ప్రజల ప్రతినిధిగా ఉంటా
పదేళ్ల కాలంలో 40వ డివిజన్‌కు మంచి ప్రతినిధి లేకపోవడంతో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. తండ్రి సీజే బెనహర్ తనయగా ఈ ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోటీలో విజేతగా నిలిచా. డిగ్రీలో బీఏ పూర్తి చేసి గృహిణిగా ఉంటున్నా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తండ్రి ప్రోత్సాహంతో కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచాను. రాబోయే రోజుల్లో డివిజన్‌లో ఒక మంచి ప్రతినిధిగా ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి చేస్తా. బస్తీ దవాఖాన ఇతర సదుపాయాల కల్పనపై దృష్టిపెడుతా.
– సి.బి పూజిత, 40వ కార్పొరేటర్


