మోడల్స్‌గా మావోయిస్టు మహిళలు..! | From Maoist Camps to Modelling Ramps: Former Women Naxals Walk Ramp in Raipur | Sakshi
Sakshi News home page

మోడల్స్‌గా మావోయిస్టు మహిళలు..!

Aug 13 2026 2:08 PM | Updated on Aug 13 2026 2:09 PM

Viral Video: From Maoist Camps To Modelling Ramps

మావోయిస్ట్‌ అనే పదం వినగానే అడువల్లో లోపల నివశిస్తూ...జన సముహానికి దూరంగా ఉండే సాయుధ మిలిటెంట్లుగా ఊహించుకుంటాం. ఎందుకంటే టీవీల్లో, మీడియాల్లో చూసినదాన్ని బట్టి వాళ్లు అలానే ఉంటారనుకుంటాం. అయితే కొందరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా కలిసిపోయి కొందరు అత్యద్భుతంగా జీవిస్తున్నారు. వారిలో వచ్చిన ఆ మార్పు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవడం ఖాయం. సాధారణ జీవితం గడపడం అంటే మాములు మనుషుల్లా బతికేయడం కాదు..తమకంటూ ఓ గుర్తింపు వచ్చేలా స్పూర్తిదాయకంగా బతికి చూపిస్తున్నారు ఆ మాజీ మావోయిస్టు మహిళలు. 

ఈ అద్భుత ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఒకప్పుడు చత్తీస్‌గడ్‌లోని బస్తర్‌ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఆయుధాలు చేత పట్టుకుని తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ఎలా హుందాగా జీవిస్తున్నారో చూస్తే కంగుతింటారు. 

వారి జీవితాలు ఎంత అద్భుతంగా మారాయో చూడాలంటే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కి వెళ్లిపోవాల్సిందే. అక్కడ జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఈ వింత దృశ్యాలు కనువిందు చేశాయి. ఆ ఈవెంట్‌లో మాజీ మహిళా మావోయిస్టులు ర్యాంప్‌పై నడిచి అందర్నీ అలరించారు. 

ఒకప్పుడు వారికి అందని అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మహిళల కట్టు బొట్టు మారిన విధం చూసి అందరూ మంత్రముగ్ధులవుతున్నారు. నెటిజన్లు కూడా నమ్మశక్యంకానీ దృశ్యాలు, ఇదే నిజమైన సాధికారత అంటూ ప్రశంసిస్తూ పోస్టులు  పెట్టారు.

 

(చదవండి: టీసీఎస్‌లో టెకీ నుంచి వైమానిక దళ ఫైటర్‌ పైలట్‌గా..! నటుడు మాధవన్‌ సైతం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement