కురుమూర్తి ఆలయ దిగుడు మెట్లు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

కురుమూర్తి ఆలయ దిగుడు మెట్లు పొడిగింపు

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

కురుమూర్తి ఆలయ దిగుడు మెట్లు పొడిగింపు

కురుమూర్తి ఆలయ దిగుడు మెట్లు పొడిగింపు

చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం గ్రామ సమీపంలో వెలసిన కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్ధం దాతల సహకారంతో అధికారులు దిగుడు మెట్ల పొడిగించేందుకు పనులు ప్రారంభించారు. రాజగోపురం వరకు ఉన్న దిగుడు మెట్లను ఈఓ కార్యాలయం వెనక భాగం నుంచి కొనసాగించనున్నారు. ప్రస్తుతం మెట్ల పనులకు కాంక్రీట్‌ వేసేందుకు సీకులు కట్టి ఉంచారు. ఆలయం వద్ద దిగుడు మెట్లు రాజగోపురం వరకు ఉండడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు, తిరిగి వచ్చే వారందరూ రాజగోపురం వద్దనే కలవడంతో భక్తుల రద్దీ ఏర్పడుతోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు దిగుడు మెట్లను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ దిగుడు మెట్ల నిర్మాణం పూర్తయితే స్వామివారిని దర్శించుకొని వచ్చే భక్తులు ఈఓ కార్యాలయం వెనక భాగం నుంచి ఆలయానికి చేరుకునే ప్రధాన రోడ్డు గుండా వెళ్లిపోతారు. దీంతో రాజగోపురం వద్ద భక్తుల రద్దీ తగ్గుతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement