అన్నివిధాల అభివృద్ధి చేస్తా
డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. 47వ డివిజన్ ప్రజలు నాపై నమ్మకంతో కార్పొరేటర్‌గా గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లో తిరిగాను. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డివిజన్‌లో అనేక ప్రాంతాల్లో సీసీరోడ్లు ఏర్పాటయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా అండర్ డ్రైనేజీ, సీసీరోడ్లు వేసేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు ప్రతి ఆరు నెలలకోసారి డివిజన్‌లో ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తాం.
– హలీమా తస్నీమ్, 47వ డివిజన్


