టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

Feb 17 2026 8:42 AM | Updated on Feb 17 2026 8:42 AM

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

జడ్చర్ల టౌన్‌: పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల (ఊర్కొండపేట) పాఠశాలను సోమవారం ఆర్‌సీఓ శ్రీనివాస్‌ సందర్శించారు. పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు చేయిచేసుకున్న ఘటనపై ఆయన విద్యార్థినితో పాటు తల్లిదండ్రులను ఆయన విచారించారు. ఉపాధ్యాయురాలితోనూ ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్‌ శ్యామల, ఉపాధ్యాయులతో ఆరా తీశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement