పీయూ బంగారు పతకం సాధించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో నిర్వహించే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ, ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ క్రికెట్ జట్టు శనివారం పయనమైంది. ఈ మేరకు జట్టు సభ్యులను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించి క్రీడా దుస్తులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నిబద్ధతతో ఆడి జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటాలని ఆకాక్షించారు. పీయూ గోల్డ్ మెడల్ సాధించాలని, క్రీడల్లో మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కృష్ణయ్య, పీడీ శ్రీనివాస్, కోచ్‌లు మన్నన్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు
బయలుదేరిన పీయూ క్రికెట్ టీం


