పాఠశాల సమయంలో ఫంక్షన్‌కు ఉపాధ్యాయులు
మిడ్జిల్: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 24 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో బుధవారం ఇద్దరు సెలవులో ఉన్నారు. ఉన్న వారిలో మధ్యాహ్నం 2:30 గంటల వరకు పాఠశాలలో కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల శబ్ధం చేస్తుండడంతో గమనించిన గ్రామస్తులు పాఠశాల గేట్‌కు తాళం వేశారు. విషయం తెలుసుకొని 2:45 సమయంలో ఫంక్షన్‌కు వెళ్లిన ఉపాధ్యాయులు పాఠశాలకు వెనుక వైపు నుంచి లోపలికి వెళ్లారు. విషయాన్ని గ్రామస్తులు డీఈఓకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ స్వప్న పాఠశాలకు చేరుకొని గ్రామస్తుల ఎదుట ఉపాధ్యాయులను విచారించడంతో.. ఫంక్షన్‌కు వెళ్లడంతో అక్కడ ఆలస్యం అయిందని హెచ్‌ఎం సరస్వతి తెలిపారు. ఇలా అందరూ ఒక్కసారే పోతే ఎలా అని సర్పంచ్ శంకర్, గ్రామస్తులు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఈ విషయంపై హెచ్‌ఎం సరస్వతిని వివరణ కోరగా.. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని తెలపడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లారు.


