సిరాజ్‌ చిలిపి పని.. భయపడుతూనే ఓకే చెప్పిన సర్ఫరాజ్‌ ఖాన్‌ | Mohammed Siraj Turns Barber For Returning Sarfaraz Khan, Video Goes Viral | Sakshi
Sakshi News home page

సిరాజ్‌ చిలిపి పని.. భయపడుతూనే ఓకే చెప్పిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Aug 12 2026 5:38 PM | Updated on Aug 12 2026 5:52 PM

Mohammed Siraj Turns Barber For Returning Sarfaraz Khan, Video Goes Viral

టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఓ చిలిపి పని చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌కు హెయిర్‌కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భయపడుతూనే ఓకే చెప్పిన సర్ఫరాజ్‌
వైరల్ అవుతున్న వీడియోలో సిరాజ్.. సర్ఫరాజ్ దగ్గరకు వెళ్లి హెయిర్‌కట్ చేస్తానంటూ ముందుకొచ్చాడు.

అయితే సర్ఫరాజ్ మాత్రం సిరాజ్ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. పేసర్ హెయిర్‌కటింగ్ నైపుణ్యంపై అతడికి నమ్మకం లేనట్టుగా కనిపించాడు.

సిరాజ్ హెయిర్‌కట్ చేసేందుకు సిద్ధమవుతుండగా సర్ఫరాజ్ ముఖంలో కాస్త భయం కూడా కనిపించింది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో సిరాజ్‌కు తన జుట్టును కత్తిరించేందుకు అనుమతించాడు.

సిరాజ్ కూడా హెయిర్‌స్టైలిస్ట్ సహాయం తీసుకుంటూ సరదాగా ఈ పని పూర్తి చేశాడు. మరోవైపు సర్ఫరాజ్ మాత్రం వీలైతే అక్కడి నుంచి తప్పించుకోవాలన్నట్లుగా కనిపించాడు.

చివరకు సిరాజ్ తన ‘సెషన్’ ముగించడంతో అసలు హెయిర్‌ స్టైలిస్ట్ రంగంలోకి దిగాడు. జుట్టుకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి సర్ఫరాజ్‌కు కొత్త లుక్ తీసుకొచ్చాడు.

అనుకోని అవకాశం
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సర్ఫరాజ్ అనూహ్యంగా టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. సాయి సుదర్శన్ కుడి కాలిలోని టో స్ట్రెస్ రియాక్షన్ కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు.

సర్ఫరాజ్ ఇప్పటికే కొలంబోలో భారత జట్టుతో చేరాడు. ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టులో అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఆరు టెస్టుల్లో 371 పరుగులు
సర్ఫరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఆరు టెస్టులు ఆడాడు. 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 150 పరుగులు.

సర్ఫరాజ్‌ గతంలో జట్టులో ఉన్నప్పటికీ అవకాశాలు దక్కని సందర్భాలు ఉన్నాయి. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

ఇప్పుడు సాయి సుదర్శన్ గైర్హాజరీతో మరో అవకాశం లభించింది. శ్రీలంకలో ఈ అవకాశాన్ని సర్ఫరాజ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

WTC రేసులో భారత్‌
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకతో జరిగే ఈ సిరీస్‌లో మెరుగైన ఫలితాలు సాధించడం భారత జట్టుకు కీలకం.

తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలేలో జరగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరగనుంది.

శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఔకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement