Mahabubnagar District Latest News
-
యథాతథంగా రెస్క్యూ ఆపరేషన్
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఏడుగురి కార్మికుల ఆచూకీ కనుగొనాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో రెస్క్యూ ఆపరేషన్ యథాతథంగా కొనసాగనుంది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం ఎస్ఎల్బీసీ ప్రమాదం, సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నేటి సమీక్షలో ప్రభుత్వం సొరంగంలో సహాయక చర్యలు నిలిపివేస్తారన్న అందరి అంచనాలు తారుమారయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించలేమని సహాయక బృందాలు చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో మరికొన్ని రోజులపాటు ఆపరేషన్‌లో పాల్గొననున్నారు. 30 మీటర్ల వద్ద అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తే సహాయక సిబ్బంది ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లనుందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎంత రెస్క్యూ అయినా కార్మికులను కాపాడాలని నిర్ణయించుకుంది. సహాయక బృందాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశానికి వెళ్లిన సొరంగం కుప్పకూలిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక సిబ్బంది సోమవారం 31వ రోజు సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడి భాగాలను ప్లాస్మా కట్టర్‌తో కట్ చేసి బయటకి తెస్తున్నారు. మట్టి, రాళ్ల దిబ్బలు, బురద పూడిక, ఉబికి వస్తున్న నీటిని వాటర్ జెట్ల ద్వారా బయటికి పంపిస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో.. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి ప్రమాదం జరిగిన 14 కిలోమీటరు వద్ద గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో విద్యుత్, వెంటిలేషన్ పనులను పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాద జోన్‌గా అధికారులు గుర్తించారు. నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్డీఆర్ఐ నిపుణుల నివేదిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎక్స్‌ఫర్ట్ కమిటీని కూడా నియమించి వారి సూచనలు, సలహాల మేరకు పనులు కొనసాగించనున్నారు. కేరళ నుంచి వచ్చిన కాడవర్స్ డాగ్స్ గుర్తించిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో చేపడుతున్న సహాయక చర్యలకు టీబీఎం భాగాలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. అదేవిధంగా సొరంగం తవ్వకాలకు మినీ హిటాచీ, కన్వేయర్ బెల్టు, డీవాటరింగ్ పైపులు కూడా అడ్డు పడుతున్నాయి. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణమధ్య రైల్వే, హైడ్రా, ర్యాట్ హోల్స్ మైనర్స్, ఆర్మీ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎస్ఎల్బీసీలో కొనసాగనున్న అన్వేషణ 31వ రోజూ సహాయక చర్యలు ముమ్మరం ఏడుగురి ఆచూకీ కనుగొనాలని సీఎం ఆదేశాలు -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఎర్రవల్లి: మండలంలోని కొండపేటకు చెందిన గద్వాల నరహరి (25) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్ఐ వెంకటేష్ వివరాల మేరకు.. నరహరి పెళ్లి విషయంలో ఆదివారం కుటుంబ సభ్యులు మందలించారు. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్థాపానికి గురై పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడి తండ్రి గద్వాల సింగోటం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు.. గద్వాల: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన ధరూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీహరి వివరాల మేరకు.. అయిజ మండలం చిన్నతాండ్రపాడు చెందిన కుర్వకిష్టన్న అనే వృద్ధుడు ఇటీవల కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోయింది. వృద్ధుడి అదృశ్యంపై అయిజ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో సోమవారం జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ వద్ద ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. విషయాన్ని స్థానిక జాలర్లు ధరూరు పోలీసులకు తెలియజేయగా.. కుర్వ కిష్టన్నగా గుర్తించారు. దాదాపు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని కుర్వ కిష్టన్న కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీహరి తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ఊట్కూరు/కోస్గి/భూత్పూర్: ఊట్కూరు మండలంలోని అవుసలోనిపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి అక్రమంగా ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణంరాజు తెలిపారు. గ్రామానికి చెందిన సాలేరాముపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ● కోస్గి మండలంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాల్‌రాజ్ తెలిపారు. మండలంలోని కడంపల్లి వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ● భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ సమీపంలో అనుమతుల్లేకుండా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. విధుల్లో భాగంగా సోమవారం గ్రామాల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఇసుక తరలిస్తున్న టిప్పర్ కనపడగా తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి లేదు. దీంతో టిప్పర్ డ్రైవర్ నక్కలి సురేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. నంబర్ ప్లేట్ లేని ట్రాకర్.. నాగర్‌కర్నూల్ క్రైం: నంబర్ ప్లేట్ లేని ఇసుక ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఏఎస్పీ రామేశ్వర్ సోమవారం తెలిపారు. జిల్లాకేంద్రంలో ఇసుక డంప్ చేసి వస్తుండగా ఎస్పీ కార్యాలయం ఎదుట ట్రాక్టర్‌ను తనిఖీ చేయడంతో నంబర్ ప్లేట్ లేనట్లు గుర్తించి జిల్లా రవాణాశాఖ అధికారికి అప్పగించినట్లు వివరించారు. ఎవరైనా నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామన్‌పాడులో 1,016 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో సోమవారం 1,016 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా 275 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుందని.. సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారని పేర్కొన్నారు. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వ ద్వారా 27 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 57 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. -
వరిపంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక
భూత్పూర్: జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న వరిపంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ అన్నారు. సోమవారం మండలంలోని మద్దిగట్ల, కర్వెన గ్రామాల్లో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరిపంటను దేవరకద్ర ఏడీఏ యశ్వంత్‌రావు, తహసీల్దార్ జయలక్ష్మి, ఏఓ మురళీధర్‌తో కలిసి డీఏఓ పరిశీలించారు. రెండు గ్రామాల్లో 882 మంది రైతులకు సంబంధించి 1,476 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, అలాగే 65 ఎకరాల్లో మొక్క జొన్నకు సైతం నష్టం జరిగిందని డీఏఓ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఏఈఓలు మౌనిక, ఆనందస్వామి, రైతులు పాల్గొన్నారు. నష్టపరిహారం అందించాలి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలతో సుమారు 2 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు పెంచి సత్వరమే పూర్తి చేయాలన్నారు. అలాగే పార్టీ ఏర్పడి వందేళ్లు అవుతున్నందున జిల్లా, మండల, గ్రామస్థాయిలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో నాయకులు బాలకిషన్, పరమేష్‌గౌడ్, అల్వాల్‌రెడ్డి, సురేష్, రాము, చాంద్‌పాషా, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు తీరనున్న తాగునీటి వ్యథ
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భక్తులకు తాగునీటి వ్యథ తీర్చేందుకు రూ. 36లక్షలతో చేపట్టిన తాగునీటి సంపు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 2లక్షల కిలో లీటర్ల సామర్ధ్యంగల సంపు నిర్మాణ పనులను మూడు నెలల క్రితం డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టారు. ప్రస్తుతం సంపు నిర్మాణం తుది దశలో ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే మిషన్ భగీరథ నీటిని సంపులో నింపి.. జాతర మైదానంలోని వాటర్ ట్యాంక్‌లకు నీటిని తరలిచేందుకు పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ట్యాంకుల నుంచి జాతర మైదానం, ఆలయ ప్రాంగణంలో అవసరమైన చోట కొళాయిలను ఏర్పాటుచేసి.. తాగునీటిని అందించనున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి చొరవతో పనులు వేగంగా సాగుతున్నాయి. ● కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం దాదాపు 10లక్షల మంది భక్తులు తరలివస్తారు. అయితే ఆలయం వద్ద 90వేల సామర్ధ్యంగల రెండు వాటర్ ట్యాంకులు మాత్రమే ఉండటంతో నీరు సరిపోక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఆలయ పరిసరాల్లో ఉన్న చేతిపంపులు, సమీప వ్యవసాయ పొలంలో ఉన్న బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే వారు. మరోవైపు భక్తులకు తాగునీటి వసతి కోసం అధికారులు నానా తంటాలు పడే వారు. సమీపంలోని గ్రామపంచాయతీల నుంచి వాటర్ ట్యాంకర్లతో పాటు ఊకచెట్టు వాగు నుంచి బోరు పంపులను ఏర్పాటుచేసి నీటి వసతి ఏర్పాటు చేసేవారు. అయినప్పటికీ నీటి కొరత తీరేది కాదు. ప్రస్తుతం చేపట్టిన వాటర్ సంపు నిర్మాణంతో ఇబ్బందులు తీరనున్నాయి. కురుమూర్తిస్వామి ఆలయ ప్రాంగణంలో రూ. 36లక్షలతో సంపు నిర్మాణం తుది దశలో పనులు -
జూరాలలో దూకి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
అమరచింత: జూరాల బ్యాక్‌వాటర్‌లో దూకి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌కు చెందిన వామనరావు కుమారుడు వినయ్‌కులకర్ణి(25) హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతనికి రెండు నెలల క్రితమే పెద్దలు ఓ యువతితో వివాహం జరిపించారు. అయితే స్వగ్రామం బీజాపూర్‌కు వచ్చిన వినయ్ హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి శుక్రవారం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలోనే తండ్రి వామన్‌రావుకు ఫోన్ చేసి తాను జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆయన జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకుని గాలించగా 17వ నంబర్ షెటర్ వద్ద బైక్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ కనిపించాయి. విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో.. ఎస్ఐ సురేష్ జాలర్లతో కలిసి బ్యాక్‌వాటర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల తర్వాత సోమవారం వినయ్ మృతదేహం బ్యాక్‌వాటర్‌లో తేలడంతో జాలర్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఆత్మకూర్‌లోని శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై వినయ్ తండ్రి వామనరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పెళ్లయిన రెండు నెలలకే.. వినయ్ కులకర్ణి పెళ్లయిన రెండు నెలలకే ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బంధువులు పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించడం, లోలోపల కుంగిపోయేవాడని పేర్కొన్నారు. అయితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు దాపురించిందో అర్థం కావడం లేదని తండ్రి వామనరావు రోదిస్తూ చెప్పారు. మూడు రోజుల క్రితం బైక్, ల్యాప్‌టాప్ లభ్యం తాజాగా ప్రాజెక్టులో లభ్యమైన మృతదేహం -
క్షయ కట్టడిలో ముందంజ: కలెక్టర్
పాలమూరు: జిల్లాలో క్షయవ్యాధి నియంత్రణ, రోగులకు చికిత్స అందించడంతో పాటు అన్ని విభాగాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. క్షయ రోగులకు అందించిన సేవలకు గాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు వైద్యాధికారులతో పాటు సిబ్బందిని అభినందించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,087 క్షయ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, 1,218 మందికి చికిత్స అందించి వ్యాధి తగ్గించినట్లు తెలిపారు. 1,767 మంది రోగులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరు నెలల పాటు ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో క్షయ నియంత్రణ కోసం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా డిసెంబర్ 7 నుంచి మార్చి 24 వరకు రెండు మొబైల్ వ్యాన్ల ద్వారా లక్షణాలు ఉన్నవారికి తేమడ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. క్షయ పరీక్షలు చేయడానికి డీఎఫ్ఎంటీ నిధుల ద్వారా పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్ కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో క్షయ లక్షణాలు బాధితులు సమీప పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో చికిత్స తీసుకోవాలన్నారు. ఆనంతరం క్షయ నియంత్రణ కోసం ప్రత్యేక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మెహన్రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకుకూరలు.. వేసవిలో అనువైన పంటలు
అలంపూర్ : వేసవిలో ఆకు కూరల సాగు రైతులకు కొంత వరకు లాభసాటిగా ఉంటుంది. ప్రజల ఆరోగ్య రక్షణ కల్పించడంతోపాటు రైతులకు లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు సూచిస్తున్నారు. వాటి వివరాలను ఇలా వివరించారు. అనుకూలమైన ఆకు కూరలు వేసవిలో ముఖ్యంగా గొంగూర, తోట కూర, పాల కూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా మొదలైన ఆకు కూరలు సాగు రైతులకు మేలు చేస్తాయి. వేసవిలో సాగుకు అనుకులమైన విత్తనాలనే వాడాలి. తోట కూర : తోట కూరలో ఆర్‌ఎన్‌ఎ–1 రకం ముఖ్యమైనది. ఆకులు, కాండం లేత ఆకు పచ్చరంగులో ఉంటాయి. విటమిన్ ఏ, సీలు అధికంగా ఉంటాయి. కాండం కూడా పీచు లేకుండా మృదువుగా రుచికరంగా ఉంటాయి. నెల రోజుల్లో ఎకరాకు 5–6 టన్నుల దిగుబడి వస్తోంది. మొదటి కోత ఎత్తిన 15–20 రోజుల్లో వస్తోంది. మొదటి కోత తర్వాత పక్క కోమ్మలు బాగా వస్తాయి. నీటి ఎద్దడిని తెల్ల మచ్చ తెగుళును తట్టుకుంటుంది. ఎకరానికి 800 గ్రాముల విత్తనం అవసరం. పాల కూర : పాలకూరలో ఆల్ గ్రీన్ రకం లేత ఆకులు కలిగి 15 నుంచి 20 రోజులకు కోతకు వస్తోంది. 6 నుంచి 7 కోతల్లో ఎకరానికి 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరం. విత్తనాలను 20గీ10సెంటీమీటర్ల ఎడంగా, 3–4 సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి. లోతు ఎక్కువైతే మొక్క సరిగ్గా రాదు. విత్తిన 8–10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. గొంగూర : ఎఎన్జీఆర్యు–1 రకం ప్రధానమైనది. ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు 6 కిలోల విత్తనం అవసరం. ముందుగా 60 సెంటీమీటర్ల ఎడంగా బోదలు చేసుకొని బోదలకు రెండు వైపుల విత్తనాన్ని 30 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో వేయాలి. మొలకెత్తిన 20 రోజులకు వత్తుగా ఉన్న మొక్కలను పీకి కట్టలు కట్టి విక్రయించాలి. మెంతి కూర : పూసా ఎర్లీ బంచీంగ్ రకం. ఇది త్వరగా కోతకు వచ్చే రకం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనాన్ని వరుసల మధ్య 25 సెంటిమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తుకోవాలి. కొత్తమీర సీఎస్–6 రకం పంట కాలం 80 నుంచి 85 రోజులు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. సాధన(సీఎస్–4) రకం పేను బంకను తట్టుకుంటుంది. ఎకరానికి 4 నుంచి 5 కిలోల విత్తనాన్ని 15 సెంటిమీటర్ల ఎడంలో విత్తుకోవాలి. విత్తిన 8–12 రోజుల్లో గింజలు మొలకెత్తుతాయి. పాడి–పంట ఎండ నుంచి రక్షణ ఆకు కూరలు అధిక ఎండలను తట్టుకోలేవు. కాబట్టి వేసవిలో సాగుకు నీడ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. పొలంలో నీడనిచ్చేలా మొక్కజొన్న, ఆముదం పంటలను ఉత్తర, దక్షిణ దిశల్లో నాటుకోవాలి. వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. వేసవిలో నీటి అవసరం ఎక్కువ కాబట్టి స్ప్రింక్లర్ల పద్దతిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు. -
నల్ల‘గుట్టు’ రట్టయ్యేనా..!
కృష్ణా : మండలంలోని నల్లగట్టులో గుట్టుగా మైనింగ్ కొనసాగుతోంది. అనుమతుల్లేకుండా అక్రమార్కులు ఇష్టానుసారంగా గుట్టను ధ్వంసం చేస్తూ భారీ పేలుడు పదార్థాలతో బ్లాసింగ్‌కు పాల్పడుతున్నారు. గత రెండు, మూడేళ్లలో గుట్ట రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. కర్ణాటకలోని బళ్లారిలో మాదిరిగానే ఇక్కడి రాయిని తీస్తున్నారు. ఇక్కడి అధికారులు, నాయకులు అవినీతి, అక్రమార్కలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దుంటూ.. ప్రతి రోజు బ్లాసింగ్ ఇళ్లు, ప్రభుత్వ భవనాలు బీటలు వారుతున్నాయి. నివాస ప్రాంతాల్లో రాళ్లు పడుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో జాతీయ రహదారిపై కొన్నిసార్లు వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దు నిర్వాహకులు హుకుం జారీ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు కొన్నేళ్లుగా అనుభవిస్తున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు ఇచ్చే మామూళ్ల మత్తులో చూసీచూడనట్లుగా వ్యహరిస్తున్నారు. ప్రతినిత్యం ఈ క్వారీ, క్రషర్ మిషన్లలో అమాయక ప్రజలు, కూలీలు పనిచేస్తూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు బయటకు పొక్కకుండా అక్కడికక్కడే వారికి కొంత డబ్బు ఇచ్చి మూసివేసిన సందర్భాలు ఉన్నాయని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. శ్రమదోపిడీ ఈగుట్టకు ఉన్న క్వారీల్లో వందల సంఖ్యలో కూలీలు పనిచేస్తున్నారు. వారు రోజంతా పనిచేస్తే కనీసం రెండు, మూడు వందలు కూలి కూడా ఇవ్వడంలేదని కర్ణాటక కూలీలు ఆరోపిస్తున్నారు. వారు పనిచేసేచోట ప్రమాదం అని తెలిసినా కూడ వారు తమ పిల్లలను అక్కడే ఉంచుకుంటున్నారు. బోరు బావుల్లో నీళ్లు తగ్గుతున్నాయ్ బ్లాస్టింగ్ మూలంగా పక్కనే ఉన్న తమ పొలాల్లోని బోరుబావుల్లో నీళ్లు తగ్గుతున్నాయి. గతంలో 100 ఫీట్లల్లో నీళ్లు వచ్చేవి. ఇప్పుడు 200 ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. బ్లాస్టింగ్ చేసిన సమయంలో భూమి అదిరి నీళ్లు కిందకు వెళ్తున్నాయి. – బ్డుమోళ్ల రాము, గుడెబల్లూర్ గ్రామం. దుమ్ము ధూళితో రోగాలు గుట్టకు ఏర్పాటుచేసిన క్రషర్ మిషన్ల మూలంగా వచ్చే దుమ్ము ధూళితో రోగాలు వస్తున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలు అయితే చాలు ఆ దుమ్మధూళితో నరకం చూస్తున్నాం. జాతీయ రహదారికి పక్కన ఉన్న క్రషర్ మూలంగావచ్చే దుమ్ముతో రోడ్డుపై వెళ్లే ద్విచక్ర, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. – చెవిటోళ్ల సురేష్.గుడెబల్లూర్ గ్రామం. కొన్నింటికి అనుమతులున్నాయ్ నాలుగు క్వారీలు, మూడు స్టోన్ క్రషర్లకు మైనింగ్ శాఖ నుంచి అనుమతలున్నాయ్. 551, 348, 355, 356 సర్వే నంబర్లలో మొత్తం 66ఎకరాల్లో మైనింగ్‌కు అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేని క్వారీల్లో పనులను నిలిపివేసి, గనుల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తాం. – వెంకటేష్, తహసీల్దార్, కృష్ణా అనుమతుల్లేకుండా బ్లాస్టింగ్ ఊపందుకున్న మైనింగ్ రెచ్చిపోతున్న అక్రమార్కులు మామూళ్ల మత్తులో అధికారులు బీటలు వారుతున్న నివాసగృహాలు భయాందోళనలో ప్రజలు -
నల్లమలలో పులుల గణన
కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు పులుల గణన చేపట్టారు. కొల్లాపూర్ సమీపంలోని నల్లమల అడవిలో రెండు రోజుల క్రితం గణన ప్రారంభించినట్లు ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫేజ్–4లో భాగంగా కొల్లాపూర్ రేంజ్లో బయాలజిస్టు రవికాంత్ నేతృత్వంలో పులులు, చిరుతల పాదముద్రలు సేకరిస్తున్నట్లు వివరించారు. అటవీ ప్రాంతంలో ప్రతి రెండు చదరపు కిలోమీటర్లకు ఒక కెమెరా ఏర్పాటు చేశామని, కెమెరాలో రికార్డు అయిన వన్యప్రాణులతోపాటు పాదముద్రల ఆధారంగా గణన కొనసాగుతుందని చెప్పారు. పులుల గణనలో స్థానిక ఫారెస్టు అధికారులతోపాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. గతేడాది కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 9 పులులను గుర్తించామని ఆయన వెల్లడించారు. అనుమతి లేకుండా ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. -
నిరుపేదలకే ‘భరోసా’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కూలి పనులు చేసుకునే నిరుపేదలే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులు. ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం’ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’కి శ్రీకారం చుట్టింది. ఏడాదికి రెండు విడతల్లో నిధులు జమ చేయనుంది. మొదటి విడతలో భాగంగా కూలీల కుటుంబాలకు రూ.6 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 423 గ్రామ పంచాయతీల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 5,74,26,000 మంజూరు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 9571 మంది ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వీరికే ఆత్మీయ భరోసా ● భూమి లేని రైతులు, వ్యవసాయ కార్మికులకే పథకం వర్తిస్తుంది. ● 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పని పూర్తిచేసిన ఉపాధి హామీ కూలీలు అర్హులు. ● ధరణి పోర్టల్‌లో ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలు. ● ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితా ప్రకారం గ్రామ సభలు నిర్వహించారు. అర్హుల జాబి తాను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించి, లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.6 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ 9, 571 కుటుంబాలకు లబ్ధి ‘ఆత్మీయ భరోసా’ రూ.5,74,26,000 మంజూరు -
చల్లంగుండాలి..
మాకు మీరు.. మీకు మేము ! ‘సివిల్ సప్లయ్’లో తోడు దొంగలు ● జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ఇద్దరు అధికారుల హవా ● మిల్లర్లతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వ్యవహారం ● వేడి భరించలేం.. ఏసీలు ఇవ్వాలంటూ బేరం ● నజరానాగా లారీకి 5 క్వింటాళ్ల సీఎమ్మార్ మిగిలించుకునేలా ఒప్పందం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే.. ‘మమకారం’ పంచిన మిల్లర్లకే మొగ్గు.. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌తో ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం విదితమే. జోగుళాంబ గద్వాల జిల్లాలో 61 వేల మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నులు.. మొత్తం 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి సీఎమ్మార్ కింద బియ్యంగా ఇవ్వాలని గద్వాల జిల్లాలోని 37 రైస్ మిల్లులకు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనే సివిల్ సప్లయ్ అధికారులు వివక్ష చూపినట్లు తెలుస్తోంది. తమపై మమకారం చూపిన మిల్లర్లకు అధికంగా.. తమను పట్టించుకోని వారికి తక్కువ మొత్తంలో ధాన్యం కేటాయింపులు చేసినట్లు సమాచారం. మొత్తానికి గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మర ఆడించి.. 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు సుమారు 23 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు అప్పగించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. -
పురుడు పోసుకున్న నీరుకట్ట పాము
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయోడైవర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్లో భద్రపర్చిన నీరుకట్టపాము సోమవారం పురుడు పోసుకుంది. మండలంలోని నసురుల్లాబాద్‌లో నాలుగురోజుల క్రితం ఓఇంట్లోకి పామురాగా సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు ఫోన్‌ద్వారా సమాచారమిచ్చారు. దీంతో ఆయన శిష్యులను పామును పట్టుకురమ్మని పంపించగా వారు వెళ్లి నీరుకట్ట పాముగా గుర్తించి పట్టుకున్నారు. పాముతో పాటు అది పెట్టిన 21గుడ్లను సైతం కళాశాల బయో డైవర్సిటీ రీసెర్చ్అండ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు తీసుకొచ్చారు. గుడ్లను పొదిగేందుకు కళాశాలలో సరైన సౌకర్యాలు లేకపోవటంతో హైదరాబాద్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి పంపించేందుకు భద్రపర్చారు. భద్రపర్చిన గుడ్లలో సోమవారం 10పిల్లలు బయటకు వచ్చాయి. పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నట్లు తెలిపారు. ఈకాలంలో నీరుకట్ట పాము గుడ్లు పిల్లలను లేపే అవకాశం అధికంగా ఉంటుందని, ఎక్కువగా తడితో కూడిన ప్రదేశంలో భూమిలోని రంధ్రాల్లో గుడ్లను పెట్టి ఉంటాయని సర్పరక్షకుడు డా.సదాశివయ్య తెలిపారు. నీరుకట్ట గుడ్లనుంచి పాము పిల్లలు బయటకు రావటంపై కళాశాల ప్రిన్సిపాల్ డా. సుకన్య ఆనందం వ్యక్తం చేశారు. -
యువత జీవితంలో ఉన్నతంగా ఎదగాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యువత జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలను దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో అత్యధిక మంది బాలికలు చదవడం గొప్ప విషయమని, ఈ కళాశాలను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇక్కడ చదివే 500 మంది బాలికలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ వంటి శిక్షణలు ఇస్తామన్నారు. శిక్షణ కోసం వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని, మొదటి బ్యాచ్‌ను పైలెట్ బ్యాచ్‌గా ఎంపిక చేసుకుని శిక్షణ ఇవ్వాలని ఫౌండేషన్ సభ్యులను కోరారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో రాణించాలంటే విద్యార్థులు ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, ఫౌండేషన్ సభ్యులు ప్రవీణ్ముత్యాల, శేఖర్, మురళీమోహన్, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
డ్రంకెన్ డ్రైవ్‌లో వ్యక్తికి మూడు రోజుల జైలుశిక్ష
మహబూబ్‌నగర్ క్రైం: అధిక మోతాదులో మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించగా.. వీరిలో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ భగవంత్‌రెడ్డి ఆ ధ్వర్యంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 8మంది వాహనదారులు అధిక మోతాదులో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారందరిని సోమవారం కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ఆర్.శశిధర్ కేసు పరిశీలించి దీంట్లో నలుగురు వాహనదారులకు రూ.4వేలు, ఇద్దరికి రూ.3వేలు, మరొకరికి రూ.2వే ల జరిమానా విధించారు. మరో వాహనదారుడికి మూడు రోజుల జైలు శిక్ష విదించడంతో అతడిని జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. -
లారీ బోల్తా.. నలుగురికి గాయాలు
చారకొండ: లారీ బోల్తాపడి నలుగురు గాయాల పాలైన ఘటన మండలంలోని జూపల్లి సమీపం 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శంషోద్దీన్ కథనం మేరకు.. కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు ఇనుప చువ్వల లోడ్‌తో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇనుప ర్యాంపును, అటుగా వస్తున్న ఆటోను ఢీకొని రహదారిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రెవర్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై లారీ పడటంతో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి పొక్లెయిన్ సాయంతో రోడ్డుపై పడ్డ ఇనుప చువ్వలు, లారీని పక్కకు తొలగించారు. ఆటో డ్రైవర్ లోకిలాల్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ శంషోద్దీన్ వివరించారు. -
పాలమూరు రెడ్డి సేవా సమితి సేవలు అమోఘం
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు రెడ్డి సేవా సమితి సేవలు అమోఘమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజబహదూర్రెడ్డి కన్వెన్షన్‌లో ఆదివారం సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తూము ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన పాలమూరు రెడ్డి సేవాసమితి 23వ వార్షికోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాలమూరు రెడ్డి సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నతస్థానంలో నిలిచిందన్నారు. 23 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. రెడ్డి సేవా సమితి ఏం చేసినా అది సమాజానికి ఉపయోగపడుతుందన్నారు. గతంలో పాలమూరు రెడ్డి సేవా సమితి ఏర్పాటు చేసిన బాలికల హాస్టల్ ఇప్పుడు మహబూబ్‌నగర్ ఫస్ట్ నవరత్నాల కార్యాలయంగా సమాజానికి ఉపయోగపడుతున్నదని, అక్కడ మొదటి బ్యాచ్‌లో 280 మంది మహిళలకు వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. చదువుకు నోచుకొని అన్ని వర్గాల పేద విద్యార్థుల కోసం మహబూబ్‌నగర్ విద్యానిధి ఏర్పాటు చేశామని, మీరంతా విద్యానిధికి చేయూత ఇవ్వాలని కోరారు. డీసీసీబీ అధ్యక్షులు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని నిరుపేదలు స్వయం ఉపాధి కోసం తగు వివరాలతో వస్తే రుణసదుపాయం కల్పిస్తామన్నారు. భక్తమల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుమతి మాట్లాడుతూ రెడ్లు ఆర్థికంగా ఎదిగి తమ పిల్లలకు మంచి విద్యను అందించి వారు జీవితంలో స్థిరపడే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం రెడ్డి సేవా సమితి 23వ వార్షికోత్సవ సంచికను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్డి హాస్టల్ అధ్యక్షుడు ఎం.వెంకటరంగారెడ్డి, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీవీ నందకుమార్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, సినీ నిర్మాత బసిరెడ్డి, సమితి ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మద్ది అనంతరెడ్డి, రాఘవరెడ్డి, మల్లు నరసింహారెడ్డి, జి.వెంకట్రాంరెడ్డి, ఎన్.సురేందర్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, మే ఘారెడ్డి, వెంకటరాజారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సరస్వతి, స్వరూప, శోభ, వరలక్ష్మి, నర్మద, శశికళ, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి -
వచ్చేనెల 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జైబాపు, జైభీమ్, జైసంవిదాన్ అభియాన్ రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశాన్ని ఇటీవలే నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాల సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయని, ఈనెల 28 లోపు మండలస్థాయిలో కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై వందేళ్లు పూర్తయిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందన్నారు. అంబేద్కర్‌ను పార్లమెంట్లో కేంద్రహోంమంత్రి అమిత్‌షా అత్యంత హీనంగా అవమానపర్చారని అన్నారు. అమిత్‌షా రాజీనామా చేయాలని కాంగ్రెస్‌తో పాటు దేశ ప్రజలందరూ డిమాండ్ చేశారని, కానీ ఆయన చేయలేదన్నారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏడాది పాటు ప్రతి గ్రామాన్ని సందర్శించేలా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. సన్నాహక సమావేశాలు అనంతరం ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్ల పాదయాత్రలు పూర్తిచేసి మండల కేంద్రం లేదా ఏదైనా పెద్ద గ్రామ పంచాయతీలో ముగింపు సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సతీష్, మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, మీడియా కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు చంద్రకుమార్‌గౌడ్, సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేశ్ పాల్గొన్నారు. ఏడాది పాటు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి -
దొరకని కార్మికుల ఆచూకీ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ కోసం సహాయక బృందాలు నెలరోజులుగా శ్రమిస్తున్నాయి. కేరళకు చెందిన కడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతున్నా ఫలితం లేకపోతోంది. గత నెల 22న జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కకోగా.. ఈ నెల 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభ్యమైంది. సొరంగం కుప్పకూలిన 14 కిలోమీటరు వద్ద మట్టి, బండరాళ్లు, టీబీఎం శకలాల కింద మిగిలిన ఏడుగురు కార్మికులు ఉండి ఉంటారని సహాయక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ప్రదేశంలో మట్టి, బురద, రాళ్ల తొలగింపు ప్రక్రియ చేపడితే కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో ఆచితూచి తవ్వకాలు చేపడుతుండగా.. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరు కూడా సాహసం చేయడం లేదు. ఇదిలా ఉండగా.. ఆదివారం 30వ రోజు డీ1, డీ2 ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగాయి. టీబీఎం భాగాలను దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్లాస్మా కట్టర్లతో తొలగించి బయటకు పంపిస్తున్నారు. సొరంగంలో ఉబికి వస్తున్న నీరు, పేరుకుపోతున్న మట్టితో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాద ప్రదేశం వరకు పూర్తిస్థాయిలో విద్యుత్, వెంటిలేషన్ పనులు పునరుద్ధరించారు. నేడు ముఖ్యమంత్రితో సమీక్ష.. సోమవారం శాసనసభ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొనేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, వికాస్‌సింగ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి డా. హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జీఎం బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్ హోల్ మైనర్స్, అన్వి రోబోటిక్, కేరళ కడావర్ డాగ్స్ బృందంతో పాటు జేపీ కంపెనీకి చెందిన 12 రకాల సహాయక బృందాల ఉన్నతాధికారులు ఆదివారం తరలివెళ్లారు. సమీక్షలో ప్రధానంగా నెలరోజుల్లో తీసుకున్న చర్యలు.. ఎలాంటి సహాయక చర్యలు చేపడితే సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తేవచ్చనే అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు వేగవంతం.. సొరంగంలో మట్టి తవ్వకాలు, డీ వాటరింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఆదివారం ఉదయం జేపీ కంపెనీ క్యాంపు కార్యాలయం వద్ద సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక బృందాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు సొరంగం లోపలి పరిస్థితులను ఆయనకు వివరించారు. సొరంగంలో అత్యంత ప్రమాద ప్రదేశంగా భావిస్తున్న ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రదేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. సహాయక బృందాలకు కావాల్సిన సదుపాయాలు, వసతులు కల్పిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు అధికారులకు సవాల్‌గా మారిన ప్రమాదం -
జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఈ నెల 25 నుంచి 29 వరకు జరగనున్న జాతీయస్థాయి సీనియర్ టెన్నికాయిట్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. హనుమకొండలో ఈనెల 15 నుంచి 17 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ టెన్నికాయిట్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన యాసిన్, సుజాయత్, మమత, జాష్నవి, శ్రీనిధిలు ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం క్రీడాకారులు జాతీయపోటీలకు బయలుదేరగా వీరిని జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లయన్ నటరాజ్, వడెన్న, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. -
హక్కుల సాధనకు సమష్టిగా పోరాటం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కార్మికులందరూ ఏకమై హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బోరింగ్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో నర్సింగ్ హోం కార్మికుల సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే కార్మికులందరికీ అండగా ఉంటామన్నారు. వీరు శ్రమదోపిడీకి గురవుతున్నారని, ఏడాదికి కనీసం 15 రోజుల సెలవులైనా యాజమాన్యాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్, ఆయా సంఘాల నాయకు లు బాబుమియా, శ్రీనివాసులు, ఆంజనేయులుగౌడ్, మనోహర్, నాగరాజు, సంతోష్, కాశపోగు ప్రసాద్, శివాని, మనీషా పాల్గొన్నారు. జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు మహబూబ్‌నగర్ క్రీడలు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ఈ నెల 26 నుంచి 30 వరకు జరగనున్న జాతీయస్థాయి జూనియర్ (బాలికల) హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. బి.పారిజాత, మాధురి, శ్రీవర్ధినిలు తెలంగాణ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి ఎంపికపై సంఘం సభ్యులు రజినీకాంత్‌రెడ్డి, ఎండీ జియావుద్దీన్, బి.బాల్‌రాజు, ఎండీ అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్‌కుమార్, పీఈటీ ప్రణయ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. న్యూస్‌రీల్ -
హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ : ఒకరికి గాయాలు
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు ఘర్షణ పడగా ఓ విద్యార్థి చెయ్యి విరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. మహబూబ్‌నగర్ రోడ్లో ఉన్న ఎస్పీ–ఏ ప్రభుత్వ హాస్టల్లో 85 మంది విద్యార్థులు ఉంటున్నారు. 7వ తరగతి విద్యార్థి లోకేష్ ట్రంకు పెట్టే తాళాన్ని విరగ్గొట్టి అందులోని సామగ్రిని కొందరు విద్యార్థులు దొంగిలించారు. ఆ వస్తువులు మీరే తీశారంటూ లోకేష్ కొంతమంది విద్యార్థులను ప్ర శ్నించగా వారంతా గుంపుగా ఏర్పడి కొట్టడంతో ఎడమ చెయ్యి విరిగింది. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఘటన విషయాన్ని హాస్టల్ వార్డెన్ కృష్ణయ్య వద్ద ప్రస్తావించగా.. రాత్రి 8 వరకు హాస్టల్లోనే ఉన్నానని, భోజనానికి ఇంటికి వెళ్లి వచ్చేసరికి విద్యార్థులు గొడవపడ్డారన్నారు. గొడవ విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేసి విద్యార్థులను మందలించానని చెప్పారు. -
విస్తరిస్తోన్న క్షయ
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న బాధితులు ●అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో క్షయ బాధితులు కొంత తగ్గుముఖం పట్టారు. అన్ని పీహెచ్‌సీల్లో మైక్రోస్కోపీ మిషన్, టీబీ సెంటర్, జడ్చర్ల, ఎస్వీఎస్లో న్యాట్ మిషన్స్ ద్వారా పరీక్షలు చేస్తున్నాం. ఈ పరీక్ష ఫలితాలు త్వరగా వస్తాయి. జిల్లాలో ఆశల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా పనితీరు బాగుందని రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి వచ్చింది. – మల్లికార్జున్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి నిర్లక్ష్యం చేయొద్దు రెండు వారాల పాటు క్రమం తప్పకుండా దగ్గు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా తప్పక తెమడ పరీక్ష, ఎక్స్‌రే తీయించి వైద్యుడికి చూపించాలి. టీబీ సోకిన వారు మందులు వాడకుండా మధ్యలో ఆపేస్తున్నారు. పల్లెల్లో ఆర్ఎంపీలు అప్పటి పూర్తిగా దగ్గు, జ్వరానికి తాత్కాలిక మందులు ఇచ్చి సంబంధిత వైద్యుడి దగ్గరకు రాకుండా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ సందీప్‌కుమార్, పల్మనాలజిస్ట్ పాలమూరు: క్షయ నివారణ కట్టడి కోసం జిల్లా అధికారులు ఒకవైపు ప్రయత్నిస్తున్నా.. మరోవైపు రోగులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో చిన్నారుల్లోనూ ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కేటాయించిన లక్ష్యంలో భాగంగా బాధితులను గుర్తించడానికి ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటి వరకు జిల్లాలో 125 మందికి కిట్లు అందజేశారు. ఇందులో 3 కిలోల బియ్యం, కిలో పల్లీలు, కిలో పాల పౌడర్, నాలుగు రకాల పప్పు ధాన్యాలు, ఒక ఆయిల్ పాకెట్ అందిస్తున్నారు. నిబంధనలు పాటించరు.. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు క్షయ బాధితులను గుర్తిస్తే వారి వివరాలు ప్రతినెల క్షయ నియంత్రణ శాఖకు అందించాలి. ఒక కేసును గుర్తిస్తే ప్రభుత్వం సదరు వైద్యుడికి రూ.100 ప్రోత్సహక నగదు అందిస్తుంది. బాధితుడికి ఐదు నెలలపాటు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తే రూ.500 చెల్లిస్తోంది. అయినా ప్రైవేట్ వైద్యులు వివరాలు అందించడం లేదు. ప్రైవేట్‌లో చికిత్స తీసుకోకపోవడంతో అది వారి నుంచి ఇతరులకు సోకి మరింతగా ప్రబలుతోంది. బాధితుల వివరాలన్నీ ఈ శాఖ వద్ద ఉన్నట్లయితే సిబ్బంది ఆ రోగుల వివరాల మేరకు చికిత్స తీసుకుంటున్నారా.. లేదా.. అనే విషయాలను పర్యవేక్షించి అవగాహన కల్పించి వ్యాధి నివారణకు కృషి చేయడానికి వీలవుతుంది. వ్యాధిని గుర్తించడం ఇలా.. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, దగ్గినప్పుడు రక్తం పడటం టీబీ వ్యాధి లక్షణాలు. సమీపంలోని అరోగ్య కేంద్రాలకు వెళ్తే ఉచితంగా తెమడ పరీక్ష చేసి వ్యాధిని గుర్తిస్తారు. శరీరంలో అన్ని అవయవాలకు.. క్షయ ఒక అంటువ్యాది. ఇది మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిన్ అనే బ్యాక్టీరియా సోకినప్పుడు వ్యాపిస్తుంది. వెంట్రుకలు, గోళ్లు, తప్ప మిగిలిన అన్ని అవయవాల్లోనూ నివసించే ప్రమాదకరమైన సూక్ష్మ క్రిమి ఇది. ఈ బ్యాక్టీరియా అధికంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి భయంకరమైన వ్యాధికారక క్రిమి గాలి పీల్చుకున్నప్పుడు దేహంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా వ్యాధికారక క్రిమి 90 శాతం మందిలో క్రియా రహితంగా ఉంటుంది. పొగరాయుళ్లు, మద్యపాన ప్రియులు, హెచ్ఐవీ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు వ్యాధి ప్రబలుతుంది. చిన్నారులను కలవరపెడుతున్న మహమ్మారి అవగాహనతోనే అరికట్టేందుకు అవకాశం నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం -
రైతన్నకు అకాల నష్టం
జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమాగం అవుతోంది. ఓ వైపు సాగునీరు లేక వేల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే.. మరోవైపు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో... కురిసిన వడగండ్ల వర్షంతో కొందరు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు 1967 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ, కోయిలకొండ, నవాబుపేట, మిడ్జిల్, రాజాపూర్, జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లో పంట దెబ్బతింది. – సాక్షి నెట్వర్క్ వివరాలు 9లో u -
ఆశలు ఆవిరి
నెర్రెలు బారిన పొలాలు.. పశువుల మేతగా మారిన పంటలతో వ్యవసాయ పొలాలు కళ తప్పాయి. ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. యాసంగి సీజన్లో వ్యయ ప్రయాసాలకోర్చి పంటలు సాగుచేసిన రైతన్నలకు కన్నీరే మిగులుతోంది. పంటలకు నీరందించే బోరుబావుల్లో భూగర్భజలాలు పడిపోవడం.. కరెంటు సక్రమంగా లేకపోవడం.. కాల్వలకు నీటి విడుదల నిలిచిపోవడం తదితర కారణాలతో రైతుల కళ్లెదుటే పంటలు ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. పంటసాగుకు చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంటలు ఎండిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. – సాక్షి నెట్వర్క్ నవాబుపేట మండలం కామారం గ్రామానికి చెందిన రైతు గోరుగాని చంద్రయ్య తనకున్న మూడెకరాల్లో వరిపంట సాగు కోసం రూ.లక్ష ఖర్చుచేసి రెండు బోర్లు డ్రిల్లింగ్ చేయిస్తే ఒక్క బోరులో నీరు వచ్చింది. దీంతో పంటసాగు చేశాడు. తీరా వేసవి ప్రారంభంలోనే బోరుబావిలో నీటిమట్టం పడిపోవడంతో ఎకరా పంటకు నీరందడం కష్టంగా మారింది. రెండెకరాల వరిపొలం రైతు కళ్లెదుటే ఎండింది. బోరుడ్రిల్లింగ్, పంటసాగుకు తెచ్చిన నవాబుపేట మండలం పల్లెగడ్డకు చెందిన రైతు రామయ్య నాలుగెకరాల్లో వరిసాగు చేశారు. నారు పోసే సమయంలో బోర్లు బాగానే ఉన్నా.. ప్రస్తుతం రెండు బోర్లు కలిసి ఎకరం కూడా సరిగ్గా పారడం లేదు. పంట మొత్తం పూర్తిగా ఎండిపోయింది. సదరు రైతుకు దాదాపు రూ. 2లక్షలకు పైగా అప్పులు మిగలాయి. బోర్లను నమ్ముకుని వరిసాగు చేస్తే అప్పులే మిగిలాయని రైతు రామయ్య రోదిస్తున్నారు. కౌకుంట్ల మండలం దాసరిపల్లికి చెందిన రైతు శ్రీకాంత్‌రెడ్డి బోరుబావి ఆధారంగా నాలుగెకరాల్లో వరిసాగు చేశారు. బోరుబావిలో నీటిమట్టం పడిపోవడంతో పంటకు నీరందించే పరిస్థితి లేకుండాపోయింది. రైతు కళ్లెదుటే పంట మొత్తం ఎండిపోయింది. పశువుల మేతగా మారిన పంటను చేస్తే కన్నీరు ఆగడం లేదని రైతు వాపోయారు. పంట పెట్టుబడి కోసం తెచ్చిన రూ. లక్షకు పైగా అప్పు ఎలా కట్టాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఖిల్లాఘనపురం మండలం ముందరితండాకు చెందిన రైతు కేతావత్ ముత్యాలు తనకున్న రెండెకరాల్లో బోరుబావి కింద వరిపంట సాగుచేశారు. మొదట్లో బోరుబావిలో నీరు పుష్కలంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇటీవల బోరుబావి నీరు తగ్గడంతో రెండెకరాల్లో మూడు మళ్లు తప్ప మిగతా పంట పూర్తిగా ఎండిపోయింది. మరో రెండు తడులు పెడితే పంట చేతికి వచ్చేది. పంటసాగు కోసం రూ. 60వేలు ఖర్చు చేసినట్లు రైతు ముత్యాలు వాపోయారు. చేసిన అప్పు ఎలా కట్టాలో పాలుపోవడం లేదని కంటతడి పెట్టుకుంటున్నారు. జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాలకు చెందిన రైతు కొంగల రామలింగం నాలుగెకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగుచేశారు. రెండు బోర్ల సహాయంతో మొక్కజొన్నకు నీరు అందిస్తున్నారు. ఇప్పటి వరకు పంట పెట్టుబడిగా రూ.50 వేలు వెచ్చించారు. కంకి పట్టే దశలో ఒక్కసారిగా బోర్లలో నీటిమట్టం పడిపోయింది. దీనికి తోడు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా చేతికందే మొక్కజొన్న పంట కళ్లెదుటే ఎండటంతో విధిలేక పశువులకు మేతగా వదిలిపెట్టారు. మూడు నెలల కష్టంతో పాటు సాగు వ్యయం భూమిలో కలిసిపోయింది. పెట్టుబడి పెట్టిన డబ్బు అప్పుగా మిగిలింది. గట్టు మండల కేంద్రానికి చెందిన రైతు కుర్వ వీరన్నకు 15 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. 3 కి.మీ. దూరంలో ఉన్న నెట్టెంపాడు ప్రాజెక్టులోని ర్యాలంపాడు కాల్వ నుంచి తన పొలానికి 450 పైపులు వేసుకుని పంటసాగు చేస్తున్నారు. అయితే ఏప్రిల్ వరకు నీటిని అందిస్తామని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలను నమ్మిన ఈ రైతు.. యాసంగిలో రూ. 3.36లక్షల పెట్టుబడి పెట్టి పదెకరాల్లో వేరుశనగ సాగుచేశారు. రెండున్నర నెలల తర్వాత నీటి తడులకు ఇబ్బందికరంగా మారడంతో 10 ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంటను వదిలేశారు. గతేడాది యాసంగి పంటలకు నీళ్లు రావని చెప్పడంతో సాగుచేయలేదని.. ఈసారి ఏప్రిల్ వరకు నీరందిస్తామని చెప్పడంతో పంటసాగు చేసి, తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిదని రైతు కుర్వ వీరన్న వాపోయారు. గట్టు శివారులో నీరు లేక ఎండిన పొగాకు పంటను మేస్తున్న గొర్రెలు హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన రైతు బోయిని అంజిలయ్య ఎకరన్నర పొలంలో వరిసాగు చేశారు. వరినాట్లు, కలుపు నివారణ, క్రిమిసంహారక మందులకు మొత్తం రూ. 40వేలకు పైగా ఖర్చు పెట్టారు. వేసవి ప్రారంభంలోనే బోరులో పూర్తిగా నీరు అడుగంటడంతో పొట్ట దశలో ఉన్న పంటకు నీరు లేక పశువులకు మేతగా వదిలేశారు. యాసంగిలో వరిసాగుతో రూ. 1.40లక్షలు నష్టపోవాల్సి వచ్చిందని రైతు అంజిలయ్య ఆవేదన చెందుతున్నారు. ఖిల్లాఘనపురం మండలం గట్టుకాడిపల్లికి చెందిన రైతు రాసుమళ్ల నాగరాజు దేవుడి పొలం మూడెకరాలు కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేశారు. ఇటీవల బోరుబావిలో నీరు తగ్గడంతో రెండెకరాల్లో పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా వదిలేశారు. పంటసాగు కోసం రూ.లక్ష వరకు ఖర్చయ్యాయని.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాల్వ నీరు అందుతుందనే ఆశతో రూ. 90వేల పెట్టుబడులు పెట్టి రెండెకరాల్లో వేరుశనగ, ఒక ఎకరంలో వరిపంట సాగుచేశా. అధికారులు, పాలకులు చెప్పినట్టుగా కేఎల్ఐ డీ–8 కాల్వ నుంచి మైనర్ కాల్వను తవ్వకపోవడం, ఉన్న బోరులో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో నీరు అందక సాగుచేసిన పంటలు ఎండిపోయి పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – కండ్యానాయక్, అన్నారంతండా, పాన్‌గల్ మండలం సంగంబండ రిజర్వాయర్ కుడి కాల్వపై ఆధారపడి నాలుగెకరాల్లో వరిసాగు చేశా. పంట చేతికివచ్చే సమయానికి కాల్వ నీరు అందకపోవడంతో పంట మొత్తం పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంటసాగు కోసం రూ. 1.20లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. పది రోజులుగా 800 మీటర్ల దూరం సాగునీరు తీసుకురావడానికి రూ. 30 వేలకు పైగా ఖర్చుచేసినా ఫలితం లేకుండాపోయింది. పంట పూర్తిగా ఎండిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – సురేష్, యువ రైతు, తాళంకేరి, మాగనూర్ మండలం నేను రెండున్నర ఎకరాల్లో వరిసాగు చేశా. ఇప్పటి వరకు రూ. 80వేల వరకు పెట్టుబడులు పెట్టాను. పంట పొట్టదశకు వచ్చే సమయంలో కాల్వ నీరు బంద్ కావడం, బోరు నీరు రాకపోవడంతో పంట మొత్తం ఎండింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – శంకరమ్మ, మహిళా రైతు, తాళంకేరి, మాగనూర్ మండలం ●యాసంగి సీజన్ ప్రారంభంలో బోరుబావిలో నీరు పుష్కలంగా ఉండటంతో నాలుగెకరాల్లో వరిపంట సాగుచేశా. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు నీరు రావడంలేదు. ఇప్పటికే రెండెకరాల్లో పంట పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు వదిలేశా. పంటసాగు కోసం రూ. 80వేల వరకు ఖర్చుచేశాను. – కె.శ్రీనివాస్‌రెడ్డి, రైతు, చొక్కన్నపల్లి, వెల్దండ మండలం బోరుబావులపై ఆధారపడి మూడెకరాల్లో వరిసాగు చేశా. ప్రస్తుతం బోరుబావుల్లో భూగర్భ జలాలు తగ్గడం, కరెంటు సక్రమంగా రాకపోవడంతో రెండెకరాల్లో పంట ఎండింది. రూ. లక్షకు పైగా పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట ఎండిపోతుంటే బాధగా ఉంది. కనీసం ఉన్న ఎకర పొలంలో అయినా పంట చేతికి వచ్చేలా లేదు. గోపాల్పేట మండలం బుద్ధారం శివారులో నేను పదెకరాల్లో వరిపంట సాగుచేశా. నెలరోజులుగా లోఓల్టేజీ సమస్య వేధిస్తోంది. అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదు. మోటార్లు కాలిపోతున్నాయి. 50 ఎకరాల పంట వరకు వారం రోజుల్లో ఎండిపోయే ప్రమాదం ఉంది. లోఓల్టేజీ సమస్య తీర్చాలి. –ఎర్ర లక్ష్మయ్య, రైతు, బుద్ధారం, గోపాల్పేట మండలం బోరుబావిలో ఉన్న నీటితో పంట పండించుకుందామని మూడెకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. పుప్పొడి దశలో ఉన్న పంటకు నీరందే పరిస్థితి లేక గొర్రెల మేతకు ఇచ్చాను. – మద్దిలేటి, రైతు, రామాపురం, వడ్డేపల్లి మండలం చివరి దశలో కాల్వ నీరు రాక.. కేఎల్ఐ కింద ఐదెకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. పంటను సాగుచేసే సమయంలో కేఎల్ఐ కాల్వ ద్వారా నీరు బాగానే వస్తుండేవి. పంట చేతికందే సమయంలో నెలరోజుల నుంచి కాల్వలో నీరు రావడం లేదు. దీంతో పంట పూర్తిగా ఎండిపోయింది. పంటసాగుకు దాదాపు రూ. 70వేలు ఖర్చు చేశాను. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. – కుర్ముల శ్రీనివాస్‌రెడ్డి, రైతు, చొక్కన్నపల్లి, వెల్దండ మండలం నీటి విడుదల సక్రమంగా ఉండాలి.. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా నీరు సక్రమంగా విడుదల చేస్తే పంటలు బాగా పండుతాయి. నీరు వస్తే పొలాలు మునిగేలా విడుదల చేస్తారు. లేకపోతే 20 రోజులైనా రావు. పంటలకు అవసరమైనప్పుడు నీటి తడులు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి తగ్గి నష్టపోయాం. – జమ్మన్న, ఆయకట్టు రైతు, పైపాడు, వడ్డేపల్లి మున్సిపాలిటీ ప్రభుత్వమే ఆదుకోవాలి.. అప్పులే మిగిలాయి.. కాల్వ నీరు అందక ఎండింది.. పశువులకు వదిలేశా.. లోఓల్టేజీ సమస్య వేధిస్తోంది.. ఉన్న పంట కూడా చేతికొచ్చేలా లేదు.. గొర్రెల మేతకు ఇచ్చా.. – రైతు టీక్యానాయక్, పెద్దగూడెంతండా, వనపర్తి మండలం -
యువకుడి బలవన్మరణం
మద్దూరు/కొత్తపల్లి: ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారని మనస్తాపానికి గురై ఓ యువకుడు పురుగుమందు తాగి మృతిచెందిన ఘటన కొత్తపల్లి మండలం గోకుల్‌నగర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కావలి సాయికుమార్ (22) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని అమ్మాయి తండ్రి రాములుకు చెప్పగా ఆయన మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 17న పొలంలో పురుగుమందు తాగాడు. చుట్టుపక్కల పొలాల రైతులు గుర్తించి వెంటనే జిల్లా ఆస్పత్రికి, అటు నుంచి మహబూబ్‌నగర్ ఎస్వీఎస్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం హైదరాబాద్ నిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తల్లి కావలి భీమమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ ఆదివారం వివరించారు. గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం నాగర్‌కర్నూల్ క్రైం: గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైన సంఘటన జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పతిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన సమాచారం మేరకు.. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెంది ఉండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జనరల్‌ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తిస్తే స్థానిక పోలిస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. -
గ్రామాల్లో శ్రీరామ ఉత్సవాలు నిర్వహించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: గ్రామ గ్రామన శ్రీరామ ఉత్సవాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు భోజనపల్లి నరసింహమూర్తి అన్నారు. జిల్లాకేంద్రం తెలంగాణ చౌరస్తాలోని శ్రీగణేష్ భవనంలో ఆదివారం జిల్లా వీహెచ్‌పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు ఈ ఏడాది ప్రత్యేకంగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామ కమిటీ ఉన్న ప్రతి చోట, నగరాలు, బస్తీల్లో ఈ రామోత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త దేవాలయాలను కేంద్రంగా చేసుకొని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పరిషత్‌ను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ మాట్లాడుతూ వీహెచ్‌పీ, బజరంగ్దళ్, దుర్గావాహిని మాతృమండలి కార్యకర్తలకు ఏప్రిల్, మే మాసంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ జిల్లా నూతన కార్యదర్శిగా నాగరాజును, అంతకుముందు కార్యదర్శిగా ఉన్న నలిగేశి లక్ష్మీనారాయణను విభాగ్ సహ కార్యదర్శిగా ప్రకటించారు. -
మహిళా శక్తి, ఉగాది పురస్కారాలు ప్రదానం
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్‌కు చెందిన ప్రమీల శక్తిపీఠం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని భారత్ స్కౌట్స్, గైడ్స్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప మాట్లాడుతూ మహిళలు పురుషులతో పోటీపడుతూ సాహిత్యరంగంలో చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణ సాహిత్య కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి మాట్లాడుతూ మహిళలు సాహిత్య సాంస్కృతిక సంస్థను స్థాపించి సాహిత్య కార్యక్రమాలు చేపడుతూ వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకు మహిళా శక్తి పురస్కారాలు, ప్రముఖ సాహితీవేత్తలకు ఉగాది పురస్కారాలు అందజేస్తుండటం అభినందనీయమని అన్నారు. పద్యకవి డాక్టర్ కె.బాలస్వామి రచించిన ‘నమో శిల్పి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజ సేవకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల, పద్య కవయిత్రి సుజాత, ప్రముఖ చిత్రకారిణి గుమ్మన్నగారి బాల సరస్వతిలకు మహిళాశక్తి పురస్కారాలు అందజేశారు. పటేల్ మాడ లక్ష్మిదేవమ్మ స్మారక పురస్కారాన్ని ప్రముఖ గాయని జి.చంద్రకళకు అందజేశారు. శ్రీవిశ్వావసునామ ఉగాది పురస్కారాలను డాక్టర్ నామోజు బాలాచారి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలరాజు యాదవ్, ప్రముఖ పద్యకవి డాక్టర్ బాలస్వామిలకు అందజేశారు. కార్యక్రమంలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, చుక్కాయపల్లి శ్రీదేవి, కవులు పాల్గొన్నారు. -
జలదోపిడీని ఆపాల్సి ఉంది
కల్వకుర్తి రూరల్: ప్రజాస్వామిక వాదులు, పెద్దలు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలసి వచ్చి జలదోపిడీని ఆపాల్సి ఉందని పాలమూరు అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవాచారి పిలుపునిచ్చారు. శనివారం కల్వకుర్తిలోని యూటీఎఫ్ భవనంలో జలదోపిడీపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. రాఘవాచారితో పాటు ఇరిగేషన్ నిపుణులు రవి హాజరయ్యారు. అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ వెంకట్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా నష్టపోయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నష్టపోతూనే ఉండడం బాధాకరమన్నారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక నీటి విషయంలో పాలమూరు జిల్లా రైతులకు అన్యాయానికి గురి చేశారని అన్నారు. ప్రస్తుతం పాలమూరు జిల్లాకు దక్కాల్సిన నీటివాటాను ప్రజల కళ్ల ఎదుటే నల్గొండ జిల్లాకు తరలించుకుపోతుంటే అడ్డగించాల్సిన 14మంది ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ఏమిటని రాఘవాచారి ప్రశ్నించారు. జిల్లాలో సాగునీరు లేక ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకుందామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ అన్యాయాన్ని ఆపాలన్నారు. సమావేశంలో సదానందంగౌడ్, ఆంజనేయులు, పరశురాముడు, బాబీ దే వ్, సీఐఐ పరశురాములు, అంజి, రాజేందర్, గోపా ల్, సైదులు, బాలయ్య, జంగయ్య పాల్గొన్నారు. -
చిచ్చుపెట్టిన స్నాక్స్
రాజాపూర్: అనుమతులేకుండా స్నాక్స్ తీసుకున్న విషయంపై ఇరువురు విద్యార్థినుల మధ్య గొడవకు కారణమైంది. క్షణికావేశానికి గురైన ఓ విద్యార్థిని మల్టీవిటయన్ మాత్రలు మింగి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. వివరాలు.. కేజీబీవీలో వైష్ణవి ఎనిమిది తరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం స్కూల్లోని స్టాక్‌రూంలో ఉన్న స్నాక్స్‌ను మరికొందరు విద్యార్థినులతో కలసి అనుమతి లేకుండా తీసుకుంది. ఇది గుర్తించిన 9వ తరగతి క్లాస్‌లీడర్ అనుమతి లేకుండా స్నాక్స్ ఎందుకు దొంగిలించారని మందలించింది. ఈక్రమంలో కొంత వాగ్వాదం కొనసాగటంతో 9వ తరగతి విద్యార్థినులు చేయిచేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురై అందుబాటులో ఉన్న ఐదు మల్టీ విటమిన్ మాత్రలను మింగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. గమనించిన సీఆర్టి వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌చేసి సమాచారమిచ్చి జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో విద్యార్తిని కోలుకుంటుంది. మాత్రలతో ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తేల్చారు. విద్యార్థిని ఘటన తెలియటంతో జీసీడీఓ రాధ, ఎంఈఓ సుధాకర్ ఆస్పత్రికి చేరుకొని వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు అందుబాటులో లేకపోవటంతో మేనమామ, నానమ్మ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థిని వద్ద ఉన్నారు. సీనియర్లతో గొడవ క్షణికావేశానికి లోనై విద్యార్థిని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం రాజాపూర్ కేజీబీవీలో ఘటన ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యులు -
భవన నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): భవన నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీ.వెంకటేశ్ అన్నారు. కర్యాదర్శి సి. వెంకటేశ్ అన్నారు. శనివారం స్థానిక సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఏకం కావాలని అన్నారు. మార్చి 25న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులు రాష్టంలో దేశంలో తీవ్ర ఇబ్బందులను ఎదురుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 25కోట్లకు పైగా, రాష్టంలో 30 లక్షలకు పైగా నిర్మాణ రంగా కార్మికులు జీవిస్తున్నారని తెలిపారు. అనంతరం మహాసభకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. భవన నిర్మాణ, ఇతర కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, రాజు, గోవర్ధన్, శేఖర్, ఆంజనేయులుపాల్గొన్నారు. -
భర్తను హత్య చేసిన భార్యకు రిమాండ్
మరికల్: భూమి అమ్మగా వచ్చిన డబ్బులు తనకు ఇవ్వలేదని భర్తను తాడుతో హత్య చేసిన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మరికల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. నర్వ మండలం లంకాలకి చెందిన పాలెం అంజన్న(41) నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి డిగ్రీ కళాశాలల్లో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 20న రాత్రి 7గంటల తర్వాత ఇంటికి వచ్చిన భర్త అంజన్నతో భార్య పాలెం రంగమ్మ పొలం విషయంలో గొడవ పడింది. భర్త పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని తనపేరు మీద చేయకుండా అమ్మేశాడు. అమ్మిన డబ్బులు తనకు ఇవ్వలేదని కోపంతో నిద్రిస్తున్న భర్తను అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో భర్త మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకొని నారాయణపేట కోర్టుకు రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు. నర్వ ఎస్ఐ కుర్మయ్య, తిరుపతిరెడ్డి, రఘు, అజయ్ పాల్గొన్నారు. -
నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడా కనుకొనేందుకు అధికార యంత్రాంగం సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది. గత నెల 22న దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మికులు అందులో చిక్కుకోగా ఈనెల 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ మృతదేహం గుర్తించారు. మిగిలిన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతుంది. ఇంత వరకు వారి అచూకీ లభ్యం కాకపోవడంతో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ1, డీ2 ప్రదేశాల్లో తవ్వకాలు మమ్మురం చేశారు. డాగ్స్ పసిగట్టిన ప్రదేశాల్లో 8 నుంచి 10 మీటర్ల పొడవున గోతులు తీస్తూ మట్టిన బయటికి పంపించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 మీటర్ల వద్దకు చేరుకోవాలంటే మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. కేరళ డాగ్స్ 14 కిలోమీటరు సొరంగం ముందు భాగం 30 మీటర్ల వద్ద కార్మికుల జాడ కనుకొన్నట్లు సమాచారం. అతి క్లిష్టమైన ప్రమాదకరమైన ప్రదేశంలోని మట్టి, రాళ్లు, బురద తొలగింపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తే.. మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీఎస్ఐ అధికారులు తేల్చినట్లు తెలిసింది. అయితే ఎంతో జాగ్రత్తగా సహాయక చర్యలు కొనసాగించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. సొరంగం ప్రమాదం జరిగిన చోట చివరి 20 మీటర్ల వద్ద తవ్వకాలు జరిపితే పైకప్పు కూలే అవకాశం ఉండటంతో సింగరేణి రెస్క్యూ బృందాలు టైగర్ కాగ్స్ టింబర్ సపోర్టు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మట్టి, రాళ్లు తొలగింపుతో పాటు కార్మికుల గాలింపు చర్యలు ఇంకా మొదలుకాలేదు. గల్లంతైన కార్మికుల అచూకీ కోసం 29 రోజులుగా గాలింపు ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు -
మోనేశ్వర ఆలయంలో చోరీ
మక్తల్: పట్టణంలోని రాయచూర్ రోడ్డు సమీపంలో ఉన్న మోనేశ్వర ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని విగ్రహమూర్తిని, దాదాపు 20 తులాల పంచలోహాల విగ్రహం, 5తులాల వెండి, 5తులాల వినాయకుడి విగ్రహం, హుండీతో పాటు మిగతా వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం దేవాలయంలో పూజలు చేసేందుకు పూజారి విష్ణుమూర్తి ఆలయం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లిచూసే సరికి వస్తువులు మాయమై ఉండటంతో చోరీ జరిగినట్లు కమిటీ సభ్యులకు తెలిపారు. హుండీని పక్కన పొలాల్లో పడేసి వెళ్లారు. మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి సమాచారం ఇవ్వగా ఆమె అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు చోరీ జరిగినట్లు మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానాస్పదవ్యక్తులపై నిఘా పెట్టాలి
మహబూబ్‌నగర్ క్రైం: పదో తరగతి పరీక్ష కేంద్రాల దగ్గర ఎలాంటి సమస్యలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలో భాగంగా శనివారం పోలీస్ లైన్ హైస్కూల్, అపెక్స్, తక్షశిల ఉన్నత పాఠశాలను ఎస్పీ పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరగడానికి ఎస్పీ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ట్రాఫిక్ కట్టడి చేయాలని విద్యార్థుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కేంద్రంలోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఏఎన్ఎం సిబ్బంది, పాఠశాల సిబ్బంది కూడా ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. మహిళ పోలీస్ సిబ్బంది అమ్మాయిలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో పోలీసులు తప్పక విధుల్లో ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ట్రాఫిక్‌సీఐ భగవంతురెడ్డి పాల్గొన్నారు. 35 మంది గైర్హాజరు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదోతరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 60 పరీక్ష కేంద్రాల్లో 12,771 మంది విద్యార్థులకు 12,736 మంది పరీక్షకు హాజరై 35 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ విజయేందిర రెండు, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఒకటి, డీఈఓ ఒకటి, అసిస్టెంట్ కమిషనర్ మూడు, ఫ్లయింగ్ స్క్వాడ్ 26, అబ్జర్వర్ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సింథటిక్ మ్యాట్లు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడాశాఖకు శనివారం కబడ్డీ సింథటిక్ మ్యాట్లు చేరాయి. 35ఎంఎం సైజు గల 300 మ్యాట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఒక కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ కబడ్డీ సింథటిక్ మ్యాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ సింథటిక్ ట్రాక్‌లు పంపించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి కృషితో జిల్లాకు కబడ్డీ సింథటిక్ మ్యాట్లు వచ్చినట్లు తెలిపారు. కబడ్డీ మ్యాట్‌పై ప్రాక్టీస్ చేయడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. కల్తీ ఆహారం అందిస్తే చర్యలు తప్పవు జడ్చర్ల: హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని కల్తీ ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రత ఆధికారి మనోజ్ హెచ్చరించారు. శనివారం జడ్చర్లలోని ఓ ఫుడ్ కోర్టును ఆయన తనిఖీ చేశారు. శుక్రవారం ఫుడ్‌కోర్టులో బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక వచ్చిందటూ ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయగా శనివారం విచారణ చేపట్టారు. హోటల్లో ఆహార పదార్థాలు, శుభ్రత, తదితర పారిశుద్ధ్యంపై విచారించారు. మటన్ బిర్యానీ, ముడి పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ పరీక్షలలో కల్తీ తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోటళ్లలో నిబంధనల మేరకు వ్యవహరించాలని, వంటశాలలో శుభ్రత పాటించాలనితెలిపారు. -
టీడీసీఏ, ఏవైసీఏ క్రికెట్ టోర్నీకి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఈనెల 24 నుంచి 31 వరకు శంషాబాద్ తొండుపల్లిలో జరిగే తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (రూరల్), అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ అండర్–17 క్రికెట్ టోర్నమెంట్‌కు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంపికై నట్లు టీడీసీఏ ఉమ్మడి జిల్లా కన్వీనర్ నవీన్‌కుమార్ వెల్లడించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బ్రదర్హుడ్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అండర్–17 క్రికెట్ టోర్నీకి మహ్మద్ సోహైల్ (షాద్‌నగర్), దక్ష్ పాటిల్ (మహబూబ్‌నగర్), విరాట్‌కుమార్ (భూత్పూర్), సంజునాయక్ (అచ్చంపేట) రవితేజ (వనపర్తి) ఎంపిరైనట్లు తెలిపారు. వీరు టీడీసీఏ రూరల్ వారియర్స్ జట్టు తరపన అమెరికన్ జట్టుతో తలపడుతారన్నారు. టీడీసీఏ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 24న శంషాబాద్ మండలం తొండుపల్లిలోని ఎంపీఎస్ మైదానంలో అండర్–17 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, 31న జరిగే ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. టీడీసీఏ రూరల్ వారియర్స్ జట్టు మేనేజర్‌గా శ్రీనివాస్‌రెడ్డి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్రదర్హుడ్ క్రికెట్ అకాడమీ కోచ్ ఎండి.రియాజుద్దీన్, టీడీసీఏ సభ్యులు నవాజ్‌షా, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
మిగిలింది 8 రోజులే..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని పాలమూరు నగరంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ పట్టణాల్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజు అంతంత మాత్రంగానే వసూలవుతోంది. వాస్తవానికి నగరాలు, పట్టణాల్లో ఎక్కడైనా ఏదైనా వ్యాపారం నిర్వహించాలంటే నిర్ణీత రుసుం (ఫీజు) చెల్లించి స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటేటా రెన్యూవల్ చేసుకోవడం తప్పనిసరి. ఎవరికి వారు ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత అధికారులు సర్టిఫికెట్ అందజేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి సరళీకృత విధానం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లకుండానే ఈ ప్రక్రియ మొత్తం మీ–సేవ ద్వారా నేరుగా పూర్తి చేయవచ్చు. కాగా, జిల్లా కేంద్రంలో 15 వేలకు పైగా వివిధ వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఆన్లైన్లో ఐదు వేల లోపు మాత్రమే నమోదు కావడం గమనార్హం. వీటి తనిఖీ, పర్యవేక్షణ బాధ్యతలను మున్సిపాలిటీలోని శానిటేషన్ ఇన్స్పెక్టర్లు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీరితో పాటు జవాన్లు సైతం ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం ఎనిమిది రోజులే గడువు ఉంది. వీరు వసూళ్ల లక్ష్యానికి ఎంతో దూరంలో ఉండటం గమనార్హం. కొత్త విధానం.. వసూళ్లపై ప్రభావం కొత్త సరళీకృత విధానం అమలులోకి వచ్చాక ఏటా ట్రేడ్‌లైసెన్సు వసూళ్లపై ప్రభావం పడింది. ముఖ్యంగా రెన్యూవల్ చేసుకోవడానికి 11 నెలల ముందుగానే ఏడాదికి సంబంధించిన మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఆయా సంస్థల యజమానులు, నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయిలో మున్సిపాలిటీలకు ఆదాయం రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సంవత్సరం ముగిసే మూడు నెలల ముందు నుంచి ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తోంది. ● మహబూబ్‌నగర్ నగరంలో 2024–25కు 4,779 సంస్థల నుంచి రూ.82.40 లక్షలు, జరిమానా కింద రూ.23.67 లక్షలతో పాటు పాత బకాయిలు రూ.82.43 లక్షలు, వీటి జరిమానా రూ.41.17 లక్షలు కలిపి మొత్తం రూ.2,29,67,000 రావాలి. అయితే ఇప్పటివరకు 1,538 సంస్థల నుంచి రూ.49.93 లక్షలు, జరిమానా కింద రూ.7.50 లక్షలు, పాత బకాయిల కింద రూ.11.94 లక్షలు, వీటికి సంబంధించి జరిమానా రూ.5.97 లక్షలు కలిపి మొత్తం రూ.75.34 లక్షలు (32.81 శాతం) మాత్రమే వచ్చింది. ఇంకా 3,241 సంస్థల నుంచి రూ.32.47 లక్షలు, జరిమానా కింద రూ.16.17 లక్షలు, పాత బకాయిలు రూ.70.49 లక్షలు, వీటికి సంబంధించి జరిమానా రూ.35.20 లక్షలు కలిపి మొత్తం రూ.1,54,33,000 పెండింగ్‌లోనే ఉంది. ● ఇక 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 4,777 సంస్థలు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండగా.. ఇందు లో ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ.84.76 లక్షలు, జరిమా నా కింద రూ.51.23 లక్షలు, పాత బకాయిల కింద రూ.1.05 కోట్లు కలిపి మొత్తం రూ.2,40,82,000 రావచ్చని మున్సిపల్ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 263 సంస్థల నుంచి ఫీజు రూ.20.26 లక్షలు, జరిమానా కింద రూ.1.28 లక్ష లు, పాత బకాయిల కింద రూ.2.59 లక్షలు కలిపి మొత్తం రూ.24.13లక్షలు మాత్రమే (10.02శాతం) వసూలైంది. ఇంకా 4,514 సంస్థల నుంచి ట్రేడ్‌లైసెన్స్ ఫీజు రూ.64.50 లక్షలు, జరిమానా కింద రూ.49.95 లక్షలు, పాత బకాయిలు రూ.1,02,25,000 కలిపి మొత్తం రూ.2,16,70,000 రావాల్సి ఉంది. సాధ్యమైనంత మేరకు వసూలు నగరంలోని వివిధ సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు రాబట్టడానికి క్షేత్రస్థాయిలో శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది తిరుగుతున్నారు. గడువు దగ్గరపడుతున్నందున ఈ వసూళ్లలో వేగం పెంచుతున్నాం. సాధ్యమైనంత మేరకు లక్ష్యం చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. – డి.మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్‌నగర్ ట్రేడ్‌లైసెన్స్ ఫీజు వసూలు అంతంతే మహబూబ్‌నగర్ నగరంలో 32.81 శాతమే రెన్యూవల్ కింద వచ్చింది 10.02 శాతమే -
నేడు మహిళా శక్తి పురస్కారాలు ప్రదానం
టీబీ విభాగంలో పాలమూరుకు మొదటి బహుమతి రాష్ట్ర స్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమసేవలు అందించినందుకు 2024 ఏడాదికి మహబూబ్‌నగర్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రిజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతులమీదుగా డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. – పాలమూరు -
పాము కాటుకు మహిళ బలి
మరికల్: పాము కాటుకు మహిళ మృతిచెందిన ఘటన శనివారం గాజులయ్యతండాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గాజులయ్యతండాకు చెందిన డేగవత్ లక్ష్మి పొయ్యి కట్టెల కోసం పొలానికి వెళ్లింది. కట్టెలు కొడుతుండగా ముళ్లపొదలో ఉన్న పాము కాటేసింది. ఆమె ఆజాగ్రత కారణంగా కొద్ది సమయానికి నోట్లో నుంచి నురుగులు వచ్చి అక్కడిక్కడే మృతిచెందింది. సాయంత్రం గమనించిన చుట్టుపక్కల రైతులు ఈవిషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దిక్కుముక్కు లేని ఈ కుటుంబంలో తల్లి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. గ్రామస్తులు చందాలు వసూలుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. భవనంపై నుంచి కిందపడి కార్మికుడు మృతి మహబూబ్‌నగర్ క్రైం: నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నుంచి పడి ఓ కార్మి కుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. గాజులపేటకు చెందిన రమేష్(42) జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న రెండవ అంతస్తు భవనంలో శుక్రవారం సెంట్రింగ్ బాక్స్ పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళుతున్న సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట కొంత సేపు ఆందోళన చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో యువకడి బలవన్మరణం కోడేరు: ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘ టన నాగర్‌కర్నూల్ జి ల్లా కోడేరు మండల కేంద్రంలో చోటు చే సుకున్నట్లు ఎస్ఐ గోకారి తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన మహే్ ష (30)కు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామశివారులో ఓ చింత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు చూసి కుటుంబీకులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య పుష్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సంపులో పడి మహిళ మృతి కల్వకుర్తి టౌన్: ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న సంపులో పడి ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సుభాష్‌నగర్ కాలనీకి చెందిన బాలకిష్టమ్మ(49) తన కొడుకుతో కలిసి నిర్మల విద్యాలయం దగ్గర నివాసం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు జారి నీటి సంపులో పడింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే బయటకు తీశారు. ఆమె అప్పటికే మృతిచెందింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు ఆత్మకూర్: మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఓ బాలికతో అదే ప్రాంతానికి చెందిన దండు రవి అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రవిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వనపర్తి కోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారు. -
అజిలాపూర్ లిఫ్ట్‌కు రూ.32.05 కోట్లు మంజూరు
దేవరకద్ర: మండలంలోని అజిలాపూర్ లిఫ్ట్‌కు రూ. 32.05 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి జీఓ కాపీని అందజేశారు. ఈ సందర్బంగా మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీ నిలబెట్టుకున్నాం.. ఎన్నికల సందర్బంగా అడవి అజిలాపూర్కి సాగునీటిని అందిస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న అడవి అజిలాపూర్‌కు సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం చూసి సాగునీటిని గ్రామానికి తీసుకువస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అజిలాపూర్ ఎత్తిపోతలతో గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్నారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు. -
జల వనరులను సంరక్షించుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జల వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ జలవనరుల దినోత్సవం 2025 సందర్భంగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యజీవితంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, భూగర్భజలాలు తగ్గడంతో పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్య వస్తుందన్నారు. పూర్వం రాజ్యాధికారం, సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు జరిగేవని, రానున్న రోజుల్లో నీటికోసం యుద్ధాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. భూగర్భ, ఉపరితల జలంను గృహ, వ్యవసాయ, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు మితిమీరి వాడడం వల్ల భూగర్భ జలమట్టం తగ్గిపోవటానికి కారణం అన్నారు. చెరువులు, కుంటలు నుంచి నీటిని తోడేయడం, ఆటోమేటిక్ స్టార్టర్లు వినియోగంతో నీటి వృథా జరుగుతుందన్నారు. నాటిన మొక్కలు సంరక్షించాలని, ప్రతి ఏడాది పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో ల్యాండ్ స్కేపింగ్‌తో పచ్చదనం పెంపొందించేలా మొక్కలు పెంచాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ భూగర్భజలాలు ప్రాధాన్యత గురించి వివరించారు. జిల్లాలో బాలానగర్, మిడ్జిల్, నవాబ్‌పేట, రాజాపూర్ ప్రాంతాల్లో భూగర్భ జలాల వెలికితీత అధికస్థాయిలో ఉందని తెలిపారు. టీజీ వాల్టా 2002 సెక్షన్ 8, సబ్ సెక్షన్ (2) ప్రకారం భూగర్భజల వనరులకు సంబంధించి బోర్లు వేసేందుకు ప్రతి వ్యవసాయ, గృహ యజమాని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇందుకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్‌కి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం ప్రపంచ జలవనరుల దినోత్సవం 2025 బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో నీటి సంరక్షణ స్థిరమైన నీటి నిర్వహణలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులు, పాఠశాలలు మరియు కమ్యూనిటీ సమూహాలను గుర్తించి కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో భూగర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, డీఆర్డీఓ నర్సింహులు, డీఎఫ్ఓ సత్యనారాయణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి వేణుగోపాల్, డీపీఆర్ఓ శ్రీనివాస్, భూగర్భ జలశాఖ జియాలజిస్ట్‌లు లావణ్య, ధీరజ్ కుమార్, ద్వారకానాథ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. భవిష్యత్‌లో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం అవసరాలకు మించి వాడడం వల్లే భూగర్భ జలాల తగ్గుదల కలెక్టర్ విజయేందిర బోయి -
జనరల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
మహబూబ్‌నగర్ క్రైం: వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థికి జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇవ్వడం వల్లే శ్వాసలో ఇబ్బంది ఏర్పడి మృతి చెందాడని కుటుంబసభ్యులు, స్నేహితులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు అధికంగా రావడంతో కొంత సమయం ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తంగా మారింది. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. జడ్చర్లకు చెందిన రవీంద్ర(23) విద్యార్థి వ్యక్తిగత కారణాల వల్ల శుక్రవారం 11 డోలో 650 ట్యాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబసభ్యులు చికిత్స కోసం అదేరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో మృతి చెందాడు. చికిత్స చేస్తున్న క్రమంలో అతనికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యసిబ్బంది బయటకు రాసి ఇవ్వగా.. తీసుకొచ్చి ఇంజక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆ ఇంజక్షన్ వికటించడం వల్లే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడి మృతి చెందాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న రవీంద్ర స్నేహితులు, బంధువులు భారీస్థాయిలో ఆస్పత్రి దగ్గర చేరారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్తో పాటు వన్‌టౌన్ సీఐ అప్పయ్య ఇతర పోలీసులు ఆస్పత్రికి చేరుకుని గొడవ చేస్తున్న యువకులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రవీంద్ర మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, పోస్టుమార్టం తర్వాత మరణంపై అన్ని రకాల విషయాలు తెలుస్తాయని దాని ప్రకారం విచారణ పూర్తి చేస్తామని ఆర్ఎంఓ డాక్టర్ సమత వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చికిత్సపొందుతూ మృతి.. వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు ఇంజక్షన్ మార్చి ఇవ్వడం వల్లే చనిపోయాడని ఆస్పత్రి ఎదుట ఆందోళన ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ చేయిస్తాం: సూపరింటెండెంట్ -
కొలిక్కిరాని డీఎల్ఐ భూ పరిహారం పంపిణీ
చారకొండ: మండలంలోని డిండి– నార్లాపూర్ లిప్టు ఇరిగేషన్లో భూములు కోల్పోతున్న సిర్సనగండ్ల ఆలయ భూమి, కొన్నేళ్లుగా సాగు చేస్తున్న రైతులు ఎవరికి భూ పరిహారం అందించాలని విషయమై శుక్రవారం మండలంలోని కమాల్పూర్లో కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా కొలిక్కి రాలేదు. కమాల్‌పూర్ శివారులో సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించి 51.32 ఎకరాల భూమి కాల్వ నిర్మాణంలో కోల్పోతుంది. దీంతో ప్రభుత్వం భూ పరిహారం కింద ఎకరాకు రూ.5.30 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ పరిహారం పంపిణీపై శుక్రవారం గ్రామసభలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గత కొన్నేళ్లుగా భూములు నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకే పరిహారం దక్కాలని కమాల్‌పూర్ రైతులు వేడుకున్నారు. అయితే భూ పట్టాలు తమ పేరిట ఉన్నందున దేవాదాయ శాఖకు పరిహారం చెల్లించాలని దేవాదాయ శాఖ అధికారులు పట్టుబట్టారు. దేవాలయ భూములు ఉన్న అభివృద్ధి చెందలేదని వారు పేర్కొన్నారు. దీంతో ఆర్డీఓ శ్రీను మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో రైతులు ఏ సర్వే నంబర్లో ఎంత పొలం సాగు చేస్తున్నారు.. తదితర వివరాలపై తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డి, దేవాదాయ తహసీల్దార్ గిరిధర్, ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, డీఎల్ఐ ఏఈ సుభాషిణి, ఆర్ఐ భరత్‌గౌడ్, కార్యదర్శి రవి పాల్గొన్నారు. -
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
మల్దకల్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన శుక్రవారం మండలంలోని చర్లగార్లపాడులో చోటుచేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాలు.. చర్లగార్లపాడుకి చెందిన ఈరమ్మ భర్త నర్సింహులకు ఇద్దరు సంతానం. వారికి ఉన్న కొద్ది పాటి వ్యవసాయ పొలంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఈరమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి ● భార్యే చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి అక్క నర్వ: మండలంలోని లంకాల్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు ఎస్ఐ కురుమయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన పాలెం అంజన్న (41)కు 17 ఏళ్ల కిందట మక్తల్ మండలం కర్నికి చెందిన రంగమ్మతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అంజన్న నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో అటెండర్‌గా విధులు నిర్వర్తించేవాడు. అంజన్న ఇటీవల తన పేరున ఉన్న భూమిలో కొంతభాగాన్ని దాయాదులకు పట్టా చేయడంతో భార్య తరచూ గొడవ పడేది. అలాగే కొంత భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇవ్వాలని, మిగిలిన భూమిని తన పేరున పట్టా చేయాలంటూ వేధించేది. అంజన్న మృతిచెందినట్లు గ్రామస్తులు శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అక్క దుప్పల్లి పద్మమ్మకు సమాచారం అందించారు. ఆమె వచ్చి చూడగా మెడ చుట్టూ తాడు బిగించి చంపినట్లు కందిన గాయాలు కనిపించడంతో తమ్ముడి మృతిపై అనుమానం ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్క ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. ఫ అంజన్న మృతిపై నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. మెర్సీ వసంత, జూనియర్ అసిస్టెంట్ రంగారెడ్డి, సూపరింటెండెంట్ జయపాల్, ఇతర సిబ్బంది నివాళులు అర్పించారు. వ్యక్తి బలవన్మరణం బిజినేపల్లి: మండలంలోని మంగనూర్‌కు చెందిన దాసరి చిన్నయ్య (32) గురువారం రాత్రి గ్రామంలోని ఓ రైస్‌మిల్లు వద్ద నిలిపిన డీసీఎం వాహనానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రెండో ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. చిన్నయ్య డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తుండేవాడని.. కొద్దిరోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. చిన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ మృతదేహం లభ్యం వెల్దండ: మండలంలోని రాఘాయపల్లి సమీపం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైందని ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందినట్లు వివరించారు. వయోలెట్ రంగు నైటీ ధరించిందని.. మతిస్థిమితం సరిగా లేక భిక్షాటన చేసే మహిళ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పెద్దాపూర్ కార్యదర్శి సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 87126 57756, 87126 61808, 87126 57755 సంప్రదించాలని సూచించారు. కేసరి సముద్రంలో వ్యక్తి మృతదేహం.. నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ గోవర్ధన్ వివరించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మరిన్ని వివరాలకు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. రైలు కిందపడి మహిళ ఆత్మహత్య మహబూబ్‌నగర్ క్రైం: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్ బ్రిడ్జి కింద శుక్రవారం గుర్తు తెలియని మహిళ(40) రైలు కిందపడటంతో శరీరం రెండు ముక్కలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న అన్వేషణ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో 28వ రోజు శుక్రవారం సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినా ఏడుగురు కార్మికుల జాడ లభించలేదు. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న టీబీఎం యంత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అల్ట్రా థర్మల్ కట్టర్స్‌తో తొలగిస్తున్నారు. తవ్వకాలకు అడ్డుగా వస్తున్న బండరాళ్లును ఇటాచీలతో తొలగించి లోకో రైలులో బయటకు తరలిస్తున్నారు. నీటి ఊట, బురదను వాటర్ జెట్‌తో, మట్టిని కన్వేయర్ బెల్టుపై తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. కార్మికుల ఆచూకీ కోసం డి–1 పాయింట్ వద్ద తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అందుబాటులోకి రాని రోబోల సేవలు.. 40 మీటర్ల అత్యంత ప్రమాద ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఈ నెల 11న రోబోలు సొరంగం వద్దకు చేరుకున్నా.. ఇప్పటి వరకు వాటి సేవలు అందుబాటులోకి రాలేదు. పదిరోజులు దాటినా ఇంతవరకు సొరంగం లోపలికి వెళ్లలేదు. సొరంగంలో హైడ్రాలిక్ రోబో పనిచేయాలంటే టీబీఎం శకలాలు పూర్తిగా తొలగించాల్సి ఉంది. హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసే రోబో ముందు భాగంలో ఉన్న గ్రైండర్ పెద్దపెద్ద రాళ్లు, శిథిలాలను ముక్కులుగా చేయడంతో పాటు బురదను వాక్యూమ్ పంపు సాయంతో నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తోంది. అయితే టీబీఎం భాగాలు (ఇనుపరాడ్లు) అడ్డు రావడంతో రోబో సేవలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. టీబీఎం భాగాలు తొలగిస్తున్నారు.. సొరంగంలోని డి–1, డి–2 ప్రదేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, వికాస్‌సింగ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి డా. హరీశ్, సింగరేణి రెస్క్యూ జీఎం బైద్యతో సొరంగంలో కొనసాగతున్న సహాయక చర్యల పురోగతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రోజువారీగా టీబీఎం భాగాలు కత్తిరించి బయటకు పంపిస్తున్నామని.. నీటి ఊటను డీవాటరింగ్ చేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు. అధునాతన యంత్రాలతో నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామని, ఉన్నతాధికారులు సహాయక బృందాల సేవలను పర్యవేక్షిస్తూ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. 28వ రోజుకు చేరిన సహాయక చర్యలు కార్మికుల జాడ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు -
కల్వకుర్తిలో చోరీ
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని తిలక్‌నగర్ కాలనీలో ఇంట్లో దొంగలు పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి, బాధితులు తెలిపిన వివరాలు.. తిలక్‌నగర్ కాలనీలో నివాసముండే శ్రీను తన బంధువుల ఇంటికి కుటుంబంతో కలిసి గురువారం ఉదయం వెళ్లాడు. శుక్రవారం ఉదయాన్నే ఇంటికి తిరిగివచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలికి చేరుకున్న ఎస్ఐ, క్లూస్ టీం సిబ్బందితో క్లూస్ సేకరించారు. ఇంట్లో మూడు తులాల బంగారం, 40 తులాల వెండి, సుమారు రూ.లక్ష నగదు చోరీ జరిగినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం మన్ననూర్: మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రజిత కథనం ప్రకారం.. కొల్లాపూర్‌కు చెందిన ఎత్తం మల్లయ్య మన్ననూర్‌లో ఓ వ్యక్తి వద్ద కొంతకాలంగా నెల వేతనానికి పనులు చేస్తున్నాడు. చేసిన కష్టానికి తగిన జీతం ఇవ్వడం లేదని మద్యం తాగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చెప్పాడు. ఎస్ఐ ఉద యం రావాలని సూచించగా.. క్షణికావేశానికి లో నై పోలీస్‌స్టేషన్ బయట రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు, పోలీసులు అతడిని కాపాడారు. -
కూలీ కోసం వెళ్తే.. కాటికి పంపారు
మక్తల్: బతుకుదెరువు కోసం కరెంట్ (కూలీ) పనులు చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన సిరిపే మహేష్(23) అదే గ్రామానికి చెందిన చిన్న వెంకటేష్‌తో కలిసి కరెంట్ పనులు చేసేందుకు కూలీగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కర్ని గ్రామ శివారులోని ఎర్సాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతుల పొలాలకు కొత్తగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ చిన్న వెంకటేష్ సంబంధిత లైన్‌మేన్ లింగప్పకు చెప్పగా కరెంట్ నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా కరెంట్ సరఫరా కావడంతో విద్యుత్ స్తంభంపై వైర్లు సరిచేస్తున్న సిరిపె మహేష్ ఒక్కసారిగా షాక్‌కు గురై స్తంభంపైనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వెంటనే కూలీలు లైన్‌మేన్ లింగప్పకు సమాచారం అందించడంతో లైన్‌మేన్ లింగప్ప కర్ని సబ్‌స్టేషన్‌కు వద్దకు చేరుకొని ఆపరేటర్ లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నీదంటే నీది తప్పంటూ వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా లైన్మెన్ లింగప్ప మరో వ్యక్తితో వీడియో తీయించి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేసి.. తన తప్పు లేదని కప్పిపుచ్చుకునేందుకు ఇలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత లైన్‌మేన్, ఆపరేటర్ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుని ఇద్దరూ పరారయ్యారు. అయితే ఆపరేటర్ లక్ష్మణ్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కుటుంబీకుల ఆందోళన సమాచారం తెలుసుకున్న సిరపె మహేష్ తల్లిదండ్రులు పోలప్ప, భీమమ్మతో పాటు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మహేష్ మృతికి లైన్‌మేన్ లింగప్ప, ఆపరేటర్ లక్ష్మణ్ కారణమని ఆరోపిస్తూ కర్ని సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం మృతదేహంతో మక్తల్‌కు చేరుకుని అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి అక్కడికి చేరుకొని కుటుంబీకులకు నచ్చజెప్పి మృతదేహాన్ని స్థానిక సబ్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లేలా ఒప్పించారు. అక్కడ విద్యుత్ శాఖ డీఈ నర్సింగ్‌రావు, ఏడీ జగన్మోహన్, ఏఈ రామకృష్ణ తదితరులు వచ్చి మహేష్ బంధువులతో చర్చలు జరపగా పరిహారంగా రూ.8 లక్షలు అందజేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం మహేష్ మృతదేహాన్ని మక్తల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. లైన్‌మేన్, ఆపరేటర్ నిర్లక్ష్యంతో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి నారాయణపేట జిల్లా ఎర్సాన్పల్లిలో ఘటన -
రుణాల పేరిట ఘరానా మోసం
గద్వాల క్రైం: ప్రైవేట్ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకే వ్యవసాయ, ఇంటి నిర్మాణం, వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తామని ఓ నకిలీ ఏజెంట్ పలువురి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కాజేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి బాధితులు, బ్యాంకు సిబ్బంది కథనం ప్రకారం.. గద్వాల మండలంకు చెందిన ఓ నకిలీ ఏజెంట్ గద్వాల, గట్టు తదితర గ్రామాలకు చెందిన రైతులు, గృహ నిర్మాణం, వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకే ఇపిస్తామని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే రుణాలు మంజూరు కోసం ఏజెంట్ బాధితుల నుంచి రూ.1–4 లక్షల వరకు వివిధ డాక్యుమెంట్ ఖర్చులు, రుణం మంజూరు చేసే వారికి ఇవ్వాల్సి ఉంటుందని గతేడాది వసూలు చేశాడు. బాధితులకు రుణం రూ.35 లక్షలు మంజూరైనట్లు నకిలీ పత్రాలను అందజేసి.. త్వరలోనే వ్యక్తిగత ఖాతాలో జమ అవుతుందని నమ్మించారు. అయితే నెలలు గడిచినా డబ్బులు జమ కాకపోవడంతో బాధితులు కర్నూలులోని సదరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బందితో మాట్లాడారు. రుణాలు మంజూరు చేసిన పత్రాలను చూయించగా నకిలీవి అని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించి గద్వాల పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నకిలీ రుణాలు మంజూరు చేసిన పత్రాలు సదరు ప్రైవేట్ బ్యాంకు పేరుతో ఉండడంతో సదరు బ్యాంకు సిబ్బంది సైతం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పట్టణ ఎస్ఐ కల్యాణ్‌కుమార్ మాట్లాడుతూ బాధితులు, బ్యాంకు సిబ్బంది జరిగిన సంఘటన తమ దృష్టికి తెచ్చారని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామన్నారు. -
బెట్టింగ్ భూతం
నేటి నుంచే ఐపీఎల్ ● నిత్యం కోట్లల్లో చేతులు మారే అవకాశం ● పాలమూరులో పెట్రోల్ వ్యాపారంచేసే వ్యక్తి పెద్ద బుకీ ● అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్న యువకులు సాంకేతిక పరిజ్ఞానం అండగా.. ఈసారి బెట్టింగ్ సాంకేతికంగా దూసుకుపోతుందని సమాచారం. వాట్సప్లాంటి సామాజిక మాధ్యమాలతో పాటు యాప్‌లను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ నిర్వాహకులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని రూ. లక్షల్లో వ్యాపార సామ్రాజ్యానికి తెరలేపుతున్నారు. గతంలో కేవలం మహానగరాలకే పరిమితమై పరిజ్ఞానాన్ని నిర్వాహకులు ఇక్కడ వాడుకుంటున్నారు. ప్రధానంగా యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని బుకీలు దందాను కొనసాగిస్తున్నారు. వాట్సప్‌లో రూ.3వేలు వెచ్చించి ఒక లైన్ తీసుకుంటున్నారు. దాని ద్వారా మ్యాచ్ స్థితిగతులు బుకీలకు తెలుస్తుంటాయి. టాస్ వేసిన క్షణం నుంచి చివరి బంతి వరకు బెట్టింగ్ స్వరూపాలు మారుతుంటాయి.. కొందరు మ్యాచ్ ఒడిపోతుందనే సందర్భం కన్పిస్తుంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చి వేరే జట్టుకు మార్చుకుంటారు. ఇలా చేయడం వల్ల నిర్వాహకులకు అధిక లాభాలు ఉంటాయి. రేటింగ్ ఎక్కువ ఉన్న జట్టును తీసుకుంటే రూ.10వేలకు రూ.15వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బెట్టింగ్‌లో ఒడిపోయిన వారి దగ్గర మరసటి రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి డబ్బు తీసుకొని వెళ్లి లైన్లో పెడుతుంటాడు. ఇది నిత్యం జరుగుతున్న తీరు. మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో బెట్టింగ్ భూతం జడలు విప్పుతోంది. బెట్టింగ్ యాప్‌లే కాకుండా, ఐపీఎల్ బెట్టింగ్‌కు అలవాటుపడిన యువత లక్షల్లో నష్టపోతున్నారు. ఇటీవల బాలానగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బెట్టింగ్ చేయడానికి సమీప బంధువు ఖాతాల్లో ఉన్న రూ.24లక్షలు దశల వారీగా ఖాతాలో నుంచి విత్‌డ్రా చేశాడు. ఈ యువకుడిపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలో జరిగిన మరో ఘటనలో లక్షల్లో అప్పులు కావడంతో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ● పాలమూరులో బెట్టింగ్ లైన్ నడపడంలో పేరు మోసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆన్లైన్ యాప్స్ ద్వారా నకిలీ అకౌంట్స్‌తో తప్పుడు సిమ్‌లు ఏర్పాటు చేసుకొని ఈ వ్యవహారం నడుపుతున్నారు. పాలమూరులో పెట్రోల్ వ్యాపారం చేసే ఓవ్యక్తి పెద్ద బుకీగా ఏర్పడి అందరికి లైన్, యాప్ ద్వారా బెట్టింగ్ నడిపిస్తున్నాడు. ద్వితీయ శ్రేణిలో కొందరు రాజకీయ రంగులో బెట్టింగ్ ఆడిస్తుంటే.. మరికొందరు అదే వృత్తిగా దందా కొనసాగిస్తున్నారు. ● క్రికెట్ బెట్టింగ్‌పై మోజుతో యువత ప్రాణాల మీదికి తెచ్చుకొంటున్నారు. శనివారం నుంచి ఐపీఎల్ పోటీలు మొదలవుతున్న తరుణంలో కొందరు యువకులు బెట్టింగ్‌కు సిద్ధమవుతున్నారు. జిల్లా నలుమూలలా తిష్టవేసిన కొందరు ఈతీరును శాసిస్తున్నారు. యువతను వక్రమార్గం పట్టిస్తున్నారు. చాపకింద నీరులా జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ విస్తరిస్తోంది. పైకి పోలీసులు అలాంటిదేమి లేదని చెబుతున్నా మూలాలను వెతికిపట్టి అడ్డుకట్ట వేయడంలో వారి వైఫల్యం కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహస్యంగా జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు, యువత పోలీసుల కళ్లు గప్పి ఈ తంతును యథేచ్చగా నడిపిస్తున్నారు. ఈ మోజులోపడి లక్షల రూపాయల్ని పొగొట్టుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 15ఏళ్ల బాలుడు రూ.200నుంచి మొదలు పెడుతుండగా 45ఏళ్ల వ్యక్తి రూ. వెయ్యి నుంచి రూ.1లక్ష వరకు బెట్టింగ్ కాస్తున్నారు. హోటళ్లు, బేకరీలు, కిరాణం, శీతల పానీయాల దుకాణాలు, పాన్‌షాప్, ప్రత్యేక గదులను అద్దెకు తీసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. కష్టం పడకుండా డబ్బులు సంపాదించొచ్చనే అత్యాశతోనే యువకులు పెడదోవ పడుతున్నారు. రూ.2వేలు కడితే నాలుగు రేట్లు అంటే రూ.8వేలు డబ్బులు వస్తాయంటూ ఆశపడుతున్నారు. పాత వ్యక్తులపై నిఘా.. జిల్లాలో గతంలో బెట్టింగ్ అడుతూ పట్టుబడటంతో పాటు కేసుల్లో పట్టుబడిన వ్యక్తులపై నిఘా పెడతాం. కొత్తగా స్థావరాలు ఏర్పాటు చేసి ఏమైనా ఆడుతున్నారో పరిశీలిస్తాం. పోలీసులు ఆయా స్టేషన్ పరిధిలో ఉండే వారిపై తరచూ తనిఖీలు చేయిస్తాం. ఇటీవల టూటౌన్ పరిధిలో బెట్టింగ్ ఆడుతున్నట్లు అనుమానం ఉన్న కొందరు యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్ ●సెల్ఫోన్లే ఆధారం.. ఫస్ట్ మ్యాచ్‌కు లక్షలు శనివారం రాత్రి చైన్నె–ముంబై జరగనున్న మొదటి మ్యాచ్ కోసం ముందే జిల్లాలో బెట్టింగ్ కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక వేస్తున్నారు. కొందరు బుకీలు మైదా నం నుంచే పరిస్థితిలను జిల్లా లో ఉండే వారికి అందజేయ డానికి అవసరం అయిన ఏర్పా ట్లు చేసుకుంటున్న సమాచారం. ఐపీఎల్ బెట్టింగ్‌ను సెల్‌ఫోన్ ద్వారానే కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, దేవరకద్రలో ప్రత్యేక అడ్డాల్లో ఈ వ్యవహారం సాగుతోంది. మ్యాచ్ ప్రారంభం కంటే ముందే పందేలు షూర్ అవుతున్నాయి. ఎవరు టాస్ గెలుస్తారు..ఎవరు బ్యాటింగ్ ఎంచుకుంటారు. ఎ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు..ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు అనే అంశంతో పాటు ప్రతి బంతికి పందేం ఉంటుంది. ఇలా ఒక్కో ఆటగాడిపై వ్యక్తిగతంగానూ బెట్టింగ్ అధిక సంఖ్యలో సాగుతోంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కోడ్ భాషను వాడుకలోకి తెచ్చారు. రెండ్లు జట్లు ఆడుతుంటే జట్టు సభ్యుల దుస్తుల రంగును బట్టి కోడ్ వాడుతున్నారు. -
లైంగిక వేధింపుల చట్టాలపై అవగాహన ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పరిష్కార 2013 చట్టంపై మహిళలందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మీటింగ్‌హాల్‌లో మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. పది అంత కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి పని ప్రదేశంలో ఒక అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు భద్రత లేకుండా పోతుందని.. అందుకే ఏమైనా సమస్యలు వచ్చిన వెంటనే న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించారు. లైంగిక వేధింపుల యు/ఎస్ 354ఐపీసీని ఇప్పుడు కొత్త చట్టం 74 బీఎన్ఎస్గా మార్చినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు జరిగితే వెంటనే అంతర్గత ఫిర్యాదు కమిటీలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని శాఖల్లో కూడా ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమాధికారి జరీనాబేగం మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కార్యాలయాల్లో 48 అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు ఫిర్యాదులను ఈ కమిటీల ద్వారానే పరిష్కరించినట్లు వివరించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా.. తమ వద్దకు రావచ్చని, తప్పనిసరిగా బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అడిషనల్ పీడీ ముసాయిదా బేగం, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు. -
నీటి తరలింపును ఆపాలి..
మత్స్యకారుల జీవనాధారం చెరువు. చెరువులో చేపలు పెంచుకొని బతుకుతున్న మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేయవద్దు. వర్షాలు కురిశాయని సంబరపడ్డాం. కానీ ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువుల్లో నీరు అడుగంటింది. చేపలకు సరైన నీరు లేక ఉత్పత్తిలో వృద్ధి లేదు. మోటార్ల ద్వారా చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లను సైతం తరలిస్తే చేపల మనుగడ కష్టమవుతుంది. వెంటనే చెరువుల్లో మోటార్ల ద్వారా నీటి తరలింపు ఆపాలి. అధికారులు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలి. – రాంచంద్రయ్య, వేపూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కొట్లాటకు వస్తున్నారు.. చెరువుల్లో మోటార్ల ద్వారా నీటి తరలింపును ఆపాలని, మోటార్లు తొలగించాలని చెబితే స్థానికంగా కొట్లాటకు వస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సొసైటీ తరఫున లక్షలాది రూపాయలు వెచ్చించి చేపలు వదిలాం. నీటిని తోడేస్తే మేము తీవ్రంగా నష్టపోతాం. అధికారులు చొరవ తీసుకొని నీటి తరలింపును ఆపాలి. – జిల్లెల శేఖర్, పెద్దదర్పల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ● -
ఫోన్ చేయాల్సిన నంబర్: 98488 58197
సమయం: శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకుపాలమూరు: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణతో శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
తొలి రోజు ప్రశాంతం
జిల్లాకేంద్రంలో పరీక్ష రాసి బయటికి వస్తున్న విద్యార్థులు పరీక్ష కంటే ముందు దేవాలయంలో విద్యార్థులు.. మాడ్రన్ స్కూల్లో నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు కావడంతో చాలా మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాల అడ్రస్‌లు వెతుక్కోవడం, దూరం నుంచి వచ్చేవారు హడావుడిగా చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 60 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 12,785 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 12,744 మంది హాజరై 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 12,769 మందికి 12,730 మంది హాజరై 39 మంది గైర్హాజరయ్యా రు. ప్రైవేటు విద్యార్థులు 16 మందికి 14 మంది హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీలు చేశారు. డీఎల్ఓ 5, డీఈఓ 11, ఏసీజీఈ 4, ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 25 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. మొత్తానికి తొలిరోజు జరిగిన తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలో అపెక్స్ స్కూల్ వద్ద, టీడీ గుట్ట, వన్‌టౌన్ ప్రాంతాల్లో పరీక్ష జరిగే సమయంలో పలు జిరాక్స్ సెంటర్లు తెరుచుకుని ఉన్నా.. అధికారులు పట్టించుకోలేదు. ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం ఆమె గాంధీ రోడ్డు, క్రీస్తు జ్యోతి విద్యాలయం, భూత్పూర్ జెడ్పీ స్కూళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పరీక్ష నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, తదితరులున్నారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం 12,744 మంది హాజరు.. 41 మంది గైర్హాజరు -
గడువులోగా అనుమతులు ఇవ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): టీజీ ఐపాస్ దరఖాస్తులను పరిశీలించి.. గడువులోగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ హాలులో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. టీ ఫైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి ఒకరికి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద ఒక కారు, షెడ్యూల్డ్ తెగల వారికి ఇద్దరికి కారు, ట్రాక్టర్ వాహనాలకు పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. జెడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, ఆర్డీఓ నవీన్, జిల్లా పరిశ్రమల జీఎం ప్రతాప్‌రెడ్డి, ఎల్డీఎం భాస్కర్, భూగర్భ జలవనరుల శాఖ డీడీ రమాదేవి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. వందశాతం పురోగతి సాధించాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించి ఈ నెల 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ అమలులో వందశాతం పురోగతి సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీసీ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్తో కలిగే ప్రయోజనాలను వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. వీసీలో కలెక్టర్ విజయేందిర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు. -
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
నారాయణపేట రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. దరఖాస్తు విధానం.. విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయి ల్ ఐడీతో ఇస్రో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్ల లో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. రేపటి వరకు అవకాశం దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎంపిక విధానం ఇలా.. ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్‌లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండటం, ఆన్లైన్ క్విజ్‌లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. వేసవిలో శిక్షణ.. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు. ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సదావకాశం ఆన్లైన్లో అందుబాటులో ఇస్రో ప్రత్యేక వెబ్సైట్ రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో 45,969 మంది విద్యార్థులు విద్యార్థులను ప్రోత్సహించాలి.. వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట -
నీటిని తోడేస్తున్నారు..!
మహబూబ్‌నగర్ న్యూటౌన్: తాగు, సాగునీటి అవసరాలకు గ్రామాలకు తలమానికంగా ఉన్న చెరువులను తోడేస్తున్నారు. గత సీజన్లో వర్షాలు భారీగా కురిసి.. చెరువులు, కుంటలు అలుగులు పారడంతో మత్స్యకారులు సంతోషపపడ్డారు. కానీ ఎండల తీవ్రత వల్ల చెరువుల్లోని నీరు అడుగంటిపోవడం మత్స్య సంపద వృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకు భూగర్భజలాలు తగ్గడం వల్ల చేపల ఉత్పత్తికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీనికి తోడు చెరువుల్లో మిగిలిన కొద్దిపాటి నీటిని సైతం మోటార్లు బిగించి తరలించడం వల్ల చేపల మనుగడకు, జంతువులు, పక్షుల తాగునీటి అవసరాలకు సైతం ముప్పు వాటిల్లుతోంది. నీటిని తోడవద్దని గ్రామాల్లోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు చెబుతున్నా.. పట్టించుకోకుండా గొడవలకు దిగడం, ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసుకునే వర కు వెళ్లింది. ఇటీవల హన్వాడ మండలం వేపూరు, పెద్దదర్పల్లి, కొత్తపేట, బుద్దారంతో పాటు గండేడ్, మహమ్మదాబాద్ మండలాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. చెరువు తూము నుంచి వెనుక ఉన్న పంటలకు నీరు వదలాలనే నిబంధనను ఖాతరు చేయకుండా మోటార్లు బిగించి నీటిని తరలించడంపై మత్స్య సహకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులకు ఫిర్యా దులు చేసినా స్థానిక పరిస్థితుల నేపథ్యంలో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో మోటార్లు బిగించి నీటిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకొని నివారించాలని, భవిష్యత్‌లో ఎవరూ చెరువులో మోటార్లు బిగించకుండా అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆయకట్టు సంఘాలు లేకపోవడం వల్లే.. గ్రామాల్లో చెరువులకు సంబంధించి గతంలో ఆయకట్టు సంఘాలు ఉండేవి. గత ప్రభుత్వం హయాంలో వాటిని రద్దు చేయడంతో ఆయకట్టు సమస్యలు తీవ్రం కావడంతో పాటు చెరువులపై ఎవరికీ అజమాయిషీ లేని కారణంగా పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చెరువులో నీటి నిల్వ ఆధారంగా పంటల సాగు, ఆయకట్టు కాల్వల మరమ్మతు, చెరువు మరమ్మతు పనులు వంటి వాటిపై ఆయకట్టు సంఘాల చొరవ ఉండేది. ప్రస్తుతం చెరువులపై ప్రాతినిధ్యం ఎవరికీ లేకపోవడంతో ఆయకట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో ఆయకట్టు సంఘాలు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు కలిసి చర్చించుకొని ఆయకట్టు సాగుకు నీటి వాడకం, చేపల పెంపకానికి, పశుపక్షాదుల తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేవారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పాలకవర్గాలు లేకపోవడం సమస్యలకు దారితీస్తోంది. గతేడాది చెరువుల్లో వదిలిన చేప పిల్లలు 88 లక్షలు మోటార్లు బిగించడానికి లేదు.. చెరువుల్లో మోటార్లు పెట్టి నీటిని తరలించడానికి లేదు. చెరువు తూము నుంచి మాత్రమే వదలాలి. మిగతా నీరు చెరువులో ఉంటే పశుపక్షాదుల తాగునీటి అవసరాలతో పాటు బోర్లు రీచార్జి అయ్యేందుకు ఉపయోగపడుతుంది. మోటార్లు పెట్టి నీటిని తరలించినట్లు ఎవరైనా తమ దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటాం. – మనోహర్, చిన్ననీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ చెరువుల్లో అడుగంటుతున్న నీటి వనరులు మోటార్లతో ఉన్న నీటిని సైతంతోడేస్తున్న వైనం ఫిర్యాదు చేసినా.. నిస్సహాయత వ్యక్తం చేస్తున్న అధికారుల ప్రశ్నార్థకంగా మత్స్య, పశు సంపద అభివృద్ధి సహకారం లేని పారిశ్రామిక సహకార సంఘాలు సభ్యత్వం ఉన్న వారు 12,300 మందిమత్స్య పారిశ్రామికసహకార సంఘాలు 225జిల్లాలో మొత్తం చెరువులు, కుంటలు 1,091 -
కొరంగడ్డకుంట ధ్వంసంపై విచారణ
మహబూబ్‌నగర్ రూరల్: మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఏనుగొండ రెవెన్యూ వార్డు సమీపంలోని మౌలాలిగుట్ట వద్ద కొరంగడ్డ కుంటను ధ్వంసం చేసిన సంఘటనపై శుక్రవారం అధికారులు స్పందించారు. ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్, ఏఈ ఆసీఫ్, రెవెన్యూ గిర్దావర్ నర్సింగ్ తమ సిబ్బందితో మొఖపైకి వెళ్లి విచారణ జరిపారు. కొరంగడ్డ కుంట పరిసర ప్రాంతం 403 సర్వేనంబర్‌లో పది ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల పరంగా ఈ కుంట ప్రాంతం పట్టాదారులది అయినప్పటికినీ.. ఎలాంటి అనుమతులు లేకుండా కుంటను ధ్వంసం చేయడంతో పాటు సుమారు వంద మీటర్ల కట్టను జేసీబీలతో తొలగించారు. ఈ సంఘటన జరిగాక అధికారులు మొఖపైకి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూసిన అధికారులు పరిసర ప్రాంత రైతులతో మాట్లాడి విచారించారు. కుంటను పూర్తిగా ధ్వంసం చేసిన సంఘటనపై అందుకు బాధ్యులైన పట్టాదారులపైనే ముందస్తుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని డీఈ మనోహర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్– రాయచూర్ ప్రధాన రహదారికి సమీపంలో గల మౌలాలిగుట్ట వద్ద ఈ కుంట భూమి ఎంతో విలువైనది. దీంతో కన్నెసిన రియల్టర్లు పట్టాదారులతో కుమ్మకై ్క వెంచర్ వేసేందుకు ఏకంగా కుంట కట్టను పూడ్చివేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కీలక పాత్ర వహించడంతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
సమన్వయంతో ముందుకు..
ఎస్ఎల్బీసీ సొరంగం లోపల సహాయక చర్యలపై చేపట్టాల్సిన భద్రత ప్రమాణాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అన్నారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారి హరీష్, సింగరేణి రెస్క్యూ జీఎం బైద్య సొరంగం లోపలి పరిస్థితులను ఆయనకు వివరించారు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అన్ని బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఉబికి వస్తున్న నీటి ఊటను ఎప్పటికప్పుడు అధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. సొరంగంలో నుంచి బయటికి తెచ్చిన బండరాళ్లు -
పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. బల్మూరు మండలం గోదల్కి చెందిన 14మంది రైతులకు సంబంధించిన వరి ధాన్యాన్ని నాలుగు నెలల క్రితం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసులుకు గోదల్ గ్రామానికి చెందిన రవి మధ్యవర్తిగా ఉండి విక్రయించాడు. వ్యాపారి శ్రీనివాసులు రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో గురువారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో అతడి ఇంటి ముందు వంటావార్పు నిర్వహిస్తుండటంతో డయల్ 100కు సమాచారం రావడంతో రైతులను పోలిస్‌స్టేషన్‌కు పిలిచారు. ఈక్రమంలోనే మధ్యవర్తి రవి పోలిస్‌స్టేషన్ ఎదుట న్యాయం చేయాలంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో ఎస్సై గోవర్దన్ అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకువెళ్లాడు. సంఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్దన్‌ను వివరణ కోరగా బాధితులకు పోలీస్ శాఖ ద్వారా న్యాయం చేస్తామని సముదాయించి పంపించి వేసినట్లు తెలిపారు. -
సహాయక చర్యలు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో సహాయక చర్యలు చేపట్టడం రోజురోజుకూ సవాల్‌గా మారుతోంది. సొరంగం పైకప్పు కూలిన ఘనట జరిగి 27 రోజులైనా నేటికీ కార్మికుల జాడ లభించలేదు. సొరంగం ప్రమాదంలో దెబ్బతిన్న టీబీఎం మిషన్ భాగాలను తొలగిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సహాయక సిబ్బందికి పనుల్లో జాప్యం జరుగుతోంది. అయితే గురువారం డీ–1, డీ–2 ప్రదేశాల్లో ఉన్న పెద్దపెద్ద బండరాళ్లను సైతం తొలగించి బయటికి పంపిస్తున్నారు. వీటిని కదిలిస్తుండటంతో నీటి ఊట కూడా భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగా భారీ పంపుల ద్వారా నీటిని బయటికి పంపిస్తున్నారు. డీవాటరింగ్ ప్రక్రియతోపాటు బురద, మట్టిని తొలగిస్తూ లోకో ట్రైన్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. దీంతో గతంలో కంటే సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహాయక బృందాలను తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా అభినందించారు. ఐదు షిఫ్ట్‌ల్లో.. సహాయక చర్యలు ప్రతిరోజు 5 షిఫ్ట్‌లుగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు, 11, మధ్యాహ్నం 3, రాత్రి 7, 11 గంటల షిఫ్ట్‌ల్లో ప్రత్యేక సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. సొరంగంలో లోపల జరిగే సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 27 రోజులుగా సొరంగంలో రాత్రి, పగలు పనిచేస్తూ.. ప్రమాద స్థలంలో పేరుకుపోయిన టీబీఎం భాగాలు స్టీల్, బండరాళ్లు, బురదను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. సొరంగంలో ప్రమాద స్థలానికి చేరువలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు తెప్పించిన రోబో సేవలు పదిరోజులైనా అందుబాటులోకి రాలేదు. టీబీఎం శకలాలు పూర్తిగా తొలగిస్తే తప్ప రోబో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. డీ–1, 2 ప్రదేశాల్లో బండరాళ్ల తొలగింపు భారీ పంపులతో డీవాటరింగ్‌కు చర్యలు ఒక్కొక్కటిగా సవాళ్లను అధిగమిస్తూ ముందుకు.. 27 రోజులుగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు ఎస్ఎల్బీసీలో అందుబాటులోకి రాని రోబో సేవలు -
8నెలల తర్వాత తేలిన సంగమేశ్వరాలయం
కొల్లాపూర్: కృష్ణానదిలో ఎనిమిది నెలలు మునిగి ఉన్న సంగమేశ్వరాలయం పూర్తిగా తేలింది. గురువారం తెల్లవారుజాము వరకే ఆలయ ప్రాంగణం మొత్తం పూర్తిగా నది నీటి నుంచి బయటపడింది. దీంతో గర్భగుడిలో నీటిని బయటకు ఎత్తిపోశారు. నది నీరు తొలగిపోవడంతో ఆలయంలోని వేపదారు శివలింగం భక్తులకు దర్శనమిచ్చింది. శివలింగానికి ఆలయ అర్చకులు రఘురామశర్మ శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నీటిలో మునిగి ఉండటం కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం బురదమయంగా మారడంతో పరిసరాలు శుభ్రం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు అర్చకులు వెల్లడించారు. గతేడాది జూలై 17న సంగమేశ్వరాలయం కృష్ణానదిలో మునిగింది. గర్భగుడిలోని శివలింగానికి పూజలు ఆలయ పరిసరాలు శుభ్రం చేసేందుకు చర్యలు -
సమన్వయంతో ముందుకు..
ఎస్ఎల్బీసీ సొరంగం లోపల సహాయక చర్యలపై చేపట్టాల్సిన భద్రత ప్రమాణాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అన్నారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారి హరీష్, సింగరేణి రెస్క్యూ జీఎం బైద్య సొరంగం లోపలి పరిస్థితులను ఆయనకు వివరించారు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అన్ని బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఉబికి వస్తున్న నీటి ఊటను ఎప్పటికప్పుడు అధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. సొరంగంలో నుంచి బయటికి తెచ్చిన బండరాళ్లు -
దొంగ రిమాండ్‌లో పోలీసుల గోప్యత
కల్వకుర్తి టౌన్: వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను బుధవారం రిమాండ్ చేసిన పోలీసులు ఆ విషయంలో గోప్యత పాటించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లును అడగగా నిజమేనని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కల్వకుర్తిలో బుధవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తుండగా పాలమూరు చౌరస్తాలో పోలీసులను చూసి ద్విచక్రవాహనదారుడు పారిపోగా పోలీసులు అనుమానం వచ్చి వెంబడించి పట్టుకున్నారు. ఇతను పాత నేరస్తుడు భాషమోని సైదులుగా గుర్తించి విచారించారు. అతను పలు నేరా లు చేసినట్లు ఒప్పుకోవడంతో అతని నుంచి 16 తులాల బంగారం, 84 తులాల వెండి, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై పలు స్టేషన్లలో ఇప్పటి వరకు 50కిపైగా కేసులు ఉన్నాయని, కల్వకుర్తి కోర్టులో అతనిని హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించారని డీఎస్పీ చెప్పారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, క్రైం పార్టీ కానిస్టేబుళ్లు నజీర్, చిరంజీవిని అభినందించి.. రివార్డులు సైతం అందిస్తున్నట్లు తెలిపారు. గోప్యతపై అనుమానం..? వరుస నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు భాషమెని సైదులు రిమాండ్ విషయంలో పోలీసులు గోప్యత పాటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నేరాలలో దొంగలు దొరకక అతనినే రిమాండ్ చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. చోరీలు జరుగుతున్నా నిజమైన దొంగలను పట్టుకోలేక, వారికి ఉన్న ఒత్తిడి దృష్ట్యా పాత నేరస్తుడినే పట్టుకొని నామమాత్రంగా చోరీ అయిన సొత్తును చూయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు విడుదల చేసిన ప్రెస్‌మీట్ ఫొటోలో ఓ ఎస్ఐను అతికించినట్లు ఉండటంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. -
పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. బల్మూరు మండలం గోదల్కి చెందిన 14మంది రైతులకు సంబంధించిన వరి ధాన్యాన్ని నాలుగు నెలల క్రితం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసులుకు గోదల్ గ్రామానికి చెందిన రవి మధ్యవర్తిగా ఉండి విక్రయించాడు. వ్యాపారి శ్రీనివాసులు రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో గురువారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో అతడి ఇంటి ముందు వంటావార్పు నిర్వహిస్తుండటంతో డయల్ 100కు సమాచారం రావడంతో రైతులను పోలిస్‌స్టేషన్‌కు పిలిచారు. ఈక్రమంలోనే మధ్యవర్తి రవి పోలిస్‌స్టేషన్ ఎదుట న్యాయం చేయాలంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో ఎస్సై గోవర్దన్ అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకువెళ్లాడు. సంఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్దన్‌ను వివరణ కోరగా బాధితులకు పోలీస్ శాఖ ద్వారా న్యాయం చేస్తామని సముదాయించి పంపించి వేసినట్లు తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
నారాయణపేట రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని పేరపళ్ల సమీపంలో ఉన్న డ్రైవర్ గోపితండాకు చెందిన శారు రాథోడ్ (20)ను సమీపంలోని రెడ్యానాయక్తండాకు చెందిన బంధువు వినోద్‌నాయక్ ఇచ్చి రెండునెలల క్రితం వివాహం జరిపించారు. పెళ్లి అయిన నాటి నుంచి తనకు ఆ అమ్మాయి వద్దంటూ రాథోడ్ తరచూ గొడవపడుతూ ఉండేవాడు. గురువారం ఉదయం ఫోన్ రావడంతో వివాహిత తండ్రి లోక్యానాయక్ కూతురి ఇంటికి వెళ్లి చూడగా మృతిచెంది కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో హత్య చేశారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరికల్ సీఐ రాజేందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. చెన్నంపల్లిలో వ్యక్తి.. లింగాల: మండలంలోని చెన్నంపల్లికి చెందిన ఓర్సు లింగస్వామి (35) గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు గ్రామస్తులు, పోలీసులు తెలిపారు. ఇంటిలో ఒంటరిగా నిద్రించిన వ్యక్తి తెల్లవారేసరికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం.. పాదాలు రక్తంతో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య సైదమ్మ 6 నెలల కిందట ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఉన్న ఇద్దరు కుమారులు ప్రస్తుతం మేనమామ దగ్గర ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన స్థలాన్ని అచ్చంపేట సీఐ రవీందర్, ఎస్ఐ నాగరాజు, డాగ్‌స్క్వాడ్ బృందం క్షుణంగా పరిశీలించాయి. అన్న ఓర్సు బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. చెట్టుపై నుంచికిందపడి.. అడ్డాకుల: మండలంలోని పొన్నకల్‌కు చెందిన సత్యం యాదవ్ (30) చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సత్యం ఈ నెల 15న గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఆకు తెంచడానికి పైకెక్కి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్‌నగర్‌కు, అటు నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటాక మృతి చెందినట్లు గ్రామస్తులు వివరించారు. గురువారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. సత్యంకు భార్య భాగ్యమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డుప్రమాదంలో చికిత్స పొందుతూ.. నాగర్‌కర్నూల్ క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. బిజినేపల్లి మండలం సల్కర్‌పేటకు చెందిన శ్రీనివాసులు (55) ఈ నెల 17న ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా జిల్లాకేంద్రంలో వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. భార్య శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. జడ్చర్లో యూపీ వాసి.. జడ్చర్ల: స్థానిక హౌసింగ్‌బోర్డుకాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల 16న మైలు విశ్వకర్మ(20), మిత్రుడు నిఖిల్ జైస్వల్ (19) కలిసి స్కూటీపై మెడికల్ షాప్‌కు వెళ్లారు. మందులు కొనుగోలు చేసి తిరిగి విజయనగర్‌కాలనీలోని ఇంటికి వస్తుండగా ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్ వైపు నుంచి వచ్చిన నాలుగు చక్రాల ఆటో వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత నిఖిల్ జైస్వల్ సొంత ప్రాంతం ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. గురువారం ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లల మృతి అయిజ : వీధి కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతిచెందిన ఘటన మండలంలోని విఠలాపురం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తూముకుంట గ్రామానికి చెందిన కుర్వ దొడ్ల గోపాల్ గొర్రె పిల్లలకు రక్షణగా ఇనుప కంచె ఏర్పాటుచేసి గొర్రెల మేపడానికి వెళ్లాడు. రాత్రి గొర్రె పిల్లలకు పాలు తాగిద్దామని కంచె వద్దకు రాగా అందులోని 40 గొర్రె పిల్లలు మృతిచెంది వున్నాయి. దీంతో గోపాల్ కన్నీటిపర్వంతమయ్యాడు. వీధి కుక్కలు వలలో దూరి గొర్రె పిల్లలను కొరికేశాయని, రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాఽధిత కాపరి వాపోయాడు. -
పరీక్షల వేళ.. ఆహారంపై శ్రద్ధ
పాలమూరు: జిల్లాలో శుక్రవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షల ముందు కొంత మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవడం, త్వరగా అలిసిపోవడం వంటివి జరుతుంటాయి. ముందుగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలని, ఆ సమయంలో ఆరోగ్యంగా ఉండేలా ఆహారంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ ఆస్పత్రి న్యూట్రిషనిస్ట్ శైలజ చెబుతున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే.. విద్యార్థులు వేళకు భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం సంప్రదాయ భోజనం మితంగా మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాల జోలికి వెళ్లొద్దు. రాత్రి సైతం ఇదే విధంగా నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయాలి. ఉదయం సకాలంలో నిద్రలేస్తే రోజు మొత్తం చురుకుగా ఉంటారు. పరీక్ష రోజు ఎలా? ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా, పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం అన్నం, రొట్టె, కూరగాయాలు, ఆకుకూరలు, పెరుగు, సాంబార్ వంటివి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. రాత్రి అన్నం లేదా చపాతి పప్పు వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. భోజనంలో వేటికి ప్రాధాన్యం సమతుల ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. భోజనంలో పోషకాలు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. ఇందుకు పప్పుధాన్యాలు, చపాతి, అన్నం, కూరగాయలు వంటివి తీసుకోవాలి. తక్కువ మోతాదు ఉన్న నూనె పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. కాలానుగుణ పండ్లు తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. అతిగా భోజనం చేస్తే ఆరోగ్యం సమస్యతో పరీక్షలపై ప్రభావం చూపుతుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. అల్పాహారంలోనూ తేలికపాటి ఆహారం ఉంటే మంచిది. రోజూ ఉదయం డ్రైప్రూట్స్ తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు. నూనె వస్తువులు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి రాత్రివేళ అతిగా భోజనం ప్రమాదం ప్రతిరోజూ నిర్ణీత సమయంలోనే నిద్ర మంచిది కాలానుగుణ పండ్లతో ఏకాగ్రత పెంపు ‘సాక్షి’తో జనరల్ ఆస్పత్రి న్యూట్రిషనిస్ట్ శైలజ ఆహారానికి, నిద్రకు సంబంధం సాధారణంగా రాత్రివేళలో అతిగా భోజనం చేస్తే నిద్రపట్టదు. ఈ సమయంలో వేపుళ్లు, చిప్స్, తీపి పదార్థాలు, చాక్లెట్లు తినకూడదు. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వీటి వల్ల నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే పుస్తకం పట్టుకుంటే నిద్ర ముంచుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు వాక్ చేయడం మంచిది. ప్రతిరోజు ఒకే నిర్ణీత సమయంలోనే నిద్రపోవాలి. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే పడుకునే ముందు తీసుకున్న ఆహారం సైతం సక్రమంగా జీర్ణమై ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. -
నేటినుంచి లైలతుల్ ఖద్ర్ జాగరణలు
నిష్టతో ప్రార్థనలు చేయాలి రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో షబేఖద్ర్ జాగరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఐదు రాతుల్లో నిష్టతో ప్రార్థనలు చేయాలి, ఎతికేకాఫ్ పాటించాలి. దేవుని సన్నిధిలో ఉండి ప్రత్యేక నమాజులు చేసి దువా చేయాలి. –మౌలానా మొహ్‌సిన్‌పాష ఖాద్రీ, మహబూబ్‌నగర్ స్టేషన్ మహబూబ్‌నగర్: పవిత్ర రంజాన్ మాసం లైలతుల్ ఖద్ర్ ప్రత్యేక ప్రార్థనలు శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. రంజాన్ నెల చివరి దశకం కూడా మొదలు కావడంతో ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ రాత్రులను జరుపుకుంటారు. షబే ఖద్ర్ జాగరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చాంద్రమానం ప్రకారం ఇస్లామియా సంవత్సరం తిథులను రాత్రి పూట నుంచి లెక్కించడం పరిపాటి. అందువల్ల నేటి నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసపు 21, 23, 25, 27, 29 తేదీల్లోని రాత్రులను షబేఖద్ర్గా పాటిస్తూ ముస్లింలు ఈ రాత్రుల్లో తెల్లవారేదాకా జాగరణ చేసి అల్లాను ఆరాధిస్తారు.‘ షబే ఖద్ర్ అంటే అతి విలువైనది, గౌరవమైనదని’ అర్థం. వె సాధారణ రాత్రుల కంటే ప్రధానమైందని ఖురాన్లో ప్రవచించినందున ముస్లింలు ఈ రాత్రుల్లో జాగరణ చేసి క్షమాబిక్షను కోరుతూ ఇంటిల్లిపాదీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ పది రోజుల్లో ‘ఏతెకాఫ్’ అనే సంకల్పాన్ని పాటిస్తారు. ప్రతి మసీదులో ఆ ప్రాంతానికి చెందిన ముస్లిం ప్రముఖులు ఒక్కరైనా ఎతెకాఫ్‌ను విధిగా చేపట్టాలన్న నిబంధన ఉంది. పగలు, రాత్రి స్థానిక మసీదుల్లోనే ఉండి ఇతర ప్రాపంచిక ఆలోచనలు రాకుండా ఖురాన్‌ను పటిస్తూ, తరావీ, తహజ్జుద్ నమాజులు చేస్తూ లోక కల్యాణం కోసం దైవారాధన చేస్తారు. ఖబేఖద్ర్ వేడుకలకు మసీద్‌లు ముస్తాబయ్యాయి. హాఫిజ్సాబ్లకు ఘన సన్మానం పవిత్ర రంజాన్ మాసంలోనే ఖురాన్ గ్రంథం అవతరించింది. మసీదుల్లో హాఫిజ్ సాబ్‌లను నియమించుకొని వారితో నెల రోజులపాటు ప్రతి రోజు 20 రకాతుల ప్రత్యేక తరావీ నమాజ్‌లను చేయిస్తారు. పూర్తి ఖురాన్ గ్రంథం వినిపించిన హాఫిజ్‌లను ఘనంగా సన్మానిస్తారు. వీరికి హదియా (గౌరవవేతనం) అందిస్తారు. అదే విధంగా కొన్నిచోట్ల మూడు రోజులు, ఆరు రోజుల్లో కూడా పూర్తి ఖురాన్‌ను పఠించారు. చివరి దశకంలోకి చేరిన రంజాన్ లోక కల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు -
పిచ్చుకల సంతతిని పెంచుదాం
జడ్చర్ల టౌన్: పర్యావరణ సమతుల్యతో ప్రతిజీవి తనవంతు పాత్ర పోషిస్తుందని, ఊర పిచ్చుక తనవంతు పాత్ర పోషిస్తున్నందున వాటి సంతతి పెంపునకు కృషిచేద్దామని డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుకన్య పిలుపునిచ్చారు. గురువారం కళాశాల బొటానికల్ గార్డెన్లో పిచ్చుకలకోసం డా.సదాశివయ్య ఆధ్వర్యంలో తైదలు, కొర్రలు, సామలు, ఊదలు, జొన్నలులాంటి గింజలు, నీళ్లను ప్రత్యేక పాత్రల్లో ఏర్పాటుచేయగా వాటిని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఊరపిచ్చుకల సంఖ్య తగ్గటంతో పర్యావరణ సమతుల్యతకు ముప్పుగా మారుతుందన్నారు. ప్రతి ఏటా మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహించి వాటి పరిరక్షణకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు రవీందర్, భరత్, అభిలాష్ పాల్గొన్నారు. -
దేవరకద్ర సంత ఆదాయం రూ.69.38 లక్షలు
దేవరకద్ర: స్థానిక పురపాలికకు సంతల వేలం ద్వారా రూ.69. 38 లక్షల ఆదాయం సమకూరింది. గురువారం పుర కార్యాలయం వద్ద వేలం పాట నిర్వహించగా మహబూబ్‌నగర్, దేవరకద్ర పుర కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మేనేజర్ సీత్యానాయక్ పాల్గొన్నారు. వేలంలో పశువుల సంతను రూ.47.96 లక్షలకు పట్టణానికి చెందిన ఆది హన్మంత్‌రెడ్డి దక్కించుకున్నారు. అలాగే గొర్రెలు, మేకల సంతను రూ.15.36 లక్షలకు కుర్వ రాంపాండు, తైబజార్‌ను రూ.6.06 లక్షలకు కుర్వ బీరప్ప దక్కించుకున్నారు. పురపాలిక నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువగా రావడంతో వాయిదా లేకుండా కాంటాక్టులను ఖరారు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2026, మార్చి 31 వరకు కాంటాక్టు అమలులో ఉంటుందని అధికారులు వివరించారు. -
రోడ్డుపై చెత్త, ఇసుక వేసిన వారికి జరిమానా
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో వివిధ చోట్ల రోడ్లపై చెత్త, ఇసుక, కంకర డస్ట్ తదితర వస్తువులు వేసిన వారికి గురువారం మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. న్యూటౌన్ ప్రాంతంలో మెయిన్ రోడ్డుపై చెత్త వేసినందుకు సూరజ్ ఖజానా వస్త్ర దుకాణదారు నుంచి రూ.ఐదు వేలు జరిమానా వసూలు చేశారు. అలాగే పద్మావతికాలనీలోని హెచ్‌పీ గ్యాస్ (భరధ్వాజ ఎంటర్ప్రైజెస్) నిర్వాహకులు రోడ్డుపైనే ఇసుక, కంకర డస్ట్, శ్రీనివాసకాలనీలోని రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనానికి చెందిన వేస్టేజీ మెటీరియల్‌ను రోడ్డుపై వేసిన సదరు యజమానికి రూ.2 వేల చొప్పున ఇలా మొత్తం రూ.తొమ్మిది వేలు జరిమానా విధించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు గురులింగం, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 98488 58197
సమయం: శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకుపాలమూరు: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణతో శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
కుంటను మింగేస్తున్నారు!
మహబూబ్‌నగర్ రూరల్: ఓ వైపు జల వనరుల సంరక్షణకు ప్రభుత్వం రూ.కోట్లాది ఖర్చు చేస్తుంటే.. మరోవైపు అధికారుల అలసత్వం.. స్థానిక నేతల అండదండలు వెరసి దశాబ్దాలుగా భూగర్భ జలాల పెంపునకు తోడ్పాటుగా ఉంటున్న చిన్న నీటి వనరులను మాయమైపోతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పట్టింపులేని తనం కారణంగా కొరంగడ్డ కుంట కబ్జాకు గురవుతోంది. మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఏనుగొండ రెవెన్యూ వార్డు మౌలాలిగుట్ట సమీపంలో కొరంగడ్డ కుంట దశాబ్దాల క్రితం నిర్మించారు. చుట్టుపక్కల భూగర్భజలాల పెంపునకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఈ ప్రాంతంలో భూమి విలువ ఎక్కువగా ఉండడంతో స్థిరాస్తి వ్యాపారుల దృష్టి ఈ కుంటపై పడింది. శిఖం భూమి అయినప్పటికీ కుంట కొందరి రైతుల పట్టా భూమిలో ఉంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు నిబంధనలు ఉల్లంఘించి కుంటను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజులుగా గుట్టుగా కుంట భూమిని పూడ్చేసే పనిలో ఉన్నారు. ఈ విషయం కొందరు చిన్ననీటి పారుదల శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. వారు గురువారం అక్కడి చేరుకొని కుంట పూడ్చివేత పనులను నిలిపి వేయించారు. అధికారి పార్టీ నాయకుడి ఆగడాలను అడ్డుకొని కుంటను కాపాడాలని స్థానిక రైతులు అధికారులను కోరారు. సర్వే చేసేందుకు మీనమేషాలు.. మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో కుంటలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని సర్వే చేసి పక్కాగా హద్దులు ఏర్పాటు చేయాలని రైతులు, ప్రజలు వేడుకుంటున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. వాస్తవానికి ప్రతి జల వనరు శిఖం తర్వాత ఎఫ్టీఎల్ పరిధి, దానిపైన బఫర్ జోన్ ఉంటుంది. సొంత పట్టా భూములు ఉన్నా వాటిల్లో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. అయినా స్థిరాస్తి వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి పోసి వెంచర్లు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ఏనుగొండ రెవెన్యూ శివారులో కొరంగడ్డకుంట పూడ్చే వేసే ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆ కుంట పట్టా పొలంలో ఉంది. అయినా కుంటను పూడ్చేందుకు వీల్లేదు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి.. పట్టాదారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – మనోహర్, డీఈ, చిన్ననీటిపారుదలశాఖ కొరంగడ్డకుంటను పూడ్చేందుకుఓ నాయకుడి యత్నం అడ్డుకున్న చిన్ననీటి పారుదల శాఖ అధికారులు -
రెవెన్యూ అర్జీలను త్వరగా పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ సంబంధిత అర్జీలను పరిశీలించి తగిన కారణాన్ని సరిగ్గా వివరిస్తూ వాటిని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులకు త్వరితగతిన సమాధానాలు ఇవ్వాలని సూచించారు. మండలంలో పని జరగడం లేదని జిల్లాస్థాయి ప్రజావాణికి భూ సమస్యలైపె పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కొత్త దరఖాస్తులను తీసుకొని.. వాటిని పరిశీలించి స్థానిక ఎమ్మెల్యేలకు తెలియజేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలన్నారు. కోర్టు కేసులు, ధరణి వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఓటరు జాబితాకు రాజకీయ పార్టీల సహకరించాలి ఓటరు జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చేర్పులు మార్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజయేందిర కోరారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటరు నమోదు లో అభ్యంతరాలు, చిరునామా మార్పు, బదిలీలు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం నిరంతరం కల్పించిందన్నారు. ఆయా సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్, సర్వే లాండ్ ఏడీ కిషన్‌రావు, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం, ఎన్నికల డీటీ జాఫర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
అట్టడుగున నాలుగు జిల్లాలు
సాక్షి, నాగర్‌కర్నూల్: వ్యక్తిగత ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కల్పనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఇంకా అట్టడుగునే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిలో వెనకబాటు కనిపిస్తోంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్–2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో నూతన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. అనీమియా ముక్త్ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తీసుకున్న చర్యల ఫలితంగా వనపర్తి జిల్లా 91.8 శాతం పనితీరుతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ● వస్తు సేవల ఉత్పత్తిగా లెక్కించే జీఎస్డీపీ లెక్కల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 30వ స్థానంలో ఉంది. జోగుళాంబ గద్వాల 27, వనపర్తి 26, నాగర్‌కర్నూల్ 19వ స్థానంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా మాత్రం రూ.32,767 కోట్ల జీఎస్డీపీతో రాష్ట్రవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయంలో మహబూబ్‌నగర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాలు వెనుకబడిపోయాయి. మహబూబ్‌నగర్ రూ.2,93,823 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా.. నారాయణపేట 30, జోగుళాంబ గద్వాల 26, వనపర్తి 22, నాగర్‌కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి. ● ఉమ్మడి పాలమూరులో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. నారాయణపేట జిల్లాలో 102 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. వీటి పరిధిలో 2,045 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా మహబూబ్‌నగర్‌లో 462 యూనిట్లతో 32,443 మందికి ఉపాధి పొందుతున్నారు. మిగతా జిల్లాల్లో ఐదు వేల మందికి మించి ఉపాధి లేదు. ఇక అటవీ విస్తీర్ణంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో 35.81 శాతం అటవీ భూమితో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉండగా.. గద్వాల జిల్లాలో కేవలం 2.32 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లలో 57.4శాతంతో నాగర్‌కర్నూల్ అట్టడుగు స్థానంలో ఉండగా. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు సైతం 65 శాతం లోపే కనెక్షన్లు ఉన్నాయి. ● రాష్ట్రంలోనే సోలార్ మోడల్ విలేజ్‌గా నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి నిలిచింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొత్తం 1,451 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 499 డొమెస్టిక్, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 422 గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంచడం, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడం, పర్యావరణ హితంలో భాగంగా ప్రభుత్వం ఈ సోలార్ మోడల్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ప్లాస్టిక్ ఫ్రీగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా కొనసాగుతోంది. వన్యప్రాణులు, అటవీప్రాంత సంరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 80 శాతం వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించగలిగారు. శ్రీశైలం–హైదరాబాద్ రహదారి వెంబడి సేకరించిన మొత్తం 34 వేల కేజీల ప్లాస్టిక్‌ను తుక్కుగూడలో రీసైక్లింగ్ ప్రాసెస్‌ను నిర్వహించారు. అలాగే 16 మంది స్థానిక చెంచు మహిళల ఆధ్వర్యంలో పర్యావరణ హిత బ్యాగ్‌లు, ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వెనుకంజ మహబూబ్‌నగర్ జిల్లా కాస్త మెరుగు పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కరువు సోలార్ మోడల్ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్ లుక్ 2025లో వెల్లడి -
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన
కల్వకుర్తి టౌన్: బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యం, అంబులెన్స్ డ్రైవరే కారణమంటూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పట్టణంలోని సీహెచ్‌సీ ముందు బుధవారం నిరసన తెలిపారు. ఆస్పత్రి గేటు ముందు నిరసన తెలపడంతో ఓపీ సమయంలో రోగులు ఆస్పత్రిలోకి రాకుండా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆస్పత్రిలో వరుస ఘటనలు జరుగుతున్నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. పోలీసులు అక్కడి చేరుకొని గేటు ముందు ధర్నా చేయటం సరికాదని చెప్పటంతో ఆస్పత్రి ముందు రహదారిపై నిరసన తెలిపారు. పలు పార్టీల నాయకులు పాల్గొని బాధితు కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఆస్పత్రి ముందు నిరసన తెలియజేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఫోన్‌చేసి మాట్లాడారు. మృతురాలి కుంటబానికి పరిహారంతో పాటుగా, ఒకరికి ఏదైనా ఉద్యోగం వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. బాలింత మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించాలని ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత అంబులెన్స్ సేవలపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఉచిత సేవల కొరకు ప్రారంభించిన ఉద్దేశం బాగానే ఉన్నా దానిని నడిపించే డ్రైవర్‌కు రోగి పరిస్థితి విషమంగా అనిపిస్తేనే వారు సేవలను అందిస్తారని భాధిత కుటుంబసభ్యులు, ఆసుపత్రిలో కొంతమంది సిబ్బంది ఆరోపించారు. సకాలంలో ఆ అంబులెన్స్‌లు స్పందించినా బాలింత మృతిచెందకుండా ఉండేదని కాదన్నారు. వెల్దండ సీఐ విష్ణువర్థన్‌రెడ్డి , ఎస్ఐలు మాధవరెడ్డి, మహేందర్, కురుమూర్తి, డివిజన్లోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా ఎమ్మెల్యే హామీతో విరమణ -
మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం సుమారు పది వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణ ఉల్లి కుప్పలతో నిండిపోయింది. వ్యాపారులు అన్ని కుప్పలకు వేలం వేయడానికి సమయం సరిపోలేదు. మధ్యాహ్నం 2 గంటలైనా వేలం ముగియకపోవడంతో చాలామంది రైతులు ఉల్లిని బస్తాల్లో నింపి విక్రయించారు. కొనుగోలుదారులు ఎగబడి ఎవరికి వారే సంచుల్లో నింపుకొని తూకాలు వేయించుకోవడం కనిపించింది. ఓ పక్క వ్యాపారులు, మరోపక్క రైతులు ఉల్లి విక్రయాలు సాగించడంతో మార్కెట్ అంతా కిక్కిరిసిపోయింది. కాస్త మెరుగ్గా ధరలు.. బుధవారం జరిగిన బహిరంగ వేలంలో ధరలు గత వారం కంటే కొంత వరకు పెరిగాయి. ఉల్లి బాగా ఆరబెట్టడంతో పాటు నాణ్యతగా ఉండటంతో వ్యాపారులు పోటీపడి వేలం పాడారు. క్వింటా గరిష్టంగా రూ.2,000 పలికింది. ఇది గత వారం కంటే రూ.400 ఎక్కువ. అలాగే కనిష్టంగా రూ.1,400 నమోదుకాగా.. గత వారం కంటే రూ.300 వరకు పెరిగింది. 50 కిలోల బస్తాలుగా మార్పు.. గతంలో మార్కెట్‌యార్డులో నిబంధన పేరుతో 45 కిలోల బస్తా క్వింటా ధరలో సగం ధరకు విక్రయించేవారు. దీంతో వ్యాపారి 5 కిలోల ఉల్లిని నేరుగా దోచుకునే పరిస్థితి ఉండేది. ఈసారి మార్కెట్ నిబంధనలు సవరించి 50 కిలోల బస్తాలుగా తూకం వేశారు. మార్కెట్ అంతా 50 కిలోల బస్తాలే విక్రయించారు. నాణ్యమైన ఉల్లి బస్తా రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు.. రెండోరకం ఉల్లి రూ.500 నుంచి రూ.700 వరకు విక్రయించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినవారు వేలాదిబస్తాల ఉల్లిని కొనుగో లు చేయడంతో వ్యాపారం జోరుగా సాగింది. క్వింటా గరిష్టంగా రూ. రెండు వేలు.. కనిష్టంగా రూ.1,400 -
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
వనపర్తి: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పట్టుకున్నట్లు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని ప్యాటగడ్డవీధికి చెందిన జలగరి ముత్తు, గాంధీనగర్‌కు చెందిన దుల్లోల రాజు తాగుడు, జల్సాలు, కోటి పందేలు తదితర వ్యసనాలకు అలవాటు పడి గతంలో గొర్రెల దొంగతనం చేయడంతో పాన్‌గల్ పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. జైలులో వారికి జడ్చర్లకు చెందిన మూర్తి పరిచయమై తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేస్తే బంగారం, వెండి, నగదు దొరుకుతాయని.. బంగారం, వెండి విక్రయిస్తే డబ్బులు బాగా వస్తాయని తెలిపాడు. అతడి మాటలతో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లపై రెక్కి నిర్వహించి రాత్రిళ్లు చొరబడి ఇంటి, బీరువా తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. బుధవారం జిల్లాకేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు వీరిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. దీంతో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వీరి నుంచి 5 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, ఎస్ఐలు జలంధర్‌రెడ్డి, జగన్, రాణి, జయన్న, రామరాజు, ఏఎస్ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. బంగారం, రూ.3 లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ -
కూలీ పనులకు వెళ్లొస్తూ.. అనంతలోకాలకు
ఎర్రవల్లి: పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి వస్తున్న ఇద్దరిని కారు రూపంలో మృత్యువు కబలించి.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కోదండాపురం ఎస్ఐ మురళి వివరాల మేరకు.. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన హరిజన బీసన్న (36), ఎండీ రఫి (62) కూలీ పని కోసం ద్విచక్ర వాహనంపై మంగళవారం కోదండాపురం వచ్చారు. కూలీ పనులను ముగించుకొని అర్ధరాత్రి సమయంలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కోదండాపురం కోల్డ్ స్టోరేజ్ సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా వస్తూ వీరి బైక్‌ను డీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి రక్తగాయాలు కావడంతో స్థానికులు హైవే అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇరువురు కూలీలకు ముగ్గురు చొప్పున సంతానం ఉన్నారు. మృతుడు హరిజన బీసన్న భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోషించే పెద్ద దిక్కులను కోల్పోయి ఇరువురి కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టిన కారు ఇద్దరు కూలీల దుర్మరణం ఎర్రవల్లి మండలం కోదండాపురంసమీపంలో ఘటన -
కృష్ణా స్టేషన్లో అన్ని రైళ్లు ఆపాలి
కృష్ణా: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలును నిలపాలని కోరుతూ బుధవారం అఖిలపక్ష నాయకులు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ కుమార్ జైన్‌కు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు నల్లబ్యాడ్జీలు ధరించి రైల్వేస్టేషన్ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, బీజేపీ జాతీయ నాయకుడు అమర్‌కుమార్ దీక్షిత్ మాట్లాడుతూ.. కరోనా కాలం కంటే ముందు ఇక్కడ ప్రతి రైలును నిలిపేవారని తెలిపారు. కృష్ణా గ్రామ సమీపంలోని కృష్ణానదీ తీరంలో పిండ ప్రదానం కోసం ముంబై, బెంగళూరు, గుజరాత్ తదితర ప్రాంతాల భక్తులు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చేవారని గుర్తుచేశారు. కరోనా కాలం తర్వాత కృష్ణా స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపకుండా వెళ్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారన్నారు. రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రులు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా ప్రజల అవసరాలను గుర్తించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్, ఉమ్మడి మండల అధ్యక్షుడు నర్సప్ప, నాయకులు మహాదేవ్, నాగేష్, కిష్టప్ప, శంకరప్ప, శంకర్, శక్తిసింగ్ పాల్గొన్నారు. దక్షిణమధ్య రైల్వే జీఎంకు విన్నవించిన అఖిలపక్ష నాయకులు -
వేప పిండితో పంటలకు మేలు
అలంపూర్: పంటల సమగ్ర పోషక యాజమాన్యంలో వేప ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కీటకాలను సమర్థవంతంగా ఎదుర్కొనే అజాడి రక్తిన్ అనే పదార్థం వేప గింజలో సమృద్ధిగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ సూచించారు. వేప గింజల నుంచి పిండిని తయారుచేసి పంటలకు ఉపయోగించవచ్చని తెలిపారు. వేప పిండిలో ఉండే లక్షణాలు, ఉపయోగాలను ఆయన రైతులకు వివరించారు. పోషకాలు: వంద కిలోల వేప పిండిలో 3.56 కిలోల నత్రజని, 0.83 కిలోల భాస్వరం, 1.67 కిలోల పొటాషియం ఉంటుంది. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఐదు కిలోల వేప పిండిని 200 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టిన తర్వాత పలచటి గుడ్డతో వడగట్టి వచ్చిన ద్రవణాన్ని పంటలకు పిచికారీ చేస్తే అనేక లాభాలు ఉన్నాయి. ఆహార ధాన్యాల్లో: వరిపంటలో వేప పిండిని యూరియాతో 5:1 నిష్పత్తిలో చల్లితే చీడపీడలు ఆశించవు. 30శాతం నత్రజని ఆదా అవుతుంది. మొక్కలు నత్రజని తీసుకునే శక్తిని పెంచవచ్చు. ఎకరాకు 80 కిలోల వేప పిండిని వాడితే కాయతొలుచు పురుగు, ఉల్లి కోడును నివారించవచ్చు. ● కంది, పెసర, మినుము, ఆముదం పంటల్లో ఎకరాకు 80 కిలోల వేప పిండి వాడటం వల్ల పురుగుల బెడద తగ్గించవచ్చు. 5శాతం వేప కషాయం పిచికారీతో రెక్కల పురుగుల గుడ్లు పొదగవు. ● వేరుశనగలో ఎకరాకు 100 కిలోల వేప పిండి వాడటం వల్ల వేరు కుళ్లు, కాయకుళ్లు తెగుళ్లను నివారించవచ్చు. కూరగాయ పంటల్లో: ఎకరా టమాటా తోటతో 200 కిలోల వేప పిండి వేయడం వల్ల పూత రాలడం, కాయతొలుచు పురుగులను తగ్గించవచ్చు. టమాటాకు ఆశించే పాము పొడ పురుగు నివారణకు వేప పిండితో తయారు చేసిన 50 శాతం ద్రవణాన్ని మొక్కలు నాటిన 10–15 రోజుల్లో పిచికారీ చేయాలి. ● క్వాలీఫ్లవర్ ఎకరాకు 100 కిలోల వేప పిండి వాడటంతో కులు తెగులు రాకుండా నివారించవచ్చు. వాణిజ్య పంటల్లో: పత్తిలో ఎకరాకు 50 కిలోల వేప పిండి వాడటం వల్ల వేరుకుళ్లు తెగులును పూర్తిగా అరికట్టవచ్చు. యూరియాలోని నత్రజని ఎక్కువ కాలం అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో వినియోగించుకుంటాయి. పండ్ల తోటల్లో: మామిడి, బత్తాయి తోటల్లో 3 కి లోల వేప పిండిని ఏడాది వయసు ఉన్న మొక్కలకు వాడాలి. కాండంతొలుచు, వేరుతొలుచు పురుగులను నివారించుకోవచ్చు. పూత వచ్చే సమయంలో, పిందె సమయంలో 5శాతం వేప ద్రావణం పిచికారీ చేసి చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు. పూలతోటల్లో: పూలతోటలైన కనకాంబరం, లిల్లీ మల్లె తోటల్లో వేప పిండిని వాడటం వల్ల నులిపురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. పాడి–పంట -
అవసరాలకు తగట్టు బడ్జెట్
ప్రజల అవసరాలకు తగట్టుగా బడ్జెట్ ఉంది. పట్టణాభివృద్ధి కోసం రూ.4 వేల కోట్లు పెట్టగా.. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు అత్యధిక నిధులు వచ్చే అవకాశం ఉంది. యువ వికాసం ప్రతి నియోజకవర్గంలో 4 వేల మంది యువతకు అమలవుతుంది. ఇరిగేషన్ కింద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్ కేటాయింపులు జరుగుతుంది. నీటి పారుదల, విద్య, వైద్యరంగాలకు మంచి బడ్జెట్ ఇది. – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ ఆరు గ్యారంటీలను గాలికివదిలేశారు రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు గాలికి వదిలేసిన విధంగా కొత్త బడ్జెట్ ఉంది. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసే, ఉదండాపూర్ నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశం పాలకులు లేనట్లుంది. పాలమూరు యూనివర్సిటీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశమే కనిపించడం లేదు. – ఎ.రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
కురుమూర్తిస్వామి ఆలయాభివృద్ధికి రూ.110 కోట్లు
పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్‌రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
అడ్డాకుల: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మూసాపేట మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు చికిత్స చేసే గది, ల్యాబ్, మందులు, కాన్పుల వివరాల గురించి వాకబు చేశారు. చికిత్స కోసం పీహెచ్‌సీకి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వేసవికాలంలో వడదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చే రోగులకు తగిన చికిత్స అందించి రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని కోరారు. ఆస్పత్రిలో నిల్వ ఉన్న మందులను ఎప్పటికప్పుడు పరిశీలించి కాలంచెల్లిన వాటిని తొలగించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. డా.షబానాబేగం తదితరులున్నారు. ఆందోళనకు గురికావొద్దు భూత్పూర్ : పదో తరగతి విద్యార్ధులు పరీక్షలంటే ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో రాత్రి బస చేశారు. పదో తరగతి విద్యార్ధినులు పరీక్ష కేంద్రానికి వెళ్లిన వెంటనే కొద్ది సేపు రిలాక్స్ కావాలని, మెడిటేషన్ చేయాలని ఆమె సూచించారు. అనంతరం పాఠశాలలో వసతులు, భోజనం, ఆటస్థలం తదితర విషయాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా బేగం, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రమాదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి ఇందిర, తహసీల్దార్ జయలక్ష్మి, ఎంపీడీఓ ప్రభాకర్, ఎంఈఓ ఉషారాణి, కేజీవీబీ ప్రిన్సిపాల్ శైలజా, సిబ్బంది తదితరులు ఉన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి -
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
వనపర్తి: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పట్టుకున్నట్లు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని ప్యాటగడ్డవీధికి చెందిన జలగరి ముత్తు, గాంధీనగర్‌కు చెందిన దుల్లోల రాజు తాగుడు, జల్సాలు, కోటి పందేలు తదితర వ్యసనాలకు అలవాటు పడి గతంలో గొర్రెల దొంగతనం చేయడంతో పాన్‌గల్ పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. జైలులో వారికి జడ్చర్లకు చెందిన మూర్తి పరిచయమై తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేస్తే బంగారం, వెండి, నగదు దొరుకుతాయని.. బంగారం, వెండి విక్రయిస్తే డబ్బులు బాగా వస్తాయని తెలిపాడు. అతడి మాటలతో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లపై రెక్కి నిర్వహించి రాత్రిళ్లు చొరబడి ఇంటి, బీరువా తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. బుధవారం జిల్లాకేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు వీరిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. దీంతో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వీరి నుంచి 5 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, ఎస్ఐలు జలంధర్‌రెడ్డి, జగన్, రాణి, జయన్న, రామరాజు, ఏఎస్ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. బంగారం, రూ.3 లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ -
వేరుశనగ క్వింటాల్ రూ.7,050
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,050, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,649, కనిష్టంగా రూ.6,111, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,137, ఆముదాలు, జొన్నలు గరిష్టంగా రూ.4,379, కనిష్టంగా రూ.3,977 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందుల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,019గా ఒకే ధర పలికింది. హాస్టళ్లలో మౌలికవసతులు కల్పించాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి హాస్టళ్లు, కేజీబీవీలలో మౌలిక వసతులు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికల గురుకులాలు, వసతి గృహాలలో సీసీ కెమెరాలు పని చేసే స్థితిలో ఉండాలన్నారు. అదనపు టాయిలెట్లు అవసరం ఉన్న చోట ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. అత్యవసర చిన్న, చిన్న మరమ్మతులు వెంటనే చేపట్టాలని, కిచెన్, వంటగది, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సమావేశంలో డీఈఓ ప్రవీణ్, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఎస్టీ సంక్షేమాధికారి ఛత్రునాయక్, మైనార్టీ శాఖ జిల్లా అధికారి శంకరాచారి పాల్గొన్నారు. -
వేప పిండితో పంటలకు మేలు
అలంపూర్: పంటల సమగ్ర పోషక యాజమాన్యంలో వేప ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కీటకాలను సమర్థవంతంగా ఎదుర్కొనే అజాడి రక్తిన్ అనే పదార్థం వేప గింజలో సమృద్ధిగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ సూచించారు. వేప గింజల నుంచి పిండిని తయారుచేసి పంటలకు ఉపయోగించవచ్చని తెలిపారు. వేప పిండిలో ఉండే లక్షణాలు, ఉపయోగాలను ఆయన రైతులకు వివరించారు. పోషకాలు: వంద కిలోల వేప పిండిలో 3.56 కిలోల నత్రజని, 0.83 కిలోల భాస్వరం, 1.67 కిలోల పొటాషియం ఉంటుంది. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఐదు కిలోల వేప పిండిని 200 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టిన తర్వాత పలచటి గుడ్డతో వడగట్టి వచ్చిన ద్రవణాన్ని పంటలకు పిచికారీ చేస్తే అనేక లాభాలు ఉన్నాయి. ఆహార ధాన్యాల్లో: వరిపంటలో వేప పిండిని యూరియాతో 5:1 నిష్పత్తిలో చల్లితే చీడపీడలు ఆశించవు. 30శాతం నత్రజని ఆదా అవుతుంది. మొక్కలు నత్రజని తీసుకునే శక్తిని పెంచవచ్చు. ఎకరాకు 80 కిలోల వేప పిండిని వాడితే కాయతొలుచు పురుగు, ఉల్లి కోడును నివారించవచ్చు. ● కంది, పెసర, మినుము, ఆముదం పంటల్లో ఎకరాకు 80 కిలోల వేప పిండి వాడటం వల్ల పురుగుల బెడద తగ్గించవచ్చు. 5శాతం వేప కషాయం పిచికారీతో రెక్కల పురుగుల గుడ్లు పొదగవు. ● వేరుశనగలో ఎకరాకు 100 కిలోల వేప పిండి వాడటం వల్ల వేరు కుళ్లు, కాయకుళ్లు తెగుళ్లను నివారించవచ్చు. కూరగాయ పంటల్లో: ఎకరా టమాటా తోటతో 200 కిలోల వేప పిండి వేయడం వల్ల పూత రాలడం, కాయతొలుచు పురుగులను తగ్గించవచ్చు. టమాటాకు ఆశించే పాము పొడ పురుగు నివారణకు వేప పిండితో తయారు చేసిన 50 శాతం ద్రవణాన్ని మొక్కలు నాటిన 10–15 రోజుల్లో పిచికారీ చేయాలి. ● క్వాలీఫ్లవర్ ఎకరాకు 100 కిలోల వేప పిండి వాడటంతో కులు తెగులు రాకుండా నివారించవచ్చు. వాణిజ్య పంటల్లో: పత్తిలో ఎకరాకు 50 కిలోల వేప పిండి వాడటం వల్ల వేరుకుళ్లు తెగులును పూర్తిగా అరికట్టవచ్చు. యూరియాలోని నత్రజని ఎక్కువ కాలం అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో వినియోగించుకుంటాయి. పండ్ల తోటల్లో: మామిడి, బత్తాయి తోటల్లో 3 కి లోల వేప పిండిని ఏడాది వయసు ఉన్న మొక్కలకు వాడాలి. కాండంతొలుచు, వేరుతొలుచు పురుగులను నివారించుకోవచ్చు. పూత వచ్చే సమయంలో, పిందె సమయంలో 5శాతం వేప ద్రావణం పిచికారీ చేసి చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు. పూలతోటల్లో: పూలతోటలైన కనకాంబరం, లిల్లీ మల్లె తోటల్లో వేప పిండిని వాడటం వల్ల నులిపురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. పాడి–పంట -
ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. ఎన్‌వైకే ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాత డ్వామా కార్యాలయంలోని మీటింగ్‌హాల్‌లో ఎయిడ్స్, సుఖవ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవగాహనతో ఎయిడ్స్‌ను నియంత్రించ వచ్చని తెలిపారు. ముఖ్యంగా యువత చైతన్యం కావాలని, ఎయిడ్స్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఆర్ఎసీటీఐ డైరెక్టర్ శ్రీనివాస్‌నాయక్, జిల్లా యువజన అధికారి కోటానాయక్, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజర్ శ్రీశైలం పాల్గొన్నారు. 23న మహిళా శక్తి పురస్కారాలు ప్రదానం స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ మహిళా సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీల శక్తిపీఠం హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లాకేంద్రంలోని భారత్ స్కౌట్స్, గైడ్స్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సాహిత్య సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న మహిళలకు ‘మహిళా శక్తి పురస్కారాలు’ విశ్వావసు నామ ఉగాదిని పురస్కరించుకొని ప్రముఖ సాహితీవేత్తలకు ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ కవి డాక్టర్ బాలస్వామి రచించిన నమో శిల్పి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని కవులు, రచయిత్రులు, సాహితీవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ‘టెన్త్’ పరీక్ష కేంద్రాలపై పోలీస్ నిఘా: ఎస్పీ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రతి కేంద్రం దగ్గర సెక్షన్ 163 బీఎన్ఎస్ అమల్లో ఉంటుందని, పరీక్ష కేంద్రాలపై పోలీస్ నిఘా ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు. పరీక్షల నేపథ్యంలో ఎలాంటి సభలు, ర్యాలీలు, మైక్ సౌండ్స్, డీజేలు, ధర్నాలు నిర్వహించరాదని తెలిపారు. పరీక్ష సమయంలో స్థానికంగా ఉండే ఇంటర్నెట్, జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీస్ సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల దగ్గర పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి’ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పింఛన్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దీప్లా నాయక్, నల్లవెల్ల కురుమూర్తి కోరారు. బుధవారం తెలంగాణ ఆశా కార్యకర్తల సంఘం (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల వేతనం కోసం ప్రత్యేక గ్రాంటు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దుపరచాలని, శిక్షణ పూర్తిచేసిన ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎంగా పదోన్నతి కల్పించాలన్నారు. అనంతరం ర్యాలీగా తెలంగాణచౌరస్తా వరకు చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రాములు, పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.రాంరెడ్డి, సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్, కమర్‌అలీ, ఆశా కార్యకర్తల సంఘం నాయకులు సావిత్రి, పద్మ, యాదమ్మ, హైమావతి, రాధ, సౌజన్య, అనంతమ్మ, అమృత, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా స్టేషన్లో అన్ని రైళ్లు ఆపాలి
కృష్ణా: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలును నిలపాలని కోరుతూ బుధవారం అఖిలపక్ష నాయకులు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ కుమార్ జైన్‌కు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు నల్లబ్యాడ్జీలు ధరించి రైల్వేస్టేషన్ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, బీజేపీ జాతీయ నాయకుడు అమర్‌కుమార్ దీక్షిత్ మాట్లాడుతూ.. కరోనా కాలం కంటే ముందు ఇక్కడ ప్రతి రైలును నిలిపేవారని తెలిపారు. కృష్ణా గ్రామ సమీపంలోని కృష్ణానదీ తీరంలో పిండ ప్రదానం కోసం ముంబై, బెంగళూరు, గుజరాత్ తదితర ప్రాంతాల భక్తులు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చేవారని గుర్తుచేశారు. కరోనా కాలం తర్వాత కృష్ణా స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపకుండా వెళ్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారన్నారు. రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రులు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా ప్రజల అవసరాలను గుర్తించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్, ఉమ్మడి మండల అధ్యక్షుడు నర్సప్ప, నాయకులు మహాదేవ్, నాగేష్, కిష్టప్ప, శంకరప్ప, శంకర్, శక్తిసింగ్ పాల్గొన్నారు. దక్షిణమధ్య రైల్వే జీఎంకు విన్నవించిన అఖిలపక్ష నాయకులు -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యరంగాలతో పాటు ఆర్థికంగా వెనుకబడి కులాలను ఆదుకోవడానికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా బడ్జెట్ ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా, అమలు కాని హామీలు ఇచ్చి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసిందని ఆరోపించారు. ఈ బడ్జెట్‌పై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రైతుభరోసాపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రైతుబిడ్డ సీఎంగా ఉన్నారని, అందువల్ల రైతుల సంక్షేమం కోసం రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రూ.6వేల కోట్లు, ఈడబ్ల్యూఎస్‌కు రూ.1000కోట్లతో సబ్సిడీ రుణం అందించనున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో కురుమూర్తి క్షేత్రం గురించి ప్రస్తావించడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, సీజే బెనహర్, గోవర్ధన్‌రెడ్డి, రాములుయాదవ్, అవేజ్ అహ్మద్, సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి -
26 రోజులైనా జాడే లేదు
అచ్చంపేట/మన్ననూర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఏడుగురు కార్మికుల ఆచూకీ కోసం 26వ రోజు బుధవారం సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగించినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సొరంగంలోని పరిస్థితులపై మరోమారు అధ్యయనం చేసి సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మినీ ఇటాచీ ద్వారా తవ్వకాలు చేపట్టి మట్టి, రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. కేరళకు చెందిన కడావర్ డాక్స్ గుర్తించిన డి–1, డి–2 ప్రదేశాల్లో సింగరేణి మైన్స్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్, కడావర్ డాగ్స్, హైడ్రా, అన్వి రోబోటిక్స్, దక్షిణమధ్య రైల్వే, జీఎస్ఐ, జలవనరులశాఖల బృందాలు పనిచేస్తున్నాయి. అందుబాటులోకి రాని రోబోల సేవలు.. వారం రోజులైనా రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. అటానమస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబో అనుసంధానంగా ఏర్పాటు చేసిన వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకు సాంకేతిక సమస్యల కారణంగా సొరంగం వద్దే ఉండిపోయాయి. సొరంగం చివరి పాయింట్ 40 మీటర్ల వద్ద రోబోలతో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇన్స్టాలేషన్, సిగ్నలింగ్ సమస్యగా చెబుతున్నా.. టీబీఎం శకలాలు అడ్డుగా ఉండటంతోనే వీటి సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిని పూర్తిగా తొలగిస్తే తప్ప రోబో ద్వారా మట్టి, బురద, రాళ్లు బయటకు తరలించవచ్చని భావిస్తున్నారు. 1,600 టన్నుల స్టీల్, మట్టి తరలింపు.. ఇప్పటి వరకు 800 టన్నుల స్టీల్‌ను లోకో ట్రైన్ ద్వారా, 800 టన్నుల మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు. నాలుగు ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్లతో నిరంతరాయంగా మట్టి, స్టీల్ తొలగింపు పనులు చేపడుతున్నారు. లోకో ట్రైన్‌తోనే తరలింపు వేగవంతం అవుతుందని గుర్తించిన అధికారులు ప్రమాద స్థలం వరకు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. వాటర్ జెట్ సాయంతో బురదను బయటకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు. ఎస్కవేటర్లతో పనులు ముమ్మరం.. సొరంగంలో టీబీఎం ప్లాట్‌ఫామ్ భాగాలు కత్తిరించే ప్రక్రియ, ఎస్కవేటర్లతో మట్టి తొలగింపు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్థ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి డా. హరీశ్, సింగరేణి రెస్క్యూ జీఎం బైద్య సొరంగం లోపలి పరిస్థితులు వివరించారు. డి–1, డి–2 ప్రదేశాల్లో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, టీబీఎం భాగాలను అల్ట్రా థర్మల్ కట్టర్‌తో తొలగిస్తూ మట్టిని ఎస్కవేటర్లు, కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాల ఉన్నతాధికారులు సొరంగం లోపల ప్రమాద స్థలంలో ఉంటూ సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, పర్యవేక్షణ చేపడుతున్నారని చెప్పారు. -
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన
కల్వకుర్తి టౌన్: బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యం, అంబులెన్స్ డ్రైవరే కారణమంటూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పట్టణంలోని సీహెచ్‌సీ ముందు బుధవారం నిరసన తెలిపారు. ఆస్పత్రి గేటు ముందు నిరసన తెలపడంతో ఓపీ సమయంలో రోగులు ఆస్పత్రిలోకి రాకుండా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆస్పత్రిలో వరుస ఘటనలు జరుగుతున్నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. పోలీసులు అక్కడి చేరుకొని గేటు ముందు ధర్నా చేయటం సరికాదని చెప్పటంతో ఆస్పత్రి ముందు రహదారిపై నిరసన తెలిపారు. పలు పార్టీల నాయకులు పాల్గొని బాధితు కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఆస్పత్రి ముందు నిరసన తెలియజేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఫోన్‌చేసి మాట్లాడారు. మృతురాలి కుంటబానికి పరిహారంతో పాటుగా, ఒకరికి ఏదైనా ఉద్యోగం వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. బాలింత మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించాలని ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత అంబులెన్స్ సేవలపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఉచిత సేవల కొరకు ప్రారంభించిన ఉద్దేశం బాగానే ఉన్నా దానిని నడిపించే డ్రైవర్‌కు రోగి పరిస్థితి విషమంగా అనిపిస్తేనే వారు సేవలను అందిస్తారని భాధిత కుటుంబసభ్యులు, ఆసుపత్రిలో కొంతమంది సిబ్బంది ఆరోపించారు. సకాలంలో ఆ అంబులెన్స్‌లు స్పందించినా బాలింత మృతిచెందకుండా ఉండేదని కాదన్నారు. వెల్దండ సీఐ విష్ణువర్థన్‌రెడ్డి , ఎస్ఐలు మాధవరెడ్డి, మహేందర్, కురుమూర్తి, డివిజన్లోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా ఎమ్మెల్యే హామీతో విరమణ -
మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం సుమారు పది వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణ ఉల్లి కుప్పలతో నిండిపోయింది. వ్యాపారులు అన్ని కుప్పలకు వేలం వేయడానికి సమయం సరిపోలేదు. మధ్యాహ్నం 2 గంటలైనా వేలం ముగియకపోవడంతో చాలామంది రైతులు ఉల్లిని బస్తాల్లో నింపి విక్రయించారు. కొనుగోలుదారులు ఎగబడి ఎవరికి వారే సంచుల్లో నింపుకొని తూకాలు వేయించుకోవడం కనిపించింది. ఓ పక్క వ్యాపారులు, మరోపక్క రైతులు ఉల్లి విక్రయాలు సాగించడంతో మార్కెట్ అంతా కిక్కిరిసిపోయింది. కాస్త మెరుగ్గా ధరలు.. బుధవారం జరిగిన బహిరంగ వేలంలో ధరలు గత వారం కంటే కొంత వరకు పెరిగాయి. ఉల్లి బాగా ఆరబెట్టడంతో పాటు నాణ్యతగా ఉండటంతో వ్యాపారులు పోటీపడి వేలం పాడారు. క్వింటా గరిష్టంగా రూ.2,000 పలికింది. ఇది గత వారం కంటే రూ.400 ఎక్కువ. అలాగే కనిష్టంగా రూ.1,400 నమోదుకాగా.. గత వారం కంటే రూ.300 వరకు పెరిగింది. 50 కిలోల బస్తాలుగా మార్పు.. గతంలో మార్కెట్‌యార్డులో నిబంధన పేరుతో 45 కిలోల బస్తా క్వింటా ధరలో సగం ధరకు విక్రయించేవారు. దీంతో వ్యాపారి 5 కిలోల ఉల్లిని నేరుగా దోచుకునే పరిస్థితి ఉండేది. ఈసారి మార్కెట్ నిబంధనలు సవరించి 50 కిలోల బస్తాలుగా తూకం వేశారు. మార్కెట్ అంతా 50 కిలోల బస్తాలే విక్రయించారు. నాణ్యమైన ఉల్లి బస్తా రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు.. రెండోరకం ఉల్లి రూ.500 నుంచి రూ.700 వరకు విక్రయించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినవారు వేలాదిబస్తాల ఉల్లిని కొనుగో లు చేయడంతో వ్యాపారం జోరుగా సాగింది. క్వింటా గరిష్టంగా రూ. రెండు వేలు.. కనిష్టంగా రూ.1,400 -
నల్లమల పర్యాటకంపై దృష్టి..
రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు. ● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణాలు, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్, క్యాంపింగ్, కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది. -
ఆర్థిక ఇబ్బందులతోఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
మహబూబ్‌నగర్ క్రైం: ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్థాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ సీఐ అప్పయ్య వివరాల మేరకు.. 2009 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్ (38) జిల్లా కేంద్రంలోని గౌడ్స్ కాలనీలో నివాసముంటూ.. స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ సెక్షన్లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతడికి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదం జరగడంతో తల, చేతులకు గాయాలయ్యాయి. దీంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో రెండు, మూడు రోజుల నుంచి తన జీవితం మొత్తం అయిపోయిందని చెబుతూ.. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు భోజనం చేసి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి శ్రీనివాస్ ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. యువకుడి బలవన్మరణం లింగాల: మండలంలోని అంబట్పల్లికి చెందిన చింతకింది బాబు (30) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు.. బాబు బల్మూర్‌లోని ఓ మద్యం దుకాణంలో రోజువారి కూలీగా పని చేసేవాడు. బుధవారం వ్యవసాయ పొలానికి వెళ్లి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించినట్లు ఎస్ఐ వివరించారు. కారు, బైక్ ఢీ: ఒకరి మృతి తాడూరు: కారు, బైక్ ఢీ కొని ఒకరు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ గురుస్వామి కథనం ప్రకారం.. గుంతకల్ గ్రామానికి చెందిన కోడేల చంద్రయ్య(35) తన పొలం నుంచి బైక్‌పై గ్రామానికి బయల్దేరాడు. కల్వకుర్తి మండలం తర్నికల్ నుంచి తాడూరు వైపునకు వస్తున్న కారు ఢీకొనడంతో చంద్రయ్య తీవ్ర గాయపడ్డాడు. వెంటనే ఆయనను కల్వకుర్తిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు.. నారాయణపేట రూరల్: కర్ణాటకకు చెందిన ఓ వృద్దుడు రాష్ట్ర సరిహద్దులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిటకల్ తాలూకా పరమేశ్పల్లికి చెందిన మల్లపొల్ల మొగలప్ప (59)కు అన్పూర్, జలాల్పూర్ గ్రామాల్లో చుట్టాలున్నారు. అప్పుడప్పుడు ఆయా గ్రామాలకు వచ్చి వెళ్లేవాడు. ఎప్పటిలాగే ఈ నెల 16న జలాల్పూర్ వెళ్తున్నట్లు చెప్పి ఊరు నుంచి వెళ్లాడు. అతడు రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో బంధువుల ఇంటికి ఫోన్‌చేసి ఆరా తీయగా.. రాలేదని చెప్పడంతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం జలాల్పూర్ గ్రామ శివారులో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఒంటిపై రక్తగాయాలు కనిపించడంతో అనుమానాలు వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు ● ఇంటర్ పరీక్షకు గైర్హాజరు శాంతినగర్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. స్థానికుల వివరాల మేరకు.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సుభాష్, మానవపాడు మండలం గోకులపాడుకు చెందిన మరో విద్యార్థి శివయ్య అయిజలో పరీక్ష రాసేందుకు బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలోని జూలెకల్ శివారులో వీరు వెళ్తున్న బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం చివరి పరీక్షను వారు రాయలేకపోయారు. -
జాతీయ ఆర్చరీ పోటీల్లో పతకాలు సాధించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఈనెల 22 నుంచి 27 వరకు జరగనున్న జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ చాటాలని జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి రాంచందర్ అన్నారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు వెళుతున్న 18 మంది క్రీడాకారులను బుధవారం మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యమ గొంతుక మల్లు స్వరాజ్యం’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కమ్యూనిస్టు ఉద్యమ గొంతుక మల్లు స్వరాజ్యం అని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లె గోపాల్ అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతకు మల్లు స్వరాజ్యం ఆదర్శప్రాయురాలు అని పేర్కొన్నారు. మహిళా సంఘం నేతగా, ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకమై వివిధ ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి అని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నల్లవెల్లి కురుమూర్తి, బి.చంద్రకాంత్, జి.రాజ్‌కుమార్, వరద గాలన్న, సురేష్, ఈశ్వర్, ఆంజనేయులు, భాస్కర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పీయూలో వివిధ విభాగాలకు హెచ్ఓడీల నియామకం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పలు డిపార్ట్మెంట్లకు సంబంధించి నూతన హెచ్ఓడీలను నియమిస్తూ వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బాటనీ హెచ్ఓడీగా శివకుమార్‌సింగ్, ఎంబీఏ జావిద్‌ఖాన్, కంప్యూటర్ సైన్స్ సబిత, ఎకానమిక్స్ వెంకట రాఘవేందర్, ఎడ్యుకేషన్ విభాగం ఆంజనేయులు, మ్యాథ్స్ సురేష్, సోషల్‌వర్క్ మాధురిమోహన్, జువాలజీ వేణు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రవికుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా కొత్త హెచ్ఓడీలను వీసీతో పాటు రిజిస్ట్రార్ చెన్నప్ప శుభాకాంక్షలు తెలిపారు. -
నల్లమలలో బోరుబావుల ఏర్పాటు
మన్ననూర్: నల్లమలలో అటవీ ప్రాంతంలోని వణ్యప్రాణులు, చెంచుపెంటల్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు సౌరశక్తితో బోరుబావులు ఏర్పాటు చేయనున్నట్లు మార్చుసా కార్పొరేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. బుధవారం రాంపూర్, పుల్లాయిపల్లి తదితర చెంచుపెంటల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమిత్ బజోరియా మాట్టాడుతూ.. నల్లమలలోని మన్ననూర్, అమ్రాబాద్, మద్దిమడుగు, దోమలపెంట రేంజ్ పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సౌరశక్తితో తాగునీరు అందించే బోరుబావులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూర్యోదయం మొదలుకొని సూర్యస్తమయం వరకు ఈ బోరుబావులు పనిచేసే విధంగా రూపకల్పన చేసినట్లు వివరించారు. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు వరుసగా రెండేళ్లపాటు బంగారు పథకాలను సాధించిందని తెలిపారు. -
రైతులను దగా చేయకండి
అలంపూర్ రూరల్: దేశానికి రైతులు వెన్నెముక అని అంటున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సమస్యలు ప్రభుత్వాలకు పట్టడం లేదని పొగాకు రైతుల అవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను దగా చేయకండని బొమ్మిడాల పొగాకు కంపెనీ యాజమాన్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలంపూర్ మండల పరిధిలోని కోనేరు గ్రామ శివారులోని బొమ్మిడాల కంపెనీ యాజమాన్యంపై పొగాకు చెక్కులకు సరైన ధరను కల్పించకుండా, తెచ్చిన చెక్కులను కనీసం చూడకుండా సీఆర్ చేస్తున్నారని పొగాకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులకు సరైన ధర కల్పించి న్యాయం చేయాలని కోరారు. గ్రామాల్లో ఎఫ్టీ పరిశీలించి సరుకును తీసుకురమ్మరని, తీరా కంపెనీ వద్దకు తెస్తే సరుకు నాణ్యత లేదని సీఆర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం రూ.15,500 ధర కల్పించాల్సి ఉండగా రూ.8 వేలు, 10 వేలు, 12 వేలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తట్లు వారే ఇచ్చి.. వారే కట్టుకురమ్మని రైతులను ఇబ్బందులు పెడుతున్నట్లు వాపోయారు. 30 మంది రైతుల సరుకును సగం ధరకు కూడా తీసుకోకుండా సీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మిడాల కంపెనీ యాజమాన్యంపై పొగాకు రైతుల ఆగ్రహం -
రూ.7లక్షల విలువైన 47 ఫోన్ల రికవరీ
నారాయణపేట: మొబైల్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గత రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైళ్లు పోగొట్టుకున్న 47 మంది బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీ ఆధారంగా నారాయణపేట జిల్లా పరిధిలో 47 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని, వాటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. ఎవరు పాత మొబైల్ ఫోన్లను కొనరాదన్నారు. మొబైళ్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన ఐటి కోర్ కానిస్టేబుల్ రమేష్ ఎస్పీ అభినందించారు. -
నేటికీ బియ్యం ఇవ్వలేదు..
ప్రతినెల 20 నుంచి 30వ తేదీలోపు స్టాక్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు బియ్యం చేరుకోవాలి. ఆ తర్వాత 1వ తేదీ నుంచి నుంచి 17వ తేదీ వరకు రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తాం. అయితే ఈనెల 19వ తేదీ వచ్చినా ఇంతవరకు మా రేషన్‌షాపునకు బియ్యం సరఫరా చేయలేదు. జనం బియ్యం కోసం ప్రతిరోజూ వచ్చి పోతున్నారు. నేడో.. రేపో బియ్యం వస్తే అధికారులు 22 లేదా 25 పంపిణీ చివరి తేదీ అంటారు. బియ్యం సరఫరా నిలిపివేస్తారు. ఇలా ఎన్నోమార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బియ్యం పంపిణీకి 30వ తేదీ వరకు సమయం ఇవ్వాలి. – మోహన్‌నాయక్, రేషన్ డీలర్, అన్నారెడ్డిపల్లి తండా, మహమ్మదాబాద్ మండలం ఒకటి, రెండు రోజుల్లో... పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌బియ్యం సరఫరాలో కొంత ఆలస్యం జరిగింది. ఒకటి, రెండు రోజుల్లో అన్ని దుకాణాలకు బియ్యం పంపేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు 3,900 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా పూర్తయింది. ఈనెల 25వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తాం. – తోట వెంకటేష్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ● -
డ్రోన్లతో సాగు సులభం
పాన్‌గల్: అన్నదాతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అందుబాటులోకి వస్తుండటంతో కాస్త ఊరట కలిగిస్తుంది. వరి, వేరుశనగ, పత్తి, కంది తదితర పంటలకు డ్రోన్‌తో మందులు పిచికారీ చేస్తుండడంతో భారం తగ్గింది. వేగంగా పనులు పూర్తి చేయడం, తక్కువ ధరకే ప్రక్రియ పూర్తికావడంతో.. చాలా మంది రైతులు అటువైపుగా ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక మందుల ఆదా.. డ్రోన్ సహయంతో మందు పిచికారీ చేయడంతో రసాయనిక మందులు ఆదా అవుతున్నాయి. డ్రోన్‌తో నాలుగు నుంచి ఐదు నిమిషాల్లోనే ఎకరాకు మందు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. ఎకరానికి సరిపోయే మందు రెండెకరాలకు వస్తుంది. కూలీల ఖర్చులు తప్పుతున్నాయి. డ్రోన్‌తో పిచికారీ కోసం ఎకరానికి రూ.450 నుంచి రూ. 500 తీసుకుంటున్నారు. ఒక రోజుకు 20 నుంచి 30 ఎకరాల వరకు మందులు పిచికారీ చేసుకునే అవకాశం ఉండడంతో కూలీల కొరతను అధిగమించొచ్చు. దీంతో గ్రామాల్లో యువకులు సొంతంగా డ్రోన్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతూ స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. ఖర్చులు తగ్గి రైతులకు మేలు కలగడంతో యువతకు ఉపాధి లభించినట్లవుతుంది. మండలంలో అత్యధిక ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుండడంతో డ్రోన్లు కొనుగోలు చేసిన వారికి అన్ని కాలాల్లోనూ పని దొరుకుతుంది. చేతిపంపులతో ఇలా.. రైతులు ఎక్కువగా చేతిపంపు, ఛార్జింగ్ పంపు, పెట్రోల్‌తో నడిచే పంపులతో పంటలకు మందు పిచికారీ చేస్తుంటారు. ఎకరం పొలానికి మందు పిచికారీ చేయాలంటే గంట నుంచి రెండు గంటల వరకు సమయం పడుతుంది. నాలుగైదు ఎకరాలు ఉంటే రోజంతా అవుతుంది. ఎకరానికి 100 లీటర్లకు పైగానే నీరు అవసరం పడుతుంది. ఒకరు నీరు పోయడం మరొకరు మందు పిచికారీ చేయడం కోసం ఒక్కో కూలీకి రోజుకు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతుంది. కూలీల సమస్యకు చెక్ రైతులు స్ప్రేయర్‌తో పురుగు మందు పిచికారీ చేయాలంటే సుమారు రూ.వెయ్యి వరకు ఖర్చుయ్యేది. డ్రోన్‌తో కూలీల బెడద తప్పింది. ఖర్చు కూడా సగానికి సగం తగ్గింది. దీంతో రైతులకు సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. డ్రోన్ బ్యాటరీ కొనుగోలు, వాహనం నిర్వహణకు రూ.10 లక్షల వరకు అవుతోంది. ఇది రైతులకు భారం కావడంతో ఆసక్తి గల యువకులు డ్రోన్లను కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. పల్లెల్లో అందిపుచ్చుకుంటున్న సాంకేతికత డబ్బు, సమయం ఆదా ఆసక్తి చూపుతున్న రైతులు కొనుగోలు రాయితీ లేదు రాయితీపై డ్రోన్ కొనుగోలు చేసే అవకాశం ప్రస్తుతం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రోన్ల కొనుగోలుకు రాయితీ వస్తే రైతులకు తెలియపరుస్తాం. – రాజవర్ధన్‌రెడ్డి, ఏఓ, పాన్గల్శ్రమ తగ్గింది డ్రోన్‌తో పిచికారీ వల్ల ఐదెకరాల పొలం అరగంటలో పూర్తయింది. డ్రోన్‌తో అయితే పురుగు మందు పైరు మొదలు వరకు చేరుతోంది. తెగుళ్లు, చీడపీడల నియంత్రణ కొంత వరకు ఆశాజనకంగా ఉంది. డ్రోన్‌తో మందుల పిచికారీతో సమయం, డబ్బు కూడా అదా అవుతుంది. – లింగాల రాములు, రైతు, పాన్‌గల్ -
సంఘాల పోరాటాల ఫలితమే బీసీ బిల్లు
స్టేషన్ మహబూబ్‌నగర్: బీసీ సంఘాల పోరాటాల ఫలితమే బీసీ బిల్లు అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌సాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం అమలుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లు పెట్టి ఆమోదించడంలో బీసీ సంఘాల పోరాటాల ఫలితంగానే సాధ్యమైందన్నారు. ఆయా కుల, బీసీ సంఘాల ప్రతినిధులు బుగ్గన్న, అశ్విని సత్యం, ఆశన్న ముదిరాజ్, విశ్వనాథ్, కేశవులు, ఆంజనేయులు, సుకుమార్, వీరప్ప, భీమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
ఉచిత న్యాయ సేవలు అందిస్తాం
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ ఇందిర మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మానసిక దివ్యాంగులు, వారి తల్లిదండ్రులకు ఉచిత న్యాయ సంబంధమైన సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డి.ఇందిర అన్నారు. బుధవారం స్థానిక టీచర్స్‌కాలనీలోని బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి వారికి ఆరోగ్యపరమైన చికిత్సలు ఎంతో అవసరమన్నారు. మానసిక దివ్యాంగుల కోసం 24 ఏళ్లుగా ప్రత్యేక పాఠశాలను నిర్వహిస్తున్న గన్నోజు చంద్రశేఖర్‌ను అభినందించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నంటి ఉంటుందన్నారు. ఇలాంటి చిన్నారులు, పెద్దలను బుద్ధిమంతులుగా తీర్చిదిద్దడం ఒక మహాయజ్ఞమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ కార్యదర్శి బి.సునీత, సభ్యులు ఆనంద్, మహదేవ్, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, మాజీ సైనికుడు ఎం.ఆర్.కె.రెడ్డి, వైద్యులు డా.ప్రణతి, డా.నమిత, డా.స్వాతి తదితరులు పాల్గొన్నారు. మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రెండోసారి హుండీ లెక్కించారు. మొత్తం రూ.రూ.35,26,085 ఆదాయం వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన హుండీ లెక్కింపు రాత్రి 7 గంటలకు సాగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ నీలకంఠ, పాలక మండలి సభ్యులు సుధా, మంజుల తదితరులు పాల్గొన్నారు. బీచుపల్లి హుండీ ఆదాయం రూ.35.69 లక్షలు ఎర్రవల్లి: బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. మొత్తం 8 నెలల 8 రోజులకు చెందిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా.. ఇందులో కరెన్సీ ద్వారా రూ.34,09,845, నాణెముల ద్వారా రూ.1,59,440 మొత్తం ఆదాయం 35,69,285 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి రామన్‌గౌడ్ పేర్కొన్నారు. గద్వాల డివిజన్ దేవాదాయ దర్మాదాయ శాఖ పరిశీలకురాలు వెంకటేశ్వరి ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. గద్వాల యూనియన్ బ్యాంకు సిబ్బంది, గద్వాల, వనపర్తి, కొత్తకోటకు చెందిన సేవా సమితి సభ్యులతోపాటు బ్యాంకు సిబ్బంది రవికుమార్, ప్రమోద్, ఆలయ సిబ్బంది, అర్చకులు, సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. బంగారం, వెండి ఆభరణాలు చోరీ చారకొండ: బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంషోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కొంపెల్లి సరిత రోజువారిగా తన ఇంటికి తాళం వేసి తాళచెవిని పక్కన పెట్టి బయటకు వెళ్లింది. గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించి 13 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి గొలుసులు, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు. తాళం చెవిని యథాస్థానంలో పెట్టారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తుమ్మిళ్ల నీటిని విడుదల చేయండి
శాంతినగర్: ఆర్డీఎస్ కెనాల్ కింద సాగు చేసిన పంటలు ఎండుతున్నాయని, తుమ్మిళ్ల లిఫ్ట్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఽజూలెకల్ శివారులోని ఆర్డీఎస్ కెనాల్లో బుధవారం ధర్నా చేపట్టారు. గత 14 రోజుల క్రితం నిలిచిపోయిన తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్ ఇప్పటి వరకు ఆన్ చేయలేదని, ఇండెంట్ నీరు విడుదల చేసినా రాకపోవడం అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమని మండిపడ్డారు. రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా కనీసం రెండు తడులైనా నీరు అందజేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజగోపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు అందని బియ్యం
మహబూబ్‌నగర్ రూరల్: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం క్షేత్రస్థాయిలో వచ్చేసరికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ప్రతి నెల ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పట్టణాలు, గ్రామాల్లో ఉన్న రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం బియ్యంతో పాటు తొమ్మిది రకాల సరుకులను రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై అందించేవారు. అన్ని నిత్యావసర సరుకులు పోగా.. ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే మిగిలింది. ప్రతి నెల రెండు, మూడు రోజులు ఆలస్యమైనా బియ్యం సరఫరా చేసేవారు. సంక్రాంతికి సన్న బియ్యం సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ దేవుడెరుగు.. ఈనెల 19వ తేదీ వచ్చినా కనీసం దొడ్డు బియ్యం కూడా సరఫరా కాకపోవడం జిల్లాలో పేదలకు శాపంగా మారింది. సన్నాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు దొడ్డు బియ్యం కూడా రాకపోవడంతో తీవ్ర అయోమయంలో పడ్డారు. బియ్యం ఎప్పుడిస్తారోనని సంచులు పట్టుకొని రేషన్‌షాపుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో నేడో.. రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ● వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పేదలకు సన్న బియ్యంగా పంపిణీ చేస్తామని స్వయంగా రాష్ట్ర పౌర సరఫరాలశాఖ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సన్న బియ్యంపై డైలమా నెలకొంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి బియ్యం కేటాయింపు ఉంటుంది. పౌర సరఫరాల సంస్థ కేటాయింపులు విధించగానే రేషన్‌షాపులకు బియ్యం స్టాక్ వెళ్తుంది. ప్రతి నెల 1వ తేదీలోపే జిల్లాలోని మూడు రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ల నుంచి పట్టణాలు, గ్రామాల్లోని 506 రేషన్‌షాపులకు బియ్యం చేరాల్సి ఉండగా.. ఇప్పటి వరకు జిల్లాలో 70 శాతం మాత్రమే బియ్యం చేరుకుంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి దుకాణాలకు బియ్యం సరఫరా కావాలి. అయితే 1వ తేదీ తర్వాత కేటాయింపు ఇవ్వడంతో రేషన్ బియ్యం పేదలకు అందకుండా సమస్యగా మారింది. జిల్లాలో 4,423 మెట్రిక్ టన్నులు కేటాయింపులకు ఇప్పటివరకు 3,900 మెట్రిక్ టన్నులు పంపిణీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి 70 శాతం మాత్రమే పంపిణీ జరిగిందని తెలుస్తుంది. ● ప్రతి ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పేదలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే సీఎంఆర్ విషయంలో మిల్లర్లు తీసుకున్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విషయంలో మిల్లర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏయే మిల్లులకు ఎంతంత కేటాయింపులు చేస్తున్నారు. తిరిగి వారు ఎప్పుడు బియ్యాన్ని అప్పగిస్తున్నారు. టార్గెట్లు ఏ మేరకు ఉన్నాయి అని అధికారులను అడిగితే వారు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. గోడౌన్ల కెపాసిటిని బట్టి అలాట్మెంట్ చేశామని పైకి అధికారులు చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి వీరు రైస్ మిల్లర్లతో కుమ్మక్కు కావడం వల్ల సమయానికి సీఎంఆర్ రైస్ అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్య ఏర్పడిందంటే ఇందుకు కారణం రేషన్‌షాపుల డీలర్లతో అధికారులు కుమ్మక్కు కావడమేనని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మార్చి నెల ఇంకా పేదలకు బియ్యం అందలేదు. నేడో.. రేపో పరిస్థితి చక్కబడుతుందని అధికారులు అంటున్నారు. అలాట్మెంట్ ప్రకారం బియ్యం తీసుకెళ్తున్న డీలర్లు అందరికీ బియ్యం పంపిణీ చేస్తారా.. లేక గుట్టుచప్పుడు కాకుండా మాయం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌర సరఫరాల సంస్థ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల మధ్య ఉన్న చీకటి ఒప్పందం కారణంగా రైస్ మిల్లర్లు రేషన్ షాపుల డీలర్లు పేదల బియ్యాన్ని పెద్దల పాలు చేస్తున్నారు. సాంకేతిక సమస్య సాకుగా... మార్చి నెల పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం సకాలంలో అందకపోవడం గల కారణాలను సాంకేతిక సాకుగా చూపిస్తున్నారు అధికారులు. వారి తప్పిదం వల్ల ఆలస్యం జరిగిందా లేక సీఎంఆర్ చెల్లింపుల్లో మిల్లర్లు మాయజాలం వల్ల ఇబ్బంది కలిగిందా అనేది విచారణలో తేలనుంది. సీఎంఆర్ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్న మిల్లర్లు అధికారుల మిలాఖత్ కారణమా..? సన్నబియ్యం దేవుడెరుగు.. ఇచ్చే బియ్యం సంగతేంటి నేటికీ 30 శాతం పేదలకు అందని బియ్యం -
పాత కక్షలతో వేటకొడవలితో దాడి
కోస్గి రూరల్: పాత కక్షలతో సొంత పెద్దనాన్నపై వేట కొడవలితో దాడి చేసిన సంఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఈర్లపల్లి మల్లప్ప, రామయ్య మధ్య భూ పంపకాలు జరిగాయి. అయితే రామయ్య కుమారుడు నర్సింహులు వరి చేనుకు నీరు పారించే విషయంలో తరుచుగా మల్లప్ప కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. దీంతో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్దిచెప్పారు. అయితే నర్సింహులు సోమవారం పొలంలో పనులు చేసుకుంటున్న మల్లప్ప దగ్గరకు వెళ్లి మరోమారు గొడవ పడి తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మల్లప్ప మెడ, రెండు చేతులపై దాడి చేశాడు. గమనించిన చుట్టుపక్కల పొలాల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హుటాహుటిన కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాలమూరుకు అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మల్లప్ప కుమారుడు ఇసువయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బాలరాజు తెలిపారు. -
కడావర్ డాగ్స్‌తో అన్వేషణ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. గల్లంతైన కార్మికుల జాడ కోసం మూడురోజులుగా కడావర్స్ డాగ్స్‌తో గాలింపు చేపడుతున్నా.. భారీగా ఉబికి వస్తున్న నీటి ఊట ఆటంకంగా మారుతున్నట్లు అధికారులు వివరించారు. డాగ్స్ చూపిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టినా మంగళవారం వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా.. ఇప్పటి వరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన వారి ఆచూకీ కోసం డి–1, డి–2 ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. 13.5 కి.మీ. నుంచి సొరంగం చివరి పాయింట్ వరకు 40 మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోబోలతో సహాయక చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు. వాటి ఇన్స్టాలేషన్ ప్రక్రియతో పాటు సిగ్నలింగ్‌ను మెరుగుపర్చేందుకు టెక్నీషియన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) అధికారులు టన్నెల్ ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించి విశ్లేషిస్తున్నారు. సింగరేణి, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్, కాడవర్స్ డాగ్స్, హైడ్రా, అన్వి రోబోటిక్స్, దక్షిణ మధ్య రైల్వే, జీఎస్ఐ, జలవనరుల వంటి 12 బృందాలు ఒక్కటిగా పనిచేస్తున్నాయి. సమన్వయంతో ముందుకు.. సహాయక బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేరళకు చెందిన కడావర్ డాగ్స్ టన్నెల్లోకి వెళ్లాయిన.. టీబీఎం ప్లాట్‌ఫామ్‌ను ప్లాస్మా కట్టర్‌తో తొలగించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని, టీబీఎంపై ఉన్న మట్టిని సమాంతరంగా తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని, కట్ చేసిన విడి భాగాలను ఎస్కలేటర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్లో బయటకు పంపిస్తున్నామని, మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా తరలిస్తున్నట్లు వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్ మిషన్లు, సెన్సార్లు, రోబోటిక్ పరికరాలు వంటి సాధనాలను వినియోగించి సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఆటంకంగా మారినటీబీఎం శకలాలు.. నీటి ఊట, బురద మట్టి, టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) శకలాలు సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. డి–1, డి–2 ప్రదేశాల్లో కాడవర్ డాగ్స్ చూపిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతుండగా టీబీఎం శకలాలు అడ్డుగా వస్తున్నాయని, దీంతో పనులు ముందుకు సాగడం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్లాస్మా కట్టర్లతో టీబీఎం శకలాలను తొలగిస్తుండగా.. రెస్క్యూ బృందాలు తీసిన మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి పంపడంలో ఆలస్యమవుతుంది. లోకో ట్రైన్ ద్వారా మట్టి, టీబీఎం శకలాలు బయటకు తరలిస్తున్నారు. 25 రోజులైనా దొరకని కార్మికుల ఆచూకీ ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు అందుబాటులోకి రాని రోబో సేవలు -
ఇంటికి నిప్పంటుకొని మహిళ సజీవ దహనం
బిజినేపల్లి: ఇంటికి నిప్పంటుకొని ఓ మహిళ సజీవ దహనమైన ఘటన మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మమ్మ (48) ఇంట్లో ఉండగానే నిప్పంటుకుని భారీగా పొగలు వస్తుండటంతో చుట్టుపక్కల వారు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మమ్మ కాలిన శరీరంతో చనిపోయి కనిపించింది. కుటుంబసభ్యులు కూడా వెంటనే ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోని ఒక గదిలో ఫర్నీచర్, ఇతర సామగ్రి కాలిపోయి ఉన్నాయి. మహిళ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జ్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. చెరువులో పడివృద్ధురాలు మృతి లింగాల: మండలంలోని శాయిన్‌పేట సమీపంలో ఉన్న నర్సింహస్వామి చెరువులో పడి కుమ్మరి మధునాగుల బిచ్చమ్మ(65) అనే వృద్దురాలు మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు..వృద్ధురాలు బట్టలు ఉతుక్కోవడానికి చెరువు దగ్గరకు వెళ్లింది. ఇదే క్రమంలో కాలుజారి చెరువులో పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో తెలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు గుర్తించారు. మృతురాలి భర్త లక్ష్మయ్య ఇదివరకే మృతిచెందగా ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ.. కోస్గి రూరల్: పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్ఐ బాల్‌రాజ్ తెలిపారు. గుండుమాల్ మండలంలోని భక్తిమళ్ల గ్రామానికి చెందిన పిట్టల రవితో బొంరాస్‌పేట మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన మంగమ్మతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కూమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సోమవారం మరోమారు గొడవపడి మనస్తాపానికి గురైన పిట్టల మంగమ్మ (32 ) వ్యవసాయ పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఇంటికొచ్చింది. వాంతులు కావడంతో కుటుంబసభ్యులు కోస్గి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాలమూరు నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కోలుకోలేక మంగళవారం మధ్యాహ్నం మృతిచెందింది. మృతురాలి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తండ్రి మందలించాడని.. నాగర్‌కర్నూల్ క్రైం: చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్దన్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక ఫోన్ చూస్తుండగా తండ్రి మందలించడంతో ఈనెల 15న ఇంట్లో పురుగు మందు సేవించింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోక్సో కేసులో జీవిత ఖైదు మహబూబ్‌నగర్ క్రైం: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 2020 డిసెంబర్ 21 కోయిలకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుప్పుల ఆనంద్ 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కోయిలకొండ ఎస్ఐ సురేష్‌గౌడ్ క్రైం నంబర్ 138లో ఐపీసీ 376(3) సెక్షన్5(ఐ) పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి రూరల్ సీఐ కేసు పర్యవేక్షించి చార్జ్‌షీట్‌ను దాఖలు చేయగా మంగళవారం కేసు కోర్టుకు రావడంతో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలస్వామి 11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి టి.రాజేశ్వరి నిందితుడు ఆనంద్‌కు జీవితఖైదుతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల పరిహారం మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.జానకి నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు. -
గ్రూప్స్‌లో సత్తాచాటిన బల్గెర వాసి
గట్టు: మండలంలోని బల్గెరకు చెందిన ఆంజనేయులు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించి సత్తా చాటాడు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన తిమ్మప్ప, మల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. పెద్ద కుమారుడు ఆంజనేయులు గ్రూప్–4లో ప్రతిభ కనబర్చి గద్వాల మున్సిపాలిటీలో జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇటీవల వెలువడిన గ్రూప్–2, 3, 4తో పాటు సోమవారం విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. ఆంజనేయులు 1 నుంచి 7వ తరగతి వరకు బల్గెర పాఠశాల, 8 నుంచి 10వ తరగతి వరకు మాచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల, ఇంటర్, డిగ్రీ జిల్లాకేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ కళాశాల, పీజీ పాలమూరు యూనివర్సిటీ, బీఎడ్ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. పోటీ పరీక్షలకు ఆరేళ్లుగా రోజు 8 నుంచి 10 గంటలు కష్టపడి చదివానని ఆంజనేయులు వివరించారు. 2024లో తల్లి చనిపోగా.. తండ్రితో పాటు ఇద్దరు తమ్ముళ్లు తనకు తోడుగా నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య
జడ్చర్ల: ఓ గుర్తు తెలియని వ్యక్తి (42)ని పెద్ద బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. కావేరమ్మపేటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (42) మంగళవారం దారుణ హత్యకు గురయ్యాడు. సంత రోడ్డు నుంచి జాతీయ రహదారికి వెళ్లే ప్రధాన రోడ్డును అనుసరించి ఉన్న ఓ దుకాణం ముందు హత్య చేయబడిన వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని హత్య ప్రదేశాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలకు సంబందించి అన్వేషించారు. పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరాలను ఆరా తీశారు. హతుడి ఎడమ భుజం, చెంప, ఛాతిభాగంపై ఒక పెద్ద బండరాయి ఉన్నది. తలపై బండరాయితీ మోది హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. హత్య అర్థరాత్రి వేళ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు తెలుపు, నీలం రంగులో గల హాఫ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మెరున్ కలర్ ఫుల్ డ్రాయర్ ఉండగా నడుముకు నాలుగు వరుసల ఎర్రటి మొలతాడు. మెడలో రుద్రాక్ష ఉన్నది. అంతకు మించి మరెలాంటి ఆధారాలు లేవని సీఐ తెలిపారు. వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కావేరమ్మపేట ప్రధాన రహదారిని అనుసరించి జనం తిరిగే రద్దీ ప్రాంతంలోనే హత్య జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కౌన్సిలర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కావేరమ్మపేటలో ఘటన -
అభ్యాస దీపిక ఉపయోగకరం..
ఎన్సీఈఆర్టీ రూపొందించిన అభ్యాస దీపిక విషయ సామగ్రి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ప్రతి భావనను రెండుసార్లు క్షుణ్ణంగా చదువుకొని అర్ధం చేసుకోవాలి. అవసరమైన చోట పట్టికలు, బొమ్మలు గీసి భాగాలను తప్పకుండా రాయాలి. జత పరచడం, తప్పు వాక్యాన్ని గుర్తించడం, వరుస క్రమంలో అమర్చడం, ఫ్లో చార్టులు బొమ్మలు వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. – ఎండీ గౌస్, బయాలజీ టీచర్, జెడ్పీహెచ్ఎస్, గుమ్ముక్లపర్యావరణం, సాంకేతికత ఆధారంగా అంశాలను దృష్టిలో ఉంచుకొని జీవశాస్త్రం(బయాలజీ) ప్రశ్నలు రూపొందిస్తారు. ముఖ్యంగా పట్టికలను నేర్చుకొని ప్రయోగాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు సాధించే అవకాశముంది. ప్రతి పాఠంలోని అంశాలు, నిర్దిష్ట శీర్షిక కింద ఇచ్చిన భావనలను, బొమ్మలు, చార్టులు, కృత్యాలను నేర్చుకోవాలి. సెక్షన్ 3 లో తప్పకుండా ప్రయోగం వస్తుంది. -
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ రూరల్: శిశుగృహలో ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఫెర్నాండేజ్ ఫౌండేషన్ మెడికల్ టీమ్, జీజీహెచ్ డాక్టర్లు, ఆర్బీఎస్కే వైద్యులతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిశుగృహ చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పిల్లలు ఇంటి వాతావరణంలో పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిశుగృహలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కావాల్సిన వైద్య సహాయం అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీడబ్ల్యూఓ జరీనాబేగం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్, సీడీపీఓలు శైలాశ్రీ, రాధిక, ఏసీడీపీఓ వెంకటమ్మ, డీసీపీఓ నర్మద, శిశుగృహ మేనేజర్ గణేష్‌బాబు పాల్గొన్నారు. భవిత సెంటర్లలో శిక్షణ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు భవిత సెంటర్లలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థుల ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణ దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని వారికి జీవన నైపుణ్యాలు నేర్పించాలన్నారు. ఇక నుంచి వారానికి రెండుసార్లు భవిత సెంటర్లలో ఫిజియోథెరపీ సేవలు అందిస్తామన్నారు. దివ్యాంగ విద్యార్థులు ఏ విషయంలో కూడా తక్కువ కాదని వారికి ప్రత్యేకమైన నైపుణ్యాలు పుట్టుకతోనే వస్తాయని, వారిలో గల సృజనాత్మకతను నైపుణ్యాలను గుర్తించి వెలికి తీస్తే వారు చాలా ప్రతిభావంతులుగా మారుతారని తెలిపారు. గత ఆగస్టులో నిర్వహించిన అసెస్మెంట్ క్యాంపులో నుంచి 183 మంది విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన సుమారు రూ.16 లక్షలు విలువైన సహాయ ఉపకరణాలను కలెక్టర్ అందజేశారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో కూడా భవిత సెంటర్లలో చదివే విద్యార్థులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తామని, వాటిని ఉపయోగించుకొని ఆయా పరీక్షల్లో సులభంగా ఉత్తీర్ణులు కావచ్చని తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ పాల్గొన్నారు -
పరీక్షలు ప్రశాంతంగా రాయాలి
జిల్లాలో ఎస్సెస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి గత పరీక్షలతో పోలిస్తే ఈ సంవత్సరం నిర్వహించే పరీక్షల్లో మార్కుల విధానంలో మార్పులు వచ్చాయి. జీపీఏ విధానం బదులు నేరుగా మార్కులు ఇవ్వనున్నారు. అంతేకాకుండా పరీక్ష సమయంలో జవాబు పత్రాలు విడిగా ఇవ్వడం కుదరదు. 24 పేజీలతో కూడిన బుక్‌లెట్‌కు క్యూఆర్ బార్కోడ్ ఉంటుంది. ఇది పూర్తిగా రాస్తేనే మరో బుక్లెట్ ఇస్తారు. వీటిలో పేజీలు మిగిలితే విద్యార్థి లేదా ఇన్విజిలేటర్ ఖాళీ పేజీలపై మార్క్ చేయాల్సి ఉంటుంది. ● అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు ● ఈసారి జీపీఏ విధానం కాకుండా మార్కులు ఇవ్వనున్న ప్రభుత్వం ● హాల్‌టికెట్లు ఆన్లైన్లో నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ● ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం ● ’సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ ప్రవీణ్‌కుమార్ -
సమాజం కోసం పాటుపడాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: దేశం కోసం, సమాజం కోసం యువత పాటుపడాలని పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ సూచించారు. పీయూలో మంగళవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్–25ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగడానికి యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి వారితోనే సాధ్యమన్నారు. కాగా, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ ఆచార్య డా.చెన్నప్ప, జిల్లా యువజన అధికారి వి.కోటానాయక్ తదితరులు పాల్గొన్నారు. పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ యువ ఉత్సవ్–25 ప్రారంభం -
కఠినమైన అంశాలపై పట్టు సాధిస్తే..
గణితంలో కఠినమైన అంశాలపై పట్టు సాధిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. పాత ప్రశ్నపత్రాలు, నమూనా లెక్కలను ఎక్కువగా సాధన చేయాలి. అభ్యాస దీపికలు, ప్రీ ఫైనల్లో అడిగిన ప్రశ్నలను పరిశీలించాలి. – సగర్ విశ్వనాథ్, మ్యాథ్స్ టీచర్, జెడ్పీహెచ్ఎస్, కానుకుర్తి గణితంలో ప్రతి అధ్యాయంలో ఇచ్చిన భావాలపై పట్టు సాధిస్తే ప్రశ్నను ఏ విధంగా అడిగినా సమాధానం రాసే వీలుంటుంది. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, త్రికోణమితి అధ్యాయాలపై పట్టు సాధించాలి. ముందుగా సులువైన వాటిని స్పష్టంగా జవాబులు రాయాలి. తర్వాత కఠినమైన వాటిని సాధించేందుకు ప్రయత్నించాలి. రేఖా చిత్రాలు పెన్సిల్‌తో గీయాలి. సాధనలు డబ్బాలో రాయాలి. -
నేరాలను అరికట్టడమే పోలీస్‌శాఖ లక్ష్యం: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా పోలీస్‌శాఖ పని చేస్తోందని ఎస్పీ డి.జానకి అన్నారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పలు ముఖ్య కూడళ్లు, ప్రార్థన మందిరాలను ఎస్పీ పరిశీలించారు. స్థానికంగా పోలీస్ సిబ్బంది ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు అనే అంశంపై తనిఖీ చేశారు. నేరాలను నివారించే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా శాంతి భద్రతలను రక్షించాలన్నారు. తనిఖీల్లో డీఎస్పీ రమణారెడ్డి, వన్‌టౌన్ సీఐ అప్పయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి వద్దకే రాములోరి కల్యాణం తలంబ్రాలు స్టేషన్ మహబూబ్‌నగర్: భద్రాచలంలో వచ్చేనెల 6వ తేదీన జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా కల్యాణ తలంబ్రాలను ఇంటివద్దకే చేరవేస్తామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్, లాజిస్టిక్ ఏటీఎం ఇసాక్బిన్ మహ్మద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఒక పాకెట్‌కు రూ.151 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం ఆయా డిపోల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించాలని కోరారు. డీఈఐసీ కేంద్రం పరిశీలన పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉన్న డీఈఐసీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పరిశీలించారు. డీఈఐసీ కేంద్రంలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి, పిల్లలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు అనే అంశంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేకవిధానాలపై పోరాటం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మిక విధానాలను అవలంబిస్తోందని దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు అన్నారు. ఇప్పలపల్లిలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ కార్మికులు ఉపాధి లేక గ్రామాల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస పోతున్నారని, అక్కడ వారి జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. పోరాడి సాధించుకున్న చట్టం కాగితాలకే పరిమితమవుతున్నాయని, మారుతున్న పాలకులు ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారని వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 25న జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న భవన, నిర్మాణ కార్మిక సంఘం సభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేష్, నాయకులు గోవర్ధన్, ఉషన్న ఆంజనేయులు, శేఖర్, మల్లేష్, రవి, కే.నర్సింహులు, పి.చంద్రమౌళి చెన్నయ్య పాల్గొన్నారు. బాలకార్మిక చట్టాలపై అవగాహన పాలమూరు: జిల్లాకేంద్రంలోని షెల్టర్ హోం బాయ్స్ గృహాన్ని మంగళవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సందర్శించారు. స్థానికంగా అందుతున్న వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆ తర్వాత న్యూ లైఫ్ చిల్డ్రన్ హోంను సందర్శించారు. స్థానికంగా ఉన్న పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, బాల్య వివాహాలు, బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్‌లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2005లో చేపట్టిన నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులకు నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు పూర్తి చేయాలంటే రూ.231.36 కోట్లు అవసరం. వీటిని విడుదల చేస్తే రెండేళ్లలో పెండింగ్ పనులు పూర్తయ్యి నడిగడ్డలో కొత్తగా 58 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. ర్యాలంపాడుకు మరమ్మతు.. నెట్టెంపాడు ప్రాజెక్టులో గుండెకాయగా చెప్పుకొనే ర్యాలంపాడు రిజర్వాయర్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో 4 టీఎంసీల సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే పరిస్థితి. దీని మరమ్మతుకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తి చేసి సుమారు రూ.137 కోట్ల అంచనాతో నివేదిక ప్రభుత్వానికి పంపారు. దీని మరమ్మతుకు అవసరమైన నిధుల కేటాయింపుపై రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. ● రెండేళ్ల కిందట రూ.581 కోట్లతో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కింద కేటీదొడ్డి, గట్టు మండలాల్లో కొత్తగా 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద 40 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం రూ.285.19 కోట్లు అవసరం ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు. ● ఆర్డీఎస్ ప్రాజెక్టులో భాగంగా తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసి 87,500 ఎకరాలకు అందించేలా రూ.1,197.77 కోట్లతో ఎనిమిదేళ్ల కింద తుమ్మిళ్ల లిఫ్టు చేపట్టారు. ఇందులో రూ.629.26 కోట్ల పనులు పూర్తి కాగా.. మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సంగంబండ సైతం.. 2003లో మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ దగ్గర కాల్వ పనులు ప్రారంభించారు. 2004లో జలయజ్ఞం భీమా ఫేజ్–1, ఫేజ్–2లకు జీఓ నం.166 విడుదల చేయగా రూ.1,426 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే కాల్వల పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో.. 2017లో మళ్లీ రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. ఈ రెండు రిజర్వాయర్ల కింద పనులు దాదాపు 90 శాతం పూర్తి చేశారు. అయితే పొలాలకు సాగునీరందించేందుకు పిల్ల కాల్వలు పూర్తి కాకపోవడంతో మెయిన్ కెనాళ్ల ద్వారా చెరువులు నింపుతున్నారు. కోయిల్‌సాగర్‌ది అదే దారి.. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్‌హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్‌హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కోయిల్‌సాగర్ బ్యాక్‌వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా పెండింగ్ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు -
‘పాలమూరు’ పరుగులు పెట్టేనా?
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదు. మొత్తం 12.50 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2015లో తొలుత రూ.35,200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే అంచనా వ్యయం రూ.52,056 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు కింద పంపుహౌస్‌లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా.. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ చానళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అన్నిచోట్ల కీలకమైన మోటార్ల బిగింపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొదటి లిఫ్టు వద్ద ఒక్క మోటారును మాత్రమే ప్రారంభించారు. నార్లాపూర్ సమీపంలో మొదటి లిఫ్టు వద్ద రెండు మోటార్లు, ఏదుల సమీపంలో రెండో లిఫ్టు వద్ద నాలుగు మోటార్లు, వట్టెం సమీపంలో మూడో లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల చొప్పున బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ● రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కొడంగల్– పేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులకు సంబంధించిన సర్వే మూడు దశల్లో పూర్తి కాగా.. ప్రాజెక్టు డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ● కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఏడాదికి రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి. -
టైర్ పగిలి ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు .. తాత, మనవడు దుర్మరణం
జడ్చర్ల: ఆకస్మాత్తుగా టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఈ ప్రమాదంలో తాతమనవడు దుర్మణం చెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన ఎం.వెంకట్‌రెడ్డి (76) మహబూబ్‌నగర్‌లోని ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వెంకట్‌రెడ్డి కూతురు హైదరాబాద్‌లోని నార్సింగిలో నివాసం ఉంటున్నారు. సోమవారం వెంకట్‌రెడ్డి కూతురు శ్వేత(45), ఆమె కుమారుడు నిదయ్‌రెడ్డి (22)తో కలిసి హైదరాబాద్ నుంచి కారులో జడ్చర్ల వైపు వస్తున్నారు. మాచారం గ్రామం దాటాక జాతీయరహదారిపై ఆకస్మాత్తుగా కారు టైరు పగిలిపోయింది. దీంతో అదుపుతప్పిన కారు డివైడర్‌ను దాటుకుంటూ అవతలి వైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో జడ్చర్ల నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కారు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న శ్వేత, పక్క ఉన్న వెంకట్‌రెడ్డి తీవ్రగాయాలకు గురయ్యారు. నిదయ్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. క్షతగాత్రులను వైద్యచికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. కొనఊపిరితో ఉన్న వెంకట్‌రెడ్డి మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రగాయాలకు గురైన శ్వేతను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాద సమయంలో కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో డ్రైవర్ సీట్లో ఉన్న శ్వేతకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో దుర్మరణం చెందిన వెంకట్‌రెడ్డి సర్వేయర్‌గా పదవీ విరమణ పొందగా నిదయ్‌రెడ్డి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. శ్వేత సొంత గ్రామం నల్గొండ జిల్లా చండూరు కాగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమెకు భర్త శేఖర్‌రెడ్డి, ఇద్దరు కుమారులు ఉండగా మృత్యువాత పడిన నిదయ్‌రెడ్డి చిన్నవాడు. ప్రమాద సంఘటనతో ఆకుటుంబం ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కారు పూర్తిగా ధ్వంసం.. రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారు ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు కూడా ముందు ఒక భాగం ధ్వంసమైంది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు. కూతురి పరిస్థితి విషమం జడ్చర్ల మండలం మాచారం వద్ద దుర్ఘటన జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ -
పీయూ సిబ్బంది వేతనాల పెంపుపై కమిటీ భేటీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నాలుగేళ్లుగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బంది వేతనాల పెంపు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో 2018లో వైస్ చాన్స్‌లర్ రాజారత్నం ప్రతి సంవత్సరం 12 శాతం వేతనాలు పెంచేలా ప్రతిపాదనలు చేసి 2021 సంవత్సరం వరకు కొనసాగించారు. ఆ తర్వాత వీసీగా వచ్చిన లక్ష్మీకాంత్ రాథోడ్ వేతనాల పెంపుదలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నూతనంగా వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ సిబ్బంది వేతనాల పెంపుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అందుకోసం ఒక కమిటీని నియమించగా.. సోమవారం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో భేటీ అయ్యింది. వేతనాల పెంపు ఎంత మేరకు ఉండాలి.. గతంలో ఎంత మేరకు పెంచారు అనే అంశాలపై చర్చించారు. ఈ కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తే దాని ఆధారంగా ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం అనంతరం సిబ్బంది వేతనాలు పెంచేందుకు చర్యలు చేపడుతారు. కమిటీ భేటీలో పీయూ మాజీ రిజిస్ట్రార్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, ప్రొఫెసర్ అప్పారావు, పీయూ అధ్యాపకులు కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 155 మందికి ప్రయోజనం.. యూనివర్సిటీలో తాత్కాలిక పద్ధతిలో 155 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో అటెండర్, స్వీపర్ స్థాయి వారికి రూ.7 వేలు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు రూ.9 వేల చొప్పున వేతనాలు ఉన్నాయి. రెగ్యులర్ సిబ్బందికి రూ.50 వేలకుపైగా వేతనాలు ఉండగా.. తాత్కాలిక సిబ్బందికి అరకొర వేతనాలు అందుతున్నాయి. గత వీసీ హయాంలో వేతనాల పెంపుకోసం పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపాదనలు పెట్టినా పెంపు మాత్రం జరగలేదు. దీంతో చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో పలువురు ఉద్యోగాలు మాని వెళ్లిపోగా.. పలువురు రిటైర్డ్ కూడా అయ్యారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సిబ్బందికి త్వరగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నాన్‌టీచింగ్ సిబ్బంది కోరుతున్నారు. -
గడ్డివాములు దగ్ధం
అయిజ: మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామంలోని కురువ బాలప్ప, వడ్డెర తిమ్మప్పలకు సంబంధించిన గడ్డివాముల నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లభించలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. సుమారు రూ. 2 లక్షల నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి బాధితులకు రూ. 10వేలు ఆర్థిక సహాయం చేశారు. -
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరాలయం
కొల్లాపూర్: సప్తనదీ సంగమ ప్రాంతంలోని సంగమేశ్వరాలయం జలాధివాసం వీడుతోంది. క్రమేణ కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుతుండటంతో ఆలయం బయటపడుతోంది. సోమవారం ఆలయ ప్రాకారం పూర్తిస్థాయిలో తేలింది. ఆలయ ప్రాంగణంలో నడుము లోతు వరకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఆలయ అర్చకులు రఘురామశర్మ గర్భగుడిలోకి వెళ్లి సంగమేశ్వరుడికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వారం రోజుల వ్యవధిలో నాలుగు అడుగుల మేరకు ఆలయ ప్రాంగణంలో నీటిమట్టం తగ్గింది. నీటి తగ్గింపు ఇలాగే కొనసాగితే.. ఈ నెలాఖరులోగా ఆలయం పూర్తిగా నీటి నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్‌వాటర్ లెవెల్స్ 842 అడుగులు ఉన్నాయి. నదిలో నుంచి బయటపడిన ఆలయ ప్రాంగణం -
క్యాతూర్‌లో పేలిన 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు
అలంపూర్ రూరల్: మండలంలోని క్యాతూర్ గ్రామంలో 25 కేవీ మూడు నూతన ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 25 కేవీ 3 ట్రాన్స్ఫార్మర్లు అకస్మాత్తుగా పేలిపోయి మంటల వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విద్యుత్ తీగలపై మంటలు వ్యాపించి.. పలు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, కరెంట్ మీటర్లు, సెల్‌ఫోన్ చార్జర్లు కాలిపోయాయి. దీంతో భారీగా శబ్దాఆలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ తీగలపై పెద్దఎత్తున మంటలు వ్యాపించి.. గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 50 ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు ఇతరత్రా పరికరాలు కాలిపోయి రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని గ్రామస్తులు వాపోయారు. సమస్య పరిష్కరించిన అధికారులు షార్ట్‌సర్క్యూట్‌తో ట్రాన్స్ఫార్మర్లు పేలిన విషయం తెలుసుకున్న వెంటనే విద్యుత్ సిబ్బంది గ్రామానికి చేరుకుని సమస్యను పరిష్కరించి.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఏఈ అఖిల్ తెలిపారు. గ్రామంలో లోఓల్టేజీ సమస్య ఉండడంతో సోమవారం 6 గంటల సమయంలో మరమ్మతు చేసిన 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన కొద్దిసేపటికే ఇంటర్నల్ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయని చెప్పారు. వాటి స్థానంలో 15 కేవీ సామర్థ్యం గల మరో మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే పేలిపోయిన మీటర్ల స్థానంలో తమ శాఖ తరపున నూతన మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదన్నారు. ఇళ్లలో కాలిపోయిన టీవీ, ఫ్రిజ్‌లు, కరెంట్ మీటర్లు -
ఊరూరా శ్రీరామోత్సవాలు నిర్వహించాలి
జడ్చర్ల: ఉగాది పర్వదినం మొదలుకొని హనుమాన్ జయంతి వరకు శ్రీరామ మహోత్సవాలను ఊరూరా అట్టహాసంగా నిర్వహించాలని వీహెచ్‌పీ కేంద్రీయ కార్యదర్శి సుధాంశు మోహన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం జడ్చర్ల మాధవీయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆరు జిల్లాలకు చెందిన వీహెచ్‌పీ ముఖ్యకార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వీహెచ్‌పీ కార్యకర్త కనీసంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసుకుని ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు శ్రీరాముడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హిందూ సమాజాన్ని జాగృతం చేయాలన్నారు. వీహెచ్‌పీ బలోపేతం కోసం గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక ప్రతి దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సత్సంగాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి కార్యకర్త రెండు సత్సంగాలు నిర్వహించే విధంగా చూడాలన్నారు. వీహెచ్‌పీతో పాటు భజరంగ్‌దళ్, మాతృశక్తి, దుర్గావాహిని కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వీరికి వచ్చే రెండు నెలల్లో ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యువత భజరంగ్‌దళ్ శిక్షణ పొందే విధంగా, మిగతా వీహెచ్‌పీ కార్యకర్తలు శిక్షావర్గ పూర్తిచేసే విధంగా కృషి చేయాలన్నారు. అదే విధంగా యువతి విభాగానికి సంబంధించి దుర్గావాహణి ఆధ్వర్యంలో శిక్షావర్గలో పాల్గొనే విధంగా చూడాలని తెలిపారు. ఆత్మరక్షణ కోసం నేర్పించే విద్యలతో యువతులు సమాజంలోని సమస్యలను అధిగమించాలని కోరారు. సమావేశంలో వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు నర్సింహామూర్తి, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, విభాగ్ కార్యదర్శి నరేందర్, సహకార్యదర్శులు లక్ష్మీనారాయణ, వేణుగోపాల్, పట్టణ అధ్యక్షుడు అఖిల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్ర మాదంలో మహిళ మృతి చెందిన ఘటన దే వల తిరుమలాపూర్లో చోటు చేసుకున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. వివరాలు.. పెద్దకార్పాముల గ్రామానికి చెందిన సింగిల్‌విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు, అతడి భార్య అనూష, కొడుకుతో కలిసి ఆదివారం బైక్‌పై వనపర్తికి వెళ్తున్నాడు. దేవల తిరుమలాపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయాడు. బైక్ అదుపు తప్పి అనూష రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. రాజుకు, అతడి కుమారుడికి గాయాలయ్యాయి. సోమవారం మృతురాలి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, జూపల్లి అరుణ్ కుమార్‌రావు పరామర్శించారు. చెరువులో పడి మహిళ.. తెలకపల్లి: చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. వివరాలు.. తెలకపల్లికి చెందిన రెడ్డపాకుల చంద్రమ్మ (35) అనే మహిళ కొంత కాలంగా మద్యానికి బానిసైంది. కుటుంబ సభ్యులు ఎంత చెప్పి నా వినిపించుకోలేదు, తన ప్రవర్తన మార్చుకోకుండా ఎప్పుడు చనిపోతానని అంటూ ఉండేదని తెలిపారు. ఈనెల 16న గ్రామ శివారు లో ఉన్న పెద్దచెరువు దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడింది. ఈత రాకపోవడంతో మృతిచెందింది. మృతురాలి భర్త రెడ్డపాకుల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. జడ్చర్ల: తాగునీళ్లు అనుకొని ఫినాయిల్ తాగి వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. మండలంలోని ఉదండాపూర్‌కి చెందిన గద్ద పెంటయ్య (62) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో బాత్రూంకు వెళ్లి అక్కడ తాగునీళ్లు అనుకొని బాటిల్లో ఉన్న ఫినాయిల్ తాగా డు. అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన కుటుంబీకులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య నాగర్‌కర్నూల్ క్రైం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. గుడిపల్లికి చెందిన బాలస్వామి (36) హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య వనిత తన సోదరి భర్త శివతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్ర మంలో మనస్థాపానికి గురైన బాలస్వామి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మా ర్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. శతాధిక వృద్ధుడుగుజ్జుల ఆశన్న మృతి మదనాపురం: మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందిన గుజ్జుల పెద్ద ఆశన్న(103) సోమవారం మృతిచెందారు. మొదటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికై మూడు పర్యాయాలు కొనసాగారు, ఐదు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి కీలక పాత్ర పోషించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయన కుటుంబానికి మాజీ సర్పంచ్ భాగమ్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
భవనం పూర్తికాగానే తరలిస్తాం
టీడీగుట్ట సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో కూరగాయలు, మాంసం, చేపల అమ్మకాల కోసం నిర్మిస్తున్న అతి పెద్ద భవనం పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. కోస్గి రోడ్డుతో పాటు పాత బస్టాండు సమీపంలో, పాత రైతుబజార్లో అమ్మే వారినందరినీ అక్కడికి తరలిస్తాం. ఆయా రోడ్ల పైనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల అమ్మకంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది వాస్తవమే. గతంలో పలుసార్లు వీరిని తూర్పు కమాన్‌కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతుబజార్‌కు వెళ్లాలని సూచించాం. – డి.మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్‌నగర్ వాహన రాకపోకలకు ఇబ్బందులు పాత బస్టాండు చుట్టుపక్కల, కోస్గి రోడ్డుపై కూరగాయలు, ఆకుకూరలు అమ్మడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే భారీ వాహనాలతో పాటు బస్సుల రాకపోకలు విరివిగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ రోడ్లపై అమ్మే వర్తకులు గాని, రైతులు గాని తూర్పు కమాన్‌కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతు బజార్‌కు వెళ్తే బాగుంటుంది. అక్కడ వినియోగదారులకు సైతం ఉపయోగకరంగానే ఉంది. – పగడం మల్లేష్, పద్మావతికాలనీ, మహబూబ్‌నగర్ మోడ్రన్ రైతు బజార్‌కు తరలించాలి కోస్గి రోడ్డుపై మలుపులో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర నిత్యావ సర వస్తువులను కొనాలంటేనే భయమేస్తుంది. అటు వైపు చించోళి నుంచి పెద్ద లారీలు, ఇతర భారీ వాహనాలు వస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో బైక్‌పై వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీడీగుట్ట వద్ద రైల్వే గేటు పడ్డప్పుడు ట్రాఫిక్‌జాం అవుతోంది. వందలాది వాహనాలు అటు కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు వరకు ఇటు క్లాక్‌టవర్ వరకు ఆగిపోతున్నాయి. వీటి మధ్యన నడవడానికి కూడా వీలుండదు. రోడ్డుపై అమ్మే వారిని మోడ్రన్ రైతుబజార్‌కు తరలించాలి. అక్కడ కూడా గిరాకీ అవుతుంది. – వెంకటయ్య, రిటైర్డ్ ఉద్యోగి, లక్ష్మీనగర్‌కాలనీ, మహబూబ్‌నగర్ 20 ఏళ్లుగా ఇక్కడే అమ్ముతున్నాం.. 20 ఏళ్ల నుంచి భూత్పూర్ చౌరస్తాలో కూరగాయల అమ్ముతున్నాం. దుకాణాల ఎదుట కూరగాయలు పెట్టవద్దని వారు నిరాకరించడంతో కుటుంబ పోషణ కోసం రహదారిపైనే విక్రయాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రహదారి విస్తరిస్తున్నట్లు తెలిసింది. తమకు కూరగాయలు అమ్మడానికి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలి. – పి.బుచ్చయ్య, కూరగాయల వ్యాపారి, భూత్పూర్ -
సహాయక చర్యలు ముమ్మరం
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ సోమవారం కూడా దొరకలేదు. టన్నెల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం గత 24 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గల్లంతైన ఎనిమిది మందిలో టీబీఎం ఆపరేటర్ మృతదేహం లభించగా.. మిగతా ఏడుగురు కార్మికుల జాడ కోసం సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో సింగరేణి కార్మికులు షిఫ్ట్‌ల వారీగా సొరంగంలోకి వెళ్లి తవ్వకాలు జరుపుతున్నారు. డీ2 ప్రదేశంలో తవ్వకాలు చేపట్టినా కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో డీ1 ప్రదేశంలో ప్రధానంగా రెండు రోజుల నుంచి తవ్వకాలు అతికష్టంగా సహాయక బృందాలు చేపడుతున్నాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తున్నా పురోగతి లేకపోతోంది. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి కాడవర్ డాగ్స్‌ను సొరంగంలోని డీ–1, డీ–2 ప్రదేశాల్లో గాలింపు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సొరంగంలోని డీ1, డీ2 ప్రదేశాల్లో టీబీఎం పరికరాలు మట్టిలో కూరుకుపోవడంతో పైనుంచి ఉబికి వస్తున్న ఊట నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది. టీబీఎం ముందు భాగంలోని చివరి 40 మీటర్ల వద్ద మట్టి, రాళ్లు, టీబీఎం శకలాలను కదలిస్తే మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందని సిబ్బంది అనుమానిస్తున్నారు. ఈ దశలో సహాయక చర్యలు సిబ్బందికి సవాల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ఆరు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన రోబోల సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అటానమస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబో అనుసంధానంగా ఏర్పాటు చేసిన వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకులు పనిచేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టెక్నీషియన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల సమీక్ష.. టన్నెల్ డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం ఉదయం టన్నెల్ వద్ద పరిస్థితులపై కలెక్టర్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్‌తో కలిసి సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నామని చెప్పారు. టన్నెల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను తొలగించే పనులు కొనసాగిస్తూ ఎస్కవేటర్ వద్ద మట్టి తొలగించే పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. డీవాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, బృందాలకు అవసరమైన సామగ్రి, సిబ్బంది భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశామన్నారు. మొరాయిస్తున్న కన్వేయర్ బెల్టు సొరంగంలో సహాయక బృందాలు చేపడుతున్న గాలింపు చర్యలకు ఊట నీరు ఆటంకం కలిగిస్తోంది. 13.5 కి.మీ., తర్వాత ఏర్పాటు చేసిన డీ–2 ప్రాంతంలో ఒక కాల్వలో నీళ్లు పెరుగుతున్నాయి. నీటిని డీవాటరింగ్ చేసేందుకు ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒక పంపింగ్ మోటారు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపించే చర్యలు తీసుకుంటున్న నీటి ఊట తగ్గడం లేదు. సొరంగంలోని బురద, మట్టిని బయటకు పంపడానికి ప్రధానంగా కన్వేయర్ బెల్టు కీలకం. కానీ, ఈ కన్వేయర్ బెల్టు తరుచుగా మొరాయిస్తుండటం.. దాని స్థాయికి తగ్గట్టు పనిచేయకపోవడంతో సహాయ చర్యలకు విఘాతం కలుగుతున్నాయి. డీ–1 పాయింట్ వద్ద గత రెండు రోజుల నుంచి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టీబీఎం వద్ద దక్షిణమధ్య రైల్వేకు చెందిన రెస్క్యూ బృందాలు శకలాలను కట్ చేస్తూ విడి భాగాలను బయటకి పంపిస్తున్నారు. అత్యంత ప్రమాదంగా గుర్తించిన డీ1 వద్ద ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రోబో సేవలు అందుబాటులోకి రాకపోవడంతో కార్మికుల జాడ లభించేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 24 రోజులు గడిచినా లభించని కార్మికుల ఆచూకీ నిర్విరామంగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు ఎస్ఎల్బీసీలో అందుబాటులోకి రాని రోబో సేవలు -
స్ప్రింక్లర్లతో ఉల్లి సాగు చేద్దాం
అలంపూర్: మైక్రో స్ప్రింక్లర్లతో ఉల్లి పంట సాగు చేయడంతో ఆశించిన దిగుబడి సాధించొచ్చని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. జిల్లాలో నీటి సౌకర్యం ఉన్న రైతులు యాసంగిలో ఉల్లిని సాగు చేయడం లాభదాయకమన్నారు. పంట సాగు చేసిన రైతులు మైక్రో స్ప్రింక్లర్లను వాడడం ద్వారా నీటి ఆదా అవుతుందని తెలిపారు. దీనితో పాటు వ్యవసాయ అధికారుల సూచనలతో ఎరువులు సరైన మోతాదులో వాడితే పంట నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. నాటులో జాగ్రత్తలు ఒక ఎకరానికి 1.4 లక్షల మొక్కల సాంద్రత ఉండేటట్లుగా నాటుకోవాలి. వరుసకు వరస 10 సెంటీమీటర్లు ఉండాలన్నారు. నారు నాటే సమయంలో వాటిని కార్బండిజమ్ 1 గ్రామును లీటర్ నీటికి, మోనోక్రోటోపాస్ 2 మి.లీ నీటితో కలిపిన ద్రావణంలో వేర్లను ముంచి నాటితే మొక్క పెరుగుదల బాగుందని వివరించారు. మైక్రో స్ప్రింక్లర్లు అమర్చే విధానం 16 మిల్లీ మీటర్ల లేటరల్స్‌ను ప్రధాన పీవీసీ పైపునకు ప్రతి నాలుగు మీటర్ల దూరంలో అమర్చాలి. ప్రతి లేటరల్ పైపు మీద 4 మీటర్ల దూరంలో 8 మి.లీ మీటర్ల ప్లాస్టిక్ పైప్ ద్వారా ఒక మైక్రో స్ప్రింక్లర్లను అమర్చాలి. దీనిని 3 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలని సూచించారు. ప్రతి మైక్రో స్ప్రింక్లర్లు గంటకు 148 లీటర్ల నీటిని విడుదల చేస్తోంది. తెగుళ్ల నేలలో ఎల్లప్పుడు తగినంత తేమ ఉండటం వలన ఉల్లి గడ్డలు సమాన పరిమాణంలో పెద్దగా పెరుగుతాయి. పంటకాలం 15 నుంచి 17 రోజులు తగ్గుతుంది. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నీటి తుంపర్ల వలన శీలింద్రపు తెగుళ్లు ఆశించవు. రసం పీల్చే పురుగులు తుంపర్లకు కొట్టుకొని పోతాయి. మొక్కల సంఖ్య పెరగడం వలన 30 నుంచి 40 శాతం అధిక దిగుబడి వస్తోంది. కలుపు నివారణ 2 నుంచి 3 సార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. నారు నాటిన మూడు రోజుల తర్వాత పెండిమిథాలిన్ అనే లీటర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 40 నుంచి 45 రోజులకు ఒకసారి కలుపుతీయాలి. నీటి యాజమాన్యం పొలంలో నీటి నిల్వ ఉంచరాదు. నీరు నిలువ ఉంటే గడ్డ నాణ్యత తగ్గిపోతుంది. ఉల్లి వేరు 10–15 సెం.మీ వరకే ఉంటుంది. కాబట్టి అవసరం ఉన్నంత వరకే నీటిని పెట్టాలి. సస్యరక్షణ తామర పురుగుల నివారణకు పిప్రోనిల్ 2 మి.లీ లేదా మిథైల్ డెమటాన్ 2మి.లీలు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆకుమాడు తెగులు నివారణకు సాఫ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి లేదా కిటాజెన్ ఒక మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎరువులు ఉల్లి నాటిన 30 రోజులకు, 60 రోజులకు యూరియా లేదా సీఏఎన్ వేసుకోవాలి. ఎకరానికి 10–15 కిలోల సల్ఫర్ వాడాలి. దీనివలన నాణ్యమైన గడ్డలు వస్తాయి. 50 కిలోల భాస్వరం 60 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు నాటే ముందు వేసుకోవాలి. పాడి–పంట -
మహిళా సంఘాల బలోపేతం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని మెప్మా స్టేట్ మిషన్ కో–ఆర్డినేటర్ (ఎస్ఎంసీ) సుజాత ఆదేశించారు. సోమవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్పీలు, ఓబీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 2,858 ఎస్‌హెచ్‌జీలు ఉండగా కొత్తగా మరో 477 ఈనెలా ఖరులోగా ఏర్పాటు చేయాలన్నారు. కాగా, ఇప్పటివరకు 218 కొత్తవి అయ్యాయని ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి బదులిచ్చారు. అమృత్‌మిత్ర పథకం కింద నగరంలోని 49 డివిజన్లకు గాను నాలుగు ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేక బృందా (ఎస్‌హెచ్‌జీ) లతో తాగునీటి పరీక్షలు చేయిస్తున్నామన్నారు. ఈ నాలుగు బృందాలలో సుమారు 25 మంది ఎస్‌హెచ్‌జీలు ఉన్నారని వివరించారు. గత నవంబర్ నుంచి బండ్లగేరి, మోతీనగర్, పద్మావతి కాలని, మర్లులో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. కాగా, మరో పది డివిజన్లకు ఈ పథకం విస్తరింపజేయాలని ఎస్ఎంసీ సూచించారు. ఈ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒక్కో ఇంటికి రూ.20 చొప్పున బృందంలోని సభ్యురాలికి పారితోషికం ఇస్తామన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన తాగునీరు సరఫరా అవుతోందా? లేదా? క్లోరినేషన్ చేస్తున్నది? లేనిది? ఈ పరీక్షల్లో బయట పడుతుందన్నారు. ఒకవేళ తాగునీటిలో ఒక శాతానికి మించి క్లోరిన్ ఉంటే కలుషితమైనట్లుగా భావించి వెంటనే ఇంజినీరింగ్ అధికారులకు నివేదించాలన్నారు. అనంతరం ఈ పరీక్షలు క్షేత్రస్థాయిలో ఎలా నిర్వహిస్తున్నది ప్రత్యేక బృందాలు ప్రయోగాత్మకంగా మెప్మా భవనంలో ఆమెకు వివరించారు. అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఎస్ఎంసీ కలిసి నగరంలో మెప్మా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆరా తీశారు. ఆయా సమావేశాల్లో ఇన్చార్జ్ ఎంఈ సందీప్, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మెప్మా స్టేట్ మిషన్ కో–ఆర్డినేటర్ సుజాత -
‘గుర్రంగడ్డ’ పనుల్లో కదలిక
గద్వాల: ఏడాదిలో ఆర్నెళ్లు దీవిలో.. మరో ఆర్నెళ్లు మైదాన ప్రాంతంలో జీవిస్తున్న గుర్రంగడ్డ వాసుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న ఏకై క దీవి గ్రామం గుర్రంగడ్డ. ఈ గ్రామ ప్రజల రాకపోకలకు ఏకై క మార్గం నదిలో పుట్టీల ద్వారా ప్రయాణం చేయడం. దీవిగ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వం హయాంలో 2015లో రూ.12 కోట్ల అంచనాలతో వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పనులు మొదలు పెట్టకపోవడంతో ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగలేదు. తాజాగా అధికారు లు పాత ఏజెన్సీని మార్చేసి కొత్త ఏజెన్సీకి పనులు అప్పచెప్పడంతో పనుల్లో కదలిక మొదలైంది. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ● వానాకాలం సీజన్లో భారీగా కురిసే వర్షాలకు వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ సమయంలో గుర్రంగడ్డ వాసులు పుట్టీలు, పడవల ద్వారా ప్రయాణించాల్సిందే. ఈక్రమంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నది మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ గ్రామంలో మొత్తం 600 మంది నివాసం ఉంటుండగా 450 మంది వరకు ఓటర్లున్నారు. మొత్తం వ్యవసాయ భూమి విస్తీర్ణం 2,100 ఎకరాలు కాగా ఇందులో సుమారు 1,600 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందులో ప్రధాన పంట వరి. ఇలాంటి పరిస్థితిలో నదిలో భారీగా వరద ప్రవహిస్తున్నప్పుడు బాహ్యప్రపంచంతోదీవి వాసులకు పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. ఏడాదిలో ఆర్నెళ్ల వరకు ఈ కష్టాలు వెంటాడుతుంటాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో.. గత ప్రభుత్వం 2018లో రూ.12 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్లో చలనం లేదు. దీంతో ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. ఇన్చార్జి ఎస్ఈ రహీముద్దీన్ మాట్లాడుతూ ‘పనులు నిర్లక్ష్యంచేసిన పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.’ అని పేర్కొన్నారు. గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు నూతన ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం.. అత్యవసర పరిస్థితుల్లో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు వంతెననిర్మాణంతో తీరనున్న కష్టాలు -
వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈనెలాఖరులోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా రూ.4.35కోట్లు వసూలైతేనే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత దక్కుతుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డు ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. మరో ఎనిమిది మందికి మెమోలు జారీ చేయాలన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.33.75 కోట్ల తో పాటు పాత బకాయిల కింద రూ.18.25కోట్లు రావాల్సి ఉందని, ఇప్పటివరకు రూ.18.75 కోట్లు వసూలైందని ఆర్ఓ మహమ్మద్ ఖాజా బదులిచ్చారు. సమావేశంలో ఆర్ఐలు అహ్మద్షరీఫ్, ముజీబుద్దీన్, టి.నర్సింహ, రమేష్, పెంటయ్య, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరి సస్పెన్షన్ మరో 8 మంది వార్డు ఆఫీసర్లకు మెమో జారీ -
భవనం పూర్తికాగానే తరలిస్తాం
టీడీగుట్ట సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో కూరగాయలు, మాంసం, చేపల అమ్మకాల కోసం నిర్మిస్తున్న అతి పెద్ద భవనం పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. కోస్గి రోడ్డుతో పాటు పాత బస్టాండు సమీపంలో, పాత రైతుబజార్లో అమ్మే వారినందరినీ అక్కడికి తరలిస్తాం. ఆయా రోడ్ల పైనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల అమ్మకంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది వాస్తవమే. గతంలో పలుసార్లు వీరిని తూర్పు కమాన్‌కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతుబజార్‌కు వెళ్లాలని సూచించాం. – డి.మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్‌నగర్ వాహన రాకపోకలకు ఇబ్బందులు పాత బస్టాండు చుట్టుపక్కల, కోస్గి రోడ్డుపై కూరగాయలు, ఆకుకూరలు అమ్మడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే భారీ వాహనాలతో పాటు బస్సుల రాకపోకలు విరివిగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ రోడ్లపై అమ్మే వర్తకులు గాని, రైతులు గాని తూర్పు కమాన్‌కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతు బజార్‌కు వెళ్తే బాగుంటుంది. అక్కడ వినియోగదారులకు సైతం ఉపయోగకరంగానే ఉంది. – పగడం మల్లేష్, పద్మావతికాలనీ, మహబూబ్‌నగర్ మోడ్రన్ రైతు బజార్‌కు తరలించాలి కోస్గి రోడ్డుపై మలుపులో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర నిత్యావ సర వస్తువులను కొనాలంటేనే భయమేస్తుంది. అటు వైపు చించోళి నుంచి పెద్ద లారీలు, ఇతర భారీ వాహనాలు వస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో బైక్‌పై వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీడీగుట్ట వద్ద రైల్వే గేటు పడ్డప్పుడు ట్రాఫిక్‌జాం అవుతోంది. వందలాది వాహనాలు అటు కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు వరకు ఇటు క్లాక్‌టవర్ వరకు ఆగిపోతున్నాయి. వీటి మధ్యన నడవడానికి కూడా వీలుండదు. రోడ్డుపై అమ్మే వారిని మోడ్రన్ రైతుబజార్‌కు తరలించాలి. అక్కడ కూడా గిరాకీ అవుతుంది. – వెంకటయ్య, రిటైర్డ్ ఉద్యోగి, లక్ష్మీనగర్‌కాలనీ, మహబూబ్‌నగర్ 20 ఏళ్లుగా ఇక్కడే అమ్ముతున్నాం.. 20 ఏళ్ల నుంచి భూత్పూర్ చౌరస్తాలో కూరగాయల అమ్ముతున్నాం. దుకాణాల ఎదుట కూరగాయలు పెట్టవద్దని వారు నిరాకరించడంతో కుటుంబ పోషణ కోసం రహదారిపైనే విక్రయాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రహదారి విస్తరిస్తున్నట్లు తెలిసింది. తమకు కూరగాయలు అమ్మడానికి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలి. – పి.బుచ్చయ్య, కూరగాయల వ్యాపారి, భూత్పూర్ -
కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: భూ తగాదాలు కోర్టు ద్వారా లేదా పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని, అనవసరమైన ఆవేశాలకు వెళ్లి గొడవలు పెట్టుకోరాదని ఎస్పీ డి.జానకి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు సూచనలు అందించారు. బాధితుల ఫిర్యాదులపై దృష్టి పెట్టి సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించేలా న్యాయం అందించాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే డయల్ 100 లేదా 1930 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అలివేలు మంగ హుండీ లెక్కింపు మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. 336 మంది గైర్హాజరు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్, ఎకానమిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 12,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 11,787 మంది హాజరై, 336 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు పలు పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,959 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,959, కనిష్టంగా రూ.5,311 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,925, కనిష్టంగా రూ.5,200, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,189, ఆముదాలు గరిష్టంగా రూ.6,160, కనిష్టంగా రూ.6,080, జొన్నలు గరిష్టంగా రూ.4,377, కనిష్టంగా రూ.4,277,పెబ్బర్లు రూ.5,771, మినుములు రూ.7,171 ధరలు లభించాయి. -
అన్ని సౌకర్యాలు కల్పించినా..
ఈ పరిస్థితులను అధిగమించడానికి 2018 సెప్టెంబర్‌లో తూర్పు కమాన్‌కు ఎదురుగా కొత్త మోడ్రన్ రైతుబజార్‌ను నిర్మించారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం దక్కడం లేదు. సువిశాలమైన హాలులో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మటన్, చికెన్ విక్రయానికి సైతం షాపులు కేటాయించారు. మొదట్లో కొన్ని నెలలపాటు క్రయ విక్రయాలు బాగానే సాగాయి. అయితే ఆ తర్వాత పాత రైతు బజార్‌కే ప్రజలు వెళ్లడం ఆరంభించడంతో అప్పటి నుంచి మోడ్రన్ రైతు బజార్ వెలవెలబోతోంది. చాలా తక్కువ మంది రావడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. మరోవైపు మెట్టుగడ్డలోని డైట్ కళాశాల వద్ద, న్యూటౌన్ హైస్కూల్ వద్ద మరికొందరు వక్ఫ్ స్థలంలో షెడ్లు వేసుకుని కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతున్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి 130 అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టవద్దని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వేసవికాలం పూర్తయ్యే వరకు తాగునీటి, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. భూగర్భజలాలు ఇంకిపోయి పంటలు ఎండిపోకుండా రైతులతో మాట్లాడి నీటి వృథా, పొదుపు, ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీలను రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిసరాలు పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి కలెక్టర్ విజయేందిర అదనపు తరగతులు మంజురు చేయాలి మహబూబ్‌నగర్ మండలంలోని గాజులపేట జెడ్పీహెచ్ఎస్లో అదనపు తరగతి గదులను మంజురు చేయాలని విద్యా కమిటీ మాజీ చైర్మన్ నర్సింహులు కోరారు. ఈ పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో భోదన జరుగుతుంది. కానీ తరగతులు మాత్రం కేవలం నాలుగే ఉన్నాయని, ఈ తరగతుల్లోనే 10వ తరగతి వరకు కొనసాగడం విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది. బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. బీజేపీ నాయకులు సతీష్‌కుమార్, నాగరాజు, రవికుమార్, నర్సింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. క్యాలిఫర్ కేంద్రాన్ని ప్రారంభించాలి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ ఆస్పత్రిలో ఉన్న క్యాలిఫర్ కేంద్రాన్ని పున: ప్రారంభించాలి. ఈ కేంద్రంలో టెక్నిషన్ లేక రెండు నెలల నుంచి కేంద్రం మూతపడింది. ఉమ్మడి జిల్లాలో ఏజిల్లాలో కూడా క్యాలిఫర్ కేంద్రం లేదని, ఉమ్మడి జిల్లా కేంద్రంలో మాత్రమే ఉన్న ఈకేంద్రం మూత పడడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పరికరానికై నా హైదరాబాద్‌కు పోవాల్సి వస్తుంది. -
నీటి తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగునీటి విషయంలో పాలమూరుకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుందన్నారు. సాగునీటి పోరాటం తర్వాత ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన వంటి పోరాటాలు తది దశకు చేరుకోగా.. సాగునీటి పోరాటం మాత్రం ఇంకా కొనసాగుతుందన్నారు. నల్లగొండకు నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి నీటిని తరలించడం అన్యాయం చేయడమేనన్నారు. ఏదుల రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ మాత్రమే కేటాయించారని.. అందులో అర టీఎంసీ నీటిని డిండికి తరలించడం వల్ల ఉద్దండాపూర్, వట్టెం, కరివెన వరకు నీరు పారే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు లేవని.. ఇప్పుడు నీళ్లు కూడా లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు వ్యతిరేకించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ధర్నాలు చేసిన నాయకులు ప్రస్తుతం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా నుంచి ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా భూములు నష్టపోయేది ఈ ప్రాంత రైతులేనని అన్నారు. ఇటీవల ప్రకటించన గ్రూప్–3 ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లు తప్పుగా వేసినందుకు వారిని పక్కన పెట్టారని.. మరోసారి పరిశీలించి మార్కుల ఆధారంగా ఫలితాలు విడుదల చేయాలన్నారు. సమావేశంలో టీడీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌నాయక్, రాష్ట్ర కౌన్సిలర్ కృష్ణయ్య, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, మద్దిలేటి తదితరులు ఉన్నారు. -
మహబూబ్‌నగర్ టు మక్కా షరీఫ్
స్టేషన్ మహబూబ్‌నగర్: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేపడుతారు. ఈ మాసంలో నిర్వహించే ఆరాధనలకు దేవుడు 70 రెట్లు ఎక్కువ పుణ్యం ప్రసాదిస్తారని ముస్లింల నమ్మకం. ఏటా ఈ మాసంలోనే మక్కా, మదీనాలోని పుణ్య ప్రదేశాలైన కాబా ప్రదక్షిణ, మదీనాలోగల మసీదులోని ప్రార్థనల కోసం ముస్లింలు ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్నారు. ప్యాకేజీల వారీగా కొంత మంది 15 రోజులు, నెలరోజులపాటు మక్కా, మదీనాలోనే ఉంటారు. సాధారణ రోజుల్లో కంటే రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు ఎక్కువ పుణ్యం దక్కుతుందని భావిస్తారు. అక్కడే రంజాన్ ఉపవాస దీక్షలు పాటిస్తూ దైవస్మరణలో తరిస్తారు. వందల సంఖ్యలో.. కొన్నేళ్లుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. మిగతా రోజుల్లో ఉమ్రాయాత్ర కంటే రంజాన్ మాసంలో ప్యాకేజీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ముస్లింలు మక్కా, మదీనాకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి వందల సంఖ్యలో ఉమ్రాయాత్రకు వెళ్తున్నారు. దాదాపు 300 నుంచి 400 వరకు ఉమ్రాయాత్రకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది మక్కా షరీఫ్ యాత్రకు వెళ్లారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో పదుల సంఖ్యలో హజ్, ఉమ్రా ట్రావెల్స్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది ఇక్కడి ట్రావెల్స్, మరికొంత మంది హైదరాబాద్‌లోని ట్రావెల్స్‌ల ద్వారా ఉమ్రాయాత్రకు వెళ్తున్నారు. మానసిక ప్రశాంతత.. కొన్నేళ్ల నుంచి రంజాన్ మాసంలో ఉమ్రాయాత్ర చేస్తున్న. ఉమ్రాయాత్రతో మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఈ రంజాన్ మాసంలో 15 రోజులు మక్కా, మదీనా షరీఫ్‌లో దైవ ప్రార్థనలో నిమగ్నమై ఈ నెల 10న ఇంటికి వచ్చాను. ఆ అల్లా దయవల్లే ప్రతి ఏడాది రంజాన్‌లో ఉమ్రాయాత్ర చేయడానికి అవకాశం లభిస్తుంది. – అబ్దుల్ జకీ, ఉమ్రా యాత్రికుడు, మహబూబ్‌నగర్ అదృష్టంగా భావిస్తున్నా.. ఇప్పటి వరకు రెండుసార్లు ఉమ్రాయా త్ర చేశాను. 2018 సంవత్సరంలో పవి త్ర రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు వెళ్లాను. రంజాన్‌లో ఉమ్రాయాత్ర చేయడానికి అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ముస్లింలు రంజాన్‌లో ఉమ్రాయాత్ర చేయడానికి వెళ్తున్నారు. – మొహ్‌సిన్‌పాష ఖాద్రీ, మహబూబ్‌నగర్ రంజాన్‌లో ఉమ్రా యాత్రకు వెళ్తున్న ముస్లింలు -
‘10 శాతం రిజర్వేషన్లు కల్పించడం దుర్మార్గం’
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జనాభాలో కేవ లం 15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం దుర్మార్గమని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకటయాదవ్ అన్నారు. ఆదివారం సంఘం కార్యాలయంలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లాస్థాయి అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకుల రిజర్వేషన్లు అతిపెద్ద తప్పిదమని, దీంతో బలహీనవర్గాలకు నష్టం జరుగుతుందన్నారు. సమాజంలో అణగారిన, బలహీన, పీడిత వర్గాలకు మాత్రమే సంఘాలు ఉండాలని, అలాంటిది పాలక పక్షంలో ఉన్న వ్యక్తులు కూడా సంఘాలను పెట్టుకొని వాళ్లకు అనుకూలమైన చట్టాలను రూపకల్పన చేసుకుంటున్నారని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎవరి వాటా వారికి దక్కాలని డిమాండ్ చేశారు. ప్రతి యాదవ బిడ్డ చదువుకోవాలని అందుకోసం వారి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో యాదవుల వాటా కోసం ప్రతిఒక్కరు పోరాటం చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో రానున్న 15 రోజుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలుయాదవ్, నాయకులు రవికుమార్‌యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలుయాదవ్ పాల్గొన్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న 45 రోజులకే..
జడ్చర్ల: మండలంలోని రాళ్లగడ్డ తండాలో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలన్నర రోజులకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపల్లి శివారులోని రాళ్లగడ్డ తండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన చర్చిత (23) ఖమ్మంలో బీఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 45 రోజుల క్రితం ఆమె తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తలు ప్రస్తుతం రాళ్లగడ్డ తండాలో ఉంటున్నారు. ఆదివారం భర్త పవన్‌కుమార్ డ్యూటీకి వెళ్లి వచ్చి తండాలోని స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో చర్చిత ఇంట్లో ఒంటరిగా ఉంది. కొద్ది సేపటికే ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలు ఎంఫార్మసీ పరీక్షలకు హాజరవుతుందని.. భర్త, ఇతర కుటుంబ సభ్యులతో అన్యూన్యంగా ఉంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఉరేసుకుని నవవధువు ఆత్మహత్య -
ఆటంకంగా మారిన నీటి ఊట
అచ్చంపేట/మన్ననూర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఉబికి వస్తున్న నీటి ఊటతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నీటి ఊట వల్ల తవ్వేకొద్దీ బురద, మట్టి వస్తోంది. భారీగా వస్తున్న నీటి ఊటను మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటికి పంపింగ్ చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన ఏడుగురిని బయటికి తెచ్చేందుకు సహాయక బృందాలు 23 రోజులుగా శ్రమిస్తూనే ఉన్నాయి. కాడవర్ డాగ్స్ గుర్తించిన డీ1, డీ2 ప్రదేశాల్లో బిగుసుకుపోయిన బురద తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 12 బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. తవ్వకాల్లో అడుగడుగునా టీబీఎం పైకప్పు మెటల్ ప్లాట్‌ఫాం, పెద్దపెద్ద ఇనుపరాండ్లు అడ్డుగా వస్తున్నాయి. చిన్నచిన్న వాటిని ఎప్పటికప్పుడు ప్లాస్మా కట్టర్‌తో కట్‌చేసి తొలగిస్తున్నారు. పెద్ద రాండ్లను కట్ చేయడం కొంత ఇబ్బందిగా ఉన్నట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. రెండు జనరేటర్స్ సహాయంతో మట్టి, బుదరను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. సొరంగంలో అప్పుడప్పుడు వస్తున్న దుర్వాసనతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలుగుతున్నట్లు తెలిసింది. అందుబాటులోకి రాని రోబో సేవలు.. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఐదు రోజుల క్రితం ఇక్కడికి చేరిన అటాన్‌మస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబో సేవలు ఇంకా మొదలు కాలేదు. సొరంగం ఇన్లెట్ వద్ద నుంచే ఆపరేటింగ్(కమ్యూనికేషన్) చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) ఆధారిత మాస్టర్ రోబోతో పాటు పవర్డ్ హైడ్రాలిక్ రోబోకు అనుసంధానంగా ఏర్పాటుచేసిన 30 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకు ఇన్స్టాలేషన్ పూర్తయినా ఆదివారం సాయంత్రం కూడా సొరంగం లోపలికి వెళ్లలేదు. సొరంగంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా హైడ్రాలిక్ రోబోకు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఇది నిరంతరాయం పనిచేసేందుకు అదనపు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీబీఎం శకలాలతో.. పూర్తిగా ఉక్కుతో తయారైన పవర్డ్ హడ్రాలిక్ రోబో హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తోంది. రోబో ముందు భాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్దపెద్ద రాళ్లు, రప్పలు, శిథిలాలను ముక్కులుగా చేయడంతో పాటు బురదను వాక్యూమ్ పంపు సహాయంతో నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను సొరంగం లోపల 200 మీటర్ల దూరం నుంచి పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అయితే సొరంగంలో రాళ్లు, బురదతో పాటు టీబీఎం విడి భాగాలు ఉండటం వల్ల రోబోలకు కూడా సహాయక సిబ్బందికి ఎదురవుతున్న సమస్యే నెలకొంది. టీబీఎం శకలాలు పూర్తిగా తొలగిస్తే తప్ప రోబో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిిపించడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 23 రోజులైనా లభించని ఏడుగురి ఆచూకీ -
మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వసంతోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి, అవబృత స్నానం, నాకబలి (నాగవెల్లి), ద్వాదశరాధన, సప్తవరణులు, మహాదాశీర్వచనం చేశారు. స్వామివారి సుదర్శన పెరుమాళ్లకు దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రత్యేక వాహనంలో సుదర్శన పెరుమాళ్లను ఊరేగింపుగా దిగువ కొండ వద్దనున్న అమ్మవారి దేవస్థానం నుంచి ఘాట్‌రోడ్డు గుండా గుట్టపైనున్న బావి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సుదర్శన పెరుమాళ్లకు పురోహితులు సంప్రదాయ రీతిలో శ్రీచక్రస్నానం నిర్వహించారు. అనంతరం సుదర్శన పెరుమాళ్లను పూలతో శోభాయమానంగా అలంకరించి దిగువ కొండ వద్దనున్న అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకురావడంతో అమ్మవారి ఉత్సవాలు ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి విశేషోత్సవాల్లో పాల్గొని తరించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు వెంకటాచారి, సురేందర్, గోవింద్, అలివేలమ్మ, సుధ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
వనపర్తిని క్రీడాహబ్‌గా మారుస్తాం
వనపర్తిటౌన్: క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని.. ఓటమిని ఆయుధంగా మలుచుకొని రెట్టింపు ఉత్సాహంతో గెలుపునకు ప్రయత్నించే వారే అసలైన క్రీడాకారులని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి అండర్–14 ఫుట్‌బాల్ క్రీడాపోటీల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వనపర్తిని క్రీడా హబ్‌గా మారుస్తామని, జిల్లాకేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేందుకు ప్రయత్నించాలన్నారు. త్వరలోనే రూ.7.50 కోట్లతో టర్ఫ్ మైదానం, ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే క్రీడాకారుల కోసం 50 గదులతో వసతిగృహాన్ని సైతం నిర్మిస్తామని చెప్పారు. అండర్–14 ఫుట్‌బాల్ పోటీల్లో బాలికలు 20, బాలురు 20 జట్లు పాల్గొన్నాయి. బాలికల్లో నిజామాబాద్ జిల్లా మొదటి, అదిలాబాద్ జిల్లా రెండు, రంగారెడ్డి జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో హైదరాబాద్ జిల్లా మొదటి, మహబూబ్‌నగర్ జిల్లా రెండో, రంగారెడ్డి జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు జిల్లా క్రీడాశాఖ అధికారులు సుధీర్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య, లక్కాకుల సతీష్, క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు. త్వరలో రూ.7.50 కోట్లతో టర్ఫ్ మైదానం ఏర్పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి -
వివాహేతర సంబంధమే కారణం
జడ్చర్ల: వావివరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు. తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయాడంటూ పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ కమలాకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కావేరమ్మపేట శివారు రాజీవ్‌నగర్‌కాలనీలో మీనుగ కోటయ్య, మీనుగ అలివేలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అదే కాలనీలో ఉండే అల్లుడు వరుస అయ్యే మీనుగ రాజ్‌కుమార్‌తో అలివేలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా విషయం తెలిసిన భర్త కోటయ్య ఇద్దరిని మందలించాడు. ఈ ఏడాది జనవరి 23న రాత్రి మీనుగ కోటయ్య కులస్తులతో కలిసి షాద్‌నగర్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాగా అలివేలు, రాజ్‌కుమార్ కాలనీలోని తమ పాత ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసి నిలదీశాడు. దీంతో విషయం అందరికి చెప్పి రచ్చ చేస్తాడని భావించిన నిందితులు మద్యం మత్తులో ఉన్న కోటయ్యను కింద పడేసి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అక్కడే పడుకోబెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు తన భర్త రాత్రి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగిరాలేడంటూ అలివేలు పిల్లలను నిద్రలేపి బంధువులు, చుట్టుపక్కల వారిని వెంటపెట్టుకొని పాత ఇంటికి వచ్చింది. చలనం లేకుండా పడి ఉన్న భర్తను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ పెద్దనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు మీనుగ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయినట్లు బయటపడింది. ఆదివారం అలివేలును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిదింతులు అలివేలు, రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. హత్య వివరాలు వెల్లడించిన జడ్చర్ల సీఐ -
ముగిసిన రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
అడ్డాకుల: మండలంలోని కందూరు సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు ప్రధాన ఆలయంలోని శివలింగానికి అభిషేకం జరిపి.. స్వామివారి వెండి ముఖాన్ని పూలతో అలంకరించి పూజలు చేశారు. గౌరమ్మ ఆలయంలో గౌరమ్మ విగ్రహానికి చీర, పూలతో అలంకరించి పూజలు, రుద్రాభిషేకం, రుద్రహోమం తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం ముందు ఊరేగించారు. కందూర్‌లో వసంతోత్సవం నిర్వహించిన తర్వాత గ్రామస్తులు ఆలయానికి చేరుకుని త్రిశూలస్నానం కార్యక్రమంలో పాల్గొన్నా రు. పవిత్రమైన కోనేరులో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు యాదగిరిశర్మ, తాళ్లపాక రామలింగశర్మ, శివశర్మ, మణికంఠశర్మ, రేవంత్‌శర్మ, వినయ్‌శర్మ త్రిశూల స్నానం చేయించి ఉత్స వాలను ముగించారు. రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియగా.. సోమవారం నుంచి జాతర ప్రారంభం కానుంది. ప్రతిఏటా ఉగాది పండగ వరకు జాతర కొనసాగనుండగా.. ఈ సారి శ్రీరామ నవమి వరకు పొడిగించారు. కార్యక్రమంలో ఈఓ రాజేశ్వరశర్మ, గ్రామస్తులు నాగిరెడ్డి, శ్రీహరి, రవీందర్‌శర్మ, దామోదర్‌రెడ్డి, రాములు, బుచ్చన్నగౌడ్, దేవ న్నయాదవ్, మనోహర్, సత్తిరెడ్డి అర్చకులు పాల్గొన్నారు. -
మైసమ్మ చెంత భక్తుల కిటకిట
నవాబుపేట: మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఈ ప్రాంతంలో నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. స్థానికులు సైతం అమ్మవారికి బోనాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వచ్చిన అందరూ అడవిలో చెట్ల కింద సేదతీరి ప్రకృతిని ఆస్వాదించారు. కాగా ఆదివారంతోపాటు మంగళవారాలు ప్రత్యేక పూజలు జరుగుతుండగా.. మిగతా రోజుల్లో సైతం ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. -
అంతర్ జిల్లాల దారిలో.. అవస్థల ప్రయాణం
కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్ -
బెట్టింగ్ యాప్స్‌నుప్రోత్సహిస్తే కఠిన చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని రకాల అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల యువత, విద్యార్థులు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్ యాప్స్‌లో పాల్గొంటూ అప్పులపాలై తీవ్ర ఒత్తిడికి గురై, చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించి, అక్రమ బెట్టింగ్ యాప్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. సోషల్ మీడియా వేదికగా వీటిని ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అక్రమ యాప్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు అపహరించే ప్రమాదం ఉందని, అక్రమ యాప్స్‌లో డబ్బులు పెట్టి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు. 2 వేల బస్తాల వేరుశనగ రాక నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం 2,329 బస్తాల వేరుశనగ వచ్చింది. కాగా వేరుశనగ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,990, కనిష్టంగా రూ.5,505 ధర లభించిందని మార్కెట్ కార్యదర్శి రమే్‌ష్ తెలిపారు. సీజన్ ముగుస్తున్న సమయంలో వేరుశనగ పోటెత్తడం గమనార్హం. నిర్వాసితులకు న్యాయం చేశాకే పనులు చేపట్టాలి జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేశాకే రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఆదివారం ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తదితర పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలన్నారు. ఉదండాపూర్‌లో రీసర్వేకు సంపూర్ణంగా సహకరించామని, తమకు పూర్తిస్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంచి అందించాలని కోరారు. అలాగే 18 ఏళ్లు వయస్సు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు అడ్డుకున్నారన్న కారణాలు చూపుతూ తమపై పోలీసులు కేసులు నమోదు చేశారని, వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
చంద్రగఢ్ కోట అభివృద్ధికి కృషి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమరచింత: చంద్రగఢ్ కోట చరిత్రను అధ్యయనం చేసి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ప్రాచీన చంద్రగఢ్ కోటను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. కోట లోపల ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాతి కొలనులు, కోటను పరిశీలించి మాట్లాడారు. కోట, ఆలయ ప్రాచుర్యం, చరిత్రను వెలికి తీసేందుకు కృషి చేస్తామని.. కోట వద్ద మౌలిక సౌకర్యాల కల్పనకు ముందస్తుగా రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ నిధులతో కోటపై భాగానికి వెళ్లడానికి సీసీ రహదారి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉందని.. అక్కడి పర్యాటకులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కోటను చూడటానికి వస్తుంటారని, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పురావస్తుశాఖ అధికారులను పంపించి చరిత్రను గుర్తించి కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఆత్మకూర్‌లోని పరమేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. పరమేశ్వరస్వామి ఆలయ చరిత్ర ఎంతో ఘనమైందని.. ఆలయంతోపాటు చెరువు అభివృద్ధికి కృషిచేస్తానని, ఇందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. -
విస్తృతంగా ప్రచారం..
ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ ప్రకటించింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్, పంచాయతీ అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఎల్ఆర్ఎస్పై ప్రతిరోజు అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పర్యవేక్షిస్తున్నారు. రియల్ ఎస్టేట్, బిల్డర్లు, డాక్యుమెంట్ రైటర్లతో సమావేశాలు నిర్వహించి మరీ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో స్పందన కనిపించడం లేదు. కలెక్టరేట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయినా ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 20 కాలేజీలు.. 1,600 సీట్లు ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్‌నగర్ -
కొనసాగుతున్న సహాయక చర్యలు
● ఎస్ఎల్బీసీ టన్నెల్లో లభ్యం కాని కార్మికుల ఆచూకీ ● కనీసం ఆనవాళ్లు కూడా లభించని వైనం ● హైడ్రాలిక్ పవర్డ్ రోబో పనితీరుపైనే ఆశలు ● డీ1 జోన్ ప్రాంతంలో బలహీనంగా పైకప్పు ● 22 రోజులుగా శ్రమిస్తున్న సహాయక బృందాలు సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న అరవింద్‌కుమార్ – అచ్చంపేట/ ఉప్పునుంతల వివరాలు 8లో u