ఒకే నామినేషన్‌.. ఏకగ్రీవం లాంఛనమే | - | Sakshi
Sakshi News home page

ఒకే నామినేషన్‌.. ఏకగ్రీవం లాంఛనమే

Feb 3 2026 7:54 AM | Updated on Feb 3 2026 7:54 AM

ఒకే నామినేషన్‌.. ఏకగ్రీవం లాంఛనమే

ఒకే నామినేషన్‌.. ఏకగ్రీవం లాంఛనమే

మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో

16 మంది ఉప సంహరణ

పాలమూరు: మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు కలిపి 516 మంది అభ్యర్థులు బరిలో ఉండగా సోమవారం 16 మంది తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం పోటీలో 500 మంది నిలిచారు. ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు వరకు అవకాశం ఉంది. కాగా.. 58వ డివిజన్‌లో రెండు నామినేషన్లు ఉండగా సోమవారం ఒకరు ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చలువగాలి రమాదేవి నామినేషన్‌ ఒకటే ఉండడంతో ఆమె ఏకగ్రీవం కానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసిన తర్వాత నేడు అధికారులు ధ్రువీకరించనున్నారు. ఇక దేవరకద్ర మున్సిపాలిటీలో నలుగురు, భూత్పూర్‌లో ఆరుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement