలు తగ్గింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈసారి పత్తి సాగు 70 వేల ఎకరాల వరకు తగ్గగా.. వరి పంట విస్తీర్ణం 7 వేల ఎకరాలు తక్కువగా నమోదైంది. ‘పాలమూరు’ పనుల్లో కదలిక.. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ ఏడాది ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రాజెక్టు కింద సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయినిగా నిలిచే ఈ ప్రాజెక్టు పనుల్లో కదలికతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు పూర్తయితేనే సాగునీరు అందనుంది. అలాగే రిజర్వాయర్ల నుంచి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణం చేపడితేనే రైతులకు మేలు చేకూరుతుంది. -
సివిల్ వివాదాలకు వెళ్లొద్దు
● చట్టపరిధిలో సమస్యలకు పరిష్కారం చూపాలి : ఎస్పీ జానకి మహబూబ్‌నగర్ క్రైం: సమస్యలను తక్షణం పరిష్కారం చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 15 మంది బాధితులు తమ సమస్యలపై ఎస్పీకి వినతులు అందజేశారు. వారి దరఖాస్తులను పరిశీలించిన ఆమె ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు భరోసా కలిగిస్తూ అనవసరంగా సివిల్ వివాదాలలోకి వెళ్లకుండా చట్ట పరిధిలోనే చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్స్టేషన్లలో సమస్యకు పరిష్కారం లభించకపోతే ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నేరుగా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ నవీన్ అన్నారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నర్సిములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆహార భద్రత కీలకం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఆహారభద్రత– జాతీయతపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆహార భద్రత ఎంతో కీలకమైందని, ప్రపంచంలో అతిపెద్ద ఆహార పంపిణీ వ్యవస్థ మనదేశంలో ఉందన్నారు. విద్యార్థులు జాతీయత భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కుమారస్వామి, వెంకట్, విజయ్‌భాస్కర్, పుష్పలత, మాధురి తదితరులు పాల్గొన్నారు. నేడు జాబ్‌మేళా జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రకాల ప్రైవేట్ కంపెనీలో 200 ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 89193 80410, 99485 68830 నంబర్లను సంప్రదించాలని కోరారు. స్టేట్‌హోం బాలలకు పుస్తకాల పంపిణీ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక స్టేట్‌హోంలో ఉంటున్న 15 మంది విద్యార్థులకు సోమవారం కలెక్టరేట్లో ఓపెన్ స్కూల్ పాఠ్య పుస్తకాలను జిల్లా అధికారులు పంపిణీ చేశారు. కాగా, ఈ విద్యార్థులు ఇటీవల ఓపెన్ స్కూల్ ఇంటర్లో చేరగా కలెక్టర్ విజయేందిర బోయి ఫీజులు చెల్లించారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రవీణ్‌కుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి జరీనాబేగం మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని చదువులు కొనసాగించాలన్నారు. జీవితంలో బాగా కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీపీఓ నర్మద, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శివయ్య, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,779 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో సోమవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ. 2,779, కనిష్టంగా రూ.2,000 ధరలు లభించా యి. హంస గరిష్టంగా రూ.1,960, కనిష్టంగా రూ.1,926, కందులు గరిష్టంగా రూ.6,660, వేరుశనగ గరిష్టంగా రూ.8,549, మినుములు రూ. 7,401, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,001 ధరలు పలికాయి. -
వసతి గృహాల కథనంపై స్పందన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘వణుకుతున్న వసతి గృహాలు’ కథనానికి జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. ప్రధానంగా మూసాపేట ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు బాత్రూంలు వినియోగించకుండా ఉదయం వేళ వాటర్ ట్యాంక్ వద్ద స్నానాలు చేయడానికి కారణాలు, అక్కడ ఉన్న బాత్రూంల పరిస్థితిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఏఎస్డబ్ల్యూఓను జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి సునీత ఆదేశించారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో పాడైన మరుగుదొడ్లు, విరిగిన డోర్లు, కిటికీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని సిబ్బంది ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. -
సాఫ్ట్‌బాల్‌లో బాలికల జట్టు విజేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 2–0 పాయింట్ల తేడాతో నిజామాబాద్‌పై గెలుపొంది చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలవడంపై జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి, పీడీలు వేణుగోపాల్, నాగరాజు, సరిత హర్షం వ్యక్తం చేశారు. – మహబూబ్‌నగర్ క్రీడలు -
సీనియర్ నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ పురుష, మహిళల నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్లు ప్రతిభచాటాయి. 4వ ఫాస్ట్–5 విభాగంలో మహబూబ్‌నగర్ పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ట్రెడిషనల్ విభాగంలో మహబూబ్‌నగర్ పురుషుల జట్టు నల్లగొండ జట్టుతో కలిసి మూడోస్థానంలో, ట్రెడిషనల్ విభాగంలో మహబూబ్‌నగర్ మహిళల జట్టు రన్నరప్‌గా, మొదటి సీనియర్ మిక్స్డ్ విభాగంలో మహబూనగర్ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ప్రతిభచాటిన జిల్లా జట్లను సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విక్రం ఆదిత్యరెడ్డి, కార్యదర్శి సయ్యద్ అంజద్‌అలీ, కోచ్ అబ్దుల్ షరీఫ్ అభినందించారు. – మహబూబ్‌నగర్ క్రీడలు -
బాక్సింగ్‌లో బంగారు పతకం
ఊట్కూరు: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే లక్ష్మీపల్లికి చెందిన విద్యార్థి ఉప్పరి శ్రీరామ్ 6వ జాతీయ మిక్స్ బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటి బంగారు పతకం సాధించారు. మహారాష్ట్రలోని రాయిఘడ్ జిల్లాలో ఇండియన్ మిక్స్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 6వ జాతీయ మిక్స్ బాక్సింగ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ పోటీలో ఉప్పరి శ్రీరాం పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించగా.. ఆ రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి అతిథి తాట్కరే పతకాన్ని అందజేశారు. కార్యక్రమంలో కరాటే శిక్షకులు నారక్రాం, రాజీవ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి గ్రామసమీపంలోని ఊకచెట్టువాగు నుంచి మద్దూర్‌కు చెందిన ఫారూక్ ఆదివారం తన కోళ్లఫారం నిర్మాణానికి జేసీపీ, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తుండగా గ్రామానికి చెందిన సమీప రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీపీ, ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కురుమూర్తి గ్రామస్తులు, రైతులు మాట్లాడుతూ.. మద్దూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ ఫారూక్ కురుమూర్తి శివారులో కోళ్ల ఫారం నిర్మాస్తున్నాడని, కోళ్లఫారం నిర్మాణానాన్ని అడ్డాగా చేసుకొని కొందరు అక్రమార్కులు వాటి సమీపంలో డంపులు చేసి రాత్రింభవళ్లు తేడాలేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోతే జేసీపీ, ట్రాక్టర్లను తగలబెడుతామని హెచ్చరించారు. వీటిపై ఎస్ఐ ఓబుల్‌రెడ్డిని వివరణ కోరగా ఇసుక తరలింపునకు పాల్పడిన జేసీపీ, ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. అట్టి వాహనాలను నేడు తహసీల్దార్‌కు అప్పగిస్తామని తెలిపారు. -
భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి
అచ్చంపేట రూరల్: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన అచ్చంపేట పట్టణంలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. వెంకటేశ్వరనగర్ కాలనీకి చెందిన అమర్‌సింగ్ రెండో కూతురు భావన (17) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. క్రిస్మస్ సెలవులు ఉండటంతో అచ్చంపేటకు వచ్చిన విద్యార్థిని.. శనివారం రాత్రి ఇంటి రెండో అంతస్తులో వాకింగ్ చేస్తూ, ప్రమాదవశాత్తు జారి కింద పడింది. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భావన మృతిచెందింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అప్పలు బాధతో యువకుడి ఆత్మహత్య జడ్చర్ల: అప్పులు ఎలా తీర్చాలన్నా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. ఏపీలో సత్యసాయి జిల్లా వెంపర్లపల్లి గ్రామానికి చెందిన చాకలి సురేశ్‌బాబు(25) పోలేపల్లి సెజ్‌లోని ఓ పరిశ్రమలో 10 నెలలుగా ఉద్యోగం చేస్తూ సత్యనారాయణస్వామి కాలనీలో తోటి ఉద్యోగులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరు మిత్రులు విధులకు వెళ్లగా ఒంటరిగా ఉన్న సురేశ్‌బాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విధులు ముగించుకొని ఆదివారం గదికి వచ్చిన మిత్రులు తలుపులు విరగ్గొట్టి చూడగా ఉరి వేసుకొని ఉన్నాడు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 15 క్వింటాళ్ల రేషన్ పట్టివేత అలంపూర్ రూరల్: అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంపూర్ గ్రామానికి చెందిన కుర్వ మారుతి(25) 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన మారుతి ఆదివారం తెల్లవారుజామున అశోక్ లేలాండ్ వాహనంలో ప్రభుత్వం సరఫరా చేసే 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కోనేరు నుంచి అలంపూర్ మీదుగా కర్నూలుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. సివిల్ సప్లై డీటీ ప్రశాంత్‌గౌడ్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత గద్వాల క్రైం: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న గూడ్స్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్‌కుమార్ తెలిపారు. ఇటిక్యాల మండలం మొగిలిరావు గ్రామానికి చెందిన శివరాజు, డ్రైవర్ మల్లికార్జున్ ఆదివారం గూడ్స్ వాహనంలో గద్వాల మీదుగా రాయచూర్‌కు రేషన్ బియ్యం తరలిస్తుండడగా ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలవి వలల పట్టివేత చిన్నంబావి: మండలంలోని కాలూరు సమీపంలోని కృష్ణానదిలో అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్ఐ నాగారాజు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. చేపట వేట కొనసాగిస్తున్న కృష్ణ, వెంకన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. నిషేధిత అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపదలో ఉన్నానంటూ సైబర్ మోసం జడ్చర్ల: ఆపదలో ఉన్నాను.. తనకు డబ్బులు పంపాలని మెసేజ్ పంపి ఓ దుండగుడు సైబర్ మోసానికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆదివారం జరిగింది. కర్నూల్‌కు చెందిన బాల్‌రాజ్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ స్థానిక వెంకటేశ్వర కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అతనికి.. అమెరికా నుంచి పలాన ఫ్రెండ్‌ను మాట్లాడుతున్నాను.. అర్జంట్‌గా తనకు డబ్బు కావాలి వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేయాలని వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. వాట్సాప్ ద్వారా చాటింగ్ అనంతరం మెసేజ్‌ను నమ్మిన అతను రూ.45వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్‌లో పంపగా అటువైపు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానం వచ్చి అమెరికాలో ఉంటున్న తన మిత్రుడికి ఫోన్ చేశాడు. తాను ఎటువంటి మెసేజ్ చేయలేదని, తనకి డబ్బు కూడా రాలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన సదరు వ్యక్తి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఎన్నికలు బహిష్కరించినా పట్టింపు లేదా?
● ‘గోకారం’ నిర్వాసితులకు న్యాయం చేయాలి ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చారకొండ/మన్ననూర్: డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే గోకారం రిజర్వాయర్‌లో ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ముంపునకు గురికాకుండా మినహాయించాలని గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం సరైంది కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చారకొండ మండలం ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలకు ఆదివారం ఆమె మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గోకారం రిజర్వాయర్ నిర్మాణంతో ఇక్కడి ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా చేకూరుతుందన్నారు. తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు మూకుమ్మడిగా పంచాయతీ ఎన్నికలు బహిష్కరించడం ప్రజాస్వామంలో అతిపెద్ద నిరసన అని అన్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్, ఇక్కడి పాలకులు, అధికారులకు పట్టింపు లేకపోవడం సమంజసం కాదన్నారు. వెంటనే కలెక్టర్ మంపు బాధితులను కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట కల్వకుర్తి జేఏసీ కన్వీనర్ సదానందంగౌడ్, సర్పంచ్ పరుశరాములు, నాయకులు ఏపీ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేశ్ తదితరులు ఉన్నారు. ● ఆదివాసీ చెంచుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ గ్రామాన్ని ఆమె సందర్శించి చెంచుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చెంచులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, రవాణా, రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామంలో రూ. 5లక్షల వ్యయంతో నిర్మించిన పక్కా ఇళ్లు పూర్తి నాసిరకంగా ఉన్నాయన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను ఆమె పరిశీలించారు. చెంచులకు దోతి, చీరలను పంపిణీ చేశారు. -
‘పాలమూరు’ పై రాజకీయం సరికాదు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.74 వేల కోట్ల వ్యయం అవుతుండగా.. కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి 90 శాతం పనులు పూర్తి చేశామని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు, కాల్వల నిర్మాణమే పూర్తి చేయకుండా బీళ్లకు నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టుకు పెద్దపీట వేశామనడం సిగ్గుచేటని.. కాల్వల నిర్మాణానికి ఇంకా 4 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. వీటిని పక్కనబెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు కొత్త బిల్లు తెచ్చిందని.. కార్మికుల పొట్టకొట్టేలా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో సుమారు 13 వేల మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. అక్రిడిటేషన్ విషయంలో పాత విధానాలను అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. నేటి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అంశం చర్చలకే పరిమితం కావద్దని.. కేంద్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై న్యాయమైన పోరాటాలకు సీపీఎం సంపూర్ణ సహకారం అందిస్తోందని భరోసానిచ్చారు. యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఒకరినే నిందితులుగా చూపి మిగతా వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని.. సిట్టింగ్ న్యాయమూర్తితో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లె గోపాల్, కురుమూర్తి, పద్మ, చంద్రకాంత్, లక్ష్మయ్య, దీప్లానాయక్, జగన్, నర్సింహులు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
దుకాణాల కేటాయింపులపై..
నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్‌టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా.. ఇందులో దుకాణానికి ఒక్కో రేటు చొప్పున ఫిక్స్ చేసి కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కొందరు ఉద్యోగులు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ముఖ్య నేత ఆదేశాలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అడ్డాకుల: మూసాపేట మండలం వేములలో అత్యాచారానికి గురై మృతిచెందిన యువతి కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. ఆదివారం ఆయన వేములలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన జరిగిన రోజు వివరాల గురించి కుటుంబ సభ్యులతో ఆరా తీశారు. తర్వాత బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం కింద మంజూరైన రూ.3.47 లక్షల చెక్కును అందజేశారు. మిగతా రూ.65 వేలను కలెక్టర్‌తో మాట్లాడి త్వరగా అందజేసేలా చొరవ తీసుకుంటానని వెల్లడించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసేలా చూడాలని, లేకపోతే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ప్రభుత్వ భూమి అందజేసేలా తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష విధించినప్పుడే యువతి మృతికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.జనార్దన్, సీఐ అప్పయ్య, తహసీల్దార్ రాజునాయక్, ఎంపీడీఓ కృష్ణయ్య, ఎస్ఐలు వేణు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాబంధుల పాలన వచ్చే
రైతుబంధు పాలన పోయి.. ● బీఆర్ఎస్ హయాంలో ఆగిన వలసలు మళ్లీ మొదలయ్యాయి ● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ● సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరులో ఆగిన వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. ఈ ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఎప్పుడూ పండబెట్టి తొక్కుతా అంటూ మాట్లాడే రేవంత్‌రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేపట్టే పోరాటానికి పాలమూరు బిడ్డలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రెతులు యూరియా బస్తాల కోసం గోస పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చలిలో చెప్పులు క్యూలో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్‌రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబితే రేవంత్‌కు సోయి వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని పేర్కొన్నారు. -
ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు
మహబూబ్‌నగర్ రూరల్: ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబు అయ్యింది. ప్రతి ఏడాది దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే వేడుకలకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారు హనుమద్దాసుల మండపంలో కొలువుదీరి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారి శేషవాహన సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకువచ్చి అలంకరించి విశేష పూజలు జరుపుతారు. ఈ వేడుకలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. దిగువకొండ వద్దనున్న అలివేలు మంగతాయారు దేవస్థానంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు పటిష్ట భద్రత మహబూబ్‌నగర్ క్రైం: నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే యువత, ఇతరులు ఎవరైనా వేడుకల పేరుతో ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు, పెట్రోలింగ్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని చెప్పారు. బుధవారం రాత్రి, గురువారం నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టడం జరుగుతుందన్నారు. ప్రధానంగా నగరంలో బైపాస్ రహదారి వెంబడి నిరంతరం పెట్రోలింగ్ వాహనాలు గస్తీ తిరుగుతాయని, ఈ మార్గంలో రాష్ డ్రైవింగ్, రైడింగ్, రేసింగ్, స్టంట్స్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడరాదని, ఒకవేళ అలా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి ఆర్గనైజ్ కార్యక్రమాలు నిర్వహించే వారికి పోలీస్ అనుమతి లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, టపాసులు పేల్చడం, డీజేలు పెట్టడం, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని చెప్పారు. నగరంలో రోడ్లు బ్లాక్ చేసి వేడుకలు జరపరాదని, మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేయాలని ఆదేశించారు. ఓపెన్ స్కూల్ తరగతుల తనిఖీ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లలో ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ స్కూల్ తరగతులను ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య జిల్లాకేంద్రంలోని గాంధీరోడ్డు, మోడల్ బేసిక్ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కేవలం ఆదివారం నిర్వహించే తరగతులకు హాజరైతే సులువుగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించవచ్చన్నారు. పరీక్ష ఫీజులు వచ్చేనెల 5 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్, ఇంటర్ వారికి ప్రాక్టికల్స్ అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం భాస్కర్, ఉపాధ్యాయులు శశిధర్, శివసాయి తదితరులు పాల్గొన్నారు. భారీగా ధాన్యం రాక నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం 22,189 బస్తాల వరిధాన్యం వచ్చింది. వేలాది బస్తాల ధాన్యం రావడంతో యార్డులో ఎక్కడ చూసిన ధాన్యం రాసులే కనిపించాయి. కాగా వరి క్వింటాల్ రూ.2,790 ఒకేధర లభించిందని మార్కెట్ అధికారి రమేశ్ తెలిపారు. -
సొంత గూటికి కార్యాలయాలు
అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఏదేని ప్రభుత్వ భవనం ఖాళీగా ఉంటే మార్చాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఎక్కడైనా ప్రభుత్వ భవనం ఉంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అక్కడికి తరలించేలా చర్యలు తీసుకుంటాం. – సమ్మయ్య, సబ్ రిజిస్ట్రార్, జడ్చర్ల జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ జడ్చర్ల: అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మారాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు పలు శాఖలకు సంబంధించి కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతూ.. ప్రతినెలా అద్దె రూపంలో రూ.వేలు చెల్లిస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ భవనాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ప్రతినెలా చెల్లిస్తున్న అద్దెను మిగిల్చుకోవడంతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలన్నింటినీ ఈ నెల 31 వరకు ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా అద్దె భవనాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి కార్యాలయాలను మార్చకుంటే వాటికి చెల్లించే అద్దె డబ్బులు నిలిపివేయాలని రాష్ట్ర ట్రెజరీ శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనికి రెండు రోజులే గడువు ఉండటంతో అద్దె భవనాల్లో సాగుతున్న కార్యాలయాల అధికారులు ఖాళీ భవనాల అన్వేషణలో నిమగ్నమయ్యారు. నిర్వహణకు అవసరమైన వసతులతో కూడిన భవనాలు కేటాయించేలా చూడాలని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు. భారం తగ్గించడంపై దృష్టి జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్ట్రార్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్, టీజీ ఎల్ఐీసీ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కోఆర్డినేటర్ల కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వీటికి ప్రతినెలా ప్రభుత్వం రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తోంది. ఇది ప్రభుత్వానికి అదనపు భారంగా మారింది. ప్రస్తుతం అద్దె భారాన్ని తగ్గించుకునే దిశగా దృష్టిసారించింది. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో టీటీడీ కల్యాణ మండపం ముందున్న ఆర్అండ్బీ కార్యాలయంలోకి రిజిస్ట్రేషన్ శాఖను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బాదేపల్లిలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనం ఖాళీగా ఉంది. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.10 లక్షలు వెచ్చించి మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టినా.. పిల్లరు, స్లాబు వరకే నిర్మించారు. జాతీయ రహదారి–44ని అనుసరించి నిర్మించిన రెండు భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. బాదేపల్లి మార్కెట్ యార్డు సమీపంలో దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి రైతు బజార్ నిర్మించి.. వృథాగా వదిలేశారు. పత్తి మార్కెట్ యార్డులో నిర్మించిన దాదాపు 20 దుకాణ సముదాయాలు నిరుపయోగంగా మారాయి. కొనసాగితే భాధ్యత వారిదే.. ఈ నెల 31లోగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను సర్కారు భవనాల్లోకి మార్చాలని ఆదేశించింది. గడువులోగా కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చకపోతే ఫిబ్రవరి 1 నుంచి వాటికి చెల్లించే అద్దె డబ్బులు నిలిపివేయాలని ప్రభుత్వ ఖజానా శాఖను ఆదేశించింది. అప్పటికి అద్దె భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగితే సంబంధిత పరిపాలనా అధికారులే బాధ్యులవుతారని స్పష్టం చేసింది. దూరదృష్టి లేకపోవడంతో.. పాలకులు, అధికారులు దూర దృష్టి సారించకపోవడంతో జడ్చర్లలో పలు భవనాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఉన్న భవనాలను వృథాగా వదిలివేయడంతో శిథిలావస్థకు చేరగా కొత్తగా చేపట్టిన భవనాలు అసంపూర్తి దశలోనే ఆగిపోయాయి. ఇటీవల రూ.కోటి వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనం కూడా ఇరుగ్గా మారిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ఈ కోవలోనే ఉన్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు దృష్టిసారించి అసంపూర్తి దశలో ఉన్న భవనాల పనులు పూర్తి చేసేందుకు, వృథాగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అద్దె భవనాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అద్దె భవనాలు ఖాళీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఈ నెలాఖరు వరకు గడువు విధింపు జడ్చర్లలో ఖాళీగా పలు భవనాలు.. ఇప్పటికై నా వినియోగిస్తే మేలు -
కూల్‌పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం ● మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్ ● నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు ● వైన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ ● ‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ ● పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు ● ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా? –8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్శ్రీగా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్‌లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
మార్కెట్లోకి విటారా గ్లోరియస్
పాలమూరు: మారుతీ సుజుకి నెక్సా మెగా ఇన్ఫ్లుయెన్సర్ మహోత్సవం శనివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్ హాజరై విటారా గ్లోరియస్ ఎడిషన్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించారు. తర్వాత కస్టమర్ రెఫరల్ పథకాన్ని ప్రారంభించారు. నెక్సా సురిక్షతమైన అంశాలపై సేల్స్ మేనేజర్ చైతన్య వివరించారు. ఆ తర్వాత విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మేనేజర్లు తుకారాం, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
జర్నలిస్టుల మధ్య వ్యత్యాసం చూపొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): డెస్క్ జర్నలిస్టులకు శాపంగా మారిన జీఓ 252ను వెంటనే రద్దు చేయాలని డెస్క్ జర్నలిస్టు సీనియర్ నాయకులు తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివా రం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన పత్రికల్లో ఉంటూ అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించి చీక ట్లో ఇళ్లకు వెళ్తుంటామని, ఈ క్రమంలో పోలీసుల తనిఖీలతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు ఉంటే వాటిని చూయించి సురక్షితంగా బయట పడేందుకు అవకాశం ఉంటుందన్నారు. విలేకరులు, డెస్క్ జర్నలిస్టుల మధ్య వ్యత్యాసం చూపకుండా అందరికీ ఒకేరకమైన అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను తగ్గించకుండా గతంలో మాదిరి గా డెస్క్ జర్నలిస్టులకు సరిపడా కార్డులు ఇచ్చి అందరికీ బస్సు పాసులు కేటాయించాలని కోరారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కోసం హెల్త్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల పథ కం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేష న్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు చోటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రతినెలా రూ. 25 వేల పింఛన్ ఇవ్వాలని వర్తింపజేయాలని పేర్కొ న్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డెస్క్ జర్నలిస్టులు సాయికుమార్, రవి, శ్రీనుయాదవ్, మాణిక్‌రావు, రవికుమార్, నవీన్, శివకుమార్, రాఘవశాస్త్రి, రామస్వామి, జాఫర్, టీయూడబ్ల్యూజే నాయకులు శివకుమార్ పాల్గొన్నారు. -
టీ–20 లీగ్‌లో మహబూబ్‌నగర్ విజయం
● క్వార్టర్ ఫైనల్‌కు చేరిన జిల్లా జట్టు ● ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని గ్రీన్‌వ్యూ క్రికెట్ గ్రౌండ్–3లో శనివారం జరిగిన హెచ్‌సీఏ బి–డివిజన్ టీ–20 లీగ్ కం నాకౌట్ టోర్నమెంట్లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో ఎ.శ్రీకాంత్ 22 బంతుల్లో 3 ఫోర్లతో 30, అబ్దుల్ రాఫే 20 పరుగులు చేశారు. ఖల్సా బౌలర్లు కరణ్ యాదవ్ 2, సన్నపవార్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఖల్సా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. కరణ్పట్నాయక్ 36, దీపాంషు 30 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు మహ్మద్ షాదాబ్ 3 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2, మహ్మద్ ముఖితుద్దీన్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కొండ శ్రీకాంత్, గగన్ చెరో వికెట్ తీశారు. టీ–20 లీగ్‌లో జిల్లా జట్టు మ్యాచ్ గెలుపొందడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. -
పప్పుశనగకు పచ్చపురుగు
● నివారణ చర్యలు చేపట్టకపోతే నష్టమే అలంపూర్: వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని లాభాలు ఆర్జించడానికి రైతన్నలు ఎక్కువగా పప్పుశనగ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సాగు నీటి వనరులు పుష్కలంగా లేకపోవడంతో తక్కువ నీటితో సాగయ్యే పప్పుశనగను నమ్ముకొని సాగు చేపట్టారు. మండలంలో ఉన్న పొలాలకు అనువుగా రైతులు ఆయా రకాల విత్తనాలతో పంటను సాగు చేస్తున్నారు. అయితే పంటకు పచ్చపురుగు వ్యాప్తి అధికంగా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ రైతులకు పలు సూచనలు చేశారు. పచ్చపురుగు పంటకు ఆశిస్తే ముందుగా ఆకు చివర బంగారు రంగులో గుడ్లు పెడుతుందని, నాలుగు రోజుల తర్వాత గుడ్డు నుంచి పురుగు బయటికి వచ్చి కాయలను, పూతను, పిందెలను తింటూ పంటకు నష్టం కలిగిస్తుందన్నారు. 60–80 శాతం వరకు తగ్గనున్న దిగుబడి పచ్చపురుగు ఆకులను తింటూ కాయలోకి చేరుకుంటుంది. గింజలోకి చేరిన పచ్చపురుగు లోపలి కాయను మాత్రమే తింటూ తొట్టేను వదిలేస్తుంది. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాదాపు 60 నుంచి 80 శాతం వరకు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. పచ్చపురుగు నివారణ ఇలా... ● 1. ముందుగా 5 మిల్లిలీటర్ల వేపనూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేయడం వల్ల గుడ్డు నాశనం అవుతుంది. ● 2. వేప నూనెలో ఉన్న కషాయం వలన పంటను తినలేక పురుగు చనిపోతుంది. ● 3. క్లోరో 2 మి.లీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది. ● 4. కోరాజెన్ (రెనాక్సిపెర్) 0.3 మి.లీ మందును లీటర్ నీటితో కలిపి పంటపై చల్లుకోవాలి. ● 5. ప్లూ బెండమైడ్ 0.3 మి.లీ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ● 6. ప్లీతోరా 1మి.లీ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ఉత్తమం. కాయ బరువు పెరగడానికి... పంట సాగులో కాయ బరువు, కాయ పూర్తిగా నిండుటకు 13:45 పోషకాన్ని లీటర్ నీటికి 5 గ్రామాలు కలిపి పిచికారీ చేసుకుంటే లాభాదాయకంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే పంట దిగుబడిని పెంచి లాభాలు ఆర్జించవచ్చని సూచించారు. పాడి–పంట -
అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ కోరారు. పట్టణంలోని సింహగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ మండపంలో శనివారం ధూప, దీప నైవేద్య అర్చక సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టిన అర్చక చైతన్యయాత్రకు జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత లేకపోవడంతో డీడీఎన్ అర్చకుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం డీడీఎన్ అర్చకుడికి రూ.6వేల వేతనం, దీప నైవేద్యం కోసం రూ.4వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా డీడీఎన్ అర్చకులకు రూ.25వేల వేతనం, దీప నైవేద్యానికి రూ.10వేలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినెల 5వ తేదీలోగా వేతనం ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, ఈహెచ్ఎస్ గుర్తింపు కార్డులు అందజేయాలని, అర్చకులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు. అర్చక సంక్షేమ పథకాలకు సంబంధించి అవగాహన కల్పించాలని, హైదరాబాద్ బర్కత్‌పురలో నిరుపయోగంగా ఉన్న అర్చక భవన్‌కు మరమ్మతులు చేయించి డీడీఎన్ అర్చకులకు కేటాయించాలని కోరారు. 33జిల్లాల అర్చకుల త్రీమెన్ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రతి జిల్లా నుంచి ఇద్దరూ డీడీఎన్ అర్చకులకు కమిటీలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎండోమెంట్ కార్యాలయంలో ఏసీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి, హరికిషన్, కార్యవర్గ సభ్యులు పరిపూర్ణానందాచారి, నరేంద్రచార్యులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు జంగం మహేశ్‌కుమార్, కార్యదర్శి కుమారస్వామి, వనపర్తి అధ్యక్షుడు లక్ష్మీకాంతాచార్యులు, నారాయణపేట అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, నాగర్‌కర్నూల్ అధ్యక్షుడు చంద్రశేఖర్, గద్వాల అధ్యక్షుడు చక్రవర్తిచార్యులు, ప్రతినిదులు పవన్‌కుమార్, జయతీర్థచార్యులతోపాటు వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘డయల్ 100’కు తక్షణ స్పందన వనపర్తి: అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎకో పార్క్ వద్ద రోడ్డు పక్కన ఓ వ్యక్తి నిస్సహాయంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. డయల్ 100కు సమాచారం అందించారు. రెండు నిమిషాల్లోనే వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు మాలిక అక్కడికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని అత్యంత జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందించడంతో ఆరోగ్యం కొంత మెరుగుపడింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు. -
కో–ఆప్షన్‌పై ఆశలు
పంచాయతీరాజ్ చట్టంతో కొత్త పదవులు పుట్టుకొచ్చాయి. ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ అధికారం ఇవ్వడంతో ఇప్పటికే పలువురు ఆ పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు మరికొందరు కో–ఆప్షన్ పదవిపై ఆశలు పెట్టుకొన్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసిన కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టాక ఇప్పుడు అందరి దృష్టి ఈ పదవులపై పడింది. తమకు సంబంధించిన వారు వార్డు మెంబర్లుగా ఎన్నిక కాని చోట్ల సర్పంచ్‌లు కోఆప్షన్ సభ్యుల ఎంపికలో జాగ్రత్తగా తమ మద్దతుదారులను ఎన్నునేందుకు అప్పుడే పావులు కదుపుతున్నారు. నూతన పంచాయతీరాజ్–2018 చట్టం ప్రకారం గ్రామపంచాయతీ పాలకవర్గంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లతో పాటు ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. కోఆప్షన్ సభ్యులకు ఓటు హక్కు మినహా వార్డు మెంబర్లతో సమాన హోదా ఉండటంతో ఈ పదవులపై ఇప్పుడు గ్రామాల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఒక్కో పంచాయతీలో ముగ్గురు చొప్పున కోఆప్షన్ సభ్యులు నియమితులు కానున్నారు. అయితే సభ్యుల ఎంపికలో సర్పంచ్, ఉపసర్పంచ్‌లే కీలకంగా వ్యవరించనున్నారు. ఇంకా అధికారికంగా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా.. త్వరలో ఉత్తర్వులు జారీ కానుండగా దీనిపై గ్రామాల్లో అప్పుడే కసరత్తు ప్రారంభించారు. ప్రతి జీపీలో ముగ్గురికి అవకాశం వాస్తవానికి ఎవరిని కో–ఆప్షన్ సభ్యులుగా నియ మించాలో చట్టంలో పేర్కొన్నారు. కోఆప్షన్ సభ్యుల కు ఓటు హక్కు తప్ప వార్డు సభ్యులకు ఉండే ఇతర అధికారాలు, హోదా కల్పించారు. గ్రామపంచాయతీ సమావేశాలకు కోఆప్షన్ సభ్యులకు కూడా అహ్వానించాల్సి ఉంటుంది. అయితే తీర్మానాల ఆమోదం, ఇతర అధికారాలకు వీరికి ఏమేరకు ప్రాధాన్యత ఉంటుందనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకంలో మాత్రం ప్రభుత్వం విభిన్నమైన విధానాన్ని అనుసరించేలా చట్టంలో పెర్కొంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామపంచాయతీల్లో ముగ్గురిని కోఆప్షన్ సభ్యులుగా నియమించనుండగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిని తప్పకుండా నియమించాలి. అలాగే గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన స్థల దాతకు సైతం కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించవచ్చు. లేదా గ్రామానికి సేవ చేసే ఎన్నారైని నియమించుకోవచ్చు. దీంతో జిల్లాలో 1,671 గ్రామపంచాయతీల్లో ముగ్గురు చొప్పున మొత్తం 5,013 మంది కోఆప్షన్ సభ్యుల నియామకాన్ని జిల్లాలో త్వరలోనే చేపట్టనున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లే ఎక్కువగా ఉండటంతో కోఆప్షన్ పదవులు సైతం ఆ పార్టీ మద్దతుదారులకే దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునేందుకు కొన్ని గ్రామాల్లో రిటైర్డు ఉద్యోగులు లేరు. ముఖ్యంగా కొత్త పంచాయతీలు, తండాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అలాగే గ్రామ సమాఖ్య అధ్యక్షులు సైతం కొన్ని గ్రామాలకు లేరు. పంచాయతీలకు స్థలాన్ని ఇచ్చేందుకు ఎంత మంది ముందుకు వస్తారో తెలియదు. అలాంటప్పుడు కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాల వారీగా గ్రామ పంచాయతీలు, కో–ఆప్షన్ సభ్యులు ఇలా.. జిల్లా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినవి కో–ఆప్షన్ సభ్యులు మహబూబ్‌నగర్ 423 422 1,266 నాగర్‌కర్నూల్ 460 454 1,362 జోగుళాంబ గద్వాల 255 255 765 వనపర్తి 268 268 804 నారాయణపేట 272 272 816 ప్రతి పంచాయతీ పాలకవర్గంలో ముగ్గురు సభ్యులు సభ్యుల ఎంపికలో సర్పంచులు, ఎమ్మెల్యేలే కీలకం గ్రామాల్లో అప్పుడే కసరత్తు షురూ.. పదవిపై ఆశావహుల కన్ను ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామ పంచాయతీలు ఉండగా ఎన్నికల సంఘం ఈ నెల మొదటి వా రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నల్లమల ఏజెన్సీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, ప్రశాంత్‌నగర్, లక్ష్మాపురం, వంగురోనొపల్లి, కల్మూలోనిపల్లి 5 పంచాయతీలతో గిరిజన అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహంచలేదు. అదేవిధంగా చారకొండ మండలం ఎర్రవరల్లి గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించడంతో ఎన్నికలు జరగలే దు. జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండాకు ఎన్నికలు జరగలేదు. 1,671 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వీటిల్లో కొత్త సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు కొలువుదీరారు. ఇందులో కాంగ్రెస్ 964, బీఆర్ఎస్ 482, బీజేపీ 75, స్వతంత్రులు 149, సీపీఐ 1, చొప్పున అభ్యర్థులు పంచాయతీ పాలన చేపట్టారు. ఎన్నికల సందడి ముగిసిపోవడంతో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు కొత్త ఏడాది జనవరి చివరి మాసంలో శిక్షణ పొందనున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కోఆప్షన్ సభ్యులపై పడింది. ఈ పదవుల కోసం పోటీ అన్ని గ్రామాల్లో ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం కోఆప్షన్ సభ్యుడి కోసం ఆరాట పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు ప్రమా ణ స్వీకారం చేశారు. బాధ్యతలూ చేపట్టారు.. కోలాహలం ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి కో ఆప్షన్ సభ్యులపై పడింది. వీరికి వార్డు మెంబర్లతో సమాన హోదా ఉండటంతో వీటిపై ఆశావహుల కన్ను పడింది. ఆయా పార్టీలు, సర్పంచ్ల మద్దతుదారులు.. వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన వారు.. ఇలా ఎందరో వీటిపై ఆశలు పెట్టుకున్నారు. – అచ్చంపేట -
సైబర్ మోసం
● రూ.7.6లక్షలు పోగొట్టుకున్న మహిళ తెలకపల్లి: సైబర్ వలలో చిక్కి ఓ మహిళ డబ్బులు పోగొట్టుకుంది. ఎస్ఐ నరేశ్ వివరాల మేరకు.. తెలకపల్లికి చెందిన బాషమోని శ్రీజ శనివారం ఇన్‌స్ట్రాగాంలో రీల్ చూస్తుండగా.. రెస్టారెంట్లకు రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయనే యాడ్ వచ్చింది. దానిపై ఆమె క్లిక్ చేసి.. రెస్టారెంట్లకు రేటింగ్ ఇచ్చింది. ఆ తర్వాత డబ్బుల కోసం ట్రాన్సాక్షన్ ఫీజు పంపించాలని సైబర్ నేరగాళ్లు నమ్మబలకడంతో ఆమె రూ. 7,68,961 పంపించింది. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి.. డయల్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేసింది. సైబర్ మోసంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తిపై వరాహం దాడి.. తీవ్రగాయాలు కొత్తకోట రూరల్: వ్యక్తిపై వరాహం దాడి చేసి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తిజిల్లా కొత్త కోట మండలంలో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పామాపురం గ్రామంలో ఓ తల్లిపంది గ్రామానికి చెందిన తప్పెట బందెన్న అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతడి రెండు చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వరాహాన్ని భయపెట్టడంతో బందెన్నను వదిలి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలు కాకుండా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పందులను, కుక్కలను శివారు ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య అమరచింత: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది యువకుడు చెట్టుకు ఉరేసుకొని మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా అమ రచింత మండ లం కొంకనోనిపల్లి గ్రామంలో చో టు చేసుకుంది. ఎస్సై స్వాతి తెలిపిన వివరాల ప్ర కారం.. కొంకనోనిపల్లి గ్రామానికి చెందిన విజయ్(24) తన ఆర్థిక పరిస్థితి బాగాలేక, తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో వైద్యం చేయించలేక మనస్తాపం చెంది శనివారం తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ మాజీ సైనికుడి మృతి మాగనూర్: మండలంలో ని కొత్తపల్లికి చెందిన మా జీ సైనికుడు సంజీ వ్ (45) చికిత్స పొందు తూ శనివారం ఉద యం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకా రం.. సంజీవ్ ఇండియన్ ఆర్మీలో బీఎస్ఎఫ్తోపాటు ఎన్ఎస్జీ బ్లాక్ కా మాండోలో విధులు నిర్వహించారు. వ్యక్తిగత కారణాలతో 2022లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. వారం కిందట సొంత పనుల నిమిత్తం మక్తల్ కు వెళ్లి తిరిగి గ్రామానికి బైక్‌పై వస్తుండగా తిర్మలాపురం గేట్ వద్ద బూడిద టిప్పర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.రెండురోజుల కింద ట మంత్రి వాకిటి శ్రీహరి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి అక్కడున్న డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.సంజీవ్‌కు భార్య మహేశ్వరి, ఇద్దరు కూమారులు, కూతురు ఉన్నారు. సంజీవ్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. -
ఉత్సాహంగా హ్యాండ్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14 విభాగం హ్యాండ్‌బాల్ బాల, బాలికల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపికై న జట్లు నారాయణపేటలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రాష్ట్రస్థాయి టోర్నీ లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్, ప్రదీప్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ క్వింటాల్ రూ.2,881 జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,881, కనిష్టంగా రూ.2,301 ధరలు లభించాయి. అలాగే హంస గరిష్టంగా రూ.1,989, కనిష్టంగా రూ.1,746, కందులు గరిష్టంగా రూ.6,659, కనిష్టంగా రూ.6,189, వేరుశనగ గరిష్టంగా రూ.8,520, కనిష్టంగా రూ.6,515, ఉలువలు రూ.4,001, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,000, కనిష్టంగా రూ.1,777, పత్తి గరిష్టంగా రూ.6,729, కనిష్టంగా రూ.5,010 చొప్పున వచ్చాయి. ముఖ్యమంత్రివి డైవర్షన్, కరెప్షన్ పాలిటిక్స్ నాగర్‌కర్నూల్: తనవి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ పాలిటిక్స్ అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి డైవర్షన్, కరెప్షన్ పాలిటిక్స్ అని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రలో చంద్రబాబు, లోకేష్ వరద నీళ్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నామని చెబుతున్నారని, ట్రిబ్యునల్ నీళ్ల కేటాయింపు సమయంలో వరద నీరు పేరుతో కట్టిన వాటికి కూడా నీటిని కేటాయిస్తుందని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉంటే మనకి 90 టీఎంసీలపై హక్కు వచ్చేదన్నారు. నల్లమల బిడ్డను అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. గురువు చంద్రబాబు కోసం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. హరీశ్‌రావు నిర్వాకం వల్లే ఇప్పటికీ కేఎల్ఐ ప్రాజెక్టులో మూడు మోటార్లే పనిచేస్తున్నాయని ఆరోపించారు. -
పర్యాటక కేంద్రంగా కోయిల్‌సాగర్
● రూ.9.50 కోట్లతో అభివృద్ధిపనులకు ప్రణాళికలు సిద్ధం ● కేఎస్పీని సందర్శించిన ఎమ్మెల్యే, టూరిజం అధికారులు దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రూ.9.50 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం టూరిజం శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోయిల్‌సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద చేపట్టే పనులకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు వివరించారు. పర్యాటకులకు కల్పించే అన్ని సౌకర్యాలకు సంబంధించిన మ్యాప్‌లను అధికారులు చూపించారు. ప్రాజెక్టు సమీపంలో కాటేజీల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్కు, రెస్టారెంట్, ప్రాజెక్టు నీటిలో బోటింగ్ వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు వద్ద నిర్మాణాల కోసం కావాల్సిన స్థలాలను వారు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోయిల్‌సాగర్ వద్ద అభివృద్ధి పనులకు గతంలో రూ.3.5 కోట్లు మంజూరు కాగా.. నిధులు పెంచాలని చేసిన ప్రతిపాదనలకు అనుకుణంగా రూ.9.5 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. గతేడాది మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించి ఇక్కడ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ఆ మేరకు ఇప్పుడు నిధులు కేటాయింపులు చేశారన్నారు. త్వరలో టెండర్లు పిలుస్తారని ఆ తర్వాత పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నియోజకవర్గాన్ని అన్నివిధాల ముందుకు తీసుకెళ్తామని వివరించారు. కార్యక్రమంలో టూరిజం శాఖ డీఈ పరుశవేది, ఆర్కిటెక్చర్ ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్.. టెర్రర్
జిల్లాల్లో గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు ● ఉమ్మడి పాలమూరులోని 4 జిల్లాల్లో ఇదే పరిస్థితి ● ఈసారి మొత్తం 3,625 ఫిర్యాదులు.. 454 కేసులు నమోదు ● అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో.. అత్యల్పంగా వనపర్తిలో.. ● ఈ ఏడాది కేటుగాళ్లు కొల్లగొట్టింది రూ.9.29 కోట్లు ● గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిన రికవరీ ధని ఇండియా బుల్స్ ఫైనాన్స్ పేరులో ఆన్లైన్ లోన్లు మంజూరు చేస్తామని నకిలీ పత్రాలు చూపిస్తూ.. ప్రాసెసింగ్ ఫీజుగా బాధితుడి నుంచి రూ.75,650 వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించిన తర్వాత బాధితుడు మహబూబ్‌నగర్ టూటౌన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపి నేరస్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. రాష్ట్రవ్యాప్తంగా 35 కేసుల్లో రూ.3 కోట్లకు పైగా ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలే వేదికగా వల పన్ని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆయా వర్గాల వ్యక్తుల బలహీనత అయిన అత్యాశను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల పేర్లతో ఏపీకే లింక్‌లు పంపించి నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట యువత నుంచి భారీగా డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. వారి మాయలో చిక్కుకున్న వారిలో అమాయకులే కాకుండా.. రైతులు మొదలుకొని విద్యాధికులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరుపై ‘సాక్షి’ క్రైం రౌండప్.. తీగలాగితే 35 కేసులు.. -
మహిళలకు జీవనోపాధి..
సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో మహిళలు జీవనోపాధి పొందుతారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సోలార్ కోసం గ్రామంలోని బీడు భూమి నాలుగు ఎకరాలను అధికారులు గుర్తించారు. దీనిపై అధికారులే శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చొరవ చూపిస్తారు. మహిళా సంఘాల్లో ఉన్న వారందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. – స్వాతి, అధ్యక్షురాలు, జిల్లా మహిళా సమాఖ్య స్థలాలు గుర్తించాం.. మహిళలు అన్నిరంగాల్లో రాణించేలా ప్రభు త్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నాం. ఇందుకోసం దేవరకద్ర, బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాం. మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి పొందే విధంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. – నర్సింహులు, డీఆర్డీఓ ● -
మహబూబ్‌నగర్
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025622 ఫిర్యాదులు.. 218 కేసులు ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి గతేడాది (2024)లో మొత్తం 3,003 ఫిర్యాదులు రాగా.. 236 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2025 సంవత్సరంలో 3,625 ఫిర్యాదులు అందగా.. 454 కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 622 ఫిర్యాదులు.. 218 కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే మహబూబ్న గర్, జోగుళాంబ గద్వా ల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సైబర్ నేరాల సంఖ్య అధికంగా ఉంది. -
మహిళా సంఘాల్లో సౌర వెలుగులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా 17 రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టారు. సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇందుకు గాను వినియోగంలో లేని ప్రభుత్వ భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు లభించే విధంగా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సౌరశక్తి వినియోగం ప్రోత్సహించడానికి పీఎం కుసుమ్ పథకం ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా అమలు చేయాలని నిర్ణయించుకుంది. వినియోగంలో లేని ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, బంజర, ప్రైవేట్, లీజు భూములలో ఒప్పందాలతో సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు భూముల వివరాలు సేకరిస్తున్నారు. 2 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం.. మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి సుమారు రూ.3– 3.50 కోట్ల వరకు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతోపాటు మహిళా సంఘాలకు 10 శాతం గ్రాంట్ గ్రామ సమాఖ్య లేదా మండల సమాఖ్యల నుంచి చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్‌కు రూ.3.13 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ● ఒక్కో మెగావాట్ సామర్థ్యం ఉన్న యూనిట్ నుంచి రోజుకు కనీసం 4 యూనిట్ల విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దీంతో మహిళా సంఘాలకు అన్ని విధాలుగా ఆదాయం చేకూరుతుంది. సోలార్ శక్తి విద్యుత్ ప్లాంట్ల ద్వారా ప్రతినెలా రూ.2,16,000 ఆదాయం సమకూరవచ్చు. రెండు మండలాల్లో ఏర్పాటు.. జిల్లాలోని దేవరకద్రతోపాటు బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామంలో సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నాలుగు ఎకరాల చొప్పున ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. స్థానికంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరువలో ఉండేలా ప్రాధాన్యమిచ్చారు. ఇక్కడ ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్ ద్వారా సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి 4 నుంచి 5 ఎకరాలు కేటాయింపు ఇందిరమ్మ మహిళా శక్తితో ఉపాధి అవకాశాలు దేవరకద్ర, బాలానగర్ మండలాల్లో ఏర్పాటుకు చర్యలు -
పాలమూరులో 18,446 కేసులు పెండింగ్
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 18,446 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మౌళిక సదుపాయాల కల్పనతో కోర్టులలో పెండింగ్ కేసులు తగ్గించే విధంగా న్యాయవాదులు కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ అన్నారు. నగరంలోని బండమీదిపల్లి సమీపంలో రూ.81 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ నర్సింగ్‌రావులతో కలిసి జస్టిస్ శ్రావణ్‌కుమార్ శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నగరంలో 16, జడ్చర్లలో 3 మొత్తం 19 కోర్టులు ఉండగా.. 293 మంది సిబ్బందికి గాను 252 మంది ఉన్నారని వెల్లడించారు. 504 మంది న్యాయవాదులు ఉండగా 35 మంది మహిళా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం 2.5 ఎకరాల స్థలంలో సరిపోని విధంగా ఉందని, నూతన కోర్టు భవన సముదాయం విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం 2024 నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 10.5 ఎకరాల స్థలంలో రూ.81 కోట్లతో మూడు అంతస్తులలో 12 కోర్టుల ఒకే భవన సముదాయం ఒకేదగ్గర నిర్మాణం అవుతుందన్నారు. ఈ నూతన భవన నిర్మాణం రాబోయే 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు భౌగోళికంగా, పరిపాలన పరంగా ప్రాముఖ్యత ఉందని, వ్యవసాయ జీవనోపాధిగా, పట్టణీకరణతో అభివృద్ధి చెందుతున్న జిల్లా అన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. నెరవేరిన చిరకాల కోరిక.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేయడంతో కక్షిదారులు, న్యాయవాదుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. పాలమూరును మొదట రుక్మాపూర్ అని పిలిచేవాళ్లని 1890లో మహబూబ్‌నగర్‌గా మారిందన్నారు. స్థానికంగా భూముల ధరలు పెరిగాయని, ఒకప్పటి కరువు ఇప్పుడు లేదని, జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తోందని, ఇక్కడి ప్రజలు చాలా ప్రేమగల వారని తెలిపారు. కోర్టులలో పెండింగ్ కేసులు కేవలం న్యాయ అధికారులు, న్యాయవాదులపైనే కాకుండా.. అందరి బాధ్యత ఉంటుందన్నారు. ● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మాట్లాడుతూ కేసుల సంఖ్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని, భూ తగాదాలు ఒక ఉదాహరణ అన్నారు. గతంలో కోర్టుకు వెళ్లాలంటే ఆలోచించే వారని, ప్రస్తుతం కోర్టుకు వెళ్తే పరిష్కారం లభిస్తుందన్న భరోసా పెరిగిందన్నారు. సమాజానికి న్యాయవాదులు అవసరం అని ఎలాంటి తగాదాలు వచ్చిన సలహా ఇస్తారని, జడ్జికి కక్షిదారుడికి మధ్య సంధానకర్తగా ఉంటారని తెలిపారు. జస్టిస్ టి.మాధవిదేవి మాట్లాడుతూ పాలమూరు నా పుట్టినిల్లు, మెట్టినిల్లు ఇదే జిల్లా కావడం విశేషం అన్నారు. ప్రస్తుత కోర్టు భవనం 1833లో నిర్మాణం చేయగా 1951లో కోర్టు భవనంగా ఏర్పడిందన్నారు. జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు మాట్లాడుతూ కక్షిదారులు పెరగడం వల్ల కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, కానీ కోర్టులు పెరిగి సరైన వసతులు లేని ఇరుకు గదుల్లో పని చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా నూతన కోర్టు భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత, కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ కోత్వాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, కార్యదర్శి శ్రీధర్‌రావు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రెండేళ్లలో కోర్టు భవన నిర్మాణం పూర్తికావాలి రూ.81 కోట్లతో ఒకే సముదాయంలో 12 కోర్టులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ నూతన కోర్టుల భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన న్యాయమూర్తులు -
మునగ సాగు.. లాభాలు బాగు
అలంపూర్: ప్రకృతి వైఫరీత్యాలతో అన్నదాతలు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. వర్షాధార పంటలు సాగు చేయడం గగనమైంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి రైతులు మునగ సాగుపై దృష్టిసారిస్తున్నారు. గతంలో మునగ సాగు బహువార్షిక పంటగా ఉండేదని.. ప్రస్తుతం ఏక వార్షిక రకాలు అందుబాటులోకి వచ్చాయని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. నీటివసతితో దీన్ని ఏకకాలంలో సాగు చేసుకోవచ్చని వివరిస్తున్నారు. మునగలో మాంసకృతులు, ఖనిజ లవణాలు, ఐరన్, కాల్షియం, భాస్వరం, విటమిన్ సీ, ఏ ఉంటాయి. ● ఆకుల నుంచి తీసిన రసానికి బ్యాక్టీరియాను తట్టుకోనే శక్తి ఉంటుంది. ● గింజల నుంచి బెన్ ఆయిల్ లభిస్తోంది. ● చెక్క నుంచి నీలంరంగు డైని తయారు చేసుకొనే అవకాశం ఉంటుంది. రకాలు.. ● పీకేఎం–1, పీకేఎం–2, జీకేదీకే–1, జీకేదీకే–2 రకాలుంటాయి. పీకేఎం–1 రకం అధిక ప్రాచుర్యం పొందినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మునగ చెట్టు 6 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. 90 నుంచి 100 రోజుల్లో పూత దశకు చేరుకుంటుంది. మొదటి కోత 150 నుంచి 170 రోజుల్లో వస్తుంది. ఒక చెట్టు ఏడాదికి 250 నుంచి 280 వరకు కాయలు కాస్తోంది. ఒక్కో కాయ 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు.. 140 గ్రాముల బరువు ఉంటుంది. ఎకరం సాగుకు 250 నుంచి 300 గ్రాముల విత్తనాలు అవసరం. 5 గీ9 అంగుళాల పాలిథిన్ సంచుల్లో ఎర్రమట్టి, పశువుల ఎరువు, ఇసుక 2:1:1 నిష్పత్తిలో నింపి నీరు పోసి ఆరబెట్టాలి. ఒక్కో సంచిలో ఒక్క విత్తనం నాటి సంచి కింది భాగంలోకి వెళ్లడానికి 6 నుంచి 8 రంధ్రాలు చేయాలి. నెల తర్వాత పొలంలో 2.5 గీ2.5 మీటర్ల దూరంలో ఎకరాకు 640 నుంచి 650 వరకు మొక్కలు నాటాలి. పొలంలో మొక్కలు నాటిన వెంటనే నీరు పెట్టాలి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా 7 నుంచి 10 రోజులకు ఓసారి నీరందించాలి. పూత సమయంలో నీటి పారుదలలో ఒడిదుడుకులు తలెత్తితే పూత రాలిపోతుంది. కాపు సమయంలో 4 నుంచి 6 రోజులకు ఒకసారి నీరందిస్తే దిగుబడి పెరుగుతుంది. పొలంలో మొక్కలు నాటే సమయంలో 2 కిలోల పశువుల ఎరువు, 250 గ్రాముల వేప పిండి, 250 గ్రాముల సూపర్ వే యాలి. మొక్క నాటిన 3, 6, 9 నెలలకు ఓసారి 100 గ్రాము ల యూరియా, 75 గ్రాముల పొటాష్ వేసి నీరందించాలి. పొలంలో నాటిన మొక్క మూడు అడుగులు పెరిగిన తర్వాత కొన చివర్లను తుంచి వేయాలి. దీని వలన పక్క కొమ్మలు అధికం అవుతాయి. పక్క కొమ్మ 1 నుంచి 2 అడుగులు పెరి గిన తర్వాత దాని చివర్లు తుంచి వేయాలి. దీంతో పక్క కొ మ్మలపై చిరు కొమ్మలు ఏర్పడి చెట్టు గుబురుగా అవుతుంది. మొదట పంట తీసుకున్న తర్వాత మొక్కలను నేల నుంచి మూడు అడుగులు వదిలి కత్తిరించాలి. ఇలా చేయడంతో కొత్త కొమ్మలు వస్తాయి. ఎరువులు వేసి మట్టిని ఎగదోయాలి. నెల తర్వాత ఒక్కో మొక్కపై 5 నుంచి 6 కొమ్మలు ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మూడేళ్ల వరకు పంట తీసుకోవచ్చని చెబుతున్నారు. పాడి–పంట -
తీరు మారడం లేదు..
తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి ఆర్డీఎస్ కాల్వ వరకు పైప్‌లైన్ ఉంది. పైప్‌లైన్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న రహదారిపై సాధారణ వాహనాలు తిరిగితే ఏం కాదు. నల్లమట్టి కావడం, రోడ్డును అనుసరించి పైప్‌లైన్ ఉండటంతో భారీ వాహనాలు తిరిగితే పైప్‌లైన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వాహనదారులకు పలుమార్లు తెలిపాం. గతంలో పచ్చర్ల వైపు రోడ్డుపై అడ్డుగా ముళ్ల కంచె ఏర్పాటు చేసినా తీరు మారలేదు. బీటీ రోడ్డు నిర్మాణానికిగాను ఉన్నతాధికారులకు విన్నవించాం. – వరుణ్, ఏఈఈ, ఆర్డీఎస్ ● -
సౌత్‌జోన్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీకి కార్తీక్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో వచ్చే నెల 3 నుంచి 6వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు చిన్నచింతకుంట మండలం అల్లీపూర్‌కు చెందిన టి.కార్తీక్ ఎంపికయ్యాడు. ఈ నెల 20న పాలమూరు యూనివర్సిటీలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికల్లో కార్తీక్ ప్రతిభ కనబరిచి సౌత్‌జోన్‌కు ఎంపికయ్యాడు. అతడిని హైదరాబాద్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించి బ్యాడ్మింటన్ కిట్ అందజేశారు. సౌత్‌జోన్ పోటీల్లోనూ ప్రతిభ చాటి జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అల్లీపురం మాజీ సర్పంచ్ ఎం.రఘువర్ధన్గౌడ్, కౌకుంట్ల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
అధ్వానంగా మారిన తుమ్మిళ్ల లిఫ్ట్ పైప్‌లైన్ రోడ్డు
తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి పచ్చర్ల మీదుగా తనగలలోని డి–23 వరకు ఏడు కిలోమీటర్ల మేర రెండు వరుసల పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. దీని పక్కనే పైప్‌లైన్ పర్యవేక్షణ కోసం రోడ్డు నిర్మించారు. ఈ రహదారిపై ఎక్కువగా ఇసుక ట్రాక్టర్లు, తుమ్మిళ్ల నుంచి పచ్చర్ల, తనగల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు, గతంలో టీఎస్ఎండీసీ అనుమతి పొందిన తుమ్మిళ్లలో ఇసుక రీచ్ ఉండటంతో ఇదే మార్గంలో భారీ టిప్పర్లు రోజు పదుల సంఖ్యలో తిరగడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించొద్దని సంబంధిత అధికారులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అధికారులు ఆ మార్గానికి గుంత తీసి ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. అయినా కూడా పక్క నుంచి దారి మళ్లించుకొని రాకపోకలు సాగిస్తుండటంతో అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. అసలే నల్లభూమి కావడంతో భూమి కుంగడం, వాహనాల రాకపోకలతో పైప్‌లైన్ దెబ్బతింటుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల రాకపోకలను నిలిపివేస్తే మేలు చేకూరుతుందని రైతులు అంటున్నారు. రాజోళి: తుమ్మిళ్ల నుంచి ఆర్డీఎస్ డి–23 వరకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ పర్యవేక్షణకు అధికారులు ఏర్పాటు చేసుకున్న రహదారి అధ్వానంగా మారింది. భారీ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండటంతో దెబ్బతింటోంది. దీంతో అధికారులు పర్యటన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్డీఎస్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టినా రాకపోకలకు ఈ రహదారి (ఇన్స్పెక్షన్ పాత్)ని వినియోగిస్తారు. ఈ రోడ్డుపై ఇతర వాహనాలు తిరిగేందుకు వీలుండదు. కాని రైతులు, చుట్టుపక్కల గ్రామాల వారు రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం రావడం, చుట్టుపక్కల గ్రామాల వారు ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నా ఎలాంటి ఇబ్బందులు కలగవు. కాని నిరంతరం ఇసుక ట్రాక్టర్లు, భారీ వాహనాలు తిరుగుతుండటంతో గుంతలు పడి కనీసం అధికారుల వాహనాలు కూడా తిరగలేని విధంగా మారింది. ప్రస్తుతం రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలు అదుపుతప్పి కాల్వలోకి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇసుక ట్రాక్టర్లు, భారీ వాహనాలు తిరగడంతో దెబ్బతిన్న వైనం నియంత్రణ చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం పొంచి ఉన్న ముప్పు తుమ్మిళ్ల నుంచి వేసిన పైప్‌లైన్ రహదారికి ఇరువైపులా ముళ్లపొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని, రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. పరిసర గ్రామాలకు ద్విచక్ర వాహనదారులు, ఆటోలు వెళ్లడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ రహదారి దెబ్బతినడంతో రాకపోకలు అవస్థలు తప్పడం లేదు. -
భారీ వాహనాలు తిరగడంతోనే..
భారీ ఇసుక వాహనాలు తిరగడంతో మట్టిరోడ్డు కుంగి పక్కనే ఉన్న పైప్‌లైన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాపారులు వారి స్వార్థం కోసం సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించడం సరికాదు. ప్రస్తుతం అధికారులు ఏర్పాటు చేసుకున్న రోడ్డు పలు గ్రామాల వారికి సౌకర్యంగా ఉంది. అత్యవసర సమయాల్లో సులువుగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. వర్షాకాలంలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో అధికారులు తాత్కాలికం మరమ్మతులు చేశారు. అయినప్పటికీ మళ్లీ భారీ వాహనాలు అధికంగా తిరుగుతుండటంతో రోడ్డు గుంతలమయంగా మారింది. – కోదంరాముడు, తుమ్మిళ్ల ● -
ఉరేసుకొని మహిళ బలవన్మరణం
నవాబుపేట: ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల వెంకటమ్మకు చెందిన ఎకరా పొలాన్ని ఆమె దాయాదులు గతంలో పట్టా చేయించుకున్నారు. దీంతో నాటి నుంచి మనస్తాపంతో ఉన్న వెంకటమ్మ గురువారం పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భూమి కోల్పోయానన్న మనస్తాపంతోనే తన తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుమార్తె కృష్ణవేణి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య వెల్దండ: మండలంలోని ఉబ్బలగట్టుతండా జీపీ పరిధిలోని మల్లయ్య గుండుతండాలో వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మల్లయ్యగుండు తండాకు చెందిన రాత్లావత్ రమేశ్‌నాయక్(35) గురువారం రాత్రి రోజువారీగా కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశారు. చలికాలం కావడంతో భార్య సీత ఆరుబయట చుట్టుపక్కలవారితో చలిమంట వేసుకుంది. రాత్రి ఇంట్లోకి వెళ్లే సరికి రమేశ్‌నాయక్ ఉరివేసుకొని ఉన్నట్లు గుర్తించి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వెళ్లి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతిచెందాడు. శుక్రవారం సర్పంచులు కేస్యనాయ క్, మహిపాల్, ఆయా పార్టీల నాయకులు బా ధిత కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్ మృతుడి కుటుంబానిక రూ.10వేల ఆర్థిక సాయం అందజేశా రు. మృతుడికి కుమారుడు శ్రీరామక్, కుమార్తె శ్రీలత ఉన్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మల్లేపల్లిలో యువకుడు.. రాజాపూర్: మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన నర్సింహ్మ (18) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లితో గొడవపడడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై రాజాపూర్ పోలీసులను సంప్రదించగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. కంటైనర్ ఢీకొని మహిళ దుర్మరణం రాజాపూర్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ కంటైనర్ ఢీకొని మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని రంగారెడ్డిగూడ ఎక్స్‌రోడ్డులో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన ఎరుకలి మల్లమ్మ (49) గ్రామ సర్వీసు రోడ్డులో ఉన్న పాల కేంద్రంలో పాలు తీసుకొని నడుచుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఏపీ 39వీసీ 4750 నంబర్ గల కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది. కంటైనర్ టైరు మల్లమ్మ పొట్టపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమార్తె అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంటైనర్ డ్రైవర్ రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందంగౌడ్ తెలిపారు. వ్యక్తి అనుమానాస్పద మృతి జడ్చర్ల: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బండమీదిపల్లి సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. నవాబుపేట మండలంలోని కాకర్లపహడ్ గ్రామానికి చెందిన దండు స్వామి (28) మోటర్ బైక్‌పై జడ్చర్ల నుంచి కాకర్లపహడ్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బండమీదిపల్లి డబుల్‌బెడ్ రూం ఇళ్ల సమీపంలో రోడ్డు దాటుతున్న మరో బైక్‌ను ఓ పక్కగా ఢీకొట్టి రోడ్డు కిందకు పడిపోయాడు. బైక్‌పై ఉన్న స్వామి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. అయితే తన భర్త మరణంపై అనుమానం ఉందని, ప్రమాదానికి కారణమయిన వారే రాళ్లతో కొట్టి చంపి ఉంటారని మృతుడి భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత వంగూరు: మండలంలోని ఉల్పర సమీపంలోని దుందుబీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున బ్లూకోర్ట్ సిబ్బంది పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి ట్రాక్టర్ యజమాని సత్యనారాయణపై కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు. -
టీ–20 లీగ్ చాంపియన్ మహబూబ్‌నగర్
● కీలక మ్యాచ్‌లో నారాయణపేట జట్టుపై విజయం ● రన్నరప్‌గా నిలిచిన నాగర్‌కర్నూల్ జట్టు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ చాంపియన్‌గా ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టు నిలిచింది. ఈ నెల 20న ప్రారంభమైన ఉమ్మడి జిల్లా టీ–20 లీగ్ శుక్రవారం ఉత్సాహంగా ముగిసింది. లీగ్‌లో ఉమ్మడి జిల్లాలో ని జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. లీగ్‌లో మూడు విజయాలు సాధించి నెట్రన్ రేట్ ప్రకారం మెరుగైన ప్రదర్శన కనబరిచిన మహబూబ్‌నగర్ జట్టు 6 పాయింట్లు సాధించి చాంపియన్‌గా, నాగర్‌కర్నూల్ జట్టు 6 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. కాకా మెమోరియల్ టీ–20 లీగ్‌లో రెండో రౌండ్లో పాల్గొనే 15 మందితో కూడిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులను ఎంపికచేశారు. 51 పరుగుల తేడాతో నాగర్‌కర్నూల్ విజయం లీగ్ మ్యాచ్‌లో నాగర్‌కర్నూల్ జట్టు 51 పరుగుల తేడాతో నారాయణపేట జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నాగర్‌కర్నూల్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. జట్టులో ఎన్.జశ్వంత్ 21 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు, అర్షద్ అహ్మద్ 23, రాంచరణ్ 20 పరుగులు చేశారు. నారాయణపేట బౌలర్లు అక్షయ్ 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, అచ్యుత్‌రామ్ 2, మహ్మద్ జహీర్ 2 వికెట్లు, బాలాజీ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణపేట జట్టు.. 19.4 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఆర్యన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 పరుగులు, కె.భానుప్రసాద్ 20 పరుగులు చేశారు. నాగర్‌కర్నూల్ బౌలర్లు కేతేశ్వర్ 3.4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా.. ఎన్.జశ్వంత్ 3, గగన్, జష్షు చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆప్‌ది మ్యాచ్‌గా ఎన్.జశ్వంత్ (నాగర్‌కర్నూల్) నిలిచారు. మహబూబ్‌నగర్ జట్టు విజయం.. ఉమ్మడి జిల్లా టీ–20 చి వరి లీగ్ మ్యాచ్‌లో ఆతి థ్య మహబూబ్‌నగర్ జ ట్టు 10 వికెట్ల తేడాతో నారాయణపేట జట్టు పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి న నారాయణపేట జట్టు.. నిర్ణీత 20 ఓవర్ల లో 9 వికెట్లు కో ల్పోయి 124 పరుగులు చేసింది. జట్టులో అక్షయ్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల తో 45 పరుగులు చేయగా.. ఆర్యన్ 22 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు మహ్మద్ షాదా బ్ అహ్మద్ 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికె ట్లు, డేవిడ్ క్రిపాల్ 2, యువన్ ముద్దనూరి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్ నగర్ జట్టు.. వికెట్ నష్టపోకుండా 12.4 ఓవర్లలో 126 పరుగులు చేసింది. డేవిడ్ క్రిపాల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67, అబ్దుల్ రాఫే 33 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన డేవిడ్ క్రిపాల్ (మహబూబ్‌నగర్) మ్యాన్ ఆప్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఉమ్మడి జిల్లా క్రికెటర్లు భారత జట్టుకు ఆడాలి ఉమ్మడి జిల్లా క్రికెటర్లు భారత జట్టుకు ఆడాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ వి.మనోహర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా టీ–20 లీగ్‌లో విజేతగా నిలిచిన మహబూబ్‌నగర్, రెండోస్థానంలో నిలిచిన నాగర్‌కర్నూల్ జట్లకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. కాగా, ఈ నెల 29 నుంచి జరిగే కాకా వెంకటస్వామి మెమోరియల్ రౌండ్ రౌండ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు పాల్గొంటుందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో మహబూబ్‌నగర్‌లోని మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీఎన్జీవో మాజీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ పాల్గొన్నారు. అంతకుముందు లీగ్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన కేతేశ్వర్ (నాగర్‌కర్నూల్)కు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ మెమోంటో అందజేశారు. జిల్లా క్రికెట్ జట్టు: డేవిడ్ క్రిపాల్, ఎ.శ్రీకాంత్, అబ్దుల్ రాఫే, ముఖిత్, షాదాబ్, కె.శ్రీకాంత్, వెంకటచంద్ర (మహబూబ్‌నగర్), అచ్యుత్‌రామ్, ఆర్యన్, బి.అక్షయ్, అభిలాష్ (నారాయణపేట), ఎన్.జశ్వంత్, గగన్, జి.జశ్వంత్ (నాగర్‌కర్నూల్), అరవింద్ (గద్వాల). -
అలివిలవిల..
నేడు కోర్టు నూతన భవన నిర్మాణానికి భూమిపూజ ● రూ.83 కోట్లతో ఒకే దగ్గర 12 కోర్టుల భవన సముదాయం ● హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తులు పాలమూరు: జిల్లా న్యాయవాదులు ఎదురుచూస్తున్న నూతన కోర్టుల భవనం కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. జిల్లా నూతన కోర్టుల సముదాయ భవనాలు నిర్మించడానికి బండ మీదిపల్లి శివారులో ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించారు. ఇందులో 5 ఎకరాల స్థలం ఇప్పటికే చదును చేయగా ఆ ప్రాంతంలో నూతనంగా 12 కోర్టు భవనాల సముదా యం ఒకే దగ్గర నిర్మించడానికి రూ.83 కోట్ల బడ్జెట్‌తో పనులు ప్రారంభం చేయనున్నారు. ఇందుకు సంబంధించి నగరంలోని బండమీదిపల్లి శివారులో నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు సముదాయ భవన నిర్మాణ శంకుస్థాపనకు శనివారం భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ నర్సింగ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. జిల్లా కోర్టుతోపాటు బార్ అసోసియేషన్ నుంచి భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. 50 ఏళ్ల కల నెరవేరబోతుంది గత కొన్నేళ్లుగా నూతన కోర్టు నిర్మించుకోవాలని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు అనేక రకాల పోరాటాలు చేశాం. పాలమూరు జిల్లాకు చెందిన ప్రతి న్యాయవాది 50 ఏళ్ల కల నూతన కోర్టు నిర్మించుకోవాలనేది. ఇప్పటికి ఈ కల సాకారం కావడం చాలా సంతోషంగా ఉంది. – అనంతరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణానది తీరం వెంట తనిఖీలను ముమ్మరం చేస్తాం. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేటను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రధానంగా స్థానిక మత్స్యకారులు అధికారులకు సహకరించాలి. – నర్సింహారావు, ఏడీ, మత్స్యశాఖ కొల్లాపూర్: అలివి వలలతో చేపల వేట నిషేధం. అయినప్పటికీ కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం కృష్ణానదిలో అలివి వలలతో వేట సాగిస్తూ.. చిన్న చేప పిల్లలను యథేచ్ఛగా పట్టేస్తున్నారు. ఫలితంగా సంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అలివి వలలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామని.. అవసరమైతే ఏపీ అధికారుల సమన్వయంతో అలివి వలలతో చేపల వేటను కట్టడి చేస్తామని ఇటీవల కొల్లాపూర్‌లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చాలాకాలంగా అలివి వలల వినియోగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార యంత్రాంగంలో మాత్రం స్పందన కనిపించడం లేదు. కృష్ణానదిలో విచ్చలవిడిగా అలివి వలల వినియోగం జరుగుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు, అధికారులు చేతలకు పొంతన లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కృష్ణానదిలో వదులుతున్న చేప పిల్లలను కొన్ని రోజుల్లోనే అలివి వలలతో పట్టేస్తుండటంతో క్రమేణా మత్స్య సంపద తగ్గుతూ వస్తోంది. కృష్ణాతీరంలోనే గుడారాలు.. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్న కృష్ణానది తీరం వెంట పదుల సంఖ్యలో అలివి వలలతో చేపల వేట సాగించే వారి గుడారాలు ఉన్నాయి. చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల్లోని నది తీర ప్రాంతాల్లో విస్తృతంగా అలివి వలలతో చేపల వేట సాగుతోంది. వైజాగ్, కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నదీ తీరంలోని పట్లు (చేపలు అధికంగా లభించే ప్రాంతాలు) కొనుగోలు చేసి దందా సాగిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల చెంతనే.. పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం.. కృష్ణానదిలో బోట్ల ద్వారా విహరించడం కనిపిస్తుంది. అయితే సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి కనుచూపు మేరలోనే అలివి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలు ఉన్నాయి. నదీ తీరానికి రెండు వైపులా గుడారాలు, ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలివి వలల గుడారాలే కనిపిస్తాయి. అలివి వ్యాపారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందుకే అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల నిర్బంధం.. అలివి వలలు లాగేందుకు చాలామంది కార్మికులు అవసరం పడతారు. దీంతో వ్యాపారులు బలవంతంగా కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధిస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల జోక్యంతో 100 మందికిపైగా బాండెడ్ లేబర్‌కు విముక్తి కల్పించారు. అయినప్పటికీ కార్మికశాఖ అధికారులు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలోని నీటి వనరుల్లో ఈ ఏడాది 2.50 కోట్ల చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో చేపపిల్లల విడుదలను లాంచనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 23 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. సోమశిల వద్ద కృష్ణానదిలో మంత్రి జూపల్లి కృష్ణారావు 58 వేల చేపపిల్లలను వదిలారు. నదిలో 30 లక్షల చేపపిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్నసైజు చేపల వేట ఇలా వదిలితే.. అలా పట్టేస్తున్న అక్రమార్కులు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు స్వయంగా మంత్రులు హెచ్చరించినా కనిపించని స్పందన క్రమంగా తగ్గిపోతున్న మత్స్య సంపద కృష్ణానది తెలంగాణ, ఏపీ సరిహద్దులో ప్రవహిస్తోంది. తాము తనిఖీలకు వెళ్లే సమయానికి అలివి గుడారాలను ఏపీ సరిహద్దులోకి మారుస్తున్నారంటూ తెలంగాణ అధికారులు చెబుతూ.. తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, వేంకల్, జటప్రోల్, అమరగిరి ప్రాంతాల్లో నెలల తరబడి గుడారాలు తెలంగాణ సరిహద్దులోనే ఉంటాయి. అధికారులు అనుకుంటే ఏ క్షణమైనా వారిని పట్టుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. -
చిల్లిగవ్వ లేదు..
గ్రామ పంచాయతీలో అభివృద్ధి పను లు చేపట్టేందుకు చిల్లిగవ్వ లేదు. గతంలో మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు, కార్యదర్శులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.లక్షల్లో బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటన కొంత ఊరటనిచ్చింది. – స్వర్ణలత, సర్పంచ్, కోడూర్ గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్ మండలం అభివృద్ధికే వెచ్చిస్తాం.. ముఖ్యమంత్రి ఇస్తామన్న రూ.10 లక్షలతో కొంతైనా గ్రామాల అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికై తే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వేతనాలు చెల్లించిన తర్వాత మిగులు నిధులను ప్రజల కనీస అవసరాలకు వినియోగిస్తాం. పారదర్శకంగా నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగిస్తాం. – వెంకట్‌నాయక్, సర్పంచ్, రేగడిగడ్డతండా● -
జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరి కి పదవుల్లో అవకాశం లభిస్తుందన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా పోటీ చేయాలనుకునే వారు జిల్లా పదవులకు దరఖాస్తు చేసుకోవద్దని అభిప్రాయపడ్డారు. ఒకవేళ భవిష్యత్‌లో కార్పొరేటర్‌గా, పార్టీ పదవీపరంగా కూడా పనిచేస్తామనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా పరిశీలకులు భాస్కర్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి పదవులు లభిస్తాయన్నారు. పార్టీ పరంగా జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిదే తుది నిర్ణయం అన్నారు. పార్టీ లైన్ దాటి, క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే ఎవరైనా వేటు తప్పదన్నారు. జిల్లాలోని ప్రతి బ్లాక్‌కు ఒక జిల్లా ఉపాధ్యక్ష పదవి, బ్లాక్‌కు రెండు ప్రధాన కార్యదర్శులు, ప్రతి మండలానికి ఒక కార్యదర్శి, జిల్లా కోశాధికారి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి, మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి 10 డివిజన్లకు ఒక ప్రధాన కార్యదర్శి, ఐదు డివిజన్లకు ఒక కార్యదర్శి పదవులు ఉంటాయని, ఆసక్తి గలవారు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31 లేదా వచ్చేనెల మొదటి వారంలో జిల్లా పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ అవేజ్ అహ్మద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో యువతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సర్పంచులుగా గెలుపొందిన యువజన కాంగ్రెస్ నాయకులను ఘనంగా సన్మానించారు. -
పంచాయతీలకు నిధులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున విడుదల చేస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 423 గ్రామ పంచాయతీలు ఉండగా.. చాలా గ్రామాలు జీరో బ్యాలెన్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం, గ్రామాల్లో చిన్నపాటి పనులు చేపట్టడానికి ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్న తరుణంలో సీఎం ప్రకటన వారికి ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే గ్రామ పంచాయతీలకు సీఎం నిధుల నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వనుండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడుగులు పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో.. గ్రామ పంచాయతీలకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో బాధ్యతలు చేపట్టిన ప్రత్యేకాధికారులు భారంగా నెట్టుకువచ్చారు. చాలా గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించి అవసరమైన పనులు చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో అప్పులు తెచ్చి కార్యదర్శులు పనులు చేపట్టాల్సి వచ్చింది. అలాగే మాజీ సర్పంచులు అడ్వాన్స్‌గా గ్రామాల్లో పనులు చేశారు. వీటికి సంబంధించి మాజీలతోపాటు కార్యదర్శులకు రూ.లక్షల్లో బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంబీ రికార్డులు చేయించుకుని గ్రాంట్ రాగానే రాబట్టుకునేందుకు మాజీలు జీపీల చుట్టూ తిరుగుతున్నారు. కార్యదర్శులు సైతం అప్పులు తెచ్చిన డబ్బులకు ఎంతకాలం వడ్డీలు కట్టాలని వాపోతున్నారు. నేరుగా గ్రాంట్లు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు నూతన సర్పంచ్‌లకు ఊరట -
యువకుడి ఆత్మహత్య
ధన్వాడ: భార్యతో గొడవ పడిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ధన్వాడలో చోటుచేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని అప్పాజీ నగర్‌కు చెందిన భాస్కర్(24) భార్యాభర్తల మధ్య న తరచుగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో మరోసారి రాత్రి ఇద్దరి మధ్యన గొడ వ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన భాస్కర్ తెల్లవారుజమున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం మక్తల్: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని జక్లేర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జక్లేర్‌కు చెందిన కుర్వ మల్లేష్ (38)కు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు చెప్పేవాడన్నారు. ఈ క్రమంలోనే గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కొందరు కుటుంబ సభ్యులకు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం బిజినేపల్లి: మండలంలోని గంగారం, లట్టుపల్లి గ్రామాల శివారులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శంకర్‌నాయక్(50) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌నాయక్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గంగారం నుంచి తన స్వగ్రామం అయిన ఉడుగులకుంట తండాకు బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున ఇప్పలతండా సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు అటుగా ప్రయాణించే వాహనదారులు గుర్తించారు. వారు కొన ప్రాణంతో ఉన్న శంకర్‌నాయక్ నీళ్లు తాపి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేలోపు మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య మదనాపురం: కుటుంబంలో ఏర్పడిన కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అజ్జకొల్లులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంకరి అంజలి (సహస్ర) (24)కు భర్తతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోని బాత్రూమ్లోకి వెళ్లి టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. -
విద్యుత్‌షాక్‌తో కాంట్రాక్టు సిబ్బందికి గాయాలు
కొత్తకోట: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి గాయాలపాలైన ఘటన కొత్తకోట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. మదనాపురం మండలం దంతనూర్‌కు చెందిన యాదగిరి కొత్తకోట మండలంలోని విద్యుత్ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం కొత్తకోట పట్టణంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా.. ముందస్తు హెచ్చరికలు లేకుండానే విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. ఈ సందర్భంలో యాదగిరి అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌లోని న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. గుర్తింపు పొందిన విద్యుత్‌శాఖ లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేయాల్సి ఉండగా బినామీ కాంట్రాక్టర్‌గా మారుతున్నారు. కిందిస్థాయి కాంట్రాక్టు సిబ్బందికి బాధ్యతలు అప్పగించడమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఘటనపై భద్రతా నిర్లక్ష్యం కార్యాచరణలో వైఫల్యం కోణాల్లో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆధారాలున్నా.. పక్కదారి
ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో ట్విస్టు ● ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో కేసు తారుమారుకు ప్రయత్నాలు? ● పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యుల అనుమానాలు ● ఎట్టకేలకు నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు అచ్చంపేట రూరల్: అచ్చంపేట పట్టణంలో ఓ వ్యక్తి హత్య జరిగి నెలరోజులైంది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు అందించారు. అయినప్పటికీ అది హత్య కాదని కొట్టి పారేశారు పోలీసులు. చివరికి మృతుడి బంధవులు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను కలిసి హత్యోదంతంపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో హత్యకేసు తమకు చుట్టుకునేలా ఉందని గ్రహించిన స్థానిక పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. అయితే హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించాల్సి ఉండగా.. బుధవారం రాత్రి 9.30 గంటలకు వాట్సప్ గ్రూప్‌లో ప్రెస్‌మీట్ పెట్టినట్టుగా ఫొటో, అసంపూర్తి సమాచారాన్ని పోస్టుచేసి చేతులు దులుపుకొన్నారు. అచ్చంపేటలోని మారుతీనగర్ కాలనీలో నివాసముంటున్న లక్ష్మణ్‌నాయక్(38) నవంబర్ 25న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయన సోదరుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. లక్ష్మణ్ భార్య పద్మ 2024 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై ఉప్పునుంతల మండలం తాడూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసింది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గోపితో ఆమెకు పరిచయం ఏర్పడి ఏడాదికాలంగా వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. ఈ విషయాన్ని గోపికి చెప్పడంతో తమకు అడ్డుగా ఉన్న లక్ష్మణ్‌నాయక్‌ను హతమార్చేందుకు పథకం రచించారు. నవంబర్ 24న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మణ్‌నాయక్‌ను భార్య పద్మ, ఆమె ప్రియుడు గోపి కలిసి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్టుగా పద్మ పాఠశాలకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటి యజమానికి ఫోన్ చేసి.. తన భర్తకు ఫోన్ చేసినా స్పందించడం లేదని నటించింది. మధ్యాహ్నం హడావుడిగా ఇంటికొచ్చి.. లోపల తన భర్త చనిపోయి ఉన్నాడని బంధువులు, ఇంటి చుట్టుపక్కల వారిని నమ్మించింది. తాడూరు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన పద్మ, గోపి ప్రవర్తనపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అప్పట్లో పద్మను మందలించి ఉప్పునుంతల మండలం గట్టుకాడిపల్లి పాఠశాలకు పంపించారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు పద్మ తన భర్తను హత్యచేసిన ఘటన బయట పడటంతో గట్టుకాడిపల్లి గ్రామస్తులు ఆ ఉపాధ్యాయురాలు తమకొద్దంటూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నెల రోజుల తర్వాత అచ్చంపేట పోలీసులు దర్యాప్తులో వాస్తవాలను రాబట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ నాగరాజు, ఎస్ఐ సద్దాంహుస్సేన్ వెల్లడించారు. లక్ష్మణ్‌నాయక్‌ను తన భార్య పద్మ, ప్రియుడు గోపి హత్యచేసినట్లు ఆధారాలను సేకరించి బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అచ్చంపేట జూనియర్ సివిల్‌కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. లక్ష్మణ్‌నాయక్ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలను బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు అందించినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేయడంతో.. ఇక చేసేదేమీ లేక దర్యాప్తు ముమ్మరం చేశారని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో మరో ఇద్దరిని తప్పించినట్లు బాహాటంగా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టును కూడా తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని.. పెద్ద మొత్తంలో కొందరికి ముడుపులు ముట్టజెప్పడానికి నిందితులు వెనకాడలేదని తెలుస్తోంది. దీంతోనే హత్యకు సంబంధించిన వివరాలను కూడా మీడియా ముందు వెల్లడించడానికి పోలీసులు ఆసక్తి చూపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విహారయాత్రకు వెళ్తున్న కళాశాల బస్సు బోల్తా
● విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం ● ప్రమాదస్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ రాజాపూర్: ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్తుండగా బస్సు బోల్తా పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీ ల్చుకున్నారు. పూర్తి వివరాలు.. నారాయణపేట జి ల్లా మరికల్ మండల కేంద్రంలోని మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు 43 మంది క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కళాశాల బస్సులో హైదరాబాద్ లోని జలవిహార్ విహారయాత్రకు బయలు దేరారు. ఈ క్రమంలో బాలానగర్ మండలం కేతిరెడ్డిపలక్లి శివారులో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో రోడ్డుపై బస్సు బోల్తా పడింది. విద్యార్థుల హాహాకారాలు విన్న స్థానికులు కిటికీల్లోంచి వారిని బయటకు తీశారు. ప్రమాదంలో గా యాలపాలైన 10 మంది విద్యార్థులను బాలానగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం షాద్‌నగర్ బుగ్గారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాద స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి రోడ్డు మధ్యలో పడి ఉన్న బస్సును భారీ క్రేన్ సాయంతో పక్కకు తొలగించి అక్కడి నుంచి వనపర్తికి వెళ్లారు. అనంతరం కలెక్టర్ విజయేంద్రబోయి, ఎస్పీ జానకి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారిపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, బాలానగర్, రాజాపూర్ ఎస్ఐలు లెనిన్, శివానందంగౌడ్ క్రమబద్ధీకరించారు. -
పాలమూరుకు రెండో విజయం
● సత్తాచాటిన గద్వాల, నాగర్‌కర్నూల్ జట్లు కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ కొనసాగుతోంది. గురువారం నాలుగోరోజు ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గద్వాల క్రీడాకారుడు సుజల్‌రెడ్డి లీగ్‌లోనే మొదటి సెంచరీ నమోదు చేశారు. ● 46 పరుగుల తేడాతో.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 46 పరుగుల తేడాతో జోగుళాంబ గద్వాల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 16 ఓ వర్లలో 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81 పరుగులు చేయగా, శ్రీకాంత్ 22 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు, అబ్దుల్ రాఫే 29 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు ఖయ్యూం ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గద్వాల జట్టు 15.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఎస్.అరవింద్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు, మహ్మద్ ఖయ్యూం 28 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు వెంకటచంద్ర 2, ముఖితుద్దీన్ 2, శశాంక్ 2, షాదాబ్ అహ్మద్ 2 వికెట్లు, కొండ శ్రీకాంత్, యువన్ చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ క్రిపాల్ (మహబూబ్‌నగర్)కు దక్కింది. ● 9 వికెట్ల తేడాతో నాగర్‌కర్నూల్ విజయం.. మరో లీగ్‌మ్యాచ్‌లో నాగర్‌కర్నూల్ జట్టు 9 వికెట్ల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వనపర్తి జట్టు నాగర్‌కర్నూల్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పో యింది. నిర్ణీత 16 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. జట్టులో యశ్వంత్ 13, నవీనకుమార్ 13 పరుగులు చేశారు. నాగర్‌కర్నూల్ బౌలర్లు రాంచరణ్ 4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, జష్షు 3 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నాగర్‌కర్నూల్ జట్టు సునాయసంగా ఆడి లక్ష్యాన్ని ఛేదించింది. 6.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 69 పరుగులు చేసింది. జట్టులో బి.సంజయ్ 23 బంతుల్లో 9 ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా రాంచరణ్ (నాగర్‌కర్నూల్) నిలిచారు. ● 82 పరుగుల తేడాతో గద్వాల విజయం.. మరో లీగ్ మ్యాచ్‌లో జోగుళాంబ గద్వాల జట్టు 82 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ సుజల్‌రెడ్డి 48 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మహ్మ ద్ ఖయ్యూం 38, యూనుస్ 37 పరుగులు చేశా రు. వనపర్తి బౌలర్ యశ్వంత్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వనపర్తి జట్టు 16 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. జట్టులో రాంచారి 38, గణేష్‌రెడ్డి 21 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు ఖ య్యూం 2, వెంకటసాగర్ 2 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా సుజల్‌రెడ్డి (గద్వాల) నిలిచారు. ● చక్కటి ప్రతిభ చాటాలి.. క్రికెట్ లీగ్‌లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని చక్కటి ప్రతిభ కనబర్చాలని పుర కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారుడికి ఎండీసీఏ ప్రతినిధులతో కలిసి రూ.2 వేల నగదు, మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరాజు, ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్‌అలీ, సభ్యులు శివశంకర్ పాల్గొన్నారు. -
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
● గర్భం దాల్చడంతో వెలుగులోకి ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు భూత్పూర్: మానసిక దివ్యాంగురాలిపై ఇద్ద రు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా గ ర్భం దాల్చిన ఘటన వెలుగుచూసింది. ఎస్ ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. భూత్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురా లు(35) అవావిహిత. ఈమె ఇంటి వెనకాల ఉండే పరమేష్, పిండి శేఖర్ కొన్ని నెలలుగా ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకు న్నారు. కాగా.. ఇటీవల సదరు మహిళకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె తండ్రి జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఐదు నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఈ ఘటనపై గ్రామపెద్దలు జోక్యం చేసుకుని పుట్టిన బిడ్డ పేరు మీద రూ.9 లక్షలు బ్యాంకులో జమ చేయడానికి నిర్ణయించారు. అ యితే ఈ విషయం చివరికి బయటపడటంతో బాధితురాలి తండ్రి గురువారం భూ త్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరమేష్, పిండి శేఖర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ఊట్కూరు: త్రుటిలో ఘోర బస్సు ప్రమాదం తప్పిన ఘటన గురువారం మండలంలోని కొల్లూరు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మక్తల్ నుంచి పల్లె వెలుగు బస్సు నారాయణపేటకు వెళ్తుండగా మండలంలోని కొల్లూరు గేటు సమీపంలో బస్సు కమాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో డ్రైవర్ కాలప్ప అప్రమత్తతతో బస్సు ఆపేందుకు ప్రయత్నించగా రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉండగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కాలం చెల్లిన బస్సుల వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పరవశించిన పాలమూరు
అయ్యప్పకొండపై వైభవంగా మహా పడిపూజ స్వామివారికి విశేష పూజలు.. ● ప్రధాన రహదారులపై ఊరేగిన హరిహరసుతుడు ● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ ● హాజరైన ప్రముఖులు పూజల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మెట్లపూజలో పాల్గొన్న మహిళా భక్తులు మహిళలతో కలిసి కోలాటం ఆడుతున్న ఎంపీ డీకే అరుణ స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు పద్మావతీకాలనీలో ఉన్న అయ్యప్పకొండపై గురువారం అయ్య ప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం తూర్పుకమాన్ రామాలయం నుంచి అయ్యప్ప పల్లకీతో పాటు రథం, పూర్ణ కలశం, స్వామివారి ఆభరణాల శోభాయాత్ర ప్రారంభమై గడియారం చౌరస్తా, అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, న్యూటౌన్, మెట్టుగడ్డ, పద్మావతికాలనీ మీదుగా ఆలయానికి చేరుకుంది. శోభాయాత్రలో అయ్యప్ప మాలధారులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఊరేగింపులో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. ఊరేగింపు అనంతరం అయ్యప్ప ఆలయంలో స్వామివారికి అష్టాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. ఉదయం గణపతి, నవగ్రహ హోమాలు, నిత్యాభిషేకం, సహస్ర నామార్చన చేశారు. రాత్రి తిరుపతికి చెందిన వెంకటేశ్వర చంద్రమౌళిశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి చందనం, పంచామృతాలతో అభిషేకాలు, ఏకశిల దివ్య పదునెట్టాంబడి పూజ, మహా మంగళహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు సీఆర్ భగవంతరావు, ప్రధానకార్యదర్శి ముత్యంస్వామి, పంబరాజు, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పడిపూజ సందర్భంగా అయ్యప్పకొండపై మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి శిబిరాన్ని ప్రారంభించగా 504 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ లయన్ నటరాజ్, డా. హిమబిందు, డా. అంజన్నరాజు, డా. శ్రీకర్, మధుసూదన్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేతల వసూళ్ల పర్వం
వైన్‌షాపులు మొదలుకొని.. వీధివ్యాపారుల దుకాణాల కేటాయింపులో జోరుగా దందా ● హాట్‌టాపిక్‌గా మారిన కూల్‌పాయింట్స్ అడ్డాలు ● ప్రతిచోటా జోక్యం చేసుకుంటున్న కొందరు నేతలు పాలమూరు: చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారి దగ్గరి నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపారు కొందరు నేతలు. ఇటీవల కాలంలో నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల ఎదుట నిర్వహించే కూల్‌పాయింట్స్ (వాటర్ బాటిల్స్, అన్ని రకాల స్నాక్స్, సిట్టింగ్ నిర్వహణ)పై తీవ్ర పోటీ నెలకొన్న క్రమంలో వాటి కేటాయింపు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని మనవాళ్లకు ఇవ్వాలని మద్యం దుకాణాల నిర్వాహకులపై ఒత్తిడి చేయడంతో ఒకరిద్దరూ వ్యాపారులు గుడ్‌విల్‌కు దుకాణాలు విక్రయించుకొని వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో కూల్‌పాయింట్స్ తీసుకున్న వ్యక్తుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఫుట్‌పాత్‌లపై చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించే వారిని సైతం వదలడం లేదు. డబ్బులు ఇస్తేనే అడ్డా దొరుకుతుంది.. లేకుంటే లేదు అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో సదరు వీధివ్యాపారులు అప్పులు చేసి అడిగినంత ముట్టచెబుతున్నారు. నేతలు అడిగిన మొత్తంలో ఇవ్వకపోతే దుకాణం లేకుండా కుటుంబం గడవటం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతోపాటు జీవనం దెబ్బతింటుందనే భయంతో అడిగినంత ముట్టజెప్పినట్లు సమాచారం. షెట్టర్‌కు ఒక రేటు.. నగరంలోని క్లాక్‌టవర్ దగ్గర ఎమ్మెల్యే నిధులతో పది షెట్టర్స్ నిర్మించారు. ఇదే స్థానంలో గతంలో తోపుడు బండ్లపై వీధి వ్యాపారులు పండ్లు, చెప్పుల విక్రయాలు జరిపేవారు. అయితే వాటి స్థానంలో శాశ్వతంగా షెట్టర్స్ నిర్మించడం వల్ల దాంట్లో వీధి వ్యాపారులు పండ్లు, చెప్పుల విక్రయాలు చేసుకోవడానికి అధికార పార్టీ నేతలతో మాట్లాడుకొని తీసుకున్నారు. దీంట్లో కొంత మంది పాతవారు ఉంటే మరికొందరు కొత్త వాళ్లకు ఇచ్చారు. ఈ దుకాణాల కేటాయింపులలో ఇద్దరు వ్యక్తులు కల్పించుకొని ఒక్కో షెట్టర్ ఇవ్వడానికి ఒక రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేతతోపాటు ఒక ముఖ్య నేత దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసే వ్యక్తి ఉండటం విశేషం. ఈ ఇద్దరూ కలిసి ఒక్కో షెట్టర్ కేటాయించిన వీధి వ్యాపారుడి దగ్గర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు నగరంలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. మళ్లీ కొత్తగా మార్కెట్ రోడ్లో సైతం మూడు షెట్టర్స్ నిర్మించగా వాటి కేటాయింపులలో కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇటు అధికారులతోపాటు అధికార పార్టీ పెద్దల దృష్టికి పోయిందా.. లేక అందరికి తెలిసి చేస్తున్నారా అనే విషయంపై స్పష్టత లేదు. డబ్బులు ఇచ్చిన వీధి వ్యాపారులు మాత్రం బయటకు చెప్పుకోలేక చేసిన అప్పులు తీర్చుకోలేక అవస్థలు పడుతునట్లు తెలుస్తోంది. -
పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రాచాలపల్లి బాబుదేవిదాస్రావు రచించిన ‘రామచంద్ర ప్రభో’, ‘చిత్రాంగద– సారంగధరుడు’ పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. జాతీ య సాహిత్య పరిషత్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఇరివింటి వెంకటేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుందన్నారు. కవులు సమాజ హితాన్ని కోరుకుంటారని తెలిపారు. ముఖ్య అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామచంద్ర ప్రభో కావ్యం సరళమైన, సుందరమైన సుమధుర తెలుగు భాషలో అందించినట్లు తెలిపారు. ఇందు లో ప్రాచీన కవుల గుంబనం, లలిత పదజాతం ఆకట్టుకుంటుందన్నారు. రామచంద్రప్రభో మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబుదేవిదాసును అభినందిస్తూ సమీక్ష చేశారు. డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి రామచంద్రప్రభో మకుటం ఉన్న 131 పద్య కావ్యాన్ని, పద్యాలను చదువుతూ రామ కథను అసాంతం పరి చయం చేశారు. డాక్టర్ తంగెళ్లపల్లి శ్రీదేవి చిత్రాంగద–సారంగధరుడు కథను 126 ప్యదాల కృతిని సమీక్ష చేస్తూ చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి, అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, డాక్టర్ కె.బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ పద్యకృతులపై ప్రసంగించారు. కార్యక్రమంలో పాలమూరు నగర అధ్యక్షులు జి,శాంతారెడ్డి, కవులు ప్రభులింగంశాస్త్రి, దేవదానం, రవీందర్‌రెడ్డి, ఖాజా మైనొద్దీన్, జగపతి రావు, గడ్డం వనజ, డాక్టర్ కృష్ణవేణి, జమున, ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యాంప్రసాద్, అను రాధ, వీరేందర్‌గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు. -
యాసంగి పంటలకు సాగునీరు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై రైతుల ఆశలు పదిలం అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలకు సాగునీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ విజయేందిర, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో చర్చించి నీటి విడుదల చేసే తేదీలను ఖరారు చేశారు. 2 టీఎంసీల నీరు.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వల యాసంగి సీజన్ పంటలకు సాగునీటిని వదులుతారు. గతేడాది రూపొందించిన షెడ్యూల్లో తేదీలను అటు ఇటుగా మార్చి అయిదు తడులుగా నీటిని వదలడానికి నిర్ణయించారు. దేవరకద్ర మండలంలో ఎడమ కాల్వ పూర్తిస్థాయిలో ఉండగా.. కుడి కాల్వ కింద ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాలు ఉన్నాయి. అయితే పాత ఆయకట్టు ప్రకారం 12 వేల ఎకరాల మేర ఉండగా అందులో పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. వానాకాలంలో దాదాపు మూడు నెలలపాటు నీటి విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని దీనివల్ల దాదాపు 35 వేల ఎకరాల మేర సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి, మరో టీఎంసీ వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కోయిల్‌సాగర్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు పాత ఆయకట్టు 12 వేల ఎకరాలకే అవకాశం జనవరి 5 నుంచి ఏప్రిల్ 14 వరకు తడులు ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 32.2 అడుగులు ప్రణాళిక సిద్ధం చేశాం.. కోయిల్‌సాగర్‌లో ఉన్న నీటిని సద్వినియోగం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న రెండు టీఎంసీల నీటిలో సాగుకు ఒక టీఎంసీ, తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీని ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. యాసంగి సీజన్ పంటల కోసం రైతులు ఇప్పటికే వరినారు మడులు సిద్ధం చేసుకోవడం జరిగింది. దీనివల్ల నేరుగా నాట్లు వేసుకోడానికి నీటిని వదిలేందుకు తేదీలను ఖరారు చేశాం. – ప్రతాప్‌సింగ్, ఈఈ, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు -
మహబూబ్‌నగర్
పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకైక ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్‌లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్‌లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్‌లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లై తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యా దయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్‌రెడ్డి, వార్ల విజయ్‌కుమార్, రఘువర్ధన్‌రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్‌రెడ్డి, యూసూ ఫ్, శేఖర్, మద్దప్ప దేశ్‌ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్ పాల్గొన్నారు. గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025హోరాహోరీగా టీ–20 లీగ్ హోరాహోరీగా సాగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్‌లో గద్వాల, నారాయణపేట జట్లు విజయం సాధించాయి. –8లో uనాడు వై ఎస్సార్.. నేడు రేవంతన్న: మంత్రి వాకిటి నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, అలాగే పదేళ్లు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధియే లక్ష్యంగా నేడు రేవంతన్న అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రేవంతన్న హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీఅందించే బాధ్యత సర్పంచులదే -
యువకుడి ఆత్మహత్య
మదనాపురం: అప్పుల బాధ తాళలేక యువకుడు ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నచింతకుంట మండలం ఉంధ్యాలకు చెందిన మాల వినోద్‌కుమార్ (28) కొంతకాలంగా ఆత్మకూరులో నివాసం ఉంటున్నాడు. అప్పులు ఎక్కువగా ఉండడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఉదయం సుమారు 6గంటల ప్రాంతంలో కొత్తపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకుని, నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు ఉన్నారు. చేతికి అందిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి బల్మూర్: మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితితో మృతి చెందింది. ఎస్ఐ రాజేందర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిట్టిగోరి కృష్ణమ్మ(45) భర్త విష్ణుతో కలిసి హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 22న అనారోగ్యంతో ఎవరికి సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చింది. కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి పాల కోసం వెళ్లిన కృష్ణమ్మ ఎంతకు తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతకగా తన ఇంటి వెనుక చెట్లపొదల్లో శవమై కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంలో రెండు దుకాణాలు దగ్ధం మహబూబ్‌నగర్ క్రైం: మొబైల్ దుకాణంలో ఏర్పడిన షార్ట్‌సర్క్యూట్ కారణంగా రెండు దుకాణాల్లో ఉన్న సామగ్రితో పాటు ఇంట్లో కిచెన్‌లో వస్తువులు దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం.. నగరంలోని ఎంబీసీ చర్చి ఎదురుగా ఉన్న కేజీఎన్ మొబైల్ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయి. దుకాణంలో ఉన్న మొబైల్ సామగ్రితో పాటు ఇతర వస్తువులు దగ్ధం కావడంతో మంటలు పక్క దుకాణంలోకి వ్యాప్తించి అందులోని ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయాయి. దుకాణం వెనుక భాగంలో ఉన్న ఇంట్లోకి సైతం మంటలు వ్యాపించి కిచెన్‌లో ఉన్న ఫ్రీజ్ ఇతర వస్తువులు, సామన్లు దగ్ధమయ్యాయి. ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం జడ్చర్ల: మండలంలోని గంగాపూర్‌కు చెందిన వడ్ల యాదగిరి (28) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. జడ్చర్ల నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా.. గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్డడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వివరించారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి.. వనపర్తి రూరల్: ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. ఏఎస్ఐ ఎండీ సాజిద్‌అలి తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల గ్రామానికి సూగూరు మహేష్ (29) మంగళవారం పొలం దగ్గరుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో చవటబావి దగ్గర ఊర చెరువు కాల్వకట్టపై వెనకాల వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ ఎదుట ఉన్న వాహనాలను తప్పించబోయి మహేష్‌ను ఢీకొనడంతో అతడు కాల్వలో పడగా.. ట్రాక్టర్ మీదపడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షి ంచి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి అన్న సూగూరు భాస్కర్ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలిపారు. -
సహజ వనరులు కాపాడాలి
మాగనూర్: సహజ వనరులను కాపాడాలని చిట్యాల గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మాగనూర్ మండల పరిధిలోని మందిపల్లి గ్రామ పెద్దవాగు నుంచి టీజీఎండీసీ అనుమతులతో మక్తల్‌కు చెందిన ఓ వ్యక్తి ఇసుక తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్లను బుధవారం రెండో రోజు కూడా గ్రామ రైతులు అడ్డుకున్నారు. మాగనూర్ మండలంతో పాటు మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన రైతుల పొలాలు మందిపల్లి పెద్ద వాగు పరిసరాలలో ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు ఇసుకను తవ్వి తరలిస్తే బోర్లు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా చిట్యాల గ్రామం మీదుగా ఇసుక తరలించేందుకు మట్టి రోడ్డు నిర్మిస్తుండటంతో ప్రధాన రోడ్డు ధ్వంసం కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు ఇసుక అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని చిట్యాల గ్రామ రైతులు తెలిపారు. -
హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
గద్వాల క్రైం: గూడ్స్ వాహనంతో బైక్‌ను ఢీకొట్టి మాజీ సర్పంచ్‌ను హతమార్చిన కేసులో తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో సీఐ టి.శ్రీను విలేకర్లకు వెల్లడించారు. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు (41), అదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న కుటుంబ సభ్యుల మధ్య పాత కక్షలు, రాజకీయ వైరం, ఆర్థిక విభేదాల నేపథ్యంలో ఇరువురి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భీమరాయుడిని ఎలాగైనా అడ్డు తొలగించాలనే లక్ష్యంతో మిల్లు వీరన్న కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కె.వెంకటాపూర్‌కు చెందిన ఈడిగ ఈశ్వర్గౌడ్ను కలిసి చర్చించారు. అతడి హత్యకు రూ. 25లక్షల ఒప్పందం చేసుకున్నారు. సుపారీ తీసుకున్న ఈశ్వర్‌గౌడ్.. భీమరాయుడి హత్యకు వ్యూహం రచించారు. అందులో భాగంగా తనకు తెలిసిన వ్యక్తులను ఈ వ్యూహంలో భాగస్వామ్యం చేసుకున్నారు. నవంబర్ 21న మృతుడు గద్వాల నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. ధరూర్ మండలం జాంపల్లి స్టేజీ సమీపంలో గూడ్స్ వాహనంతో ఢీకొట్టి హతమార్చారు. ఈ కేసులో 10 మంది నిందితులను నవంబర్ 27న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు ఈశ్వర్‌గౌడ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం కర్నూలు జిల్లాలోని కాల్వబుగ్గ గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ఈశ్వర్‌గౌడ్‌పై గతంలోనే రెండు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కట్టుకున్న భార్యను హత్యచేసి పత్తికొండ సబ్ జైలుకు సైతం వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు.. మంత్రాలయంలోని కోస్గిలో జరిగిన ఫ్యాక్షన్ గొడవలో నాటుబాంబులు వేసిన ఘటనలో అరెస్టయి ఆదోని సబ్‌జైలుకు వెళ్లాడని తెలిపారు. అతడిని గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఈ హత్య కేసులో మరి కొంతమ ంది ఉన్నారని.. వారిని సైతం త్వరలోనే అదుపులో కి తీసుకుంటామన్నారు. నిందితుడి నుంచి బైక్, సె ల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐలు శ్రీహరి, శ్రీనివాసులు ఉన్నారు. -
దేవరకద్ర పట్టణంలో ఇలా..
ఇదిలా ఉండగా గత జనవరి 27న కొత్తగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీలో మొత్తం ఐదు గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. అప్‌గ్రేడ్ అయినప్పటికీ భువన్ యాప్ అమలులోకి రాకపోవడంతో కేవలం ఇళ్లు ఉన్నట్లుగా అధికారులు లెక్క గట్టి గ్రామపంచాయతీ ఉన్నప్పటి ఆస్తి పన్నుతోనే సరిపెడుతున్నారు. కేటగిరీల వారీగా వాణిజ్య–వ్యాపార సముదాయాలు, మిక్స్డ్, ప్రభుత్వ భవనాలు ఎన్ని ఉ న్నాయన్నది ఇంకా తేల్చలేకపోయారు. దీంతో ఆస్తిపన్నుకు సంబంధించి భారీగా గండిపడింది. దేవరకద్రలో మొత్తం 3,431 మంది అసెస్మెంట్ దారులకు గాను ఈ ఏడాది (2025– 26) రూ.29,17,000, అలాగే పాత బకాయిల కింద రూ.20,53,000 కలుపుకొని రూ. 49,70,000 రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు ఈ ఏడాదికి సంబంధించి రూ. 16,63,000, అలాగే పాత బకాయిల కింద రూ.10,73,000 ఇలా 1,641 మంది నుంచి మొత్తం రూ.27,36,000 (55.04 శాతం) వసూలు చేశారు. ఇంకా 1,790 మంది నుంచి ఈ ఏడాదికి సంబంధించి రూ.11,91,000, అలాగే పాత బకాయిల కింద రూ.9,80,000 ఇలా మొత్తం రూ.21,71,000 రావాల్సి ఉంది. ఆస్తిపన్ను వసూలుకు ప్రత్యేక బృందాలు నగరంలో ఆస్తిపన్ను బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయింది వాస్తవమే. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలల గడువు ఉంది. ఆస్తిపన్ను వసూలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగి వీలైనంత ఎక్కువ మంది నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ముఖ్యంగా పాత బకాయిదారులకు నోటీసులు అందజేసి రాబట్టాలని సూచించాం. – టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్‌నగర్ ● -
ఆలిండియా ఉమెన్స్ కిక్‌బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారిణులు
మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం నుంచి ఈనెల 28 వరకు జరిగే ఆలిండియా ఉమెన్స్ కిక్‌బాక్సింగ్ జోనల్ పోటీల్లో స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు జిల్లా క్రీడాకారిణులు పాల్గొంటున్నట్లు జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈ పోటీల్లో 22కేజీల విభాగంలో వినూత్న, 37కేజీల కేటగిరీలో తన్షిత, 47కేజీల విభాగంలో సాయిలక్ష్మి పాయింట్ ఫైట్‌లో, సీనియర్ విభాగంలో యామిని మ్యూజికల్ ఫామ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీమ్ మేనేజర్ జయదీప్ సింగ్ పాల్గొన్నారు. -
ఆస్తిపన్ను వసూళ్లలోవెనుకంజ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని పాలమూరు నగరంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలలో ఆస్తిపన్ను వసూలు చేయడంలో మున్సిప ల్ అధికారులు వెనుకబడ్డారు. కేవలం కొత్త మున్సిపాలిటీ దేవరకద్రలో మాత్రమే లక్ష్యంలో సగాన్ని అధిగమించగలిగారు. ఈ ఆర్థిక సంవత్సర (2025 –26)లో ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయింది. ఇక మిగిలింది మూడు నెలల గడువు మాత్రమే మిగిలింది. మరోవైపు అర్బన్ డే పేరిట ఉన్నతాధికారులు నెలలో కనీసం రెండుసార్లయినా ఆయా విభాగాల అధికారులతో సమీక్షిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. దీంతో ఏటేటా మొండి బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. ఇక ఆర్థిక సంవత్సరం చివర్లో ఆస్తిపన్ను చెల్లిస్తే సరిపోతుందిలే.. అని అసెస్‌మెంట్‌దారులు చెబుతుండ టం గమనార్హం. వాస్తవానికి ఏడాదిలో రెండుసార్లు ఇంటింటికీ మున్సిపల్ సిబ్బంది వెళ్లి వీరికి డిమాండ్ నోటీసులను ఇస్తున్నా చలనం లేదు. 9 నెలల్లో పాలమూరు కార్పొరేషన్ పరిధిలో 24.23 శాతమే! జడ్చర్లలో 30.94, భూత్పూర్లో 33.79 శాతం మాత్రమే కొత్త మున్సిపాలిటీ దేవరకద్రలో 55.04 శాతం వసూలు తరచూ సమీక్షలతోనే సరిపెడుతున్నఉన్నతాధికారులు పట్టణాల్లో ఏటేటా పేరుకుపోతున్న మొండి బకాయిలు -
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే..
మూడోరోజు క్రికెట్ పోటీలకు మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి లీగ్‌లతో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయవచ్చని.. జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మాజీ క్రీడాధికారి రమేష్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ, మన్నాన్, కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్‌గౌడ్, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, చందుయాదవ్, బాలస్వామి, ప్రవీణ్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంబీ చర్చికి ఘనమైన చరిత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలో ఎంబీ చర్చి (కల్వరి మెన్నోనైట్ బ్రదరన్ చర్చి)కి ఘనమైన చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్ నడిబొడ్డున ఈ చర్చి నిర్మాణమై 1957 నుంచి క్రైస్తవులకు ప్రధాన ప్రార్థన మందిరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోనే పెద్ద చర్చిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రిస్మస్, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్, కృతజ్ఞత తర్పణ పండుగలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది సీ్త్రల సమాజం, యువత తదితర సమావేశాలు జరుగుతాయి. ఎంబీ చర్చి ఎదుట విశాలమైన ప్రాంగణం అందుబాటులో ఉంది. ఆయా పండుగ రోజుల్లో చర్చి లోపల, ప్రాంగణంలో ఒకేసారి 5వేలకుపైగా క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు. 43 ఏళ్ల నుంచి పాస్టర్‌గా పనిచేస్తున్న 43 ఏళ్ల నుంచి ఎంబీ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న. ఆ ఏసు ప్రభువు దయవల్లే నాకు ఇన్నేళ్లు నుంచి చర్చి పాస్టర్‌గా ఉన్న. ఎంబీ చర్చి మేనేజింగ్ కమిటీకి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నాను. ఈ చర్చి ఆధ్వర్యంలో 11 చర్చిల నిర్వహణ చేపడుతున్నాం. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 మంది పాస్టర్లకు నెలసరి సహాయం అందజేస్తున్నాం. వితంతువులకు కూడా నెలసరి ఆర్థికసాయం ఇస్తున్నాం. – రెవరెండ్ ఎస్.వరప్రసాద్, ఎంబీ చర్చి, సీనియర్ పాస్టర్ 68 ఏళ్ల నుంచి చర్చిలో ప్రార్థనలు ఒకేసారి 5 వేలకు పైగా ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉమ్మడి జిల్లాలోనే పెద్దచర్చిగా ప్రత్యేక గుర్తింపు -
కావేరమ్మపేటలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
జడ్చర్ల: కావేరమ్మ పేటలో ఓ పాడుబడిన పురాతన ఇంటిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన ఘటన బుధవారం వెలుగు చూసింది. కావేరమ్మపేటకు చెందిన తల్లోజు లక్ష్మికి సంబంధించిన ఇంటిలో ఆరు నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఆ ఇంటి పనులు చేపడుతున్నట్లు యజమానులు చెబుతుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఇంటి ప్రహరీ లోపల చేస్తున్న తవ్వకాలు బయటకు కూడా కనిపించకపోవడంతో పలు చోట్ల గోతులు తవ్వడం, పూడ్చడం వంటివి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు విషయాన్ని గ్రహించి సమాచారం చేరవేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తవ్వకాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. కాగా కావేరమ్మపేటలోని పాత ఇళ్లలో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం కొంత కాలంగా ఉంది. గతంలో ఇదే ప్రాంతంలో ఓ పాడుబడిన ఇంటిలో తవ్వకాలు చేయగా.. వెండి నాణెలు బయట పడ్డాయి. గుట్టుగా ఉన్న ఈ విషయం బయటపడడంతో అప్పట్లో ఆర్డీఓ, పోలీసు ఉన్నతాధాకారులు స్పందించి నిర్విరామంగా రెండు రోజుల పాటు జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. అప్పుడు కూడా కొన్ని వెండి నాణెలు లభించాయి. వాటన్నింటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ కోవలోనే గుట్టుగా గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్నట్లు తెల్సింది. సైబర్ మోసం.. ఖాతా నుంచి నగదు ఖాళీ నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు నగదు చోరీకి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సంతబజార్ కాలనీకి చెందిన అబ్దుల్‌నయీం ఫోన్‌కు ఈ నెల 10న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు గడువు ముగుస్తుందని, అప్డేట్ చేయాలని చెప్పడంతో నమ్మాడు. తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని సైబర్ నేరగాళ్లకు చెప్పడంతో అబ్దుల్‌నయీం బ్యాంకు ఖాతా నుంచి రూ.65,361 నగదు బదిలీ అయ్యింది. గుర్తించిన బాధితుడు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
హోరాహోరీగా టీ–20 క్రికెట్ లీగ్
● సత్తాచాటిన జోగుళాంబ గద్వాల, నారాయణపేట జట్లు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ మూడోరోజు బుధవారం హోరాహోరీగా కొనసాగాయి. మూడో లీగ్ మ్యాచ్‌లో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జట్లు విజయం సాధించాయి. ఈ లీగ్‌లో నారాయణపేట రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఏడు వికెట్ల తేడాతో.. బుధవారం జరిగిన మొదటి లీగ్ మ్యాచ్‌లో జోగుళాంబ గద్వాల జట్టు ఏడు వికెట్ల తేడాతో నాగర్‌కర్నూల్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నాగర్‌కర్నూల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. చరణ్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు, సంజయ్ 21 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు కె.విక్రం 2, జునైద్ మీర్జా 2, యూనుస్, వెంకట్‌సాగర్, మహ్మద్ ఖయ్యూం చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గద్వాల జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. జట్టులో ఎస్.అరవింద్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59 పరుగులు, మహ్మద్ ఖయ్యూం 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. నాగర్‌కర్నూల్ బౌలర్లు గగన్ 3 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా మహ్మద్ ఖయ్యూం (గద్వాల) నిలిచారు. 75 పరుగుల తేడాతో.. మరో లీగ్ మ్యాచ్‌లో నారాయణపేట జట్టు 75 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నారాయణపేట జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జట్టులో ఆర్యాన్ 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 పరుగులు, ఈ.అభిలాష్‌గౌడ్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 పరుగులు చేశారు. వనపర్తి బౌలర్లు యశ్వంత్, గట్టు పవన్, రోహిత్ చరణ్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వనపర్తి జట్టు నారాయణపేట బౌలర్ల ధాటికి 14.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలర్లు అక్షయ్ 3, భానుప్రసాద్ 3 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అక్షయ్ (నారాయణపేట) నిలిచారు. -
భారత్‌మాల భూసర్వేకు సహకరించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: భారత్‌మాల భూసర్వేకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. జాతీయ రహదారి భూసేకరణపై బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్నాసాగర్, తాటికొండ, హస్నాపూర్‌కు చెందిన బాధిత రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రా యాలను తెలుసుకున్నారు. కాగా, జాతీయ రహదా రి కోసం భూములు కోల్పోతే తమ జీవనోపాధి దెబ్బతింటుందని, దీని అలైన్మెంట్ మార్చాలని కోరారు. స్పందించిన ఆమె మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టినందున ఎన్హెచ్ఏఐ అధికారులకు నివేదిస్తామన్నారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. ము ఖ్యంగా భూసేకరణ కు సంబంధించి ని బంధనలననుసరించి తగిన పరిహారం ఇస్తామన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ బాధిత రైతుల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరిస్తామన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ నవీన్ పాల్గొన్నారు. సకాలంలో బోనస్ జమ చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. వరి కొనుగోళ్లపై కలెక్టర్ వీసీ నిర్వహించారు. గోదాముల్లో తగినంత స్థలం అందుబాటులో ఉన్నందున, పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. మంగళవారం వరకు మొత్తం 1,21,577 మెట్రిక్ టన్నుల వరిని 23,451 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని విలువ రూ.290కోట్లు కాగా, 20,288మంది రైతులకు రూ.251 కోట్లు ఎంఎస్పీగా చెల్లించినట్లు చెప్పారు. కొనుగోళ్లు, ఆన్లైన్ ఎంట్రీల మధ్య ఉన్న గ్యాప్‌ను మూడు రోజుల్లో తగ్గించాలని సూచించారు. కొనుగోలు చివరి దశలో ఉన్నందున, ఎలాంటి ప్రతికూల ఫిర్యాదులు రాకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. -
తండ్రి ప్రాణం తీసిన కుమారుడి వివాహేతర బంధం
● హమాలీ హత్య కేసును ఛేదించిన పోలీసులు ● నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ స్టేజీ వద్ద గత అక్టోబర్ 24న జరిగిన హమాలీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అజిలాపూర్‌కు చెందిన దానం మైబు (45) దేవరకద్రలోని మార్కెట్‌యార్డులో హమాలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అక్కినోళ్ల రాజు, హనుమన్న, రాఘువులు ముగ్గురు అన్నదమ్ములు కాగా.. చిన్నవాడైనా రాఘవులు భార్యతో మృతుడి కొడుకు అనిల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన రాఘవులు.. మూడేళ్ల క్రితం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఘటనకు కారణమైన అనిల్‌ను గ్రామం నుంచి హైదరాబాద్‌కు పంపించారు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అక్కినోళ్ల హనుమన్న భావించాడు. ఈ మేరకు చిన్నరాజమూరుకు చెందిన మ్యాదరి చిన్న రాములు సహాయంతో మహబూబ్‌నగర్‌లోని దొడ్డలోనిపల్లికి చెందిన గొల్ల మల్లేష్, మణికొండకు చెందిన శరత్‌ను ఆశ్రయించాడు. తన తమ్ముడి చావుకు కారణమైన అనిల్ లేదా అతడి తండ్రి దానం మైబును హతమార్చేందుకు గాను గొల్ల మల్లేష్, శరత్‌తో హనుమన్న రూ. 8 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. హత్యకు ముందు రూ. 3.90 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించాడు. అయితే అనిల్ హైదరాబాద్‌లో ఉండటంతో, తండ్రి దానం మైబును హతమార్చాలని నిందితులు నిర్ణయించుకున్నారు. అందుకోసం వారం రోజులుగా మృతుడి కదలికలపై నిఘా ఉంచారు. అక్టోబర్ 24న మృతుడు దేవరకద్ర మార్కెట్‌యార్డులో పనులు ముగించుకొని బైక్‌పై ఒంటరిగా ఇంటికి వెళ్తుండటాన్ని గమనించిన నిందితులు.. అజిలాపూర్ స్టేజీ వద్ద బైక్‌ను అడ్డగించి తమతో తెచ్చుకున్న వేట కొడవళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి మైబు తప్పించుకొని పారిపోతుండగా.. వెంబడించి మరీ ఇష్టానుసారంగా నరకడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత నిందితులు తమ వేట కొడవళ్లను సమీపంలోని నీటి గుంతలో వేసి వెళ్లిపోయారు. ఈ హత్యను పలు కోణాల్లో విచారించిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ఏ–1గా అక్కినోళ్ల హనుమన్న, ఏ–2గా గొల్ల మల్లేష్, ఏ–3గా గంజి శరత్, ఏ–4, మ్యాదరి చిన్నరాములును చేర్చినట్లు తెలిపారు. వీరిలో ఏ–3 నిందితుడు గంజి శరత్ పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన అభంగాపూర్ ఆశన్నను చంపిన వారిలో ఏ–6 ముద్దాయిగా ఉన్నాడన్నారు. అదే విధంగా హమాలీని హత్యచేసిన వారం రోజులకు దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన ఒక యువకుడిని మణికొండలో హత్య చేశాడని.. ఆ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడని తెలిపారు. మిగతా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య కేసు ఛేదనకు కృషిచేసిన ఎస్ఐ నాగన్న, కానిస్టేబుల్ రాజశేఖర్, నాను నాయక్‌లను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ రామకృష్ణ ఉన్నారు. -
చోరీ కేసులో నలుగురికి రిమాండ్
వనపర్తి రూరల్: జిల్లా పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వరావు తెలిపారు. బుధవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు జలేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న వనపర్తి పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీకి వెళ్లే దారిలో మహిళా నడుచుకుంటూ వెళ్తుండగా బంగారు గొలుసు చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నెల 23న నాగవరం దగ్గర వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుల్లో ఇద్దరు బైక్, మరో ఇద్దరు కారులో పారిపోతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకొని విచారించగా అమరచింత మండలం నాగల్‌కడ్మూర్‌కు చెందిన ఏ1 కుర్వ రాములు, ఏ2 గట్టు వెంకటేష్, ఏ3 డ్యామ్ వెంకటేష్, ఏ4 బండమీది రాజేష్ ముఠాగా ఏర్పడి 2024 నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్లు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 104 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైకులు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కేసును త్వరితగతిన చేధించిన సిబ్బందిని ఎస్పీ సునీతారెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. -
ఎస్జీఎఫ్ జాతీయ పోటీలకు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: ఢిల్లీలో వచ్చేనెలలో జరిగే అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ కరాటే పోటీలకు జిల్లా క్రీడాకారిణి మహిమాన్విత ఎంపికై నట్లు జీకే మాస్టర్ షోటోకాన్ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ కరాటే మాస్టర్ శివకుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహిమాన్విత ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 22, 23 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. కుమితె –48 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. క్రీడాకారిణిని జీకే మాస్టర్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఫౌండర్ చీఫ్ జి.కృష్ణయ్య, ఎగ్జామినర్ రవికుమార్, కరాటే మాస్టర్లు శివకుమార్, దామోదర్ అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
ఉల్లి ధర తగ్గుముఖం
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో మూడు వారాలుగా పెరుగుతూ వచ్చిన ఉల్లి ధర బుధవారం ఒక్కసారిగా పడిపోయింది. కొత్త ఉల్లి వచ్చిన ప్రారంభంలో కనిష్ట స్థాయికి పడిపోయిన ఉల్లి ధరలు మూడు వారాల నుంచి పెరుగుతూ వచ్చాయి. వారం గడవక ముందే మళ్లీ ధరలు మొదటికి వచ్చాయి. రూ.1,700 పలికిన ధర మార్కెట్లో జరిగిన ఉల్లి వేలంలో గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.1,700లు పలికింది. గత వారం రూ. 2600 వరకు గరిష్ట ధర పలికిన క్వింటాల్ ఏకంగా రూ.900 వరకు తగ్గింది. కనిష్ట ధర రూ.1100 వరకు పడిపోవడంతో గత వారంతో పోల్చితే రూ. 800 వరకు ధర తగ్గుదల కనిపించింది. ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మార్కెట్‌కు దాదాపు అయిదు వందల బస్తాల ఉల్లి విక్రయాలు జరిపారు. వేలంలో కొనుగోలు చేసిన ఉల్లి 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ. 850, కనిష్టంగా రూ. 550గా విక్రయించారు. -
ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాలి
● తూనికల, కొలతల అధికారుల ముమ్మర దాడులు ● నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు ● పట్టణంలో 50 కేసులు నమోదు జడ్చర్ల: పట్టణంలో మంగళవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఆరు బృందాలుగా విడిపోయి ఎలక్రికల్, ఎలక్ట్రానిక్, జనరల్స్ స్టోర్స్ తదితర దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనల మేరకు పలు ఉత్పత్తులపై నమోదు చేయాల్సిన సమాచారం లేకపోవడాన్ని తప్పుబట్టారు. వినియోగదారులకు కొనుగోలు చేసే ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధగా చేపట్టే క్రయవిక్రయాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ సిద్దార్థ్కుమార్ తెలిపారు. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న దుకాణాలకు సంబంధించి 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో వనపర్తి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి రవీందర్, నాగర్‌కర్నూల్ జిల్లా అధికారి నాగేశ్వర్రావు, నల్లగొండ జిల్లా అధికారి శ్రీనివాసులు, భువనగిరి జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కలకలం రేపిన దాడులు: పట్టణంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జరిగిన దాడులు చర్చనీయాంశంగా మారింది. గతంలో అడప దడపా కిరాణ దుకాణాలపై మొక్కుబడిగా తనిఖీలు చేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ఇంత పెద్దఎత్తున అన్ని రకాల దుకాణాలపై దాడులు చేయడం ఇదే ప్రథమమని వ్యాపారులు పేర్కొన్నారు. వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేశారు. -
ఆరు వికెట్ల తేడాతో నారాయణపేట విజయం
లీగ్ మ్యాచ్‌లో నా రాయణపేట జట్టు ఆరు వికెట్ల తేడాతో జోగులాంబ గద్వా ల జట్టు పై విజ యం సాధించింది. మొదట బ్యా టింగ్ చేసిన గద్వాల జ ట్టు 17.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో సుజాల్రెడ్డి 32 పరుగులు చేశారు. నారాయణపేట బౌలర్లు మహ్మద్ అఫ్పాన్ 4, భానుప్రసాద్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణపేట జట్టు 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అభిలాశ్గౌడ్ 34, అక్షయ్ 34 పరుగులు చేశారు. గద్వాల బౌలర్ అరవింద్ 2వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మహ్మద్ అఫ్పాన్ (నారాయణపేట) నిలిచాడు. మ్యాన్ ఆప్‌ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారులకు ఎండీసీఏ ప్రతినిధులు రూ.2వేల నగదుతోపాటు మెమోంటో అందజేశారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
మద్దూరు: మండల పరిధిలోని దమగ్నాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గ్రామా నికి చెందిన శశిధర్ పీడీఎస్ బియ్యాన్ని అక్ర మంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచారన్నా స మాచారం మేరకు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆనంద్ దాడి చేసి 29 క్వింటా ళ్లు సీజ్ చేసి నాగిరెడ్డిపల్లిలోని డీలర్షాపుకు తరలించినట్లు తెలిపారు. అనంతరం శశిధర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. చోరీ కేసును ఛేదించిన పోలీసులు దామరగిద్ద: మండలంలోని మొగుల్‌మడ్క గ్రా మంలో ఐదు రోజుల క్రితం జరిగిన చోరీ కేసు ను పోలీసలు ఛేదించారు. బాధితుడు కొనాపురం వెంకటేశ్ ఇచ్చిప ఫిర్యాదు మేరకు దర్యా ప్తు చేపట్టిన పోలీసులు వేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితు లు కర్ణాటకలోని తిలార్కొట్ గ్రామానికి చెందిన కూరుకు నవీన్, బైరంకొండ శ్రీను, అలి యాస్ శ్రీనివాస్‌గా గుర్తించి వారిని పట్టుకొని మంగళవారం పోలీస్ స్టేషన్లో హాజరు పరిచారు. అలాగే చోరీకి గురైన 5 గ్రామాల బరువు గల రెండు బంగారు ఉంగరాలు, ఆరు మాసాల బ రువు గల చెవి కమ్మలు, 16 వెండి ఉంగరాలు, ఒక వెండి బ్రాస్లెట్, రూ.30 వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. రోడ్డు పనులు అడ్డగించిన గ్రామస్తులు మాగనూర్: భారీ వాహనాలతో ఇసుక తరలించడం వలన రోడ్డు ధ్వంసమవుతుందంటూ చిట్యాల గ్రామస్తులు మంగళవారం రోడ్డు పనులను అడ్డుకున్నారు. మండల పరిధిలోని మందిపల్లి పెద్దవాగు నుంచి మక్తల్‌కు చెందిన ఓ వ్యక్తి టీజీఎండీసీ ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు పొందారు. అయితే ఇసుక రవాణా కోసం కావాల్సిన రోడ్డు పనులను చేస్తుండగా మక్తల్ మండలం చిట్యాల గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక రవాణాను మాగనూర్ మండలం మీదుగా తరలించాలని డిమాండ్ చేశారు. ఇసుక లోడుతో భారీ వాహనాలు వెళ్లడం వలన రోడ్డు మొత్తం గుంతలుగా మారి అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకను తరలింపు మాగనూర్ మండలం మీదుగా చేయకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇద్దరికి జైలు శిక్ష అమరచింత: ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన బోయ రాజు, మండ్ల పుట్టయ్యకు 18 నెలల జైళ్లు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. 2017 సంవత్సరంలో అమరచింత మండలం ధర్మాపురం సమీపంలో నిందుతులు ఇద్దరు టిప్పర్, ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడుపుతూ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఇద్దరి మృతికి కారకులయ్యారన్నారు. ఆ సమయంలో అమరచింత పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంగళవారం ఆత్మకూర్ సివిల్ కోర్టులో జడ్జి శిరీష విచారణ చేపట్టి నిందితులకు శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. వెండి ఆభరణాలు చోరీ నాగర్‌కర్నూల్ క్రైం: 40 తులాల వెండి ఆభరణాలు చోరీ అయిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాలలో చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగమ్మ గొర్రెలను మేపేందుకు వెళ్లింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటికి వేసిన తాళా న్ని విరగ్గొట్టి బీరువాలో ఉన్న 40 తులాల వెండి కడియాలే ఎత్తుకెళ్లారు. ఈ నెల 21న ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం విరగ్గొట్టి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశా రు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం చిన్నంబావి: మండల పరిధిలోని బెక్కం గ్రామ పెద్ద చెరువులో వ్యక్తి మృతదేహం మంగళవా రం లభ్యమైంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాలు.. పెంట్లవెళ్లి మండలం జటప్రోల్‌కు చెందిన నరసింహ్మ(70) ఈ నెల 15న కుమార్తె చిట్టెమ్మ ఇంటికి వెళ్లి వస్తానని మండలంలోని వెలగొండకు వచ్చాడు. తిరిగి జటప్రోల్‌కు వెళ్తా నని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకూ ఆ చూకీ తెలియకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కుమార్తె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గ్రామంలోని చెరువులో వ్యక్తి మృతదేహం తేలుతుందన్న స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టి మృతి చెందింది నరసింహ్మగా గుర్తించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
పాలమూరుకు అన్యాయం చేసిన కేసీఆర్
పాలమూరు: కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఆర్డీఎస్ ఎందుకు పూర్తి చేయలేదని, పెండింగ్‌లో మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్ తీసుకునే విధంగా డీపీఆర్ మార్పులు చేసి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారన్నారు. కాళేశ్వరానికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిన అప్పటి సర్కార్ పాలమూరు–రంగారెడ్డిపై ఎందుకు ఖర్చు చేయలేదన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో రోడ్లు వేసుకుని పాలమూరులో ఎందుకు వేయలేదని, ప్రాజెక్టులతోపాటు వైద్యం, విద్య ప్రతిదాంట్లో ద్రోహం చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి రెండు పార్టీలు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. డిండికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకెళ్లడంపై తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందని, ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు సరిపోవని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొత్త అప్పులు చేస్తోందన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటే మరింత పనులు జరుగుతాయన్నారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ జీ రామ్ జీ బిల్లు కేంద్రం చట్ట సవరణ చేసిందన్నారు. దేశంలో 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమయంలో జరగని ఓటు చోరి.. మూడేళ్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ హయాంలో జరిగిందని చెప్పడం సరికాదన్నారు. కొత్తగా గెలుపొందిన సర్పంచులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, రమేశ్, కృష్ణవర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● మూసాపేట మండలం దాసర్పల్లి ఉపసర్పంచ్ బోయ నర్సింహులుతోపాటు వార్డు సభ్యులు, హన్వాడ మండలం గొండ్యాల్ ఉపసర్పంచ్ రంగన్నతోపాటు వార్డు సభ్యులు ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం జాతీయ రహదారి అధికారులతో బండమీదిపల్లి దగ్గర ఉన్న రోడ్డు సమస్యపై చర్చించారు. ● నగరంలోని కాళికాదేవి కల్యాణ మండపంలో మంగళవారం సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్ని మాట్లాడారు. -
నలుగురు పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు సకాలంలో సీసీటీఎన్ఎస్లో అప్డేట్ చేయడంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐటీ సెల్ కో–ఆర్డినేటర్లు, ఐటీకోర్ టీం, టెక్‌టీం సిబ్బందిని మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయంలో 171మందికి రివార్డ్ మేళా నిర్వహించి అభినందించారు. జిల్లా నుంచి ఐటీసెల్ కో–ఆర్డినేటర్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వర్‌రెడ్డి, ఐటీకోర్ టీం సభ్యుడు హెడ్‌కానిస్టేబుల్ విజయ్‌కుమార్, టెక్‌టీం సిబ్బందిలో బాలానగర్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాసులు, హన్వాడ స్టేషన్‌కు చెందిన యాదమ్మకు ప్రశంసా పత్రాలను అదనపు డీజీ శ్రీనివాసరావు అందజేశారు. జిల్లా నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్న నలుగురు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు. శ్రీనివాసులు యాదమ్మ విజయ్కుమార్రాజేశ్వర్రెడ్డి -
ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
● ఉమ్మడి పాలమూరు డీటీసీ కిషన్ ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు నమోదు ● మూడుగంటల పాటు కొనసాగిన తనిఖీలు ● ప్రైవేట్ వ్యక్తులతో పాటు సిబ్బందితో లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు ● లభించని ఆధారాలు మహబూబ్‌నగర్ క్రైం: హైదరాబాద్ సిటి రేంజ్–1 ఏసీబీ డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో 8 మంది బృందం మంగళవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా రవాణాశాఖ డీటీసీగా పని చేస్తున్న కిషన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడంటూ కేసు నమోదులో భాగంగా నేరుగా చాంబర్‌కు చేరుకున్న బృందం బయటి వ్యక్తులు లోనికి రాకుండా, అక్కడి సిబ్బంది ఎవరితో మాట్లాడకుండా ఆదేశాలిచ్చారు. సుమారు మూడు గంటల పాటు అన్నిరకాల రిజిస్ట్రేషన్ దస్త్రాలు, ఇతర డాక్యుమెంట్స్, వ్యక్తిగత కంప్యూటర్ తనిఖీ చేశారు. అలాగే కార్యాలయంలో పనిచేసే అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అయితే ఇక్కడ విధులు నిర్వర్తించే ఇద్దరు, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా సోదాల్లో విలువైన డాక్యుమెంట్స్, ఇతర ఆధారాలు ఏవీ లభించలేదు. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో బృందం కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. కార్యాలయంలో పని చేసే సిబ్బందితో పాటు ప్రైవేట్ వ్యక్తుల నుంచి లెక్కల్లో లేని కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ కార్డులు ప్రైవేట్ వ్యక్తుల ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో డీటీసీ కిషన్ విధుల్లో చేరారు. గతంలో పని చేసిన ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ● ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు డీటీసీ కిషన్‌పై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సోదాల అనంతరం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనిఖీల్లో భాగంగా కిషన్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశామన్నారు. తనిఖీల నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఏడాది మూడుసార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జూన్ నెలలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు చేసి ఇద్దరు ఏజెంట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. అక్టోబర్ 19న కృష్ణా చెక్‌పోస్టులో మహబూబ్‌నగర్ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి అనధికారిక నగదు రూ.30,450 సీజ్ చేశారు. ఓవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలోనే లారీడ్రైవర్లు టేబుల్‌పై డబ్బులు పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. తర్వాత చెక్‌పోస్ట్ రద్దు చేశారు. తాజాగా మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ బృందం ఆర్టీఏ కార్యాలయంలో అడుగుపెట్టింది.


