నాగర్ కర్నూలు జిల్లా : తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరుపొందిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు.(Saleshwaram Jatara 2026) చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని నల్లమల లోతట్టు ప్రాంతంలో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. తొలిరోజు బుధవారం దాదాపు లక్షమంది భక్తులు తరలిరావడంతో నల్లమల కొండలు లింగమయ్య నామస్మరణంతో మార్మోగాయి.


