శ్రీలంక క్రికెట్ జట్టు సొంత గడ్డపై టీమిండియాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
శ్రీలంకకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూపంలో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం పంత్ అంత మంచి ఫామ్‌లో లేడు. ఇటీవల జరిగిన శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో కూడా రిషబ్ విఫలమయ్యాడు.
రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి తనదైన రోజున ఓంటి చేతితో జట్టును గెలిపించే సత్తా అతడిది. ఈ క్రమంలోనే మహరూఫ్ తమ జట్టు హెచ్చరించాడు.
"నేను శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి ఉంటే, రిషబ్ పంత్ గురుంచి ఎక్కువగా ఆలోచించేవాడిని. అతడు జట్టుకు ఎక్స్-ఫాక్టర్. టెస్టు క్రికెట్‌లో కూడా టీ20 తరహా బ్యాటింగ్ చేస్తాడు. పంత్ క్రీజులో ఉంటే కేవలం అర గంటలోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అతడికి టీమ్ మేనెజ్‌మెంట్ పూర్తి స్వేచ్ఛనిచ్చింది.
అయితే ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ప్రభాత్ జయసూర్య వంటి అద్భుతమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నప్పటికి పంత్‌ను కట్టడి చేయడం అంత తేలిక కాదు" అని మహరూఫ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
భారత్‌తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టు
ధనంజయ డి సిల్వా (కెప్టెన్), లహిరు ఉదారా, నిశాన్ మధుష్క, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమాల్, పసిందు సూరియబండారా, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక
చదవండి: Hundred Women 2026: ఎలిమినేటర్ ముంగిట సన్‌రైజర్స్ విధ్వంసం


