ఎలిమినేటర్‌ ముంగిట సన్‌రైజర్స్ విధ్వంసం | The Hundred Women's 2026: Annabel Sutherland's All-Round Show Powers Sunrisers Victory Over Super Giants | Sakshi
Sakshi News home page

Hundred Women 2026: ఎలిమినేటర్‌ ముంగిట సన్‌రైజర్స్ విధ్వంసం

Aug 12 2026 1:51 PM | Updated on Aug 12 2026 1:58 PM

Annabel-All-Round Performance-Sunrisers Beat Super Giants-Hundred Women

Photo Credit: Hundred Twitter

హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఐదో విజయంతో పట్టికలో రెండో స్థానానికి చేరుకొని ఎలిమినేటర్ పోరుకు మరింత దగ్గరైంది. మంగళవారం రాత్రి మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్ 41 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 

మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్లాండ్ (36 బంతుల్లో 62 నాటౌట్‌, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ డాని గిబ్సన్ (13 బంతుల్లో 24) రాణించడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో మాడీ విల్లర్స్ 2 వికెట్లు తీసింది. అనంతరం మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. 

ఓపెనర్లు స్మృతి మంధాన (17 బంతుల్లో 28), గ్రేస్ స్క్రీవెన్స్ (24 బంతుల్లో 31) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జొనాసన్ 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, అన్నాబెల్‌ సదర్లాండ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన అన్నాబెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు గెలుచుకుంది.

చదవండి: తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement