హోంగార్డు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు ఆత్మహత్య

Apr 2 2026 8:40 AM | Updated on Apr 2 2026 8:40 AM

అచ్చంపేట రూరల్‌: పురుగు మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధ వారం అచ్చంపేటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సద్దాంహుస్సేన్‌ తెలిపిన వివరాల ప్రకారం... కోడేరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బయ్యన్న (46) సలేశ్వరం జాతర డ్యూటీ కో సం బుధవారం అచ్చంపేటకు వచ్చాడు. కాగా మంగళవారం డ్యూటీలో చేరాల్సి ఉండగా బుధవారం రావడంతో అధికారులు గైర్హాజరు వేశారు. దీంతో మనస్థాపానికి గురైన బయ్యన్న అచ్చంపేట పశువుల సంత సమీపంలో క్రిమిసంహారక మందు తాగాడు. తర్వాత విషయా న్ని ఓ కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి చెప్పగా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందా డు.మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్ల లు ఉన్నారు. అల్లుడు శివుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

నలుగురికి గాయాలు

అడ్డాకుల: మండలంలోని కందూర్‌ స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికు ల వివరాల ప్రకారం.. మూసాపేట మండలం నందిపేటకు చెందిన రాములు మరి కొందరితో కలిసి దుస్తుల కొనుగోలు కోసం వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం వెళ్లారు. దుస్తుల కొనుగోలు తర్వాత అదే ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా కందూర్‌ స్టేజీ వద్ద ఆటోను కర్నూ ల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న రాములు, నాగన్నతో పాటు మరో ఇద్దరు మ హిళలకు గాయాలు కాగా మిగిలిన వారికి స్వ ల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎల్‌అండ్‌ టీ అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

రైలు కిందపడి

యువకుడి ఆత్మహత్య

ఉండవెల్లి: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండ లంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మానవపాడు మండలం కొర్విపాడుకు చెందిన తెలుగు యుగంధర్‌(22) తుంగభద్ర రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడి మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రికి తరలించగా, మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

పేకాట స్థావరంపై దాడి: 10 మంది అరెస్ట్‌

వనపర్తి రూరల్‌: పట్టణంలోని సాయినగర్‌ కాలనీలో బుధవారం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పట్టణ పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పోలీసులకు అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్‌ చేసి రూ.24వేల నగదు, 9 సెల్‌ఫోన్లు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఆర్టీసీ కంట్రోలర్‌పై దాడి

ఉండవెల్లి: మండలంలోని అలంపూర్‌ చౌరస్తా లోని టీఎస్‌ ఆర్టీసీ గద్వాల జిల్లాకు చెందిన కంట్రోలర్‌పై నరసింహులుపై ఆంధ్ర రాష్ట్రం కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూ రు గ్రామానికి చెందిన షేక్‌ ఖలీల్‌, మంగలి పవన్‌కుమార్‌ దాడి చేశారు. బుధవారం అయి జ బస్సులో ఫుట్‌బోర్టుపై ప్రయాణిస్తుండగా లోపలికి వెళ్లండని కంట్రోలర్‌ చెప్పడంతో నువ్వెవరని దురుసుగా ప్రవర్తించి దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దాడి చేసిన సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement